నాకు నచ్చినట్లే నడుచుకుంటా
నాకు నచ్చినట్లే నడుచుకుంటా
Published Sun, Feb 9 2014 10:45 PM | Last Updated on Wed, Apr 3 2019 6:23 PM
‘నేను ఇలానే ఉండాలని నియమ నిబంధనలు ఏమీ పెట్టుకోను.. నా మనసుకు ఎలా తోస్తే అలా ముందుకు పోవడమే..’ అని మన మనసులో మాట చెప్పింది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. ఈ ఏడాది విడుదలవుతున్న తన మొదటి సినిమా ‘గుండే..’ ప్రచార కార్యక్రమాల్లో ప్రస్తుతం ఆమె చురుకుగా పాల్గొంటోంది. ‘మేరీ కామ్ చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ కూడా నడుస్తోంది. ఈ ఏప్రిల్ ఆ సినిమా విడుదల చేయాలనేది నిర్మాతల ఆలోచన’ అని ఆమె తెలిపింది. తనకు కష్టమైన పాత్రలు పోషించాలంటే చాలా ఇష్టమని వివరించింది. ‘నాకు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషించాలంటే చాలా చిరాకు.. అందుకే మొదటి నుంచి నా పాత్రల్లో విభిన్నత ఉండేటట్లు చూసుకుంటున్నా.. ఇంతకుముందు వచ్చిన అగ్నీపథ్, బర్ఫీ, గుండే తదితర చిత్రాలు చూస్తే మీకు నా అంతరంగం అర్ధమవుతుంది..
అటువంటి విభిన్నత కూడిన కష్టమైన పాత్రలు చేయడమంటేనే నాకు చాలా ఇష్టం. ఇతరులను అనుసరించడాన్ని నేను ఇష్టపడను.. నేను ఎటువంటి నియమ నిబంధనలు పాటించను.. నా మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తా.. అంతే..’ అని 31 ఏళ్ల మాజీ విశ్వసుందరి తన మనసులో మాట చెప్పింది. గత ఏడాది నేను నటించిన రూ.200 కోట్ల సినిమా ‘క్రిష్-3’ విడుదలైంది. అంతకుముందు ఏడాది బర్ఫీ, అగ్నీపథ్ చేశా.. అవన్నీ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘ఎక్సాటిక్’ సినిమా ఇండియాలో ట్రిపుల్ ప్లాటినం సాధించింది. ప్రస్తుతం నా కెరీర్ మంచి ఫామ్‌లో ఉంది..దాన్ని ఇంకా పెంచుకోవడానికి కృషిచేస్తున్నా..’ అని ఆమె తెలిపింది. ప్రియాంక చోప్రా నటించిన ‘గుండే’ ఈ నెల 14వ తేదీన విడుదలవుతోంది. యాష్ చోప్రా నిర్మించిన ఈ సినిమాలో ఆమె ఒక క్యాబరే డ్యాన్సర్‌గా నటిస్తోంది. ఆ పాత్ర చుట్టూనే సినిమా కథ తిరుగుతుంది. రణవీర్‌సింగ్, అర్జున్ కపూర్ సహనటులు.
Advertisement
Advertisement