ప్రపంచ యుద్ధంపై చాట్‌ జీపీటీ హెచ్చరిక? | Chatgpt AI Predicted Third World War | Sakshi
Sakshi News home page

Third World War: ప్రపంచ యుద్ధంపై చాట్‌ జీపీటీ హెచ్చరిక?

Published Sat, Jan 27 2024 1:44 PM | Last Updated on Sat, Jan 27 2024 2:48 PM

Chatgpt AI Predicted Third World War - Sakshi

రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల తరువాత మూడవ ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం ఉందని ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన ‍వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తన చాట్‌ జీపీటీలో మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అంచనాలను వెల్లడించింది. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ఆరు దేశాలు ఇవేనంటూ తన భవిష్యవాణి వెల్లడించింది. 

కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ పాట్రిక్ సాండర్స్, నాటో జనరల్‌లు పౌరులను యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పౌరులు ఆయుధాలు చేతబట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్  కోరారు. ప్రతి దేశం ‘పౌర సైన్యం’ మాదిరిగా శిక్షణ పొందాలని, యుద్ధం అంటూ ప్రారంభమైతే, రిజర్వ్ దళాల సామర్థ్యం సరిపోదని వారు పేర్కొన్నారు. ఈ ప్రకటనలతో యావత్‌ ప్రపంచం నివ్వెరపోయింది. 

ఈ నేపధ్యంలో అమెరికా, నాటో దేశాలు మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయని పలు దేశాలు భావిస్తున్నాయి. ఇదిలావుండగా తాజాగా మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల గురించి తెలియజేయాలని చాట్‌ జీటీపీని అడగగా, అది ఆరు హాట్‌స్పాట్‌లను వెల్లడించింది. ‘డైలీ స్టార్’ నివేదిక ప్రకారం, ఈ ఆరు ప్రదేశాలు ప్రపంచ యుద్ధం తలెత్తే ఘర్షణ పాయింట్లు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

కొరియా ద్వీపకల్పం: 
ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఈ వివాదంలో అమెరికా ప్రమేయంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఉత్తర కొరియా తరచూ నూతన క్షిపణులను పరీక్షిస్తోంది. ఉత్తర కొరియాకు చైనా తదితర దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. అందుకే ఇక్కడ నుండి ఎప్పుడైనా మూడవ ప్రపంచ యుద్ధం మొదలు కానుంది.

మిడిల్ ఈస్ట్: 
కొన్ని దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం ఇంకా ఒక గట్టున పడలేదు. ఇంతలో ఇరాన్‌తో పాటు పొరుగు దేశాల ప్రమేయం ఈ దేశాల ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇది ఎప్పుడైనా ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు.

తైవాన్ జలసంధి: 
చైనా, తైవాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తత మరిన్ని మలుపులు తిరుగుతోంది. దీనిపై అమెరికా దృష్టి సారించడంతో పరిస్థితిని మరింత దిగజారుతోంది. ఆసియా-పసిఫిక్‌కు చెందిన ఈ ప్రాంతంలో ఏ సమయంలోనైనా మూడో ప్రపంచ యుద్ధం తలెత్తవచ్చు. 

తూర్పు ఐరోపా: 
ఈ జాబితాలో తూర్పు ఐరోపా ప్రాంతాలు నాల్గవ స్థానంలో ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, నాటోకు సంబంధించిన ఘర్షణల కారణంగా తూర్పు ఐరోపాలో ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది. ఇది ఎప్పుడైనా తీవ్ర ఘర్షణలకు దారితీయవచ్చు. 

దక్షిణ చైనా సముద్రం: 
దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా, దాని పొరుగు దేశాల మధ్య నిరంతర వివాదాలు నడుస్తున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు దీనికి  ఆజ్యం పోస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అటువంటి పరిస్థితిలో ఇక్కడి ఉద్రిక్తతలు ఎప్పుడైనా తీవ్రస్థాయికి చేరుకోవచ్చు.  మూడవ ప్రపంచ యుద్ధం ఇక్కడి నుంచే మొదలయ్యే అవకాశం ఉంది.

భారత్‌-పాక్‌ సరిహద్దు: 
భారత్‌-పాక్‌ మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. సరిహద్దుల్లో తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య రెండుసార్లు యుద్ధం జరిగింది. అయితే అది ఇతర దేశాలను ప్రభావితం చేయలేదు. గత నాలుగు సంవత్సరాలుగా సరిహద్దులో శాంతియుత వాతావరణ ఉంది. అయినప్పటికీ ఇక్కడ నుంచి కూడా ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయని చాట్‌ జీపీటీ అంచనా వేస్తోంది. ఈ రెండు దేశాలకు అణు సామర్థ్యం ఉందని కూడా చాట్‌ జీపీటీ గుర్తు చేస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement