Mary Kom
-
నేను రాజీనామా చేయలేదు
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్, దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ తన పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. పదవీకాలం ముగిసేవరకు బాధ్యతలు కొనసాగిస్తానని చెప్పింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కూడా గెలుచుకుంది. 42 ఏళ్ల ఈ మణిపురి స్టార్ బాక్సర్ ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొంది. ఆ సమయంలో ఆమె అథ్లెట్స్ కమిషన్ పదవిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. కానీ మేరీ మాత్రం తన వాట్సాప్ గ్రూప్ సంభాషణను తప్పుగా అన్వయిస్తూ మీడియాకు లీక్ చేశారని, రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం చేశారని పేర్కొంది. ‘నేను అథ్లెట్స్ కమిషన్‌కు రాజీనామా చేయనేలేదు. 2026లో పూర్తయ్యే పదవీకాలం వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగుతాను. ఆ రోజు నేను కమిషన్ సభ్యులతో అన్నది వేరు... నెట్టింట ప్రచారమైంది వేరు. అథ్లెట్స్ కమిషన్ సభ్యులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించాను. తనతో ప్రవర్తించే తీరు ఇలాగే కొనసాగితే రాజీనామాకు సైతం వెనుకాడనని చెప్పాను. కానీ రాజీనామా చేశానని చెప్పనే లేదు. నేను రాజీనామా చేశానంటున్నారు కదా! మరి రాజీనామా లేఖ ఏది? ఎవరైనా చూశారా? అని ప్రశ్నించింది. ఐఓఏ తన కుటుంబమని... దీంతో ఎప్పుడు విబేధించనని... ఇంతటితో వాట్సాప్ సంభాషణ వివాదానికి ముగింపు పలుకుతున్నానని చెప్పారు. 2022లో ఐఓఏ అథ్లెట్స్ కమిషన్‌కు మేరీకోమ్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ అచంట శరత్ కమల్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఇంకా ఈ కమిషన్‌లో రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు, మాజీ షాట్‌పుటర్ ఓం ప్రకాశ్ కర్హాన, ఒలింపియన్ శివ కేశవన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత, షూటర్ గగన్ నారంగ్ (షూటర్), రోయర్ బజరంగ్ లాల్, ఫెన్సింగ్ ప్లేయర్ భవానీ దేవి, భారత మహిళల హాకీ మాజీ కెపె్టన్ రాణి రాంపాల్, టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను సభ్యులుగా ఉన్నారు. -
మళ్లీ ‘రింగ్’లోకి దిగాలనుంది
ముంబై: బాక్సింగ్ క్రీడకు తాను ఇంకా రిటైర్మెంటే ప్రకటించలేదని... మళ్లీ ప్రొఫెషనల్ బాక్సింగ్ సర్క్యూట్‌లోకి దిగాలనే ఆలోచన ఉందని భారత మేటి బాక్సర్ మేరీకోమ్ తెలిపింది. ‘పోటీల్లో పాల్గొనాలనుకుంటున్నాను. పునరాగమనంపై నా అవకాశాల కోసం చూస్తున్నా. ఇంకో నాలుగేళ్లు ఆడే సత్తా నాలో వుంది. నా ప్రపంచం బాక్సింగే. అందుకే అందులో ఎంత ఆడినా, పతకాలు, ప్రపంచ చాంపియన్షిప్లెన్ని గెలిచినా ఇంకా కెరీర్‌ను కొనసాగించాలనే ఆశతో ఉన్నాను’ అని మాజీ రాజ్యసభ ఎంపీ అయిన మేరీకోమ్ తెలిపింది. పారిస్‌లో భారత బాక్సర్ల వైఫల్యం... దరిమిలా తన అభిప్రాయాలను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్ సమాఖ్యతో వివరించాలనుకుంటున్నట్లు చెప్పింది. ప్రపంచ చాంపియన్, తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్, రియో పతక విజేత లవ్లీనా బొర్గొహైన్ పారిస్‌లో పతకాలు గెలుపొందలేకపోయారు. ఇక టోర్నీల సమయంలో బరువు నియంత్రణ, నిర్వహణ బాధ్యత పూర్తిగా క్రీడాకారులదేనని మేరీకోమ్ స్పష్టం చేసింది. ఇటీవల పారిస్ ఒలింపిక్స్‌లో రెజ్లర్ వినేశ్ ఫొగాట్ వంద గ్రాముల అధిక బరువుతో పసిడి వేటలో అనర్హతకు గురైంది. ఈ నేపథ్యంలో 42 ఏళ్ల మేరీ ఆమె పేరును ప్రస్తావించకుండా ‘బరువు’ బాధ్యత గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ‘ఈ విషయంలో నేనెంతగానో నిరాశకు గురయ్యాను. నేను కూడా ఇలాంటి సమస్యల్ని కొన్నేళ్ల పాటు ఎదుర్కొన్నాను. అతి బరువు నుంచి మనమే జాగ్రత్త వహించాలి. ఇది మన బాధ్యతే! ఇందులో నేను ఎవరినీ నిందించాలనుకోను. వినేశ్ కేసుపై నేను వ్యాఖ్యానించడం లేదు. నా కెరీర్లో ఎదురైన చేదు అనుభవాల గురించి మాత్రమే మాట్లాడుతున్నా. బరువును నియంత్రించుకోకపోతే బరిలోకి దిగడం కుదరదు. పతకం లక్ష్యమైనపుడు మన బాధ్యత మనకెపుడు గుర్తుండాలిగా’ అని వివరించింది. -
చెఫ్ డి మిషన్‌గా వైదొలగిన మేరీకోమ్
న్యూఢిల్లీ: ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ పారిస్ ఒలింపిక్స్‌లో చెఫ్ డి మిషన్‌గా వ్యవహరించలేనని తన బాధ్యతల నుంచి వైదొలగింది. ఈ మేరకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అధ్యక్షురాలు పీటీ ఉషకు ఆమె లేఖ రాసింది. ‘దేశానికి సేవ చేయడాన్ని నేనెప్పుడు గౌరవంగా భావిస్తాను. మానసికంగానూ సిద్ధంగా ఉంటా. కానీ... వ్యక్తిగత కారణాల వల్ల ప్రతిష్టాత్మక ఈవెంట్లో గురుతర బాధ్యతలు నిర్వర్తించలేకపోతున్నాను. అందుకే ఆ పదవికి రాజీనామా చేస్తున్నా’ అని 41 ఏళ్ల ఈ మణిపూర్ మహిళా బాక్సర్ లేఖలో వివరించింది. దీనిపై స్పందించిన పీటీ ఉష... మేరీకోమ్ పదవి నుంచి తప్పుకోవడం బాధాకరమే అయినా... ఆమె నిర్ణయాన్ని, వ్యక్తిగత గోప్యతను గౌరవిస్తామని తెలిపారు. మేరీ స్థానంలో మరొకరిని నియమిస్తామని ఉష చెప్పారు. పారిస్ ఒలింపిక్స్ ఈ ఏడాది జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరుగుతాయి. -
Paris Olympics: మేరీ కోమ్ రాజీనామా.. కారణం ఇదేనన్న పీటీ ఉష
భారత దిగ్గజ బాక్సర్, వరల్డ్ మాజీ చాంపియన్ మేరీ కోమ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్యారిస్ ఒలింపిక్స్ నేపథ్యంలో ఇండియా చెఫ్ డీ మిషన్ బాధ్యతల నుంచి వైదొలిగారు. వ్యక్తిగత కారణాల దృష్ట్యా మేరీ కోమ్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని భారత ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షురాలు పీటీ ఉష ధ్రువీకరించారు. తనను చెఫీ డీ మిషన్ బాధ్యతల నుంచి తప్పించాలంటూ మేరీ కోమ్ లేఖ రాసినట్లు వెల్లడించారు. ఈ మేరకు.. ‘‘దేశానికి సేవ చేసే ఏ అవకాశాన్నైనా నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తాను. ఈ బాధ్యతను కూడా సమర్థవంతంగా నిర్వర్తించడానికి మానసికంగా సంసిద్ధమయ్యాను. కానీ ఇప్పుడు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నాను. నా వ్యక్తిగత కారణాల దృష్ట్యా మాత్రమే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇలా చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. కానీ ఇంతకంటే నాకు వేరే మార్గం కనిపించడం లేదు. ఒలింపిక్స్‌లో నా దేశం తరఫున ఆడే అథ్లెట్లందరికీ ఎల్లవేళలా మద్దతుగా ఉంటాను’’ అని 41 ఏళ్ల మేరీ కోమ్ పీటీ ఉషకు రాసిన లేఖలో పేర్కొన్నారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్-2024లో పాల్గొననున్న భారత జట్టుకు మెంటార్‌గా సేవలు అందించేందుకు చెఫ్ డీ మిషన్‌గా మేరీ కోమ్‌ను నియమించింది ఒలింపిక్ అసోసియేషన్. మార్చి 21న ఇందుకు సంబంధించి ప్రకటన చేసింది. అయితే, తాజాగా మేరీ కోమ్ ఆ బాధ్యతల నుంచి తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ రాజీనామానకు ఆమోదించామని.. ఆమె స్థానంలో కొత్త వారిని త్వరలోనే నియమిస్తామంటూ ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పీటీ ఉష ప్రకటించారు. కాగా మణిపూర్‌కు చెందిన మేరీ కోమ్.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్‌గా నిలిచారు. 2021 లండన్ ఒలింపిక్స్‌లో ఈ లెజెండరీ బాక్సర్ కాంస్య పతకం కైవసం చేసుకున్నారు. -
నేనింకా రిటైర్ కాలేదు.. రిటైర్మెంట్ కథనాలను కొట్టిపారేసిన మేరీ కోమ్
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ రిటైర్మెంట్ ప్రకటించినట్లు ఇవాల్టి ఉదయం నుంచి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజాగా కోమ్ ఈ ప్రచారంపై స్పందిస్తూ.. తన రిటైర్మెంట్పై వచ్చిన వార్తాల్లో ఎంత మాత్రం నిజం లేదని కొట్టిపారేసింది. తాను ఇంకా రిటైర్మెంట్ ప్రకటించలేదని.. ఒకవేళ ఆ నిర్ణయం తీసుకుంటే వ్యక్తిగతంగా మీడియా ముందుకు వస్తానని ఆమె తెలిపింది. ఈ మేరకు కోమ్ ప్రముఖ మీడియా సంస్థకు వివరణ ఇచ్చింది. ఇదిలా ఉంటే, 41 ఏళ్ల మేరీ కోమ్ మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
రిటైర్మెంట్ ప్రకటించిన బాక్సింగ్ దిగ్గజం
భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన ప్రకటన చేసింది. ఇకపై బాక్సింగ్ రింగ్‌లోకి దిగేది లేదని ప్రకటించింది. వయో పరిమితి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. అన్ని కేటగిరీల పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు పేర్కొంది. భవిష్యత్‌లో బాక్సింగ్‌తో అనుసంధానమై ఉంటానని తెలిపింది. కాగా, అంతర్జాతీయ బాక్సింగ్ అసోసియేషన్ (ఐబీఏ) నిబంధనల ప్రకారం 40 ఏళ్లకు పైబడిన క్రీడాకారులు ప్రొఫెషనల్ బాక్సింగ్ టోర్నమెంట్లలో పాల్గొనడానికి అనుమతి లేదు. గతేడాదే ఏజ్ లిమిట్‌ను దాటిన 41 ఏళ్ల మేరీ కోమ్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంది. మహిళల బాక్సింగ్‌లో ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా, ఒలింపిక్ విన్నర్‌గా (2012 ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో కాంస్య పతకం) నిలిచిన కోమ్.. పురుష బాక్సర్లు కూడా సాధించలేని ఎన్నో ఘనతలు సాధించి చాలా సందర్భాల్లో విశ్వవేదికపై భారత కీర్తిపతాకను రెపరెపలాడించింది. ఓవరాల్‌గా మేరీ కోమ్ తన కెరీర్లో 13 స్వర్ణాలు సహా మొత్తం 19 పతకాలను సాధించి బాక్సింగ్ లెజెండ్‌గా గుర్తింపు తెచ్చుకుంది. మేరీ కోమ్ ప్రతిభకు గుర్తుగా భారత ప్రభుత్వం ఆమెకు 2002లో అర్జున అవార్డు, 2009లో ఖేల్ రత్న అవార్డు, 2006లో పద్మశ్రీ, 2013లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందజేసింది. మేరీకోమ్ 2016లో రాజ్యసభ సభ్యురాలిగా నియమితురాలైంది. ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ కోమ్ రింగ్‌లో ఎన్నో అపురూప విజయాలు సాధించి ఔరా అనిపించింది. -
సంకల్ప్ కిరణ్ పురస్కార్ అవార్డు అందుకున్న మేరీ కోమ్ (ఫొటోలు)
-
ఆర్టిఫిషియల్ ఇంటలెజిన్స్ మాయ.. మన స్పోర్ట్స్ స్టార్స్ చిన్నపుడు ఇలా!
-
సచిన్ టెండుల్కర్‌కు కీలక బాధ్యతలు! ఇకపై..
Sachin Tendulkar: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కీలక బాధ్యతలు చేపట్టనున్నారు. భారత ఎన్నికల సంఘం ఆయనకు నేషనల్ ఐకాన్‌గా గుర్తింపు ఇవ్వనుంది. ఇందుకు సంబంధించి ఇరు వర్గాల మధ్య బుధవారం ఒప్పందం జరుగనుంది. ఈ నేపథ్యంలో మూడేళ్ల పాటు సచిన్ నేషనల్ ఐకాన్‌గా ఉండనున్నారు. ఈ క్రమంలో ఓటింగ్ ప్రాధాన్యాన్ని తెలియజేస్తూ.. దేశవ్యాప్తంగా ఓటర్లలో అవగాహన కల్పించే కార్యక్రమాల్లో భాగం కానున్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు చేసిన సచిన్ టెండుల్కర్‌కు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. యూత్‌లో భారీ క్రేజ్ దృష్ట్యా.. యువతలోనూ సచిన్‌కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ క్రికెట్ గాడ్ క్రేజ్‌ను ఉపయోగించి ఓటర్లను మరింత చైతన్యవంతం చేసేందుకు ఈసీ సిద్ధమైంది. ఇందులో భాగంగానే ఈ లెజండరీ క్రికెటర్‌ను నేషనల్ ఐకాన్‌గా నియమించనుంది. ఇక గతంలో బాలీవుడ్ నటులు పంకజ్ త్రిపాఠి, ఆమిర్ ఖాన్.. అదే విధంగా క్రీడా విభాగంలో టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, బాక్సర్ మేరీ కోమ్ లోక్‌సభ ఎన్నికల సమయంలో నేషనల్ ఐకాన్లుగా సేవలు అందించారు. చదవండి: వరల్డ్‌కప్ జట్టులో రోహిత్ వద్దంటూ.. ధోని అతడి కోసం పట్టుబట్టాడు! వెంటనే కోచ్.. తానే బెస్ట్ బౌలర్ అనుకుంటాడు.. కోహ్లి బౌలింగ్ అంటే మాకు భయం: భువీ -
మేరీకోమ్ రిటైర్మెంట్ అప్పుడే..
ఆరుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ మేరీకోమ్ ఈ ఏడాది జరగనున్న ఆసియా క్రీడల తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశాలున్నాయి. గతేడాది కామన్వెల్త్ క్రీడల సెలక్షన్ ట్రయల్స్ సందర్భంగా ఆమె ఎడమ మోకాలికి గాయమై శస్త్రచికిత్స చేయించుకుంది. అప్పటినుంచి మేరీకోమ్ బరిలోకి దిగలేదు. అయితే తాజాగా సెప్టెంబర్ 23న మొదలుకానున్న ఆసియా క్రీడల్లో పాల్గొనాలని మేరీకోమ్ భావిస్తోంది. అయితే నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడిన బాక్సర్లు పోటీల్లో పాల్గొనేందుకు ఆస్కారం లేదు. ఇప్పటికే మేరీకోమ్ వయస్సు 40 ఏళ్లు. ఈ ఏడాది నవంబర్‌లో మేరీకోమ్‌కు 41 ఏళ్లు నిండనున్నాయి. అందుకే బహుశా ఆమెకు ఆసియా క్రీడల్లో చివరిసారి బరిలోకి దిగే చాన్స్ ఉంది. కాగా ప్రపంచ మహిళల బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టు జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమంలో మేరీకోమ్ పాల్గొంది. ఆమె మాట్లాడుతూ.. ''కామన్వెల్త్ క్రీడల ట్రయల్స్ సందర్భంగా దురదృష్టవశాత్తూ గాయమైంది. శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. తిరిగి రింగ్‌లో అడుగుపెట్టేందుకు ప్రయత్నిస్తున్నా.నాకు ఏడాది మాత్రమే మిగిలి ఉంది. వచ్చే ఏడాది రిటైర్ కావాల్సిందే. కాబట్టి వీడ్కోలుకు ముందు టోర్నీలో ఆడాలనుకుంటున్నా. మరో ఐదేళ్ల పాటు బాక్సింగ్ రింగ్‌లో కొనసాగాలని ఉన్నా నిబంధనల ప్రకారం 40 ఏళ్లు పైబడితే ఆటకు దూరమవక తప్పదు. ఇప్పుడు నా ప్రధాన లక్ష్యం ఆసియా క్రీడలు. అప్పటివరకు పూర్తిగా కోలుకుంటాననే నమ్మకం ఉంది. ఒకవేళ ఆసియా క్రీడలకు అర్హత సాధించకపోతే చివరగా ఏదైనా అంతర్జాతీయ టోర్నీలో పోటీపడాలనుంది'' అని పేర్కొంది. -
రెజ్లర్ల ఉద్యమం.. పర్యవేక్షక కమిటీలోకి బబితా
మహిళా రెజ్లర్లపై భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) చీఫ్ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ లైంగిక వేధింపుల ఆరోపణల వివాదంపై మేరీకోమ్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటయిన సంగతి తెలిసిందే. ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తమ విచారణ కొనసాగిస్తున్నారు. అయితే కమిటీ ఏర్పాటుకు ముందు తమను సంప్రదించలేదని రెజ్లర్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో తాజాగా పర్యవేక్షణ కమిటీలో కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత, రెజ్లర్ బబిత ఫొగట్‌ను ఆరో సభ్యురాలిగా చేర్చినట్టు కేంద్ర క్రీడాశాఖ మంగళవారం ప్రకటించింది. కాగా కమిటీలో మేరీకోమ్‌తో పాటు మాజీ రెజ్లర్ యోగేశ్వర్ దత్, మాజీ షట్లర్ తృప్తి ముర్గుండె, రాధిక శ్రీరామ్, రాజేశ్ రాజగోపాలన్‌లు ఉన్నారు. తాజాగా బబితా ఈ కమిటీలో ఆరో సభ్యురాలిగా చేరింది. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడిగా బ్రిజ్‌భూషణ్ నియంతృత్వ ధోరణిని రెజ్లర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రస్తుతం డబ్ల్యూఎఫ్ఐ రోజువారి వ్యవహారాలను పర్యవేక్షక కమిటీనే చూస్తోంది. -
రెజ్లర్ల మీటూ ఉద్యమం.. కీలక పరిణామం
భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధింపులకు గురి చేశారంటూ భారత రెజ్లర్లు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. డబ్ల్యూఎఫ్ఐ పదవి నుంచి ఆయనను తొలగించాలంటూ రెజ్లర్లు జంతర్ మంతర్ వద్ద మూడురోజులుగా ఆందోళన చేపట్టారు. గురువారం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు విఫలం కావడంతో రెజ్లర్లు తమ ఆందోళనను మరింత ఉదృతం చేశారు. ఈ నేపథ్యంలో వినేశ్ పొగాట్, భజరంగ్ పూనియా సహా మిగతా రెజ్లర్లు శుక్రవారం ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ)కు లేఖ రాశారు. తాజగా డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై భారత ఒలింపిక్ కమిటీ(ఐవోఏ) ఏడుగురు సభ్యులతో కూడిన కమిటీని నియమించింది. ఈ కమిటీలో మేరీకోమ్ సహా డోలా బెనర్జీ, అలకనంద ఆశోక్, యోగేశ్వర్ దత్, సహదేవ్ యాదవ్‌లతో పాటు ఇద్దరు అడ్వకేట్లు ఉన్నారు. కాగా సభ్యుల్లో ఒకరైన సహదేవ్ యాదవ్ మాట్లాడుతూ.. మేము ఆందోళన చేస్తున్న రెజ్లర్ల వాదనలు వింటాం. అభియోగాలను పరిశీలించిన తర్వాత నిష్పక్షపాతంగా విచారణ జరిపి తగిన న్యాయం జరిగేలా చూస్తాం అని పేర్కొన్నారు. Indian Olympic Association (IOA) has formed a seven-member committee to probe the allegations of sexual harassment against WFI chief Brij Bhushan Sharan Singh. Members are Mary Kom, Dola Banerjee, Alaknanda Ashok, Yogeshwar Dutt, Sahdev Yadav and two advocates: IOA pic.twitter.com/BjuyEbUHZu — ANI (@ANI) January 20, 2023 చదవండి: రెజ్లర్ల మీటూ ఉద్యమం.. అథ్లెట్లకు షాక్?! ఐవోఏకు లేఖ.. పీటీ ఉష చెంతకు పంచాయతీ -
మేరీ కోమ్.. బాక్సింగ్ రింగ్‌ను శాశించిన ఉక్కు మహిళ
చుంగ్ (ఎత్తుగా), నియ్ (సంపద ఉన్న), జాంగ్ (దృఢమైన).. ఈ మూడు కలిపితే ‘చుంగ్నీజాంగ్’.. తన కూతురికి తండ్రి పెట్టిన పేరది! ఆ సమయంలో ఆ చిన్నారి గురించి, ఆమె భవిష్యత్తు గురించి ఆయన ఏమీ ఆలోచించలేదు. నామకరణంలోనే ఘనకీర్తి రాసిపెట్టి ఉందని ఆయనకు తెలియదు. అప్పటి వరకు మగపిల్లాడు పుడితే బాగుండనుకున్న తల్లి కూడా ఎంతో ఆరోగ్యంగా ఉన్న అమ్మాయిని చూసి సంబరంగా గుండెకు హత్తుకుంది. కొన్నేళ్ల తర్వాత ఆ అమ్మాయి ‘మరింత వేగంగా, మరింత ఎత్తుకు, మరింత బలంగా’.. అంటూ నినాదం నింపుకున్న విశ్వక్రీడల్లో మెరిసింది.. తన దృఢ సంకల్పంతో విజయాలతో పాటు సంపదనూ మోసుకొచ్చింది. ఆ అమ్మాయే మంగ్తె చుంగ్నీజాంగ్ మేరీ కోమ్.. దేశంలో బాక్సింగ్ ఆటకు, మహిళలకు భూమ్యాకాశాలకు ఉన్నంత అంతరం ఉన్న సమయంలో ఆటకు పర్యాయపదంగా నిలిచింది. దేశ కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింపజేసింది. ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా ఆరుసార్లు ప్రపంచ చాంపియన్... క్రీడాకారులంతా కలలుగనే ఒలింపిక్ క్రీడల్లో కాంస్యపతకంతో భారత జెండా రెపరెపలాడించిన క్షణం.. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, ఆసియా చాంపియన్‌షిప్‌లాంటి ప్రతిష్ఠాత్మక పోటీల్లో కలిపి మరో 12 పతకాలు.. 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ వేదికపై మొదలైన ఈ విజయ ప్రస్థానం 39 ఏళ్ల వయసు వరకూ సాగింది. ఈ మధ్యలో అమ్మతనం కూడా ఆమె ఆటకు అడ్డుగా మారలేదు. అసాధారణ ప్రదర్శనతో మేరీ కోమ్ బాక్సింగ్ రింగ్‌ను శాసించింది. ఆమె సాధించిన ఘనతల విలువ రికార్డు పుస్తకాలకే పరిమితం కాదు. వాటి వెనక ఉన్న అపార పట్టుదల, పోరాటం అందరికీ స్ఫూర్తిదాయకం. క్రీడల్లో రాణించలేకపోవటానికి సౌకర్యాలు లేకపోవడమే కారణమని సాకులు చెప్పే ఎందరికో మేరీ కోమ్ జీవితం ఒక పాఠం, గుణపాఠం నేర్పిస్తుంది. ఆమె నేపథ్యం, ప్రతికూల పరిస్థితులను దాటి వచ్చిన తీరు అనితరసాధ్యం. బాక్సింగ్‌నే ఇష్టపడి.. డింకో సింగ్.. 1998 ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన మణిపూర్ బాక్సర్. అతను ఆ విజయంతో తిరిగి వచ్చిన సమయంలో స్వరాష్ట్రంలో సంబరాలు జరిగాయి. అప్పుడు 16 ఏళ్లు ఉన్న మేరీ వాటన్నింటినీ చూసి ఒక అభిమానిలా గంతులు వేసింది. అంతే తప్ప అప్పటి వరకు కూడా ఆమె బాక్సింగ్‌లో కెరీర్ గురించి ఆలోచించనే లేదు. తండ్రి ఒక వ్యవసాయ కూలీ. సహజంగానే ఆర్థిక ఇబ్బందులు. అయితే ఆయన ఎప్పుడూ దానిని సమస్యగా భావించలేదు. కష్టపడి కుటుంబాన్ని పోషించుకోగలిగితే చాలనుకునే వ్యక్తి. ఇలాంటి నేపథ్యంలో స్కూల్లో పోటీలు తప్ప మేరీకి క్రీడల గురించి మరేమీ తెలీదు. చిన్నప్పటి నుంచి బలంగా ఉన్న ఆమెకు అథ్లెటిక్స్‌లో పోటీపడి గెలవడం చిటికెలో పనిగా మారింది. అయితే ఒక రోజు డింకో సింగ్‌ను చూసిన తర్వాత తనకు సరైన ఆట బాక్సింగ్ అనే భావించింది. ఆ పంచ్‌లు, బలంగా ప్రత్యర్థిపై విరుచుకుపడే తత్వం మేరీని ఆకర్షించాయి. అయితే నాన్నకు తెలిస్తే కోప్పడతాడేమోనని తన ఆసక్తిని రహస్యంగానే ఉంచింది. మేరీ దూకుడు, పోరాటతత్వం బాక్సింగ్‌కు సరిపోతాయని గుర్తించి ఆమెను కోచ్‌లు.. కొసానా మీటీ, నర్జిత్ సింగ్ ప్రోత్సహించారు. అదే చివరకు మేరీని ప్రపంచ చాంపియన్ దిశగా నడిపించింది. సాధనలోనే ఒక రోజు తన కూతురి బాక్సింగ్ గురించి తెలుసుకున్న తండ్రి కొంత ఆందోళన చెందినా.. చివరకు సరైన మార్గం ఎంచుకుందని స్థిమితపడ్డాడు. పతకాల ప్రవాహం.. 2001 అక్టోబర్.. పెన్సిల్వేనియాలో మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్.. 48 కేజీల విభాగంలో సత్తా చాటిన మేరీ కోమ్ ఫైనల్ చేరింది. తుది పోరులో ఓడినా రజతం సాధించి గర్వంగా నిలబడింది. అయితే అది ఆరంభం మాత్రమే. పతకధారణ అంతటితో ఆగిపోలేదు. తొలిసారి సాధించిన రజతం ఆ తర్వాత బంగారమైంది. ఆ వేదికపై మరో ఐదుసార్లు మేరీ మెడలో స్వర్ణం మెరిసింది. 2002, 2005, 2006, 2008, 2010, 2018లలో ఏకంగా ఆరుసార్లు ఆమె ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ ఇదే తరహాలో ఐదు స్వర్ణాలతో మేరీ తానేంటో చూపించింది. ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడల్లో పతకాలు, వరల్డ్ నంబర్‌వన్ ర్యాంక్ ఒక ఎత్తు కాగా.. 2012 లండన్ ఒలింపిక్స్ సాధించిన కాంస్య పతకం మేరీ స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లాయి. వరుస విజయాలతో సెమీస్ చేరిన తర్వాత నికోలా ఆడమ్స్ (యూకే) చేతిలో ఓడటంతో మేరీ ఫైనల్ ఆశలు నెరవరలేదు. అయితేనేమి ఎక్కడో మణిపురి కోమ్ తెగలో పుట్టి లండన్ వేదికపై ఒలింపిక్ కాంస్య పతకం అందుకుంటున్న క్షణాన ఆమె కళ్ళల్లో కనిపించిన మెరుపు ఆ కంచు పతకం విలువేమిటో చెబుతుంది. బాక్సింగ్ పంచ్ ద్వారా మెగా ఈవెంట్లో భారత జెండా ఎగరేసిన క్షణం అపురూపం. అడ్డు రాని అమ్మతనం.. బాక్సర్‌గా ఎదుగుతున్న దశలో పరిచయమైన ఫుట్‌బాల్ ప్లేయర్ కరుంగ్ ఓన్లర్‌ను మేరీ ప్రేమించి పెళ్లి చేసుకుంది. 2005లో పెళ్లి జరిగేనాటికే ఆమె ప్రపంచ చాంపియన్ కూడా. పెళ్లి తర్వాత ఆటకు మేరీ విరామమిచ్చింది. చాలామంది ఆమె బాక్సింగ్ ముగిసిపోయిందనే భావించారు. ఇతర క్రీడల సంగతేమో కానీ బాక్సింగ్‌లాంటి ఆటలో తల్లిగా మారిన తర్వాత అదే తరహా బలాన్ని ప్రదర్శించడం, శరీరంలో వచ్చే మార్పులతో కలిగే ఇబ్బందులను అధిగమించాల్సి రావడం చాలా కష్టం. కానీ మేరీ పోరాటతత్వం ముందు అవన్నీ చిన్నవిగా మారిపోయాయి. కవల పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మళ్లీ సాధన మొదలు పెట్టింది. పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత ఆమె నాలుగు ప్రపంచ చాంపియన్ షిప్‌లు, ఒలింపిక్ పతకం గెలుచుకోవడం మరో పెద్ద విశేషం. ఈ దంపతులకు ఆ తర్వాత మరో కొడుకు పుట్టగా, ఒక అమ్మాయిని వీరు దత్తత తీసుకున్నారు. అవార్డుల పంట.. క్రీడాకారులకు ఇచ్చే అర్జున, ఖేల్రత్నలు సహజంగానే మేరీని వెతుక్కుంటూ వచ్చాయి. భారత ప్రభుత్వం ఇచ్చే నాలుగు అత్యుత్తమ పౌర పురస్కారాల్లో భారతరత్న మినహా మిగతా మూడు పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్‌లు మేరీని వరించాయి. క్రీడల్లో ఆమె చేసిన సేవలకుగాను ప్రభుత్వం రాజ్యసభకు నామినేట్ చేయగా 2016–2022 మధ్య ఆమె ఈ బాధ్యతలను నిర్వర్తించింది. వెండితెర కథగా.. మేరీకోమ్ జీవితం ఆధారంగా 2014లో సినిమా వచ్చింది ఉమంగ్ కుమార్ దర్శకత్వంలో! ప్రియాంక చోప్రా అందులో మేరీ పాత్రను పోషించింది. ప్రముఖ దర్శకుడు సంజయ్‌లీలా భన్సాలి సహ నిర్మాతగా కూడా ఉన్న ఈ చిత్రం బాక్సాఫీస్ హిట్‌గా నిలిచింది. ఆమె ఆత్మకథ ‘అన్ బ్రేకబుల్’ పేరుతో పుస్తకంగా కూడా ప్రచురితమైంది. చిన్నారులకు స్ఫూర్తిని అందించే కథల సంకలనం ‘గుడ్‌నైట్ స్టోరీస్ ఫర్ రెబల్ గర్ల్స్’లో కూడా మేరీకి చోటు దక్కింది. - మొహమ్మద్ అబ్దుల్ హాది -
పీవీ సింధుకు అరుదైన గౌరవం.. అథ్లెట్స్ కమిషన్‌కు ఎన్నిక
న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్‌కు ఎన్నికైంది. ఈ కమిషన్‌లో పది మంది క్రీడాకారులుంటారు. ఇందులో ఐదుసార్లు ప్రపంచ మహిళా బాక్సింగ్ విజేత మేరీకోమ్, వింటర్ ఒలింపియన్ శివ కేశవన్, మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), గగన్ నారంగ్ (షూటింగ్), వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్), రాణి రాంపాల్ (మహిళా హాకీ), భవాని దేవి (ఫెన్సింగ్), భజరంగ్ లాల్ (రోయింగ్), ఓం కర్హన (షాట్‌పుట్)లు ఉన్నారు. లింగ వివక్షకు తావులేకుండా ఐదుగురు చొప్పున మహిళా, పురుష ప్లేయర్లకు ఐఓఏ కమిషన్‌లో సమ ప్రాధాన్యత ఇచ్చారు. పది మంది సభ్యులకు గాను సరిపడా నామినేషన్లు వేయడంతో వాళ్లంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐఓఏ వెల్లడించింది. కొత్త ఐఓఏ నియమావళి ప్రకారం ఈ కమిషన్ నుంచి ఇద్దరు సభ్యులు (పురుషుడు, మహిళ) ఐఓఏకు సంబంధించిన వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి. ఐఓఏలోని సభ్యులకు ఉన్న ఓటింగ్ హక్కులు కమిషన్‌లోని ఇద్దరు సభ్యులకు ఉంటాయని ఐఓఏ వర్గాలు వెల్లడించాయి. -
మేరీ కోమ్ విల్ పవర్ పంచ్
ముప్పై తొమ్మిదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. (ఆడపిల్లలు లేని కారణంగా దత్తత తీసుకున్న అమ్మాయితో కలిపి నలుగురు పిల్లలు). ఆరు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్. ఒక ఒలింపిక్ మెడల్! మొన్నటి వరకు రాజ్యసభ సభ్యురాలు. ఏమిటి మేరీ కోమ్ విజయ రహస్యం? బాక్సర్‌గా అనుభవమా? ఆమె ఫిట్నెస్సా? రెండూ! రెండిటినీ మించి గెలవాలన్న తపన. అలాగని కోమ్ మరీ గంటల కొద్దీ ప్రాక్టీసేం చెయ్యరు. యువ బాక్సర్లకు రెండు గంటల ప్రాక్టీస్ చాలు. కోమ్‌కి రోజూ 40 నుంచి 45 నిమిషాల సాధన సరిపోతుందట. ఇక శక్తి. ఎక్కడి నుంచి వస్తుంది ఆమెలోంచి ఆ పవర్ పంచ్? విల్ పవర్ ఎలాగూ ఉంటుంది. డైట్ ఏమిటి? స్పెషల్‌గా ఏమీ ఉండదట. ఏం తినాలని ఉంటే అప్పటికి అది తినేస్తారట. జన్రల్‌గా కోమ్ తినేది వరన్నం (వరి అన్నం). ‘‘రైస్ లేకుండా నేను బతకలేను. తరచు జిలేబీలు తింటాను. అలాగే ఐస్‌క్రీమ్. ఒక్కోసారి రెండూ కూడా. అయితే నో మసాలా.. నో స్పైసీ ఫుడ్’’ అని చెప్తారు మేరీ కోమ్. ఇవి మాత్రమే కాదు. సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారట. బలమిచ్చే మందులు. డాక్టర్ నిఖిల్ లేటీ ఆమె ఫిజియోథెరపిస్ట్. ఆయన్నడిగితే కోమ్ ఆహారపు అలవాట్ల గురించి మరికొంత వివరంగా చెబుతారు. ఇంట్లో వండిన మణిపురి ఫుడ్. అన్నంలోకి మాంసం, కూరగాయలు. బయట డబ్బాలో లభించే ప్రొటీన్, మల్టీ విటమిన్లు. ఇదీ మేరీ మెనూ. సరే, బాక్సింగ్‌లో ఆడడానికి ఒక వెయిట్ ఉండాలి కదా! ఆ వెయిట్‌ని ఎక్కువా కాకుండా, తక్కువగా కాకుండా కోమ్ ఎలా మేనేజ్ చెయ్యగలుగుతున్నారు? పోటీలో కేటగిరీలను బట్టి ఆటకు తగ్గట్లు కేలరీలు పెంచడం, తగ్గించడం కోమ్‌కి కష్టమేం కాదట! బరువు తగ్గడానికి స్కిప్పింగ్, బ్యాడ్మింటన్. పెరగడానికి.. బలమైన ఆహారం. క్రమబద్ధమైన వ్యాయామం. చివరగా ఒక్క విషయం. కోమ్ సాధారణంగా బంగారు పతకాన్నో, ఇంకో బ్రాస్ పతకాన్నో పంటి కింద కొరుకుతూ కనిపిస్తారు కానీ.. ఆహారాన్ని భుజిస్తూ ఎక్కడా కనిపించరు! అలాగే ఇకముందు పెద్ద పెద్ద ఈవెంట్స్‌లో కూడా మేరీ కోమ్ కనిపించబోవడం లేదు. యువ బాక్సర్లకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశంతో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకున్నారు. కోమ్ మణిపూర్‌లో జన్మించిన మన చైనత్య భారతి. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. కష్టపడి పైకొచ్చారు. క్రీడాకారిణిగా రాణించారు. (చదవండి: తొలి మహిళా రాష్ట్రపతి... తొలి ఆదివాసీ రాష్ట్రపతి) -
కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగిన భారత దిగ్గజ బాక్సర్
భారత మహిళా దిగ్గజ బాక్సర్.. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ మేరీకోమ్ కామన్వెల్త్ గేమ్స్ నుంచి వైదొలిగింది. గాయం కారణంగా కామన్వెల్త్ గేమ్స్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆమె ఒక ప్రకటనలో తెలిపింది. విషయంలోకి వెళితే.. కామన్వెల్త్ గేమ్స్ ట్రయల్స్‌లో భాగంగా శుక్రవారం 48 కేజీల విభాగంలో నీతూతో తలపడింది. మ్యాచ్ ఆరంభంలోనే మేరీకోమ్ మోకాలికి గాయమైంది.మెడికల్ చికిత్స పొందిన తర్వాత బౌట్‌ను తిరిగి ప్రారంభించారు. అయితే నొప్పి ఉండడంతో మేరీకోమ్ చాలా ఇబ్బందిగా కనిపించింది. ఇది గమనించిన రిఫరీ బౌట్‌ను నిలిపివేసి ఆర్ఎస్సీఐ తీర్పు మేరకు నీతూను విజేతగా ప్రకటించారు. ఈ ఓటమితో బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్‌ను సైతం మేరీకోమ్ వదులుకోవాల్సి వచ్చింది. పలుమార్లు ఆసియా స్వర్ణ పతకాన్ని అందుకున్న మేరీకోమ్ చివరిసారిగా టోక్యోలో జరిగిన ఒలింపిక్స్ బరిలో నిలిచింది. అక్కడ ప్రీ క్వార్టర్స్ వరకు చేరుకున్నప్పటికీ అనూహ్యంగా ఓటమి పాలైంది. ఈ క్రమంలో ఆసియా క్రీడలతో పాటు కామన్వెల్త్ గేమ్స్‌పై ఆమె దృష్టి పెట్టారు. -
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.. తిట్టిన నోరు మెచ్చుకునేలా చేసింది
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదని చెప్పడానికి ఇప్పుడు చెప్పుకునే సంఘటన ఒక నిదర్శనం. ఒకప్పుడు మెచ్చుకోవడానికి రాని నోరు.. ఇవాళ ప్రశంసలు కురిపించేలా చేసింది. ఏ చేతులైతే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించాయో అవే చేతులు ఇవాళ ఆమె భుజంపై చేతులు వేసి ఫోటో దిగేలా చేశాయి. ఈ పాటికే మీకు అర్థమయిదనుకుంటా ఎవరా వ్యక్తి అని.. అవునండి.. ఆమె భారత దిగ్గజ మహిళ బాక్సర్ మెరీ కోమ్. మేరీ కోమ్ చేత మెచ్చుకొని ఫోటో దిగిన వ్యక్తి పేరు నిఖత్ జరీన్. ఇటీవల జరిగిన ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం పతకం సాధించి అందరి దృష్టిని ఒక్కసారిగా తనవైపు తిప్పుకుంది తెలంగాణ ముద్దుబిడ్డ నిఖత్ జరీన్. భారత్ తరఫున ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఐదో మహిళా బాక్సర్‌గా నిఖత్ జరీన్ రికార్డులకెక్కింది. మేరీకోమ్ చివరి సారిగా 2018లో గెలిచాకా మళ్లీ నాలుగేళ్ల తర్వాత ప్రపంచ బాక్సింగ్ వేదికపై తెలుగుతేజం భారత మువ్వన్నెలను సగర్వంగా రెపరెప లాడించింది. అయితే నిఖత్ జరీన్‌కు మేరీకోమ్ అంటే విపరీతమైన అభిమానం. మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన మేరీ కోమ్ అంటే తనకు ఆదర్శమని నిఖత్ చాలాసార్లు చెప్పుకొచ్చింది. తనకు షేక్ హ్యాండ్ ఇవ్వడానికి నిరాకరించిన వ్యక్తిని నిఖత్ జరీన్ స్వయంగా కలుసుకుంది. అయితే మేరీ కోమ్ పాత గొడవలన్నీ మరిచిపోయి నిఖత్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. తన సంతోషాన్ని పంచుకున్న నిఖత్ ఆమెతో దిగిన ఫోటోను ట్విటర్లో పంచుకుంది. నిఖత్ పోస్ట్ చేసిన మరుక్షణంలోనే సోషల్ మీడియాలో ఆ ఫోటో వైరల్‌గా మారింది. అంతకముందే మేరీ కోమ్ నిఖత్‌కు శుభాకాంక్షలు చేస్తూ ట్వీట్ చేసింది.'' గోల్డ్ మెడల్ గెలిచినందుకు కంగ్రాట్స్ నిఖత్ జరీన్. నీ ప్రదర్శన చారిత్రాత్మకం.. ఎంతో గర్వంగా ఉంది. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నా'' అంటూ ట్వీట్ చేసింది. ఇద్దరి మధ్య వివాదం.. నిఖత్ జరీన్ ఎవరు’... తనతో పోటీకి సై అన్న ఒక యువ బాక్సర్ గురించి మేరీ కోమ్ చేసిన వ్యాఖ్య ఇది. టోక్యో ఒలింపిక్స్‌కు తనకు నేరుగా అర్హత ఇవ్వాలంటూ మేరీ కోమ్ కోరగా, ట్రయల్స్‌లో ఆమెతో తలపడేందుకు అవకాశం ఇవ్వాలని నిఖత్ విజ్ఞప్తి చేసింది. చివరకు నిఖత్ విజ్ఞప్తి చెల్లగా...మేరీకోమ్ చేతిలో మాత్రం ఓటమి ఎదురైంది. కనీసం క్రీడాస్ఫూర్తితో షేక్ హ్యాండ్ కూడా ఇవ్వకుండా మేరీ తన ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ''నేను ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి? ఒకవేళ ఆమెకు గౌరవం కావాలంటే ముందు జూనియర్‌గా తనే ఇవ్వడం నేర్చుకోవాలి. అలాంటి వారిని నేను అంతగా ఇష్టపడను. కేవలం నీ సత్తా ఏంటో రింగ్‌లో నిరూపించుకో.. అంతేకానీ బయట ప్రపంచంలో కాదు'' అంటూ ఆగ్రహంతో పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. చదవండి: World Boxing Championship: ప్రతికూలతలను బద్దలు కొట్టి... Nikhat Zareen: జగజ్జేత నిఖత్ జరీన్ No victory is complete without your idol’s blessings😇🙌🏻@MangteC #HappyMorning#HappyMe#HappyUs pic.twitter.com/uXJFcK9nMu — Nikhat Zareen (@nikhat_zareen) May 25, 2022 Congratulations @nikhat_zareen for winning Gold medal. So proud of you on your historic performances and all the best for your future endeavors. pic.twitter.com/M3RouNCaPs — M C Mary Kom OLY (@MangteC) May 20, 2022 -
జిమ్ మారో జిమ్.. షార్ట్‌కట్స్ ఉండవ్.. చెమటలు కక్కాల్సిందే!
భారత స్టార్ బాక్సర్ ఎంసీ మేరీకోమ్ ఈ ఏడాది జులైలో జరగనున్న కామన్వెల్త్ గేమ్స్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ పూర్తి దృష్టి బర్మింగ్‌హామ్‌లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలపైనే ఉంది. దీని కోసం ఆమె చెమటలు కక్కుతోంది తన కసరత్తుల వీడియో ను మేరీ కోమ్ సోషల్ మీడియా యాప్ కూ లో షేర్ చేసింది, విజయానికి కృషి మాత్రమే అవసరమని రాసింది. షార్ట్‌కట్ పద్ధతిలో ప్రయత్నించినా ఫలితం ఉండదని కష్టపడి పనిచేయాల్సిందే అంటోంది. బాక్సింగ్ ప్రాక్టీస్ తర్వాత, మేరీ కోమ్ మధ్యాహ్నం జిమ్‌కి వెళుతుంది. పుష్-అప్స్ సిట్-అప్లు, అలాగే హెవీ వెయిట్ లిఫ్టింగ్ వంటి బాడీ వెయిట్ వ్యాయామాలతో కండరాలను బలంగా ఉంచుకోవడానికి ఈ సమయాన్ని ఉపయోగిస్తుంది. Koo App Do or do not. There is no try. There is no shortcuts. Only HARD WORK. View attached media content - M C Mary Kom (@mcmarykom) 10 May 2022 -
బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం
Mary Kom To Skip World Championships And Asian Games: ఒలింపిక్ కాంస్య పతక విజేత, భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ సంచలన నిర్ణయం తీసుకుంది. యువ తరానికి అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఏడాది ప్రపంచ చాంపియన్‌షిప్స్‌తో పాటు ఆసియా క్రీడల్లో పాల్గొనకూడదని నిర్ణయించుకుంది. బర్మింగ్‌హామ్ వేదికగా జరగబోయే కామన్వెల్త్ గేమ్స్‌పై దృష్టి సారిస్తానని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ మేరకు బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (బీఎఫ్ఐ)కి లేఖ ద్వారా తెలియజేసింది. మేరీ కోమ్ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీఎఫ్ఐ అధ్యక్షుడు అజయ్ సింగ్ తెలిపారు. కాగా, ఐబీఏ మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ ఈ ఏడాది మే 6 నుంచి 21 వరకు టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరగనున్నాయి. అలాగే, జులై 28 నుంచి కామన్వెల్త్ క్రీడలు, సెప్టెంబరు 10 నుంచి ఆసియా క్రీడలు ప్రారంభం కానున్నాయి. చదవండి: IPL2022: సన్‌రైజర్స్ పూర్తి షెడ్యూల్ ఇదే.. రాజస్థాన్ రాయల్స్‌తో మొదలై..! -
Mary Kom: ఎవ్వరికీ ఆ ఛాన్స్ లేదు.. కానీ ఆమెకు మాత్రం మినహాయింపు?!
Mary Kom And Lovlina Borgohain: హిస్సార్‌లో ఈనెల 21 నుంచి జరిగే జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో పాల్గొనడం లేదని భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ తెలిపింది. జాతీయ చాంపియన్‌షిప్‌లో విజేతలుగా నిలిచిన వారిని మాత్రమే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టులోకి ఎంపిక చేస్తామని భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ప్రకటించింది. అయితే మేరీకోమ్ పాల్గొనే 48–51 కేజీల విభాగానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలని బీఎఫ్ఐ భావిస్తోంది. కాగా 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ అయిన మేరీ కోమ్... ఇటీవలి టోక్యో ఒలిపింక్స్‌లో క్వార్టర్స్ చేరకుండానే రెండో రౌండ్లోనే తిరుగుముఖం పట్టిన విషయం తెలిసిందే. అయితే, మరో భారత మహిళా బాక్సర్ 23 ఏళ్ల లవ్లీనా బొర్గోహెయిన్.. కంచు పంచ్‌తో కాంస్యం సాధించి విశ్వవేదికపై సత్తా చాటింది. ఈ ప్రదర్శన ఆధారంగా ఆమె వరల్డ్ ఈవెంట్(69 కేజీల విభాగం)కు నేరుగా సెలక్ట్ అయింది. చదవండి: T20 WC: ఇంగ్లండ్‌పై కోహ్లి సేన విజయం; ఏయ్.. మైకేల్ ఆఫ్‌లైన్‌లో ఉన్నావ్ ఏంది?! -
మేరీకోమ్‌కు ఖరీదైన కారు గిఫ్ట్‌గా
ఢిల్లీ: 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత.. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా ఖరీదైన కారును గిఫ్ట్‌గా ఇచ్చింది. టోక్యో ఒలింపిక్స్ 2020 ఫ్లాగ్ బేరర్‌గా(పతాకధారి) వ్యవహరించిన మేరీకోమ్‌కు రినాల్డ్ ఇండియా కైగర్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారును అందించింది. అంతకముందు టోక్యో ఒలింపిక్స్ రజత పతక విజేత.. భారత మహిళ వెయిట్‌లిఫ్టర్ మీరాభాయి చానుకు కూడా రినాల్డ్ కైగర్ కంపాక్ట్ ఎస్యూవీ మోడల్ కారునే గిఫ్ట్‌గా అందించింది. కాగా షినీ విల్సన్, అంజూ బాబీ జార్జీ తర్వాత మేరీకోమ్ ఒలింపిక్స్‌లో ఫ్లాగ్‌బేరర్‌గా వ్యవహరించిన మూడో భారత మహిళ అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కచ్చితంగా పతకం తెస్తుందనుకున్న మేరీకోమ్ క్వార్టర్స్ చేరకుండానే రెండో రౌండ్లోనే తిరుగుముఖం పట్టింది. రౌండ్ 16 పోరులో కొలంబియన్ బాక్సర్ వాల్నసీయా విక్టోరియా చేతిలో మేరి కోమ్ ఓటమి పాలైంది. 3-2 తేడాతో మేరీ కోమ్ ఓటమి పాలైంది. కాగా లండన్ ఒలింపిక్స్‌లో బాక్సింగ్‌లో మేరీకోమ్ క్యాంస్య పతకం సాధించిన సంగతి తెలిసిందే. అయితే వయసు రిత్యా చూస్తే మాత్రం మేరీకోమ్‌కు ఇవే ఆఖరి ఒలింపిక్స్ అని అంతా భావించారు. కానీ తాను 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కచ్చితంగా పాల్గొంటానని మేరీకోమ్ ధీమా వ్యక్తం చేసింది. చదవండి: Mary Kom: నాకింకా వయసైపోలేదు. మరో నాలుగేళ్లు ఆడతా -
‘నాకింకా వయసైపోలేదు. మరో నాలుగేళ్లు ఆడతా’
న్యూఢిల్లీ: బాక్సింగ్ ఆడే సత్తా తనలో ఇంకా ఉందని.. 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్ రింగ్ బరిలో ఉంటానని భారతబాక్సర్ మేరీకోమ్ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్‌లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన మేరీకోమ్ అనూహ్యంగా ప్రీక్వార్టర్స్‌లో పరాజయం పాలైన సంగతి తెలిసిందే. ఓటమి అనంతరం శనివారం స్వదేశానికి చేరుకున్న మేరీకోమ్‌కు విమానాశ్రయంలో దిగిన వెంటనే మీడియా నుంచి ఒక ప్రశ్న ఎదురైంది. ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయారు.. ఇక బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతారా అని ప్రశ్నించారు. మేరీకోమ్ స్పందింస్తూ.. 'టోక్యో ఒలింపిక్స్‌లో దేశానికి పతకం తీసుకురాకపోవడం బాధను కలిగింది. కచ్చితంగా పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా. నా వరకు నేను మంచి ప్రదర్శననే చేశా. ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో న్యాయ నిర్ణేతలు తీరు సరిగా లేదు. తొలి రెండు రౌండ్లు గెలిచిన నేను ఎందుకు ఓడిపోతాను. బౌట్‌కు ముందు అధికారులు నా దగ్గరకు వచ్చి మీ సొంత జెర్సీని వాడకూడదు.. అని చెప్పారు. అయితే నేను ఆడిన తొలి మ్యాచ్‌లోనూ అదే జెర్సీ వేసుకున్నా.. అప్పుడు చెప్పని అభ్యంతరం ప్రీక్వార్టర్స్‌లో ఎందుకు చెప్పారో అర్థం కాలేదు. కేవలం నా మానసిక ఆందోళన దెబ్బతీయడానికే జడ్జిలు అలా చేశారని అనిపిస్తుంది. ఇతర దేశాలకు లేని నిబంధనలు మనకే ఎందుకు'' అంటూ ప్రశ్నించింది. ఇక రిటైర్మెంట్పై మేరీ కోమ్ మాట్లాడుతూ.. ''నా వయసు ఇంకా అయిపోలేదు.. 40 ఏళ్లు వచ్చేవరకు బాక్సింగ్‌లో కొనసాగుతా.. అవసరమైతే వచ్చే ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రయత్నిస్తా'' అంటూ చెప్పుకొచ్చింది. -
ఆటలంటే మాటలా!
దేశ ప్రజల్లో ఆశలు పెంచిన మేటి బాక్సర్ మేరీకోం టోక్యో ఒలింపిక్స్ నుంచి ఒట్టి చేతులతో నిష్క్రమించారు. మూడింట రెండు రౌండ్లు నెగ్గి కూడా, ఓడి ప్రీ–క్వార్టర్ ఫైనల్స్ నుంచే ఆమె వెనుదిరగడంతో దేశం నివ్వెరపోయింది. క్రీడాసక్తులైన ఔత్సాహికులు కొందరి ఉవాచ ఏమంటే... ‘కోట్ల మంది భారతీయుల ఆశల్ని మేరీ కోమ్ వమ్ము చేసి, నిరాశపరిచారు’అని. బహుశా కొన్ని చానళ్లూ, పత్రికలూ తమ పతాకశీర్షికల్ని ఇలా రాస్తాయేమో! కానీ, ఇక్కడో విషయం గమనించాలి. 130 కోట్ల జనాభా దేశం ఒక క్రీడాకారిణిపై అంతగా ఆశలు పెట్టుకోవడం తప్పా? బాక్సింగ్ వంటి క్రీడలో... ఇప్పటికే ఆరుమార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన నలుగురు పిల్లల తల్లి, వారి ఆశల్ని ఇంకా... నెరవేర్చలేకపోవడం ఆమె తప్పా? ఆలోచించదగిందే! ఆటల్లో గెలుపోటములు సహజం. ఎంత గొప్ప క్రీడాకారులైనా అన్నిమార్లూ గెలవలేరు. క్రీడలు పతకాల కోసం కాదు, క్రీడాస్ఫూర్తి కోసం! మనం ఏ మేరకు క్రీడాస్ఫూర్తిని ప్రోత్సహిస్తున్నాం? క్రీడలకు మనం ఎంత ప్రాధాన్యత ఇస్తున్నాం? క్రీడా రంగాన్ని అట్టడుగు స్థాయి నుంచి ఎంతమేర శాస్త్రీయ పంథాలో అభివృద్ధి పరు స్తున్నాం? ఇవీ మన ముందున్న ప్రశ్నలు. వీటికి సమాధానం కావాలి. ప్రతిసారి ఒలంపిక్స్ ముందు పెద్ద ఎత్తున ఆశలతో బృందాల్ని పంపడం, తీరా పోటీలు ముగిశాక... ఆశించిన స్థాయిలో పతకాలు రాలేదని నిరాశపడటం. ఇది మనకు రివాజయింది! వాస్తవిక పరిస్థితుల్ని అంగీకరించే ఆత్మపరిశీలన ఎప్పుడూ జరుగదు. నేల చదును పరుచకుండా, యోగ్యమైన విత్తనాలు చల్లకుండా, శ్రద్ధాసక్తులతో సాగు చేయకుండా పంట దిగుబడి ఆశించినట్టు ఉంటుంది క్రీడల్లో మన వ్యవహారం. ప్రభుత్వాలు, ప్రయివేటు సంస్థల ప్రోత్సాహంతో ఈసారి కొంత ఆశాజనకం అనిపించినా.... ప్రతికూలాంశాలు ఇప్పుడే తలెత్తాయి. కోవిడ్‌వల్ల తగినంత శిక్షణ లభించక, స్పర్ధకు అవకాశంలేక, క్రీడాకారుల్లో మానసిక దృఢత్వం కొరవడి ప్రతిభ పూర్తిస్థాయి రాణించని స్థితి నెలకొంది. లండన్ 2012 ఒలింపిక్స్‌లో ఆరు పతకాలు నెగ్గిన భారత్, ఇనుమడించిన ఉత్సాహం, గంపెడా శలతో వెళ్లి రియో 2016 ఒలింపిక్స్‌లో రెండు పతకాలతో సరిపెట్టుకుంది. ఈ ‘ఒకడుగు ముందుకి, రెండడుగులు వెనక్కి’ పరిస్థితి క్రీడల్లో మనకు మొదట్నించీ ఉంది! కిందిస్థాయి నుంచి క్రీడా నైపుణ్యాల వృద్ధి, ఆరోగ్యకరమైన స్పర్ధ వాతావరణం, అంతర్జాతీయ పోటీని తట్టుకునే సన్నద్ధత లేమి ఇందుకు కారణం. వ్యక్తిగతంగా అసాధారణ ప్రతిభ చూపి, ఒలింపిక్స్ వంటి అంతర్జాతీయ వేదికల్లో పతకాలు నెగ్గిన వారికి ప్రభుత్వాలు ప్రోత్సాహకాలివ్వడం, ఇతరుల్లో స్ఫూర్తి నింపడం మెచ్చతగిందే! కానీ, కోట్ల రూపాయల ప్రజాధనాన్ని నగదుగా, కోట్లాది రూపాయలు విలువచేసే భూముల్ని అకాడమీల పేరిట అప్పగించడం సముచితమా? దానికి బదులు క్రీడలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యత కల్పించి, నిధులిచ్చి మౌలిక సదుపాయాలు పెంచాలి. ఆటల్లో అగ్రభాగాన ఉండే ఎన్నో దేశాల్లో ఇలా వ్యక్తిగత నగదు బహుమతులుండవు. మనం కూడా క్రీడా ప్రాంగణాలు, క్రీడా హాస్టళ్లు, క్రీడా సామగ్రితోనూ గట్టి వ్యవస్థల్ని ఏర్పాటు చేయాలి. పాఠశాల, కళాశాల, విశ్వవిద్యాలయాల స్థాయిలో నిర్బంధ క్రీడా విధానాన్ని అమలు చేయాలి. గ్రామీణ ప్రాంతాల్లో క్రీడల్ని ప్రోత్సహించాలి. విద్యా, ఉపాధి అవకాశాల్లో క్రీడాకారులకు తగు నిష్పత్తిలో రిజర్వేషన్ కల్పించాలి. దేశంలో క్రికెట్ కున్న ప్రజాదరణతో ఇతర మొత్తం క్రీడలకున్న ప్రాధాన్యత కూడా సరితూగదు. అన్ని క్రీడాంశాల్లో తగిన వసతులు, వనరులు, స్పర్ధ, ప్రోత్సాహకాల్ని పెంచాలి. మొక్కగా ఉన్నపుడు చేస్తేనే క్రీడల్లో నైపుణ్యం పెరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలను మనవాళ్లు అందుకోగలుగుతారు. ఈసారి 117 మంది క్రీడాకారులతో, 228 మంది అతి పెద్ద బృందం టోక్యో వెళ్లింది. షూటింగ్, విలువిద్య, కుస్తీలు, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, బ్యాడ్మింటన్, హాకీ వంటి అంశాల్లో గంపెడాశలతోనే వెళ్లి ప్రతిభను పరీక్షించుకుంటున్నారు. రియో ఒలింపిక్స్ తర్వాత... ప్రత్యేక శ్రద్ధతో ‘టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీం’(టాప్స్), ‘ఖేలో ఇండియా’ వంటివి పెట్టి కేంద్ర ప్రభుత్వం, ‘జేఎస్‌డబ్ల్యూ’తో జిందాల్, ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్... ఇలా ప్రయివేటు, కార్పొరేట్ సంస్థలు కూడా మంచి ప్రోత్సాహ మిచ్చాయి. ఆశలు పెరిగాయి. ఫలితాలే ఆశించినట్టు లేవు! 68,000 జనాభా కలిగిన చిన్న దేశం బెర్మడా, ఫిజీ వంటివి కూడా బంగారు పతకాలతో జాబితాకెక్కాయి. తొలిరోజు మీరాబాయి అందించిన రజతమే భారత్‌ను జాబితాలో నిలిపింది. తర్వాత ఇంకేమీ రాలే! మన క్రీడాకారులపై ఒత్తిడి కూడా ప్రతికూలంగా పనిచేస్తోంది. లండన్ ఒలింపిక్ పతక విజేత గగన్ నరంగ్ (షూటింగ్) అన్నట్టుగా ఆటను ఆస్వాదించడం, పోటీని తట్టుకోవడమే కాదు విమర్శల్ని ఎదుర్కోవడంలోనూ యువ ఆటగాళ్లు రాటు తేలాలి. ఒలింపిక్ వేదికల్లో కెమెరాలు, ఆటగాళ్ల గుండె కొట్టుకునే పల్స్‌రేట్‌ను కొలుస్తున్నపుడు, మనవాళ్లు ఎంతో ఒత్తిడికి గురవుతున్నట్టు నమోదవుతోంది. వాటిని అధిగమిస్తేనే అసలైన క్రీడాస్ఫూర్తి! క్రీడల్ని ప్రోత్సహించడంలో హరియాణా, పంజాబ్, కేరళ వంటి రాష్ట్రాల సరసన మిగతా రాష్ట్రాలూ చేరాలి. ఈశాన్యభారత్‌లోని చిన్న రాష్ట్రమే అయినా మణిపూర్ క్రీడలకు పెట్టింది పేరు. ‘మణిపూర్‌లో గుడ్డిగా రాయి విసిరితే, అది ఓ క్రీడాకారునికి తగులుతుంద’ని నానుడి. గ్రామీణ స్థాయి నుంచి అంత పకడ్బందీగా ఆటలు ఆడుతారు కనుకే ప్రస్తుత ఒలింపిక్ జట్టులో మణిపురీలు ఐదుగురున్నారు. ఇప్పటికి మనకు లభించిన ఒకే ఒక పతకం ఆ రాష్ట్ర చలువే! ఆ స్ఫూర్తే దేశవ్యాప్తమవ్వాలి! -
ఆ నిర్ణయం దురదృష్టకరం: మేరీ కోమ్ భావోద్వేగం
టోక్యో ఒలింపిక్స్‌లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ (38) నిష్క్రమణ పలువుర్ని షాక్‌కు గురిచేసింది. మహిళల ఫ్లై వెయిట్ బాక్సింగ్ ప్రీ-క్వార్టర్ ఫైనల్లో ఇంగ్రిట్ వాలెన్సియాపై ఓడిన తరువాత మీడియాతో మాట్లాడిన మేరీ కోమ్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను ఓడిపోయానంటే నమ్మలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. జడ్జెస్ నిర్ణయం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. పతకంతో తిరిగి వస్తానని అనుకున్నా.. కానీ తన తప్పు ఏమిటో అర్థం కాలేదనీ, దీన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నానని ఆమె పేర్కొన్నారు. అయితే 40 ఏళ్ల వయస్సు వరకు తన బాక్సింగ్ వృత్తిని కొనసాగిస్తానని మేరీ కోమ్ ప్రకటించారు. ఆరు సార్లు ప్రపంచ ఛాంపియన్ అయిన మేరీ కోమ్ టోక్యో ఒలింపిక్స్‌లో కొలంబియా ప్రత్యర్థిపై న్యాయ నిర్ణేతల విభజన నిర్ణయంతో అనూహ్యంగా ఓడిపోయారు. ఈ పరిస్థితిని మేరీ కోమ్ కూడా ఊహించలేదు. ఒక దశలో ఇంగ్రిట్ విజేతగాప్రకటించడానికి ముందే విజేతగా మేరీ తన చేయిని పైకి లేపారు. ముగ్గురు జడ్జిలు ఇంగ్రిట్‌కు అనుకూలంగా బౌట్ తీర్పు ఇవ్వగా ఇద్దరు మేరీ కోమ్కు మద్దతిచ్చారు. కానీ పాయింట్ల కేటాయింపులో తేడా మేరీని విజయానికి దూరం చేసింది. మరోవైపు ఇదే విషయంపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా ట్వీట్ చేశారు. అందరి దృష్టిలో మీరే విజేత. కానీ న్యాయమూర్తులకు వారి వారి లెక్కలు ఉంటాయంటూ ట్విటర్లో వ్యాఖ్యానించారు. ప్రియమైన మేరీ కోమ్, టోక్యో ఒలింపిక్స్‌లో కేవలం ఒక పాయింట్‌తో ఓడిపోయారు. కానీ ఎప్పటికీ మీరే ఛాంపియన్ అని ఆయన పేర్కొన్నారు. ప్రపంచంలో మరే మహిళా బాక్సర్ సాధించనిది మీరు సాధించారన్నారు. మీరొక చరిత్ర. భారతదేశం మిమ్మల్ని చూసి గర్విస్తోందని కేంద్ర మాజీ క్రీడామంత్రి ప్రశంసించారు. అలాగే ఇతర క్రీడాభిమానులు కూడా మేరీ కోమ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఓడిపోయినా ‘యూ ఆర్ ది లెజండ్.. మీరే విజేత.. మీరే మాకు ఆదర్శం’ అన్న సందేశాలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. For all of us @MangteC was the clear winner but Judges have their own calculations😥 https://t.co/bDxjHFK9MZ pic.twitter.com/gVgSEugq4Q — Kiren Rijiju (@KirenRijiju) July 29, 2021 -
‘పంచ్’మే దమ్ హై... బాక్సింగ్ బరిలోకి ‘నవ రత్నాలు’
ఒలింపిక్స్ క్రీడల్లో ఒకప్పుడు భారత బాక్సర్లది ప్రాతినిధ్యమే కనిపించేది. బరిలోకి దిగడం... ఆరంభ రౌండ్లలోనే వెనుదిరగడం జరిగేది. కానీ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో విజేందర్ సింగ్ ఈ ట్రెండ్‌ను మార్చాడు. తన పంచ్ పవర్‌తో సత్తా చాటి కాంస్య పతకాన్ని అందించాడు. విశ్వ క్రీడల్లో పతకం నెగ్గిన తొలి భారతీయ బాక్సర్‌గా చరిత్ర సృష్టించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌లో మహిళల బాక్సింగ్ తొలిసారి ప్రవేశపెట్టగా... ‘మణిపూర్ మెరిక’ మేరీకోమ్ కాంస్య పతకంతో తిరిగొచ్చింది. 2016 రియో ఒలింపిక్స్‌లో మాత్రం మన బాక్సర్లకు నిరాశఎదురైంది. ఈసారి ఆ గాయం మానేందుకు భారత బాక్సర్లు భారీ కసరత్తే చేశారు. కరోనా రూపంలో కష్టకాలం ఎదురైనా, ఆంక్షలు అడుగులకు అడ్డుపడినా అలుపెరగని పట్టుదలతో టోక్యో ఒలింపిక్స్ బెర్త్‌లు ఖరారు చేసుకున్నారు. ఇక చివరి పరీక్షకు సిద్ధమయ్యారు. పురుషుల విభాగంలో ఐదుగురు... మహిళల విభాగంలో నలుగురు భారత బాక్సర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ తొమ్మిది మందిలో అమిత్ పంఘాల్, మేరీకోమ్‌లు కచ్చితంగా పతకాలతో తిరిగొస్తారని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకుంటున్నారు. ‘టోక్యో’లో బరిలోకి దిగనున్న భారత బాక్సింగ్ ‘నవ రత్నాల’ గురించి తెలుసుకుందాం..! అమిత్ పంఘాల్ (52 కేజీలు) హరియాణాకు చెందిన 25 ఏళ్ల అమిత్‌పై భారత్ గంపెడాశలు పెట్టుకున్నాడు. తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా రింగ్‌లో కింగ్ అయ్యేందుకు ఈ ప్రపంచ నంబర్‌వన్ బాక్సర్ చెమటోడ్చుతున్నాడు. తొలిసారి ఒలింపిక్స్‌లో ఆడనున్న అమిత్ గత నాలుగేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో అద్భుత ప్రదర్శన చేస్తున్నాడు. ఆసియా చాంపియన్‌షిప్ (2017)లో కాంస్యం నెగ్గిన ఈ యువ బాక్సర్... ప్రపంచ చాంపియన్‌షిప్, కామన్వెల్త్ గేమ్స్‌లో రజతాలు గెలిచాడు. 2018 ఆసియా గేమ్స్‌లో చాంపియన్‌గా నిలిచాడు. ‘టోక్యో’లో టాప్ సీడ్‌గా బరిలోకి దిగనున్న అమిత్‌కు క్వార్టర్ ఫైనల్ వరకు పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. క్వార్టర్ ఫైనల్ అడ్డంకిని దాటి సెమీస్ చేరితో అమిత్‌కు పతకం ఖాయమే. మనీశ్ కౌశిక్ (63 కేజీలు) విజేందర్ 2008 ఒలింపిక్స్‌లో గెలిచిన కాంస్యమే మనీశ్‌ను బాక్సింగ్ కలల్లో ముంచెత్తింది. అదే లోకంగా ఎదిగి... బాక్సింగ్‌లో ఒదిగాడు. ఇప్పుడు మొదటి ఒలింపిక్స్‌లో పంచ్ విసిరేందుకు సిద్ధమయ్యాడు. మనీశ్ కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలిచాడు. అన్నట్లు... ఇతని ఒలింపిక్స్ ‘కల’కు గతేడాది గాయమైంది. చిత్రంగా మెగా ఈవెంట్ వాయిదా పడటం వరమైంది. లేదంటే విశ్వక్రీడల ముచ్చటకు మరో మూడేళ్లు పట్టేది. జోర్డాన్‌లో జరిగిన ఆసియా ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌లో గాయపడ్డాడు. తర్వాత కరోనా బారినపడ్డాడు. ఇప్పుడైతే టోక్యో బాట పట్టాడు. పూజా రాణి (75 కేజీలు) బాక్సింగ్ ప్రారంభంలో గ్లౌజులు వేసుకునేందుకే తెగ ఇబ్బందిపడిన పూజ తర్వాత కఠోరశ్రమతో బాక్సర్‌గా ఎదిగింది. 2016లో దీపావళి వేడుకల్లో చేతులు కాల్చుకోవడం... కోలుకున్న తర్వాత మరుసటి ఏడాదే భుజానికి తీవ్ర గాయం వల్ల ఆమె కెరీర్ ముగిసిపోయే ప్రమాదంలో పడింది. అయినా సరే ఒలింపిక్స్ అర్హతే లక్ష్యంగా తన ఫిట్నెస్, ప్రదర్శనను మెరుగుపర్చుకొని చివరకు టోక్యో బాటపట్టింది. సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు) భారత్ తరఫున హెవీ వెయిట్ కేటగిరీలో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి బాక్సర్ సతీశ్. జట్టులో పెద్ద వయస్కుడు కూడా అతనే. ఉత్తరప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల ఈ బాక్సర్‌కు ఇదే తొలి ఒలింపిక్స్. కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో పతకాలు సాధించాడు. విశ్వక్రీడల కోసం నిత్యం శ్రమించిన సతీశ్ ప్రత్యర్థులపై ముష్ఠిఘాతాలు విదిల్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ఆశిష్ కుమార్ (75 కేజీలు) బీజింగ్‌లో విజేందర్ సింగ్ చరిత్రకెక్కిన వెయిట్ కేటగిరీలో ఆశిష్ కుమార్ తొలిసారి ఒలింపిక్స్ బరిలోకి దిగుతున్నాడు. ఆశిష్‌ను ఒలింపియన్‌గా చూడాలన్న లక్ష్యం అతని తండ్రిది కాగా... అతను అర్హత సాధించడానికి సరిగ్గా నెలముందే తండ్రి కన్నుమూశాడు. దీన్ని జీర్ణించుకోవడం కష్టమైనా... తండ్రి లక్ష్యం తనని టోక్యో దాకా నడిపించింది. హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన 26 ఏళ్ల ఆశిష్ 2019 ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచాడు. ఇప్పుడు ఒలింపిక్ పతకాన్ని సాధించి తండ్రికి ఆంకితమివ్వాలనే ఆశయంతో ఉన్నాడు. వికాస్ కృషన్ (69 కేజీలు) బాక్సింగ్ జట్టులో అనుభవజ్ఞుడైన ఒలింపియన్ వికాస్. 2012 లండన్, 2016 రియో ప్రయత్నాల్లో కలగానే మిగిలిపోయిన ఒలింపిక్ పతకాన్ని టోక్యోలో నిజం చేసుకునేందుకు పగలురాత్రి అనకుండా కష్టపడుతున్నాడు. 29 ఏళ్ల ఈ హరియాణా బాక్సర్ ఏడాదికి పైగా ఇంటి ముఖమే చూడలేదు. తన రెండు కళ్లు పతకాన్నే చూస్తుండటంతో... తను కన్న పిల్లల్ని ఫోన్లోనే చూసుకుంటున్నాడు. బహుశా ఇదే తన కెరీర్‌కు ఆఖరి ఒలింపిక్స్ అనుకుంటున్న వికాస్ పంచ్‌లకు అనుభవం కూడా తోడుగా ఉంది. మేరీకోమ్ (51 కేజీలు) ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్ ఇప్పుడు ఒలింపిక్ స్వర్ణంపై గురిపెట్టింది. రెండు దశాబ్దాలుగా బాక్సింగ్ రింగ్‌లో ప్రత్యర్థుల్ని దడదడలాడిస్తున్న 38 ఏళ్ల మేరీకిది చివరి ఒలింపిక్స్... దీంతో పతకం వన్నే మార్చేందుకు అస్త్రశస్త్రాలతో సిద్ధంగా ఉంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన మేరీ తాజా వేటలో ఎదురయ్యే ప్రత్యర్థుల్ని చిత్తు చేసేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) దినసరి కూలీల కుటుంబం నుంచి వచ్చి దీటైన బాక్సర్‌గా ఎదిగిన సిమ్రన్‌జిత్ ఒలింపిక్స్ పతకంతోనైనా తన కుటుంబకష్టాలు తీరుతాయనే ఆశతో ఉంది. 26 ఏళ్ల ప్రతిభావంతురాలైన ఈ బాక్సర్‌కు పంజాబ్ ప్రభుత్వం ఉద్యోగం హామీని నిలబెట్టుకోలేకపోయింది. కూలీ పనిచేసే తండ్రి 2018లో మరణించడంతో కుటుంబానికి సిమ్రన్జితే పెద్దదిక్కయింది. ఓ వైపు ఆర్థిక సమస్యలతో పోరాడుతూ కుటుంబాన్ని పోషిస్తున్న ఆమె మరోవైపు రింగ్‌లో ప్రత్యర్థులతోనూ ‘ఢీ’కొడుతోంది. లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు) యువ బాక్సర్ లవ్లీనా ప్రాథమిక విద్యను అభ్యసించే రోజుల్లోనే బాక్సింగ్ ఆటపై మనసు పెట్టింది. సాంకేతికంగా పంచ్ పవర్లో మేటి అయిన 23 ఏళ్ల ఈ అస్సాం బాక్సర్ ప్రత్యర్థుల పని పట్టడంలో దిట్ట. 20 ఏళ్ల వయసులో 2018 ప్రపంచ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలిచింది. మరుసటి ఏడాది కూడా కాంస్యాన్ని చేజిక్కించుకుంది. ఈ ఏడాది దుబాయ్‌లో జరిగిన ఆసియా చాంపియన్‌షిప్‌లోనూ కాంస్యం నెగ్గింది. అయితే గతేడాది కీలకమై ఇటలీ శిక్షణకు కరోనా వల్ల దూరమైంది. తీరా విమానం ఎక్కబోయే రోజు ముందు వైరస్ సోకినట్లు రిపోర్టు రావడంతో ఇంటికే పరిమితమైంది. -
పతాకధారులుగా మేరీకోమ్, మన్‌ప్రీత్
న్యూఢిల్లీ: అంతర్జాతీయస్థాయిలో భారత్‌కు ఎన్నో గొప్ప విజయాలు అందించిన దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్, పురుషుల హాకీ జట్టు కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌కు అరుదైన గౌరవం లభించింది. ఈనెల 23న జరిగే టోక్యో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో వీరిద్దరు భారత బృందానికి పతాకధారులుగా (ఫ్లాగ్ బేరర్స్) వ్యవహరించనున్నారు. ఈ మేరకు మేరీకోమ్, మన్‌ప్రీత్ సింగ్ పేర్లను ఖరారు చేస్తూ టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) సమాచారం ఇచ్చింది. ఆగస్టు 8న ఒలింపిక్స్ ముగింపు ఉత్సవంలో భారత బృందానికి స్టార్ రెజ్లర్, ప్రస్తుత ఆసియా, కామన్వెల్త్ క్రీడల చాంపియన్ బజరంగ్ ఫ్లాగ్ బేరర్‌గా ఉంటాడని ఐఓఏ తెలిపింది. ఇప్పటివరకైతే టోక్యో ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 18 క్రీడాంశాల్లో మొత్తం 115 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. లింగ సమానత్వం పాటించాలనే సదుద్దేశంతో ఈసారి నుంచి ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో ఆయా దేశాలు ఇద్దరు చొప్పున (1 మహిళ, 1 పురుషుడు) క్రీడాకారులకు పతాకధారులుగా వ్యవహరించే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. 2016 రియో ఒలింపిక్స్‌లో షూటర్ అభినవ్ బింద్రా భారత బృందానికి ఫ్లాగ్ బేరర్‌గా వ్యవహరించాడు. బింద్రా 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో స్వర్ణం నెగ్గి విశ్వ క్రీడల్లో వ్యక్తిగత విభాగంలో పసిడి పతకం నెగ్గిన ఏకైక భారతీయ ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. బాక్సింగ్‌కే మణిహారం... మణిపూర్‌కు చెందిన 38 ఏళ్ల మేరీకోమ్ కెరీర్లో చివరిసారి ఒలింపిక్స్‌లో బరిలోకి దిగనుంది. దాంతో ఆమెకు గౌరవప్రద వీడ్కోలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఐఓఏ ఫ్లాగ్ బేరర్‌గా ఎంపిక చేసింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన మేరీకోమ్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఆరు స్వర్ణాలు, ఒక రజతం, ఒక కాంస్యం సాధించింది. 2014 ఆసియా క్రీడల్లో... 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకాలు నెగ్గిన మేరీకోమ్ ఆసియా చాంపియన్‌షిప్‌లో ఐదు స్వర్ణాలు, రెండు రజతాలు కూడా గెల్చుకుంది. ప్రస్తుతం రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న మేరీకోమ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ (2020), పద్మభూషణ్ (2013), పద్మశ్రీ (2006) పౌర పురస్కారాలు.. కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ నుంచి దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న–2009’ ‘అర్జున అవార్డు–2003’ కూడా లభించాయి. అంచెలంచెలుగా... పంజాబ్‌లోని జలంధర్ పట్టణానికి చెందిన 28 ఏళ్ల మన్‌ప్రీత్ సింగ్ 2011లో తొలిసారి భారత సీనియర్ పురుషుల హాకీ జట్టులోకి వచ్చాడు. హాఫ్ బ్యాక్ పొజిషన్లో ఆడే మన్‌ప్రీత్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో, 2016 రియో ఒలింపిక్స్‌లో టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాడు. 2017లో భారత జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. టోక్యో ఒలింపిక్స్‌లోనూ అతనే భారత్‌కు సారథ్యం వహించనున్నాడు. ఇప్పటి వరకు 269 మ్యాచ్‌ల్లో టీమిండియాకు ఆడిన మన్‌ప్రీత్ 22 గోల్స్ చేశాడు. 2019లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) ‘ఉత్తమ ప్లేయర్’ అవార్డు పొందిన తొలి భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందిన మన్‌ప్రీత్ సారథ్యంలో 2019లో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీలో విజేతగా నిలిచి ‘టోక్యో’ బెర్త్ సంపాదించింది. 2014 ఆసియా క్రీడల్లో స్వర్ణం, 2014 కామన్వెల్త్ గేమ్స్‌లో రజతం నెగ్గిన భారత జట్టులో మన్‌ప్రీత్ సభ్యుడిగా ఉన్నాడు. నా కెరీర్‌లోని చివరి ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న సందర్భంగా ఈ గౌరవం దక్కినందుకు చాలా ఆనందంగా ఉంది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఐఓఏకు, కేంద్ర క్రీడా శాఖకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరోసారి పతకం సాధించేందుకు నా శాయశక్తులా కృషి చేస్తాను. –మేరీకోమ్ భారత్ తరఫున ఒలింపిక్స్ క్రీడల ప్రారంభోత్సవంలో పతాకధారిగా వ్యవహరించనున్న మూడో మహిళా క్రీడాకారిణి మేరీకోమ్. గతంలో అథ్లెట్లు షైనీ విల్సన్ (1992 బార్సిలోనా), అంజూ జార్జి (2004 ఏథెన్స్)లకు ఈ గౌరవం దక్కింది. నా కెరీర్లో ఇదో గొప్ప ఘట్టం. ఆనందంలో నాకు మాటలు రావడంలేదు. మేరీకోమ్ లాంటి దిగ్గజ క్రీడాకారిణితో కలిసి ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో భారత్ బృందానికి పతాకధారిగా వ్యవహరించబోతున్నందుకు గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. –మన్‌ప్రీత్ సింగ్ భారత్ తరఫున ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పతాకధారిగా వ్యవహరించనున్న ఆరో హాకీ ప్లేయర్ మన్‌ప్రీత్ సింగ్. గతంలో లాల్షా (1932–లాస్ ఏంజెలిస్), ధ్యాన్‌చంద్ (1936–బెర్లిన్), బల్బీర్‌సింగ్ సీనియర్ (1952 హెల్సింకి, 1956 మెల్బోర్న్), జఫర్ ఇక్బాల్ (1984–లాస్ ఏంజెలిస్), పర్గత్ సింగ్ (1996–అట్లాంటా)లకు ఈ గౌరవం లభించింది. -
ఫైనల్లో మేరీ కోమ్
దుబాయ్: ఆసియా సీనియర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు మేరీ కోమ్, సాక్షి పసిడి పోరుకు అర్హత సాధించారు. దాంతో వీరిద్దరూ కనీసం రజత పతకాన్ని ఖాయం చేసుకున్నా రు. మహిళల 51 కేజీల విభాగంలో గురువారం జరిగిన సెమీ ఫైనల్లో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్ మేరీ కోమ్ 4–1తో లుస్తాయ్‌ఖాన్ (మంగోలియా)పై, 54 కేజీల విభాగంలో సాక్షి 3–2తో టాప్ సీడ్ దినా జోలామన్ (కజకిస్తాన్)పై గెలిచి ఫైనల్‌కు చేరుకున్నారు. మరో భారత బాక్సర్ లాల్ బుత్సహి (64 కేజీలు) కూడా ఫైనల్లోకి ప్రవేశించింది. మరో ఇద్దరు బాక్సర్లు పూజా రాణి (75 కేజీలు), అనుపమ (81+ కేజీలు) కూడా ఫైనల్లోకి అడుగు పెట్టడంతో తుది పోరుకు అర్హత సాధించిన భారత బాక్సర్ల సంఖ్య ఐదుకు చేరింది. అయితే ఇతర భారత బాక్సర్లు మోనిక (48 కేజీలు), జాస్మిన్ (57 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు), లవ్లీనా బార్గోహైన్ (69 కేజీలు) తమ సెమీ ఫైనల్ బౌట్‌ల్లో ఓడి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. మోనిక 0–5తో అలువా బాల్కిబెకోవా (కజకిస్తాన్) చేతిలో, జాస్మిన్ 0–5తో వ్లాదిస్లావా కుఖ్తా (కజకిస్తాన్) చేతిలో, సిమ్రన్‌జిత్ 0–5తో వోలోస్సెన్ (కజకిస్తాన్) చేతిలో, లవ్లీనా 2–3తో నవ్బఖోర్ ఖామ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడారు. -
Asian Boxing Championship: రింగ్‌లోకి దిగకముందే 7 పతకాలు!
దుబాయ్: ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత మహిళా బాక్సర్లు రింగ్‌లోకి దిగకముందే ఏడు పతకాలను ఖాయం చేసుకున్నారు. దుబాయ్‌లో నేడు మొదలయ్యే ఈ మెగా ఈవెంట్లో కరోనా కారణంగా మహిళల విభాగంలో 10 కేటగిరీల్లో కలిపి మొత్తం 47 మంది బాక్సర్లే పాల్గొంటున్నారు. చిన్నసైజు ‘డ్రా’ కారణంగా భారత్ నుంచి మేరీకోమ్ (51 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), అనుపమ (ప్లస్ 81 కేజీలు), సవీటి బురా (81 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), లాల్బుత్సహి (64 కేజీలు), మోనిక (48 కేజీలు) సెమీస్ చేరారు. కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. చదవండి: చైనా మారథాన్‌లో పెను విషాదం -
ఏడాది తర్వాత ‘రింగ్’లోకి మేరీకోమ్
న్యూఢిల్లీ: ఆరుసార్లు వరల్డ్ చాంపియన్, భారత మహిళా మేటి బాక్సర్ మేరీకోమ్ ఏడాది విరామం తర్వాత మళ్లీ ‘రింగ్’లోకి అడుగు పెట్టనుంది. స్పెయిన్‌లో నేటి నుంచి జరిగే బాక్సమ్ అంతర్జాతీయ టోర్నీలో ఆమె 51 కేజీల విభాగంలో పోటీపడనుంది. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన 37 ఏళ్ల మేరీకోమ్‌తోపాటు సిమ్రన్‌జిత్ (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) కూడా ఈ టోరీ్నలో ఆడనున్నారు. -
‘ఇలాంటి స్వభావం ఉన్నవారు నాకు నచ్చరు‘
నిఖత్ జరీన్ తెలంగాణ అమ్మాయి. బాక్సర్. 24 ఏళ్లు. నిజామాబాద్. 2019లో మేరీ కోమ్‌తో తలపడి ఓడిపోయింది. ముందు అనుకున్న విధంగా ఒలింపిక్స్ జరిగి ఉంటే.. జరీన్ మీద గెలిచిన మేరీ కోమ్ టోక్యోకి వెళ్లి ఉండేవారు. కోమ్‌కి, జరీన్‌కి అప్పట్లో జరిగిన పోటీ 51 కేజీల బౌట్. ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్ అయిన కోమ్.. జరీన్‌ని తేలిగ్గా పడగొట్టేశారు. అసలు వాళ్ల మధ్య ఆ పోటీ జరగాల్సిందే కాదు. అప్పటికే ట్రయల్స్ ఏమీ లేకుండానే ఒలింపిక్స్‌కి మేరీ కోమ్ సెలక్ట్ అయి ఉన్నారు. జరీన్ వచ్చి ‘అలా ఎలా చేస్తారు? ట్రయల్ జరగాల్సిందే. అవకాశం న్యాయంగా రావాలి. సీనియర్ అని రాకూడదు’ అని వాదించింది. అధికారులకు తప్పలేదు. ఇద్దరికీ మ్యాచ్ పెట్టారు. జరీన్ 1–9 తో ఓడిపోయింది. రింగులోనే కోమ్‌కి షేక్‌హ్యాండ్ ఇవ్వబోయింది. హగ్ కూడా చేసుకోబోయింది. ‘హు..’ అని కోమ్ ఆమెను పట్టించుకోకుండా రింగ్ దిగి వెళ్లిపోయారు. అప్పట్నుంచీ వీళ్లిద్దరికీ పడటం లేదని అంటారు. మళ్లీ ఇప్పుడెవరో అదే విషయం జరీన్‌ని అడిగారు. ‘పడకపోవడం అంత పెద్దదాన్ని కాదు. ఆమె నా ఆరాధ్య బాక్సర్. ఒలింపిక్స్‌లో కోమ్ పతకం సాధించాలని ఆశిస్తున్నా’ అంది జరీన్. ఇప్పుడు జరీన్ 2022 లో జరిగే కామన్ వెల్త్, ఏషియన్ గేమ్స్ కోసం ప్రాక్టీస్ చేస్తోంది. ఢిల్లీలో కోమ్‌కి, జరీన్‌కి జరిగిన ఆ ఒలింపిక్ క్వాలిఫయర్స్ ట్రయల్ బౌట్ లో.. జరీన్‌కు షేక్‌హ్యాండ్, హగ్ నిరాకరించడంపై కోమ్, ‘ఇలాంటి స్వభావం ఉన్నవారు నాకు నచ్చరు‘ అన్నారు. ‘కానీ సెలక్షన్ న్యాయంగానే జరగాలి. అందుకే నేను పోటీ కోసం పట్టుపట్టాను‘ అని జరీన్. జరీన్ కరెక్ట్ అనిపిస్తోంది. అయితే కోమ్ కూడా డైరెక్ట్ ఎంట్రీకి పట్టుపట్టలేదు. బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం అది. కోమ్ని ట్రయల్స్ లేకుండానే సెలెక్ట్ చేయాలని. -
బంగారు లాంతరు
ఆశ ఎప్పుడూ వెలుగుతుండాలి. అప్పుడే.. నిరాశ అనే రెక్కల పురుగు..దీపం దగ్గరకు చేరలేదు. నిన్న మళ్లీ ఒలింపిక్స్ జ్యోతి వెలిగింది! వచ్చే ఏడాదికి కౌంట్‌డౌన్. బంగారు లాంతరులో ఉన్న ఆ దీపం.. సన్నగిల్లని అథ్లెట్స్ ఆశల ప్రతిరూపం. రెండు వేల ఇరవైకి రాసి పెట్టిన పెద్ద ఈవెంట్ ‘టోక్యో ఒలింపిక్స్’. రెండు వేల ఇరవైలో ఎవరూ ఊహించని ప్రాణాంతక విపత్తు ‘కరోనా ప్యాండమిక్’. ఒలింపిక్స్ షెడ్యూల్ ప్రకారం గురువారం (జూలై 23) జపాన్‌లోని షింజుకు సిటీలో.. నేషనల్ ఒలింపిక్ స్టేడియంలో ఒలింపిక్ క్రీడల ప్రారంభ మహోత్సవం జరగాలి. శుక్రవారం ఆటలు మొదలవ్వాలి. 68 వేల మంది క్రీడాభిమానులు ప్రత్యక్షంగా వాటిని తిలకించాలి. నాలుగు వందల కోట్ల మంది ఆ సంబరాలను టీవీలలో వీక్షించాలి. 185 దేశాలకు చెందిన 12 వేల మంది క్రీడాయోధులు పదహారు రోజుల పాటు తమ ప్రతిభా ప్రావీణ్యాలను ప్రదర్శించాలి. ఇప్పుడు ఇవేమీ జరగడం లేదు. మళ్లీ ఏడాదికే ఒలింపిక్స్. మళ్లీ అదే టోక్యోలో, అవే స్టేడియంలలో, ఇవే తేదీలకు. (జూలై 23 నుంచి ఆగస్టు 8 వరకు). అప్పుడైనా కరోనా కరుణిస్తేనే! నిరుత్సాహపరిచే సంగతే. ఒలింపిక్స్ నిర్వహణ కోసం జపాన్ దాదాపు లక్ష కోట్ల రూపాయలు ఖర్చుపెట్టింది! తమ క్రీడాకారుల శిక్షణ కోసం ప్రపంచ దేశాలు కూడా కోట్లలోనే ఖర్చు చేసి ఉంటాయి. అథ్లెట్స్‌ని సిద్ధం చేయడానికి మన దేశానికి అయిన ఖర్చు సుమారు యాభై ఎనిమిది కోట్లు. ఖర్చు అటుంచితే.. ఏడాది పాటు సాధన చేసి, కదన రంగంలోకి దూకేందుకు క్రీడా ఖడ్గచాలనాలతో కాలుదువ్వుతున్న అథ్లెట్స్ మనసు ఎంత ఉసూరుమంటుంది! మనం పడే బాధ కూడా. అయ్యో.. మేరీ కోమ్ గోల్డ్ మెడల్‌కు ఇంకో ఏడాది ఆలస్యం అయిందే! సింధు ఈసారి తప్పనిసరి గా బంగారు సింధుగా హైదరాబాద్‌లో ఫ్లయిట్ దిగి ఉండేదే! అంజుమ్ మౌద్గిల్ తన రైఫిల్‌కి పసిడి పతకాన్ని తొడిగి ఉండేదే. రాణి రాంపాల్ టీమ్.. మహిళా హాకీకి హ్యాపీ డేస్‌ను తెచ్చి ఉండేదే.. అనిపిస్తుంది. నిరాశ సహజమే. అయితే ఒలింపిక్స్ జ్యోతి వెలుగు వేడిమికి రాలిపోయే శలభం ఈ నిరాశ. అందుకే ఆశ అనే జ్యోతి ఎప్పటికీ వెలుగుతూనే ఉండాలి. ఒలింపిక్స్ వాయిదా పడ్డాయి కదా అని టోక్యో నేషనల్ స్టేడియంలో ఒలింపిక్ జ్యోతి వెలగకుండా ఏమీ లేదు. వచ్చే ఏడాది జరిగే ఆటలకు జపాన్ ‘లాంతరు దీపం’ వత్తిని పెంచింది.! ఆ బంగారు లాంతరులో ఒలింపిక్స్ జ్యోతి కాంతులీనింది. అథ్లెట్లను మానసికంగా ‘డౌన్’ కానీయకుండా ఒలింపిక్ నిర్వాహకులు చేసిన ‘కౌంట్‌డౌన్’ ఇది. లాంతరును చేతితో ఎత్తిపట్టుకుని చిరువ్వులు చిందించిన అమ్మాయి 20 ఏళ్ల రికాకో. జపాన్ స్విమ్మర్. 2018లో జకార్తాలో జరిగిన ఏషియన్ గేమ్స్‌లో ఆరు బంగారు పతకాలు, రెండు రజత పతకాలు సాధించింది! అలాంటి అమ్మాయి, నిండా రెండు పదుల వయసులోని అమ్మాయి గత ఏడాది ఫిబ్రవరిలో మూడు వారాల ఆస్ట్రేలియా ట్రైనింగ్ క్యాంప్‌లో ఉన్నప్పుడు ఆరోగ్యం బాగోలేక మధ్యలోనే జపాన్ తిరిగి వచ్చేసింది. వైద్యపరీక్షల్లో ‘లుకేమియా’ క్యాన్సర్ అని నిర్థారణ అయింది! ఆ విషయాన్ని అదే నెల 12న తనే స్వయంగా ట్విట్టర్లో పెట్టింది. అలాంటి అమ్మాయి.. ఆశాదీపాన్ని పట్టుకున్నట్లుగా ఒలింపిక్ జ్యోతిని పట్టుకుని ప్రపంచానికి స్ఫూర్తిని ఇచ్చింది. మనం ఒకదారిలో ఉంటాం. జీవితం ఇంకో దారిలోకి తీసుకుపోతుంది. ఏ దారిలోనైనా మన చేతిలో ఉండవలసిన దీపం.. ఆశ. దానిని ఆరనివ్వకూడదు. ఏడాదే కదా అంతా సక్రమంగా ఉంటే ఇప్పటికి అథ్లెట్స్ విలేజ్‌లో ఉండేవాళ్లం. బాగా ప్రిపేర్ అయ్యాక వాయిదా పడటం అంటే.. కొంచెం బాధగానే అనిపిస్తుంది. ఒకటే తేడా. పోటీ పడటం కోసం ఇంకో ఏడాది వరకు ఎదురు చూడాలి. మిగతా అంతా మామూలే. హార్డ్ వర్క్.. హార్డ్ వర్క్. శారీరకంగా, మానసికంగా పర్ఫెక్ట్గా ఉండటం కోసం రోజూ ప్రాక్టీస్ చెయ్యాలి. ప్రశాంతంగా, స్ట్రాంగ్‌గా ఉండటానికి సాధన ఉపయోగపడుతుంది. అది నిరంతరం. రోజులు ఎప్పుడూ ఒకలా ఉండవు. అన్నీ చక్కబడతాయి. అనుకున్నదీ సాధించి తీరుతాం. – పి.వి. సింధు (బ్యాడ్మింటన్) : 2016 రియో ఒలింపిక్స్ రజత పతక విజేత ఎప్పుడైనా సిద్ధమే వచ్చే ఏడాదైనా ఒలింపిక్స్ జరిగే పరిస్థితులు ఉంటాయా అన్నది సందేహమే. ఏదెలా ఉన్నా అథ్లెట్స్ తమకు చేతనైనంత వరకు మనసును, శరీరాన్ని నియంత్రణ లో ఉంచుకోవాలి. నియంత్రణ అనేది మనసును ఉల్లాసంగా, శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతుంది. అప్పుడు ఏ నిముషం పోటీ జరిగినా పోరాటానికి సిద్ధంగా ఉంటాం. – అంజుమ్ మౌద్గిల్ (షూటింగ్) : మహిళల 50 మీ.ల రైఫిల్ మూడు పొజిషన్లలో (నీలింగ్, ప్రోన్, స్టాండింగ్) ఇండియాలో నెం.1 కల చెదరలేదు ఒలింపిక్ ‘గోల్’్డ నా కల. అదే నా ప్రాధాన్యం. ఒలింపిక్స్ వాయిదా పడినా నా కల చెదరలేదు. నా ప్రాధాన్యం మారలేదు. ఏమైనా.. వాయిదా పడటం అనేది ఇప్పటికీ నేను అంగీకరించలేకపోతున్న వాస్తవం. కరోనా అనేదొకటి ఇంతగా ప్రపంచాన్ని స్తంభింపజేస్తుందని ఎవరు ఊహించగలరు? రోజూ వర్క్అవుట్స్ చేస్తున్నాను. ట్రైనింగ్ కూడా. ఒలింపిక్స్ మాత్రమే వాయిదా పడ్డాయి. నా సాధన కాదు. అది కొనసాగుతుంది. – మేరీ కోమ్ (బాక్సింగ్), 2012 లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత ఇంకా బెటర్ అవుతాం మా టీమ్ మంచి ఆటతీరుతో ఉంది. పోటీలకు అందరం సిద్ధంగా ఉన్నాం. ఒలింపిక్స్ వాయిదా పడటం వల్ల ఇంకో ఏడాది ప్రాక్టీస్‌కి సమయం లభించింది అన్నంత వరకే మనసుకు తీసుకుంటున్నాం. ఈలోపు జట్టులోని జూనియర్ ప్లేయర్స్ ఇంకా బెటర్ అవుతారు. టోక్యోలో వచ్చే ఏడాది ఆడబోయే మా తొలి గేమ్‌లో విజయం సాధించడానికి అవసరమైన ప్రాక్టీస్‌ను నిరంతరం చేస్తుంటాం. – రాణి రాంపాల్,మహిళల హాకీ టీమ్ కెప్టెన్ -
మేరీకోమ్ బాధ్యతారాహిత్యం!
న్యూఢిల్లీ: ఆమె ఒలింపిక్ పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, జాతీయ రెండో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్ గ్రహీత కావడంతో పాటు పార్లమెంట్ సభ్యురాలు కూడా. కానీ కరోనాతో దేశం అల్లకల్లోలమవుతున్న వేళ తన బాధ్యత మరచింది. విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత కనీసం 14 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలనే నిబంధనను ఉల్లంఘించింది. ఇదంతా భారత మహిళా బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ గురించే. జోర్డాన్‌లో ఈ నెల 3 నుంచి 11 వరకు జరిగిన ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నీలో ఆమె పాల్గొంది. ఆ టోర్నీ నుంచి తిరిగి వచ్చిన భారత బాక్సర్లంతా రెండు వారాల పాటు బయటకు వెళ్లకుండా స్వీయ నిర్బంధంలో ఉండాలని బాక్సింగ్ సమాఖ్య ముందే చెప్పింది. దీనిని జట్టు సభ్యులంతా కచ్చితంగా పాటించాలని కోచ్ శాంటియాగో నీవా కూడా బాక్సర్లకు ముందే స్పష్టం చేసి దానికి తగినట్లుగా వారు ఇంట్లో చేసుకునేందుకు ఫిట్నెస్ షెడ్యూల్‌ను కూడా సూచించారు. ఈ బాక్సర్లంతా ఈ నెల 13న భారత్‌కు చేరుకున్నారు. కానీ మేరీకోమ్ మాత్రం దీనిని పట్టించుకున్నట్లుగా లేదు. ఈ నెల 18న రాష్ట్రపతి భవన్లో జరిగిన అల్పాహార విందులో ఆమె పాల్గొంది. రాష్ట్రపతి అధికారిక ట్విట్టర్ అకౌంట్ ద్వారా పోస్ట్ చేసిన చిత్రాలలో ఇతర పార్లమెంట్ సభ్యులతో పాటు మేరీకోమ్ కూడా ఉంది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తాను పాల్గొన్న విషయాన్ని మేరీకోమ్ కూడా నిర్ధారించింది. అయితే తాను ఎలాంటి నిబంధనలు ఉల్లంఘించలేదని ఆమె స్పష్టం చేసింది. ‘జోర్డాన్ నుంచి వచ్చిన తర్వాత నేను ఇంట్లోనే ఉన్నాను. ఒక్క రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమానికి మాత్రమే వెళ్లాను. ఆ కార్యక్రమంలో ప్రస్తుతం స్వీయ నిర్బంధంలో ఉన్న రాజస్తాన్ సీఎం వసుంధర రాజే తనయుడు, పార్లమెంట్ సభ్యుడు దుష్యంత్ సింగ్‌ను కలవడం గానీ కరచాలనం చేయడం గానీ చేయలేదు. జోర్డాన్ పర్యటన తర్వాత నిర్దేశించిన నా స్వీయ నిర్బంధం ముగిసింది. అయినా సరే రాబోయే 3–4 రోజులు ఇంట్లోనే ఉంటాను’ అని ఆమె స్పష్టం చేసింది. సిమ్రన్‌జిత్ కూడా... పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్‌తో సిమ్రన్ మేరీకోమ్ కంటే ముందుగా భారత్‌కే చెందిన మరో మహిళా బాక్సర్ సిమ్రన్‌జిత్ కౌర్ కూడా స్వీయ నిర్భంధం నిబంధనను ఉల్లంఘించింది. జోర్డాన్‌లోనే జరిగిన ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో సిమ్రన్‌జిత్ పాల్గొని 60 కేజీల విభాగంలో ఫైనల్ చేరి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. పంజాబ్ తరఫున ఈ ఘనత సాధించిన తొలి మహిళా బాక్సర్‌గా గుర్తింపు పొందింది. మార్చి 13న స్వదేశానికి తిరిగి వచ్చాక 14 రోజులపాటు స్వీయ నిర్భంధంలో ఉండాల్సిన సిమ్రన్‌జిత్ మార్చి 16న పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్‌ను... రాష్ట్ర క్రీడల మంత్రి రాణా గుర్మీత్ సింగ్ సోధిని... శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు సుఖ్బీర్ సింగ్ బాదల్‌ను కలిసింది. టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించినందుకు సిమ్రన్‌జిత్‌కు పంజాబ్ ప్రభుత్వం రూ. 5 లక్షలు... శిరోమణి అకాలీదళ్ పార్టీ తరఫున సుఖ్బీర్ సింగ్ బాదల్ రూ. లక్ష నగదు పురస్కారం అందజేశారు. జోర్డాన్‌లోనూ కోవిడ్–19 వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇప్పటివరకు జోర్డాన్‌లో 69 కోవిడ్–19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. -
‘ఇంట్లోనే ఉన్నా.. షేక్ హ్యాండ్ ఇవ్వలేదు’
న్యూఢిల్లీ: మహమ్మారి కోవిడ్-19(కరోనా వైరస్) వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ బాక్సర్ మేరీ కోమ్ నిబంధనలు ఉల్లంఘించి క్వారంటైన్ నుంచి బయటకు వచ్చారంటూ వార్తలు ప్రచారమవుతున్నాయి. జోర్డాన్‌లోని అమ్మన్లో జరిగిన ఆసియా- ఓషనియా ఒలంపిక్ క్వాలిఫైయర్స్‌లో పాల్గొన్న ఆమె ఇటీవలే భారత్ చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మేరీ కోమ్ మార్చి 18న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇచ్చిన విందుకు హాజరయ్యారు. ఈ క్రమంలో మార్చి 13న స్వదేశానికి చేరుకున్న మేరీ కోమ్.. 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిన నిబంధనను ఉల్లంఘించి నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి భవన్లో ఆమె ఎంపీ దుష్యంత్‌కు షేక్‌హ్యాండ్ ఇచ్చారన్న ప్రచారం జరుగుతోంది.(ట్రోల్స్‌కు గట్టి కౌంటర్ ఇచ్చిన కనిక! ) ఈ నేపథ్యంలో మేరీ కోమ్ శనివారం మీడియాతో మాట్లాడారు. జోర్డాన్ నుంచి వచ్చిన నాటి నుంచి తాను ఇంట్లోనే ఉన్నానని స్పష్టం చేశారు. కేవలం రాష్ట్రపతి ఇచ్చిన విందుకు మాత్రమే హాజరయ్యానని.. బీజేపీ ఎంపీ దుష్యంత్ సింగ్‌ను తాను కలవలేదని తెలిపారు. తన క్వారంటైన్ ముగిసిందని... అయినప్పటికీ ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మరో మూడు నుంచి నాలుగు రోజులు ఇంట్లోనే ఉండటానికి తనకేమీ అభ్యంతరం లేదని పేర్కొన్నారు. కాగా బాలీవుడ్ ప్రముఖ సింగర్ కనికా కపూర్ ఓ పార్టీలో రాజస్తాన్ మాజీ సీఎం వసుంధరా రాజే, ఆమె కుమారుడు దుష్యంత్ సింగ్‌ను కలిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో లండన్ నుంచి వచ్చిన కనికాకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో ఆమెతో పాటు వీరిద్దరు, వీరిని కలిసిన మరికొందరు ప్రముఖులు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిన విషయం విదితమే. ఇక ప్రాణాంతక కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ ఉత్తరప్రదేశ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. (మీ నాయకత్వం అచ్చం అలాగే: పీటర్సన్) MC Mary Kom: I am home since I came back from Jordan. I only attended the President's event and did not meet BJP MP Dushyant Singh or shake hands with him at all. My quarantine after Jordan ends, but I’m going to be at home only for the next 3-4 days. (File pic) #Coronavirus pic.twitter.com/itEfFuzWGO — ANI (@ANI) March 21, 2020 -
పసిడి కోసం వికాస్, సిమ్రన్ పోరు
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా క్వాలిఫయింగ్ బాక్సింగ్ టోర్నమెంట్లో ఇద్దరు భారత బాక్సర్లు ఫైనల్ చేరగా... మరో ఆరుగురు సెమీస్‌లో ఓడి కాంస్య పతకాలతో ముగించారు. పురుషుల 69 కేజీల విభాగంలో వికాస్ కృషన్... మహిళల 60 కేజీల విభాగంలో సిమ్రన్‌జిత్ కౌర్ ఫైనల్లోకి ప్రవేశించారు. సెమీస్‌లో వికాస్ 3–2 తేడాతో ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అబ్లైఖన్ జుసుపొవ్ (కజకిస్తాన్)పై విజయం సాధించాడు. బౌట్లో ఎడమ కంటి దిగువభాగంలో గాయమైనా... పట్టుదల ప్రదర్శించిన వికాస్ తుది పోరుకు అర్హత సాధించాడు. ఫైనల్లో అతను ఈషా హుస్సేన్ (జోర్డాన్)తో తలపడతాడు. ఒకవేళ వికాస్ కంటి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే అతనికి ఫైనల్లో పోటీపడే అవకాశం ఇవ్వరు. సిమ్రన్‌జిత్‌కు సెమీస్‌లో విజయం సులువుగానే దక్కింది. సిమ్రన్‌జిత్ 4–1తో ఆసియా చాంపియన్‌షిప్ రజత పతక విజేత షి యి వు (చైనీస్ తైపీ)ని ఓడించింది. ఫైనల్లో సిమ్రన్ రెండుసార్లు ఆసియా విజేతగా నిలిచిన ఓ యెన్ జీ (దక్షిణ కొరియా)ను ఎదుర్కొంటుంది. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ (ప్లస్ 91 కేజీలు)... మహిళల విభాగంలో మేరీకోమ్ (51 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (69 కేజీలు), పూజా రాణి (75 కేజీలు) సెమీస్‌లో ఓటమి పాలయ్యారు. అమిత్ 2–3తో రియో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత జియాంగ్వాన్ హు (చైనా) చేతిలో, ఆశిష్ 1–4తో మార్సియల్ ఇముర్ (ఫిలిప్పీన్) చేతిలో... సతీశ్ 0–5తో బఖోదిర్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో... మేరీకోమ్ 2–3తో యువాన్ చాంగ్ (చైనా) చేతిలో, లవ్లీనా 0–5తో హోంగ్ గు (చైనా) చేతిలో, పూజ రాణి 0–5తో ఖియాన్ లి (చైనా) చేతిలో పరాజయం పాలయ్యారు. ఈ టోర్నీ ద్వారా ఇప్పటికే ఎమిమిది మంది భారత బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. పురుషుల 81 కేజీల విభాగంలో భారత బాక్సర్ సచిన్ కుమార్ ఫైనల్ బాక్స్ ఆఫ్ బౌట్‌కు అర్హత సాధించాడు. నేడు జరిగే ఫైనల్ బాక్స్ ఆఫ్ బౌట్లో షబ్బోస్ నెగ్మతులోయెవ్ (తజికిస్తాన్)పై సచిన్ గెలిస్తే టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత పొందుతాడు. -
భారత బాక్సర్ల ‘తీన్మార్’
అమ్మాన్ (జోర్డాన్): అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ... భారత అగ్రశ్రేణి బాక్సర్లు అమిత్ పంఘాల్ (52 కేజీలు), మేరీకోమ్ (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (60 కేజీలు) టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. ఆసియా క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో ఈ ముగ్గురూ సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. సోమవారం జరిగిన పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ అమిత్ పంఘాల్ 4–1తో కార్లో పాలమ్ (ఫిలిప్పీన్స్)ను ఓడించగా... మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్స్‌లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్, 37 ఏళ్ల మణిపూర్ మెరిక మేరీకోమ్ 5–0తో ఇరిష్ మాగ్నో (ఫిలిప్పీన్స్)పై... పంజాబ్‌కు చెందిన 24 ఏళ్ల సిమ్రన్‌జిత్ 5–0తో రెండో సీడ్ నమున్ మోన్‌ఖోర్ (మంగోలియా)పై ఘనవిజయం సాధించారు. సిమ్రన్‌జిత్ తొలిసారి ఒలింపిక్ బెర్త్ దక్కించుకోగా... మేరీకోమ్ రెండోసారి ఒలింపిక్స్ బరిలో నిలువనుంది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్ బెర్త్ దక్కించుకోవడంతో ఇదే వెయిట్ కేటగిరీలో ఉన్న తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఒలింపిక్ ఆశలు ఆవిరయ్యాయి. ఒకవేళ మేరీకోమ్ ఓడిపోయుంటే మే నెలలో పారిస్‌లో జరిగే వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ రూపంలో నిఖత్‌కు అవకాశం మిగిలి ఉండేది. సోమవారమే జరిగిన మరో రెండు క్వార్టర్ ఫైనల్ బౌట్స్‌లో భారత బాక్సర్లకు నిరాశ ఎదురైంది. పురుషుల విభాగం 63 కేజీల కేటగిరీలో మనీశ్ కౌశిక్ 2–3తో చిన్‌జోరింగ్ బాటర్సుక్ (మంగోలియా) చేతిలో... మహిళల విభాగం 57 కేజీల కేటగిరీలో సాక్షి 0–5తో ఇమ్ ఏజి (కొరియా) చేతిలో ఓడిపోయారు. ఓవరాల్‌గా ఈ టోర్నీ ద్వారా భారత్ నుంచి ఏకంగా ఎనిమిది మంది బాక్సర్లు టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. -
వన్‌పవర్‌మెంట్
ఆట అంటేనే పవర్! షాట్ కొట్టడానికి పవర్. క్యాచ్ పట్టడానికి పవర్. షూట్ చెయ్యడానికి పవర్. లాగి వదలడానికి పవర్. పావులు కదపడానికి పవర్. పంచ్ ఇవ్వడానికి పవర్. స్ట్రయికర్ని విసరడానికి పవర్. అన్నిటా ఎంపవర్మెంట్ని సాధించిన మహిళలు ఆటల్లోనూ తమ పవర్ చూపిస్తున్నారు. నెంబర్ వన్ స్థానంతో విజయానికే వన్‌పవర్‌మెంట్ తెస్తున్నారు. తల్లి కలనునిజం చేయాలని! సైనా (బ్యాడ్మింటన్) పురుషుల బ్యాడ్మింటన్‌లో భారత స్టార్ ఆటగాళ్లుగా వెలుగొందిన వారు తెరమరుగై... భారత బ్యాడ్మింటన్ ఉనికి ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో తన విజయాలతో కొత్త ఉత్తేజాన్ని తెచ్చింది సైనా నెహ్వాల్. 2008లో జూనియర్ ప్రపంచ చాంపియన్‌గా అవతరించి తన ముద్ర చాటుకున్నాక వరుస విజయాలు సాధిస్తూ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసింది. హరియాణాలోని హిస్సార్‌లో జన్మించిన సైనా... తండ్రి హర్వీర్ సింగ్ ఉద్యోగరీత్యా హైదరాబాద్‌కు బదిలీ కావడంతో భాగ్యనగరంలో స్థిరపడింది. సైనా తల్లిదండ్రులు హర్వీర్, ఉషా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారులు. ఎనిమిదేళ్లకు రాకెట్ పట్టిన సైనా జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించాలనుకున్న తన తల్లి ఉషా కలను నిజం చేసింది. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన తర్వాత సైనా అంతర్జాతీయస్థాయిలో ఎన్నో గొప్ప విజయాలు సాధించింది. 2015లో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. ఎంతోమంది అమ్మాయిలు ఈ ఆటను కెరీర్‌గా ఎంచుకునేందుకు ప్రేరణగా నిలిచింది. స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకొని! అపూర్వీ చండేలా (షూటింగ్) మహిళల షూటింగ్ క్రీడలో భారత్ నుంచి అంజలి భగవత్, సుమా షిరూర్, తేజస్విని సావంత్, హీనా సిద్ధూ తదితరులు అంతర్జాతీయస్థాయిలో మెరిశారు. వారి అడుగుజాడల్లోనే నడుస్తూ భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడిస్తోంది అపూర్వీ చండేలా. జైపూర్‌కు చెందిన 27 ఏళ్ల అపూర్వీ తొలుత ఆటలకంటే చదువుపై ఎక్కువ శ్రద్ధ పెట్టేది. కెరీర్లో స్పోర్ట్స్ జర్నలిస్ట్ కావాలనుకున్న అపూర్వీని 2008 బీజింగ్ ఒలింపిక్స్ మార్చేశాయి. షూటర్ అభినవ్ బింద్రా 10 మీటర్ల ఎయిర్ రైఫిల్‌లో స్వర్ణం సాధించడం... ఆ తర్వాత బింద్రాకు లభించిన పేరు ప్రతిష్టలు అపూర్వీ మనసు మార్చేశాయి. బింద్రా స్ఫూర్తితో షూటింగ్ వైపు మళ్లిన అపూర్వీ 2012లో జాతీయ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించి భారత జట్టుకు ఎంపికైంది. 2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో పసిడి పతకం సాధించిన ఆమె... 2018 కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో కాంస్యాలు గెలిచింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో నాలుగో స్థానంలో నిలిచి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. ఇక 2019లో పసిడి పతకాల పంట పండించింది. మూడు ప్రపంచకప్‌లలో స్వర్ణాలు నెగ్గిన అపూర్వీ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో ప్రపంచ నంబర్‌వన్‌గా నిలిచింది. మకుటంలేని మహరాణి! హంపి (చెస్) మేధో క్రీడ చదరంగంలో అమ్మాయిలు కూడా అద్భుతాలు చేయగలరని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 32 ఏళ్ల గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి నిరూపించింది. ఐదేళ్ల ప్రాయంలో తండ్రి అశోక్ ప్రోత్సాహంతో చెస్‌లో ఓనమాలు నేర్చుకున్న హంపి 1997లో అండర్–10 బాలికల ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. 1998లో అండర్–12... 2000లో అండర్–14 విభాగంలో ప్రపంచ టైటిల్‌ను సొంతం చేసుకుంది. 2002లో గ్రాండ్‌మాస్టర్ హోదా పొందిన హంపి 2006 దోహా ఆసియా క్రీడల్లో వ్యక్తిగత, మిక్స్డ్ టీమ్ విభాగంలో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. ఆ తర్వాత పలు అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలు నెగ్గిన హంపి 2016లో తల్లి అయ్యాక రెండేళ్లపాటు ఆటకు విరామం చెప్పింది. 2018లో పునరాగమనం చేశాక... కొన్ని టోర్నీలలో నిరాశాజనక ఫలితాలు వచ్చినా 2019లో ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి రెండు టోర్నీల్లో విజేతగా నిలిచింది. డిసెంబర్లో మాస్కోలో జరిగిన ప్రపంచ ర్యాపిడ్ చాంపియన్‌షిప్‌లో విజేతగా నిలిచి మహిళల విభాగంలో ఈ ఘనత సాధించిన తొలి భారతీయ చెస్ ప్లేయర్‌గా గుర్తింపు పొందింది. ఈ ఏడాది అమెరికాలో జరిగిన కెయిన్స్ కప్ టోర్నీలోనూ చాంపియన్‌గా నిలిచి కెరీర్ బెస్ట్ రెండో ర్యాంక్‌ను అందుకుంది. నాన్న స్వప్నాన్ని సాకారం చేస్తూ! షఫాలీ వర్మ (క్రికెట్) భారత్‌లో పురుషుల క్రికెట్‌తో పోలిస్తే మహిళల క్రికెట్‌కు ఆదరణ అంతంత మాత్రమే ఉన్నా... అవకాశం దొరికినపుడల్లా మహిళా క్రికెటర్లు అంతర్జాతీయ వేదికపై అద్భుతాలు చేస్తూనే ఉన్నారు. హరియాణాకు చెందిన 16 ఏళ్ల టీనేజర్ షఫాలీ వర్మ గతేడాది చివర్లో ఒక్కసారిగా వార్తల్లో నిలిచింది. 15 ఏళ్లకే భారత్‌కు ప్రాతినిధ్యం వహించి ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా గుర్తింపు పొందిన షఫాలీ... గత నవంబర్‌లో వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 49 బంతుల్లో 73 పరుగులు చేసింది. తద్వారా అంతర్జాతీయ క్రికెట్లో పిన్న వయస్సులో అర్ధ సెంచరీ చేసిన భారత క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పింది. ఈ క్రమంలో 30 ఏళ్లుగా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న రికార్డును ఆమె బద్దలు కొట్టింది. తన కూతురు ఏనాటికైనా భారత జట్టుకు ఆడాలని కలలు కన్న తండ్రి సంజీవ్ స్వప్నాన్ని షఫాలీ తొందరగానే నిజం చేసి చూపించింది. అంతేకాకుండా తన విధ్వంసకర ఆటతో తొలిసారి భారత మహిళల జట్టు టి20 ప్రపంచకప్‌లో ఫైనల్‌కు చేరడంలో ముఖ్యపాత్ర పోషించింది. ఎన్నో...ఎన్నెన్నో! సానియా మీర్జా (టెన్నిస్) ప్రపంచ మహిళల టెన్నిస్ పటంలో సానియా మీర్జా పుణ్యమాని భారత్‌కు ఓ ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆరేళ్ల చిరుప్రాయంలో రాకెట్ పట్టిన సానియా తండ్రి ఇమ్రాన్ మీర్జా పర్యవేక్షణలో అంచెలంచెలుగా ఎదిగింది. 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీ సింగిల్స్ విభాగంలో మూడో రౌండ్‌కు చేరిన సానియా... 2007లో సింగిల్స్‌లో కెరీర్ బెస్ట్ 27వ ర్యాంక్ సాధించింది. సానియా 2009లో మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో... 2012లో మహేశ్ భూపతితో కలిసి ఫ్రెంచ్ ఓపెన్‌లో... 2014లో బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జతగా యూఎస్ ఓపెన్‌లో మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ సొంతం చేసుకుంది. గాయాల బారిన పడటంతో 2012లో సింగిల్స్‌కు గుడ్‌బై చెప్పి డబుల్స్పైనే దృష్టి సారించిన ఈ హైదరాబాదీ... స్విట్జర్లాండ్ మేటి క్రీడాకారిణి మార్టినా హింగిస్‌తో జతకట్టి గొప్ప విజయాలు సాధించింది. 2015 ఏప్రిల్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌ను దక్కించుకున్న ఆమె అదే ఏడాది హింగిస్‌తో జతగా వింబుల్డన్, యూఎస్ ఓపెన్... 2016లో ఆస్ట్రేలియన్ ఓపెన్ డబుల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. 2018లో తల్లి అయిన సానియా రెండేళ్లపాటు ఆటకు దూరమైంది. ఈ ఏడాది మళ్లీ బరిలోకి దిగిన 33 ఏళ్ల సానియా హోబర్ట్ ఓపెన్ టోర్నీలో నదియా కిచెనోక్ (ఉక్రెయిన్)తో కలిసి టైటిల్ నెగ్గి పునరాగమనాన్ని ఘనంగా చాటుకుంది. అర్జున అవార్డు (2004), పద్మశ్రీ (2006), రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న (2015), పద్మభూషణ్ (2016) పురస్కారాలు అందుకున్న సానియా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రో–ఆసియా క్రీడలు కలిపి మొత్తం ఆరు స్వర్ణాలు సహా 14 పతకాలు సాధించింది. ‘పంచ్’ మే దమ్ హై మేరీకోమ్ (బాక్సింగ్) క్రీడాకారిణిగా, ముగ్గురు పిల్లల తల్లిగా, భార్యగా, కూతురుగా, పార్లమెంటేరియన్‌గా... ఇలా ఎన్నో బాధ్యతలు మోస్తూనే దాదాపు రెండు దశాబ్దాలుగా బాక్సింVŠ రింగ్‌లో తన పంచ్ పవర్ చాటుకుంటోంది మణిపూర్ మెరిక మేరీకోమ్. 37 ఏళ్ల మేరీకోమ్ భారత్‌లో మహిళల బాక్సింగ్‌కు ప్రతిరూపం. వేర్వేరు వెయిట్ కేటగిరీల్లో ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలువడంతోపాటు ఒలింపిక్స్‌లో, ఆసియా క్రీడల్లో, కామన్వెల్త్ గేమ్స్‌లో ఇలా ప్రతి మెగా ఈవెంట్లో బరిలోకి దిగితే పతకంతో తిరిగొస్తూ ఎందరికో స్ఫూర్తి ప్రదాతలా నిలుస్తోంది. ‘అర్జున అవార్డు’.. ‘రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న’... ‘పద్మశ్రీ’.. ‘పద్మభూషణ్’.. ‘పద్మవిభూషణ్’.. ఇలా అన్ని అవార్డులు మేరీకోమ్‌ను వరించాయి. ఈ ఏడాది జూలై–ఆగస్టులో టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించి మేరీకోమ్ తన ఉజ్వల కెరీర్‌కు ఫినిషింగ్ టచ్ ఇవ్వాలనుకుంటోంది. సరదాగా మొదలై! అపూర్వ (క్యారమ్) వేసవి సెలవుల్లోనే కాకుండా తీరిక దొరికినపుడల్లా క్యారమ్ బోర్డు ఆట ఆడిన వాళ్లు ఎందరో ఉంటారు. ఇంటి ఆటలోనూ విశ్వవిజేత కావొచ్చని హైదరాబాద్‌కు చెందిన ఎస్.అపూర్వ నిరూపించింది. ఒకవైపు భారత జీవితబీమా సంస్థ (ఎల్ఐసీ)లో సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తూనే మరోవైపు క్యారమ్‌లో ప్రపంచ చాంపియన్‌గా నిలిచి అపూర్వ అందరిచేతా శభాష్ అనిపించుకుంది. తన తండ్రి ఆయన మిత్రులతో సరదాగా క్యారమ్ ఆడుతున్నపుడు ఈ ఆటపట్ల ఆసక్తి పెంచుకున్న అపూర్వ ఆ తర్వాత ముందుకు దూసుకుపోయింది. 2004లో కొలంబోలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలిచిన అపూర్వ... 2016లో బర్మింగ్హమ్ ఆతిథ్యమిచ్చిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో ఏకంగా సింగిల్స్, డబుల్స్, టీమ్ విభాగాల్లో పసిడి పతకాలు సొంతం చేసుకుంది. ఆట ఏదైనా, వయస్సుతో నిమిత్తం లేకుండా పట్టుదలతో కృషి చేస్తే అద్భుతాలు చేయవచ్చని అపూర్వ నిరూపించింది. ఆటో డ్రైవర్ అమ్మాయి! దీపిక కుమారి (ఆర్చరీ) మహిళా విలువిద్య (ఆర్చరీ)లో భారత్ పేరు దశదిశలా వ్యాప్తి చెందేలా చేసిన క్రీడాకారిణి దీపిక కుమారి. జార్ఖండ్‌కు చెందిన 26 ఏళ్ల దీపికకు ఎలాంటి క్రీడా నేపథ్యం లేకపోయినా స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి అత్యున్నత శిఖరాన్ని అధిరోహించింది. దీపిక తండ్రి శివనారాయణ్ మహతో ఆటో డ్రైవర్‌కాగా... తల్లి గీతా మహతో రాంచీ మెడికల్ కాలేజీలో నర్సుగా పని చేస్తున్నారు. చిన్న వయస్సులోనే ఆర్చరీపై ఆసక్తి పెంచుకున్న దీపికకు సరైన సామాగ్రి అందుబాటులో లేకపోయేది. అయినా ఆమె నిరాశ చెందలేదు. తమ ఊర్లోని మామిడి తోటల్లో మామిడి కాయలను గురి చూసి రాళ్లతో కొట్టేది. 2005లో ఖర్సావన్ పట్టణంలోని అర్జున్ ఆర్చరీ అకాడమీలో... కొన్నాళ్ల తర్వాత జమ్షెడ్పూర్లోని టాటా ఆర్చరీ అకాడమీలో దీపిక శిక్షణ తీసుకుంది. 2009లో 15 ఏళ్ల ప్రాయంలో అమెరికాలో జరిగిన ప్రపంచ యూత్ ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో దీపిక స్వర్ణ పతకాన్ని నెగింది. ఆ తర్వాత దీపిక వెనుదిరిగి చూడలేదు. 2010 కామన్వెల్త్ గేమ్స్‌లో దీపిక రికర్వ్ వ్యక్తిగత, మహిళల టీమ్ విభాగాల్లో భారత్‌కు స్వర్ణ పతకాలు అందించింది. 2012లో టర్కీలోని అంటాల్యాలో జరిగిన ప్రపంచకప్‌లో దీపిక స్వర్ణ పతకం సాధించడంతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌గా అవతరించింది. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా ఆర్చర్‌గా గుర్తింపు పొందింది. దీపిక ఓవరాల్‌గా ఇప్పటివరకు అంతర్జాతీయస్థాయిలో 41 పతకాలు సొంతం చేసుకుంది. – కరణం నారాయణ -
క్వార్టర్స్‌లో మేరీకోమ్
అమ్మాన్ (జోర్డాన్): టోక్యో ఒలింపిక్స్ ఆసియా బాక్సింగ్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్లో భారత అగ్రశ్రేణి బాక్సర్లు మేరీకోమ్ (51 కేజీలు), అమిత్ పంఘాల్ (52 కేజీలు) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లారు. శనివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్స్‌లో మేరీకోమ్ 5–0తో టాస్మీన్ బెన్నీ (న్యూజిలాండ్)ను చిత్తుగా ఓడించగా... అమిత్ 3–2తో ఎన్క్మనాదక్ ఖర్కు (మంగోలియా)పై కష్టపడి గెలిచాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్లో భారత బాక్సర్ గౌరవ్ సోలంకి (57 కేజీలు) 1–4తో టాప్ సీడ్ మిరాజిజ్‌బెక్ మిర్జాఖలీలోవ్ (ఉజ్బెకిస్తాన్) చేతిలో ఓడిపోయాడు. -
టోక్యో బెర్త్‌కు రెండు విజయాలే...
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్, మణిపూర్‌కు చెందిన మేరీకోమ్ (51 కేజీలు) రెండోసారి ఒలింపిక్స్ బెర్త్ ఒడిసి పట్టేందుకు సన్నద్ధమైంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించిన మేరీ ఈసారి మరింత మెరుగైన ప్రదర్శనే ధ్యేయంగా కఠిన ప్రాక్టీస్‌తో సిద్ధమైంది. ఈ నేపథ్యంలో జోర్డాన్ రాజధాని అమ్మాన్లో జరుగుతోన్న ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ ఈవెంట్లో రాణించి టోక్యో బెర్తును సాధించాలనే పట్టుదలతో మేరీ బరిలో దిగనుంది. పురుషుల విభాగంలో అమిత్ పంఘాల్ (52 కేజీలు) కూడా ఈ క్వాలిఫయర్స్‌లో సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన 37 ఏళ్ల మేరీకోమ్ ఈ క్వాలిఫయింగ్ ఈవెంట్లో రెండో సీడ్‌గా బరిలో నిలిచింది. తొలి రౌండ్లో న్యూజిలాండ్‌కు చెందిన తస్మిన్ బెన్నీతో తలపడుతుంది. ఈ టోర్నీలో రెండు విజయాలు సాధిస్తే ఆమెకు ఒలింపిక్స్ బెర్తు ఖరారు అవుతుంది. ఆమె కచ్చితంగా ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తుందని భారత మహిళల బాక్సింగ్ కోచ్ రాఫెలె బెర్గామస్కో అన్నారు. ‘ఇవే తనకు చివరి ఒలింపిక్స్ అని మేరీకి తెలుసు. అందుకే ఈ మెగా ఈవెంట్లో స్వర్ణం సాధించి తన కలను నిజం చేసుకోవాలని ఆమె శ్రమిస్తోంది. కఠిన ప్రాక్టీస్ చేస్తోంది’ అని ఆయన పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఆసియా గేమ్స్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో స్వర్ణాలు... ప్రపంచ చాంపియన్‌షిప్‌లో చరిత్రాత్మక రజతం సాధించి అద్భుత ఫామ్‌లో ఉన్న అమిత్ పంఘాల్కు తొలిరౌండ్లో ‘బై’ లభించింది. రెండో రౌండ్లో మంగోలియా బాక్సర్ ఎన్‌ఖ్‌మనదక్ ఖర్‌ఖుతో తలపడతాడు. -
సెరెనా, మేరీలే స్ఫూర్తి!
విజయవాడ: అమ్మగా మారిన తర్వాత కూడా ఆటలో సత్తా చూపేందుకు బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్, టెన్నిస్ తార సెరెనా విలియమ్స్‌లే తనలో స్ఫూర్తి కలిగించారని ప్రపంచ మహిళల ర్యాపిడ్ చెస్ చాంపియన్ కోనేరు హంపి వెల్లడించింది. తన ఇటీవలి విజయం విశేషాలను వెల్లడిస్తూ హంపి ఈ వ్యాఖ్య చేసింది. తల్లి అయిన తర్వాత కూడా మేరీ కోమ్, సెరెనాలు వారి వారి క్రీడాంశాల్లో విశేషంగా రాణిస్తున్నారని, వారిలా తాను కూడా బిడ్డకి జన్మనిచ్చిన తర్వాత తనకిష్టమైన రంగంలో పునరాగమనం చేయాలని అనుకున్నానని హంపి అన్నారు. అయితే ప్రపంచ చాంపియన్ అనే బిరుదు ఇంత త్వరగా లభిస్తుందని కలలో కూడా ఊహించలేదని, ఇందులో తన కుటుంబం పాత్ర ఎంతో ఉందని ఆమె తెలిపింది. ‘ నేను నా పునరాగమనం కోసం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేదాన్ని. అందుకోసం ప్రణాళికను కూడా సిద్ధం చేసుకున్నా. పాప పుట్టిన రోజే సంవత్సరం తర్వాత తిరిగి చెస్ ఆడాలని నిర్ణయించుకున్నా. అదే విధంగా చేశాను కూడా.’ అంటూ హంపి తన ప్రణాళిక గురించి తెలియజేసింది. ఓవరాల్‌గా తన 2019 ఏడాది ఘనంగా గడిచిందని... క్లాసికల్ విభాగంలో 30 రేటింగ్ పాయింట్లను, ర్యాపిడ్ విభాగంలో 45 రేటింగ్ పాయింట్లను సాధించానని గర్వంగా చెప్పుకుంది. -
నేను హత్తుకోవాలనుకున్నా...
న్యూఢిల్లీ: భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్ టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ టోర్నీకి అర్హత పొందిన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన మహిళల 51 కేజీల ట్రయల్ ఫైనల్ బౌట్లో ఆమె 9–1 పాయింట్ల తేడాతో తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌ను ఓడించింది. దీంతో ఈ కేటగిరీలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో మేరీ పోటీపడనుంది. కాగా, బౌట్ ముగిసిన తర్వాత మేరీకోమ్ ప్రవర్తించిన తీరు ఆశ్చర్య పరిచింది. కనీసం నిఖత్‌తో షేక్ హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు. తనకు నిఖత్ తీరు నచ్చకే షేక్ హ్యాండ్ ఇవ్వలేదని మేరీకోమ్ తెలిపింది. నిఖత్ తీరు నాకు నచ్చలేదు... ‘ఔను... పోరు ముగిశాక చేయి కలపలేదు. మరి ఆమె ఏం చేసిందో మీకు తెలియదా? బయటికి మాత్రం మేరీ నా అభిమాన, ఆరాధ్య బాక్సర్ అని... మార్గదర్శి అని చెప్పుకునే ఆమెకు ఎవరితో ఎలా ప్రవర్తించాలో తెలియదా? ఇతరుల నుంచి గౌరవ మర్యాదలు పొందాలనుకుంటున్న నిఖత్‌కు ఎదుటి వారికి కూడా కనీస గౌరవం ఇవ్వాలన్న ఇంగితం లేదా? నన్ను నేరుగా క్వాలిఫయర్స్‌కు పంపాలని భారత బాక్సింగ్ సమాఖ్య నిర్ణయం తీసుకుంది. నన్నే పంపించాలని నేనేమీ వారిని కోరలేదు. ఈ అంశంపై ఏదైనా ఉంటే బాక్సింగ్ రింగ్‌లో తేల్చుకోవాలి. కానీ ఆమె ఏం చేసింది... మీడియాలో రచ్చ రచ్చ చేసింది. కేంద్ర క్రీడల మంత్రికి లేఖ రాసి నానాయాగీ చేసింది. ఆటగాళ్లు రింగ్‌లో తలపడాలి. బయట కాదు..! అలాంటి ప్రత్యర్థి తీరు నాకు నచ్చలేదు. అందుకే షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు’ అని మేరీకోమ్ పేర్కొంది. నేను హత్తుకోవాలనుకున్నా... ‘నా శక్తిమేర రాణించాను. ఈ ప్రదర్శన పట్ల సంతోషంగానే ఉన్నా. కానీ బౌట్ ముగిశాక మేరీకోమ్ ప్రవర్తన ఏమాత్రం బాగోలేదు. ఓ సీనియర్ బాక్సింగ్ దిగ్గజం నా ప్రదర్శనకు మెచ్చి హత్తుకుంటుందనుకుంటే కనీసం చేయి కూడా కలపలేదు. ఇది నన్ను తీవ్రంగా బాధించినా... దీనిపై ఎలాంటి వ్యాఖ్యలు చేయబోను. ఈ ఒక్క ట్రయల్‌తో నా ‘టోక్యో’ దారి మూసుకుపోలేదు. ఆమె ఒక వేళ ఫిబ్రవరిలో జరిగే ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో విఫలమైతే... ప్రపంచ క్వాలిఫయర్స్ కోసం మే నెలలో జరిగే ట్రయల్స్ ద్వారా మరో అవకాశముంటుంది. అప్పుడు మరింత శ్రమించి బరిలోకి దిగుతాను. –నిఖత్ జరీన్ -
మేరీనే క్వాలిఫయర్స్‌కు...
-
వీడియో వైరల్: బౌట్ తర్వాత మేరీకోమ్ ఇలా..
-
బౌట్ తర్వాత మేరీకోమ్ ఇలా.. వీడియో వైరల్
న్యూఢిల్లీ: తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌పై ఘన విజయం సాధించి వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగబోయే ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సాధించిన మేరీకోమ్.. బౌట్ తర్వాత అసహనాన్ని ప్రదర్శించింది. భారత బాక్సింగ్‌లో తనదైన ముద్ర వేసిన మేరీకోమ్.. నిఖత్ జరీన్‌తో బౌట్ తర్వాత క్రీడా స్ఫూర్తిని మాత్రం మరిచింది. ఆ బౌట్లో గెలిచిన మేరీకోమ్‌కు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి జరీన్ చేయి చాపగా దాన్ని తిరస్కరించింది. నిఖత్ జరీన్ చేతిని విదిల్చుకుని మరీ వెళ్లిపోయింది. గతంలో ఈ బౌట్ కోసం జరిగిన రాద్దాంతాన్ని మనసులో పెట్టుకున్న మేరీకోమ్ హుందాగా వ్యవహరించడాన్ని మరచిపోయింది. దీనిపై బౌట్ తర్వాత వివరణ కోరగా తాను ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలంటూ మీడియాను ఎదురు ప్రశ్నించింది మేరీకోమ్. ‘ ఆమెకు నేను ఎందుకు షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మిగతా వాళ్ల నుంచి ఆమె గౌరవం కోరితే తొలుత గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. ఆ తరహా మనుషుల్ని ఇష్టపడను. నేను కేవలం రింగ్‌లో మాత్రమే ఆమెతో అమీతుమీ తేల్చుకోవాలి. అంతేకానీ బయట కాదు కదా’ అంటూ మేరీకోమ్ వ్యాఖ్యానించింది.(ఇక్కడ చదవండి: ట్రయల్స్‌లో జరీన్‌పై మేరీకోమ్‌దే పైచేయి) ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ట్రయల్స్‌లో భాగంగా 51 కేజీల విభాగంలో ఈరోజు(శనివారం) జరిగిన పోరులో మేరీకోమ్ 9-1 తేడాతో నిఖత్ జరీన్‌పై గెలుపొందారు. ఫలితంగా మేరీకోమ్ ఫిబ్రవరిలో జరుగనున్న ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధించారు. 51 కేజీలో విభాగంలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్ మధ్య పోటీ అనివార్యమైంది. మేరీకోమ్ ఇప్పటికే సాధించిన ఘనతలను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. మేరీకోమ్ కోసం నిబంధనలు కూడా మార్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో సమస్య తెరపైకి వచ్చింది. ఒక దశలో ఎంతో సీనియర్ అయిన మేరీకోమ్ కూడా అసహనంతో నిఖత్‌పై పలు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు మళ్లీ గెలిచిన తర్వాత కూడా నిఖత్ ట్రయల్స్ పెట్టాలనే నిర్ణయాన్ని మేరీకోమ్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతోంది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్‌కు సాటి బాక్సర్ పట్ల ఎలా వ్యవహరించాలో నేర్పించాలని కామెంట్లు వస్తున్నాయి. Mary Kom defeated Nikhat Zareen to book her spot in the Olympic qualifiers. She doesn't shake Zareen's hand after the fight 😬😬pic.twitter.com/BiVAw9PCSd — MMA India (@MMAIndiaShow) December 28, 2019 -
ట్రయల్స్‌లో జరీన్‌పై మేరీకోమ్‌దే పైచేయి
న్యూఢిల్లీ: ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ట్రయల్స్‌లో భాగంగా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌తో జరిగిన పోరులో ఆరు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన మేరీకోమ్ ఘన విజయం సాధించారు. 51 కేజీల విభాగంలో ఈరోజు(శనివారం) ఇందిరా గాంధీ స్టేడియంలో జరిగిన పోరులో మేరీకోమ్ 9-1 తేడాతో నిఖత్ జరీన్‌పై గెలుపొందారు. ఫలితంగా మేరీకోమ్ ఫిబ్రవరిలో జరుగనున్న ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు నేరుగా అర్హత సాధించారు. ఏకపక్షంగా సాగిన పోరులో మేరీకోమ్ పూర్తి ఆధిపత్యం కనబరిచారు. తనకంటే వయసులో ఎంతో చిన్నదైన నిఖత్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకున్నారు. 51 కేజీలో విభాగంలో ఒలింపిక్ క్వాలిఫయర్స్‌కు భారత్‌నుంచి బాక్సర్‌ను పంపే విషయంలో వివాదం రేగడంతో మేరీకోమ్, నిఖత్ మధ్య పోటీ అనివార్యమైంది. మేరీకోమ్ ఇప్పటికే సాధించిన ఘనతలను బట్టి ఆమెనే పంపిస్తామని బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్ వ్యాఖ్యానించడంతో వివాదం మొదలైంది. మేరీకోమ్ కోసం నిబంధనలు కూడా మార్చే ప్రయత్నం చేశారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన నిఖత్ తనకు న్యాయం చేయాలంటూ, ట్రయల్స్‌లో తన సత్తా నిరూపించుకునేందుకు అవకాశం ఇవ్వాలని కేంద్ర క్రీడా మంత్రికి లేఖ రాయడంతో సమస్య తెరపైకి వచ్చింది.ఈ క్రమంలోనే శుక్రవారం జరిగిన తమ తొలి రౌండ్ మ్యాచ్‌లలో విజయాలు సాధించి వీరిద్దరు తుది పోరుకు సన్నద్ధమయ్యారు. నిఖత్ 10–0తో ప్రస్తుత జాతీయ చాంపియన్ జ్యోతి గులియాను, మేరీకోమ్ 10–0తో రితు గ్రేవాల్‌ను ఓడించారు. కాగా, ట్రయల్స్‌లో మాత్రం మేరీకోమ్‌దే పైచేయి అయ్యింది. -
మేరీకోమ్ X నిఖత్
న్యూఢిల్లీ: తెలంగాణ యువ బాక్సర్ నిఖత్ జరీన్ పట్టుదల నెగ్గింది. భారత దిగ్గజం మేరీకోమ్‌తో ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ పోరు నిర్వహించాలనే ఆమె మొరను కేంద్ర క్రీడాశాఖ, భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) ఆలకించాయి. ఇద్దరి మధ్య ట్రయల్ బౌట్ పెట్టాలని బీఎఫ్ఐని క్రీడాశాఖ ఆదేశించింది. దీంతో బీఎఫ్ఐ డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లందరికీ సెలక్షన్ బౌట్లను నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇటీవల బీఎఫ్ఐ ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకోమ్‌కి అనుకూలంగా వ్యవహరించింది. ట్రయల్స్ లేకుండానే 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ని ఒలింపిక్స్ క్వాలియఫర్స్కు ఎంపిక చేసింది. ఇది వివాదం రేపింది. తన ఒలింపిక్స్ అవకాశాల్ని ఇలా తుంచేయడాన్ని సహించలేకపోయిన నిఖత్ ఏకంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అందులో కోరింది. దీనిపై ఎట్టకేలకు స్పందించిన క్రీడాశాఖ ట్రయల్స్ నిర్వహించాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో డిసెంబర్ 29, 30 తేదీల్లో మహిళా బాక్సర్లకు ట్రయల్స్ పోటీలు జరుగనున్నాయి. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్, నిఖత్ల మధ్య నిర్వహించే ట్రయల్స్ బౌట్లో నెగ్గిన బాక్సర్... ఒలింపిక్స్ క్వాలిఫయర్స్‌కు అర్హత సంపాదిస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చైనాలో ఈ క్వాలిఫయర్స్ పోటీలు జరుగుతాయి. 51 కేజీల విభాగంతోపాటు 57, 60, 69, 75 కేజీల విభాగాల్లో కూడా సెలెక్షన్ ట్రయల్స్ బౌట్లు ఉంటాయి. ఆ ఇద్దరికి మినహాయింపు... ఇక పురుషుల విభాగంలో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం నెగ్గిన అమిత్ పంఘాల్ (52 కేజీలు), కాంస్యం సాధించిన మనీశ్ కౌశిక్ (63 కేజీలు)లకు ఎలాంటి ట్రయల్స్ లేకుండానే నేరుగా జట్టులోకి ఎంపిక చేయనున్నారు. మిగతా ఆరు కేటగిరీల్లో (57, 69, 75, 81, 91, ప్లస్ 91 కేజీలు) మాత్రం డిసెంబర్ 27, 28 తేదీల్లో ట్రయల్స్ ఉంటాయి. -
మేరీకోమ్-నిఖత్ జరీన్ల ‘మెగా’ ఫైట్!
న్యూఢిల్లీ: గత కొంతకాలంగా నువ్వెంత అంటే నువ్వెంత అనేంతగా భారత మహిళా స్టార్ బాక్సర్లు మేరీకోమ్-నిఖత్ జరీన్ల మధ్య మాటల యుద్ధం నడుస్తూ ఉంది. వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్న ఒలింపిక్స్‌లో భాగంగా చైనాలో జరిగే క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌ను పంపడానికి బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) నిర్ణయించగా, దాన్ని మరో స్టార్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తీవ్రంగా వ్యతిరేకించింది. తాను కూడా 51 కేజీల విభాగంలో ఉండటంతో తమ మధ్య ఒలింపిక్స్ సెలక్షన్ ట్రయల్ నిర్వహించాలంటూ కోరుతూ వస్తోంది. ఈ క్రమంలోనే జరీన్‌పై మేరీకోమ్ తీవ్రంగా ధ్వజమెత్తడం, దానికి నిఖత్ కూడా అదే స్థాయిలో సమాధానం ఇవ్వడం జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ వివాదాన్ని పెద్దది చేయడం ఇష్టం లేని బీఎఫ్ఐ.. వారి మధ్య సెలక్షన్ ట్రయల్ నిర్వహించడానికి సిద్ధమవుతోంది. ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్‌తో యువ స్టార్ బాక్సర్ జరీన్‌తో పోరు నిర్వహించాలనే యోచనలో ఉంది. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినా, విశ్వసనీయ సమాచారం ప్రకారం డిసెంబర్ చివరి వారంలో వీరిద్దరికీ మధ్య ఫైట్ నిర్వహించడానికి యత్నిస్తోంది. డిసెంబర్ 2వ తేదీ నుంచి 21వ తేదీ వరకూ ఆలిండియా బాక్సింగ్ లీగ్(ఐబీఎల్) జరుగనున్న తరుణంలో ఆ తర్వాత మేరీకోమ్-జరీన్లకు మెగా ఫైట్ ట్రయల్స్ ఏర్పాటు చేసేంందుకు దాదాపు రంగం సిద్ధమైంది. దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్‌తో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ఎంపిక చేయాలని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి పోటీ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా క్వాలిఫయింగ్ టోర్నీకి పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రీడాశాఖా మంత్రి కిరణ్ రిజ్జుకు సైతం నిఖత్ లేఖ కూడా రాశారు. దీనిపై తానేమీ చేయలేనని, ఇది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయం కావడంతో దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. ఈ క్రమంలోనే వారి మధ్య వివాదం మరింత రాజుకుంది. నిఖత్ జరీన్‌కు భారత విఖ్యత షూటర్ అభినవ్ బింద్రా మద్దతుగా నిలవడం కూడా మేరీకోమ్‌కు ఆగ్రహం తెప్పించింది. ‘నాకు మేరీకోమ్‌తో పోటీ ఏంటి. అభివన్ నువ్వు బాక్సింగ్ విషయంలో తలదూర్చుకు. ఇది షూటింగ్ కాదు. నీ షూటింగ్ పని నువ్వు చూసుకో’ అంటూ మేరీకోమ్ విరుచుకుపడింది. కాగా, దీనిపై బీఎఫ్ఐ కాస్త మెట్టుదిగినట్లే కనబడుతుండటంతో మేరీకోమ్-జరీన్ల మధ్య పోటీ దాదాపు ఖాయమేనని అనిపిస్తోంది. ఒకవేళ ఈ సెలక్షన్ ట్రయల్స్ జరిగితే అందులో గెలిచిన బాక్సర్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు అర్హత సాధిస్తారు. -
మేరీకోమ్‌కు అరుదైన గౌరవం
టోక్యో: వచ్చే ఏడాది టోక్యో వేదికగా జరుగనున్నఒలింపిక్స్లో భాగంగా భారత మహిళా స్టార్ బాక్సర్, ఆరుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్‌కు అరుదైన గౌరవం దక్కింది. ఈ మెగా ఈవెంట్‌కు సంబంధించి 10 మంది అంబాసిడర్లలో మేరీకోమ్‌కు చోటు దక్కింది. మహిళల అథ్లెట్ల విభాగంలో ఆసియా నుంచి మేరీకోమ్ అంబాసిడర్‌గా నియమించబడ్డారు. ఇటీవల వరల్డ్చాంపియన్షిప్ చరిత్రలో అత్యధిక పతకాలు గెలిచిన బాక్సర్‌గా రికార్డు సాధించిన మేరీకోమ్.. ఐదుసార్లు ఆసియా చాంపియన్‌షిప్‌ను గెలిచారు. తన 51 కేజీల కేటగిరిలో కామన్వెల్త్ గోల్డ్‌తోపాటు ఆసియా గేమ్స్ పసిడి పతకాన్ని కూడా సాధించారు. దాంతో మేరీకోమ్‌ను ఆసియా నుంచి మహిళల అథ్లెట్ల విభాగంలో అంబాసిడర్‌గా నియమిస్తూ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ(ఐఓసీ) నిర్ణయం తీసుకుంది. టోక్యో ఒలింపిక్స్ అంబాసిడర్ల గ్రూప్ పురుషుల విభాగం: లుక్మో లావల్(ఆఫ్రికా), జులియో సీజర్ లా క్రూజ్(అమెరికా), జియాన్‌గుయాన్ ఆసియాహు(ఆసియా), వాస్లీ లామాచెన్కో(యూరప్), డేవిడ్ యికా(ఒసినియా) మహిళల విభాగం: ఖదిజా మార్ది(ఆఫ్రికా), మికియెలా మేయర్(అమెరికా), మేరీకోమ్(ఆసియా), సారా ఓరామౌన్(యూరప్), షెల్లీ వాట్స్(ఒసినియా) -
జరీన్ ఎవరు.. అభినవ్ నీకు రూల్స్ తెలుసా?
న్యూఢిల్లీ: దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్‌తో ట్రయల్స్ నిర్వహించిన తర్వాత ఒలింపిక్స్ క్వాలిఫయింగ్‌కు ఎంపిక చేయాలని తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ కొన్ని రోజులుగా డిమాండ్ చేస్తున్నారు. ఎటువంటి పోటీ లేకుండా మేరీకోమ్‌ను నేరుగా క్వాలిఫయింగ్ టోర్నీకి పంపడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే క్రీడాశాఖా మంత్రి కిరణ్ రిజ్జుకు సైతం నిఖత్ లేఖ కూడా రాశారు. దీనిపై తానేమీ చేయలేనని, ఇది బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయం కావడంతో దానికి కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. బీఎఫ్ఐ స్వయం ప్రతిపత్తిగల సంస్థ కావడంతో దానికే సొంత నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుందన్నారు. దీనికి జరీన్ కృతజ్ఞతలు కూడా తెలియజేశారు. వెంటనే స్పందించినందకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. దేశానికి పేరు తెచ్చేందుకు తీవ్రంగా శ్రమించే క్రీడాకారులు ఆశ్రిత పక్షపాతం, బంధుప్రీతితో నష్టపోవద్దని కోరుకుంటున్నానని జరీన్ తన సమాధానంలో పేర్కొన్నారు. కాకపోతే ఇలా కిరణ్ రిజ్జు వరకూ ఈ వివాదాన్ని తీసుకు రావడంతో మేరీకోమ్ మండిపడ్డారు. ‘ అసలు ఆమె ఎవరు.. ఆమె గురించి నాకు అస్సలు తెలియదు’ అంటూనే కాస్త ఘాటుగా స్పందించారు. ‘ ఈ వివాదాన్ని తెరపైకి తెవడంతో నేను షాక్ అయ్యా. నేను ఎనిమిది వరల్డ్ చాంపియన్స్ పతకాలు గెలిచా. అందులో ఆరు స్వర్ణ పతకాలు ఉన్నాయి. ఎవర్నీ పంపాలో బాక్సింగ్ ఫెడరేషన్ నిర్ణయిస్తుంది. అటువంటప్పుడు నీ ఏడుపు ఏమిటి. భారత బాక్సింగ్ జట్టులో చోటు కోసం లాబీయింగ్ చేయకు’ అంటూ మేరీకోమ్ ఎదురుదాడికి దిగారు. అదే సమయంలో జరీన్‌కు మద్దతుగా నిలిచిన భారత విఖ్యాత షూటర్ అభినవ్ బింద్రాపై మేరీకోమ్ నోరు పారేసుకున్నారు ‘నీ పని నువ్వు చూసుకో. బాక్సింగ్‌లో దూరకు. నీకు బాక్సింగ్ గురించి కానీ రూల్స్ కానీ తెలియదు. నేను ఏమైనా షూటింగ్ గురించి మాట్లాడానా. నీకు బాక్సింగ్ పాయింట్ల విధానం తెలుసా’ అంటూ మండిపడ్డారు. దీనిపై విమర్శలు వస్తున్నాయి. మేరీకోమ్ ఎంతటి చాంపియన్ అయినా కానీ ఇలా మాట్లాడటం తగదంటున్నారు అభిమానులు. దేనికైనా హుందాగా సమాధానం చెబితే బాగుంటుందని హితవు పలుకుతున్నారు. కొందరు మేరీకోమ్ అతి చేస్తుందంటూ విమర్శిస్తున్నారు. మేరీకోమ్-జరీన్‌లు 51 కేజీల వెయిట్ కేటగిరీలో ఉండటంతోనే ఆసియా ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీ సెలక్షన్ ట్రయల్స్ బౌట్ వివాదం పెద్దదిగా మారింది. -
'నాకు న్యాయం కావాలి'
రెండు నెలల వ్యవధిలో రెండో సారి ఒక దిగ్గజ బాక్సర్తో మరో యువ బాక్సర్ ఢీ కొట్టాల్సిన పరిస్థితి! అయితే అది బాక్సింగ్ రింగ్‌లో మాత్రం కాదు. నిబంధనలకు విరుద్ధంగా సమాఖ్య ఏకపక్ష నిర్ణయాలతో స్టార్ క్రీడాకారిణికి మద్దతు పలుకుతుంటే తన భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్న ఒక వర్ధమాన ప్లేయర్ లేఖ ద్వారా ఆవేదన వ్యక్తం చేసుకోవాల్సిన దుస్థితి. వరల్డ్ చాంపియన్‌షిప్ ట్రయల్స్ సమయంలో మేరీ కోమ్ పక్షాన నిలిచిన ఫెడరేషన్ ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ట్రయల్స్ విషయంలో కూడా తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు అన్యాయం చేసింది. దాంతో తన బాధను ఆమె మంత్రి ముందుంచింది. మేరీకోమ్ స్థాయి ఎంత పెద్దదైనా... ఈ విషయంలో జరీన్‌కు క్రీడా ప్రముఖులనుంచి మద్దతు లభిస్తుండటం విశేషం. న్యూఢిల్లీ: మాజీ ప్రపంచ జూనియర్ చాంపియన్ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ తనకు న్యాయం చేయాలంటూ కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజుకు లేఖ రాసింది. 51 కేజీల కేటగిరీలో మేరీకోమ్‌తో తనకు సెలక్షన్ పోటీలు పెట్టాలని ఆ లేఖలో పేర్కొంది. వెటరన్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ అయిన మేరీకి లబ్ది చేకూర్చేలా భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) వ్యవహరిస్తోంది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు సెలక్షన్ ట్రయల్స్ ఉన్నపళంగా రద్దు చేసి భారత బాక్సింగ్ జట్టులో మణిపూర్ సీనియర్ బాక్సర్ మేరీకి చోటు కలి్పంచారు. ఆ పోటీల్లో ఆమె కాంస్యం గెలిచింది. ఇప్పుడు ‘పతక విజేత’ అనే కారణం చూపి చైనాలో జరిగే ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ ఈవెంట్‌కు ఆమెను ఎంపిక చేశారు. దీంతో యువ బాక్సర్ నిఖత్‌కు తీరని అన్యాయం జరుగుతూనే ఉంది. మేరీ పోటీపడే 51 కేజీల వెయిట్కేటగిరే ఆమె పాలిట శాపమవుతోంది. ఆగస్టులో జరిగిన నష్టానికి అసంతృప్తి వ్యక్తం చేసి మిన్నకుండిన ఆమె... ఇప్పుడు తన ఒలింపిక్స్ ప్రయణాన్ని ఇలా అడ్డుకోవడాన్ని సహించలేకపోయింది. ప్రత్యర్థుల కంటే ముందు బాక్సింగ్ సమాఖ్య, క్రీడా పాలకులతోనే పోరాడేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా కేంద్ర క్రీడాశాఖ మంత్రికి లేఖ రాసింది. ‘సర్, క్రీడల్లో మూల సూత్రం నిజాయితీగా పోటీపడటమే. ప్రతీసారి తన శక్తి సామర్థ్యాలు నిరూపించుకోవాలంటే తలపడాల్సిందే. ఒలింపిక్ స్వర్ణ విజేత అయినా కూడా తన దేశానికి ప్రాతినిధ్యం వహించాలంటే మళ్లీ అర్హత సాధించాల్సిందే. ఓ మేటి బాక్సింగ్ దిగ్గజమైన మేరీకోమ్ అంటే నాకెంతో గౌరవం. నా టీనేజ్‌లో ఆమెను చూసే నేను స్ఫూర్తి పొందా. అయితే అలాంటి బాక్సర్‌ను ట్రయల్స్ నుంచి దాచాల్సిన అవసరమేముంది? ఆమె ఒలింపిక్స్ అర్హతను నిలబెట్టుకోలేదా’ అని తన వాదనను లేఖలో వివరించింది. ఎవరికీ అనుకూలంగా ఎవరికి వ్యతిరేకంగా కాకుండా సెలక్షన్ ట్రయల్స్ తర్వాతే ఎంపిక చేయండని, అదే సరైన ప్రాతిపదిక అని ఆమె కోరింది. దిగ్గజ స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్ (అమెరికా) 23 సార్లు ఒలింపిక్ స్వర్ణాలతో రికార్డు సృష్టించినా కూడా ఒలింపిక్స్ కోసం మళ్లీ అర్హత పోటీల్లో తలపడిన సంగతి గుర్తుంచుకోవాలని చెప్పింది. ప్రపంచ చాంపియన్‌షిప్‌కు ముందు స్వర్ణ, రజత విజేతలకు నేరుగా ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ అవకాశమని బీఎఫ్ఐ చెప్పింది. ఇప్పుడేమో కాంస్యం గెలిచిన మేరీకోసం మరోసారి మాటమార్చింది. ఆమెకు క్వాలిఫయింగ్ బెర్తు కట్టబెట్టింది. నిఖత్ డిమాండ్ సబబే: బింద్రా భారత విఖ్యాత షూటర్ అభినవ్ బింద్రా బాక్సర్ నిఖత్ జరీన్ డిమాండ్‌ను సమర్దించాడు. క్వాలిఫయింగ్ జట్టును ఎంపిక చేసేందుకు ముందుగా సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని అన్నాడు. ‘నాకు మేరీ అంటే ఎనలేని గౌరవం. అయితే ఒక అథ్లెట్ కెరీర్లో అన్ని సవాళ్లే... అన్నింటికీ నిరూపించుకోవాల్సిందే. నిన్నటి కంటే నేడు గొప్ప అని ఎప్పటికప్పుడు చాటుకోవాలి. క్రీడల్లో గత విజయాలెప్పుడు భవిష్యత్ అర్హతలకు సరిపోవు. మళ్లీ పోటీపడాలి... అర్హత సాధించాలి’ అని బింద్రా అన్నాడు. -
పద్ధతి గల మహిళలు
‘అమ్మాయిలూ.. మీరెలా ఉంటే అదే పద్ధతి. మీరెలా ఉండాలనుకుంటే అదే పద్ధతి’ అంటూ ‘రూల్స్‌ని బ్రేక్ చేయడం ఎలా?’ అని ప్యూమా కంపెనీ.. నలుగురు సెలబ్రిటీల చేత ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో అమ్మాయిలకు కొత్త పాఠాలు చెప్పిస్తోంది. అవి వినే పాఠాలు కాదు! కలిసి ఆడే పాటలు, కలిసి పాడే ఆటలు! స్త్రీలు అలా ఉండాలని, ఇలా ఉండాలని వాళ్లు పుట్టినప్పట్నుంచీ సమాజం స్టిక్ పట్టుకుని పాఠాలు నేర్పిస్తూనే ఉంటుంది. మేథ్స్, ఫిజిక్స్లా.. ఒద్దిక, అణుకువ అనేవి అమ్మాయిలకు సమాజం టీచ్ చేసే ముఖ్యమైన సబ్జెక్టులు! ఆ సబ్జెక్టుల్లో పాస్ అయితేనే చివరికి వారికి ‘ప్రాపర్ లేడీ’ అనే ప్రశంసాపత్రం వస్తుంది. ఆ పత్రం ఉంటేనే అమ్మాయి అమ్మాయిగా పెరిగినట్లు. ‘ప్రాపర్ లేడీ’ అంటే పద్ధతిగా పెరిగిన పిల్ల అని! అయితే ఇప్పుడు ‘ఫ్యూమా’ అనే అంతర్జాతీయ స్పోర్ట్స్ కంపెనీ ‘పద్ధతిగా లేకపోవడమే పద్ధతి’ అనే ఒక వీడియో క్యాంపెయిన్ మొదలు పెట్టింది! ‘ఎప్పుడూ ఎంపవర్మెంట్ని సాధించే పనేనా? సాధించిన ఎంపవర్మెంట్ని వేడుక చేసుకునేది ఎప్పుడు?’.. అని సారా అలీ ఖాన్, మేరీ కోమ్, అంజలీ లామా, ద్యుతీ చంద్ ఈ వీడియోలో మిమ్మల్ని అడుగుతారు. మీ చెయ్యి పట్టుకుని వాళ్లలోకి మిమ్మల్ని లాగేసుకుంటారు. సారా అలీఖాన్ బాలీవుడ్ వర్ధమాన నటి. మేరీ కోమ్ ఇండియన్ ఒలింపిక్స్ బాక్సర్. ద్యుతీ చంద్ ఇంటర్నేషనల్ అథ్లెట్, అంజలీ లామా ట్రాన్స్‌జెండర్ మోడల్. వీళ్లంతా స్టార్స్ కదా! పద్ధతిగా పెరగకపోతే, పద్ధతిగా ప్రాక్టీస్ చెయ్యకపోతే ఇంతవరకూ వస్తారా అనేదే మీ సందేహమైతే ఆ సందేహాన్ని తుడిచిపెట్టేయండి. వాళ్లు వాళ్లలాగే ఉంటూ.. ఇంత పైకి వచ్చారు. ‘వాళ్లలాగే అంటే..?’ అని ఇంకో డౌటా! ఒరిజినల్‌గా వీళ్లేమిటో ప్యూమా కంపెనీ తయారు చేయించిన ‘మీట్ ద ప్రాపర్ లేడీ’ వీడియో చూడండి. ఒక్కొక్కరిలో ఒక్కో పోకిరి పిల్ల్ల, కుండల్ని బద్దలు కొట్టే పిల్ల, ఎవరేమనుకుంటే నాకేంటి అనే పిల్ల, నీ గేమ్ నీ లైఫ్ అనే పిల్ల సాక్షాత్కరిస్తుంది. కుర్చీలో ‘అదోలా’ కూర్చుంటుంది ద్యుతీచంద్. నోటినిండా బబుల్గమ్ ఊదుతూ ఇంత కళ్లేసుకుని చూస్తుంది సారా అలీఖాన్. ‘ఉంటే జిమ్‌లో ఉండు.. లేదంటే స్ట్రీట్ ఫైట్‌లో ఉండు’ అంటుంది రింగ్‌లో జారి గిలబడి ఉన్న మేరీకోమ్. ‘నాకు ఇష్టమైనది తప్ప నాకు ఇంకేదీ వద్దు’ అని తెగే వరకు లాగి చెప్పేస్తుంది అంజలీ లామా! నేడో రేపో ఫేస్బుక్లో, ట్విట్టర్లో కూడా ‘మీట్ ద ప్రాపర్ లేడీ’ అనే ఈ ప్యూమా కంపెనీ ప్రచారం ప్రారంభం కాబోతోంది. చూడండి. ‘పద్ధతిగా ఉండండి’. నీ గేమ్.. నీ లైఫ్..! సారా అలీఖాన్ నువ్వు చెప్పేది నువ్వు చెప్పు. నో ప్రాబ్లం. కానీ నాకు నచ్చినట్లు నేనుంటా. మేరీ కోమ్ పంచ్ ఇస్తే తప్ప లైఫ్ దారికి రాదనుకుంటే పంచ్ ఇవ్వాల్సిందే ద్యుతీ చంద్ ఒకటేదైనా అనుకుంటే వదిలిపెట్టకు. నువ్వు అనుకున్నదాని కోసం నిన్ను నువ్వు వదులుకున్నా తప్పేం లేదు. అంజలీ లామా నా అన్వేషణ శిఖరంపై ఉన్నప్పుడు నేనెందుకు నేలపై వెదుక్కుంటాను? -
వివాదాస్పద నిర్ణయం; మేరీకోమ్‌కు షాక్
ఉలన్ ఉడే(రష్యా): ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ భారత వెటరన్ బాక్సర్ మేరీకోమ్ పోరాటం ముగిసింది. జడ్జిల వివాదాస్పద నిర్ణయంతో సెమీ ఫైనల్లో ఓటమిపాలై కాంస్యంతో సరిపెట్టుకుంది. రష్యాలో జరుగుతున్న ఈ టోర్నమెంట్లో మహిళల 51 కిలోల విభాగంలో సెమీస్‌కు చేరిన మేరీ శనివారం టర్కీకి చెందిన రెండో సీడ్ బుసెనాజ్ కాకిరోగ్లుతో తలపడింది. 1-4 తేడాతో ఓడిపోయి కాంస్యంతో వెనుదిరిగింది. ఆదివారం జరిగే ఫైనల్లో రష్యా బాక్సర్ లిలియాతో బుసెనాజ్ తలపడనుంది. అయితే కాంస్యం గెలిచిన మేరీకోమ్ వరల్డ్ బాక్సింగ్ చరిత్రలోనే అత్యధిక పతకాలు గెలిచిన బాక్సర్‌గా సరికొత్త రికార్డ్ నెలకొల్పింది. వివాదాస్పద నిర్ణయం ఇద్దరు బాక్సర్లు ఆత్మవిశ్వాసంతో సెమీస్ బరిలోకి దిగారు. రెండో రౌండ్లో బుసెనాజ్ దూకుడు పెంచి మేరీకోమ్‌ను ఆత్మరక్షణలో పడేసింది. మేరీకోమ్ కంటే హైట్ ఎక్కువగా ఉండడం కూడా బుసెనాజ్ కలిసొచ్చింది. రెండు రౌండ్ల పాటు నువ్వా, నేనా అన్నట్టు ఇద్దరు హోరాహోరీగా తలపడ్డారు. బౌట్ ముగిసిన తర్వాత జడ్జిల నిర్ణయంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నిర్ణయాన్ని మరోసారి పరిశీలించాలని, మరో బౌట్‌కు అవకాశం ఇవ్వాలని కోరింది. భారత్ అప్పీలును టెక్నికల్ కమిటీ తోసిపుచ్చింది. స్కోరు 3:2/3:1 ఉన్నప్పుడు మాత్రమే అభ్యంతరాలు పరిశీలించడానికి వీలవుతుందని తెలపడంతో మేరీకోమ్ కాంస్యంతో వెనుదిరగాల్సి వచ్చింది. కాగా, బుసెనాజ్‌ను విజేతగా ప్రకటించడంపై మేరీకోమ్ మండిపడింది. తాను ఓడిపోయినట్టు ప్రకటించిన న్యాయ నిర్ణేతల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. జడ్జిల నిర్ణయం సరైందో, కాదో ప్రపంచం మొత్తానికి తెలుసని పేర్కొంటూ ట్వీట్ చేసింది. కాగా ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీకి ఇది ఎనిమిదవ పతకం. దీంతో సుదీర్ఘ కాలంపాటు విజయవంతమైన బాక్సర్‌గా మేరీ నిలిచారు. ఇప్పటి వరకు మేరి తన కెరీర్లో ఆరు బంగారు, ఒక సిల్వర్, ఒక కాంస్య పతకాలను సాధించారు. ఇటీవల 48 కేజీల విభాగం నుంచి 51 కేజీల కేటగిరీకి మారిన మేరీకోమ్ పేరును భారత రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డుకు సిఫార్స్ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఈ అవార్డుకు నామినేట్ అయిన మొదటి మహిళ అథ్లెట్‌గా ఆమె ఘనత సాధించారు. (చదవండి: చరిత్ర సృష్టించిన మేరీకోమ్) -
జయము జయము
క్రీడా మంత్రిత్వ శాఖ ఈసారి ‘పద్మ’ అవార్డుల కోసం అందరూ మహిళల్నే నామినేట్ చేసింది! మొత్తం 9 మంది. ‘పద్మ విభూషణ్’కు మేరీ కోమ్ (బాక్సింగ్), ‘పద్మ భూషణ్’కు పి.వి.సింధు (బ్యాడ్మింటన్), ‘పద్మశ్రీ’కి వినేశ్ ఫోగట్ (రెజ్లింగ్), హర్మన్‌ప్రీత్ కౌర్ (క్రికెట్), రాణి రాంపాల్ (హాకీ), సుమ శిరూర్ (షూటింగ్), మనికా బత్రా (టేబుల్ టెన్నిస్), కవలలు తాషి, నంగ్షీ మాలిక్ (పర్వతారోహణ) నామినేట్ అయ్యారు. ‘పద్మ విభూషణ్’గా నామినేట్ అయిన మేరీ కోమ్.. బాక్సింగ్‌లో ఆరుసార్లు వరల్డ్ ఛాంపియన్. పద్మభూషణ్ (2013), పద్మ శ్రీ (2006) గ్రహీత కూడా. ఇక మిగిలింది పద్మ విభూషణ్! క్రీడల్లో ఒక మహిళ పద్మ విభూషణ్‌కు నామినేట్ అవడం ఇదే మొదటిసారి. ఇంతవరకు విశ్వనాధన్ ఆనంద్ (2007), సచిన్ టెండూల్కర్ (2008), సర్ ఎడ్మండ్ హిల్లరీ (చనిపోయాక 2008లో) లకు మాత్రమే స్పోర్ట్స్ కేటగిరీలో పద్మవిభూషణ్ లభించింది. ఈ ఏడాది పద్మభూషణ్‌కు నామినేట్ అయిన పి.వి.సింధు 2017లోనూ నామినేట్ అయ్యారు కానీ, విజేత కాలేకపోయారు. 2015లో ఆమెకు పద్మ శ్రీ దక్కింది. ‘భారతరత్న’ మనదేశంలో అత్యున్నత పురస్కారం. తర్వాతవి.. వరుసగా ‘పద్మ విభూషణ్’, ‘పద్మ భూషణ్’, ‘పద్మ శ్రీ’. ఏటా ‘రిపబ్లిక్ డే’కి ఒక రోజు ముందు ఈ అవార్డులను ప్రకటిస్తారు. అంతకన్నా ముందు వివిధ రంగాల నుంచి నామినేషన్లు వెళ్తాయి. వాటిలోంచి విజేతలు ఎంపికవుతారు. మేరీ కోమ్కు ఛాన్సుంది! మేరీ కోమ్ (36) రాజ్యసభ సభ్యురాలు కూడా. 2016 ఏప్రిల్‌లో బీజేపీ ప్రభుత్వం ఆమెను ఎంపీగా నామినేట్ చేసింది. ప్రస్తుతం ఆమె.. వచ్చే ఏడాది టోక్యోలో జరిగే ఒలింపిక్స్‌కి క్వాలిఫై అయ్యేందుకు దీక్షగా సాధన చేస్తున్నారు. కోమ్ 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు. ఈ మణిపురి బాక్సర్‌కు ఉన్న ట్రాక్ రికార్డుని బట్టి ఆమెకు పద్మవిభూషణ్ రావచ్చనే క్రీడా మంత్రిత్వ శాఖ భావిస్తోంది. -
తొలి మహిళా అథ్లెట్..
న్యూఢిల్లీ: ఆరుసార్లు వరల్డ్‌చాంపియన్‌గా నిలిచి ఇప్పటికీ తనలో పంచ్ పవర్‌ను చూపిస్తున్న భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ పేరును పద్మ విభూషణ్ అవార్డుకు ప్రతిపాదిస్తూ క్రీడామంత్రిత్వ శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాదికి గాను మొత్తం తొమ్మిది మంది మహిళా క్రీడాకారిణులతో కూడిన పద్మ అవార్డుల జాబితాను క్రీడా శాఖ తాజాగా సిద్ధం చేసింది. ఇందులో మేరీకోమ్‌ను పద్మ విభూషణ్‌కు ఎంపిక చేయగా, తెలుగు తేజం, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరును పద్మ భూషణ్‌కు ప్రతిపాదించారు. ఇటీవల వరల్డ్‌చాంపియన్‌గా సింధు నిలవడంతో ఆమెను పద్మ భూషణ్‌కు సిఫారుసు చేయడం ప్రధాన కారణం. 2015లో పద్మ శ్రీ అవార్డు అందుకున్న సింధు.. 2017లోనే పద్మ భూషణ్ గౌరవం దక్కుతుందని అంతా అనుకున్నారు. కానీ అప్పుడు సింధు పేరును పరిగణలోకి తీసుకోలేక పోవడంతో ఇప్పుడు ఆమె పేరును ఈ అవార్డుకు సిఫారుసు చేస్తూ కేంద్ర క్రీడాశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా, పద్మ విభూషణ్‌గా మేరీకోమ్‌ను ఎంపిక చేయడంతో ఆమె అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్‌కు ఒక మహిళా అథ్లెట్‌ను ఎంపిక చేయడం ఇదే తొలిసారి. ఫలితంగా మేరీకోమ్ పద్మ విభూషణ్‌కు సిఫారుసు చేయబడ్డ తొలి క్రీడాకారిణిగా నిలిచారు. ఇక మిగిలిన ఏడుగురు క్రీడాకారిణుల పద్మ అవార్డుల్లో భాగంగా రెజ్లర్ వినేశ్ ఫోగట్, టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మానికా బాత్రా, టీ20 కెప్టెన్ హర్మన్ ప్రీత్, హాకీ కెప్టెన్ రాణి రాంపాల్, మాజీ షూటర్ సుమా షిర్పూర్, మౌంటైనీర్ ట్విన్ సిస్టర్స్ తాషి, నుంగాషి మాలిక్‌లను పద్మ శ్రీకి సిఫారుసు చేశారు. -
నిఖత్ జరీన్‌కు షాక్!
న్యూఢిల్లీ: గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తూ పెద్ద టోర్నీలలో సత్తా చాటేందుకు సిద్ధమైన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ ఆశలపై భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ) పంచ్ విసిరింది. వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనాలనుకున్న ఆమెను ఊహించని విధంగా అడ్డుకుంది. ఈ మెగా ఈవెంట్ కోసం నిర్వహిస్తున్న ట్రయల్స్‌లో నిఖత్ పాల్గొనకుండా స్వయానా చీఫ్ సెలక్టర్ రాజేశ్ భండారి నిరోధించారు. నిఖత్ ఈవెంట్ అయిన 51 కేజీల విభాగంలో భారత స్టార్ బాక్సర్, ఆరుసార్లు ప్రపంచ విజేతగా నిలిచిన 36 ఏళ్ల మేరీకోమ్‌ను బీఎఫ్ఐ ఎంపిక చేసింది. ట్రయల్స్‌లో పాల్గొనకపోయినా ఇటీవలి ప్రదర్శన ఆధారంగా మేరీకోమ్‌ను ఎంపిక చేసినట్లు బీఎఫ్ఐ ప్రకటించింది. మేరీకోమ్ ఈ ఏడాది ఇండియన్ ఓపెన్‌తో పాటు ఇండోనేసియాలో జరిగిన ప్రెసిడెంట్స్ కప్ టోర్నీలో కూడా విజేతగా నిలిచింది. షెడ్యూల్ ప్రకారం మంగళవారం జరిగిన ట్రయల్స్‌లో వన్లాల్ దువాతితో నిఖత్ తలపడాల్సి ఉంది. అయితే బౌట్ ఆరంభానికి కొద్దిసేపు ముందు ఈ పోరు జరగడం లేదని ఆమెకు భండారి చెప్పారు. బుధవారం జరగవచ్చని ఆశించినా... జాబితాలో ఆమె పేరు, కేటగిరీలే కనిపించలేదు. దాంతో ఒక్కసారిగా ఈ నిజామాబాద్ బాక్సర్ దిగ్భ్రాంతికి గురైంది. ట్రయల్స్ నిర్వహించండి... తనకు జరిగిన అన్యాయంపై ప్రపంచ మాజీ జూనియర్ చాంపియన్ నిఖత్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. ప్రపంచ యూత్ బాక్సింగ్ రజత, సీనియర్ ఆసియా కాంస్య పతక విజేత అయిన ఆమె తన సమస్యను, బాధను వెల్లడిస్తూ బాక్సింగ్ సమాఖ్యకు లేఖ రాసింది. ఇటీవలే నిఖత్ థాయ్‌లాండ్‌లో జరిగిన టోర్నీలో కూడా రజతం సాధించింది. ‘ఇది చాలా ఆశ్చర్యంతోపాటు నిరాశ కలిగించింది. చిన్న వయసులోనే నేను ప్రపంచ చాంపియన్‌షిప్ బరిలోకి దిగకుండా రక్షిస్తున్నామని, మంచి భవిష్యత్తు కోసం నా మేలు కోరుతున్నామని సెలక్టర్లు నాతో చెప్పారు. అయితే 2016లోనే ఈ టోర్నీలో పాల్గొన్న నేను ఇప్పుడు చిన్నదాన్ని ఎలా అవుతాను. కాబట్టి నన్ను ఆపేందుకు వయసు మాత్రమే కారణం కాదు. మీ ఆధ్వర్వంలో పారదర్శకంగా ట్రయల్స్ నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నా. ఏదైనా ఒక నిబంధన నిజంగా ఉంటే అది బాక్సర్ల స్థాయి, ఘనతను బట్టి కాకుండా అందరికీ వర్తింపజేయాలి. బాక్సర్లు ట్రయల్స్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు తప్పుడు పద్ధతులు అవలంబించవద్దు. అందుకే మీ జోక్యం కోరుతున్నాను’ అని 23 ఏళ్ల నిఖత్ ఆ లేఖలో పేర్కొంది. సరైన నిర్ణయమే: భండారి నిఖత్‌ను ట్రయల్స్‌లో పాల్గొనకుండా తీసుకున్న నిర్ణయాన్ని రాజేశ్ భండారి సమర్థించుకున్నారు. భారత్ పతకావకాశాలు మెరుగ్గా ఉండాలనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ‘బీఎఫ్ఐ ఉన్నతాధికారులతో చర్చించిన తర్వాతే 51 కేజీల విభాగంలో మేరీకోమ్‌ను ఎంపిక చేశాం. ఆమె కోచ్ కూడా మాకు ఒక అభ్యర్థన పంపారు. దానిని పరిశీలించిన తర్వాత ట్రయల్స్ లేకుండానే ఎంపికయ్యేందుకు మేరీకోమ్‌కు అర్హత ఉందని నిర్ధారణకు వచ్చాం. ఇటీవల ఇండియా ఓపెన్‌లో నిఖత్‌ను కూడా ఆమె ఓడించింది. జాతీయ శిబిరంలో కూడా అందరికంటే మెరుగ్గా కనిపించింది. నిఖత్ కూడా చాలా మంచి బాక్సర్. భవిష్యత్తులో ఆమెకు తగిన అవకాశాలు లభిస్తాయి. ప్రస్తుతానికి మాత్రం ప్రదర్శన, అనుభవంపైనే మేరీకోమ్‌ని ఎంపిక చేశాం’ అని భండారి వివరించారు. మేరీకోమ్గీనిఖత్ మే నెలలో గువాహటిలో జరిగిన ఇండియా ఓపెన్ సెమీఫైనల్లో నిఖత్‌పై మేరీకోమ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌కు ముందు ‘నాకు స్ఫూర్తిగా నిలిచిన బాక్సర్తో తలపడేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నా. ఆమె వ్యూహాలను పసిగట్టి గట్టి పోటీనిస్తా’ అని నిఖత్ వ్యాఖ్యానించింది. ఈ వ్యాఖ్యలో అంత వివాదం ఏమీ లేదు. కానీ ఎందుకో మేరీకోమ్ అహం దెబ్బతిన్నట్లుంది! లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత, ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఈ దిగ్గజం తనకంటే ఎంతో జూనియర్ అయిన నిఖత్‌పై మ్యాచ్ తర్వాత ఆగ్రహాన్ని ప్రదర్శించింది. ‘ఈ అమ్మాయి ఎవరో కూడా నాకు తెలీదు. నేను చా లా ఏళ్లుగా ఆడుతున్నాను. నన్ను ఆమె సవాల్ చేస్తున్నట్లుగా పత్రికల్లో వచ్చింది. నాకు ఆశ్చర్యంతో పాటు చికాకు కలిగింది. ముందు నిన్ను నువ్వు రింగ్‌లో నిరూపించుకో. ఆ తర్వాత నాపై వ్యాఖ్యలు చేయవచ్చు. అంతర్జాతీయ స్థాయి లో ఒక్క పతకం గెలిచిన ఆమెకు ఇంత అహం అవసరమా? నాతో పోటీ పడటం ఆమె అదృష్టం’ అని తీవ్రంగా వ్యాఖ్యానించింది. నిఖత్ కెరీర్ ఆరంభం నుంచి 51 కేజీల విభాగంలోనే పోటీ పడుతోంది. మొదటి నుంచి 48 కేజీల విభా గంలో ఆడిన మేరీ కోమ్ దానిని ఒలింపిక్స్ నుంచి తప్పించడంతో ఇండియా ఓపెన్‌తోనే 51 కేజీలకు మారింది. దాంతో నిఖత్ అవకాశాలు దెబ్బతింటున్నాయి. నాటి ఘటనకు, ఇప్పుడు నిఖత్‌ను అడ్డుకోవడానికి సంబంధం ఉండవచ్చని బాక్సింగ్ వర్గాలు అభిప్రాయం వ్యక్తం చేశాయి. -
మేరీ కోమ్ మెరిసింది!
జకార్త : భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ స్వర్ణంతో మెరిసింది. ఆదివారం జరిగిన ఇండోనేసియా 23వ ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నమెంట్ ఫైనల్లో ఈ మణిపూర్ మణిపూస(51 కేజీలు) ఆస్ట్రేలియా బాక్సర్ ఫ్రాంక్స్ ఎప్రిల్ను 5-0తో చిత్తు చేసింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా పంచ్‌లు విసురుతూ.. ఏకపక్ష విజయాన్ని సొంతం చేసుకొని భారత్‌కు పసిడిని అందించింది. ఈ విజయానంతరం పతకాన్ని అందుకున్న క్షణాలను ట్వీట్ చేస్తూ మేరికోమ్ సంతోషం వ్యక్తం చేసింది. ‘ప్రెసిడెంట్స్ కప్ ఇండోనేషియాలో నా దేశానికి.. నాకు స్వర్ణం దక్కింది. గెలవడమంటే ఎంత దూరమైన వెళ్లడానికి, అందరికంటే ఎక్కవ కష్టపడటానికి సిద్ధంగా ఉన్నారని అర్థం. నా కోచ్‌లకు, సహాయక సిబ్బందికి మనస్పూర్తిగా ధన్యవాదాలు’ అని ఆరుసార్లు ప్రపంచ చాంపియనైన మేరీకోమ్ పేర్కొంది. 36 ఏళ్ల మేరీకోమ్ మేలో జరిగిన భారత ఓపెన్ బాక్సింగ్ టోర్నీలోనే స్వర్ణం సాధించింది. ఒలింపిక్స్ ప్రణాళికలో భాగంగా ఆ నెలలోనే థాయ్‌లాండ్‌లో జరిగిన ఏషియన్ చాంపియన్‌షిప్స్‌లో పాల్గొనలేదు. గతేడాది ఢిల్లీలో ఆరో బాక్సింగ్ ప్రపంచ టైటిల్‌ను నెగ్గి ప్రపంచ మేటీ బాక్సర్‌గా గుర్తింపు పొందింది. రష్యాలోని యెకాటెరిన్బర్గ్ వేదికగా జరిగే ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్-2019లో నెగ్గి టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలని మేరీకోమ్ ఉవ్విళ్లూరుతోంది. ఈ చాంపియన్ షిప్ సెప్టెంబర్ 7 నుంచి 21 మధ్య జరగనున్నాయి. వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ అనంతరం బాక్సింగ్‌కు వీడ్కోలు పలుకుతానని ఈ ముగ్గురు పిల్లల బాక్సర్ ప్రకటించింది. ఇక స్వర్ణం నెగ్గిన మేరీకోమ్‌కు సోషల్ మీడియా వేదికగా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర కీడ్రాశాఖ మంత్రి కిరణ్ రిజిజు మేరీకోమ్‌ను కొనియాడుతూ అభినందనలు తెలిపారు. ‘డియర్ మేరీకోమ్ నువ్వెప్పుడు దేశం గర్వించేలా చేస్తున్నావ్. ప్రెసిడెంట్స్ కప్ బాక్సింగ్ టోర్నీలో స్వర్ణం నెగ్గిన నీకు అభినందనలు’ అని పేర్కొన్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం మేరీకోమ్‌ను అభినందించారు. భవిష్యత్తులో ఆమె మరిన్ని విజయాలందుకోవాలని ఆకాంక్షించారు. Gold medal for me and for my country at #PresidentCup Indonesia. Winning means you’re willing to go longer,work harder & give more effort than anyone else. I sincerely thanks to all my Coaches and support staffs of @BFI_official @KirenRijiju @Media_SAI pic.twitter.com/R9qxWVgw81 — Mary Kom (@MangteC) July 28, 2019 -
‘టోక్యో’నే ఆఖరు: మేరీకోమ్
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్ తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించింది. వచ్చే ఏడాది టోక్యోలో జరగనున్న ఒలింపిక్స్ అనంతరం బాక్సింగ్‌కు వీడ్కోలు చెప్పనున్నట్లు ప్రకటించింది. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె ఈ విషయం వెల్లడించింది. ‘టోక్యో ఒలింపిక్స్ తర్వాత రిటైర్ అవ్వాలని నిర్ణయించుకున్నా. ప్రస్తుతం నా ముందున్న లక్ష్యం ఆ మెగా టోర్నీలో భారత్‌కు పసిడి పతకం అందించడమే’అని ఆమె పేర్కొంది. కాగా, 36 ఏళ్ల మేరీకోమ్ తన 18 ఏళ్ల బాక్సింగ్‌లో భారత్‌కు ఎన్నో పతకాలు తెచ్చిపెట్టింది. ఆరురుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచి వరల్డ్ రికార్డు సృష్టించింది. 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీ ఖాతాలో ఐదు ఆసియా చాంపియన్‌షిప్‌లు సైతం ఉన్నాయి. ప్రస్తుతం మేరీ రాజ్యసభ ఎంపీగా కొనసాగుతోంది. -
నిఖత్ జరీన్‌కు పతకం ఖాయం
గువాహటి: ఇండియా ఓపెన్ అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్ పతకాన్ని ఖాయం చేసుకుంది. మహిళల 51 కేజీల విభాగంలో ఈ నిజామాబాద్ జిల్లా బాక్సర్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో నిఖత్ 5–0తో భారత్‌కే చెందిన అనామికపై విజయం సాధించింది. సెమీఫైనల్లో భారత దిగ్గజ బాక్సర్ మేరీకోమ్‌తో నిఖత్ తలపడనుంది. మరో క్వార్టర్ ఫైనల్లో మేరీకోమ్ 5–0తో మాలా రాయ్ (నేపాల్)పై గెలుపొందింది. సరితా దేవి (60 కేజీలు), అంకుశిత బోరో (64 కేజీలు), మంజు రాణి (48 కేజీలు) కూడా సెమీఫైనల్‌కు చేరి పతకాలను ఖాయం చేసుకున్నారు. క్వార్టర్ ఫైనల్స్‌లో సరిత 5–0తో ప్రీతి బెనివాల్ (భారత్)పై, అంకుశిత 4–1తో లలిత (భారత్)పై, క్లియో తెసారా (ఫిలి -
పాటతో అదరగొట్టిన మేరీకోమ్
-
మేరీ.. పంచ్‌లతోనే కాదు.. పాటతో అదరగొట్టింది!
పనాజి : ముప్పై ఐదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. ఆరు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్. ఒక ఒలింపిక్ మెడల్.. ఇది భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ గురించి మనందరికి తెలిసిన విషయం. కానీ ఆమె ఓ మంచి పాప్ సింగరని, అద్బుత గొంతులో పాటలు పాడుతుందని ఎవరికి తెలియదు. ఆమెలోని ఈ కొత్త టాలెంట్ గోవా ఫెస్ట్ 2019 ద్వారా ప్రపంచానికి తెలిసింది. ప్రచారసంస్థలు, మీడియా సంయుక్తంగా నిర్వహించిన ఈ ఫెస్ట్‌కు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు పాల్గొన్నారు. క్రీడల నుంచి మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్.. బాక్సింగ్ దిగ్గజం మేరీ కోమ్‌లు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మేరికోమ్.. వాట్సాప్.. అమెరికన్ క్లాసిక్ సాంగ్‌ను ఆలపించి ఔరా అనిపించారు. ఆమె గానంతో అందరిని మైమరిపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. మేరీ గాత్రానికి ముగ్దులైన నెటిజన్లు... మేరీ పంచ్‌లతోనే కాదు.. పాటతోను అదరగొట్టారు అంటూ కామెంట్ చేస్తున్నారు. -
ఎంతిష్టమో!
ముప్పై ఐదేళ్ల వయసు. ముగ్గురు పిల్లలు. ఆరు వరల్డ్ చాంపియన్‌షిప్ టైటిల్స్. ఒక ఒలింపిక్ మెడల్! ఏమిటి మేరీ కోమ్ విజయ రహస్యం? బాక్సర్‌గా అనుభవమా? ఆమె ఫిట్నెస్సా? రెండూ! రెండిటినీ మించి గెలవాలన్న తపన. అలాగని కోమ్ మరీ గంటల కొద్దీ ప్రాక్టీసేం చెయ్యరు. యువ బాక్సర్లకు రెండు గంటల ప్రాక్టీస్ చాలు. కోమ్‌కి రోజూ 40 నుంచి 45 నిమిషాల సాధన సరిపోతుందట. ఇక శక్తి. ఎక్కడి నుంచి వస్తుంది ఆమెలోంచి ఆ పవర్ పంచ్? విల్ పవర్ ఎలాగూ ఉంటుంది. డైట్ ఏమిటి? స్పెషల్‌గా ఏమీ ఉండదట. ఏం తినాలని ఉంటే అప్పటికి అది తినేస్తారట. జన్రల్‌గా కోమ్ తినేది వరన్నం (వరి అన్నం). ‘‘రైస్ లేకుండా నేను బతకలేను. తరచు జిలేబీలు తింటాను. అలాగే ఐస్‌క్రీమ్. ఒక్కోసారి రెండూ కూడా. అయితే నో మసాలా.. నో స్పైసీ ఫుడ్’’ అని చెప్తారు మేరీ కోమ్. ఇవి మాత్రమే కాదు. సప్లిమెంట్స్ కూడా తీసుకుంటారట. బలమిచ్చే మందులు. డాక్టర్ నిఖిల్ లేటీ ఆమె ఫిజియోథెరపిస్ట్. ఆయన్నడిగితే కోమ్ ఆహారపు అలవాట్ల గురించి మరికొంత వివరంగా చెబుతుంటారు. ఇంట్లో వండిన మణిపురి ఫుడ్. అన్నంలోకి మాంసం, కూరగాయలు. బయట డబ్బాలో లభించే ప్రొటీన్, మల్టీ విటమిన్లు. ఇదీ మేరీ మెనూ. సరే, బాక్సింగ్‌లో ఆడడానికి ఒక వెయిట్ ఉండాలి కదా! ఆ వెయిట్‌ని ఎక్కువా కాకుండా, తక్కువగా కాకుండా కోమ్ ఎలా మేనేజ్ చెయ్యగలుగుతున్నారు? మొన్నటి వరల్డ్ బాక్సింగ్ పోటీలలో మేరీ కోమ్ బంగారు పతకాన్ని కొట్టింది 48 కిలోల కేటగిరీలో. ఇప్పుడు ఆమె గోల్ ఒలింపిక్స్‌లో గోల్డ్ కొట్టడం. అందుగ్గాను ఆమె 51 కిలోల బరువు ఉండాలి. అంటే పెరగాలి. ఆటకు తగ్గట్లు పెరగడం, తగ్గడం కోమ్‌కి కష్టమేం కాదట! బరువు తగ్గడానికి స్కిప్పింగ్, బ్యాడ్మింటన్. పెరగడానికి.. బలమైన ఆహారం. క్రమబద్ధమైన వ్యాయామం. చివరగా ఒక్క విషయం. కోమ్ సాధారణంగా బంగారు పతకాన్నో, ఇంకో బ్రాస్ పతకాన్నో పంటి కింద కొరుకుతూ కనిపిస్తారు కానీ.. ఆహారాన్ని భుజిస్తూ ఎక్కడా కనిపించరు! -
మేరీకోమ్ ‘రికార్డు’ పంచ్
న్యూఢిల్లీ: ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ చరిత్ర సృష్టించారు. మంగళవారం జరిగిన పోటీల్లో 35 ఏళ్ల మేరీ కోమ్ సంచలన ప్రదర్శన చేసిన మేరీకోమ్ సెమీ ఫైనల్లో ప్రవేశించారు. 48 కేజీల లైట్ ఫ్లైవెయిట్ విభాగంలో మేరీకోమ్ 5-0 తేడాతో వుయ్(చైనా)పై గెలిచి సెమీస్ బెర్తును ఖాయం చేసుకున్నారు. ఫలితంగా కనీసం కాంస్య పతకాన్ని మేరీకోమ్ తన ఖాతాలో వేసుకున్నారు. అదే సమయంలో ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఏడో పతకాన్ని మేరీకోమ్ సాధించారు. ఈ క్రమంలోనే వరల్డ్ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో అత్యంత విజయవంతమైన బాక్సర్‌గా అరుదైన రికార్డు సృష్టించారు మేరీకోమ్.ఓవరాల్ ఈ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ 5స్వర్ణాలు, ఒక రజత పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే. చివరిసారిగా 2010లో 48 కేజీలో కేటగిరీలో ఆమె స్వర్ణాన్ని సాధించారు. -
బాసు.. భలే పోజు!
ఇక్కడున్న ఫొటో చూశారుగా! సూపర్‌స్టార్ రజనీకాంత్ బాక్సింగ్ చేస్తున్నట్లు పోజిచ్చారు. పక్కనున్నది ఎవరో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆమె మణిపూర్‌కు చెందిన ప్రముఖ బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ అని అందరికీ తెలుసు. కానీ వీళ్లు ఎందుకు కలిశారు? సినిమా కోసమా? అనే ఆలోచనలు తగవు. రజనీకాంత్ సతీమణి లతా రజనీకాంత్ చెన్నైలో ఓ ఈవెంట్‌ను నిర్వహించారట. ఆ ఈవెంట్‌కి వెళ్లిన మేరికోమ్ అలా రజనీకాంత్‌ను కలిశారు. వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో వైరల్‌గా మారింది. దీన్ని చూసిన రజనీ అభిమానులు బాసు.. భలే పోజు అని సరదాగా కామెంట్ చేస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన ‘2.ఓ’ సినిమా ట్రైలర్ నేడు విడుదల కానుంది. ఈ చిత్రం ఈ నెల 29న విడుదల అవుతుంది. అలాగే కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా నటించిన ‘పేట్టా’ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుందని కోలీవుడ్ టాక్. -
గిరిజనుల అంబాసిడర్‌గా మేరీ కోమ్
న్యూఢిల్లీ: ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ బాక్సర్ అయిన మేరీ కోమ్ భారత గిరిజనులకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనుంది. కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ఆమెను ప్రచారకర్తగా నియమించింది. ఆమె గతంలో రాజ్యసభ సభ్యురాలిగా పనిచేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో స్టార్ మహిళా బాక్సర్ మేరీ మాట్లాడుతూ ‘షెడ్యూల్డు తెగలకు బ్రాండ్ అంబాసిడర్ కావడం చాలా సంతోషంగా ఉంది.మణిపూర్‌కు చెందిన నేను గిరిజనుల వృద్ధి, వికాసానికి నా వంతు సహకారం అందజేస్తాను. వాళ్లంతా ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నా’ అని చెప్పింది. ఇందులో భాగంగా గిరిజనులు, చేతివృత్తుల వారు తయారు చేసిన ఉత్పత్తులను ప్రదర్శించారు. -
ఔరా... మేరీ!
న్యూఢిల్లీ: భారత బాక్సింగ్ దిగ్గజం మేరీకోమ్ తానేంటో ఇది వరకే చాలాసార్లు నిరూపించుకుంది. అలాంటి చాంపియన్ బాక్సర్ తనకు పతకాలు తెచ్చే కేటగిరీ (48 కేజీలు) కోసం వీరోచిత కసరత్తే చేసి ఔరా అనిపించింది. కేవలం 4 గంటల్లోనే 2 కిలోల బరువు తగ్గింది. పోలాండ్‌లో జరిగిన బాక్సింగ్ చాంపియన్‌షిప్ కోసం అక్కడికి వెళ్లేసరికి ఆమె బరువు 50 కేజీలుగా ఉంది. పోటీలకు ముందు నిర్వహించే వేయింగ్ కార్యక్రమానికి మరో 4 గంటలు సమయం మాత్రమే ఉండటంతో బరువు తగ్గించుకోవడంపై దృష్టి సారించింది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఏకబిగిన స్కిప్పింగ్ చేసింది. ఆమె పడ్డ కష్టానికి ఫలితం వచ్చింది. వేయింగ్ సమయానికి సరిగ్గా 48 కేజీల బరువుతో పోటీకి అర్హత సాధించింది. అనంతరం తన పంచ్ పవర్‌తో షరామాములుగా బంగారు పతకం గెలిచింది. దీనిపై ఆమె మాట్లాడుతూ ‘ఒకవేళ వెయింగ్‌లో 48 కేజీలకు పైబడి ఉంటే నాపై అనర్హత వేటు పడేది. అందుకే 4 గంటలపాటు తీవ్రంగా చెమటోడ్చాను. వేయింగ్ సమయానికి సరైన బరువుతో సిద్ధమయ్యాను’ అని చెప్పింది. -
రోల్ మోడల్.. మేరీకోమ్
ఆ అమ్మాయి పంచ్‌లతో ప్రత్యర్థులను మట్టికరిపిస్తోంది. పాఠశాల స్థాయిలోనే బాక్సింగ్‌లో రాణిస్తోంది. తండ్రి బాటలో నడుస్తూ... తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటోంది.ఆమే సికింద్రాబాద్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోన్న హర్మీత్ సేఠి. రాష్ట్ర స్థాయి పోటీల్లో బంగారు పతకంగెలుచుకున్న హర్మీత్... బెస్ట్ సైంటిఫిక్ బాక్సర్ అవార్డు సొంతంచేసుకుంది. రాంగోపాల్‌పేట్: తల్లిదండ్రుల సహకారం, బాక్సింగ్ కోచ్ ప్రోత్సాహంతో హర్మీత్ సేఠి బాక్సింగ్‌లో దూసుకెళ్తోంది. మారేడుపల్లికి చెందిన హర్మీత్ తండ్రి హర్మీందర్ సింగ్ కూడా బాక్సర్. ఆయన గతంలో రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో పాల్గొని బహుమతులు అందుకున్నారు. అలాగే బాడీ బిల్డింగ్‌లో మిస్టర్ ఇండియా పోటీల్లోనూ పాల్గొన్నారు. ప్రస్తుతం బాక్సింగ్ కోచ్‌గా, ఫిటనెస్ ట్రైనర్‌గా ఉన్నారు. ఈ నేపథ్యంలో తండ్రి బాటలో పయణిస్తున్న హర్మీత్... బాక్సింగ్‌పై ఆసక్తితో 2016లో జీహెచ్ఎంసీ సమ్మర్ కోచింగ్ క్యాంపులో చేరింది. అక్కడ కోచ్ కృష్ణ దగ్గర శిక్షణ తీసుకున్న ఆమె అనేక పతకాలు, అవార్డులు సొంతం చేసుకుంది. 2017లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పెద్దపల్లిలో నిర్వహించిన అండర్–17 రాష్ట్ర స్థాయి బాక్సింగ్ పోటీల్లో 54 కిలోల విభాగంలో బంగారు పతకం సాధించింది. ఆ తర్వాత డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంది. ఇప్పటికీ మారేడుపల్లిలోని నెహ్రూనగర్ పార్కులో జీహెచ్ఎంసీ కోచ్ కృష్ణ దగ్గరే శిక్షణ తీసుకుంటోంది. జాతీయపోటీలకు... తెలంగాణ బాక్సింగ్ అసోసియేషన్ ఆగస్టు 13–15 వరకు ఎల్బీ స్టేడియంలో సబ్ జూనియర్స్ గర్ల్స్ రాష్ట్రస్థాయి బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించింది. ఇందులో హర్మీత్సేఠి ఈ ఏడాది బెస్ట్ సైంటిఫిక్ బాక్సర్ అవార్డు అందుకుంది. అంతేకాకుండా 54 కిలోల విభాగంలో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకంసాధించింది. దీంతో ఆమె జాతీయ సబ్ జూనియర్స్చాంపియన్షిప్కు అర్హత సాధించింది. సెప్టెంబర్ 2–8 వరకు నాగ్‌పూర్‌లో బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహించనున్న పోటీల్లో ఆమె పాల్గొననుంది. రోల్ మోడల్.. మేరీకోమ్ బాక్సింగ్ రాణి మేరీకోమ్ నా రోల్ మోడల్. మేరీకోమ్‌లా నేనూ భారత్‌కు పతకాలు సాధించి పెట్టాలనేది నా కోరిక. చిన్నప్పటి నుంచే నాకు బాక్సింగ్ అంటే ఇష్టం. అందుకే ఇందులోకి వచ్చాను. నా తల్లిదండ్రులు, కోచ్ కృష్ణ గారు నన్నెంతోప్రోత్సహిస్తున్నారు. – హర్మీత్ సేఠి -
అభేద్య బాక్సర్
బురదలో పుట్టినా పద్మంలా వికసించిన ఎం.సి.మేరి కోమ్ ఆత్మకథ, అన్బ్రేకబుల్. మణిపుర్ సాధారణ అమ్మాయి ఆమె. తండ్రి వ్యవసాయ కూలీగా చేస్తూనే, మోతుబరి రైతు పొలం కౌలుకి తీసుకుని వ్యవసాయం చేసేవాడు.కోమ్ సమాజంలో మగవాళ్లు చదువుకునేవాళ్లు, ఆడవాళ్లు పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళేవాళ్లు. ఆమె తండ్రి భిన్నంగా ఆలోచించి బడిలో చేర్చడంతో జీవితం మలుపు తిరిగింది. బడి నుండి వచ్చిన తరువాత, వెళ్ళే ముందు ఇంటి పనుల్లో అమ్మకూ, పొలం పనుల్లో నాన్నకూ సాయం చేసేది. వారున్న గ్రామానికి విద్యుత్ సదుపాయం లేనందున పత్తి వత్తితో చేసిన దీపంలో కిరోసిన్ పోసి ఇల్లంతటికీ అదే వెలుగు ఇస్తుండగా చదువుకునేది. ఆటలంటే మోజు ఉంది కానీ తండ్రికి ఇష్టం లేదు. శరీర సౌష్ఠవం కోసం బలమైన ఆహారం, పోటీల్లో పాల్గొనడానికి తరచూ ప్రయాణాలకయ్యే ఖర్చు కోసం ఆలోచించేవాడు. కుమార్తె పట్టుదల చూసి అంగీకరించక తప్పలేదు. ఎస్.ఎ.ఐ.లో బాక్సింగ్ శిక్షణ కోసం ఇంఫాల్‌లో అద్దె ఇంట్లో గడిపిన రోజుల్లో వంట చేయడానికి బియ్యం నిండుకోవడం, చేతిలో డబ్బు లేకపోవడం వలన నాలుగు గంటలు సైకిలు తొక్కుతూ కాంగతైలోని ఇంటికి వెళ్లి బియ్యం తెచ్చుకున్న విషయం ఆమె మరచిపోలేదు. కష్టాలలో గడపడం వలన బాక్సింగ్‌కు అవసరమైన కష్ట సహిష్ణుత, సహనం అలవాటయినట్టు చెప్పుకుంది. రోజూ ఆరు గంటలు వ్యాయామం చేస్తూ శత్రువుని ఓడించడానికి ఉత్తమ మార్గం వేగంగా, తీవ్రంగా విజృంభించడమే అన్న అవగాహన పెంచుకుంది. తండ్రి వ్యవసాయం చేస్తూ, తల్లి బట్టలు నేస్తూ సంపాదించేది తక్కువ కావడంతో పంపించిన 50, 100 రూపాయలతోనే సర్దుకునేది. బాక్సింగ్ సామగ్రి ఖరీదైనది కాబట్టి అవేవీ లేకుండానే శిక్షణలో చేరింది. సౌకర్యవంతమైన బూట్లు కావాల్సినప్పటికీ స్థోమత లేక చౌక బూట్లు కొని సాధన చేసింది. ఎన్నో కష్టాలకు ఓర్చి ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నత స్థానానికి చేరిన మేరి కోమ్ 5 సార్లు వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్ అయ్యింది. 2012 సమ్మర్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ఏకైక భారత మహిళా బాక్సర్ అయ్యి, 51 కిలోల విభాగంలో కాంస్య పతకం గెలిచి దేశ జెండాను గర్వంగా ఎగరేసింది. 2014 ఏసియన్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళా బాక్సర్ అయ్యింది. అలాగే 2018 కామన్వెల్త్ గేమ్స్‌లోనూ బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళా బాక్సర్ అయ్యింది. ఫుట్‌బాల్ ఆటగాడు ఆన్లెర్తో ప్రేమలో పడి, పెళ్లి చేసుకుని, ముగ్గురు పిల్లల తల్లి అయ్యాక ఇవన్నీ సాధించిందని మరవకూడదు. ఈ అన్ని విషయాలనూ క్షుణ్ణంగా ఈ ఆత్మకథ ఆవిష్కరించింది. తండ్రి రుణం తీర్చుకున్న కూతురులా నిలవాలని ఆయనకు బొలెరో కారు బహూకరించింది. ఇంగ్లిష్‌లో ‘అన్బ్రేకబుల్’గా వచ్చిన కోమ్ ఆత్మకథను డాక్టర్ డి.వి.సూర్యారావు ‘అభేద్యం’ పేరుతో తెలుగులోకి అనువదించగా ‘రీమ్’ ప్రచురించింది. నారంశెట్టి ఉమామహేశ్వరరావు -
ముగిసిన కామన్వెల్త్ గేమ్స్
గోల్డ్‌కోస్ట్ : కామన్వెల్త్ గేమ్స్-2018 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ ముగింపు వేడుకల్లో భారత అథ్లెట్ల బృందానికి బాక్సింగ్ దిగ్గజం మేరికోమ్ నేతృత్వం వహించారు. త్రివర్ణపతకాన్ని చేతపట్టుకోని నడుస్తూ.. కామన్వెల్త్ గేమ్స్‌కు ముగింపు పలికారు. ఈ 21వ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పంట పండింది. 26 స్వర్ణాలు, 20 రజతాలు, 20 కాంస్యలను భారత అథ్లెట్లు సొంతం చేసుకున్నారు. మొత్తం 66 పతకాలతో భారత్ మూడోస్థానంలో నిలిచింది. 198 పతకాలతో(80 స్వర్ణాలు,59 రజతాలు, 59 కాంస్యాలు) ఆస్ట్రేలియా తొలి స్థానంలో ఉండగా 136 పతకాలతో(45 స్వర్ణాలు, 45 రజాతాలు, 46 కాంస్యలతో) ఇంగ్లండ్ రెండోస్థానంలో నిలిచింది. చివరిదైన11వ రోజు భారత్ 1 స్వర్ణం, 4 రజతాలు, 1 కాంస్యలతో ఏడు పతకాలను సొంతం చేసుకుంది. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్‌లో 21-18, 23-21 తేడాతో పీవీ సింధుపై నెగ్గిన సైనా నెహ్వాల్‌కు బంగారు పతకం సొంతమైంది. ఇక ఓడిన పీవీ సింధు రజతం సాధించారు. పురుషుల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో శ్రీకాంత్ రజత పతకం గెలుపొందారు. టేబుల్ టెన్నిస్‌లో శరత్ కమల్ కాంస్య పతకం సాధించగా.. స్క్వాష్ మహిళల డబుల్స్ ఫైనల్లో భారత్ స్టార్లు జోష్నా చిన్నప్ప, దీపికా పల్లికల్ కార్తీక్‌లు రజత పతకాలు గెలుపొందారు. ఇక పతకాల జాబితాలో కెనడా 82, న్యూజిలాండ్ 46, దక్షిణాఫ్రికా 37, వాలేస్ 36, స్కాట్లాండ్ 44, నైజిరియా 24, సైప్రస్ 14, జమైకా 27, మలేసియా 24, కెన్యా 17, నార్త్ ఐర్లాండ్ 12 పతకాలు సాధించాయి. -
ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే..నా భర్త కూడా ఆపలేరు
గోల్డ్‌కోస్ట్ : గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో పసిడి పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ తన విజయ రహస్యాన్ని వెల్లడించారు. ఫిట్నెస్ను కాపాడుకోవడం ద్వారానే 35 ఏళ్ల వయస్సులోనూ తాను రాణించగలుగుతున్నానని పేర్కొన్నారు. 48 కేజీల విభాగంలో స్వర్ణ పతకం నెగ్గిన తర్వాత మేరీకోమ్ మీడియాతో మాట్లాడారు. ప్రత్యర్థిని నిలువరించేందుకు ముందుగానే ప్రణాళికలను సిద్ధం చేసుకుంటానని.. తద్వారా సులువుగా విజయం సాధించే అవకాశం ఉంటుందన్నారు. గాయాల బెడద లేకపోవడం తనకు కలిసొచ్చే అంశమని తెలిపారు. ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయితే.. ఈవెంట్లు లేని సమయంలోనూ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటానని క్రీడల పట్ల తనకున్న నిబద్ధతని చాటుకున్నారు. బౌట్లు లేని సమయంలోనూ ఇలా కష్టపడడం అవసరమా అంటూ తన భర్త ప్రేమగా కోప్పడతారని.. అయినప్పటికీ ప్రాక్టీస్ చేయకుండా ఆయన నన్ను ఆపలేరని సరదాగా వ్యాఖ్యానించారు. ఒక్కసారి మైండ్‌లో ఫిక్స్ అయిపోతే అనుకున్న పనిని పూర్తిచేసేదాకా ఎవరి మాటా విననన్నారు. 2020 ఒలింపిక్ క్రీడల్లో పాల్గొనే అంశంపై ప్రశ్నించగా.. ఆ విషయంపై ఇప్పుడే ఏం చెప్పలేనన్నారు. ప్రస్తుతం 48 కేజీల బరువున్న తాను ఒలింపిక్స్‌లో 51 కేజీల విభాగంలో పోటీపడాల్సి ఉంటుందని, అప్పటికీ ఫిట్నెస్ను ఇలాగే కాపాడుకోగలిగితే తప్పక పాల్గొంటానని పేర్కొన్నారు. ముగ్గురు పిల్లలకు తల్లైన తర్వాత కూడా పతకాల వేట కొనసాగిస్తున్న మేరీకోమ్ ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. రియో ఒలింపిక్స్‌లో బ్రాంజ్ మెడల్ సాధించిన మేరీకోమ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ పతకం నెగ్గిన భారత తొలి మహిళా బాక్సర్‌గా రికార్డు సృష్టించారు. -
కామన్వెల్త్ గేమ్స్.. భారత్‌కు భారీగా పతకాలు
గోల్డ్‌కోస్ట్: ఆస్ట్రేలియాలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు సత్తా చాటుతున్నారు. అద్భుతంగా రాణిస్తూ వరుసగా పతకాలు సాధిస్తున్నారు. శనివారం భారత్ ఖాతాలో మరిన్ని స్వర్ణాలు వచ్చి చేరాయి. ఈ రోజు భారీగా పతకాలు దక్కడంతో భారత్ పతకాల విషయంలో అర్ధ సెంచరీని దాటింది. మెడల్స్ పట్టికలో ప్రస్తుతం భారత్ 50 పతకాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. భారత్ ఖాతాలో 23 స్వర్ణాలు, 13 రజతాలు, 15 కాంస్య పతకాలు ఉన్నాయి. సీనియర్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరికోమ్ మరోసారి సత్తా చాటింది. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ఆమె స్వర్ణ పతకాన్ని సాధించింది. 45-48 కేజీల విభాగంలో ఫైనల్లో ప్రత్యర్థిని మట్టికరిపించి ఆమె భారత్‌కు గోల్డ్ మెడల్ అందించింది. మహిళల 50 కిలోల ఫ్రీస్టయిల్ పోటీల్లో రెజ్లర్ వినేష్ ఫొగట్, 125 కేజీల పురుషుల ఫ్రీస్టయిల్ ఈవెంట్లో రెజ్లర్ సుమిత్ గోల్డ్ మెడళ్లను సొంతం చేసుకున్నారు. జావెలింగ్ త్రో విభాగంలో నీరజా చోప్రా స్వర్ణ పతకాన్ని సాధించారు. బాక్సర్ గౌరవ్ సోలంకీ కూడా సత్తా చాటాడు. పురుషుల 52 కిలోల విభాగంలో ప్రత్యర్థిని ఓడించి స్వర్ణపతకాన్ని సొంతం చేసుకున్నాడు. షూటర్ సంజీవ్ రాజ్‌పుత్ సైతం కామన్వెల్త్ క్రీడల్లో భారత పతకాన్ని రెపరెపలాడించాడు. పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3పొజిషన్స్ ఈవెంట్లో గోల్డ్ మెడల్ సాధించాడు. రియో ఒలింపిక్స్‌లో పతకాన్ని సాధించిన రెజ్లర్ సాక్షి మాలిక్ మరోసారి సత్తా చాటి.. కామన్వెల్త్ క్రీడల్లో కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు. అటు బ్యాడ్మింటన్‌లో తెలుగు తేజాలు సైనా నెహ్వాల్, పీవీ సింధు ఫైనల్‌కు చేరడంతో స్వర్ణ, రజత పతకాలు భారత్ ఖాతాలో చేరడం ఖాయంగా మారింది. -
పసిడికి పంచ్ దూరంలో మేరీకోమ్
గోల్డ్‌కోస్ట్: తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటున్న భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీకోమ్ స్వర్ణానికి విజయం దూరంలో నిలిచింది. 48 కేజీల సెమీఫైనల్లో మేరీకోమ్ 5–0తో అనూష దిల్రుక్షి (శ్రీలంక)ని చిత్తుచేసింది. పురుషుల విభాగంలో ముగ్గురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (75 కేజీలు), గౌరవ్ సోలంకి (52 కేజీలు), మనీశ్ కౌశిక్ (60 కేజీలు) సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్య పతకాలు ఖాయం చేసుకున్నారు. సరితా దేవి (60 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో ఓటమి చవిచూశారు. బ్యాడ్మింటన్‌లో జోరు... వ్యక్తిగత విభాగంలో భారత బ్యాడ్మింటన్ ఆటగాళ్లందరూ ప్రిక్వార్టర్ ఫైనల్‌కు అర్హత పొందారు. రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో పీవీ సింధు 21–6, 21–3తో ఆండ్రా వైట్‌సైడ్ (ఫిజీ)పై, సైనా నెహ్వాల్ 21–3, 21–1తో ఎల్సీ డివిలియర్స్ (దక్షిణాఫ్రికా)పై, రుత్విక 21–5, 21–7తో గ్రేస్ అలిపాక (ఘనా)పై, శ్రీకాంత్ 21–13, 21–10తో ఆతిశ్ లుభా (మారిషస్)పై, ప్రణయ్ 21–14, 21–6తో క్రిస్టోఫర్ (మారిషస్)పై గెలిచారు. మిక్స్డ్ డబుల్స్‌లో సిక్కి రెడ్డి–ప్రణవ్ చోప్రా; సాత్విక్–అశ్విని పొన్నప్ప జంటలు కూడా ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరాయి. గ్రూప్ ‘టాపర్’... పురుషుల హాకీలో భారత జట్టు గ్రూప్ టాపర్‌గా నిలిచింది. ‘బి’ గ్రూప్ చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4–3తో ఇంగ్లండ్‌ను ఓడించి సెమీస్‌లో న్యూజిలాండ్‌తో పోరుకు సిద్ధమైంది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్, రూపిందర్ పాల్ సింగ్, వరుణ్ కుమార్, మన్దీప్ సింగ్ ఒక్కో గోల్ చేశారు. మ్యాచ్ చివరి నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్ చేసి భారత్ విజయాన్ని ఖాయం చేశాడు. శరత్, సత్యన్ ముందంజ... టేబుల్ టెన్నిస్ (టీటీ)లో భారత ఆటగాళ్లు శరత్ కమల్, సత్యన్ ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. తొలి రౌండ్లో శరత్ 4–3తో జావెన్ చూంగ్ (మలేసియా)పై, సత్యన్ 4–0తో రమీజ్ (పాకిస్తాన్)పై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో మౌమా దాస్ 4–0తో హో వాన్ కౌ (మారిషస్)పై, మధురిక 4–1తో రెన్ చుంగ్ (ట్రినిడాడ్ టొబాగో)పై నెగ్గారు. అథ్లెట్స్‌కు మిశ్రమ ఫలితాలు... అథ్లెటిక్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు వచ్చాయి. పురుషుల హైజంప్ ఫైనల్లో తేజస్విన్ శంకర్ (2.24 మీటర్లు) ఆరో స్థానంలో నిలువగా... మహిళల 400 మీటర్ల ఫైనల్లో హిమా దాస్ (51.32 సెకన్లు) తన అత్యుత్తమ సమయాన్ని నమోదు చేసి ఆరో స్థానాన్ని దక్కించుకుంది. మరోవైపు మహిళల లాంగ్‌జంప్‌లో నయన జేమ్స్, నీనా వరాకిల్ క్వాలిఫయింగ్‌లో వరుసగా 9, 12 స్థానాలు సాధించి ఫైనల్‌కు చేరారు. దీపిక జంట విజయం... మహిళల స్క్వాష్ డబుల్స్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ జంట దీపిక పళ్లికల్–జోష్నా చినప్ప క్వార్టర్ ఫైనల్ చేరింది. ఈ జోడీ మూడో లీగ్ మ్యాచ్‌లో 11–5, 11–6తో కెల్లాస్–కొలెట్టే సుల్తానా (మాల్టా)పై గెలుపొందింది. అంతకుముందు జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయాలు సాధించిన ఈ జోడీ గ్రూప్ టాపర్‌గా క్వార్టర్స్‌కు అర్హత సాధించింది. -
పసిడి పోరుకు మేరీకోమ్
గోల్డ్‌కోస్ట్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత మహిళా బాక్సర్ మేరీకోమ్ పంచ్ అదిరింది. బుధవారం జరిగిన సెమీ ఫైనల్లో మేరీకోమ్ 5-0 తేడాతో శ్రీలంక బాక్సర్ అనూష దిల్రుక్షిపై గెలిచి ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఫలితంగా మేరీకోమ్ రజత పతకం ఖాయం చేసుకుంది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న మేరీకోమ్ మహిళల 48 కేజీల కేటగిరీలో భాగంగా మొత్తం ఐదు రౌండ్లు పాటు జరిగిన సెమీస్‌లో ఏకపక్ష విజయాన్ని నమోదు చేసింది. మేరీకోమ్ 30-27, 30-27, 30-27, 30-27, 30-27 తేడాతో అనూష దిల్రుక్షిపై గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం జరిగే పసిడి పోరులో ఉత్తర ఐర్లాండ్ క్రిస్టినా ఓ హరాతో మేరీకోమ్ తలపడనుంది. -
పంచ్ అదిరింది
మహిళల బాక్సింగ్ 48 కేజీల విభాగంలో మేరీకోమ్ సెమీఫైనల్‌కు చేరి కనీసం కాంస్యం ఖాయం చేసుకుంది. తొలిసారి కామన్వెల్త్ గేమ్స్‌లో ఆడుతున్న మేరీకోమ్ క్వార్టర్ ఫైనల్లో 5–0తో మెగాన్ గార్డన్ (స్కాట్లాండ్)ను ఓడించింది. 69 కేజీల క్వార్టర్ ఫైనల్లో లవ్లీనా బోర్గోహైన్ (భారత్) 2–3తో స్యాండీ రియాన్ (ఇంగ్లండ్) చేతిలో ఓడిపోయింది. మరోవైపు పురుషుల 75 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్లో వికాస్ కృషన్ 5–0తో సోమర్విల్లె క్యాంప్‌బెల్ (ఆస్ట్రేలియా)పై గెలిచాడు. -
సింధు సారథ్యంలో టీమిండియా..
న్యూఢిల్లీ : తెలుగు తేజం పీవీ సింధుకు అరుదైన అవకాశం లభించింది. గోల్డ్ కోస్ట్(ఆస్ట్రేలియా)లో జరుగనున్న కామన్వెల్త్ గేమ్స్ ప్రారంభోత్స వేడుకలో త్రివర్ణ పతాకాన్ని చేతబట్టి భారత జట్టుకు సారథ్యం వహించనున్నారామె. ఏప్రిల్ 4న కరారా స్టేడియంలో సాయంత్రం 7 గంటల నుంచి (స్థానిక కాలమానం ప్రకారం) ప్రారంభవేడుకలు జరుగుతాయని, ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని నిర్వాహకులు చెప్పారు. దాదాపు 300 మంది భారత అథ్లెట్లు వివిధ క్రీడాంశాల్లో పాల్గొంటారు. తన కంటే సీనియర్లైన మేరీ కోమ్, సైనా నెహ్వాల్‌లు కూడా కామన్వెల్త్లో పాల్గొంటున్నప్పటికీ ఈ అవకాశం మాత్రం సింధూకే దక్కడం గమనార్హం. ప్రస్తుతం సింధూ దేశంలోనే గొప్ప అథ్లెట్‌గా గుర్తింపు పొందారని, అందుకే ఆమెకు ఈ బాధ్యతలు అప్పజెప్పామని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
తొలి భారత బాక్సర్‌గా...
సోఫియా(బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లోభారత బాక్సర్ వికాస్ క్రిషన్ చరిత్ర సృష్టించాడు. ఈ టోర్నమెంట్లో స్వర్ణం గెలిచిన తర్వాత బెస్ట్ బాక్సర్ అవార్డును వికాస్ సొంతం చేసుకున్నాడు. తద్వారా ఈ బాక్సింగ్ టోర్నమెంట్లో బెస్ట్ బాక్సర్ అవార్డును గెలుచుకున్న మొదటి భారత బాక్సర్‌గా వికాస్ నిలిచాడు. సోఫియా వేదికగా 75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన తుది పోరులో వికాస్ విజయ సాధించి పసిడిని సొంతం చేసుకున్నాడు. అదే సమయంలో ఈ టోర్నమెంట్లో అత్యుత్తమ బాక్సర్ అవార్డును సైతం సొంతం చేసుకుని కొత్త అధ్యాయాన్ని లిఖించాడు. ఫైనల్ పోరులో వరల్డ్ చాంపియన్స్ కాంస్య పతక విజేత ట్రో ఇస్లే(అమెరికా)పై గెలిచి స్వర్ణాన్ని సొంతం చేసుకున్నాడు. ఫలితంగా గతేడాది ఆసియా చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకం సాధించిన తర్వాత తొలి పతకాన్ని అందుకున్నాడు. మరొకవైపు మరో భారత బాక్సర్ అమిత్ పంగల్ కూడా పసిడిని ఒడిసి పట్టుకున్నాడు. 49 కేజీల విభాగంలో అమిత్ స్వర్ణాన్ని సాధించాడు. ఇక మహిళల తుది పోరులో మేరీకోమ్ రజతంతో సరిపెట్టుకుంది. దాంతో ఇక్కడ వరుసగా మూడో స్వర్ణ పతకాన్ని సాధించాలనుకున్న మేరీకోమ్‌కు నిరాశే ఎదురైంది. 48 కేజీల విభాగంలో బల్గేరియాకు చెందిన సెవదా అసెనోవా చేతిలో మేరీకోమ్ ఓటమి పాలై రజత పతకానికే పరిమితమయ్యారు. స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత జట్టు 11 పతకాలతో పోరును ముగించింది. ఇందులో ఐదు పతకాలు పురుషులు సాధించగా, ఆరు పతకాల్ని మహిళలు సొంతం చేసుకున్నారు. ఇక్కడ రెండు స్వర్ణ పతకాలు, మూడు రజత పతకాలు, ఆరు కాంస్య పతకాలు భారత్ ఖాతాలో చేరడం విశేషం. -
పసిడి పోరుకు మేరీకోమ్
సోఫియా (బల్గేరియా): స్ట్రాండ్జా స్మారక అంతర్జాతీయ బాక్సింగ్ టోర్నమెంట్లో భారత మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ స్వర్ణ పతకానికి మరో విజయం దూరంలో ఉంది. శుక్రవారం జరిగిన మహిళల 48 కేజీల విభాగం సెమీఫైనల్లో యె జియాలీ (చైనా)పై మేరీకోమ్ గెలిచింది. పురుషుల విభాగంలో తెలంగాణ బాక్సర్ హుస్సాముద్దీన్ (56 కేజీలు), అమిత్ (49 కేజీలు), వికాస్ (75 కేజీలు), సతీశ్ (ప్లస్ 91 కేజీలు), గౌరవ్ (52 కేజీలు) సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు. -
ఆసియా బాక్సింగ్ ‘రాణి’ మేరీకోమ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ ఫైనల్లో విజయం సాధించి భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన 34 ఏళ్ల మేరీకోమ్ బుధవారం ఇక్కడ జరిగిన ఫైనల్లో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)పై 5-0తో ఏక్షపక్ష విజయాన్ని సొంతం చేసుకుంది. కాగా, 48 కేజీల విభాగంలో మేరీకోమ్‌కి ఇదే తొలి స్వర్ణం కావడం విశేషం. ఈ చాంపియన్‌షిప్‌లో ఓవరాల్‌గా ఆరుసార్లు ఫైనల్స్‌కు చేరుకున్న మేరీకోమ్ ఐదు స్వర్ణాలు సాధించగా, ఓ సారి రజతంతో సరిపెట్టుకుంది. ఒలింపిక్స్ కోసమని గతంలో 51 కేజీల విభాగానికి మారిన మేరీకోమ్ ఇటీవలే తన పాత వెయిట్ కేటగిరీ 48 కేజీలకు మారిన విషయం తెలిసిందే. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 5-0తో సుబాసా కొమురా (జపాన్)పై ఏకపక్ష విజయాన్ని సాధించిన మేరీకోమ్.. నేటి ఫైనల్లోనూ అదేజోరు ప్రదర్శించింది. ఫలితంగా బుధవారం ప్రత్యర్థి కిమ్ హ్యాంగ్ మిని తన పంచులతో ఓ ఆటాడుకున్న మేరీకోమ్ సగర్వంగా ఈ చాంపియన్‌షిప్‌లో ఐదోసారి స్వర్ణాన్ని ముద్దాడింది. -
‘పసిడి’ పోరుకు మేరీకోమ్, సోనియా
హో చి మిన్ సిటీ (వియత్నాం): గతంలో ఐదుసార్లు విశ్వవిజేతగా నిలిచిన భారత మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ ఇదే ఘనతను ఆసియా స్థాయిలోనూ పునరావృతం చేసేందుకు విజయం దూరంలో నిలిచింది. ఇక్కడ జరుగుతున్న ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో మేరీకోమ్ (48 కేజీలు)తోపాటు సోనియా లాథెర్ (57 కేజీలు) ఫైనల్లోకి దూసుకెళ్లారు. అయితే సరితా దేవి (64 కేజీలు), ప్రియాంక (60 కేజీలు), లవ్లీనా (69 కేజీలు), సీమా పునియా (ప్లస్ 81 కేజీలు), శిక్ష (54 కేజీలు) సెమీఫైనల్లో ఓడిపోయి కాంస్య పతకాలతో సరిపెట్టుకున్నారు. ఒలింపిక్స్ కోసమని గతంలో 51 కేజీల విభాగానికి మారిన మేరీకోమ్ ఇటీవలే తన పాత వెయిట్ కేటగిరీ 48 కేజీలకు మారింది. మంగళవారం జరిగిన సెమీఫైనల్లో 34 ఏళ్ల మేరీకోమ్ 5–0తో సుబాసా కొమురా (జపాన్)పై ఏకపక్ష విజయాన్ని సాధించింది. బుధవారం జరిగే ఫైనల్లో కిమ్ హ్యాంగ్ మి (ఉత్తర కొరియా)తో మేరీకోమ్ తలపడుతుంది. ఆరోసారి ఆసియా చాంపియన్‌షిప్ ఫైనల్లోకి ప్రవేశించిన మేరీకోమ్ నాలుగుసార్లు స్వర్ణ పతకాలు సాధించి, మరోసారి రజతం గెలిచింది. మరో సెమీఫైనల్లో యోగ్దోరాయ్ మిర్జయెవా (ఉజ్బెకిస్తాన్)పై సోనియా గెలిచి యిన్ జున్హువా (చైనా)తో బుధవారం జరిగే ఫైనల్ పోరుకు సిద్ధమైంది. ఇతర సెమీఫైనల్స్‌లో డూ డాన్ (చైనా) చేతిలో సరితా దేవి; లిన్ యు టింగ్ (చైనీస్ తైపీ) చేతిలో శిక్ష; యోన్జీ (కొరియా) చేతిలో ప్రియాంక; ఖల్జోవా (కజకిస్తాన్) చేతిలో లవ్లీనా; ఇస్మతోవా (కజకిస్తాన్) చేతిలో సీమా పునియా ఓడారు. -
ఐదో స్వర్ణంపై గురి..!
హో చి మిన్ సిటీ (వియ త్నాం):ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్ షిప్ మీట్ లో భారత బాక్సర్ మేరీకోమ్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్లో భాగంగా 48 కేజీల విభాగంలో మేరీకోమ్ 5-0 తేడాతో సుబాసా కొమురా (జపాన్)పై గెలిచి ఫైనల్లోకి ప్రవేశించింది. గతంలో ఈ చాంపియన్ షిప్ లో నాలుగుసార్లు స్వర్ణ పతకాన్ని గెలిచిన మేరీకోమ్.. మరో పసిడి పోరుకు సిద్ధమైంది. ఆసియా చాంపియన్ షిప్ మీట్ లో తనపై పెట్టుకున్న అంచనాలను నిజం చేస్తూ మేరీకోమ్ ఫైనల్లోకి ప్రవేశించింది. బౌట్ తరువాత తన ప్రదర్శనపై మేరీకోమ్ సంతోషం వ్యక్తం చేసింది.. గత కొన్నేళ్లుగా తన దేశం కోసం పోరాడటం ఎంతో అద్భుతమైన అనుభూతిని కల్గిస్తూ ఉందని స్పష్టం చేసింది. ఇక్కడ ప్రత్యేకంగా బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(బీఎఫ్ఐ) ప్రెసిడెంట్ అజయ్ సింగ్ కు కృతజ్ఞతలు తెలియజేసింది. ఆయన సహకారంతోనే ఇదంతా సాధ్యమైందని మేరీకోమ్ పేర్కొంది. ఇదిలా ఉంచితే, ఫైనల్ కు చేరిన మేరీకోమ్ పై మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ప్రశంసలు కురిపించాడు. ఫైనల్ పోరులో మరింత శక్తితో రాణించాలంటూ సచిన్ ఆకాంక్షించాడు. అంతకుముందు ఆసియా చాంపియన్ షిప్ లో ఐదుసార్లు తలపడిన 34 ఏళ్ల మేరీకోమ్.. నాలుగుసార్లు స్వర్ణం పతకాలు సాధించగా, ఒకసారి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. Way to go, @MangteC. My best wishes to you for the finals. More power to you, Champ. #ASBC2017Women pic.twitter.com/JKjXFUdqCx — sachin tendulkar (@sachin_rt) 7 November 2017 -
మేరీకోమ్‌కు పతకం ఖాయం
హో చి మిన్ సిటీ (వియ త్నాం): ఆసియా సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు 3 పతకాలు ఖాయమయ్యా యి. శనివారం జరిగిన క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో భారత మేటి బాక్సర్ మేరీకోమ్‌తో పాటు శిక్ష (54 కేజీలు), ప్రియాంక చౌదరి (60 కేజీలు) సెమీఫైనల్‌కు చేరుకున్నారు. తద్వారా కనీసం కాంస్య పతకాలను ఖాయం చేసుకున్నారు. ఈ టోర్నీలో గతంలో 4 స్వర్ణాలు, ఒక రజతాన్ని గెలుచుకున్న 34ఏళ్ల మేరీకోమ్ (48కేజీ) క్వార్టర్స్‌లో చైనీస్‌తైపీకి చెందిన మెంగ్ చిన్ పిన్‌పై విజయం సాధించి సెమీస్‌లో అడుగుపెట్టింది. సెమీస్‌లో సుబాసా కొమురా (జపాన్)తో మేరీకోమ్ తలపడుతుంది. 54 కేజీ విభాగం క్వార్టర్స్‌లో శిక్షా, ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఫెరాంగిజ్ ఖొషిమోవాపై, ప్రియాంక శ్రీలంకకు చెందిన డులాంజని లంకపురయాలగేపై గెలుపొందింది. సెమీస్‌లో శిక్షా.. లిన్ యు టింగ్ (చైనీస్ తైపీ)తో తలపడుతుంది. -
సెమీస్ లో మేరీకోమ్
హో చి మిన్ సిటీ (వియత్నాం): తన పాత వెయిట్ కేటగిరికి మారిపోయాక బరిలోకి దిగిన తొలి అంతర్జాతీయ టోర్నమెంట్లో భారత స్టార్ బాక్సర్ మేరీకోమ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తోంది. ఆసియా మహిళల చాంపియన్ షిప్ లో భాగంగా శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో 48 కేజీల విభాగంలో చైనీస్ తైపీ బాక్సర్ మెంగ్ చియె పింగ్ పై మేరీకోమ్ విజయం సాధించి సెమీస్ లోకి ప్రవేశించారు. తద్వారా పతకాన్ని ఖాయం చేసుకుంది మేరీకోమ్. ఈ చాంపియన్ షిప్ లో మేరీకోమ్ తో పాటు శిక్షా(54 కేజీలు, ప్రియాంక చౌదరి(60 కేజీలు)లు సైతం సెమీస్ కు చేరారు. అంతకుముందు ఆసియా చాంపియన్ షిప్ లో ఐదుసార్లు తలపడిన 34 ఏళ్ల మేరీకోమ్.. నాలుగుసార్లు స్వర్ణం పతకాలు సాధించగా, ఒకసారి రజత పతకాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. సెమీఫైనల్లో జపాన్ బాక్సర్ సుబాసా కోమురాతో మేరీకోమ్ తలపడనుంది. -
ఐఓసీలో ‘ఐబా’ ప్రతినిధిగా మేరీకోమ్
న్యూఢిల్లీ: ఐదు సార్లు ప్రపంచ చాంపియన్ అయిన భారత మహిళా బాక్సర్ మేరీకోమ్‌కు అరుదైన అవకాశం దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) అథ్లెట్స్ ఫోరమ్‌లో ఆమె అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ–ఐబా) ప్రతినిధిగా పాల్గొననుంది. దీంతో ఈ ఘనత సాధించిన తొలి భారత క్రీడాకారిణిగా ఆమె నిలిచింది. 33 ఏళ్ల మణిపూర్ స్టార్ బాక్సర్ గతేడాది ‘ఐబా’ లెజెండ్స్ అవార్డు అందుకుంది. రాజ్యసభ ఎంపీ అయిన ఆమె... నవంబర్ 11 నుంచి 13 వరకు లుసానేలో జరిగే ఎనిమిదో ఐఓసీ అథ్లెట్స్ ఫోరమ్‌లో ఐబా ప్రతినిధిగా వ్యవహరిస్తుంది. ‘ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లు ఈ ఫోరమ్‌లో పాల్గొని తమ అభిప్రాయాల్ని పంచుకోవడమే ఈ వేదిక ఉద్దేశం’ అని ఐబా... భారత బాక్సింగ్ సమాఖ్య అధ్యక్షుడు అజయ్ సింగ్‌కు లేఖ రాసింది. అయితే వియత్నాంలో నవంబర్ 2 నుంచి 12 వరకు ఆసియా బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరగనుంది. ఈ టోర్నీ కోసం జరిగే ట్రయల్స్‌లో మేరీకోమ్ ఎంపికైతే అథ్లెట్స్ ఫోరమ్‌లో పాల్గొనడంపై అనిశ్చితి నెలకొంటుంది. -
ప్రధాని మంచి పనిచేశారు..
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్టార్ బాక్సర్ మేరీ కోమ్ అభినందించారు. ఎలాంటి కష్టాలు లేకుండా జీవితంలో ఏ మంచిని సాధించలేమని తెలిపారు.అన్ని సర్దుకునే వరకు కొంత ఆందోళనకర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను తాను అర్థం చేసుకోగలనని, కానీ భవిష్యత్తు ప్రయోజనాల కోసం ఈ అడుగు చాలా కీలకమన్నారు. పెద్దనోట్ల రద్దు ప్రజల్లో మార్పు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తంచేశారు. వివిధ రూపాల్లో భారత్‌లో బ్లాక్‌మనీ విజృంభిస్తుందని, ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయాన్ని తప్పనిసరిగా అభినందించి తీరాల్సిందేనని కోమ్ తెలిపారు. ‘‘ ఇది భారత్‌లో మార్పు తీసుకుస్తుందని నేను భావిస్తున్నా. ముఖ్యంగా పేద ప్రజలు ఎక్కువగా ఇబ్బందులు పడుతున్నారు. కానీ ఇవి కొన్నిరోజులే. కష్టం లేనిదే ఎలాంటి ఫలితం దక్కదు. కచ్చితంగా భవిష్యత్తులో లబ్ది పొందుతామనే ఆశ ఉంది’’అని ఒలంపిక్ మెడలిస్ట్ పేర్కొన్నారు. ఇంతపెద్ద సంచలన నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోదీకి సెల్యూట్ చేయాల్సిందేనని లెజెండరీ అథ్లెట్ మిల్కా సింగ్ తెలిపారు. భవిష్యత్తు తరం వారికి ఈ నోట్ల రద్దు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదరికాన్ని కొంతమేర తగ్గించవచ్చన్నారు. చెప్పడం తేలికే.. కానీ అమల్లోకి తీసుకురావడమే కష్టం. అలాంటిది మోదీ నెరవేర్చారని, గ్రేట్ జాబ్ నిర్వహించారని కొనియాడారు. పేద పిల్లలు చదువుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని మిల్కా సింగ్ చెప్పారు. -
మేరీ మమ్మీ
ఫస్ట్ పర్సన్ హిందీలో మేరీ అంటే ‘నా’.. మమ్మీ అంటే అమ్మ.. మేరీ మమ్మీ అంటే నా అమ్మ! ప్రతి కొడుకుకి ఉండాల్సిన మమ్మీ మేరీ కోమ్!! తన కొడుకులకు రాసుకున్న ఉత్తరం అనువాదమిది! మన ఇళ్లల్లో కూడా ‘వాడికేం.. మగాడు’ అన్న మాట తరచూ వింటూంటాం.. అంటే తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి మగపిల్లలకు ఏం చేసినా చెల్లుతుంది అని చెప్తున్నారన్నమాట! చెల్లదు .. అని చెప్తుంది మేరీ! ‘నో ’ అంటే ‘నో’!! డియర్ సన్స్.. ఎందుకో ఈ రోజు మీకు ఈ ఉత్తరం రాయాలనిపించింది. మన దగ్గర అమ్మాయిలకు గౌరవం లేదు. అబ్బాయిలుగా మీకూ ఒక ముక్కు, రెండు కళ్లు, రెండు చెవులు, మెదడు ఉన్నట్టే అమ్మాయిలుగా మాకూ ఉంటాయి. శరీరంలోని కొన్ని భాగాలు మాత్రమే మీ నుంచి మమ్మల్ని వేరు చేస్తున్నాయి. అంతమాత్రాన మేం సెకండ్ సిటిజన్స్ కాము కదా! మీలాగే మేమూ మెదడుతో ఆలోచిస్తాం... మనుసుతో ఫీలవుతాం! ఇలాంటి పెద్ద విషయాలను పదేళ్లయినా నిండని మీతో ఎందుకు చెప్తున్నానంటే.. కనీసం ఈ వయసు నుంచయినా అమ్మాయిలను అర్థం చేసుకోవడం నేర్చుకుంటారని.. అమ్మాయిల విషయంలో సున్నితంగా ప్రవర్తించడం అలవడుతుందని! నాకూ తప్పలేదు.. మన దేశంలో ప్రతిరోజూ ఎక్కడో ఒకచోట ఆడపిల్లలు ఈవ్‌టీజింగ్‌కి, సెక్సువల్ అబ్యూజ్కి, లైంగికదాడికి గురవుతూనే ఉన్నారు. ఎవరో ఆడపిల్లల దాకా ఎందుకు కన్నలూ.. మీ అమ్మనైన నేనూ లైంగిక దాడికి గురయ్యాను. అప్పుడు నాకు పదిహేడేళ్లు.. ఉదయం ఎనిమిదన్నరకు రిక్షాలో బాక్సింగ్ ట్రైనింగ్‌కి వెళ్తున్నా.. పక్కనుంచి సైకిల్ మీద వెళ్తున్న ఓ వ్యక్తి హఠాత్తుగా నా మీదకు వంగి నా యెదను తడుతూ వెళ్లిపోయాడు. ఒక్క క్షణం షాక్ అయ్యాను. కోపంతో రగిలిపోయాను. వెంటనే రిక్షాలోంచి దూకి, చెప్పుల్ని తీసి చేత్తో పట్టుకొని వాడిని వెంబడించాను. కాని వాడు తప్పించుకొని పారిపోయాడు. అరే వాడిని పట్టుకోలేకపోయానే అనే బాధ ఇప్పటికీ వెంటాడుతుంది. వాడు దొరికి ఉంటే అప్పటికే నేను నేర్చుకున్న కరాటేను వాడి మీద ప్రాక్టిస్ చేసేదాన్ని. ఇంకోసారి.. ఢిల్లీ, హిస్సార్‌లో కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది నాకు, నా ఫ్రెండ్స్‌కి. ట్రైనింగ్ క్యాంప్‌లో ఓ సాయంకాలం.. వాకింగ్ చేస్తుంటే! ఎందుకు విషయం అవుతోంది? ఆ సంఘటనల తర్వాత మమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్లను వదిలి.. మమ్మల్నే మాటలన్నారు. అమ్మాయిలను చూస్తే చాలు.. వాళ్ల వక్షస్థలాన్ని తాకాలని, పిరుదుల మీద తట్టాలని ఎందుకనుకుంటారు ఈ మగవాళ్లు? అమ్మాయిలున్నది అలాంటి వెకిలి ఆనందాలను పంచడానికి కాదు. అమ్మాయిలను బలవంతంగా తాకి అబ్బాయిలు పొందే సంతోషమేంటో నాకిప్పటికీ అర్థంకాదు! అమ్మాయిల మీద లైంగిక దాడి జరిగిందంటే చాలు.. వాళ్లు వేసుకున్న బట్టలు ఎందుకు చర్చకొస్తాయి? వాళ్లు ఆ టైమ్‌లో బయటకు ఎందుకు వెళ్లారనేది ఎందుకంత ఇంపార్టెంట్ అవుతుంది? ఒరేయ్.. ఈ ప్రపంచం మీకెంత సొంతమో.. మాకూ అంతే కదా? మరి మాకెందుకు ఇన్ని రిస్ట్రిక్షన్స్? స్వేచ్ఛగా బయటకు వెళ్లడానికి అమ్మాయిలెందుకు వెనకాముందు ఆలోచించాలి? మీకు అర్థం కావాలి.. మీరు పెరుగుతున్నారు. అందులోనూ అబ్బాయిలు.. అందుకే మీకు అర్థంకావాలని చెప్తున్నానురా.. రేప్, అబ్యూజ్, ఈవ్ టీజింగ్, సెక్సువల్ హెరాస్మెంట్.. ఇవన్నీ నేరాలే. వీటికి తీవ్రమైన శిక్షలుంటాయి.. ఉన్నాయి.. ఉండాలి కూడా! కన్నలూ.. ఎప్పుడైనా ఎవరైనా ఆడపిల్లలను ఏడిపించడం మీరు చూస్తే వెంటనే వెళ్లి ఆ అమ్మాయిలకు సాయం చేయండి.. ధైర్యం చెప్పండి.. వాళ్లకు అండగా నిలబడండి.. మీ అమ్మగా మీ నుంచి నేను కోరుతున్నదిదే! రెస్పెక్ట్ విమెన్! అత్యంత విషాదమేంటంటే.. ఈ సమాజంలో సమంగా గౌరవం పొందాల్సిన మేము నిర్లక్ష్యానికి గురికావడం! మన దేశ రాజధాని ఢిల్లీలో.. కొన్ని వందల మంది అమ్మాయిలు రేప్‌కి గురయ్యారు. గురవుతూనే ఉన్నారు. ఎవ్వరూ ఆ అన్యాయాలను ఆపట్లేదు సరికదా కనీసం ప్రశ్నించడం లేదు. మీరు అలా కాదు.. మనిల్లు వేరు. అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరూ సమానమనే వాతావరణంలో మీరు పెరుగుతున్నారు. దీనికి సరైన ఉదాహరణ మీ నాన్నే. ఆయన మీ ఫ్రెండ్స్ అందరి నాన్నల్లాగా నైన్ టు ఫైవ్ జాబ్ చేయరు. బాక్సర్‌గా నా ట్రైనింగ్, జాబ్, ఇప్పుడు రాజ్యసభ సభ్యురాలిగా... ఇంటిపట్టునే ఉండడం నాకు కుదరదు. కాని మా ఇద్దరిలో ఎవరో ఒకరి అటెన్షన్ మీకు తప్పకుండా కావాలి. అందుకే ఆ బాధ్యతను మీ నాన్న తీసుకున్నారు. ఈ విషయంలో మీ నాన్నంటే నాకెంత గౌరవమో మాటల్లో చెప్పలేను. నా కోసం, మీ కోసం, ఈ ఇంటి కోసం ఆయన టైమ్‌ని, కెరీర్‌ని డెడికేట్ చేశారు. నా బలం మీ నాన్నే. ఆయన తోడులేందే నా ప్రయాణంలో ఒక్క అడుగూ ముందుకు సాగలేదు! అయితే త్వరలోనే మీరు బయటవాళ్ల నుంచి నాన్న మీద హౌజ్ హజ్బెండ్ అనే మాటలు వింటారు. ఒక్కటి గుర్తుంచుకోండి.. అలాంటి మాటలను అవమానంగా, అగౌరవంగా భావించాల్సిన పనిలేదు. ఇంటిని చూసుకునే బాధ్యత అమ్మకు మాత్రమే కాదు నాన్నకూ ఉంటుందని గ్రహించండి. రేపొద్దున మీరిలాంటి బాధ్యతను పంచుకోవాల్సి వస్తే నామోషీగా, అమర్యాదగా ఫీలవ్వకూడదు. అది అవమానం.. అది హేళన.. మీరు నా పక్కనుంచి నడుస్తుంటే కొంతమంది మీ అమ్మను ‘చింకీ’ (చట్టి ముక్కు, చిన్న కళ్లున్న చైనీస్ అనే అర్థంలో) అంటూ కామెంట్ చేయడం వింటారు. ఇప్పటికే మన రాష్ట్రానికి చెందిన చాలామంది అమ్మాయిలు వాళ్ల రూపురేఖలు, వాళ్ల వస్త్రధారణతో చింకీస్గా టార్గెట్ అవుతున్నారు. అది అవమానం. అది హేళన. అది జాత్యాహంకారం. నేను భారతీయురాలినే. మిమ్మల్నీ భారతీయులుగానే పెంచుతున్నా! భారతీయులమైనందుకు గర్వపడేలా తీర్చిదిద్దుతున్నా. తిరుబాటుదారులున్న రాష్ట్రానికి చెందినవాళ్లం. ఆ హింస నుంచి మిమ్మల్ని కాపాడుకుంటున్నా... రక్షించుకుంటున్నా. ఆ భయాలనుంచి బయటపడే ధైర్యాన్ని మీకు నూరిపోస్తున్నా. ఈ దేశ పౌరులుగా మిగిలిన అందరితో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కు మీకెలా ఉందో మహిళలకూ పురుషులతో సమానమైన గౌరవమర్యాదలు పొందే హక్కుంది. మీరు ఈ దేశ భవిష్యత్ పౌరులు. ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు, గౌరవమర్యాదలు మీ చేతుల్లో ఉన్నాయి. మహిళలను మీరు గౌరవిస్తేనే ఈ దేశ పరువు, ప్రతిష్ఠలు నిలబడుతాయి. అదే నిజమైతే.. నా దేశం నాకు ఎంతో పేరు, ప్రతిష్ఠలను ఇచ్చింది. కాని ఎమ్మెస్ ధోని, విరాట్ కొహ్లీలను గుర్తుపట్టినట్టుగా నన్ను గుర్తించరు. అలాగని ‘చింకీ’ అనే కామెంట్‌కీ నేను అర్హురాలిని కాదు కదా..! రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి నన్ను గౌరవించారు. చాలా సంతోషం. స్త్రీ సమస్యలను చర్చించే ఈ అవకాశాన్ని వదులుకోను. మహిళల మీద సాగుతున్న హింస గురించి పార్లమెంట్లో ప్రశ్నిస్తాను. ప్రజల్లో చైతన్యం తీసుకొస్తాను. అయితే సెక్సువల్ అబ్యూజ్, హెరాస్మెంట్స్ నేరాలే కావనే ముద్ర పడిపోయింది మనలో. అవి నేరాలే అనే విషయం మీకు చెప్పకపోతే.. వాటి గురించి మీకు అవగాహన పెంచకపోతే అమ్మగా నేను ఫెయిల్ అయినట్టే. అందుకే.. ఇవన్నీ చెప్పాలనే ఈ ఉత్తరం రాస్తున్నా.. శరీరాల మీద హక్కు కేవలం మగవాళ్లకే కాదు.. వాళ్ల శరీరాల మీద హక్కు స్త్రీలకూ ఉంటుంది. వాళ్లు ఒకసారి నో అని చెప్పారంటే ఆ ‘నో’ గౌరవించండి. బలవంతం చేసి వాళ్ల చావులను చూడకండి. రేప్ అనేది సెక్స్ కాదు. ఇట్ ఈజ్ ఓన్లీ మిస్ప్లేస్డ్ సెన్స్ ఆఫ్ పవర్ అండ్ రివెంజ్! నన్ను ఇబ్బంది పెట్టినవాడిని చాచి ఒక్కటి ఇవ్వగలను. అది నా బాక్సింగ్ ప్రాక్టిస్నూ పెంచుతుంది. కాని కొట్టేదాకా తెచ్చుకోవడం ఎందుకని? కోరిక చాలా అందమైంది పరస్పర అంగీకారం, ఇష్టం ఉంటే! ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. మన ఇళ్లలో చాలా సార్లు వింటాం.. వాళ్లు మగ పిల్లలు.. మగ పిల్లలు మగపిల్లలే అని. అదే నిజం అయితే మగపిల్లలుగా ఈ దేశంలో అమ్మాయి భద్రంగా, గౌరవంగా మసిలే వాతావరణాన్ని కల్పించండి! ఇట్లు మీ అమ్మ మేరీ కోమ్ -
మహిళా బాక్సింగ్‌పై మేరీకోమ్ ఆందోళన
న్యూఢిల్లీ:భారత మహిళా బాక్సింగ్‌పై స్టార్ బాక్సర్ మేరీకోమ్ ఆందోళన వ్యక్తం చేసింది. రాబోవు తరంలో భారత్ నుంచి సాధ్యమైనంత మహిళా బాక్సర్లు ప్రాతినిధ్యం వహిస్తారనే విషయం కచ్చితంగా చెప్పలేమని పేర్కొంది. 'భారత్‌లో బాక్సింగ్ పోటీలు ఎక్కువగా జరగడం లేదు. జాతీయ స్థాయిలో పోటీలు నిర్వహించడానికి పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదు. దాదాపు రెండు-మూడు సంవత్సరాల నుంచి చూస్తే భారత్‌లో జాతీయ స్థాయి బాక్సింగ్ పోటీనే జరగలేదు. ఇలా అయితే అంతర్జాతీయ పాల్గొనే భారత మహిళా బాక్సర్లు ఎక్కడ్నుంచి వస్తారు. ఇక ఏ మహిళా బాక్సర్‌ను అంతర్జాతీయ స్థాయిలో చూస్తానని నేను అనుకోవడం లేదు. గత కొన్ని సంవత్సరాల నుంచి దేశ మహిళా బాక్సింగ్ బాగా మెరుగుపడింది. దాన్ని మనం వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. యువ బాక్సర్లకు శిక్షణ ఇస్తేనే భవిష్యత్ బాక్సర్లు ఉంటారు'అని ఐదుసార్లు వరల్డ్ చాంపియన్ మేరీకోమ్ తెలిపింది. -
చిత్తూరులో సీపీ ఫుడ్స్ చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్
బ్రాండ్ అంబాసిడర్‌గా మేరీ కోమ్ బెంగళూరు: భారత్‌లో ప్యాకేజ్డ్ ఫుడ్స్ బిజినెస్‌లో ప్రవేశిస్తున్నామని థాయ్‌లాండ్‌కు చెందిన ఆగ్రో-ఇండస్ట్రియల్ దిగ్గజం చరొయిన్ పోక్ఫాండ్ ఫుడ్స్ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్(సీపీ ఫుడ్స్) తెలిపింది. దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరులో కొత్త చికెన్ ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని కంపెనీ పేర్కొంది. బెంగళూరు, చెన్నై వంటి రెండు పట్టణాల మధ్య ఉన్నందున చిత్తూరులో చికెన ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేశామని సీపీ ఫుడ్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజీవ్ పంత్ తెలిపారు. ఈ ప్లాంట్ కోసం 1.8 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేశామని తెలిపారు. సీపీ ఫ్రొజెన్ చికెన్, సీపీ చిల్డ్ చికెన్, సీపీ ఈజీ స్నాక్స్(వెజ్ అండ్ నాన్ వెజ్), సీపీ ఎగ్స్ వంటి బ్రాండెడ్ ఉత్పత్తులను త్వరలో అందుబాటులోకి తెస్తామని సంజీవ్ వివరించారు. తమ బ్రాండ్ అంబాసిడర్‌గా మహిళ బాక్సర్ మేరీ కోమ్ వ్యవహరిస్తారని వివరించారు. -
'రియో' అర్హతలో మేరీకోమ్ విఫలం
అస్టానా (కజకిస్తాన్):రియో ఒలింపిక్స్ బెర్తే లక్ష్యంగా వరల్డ్ చాంపియన్ షిప్ లో బరిలోకి దిగిన ఐదుసార్లు ప్రపంచ చాంపియన్, భారత స్టార్ బాక్సింగ్ క్రీడాకారిణి మేరీకోమ్ కు చుక్కెదురైంది. శనివారం జరిగిన రెండో రౌండ్ పోటీలో మేరీకోమ్(51 కేజీల విభాగం) 0-2 తేడాతో జర్మనీ క్రీడాకారిణి అజిజ్ నిమానీ చేతిలో పరాజయం చవిచూసింది. దీంతో రియో బెర్తుపై మేరీకోమ్ పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వరల్డ్ చాంపియన్ షిప్ లో సెమీ ఫైనల్ కు చేరితేనే రియో బెర్తు అవకాశం ఉన్న తరుణంలో మేరీకోమ్ రెండో రౌండ్ లో ఇంటిముఖం పట్టడం భారత అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. తొలి రౌండ్ లో మ్యాచ్ ఆరంభమైన రెండు నిమిషాల పాటు మేరీకోమ్ తన పంచ్ లతో ఆధిక్యాన్ని కొనసాగించే యత్నం చేసినా, నిమానీ వాటిని చాకచక్యంగా కాపాడుకుంది. ఆ తదుపరి రెండో రౌండ్ లో కూడా మేరీకోమ్ దూకుడును కొనసాగించినా, పంచ్ లను సంధించడంలో వైఫల్యం చెందింది. దీంతో జడ్జిలు నిమానీ 2-0 తో విజయం సాధించినట్లు ప్రకటించారు. -
రెండో రౌండ్‌కు మేరీ కోమ్, సరితా దేవి
అస్టానా (కజకిస్తాన్): భారత స్టార్ బాక్సర్లు మేరీ కోమ్ (51కేజీ), ఎల్.సరితా దేవి (60కేజీ) ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో రెండో రౌండ్‌కు చేరారు. -
ఐబా అంబాసిడర్‌గా మేరీ కోమ్
న్యూఢిల్లీ: భారత మహిళా స్టార్ బాక్సర్ మేరీ కోమ్కు అరుదైన గౌరవం దక్కింది. అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఐబా) ఆధ్వర్యంలో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌కు మేరీ కోమ్‌ను అంబాసిడర్‌గా నియమించారు. ఓవరాల్‌గా ఎనిమిది మందిని ఐబా నియమించింది. ‘ఓ భారతీయురాలిగా ఈ గౌరవం దక్కినందుకు గర్విస్తున్నాను. దీనిద్వారా నేను అంతర్జాతీయ బాక్సింగ్‌కు ప్రతినిధిగా వ్యవహరిస్తాను. ఇది అందరికీ దక్కే అ వకాశం కాదు’ అని ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీకోమ్ సంతోషం వ్యక్తం చేసింది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన తను రియో గేమ్స్‌లో చోటు కోసం వచ్చే నెల 19 నుంచి 27 వరకు కజకిస్తాన్‌లో జరిగే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పాల్గొననుంది. -
ప్రియాంక... కెజుకెన్బో!
సినిమాల్లో తమ పాత్రల కోసం ఎంత కష్టాన్నైనా ఓర్చుకుని, వాటికి వన్నె తెచ్చే నటీమణుల్లో ప్రియాంకా చోప్రా ఒకరు. ఆ మధ్య ప్రియాంక నటించిన ‘మేరీ కోమ్’ చిత్రం దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. మేరీ కోమ్ పాత్ర కోసం బాక్సింగ్ నేర్చుకుని, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేశారామె. ఆ సినిమాలో అనేక రిస్కీ షాట్స్ చేసి భేష్ అనిపించుకున్నారు. తాజాగా ‘బేవాచ్’ అనే హాలీవుడ్ చిత్రం కోసం ప్రియాంక ఓ మార్షల్ ఆర్ట్ నేర్చుకోనున్నారు. కరాటే, బాక్సింగ్, జూడో లాంటివన్నీ మార్షల్ ఆర్ట్స్ అనే విషయం తెలిసిందే. అయితే, ప్రియాంక ‘బేవాచ్’ కోసం ‘కెజుకెన్బో’ అనే మార్షల్ ఆర్ట్ నేర్చుకోనున్నారు. ఇది అమెరికాలో ప్రసిద్ధి చెందిన మార్షల్ ఆర్ట్. కరాటే, కొరియన్ కరాటే, జూడో, కెన్బో, వెస్ట్రన్, చైనీస్ బాక్సింగ్ లాంటి ఆరు మార్షల్ ఆర్ట్స్ కలిపిన విశేషమైన యుద్ధవిద్య ‘కెజుకెన్బో’. ఇది నేర్చుకోవాలంటే చిన్న విషయం మాత్రం కాదట. అయినప్పటికీ ప్రియాంకా చోప్రా వెనకడుగు వేయలేదని సమాచారం. ‘బేవాచ్’లో తాను చేస్తున్న విలన్ పాత్రకు పూర్తి న్యాయం చేయాలంటే ఎంత రిస్కీ మార్షల్ ఆర్ట్ అయినా నేర్చుకోవాలని ఫిక్స్ అయ్యారట. హీరో డ్వేన్ జాన్సన్‌కు దీటుగా ఉండే ఆమె పాత్రకు కెజుకెన్బో వస్తే బాగుంటుందని చిత్ర దర్శకుడు సేథ్ గోర్డన్ సూచించారట. అందుకే అమెరికాలో ఈ విద్యలో ప్రసిద్ధిగాంచిన ఓ ట్రైనర్ ఆధ్వర్యంలో నేర్చుకోవడానికి ప్రియాంక సై అన్నారు. మరి.. ప్రియాంకానా... మజాకానా! -
మేరీకోమ్ 'పంచ్'అదిరింది!
షిల్లాంగ్:దక్షిణాసియా క్రీడల్లో భారత మహిళా స్టార్ బాక్సర్ , లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ పదునైన పంచ్‌లతో అదరగొట్టింది. మంగళవారం అనుషా దిల్రుక్షి (శ్రీలంక)తో జరిగిన పోరులో మేరీకోమ్ తన విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ స్వర్ణ పతకాన్ని చేజిక్కించుకుంది. 51 కేజీల విభాగంలో పవర్ పంచ్‌లతో విరుచుకుపడిన మేరీకోమ్ నాకౌట్ విజయం సాధించి పసిడిని దక్కించుకుంది. కేవలం 90 నిమిషాల్లో ముగిసిన పోరులో మేరీకోమ్ ఆద్యంతం ఆధిక్యాన్ని ప్రదర్శించింది. ఓ దశలో మేరీకోమ్ కురిపించిన బలమైన పంచ్‌లకు అనుషా వద్ద సమాధానమే లేకుండా పోయింది. మేరీకోమ్ పంచ్‌లకు అదుపు తప్పి కిందిపడిపోయిన అనుషా కుడి మోకాలుకు గాయం అయ్యింది. దీంతో అనుషా రెండు నుంచి మూడు నెలల పాటు బాక్సింగ్ కు దూరమయ్యే అవకాశం ఉందని శ్రీలంక టీమ్ డాక్టరు తెలిపారు. ఇదిలా ఉండగా, మరో భారత బాక్సర్ పూజా రాణి కూడా స్వర్ణ పతాకాన్ని కైవసం చేసుకుంది. 75 కేజీల విభాగంలో శ్రీలంక దేశానికే చెందిన నిలాన్తిపై టెక్నికల్ నాకౌట్ విజయం సాధించిన పూజారాణి పసిడిని దక్కించుకుంది. అయితే ఏడాది నిషేధం తరువాత బాక్సింగ్ రింగ్‌లోకి వచ్చిన భారత బాక్సర్ సరితాదేవి పోరాడి గెలిచి స్వర్ణ పతకాన్ని సాధించింది. సరితా దేవి 39-36 తేడాతో శ్రీలంక మహిళా బాక్సర్ విదుషికా ప్రభాదిపై విజయం సాధించి పసిడి పతకాన్ని చేజిక్కించుకుంది. తద్వారా అందుబాటులో ఉన్న మూడు స్వర్ణపతకాలను కైవసం చేసుకున్న భారత మహిళా బాక్సర్లు క్లీన్‌స్వీప్ చేశారు. దీంతో బాక్సింగ్ ఈవెంట్ లో మొత్తంగా 10 స్వర్ణాలను భారత్ తన ఖాతాలో వేసుకుని టోర్నీని ఘనంగా ముగించింది. సోమవారం పురుషుల బాక్సింగ్‌లో భారత్ క్లీన్‌స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. ఏడింటికి ఏడు స్వర్ణాలను భారత బాక్సర్లు సొంతం చేసుకున్నారు. -
కన్నీరుమున్నీరైన మేరీకోమ్
ముంబై: మణిపూర్ మణిమకుటం, ప్రపంచ బాక్సింగ్ చాంపియన్ గా ఐదుసార్లు నిలిచిన భారత మహిళగా చరిత్ర సృష్టించిన మేరీ కోమ్ కన్నీటి పర్యంతమయ్యారు. భారతదేశంలో మహిళ బాక్సర్లెందరికో ఒక స్ఫూర్తిగా నిలిచిన ఆమె ముంబైలో జరిగిన ఒక మీడియా సమావేశంలో కన్నీళ్లు పెట్టుకోవడం సంచలనం సృష్టించింది. సెలక్షన్ ప్రక్రియలో బాక్సింగ్ రిఫరీలు, జడ్జిలు తనపై వివక్ష చూపిస్తున్నారని మేరో కోమ్ ఆరోపిస్తున్నారు. వారి ప్రాంతీయ దురభిమానం వల్ల తనకు తీరని అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. తాను ఈశాన్య భారతానికి చెందినదాన్ని కావడంతోనే తన పట్ల పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారన్నారు. ముందు తాను భారతీయురాలిని అనే విషయాన్ని గమనించాలన్నారు. తన చేతిలో అనేకసార్లు ఓడిపోయిన హర్యానాకు చెందిన పింకీ జాంగ్రాకే సెలక్లర్లు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారని ఒలింపిక పతక విజేత మేరీకోమ్ వాపోయింది. అయినా తాను నిరుత్సాహపడననీ, తనకీ అవమానాలు, వివక్ష కొత్తకాదనీ, గతంలో ఇలాంటివి చాలా అనుభవించానన్నారు. తానేంటో బాక్సింగ్ రింగ్ లో నిరూపించుకుంటానంటూ ఒక్కసారిగా కన్నీటి పర్యంతమయింది. దీంతో పక్కనే సింధు ఆమెను ఓదార్చారు. -
ఆస్కార్‌కు మన కోర్ట్
భారతదేశం నుంచి ఆస్కార్ అవార్డ్స్‌కు ఏ సినిమా నామినేటవుతుంది? ఈ ఉత్కంఠకు బుధవారం తెరపడింది. ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో మన దేశం నుంచి మరాఠీ చిత్రం ‘కోర్ట్’ను ‘ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా’ (ఎఫ్.ఎఫ్.ఐ) నామినేట్ చేసింది. నటుడు, దర్శకుడు అమోల్ పాలేకర్ నేతృత్వంలోని పదిహేడు మంది సభ్యులతో కూడిన జ్యూరీ దేశంలో వివిధ భాషల్లో రూపొందిన 30 చిత్రాలను వీక్షించింది. వీటిలో తెలుగు నుంచి ‘బాహుబలి’, ‘శ్రీమంతుడు’, హిందీ నుంచి ‘పీకే’, ‘అగ్లీ’, ‘హైదర్’, ‘మేరీ కోమ్’, తమిళం నుంచి ‘కాక్కా ముట్టయ్’ తదితర చిత్రాలున్నాయి. అన్ని చిత్రాలనూ వీక్షించిన అనంతరం మరాఠీ ‘కోర్ట్’ను ఎంపిక చేసింది. ‘‘భారతీయ న్యాయవ్యవస్థను ఈ చిత్రం కళ్లకు కట్టింది. అందుకే మన దేశం పక్షాన ఈ చిత్రాన్ని ఎంపిక చేశాం’’ అని బుధవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో అమోల్ పాలేకర్, ఎఫ్ఎఫ్ఐ సెక్రటరీ జనరల్ సుప్రాణ్ సేన్ తెలిపారు. ఈ సమావేశంలో నిర్మాత సి. కల్యాణ్ కూడా పాల్గొన్నారు. వృద్ధ జానపద కళాకారుడి కథతో... జానపద గీతాల ద్వారా ప్రజలను చైతన్యవంతుల్ని చేసే ఓ వృద్ధ సామాజిక కార్యకర్త కథ - ‘కోర్ట్’. ఈ పాటలను స్ఫూర్తిగా తీసుకుని ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణతో ఆ సామాజిక కార్యకర్తను పోలీసులు అరెస్ట్ చేస్తారు. ఈ కేసు నేపథ్యంలో ‘కోర్ట్’ సాగుతుంది. దర్శకుడు చైతన్యా తమ్హాణెకు ఇది తొలి చిత్రమైనప్పటికీ, ఇప్పటికే ‘ఉత్తమ ప్రాంతీయ చిత్రం’గా జాతీయ అవార్డును సొంతం చేసుకుంది. పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో సత్తా చాటుకుంది. మరి, వచ్చే ఫిబ్రవరిలో జరగనున్న ఆస్కార్ అవార్డ్స్ వేడుకలో ఫైనల్‌గా పోటీపడే 5 చిత్రాల్లో మన ‘కోర్ట్’ నామినేషన్ దక్కించుకుంటుందో లేదో? ఒకవేళ నామినేషన్ దక్కితే, ఆస్కార్‌ను కూడా సొంతం చేసుకుని తన సత్తా చాటుతుందో లేదో చూడాలి. -
మేడమ్జీగా ప్రియాంక చోప్రా
ఫ్యాషన్ స్టార్ ప్రియాంక మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతోంది. స్టార్ ఇమేజ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీస్ అందరూ గ్లామర్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంటే ప్రియాంక మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటుంది. గ్లామర్ క్యారెక్టర్స్‌తో పాటు ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పటికే ఫ్యాషన్, మేరికోమ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటి త్వరలో మేడమ్జీగా అలరించనుంది. రియలిస్టిక్ ఫిలిం మేకర్ మథుర్ బండార్కర్ మరోసారి ప్రియాంక చోప్రాతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా చాలా రోజుల క్రితమే సెట్స్ మీదకు రావాల్సి ఉండగా ప్రియాంక కమిట్ మెంట్స్ మూలంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ గ్యాప్‌లో మథుర్ బండార్కర్ కూడా క్యాలెండర్ గర్ల్స్ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ చేసే పనిలో ఉన్న ప్రియాంక త్వరలోనే మేడమ్‌జీ షూటింగ్లో పాల్గొనటానికి ప్లాన్ చేసుకుంటుంది. ఫ్యాషన్ సినిమాలో ప్రియాంకను మోడల్‌గా చూపించిన మథుర్, మేడమ్‌జీ లో పొలిటీషియన్ గా చూపించబోతున్నాడు. రాజకీయరంగంలో అధికారం కోసం ఎలాంటి తప్పులు జరుగుతాయో ఈసినిమాలో చూపించబోతున్నాడు. బాజీరావ్ మస్తానీతో పాటు క్వాంటికో సీరియల్లో నటిస్తున్న ఈ బ్యూటి త్వరలోనే మేడమ్‌జీ సినిమాకు డేట్స్ ఇవ్వనుంది. 60 రోజుల్లోనే మేడమ్‌జీ షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు మథుర్ బండార్కర్. -
సాకారమైన స్వప్నం...మా ‘మేరీ కోమ్’కు అవార్డు!
‘‘నా తొలి చిత్రమైన ‘మేరీ కోమ్’కు సకుటుంబ వినోదం అందించిన ఉత్తమ పాపులర్ చిత్రంగా జాతీయ అవార్డు వచ్చిందని తెలిసి, ఉద్వేగానికి గురవుతున్నా. అసలిది నమ్మలేకపోతున్నా. ఎన్నడూ లేనంత ఆనందంగా ఉంది. మన దేశంలోని మణిపూర్‌కు చెందిన బాక్సింగ్ చాంపియన్ ఎం.సి. మేరీకోమ్ జీవితంపై ఎంతో కష్టపడి ఈ సినిమా తీశాం. ఈ నిజజీవిత పాత్రలోకి ప్రియాంకా చోప్రా అద్భుతంగా పరకాయ ప్రవేశం చేసింది. ఏ నూతన చిత్ర దర్శకుడికైనా ఈ గుర్తింపు వాస్తవరూపం ధరించిన సుందర స్వప్నం లాంటిదే!’’ -‘మేరీ కోమ్’ చిత్రంతో దర్శకుడైన ఒమంగ్ కుమార్ -
ఈశాన్య రాష్ట్రాల అంబాసిడర్‌గా మేరికోమ్
న్యూఢిల్లీ/అగర్తల: భారత ఒలంపిక్ బాక్సర్ చాంపియన్ మేరీకోమ్‌కు మరో అరుదైన గౌరవం దక్కనుంది. ఈశాన్య రాష్ట్రాలకు ఆమెను ప్రచారకర్త(బ్రాండ్ అంబాసిడర్)గా కేంద్ర ప్రభుత్వం నియమించనుంది. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు ఆదివారం వెల్లడించారు. 'డోనర్(డెవలప్ మెంట్ ఆఫ్ నార్త్ ఈస్ట్రన్ రీజియన్) నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు పరిష్కారం చూపే కార్యక్రమాల ప్రచారం కోసం కొందరు ప్రముఖ వ్యక్తుల కోసం మంత్రి జితేంద్ర సింగ్ నేతృత్వంలో కమిటీ వేశాం. చివరిగా అది మేరీకోమ్‌ను ఎంపికచేసింది. త్వరలోనే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నాం' అని డోనర్ శాఖ అధికార వర్గాలు తెలిపాయి. మణిపూర్‌కు చెందిన మేరీకోమ్ ఇప్పటికే బాక్సింగ్‌లో ఐదు ప్రపంచ టైటిళ్లను, ఒలంపిక్ను గెలుచుకున్నారు. రియోడిజనరియోలో జరగనున్న ఒలంపిక్ గేమ్స్ అనంతరం తాను బాక్సింగ్ నుంచి విశ్రాంతి తీసుకోనున్నట్లు మేరీకోమ్ ప్రకటించిన విషయం తెలిసిందే. -
ప్రధాని మోదీని కలిసిన మేరీకోమ్
న్యూఢిల్లీ: భారత మేటి మహిళా బాక్సర్ మేరీకోమ్ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసింది. ఏప్రిల్‌లో మణిపూర్‌లో తన అకాడమీ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించింది. ‘ప్రధాని అపాయింట్మెంట్ కావాలని మంగళవారం అడిగా. బుధవారం కలిసేందుకు అనుమతి వచ్చింది. నా అకాడమీ నిర్మాణం ఏప్రిల్‌లో పూర్తవుతుంది. ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించా. తగిన సమయం దొరికే వరకు వేచి చూస్తానని ప్రధానికి చెప్పా. సాధ్యమైనంత వరకు ప్రయత్నిస్తానని హామీ ఇచ్చారు. ఏం జరుగుతుందో చూద్దాం. మోదీతో సమావేశం చాలా ఆనందాన్నిచ్చింది’ అని మేరీకోమ్ వెల్లడించింది. తాను చెప్పిన విషయాలను చాలా శ్రద్ధగా విన్న ప్రధాని... భవిష్యత్‌లోనూ కావాల్సిన సహాయ సహకారాలను అందిస్తానన్నారని తెలిపింది. ‘నన్నో కూతురిలాగా భావించారు. అన్ని విషయాలు చాలా సావధానంగా విన్నారు. ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించవచ్చని, ఓ కూతురిగా ఎప్పుడైనా తన ఇంటికి రావొచ్చని చెప్పారు’ అని ఈ బాక్సర్ వ్యాఖ్యానించింది. -
రియో ఒలింపిక్స్ తర్వాత రిటైర్: మేరీకోమ్
గువాహటి: వచ్చే ఏడాది జరిగే రియో ఒలింపిక్స్ తర్వాత తన కెరీర్‌కు గుడ్‌బై చెప్పే అవకాశం ఉందని బాక్సర్ మేరీ కోమ్ తెలిపింది. ‘ఈ విషయంలో ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. కానీ రియో ఒలింపిక్స్ అనంతరం బాక్సింగ్‌లో కొనసాగకపోవచ్చు. రిటైర్ అయ్యే అవకాశాలే ఎక్కువ. ప్రస్తుతానికైతే భారత్‌కు మరిన్ని పతకాలు అందించాలనే ఉద్దేశంతో కఠోరంగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ ఏడాది కొన్ని అంతర్జాతీయ ఇన్విటేషన్ టోర్నీలు ఆడతాను. ఈశాన్య రాష్ట్రాల్లో నైపుణ్యం కలిగిన ఆటగాళ్లున్నా పతకాలు సాధించలేకపోతున్నారు. ఇందుకోసం నా శాయశక్తులా సహకారం అందిస్తా’ అని మేరీ కోమ్ తెలిపింది. -
వీరనారిగా
విభిన్న పాత్రలు పోషించాలని తపించే ప్రియాంకా చోప్రా... త్వరలో మరో కొత్త పాత్ర చేయనున్నారట. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కూడిన కథాంశంతో రూపొందే ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రియాంక ప్రధాన భూమిక పోషించనున్నారని సమాచారం. వివరాల్లోకెళ్తే- ‘మేరీకోమ్’ దర్శకుడు ఒమాంగ్ కుమార్ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్ కథాంశం కావడంతో, ‘మేరీకోమ్’లో అద్భుత నటన కనబరిచిన ప్రియాంకతోనే ఈ సినిమా కూడా చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ప్రియాంకతో ఈ విషయం చెప్పగానే, ఆమె కూడా సానుకూలంగా స్పందించారని వినికిడి. ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన కథాంశం కావడం వల్ల ప్రీ ప్రొడక్షన్‌కే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే... వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌కి తీసుకెళ్లడానికి ఒమాంగ్ కుమార్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక పాత్ర అత్యంత శక్తిమంతంగా వీరనారి తరహాలో ఉంటుందని సమాచారం. -
పాత్ర కోసం వంద కిలోల బరువు?
పాత్ర కోసం శరీరాన్ని హింసించుకోవడం, కావాలని బరువు పెరగడం, ఊహించని స్థాయిలో బరువు తగ్గడం... ఇలాంటి ఫీట్లన్నీ ఎక్కువగా హీరోలే చేస్తుంటారు. హీరోయిన్లు చేసేది తక్కువ. ఆ మధ్య బాలీవుడ్లో ‘మేరీ కోమ్’ సినిమా కోసం ప్రియాంక చోప్రా కండలు పెంచి, సహజంగా స్త్రీలకుండే సున్నితత్వాన్ని సైతం ఆ పాత్ర కోసం కోల్పోయారు. మళ్లీ మునుపటి సోయగం కోసం ప్రస్తుతం ఆమె ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం దేనికంటే... అందాల అనుష్క కూడా త్వరలో అలాంటి సాహసమే చేయబోతున్నారట. పాత్ర కోసం తన బరువుని ఏకంగా వంద కిలోలకు పెంచనున్నారట. ఇప్పటికే... రుద్రమదేవి, బాహుబలి చిత్రాల కోసం గుర్రపు స్వారీనీ, యుద్ధ విద్యలను అభ్యసించి ఆ పాత్రల కోసం అనుష్క అహర్నిశలూ శ్రమిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలు నిర్మాణంలో ఉండగానే, మరో ప్రయోగాత్మక పాత్రకు ఈ అందాలభామ పచ్చజెండా ఊపారనేది తాజా సమాచారం. కె.రాఘవేంద్రరావు తనయుడు కోవెలమూడి ప్రకాశ్ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రంలో అనుష్క ద్విపాత్రాభినయం చేయనున్నట్లు తెలిసింది. అందులోని ఓ పాత్ర... అధిక బరువుతో అపర కాళికలా కనిపించాల్సి వస్తుందట. ఆ విషయం తెలిసి కూడా ఆ చిత్రంలో నటించడానికి అంగీకారం తెలిపారట అనుష్క. తోటి హీరోయిన్లందరూ గ్లామర్ పాత్రల కోసం వెంపర్లాడుతుంటే.. అనుష్క మాత్రం వారికి భిన్నంగా ఇలా ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి మొగ్గు చూపడం నిజంగా అభినందనీయం. -
సెట్స్‌లో అప్సెట్!
పని పెరిగి... ఒత్తిడి అధికమైతే ఏం జరుగుతుంది..! దిమ్మ తిరిగి... బాడీ బెండవుతుంది. అందుకు బాలీవుడ్ ‘మేరికోమ్’ కూడా మినహాయింపేమీ కాదు. పాత్రలో జీవించడానికి ఆ మధ్య రింగ్‌లో దిగి పంచ్‌ల పవర్ చూపించిన ఈ అమ్మడు... ఇప్పుడు ‘హెవీ డ్యూటీ’ దెబ్బకు సెట్స్‌లో స్పృహ తప్పి పడిపోయింది. సంజయ్ లీలా బన్సాలీ తెరకెక్కిస్తున్న ‘బాజీరావ్ మస్తానీ’ షూటింగ్లో నాలుగు గంటలు నిర్విరామంగా రిహార్సల్స్‌లో మునిగిపోయిన ప్రియాంక... ఉన్నట్టుండి కళ్లు గిరగిరా తిరిగి కిందపడింది. అక్కడున్నవారంతా షాకయ్యి... షేకయ్యారని మిడ్ డే కథనం. -
అందమే లేకపోతే మిస్ వరల్డ్ అయ్యేదానివా?
బాలీవుడ్ కథానాయికల్లో ప్రియాంక చోప్రా రూటే సెపరేటు. పదుగురిలో ఒకదాన్ని అనిపించుకోవడానికి అస్సలు ఇష్టపడరామె. అందుకు ప్రియాంక కెరీరే ఉదాహరణ. హీరోయిన్లందరూ గ్లామర్ పాత్రలవైపు పరుగులు పెడుతుంటే... ప్రియాంక మాత్రం ప్రయోగాత్మక పాత్రలు చేయడానికే ఇష్టపడతారు. బర్ఫీ, మేరీ కామ్ చిత్రాలే అందుకు నిదర్శనాలు. ముఖ్యంగా ‘మేరీ కామ్’ కోసమైతే... తనలోని సున్నితత్వాన్ని కోల్పోయారు ప్రియాంక. ప్రస్తుతం పూర్వపు అందం కోసం అహర్నిశలూ శ్రమిస్తున్నారామె. బహుశా ఆ శ్రమ భరించలేకేనేమో... ట్విటర్లో ఓ వింత మెసేజ్ పోస్ట్ చేశారు. ‘‘నేను వికృతంగా పుట్టి ఉంటే ఏ సమస్యా ఉండేది కాదు. జీవితం సాఫీగా సాగిపోయేది. అందంగా పుట్టడం వల్లే ఈ సమస్యలన్నీ. ఈ అందమే లేకపోతే... అసలు గ్లామర్ ఫీల్డ్‌లోకే వచ్చేదాన్ని కాదు కదా. ఈ తిప్పలు ఉండేవి కావు కదా. కాసేపు స్కిన్‌పై శ్రద్ధ పెట్టాలి. ఇంకాసేపు జుత్తు గురించి ఆలోచించాలి. నిజంగా చిరాగ్గా ఉంది’’ అని ట్వీట్ చేశారు ప్రియాంక. ఈ ట్వీట్‌పై బాలీవుడ్లో రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘ఆ అందమే లేకపోతే నువ్వు మిస్ వరల్డ్ అయ్యేదానివా, సెలబ్రిటీ హోదా ఎంజాయ్ చేసేదానివా, కోటానుకోట్లు సంపాదించేదానివా? అంటూ చాలామంది తమ వ్యక్తిగత సామాజిక మాధ్యమాల ద్వారా ప్రియాంక ట్వీట్‌పై కామెంట్లు విసిరారు. ఇంకొందరైతే.. తాను అందగత్తెనని ఈ ట్వీట్ ద్వారా ప్రియాంక చెప్పకనే చెప్పి, తన తెలివితేటలు ప్రదర్శించిందని కౌంటర్ ఇచ్చారు. మరి... ఈ కామెంట్లపై ప్రియాంక ఎలా స్పందిస్తారో చూడాలి. -
ధ్యాన్‌చంద్, ధోనీలపై సినిమాలు
బయోపిక్ బాటలో బాలీవుడ్ న్యూఢిల్లీ: ఇటీవల విడుదలైన ‘మేరీకోమ్’ సినిమా బాక్సాఫీస్ వద్ద విజయవంతమవడంతో బాలీవుడ్ దృష్టంతా ఇప్పుడు బయోపిక్‌పైనే పడింది. మున్ముందు ఈ తరహా సినిమాలు వెల్లువెత్తనున్నాయి. ఈ సినిమాలు స్ఫూర్తిని కలిగిస్తాయని, ప్రేక్షకులను తొందరగా ఆకట్టుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒక సినిమా హిట్ అయినంతమాత్రాన అన్నీ విజయవంతమవుతాయనే గ్యారంటీ కూడా ఏమీలేదంటున్నారు. మహేందర్‌సింగ్ ధోనీ, ధ్యాన్‌చంద్ జీవితగాథల ఆధారంగా త్వరలో మరో రెండు బయోపిక్ సినిమాలు తెరకెక్కనున్నాయి. హాకీ లెజెండ్ జీవితగాధ ఆధారంగా కరణ్‌జోహార్ త్వరలో ఓ సినిమా తీయనున్నాడు. నీరజ్ పాండే దర్శకత్వంలో ధోనీ జీవితంపై సినిమా తెరకెక్క నుంది. ఈ సినిమాకు ‘అన్‌టోల్డ్ స్టోరీ’ అని నామకరణం చేశారు. ఈ సినిమాలో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో కనిపించనున్నాడు. ఈ విషయమై పీవీఆర్ సంస్థ సీఈఓ దీపక్ శర్మ మాట్లాడుతూ ‘ఇందులో రహస్యమేమీ లేదు. బాక్సాఫీస్ వద్ద ఇటువంటి సినిమాలు బాగా ఆడుతున్నాయి. అందువల్లనే ఈ సినిమాలపై మొగ్గుచూపుతున్నాం’ అని అన్నాడు. ‘ఈ సినిమాలు అందరికీ స్ఫూర్తిని కలిగిస్తాయి. అన్నిరంగాలకుచెందిన ప్రజలు ఇటువంటి వారితో తమను తాము పోల్చుకుంటుంటారు. తమ పిల్లలను ఇటువంటి సినిమాలకు తీసుకెళ్లడానికి తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఎందుచేతనంటే ఇవి మంచి సినిమాలనే విషయం వారికి తెలుసు. విజయవంతమైన సినిమాల బాటలోనే నడవాలని సహజంగానే అంతా కోరుకుంటారు’ అని అన్నాడు. -
తెరపై కాసులు కురిపిస్తున్న క్రీడాకారులు
క్రీడా దిగ్గజాల జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల సంఖ్య బాలీవుడ్ పెరిగింది. క్రీడా నేపథ్యంలో గతంలోనే సినిమాలు వచ్చాయి. అయితే క్రీడాకారులు జీవిత చరిత్రలను సెల్యులాయిడ్ పై చూపించడమనే సరిక్రొత్త ట్రెండ్ బాలీవుడ్ లో ఇటీవలే మొదలైందని చెప్పాలి. ఈ కోవలో వచ్చిన సినిమాలు విజయవంతం కావడంతో ఇటువైపు దర్శకులు దృష్టి సారించారు. ప్రఖ్యాత క్రీడాకారుల జీవితాలను సినిమాగా మలిచేందుకు అమితాసక్తి చూపిస్తున్నారు. భారత హాకీ దిగ్గజం ధ్యాన్ చంద్, టిమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని జీవిత కథలు ఈ వరుసలో ఉన్నారు. మిల్కా సింగ్ జీవిత కథ నేపథ్యంగా తెరకెక్కిన 'భాగ్ మిల్కా భాగ్' సినిమా రూ. 100 కోట్ల పైగా వసూళ్లు సాధించడంతో ఈ తరహా చిత్రాలు రూపొందించేందుకు బాలీవుడ్ దర్శకులు ఉత్సుకత చూపిస్తున్నారు. స్టార్ మహిళా బాక్సర్ మేరీ కోమ్ జీవితచరిత్ర ఆధారంగా వచ్చిన సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించడం మరింత ఉత్సాహనిచ్చింది. ధ్యాన్ చంద్ పై సినిమా తీస్తున్నట్టు ప్రముఖ దర్శకనిర్మాత కరణ్ జోహార్ ఇప్పటికే ప్రకటించారు. 'ఎంఎస్ ధోని- ది అన్‌టోల్డ్ స్టోరీ'తో నీరజ్ పాండే మెగా ఫోన్ పట్టేందుకు సిద్దమవుతున్నారు. ధోని పాత్రలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటిస్తాడని పాండే వెల్లడించారు. ఆటగాళ్ల జీవితాలను వరుసగా తెరకెక్కించడం వెనుక రహస్యమేమీ లేదని, బాక్సాఫీస్ వద్ద ఇటువంటి సినిమాలు విజయం సాధిస్తుండడమే కారణమని పీవీఆర్ సినిమా సీఓఓ దీపక్ శర్మ పేర్కొన్నారు. ఇలాంటి సినిమాలు స్ఫూర్తి రగిలిస్తాయని చెప్పారు. మంచి కథను ప్రేక్షకుల హృదయాలను హత్తుకునేలా తీసే సినిమాలు ఎప్పుడూ విజయం సాధిస్తాయని విశ్లేషకుడు కోమల్ నహతా చెప్పారు. ప్రస్తుతం జీవిత చరిత్రల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమాల పరంపర బాలీవుడ్ లో నడుస్తోందన్నారు. క్రీడాస్ఫూర్తితో కాకుండా కాసుల కోసమే 'బయోపిక్'లు తెరకెక్కిస్తున్నారని విమర్శిస్తున్న వారు లేకపోలేదు. కాగా, మరింత మంది క్రీడాకారులు తమ జీవిత చరిత్రలను సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలని ఉబలాటపడుతుండడం విశేషం. తన పాత్రకు సల్మాన్ ఖాన్ లేదా అక్షయ్ కుమార్ సరిపోతారని కుస్తీ వీరుడు యోగేశ్వర్ దత్ పేర్కొన్నారు. ఒకవేళ తన బయోగ్రఫీ సినిమాగా తీస్తే.. ఆ పాత్రకు బాలీవుడ్ నటి దీపికా పదుకొనే సరిగ్గా సరిపోతుంది టెన్నిస్ తార సానియా వ్యాఖ్యానించింది. రానున్న రోజుల్లో మరింత మంది క్రీడాకారులు జీవితాలు తెరపై చూసే అవకాశం ప్రేక్షకులకు కలగనుంది. -
మేరీకోమ్ నిజమైన హీరో: భన్సాలీ
ముంబై: భారత స్టార్ బాక్సర్ మేరీ కోమ్ నిజమైన హీరో అని బాలీవుడ్ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ప్రశంసించారు. ఆసియా గేమ్స్‌లో మేరీ స్వర్ణ పతకం సాధించడం తనకేమీ ఆశ్చర్యం కలిగించలేదని భన్సాలీ అన్నారు. మేరీ కోమ్ నిజజీవితం ఆధారంగా 'మేరీకోమ్' చిత్రాన్ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ప్రియాంక చోప్రా టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రానికి భన్సాలీ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఆసియాడ్‌లో మేరీ స్వర్ణ పతకం సాధించిన నేపథ్యంలో భన్సాలీ స్పందించారు. మేరీ విజయాన్ని తాను ముందే ఊహించానని భన్సాలీ అన్నారు. 'మేరీ విజయం దేశానికి గర్వకారణం. అద్భుత విజయం సాధించిన మేరీకి అభినందనలు. స్వర్ణ పతకంతో భారత్ వెలిగిపోయేలా చేశారు. మేరీకోమ్ చిత్ర నిర్మాణంలో భాగస్వామిని అయినందుకు సంతోషంగా ఉంది' అని భన్సాలీ చెప్పారు. -
'వ్యాట్ ఏ ఫీట్.. భారతీయుడిగా గర్విస్తున్నా'
ముంబై: ఆసియా క్రీడల్లో బంగారు పతకం సాధించిన భారత మహిళా బాక్సర్ మేరీ కోమ్ పై బాలీవుడ్ అభినందనల జల్లు కురిపించింది. ఆమె సాధించిన విజయంపై హర్షం వ్యక్తం చేసింది. మేరీ కోమ్ జీవితచరిత్ర ఆధారంగా నిర్మించిన సినిమాలో నటించిన ప్రియాంక చోప్రా అందరికంటే ముందు అభినందనలు తెలిపారు. మహిళా శక్తిని మరోసారి మేరీకోమ్ ప్రపంచానికి చాటిందని ప్రశంసించారు. బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఆమెను అభినందించారు. వ్యాట్ ఏ ఫీట్.. భారతీయుడిగా గర్విస్తున్నా అని ట్వీట్ చేశారు. ప్రముఖ గాయనీమణి లతా మంగేష్కర్, నటులు షాహిద్ కపూర్, కునాల్ కోహ్లి, ఫర్హాన్ అక్తర్, రచయిత మిలాప్ జవేరీ, వీర్ దాస్, విశాల్ దద్లానీ, సుజిత్ సిర్కార్, దిపనిత శర్మ తదితరులు మీరీకోమ్ కు అభినందలు తెలుపుతూ ట్వీట్ చేశారు. -
మేరీకోమ్.. 'బంగారం'తో మెరిసింది!
-
బాక్సింగ్‌లో మేరీకోమ్ 'పసిడి' పంచ్
ఇంచియాన్ : బాక్సర్ మేరీకోమ్ పసిడి పంచ్ విసిరింది. ఆసియా క్రీడల్లో భారత్‌కు మరో బంగారు పతకం లభించింది. 51 కేజీల మహిళల విభాగంలో మేరీకోమ్ పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. ఫైనల్స్‌లో కజికిస్తాన్ బాక్సర్ జైనా షెకర్ బెకోవాపై ఆమె విజయం సాధించింది. ఇక ఆసియా క్రీడల్లో ఆమెకు ఇదే తొలి బంగారు పతకం. దాంతో ఇప్పటివరకూ భారత్‌కు ఏడు స్వర్ణాలు, 8 రజిత, 32 కాంస్య పతకాలతో పదో స్థానంలో నిలిచింది. -
ఫైనల్లో మేరీకోమ్
ఇంచియాన్: ఆసియా గేమ్స్‌లో భారత బాక్సర్లకు మంగళవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. మహిళల సెమీస్ బౌట్స్‌లో సరితా దేవి, పూజా రాణి పరాజయం పాలై రెండు కాంస్యాలు అందించగా... అంచనాలకు తగ్గట్టుగానే దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మేరీకోమ్‌కు కనీసం రజతం ఖాయం. ఇక పురుషుల విభాగంలో సతీష్ కుమార్, వికాస్ క్రిషన్ సెమీస్‌లో ప్రవేశించారు. మహిళల ఫ్లయ్ వెయిట్ 48-51కేజీ విభాగం సెమీఫైనల్లో మేరీకోమ్ 3-0తో పూర్తి ఆధిపత్యంతో వియత్నాంకు చెందిన తి బాంగ్ లిని ఓడించి తుది పోరుకు అర్హత సాధించింది. మిడిల్ వెయిట్ 69-75కేజీల విభాగం సెమీస్‌లో పూజా రాణి 0-3తో లి కియాన్ (చైనా) చేతిలో ఓడింది. పురుషుల మిడిల్ వెయిట్ 75కేజీల క్వార్టర్స్‌లో వికాస్ క్రిషన్ 3-0తో హుర్షిడ్బెక్ (ఉజ్బెకిస్థాన్) పై నెగ్గాడు. సూపర్ హెవీ 91+కేజీల విభాగం క్వార్టర్స్‌లో సతీష్ కుమార్ 2-1తో హుస్సేన్ (జోర్డాన్)ను ఓడించాడు. బాంటమ్ 56కేజీల క్వార్టర్స్‌లో శివ థాపా, లైట్ ఫ్లయ్ (46-49కేజీల) క్వార్టర్ఫైనల్లో దేవేంద్రో సింగ్ ఓడిపోయారు. -
ఇక నా వల్ల కాదు..!
మేరీ కోమ్ పాత్రలో ప్రియాంక చోప్రా అద్భుతంగా ఒదిగిపోవడం ఆమెకు తలనొప్పిగా తయారైందట. మళ్లీ ఆమెను క్రీడాకారిణిగా నటింపజేసి, క్యాష్ చేసుకోవాలని చాలామంది దర్శక, నిర్మాతలు ప్రియాంక వెంటబడుతున్నారట. కొంతమంది రచయితలైతే కథలు సిద్ధం చేసుకుని మరీ ప్రియాంకను కలుస్తున్నారట. దాంతో విసుగు చెందిన ఈ బ్యూటీ ‘‘ఇక నేను క్రీడాకారిణి పాత్ర చేయను. ఒక క్రీడాకారిణి జీవిత కథ క్లిక్ అయ్యింది కదా అని.. వరుసగా అలాంటి సినిమాలే చేయమంటే, ఇక నావల్ల కాదు. నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం లేక కాదు. ఇష్టం కదా అని పదే పదే తాగితే అమృతం కూడా వెగటు పుడుతుందట. అలా, ఒకే తరహా పాత్రలు చేస్తే ప్రేక్షకులు విసుగు చెందుతారు. ఓ నటిగా విభిన్న తరహా పాత్రలు చేయాలన్నది నా సంకల్పం. భవిష్యత్తులో వెనక్కి తిరిగి చూసుకుంటే చెప్పుకోవడానికి ఓ పది, ఇరవై సినిమాలైనా ఉండాలిగా’’ అన్నారు. -
కాంస్యంతో సరిపెట్టుకున్న పూజారాణి
ఇంచియాన్:ఆసియా క్రీడల మహిళల బాక్సింగ్ లో మేరీ కోమ్ ఫైనల్ కు చేరగా, మరో ఇద్దరు బాక్సర్లు సెమీ ఫైనల్లో నిష్క్రమించారు. మంగళవారం జరిగిన సెమీ ఫైనల్ పోరులో పూజా రాణి 0-2 తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఆమెకు కాంస్య పతకానికే పరిమితమైంది. ఇంచియాన్ లో జరుగుతున్న ఏషియాడ్ క్రీడల్లో ఆమె మహిళల 69-75 కేజీల మిడిల్ వెయిట్ విభాగంలో జరిగిన పోరులో చైనా క్రీడా కారిణి లీ కైన్ చేతిలో ఓటమి చెందింది. సెకెండ్ రౌండ్ లో ఆకట్టుకున్న పూజారాణి.. మూడో రౌండ్ కు వచ్చే సరికి చతికిలబడింది. రెండో రౌండ్ లో 27 పాయింట్లు సాధించిన పూజారాణి ఆధిక్యం దిశగా దూసుకెళ్లింది. అనంతరం మూడో రౌండ్ లో పదునైన పంచ్ లతో చెలరేగిన లీ కైన్.. జడ్జిల నుంచి అత్యధిక పాయింట్లు సాధించి పూజారాణికి చెక్ పెట్టింది. ఇదిలా ఉండగా నాల్గో రౌండ్ లో పూజారాణి పుంజుకుందామని ప్రయత్నాలను లీ అడ్డుకుని ఫైనల్ కు చేరుకుంది. అంతకుముందు మహిళల 48-51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో మేరీకోమ్ ఫైనల్ రౌండ్ కు చేరింది.వియాత్నం బాక్సర్ లి థాయ్ బాంగ్ పై మేరికోమ్ 3-0 తేడాతో గెలుపొందింది. ఫైనల్స్‌లో మేరీకోమ్ విజయం సాధిస్తే భారత్‌కు మరో పసిడి పతకం దక్కనుంది.అయితే సరితా దేవి కూడా సెమీ ఫైనల్లో ఓటమి చెందడంతో కాంస్యంతో సరిపెట్టుకుంది. -
గోల్డ్ మెడల్ కు ఒక్క అడుగు దూరంలో...
ఇంచియాన్: ఆసియా క్రీడల్లో భారత బాక్సర్ మేరికోమ్ స్వర్ణం పతకం సాధించేందుకు ఒక్క అడుగు దూరంలో నిలిచింది. ఇంచియాన్‌లో జరుగుతున్న ఏషియన్ క్రీడల్లో ఆమె మహిళల 48-51 కేజీల ఫ్లై వెయిట్ విభాగంలో ఫైనల్స్‌లోకి ప్రవేశించింది. వియాత్నం బాక్సర్ లి థాయ్ బాంగ్ పై మేరికోమ్ 3-0 తేడాతో గెలుపొందింది. ఫైనల్స్‌లో మేరీకోమ్ విజయం సాధిస్తే భారత్‌కు మరో పసిడి పతకం దక్కనుంది. ఒకవేళ ఆమె రన్నర్‌గా నిలిచినా రజిత పతకం దక్కనుంది. క్వార్టర్ ఫైనల్లో తనకంటే 10 ఏళ్లు చిన్నదైన చైనా ప్రత్యర్థి హైజువన్ ను మేరీకోమ్ ఓడించింది. -
మూడు పతకాలు ఖాయం
బాక్సింగ్ ఆసియా క్రీడల బాక్సింగ్‌లో భారత్‌కు కనీసం మూడు కాంస్య పతకాలు ఖాయమయ్యాయి. మహిళల విభాగంలో ఆదివారం ముగ్గురు భారత బాక్సర్లు మేరీకోమ్, సరితా దేవి, పూజా రాణి సెమీ ఫైనల్లోకి ప్రవేశించారు. వీరు తమ విభాగాల్లో సెమీస్‌లో ఓటమిపాలైనా కనీసం కాంస్యం దక్కుతుంది. 51 కేజీల విభాగంలో మేరీకోమ్ సునాయాసంగా సి హైజువన్ (చైనా)ను చిత్తు చేసింది. మేరీకంటే 10 ఏళ్లు చిన్నదైన చైనా ప్రత్యర్థి మూడో రౌండ్లో కొంత పోటీ ఇవ్వగలిగినా...ఐదు సార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన భారత బాక్సర్ ముందు నిలబడలేకపోయింది. సెమీస్‌లో మేరీకోమ్... వియత్నాంకు చెందిన లి థాయ్ బాంగ్‌తో తలపడుతుంది. 60 కేజీల విభాగంలో సరితాదేవి, సడ్ ఎర్డిన్ (మంగోలియా)పై ఘన విజయం సాధించింది. సెమీస్‌లో సరిత... జినా పార్క్ (కొరియా)ను ఎదుర్కొంటుంది. 75 కేజీల విభాగం క్వార్టర్స్‌లో పూజా రాణి, చైనీస్ తైపీకి చెందిన షెన్ దారా ఫ్లోరాను ఓడించింది. పదునైన అప్పర్‌కట్‌లతో చెలరేగిన పూజను ప్రత్యర్థి అడ్డుకోలేకపోయింది. సెమీస్‌లో లి కియాన్ (చైనా)తో పూజ పోటీ పడుతుంది. పురుషుల 49 కేజీల విభాగంలో క్వార్టర్స్ చేరేందుకు దేవేంద్రో సింగ్‌కు 87 సెకన్ల సమయం సరిపోయింది. దేవేంద్రో ‘నాకౌట్’ పంచ్‌తో బౌన్‌ఫోన్ (లావోస్)ను చిత్తు చేశాడు. క్వార్టర్స్‌లో అతను షిన్ జాంగున్ (కొరియా)ను ఢీకొంటాడు. -
ధోనీపై సినిమా ఖాయం!
క్రీడాకారుల జీవితం ఆధారంగా సినిమాలు తీయడమనేది బాలీవుడ్లో లేటెస్ట్ ట్రెండ్. గత ఏడాది మిల్కా సింగ్ జీవితంతో వచ్చిన ‘భాగ్ మిల్కా భాగ్’, ఈ ఏడాది మేరీ కోమ్ జీవితంతో వచ్చిన ‘మేరీ కోమ్’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. తాజాగా, టీమిండియా కెప్టెన్ మహేందర్ సింగ్ ధోని జీవితం ఆధారంగా ‘ఎం.ఎస్. ధోని’ పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. నీరజ్ పాండే దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం పోస్టర్ని ధోని భార్య సాక్షీ సింగ్ తన ట్విట్టర్ ద్వారా బయటపెట్టారు. అయితే, కొన్ని రోజుల క్రితం ధోనీ జీవితంతో సినిమా రూపొందనుందనే వార్త రాగానే, ‘బీసీసీఐ’ (బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా) అభ్యంతరం వ్యక్తం చేసిందనే వార్త వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్లో దోనీ ఇంకా ఆడుతున్నందున ఇప్పుడు సినిమా తీయడం సరికాదని, ఆయన రిటైర్ అయిన తర్వాత మాత్రమే ఈ సినిమా తీయాలని బీసీసీఐ చెప్పినట్లు ఓ వార్త హల్చల్ చేసింది. దాంతో ధోనీపై చిత్రం ఉండదని ఎవరికి వారు అనుకుంటున్న తరుణంలో, హఠాత్తుగా సాక్షీ సింగ్ ఈ చిత్రం పోస్టర్‌ను బయటపెట్టడంతోపాటు, ‘గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలన్నీ నిజం కాదు. మీ కోసమే ఈ పోస్టర్’ అని ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉంటే తన జీవితం ఆధారంగా సినిమా తీస్తున్నందుకుగాను హక్కుల నిమిత్తం ధోని 40 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. దాదాపు 100 కోట్ల రూపాయల నిర్మాణ వ్యయంతో రూపొందనున్న ఈ చిత్రంలో ధోనీగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ నటించనున్నారు. -
ఆసియా క్రీడల్లో తొలి స్వర్ణపతక విజేత?
1. సార్క దేశాల అంతర్గత, హోంశాఖ మంత్రుల సమావేశాన్ని 2014 సెప్టెంబర్ 19న ఎక్కడ నిర్వహించారు? ఎ) న్యూఢిల్లీ బి) ఢాకా సి) ఖాట్మాండు డి) కొలంబో 2. కేంద్ర ఎన్నికల సంఘం తరఫున ప్రచార కర్త కాని వ్యక్తి? ఎ) మహేంద్రసింగ్ ధోని బి) సైనా నెహ్వాల్ సి) మేరీ కోమ్ డి) దీపికా కుమారి 3. 2014 సెప్టెంబర్‌లో బీహార్‌లో నలంద విశ్వవిద్యాలయాన్ని ఎవరు ప్రారంభిం చారు? ఎ) నరేంద్రమోడి బి) రాజ్‌నాథ్ సింగ్ సి) సుష్మాస్వరాజ్ డి) ప్రణబ్ ముఖర్జీ 4. 17వ ఆసియాక్రీడల ప్రారంభోత్సవంలో భారత పతాక ధారి ఎవరు? ఎ) అభినవ్ బింద్రా బి) యోగేశ్వర్ దత్ సి) సుశీల్ కుమార్ డి) సర్దార్ సింగ్ 5. 2014 సెప్టెంబర్‌లో జరిగిన జీ20 ఆర్థిక మంత్రులు, కేంద్ర బ్యాంకుల గవర్నర్ల సమావేశానికి భారతదేశం తరఫున ఎవరు హాజరయ్యారు? ఎ) అరుణ్ జైట్లీ బి) నిర్మలా సీతారామన్ సి) సుష్మాస్వరాజ్ డి) రవిశంకర్ ప్రసాద్ 6. 2014 మార్చిలో దేవధర్ ట్రోఫీ క్రికెట్‌ను కైవసం చేసుకున్న జట్టు? ఎ) నార్త జోన్ బి) సౌత్ జోన్ సి) వెస్ట్ జోన్ డి) ఈస్ట్ జోన్ 7. గ్రూప్ ఆఫ్ ఎయిట్ (జీ 8) కూటమి నుంచి ఇటీవల ఏ దేశాన్ని సస్పెండ్ చేశారు? ఎ) జపాన్ బి) ఫ్రాన్స సి) ఇటలీ డి) రష్యా 8. డేవిస్ కప్ ఏ క్రీడకు సంబంధించింది? ఎ) వాలీబాల్ బి) ఫుట్‌బాల్ సి) టెన్నిస్ డి) బ్యాడ్మింటన్ 9. అయిదో టీ 20 ప్రపంచకప్ క్రికెట్‌కు 2014లో ఆతిథ్యమిచ్చిన దేశం? ఎ) శ్రీలంక బి) వెస్టిండీస్ సి) ఇంగ్లండ్ డి) బంగ్లాదేశ్ 10. ఈ- కామర్స దిగ్గజం అలీబాబా గ్రూప్ ఏ దేశానికి చెందింది? ఎ) సౌదీ అరేబియా బి) చైనా సి) భారత్ డి) ఫ్రాన్స 11. ఏ దేశం నుంచి విడిపోయి క్రిమియా 2014 మార్చి 18న రష్యాలో అంతర్భాగమైంది? ఎ) లాత్వియా బి) జార్జియా సి) ఉక్రెయిన్ డి) కజక్‌స్థాన్ 12. రష్యాలో అంతర్భాగమైన క్రిమియా రాజధాని? ఎ) యాల్టా బి) సింఫెరోపోల్ సి) ఫెడోసియా డి) కెర్చ 13. 16వ లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏ బాలీవుడ్ నటుడిని ప్రచాకర్తగా నియ మించింది? ఎ) షారుక్ ఖాన్ బి) అమితాబ్ బచ్చన్ సి) అమీర్ ఖాన్ డి) సల్మాన్ ఖాన్ 14. 2014 విజయ్ హజారే క్రికెట్ ట్రోఫీని ఏ జట్టు గెలుచుకుంది? ఎ) కర్ణాటక బి) రైల్వేస్ సి) తమిళనాడు డి) మహారాష్ర్ట 15. 2014 సంవత్సరానికిగాను ప్రిట్జ్కర్ ఆర్కి టెక్చర్ ప్రైజ్ షిగెరు బాన్‌కు లభించింది. ఆయన ఏ దేశస్థుడు? ఎ) దక్షిణ కొరియా బి) చైనా సి) జపాన్ డి) ఉత్తర కొరియా 16. కాన్పూర్‌లోని ఇండియన్ ఆర్డినెన్స ఫ్యాక్టరీ మహిళల రక్షణ కోసం రూపొందించిన తేలిక పాటి రివాల్వర్ పేరు? ఎ) నిర్భయ్ బి) నిర్భీక్ సి) ప్రగతి డి) అభయ్ 17. పార్లమెంట్‌తో తొలగింపునకు గురైన అలీ జైదాన్ ఏ దేశ ప్రధాని? ఎ) ఇరాన్ బి) ఇరాక్ సి) అల్జీరియా డి) లిబియా 18. మ్యాంగిఫెరా ఇండియా దేని శాస్త్రీయ నామం? ఎ) అరటి బి) ఆపిల్ సి) మామిడి డి) జామ 19. స్వతంత్ర భారతదేశంలో గవర్నర్‌గా పని చేసిన తొలి మహిళ ఎవరు? ఎ) శారదా ముఖర్జీ బి) సరోజినీ నాయుడు సి) విజయలక్ష్మీ పండిట్ డి) కుముద్‌బెన్ జోషి 20. 1978 నుంచి ఏటా ప్రపంచ అభివృద్ధి రిపోర్టను ఏ సంస్థ ప్రచురిస్తోంది? ఎ) ప్రపంచ వాణిజ్య సంస్థ బి) ప్రపంచ బ్యాంక్ సి) అంతర్జాతీయ ద్రవ్యనిధి డి) ఐక్యరాజ్యసమితి 21. భారతీయ రిజర్వబ్యాంక్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఎ) కోల్‌కతా బి) ఢిల్లీ సి) ముంబై డి) హైదరాబాద్ 22. 86వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ చిత్రంగా ‘12 ఇయర్స ఎ స్లేవ్’ ఎంపికైంది. ఈ చిత్ర దర్శకుడు? ఎ) స్టీవ్ మెక్‌క్వీన్ బి) అలెగ్జాండర్ పేన్ సి) డేవిడ్ రసెల్ డి) మార్టిన్ స్కోర్స 23. గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స అనే పుస్తకాన్ని ఎవరు రచించారు? ఎ) అనిత్ దేశాయ్ బి) అరుంధతీ రాయ్ సి) కిరణ్ దేశాయ్ డి) శోభా డే 24. రూపాయి నోటుపై ఎవరి సంతకం ఉంటుంది? ఎ) అర్బీఐ గవర్నర్ బి) ఆర్థిక మంత్రి సి) ఆర్థిక శాఖ కార్యదర్శి డి) ఆర్థిక సేవల కార్యదర్శి 25. కేంద్ర ఆహార సాంకేతిక పరిశోధనా సంస్థ (సీఎఫ్టీఆర్ఐ) ఎక్కడ ఉంది? ఎ) హైదరాబాద్ బి) మైసూరు సి) చెన్నై డి) నాగ్‌పూర్ 26. మహాత్మాగాంధీ దక్షిణాఫ్రికా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం? ఎ) 1919 బి) 1920 సి) 1917 డి) 1915 27. ప్రత్యేక గారోలాండ్ రాష్ర్ట డిమాండ్‌ను 2014 మార్చి 18న ఏ రాష్ర్ట అసెంబ్లీ తిరస్కరించింది? ఎ) మేఘాలయ బి) త్రిపుర సి) మణిపూర్ డి) పశ్చిమ బెంగాల్ 28. 2014 ఏప్రిల్ 1న మాన్యుయెల్ వాల్స్ ఏ దేశానికి ప్రధానిగా నియమితులయ్యారు? ఎ) ఫ్రాన్స బి) జర్మనీ సి) ఆస్ట్రియా డి) ఇటలీ 29. 2014 ఆల్ ఇంగ్లండ్ ఓపెన్ బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో ఛాంపి యన్‌గా ఎవరు నిలిచారు? ఎ) షిజియాన్ వాంగ్ బి) లీజురాయ్ సి) సైనా నెహ్వాల్ డి) వాంగ్ ఇహాన్ 30. 2014 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్స్ సోపోట్ నగరంలో జరిగాయి. సోపోట్ ఏ దేశంలో ఉంది? ఎ) జమైకా బి) పోలండ్ సి) రష్యా డి) ఫ్రాన్స 31. ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో) ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? ఎ) వాషింగ్టన్ బి) రోమ్ సి) న్యూయార్క డి) జెనీవా 32. 86వ ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ దర్శకుడిగా ఎంపికైన అల్ఫోన్సో క్యూరోన్ ఏ దేశానికి చెందినవాడు? ఎ) ఇటలీ బి) స్పెయిన్ సి) మెక్సికో డి) యూఎస్ఏ 33. భారత్ ట్వంటీ20 ప్రపంచ కప్ క్రికెట్‌ను ఏ సంవత్సరంలో గెలుచుకుంది? ఎ) 2009 బి) 2007 సి) 2010 డి) 2012 34. పెన్సిలిన్‌ను వేటి నుంచి తయారుచేస్తారు? ఎ) బ్యాక్టీరియా బి) వైరస్ సి) శైవలాలు డి) శిలీంద్రాలు 35. మారియా ఇసాబెల్ అలెండీ ఏ దేశ సెనేట్‌కు ప్రెసిడెంట్‌గా ఎంపికైన తొలి మహిళ? ఎ) అర్జెంటీనా బి) మెక్సికో సి) చిలీ డి) బొలీవియా 36. 17వ ఆసియా క్రీడల్లో భారత్‌కు తొలి స్వర్ణపతకం సాధించిన షూటర్? ఎ) అభినవ్ బింద్రా బి) జీతురాయ్ సి) గగన్ నారంగ్ డి) రంజన్ సోధి 37. 2014 లారెస్ క్రీడా పురస్కారాల్లో వరల్డ్ స్పోర్ట్సమన్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు? ఎ) సెబాస్టియన్ వెటెల్ బి) రఫెల్ నాదల్ సి) ఉసేన్ బోల్ట్ డి) రోజర్ ఫెదరర్ 38. 2014 మార్చిలో లక్నోలోని మేజర్ ధ్యాన్ చంద్ స్టేడియంలో జాతీయ పురుషుల హాకీ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్న జట్టు? ఎ) ఎయిర్ ఇండియా బి) ఉత్తర ప్రదేశ్ సి) రైల్వేస్ డి) కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా 39. ద సన్‌సెట్ క్లబ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? ఎ) ముల్క్‌రాజ్ ఆనంద్ బి) కుల్దీప్ నయ్యర్ సి) కుష్వంత్ సింగ్ డి) ఆర్. కె. నారాయణ్ 40. ఖజురహో దేవాలయాన్ని ఎవరు నిర్మించారు? ఎ) చోళులు బి) కాకతీయులు సి) చందేలులు డి) రాష్ర్టకూటులు సమాధానాలు 1) సి 2) డి 3) సి 4) డి 5) బి 6) సి 7) డి 8) సి 9) డి 10) బి 11) సి 12) బి 13) సి 14) ఎ 15) సి 16) బి 17) డి 18) సి 19) బి 20) బి 21) సి 22) ఎ 23) బి 24) సి 25) బి 26) డి 27) ఎ 28) ఎ 29) ఎ 30) బి 31) డి 32) సి 33) బి 34) డి 35) సి 36) బి 37) ఎ 38) ఎ 39) సి 40) సి -
'డిజిటల్ ' కార్యక్రమంలో ప్రియాంక
-
ఆ పోలికలు చాలా అన్యాయం: ప్రియాంక
ముంబై: స్పోర్ట్స్ స్టార్స్ జీవిత కథలు ఆధారంగా రూపొందుతున్నచిత్రాలకు ఆర్థికపరమైన లాభాపేక్షను ముడిపెట్టడం ఏమాత్రం సరికాదని బాలీవుడ్ ప్రముఖ నటి ప్రియాంక చోప్రా అభిప్రాయపడ్డారు. ప్రియాంక చోప్రా- మేరీ కోమ్ ఆదాయాలపై తారతమ్యాలను ఎత్తిచూపుతూ ఓ వర్గం ప్రజలు విమర్శలకు పాల్పడటంతో ప్రియాంక పై విధంగా స్పందించారు.ఆ స్పోర్ట్ స్టార్స్ జీవితాలను మరొకరి జీవితాలతో పోల్చవద్దని ప్రియాంక తన ఆవేదనను వ్యక్తం చేశారు.ఆ చిత్రాలలో ఒక నిగూఢమైన సందేశాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. 'ఇప్పటివరకూ మేరీ కోమ్ 5 సార్లు ప్రపంచ చాంఫియన్ అనే విషయం ఎవరికీ పెద్దగా తెలియకపోవచ్చు. సినిమా విడుదలయ్యే వరకూ దానిపై అసలు అవగాహనే ఉండకపోవచ్చు.మేరీ కోమ్ జీవితంలో జరిగిన వాస్తవ పరిస్థితిని తెరపై చూపించాం. అంతకుముందు వచ్చిన 'పాన్ సింగ్ తోమర్' భాగ్ మిల్కా సింగ్' చిత్రాలు చూస్తే ఆ విషయం ప్రతీ ఒక్కరికీ అవగతం అవుతుందన్నారు. దయచేసి వారి జీవితాలకు ఆర్థికపరమైన అంశాలను జతచేయకండి అంటూ ప్రియాంక విన్నవించారు. ప్రస్తుతం ప్రియాంక నటించిన 'మేరీ కోమ్' చిత్రం ఐదు రోజుల్లో దాదాపు 39 కోట్లు వసూలు చేసిన సంగతి తెలిసిందే. -
శిల్పను ఏడ్పించిన ప్రియాంక
నిజం.. బాలీవుడ్ భామ శిల్పాశెట్టిని స్టార్ నటి ప్రియూంకా చోప్రా ఏడిపించిందట. ఈ విషయం స్వయుంగా శిల్పాశెట్టే ట్విట్టర్లో చెప్పుకుంది. అంత ఏడిపించినా.. ప్రియూంకను తెగ పొగిడేసిందీ సుందరి! అసలు కథేమిటంటే, ప్రియూంక తాజా చిత్రం ‘మేరీ కోమ్’ చూసిన శిల్ప కళ్లలో నీళ్లు తిరిగాయుట. ప్రియూంక నటన అద్భుతవుని.. దర్శకుడు ఒవుంగ్ కువూర్ పనితనం చాలా బాగుందని మెచ్చేసుకుంది. ఇదే విషయూన్ని శిల్ప భర్త రాజ్‌కుంద్రా కూడా ట్వీట్ చేశాడు. ‘రియుల్ లైఫ్ క్యారెక్టర్‌ను రీల్ లైఫ్‌లో అద్వితీయుంగా పండించిన ప్రియూంక శిల్పతో కంట తడి పెట్టించింది’ అని. లార్జర్ దేన్ లైఫ్ ఇన్నేళ్లుగా లేని ఆలోచన ఇప్పుడెందుకు వచ్చిందో గానీ.. తనను తాను ‘వుహా’ద్భుతంగా ప్రజెంట్ చేసుకున్నాడు హాలీవుడ్ కండల వీరుడు ఆర్నాల్డ్ స్క్వార్కనెగ్గర్. తన కంటే పెద్దదిగా ఉన్న తన అధికారిక పోస్టర్‌ను కాలిఫోర్నియూలో స్వయుంగా ఆవిష్కరించాడు. ఒకప్పటి కాలిఫోర్నియూ గవర్నర్‌గా కూడా పనిచేసిన ఆర్నాల్డ్... ఈ నగరం గురించి చిన్నప్పటి నుంచీ తాను కలలు కనేవాడినన్నాడు. ఎప్పటికైనా ఈ నగరానికి వస్తానన్న నవ్ముకం తనకుండేదన్నాడు. ఆస్ట్రియున్ ప్రవుుఖ ఆర్టిస్ట్ గాట్ఫ్రెడ్ ఎల్నివిన్ ఈ ‘లార్జర్ దేన్ లైఫ్’ పోస్టర్‌ను రూపొందించాడు. డ దోస్త్ మేరా దోస్త్ హీరో రణబీర్ కపూర్.. తనకు వుధ్య ఏదో జరిగిపోతుందని వస్తున్న వార్తలకు ఫుల్స్టాప్ పెట్టాడు హీరో అర్జున్ రాంపాల్. ‘ఇప్పటి వరకు మేమిద్దరం వుంచి ఫ్రెండ్స్. ఇక వుుందు కూడా రణబీర్‌తో సంబంధాలు అలాగే ఉంటాయుని ఆశిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చాడు అర్జున్. వీరిద్దరూ కలసి ‘రాయ్’ సినివూలో నటిస్తున్నారు. రణబీర్ అందుబాటులో లేకపోవడం వల్ల అర్జున్ తరువాతి షెడ్యూల్ కోసం వేచి చూడాల్సి వచ్చిందట. దీనిపై అర్జున్ రాంపాల్ గరం అరుునట్టు సవూచారం. -
కంటతడి పెట్టిన శిల్పాశెట్టి
ముంబై: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఏడవడానికి కారణం ప్రియాంక చోప్రా కారణమైందట. ప్రియాంక చోప్రా నటించిన 'మేరి కోమ్' చిత్రాన్ని చూసి ఉద్వేగానికి లోనవ్వడమే తన దుఖానికి కారణమని శిల్పాశెట్టి తెలిపింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన 'మేరి కోమ్' చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలైన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ చిత్రాన్ని చూసిన శిల్పా. ప్రియాంక నటనను చూసి ఉద్వేగానిక లోనై కంటతడి పెట్టినట్టు ట్విటర్ లో ఓ సందేశాన్ని పోస్ట్ చేశారు. మేరి కోమ్ చిత్రాన్ని చూశాను. ప్రియాంక అద్బుతంగా నటించింది. ఒమంగ్ కుమార్ దర్శకత్వం బాగుంది. ఈ చిత్రాన్ని చూసి కంట తడి పెట్టుకున్నారు. ప్రతి ఒక్కరు చూడాల్సిన చిత్రం అని శిల్ప ట్వీట్ చేశారు. బాక్సింగ్ చాంఫియన్ మేరి కోమ్ తో శిల్పాశెట్టి, ఆమె భర్త రాజ్ కుంద్రాలు అభినందించారు. Jus Saw#MaryKom all actors performed so well but @priyankachopra u rocked it.Omungs done a fab job.Cried my eyeballs out..Must watch tweetos — SHILPA SHETTY (@TheShilpaShetty) September 7, 2014 -
'మేరి కోమ్'కు భారీ కలెక్షన్లు!
న్యూఢిల్లీ: బాక్సింగ్ ఛాంపియన్ ఎంసీ మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం కలెక్షన్ల వర్షం కరుపిస్తోంది. మేరి కోమ్ చిత్రం తొలివారాంతానికి (3 రోజులు) 28.32 కోట్ల రూపాయలు వసూలు చేసింది. సెప్టెంబర్ 5 తేది శుక్రవారం 8.02 కోట్లు, శనివారం 9.25 కోట్లు, ఆదివారం 11.05 కోట్లు రూపాయలను మేరి కోమ్ చిత్రం రాబట్టింది. ఈ చిత్రానికి వస్తున్న స్పందనపై ప్రియాంక చోప్రా ట్విటర్ లో ఆనందం వ్యక్తం చేసింది. 'మేరి కోమ్' చిత్రం ద్వారా ఒమంగ్ కుమార్ దర్శకుడిగా పరిచయమయ్యారు. ప్రియాంక నటన, కథ, కథనాలు విమర్శకులను ఆకట్టుకుంటున్నాయని చిత్రానికి సంబంధించిన వారు వెల్లడించారు. ఈ చిత్రం 1800 థియేటర్లలో విడులైంది. -
సన్నీ మస్తీ
అడల్ట్ స్టార్ సన్నీ లియోన్ వెండితెరపై మరోసారి తన అందాలు ఆరబోయుడానికి సిద్ధమైంది. ఈ పోర్న్ తార కొత్తగా ‘మస్తీజేడ్’ సినిమాలో నటించడానికి సై అంది. తుషార్ కపూర్, వీర్దాస్తో జట్టు కడుతున్న ఈ అమ్మడు వుస్తీజేడ్లో హాట్ సీన్లకు కొదవేలేదంటూ ట్వీట్ చేసింది. ప్చ్.. వియ్ మిస్ దట్ తన జీవిత కథ ఆధారంగా నిర్మించిన మూవీని హోమ్టౌన్ మిస్సవుతోందని బాక్సర్ మేరీ కోమ్ బాధ పడుతున్నారు. ప్రియాంకాచోప్రా లీడ్ రోల్ పోషించిన ‘మేరీ కోమ్’ మూవీ దేశవ్యాప్తంగా రికార్డు కలెక్షన్లు వసూలు చేస్తోంది. తిరుగుబాటుదారుల హెచ్చరికలతో ఈ సినివూ మేరీ కోమ్ సొంత రాష్ట్రం మణిపూర్‌లో రిలీజ్ కాలేదు. ఇన్ని ఇబ్బందుల మధ్య రిలీజ్ కాకపోవడమే మంచిదంటున్నారామె. టెర్మినేటర్ రిటర్న్స్ కండల వీరుడుగా పేరొందిన అర్నాల్డ్ స్క్వాజనెగ్గర్ 67 ఏళ్ల వయసులో సిల్వర్ స్క్రీన్‌పై కేకపుట్టిస్తానంటున్నాడు. టెర్మినేటర్ సిరీస్ 5వ సినిమాలో వురోసారి మెరుస్తున్నాడు. ఇప్పటికే సెట్స్ మీదున్న ఈ సినిమాకు ‘టెర్మినేటర్ జెనిసిస్’గా టైటిల్ ఫిక్స్ చేశారు. ఇదే విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన అర్నాల్డ్.. మూవీ టీమ్‌కు అభినందనలు తెలిపాడు. -
షార్ట్ రూట్ టు సక్సెస్
సినిమా తీయూలంటే క్వాలిఫికేషన్‌తో పనిలేదు. గాడ్‌ఫాదర్ అండదండలు అక్కర్లేదు. సినీ కుటుంబ వారసత్వంతో పని లేదు. మీలో ప్యాషన్ ఉంటే మేం ప్లాట్‌ఫాం కల్పిస్తావుంటోంది సినీషార్ట్స్. ఈ తరం ప్రతిభను వెలికితీయుడానికి షార్ట్ ఫిలిం పోటీలు నిర్వహిస్తోంది. బాలీవుడ్ సినీ దిగ్గజం సంజయ్ లీలా భన్సాలీ, మేరీకోమ్ చిత్ర దర్శకుడు ఉమంగ్ కుమార్ తదితరులతో కూడిన జ్యూరీ ఉత్తమ చిత్రాలను ఎంపిక చేస్తుంది. పోటీలో గెలుపొందిన మొదటి ఐదు చిత్రాలకు బహువుతి అందించడంతో పాటు, వీటిని ఓ జాతీయు చానల్లో ప్రసారం చేయునున్నారు. మొదటి స్థానంలో నిలిచిన చిత్రానికి రూ.లక్ష, తర్వాతి స్థానాల్లో నిలిచిన చిత్రాలకు వరుసగా రూ.50 వేలు, రూ.40 వేలు, రూ.30 వేలు, రూ.20 వేలు ఇవ్వనున్నారు. ‘అగెనైస్ట్ ఆల్ ఆడ్స్’ థీమ్‌తో హిందీలో 5 నిమిషాల చిత్రాన్ని రూపొందించి సినీషార్ట్స వెబ్సైట్ (http://www.cineshorts.in) లో సబ్మిట్ చేయూల్సి ఉంటుంది. వయాకామ్ 8 మీడియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ షార్ట్ ఫిలిం పోటీకి ఎంట్రీలు పంపడానికి చివరి తేదీ 30 సెప్టెంబర్. ముంబై 48 అవర్ ఫిలిం ప్రాజెక్ట్ 48 గంటల్లో షార్ట్ ఫిలిం తీసే సత్తా మీకు ఉంటే ఈ పోటీ మీ కోసమే. ప్రపంచ వ్యాప్తంగా వివిధ నగరాల్లో నిర్వహించే ఈ పోటీ అక్టోబర్ 10వ తే దీ నుంచి 12 వరకు ముంబై లో జరగనుంది. ఈ పోటీలో ఉత్తమగా నిలిచిన చిత్రాలను అంతర్జాతీయు పోటీలకు ఎంపిక చేస్తారు. ఇందులో పాల్గొంటున్న ప్రతి టీమ్‌కు జానర్‌తో పాటు ఒక డైలాగ్, ఒక ప్రాపర్టీ, ఒక క్యారెక్టర్‌ను అసైన్ చేస్తారు. వీటితో చక్కటి సినిమాను 48 గంటల్లో పూర్తి చేయూల్సి ఉంటుంది. ఈ పోటీలకు ఆన్లైన్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫీజు రూ.2,500గా నిర్ధారించారు. ఇతర వివరాలకు లాగ్ ఇన్ టు.. www.48hourfilm.com/en/mumbai -
బాలీవుడ్ కలెక్షన్లపై మేరి కోమ్ పంచ్ పడింది!
న్యూఢిల్లీ: బాలీవుడ్ కలెక్షన్ల పై ప్రియాంక పంచ్ భారీగానే పడింది. ఇప్పటి వరకు హీరోలే బాలీవుడ్ కలెక్షన్లకు స్టామినా అని నమ్మె నిర్మాతలు తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోల కలెక్షన్లకు ధీటుగా మేరి కోమ్ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లో మేరి కోమ్ చిత్రం 17.25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. దేశవ్యాప్తంగా 1800 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రాన్ని సినీ, క్రీడా ప్రేక్షకులు భారీగానే ఆదరిస్తున్నారు. ఐదుసార్లు ప్రపంచ చాంఫియన్ గా నిలిచిన మేరికోమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి సహ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కాగా, ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. -
మణిపూర్ లో 'మేరి కోమ్' ఎందుకు విడుదల కాలేదు?
బాక్సింగ్ చాంఫియన్ మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం స్వంత రాష్ట్రం మణిపూర్ లో విడుదలకు నోచుకోకపోవడంపై ఆ ప్రాంతవాసులు నిరాశకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా విడుదలై అందర్ని ఆకట్టుకుంటున్న మేరి కోమ్ చిత్రాన్ని మణిపూర్ రాజధాని ఇంఫాల్ లో విడుదల చేయించేందుకు అన్లర్ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. తాజాగా విడుదలైన ఈ చిత్రాన్ని మణిపూర్ లో విడుదల చేయించేందుకు చిత్ర సహనిర్మాతలు వాయాకామ్18 మోషన్ పిక్చర్స్ ను మేరి కోమ్ భర్త ఆన్లర్ సంప్రదించారు. ఈ చిత్ర విడుదల కోసం మణిపూర్ ముఖ్యమంత్రి ఓక్రమ్ ఐబోబీ సింగ్ కార్యాలయ అధికారులతో కలిసి చర్చలు జరుపుతున్నారు. 'మేరి కోమ్ చిత్ర విడుదలకు సాధ్యమయ్యేంత వరకు కృషి చేస్తున్నాం. ఏమవుతుందో చూద్దాం' అని వాయాకామ్18 ప్రతినిధి అన్నారు. గత కొద్దికాలంగా మణిపూర్ లోని ఉగ్రవాద సంస్థలు హిందీ చిత్రాల పదర్శనపై నిషేధం విధించారు. ప్రపంచమంతటా ఈ చిత్రాన్ని చూస్తున్నారు. మణిపూర్ లో ప్రదర్శనకు నోచుకోకపోవడంపై బాధగా ఉందని మేరి కోమ్ తెలిపారు. ఈ చిత్రాన్ని ఇక్కడ విడుదల చేయడం చాలా రిస్క్ తో కూడుకున్న పని. ఎందుకైనా మంచిది ప్రదర్శించకపోవడమే మంచిదనుకుంటున్నాను. ఈ చిత్ర విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నానని మేరి కోమ్ అన్నారు. ఇటీవల ముంబైలో ప్రదర్శించిన ప్రీమియర్ షోను మేరి కోమ్ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, బాక్సింగ్ విద్యార్ధులు చూశారు. బాలీవుడ్ తార ప్రియాంక చోప్రా నటించిన 'మేరి కోమ్' చిత్రం శుక్రవారం విడుదలై.. విమర్శకుల ప్రశంసలందుకుంటోంది. -
పబ్లిసిటీ స్టంట్స్ అంటున్ను బిటౌన్
-
అలా పిలవడమే తప్పు
న్యూఢిల్లీ: హీరోయిన్ కేంద్రంగా నడిచే కథా చిత్రాలన్నింటినీ ‘లేడీ ఓరియెంటెడ్ సినిమా’గా పిలవడం మామూలే. అయితే ప్రియాంకా చోప్రాకు మాత్రం ఈ పిలుపు నచ్చడం లేదు. ఒక సినిమా మంచీచెడును దాని కథ ఆధారంగా నిర్ణయించాలె తప్ప పాత్రలతో కాదని ఈమె చెప్పింది. బాక్సర్ మేరీకోమ్ జీవితగాథ ఆధారంగా అదే పేరుతో రూపొందించిన సినిమాలో ఈ బ్యూటీ ప్రధానపాత్ర పోషించడం తెలిసిందే. మేరీకోమ్ శుక్రవారమే విడుదలయింది. ‘సినిమాల్లో మహిళాపాత్రధారికి అమిత ప్రాధాన్యం ఇస్తూ వివక్ష చూసే సంస్కృతి బాలీవుడ్, మీడియాలో ఇప్పటికీ ఉంది. దీనివల్ల ఆమె ప్రతిభ కనుమరుగువుతుంది. అందుకే నాకు ‘లేడీ ఓరియెంటెడ్’ అనే పదమే నచ్చదు. ఇది హీరోయిన్ ప్రతిభ, శ్రమను పట్టించుకోదు. మామూలుగా హీరో నటిస్తే దానికి ఎంతమాత్రమూ ప్రాధాన్యం ఉండదు. అదే హీరోయిన్ కీలకపాత్రలో ఉంటే ఆ సినిమాకు ప్రత్యేక గుర్తింపు వస్తోంది. ఇలా ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదన్నది నా అభిప్రాయం. మా నటన, శ్రమ ఆధారంగా గుర్తింపు ఇవ్వండి. హీరోల సినిమాల్లాగే మా చిత్రాలనూ విమర్శించండి లేదా ప్రశంసించండి’ అని ప్రియాంక చెప్పింది. మనదేశంలో ఇది వరకే బాలికలపై వివక్ష ఉందని, ఈ విషసంస్కృతి బాలీవుడ్‌లోనూ కొనసాగుతూనే ఉందని విచారం వ్యక్తం చేసింది. సినీప్రముఖులు ముందుగా వారి రంగంలోని వివక్షను నిర్మూలించగలిగితేనే దేశంలోనూ దీనిని తొలగించేందుకు అవకాశం ఉంటుందని తెలిపింది. ఒలింపిక్ పతకం సాధించడానికి మేరీకోమ్ పడ్డ కష్టాన్ని ఈ సినిమా అద్భుతంగా చూపిస్తుందని, ఇది ప్రతి ఒక్కరికీ ఇది స్ఫూర్తిదాయక చిత్రమని జాతీయ అవార్డు గ్రహీత కూడా అయిన ఈ 32 ఏళ్ల బ్యూటీ చెప్పింది. మనల్ని ఎప్పుడూ నిరుత్సాహపర్చేవారు అంతటా ఉంటారని, వీరిని పట్టించుకోకుండా ముందుకు సాగాలని యువతకు ప్రియాంకా చోప్రా పిలుపునిచ్చింది. -
సోఫియా హ్యాట్రిక్
హాలీవుడ్... బాలీవుడ్... ఏ ‘వుడ్’లతో టచ్ లేకపోరుునా కోట్లు గడిస్తోంది టీవీ నటి సోఫియా వెర్గారా. ఫోర్బ్స్ వ్యూగజైన్ ‘హయ్యుస్ట్ పెరుుడ్ యూక్ట్రెస్’ లిస్టులో వరుసగా మూడో ఏడాదీ ఈ అమ్మడే టాప్ ప్లేస్ దక్కించుకుంది. ఈ ఏడాదిలో సోఫియూ సంపాదన దాదాపు 37 మిలియున్ డాలర్లని అంచనా. 13 మిలియున్ డాలర్లతో రెండో స్థానంలో నిలిచింది వురిస్కా హర్గిటే. శ్రుతి మించిన ప్రమోషన్ ‘దేశీ కట్టే’ చిత్రం టీమ్ చౌకబారు పబ్లిసిటీతో పరువు తీసుకుంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఈ చిత్రం ఆడియో లాంచింగ్‌లో.. పాటల వీడియో ప్లే చేస్తుండగా వుధ్యలో ఓ నీలి చిత్రం క్లిప్పింగ్ వచ్చేసింది. ఈ దెబ్బకు అక్కడున్నవారు షాక్‌కు గురయ్యారన్నది ‘మిడ్ డే’ కథనం. ఇది ఓ టెక్నీషియున్ పనని అంటున్నా... అతడు మాత్రం తనకేమీ తెలీదన్నాడు. ఇది తమనీ దిగ్భ్రాంతికి గురిచేసిందనేది నిర్మాత, దర్శకుల మాట. అసోంలోనూ నో ట్యాక్స్ ప్రియాంకాచోప్రా నటించిన ‘మేరీకోమ్’ చిత్రానికి అసోం ప్రభుత్వం ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఎత్తివేసింది. స్ఫూర్తిదాయుకమైన వుణిపూర్ వుహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా తీసిన ఈ చిత్రం శుక్రవారం విడుదలవుతోంది. మేరీ యూవత్ దేశానికీ గర్వకారణవుని, అందుకే ట్యాక్స్ విధించడం లేదని అసోం వుుఖ్యవుంత్రి తరుణ్ గొగోయ్ చెప్పారు. వుహారాష్ర్ట, ఉత్తరాఖండ్ రాష్ట్రాలు ఇప్పటికే ఈ సినివూపై ట్యాక్స్ ఎత్తివేశాయి. -
హామేరీకోమ్స్
పేదరికం ఎదురు నిలిచినా... కుటుంబం బాధ్యతలు మోపినా... సంకల్పమే ఆమెకు బలం. పట్టుదలే ప్రోత్సాహం. లక్ష్యం ఉండాలే గానీ... ఏవీ అడ్డంకులు కాదన్నది ఆమె నమ్మిన సిద్ధాంతం. కృషే పెట్టుబడిగా... సవాళ్లే నిచ్చెనగా చేసుకొని ఎదిగిన వుట్టిలో మాణిక్యం.. బాక్సింగ్ చాంపియన్ మేరీకోమ్. పవర్ పంచ్‌లతో రింగ్‌లో ప్రత్యర్థులను వుట్టికరిపిస్తున్న ఈ వుణిపూర్ వుణిపూస స్ఫూర్తితో వున సిటీలోనూ పుట్టుకొస్తున్నారు మేరీకోమ్‌లు. కృష్ణప్రియ, ధ్రువిక, ప్రవల్లిక, ఒసామా, సునీత, నసీరున్, తన్మయ్ యాదవ్... ఒకరా ఇద్దరా... మెరుపు పంచ్‌లు విసురుతూ అకుంఠిత దీక్షతో ‘టార్గెట్’ వైపు దూసుకుపోతున్నారు ఎందరో బాలికలు. కృష్ణప్రియ. నిరుపేద కుటుంబం. నాన్న జ్ఞానేశ్వర్ ఫుట్‌పాత్‌పై హెల్మెట్స్ అమ్ముతుంటాడు. ప్యారడైజ్ నల్లగుట్ట గవర్నమెంట్ గర్ల్స్ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. పీఈటీ, తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జింఖానా గ్రౌండ్లో రెండేళ్ల నుంచి బాక్సింగ్‌లో కోచింగ్ తీసుకుంటోంది. ఎల్బీ స్టేడియంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ట్ బాక్సింగ్ పోటీల్లో గోల్డ్‌మెడల్ సాధించింది. నగ్మా రెడ్‌హిల్స్‌లోని ఇండో గ్రామర్ హైస్కూల్లో పదో తరగతి చదువుతోంది. తండ్రి షేక్ ముక్తా నాంపల్లిలో మెకానిక్. ఆమె గతేడాది అసోంలో జరిగిన నేషనల్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ప్రతిభ చూపింది. జిల్లాస్థాయి టోర్నీల్లోనూ పలు పతకాలను సాధించింది. ఆ నలుగురు... బి.కృష్ణవేణి, మౌనిక, నవ్య, రోజా సీతాఫల్‌మండిలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదువుకుంటున్నారు. పీఈటీలు హరిశ్చంద్రప్రసాద్, శ్రీనివాస్మూర్తిల పర్యవేక్షణలో బాక్సింగ్‌లో రాటుదేలుతున్నారు. గతేడాదిలో రాష్ట్రస్థాయి పోటీల్లో పతకాలు సాధించారు. ఇంటర్ డిస్ట్రిక్ట్ టోర్నీలో గోల్డ్‌మెడల్స్ దక్కించుకున్నారు. కృష్ణవేణికి అమ్మ లే దు. నాన్న గాంధీ వాచ్‌మన్. మౌనిక నాన్న నాగేశ్వర్రావు చిరు వ్యాపారి. నవ్య తండ్రి యాదగిరి రిక్షాపుల్లర్. రోజా ఫ్యామిలీదీ రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితి. తండ్రి హనుమంతు, తల్లి కమలమ్మ మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు. వీరందరూ కడుపుకట్టుకొని కన్నబిడ్డల కలలు నెరవేర్చేందుకు కష్టపడుతున్నారు. ఈ అమ్మాయిలందరిదీ ఒకేమాట.. ‘లక్ష్యాన్ని చేరుకునేదాకా పిడిగుద్దుల వర్షం కురిపిస్తాం.’ శిక్షణ ఇలా... ఎల్బీ స్టేడియం, సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్లో బాక్సింగ్‌లో శాప్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ ‘పే అండ్ ప్లే’ పద్ధతిలో ప్రవేశం పొందవచ్చు. నిజాం కాలేజీలోని శిక్షణ కేంద్రానికి ఉస్మానియా వర్సిటీ నిధులు సమకూరుస్తోంది. ఎల్బీ స్టేడియం కోచ్ ఓంకార్ యాదవ్ -99851 55357, జింఖానా మైదానం కోచ్ శ్రీకాంత్‌రెడ్డి -94920 35789, నిజాం కళాశాల కోచ్ కేఆర్ స్టీవన్ -92465 38129. ఎల్బీ స్టేడియం కేంద్రంలో ప్రవేశానికి కనీసం 11 ఏళ్లు నిండి ఉండాలి. 14 ఏళ్లలోపు వారు రూ.35, 14 ఏళ్లు పైబడినవారు రూ.70 ప్రవేశ రుసుం చెల్లించాలి. నెల ఫీజూ అంతే మొత్తం. జింఖానాగ్రౌండ్‌లో ప్రవేశానికి 14 ఏళ్ల లోపు బాలలు రూ.70, ఆ వయసు పైబడినవారు రూ.110 ప్రవేశ రుసుం చెల్లించాలి. 14 ఏళ్లలోపు వారు రూ.30, 14 ఏళ్లు పైబడినవారు రూ.50 ప్రతినెలా ఫీజు చెల్లించాలి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నారు. మెళకువలపై పట్టు ముఖ్యం... పదిహేనేళ్లుగా బాక్సింగ్ శిక్షణ ఇస్తున్నా. మెలకువల్లో పట్టు సాధిస్తే బాక్సింగ్‌లో రాణించడం తేలికే. మా కేంద్రంలో బాక్సర్లకు కావలసిన సామగ్రి అంతా అందుబాటులో ఉంది. - ఓంకార్ యాదవ్, శాప్ బాక్సింగ్ కోచ్, ఎల్బీ స్టేడియం జీహెచ్ఎంసీ శిక్షణ కేంద్రాలు.. కోచ్‌లు రీహ ంపురా ప్లే గ్రౌండ్- పురానాపూల్-అనిల్ కుమార్-99081 99383 కులీకుతుబ్ షా-మోహన్‌దాస్ మఠ్ పురానాపూల్-బహుదూర్ సింగ్-8801093421 సలర్-ఈ-మిల్లార్ చందూలాల్ బరాదరి- బహుదూర్‌పురా ఇస్మాయిల్ 9885963502 ఫలక్‌నుమా ప్లే గ్రౌండ్ అబిద్ ముస్తఫా-9652924694 విక్టరీ ప్లే గ్రౌండ్-చాదర్‌ఘాట్ దుర్గాప్రసాద్-98666 72227 జీహెచ్ఎంసీ ప్లే గ్రౌండ్- షెనాయ్ నర్సింగ్ హోం-మారేడ్ పల్లి కె.కృష్ణ -9290218047 గురుమూర్తి స్విమ్మింగ్ పూల్ పరేడ్ గ్రౌండ్స్ (అశోక్ కుమార్) - వాంకె శ్రీనివాస్ -
మేరీ కోమ్ మూవీ స్టిల్స్
-
పాత్రలో లీనమైపోయా
ముంబై: ‘మేరీ కోమ్’ పాత్రలో తాను లీనమైపోయానని, ఒకవేళ ఇదికనుక బాక్సాఫీస్ వద్ద బోల్తాపడితే తన హృదయం గాయపడుతుందని బాలీవుడ్ నటి ప్రియాంకచోప్రా చెప్పింది. ప్రముఖ భారతీయ బాక్సర్ మేరీకోమ్ జీవిత గాధను ‘మేరీకోమ్’ సినిమాగా రూపొందుతోంది. ‘ఈ సినిమా నాకు ఎంతో ప్రత్యేకం. ఈ పాత్రకు తగు న్యాయం చేసేందుకు శాయశక్తులా కృషి చేశా. జీవితంలో అత్యంత విషాదం తనను ముట్టిన సమయంలో షూటింగ్లో పాల్గొన్నా. మా నాన్నగారు చనిపోయిన నాలుగురోజుల తర్వాతే ఈ సినిమా షూటింగ్ మొదలైంది. నా బాధంతా ఇందులో కనిపిస్తుంది. ఈ సినిమా షూటింగ్ జరిగిన ప్రతి రోజూ నాకో సవాలువంటిది. నా ఆత్మలో కొంతభాగం ఇందులోకి వెళ్లిపోయింది. ఇంటికెళ్లిన ప్రతిరోజూ ఈ సినిమా చేయగలనో లేదోనంటూ అమ్మ దగ్గర ఏడ్చేదాన్ని. అయితే మరుసటి రోజు మాత్రం ఎప్పటిమాదిరిగానే షూటింగ్‌కు వెళ్లిపోయేదాన్ని’ అని మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది. మేరీకోమ్‌ను తలపించేరీతిలో మారేందుకుగాను ప్రియాంకచోప్రా ప్రతిరోజూ ఎంతో శ్రమించేది. వాకింగ్, రన్నింగ్, బాక్సింగ్ వంటి వాటిని సాధన చేసేది. ఒముంగ్ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ‘ఈ సినిమా నాకు అత్యంత ప్రత్యేకమైనది. వైఫల్యాలను ఎదుర్కోవడానికి ఇష్టపడను. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడదని ఆశిస్తున్నా. ఈ సినిమా ఇతివృత్తం నాకు ఎంతో స్ఫూర్తిని కలిగించింది. ఈ సినిమా బాగా ఆడుతుందని ఆశిస్తున్నా’అని తెలిపింది. కాగా ఈ సినిమాపై దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రియాంక ప్రచారం చేస్తోంది. టొరంటోలో జరగనున్న అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఈ నెల నాలుగో తేదీన హాజరు కానుంది. కాగా మేరీ కోమ్ సినిమా ఈ నెల ఐదో తేదీన విడుదల కానుంది. -
'మేరి కోమ్'కు యూపీ పన్ను మినహాయింపు!
లక్నో: భారత బాక్సర్ మేరీ కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన బాలీవుడ్ చిత్రానికి వివిధ రాష్ట్రాల్లో ఆదరణ లభిస్తోంది. మేరీకోమ్ చిత్రానికి ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు ఇచ్చిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర బాటలోనే ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా చేరింది. 'మేరికోమ్' చిత్రానికి యూపీ కూడా పన్ను మినహాయింపు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. యూపీలోని మహిళలకు స్పూర్తిగా నిలిచే చిత్రంగా 'మేరికోమ్' చిత్రం నిలువాలని ప్రభుత్వం ఓ ప్రకటనలో వెల్లడించింది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మించిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా 'మేరీ కోమ్' పాత్రను పోషిస్తోంది. 'మేరి కోమ్' చిత్రం సెప్టెంబర్ 5 తేదిన విడుదలవుతోంది. -
జీవితంతో బాక్సింగ్
విజయం: మహిళలకు బాక్సింగ్ అంటేనే నవ్విపోయే పరిస్థితుల్లో.. కనీసం చేతులకు గ్లవ్స్ కూడా కొనుక్కోలేని పేదరికం నుంచి వచ్చిన ఓ అమ్మాయి వరుసగా ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచింది. అమ్మా నాన్నలకు ఆసరాగా నిలవాలనే లక్ష్యంతో బాక్సింగ్‌ను ఎంచుకున్నా.. కఠోర శ్రమ, పట్టుదలతో అటు ప్రత్యర్థులతోపాటు ఇటు జీవితంతోనూ తలపడి గెలిచింది. ఒలింపిక్స్‌లో పతకం సాధించి దేశానికి కీర్తి ప్రతిష్టలు సంపాదించిపెట్టింది. ఇద్దరు పిల్లలకు తల్లి అయ్యాక కూడా బాక్సింగ్ రింగ్‌లో విజయాల పంచ్‌లు కురిపించి మహిళలందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది మేరీ కామ్. దేశం గర్వించదగ్గ ఈ క్రీడారత్నం జీవితకథ త్వరలో సినిమా రూపంలో మన ముందుకు రానుంది. మణిపూర్ రాష్ట్రంలోని చురాచంద్పూర్ జిల్లాలో కంగ్తయ్ అనే మారుమూల గ్రామంలో నిరుపేద గిరిజన కుటుంబంలో 1983 మార్చి 1వ తేదీన జన్మించింది మేరీ కామ్. తండ్రి మాంగ్తే తోన్పాకామ్, తల్లి మాంగ్తే అఖమ్ కామ్లు అడవుల్లో చెట్లను నరికి, కాల్చివేసి వ్యవసాయ భూమిని తయారు చేసే పని (ఝమ్ కల్టివేషన్)లో దినసరి కూలీలు. బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి తానూ పనికి వెళ్లిన మేరీ.. తమ కోసం వారు పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయేది. దీంతో ఎలాగైనా వారికి ఆసరాగా నిలవాలనే ఉద్దేశంతో క్రీడల్లో అడుగుపెట్టింది. ఆరంభంలో అథ్లెటిక్స్‌పై ఆసక్తి కనబరిచినా.. తమ రాష్ట్రానికే చెందిన డింకోసింగ్.. 1998లో ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో స్వర్ణ పతకం సాధించడం చూసి మేరీ తన నిర్ణయాన్ని మార్చుకుంది. ఎవరి మద్దతూ లేకపోయినా.. బాక్సింగ్ క్రీడ మగవాళ్లకు మాత్రమేనన్న అభిప్రాయం బలంగా ఉన్న పరిస్థితుల్లో.. ఏ ఒక్కరూ మద్దతుగా నిలవకపోయినా బాక్సర్‌ను కావాలన్న లక్ష్యాన్ని వీడలేదు మేరీ కామ్. బాక్సింగ్ రింగ్‌లో పంచ్‌లు కురిపించే అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు ఎవరూ ముందుకు రారన్న ఆందోళనలో ఉన్న తల్లిదండ్రులకు సర్దిచెబుతూ.. శిక్షణ ఇచ్చేందుకు నిరాకరించిన కోచ్‌ను ఒప్పిస్తూ తొలి అడుగులు వేసింది. కోచ్ ఇంబోచా సింగ్ వద్ద అంతా అబ్బాయిలే శిక్షణ తీసుకుంటున్నా.. వెరవకుండా వారితో కలిసే మెళకువలు నేర్చుకుంది. మణిపూర్ రాష్ట్ర కోచ్ ఎం.నర్జిత్సింగ్ వద్ద శిక్షణతో రాటుదేలి 2000 సంవత్సరంలో.. పాల్గొన్న తొలిసారే రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో విజేతగా నిలిచింది. దీంతో గర్వంతో పొంగిపోయిన తండ్రి.. భుజం తట్టగా మరింత ఉత్సాహంతో ముందుకు సాగింది మేరీ. ‘చెన్నై’తో మొదలు... 2001 ఫిబ్రవరిలో చెన్నైలో జరిగిన జాతీయ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన మేరీ కామ్.. తన జైత్రయాత్రను ఏడాదంతా కొనసాగించింది. 18 ఏళ్ల వయసులోనే అమెరికాలోని పెన్సిల్వేనియాలో మహిళలకు తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో 48 కేజీల ఫ్లై వెయిట్ కేటగిరీలో పాల్గొని రజతం గెలిచింది. 2002లో టర్కీలో జరిగిన ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం కైవసం చేసుకుంది. ఆ తరువాత 2005, 2006, 2008, 2010లలో జరిగిన ప్రపంచకప్‌లలో వరుసగా విజేతగా నిలిచింది. ఈ క్రమంలో 2006 ప్రపంచకప్ తరువాత ఇద్దరు కవల పిల్లలకు జన్మనిచ్చిన మేరీ.. మళ్లీ బాక్సింగ్ రింగ్‌లోకి దిగుతూనే చాంపియన్‌గా నిలిచి ఆశ్చర్యపరిచింది. దృఢచిత్తం ఉండాలి... బాక్సర్‌గా సక్సెస్ కావాలంటే శారీరకంగా బలంగా ఉండటమొక్కటే సరిపోదు. గెలిచి తీరాలన్న పట్టుదల, వెనకడుగు వేయరాదన్న ధృడచిత్తం అవసరం. మహిళలు బాక్సింగ్‌లో రాణించాలంటే పురుషుల కన్నా ఎక్కువగా శ్రమించాల్సివుంటుంది.కెరీర్లో ఎక్కువసార్లు నాకన్నా ఎత్తుగా, బలంగా ఉన్న ప్రత్యర్థుల్నే ఎదుర్కొన్నాను. కానీ, నా తక్కువ ఎత్తునే అనుకూలంగా మలచుకుని ప్రత్యర్థికి అందకుండా తప్పించుకుంటాను. రింగ్‌లో వారిని ఎక్కువగా పరిగెట్టిస్తూ.. అలసటకు గురిచేస్తాను. ఆ తరువాత నా పంచ్‌ల రుచి చూపించి పడగొడతుంటాను. -మేరీ కామ్ ప్రతికూలతల్ని దాటి... ప్రతి క్రీడాకారుడికీ ఒలింపిక్స్‌లో పతకం సాధించడమన్నది ఓ స్వప్నం. ఐదుసార్లు విజేతగా నిలిచినా.. విశ్వ క్రీడల్లో పాల్గొనలేకపోయానన్న బాధ మేరీ కామ్‌ను వేధిస్తుండేది. అయితే 2012లో లండన్ ఒలింపిక్స్‌లో దాన్ని చేర్చడంతో మేరీకి ఆ అవకాశం రానే వచ్చింది. కానీ, కనీసం 51 కేజీల నుంచి మూడు కేటగిరీలకు మాత్రమే చోటు కల్పించారు. దీనికి తగ్గట్టుగానే ఏఐబీఏ కూడా ప్రపంచ చాంపియన్‌షిప్‌లో మహిళలకు ఈ మూడు కేటగిరీల్లోనే పోటీలు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో ఒలింపిక్స్ బెర్తు దక్కించుకునేందుకు మేరీ అత్యంత కఠినమైన పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. అప్పటిదాకా 45, 46 కేజీల కేటగిరీల్లో పోటీపడుతూ వచ్చిన మేరీ కామ్.. 51 కేజీలకు మారాల్సి వచ్చింది. దీంతో మహిళల ప్రపంచకప్‌లో తొలిసారిగా 2012లో మేరీ.. సెమీఫైనల్లో బ్రిటన్‌కు చెందిన నికోలా ఆడమ్స్ చేతిలో ఓటమిపాలైంది. కానీ, ఒలింపిక్స్ బెర్తును మాత్రం దక్కించుకోగలిగింది. ఫలించిన కల... బాక్సింగ్‌లో అడుగు పెట్టిన నాటి నుంచి మేరీ కామ్ కన్న కల నిజమయ్యే రోజు వచ్చింది. ఉద్విగ్నభరిత క్షణాల మధ్య లండన్ ఒలింపిక్స్‌లో తొలిరౌండ్ కోసం రింగ్‌లో అడుగు పెట్టిన మేరీ.. బెబ్బులిలా విజృంభించింది. కరోలినా మిచల్చుక్ (పోలండ్)ను అలవోకగా ఓడించి క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. క్వార్టర్స్‌లో మరోవా రహాలి (టునిషియా)నూ మట్టికరిపించింది. అయితే సెమీ ఫైనల్లో మళ్లీ నికోలా ఆడమ్స్ (బ్రిటన్) ఎదురైంది. ఆమెతో తీవ్రంగా పోరాడిన మేరీ..చివరకు 6-11తో ఓటమిపాలైంది. కానీ, మూడోస్థానంలో నిలవడం ద్వారా కాంస్య పతకాన్ని దక్కించుకుని సగర్వంగా నిలిచింది. లండన్‌లో మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించి.. భారత మహిళలందరికీ స్ఫూర్తిప్రదాత అయింది. పద్మభూషణ్ ‘మేరీ’... ఒలింపిక్ పతకం సాధించి మహిళలందరికీ ఆదర్శంగా నిలిచిన మేరీ కామ్‌ను భారత ప్రభుత్వం 2013లో పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. అంతకుముందు 2010లోనే పద్మశ్రీ అవార్డునందించింది. దీంతోపాటు 2009లో రాజీవ్ గాంధీ ఖేల్త్న్ర, 2003లో అర్జున అవార్డుల్ని మేరీ కామ్ అందుకుంది. వెండితెరపై ‘మేరీ కామ్’ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకమైన మేరీ కామ్ జీవితం వెండితెరపై ఆవిష్కృతం కానుంది. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. మేరీ కామ్ పాత్రను పోషిస్తుండగా ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో సంజయ్ లీలా భన్సాలీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్లామర్ క్వీన్ ఇమేజ్ ఉన్న ప్రియాంక ఈ చిత్రం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకొని మేరీ కామ్ పాత్రకు ప్రాణప్రతిష్ట చేసింది. చిత్రం ప్రివ్యూను ఇప్పటికే వీక్షించిన మేరీ కామ్.. ప్రియాంక నటనను చూసి చలించిపోయింది. భాగ్ మిల్కా భాగ్ వంటి సూపర్‌హిట్ తరువాత వస్తున్న క్రీడా నేపథ్య చిత్రంగా ‘మేరీ కామ్’ కోసం అటు సినీ, ఇటు క్రీడాభిమానులు ఎంతగానో నిరీక్షిస్తున్నారు. అతనే లేకపోతే... తాను సాధించిన విజయాల వెనుక తన తల్లిదండ్రుల పాత్ర ఎంత ఉందో.. భర్త ఓన్లర్ కామ్ ప్రోత్సాహమూ అంతే ఉందంటుంది మేరీ కామ్. 2001లో పంజాబ్‌లో జాతీయ క్రీడల్లో పాల్గొనేందుకు న్యూఢిల్లీలో శిక్షణ తీసుకుంటున్న సమయంలో మేరీకి పరచయమయ్యాడు ఓన్లర్. ఢిల్లీ యూనివర్సిటీలో ‘లా’ కోర్సు చదువుతున్న ఓన్లర్‌తో నాలుగేళ్ల ప్రేమ తరువాత 2005లో వివాహం జరిగింది. అతడు తనను చక్కగా అర్థం చేసుకొని ప్రోత్సహించాడని, తాను బాక్సింగ్ టోర్నీలతో బిజీగా గడుపుతుంటే ఇద్దరు పిల్లల్ని అన్నీ తానై చూసుకున్నాడని చెబుతుంది. అతనే లేకపోతే.. బాక్సర్‌గా తాను ఈ స్థాయికి చేరడం కష్టమయ్యేదేమో అంటుంది. అన్నట్టు.. మేరీకి ఇటీవలే మూడో బాబు పుట్టాడు! - శ్యామ్ కంచర్ల -
మేరీకోమ్ చిత్రానికి పన్ను మినహాయింపు!
ముంబై: బాలీవుడ్ లో రూపొందిన మేరీకోమ్ చిత్రానికి మహారాష్ట్ర ప్రభుత్వం పన్ను మినహాయింపు లభించింది. ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ రూపొందించారు. భారతీయ మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందిన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా నటించారు. మేరీకోమ్ చిత్రం చూసి అందరూ స్పూర్తి పొందాలనే ఉద్దేశంతోనే పన్ను మినహాయింపు ఇచ్చినట్టు మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. -
ఫ్రీగానైనా చేసేదాన్ని..
ముంబై: ‘దర్శక నిర్మాత లు కోరి ఉంటే ‘మేరీ కోమ్’ పాత్రను ఉచితంగానైనా చేసి ఉండేదాన్ని.. అంతలా నన్ను ఆ పాత్ర ఆకట్టుకుంది..’ అని నటి ప్రియాం క చోప్రా చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతూ నేను నటించే ప్రతి చిత్రం నా ‘మొఘల్-ఇ-అజామ్’ చిత్రంలానే ఉండాలనే కోరుకుంటానని తెలిపింది. ఒలంపిక్ మెడల్ విజేత మేరీ కోమ్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన చిత్రంలో టైటిల్ పాత్ర ను ప్రియాంకచోప్రా పోషించింది. కాగా, ఈ సినిమా పాటల ఆవిష్కరణ సందర్భంగా మేరీ కోమ్ తన భర్త కె ఆన్లెర్ కోమ్‌తో పాటు ప్రత్యేక అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. ప్రతి సినిమాకు తాను కష్టపడతానని చెప్పింది. అది బర్ఫి అయినా.. మేరీ కోమ్ అయినా.. నటించడం నా వృత్తి.. ప్రతి పాత్రకు న్యాయం చేయడానికి నా శక్తిమేర కష్టపడతాను. దానికి డబ్బుతో ముడిపెట్టను. నా పాత్రకు డబ్బు వస్తే సం తోషం.. లేదంటే మేరీ కోమ్ లాంటి సినిమాలు ఫ్రీగా చేయడానికైనా సిద్ధం..’ అని చెప్పింది. తన జీవితానికి, మేరీ కోమ్ జీవితానికి కొన్ని పోలికలున్నాయని ప్రియాంక అంది. తామిద్దరూ మహిళలైనప్పటికీ పురుషాధిక్యత ఎక్కువగా ఉండే రంగాల్లో తట్టుకుని నిలబడగలిగామని తెలిపింది. తాను నటించిన చిత్రాన్ని మేరీ కోమ్ చూసినప్పుడు కొంత ఒత్తిడికి లోనయ్యాయని చెప్పింది. ‘ఒక ఒలంపిక్ మెడల్ విజేత నేను నటిం చిన సిని మాను చూస్తోందని అనిపించే సరికి కొంత ఒత్తిడికి లోనయ్యా.. ఒకవేళ ఆ సినిమాలో ఏ సన్నివేశమైన ఆమెకు నచ్చి ఉండకపోతే నటిగా నేను విఫలమైనట్లేనని అనుకున్నా.. ఒక క్రీడాకారిణి జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నప్పుడు ఆమె వ్యక్తిత్వాన్ని నేను ఆ పాత్రలో వ్యక్తపరచాలి.. అందుకే మేరీ కోమ్ సినిమా చూసినప్పుడు నేను భయపడ్డా. అయితే ఆ సినిమా చూశాక మేరీ నన్ను మెచ్చుకుంది. అప్పుడే అనుకున్నా..నేను పాత్రపరంగా విజేతగా నిలిచానని..’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లకు రానుంది. -
ఫ్రీగానైనా చేసేదాన్ని..
‘దర్శక నిర్మాతలు కోరి ఉంటే ‘మేరీ కోమ్’ పాత్రను ఉచితంగానైనా చేసి ఉండేదాన్ని అంతలా నన్ను ఆ పాత్ర ఆకట్టుకుంది..’ అని నటి ప్రియాంక చోప్రా చెప్పింది. ఆమె ఇంకా మాట్లాడుతూ నేను నటించే ప్రతి చిత్రం నా ‘మొఘల్-ఇ-అజామ్’ చిత్రంలానే ఉండాలనే కోరుకుంటానని తెలిపింది. ఒలంపిక్ మెడల్ విజేత మేరీ కోమ్ జీవిత చరిత్రను ఆధారంగా చేసుకుని ప్రముఖ నిర్మాత సంజయ్ లీలా బన్సాలీ నిర్మించిన చిత్రంలో టైటిల్ పాత్రను ప్రియాంకచోప్రా పోషించింది. కాగా, ఈ సినిమా పాటల ఆవిష్కరణ సందర్భంగా మేరీ కోమ్ తన భర్త కె ఆన్లెర్ కోమ్‌తో పాటు ప్రత్యేక అతిథిగా హాజరైంది. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ. పతి సినిమాకు తాను కష్టపడతానని చెప్పింది. అది బర్ఫి అయినా.. మేరీ కోమ్ అయినా.. నటించడం నా వృత్తి.. ప్రతి పాత్రకు న్యాయం చేయడానికి నా శక్తిమేర కష్టపడతాను. దానికి డబ్బుతో ముడిపెట్టను. నా పాత్రకు డబ్బు వస్తే సంతోషం.. లేదంటే మేరీ కోమ్ లాంటి సినిమాలు ఫ్రీగా చేయడానికైనా సిద్ధం..’ అని చెప్పింది. తన జీవితానికి, మేరీ కోమ్ జీవితానికి కొన్ని పోలికలున్నాయని ప్రియాంక అంది. తామిద్దరూ మహిళలైనప్పటికీ పురుషాధిక్యత ఎక్కువగా ఉండే రంగాల్లో తట్టుకుని నిలబడగలిగామని తెలిపింది. మేరీ కోమ్ జీవితం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని ప్రియాంక కొనియాడింది. తాను నటించిన చిత్రాన్ని మేరీ కోమ్ చూసినప్పుడు కొంత ఒత్తిడికి లోనయ్యాయని చెప్పింది. ‘ ఒక ఒలంపిక్ మెడల్ విజేత నేను నటించిన సినిమాను చూస్తోందని అనిపించే సరికి కొంత ఒత్తిడికి లోనయ్యా.. ఒకవేళ ఆ సినిమాలో ఏ సన్నివేశమైన ఆమెకు నచ్చి ఉండకపోతే నటిగా నేను విఫలమైనట్లేనని అనుకున్నా.. ఒక క్రీడాకారిణి జీవిత చరిత్రను సినిమాగా తీస్తున్నప్పుడు ఆమె వ్యక్తిత్వాన్ని నేను ఆ పాత్రలో వ్యక్తపరచాలి.. అందుకే మేరీ కోమ్ సినిమా చూసినప్పుడు నేను భయపడ్డా. అయితే ఆ సినిమా చూశాక మేరీ నన్ను మెచ్చుకుంది. అప్పుడే అనుకున్నా..నేను పాత్రపరంగా విజేతగా నిలిచానని.’ అని ప్రియా ంక చెప్పుకొచ్చింది. ఈ సినిమా సెప్టెంబర్ 5న థియేటర్లకు రానుంది. అలాగే హీరో హీరోయిన్ల పారితోషికాల్లో చాలా తేడా ఉందన్న విషయాన్ని ప్రియాంక అంగీకరించింది. -
మూడు గంటల్లో మూడువందల యాభై మెయిల్స్!
జీవితంలో ఇప్పటివరకు ఎప్పుడూ పొందనంత ఆనందాన్ని ప్రియాంకా చోప్రా చవి చూస్తున్నారు. ఆ ఆనందానికి కారణం ‘మేరీ కామ్’. ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పట్నుంచి ప్రియాంకకు ప్రశంసలు మొదలయ్యాయి. ‘బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కామ్లానే ఒదిగిపోయారు’ అని ప్రియాంకను చాలామంది అభినందిస్తున్నారు. ఈ అభినందనల గురించి ప్రియాంక చెబుతూ -‘‘ఈ చిత్రం ఫస్ట్ లుక్ విడుదలైనప్పుడు నేను పడవలో ఉన్నాను. జోయా అక్తర్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం కోసం పడవలో కీలక సన్నివేశాలు చిత్రీకరణలో పాల్గొంటున్నాను. ‘మేరీ కామ్’ ఫస్ట్ లుక్ విడుదలైన మూడు గంటలకు నాకు మూడువందల యాభై మెయిల్స్ వచ్చాయి. అలాగే, నా ఫోన్‌కి ఆరు వందల మెసేజ్‌లు వచ్చాయి. ఇక, ట్వీట్స్ అయితే లెక్కలేనన్ని. కెరీర్ ఆరంభించిన ఈ పధ్నాలుగేళ్లల్లో ఇలా జరగడం ఇదే మొదటిసారి’’ అన్నారు. -
బాక్సర్లతో ప్రియాంక డిష్యుం డిష్యుం
ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్షిప్ సాధించిన బాక్సర్ 'మేరీ కోమ్' చిత్రంలో తాను నిజమైన బాక్సర్లతోనే పోరాటాలు చేసినట్లు బాలీవుడ్ భామ ప్రియాంకా చోప్రా చెప్పింది. పూర్తిస్థాయి ప్రొఫెషనల్ బాక్సర్లతో ఫైటింగ్ చేయడం అంటే అంత సులభం కాదని, అయినా తాను అలాగే చేశానని తెలిపింది. మేరీకోమ్ చిత్రం గురించి ఆమె ఆమె ఓ ఇంటర్వ్యూలో ఈ విషయం తెలిపింది. వాళ్లంతా అసలైన బాక్సర్లే కావడంతో వాళ్లకు ఉత్తుత్తి పంచ్‌లు ఇవ్వడం రాదని, దాంతో నిజంగానే కొట్టేస్తారని ప్రియాంక వివరించింది. చాలా సందర్భాల్లో తనకు నిజంగానే గట్టి దెబ్బలు తగిలాయని తెలిపింది. సంజయ్ లీలా భన్సాలీ, వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో మేరీ కోమ్ అథ్లెట్ నుంచి బాక్సర్‌గా ఎలా మారిందో అనే విషయం చెబుతారు. ఒముంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. -
ప్రేమ గెలుస్తుందా? పిడిగుద్దులు గెలుస్తాయా??
అక్కా చెల్లెళ్లిద్దరూ మళ్లీ యుద్ధానికి సిద్ధం అయ్యారు. ఒకావిడ ప్రేమకు ఆహ్వానం పలుకుతోంది. ఇంకో ఆమె పిడిగుద్దులు కురిపించేందుకు రెడీ అవుతోంది. ఆ అక్కా చెల్లెళ్లిద్దరూ ఇంకెవరో కాదు. అందాల రాణి ప్రియాంక చోప్రా. ఆమె చెల్లెలు పరిణితి చోప్రా. పరిణితి నటించిన దావతె ఇష్క్, ప్రియాంక నటించిన మేరీ కామ్ లు సెప్టెంబర్ 5 నే రిలీజవుతున్నాయి. రెండు సినిమాలూ బాక్సాఫీసు బద్దలు కొట్టాలని ఇద్దరూ కోరుకుంటున్నారు. గతేడాదీ వీరిద్దరి సినిమాలూ ఒకే సారి విడుదలయ్యాయి. పరిణితి నటించిన శుధ్ దేశీ రొమాన్స్, ప్రియాంక నటించిన జంజీర్ లు ఒకేసారి వచ్చాయి. అయితే జంజీర్ సినిమా మాత్రం పైకి తేలకుండా మునిగిపోయింది. శుధ్ దేశీ రొమాన్స్ బొమ్మ కూడా అంత పెద్దగా నడవ లేదు. ఈ సారి ఏమవుతుందో చూడాలి. ప్రేమ గెలుస్తుందా లేక పిడిగుద్దులు గెలుస్తాయా చూడాలి. -
సాధారణ చిత్రం కాదు..
ముంబై: ఒక క్రీడాకారిణి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని నిర్మించిన ‘మేరీ కోమ్’ సినిమాను మామూలు సినిమాల్లా పరిగణించవద్దని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కోరింది. ఒలంపిక్స్‌లో మెడల్ సాధించిన మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత చరిత్రను ఆధారంగా ఈ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో మేరీకోమ్‌గా ప్రియాంక చోప్రా నటించింది. పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమై గతేడాది విడుదలైన ‘భాగ్ మిల్కా భాగ్’ పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాతో మేరీకోమ్ సినిమాను పోల్చడం సరికాదని ప్రియాంక అభిప్రాయపడింది. దేశంలో మొదటిసారి ఒక మహిళా క్రీడాకారిణి జీవితాన్ని ఆధారంగా తీసిన ఈ సినిమాను వేరే సినిమాలతో పోలిస్తే అది ఆమెను అవమానించినట్లే అవుతుందని ప్రియాంక స్పష్టం చేసింది. మేరీకోమ్ మనజాతి గర్వించదగ్గ క్రీడాకారిణి.. అని ఆమె వ్యాఖ్యానించింది. ముంబైలో బుధవారం ‘మేరీకోమ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తన నటజీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు దేనికీ కష్టపడలేదని చెప్పింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించడమంటే మాటలు కాదని, అటువంటి అద్భుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంక పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ సినిమాలో మేరీలా శరీరాకృతిని ప్రదర్శించడానికి రోజూ 15 గంటలపాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని తెలిపింది. బాక్సింగ్‌లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి బాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్థాయిలో భారత్ కీర్తిపతాకం ఎగిరేలా ఒలంపిక్స్‌లో పతకం సాధించిందని ప్రియాంక వివరించింది. ఈ సినిమాకు డెరైక్టర్ దేబుటంగే ఒమాంగ్ కుమార్. సెప్టెంబర్ 5వ తేదీన ఇది థియేటర్లలో విడుదల కానుంది. -
సాధారణ సినిమా కాదు
ఒక క్రీడాకారిణి జీవిత చరిత్రను ఆధారంగా తీసుకుని నిర్మించిన ‘మేరీ కోమ్’ సినిమాను మామూలు సినిమాల్లా పరిగణించవద్దని బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా కోరింది. ఒలంపిక్స్‌లో మెడల్ సాధించిన మహిళా బాక్సర్ మేరీకోమ్ జీవిత చరిత్రను ఆధారంగా ఈ సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇందులో మేరీకోమ్‌గా ప్రియాంక చోప్రా నటించింది. పరుగుల వీరుడు మిల్కా సింగ్ జీవిత చరిత్ర ఆధారంగా నిర్మితమై గతేడాది విడుదలైన ‘భాగ్ మిల్కా భాగ్’ పలు అవార్డులను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాతో మేరీకోమ్ సినిమాను పోల్చడం సరికాదని ప్రియాంక అభిప్రాయపడింది. దేశంలో మొదటిసారి ఒక మహిళా క్రీడాకారిణి జీవితాన్ని ఆధారంగా తీసిన ఈ సినిమాను వేరే సినిమాలతో పోలిస్తే అది ఆమెను అవమానించినట్లే అవుతుందని ప్రియాంక స్పష్టం చేసింది. మేరీకోమ్ మనజాతి గర్వించదగ్గ క్రీడాకారిణి.. అని ఆమె వ్యాఖ్యానించింది. ముంబైలో బుధవారం ‘మేరీకోమ్’ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ తన నటజీవితంలో ఈ సినిమాకు కష్టపడినట్లు దేనికీ కష్టపడలేదని చెప్పింది. మేరీ వ్యక్తిత్వాన్ని తెరపై ఆవిష్కరించేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపింది. ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి క్రీడా ప్రపంచంలో రాణించడమంటే మాటలు కాదని, అటువంటి అద్భుతాన్ని మేరీ సాధించిందని ఆమెను ప్రియాంక పొగడ్తల్లో ముంచెత్తింది. ఈ సినిమాలో మేరీలా శరీరాకృ తిని ప్రదర్శించడానికి రోజూ 15 గంటలపాటు శిక్షణ పొందాల్సి వచ్చిందని తెలిపింది. బాక్సింగ్‌లో ప్రవేశించేందుకు మేరీ చాలా ఇబ్బందులు ఎదుర్కొందని, ఆమె తండ్రి బాక్సింగ్ వద్దని కట్టడి చేసినా పట్టుదలగా నేర్చుకుని ప్రపంచస్థాయిలో భారత్ కీర్తిపతాకం ఎగిరేలా ఒలంపిక్స్‌లో పతకం సాధించిందని ప్రియాంక వివరించింది. ఈ సినిమాకు డెరైక్టర్ దేబుటంగే ఒమాంగ్ కుమార్. సెప్టెంబర్ 5వ తేదీన ఇది థియేటర్లలో విడుదల కానుంది. -
ప్రియాంక చేతుల మీదుగా 'మేరి కోమ్' టీజర్
బాక్సింగ్ క్రీడాకారిణి మేరి కోమ్ జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న 'మేరి కోమ్' చిత్ర టీజర్ ను బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఆవిష్కరించింది. మేరి కోమ్ గా ప్రియాంక చోప్రా నటిస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం తన 32 జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని టీజర్ ను ప్రియాక చోప్రా విడుదల చేసింది. ఓ నిజమైన పోరాటయోధురాలి జీవిత కథ ఆధారంగా రూపొందుతున్న చిత్రంలో నటిస్తున్నాను. పూర్తిస్థాయి ట్రైలర్ త్వరలో విడుదల అవుతుంది అని ట్విటర్ లో ప్రియాంక చోప్రా ఓ సందేశాన్ని పోస్ట్ చేసింది. 54 సెకన్ల వీడియో సినీ అభిమానులను ఆకట్టుకుంటోంది. సంజయ్ లీలా భన్సాలీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. For you… a sneak peak into the life of a true fighter… http://t.co/d8B2e29PGE #MaryKomPunch Full trailer coming soon. Cant wait to share it — PRIYANKA (@priyankachopra) July 18, 2014 -
‘మేరీ కామ్’ అదుర్స్!
భారతీయ బాక్సింగ్ చాంపియన్ మేరీ కామ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘మేరీ కామ్’లో ప్రియాంకా టైటిల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే. అసలు సిసలైన బాక్సర్‌గా అగుపించడానికి ప్రియాంక చాలా కసరత్తులు చేశారు. శారీరకంగా ఫిట్‌గా తయారు కావడంతో పాటు, బాక్సింగ్ కూడా నేర్చుకున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ‘‘మేరీ కామ్‌గా ప్రియాంకా ఒదిగిపోయిన వైనం అద్భుతంగా ఉందని, పాత్రలో ఇంతలా పరకాయ ప్రవేశం చేయడం నమ్మశక్యంగా లేదనీ, ప్రియాంకకు అభినందనలు అని’’ ట్వీట్ చేశారు సమంత. అది మాత్రమే కాదు.. ప్రియాంకను అభినందిస్తూ తనకు వచ్చిన ట్వీట్స్ అన్నింటినీ సమంత రీట్వీట్ చేశారు. -
అలాంటి మాటలు ఇక నా నోట రావు!
అభిమానులు లేనిదే మేం లేమని అడపా దడపా సినిమా తారలు అంటుంటారు. అందుకే, వీలు కుదిరినప్పుడల్లా అభిమానుల కోసం కొంత సమయం కేటాయిస్తుంటారు. ఇటీవల ప్రియాంకా చోప్రా అదే చేశారు. తన అభిమానులతో సరదాగా కబుర్లు చెప్పాలనుకున్నారు. ‘నన్నేమైనా అడగండి.. ఫర్వాలేదు’ అని తన ట్విట్టర్లో పోస్ట్ చేశారామె. ఈ సోషల్ మీడియా ద్వారా అభిమానులు అడిగే ప్రశ్నలన్నిటికీ కాదనకుండా సమాధానాలిచ్చి వాళ్లను ఆనందపర్చాలనుకున్నారు ప్రియాంక. కానీ, అలా చేయలేకపోయారు. ఎందుకంటే, కొంతమంది అభిమానులు అడగకూడని ప్రశ్నలేవో అడిగారు. ఇలా కూడా అడుగుతారని ఊహించని ప్రియాంక ఒక్కసారిగా ఖంగు తిన్నారు. కాసేపు ఆ షాక్‌లోనే ఉండిపోయి, ఇబ్బందిపెట్టే ప్రశ్నలకు సమాధానాలివ్వలేదామె. అభిమానులతో సరదాగా కాలక్షేపం చేద్దామనుకున్న ప్రియాంకకు చేదు అనుభవమే మిగిలింది. ఈ విషయంలో ‘పశ్చాత్తాప పడుతున్నారా?’ అని ఓ వీరాభిమాని అడిగితే -‘‘అవును. నాకిదో కనువిప్పులాంటిది. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ‘నన్నేమైనా అడగండి.. ఫర్వాలేదు’ అనే మాటలు నా నోటి నుంచి రావు. అలాగే, ఈ అనుభవం నాకో మంచి పాఠం అయ్యింది. ఇప్పుడైతే షాక య్యాను కానీ, భవిష్యత్తులో నన్నెవరైనా అడగకూడని ప్రశ్నలు అడిగితే.. వాళ్ల బతుకు మీద వాళ్లకే విరక్తి పుట్టేలా సమాధానం చెబుతా’’ అన్నారు. ఇదిలా ఉంటే.. ఇప్పటికి మూడు ప్రైవేట్ ఆల్బమ్స్ విడుదల చేశారు ప్రియాంక. వాటి ద్వారా తనలో మంచి గాయని ఉందని నిరూపించుకున్నారు. మరి.. సినిమాలకు ఎప్పుడు పాడతారు? అనే ప్రశ్న ప్రియాంక ముందుంచితే -‘‘ప్రస్తుతం నేను నటిస్తున్న ‘మేరీ కామ్’ కోసం ఓ పాట పాడనున్నా’’ అని చెప్పారు. -
సైనా నెహ్వాల్‌పై సినిమా
హిందీ చలనచిత్ర పరిశ్రమలో ఇప్పుడు క్రీడాకారుల జీవితకథా చిత్రాల సీజన్‌లా ఉంది. అథ్లెట్ మిల్ఖా సింగ్ కథతో ‘భాగ్ మిల్ఖా భాగ్’, బాక్సింగ్ క్రీడాకారిణి మేరీ కోమ్ కథతో ‘మేరీ కోమ్’ తరువాత ఇప్పుడు తాజాగా బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ వంతు వచ్చింది. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్యాడ్మింటన్ సంచలనం జీవితం ఆధారంగా ఓ చిత్రం చేయాలని దర్శకుడు మహేశ్ భట్ యోచిస్తున్నారు. ప్రస్తుతం హిందీ చిత్రసీమలో అగ్రతారగా భాసిల్లుతోన్న దీపికా పదుకొనేతో సైనా పాత్ర ధరింపజేయాలని ఆయన భావిస్తున్నారు. మిత్రుడొకరు ఈ ఆలోచన చెప్పారనీ, ఈ చిత్ర ప్రతిపాదన ఇంకా చర్చల దశలోనే ఉందనీ మహేశ్‌భట్ వ్యాఖ్యానించారు. అయితే, భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన సైనా మీద సినిమా తీస్తే, అది ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన అన్నారు. సైనా సైతం ఇటీవల మాట్లాడుతూ, తెరపై తన పాత్రకు దీపిక బాగుంటుందని కామెంట్ చేశారు. మరింకేం! బ్యాడ్మింటన్‌తో అనుబంధమున్న పదుకొనే వంశ వారసురాలైన దీపిక నటనతో సైనా నిజజీవిత కథ మరింత వన్నెలద్దుకొంటే ఆశ్చర్యం లేదు. ఓ పక్క సైనా గురువు పుల్లెల గోపీచంద్ జీవితంపై తెలుగు దర్శకుడు ప్రవీణ్ సత్తారు ప్రయత్నిస్తుంటే, మరోపక్క శిష్యురాలైన సైనాపై మహేశ్‌భట్ ఆలోచించడం యాదృచ్ఛికమే అయినా, విశేషం. ఈ సినిమాలు కార్యరూపం ధరిస్తే, ఒక క్రీడకు సంబంధించిన గురుశిష్యులిద్దరి కథలూ తెరకెక్కడం ఇదే మొదటిసారి అవుతుంది. పైగా, ఆ ఇద్దరూ తెలుగు గడ్డ మీద నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ‘మనవాళ్ళు’ కావడం మనకు మరీ గొప్ప కదూ! -
ఇరవై రోజుల్లో...ఏడు కిలోలు...
ఒక సినిమా కోసం బరువు పెరగడం.. వెంటనే మరో సినిమా కోసం సన్నబడడం అంటే చిన్న విషయం కాదు. పైగా తక్కువ రోజుల్లో అమాంతంగా బరువు తగ్గడం, పెరగడం అంటే ఆరోగ్యంతో ఆడుకున్నట్లే. అయినప్పటికీ ప్రియాంకా చోప్రా రిస్క్ తీసుకోవడానికి వెనకాడలేదు. బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘మేరీ కోమ్’ చిత్రంలో ప్రియాంకా చోప్రా టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం బాక్సర్ జరానా సంఘ్వీ దగ్గర ఆమె శిక్షణ తీసుకున్నారు. అసలు సిసలైన బాక్సర్‌లా కనిపించడం కోసం కండలు కూడా పెంచారు. ‘మేరీ కోమ్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం జోయా అఖ్తర్ దర్శకత్వంలో ప్రియాంక ‘దిల్ ధడఖ్నే దో’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె పేరొందిన వ్యాపారవేత్త పాత్ర చేస్తున్నారు. అందుకని, చాలా స్టయిలిష్‌గా, మెరుపు తీగలా కనిపించాలట. దాంతో, ‘మేరీ కోమ్’ పాత్ర కోసం పెంచిన కండలను తగ్గించడంతో పాటు కొంచెం సన్నబడమని జోయా సూచించారు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే - షూటింగ్‌ను మరో 20 రోజుల్లో ప్రారంభిస్తామని, ఈలోపే బరువు తగ్గాలని ఓ నియమం పెట్టారట. 20 రోజుల్లో 7 కిలోలు తగ్గడమంటే చాలా రిస్క్ అని సన్నిహితులు చెప్పినా, ప్రియాంక వినలేదు. ‘మేరీ కోమ్’ కోసం కండలు పెంచడానికి జరానా సహాయం తీసుకున్న ప్రియాంక, మళ్లీ ఆమె సహాయంతోనే బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. జరానా చెప్పినట్లు ఆహారం తీసుకుని, వర్కవుట్స్ చేశారు. ఫలితంగా 20 రోజుల్లో 7 కిలోలు తగ్గి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆరోగ్యానికి హాని లేకుండా ప్రియాంక బరువు తగ్గేలా చేశానని జరానా చెప్పారు. -
రిటైర్మెంట్ ఆలోచన వచ్చింది
- కానీ లక్ష్యాలు మిగిలే ఉన్నాయి - మేరీకామ్ వ్యాఖ్య న్యూఢిల్లీ: బాక్సింగ్‌కు ఇక గుడ్‌బై చెప్పాలన్న ఆలోచన కలుగుతోందని భారత మహిళా బాక్సర్, లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీ కామ్ తెలిపింది. ఏడాది కాలంగా బాక్సింగ్‌కు దూరంగా ఉండి మూడో బిడ్డకు జన్మనిచ్చిన అనంతరం కామన్వెల్త్ క్రీడల కోసం ఆమె తిరిగి ప్రాక్టీస్ ప్రారంభించింది. ఈ సందర్భంగా మేరీ కామ్ మాట్లాడుతూ, ‘రిటైర్మెంట్ ఆలోచన చాలాసార్లు వచ్చింది. కానీ, సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయి. ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించడమే ప్రధాన లక్ష్యం’ అని వివరించింది. 2008లో తొలిసారి తల్లి అయ్యేందుకు బాక్సింగ్ నుంచి విరామం తీసుకున్న మేరీ కామ్ ఆ తరువాత రింగ్‌లోకి అడుగు పెడుతూనే ప్రపంచ టైటిల్‌ను గెలుచుకుంది. తాజా విరామంతో కూడా తనకు ఎటువంటి ఇబ్బంది తలెత్తదని, నెల రోజుల క్రితమే ప్రాక్టీస్ మొదలుపెట్టానని ఆమె పేర్కొంది. -
నా కష్టాల గురించి ఏం చెప్పమంటారు!
ప్రియాంకా చోప్రా గాయాలపాలైంది. బాక్సింగ్ పంచింగ్ బ్యాగ్ బలంగా తగలడంతో వెల్లకిలా పడిపోయింది. కంటి కింద గీరుకు పోయింది. అసలీ ప్రమాదం ఎలా జరిగింది? అనే విషయానికొస్తే- ప్రఖ్యాత బాక్సర్ మేరీకామ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న ‘మేరీకామ్’ చిత్రంలో ప్రియాంక టైటిల్‌రోల్ పోషిస్తోన్న విషయం తెలిసిందే. ఇటీవల ప్రియాంకచోప్రా, ఓ విదేశీ నటుడు కాంబినేషన్లో చిత్ర దర్శకుడు ఒమాంగ్ కుమార్ బాక్సింగ్ సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈ సన్నివేశంలో భాగంగా ఆ విదేశీనటుడు పంచింగ్ బ్యాగ్‌ని బలంగా మోదాడు. అది నేరుగా వచ్చి ప్రియాంకా చోప్రా కంటికి గుద్దుకుంది. దాంతో ఆమె వెల్లికిలా పడిపోయారు. కంటి కింద గీరుకుపోయింది. ఈ హఠాత్పరిణామం వల్ల దాదాపు గంటకు పైగా షూటింగ్ ఆగిపోయింది. గాయం కనబడకుండా మేకప్ చేసి షూటింగ్ మొదలుపెట్టారు. అయితే... మీడియాలో మాత్రం ప్రోస్తటిక్ మేకప్ వేసి గాయాన్ని కనబడకుండా చేశారనే వార్తలొచ్చాయి. దాన్ని ఒమాంగ్ కుమార్ ఖండించారు. ‘‘ఈ సినిమాలోని తన పాత్ర గురించి ప్రియాంక స్పందిస్తూ -‘‘ఈ సినిమాలో నా కష్టాల గురించి ఏం చెప్పమంటారు! ఇప్పటివరకూ నేను చేసిన సినిమాలన్నింటిలో అతి క్లిష్టమైన సినిమా ఇది. మాటల్లో చెప్పలేనంత కష్టం. ఇందులోని ప్రతి సన్నివేశం నన్ను ఇన్స్పైర్ చేసింది. అందుకే కష్టాలు మరిచిపోయి ఈ సినిమా చేస్తున్నాను. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలనుకునే ప్రతి మహిళకూ ఈ ‘మేరీకామ్’ అదర్శం’’ అన్నారు ప్రియాంకచోప్రా. ప్రియాంకాచోప్రా గొప్ప అందగత్తె మాత్రమే కాదు. మంచి నటి కూడా. ఇప్పటికే మూడు ఫిలింఫేర్ అవార్డులు, ఓ నేషనల్ అవార్డు ఆమె ఖాతాలో ఉన్నాయి. పాత్ర కోసం ఎన్ని ఇబ్బందులనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారామె. ఈ సినిమాకు కూడా నేషనల్ అవార్డు ఖాయం అనుకుంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. -
రౌడీలు చుట్టుముట్టారు!
నటిగా భిన్న కోణాలను చూపించగల సత్తా ప్రియాంకా చోప్రాకి ఉంది. అందుకు చాలా ఉదాహరణలు ఉన్నాయి. ‘ఫ్యాషన్'లో గ్లామరస్‌గా, ‘బర్ఫీ'లో డీ-గ్లామరైజ్డ్గా ఒదిగిపోయిన వైనం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ‘మేరీ కామ్’ చిత్రంలో ఆమె టైటిల్ రోల్ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న భారతీయ బాక్సర్ మేరీ కామ్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందుతోంది. మేరీ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడానికి ఆహార్యంపరంగా చాలా కసరత్తులే చేశారు ప్రియాంక. అలాగే, బాక్సింగ్‌లో శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవల మనాలీలోని ఓ గ్రామంలోను, అటవీ ప్రాంతంలోను కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. వీటిలో ఓ పోరాట సన్నివేశం కూడా ఉంది. పాఠశాల నుంచి ఇంటికెళుతున్న మేరీ కామ్ని చుట్టుముడితే, వాళ్ల భరతం పట్టే సన్నివేశం అది. ఈ సన్నివేశంలో ప్రియాంక రిస్కీ ఫైట్స్ చేశారని, ఎంతో నేర్పుగా ఆమె చేసిన పోరాటాలు చూసి యూనిట్ సభ్యులు ఆశ్చర్యపోయారని సమాచారం. షూటింగ్ చేయడంతో పాటు విరామ సమయంలో మనాలీ పరిసర ప్రాంతాలను సందర్శిస్తున్నారట ప్రియాంక. అక్కడి హడింబా దేవి ఆలయాన్ని సందర్శించి పూజలు కూడా చేశారు. -
అంతా అకాడమీపైనే: మేరీ కామ్
సెలబ్రిటీలంటే ఎడాపెడా సంపాదిస్తారు కనుక వారి ఇన్వెస్ట్మెంట్లు కూడా అలాగే ఉంటాయనుకుంటాం. కానీ కష్టపడి సంపాదించిన సొమ్ము కాబట్టి ప్రతి పైసాను చాలా జాగ్రత్తగా చూసుకుంటామంటున్న సెలబ్రిటీల కథలివి... బాక్సింగ్ మేరా కామ్ అని చెప్పే మేరీ కామ్... లేటు వయసులో ఒలింపిక్ పతకాన్ని సాధించి యావద్భారత దేశ దృష్టినీ ఆకర్షించిన మహిళ. మణిపూర్‌లోని పేద కుటుంబం నుంచి వచ్చినా... కష్టపడి పెకైదిగి ఒలింపిక్స్‌లో త్రివర్ణ పతాకం ఎగరేసింది. తనకు కష్టం విలువ తెలుసని చెప్పే మేరీకామ్ ఇన్వెస్ట్మెంట్లు ఎలా ఉంటాయి? ఆమె ఇతరులకిచ్చే సలహా ఏంటి? ఆమె మాటల్లోనే... కేంద్ర ప్రభుత్వంతో సహా వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నాకు చాలా బహుమతులొచ్చాయి. నా సంపాదనలో అత్యధికం కేంద్రం, ఇతర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిన బహుమతి సొమ్మే. ఈవెంట్లలో గెలవటంతో పాటు ఆయా ప్రభుత్వాలిచ్చిన ప్రోత్సాహకాలు కూడా కొంతవరకూ ఉన్నాయి. వీటన్నిటినీ నేను మొట్టమొదట ఎక్కువగా ఇన్వెస్ట్ చేసింది నా అకాడమీపైనే. తరువాతి ప్రాధాన్యం నా కుటుంబానికి. నాకు ముగ్గురు అబ్బాయిలున్నారు. వాళ్ల పేరున కొంత ఫిక్స్డ్ డిపాజిట్లు చేశా. మిగిలిన మొత్తంతో కొంత రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ కొన్నా. ఇదంతా నా కుటుంబంపై పెట్టిన పెట్టుబడిగా భావిస్తాన్నేను. చాలామంది నన్ను సాయం అడుగుతుంటారు. నేను మంచి స్పోర్ట్స్ ఉమన్‌గా ఎదిగాక ఇది ఇంకాస్త ఎక్కువయింది. అలా అడిగే వాళ్లకు వివిధ రూపాల్లో నేను సాయం చేస్తుంటా. ఈ సాయం అందుకునే వారు ఎక్కువమంది మణిపూర్ వారే కావచ్చు. వాళ్లకు నేను డొనేషన్లు ఇస్తుంటా. భోజనం పెడుతుంటా. ఇలాంటి సాయాన్ని కూడా నేను ఇన్వెస్ట్‌మెంట్‌గానే భావిస్తా. నా దృష్టిలో ఇది సమాజంపై పెట్టే పెట్టుబడి. నాకు ఇతరత్రా ఇన్వెస్ట్మెంట్ సంగతులేవీ తెలి యవు. కానీ ఆదా చేయటం మాత్రం తెలుసు. మొదటి నుంచీ చేసిందే కాబట్టి! అందుకే నా సలహా అదే. కుటుంబం కోసం మనం కొంత ఆదా చేసి తీరాలి. ఇది ఏ కుటుంబానికైనా తప్పనిసరి. ఉన్నంతలో లేని వారికి సాయం చేయటం కూడా అవసరమే. -
నాకు నచ్చినట్లే నడుచుకుంటా
‘నేను ఇలానే ఉండాలని నియమ నిబంధనలు ఏమీ పెట్టుకోను.. నా మనసుకు ఎలా తోస్తే అలా ముందుకు పోవడమే..’ అని మన మనసులో మాట చెప్పింది బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా.. ఈ ఏడాది విడుదలవుతున్న తన మొదటి సినిమా ‘గుండే..’ ప్రచార కార్యక్రమాల్లో ప్రస్తుతం ఆమె చురుకుగా పాల్గొంటోంది. ‘మేరీ కామ్ చిత్రం తదుపరి షెడ్యూల్ షూటింగ్ కూడా నడుస్తోంది. ఈ ఏప్రిల్ ఆ సినిమా విడుదల చేయాలనేది నిర్మాతల ఆలోచన’ అని ఆమె తెలిపింది. తనకు కష్టమైన పాత్రలు పోషించాలంటే చాలా ఇష్టమని వివరించింది. ‘నాకు ఎప్పుడూ ఒకే తరహా పాత్రలు పోషించాలంటే చాలా చిరాకు.. అందుకే మొదటి నుంచి నా పాత్రల్లో విభిన్నత ఉండేటట్లు చూసుకుంటున్నా.. ఇంతకుముందు వచ్చిన అగ్నీపథ్, బర్ఫీ, గుండే తదితర చిత్రాలు చూస్తే మీకు నా అంతరంగం అర్ధమవుతుంది.. అటువంటి విభిన్నత కూడిన కష్టమైన పాత్రలు చేయడమంటేనే నాకు చాలా ఇష్టం. ఇతరులను అనుసరించడాన్ని నేను ఇష్టపడను.. నేను ఎటువంటి నియమ నిబంధనలు పాటించను.. నా మనసుకు నచ్చినట్లు ప్రవర్తిస్తా.. అంతే..’ అని 31 ఏళ్ల మాజీ విశ్వసుందరి తన మనసులో మాట చెప్పింది. గత ఏడాది నేను నటించిన రూ.200 కోట్ల సినిమా ‘క్రిష్-3’ విడుదలైంది. అంతకుముందు ఏడాది బర్ఫీ, అగ్నీపథ్ చేశా.. అవన్నీ నాకు మంచి పేరు తెచ్చిపెట్టాయి. ‘ఎక్సాటిక్’ సినిమా ఇండియాలో ట్రిపుల్ ప్లాటినం సాధించింది. ప్రస్తుతం నా కెరీర్ మంచి ఫామ్‌లో ఉంది..దాన్ని ఇంకా పెంచుకోవడానికి కృషిచేస్తున్నా..’ అని ఆమె తెలిపింది. ప్రియాంక చోప్రా నటించిన ‘గుండే’ ఈ నెల 14వ తేదీన విడుదలవుతోంది. యాష్ చోప్రా నిర్మించిన ఈ సినిమాలో ఆమె ఒక క్యాబరే డ్యాన్సర్‌గా నటిస్తోంది. ఆ పాత్ర చుట్టూనే సినిమా కథ తిరుగుతుంది. రణవీర్‌సింగ్, అర్జున్ కపూర్ సహనటులు. -
వాళ్లది ‘కామ్’ లవ్‌స్టోరీ
ప్రతి మగాడి విజయం వెనక ఓ స్త్రీ ఉంటుందంటారు... మరి స్త్రీ విజయం వెనక ఓ మగాడు ఉండి తీరాలి కదా... లాజిక్ ప్రకారమే కాదు... వాస్తవం కూడా అదేనంటోంది మేరీకామ్. భారత స్టార్ బాక్సర్, ఒలింపిక్స్‌లో పతకం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్ మేరీకామ్... తన విజయాలన్నీ వాళ్లాయన ఓన్లర్ పుణ్యమేనంటోంది. మేరీకామ్ది కూడా ప్రేమ వివాహం. అది 2000వ సంవత్సరం... ఓన్లర్కామ్... ఢిల్లీ యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడు. తమ ప్రాంతానికి చెందిన వాళ్లందరికీ సాయం చేస్తాడని మంచి పేరు. మేరీ 19 ఏళ్ల బాక్సర్. మణిపూర్ నుంచి భవిష్యత్‌లో వెలుగులోకి వస్తుందని బాక్సింగ్ కమ్యూనిటీ నమ్మిన అమ్మాయి. బెంగళూరులో జరిగే జాతీయ బాక్సింగ్ శిబిరం కోసం ట్రెయిన్లో వెళుతుండగా మేరీ సూట్‌కేస్ పోయింది. డబ్బు, పాస్‌పోర్ట్ అందులో ఉన్నాయి. నెల రోజుల్లోనే విదేశాలకు వెళ్లి బాక్సింగ్ పోటీల్లో పాల్గొనాలి. ఎలా? అన్యమస్కంగా క్యాంప్‌ను ముగించుకుని ఢిల్లీ చేరింది. అక్కడెవరో చెప్పారు. ‘ఓన్లర్ అని మన ప్రాంతం వ్యక్తే. అందరికీ సాయం చేస్తాడు. ప్రస్తుతం ఇక్కడే ఢిల్లీలో ఉన్నాడు. ఓసారి కలువు’. నెహ్రూ స్టేడియంలో మేరీ ప్రాక్టీస్ చేస్తోంది. ఓ స్నేహితుడిని కలవడానికి ఓన్లర్ అక్కడకి వచ్చాడు. మేరీకామ్ ప్రాక్టీస్ చేస్తుంటే చూశాడు. ఆమె పంచ్ పవర్‌ని గమనించాడు. ‘ఫర్వాలేదు... భవిష్యత్ ఉంది’ అనుకున్నాడు. పది నిమిషాల తర్వాత మేరీ ఓన్లర్ దగ్గరకి వచ్చింది. ‘నా పాస్‌పోర్ట్ పోయింది. కాస్త తొందరగా తెచ్చుకోవడానికి సహాయం చేస్తారా?’ అని అడిగింది. ఆ రోజు స్నేహం మొదలైంది. ఐదేళ్లు గడిచాయి. ఈలోగా ఎప్పుడు ఇద్దరి మధ్య ప్రేమ మొదలైందో తెలియదు. ఒక రోజు ఓన్లర్ వచ్చి ‘మేరీ... విల్ యూ మ్యారీ మీ’ అని అడిగాడు. అప్పటికే తన గుండెల్లో ఉన్న వ్యక్తి నుంచి ఈ ప్రతిపాదన వస్తే ఎవరైనా ఏం చేస్తారు..? మేరీ కూడా అదే చేసింది. మార్చి, 2005... ఓన్లర్ కామ్, మేరీకామ్ల పెళ్లయింది. బాక్సింగ్ కమ్యూనిటీ పెదవి విరిచింది. ‘ఇక ఓ గొప్ప బాక్సర్ కెరీర్ ముగిసిపోయింది. పెళ్లయ్యాక మహిళలు బాక్సింగ్‌లో రాణించడం కష్టం’... ఇదీ నాటి అభిప్రాయం. కానీ ఆ అభిప్రాయం తప్పు అని ఈ జంట నిరూపించింది. మేరీకామ్ జీవితంలో అతి పెద్ద విజయాలన్నీ పెళ్లయ్యాకే వచ్చాయి. కవల పిల్లలకు జన్మనిచ్చాక... బాక్సింగ్ రింగ్‌లోకి దిగి పతకాలు గెలవడం... అది కూడా ఒలింపిక్ పతకం గెలవడం... వాహ్ మేరీకామ్.. హ్యాట్సాఫ్..! కవలలతో సహా ముగ్గురు పిల్లల్ని పెంచడం... భార్య కెరీర్‌కు సహకరించడం... ఓన్లర్ కామ్... డబుల్ హ్యాట్సాఫ్..! -ఎల్లా రమేష్ (సాక్షి స్పోర్ట్స్) ‘మేరీలో చాలా ప్రత్యేక లక్షణాలు ఉన్నాయి. మాది లవ్ అనడం కంటే... ఆమెను నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించానని అనడం కరెక్ట్. ఆమె విషయంలో బాధ్యత తీసుకోవాలని అనిపించింది. కెరీర్ ఎలా ఉంటుందో తెలియదు. కానీ తనలోని తపన చూస్తే ముచ్చటేస్తుంది. పిల్లల విషయంలో తను నన్ను ఆకాశానికి ఎత్తేస్తుంది. కానీ తను రింగ్‌లో ఉన్నంతసేపు ఇంటి సమస్యలు, బాధ్యతలు తనకు గుర్తు రాకూడదు. అందుకే నేను పిల్లల గురించి ఎక్కువ కేర్ తీసుకుంటాను’ - ఓన్లర్కామ్ ‘ఓన్లర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తన గురించి ఆగకుండా వారం రోజులు చెప్పమన్నా చెబుతా. మా పెళ్లయిన కొత్తలో నా కెరీర్ అయిపోయిందని అందరూ అన్నారు. కానీ నన్ను నమ్మిన ఒకే ఒక్క వ్యక్తి ఓన్లర్. నా కెరీర్ కోసం తను చాలా త్యాగాలు చేశాడు. తను పరిచయమైనప్పటి నుంచి ఎందుకో తనంటే తెలియని ప్రేమ. పెళ్లి చేసుకుందాం అనగానే ఎగిరి గంతేశాను. పిల్లల్ని పెంచడం ఎంత కష్టమో నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కవలల్ని పెంచడం మరీ కష్టం. కానీ అలాంటి ఇబ్బందీ నాకు మాత్రం ఇప్పటిదాకా తెలియదు. ఓన్లర్ మొత్తం చూసుకుంటాడు. నా విజయాల్లో... ఓన్లర్ త్యాగం, తను ఇచ్చిన స్ఫూర్తిదే అగ్రస్థానం’ - మేరీకామ్