ఇరవై రోజుల్లో...ఏడు కిలోలు... | Priyanka Chopra seven kg's Weight loss in twenty days | Sakshi
Sakshi News home page

ఇరవై రోజుల్లో...ఏడు కిలోలు...

Published Thu, Jun 5 2014 1:04 AM | Last Updated on Sat, Sep 2 2017 8:19 AM

ఇరవై రోజుల్లో...ఏడు కిలోలు...

ఇరవై రోజుల్లో...ఏడు కిలోలు...

ఒక సినిమా కోసం బరువు పెరగడం.. వెంటనే మరో సినిమా కోసం సన్నబడడం అంటే చిన్న విషయం కాదు. పైగా తక్కువ రోజుల్లో అమాంతంగా బరువు తగ్గడం, పెరగడం అంటే ఆరోగ్యంతో ఆడుకున్నట్లే. అయినప్పటికీ ప్రియాంకా చోప్రా రిస్క్ తీసుకోవడానికి వెనకాడలేదు. బాక్సింగ్ చాంపియన్ మేరీ కోమ్ జీవితం ఆధారంగా రూపొందుతోన్న  ‘మేరీ కోమ్’ చిత్రంలో ప్రియాంకా చోప్రా టైటిల్ రోల్ చేసిన విషయం తెలిసిందే.
 
ఈ సినిమా కోసం బాక్సర్ జరానా సంఘ్వీ దగ్గర ఆమె శిక్షణ తీసుకున్నారు. అసలు సిసలైన బాక్సర్‌లా కనిపించడం కోసం కండలు కూడా పెంచారు. ‘మేరీ కోమ్’ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ప్రస్తుతం జోయా అఖ్తర్ దర్శకత్వంలో ప్రియాంక ‘దిల్ ధడఖ్‌నే దో’ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో ఆమె పేరొందిన వ్యాపారవేత్త పాత్ర చేస్తున్నారు. అందుకని, చాలా స్టయిలిష్‌గా, మెరుపు తీగలా కనిపించాలట. దాంతో, ‘మేరీ కోమ్’ పాత్ర కోసం పెంచిన కండలను తగ్గించడంతో పాటు కొంచెం సన్నబడమని జోయా సూచించారు.
 
అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే - షూటింగ్‌ను మరో 20 రోజుల్లో ప్రారంభిస్తామని, ఈలోపే బరువు తగ్గాలని ఓ నియమం పెట్టారట. 20 రోజుల్లో 7 కిలోలు తగ్గడమంటే చాలా రిస్క్ అని సన్నిహితులు చెప్పినా, ప్రియాంక వినలేదు. ‘మేరీ కోమ్’ కోసం కండలు పెంచడానికి జరానా సహాయం తీసుకున్న ప్రియాంక, మళ్లీ ఆమె సహాయంతోనే బరువు తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. జరానా చెప్పినట్లు ఆహారం తీసుకుని, వర్కవుట్స్ చేశారు. ఫలితంగా 20 రోజుల్లో 7 కిలోలు తగ్గి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆరోగ్యానికి హాని లేకుండా ప్రియాంక బరువు తగ్గేలా చేశానని జరానా చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement