![అందమే లేకపోతే మిస్ వరల్డ్ అయ్యేదానివా? - Sakshi](/styles/webp/s3/article_images/2017/09/2/61416850127_625x300.jpg.webp?itok=b1Vd5x6J)
అందమే లేకపోతే మిస్ వరల్డ్ అయ్యేదానివా?
బాలీవుడ్ కథానాయికల్లో ప్రియాంక చోప్రా రూటే సెపరేటు. పదుగురిలో ఒకదాన్ని అనిపించుకోవడానికి అస్సలు ఇష్టపడరామె. అందుకు ప్రియాంక కెరీరే ఉదాహరణ. హీరోయిన్లందరూ గ్లామర్ పాత్రలవైపు పరుగులు పెడుతుంటే... ప్రియాంక మాత్రం ప్రయోగాత్మక పాత్రలు చేయడానికే ఇష్టపడతారు. బర్ఫీ, మేరీ కామ్ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ముఖ్యంగా ‘మేరీ కామ్’ కోసమైతే... తనలోని సున్నితత్వాన్ని కోల్పోయారు ప్రియాంక. ప్రస్తుతం పూర్వపు అందం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారామె. బహుశా ఆ శ్రమ భరించలేకేనేమో... ట్విటర్‌లో ఓ వింత మెసేజ్ పోస్ట్ చేశారు. ‘‘నేను వికృతంగా పుట్టి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు.
జీవితం సాఫీగా సాగిపోయేది. అందంగా పుట్టడం వల్లే ఈ సమస్యలన్నీ. ఈ అందమే లేకపోతే... అసలు గ్లామర్ ఫీల్డ్‌లోకే వచ్చేదాన్ని కాదు కదా. ఈ తిప్పలు ఉండేవి కావు కదా. కాసేపు స్కిన్‌పై శ్రద్ధ పెట్టాలి. ఇంకాసేపు జుత్తు గురించి ఆలోచించాలి. నిజంగా చిరాగ్గా ఉంది’’ అని ట్వీట్ చేశారు ప్రియాంక. ఈ ట్వీట్‌పై బాలీవుడ్‌లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
‘ఆ అందమే లేకపోతే నువ్వు మిస్ వరల్డ్ అయ్యేదానివా, సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేసేదానివా, కోటానుకోట్లు సంపాదించేదానివా? అంటూ చాలామంది తమ వ్యక్తిగత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రియాంక ట్వీట్‌పై కామెంట్లు విసిరారు. ఇంకొందరైతే.. తాను అందగత్తెనని ఈ ట్వీట్ ద్వారా ప్రియాంక చెప్పకనే చెప్పి, తన తెలివితేటలు ప్రదర్శించిందని కౌంటర్ ఇచ్చారు. మరి... ఈ కామెంట్లపై ప్రియాంక ఎలా స్పందిస్తారో చూడాలి.