ప్రపంచ యుద్ధాల సాక్షి ఇక లేరు | World's oldest man and Holocaust survivor dies at 113 | Sakshi
Sakshi News home page

ప్రపంచ యుద్ధాల సాక్షి ఇక లేరు

Published Sat, Aug 12 2017 6:31 PM | Last Updated on Mon, Sep 11 2017 11:55 PM

World's oldest man and Holocaust survivor dies at 113

ఇజ్రాయెల్‌:
ప్రపంచ కురువృద్ధుడు యెజ్రాయెల్ క్రిస్టల్(113) కన్నుమూశారు. యెజ్రాయెల్ 1903 సెప్టెంబర్ 15న జన్మించి ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా గత ఏడాది ప్రపంచ గిన్నిస్ బుక్‌లో చోటు సంపాదించారు. ఆయన పోలాండ్‌లో జన్మించారు. రెండు ప్రపంచ యుద్ధాలకు యెజ్రాయెల్‌ ప్రత్యక్ష సాక్షిగా నిలవడమే కాకుండా ఆ యుద్ధాలను చవి చూసి మరణం అంచుల వరకు పోయి మృత్యుంజయుడుగా నిలిచాడు.  ఈ క్రమంలోనే అతని మొదటి భార్య, కుటుంబ సభ్యులు నాజీల చేతిలో హత్యకు గురయ్యారు.

రెండో ప్రపంచ యుద్ధం అనంతరం యెజ్రాయిల్‌ మళ్లీ వివాహం చేసుకుని ఇజ్రాయిల్‌కు వలస వచ్చారు. ఇజ్రాయెల్‌లోని హైఫా నగరంలోని తన ఇంట్లో (113 ఏళ్ల 330 రోజులు జీవించి) మృతిచెందారు. అతని మృతిపట్ల ప్రపంచవ్యాప్తంగా నివాళులు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement