బాక్సర్లతో ప్రియాంక డిష్యుం డిష్యుం | Priyanka Chopra fought real boxers in 'Mary Kom' | Sakshi
Sakshi News home page

బాక్సర్లతో ప్రియాంక డిష్యుం డిష్యుం

Published Fri, Jul 25 2014 2:33 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

బాక్సర్లతో ప్రియాంక డిష్యుం డిష్యుం - Sakshi

బాక్సర్లతో ప్రియాంక డిష్యుం డిష్యుం

ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన బాక్సర్ 'మేరీ కోమ్' చిత్రంలో తాను నిజమైన బాక్సర్లతోనే పోరాటాలు చేసినట్లు బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా చెప్పింది. పూర్తిస్థాయి ప్రొఫెషనల్ బాక్సర్లతో ఫైటింగ్ చేయడం అంటే అంత సులభం కాదని, అయినా తాను అలాగే చేశానని తెలిపింది. మేరీకోమ్ చిత్రం గురించి ఆమె ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపింది.

వాళ్లంతా అసలైన బాక్సర్లే కావడంతో వాళ్లకు ఉత్తుత్తి పంచ్లు ఇవ్వడం రాదని, దాంతో నిజంగానే కొట్టేస్తారని ప్రియాంక వివరించింది. చాలా సందర్భాల్లో తనకు నిజంగానే గట్టి దెబ్బలు తగిలాయని తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మేరీ కోమ్ అథ్లెట్ నుంచి బాక్సర్గా ఎలా మారిందో అనే విషయం చెబుతారు. ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement