'వ్యాట్ ఏ ఫీట్.. భారతీయుడిగా గర్విస్తున్నా' | Bollywood stars shower Mary Kom with praise | Sakshi
Sakshi News home page

'వ్యాట్ ఏ ఫీట్.. భారతీయుడిగా గర్విస్తున్నా'

Published Wed, Oct 1 2014 5:47 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM

'వ్యాట్ ఏ ఫీట్.. భారతీయుడిగా గర్విస్తున్నా' - Sakshi

'వ్యాట్ ఏ ఫీట్.. భారతీయుడిగా గర్విస్తున్నా'

ముంబై: ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ పై బాలీవుడ్ అభినందనల జల్లు కురిపించింది. ఆమె సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేసింది. మేరీ కోమ్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మించిన సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా అందరికంటే ముందు అభినందనలు తెలిపారు. మహిళా శక్తిని మరోసారి మేరీకోమ్ ప్రపంచానికి చాటిందని ప్రశంసించారు.

బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఆమెను అభినందించారు. వ్యాట్ ఏ ఫీట్.. భారతీయుడిగా గర్విస్తున్నా అని ట్వీట్ చేశారు. ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్, నటులు షాహిద్ కపూర్, కునాల్ కోహ్లి, ఫర్హాన్ అక్తర్, రచయిత మిలాప్ జవేరీ, వీర్ దాస్, విశాల్ దద్లానీ, సుజిత్ సిర్కార్, దిపనిత శర్మ తదితరులు మీరీకోమ్ కు అభినందలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement