ఫ్యాషన్ స్టార్ ప్రియాంక మరో ఇంట్రస్టింగ్ సినిమాకు రెడీ అవుతోంది. స్టార్ ఇమేజ్ ఉన్న బాలీవుడ్ బ్యూటీస్ అందరూ గ్లామర్ క్యారెక్టర్స్ మాత్రమే చేస్తుంటే ప్రియాంక మాత్రం సంథింగ్ స్పెషల్ అనిపించుకుంటుంది. గ్లామర్ క్యారెక్టర్స్తో పాటు ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ తన కంటూ స్పెషల్ ఇమేజ్ ను క్రియేట్ చేసుకుంటుంది. ఇప్పటికే ఫ్యాషన్, మేరికోమ్ లాంటి సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటి త్వరలో మేడమ్జీగా అలరించనుంది.
రియలిస్టిక్ ఫిలిం మేకర్ మథుర్ బండార్కర్ మరోసారి ప్రియాంక చోప్రాతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా చాలా రోజుల క్రితమే సెట్స్ మీదకు రావాల్సి ఉండగా ప్రియాంక కమిట్ మెంట్స్ మూలంగా ఆలస్యం అవుతూ వచ్చింది. ఈ గ్యాప్లో మథుర్ బండార్కర్ కూడా క్యాలెండర్ గర్ల్స్ సినిమాను పూర్తి చేశాడు. ప్రస్తుతం కమిట్ అయిన ప్రాజెక్ట్స్ చేసే పనిలో ఉన్న ప్రియాంక త్వరలోనే మేడమ్జీ షూటింగ్లో పాల్గొనటానికి ప్లాన్ చేసుకుంటుంది.
ఫ్యాషన్ సినిమాలో ప్రియాంకను మోడల్గా చూపించిన మథుర్, మేడమ్జీ లో పొలిటీషియన్ గా చూపించబోతున్నాడు. రాజకీయరంగంలో అధికారం కోసం ఎలాంటి తప్పులు జరుగుతాయో ఈసినిమాలో చూపించబోతున్నాడు. బాజీరావ్ మస్తానీతో పాటు క్వాంటికో సీరియల్లో నటిస్తున్న ఈ బ్యూటి త్వరలోనే మేడమ్జీ సినిమాకు డేట్స్ ఇవ్వనుంది. 60 రోజుల్లోనే మేడమ్జీ షూటింగ్ పూర్తి చేయాలని భావిస్తున్నాడు మథుర్ బండార్కర్.
మేడమ్జీగా ప్రియాంక చోప్రా
Published Wed, Sep 16 2015 9:51 AM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM
Advertisement
Advertisement