మణిపూర్ లో 'మేరి కోమ్' ఎందుకు విడుదల కాలేదు?
మణిపూర్ లో 'మేరి కోమ్' ఎందుకు విడుదల కాలేదు?
Published Sun, Sep 7 2014 2:31 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM
బాక్సింగ్ చాంఫియన్ మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం స్వంత రాష్ట్రం మణిపూర్ లో విడుదలకు నోచుకోకపోవడంపై ఆ ప్రాంతవాసులు నిరాశకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై అందర్ని ఆకట్టుకుంటున్న మేరి కోమ్ చిత్రాన్ని మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో విడుదల చేయించేందుకు అన్లర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా విడుదలైన ఈ చిత్రాన్ని మణిపూర్ లో విడుదల చేయించేందుకు చిత్ర సహనిర్మాతలు వాయాకామ్18 మోషన్ పిక్చర్స్ ను మేరి కోమ్ భర్త ఆన్లర్ సంప్రదించారు. ఈ చిత్ర విడుదల కోసం మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఐబోబీ సింగ్ కార్యాలయ అధికారులతో కలిసి చర్చలు జరుపుతున్నారు. 'మేరి కోమ్ చిత్ర విడుదలకు సాధ్యమయ్యేంత వరకు కృషి చేస్తున్నాం. ఏమవుతుందో చూద్దాం' అని వాయాకామ్18 ప్రతినిధి అన్నారు.
గత కొద్దికాలంగా మణిపూర్ లోని ఉగ్రవాద సంస్థలు హిందీ చిత్రాల పదర్శనపై నిషేధం విధించారు. ప్రపంచమంతటా ఈ చిత్రాన్ని చూస్తున్నారు. మణిపూర్ లో ప్రదర్శనకు నోచుకోకపోవడంపై బాధగా ఉందని మేరి కోమ్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకైనా మంచిది ప్రదర్శించకపోవడమే మంచిదనుకుంటున్నాను. ఈ చిత్ర విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని మేరి కోమ్ అన్నారు. ఇటీవల ముంబైలో ప్రదర్శించిన ప్రీమియర్ షోను మేరి కోమ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బాక్సింగ్ విద్యార్ధులు చూశారు. బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నటించిన 'మేరి కోమ్' చిత్రం శుక్రవారం విడుదలై.. విమర్శకుల ప్రశంసలందుకుంటోంది.
Advertisement
Advertisement