వీరనారిగా | Priyanka Chopra to Team up with 'Mary Kom' Director to Play Lead in Film Based on World War II? | Sakshi
Sakshi News home page

వీరనారిగా

Published Thu, Dec 25 2014 11:08 PM | Last Updated on Sat, Sep 2 2017 6:44 PM

వీరనారిగా

వీరనారిగా

విభిన్న పాత్రలు పోషించాలని తపించే ప్రియాంకా చోప్రా... త్వరలో మరో కొత్త పాత్ర చేయనున్నారట. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కూడిన కథాంశంతో రూపొందే ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రియాంక ప్రధాన భూమిక పోషించనున్నారని సమాచారం. వివరాల్లోకెళ్తే- ‘మేరీకోమ్’ దర్శకుడు ఒమాంగ్ కుమార్ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది.
 
 ఇది లేడీ ఓరియంటెడ్ కథాంశం కావడంతో, ‘మేరీకోమ్’లో అద్భుత నటన కనబరిచిన ప్రియాంకతోనే ఈ సినిమా కూడా చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ప్రియాంకతో ఈ విషయం చెప్పగానే, ఆమె కూడా సానుకూలంగా స్పందించారని వినికిడి. ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన కథాంశం కావడం వల్ల ప్రీ ప్రొడక్షన్‌కే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే... వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌కి తీసుకెళ్లడానికి ఒమాంగ్ కుమార్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక పాత్ర అత్యంత శక్తిమంతంగా వీరనారి తరహాలో ఉంటుందని సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement