world war
-
నానాటికీ నీరసిస్తున్న ఐక్యరాజ్యసమితి
ఇటీవల పరిణామాలను చూస్తే ఎవరికైనా ఐక్య రాజ్యసమితి ఉత్సవ విగ్రహంగా మారుతోందనే అభిప్రాయం కలుగక మానదు. యుద్ధ జ్వాలల నుంచి తమను తాము కాపాడుకోవడానికి, శాంతి యుత ప్రపంచ స్థాపనకు మానవులలో ఉన్న అకుంఠిత ఆశయాలే ఐక్య రాజ్యసమితి వంటి అంతర్జాతీయ సంస్థ స్థాపనకు దారి తీశాయి.మొదటి ప్రపంచ యుద్ధం ముగియడంతో ‘నానాజాతి సమితి’ని ఏర్పాటు చేసి ప్రపంచ శాంతిని పరిరక్షించే బాధ్యతను దానికి కట్ట బెట్టాయి పెద్ద రాజ్యాలు. ఈ సమితి ఎన్నో రకాల శాంతి మార్గాలను సూచిస్తూ అందులో ముఖ్య మైనదిగా... నిరాయుధీకరణంను సూచించింది. దానిని పెడచెవిన పెట్టిన ప్రపంచ దేశాలు ఆయు ధాలను సమీకరించుకొని ఆధిపత్య పోరు మొదలు పెట్టి, రెండవ ప్రపంచ యుద్ధం ముంగిట మాన వాళి మరోసారి నిలబడేలా చేశాయి.యుద్ధం ముగిసిన వెంటనే నానాజాతి వైఫల్యం వల్లనే రెండో ప్రపంచ యుద్ధం జరిగిందని భావించి... దాని స్థానంలో ఐక్యరాజ్య సమితిని ఏర్పాటు చేశాయి ప్రపంచ దేశాలు. ఇక్కడ గమనించవలసిన విషయమేమిటంటే... మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల ముందు ఆయా దేశాలు యుద్ధం రాబోతుందని గ్రహించి శాంతి సభలు నిర్వహించడం, చర్చలు జరపటం జరి పాయి. సంధులు చేసుకున్నాయి. అయినా ప్రపంచ యుద్ధాలు ఆగలేదు. ఇప్పుడు ఐరాసలో సభ్యులుగా 193 దేశాలు ఉన్నాయి. ఇందులో వీటో అధికారం ఉన్న 5 అగ్ర రాజ్యాలు ఉన్నాయి. 25 రకాలుగా పనిచేసే వివిధ రకాల సంస్థలు,అంతర్జాతీయ న్యాయస్థానం ఐరాస కింద పని చేస్తున్నాయి. అయినా కూడా రగిలిపోతున్న యుద్ధాలను ఆపలేకపోవడం బాధాకరం. అలా అని ఐరాస సాధించిన విజయాలు లేవని కాదు. రష్యా–ఇరాన్ , ఫ్రాన్స్– సిరియా– లెబనాన్, ఇండోనేషియా సమస్య, ఈజిప్ట్ అంశం, చెకోస్లావేకియా అంశం... ఇలా ఐరాస మధ్య వర్తిత్వంలో శాంతి ఒప్పందాల ద్వారా సమస్య లను పరిష్కరించుకున్న ఉదంతాలు చాలానే ఉన్నాయి. అలాగే అభివృద్ధి చెందుతున్న దేశాలకు వివిధ రకాల సాయం అందడానికీ ఐరాస ఎంతగానో కృషి చేస్తోంది.ఎన్ని విజయాలు సాధించినప్పటికీ ఐక్యరాజ్య సమితి అగ్రరాజ్యాల జోలికి రానంతవరకే సంస్థకు గౌరవం దక్కుతోంది. ఆ మేరకే దానికి ఆర్థిక వనరులు అందుతున్నాయి. అంతర్జాతీయ శాంతికి అడ్డంకిగా మారిన అణ్వాయుధాల తయారీ, విని యోగానికి అగ్ర రాజ్యాలు స్వస్తి పలకవలసిందిగా యూఎన్ఓ విజ్ఞప్తి చేసినప్పటికీ అవి పెడచెవిన పెడుతున్నాయి. పైగా ప్రస్తుత తరుణంలో అగ్ర రాజ్యాల షాడో దేశాల మధ్య యుద్ధం మొదలై ఆయుధ గోడౌన్ల తలుపులు తెరుచుకుంటున్నాయి. అగ్ర రాజ్యాల ప్రోద్బలంతోనే ఇవి బరిలో దిగిన ప్పుడు ఇంకా ఐరాస మాట వినే పరిస్థితి లేదనిపించక మానదు.ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ అయిన ఆంటోనియో గుటెరస్‌ను తమ దేశంలోకి రాకుండా బహిష్కరిస్తున్నాం అంటున్న ఇజ్రాయెల్‌కు అగ్రరాజ్యమైన అమెరికా, బ్రిటన్లు మద్దతుగా ఉన్న విషయం తెలిసిందే. గాజాను పూర్తిగా నేల మట్టం చేసి, లెబనాన్‌ను పావు వంతు ఆక్రమించి, ఇరాన్‌పై పూర్తిస్థాయిలో యుద్ధానికి సిద్ధం అవు తున్న ఇజ్రాయిల్‌ను అగ్రరాజ్యాలు నిలువరించ లేకపోతున్నాయి. ఓ పక్క ఇజ్రాయెల్‌పై దాడి చేస్తూనే అరబ్ దేశాలను ఏకం చేయడానికి ఇరాన్ ముమ్మర ప్రయత్నాలు చేస్తుంటే ఐరాస ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోవాల్సి వస్తోంది. అంతేకాకుండా ఉక్రెయిన్ విషయంలో కూడా అగ్రరాజ్యాలు గ్రూపులుగా సంఘటిత మవుతూ ఉంటే ఐరాస ఏమి చేయలేక చూస్తూ ఉండిపోతోంది. ఈ పరిస్థితులను చూస్తుంటే ఏ ఆశయాలతో అయితే ఐక్యరాజ్య సమితిని స్థాపించారో... వాటిని సాధించలేని స్థితికి ఐరాస చేరు కుందని చెప్పక తప్పదు.వి.వి. రమణ వ్యాసకర్త ఉపాధ్యాయులు ‘ 89198 62019 -
యుద్ధ భయం!
ఇజ్రాయెల్‌పై ఇరాన్ కురిపించిన క్షిపణుల వర్షం రక్షణ నిపుణులతో పాటు ప్రపంచ దేశాలన్నింటినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇది మూడో ప్రపంచ యుద్ధానికి ఆరంభ సూచికేనంటూ వెల్లువెత్తుతున్న విశ్లేషణలతో ఇంటర్నెట్ హోరెత్తిపోతోంది. రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఇదే ట్రెండింగ్ టాపిక్‌గా మారింది. ఆన్లైన్లో లక్షలాది పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. అటు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం రెండేళ్లు దాటినా ఆగే సూచనలు కన్పించడం లేదు. ఇటు గాజాపై ఇజ్రాయెల్ తెరతీసిన దాడులకు ఏడాది నిండనుంది. అవీ ఇప్పట్లో ఆగే సూచనల్లేవు. ఇరాక్, యెమన్, సిరియాల్లోని ఉగ్రవాద సంస్థలు ఇప్పటికే పాలస్తీనాకు దన్నుగా ఇజ్రాయెల్‌పై అడపాదడపా దాడులకు దిగుతూనే ఉన్నాయి. తద్వారా ఆయా దేశాలను కూడా ఇజ్రాయెల్‌తో యుద్ధం దిశగా లాగుతున్నాయి. వీటికి తోడు లెబనాన్‌ను వైమానిక దాడులతో వణికించి హెజ్»ొల్లా అగ్రనేతలను వరుసబెట్టి మట్టుపెట్టిన ఇజ్రాయెల్ తాజా భూతల దాడులకు కూడా దిగింది. ఆ వెంటనే ఇజ్రాయెల్‌పై ఇరాన్ దాడులతో పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి చందంగా మారింది. తమపై క్షిపణి దాడులకు మర్చిపోలేని రీతిలో బదులిస్తామని ఇజ్రాయెల్ ఇప్పటికే హెచ్చరించింది. ఆ ప్రతీకార దాడులు బహుశా కనీవినీ ఎరగనంత తీవ్రంగా ఉండవచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇరాన్ అణు కేంద్రాలను నేలమట్టం చేయడానికి దీన్ని అందివచ్చిన అవకాశంగా ఇజ్రాయెల్ భావిస్తోంది. అదే జరిగితే ఇరాన్, పశ్చిమాసియాలోని దాని మిత్ర దేశాలు మరింత తీవ్రంగా ప్రతిస్పందించే ఆస్కారముంది. మొత్తమ్మీద పశ్చిమాసియా యుద్ధక్షేత్రంగా మారిపోయింది. ‘‘అక్కడి పరిస్థితి మందుపాతరను తలపిస్తోంది. ఇప్పుడు తేలాల్సింది దానిపై ముందుగా ఎవరు కాలేస్తారన్నదే!’’ అని అంతర్జాతీయ రక్షణ నిపుణులు అంటున్నారు. తారస్థాయికి చేరుతున్న ఈ ఉద్రిక్తతలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ఆశ్చర్యం లేదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. రంగం సిద్ధం...? తమపై ప్రతిదాడులకు దిగితే మరింతగా విరుచుకుపడతామన్న ఇరాన్ హెచ్చరికలను ఇజ్రాయెల్ ఖాతరు చేసే అవకాశాలు లేనట్టే. క్షిపణి దాడులకు భారీ స్థాయి ప్రతీకారానికి రంగం సిద్ధం చేసుకుంటోంది. అందుకు మిత్రదేశం అమెరికాతో పాటు నాటో కూటమి కూడా దన్నుగా నిలవడం ఖాయమే. మంగళవారం నాటి ఇరాన్ క్షిపణి దాడులను అడ్డుకోవడంలో అమెరికా సాయపడింది కూడా. మధ్యదరా సముద్రంలో మోహరించిన అమెరికా యుద్ధనౌకలు ఇరాన్ క్షిపణులను గాల్లోనే అడ్డుకుని పేల్చేశాయి. అంతేగాక పశ్చిమాసియాలో ఇప్పటికే ఉన్న తమ సైనికులకు తోడుగా మరికొన్ని వేలమందిని పంపుతామని అమెరికా ప్రకటించింది. యుద్ధ విమానాల మోహరింపునూ పెంచనుంది. ఇరాన్‌పై దాడిలో కూడా ఇజ్రాయెల్‌కు అమెరికా, నాటో దన్నుగా నిలిస్తే దాని పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. ఎరుపెక్కిస్తున్న ఎర్రసముద్రం యెమన్లోని హౌతీ తిరుగుబాటుదారులు ఎర్రసముద్రాన్ని గుప్పెట్లో పెట్టుకున్న వైనం ప్రపంచ దేశాలన్నింటినీ ప్రభావితం చేస్తోంది. ఆ మార్గం గుండా రాకపోకలు సాగించే నౌకలను చెరబడుతూ, లూటీ చేస్తూ హౌతీలు కలకలం రేపుతున్నారు. దీనివల్ల అంతర్జాతీయ వర్తకం, ప్రపంచవ్యాప్తంగా సరుకు రవాణా భారీగా ప్రభావితమవుతున్నాయి. పలు దేశాల ఆర్థిక వ్యవస్థలు తీవ్రంగా ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. అంతేగాక దేశాల నడుమ ఇప్పటికే నెలకొన్న ఉద్రిక్తతలను ఈ పరిణామం మరింతగా ఎగదోస్తోంది.అవున్నిజమే మనమిప్పుడు కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధపు ముంగిట్లో నిలిచాం. ప్రపంచంలో ఏ మూల చూసినా ఎటు చూసినా యుద్ధమో, యుద్ధ భయాలో, యుద్ధపు హెచ్చరికలో కన్పిస్తున్నాయి. అమెరికాను పాలిస్తున్న అసమర్థులు (అధ్యక్షుడు బైడెన్, ఉపాధ్యక్షురాలు హారిస్‌లను ఉద్దేశించి) ఏమీ చేయలేకపోతున్నారు – అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్అగ్ర రాజ్యాలు చెరోవైపు! అపార చమురు నిల్వలకు ఆలవాలమైన పశ్చిమాసియాపై పట్టు కోసం అమెరికా, రష్యా ప్రయత్నాలు ఇప్పటివి కావు. అగ్ర రాజ్యాలు రెండూ ప్రాంతీయ శక్తులనే పాచికలుగా మార్చుకుని ఎత్తులూ పై ఎత్తులు వేస్తూ వస్తున్నాయి. సౌదీకి అమెరికా దన్నుంటే ఇరాన్, సిరియా తదితరాలకు రష్యా ప్రాపకముంది. వ్యూహాత్మక, రాజకీయ ప్రయోజనాల దృష్ట్యా పశ్చిమాసియా వరకు రష్యాకు చైనా, ఉత్తర కొరియా కూడా మద్దతుగానే ఉంటున్నాయి. నాటో ముసుగులో తన ముంగిట్లో తిష్ట వేయాలన్న అమెరికా ప్రయత్నాలకు చెక్ పెట్టడానికే ఉక్రెయిన్‌పై రష్యా ఆక్రమణకు దిగింది. ఆ పోరుకు అంతం ఇప్పట్లో కనిపించడం లేదు. పశ్చిమాసియా రగడ ముదిరితే తమ మిత్ర దేశాలకు మద్దతుగా అటు అమెరికా, ఇటు రష్యా కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితులు తలెత్తవచ్చు.పర్యవసానాలుఊహించలేంఈ అణ్వస్త్ర యుగంలో మూడో ప్రపంచ యుద్ధమంటూ వస్తే దాని పర్యవసానాలు ఊహించలేనంత భయంకరంగా ఉంటాయి. కనుక యుద్ధజ్వాలలను ఆ స్థాయికి రగిల్చే దుస్సాహసానికి ఏ దేశమూ ఒడిగట్టకపోవచ్చు. ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తినా ఉద్రిక్తతలను చల్లబరిచేందుకు భారత్‌తో సహా పలు దేశాలు శాయశక్తులా ప్రయత్నాలు చేస్తాయి కూడా. కనుక ఇప్పటికిప్పుడు మూడో ప్రపంచ యుద్ధం రాకపోవచ్చన్న అభిప్రాయాలకూ కొదవ లేదు. కాకపోతే పశ్చిమాసియా పరిణామాలు ఎటు దారి తీస్తాయో చెప్పలేని పరిస్థితి!పశ్చిమాసియాలో ఎవరెటువైపు...!పశ్చిమాసియాపై నానాటికీ యుద్ధమేఘాలు దట్టంగా కమ్ముకుంటున్నాయి. పాలస్తీనాపై ఇజ్రాయెల్ దాడి చినికి చినికి గాలివానగా రూపుదాలుస్తోంది. అటు లెబనాన్‌కు పాకడంతో పాటు తాజాగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భారీ ఘర్షణలకు దారి తీస్తోంది. ఇది పూర్తిస్థాయి యుద్ధంగా మారితే అది రెండు దేశాలకే పరిమితం కాబోదు. మిగతా దేశాలన్నీ చెరో వైపు మోహరించడం ఖాయం. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా దేశాల్లో ఏవి ఎవరి వైపన్నది ఆసక్తికరం. దీనికి సంబంధించి గత ఏప్రిల్‌లోనే ట్రయిలర్ కనిపించింది. ఇజ్రాయెల్‌పై ఉన్నట్టుండి దాడికి దిగిన ఇరాన్‌కు లెబనాన్‌తో పాటు యెమన్ హౌతీలు పూర్తి దన్నుగా నిలిచారు. ఇజ్రాయెల్‌కు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ వంటి పాశ్చాత్య మిత్రులతో పాటు జోర్డాన్, సౌదీ అరేబియా, యూఏఈ వంటి పొరుగు దేశాలు మద్దతిచ్చాయి.ఇజ్రాయెల్ వైపుసౌదీ అరేబియా యూఏఈ (అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌తో పాటు నాటో దన్ను)ఇరాన్ వైపుసిరియా యెమన్ (హౌతీలు) పాలస్తీనా (హమాస్) హెజ్బొల్లా (లెబనాన్) తటస్థ దేశాలు ఖతర్ (ఇజ్రాయెల్ వైపు మొగ్గు) జోర్డాన్ (ఇజ్రాయెల్ వైపు మొగ్గు) ఈజిప్ట్ (ఇరాన్ వైపు మొగ్గు) తుర్కియే (ఇరాన్ వైపు మొగ్గు) -
వందేళ్ల యుద్ధ సైనికుని వివాహం.. హాజరైన బైడెన్
రెండో ప్రపంచ యుద్ధంలో పోరాడిన అమెరికా మాజీ సైనికుడు హెరాల్డ్ టెరెన్స్ తన 100 ఏళ్ల వయసులో ప్రియురాలిని పెళ్లాడి సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ వివాహానికి ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.దేశాధినేతలైన బైడెన్, మాక్రాన్‌లు కొత్తగా పెళ్లయిన హెరాల్డ్ టెరెన్స్ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. వీరి వివాహం ఫ్రాన్స్, అమెరికాతో పాటు ఇతర దేశాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. హెరాల్డ్ పెళ్లి చేసుకున్న ప్రియురాలికి 96 ఏళ్లు. ఆమె పేరు జీన్ స్వెర్లిన్. వారిద్దరూ ఫ్రాన్స్‌లోని నార్మాండీలోని డి-డే బీచ్‌లలో ఉన్న టౌన్ హాల్లో వివాహం చేసుకున్నారు. 1944 జూన్ 6న అడాల్ఫ్ హిట్లర్ దౌర్జన్యాల నుండి ఐరోపాను విముక్తి చేయడానికి మిత్రరాజ్యాల విమానాలు ఇక్కడే ల్యాండ్ అయ్యాయి. అనంతరం ఇక్కడ భీకర యుద్ధం జరిగింది.హెరాల్డ్ తన పెళ్లికి రెండవ ప్రపంచ యుద్ధంలో తాను పోరాడిన ప్రదేశాన్నే ఎంచుకున్నారు. వీరి వివాహానికి హాజరైన కొందరు రెండవ ప్రపంచ యుద్ధం నాటి దుస్తులు ధరించారు. జీన్ స్వెర్లిన్ గులాబీ రంగు దుస్తులు ధరించగా, టెరెన్స్ లేత నీలం రంగు సూట్ ధరించారు. ఈ సందర్భంగా టెరెన్స్ మాట్లాడుతూ తన పెళ్లి రోజు తన జీవితంలోని ఉత్తమమైన రోజు అని, ప్రేమ అనేది కేవలం యువతీయువకులకు సంబంధించినది మాత్రమే కాదని పేర్కొన్నాడు. వీరి వివాహ విందు ఎలీసీ ప్యాలెస్‌లో జరిగింది. -
ప్రపంచ యుద్ధంపై చాట్ జీపీటీ హెచ్చరిక?
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల తరువాత మూడవ ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం ఉందని ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తన చాట్ జీపీటీలో మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అంచనాలను వెల్లడించింది. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ఆరు దేశాలు ఇవేనంటూ తన భవిష్యవాణి వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ పాట్రిక్ సాండర్స్, నాటో జనరల్‌లు పౌరులను యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పౌరులు ఆయుధాలు చేతబట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ కోరారు. ప్రతి దేశం ‘పౌర సైన్యం’ మాదిరిగా శిక్షణ పొందాలని, యుద్ధం అంటూ ప్రారంభమైతే, రిజర్వ్ దళాల సామర్థ్యం సరిపోదని వారు పేర్కొన్నారు. ఈ ప్రకటనలతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ నేపధ్యంలో అమెరికా, నాటో దేశాలు మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయని పలు దేశాలు భావిస్తున్నాయి. ఇదిలావుండగా తాజాగా మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల గురించి తెలియజేయాలని చాట్ జీటీపీని అడగగా, అది ఆరు హాట్స్పాట్లను వెల్లడించింది. ‘డైలీ స్టార్’ నివేదిక ప్రకారం, ఈ ఆరు ప్రదేశాలు ప్రపంచ యుద్ధం తలెత్తే ఘర్షణ పాయింట్లు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొరియా ద్వీపకల్పం: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఈ వివాదంలో అమెరికా ప్రమేయంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఉత్తర కొరియా తరచూ నూతన క్షిపణులను పరీక్షిస్తోంది. ఉత్తర కొరియాకు చైనా తదితర దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. అందుకే ఇక్కడ నుండి ఎప్పుడైనా మూడవ ప్రపంచ యుద్ధం మొదలు కానుంది. మిడిల్ ఈస్ట్: కొన్ని దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం ఇంకా ఒక గట్టున పడలేదు. ఇంతలో ఇరాన్‌తో పాటు పొరుగు దేశాల ప్రమేయం ఈ దేశాల ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇది ఎప్పుడైనా ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. తైవాన్ జలసంధి: చైనా, తైవాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తత మరిన్ని మలుపులు తిరుగుతోంది. దీనిపై అమెరికా దృష్టి సారించడంతో పరిస్థితిని మరింత దిగజారుతోంది. ఆసియా-పసిఫిక్‌కు చెందిన ఈ ప్రాంతంలో ఏ సమయంలోనైనా మూడో ప్రపంచ యుద్ధం తలెత్తవచ్చు. తూర్పు ఐరోపా: ఈ జాబితాలో తూర్పు ఐరోపా ప్రాంతాలు నాల్గవ స్థానంలో ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, నాటోకు సంబంధించిన ఘర్షణల కారణంగా తూర్పు ఐరోపాలో ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది. ఇది ఎప్పుడైనా తీవ్ర ఘర్షణలకు దారితీయవచ్చు. దక్షిణ చైనా సముద్రం: దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా, దాని పొరుగు దేశాల మధ్య నిరంతర వివాదాలు నడుస్తున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అటువంటి పరిస్థితిలో ఇక్కడి ఉద్రిక్తతలు ఎప్పుడైనా తీవ్రస్థాయికి చేరుకోవచ్చు. మూడవ ప్రపంచ యుద్ధం ఇక్కడి నుంచే మొదలయ్యే అవకాశం ఉంది. భారత్-పాక్ సరిహద్దు: భారత్-పాక్ మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. సరిహద్దుల్లో తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య రెండుసార్లు యుద్ధం జరిగింది. అయితే అది ఇతర దేశాలను ప్రభావితం చేయలేదు. గత నాలుగు సంవత్సరాలుగా సరిహద్దులో శాంతియుత వాతావరణ ఉంది. అయినప్పటికీ ఇక్కడ నుంచి కూడా ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయని చాట్ జీపీటీ అంచనా వేస్తోంది. ఈ రెండు దేశాలకు అణు సామర్థ్యం ఉందని కూడా చాట్ జీపీటీ గుర్తు చేస్తోంది. -
యుద్ధం కన్న అనాథలు
ప్రపంచంలో ఎంతో మంది ఒక పూట తిండి కోసం ఎదురుచూస్తున్నారు. అదే సమయంలో మరెంతో మంది కన్న ప్రేమను కోల్పోయి తల్లడిల్లుతున్నారు. – మదర్ థెరెసా రష్యా–ఉక్రెయిన్ యుద్ధం మొదలై దాదాపు రెండేళ్లు. ఇరువైపులా ఎంతో మంది మరణించారు. రష్యా దాడులు తట్టుకోలేక ఉక్రెయిన్ నుంచి లక్షలాది మంది వలసపోయారు. అటు పాలస్తీనాలో ఇజ్రాయెల్ దాడులతోనూ లక్షలాది జీవితాలు అతలాకుతలం అయ్యాయి. అంతా యుద్ధ నష్టం గురించి, ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుకుంటుంటే.. అభంశుభం ఎరుగని ఎందరో చిన్నారులు యుద్ధం మిగిల్చిన అనాథలుగా భవిష్యత్తు ఏమిటో తెలియని దుస్థితిలో పడిపోయారు. జనవరి 6న (శనివారం) ప్రపంచ యుద్ధ సంక్షుభిత అనాథ పిల్లల దినోత్సవం (వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్) నేపథ్యంలో ఈ అంశంపై ప్రత్యేక కథనం.. నేను ఎందుకిలా అయ్యానో తెలియదు ఈ చిత్రంలోని అమ్మాయి పేరు మసిక. వయసు పన్నెండేళ్లు. డెమొక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో (డీఆర్సీ)లో జరుగుతున్న అంతర్యుద్ధంలో తిరుగుబాటుదారులు ఆమె కళ్ల ముందే తల్లిదండ్రులను కాల్చి చంపేశారు. ఎవరూ దిక్కులేక తన స్నేహితురాలి తల్లితో కలసి జీవిస్తోంది. నాటి ఘటనను తలచుకుని కుమిలిపోతూ.. తినేందుకు తిండి, సరైన రక్షణ లేని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. ‘‘అసలు వాళ్లెవరో, ఎందుకోసం ఇలా చేస్తున్నారో, మా అమ్మానాన్నను ఎందుకు చంపేశారో, నేను ఎందుకిలా బతకాల్సి వస్తోందో నాకు తెలియదు..’’ అంటూ మసిక ఆవేదన వ్యక్తం చేస్తోంది. అమ్మానాన్నను కోల్పోయి.. ఈ చిన్నారి పేరు కరీనా. వయసు ఏడేళ్లు. ఉక్రెయిన్‌లోని చెర్నిగివ్ ప్రాంతంలోని ఓ గ్రామం. రష్యా యుద్ధం మొదలుపెట్టాక తమ ఊరిని విడిచిపోతున్న సమయంలో.. జరిగిన బాంబు దాడిలో కరీనా తల్లిదండ్రులు చనిపోయారు. ఇప్పుడు ఉక్రెయిన్‌లోని కీవ్ నగరంలో తమ బంధువుల ఇంట్లో ఉంటోంది. తల్లిదండ్రులను గుర్తు చేసుకుంటూ, బాంబు దాడిలో అయిన గాయాలతో బాధపడుతూ గడుపుతోంది. ప్రపంచ యుద్ధాలతో ముమ్మరమై.. ► రెండు ప్రపంచ యుద్ధాలు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అనాథ చిన్నారులను మిగిల్చాయి. అధికారిక అంచనాల ప్రకారమే.. అప్పట్లో పోలాండ్‌లో 3 లక్షలు, యుగోస్లే్లవియాలో 2 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. ► ‘యూనిసెఫ్ (ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ పిల్లల అత్యవసర నిధి)’ గణాంకాల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా సంక్షుభిత ప్రాంతాల్లో 25 కోట్ల మందికిపైగా చిన్నారులు కనీస అవసరాలైన ఆహారం, మంచినీరు, నిలువనీడ లేక అవస్థ పడుతున్నారు. ఇందులో సుమారు 14 కోట్ల మంది తండ్రినిగానీ, తల్లిదండ్రులు ఇద్దరినీగానీ కోల్పోయి అనాథలుగా బతుకీడుస్తున్నారు. ► అనాథలుగా మారినవారిలో సుమారు 6 కోట్ల మంది ఆసియా దేశాల్లో, 5 కోట్లకుపైగా ఆఫ్రికా, మరో కోటిన్నర మందికిపైగా లాటిన్ అమెరికా, కరీబియన్ ప్రాంత దేశాల్లో ఉన్నారు. ► యుద్ధాలు, తిరుగుబాట్లతో అట్టుడుకుతున్న మధ్య ప్రాచ్యం, ఆసియా, దక్షిణ అమెరికా దేశాల్లో.. ముఖ్యంగా సిరియా, ఇరాక్, అఫ్గానిస్తాన్ వంటి దేశాల్లో.. ఆఫ్రికా ఖండంలోని సూడాన్, కాంగో, ఉగాండా, సోమాలియా వంటి దేశాల్లో అనాథ పిల్లల సమస్య పెరుగుతోంది. ఇలాంటి చోట్ల చాలా మంది చిన్నారులు తిరుగుబాటు దళాల్లో సైనికులుగా తుపాకులు చేతబట్టాల్సి వస్తోంది. ► సూడాన్‌లో అయితే ప్రతి వంద మంది చిన్నారుల్లో పది మంది అనాథాశ్రమాల్లో, వీధుల్లో బతుకు వెళ్లదీస్తున్నారు. ► ఇటీవల ఇజ్రాయెల్‌పై పాలస్తీనాకు చెందిన హమాస్ దాడికి ప్రతిగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడటంతో.. వేల మంది మరణించారు. లక్షలాది మంది వలసపోయారు. ఈ యుద్ధంలో నూ పెద్ద సంఖ్యలో చిన్నారులు అనాథలయ్యారు. ఏనాటి యుద్ధమైనా.. పిల్లలూ సమిధలే.. ఏ పిల్లలకైనా తల్లిదండ్రులే అన్నీ. చదువు కోసమో.. ఉద్యోగం కోసమో దూరంగా ఉంటున్నా..తల్లడిల్లేది వారి గురించే. అమ్మ ఒడికి, నాన్న చెంతకు చేరితేనే సాంత్వన. అలాంటి చిన్న వయసులోనే తండ్రిని కోల్పోతే.. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఇద్దరినీ కోల్పోతే.. ఆ బాధ వర్ణనాతీతం. అలాంటిది అస్తిత్వం కోసమో, అన్నం కోసమో, ఆక్రమణ కోసమో.. మానవ నాగరికత మొదలైన నాటి నుంచీ జరుగుతున్న యుద్ధాల్లో ఎందరో పిల్లలు అనాథలుగా మారుతున్నారు. తమ వారంటూ ఉన్న బంధువుల మధ్య పెరుగుతున్నవారు కొందరు.. ఏతోడూ లేకుండా కునారిల్లిపోతున్నవారు మరికొందరు. సరైనదారిలో పడ్డవారు మంచి జీవితం గడపగలిగితే..‘దారి తప్పిన’వారి బతుకులు ఆగమైపోతున్నాయి. ఉక్రెయిన్‌లో రెండేళ్లుగా పిల్లల గోస రష్యా–ఉక్రెయిన్ ఒకప్పుడు ఒకే సోవియట్ యూనియన్‌లో భాగం. అందుకే ఇరు దేశాల మధ్య రాకపోకలూ, సంబంధ బాంధవ్యాలూ సాధారణమే. కానీ ఇరు దేశాల మధ్య పొరపొచ్చాలు, యుద్ధంతో ఇరువైపులా ఉండిపోయిన మరోదేశపు కుటుంబాలు ఆగమైపోయాయి. మరణించిన, వలస వెళ్లినవారి పిల్లలు, సైనికులు బలవంతంగా తల్లిదండ్రుల నుంచి విడదీసినవారు.. ఇలా ఎందరో చిన్నారులు అనాథలుగా మారారు. ఈ నేపథ్యంలోనే అమెరికాకు చెందిన ‘కిడ్సేవ్’ అనే స్వచ్ఛంద సంస్థ తమ ప్రభుత్వానికి ఓ విజ్ఞప్తి చేసింది. ఉక్రెయిన్‌కు మిలటరీ సాయమేకాదు.. యుద్ధంతో అనాథలైన చిన్నారులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని కోరింది. బలవంతంగా క్యాంపులకు చిన్నారులు 2022 ఫిబ్రవరి చివరివారం నాటికి ఉక్రెయిన్‌లో అనాథ పిల్లల సంఖ్య లక్ష వరకు ఉండగా.. ఆ తర్వాత ఈ సంఖ్య మరింతగా పెరిగింది. కానీ సంక్షుభిత పరిస్థితుల్లో లెక్కలు తేల్చేదెలాగని, వేల మంది చిన్నారులు క్యాంపుల్లో మగ్గుతున్నారని అమెరికాకు చెందిన కాన్ఫ్లిక్ట్ అబ్జర్వేటరీ సంస్థ గతంలోనే పేర్కొంది. మరోవైపు రష్యా తమ దేశంలోని సుమారు 14 వేల ఉక్రెయిన్ కుటుంబాల పిల్లలను తల్లిదండ్రుల నుంచి బలవంతంగా విడదీసి క్యాంపులకు తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధంలో యూరప్‌లో తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన యూదు చిన్నారులు వీరు. వారికి కొత్త జీవితం అందించడం కోసం 1921లో అమెరికాలోని న్యూయార్క్‌కు తరలించినప్పుడు హార్బర్లో తీసిన ఫొటో ఇది. ఫ్రెంచ్ ఆర్గనైజేషన్ చొరవతో..ప్రత్యేక రోజుగా.. ఫ్రాన్స్‌కు చెందిన ‘ఎస్ఓఎస్ ఎన్ఫాంట్స్ ఎన్ డెట్రెసెస్’ స్వచ్ఛంద సంస్థ చొరవతో యూనిసెఫ్ ఏటా జనవరి 6న ‘వరల్డ్ డే ఆఫ్ వార్ ఆర్ఫాన్స్ డే’గా నిర్వహిస్తోంది.యుద్ధాలు, తిరుగుబాట్ల కారణంగా అనాథలుగా మారుతున్న చిన్నారులు.. వారు శారీరకంగా, మానసికంగా తీవ్ర దుస్థితిని ఎదుర్కొంటున్న అంశంపై అవగాహన కల్పించడం, వారిని ఆదుకోవడం లక్ష్యంగా చర్యలు చేపట్టడమే దీని లక్ష్యం. అనాథలను ఆశ్రమాల్లో చేర్చడంతోపాటు చదువుకోవడానికి, సాధారణ జీవితం గడపడానికి తోడ్పడాలని స్వచ్ఛంద సంస్థలు విజ్ఞప్తి చేస్తున్నాయి. -
ఊహించని పరిస్థితుల్లో నాగసాకిపై అణుబాంబు? అమెరికా అసలు ప్లాన్ ఏమిటి?
రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో అమెరికా.. జపాన్‌లోని హిరోషిమా, నాగసాకిలపై అణుబాంబులు వేసింది. ఈ ఘటన జరిగి 78 ఏళ్లు దాటింది. అయినప్పటికీ విధ్వంసానికి సంబంధించిన గుర్తులు ఇప్పటికీ కనిపిస్తాయి. అమెరికా తొలిసారిగా 1945, ఆగస్టు 6న జపాన్‌లోని హిరోషిమా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని అణుబాంబు వేసింది. ఈ బాంబు పేలుడు నగరంలోని 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో భారీ విధ్వంసం సృష్టించింది. ఇది జరిగిన మూడు రోజుల తర్వాత అంటే ఆగష్టు 9న జపాన్‌లోని నాగసాకి నగరంపై మరో అణుబాంబు వేసి జపాన్‌కు అమెరికా తన సత్తా ఏమిటో చూపించింది. దీంతో జపాన్ అగ్రరాజ్యానికి లొంగిపోవాల్సి వచ్చింది. నిజానికి నాగసాకిపై అమెరికా దాడి చేయాలని నిర్ణయించుకోలేదు. నాగసాకిపై అణుబాంబు వేయడం అత్యంత విచిత్ర పరిస్థితిలో జరిగింది. బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ పేరు 1945, ఆగష్టు 8 రాత్రి గడిచిపోయింది. అమెరికన్ బీ-29 సూపర్‌ఫోర్రెస్(విమానం)లోని బాంబర్ బాక్స్‌లో బాంబు లోడ్ చేశారు. ఈ బాంబు పెద్ద పుచ్చకాయ మాదిరిగా ఉంది. దీని బరువు 4050 కిలోలు. విన్స్టన్ చర్చిల్‌ను ఉద్దేశించి ఈ బాంబుకు ‘ఫ్యాట్ మ్యాన్’ అని పేరు పెట్టారు. ఈ బాంబు లక్ష్యం పారిశ్రామిక నగరం కోకురా. ఈ జపాన్‌లోని ఈ నగరంలోనే పలు మందుగుండు సామగ్రి తయారీ కర్మాగారాలు ఉన్నాయి. 1945, ఆగస్టు 9, ఉదయం 9.50.. ఈ సమయంలో కోకురా నగరంపైన 31,000 అడుగుల ఎత్తులో బీ-29 విమానం ఎగురుతోంది. ‘ఫ్యాట్ మ్యాన్’ ను ఈ ఎత్తు నుంచి కిందకు వదలాలని నిర్ణయించారు. అయితే ఇంతలో కోకురా మీద మబ్బులు కమ్ముకున్నాయి. దీనికితోడు కింద యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ గన్లతో కాల్పులు జరుగుతున్నాయి. దట్టమైన మేఘాలు కమ్ముకోవడంతో.. ఇంతలో బీ-29లోని ఇంధనం క్షీణిస్తోంది. వెనక్కి వెళ్లేందుకు సరిపడా ఇంధనం మాత్రమే విమానంలో మిగిలివుంది. ఈ ఆపరేషన్‌ను నిర్వహించే బాధ్యత గ్రూప్ కెప్టెన్ లియోనార్డ్ చెషైర్ చేపట్టారు. ఈ సంఘటన తరువాత అతను మాట్లాడుతూ ‘మేము ఉదయం తొమ్మిది గంటలకు విమానం టేక్ ఆఫ్ చేశాం. మేము ప్రధాన లక్ష్యమైన కోకురా చేరుకున్న సమయంలో దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. ఇంతలో ఆ బాంబును విడిచిపెట్టాలంటూ మాకు సమాచారం వచ్చింది. అయితే కోకురాపై మేఘాలు ఉండటంతో నాగసాకి నగరం మీది గగనతలానికి చేరుకున్నాం. ఆ తర్వాత సిబ్బంది ఆటోమేటిక్ బాంబు డ్రాపింగ్ ఎక్విప్మెంట్ని యాక్టివేట్ చేయడంతో కొద్ది క్షణాల్లోనే ఆ భారీ బాంబు భూమిపైకి వేగంగా దూసుకువెళ్లింది. ఆలోచనకు అవకాశం లేకుండా.. కేవలం 52 సెకన్లలో ఈ బాంబు భూమి ఉపరితలం నుంచి 500 అడుగుల ఎత్తులో పేలింది. 11:02 కాగానే బాంబు పేలింది. బాంబు పేలిన వెంటనే భగభగ మండుతున్న ఒక భారీ నిప్పు బంతి పైకి ఉబికిలేచింది. ఆ బంతి పరిమాణం పెరుగుతూ నగరం మొత్తాన్ని ఆక్రమించింది. నగరంలోని ప్రజలకు ఏం జరుగుతున్నదనే ఆలోచనకు అవకాశం లేకుండానే వారంతా మృత్యువాత పడ్డారు. నాగసాకి చుట్టూ పర్వతాలు ఉన్నాయి. దీని కారణంగా కేవలం 6.7 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విధ్వంసం జరిగింది. నాగసాకిలో జరిగిన ఈ దాడిలో 74 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. హిరోషిమాలో జరిగిన దాడిలో లక్షా 40 వేల మందికి పైగా ప్రజలు మరణించారు. ఇది కూడా చదవండి: తాలిబాన్‌తో చెలిమి వెనుక చైనా ఎత్తుగడ ఏమిటి? -
అగ్రరాజ్యాల యుద్ధకాంక్ష
-
మనది కాని యుద్ధంలో మన సైనికులు!
‘‘స్వర్గం కూలిపోతున్నప్పుడు, భూమి కదలిపోతున్నప్పుడు, వాళ్లు తమది కాని యుద్ధం చేయడానికి వచ్చారు. కూలిపోతున్న ఆకాశాన్ని తమ భుజానికెత్తుకున్నారు. దేవుడు కూడా వదిలేసినవారిని తమ ప్రాణాలను పణంగా పెట్టి వారు రక్షించారు.’’ మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయ సైనికుల గురించి ప్రముఖ ఇంగ్లిష్ కవి ఎడ్వర్డ్ హౌస్‌మెన్ రాసిన మాటలివి. జూలై 28.. మొదటి ప్రపంచ యుద్ధం మొదలైన రోజు. 1914 జూలై నుంచి నాలుగేళ్లపాటు రక్తపుటేరులు పారించిన ఆ సంగ్రామం 1918 నవంబరు 11న ముగిసింది. ఆ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, కోటీ ముప్పై లక్షల మంది ప్రజలు మరణించినట్లు అంచనా. యుద్ధంలో బ్రిటిష్ ఇండియాకు చెందిన 14 లక్షల మంది భారతీయ సైనికులు పాల్గొన్నారు. వారిలో 74 వేల మంది మరణించారు. వాళ్లకు ఫ్రాన్స్, గ్రీస్, ఉత్తర ఆఫ్రికా, పాలస్తీనా, మెసపటోమియాలలోనే అంత్యక్రియలు నిర్వహించారు. వాళ్లంతా పాల్గొన్నది బ్రిటన్ తరఫున! యూరప్, మధ్యప్రాచ్యం, మధ్యధరా ప్రాంతాల్లో జరిగిన యుద్ధాల్లో భారత సైనికులు పోరాడారు. భారత సైన్యం వెస్టర్న్ ఫ్రంట్‌ను చేరుకోకపోయినా లేక ఇంగ్లిష్ చానెల్ తీరంలోని పోర్టులను జర్మనీ ఆక్రమించుకున్నా మొదటి ప్రపంచయుద్ధం చరిత్ర మరోలా ఉండేది అంటారు. బెల్జియం, ఈశాన్య ఫ్రాన్స్, పశ్చిమ జర్మనీలు ఉన్న ప్రాంతానికే వెస్టర్న్ ఫ్రంట్ అని పేరు. మొదటి ప్రపంచ యుద్ధానికి ప్రధాన వేదిక ఈ ప్రాంతమే. లగ్జెంబర్గ్, బెల్జియంలను ఆక్రమించుకున్న జర్మన్ సైన్యం వెస్టర్న్ ఫ్రంట్‌కు తెరతీసింది. ఈ క్రమంలో ఫ్రాన్స్‌లోని కీలకమైన పారిశ్రామిక ప్రాంతాలపైనా పట్టు సాధించింది. ఆ సమయంలో జర్మన్ సైన్యంపై పోరాడటంలోనూ, నిలువరించటంలోనూ భారత సైన్యం ప్రముఖ పాత్ర పోషించింది. వెస్టర్న్ ఫ్రంట్ ప్రాంతంలోని బెల్జియం, ఫ్రాన్స్‌ల్లో భారత సైన్యానికి చెందిన 1,30,000 మంది తమ సేవలు అందించారు. వీరిలో 9 వేల మంది మరణించారు. ఈ ఒక్క వెస్టర్న్ ఫ్రంట్‌లోనే కాదు, మొదటి ప్రపంచ యుద్ధంలో భాగంగా జరిగిన ప్రతి పోరాటంలో బ్రిటిష్ ఇండియా సైన్యం పాలుపంచుకుంది. అయితే మొదటి ప్రపంచ యుద్ధాన్ని ఎప్పుడూ భారతీయ నేపథ్యం నుంచి ఎవరూ వివరించలేదు. సైనికులే కాకుండా వాళ్లకు సేవలు అందించేందుకు భారతదేశం నుంచి వేల మంది కూలీలు వారి వెంట వెళ్లారు. అంతేకాదు, భారతదేశం తనది కాని యుద్ధం కోసం ధన రూపేణా, ఇతర రూపేణా రూ.13 వేల కోట్లు బ్రిటన్‌కు అందించింది. (చదవండి: తొలి షిప్పింగ్ మహిళ) -
రష్యా - ఉక్రెయిన్ దేశాలే కాదు..ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తుంది
రష్యా - ఉక్రెయిన్ యుద్ధం కారణంగా పరోక్షంగా నష్టపోతున్న ప్రపంచ దేశాల స్థితిగతులపై మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర స్పందించారు. రష్యా - ఉక్రెయిన్ తోపాటు మిగిలిన ప్రపంచ దేశాలు యుద్ధం చేస్తున్నాయని ట్వీట్ చేశారు. This isn’t surprising because the world is effectively at War. The physical battle may be in one country, but the political, economic, cyber, social media & commodity resource battle lines have been drawn & are global. Welcome to World War in the 21st century. https://t.co/PVeg1FUge5 — anand mahindra (@anandmahindra) March 7, 2022 "21వ శతాబ్దంలో జరుగుతున్న ప్రపంచ యుద్ధానికి స్వాగతం. ఇది ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే ప్రపంచం మొత్తం సమర్థవంతంగా యుద్ధంలో పాల్గొంది. భౌతికంగా యుద్ధం లేకపోవచ్చు. కానీ రాజకీయ, ఆర్థిక, సైబర్, సోషల్ మీడియా, కమోడిటీ మార్కెట్లు యుద్ధం చేస్తున్నాయని ముంబై బిజినెస్ టైకూన్ ట్వీట్ చేశారు. Agree. https://t.co/apXQornYsN — anand mahindra (@anandmahindra) March 7, 2022 అందుకు స్పందించిన ప్రపుల్ అనే ట్విట్టర్ యూజర్ స్పందిస్తూ 'ప్రపంచం, మన ఆర్థిక వ్యవస్థ పటిష్టం చేసేందుకు భారత్ శక్తివంతమైన పాత్ర పోషించాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచం గత 2ఏళ్లుగా మహమ్మారితోనే గడిపింది. ఇప్పుడు మాకు ఈ యుద్ధం అక్కర్లేదని ట్వీట్లో పేర్కొన్నాడు. అందుకు మహీంద్రా అవును నిజమేనని స్పందించారు. చదవండి: పోయి పోయి వాళ్లతో ఎందుకు పెట్టుకున్నారయ్యా.. -
మొదటి ప్రపంచ యుద్ధం ఇప్పటికీ ఉంది
మొదటి ప్రపంచ యుద్ధానికి ఇదేమీ ‘టైమ్’ కాదు. టైమ్ అంటే సందర్భం. వరల్డ్ వార్–1 మొదలైంది 1914 జూలై 14. ముగిసింది 1918 నవంబర్ 11న. ప్రారంభానికీ, ముగింపునకు వందేళ్లు ఎప్పుడో దాటిపోయాయి. పోనీ ఈ ప్రథమ ప్రపంచ సంగ్రామానికి కారకుడైన బోస్నియా యువకుడు గవ్రిలో ప్రిన్సిప్ బర్త్, డెత్‌ల తేదీల కూడా దగ్గర్లో ఏమీ లేవు. మరేమిటి! అకస్మాత్తుగా యుద్ధం–1? ఒక విశేషం అయితే ఉంది. ఎయిడ్స్‌కు కారణమైన హెచ్.ఐ.వి. వైరస్ అసలు ఎక్కడి నుంచి సంక్రమించిందో కనిపెట్టేందుకు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్న ఒక కెనడా ప్రొఫెసర్‌కు మధ్య ఆఫ్రికాలోని కామెరాన్‌లో మొదటి ప్రపంచ యుద్ధం మధ్య కాలం నాటి (1916) సైనికుడొకరు ఆకలికి తట్టుకోలేక ఒక చింపాజీని చంపి తినడంతో ఆ చింపాజీ నుంచి ఎయిడ్స్ క్రిమి సంక్రమించిన జాడలు కనిపించాయి. అలా.. చింపాంజీ టు మనిషి.. ఎయిడ్స్ వచ్చి ఉంటుందని ఆ ప్రొఫెసర్ గారొక ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఈ సంగతిని తాజాగా కెనడా, యూఎస్‌లలోని మెడికల్ జర్నల్స్ ప్రకటించాయి. ఎయిడ్స్‌ని అలా ఉంచితే.. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో మానవాళికి ‘సంక్రమించిన’ కొన్ని ఇన్వెన్షన్స్ కూడా ఉన్నాయి. వాటిలో కొన్నివి. చేతి వాచీ మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు మహిళలు మాత్రమే చేతివాచీలు ధరించేవారు. అయితే అవి వారికి ఆభరణాలుగా ఉండేవి. మగవారైతే కాలంతో తమకు పనేముంది అన్నట్లు ఉండేవారు. తెలియందేముంది! తామే కాలాన్ని నడిపిస్తున్నామన్న ఆ ఆధిక్య భావన భూమి పుట్టినప్పటి నుంచి మగజాతికి ఉన్నదే కదా! అయితే ఘరానా ఉండటం కోసం మాత్రం వాచీలను జేబుల్లో పైకి కనిపించేలా పెట్టుకుని తిరిగేవారు. యుద్ధం మొదలయ్యాక పగలూ రేయీ ఏకమై పురుషులు కూడా టైమ్‌ను చూసుకునేందుకు వీలుగా జేబుల్లోంచి తీసి చేతికి పెట్టుకోవలిసి వచ్చింది. ఆ రిస్ట్ వాచీలకు, పాకెట్ వాచీలకు మధ్యస్థ రూపం మరొకటి వచ్చింది. అవి ‘ట్రెంచ్ వాచీ’లు. వాటినే రిస్ట్లెట్స్ అనేవారు. ఒక గ్రేట్ వార్ వస్తే కానీ రిస్ట్‌వాచ్‌లు తగిలించుకోని ‘గ్రేట్’ పీపుల్ ఈ మగవాళ్లు! ఇది ఆవిష్కరణ కానీ, ఒక అలవాటుకు ఆరంభం. జిప్పులు మగవాళ్ల ప్యాంట్లకు, ఆడవాళ్ల గౌన్లకు మొదటి ప్రపంచ యుద్ధానికి ముందు ‘హుక్లెస్ ఫాస్ట్నర్స్’ మాత్రమే ఉండేవి. ఇప్పుడు మనం చూస్తున్న జిప్పుల్లాంటివి అవి. లాంటివే కానీ, జిప్పులు కావు. గిడియోన్ సండ్బాక్ అనే స్వీడిష్ అమెరికన్ ఇంజినీరు చిక్కుపడని, కక్కేలు ఇరుక్కోని సాఫీగా ఉండే జిప్పులను హుక్కుతో పాటు 1914లో డిజైన్ చేశారు. ఆ యుద్ధ పరిస్థితుల్లో సైనిక వస్త్రాల అవసరాలకు కొత్త డిజైన్లలోని జిప్పులు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చివరికి అవే మన్నికైనవిగా స్థిరపడ్డాయి. ఫ్యాషన్లు ఎన్ని మారినా, జిప్ డిజైన్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. అంతకుమించి జిప్పులను మెరుగు పరచడానికి ఏమీ లేదని, మెరుగు పరిచే అవసరమే లేదని తర్వాత్తర్వాత వచ్చిన ఇంజనీర్లు తేల్చేశారు! స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు పట్టని విధంగా క్రోమిమంతో తయారు చేసిన స్వచ్ఛమైన ఉక్కు ‘స్టెయిన్లెస్ స్టీల్’. మొదటి ప్రపంచ యుద్ధకాలానికి ముందు స్టెయిన్లెస్ స్టీల్ లేనేలేదు. యు.ఎ.లోని షెఫీల్డ్ ప్రాంతంలో ఉండే హ్యారీ బ్రియర్లీ యుద్ధ ప్రారంభ కాలమైన 1914 లో ఈ రకం స్టీల్‌ను కనిపెట్టారు. యుద్ధ విమానాల ఇంజిన్లు, మెస్ కిట్ సిల్వర్‌వేర్, వైద్య పరికరకాల తయారీకి ఒక మేలు రకమైన లోహం అవసరం అవడంతో, ఆ అవసరం నుంచి స్టెయిన్లెస్ స్టీల్ అవిర్భవించింది. పైలేట్స్ ఇదొక ఫిట్నెస్ టెక్నిక్. జోసెఫ్ పైలేట్స్ అనే జర్మన్ ఫిట్నెస్ మాస్టర్ ఈ టెక్నిక్‌ను (వ్యాయామ విధానం) మొదటి ప్రపంచ యుద్ధం ముగుస్తుండగా 1918 చివర్లలో వృద్ధి చేశారు. యుద్ధకాలంలో ఆయన ఆసుపత్రులలోని రోగుల నడకకు బలం చేకూర్చే పైలేట్స్ వ్యాయామం కోసం ‘క్యాడిలాక్’ అనే సాధనాన్ని రూపొందించారు. స్వయంగా ఆసుపత్రులకు వెళ్లి ఈ టెక్నిక్‌తో వ్యాయామ సేవలు కూడా అందిం చారు. శానిటరీ నేప్కిన్స్ 1914లో యూఎస్‌లోని కింబర్లీ క్లార్క్ అనే సంస్థ కలప గుజ్జుతో ఒక వస్త్రాన్ని తయారు చేసింది. యుద్ధ కాలంలో పత్తి కొరత ఏర్పడి, పత్తి వస్త్రాలకు అవసరం పెరగడంతో ప్రత్యామ్నాయంగా ఆ కంపెనీ గుజ్జు వస్త్రాన్ని కనిపెట్టింది. దానికి సెల్యుకాటన్ అని పేరుపెట్టింది. అమెరికా సైన్యంలోని క్షతగాత్రుల కోసం సర్జికల్ డ్రెస్సింగ్‌గా ఆ వస్త్రాన్ని సరఫరా చేసింది. రక్తస్రావాన్ని సెల్యుకాటన్ సమర్థం గా నిలువరించడంతో, యుద్ధానంతరం కొటెక్స్ శానిటరీ పాడ్స్ తయారు చేసి మార్కెట్లో విడుదల చేసింది. ఆ ప్రాడక్ట్‌కు అమితమైన ఆదరణ లభించింది. నేడు వాడుకలో ఉన్న శానిటరీ నేప్కిన్స్ వాటికి ఆధునాతన రూపమే. పోర్టబుల్ ఎక్స్–రేస్ తొలి ‘రేడియోలాజికల్ కారు’ అవిష్కరణ జరిగింది కూడా మొదటి ప్రపంచ యుద్ధ కాలంలోనే. ఈ కారును కనిపెట్టింది పోలెండ్ భౌతిక శాస్త్రవేత్త మేరీ క్యూరీ. ఈ వాహనంలో ఎక్స్ రే మిషన్ ఉండేది. ఫొటోగ్రాఫ్ డార్క్ రూమ్ పరికరాలు ఉండేవి. యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స చేయడానికి ఆర్మీ సర్జన్లు నేరుగా యుద్ధ క్షేత్రంలోనికే ఈ రేడియోలాజికల్ కార్లను నడుపుకుంటూ వెళ్లేవారు. -
‘వరల్డ్ వార్ వన్’ విస్మరించిన జర్మనీ
బెర్లిన్ : ‘జర్మనీ జీవించేందుకు మేము చనిపోయాం. జర్మనీ జీవించడంలో మేము బతికుంటాం’ అన్న నినాదం బెర్లిన్‌లోని కొలంబియాడామ్ శ్మశానంలో నేల కొరిగిన ఓ సైనికుడి విగ్రహం పక్కన రాసి ఉంటుంది. మొదటి ప్రపంచ యుద్ధంలో చనిపోయిన ఏడువేల మంది జర్మనీ సైనికులు సంస్మరణార్థం ఈ విగ్రహాన్ని 1925లో అప్పటి జర్మనీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పిడికిలి మాత్రమే బయటకు కనిపించేలా బ్లాంకెట్ కప్పిన అమరసైనికుడి విగ్రహం నెత్తిన టోపీ, పక్కన తుపాకీ ఉన్నట్లుగా చెక్కిన ఈ రాతి విగ్రహం వద్ద మొదట్లో ప్రభుత్వ పెద్దలు, ప్రజలు పుష్ప గుచ్చాలు ఉంచి నివాళులర్పించేవారు. రెండవ ప్రపంచ యుద్ధం అనంతరం మొదటి ప్రపంచ యుద్ధం అమర సైనికులను జర్మనీ దాదాపు విస్మరించింది. మొదటి సంవత్సరం యుద్ధం ముగిసి ఆదివారం నాటికి సరిగ్గా వందేళ్లు పూర్తియిన సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలతోపాటు పారిస్‌లో వివిధ దేశాధినేతల సమక్షంలో భారీ ఎత్తున స్మారక కార్యక్రమాలు జరిగాయి. పారిస్ ఆహ్వానాన్ని అందుకున్నప్పటికీ జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కల్ ఆ కార్యక్రమానికి వెళ్లలేదు. దేశంలో కూడా పెద్దగా సంస్మరణ కార్యక్రమాలు నిర్వహించలేదు. ఒక్క పార్లమెంట్ హాలులో స్మారక ఉపన్యాసంతో మొక్కుబడిగా నూరేళ్ల స్మారక దినాన్ని ముక్తిసరిగా ముగించింది. ఎందుకు? మొదటి ప్రపంచ యుద్ధంలో సంభవించిన నష్టం కంటే రెండో ప్రపంచ యుద్ధంలో ఎక్కువ నష్టం వాటిల్లడం. మొదటి ప్రపంచ యుద్ధమే రెండో ప్రపంచ యుద్ధానికి కారణం కావడం కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా దేశం రాజరిక వ్యవస్థ నషించి రిపబ్లికన్ వ్యవస్థ ఏర్పడడం, ఆ రిపబ్లికన్ వ్యవస్థ నియంత హిట్లర్, నాజిజిం పుట్టుకకు కారణం అయింది. రెండో ప్రపంచ యుద్ధానికి సంబంధించి బెర్లిన్‌తోపాటు, దేశంలోని పలు ప్రాంతాల్లో స్మారక భవనాలు, మ్యూజియంలు ఉన్నాయి. మొదటి ప్రపంచ యుద్ధానికి సంబంధించి అతి తక్కువ స్మారక మ్యూజియంలు ఉన్నాయి. కొలంబియాడామ్ శ్మశానంలోని అమర వీరుల సమాధాల వద్దగానీ, వారి స్మారక విగ్రహం వద్దకుగానీ పుష్మ నివాళులర్పించేందుకు ఈ మధ్య ఎవరూ రావడం లేదని స్థానికులు తెలిపారు. 2017లో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలినా మార్కెల్ సైనిక స్మారక విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అయితే ఈసారి ఆమె అక్కడికి కూడా పోలేదు. నాటి యుద్ధానికి కారణమైన దేశాల్లో జర్మనీ ఒకటి అవడమే కాకుండా ఆ యుద్ధంలో ఓటమిని అంగీకరించమనే ఆత్మన్యూనతా భావం వల్ల కూడా జర్మనీ నూరేళ్ల కార్యక్రమాన్ని పట్టించుకోక పోవచ్చని చరిత్రకారులు భావిస్తున్నారు. ఆదివారం నాటి కార్యక్రమం కోసం పలు దేశాలు ఏడాది ముందుగానే చరిత్రకారులతో, ఉన్నతాధికారులతో కమిటీలు వేశాయి. మొదటి ప్రపంచ యుద్ధం, ప్రపంచంపై దాని ప్రభావం, ఫలితాలు అంశాలపై చరిత్రకారులతో పుస్తకాలు రాయించి ప్రచురించడంతోపాటు తమ దేశాల్లో పలు స్మారక భవనాలను కూడా నిర్మించాయి. సెమినార్లు, సదస్సులను నిర్వహించాయి. -
గ్రేట్ వార్.. అరుదైన ఫొటోలు
-
ప్రపంచ యుద్ధాల సాక్షి ఇక లేరు
ఇజ్రాయెల్: ప్రపంచ కురువృద్ధుడు యెజ్రాయెల్ క్రిస్టల్(113) కన్నుమూశారు. యెజ్రాయెల్ 1903 సెప్టెంబర్ 15న జన్మించి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గత ఏడాది ప్రపంచ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. ఆయన పోలాండ్‌లో జన్మించారు. రెండు ప్రపంచ యుద్ధాలకు యెజ్రాయెల్ ప్రత్యక్ష సాక్షిగా నిలవడమే కాకుండా ఆ యుద్ధాలను చవి చూసి మరణం అంచుల వరకు పోయి మృత్యుంజయుడుగా నిలిచాడు. ఈ క్రమంలోనే అతని మొదటి భార్య, కుటుంబ సభ్యులు నాజీల చేతిలో హత్యకు గురయ్యారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యెజ్రాయిల్ మళ్లీ వివాహం చేసుకుని ఇజ్రాయిల్‌కు వలస వచ్చారు. ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంలోని తన ఇంట్లో (113 ఏళ్ల 330 రోజులు జీవించి) మృతిచెందారు. అతని మృతిపట్ల ప్రపంచవ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తుతున్నాయి. -
ఆడ'వార్'
ప్రపంచ యుద్ధ క్షేత్రాలలో 'షి'శస్త్రం వియ్ కెన్ డు యుద్ధం క్రూరంగా ఉంటుంది. మహిళలో కారుణ్యం ఉంటుంది. ఎలా ఈ రెండూ మ్యాచ్ అవడం? యుద్ధంలో శత్రువు యుద్ధధర్మాన్నీ, యుద్ధనీతినీ విస్మరిస్తాడు. ఆ శత్రువుకు మహిళ బందీగా దొరికితే ఇంకేమైనా ఉందా?! యుద్ధంలో ఊహించని విధంగా దుర్భరమైన పరిస్థితులు ఏర్పడతాయి. మహిళ మానసికంగా వాటిని తట్టుకుని నిలబడవచ్చు. కానీ శారీరకంగా ఆమె శక్తి సరిపోకపోతే? ఇదిగో.. ఇన్ని డౌట్లు వస్తాయి.. మహిళను యుద్ధభూమికి పంపడానికి!! ‘వియ్ కెన్ డు ఇట్’ అని మహిళలు ఎంత చెయ్యెత్తి పిడికిలి బిగించినా, ‘వి కాంట్ డూ ఇట్ ప్లీజ్’ అని ప్రపంచ దేశాలు మహిళల్ని కంబాట్ (యుద్ధం)లోకి తీసుకోలేమని చెప్పి, దశాబ్దాలపాటు నిరుత్సాహపరుస్తూ వచ్చాయి. సైన్యంతో నిమిత్తం లేకుండా తమకై తాముగా కదన రంగంలోకి దుమికిన క్వీన్ బోడికా (రోమ్కు వ్యతిరేకంగా బ్రిటన్ తరఫున), జోన్ ఆఫ్ ఆర్క్ (ఇంగ్లండ్‌కు వ్యతిరేకంగా ఫ్రాన్స్ తరఫున) వంటి వారు చరిత్రలో ఉన్నప్పటì కీ వారు మగవేషంలో మాత్రమే ఫైట్ చేయవలసి వచ్చింది. సుమారు 18వ శతాబ్దం వరకు ప్రపంచంలో ఎక్కడా మహిళలు ఒక ప్రత్యేక సైనిక విభాగంగా యుద్ధక్షేత్రానికి వెళ్లింది లేదు. తొలిసారి రష్యా మొదటి ప్రపంచ యుద్ధంలోకి ఒక మహిళా దళాన్ని పంపింది. ఆ తర్వాత ఒక్కో దేశం రష్యాను అనుసరించింది. రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటన్, జర్మనీ.. తమ దేశ మహిళలకు శత్రుదేశాల విమానాలను కూలగొట్టే యాంటీ–ఎయిర్‌క్రాఫ్ట్ యూనిట్లలో శిక్షణ ఇప్పించి మరీ యుద్ధానికి పంపాయి. ఆ తర్వాతి రెండు శతాబ్దాలలోనూ అనేక దేశాలు మహిళలను యుద్ధ విధుల్లోకి తీసుకోవడం మొదలు పెట్టాయి. భారత్ అయితే మరీ ఇటీవల మాత్రమే తన మహిళలకు ఈ అవకాశాన్ని కల్పించింది. మహిళలను యుద్ధక్షేత్ర విధుల్లోకి తీసుకునేది లేదని 2015లో స్పష్టంగా ప్రకటించిన అప్పటి రక్షణశాఖ మంత్రి మనోహర్ పారికర్ 2016లో తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని ‘పోరాటంలోకి మీరూ రావచ్చు’ అని త్రివిధ దళాలలోకి మహిళలకు ఎంట్రీ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఏ దేశం ఎప్పుడు తన మహిళలకు యుద్ధరంగపు సైనికులుగా అవకాశం కల్పించిందో ఒకసారి చూద్దాం. అమెరికా: 2013 జనవరి 24న అమెరికా రక్షణశాఖ కార్యదర్శి లియోన్ పనెట్టా యుద్ధరంగంలోకి మహిళలు రావడంపై అప్పటి వరకు ఉన్న నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేశారు. యునైటెడ్ కింగ్డమ్: 2016 జూలైలో భూతలంపై పోరాడే యుద్ధ సైనికులుగా మహిళలను నియమించడానికి అవరోధంగా ఉన్న నిబంధనలను యు.కె.తొలగించింది. జర్మనీ: 2011లో అన్ని ఫైటింగ్ యూనిట్లలోకి మహిళలను ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది. ఆస్ట్రేలియా: 2011 నుంచి 2013 వరకు విడతల వారీగా దేశ రక్షణ దళాలలోని పోరాట విభాగాలలో మహిళలకు అవకాశం కల్పించింది. కెనడా: ‘కెనడా మానవ హక్కుల చట్టం’ ప్రకారం కెనడా సైనిక దళాలలోనూ మహిళలకు స్థానం కల్పిస్తూ 1989లో నిర్ణయం తీసుకుంది. 2000 సంవత్సరంలో.. జలాంతర్గాములలోకి మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని రద్దు చేసింది. డెన్మార్క్: మహిళలు యుద్ధరంగంలోకి పనికొస్తారా అనే విషయంపై సర్వే చేయించి, సైన్యంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమైన పోరాట పటిమను కనబరుస్తారని ఆ సర్వేలో తేలడంతో 2010 నుంచి మహిళల్ని యుద్ధంలోకి తీసుకుంటోంది. ఫిన్లాండ్: ‘మగవాళ్లకు మాత్రమే’ అనే నిబంధనేమీ ఫిన్లాండ్లో లేదు. అలాగే మహిళలకు ప్రత్యేక ఆహ్వానమేమీ లేదు. మహిళలు తమకు ఇష్టమైతే ఆర్మీలోని యుద్ధ విభాగాలలో చేరొచ్చు. ఫ్రాన్స్: ఈ దేశపు యుద్ధ విధుల్లో ఐదింట ఒక శాతం వరకు మహిళలు ఉన్నారు. మహిళలు యుద్ధ విధుల్లోకి రావడానికి అక్కడ ఉన్న నిబంధలను ఫ్రాన్స్ తన అవసరాన్ని బట్టి సడలించుకుంటూ వస్తోంది. ఇజ్రాయిల్: 2000లో ‘సైనిక సేవల్లో సమానత్వ సవరణ బిల్లు’ను తీసుకువచ్చింది. నాటి నుంచి మహిళల నియామకాలు ఎక్కువయ్యాయి. నార్వే: 1985లోనే సబ్మెరైన్స్లోకి మహిళల్ని తీసుకుంది! 2015 నాటికి ‘కంపల్సరీ మిలటరీ సర్వీస్’లోకి కూడా మహిళలు వచ్చేశారు. శ్రీలంక: సాధారణ యుద్ధరంగంలో తప్ప.. ప్రత్యేక దళాలు, పైలట్ బ్రాంచ్, నావల్ ఫాస్ట్ ఎటాక్.. వంటి ‘డూ ఆర్ డై’ విభాగాలలోకి మాత్రం ఇప్పటికీ మహిళలకు అవకాశం లేదు. స్వీడన్: 1989 నుండి అన్ని యుద్ధ విధుల్లోకి స్వీడన్ తన మహిళల్ని స్వాగతిస్తోంది. -
మూడో ప్రపంచ యుద్ధం తప్పదట!
న్యూయార్క్: మూడో ప్రపంచ యుద్ధం అతి సమీపంలోకి వచ్చిందని, ఏ క్షణాన్నైనా యుద్ధం ప్రారంభకావొచ్చని హెచ్చరిస్తూ అనానిమస్ (గుర్తుతెలియని)గా చెప్పుకుంటున్న హ్యాకర్ల బృందం ఓ వీడియోను ఆన్లైన్లో పోస్ట్ చేసింది. గతంలో జరిగిన ఒకటో ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం తరహాలో ఈ మూడో యుద్ధం కొన్ని సంవత్సరాలుగానీ, నెలల తరబడిగాని జరగదని కూడా పేర్కొంది. సత్వరం ముగిసే ఈ యుద్ధం గతంలోకంటే హోరాహోరీగా, క్రూరంగాను జరుగుతుందని హ్యాకర్ల బృందం అంచనా వేసింది. మూడో ప్రపంచ యుద్ధం రావడానికి ఉత్తరకొరియా ద్వీపకల్పంలో చోటుచేసుకుంటున్న పరిణామాలే కారణమని కూడా అనానిమస్ హ్యాకర్లు చెబుతున్నారు. చైనా, జపనీస్ ప్రభుత్వాలు పౌర హెచ్చరికలు జారీ చేయడం కూడా ఇందుకు సూచననేనని అంటున్నారు. దక్షిణ కొరియాలో అమెరికా థాడ్ ఖండాంతర క్షిపణి రక్షణ వ్యవస్థను పరీక్షించడంతోపాటు మూడు ఖండాంతర క్షిపణులను కూడా అమెరికా పరీక్షించడాన్ని హ్యాకర్లు ప్రస్తావించారు. ఉత్తర కొరియా సరిహద్దుల్లో మోహరిస్తున్న ఆ దేశ సైన్యాన్ని, సైనిక సంపత్తిని కూడా హ్యాకర్లు యుద్ధ సన్నాహాలుగానే పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే ఉత్తరకొరియా నుంచి చైనా పౌరులను వెనక్కి రావాల్సిందిగా చైనా ప్రభుత్వం ట్రావెల్ హెచ్చరిక జారీ చేసింది. ఉత్తర కొరియా అణు దాడికి పాల్పడితే ప్రాణాలతో బయటపడేందుకు పది నిమిషాలకు మించి సమయం దొరకదని చైనా పేర్కొంది. ప్రపంచ దేశాలు మూడు బృందాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు యుద్ధం చేస్తాయని హ్యాకర్లు పేర్కొన్నారు. ఎవరి నాయకత్వాన ఆ బృందాలు ఏర్పాడతాయనే విషాయాన్ని మాత్రం తెలపలేదు. అమెరికా, ఉత్తరకొరియా రెండు బృందాలుగా చీలిపోతే మరి మూడో బృందం ఏ దేశం నాయకత్వాన ఏర్పడుతుందనే విషయంలో హ్యాకర్ల మాటల్లో స్పష్టత లేదు. రష్యా పేరును అసలు ప్రస్తావించకపోవడం కూడా ఇక్కడ గమనార్హం. మూడో ప్రపంచ యుద్ధం కచ్చితంగా జరుగుతుందని తాము చెప్పడం లేదని, యుద్ధం జరిగేందుకు కచ్చితమైన పరిస్థితులు ఉన్నాయని మాత్రమే తాము చెబుతున్నామని పేర్కొన్నారు. అనానిమస్ హ్యాకర్లు విడుదల చేసిన ఏడు నిమిషాల నిడివిగల వీడియోలో మాట్లాడిన హ్యాకర్ తనను గుర్తుపట్టకుండా చిత్రమైన మాస్క్ ధరించాడు. -
యుద్ధ సైనికులకు ఆర్థిక సాయం
♦ రూ.3 వేల నుంచి రూ.5 వేలకు పెంపు ♦ జిల్లాలో 35 మందికి లబ్ధి శ్రీకాకుళం న్యూకాలనీ: యుద్ధవీరుల సేవలను ప్రభుత్వం గుర్తించింది. 1939 నుంచి 1945 సంవత్సరాల మధ్య రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పనిచేసిన మాజీ సైనికులు, వారి కుటుంబాలకు ఆర్థిక సాయం పెంచింది. కొన్నేళ్లుగా నెలకు రూ.3000 ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. 2016 జూలై 20 నుంచి పెంచిన సాయం అమల్లోకి వస్తుందని ‘ఉత్తర్వుల సంఖ్య 88 హోమ్ (సర్వీసెస్–4) డిపార్ట్మెంట్’లో పేర్కొంది. ఈ మేరకు జిల్లా సైనిక సంక్షేమాధికారి కార్యాలయానికి ఉత్తర్వుల చేరాయి. జిల్లాలో 35 కుటుంబాలకు ఆర్థిక లబ్ధి చేకూరనుంది. యుద్ధంలో పాల్గొన్న ఒకేఒక్క మాజీ సైనికుడు బతికుండగా, మిగిలిన 34 మంది వితంతువులే కావడం గమనార్హం. మాజీ సైనికులు, వితంతువుల ఆధార్ కార్డు నంబర్, ప్రస్తుతం సహాయం అందుతున్న బ్యాంకు ఖాతా నంబర్‌ను అనుసంధానం చేసి జిరాక్సు కాపీలను జిల్లా సైనిక సంక్షేమాధికారి కార్యాలయానికి అందజేయాలని సంక్షేమాధికారి సత్యానందం కోరారు. మరిన్ని వివరాలకు 08942–227688 నంబర్‌ను సంప్రదించాలని కోరారు. చేయూత ఇలా మొదలైంది.. పింఛన్‌కు కూడా నోచుకోని యుద్ధసైనికుల కుటుంబాలను రాష్ట్రసర్కారు తొలుత 1985లో గుర్తించింది. వీరికి అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో (1985)లో 500 అందజేశారు. తర్వాత చంద్రబాబు హయాంలో (2002లో) దీనిని రూ.1000కి పెంచారు. అనంతరం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి (2005లో) రూ.3000లకు పెంచారు. తాజాగా దానిని రూ.5 వేలకు పెంచారు. ఆర్థిక చేయూత పెంచాలి రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ప్రాణాలను సైతం పనంగా పెట్టి సైనికులు పోరాడారు. సైనికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివి. ప్రభుత్వాలు పెద్దమనసుతో ఆలోచించాలి. దశాబ్దం తర్వాత గాని పెంపునకు నోచుకోకపోవడం బాధాకరం. కనీసం రూ.10 వేలకు తగ్గకుండా ఆర్థిక చేయూతను అందించి వారి కుటుంబాలను ఆదుకోవాలి. – డి.సింహాచలం, జిల్లా మాజీ సైనిక,కుటుంబ సంక్షేమ సంఘం అధ్యక్షుడు -
సమరం సంబరమైన వేళ...
‘దేవతల గానం వినడానికైనా ఆ రాత్రి తుపాకులు మౌనం వహిస్తాయని ఆశిస్తున్నాను’ అంటూ డిసెంబర్ 7, 1914న నాటి పోప్ పదిహేనో బెనడిక్ట్ ఒక సందేశం పంపారు. ఇంతకీ ఆ రాత్రి ఏదీ అంటే, క్రిస్మస్ రాత్రి. యుద్ధం పేరుతో ఈ పుడమి గతంలో ఎన్నడూ లేనంతగా నెత్తుటిలో తడిసి ముద్దవుతున్న కాలంలో పోప్ ఈ సందేశం పంపారు. అప్పటికి మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభమై ఐదు మాసాలు గడిచిపోయింది. రోజూ వేల మంది ప్రాణాలు వదులుతున్నారు. ఇంగ్లండ్, బ్రిటిష్ వలస రాజ్యాలు, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, సెర్బియా ఒకవైపు మిత్రపక్షాల పేరుతోనూ; జర్మనీ, ఆస్ట్రియా, జపాన్, టర్కీ వంటి దేశాలు అగ్రరాజ్యాల కూటమి పేరుతోనూ ఘోర యుద్ధం చేశాయి. ఈ యుద్ధం ఆ సంవ త్సరం క్రిస్మస్ నాటికి పూర్తయిపోతుందని అంతా ఆశించారు. కానీ ‘ఈ భూగోళం మీద మనిషి మిగులుతాడా?’ అన్నంత బీభత్సంగా మారి, ప్రపంచ యుద్ధంగా పరిణమించింది. చివరికి 15 లక్షల ప్రాణా లను బలి తీసుకుని ఎలాంటి ఫలితం లేకుండానే ముగిసింది. మధ్యయుగాలకు మించిన అంధత్వంతో సాగిన ఈ సమరానికి కొద్దిగా అయినా విరామం కల్పించాలని పోప్ ప్రయత్నించడం ఒక అద్భుతం. కానీ పోప్ పిలుపునకు బ్రిటిష్ యుద్ధమంత్రి లార్డ్ కిష్నర్, ఆ దేశ సర్వసైన్యాధ్యక్షుడు సర్ జాన్ ఫ్రెంచ్, ఇంగ్లండ్ రాజు ఐదో జార్జి, జర్మనీ నియంత విల్హెల్మ్, ఆస్ట్రియా చక్రవర్తి ఫ్రాంజ్ జోసెఫ్, రష్యా చక్రవర్తి రెండో నికోలస్-ఎవరూ స్పందించలేదు. కానీ, ఒకరినొకరు ఘోరంగా చంపుకుంటున్న రెండు శిబిరాల సైనికులూ కలసిపోయి యుద్ధభూమిలో క్రిస్మస్ పండుగ జరుపు కున్నారు. ‘అక్కడ ఆ రాత్రి జరిగినదాన్ని తెర మీద చూస్తే అదో అభూత కల్పన అని నేను కూడా అనుకునేవాడిని’ అంటాడు కెప్టెన్ ఎడ్వర్డ్ హూల్సే (ఇంగ్లండ్ సెకెండ్ స్కాట్స్‌కు చెందిన సైనికాధికారి). హూల్సే ఆ గాథకు ప్రత్యక్ష సాక్షి. నిజంగా అదొక కథలా, స్వప్నంలా అనిపిస్తుంది. మొదటి ప్రపంచ యుద్ధం ఆరంభ మైన తరువాత జరిగిన తొలి క్రిస్మస్ పండుగలో దాదాపు లక్షమంది సైనికులు పాల్గొన్నారని అంచనా(తరువాత వైరి శిబిరాల మధ్య ఇలాంటి ‘అవాంఛనీయ సంఘటనలు’ చోటు చేసుకోకుండా జాగ్రత్త పడ్డారు). బెల్జియం, ఫ్రాన్స్ దేశాల సరిహద్దులలో ఫ్లాండర్స్ అనే చోట, ఫ్రీలింఘీన్ అండ్ హూప్లైన్స్ సెక్టర్లో శత్రుదేశాల సైనికుల మధ్య జరిగిన వేడుక చరిత్రలో ఎంతో ఖ్యాతి గాంచింది. ఏది ఏమైనా ఫ్రాన్స్‌ను స్వాధీనం చేసుకోవా లన్న నిర్ణయంతో జర్మనీ సేనలు ఆ దేశ సరి హద్దులకు నలభై మైళ్ల దూరంలోనే కాపు వేసి ఉండిపోయాయి. దానితో ట్రెంచ్‌లు (కందకాలు) అవసరమైనాయి. ఫ్రాన్స్ వైపు మిత్రరాజ్యాల సేనల కందకాలు, బెల్జియం సరిహద్దులలో అక్షరాజ్యాల సేనలు మాటు వేసి ఉన్నాయి. నిత్యం వేకువనే మొదలయ్యేది కవ్వింపు చర్య. ఏదో ఒకవైపు నుంచి కాల్పులు మొద లయ్యేవి. కొన్నిగంటల సేపు సాగి, ఆగేవి. స్నైపర్ గన్నులు, గ్రెనేడ్లు, ట్యాంకులు పేలుళ్లతో ఆ ప్రాంతం పొగతో నిండేది. డిసెంబర్ 23 రాత్రి జర్మన్ సేనలు మాటు వేసి ఉన్న కందకం గోడ (పేరాపెట్ వాల్) మీద ఏవో చిన్న చిన్న దిమ్మలు కనిపించాయి. అవేవో కొత్తరకం మందుగుండు అనుకున్నారు ఇంగ్లిష్ సైన్యం. త్రికోణాకారంలో, అడుగు ఎత్తు ఉన్న ఆ దిమ్మల మీద వెలుగులు నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. నిజానికి అవి క్రిస్మస్ చెట్లు. ఆ వెలుగులు చిన్న చిన్న కొవ్వొత్తులు. కానీ అప్పటికి క్రిస్మస్ చెట్టు సంప్రదాయం ఇంగ్లండ్ సామాన్య జనానికి చేరువ కాకపోవడంతో ఆ దేశ సైన్యంలో అలాంటి అపోహ తలెత్తింది. అయితే రెండు శిబిరాల సైన్యం మధ్య క్రిస్మస్ పండుగ జరుపుకోవాలన్న కోరిక బలంగా ఉంది. అప్పుడే బ్రిటిష్ యువ రాణి నుంచి, కుటుంబాల నుంచి క్రిస్మస్ కానుకలు వెల్లువెత్తడం మొదలైంది. సైనికాధికారుల మాట ఎలా ఉన్నా సరిగ్గా మూడు రోజుల ముందు జర్మనీకి చెందిన లెఫ్టినెంట్ జోహెన్నెస్ నిమానీ హూల్సే వంటి కింది స్థాయి అధికారులతో రహస్య చర్చలు మొదలుపెట్టాడు. అంటే జర్మనీ వైపు నుంచి ఈ ప్రయత్నం ఆరంభమైంది. క్రిస్మస్ రోజున తాము పై అధికారుల కోసం తుపాకులు పేల్చడం కంటే, ప్రభువును భక్తితో ప్రార్థించడానికే ప్రాధాన్యం ఇస్తామని వారు కరాఖండీగా చెప్పేశారు. అంతా కొంత మెత్తబడ్డారు. కానీ ఇలాంటిదేదో జరుగుతుందన్న అనుమానం మిలటరీ పెద్దలలో రానే వచ్చింది. శత్రుపక్షంతో చేతులు కలపడం వంటి పని చేయవద్దని, అదే జరిగితే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరికలు కూడా వచ్చేశాయి. పోప్ క్రిస్మస్ రాత్రి తుపాకులు పేల కుండా ఉంటే చాలునని కోరుకున్నారు. కానీ, 24 వేకువ నుంచే మందుగుండు మూగబోయింది. అయినా ఎవరి అను మానాలు వారివి. 25వ తేదీ వేకువన, గడగడలాడించే చలిలో, ఎడతెరిపి లేకుండా కురుస్తున్న మంచులో ‘నో మ్యాన్స్ల్యాండ్’కు అవతల జర్మన్ భాషలో ‘సిల్లేనాట్.. హి వజ్ నాట్...’ అంటూ కీర్తన లీలగా వినిపించింది. ఆ పాట విన్న కందకాలలోని ఇంగ్లిష్ సైనికులకు తమ దేశంలో పాడుకునే ఒక గీతం బాణీ గుర్తుకు వచ్చింది - ‘సెలైంట్ నైట్...’ అన్న గీతమే అది. క్రిస్మస్ రోజు వేకువన పాడే పాట. శాంటాక్లాజ్ వేషధారి అయిన ఒక జర్మన్ సైనికుడు ఇంగ్లిష్ వాళ్ల కందకం దగ్గరకు వచ్చి, ముళ్ల కంచె వెనక నుంచి గట్టిగా ‘మెర్రీ క్రిస్మస్’ అని అరిచాడు. ఒక్కొక్కరే లేచి, నోమ్యాన్స్ ల్యాండ్ లోకి వెళ్లి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. మనిషిలో చచ్చిపోయిందనుకున్న మానవత్వం క్రిస్మస్ పేరుతో అయినా అందరికీ గుర్తుకు వచ్చినందుకు మురిసి పోయారు. బద్ధశత్రువులు ఆలింగనం చేసుకున్నారు. పెద్ద మంట వేసి దాని చుట్టూ తిరుగుతూ సైనిక వాద్యాలు మోగించారు. నాటి ప్రఖ్యాత ప్యారిస్ ఒపేరా గాయకుడు విక్టర్ గ్రానరీ ఒడలు మరచి పాడాడు. అంతా కలసి చుట్టూ ఉన్న రెండు పక్షాల సేనల శవాలనూ సేకరించి తెచ్చి ఉమ్మడిగా అంత్యక్రియలు చేశారు. శిరస్త్రాణాలు, పొగాకు, కత్తులు, కోటు గుండీలు వంటివి కానుకలుగా ఇచ్చి పుచ్చుకున్నారు. తరువాత రెండు పక్షాల నుంచి ఎంపిక చేసిన క్రీడాకారులతో ఆ యుద్ధభూమిలో జరిగిన ఫుట్‌బాల్ మ్యాచ్ చరిత్రలోనే ఓ అద్భుతం. చిత్రంగా ఇందులో ఇంగ్లండ్ నెగ్గింది. ఆ కొద్ది గంటలలో జరిగిన వింతలూ విశేషాలూ ఎన్నో! నిజానికి యుద్ధంలో ఉన్న సైనికుడు నిబంధనను అతిక్రమిస్తే దారుణమైన శిక్షను ఎదుర్కోవాలి. శత్రువుతో చేయి కలిపితే కాల్చి చంపేవారు. అయినా తెగించి ఇరు పక్షాల సైనికులూ ఈ సాహసానికి ఒడిగట్టారు. అందుకే ఇదొక చారిత్రక అద్భుతం. - డా॥గోపరాజు నారాయణరావు -
దురాక్రమణల పర్వం.. ఆ యుద్ధం
‘‘యుద్ధం మానవజాతికి చరమగీతం పాడకముందే.. మానవజాతి యుద్ధానికి చరమగీతం పాడాలి’’ అంటారు అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్.కెనడీ. రక్తపాతాన్ని సృష్టించే యుద్ధం వల్ల సాధించేదేమీ ఉండదు. దేశాధినేతల భూదాహం చల్లార్చుకోవడం తప్ప. కోట్లాది కుటుంబాల రక్తాన్ని ఏరులై పారించిన రెండో ప్రపంచ యుద్ధ కాలాన్ని తలచుకుంటే నేటికీ సైనికుల కళ్లు చెమర్చుతాయి. పోరాటం దేనికోసమో తెలియని అయోమయస్థితిలోకి ప్రపంచాన్ని నెడతాయి..! 1939 నుంచి 45 వరకూ ప్రపంచంలోని వివిధ దేశాల మధ్య జరిగిన యుద్ధాల సమాహారమే రెండో ప్రపంచ యుద్ధం. వీటిలో కొన్ని విడివిడిగానూ, కొన్ని ఉమ్మడిగానూ జరిగాయి. సుమారు ఆరు కోట్లమందిని బలితీసుకున్న ఈ యుద్ధం.. ప్రధానంగా రెండు కారణాల వల్ల పురుడుపోసుకుంది. వాటిలో మొదటిది 1937లో జరిగిన జపాన్-చైనా యుద్ధం కాగా.. 1939 పోలాండ్ దురాక్రమణ రెండోది. ఇవే రానురానూ ప్రపంచంలోని అగ్రదేశాలన్నీ కలిసి మిత్ర రాజ్యాలు, అక్ష రాజ్యాలు అనే రెండు కూటములుగా ఏర్పడి, మహా సంగ్రామంలో పాల్గొనేలా చేసింది. ఆరంభం.. 1937 జూలైలో చైనా ప్రధాన భూభాగంపై జపాన్ పెద్దఎత్తున దాడి చేసింది. షాంఘై, గువాంగ్ ర నగరాలపై బాంబులు కురిపించి.. నాంకింగ్‌లో నరమేధం జరిపి వేలాదిమందిని పొట్టనపెట్టుకుంది. ఇదేసమయంలో జర్మనీ, ఇటలీ రెచ్చగొట్టే విదేశాంగ విధానాలు అవలంబించాయి. మరోవైపు బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనిస్టు పాలిత సోవియెట్ యూనియన్ను తమ శత్రువుగా భావించి జర్మనీతో శాంతిఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో ఫ్రాన్స్ కూడా పాలుపంచుకుంది. దీని ప్రకారం సోవియెట్ దిశగా జర్మనీ విస్తరణను బ్రిటన్, ఫ్రాన్స్‌లు చూసీచూడనట్టుగా వ్యవహరిస్తాయి. దీంతో సోవియెట్‌ను నియంత్రణలో ఉంచొచ్చని బ్రిటన్ భావించింది. అయితే 1939లో బ్రిటిష్ వారిని ఆశ్చర్యపరుస్తూ సోవియెట్, జర్మనీలు ఏకమై పోలండ్‌ను ఆక్రమించుకున్నాయి. దీంతో యూరప్‌లో మహా సంగ్రామానికి తెరలేచింది. జర్మనీపై యుద్ధం.. శాంతి చర్చలకు జర్మనీ నియంత హిట్లర్ దిగిరాకపోవడంతో బ్రిటన్, ఫ్రాన్స్‌లు ఆగ్రహించాయి. వెంటనే యుద్ధ ప్రకటన జారీ చేశాయి. జర్మనీ మాత్రం ఆక్రమణల పర్వం కొనసాగిస్తూ వచ్చింది. 1940లో డెన్మార్క్, నార్వేలను ఆక్రమించుకుంది. అదే ఏడాది వేసవిలో బెల్జియం, నెదర్లాండ్స్, లక్జెంబర్గ్లతో పాటు ఫ్రాన్స్‌లో కొద్ది భాగాన్ని కూడా అధీనంలోకి తెచ్చుకుంది. ఇదే సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్‌లపై ఇటలీ యుద్ధం ప్రకటించింది. దీంతో బ్రిటన్ మీద తొలిసారిగా దాడులు మొదలయ్యాయి. కూటముల ఏర్పాటు.. 1941లో సోవియెట్ యూనియన్‌పై జర్మనీ దాడి చేయడంతో మిత్రరాజ్యాల కూటమిలో సోవియెట్ చేరింది. మొదట్లో జర్మన్లు విజయం సాధించారు. అయితే క్రమేణా ఆ ఏడాది శీతాకాఠిలం నాటికి జర్మన్ల విజయానికి అడ్డుకట్ట పడింది. మరోవైపు ఆసియాలో జపాన్ ఆక్రమణలు మరింత పెరిగాయి. చైనా భూభాగాలతో పాటు ఇండో-చైనా భాగాన్నీ జపాన్ ఆక్రమించింది. దీంతో అమెరికా, బ్రిటన్, నెదర్లాండ్స్‌లు ఆ దేశంపై ఆంక్షలు విధించాయి. ఇది జపాన్‌కు ఎక్కడలేని కోపం తెప్పించింది. అమెరికాకు చెందిన పెర్ల్హార్బర్పై దాడి చేశాయి జపాన్ దళాలు. దీంతోపాటు బ్రిటన్ అధీనంలోని ఆగ్నేయాసియా భూభాగాల మీదా జపాన్ మెరుపుదాడి చేసింది. దీంతో అమెరికా యుద్ధరంగంలోకి దిగాల్సి వచ్చింది. ప్రపంచ యుద్ధంగా.. అమెరికా మిత్రరాజ్యాలతో చేతులు కలపడంతో ఇది ప్రపంచ యుద్ధంగా మారింది. ఆఫ్రికా, ఆసియా, యూరప్‌లతో సహా అమెరికా ఖండానికీ యుద్ధం పాకినట్టయింది. జర్మనీ, జపాన్, ఇటలీ కూటమిగా ఉన్న అక్షరాజ్యాలు తొలుత విజయాలు సాధించినప్పటికీ, 1942 నుంచి వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి. పసిఫిక్ మహా సముద్రంలో అమెరికన్ సేనలు జపాన్ నౌకలను ముంచివేశాయి. మరోవైపు జర్మనీ సేనలను మిత్రరాజ్యాల సైనికులు ఆఫ్రికా ఎడారి యుద్ధం నుంచి తరిమికొట్టారు. మరుసటి ఏడాది స్టాలిన్ గ్రాడ్ వద్ద సోవియెట్ సైనికుల చేతిలో జర్మనీ భారీ పరాజయం చవిచూసింది. 1944లో యుద్ధం పూర్తిగా మిత్రరాజ్యాల వైపునకు మళ్లింది. సోవియెట్ సేనలు పోలండ్, రుమేనియాలను.. అమెరికా-బ్రిటన్-ఫ్రాన్స్ కూటమి బెల్జియం, నెదర్లాండ్స్, లక్జెంబర్గ్లకు అక్షరాజ్యాల చెర నుంచి విముక్తి కలిగించాయి. తూర్పు నుంచి సోవియెట్ సైనికులు, పశ్చిమం నుంచి మిత్ర రాజ్యాలు ముట్టడించడంతో జర్మనీకి ఊపిరాడలేదు. 1945లో జర్మనీ రాజధాని బెర్లిన్ను సోవియెట్ సేనలు వశపరచుకోవడంతో హిట్లర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే జపాన్ మాత్రం తన దూకుడు కొనసాగించింది. చివరకు ఆ దేశ ప్రధాన నగరాలైన హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబులు ప్రయోగించడంతో జపాన్‌కు ఓటమిని అంగీకరించక తప్పలేదు. మిత్రకూటమిలోకి ఇటలీ.. జర్మనీ బలహీనపడటంతో మిత్రరాజ్య సేనలు ఇటలీ వైపు దృష్టి మల్లించాయి. ఉత్తర దిశగా కదులుతూ సిసిలీని వశపరుచుకుని ఇటలీలో అడుగుపెట్టాయి. దీంతో కొద్దిరోజుల్లోనే ఆ దేశం మిత్రరాజ్యాల చేతికి చిక్కింది. విధిలేని పరిస్థితిలో 1943 సెప్టెంబర్ 8న ఇటలీ మిత్రరాజ్యాలతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకుంది. మరోవైపు అమెరికా సేనలు జపాన్ అధీనంలోని దీవులను వశపరచుకున్నాయి. -
వీరనారిగా
విభిన్న పాత్రలు పోషించాలని తపించే ప్రియాంకా చోప్రా... త్వరలో మరో కొత్త పాత్ర చేయనున్నారట. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో కూడిన కథాంశంతో రూపొందే ఓ లేడీ ఓరియంటెడ్ చిత్రంలో ప్రియాంక ప్రధాన భూమిక పోషించనున్నారని సమాచారం. వివరాల్లోకెళ్తే- ‘మేరీకోమ్’ దర్శకుడు ఒమాంగ్ కుమార్ రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఇది లేడీ ఓరియంటెడ్ కథాంశం కావడంతో, ‘మేరీకోమ్’లో అద్భుత నటన కనబరిచిన ప్రియాంకతోనే ఈ సినిమా కూడా చేయాలని ఆయన ఫిక్స్ అయ్యాడట. ప్రియాంకతో ఈ విషయం చెప్పగానే, ఆమె కూడా సానుకూలంగా స్పందించారని వినికిడి. ఇది చారిత్రక నేపథ్యంతో కూడిన కథాంశం కావడం వల్ల ప్రీ ప్రొడక్షన్‌కే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. అందుకే... వచ్చే ఏడాది అక్టోబర్‌లో ఈ చిత్రాన్ని సెట్స్‌కి తీసుకెళ్లడానికి ఒమాంగ్ కుమార్ సన్నాహాలు చేసుకుంటున్నారు. ఈ సినిమాలో ప్రియాంక పాత్ర అత్యంత శక్తిమంతంగా వీరనారి తరహాలో ఉంటుందని సమాచారం. -
‘ప్రచ్ఛన్నయుద్ధం’ నీడలో ఆఫ్రికా
ఆఫ్రికా ఖండంలో ఆమెరికా, చైనాల మధ్య సాగుతున్న సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధం అంతగా వెలుగులోకి రావడం లేదు. వాణిజ్యం, దీర్ఘకాలిక పెట్టుబడుల బాటలో చైనా, అమెరికా మిత్ర దేశాలపై ప్రాబల్యాన్ని సాధిస్తోంది. అమెరికా తన పాత సైనిక వ్యూహాలతో, వాటి ఫలితమైన ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’లో మరింతగా కూరుకుపోతోంది. ప్రపంచ యుద్ధాలకు కాలం చెల్లిపోయింది. 20వ శతాబ్దపు అనాగరిక ప్రపంచంలో ప్రపంచ శక్తులు తె లిసీతెలియక ఆడిన ఆటలవి. ఇది అత్యధునాతనమైన 21వ శతాబ్దం. యుద్ధం నాగరికతగా, ప్రపంచమే యుద్ధంగా, యుద్ధమే శాంతిగా మారిపోయాక యుద్ధ ప్రమాదం గురించి మాట్లాడటం అనుచితం, అసందర్భం. అఫ్ఘానిస్థాన్‌లోనో, ఇరాక్‌లోనో, సిరియాలోనో, ఉక్రెయిన్లోనో యుద్ధమో లేక అంతర్యుద్ధమో, కాదంటే ముసుగు యుద్ధమో జరుగుతోం దంటే... బ్రేక్ ఫాస్ట్‌కీ, కాఫీ కప్పుకీ మధ్య ఓ లుక్కు వేస్తే వేస్తామేమో. ఎవడి చావు ఎవడికి కావాలి? ఎవరికీ అక్కర్లేని చావులకు ఆఫ్రికా ఖండం ఎప్పటి నుంచో ప్రసిద్ధి. ప్రపంచంలోనే అతి పిన్న దేశం దక్షిణ సూడాన్ ‘చావు’ బ్రేకింగ్ న్యూస్‌గా కాదుగదా స్క్రోలింగ్‌గా కూడా కంట పడటం లేదు. అలాం టి దేశానికి సమాచార మంత్రి మైఖేల్ మకుయీ లూత్ ఈ నెల 5 నుంచి జరుగుతున్న ఆఫ్రికా-అమెరికా శిఖరాగ్ర సదస్సుకు హాజరై ఏం చెబితే ఎవరికి కావాలి? ‘‘సరికొత్త ప్రచ్ఛన్న యుద్ధంలో మా దేశం మొట్ట మొదటి రణ రంగంగా మారుతోంది. మా దేశాన్ని నిలుపునా విచ్ఛిన్నం చేస్తున్న అంతర్యుద్ధం నిజానికి ప్రపంచ అగ్ర శక్తులు తమ బంట్లతో సాగిస్తున్న ప్రాక్సీ యుద్ధం.’’ లూత్ ప్రస్తావించినది. ఆఫ్రికాలోని అమెరికా-చైనా ప్రచ్ఛన్న యుద్ధం గురించి. ‘మంత్రసాని’ కడుపు మంట దక్షిణ సూడాన్‌కు పురుడు పోసి, అస్తిత్వంలోకి తెచ్చిన మంత్రసాని అమెరికా. వందల కోట్ల డాలర్లు ధారపోసి తిరుగుబాటు దళాలను పోషించి ‘పురిటి ఖర్చును’ భరించినది అదే. ఆఫ్రికాలో మూడో అతి పెద్ద చమురు నిక్షేపాలున్న దేశం తన గనులను అప్పగించేస్తే సరిపుచ్చుకోవాలని భావించింది. అందుకు అనుమతించే ‘సొంత’ ప్రభుత్వం ఉండాలని కోరుకుంది. ఆ ఆశతోనే ఇంత చేసింది. అమెరికాయే పెంచి పోషించిన బిన్ లాడెన్‌కు సూడాన్ అధ్యక్షుడు ఒమర్ అల్ బషీర్ కాసిన్ని రోజులు ఆశ్రయమిచ్చాడు. ఆ నెపంతో అమెరికా ఉగ్రవాద వ్యతిరేక స్పెషల్ ఆపరేషన్స్‌తో, దక్షిణ, ఉత్తర సూడాన్ల మధ్య చిచ్చును దావానలంగా మార్చి సూడాన్‌ను రెండు ముక్కలు చేసింది. నోట్లోని మాంసం ముక్కను డ్రాగన్ తన్నుకు పోతే ఊరుకుంటుందా? 1996 నుంచి ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులను, చౌకగా సరుకులను గుమ్మరించడం ప్రారంభించిన చైనాను అమెరికా తక్కుగా అంచనా వేసింది. ఏదో ముడిపదార్ధాలు, ఖనిజాలకు కక్కుర్తిపడే చౌక వస్తు తయారీ బాపతేనని భావించింది. కానీ చాపకింది నీరులా అది సర్వాంతర్యామిగా విస్తరిస్తుందని ఊహించలేదు. చైనా ఇప్పుడు దక్షిణ సూడాన్ కు ప్రధాన వ్యాపార భాగస్వామి. అమెరికాను వెనక్కు నెట్టేసి ఆఫ్రికా ఖండానికే ప్రధాన భాగస్వామిగా మారిపోయింది. అధ్యక్షుడు సల్వా కీర్ ప్రభుత్వంతో చైనాకు సన్నిహిత సంబంధాలున్నాయి. ఆయనొక్కరే ఏమిటి ఆఫ్రికాలోని ప్రభుత్వాధినేతలందరికీ చైనా అంటే ఎనలేని ప్రేమ. అమెరికాలాగా అది అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు. అప్పటికి ఏ ప్రభుత్వం ఉంటే అదే దాని ప్రభుత్వం! రాజకీయాలకు అతీతమైన నికార్సయిన ఆర్థిక, వ్యాపార బంధాల దారి. 2000లో ఆఫ్రికాతో 1,000 కోట్ల డాలర్లున్న చైనా వాణిజ్యం నేడు అమెరికాకు రెండు రెట్లకు అంటే 20,000 కోట్ల డాలర్లకు చేరిందంటే ఊరికే కాదు. సహజంగానే దక్షిణ సూడాన్ చమురు నిక్షేపాలపైనా చైనా పట్టు బిగుస్తోంది. ఇదంతా చూస్తూ సహించేదెలా? సల్వా కీర్‌ను కూలదోయడం కోసం తెగల తిరుగుబాటుదార్లకు ఆయుధాలిచ్చి అమెరికా చిచ్చు రేపింది. గత రెండేళ్లలో పది వేల మంది బలైనా, లెక్కలేనంత మంది అత్యాచారాలకు గురైనా, 15 లక్షల మంది నిర్వాసితులైనా దానికి పట్టదు. ప్రధాన చమురు సంస్థల్లో 40 నుంచి 70 శాతం వాటాలను చేజిక్కించుకున్న చైనా సంస్థలు తాజాగా కీర్ ప్రభుత్వానికి 100 కోట్ల డాలర్ల రుణాన్ని అందజేశాయి. ‘అర్ధరహితమైన ఈ యుద్ధం కోసం మేం మా పిల్లల భవిష్యత్తును తాకట్టు పెట్టేస్తున్నాం’ అని స్థానిక పరిశోధకుడొకరు వాపోయారు. అంతా చైనీయం ఇథియోపియా నేడు ‘చైనా ఇథియోపియా’! ప్రపంచ వస్తు తయారీ సూపర్ పవర్ చైనా ఇటీవలి కాలంలో ఆ దేశాన్ని అతి పెద్ద వస్తు తయారీ కేంద్రంగా మార్చేస్తోంది. గత ఏడాదిలోనే ఆ దేశానికి చైనా ప్రత్యక్ష పెట్టుబడులు 3.4 రెట్లు పెరిగి దాదాపు 100 కోట్ల డాలర్లకు చేరాయి. అవి మన దేశంలోకి ప్రవేశిస్తున్న స్వల్పకాలిక పెట్టుబడులు కావు. నేరుగా పారిశ్రామిక రంగంలోకి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలోకి దీర్ఘకాలిక పెట్టుబడులుగా చేరేవి. ఫలితంగా రెండేళ్లలో చైనా తూర్పు ఆఫ్రికా దేశాల్లో 8 కోట్ల ఉద్యోగాలను సృష్టించబోతోంది. ఇథియోపియా, కెన్యా, లెసాతో, రువాండా, సెనెగల్, టాంజానియా తదితర దేశాల్లో చైనా వస్తు తయారీ వివ్లవాన్ని సృష్టించబోతోందని ప్రపంచ బ్యాంకు మాజీ ప్రధాన ఆర్థికశాస్త్రవేత్త జస్టిన్ లిన్ యీఫూ తెలిపారు. ‘ఇథియోపియా సరిగ్గా 30 ఏళ్ల క్రితంనాటి చైనా లాగా ఉంది. సగటు వేతనాలు నెలకు 40 డాలర్లు (రూ. 2,600). ఇప్పటికే ఆఫ్రికాను చౌక వస్తువులతో ముంచెత్తుతున్న చైనా లోటెక్ వస్తు తయారీతో ఆఫ్రికానే చైనాగా మార్చేయబోతోంది’ అని జాన్ హాప్కిన్స్ యూనివర్సిటీ ప్రొఫెసర్ దిబోరా బ్రాటిగామ్ అన్నారు. రాబోయే ఐదేళ్లలో కూడా చైనా వ్యాపార ఆధిపత్యానికి తిరుగులేదని అంచ నా. కాదనలేని విధంగా చైనా ఇటీవలే వివిధ దేశాలతో 40,000 కోట్ల డాలర్ల విలువైన నిర్మాణ ఒప్పందాలను కుదుర్చుకుంది. ఇప్పటికే ఆఫ్రికాలో అది 2,200 మైళ్ల రైలు రోడ్లు, 1,400 మైళ్ల రోడ్ల నిర్మాణం పూర్తి చేసింది. ‘ఉగ్రవాద వ్యతిరేక యుద్ధం’ ఊబిలో అమెరికా చైనా ఆఫ్రికాను గొప్ప అవకాశాల గనిగా చూసి పాతుకుపోతుంటే అమెరికా తన సైనిక దృక్పథంతో పీక లోతు వరకు ఉగ్రవాద వ్యతిరేక యుద్ధాల్లో కూరుకుపోయింది. కల్నల్ గఢాఫీని హతమార్చి, లిబియాను బుగ్గిచేసి ‘ప్రజాస్వా మ్యాన్ని’ స్థాపించింది. ఆ ప్రజాస్వామ్యం భగ్గున దేశాన్ని మండించేస్తోంది. ఆ ధాటికి తట్టుకోలేక రాజధాని ట్రిపోలీలో నుంచి సైతం అమెరికా దౌత్య సిబ్బంది పలాయన మంత్రం పఠించాల్సి వచ్చింది. ఆఫ్రికా నుండి చేసుకునే చమురు దిగుమతుల్లో 70 శాతం కోసం లిబియాపై ఆధారపడిన చైనాకు ‘లిబియా విప్లవం’ వల్ల 2,000 కోట్ల నష్టం వాటిల్లింది. గడాఫీ కూలదోసివేతకు కారణాల్లో ఒకటి... చైనా ప్రాబల్యానికి అడ్డు కట్టవేయడం. లిబియాపై దాడికి అమెరికా దాని మిత్ర దేశాలు చాలా మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోంది. గడాఫీ వ్యతిరేక యుద్ధం కోసం వారు అన్ని తెగలకు అత్యాధునిక ఆయుధాలను సమకూర్చారు. కేంద్ర అధికారం కూలిపోయాక ఆ తెగలన్నీ ‘ప్రజాస్వామ్యాన్ని’ ధిక్కరిస్తున్నాయి. లిబియా యుద్ధంలో కీలక పాత్ర వహించిన ట్యు రెగ్ తెగలు అత్యాధునిక ఆయుధాలతో మాలీ, చాద్, నైజీరియా, బుర్కినా పోసో, ఘనా, గినియా, అల్జీరియాల్లో కూడా అస్థిరత్వాన్ని సృష్టిస్తున్నాయి. మాలీలో అమెరికా సహాయంతో సైనిక జోక్యానికి దిగిన ఫ్రాన్స్ అక్కడి నుండి బయటపడే పరిస్థితి లేదు. సోమాలియాలో 2006లో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పరచిన ఇస్లామిక్ కోర్ట్ యూనియన్ (ఐసీయూ) ప్రభుత్వాన్ని కూలదోయడానికి అమెరికా 2007లో కూల్చింది. అందుకోసం ఇథియోపియా, కెన్యాలను సోమాలియాపై యుద్ధానికి దించింది. ఫలితంగా ఐసీయూ చీలిపోయి అల్ షబాబ్ అనే ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ప్రాబల్యాన్ని పెంపొందించుకుంది. అది ఇథియోపియా, కెన్యా, ఉగాండా తదితర దేశాల్లో ఉగ్రదాడులకు పాల్పడుతోంది. మేలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కాంగ్రెస్ కమిటీలో మాట్లాడుతూ, ఉగ్రవాద వ్యతిరేక యుద్ధంలో ఆఫ్రికా ప్రధాన రంగంగా ముందుకు వస్తోందంటూ 5,000 కోట్ల డాలర్ల నిధులను అందుకు కేటాయించారు. అఫ్ఘానిస్థాన్‌ను నుంచి ఉపసంహరించే సేనలను ఆఫ్రికాలో స్పెషల్ ఆపరేషన్స్‌కు నియమించబోతున్నారు. చైనా ప్రాబల్యాన్ని పరిమితం చేసే లక్ష్యం నుండి దాన్ని ఎదుర్కొనే లక్ష్యానికి మారినట్టుగా ఇటీవల ఒబామా ప్రకటించారు. కానీ చైనా దీర్ఘకాలిక వ్యూహంతో వాణిజ్య, పెట్టుబడుల బంధాలతో 54 దేశాల ఆఫ్రికా మద్దతును కూడగట్టడానికి యత్నిస్తోంది. ఐక్యరాజ్యసమితి వంటి వేదికల నుండి అమెరికాను సవాలు చేయడానికి సిద్ధమవుతోంది. లిబియాలో తిన్న ఎదురు దెబ్బకు చైనా మూల్యాన్ని వసూలు చేయక తప్పనట్టే కనిపిస్తోంది. పిళ్లా వెంకటేశ్వరరావు