బాలీవుడ్ కలెక్షన్లపై మేరి కోమ్ పంచ్ పడింది! | Priyanka Chopra packs a punch; 'Mary Kom' collects over Rs.17 crores | Sakshi
Sakshi News home page

బాలీవుడ్ కలెక్షన్లపై మేరి కోమ్ పంచ్ పడింది!

Published Sun, Sep 7 2014 6:45 PM | Last Updated on Sat, Sep 2 2017 1:01 PM

బాలీవుడ్ కలెక్షన్లపై మేరి కోమ్ పంచ్ పడింది!

బాలీవుడ్ కలెక్షన్లపై మేరి కోమ్ పంచ్ పడింది!

న్యూఢిల్లీ: బాలీవుడ్ కలెక్షన్ల పై ప్రియాంక పంచ్ భారీగానే పడింది. ఇప్పటి వరకు హీరోలే బాలీవుడ్ కలెక్షన్లకు స్టామినా అని నమ్మె నిర్మాతలు తమ అభిప్రాయాలను మార్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని విమర్శకులు వ్యాఖ్యలు చేస్తున్నారు. బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ హీరోల కలెక్షన్లకు ధీటుగా మేరి కోమ్ కలెక్షన్ల వర్షం కురుస్తోంది. విడుదలైన తొలి రెండు రోజుల్లో మేరి కోమ్ చిత్రం 17.25 కోట్ల కలెక్షన్లు రాబట్టింది. 
 
దేశవ్యాప్తంగా 1800 స్క్రీన్లలో విడుదలైన ఈ చిత్రాన్ని సినీ, క్రీడా ప్రేక్షకులు భారీగానే ఆదరిస్తున్నారు. ఐదుసార్లు ప్రపంచ చాంఫియన్ గా నిలిచిన మేరికోమ్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ చిత్రానికి సహ నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ కాగా,  ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement