GPT
-
వెరై‘టీ’.. చాయ్ జీపీ‘టీ’..
వారిరువురూ అన్నదమ్మలు.. ఒకరు చదువు కోసం..మరొకరు ఉపాధి కోసం నగరానికి వచ్చారు.. అందరిలా కాకుండా తమ కాళ్లపై తాము నిలబడాలనుకున్నారు.. అనుకున్నదే తడవుగా తమ వద్ద ఉన్న కొద్ది మొత్తంతో ఓ టీ దుకాణాన్ని పెట్టారు.. అదే చాయ్ జీపీటీ..అంతటితో ఆగకుండా.. తమ స్టాల్లో లభ్యమయ్యే ఫ్లేవర్‌తో టీ పౌడర్‌ను మార్కెట్లోకి విడుదల చేయాలనుకుంటున్నారు.. అసలీ ఆలోచన ఎలా వచ్చింది? దీని వెనుక కథేంటి? తులుసుకుందాం..!శ్రీనగర్‌కాలనీ: సరికొత్త ఆలోచనతో ఓ ఇద్దరు అన్నదమ్ములు నగరంలోని యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.. జిహ్వకో రుచి.. పుర్రెకో ఆలోచన అన్నట్లు.. వెరైటీగా ఆలోచించారు. అందరిలా ఉద్యోగాలు కాకుండా.. వ్యాపారంలో రాణించాలని భావించారు.. తమ వ్యాపారాన్ని విస్తరించడానికి మార్కెట్లో ఓ కొత్త టీ ప్రొడక్ట్‌ను లాంచ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే తెలుగు టీ రుచులను వినియోగదారులకు పరిచయం చేస్తామని ధీమాగా చెబుతున్నారు. టెక్నాలజీ రంగంలో దూసుకుపోతున్న చాట్ జీపీటీ నేడు ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది. ప్రస్తుతం జనాల బుర్రల్లో తిరుగుతున్న పేరునే తమ కంపెనీ పేరుగా మలుచుకున్నారు.. ఓ టెక్నాలజీ పేరైన చాట్ జీపీటీని తలపిస్తూ చాయ్ జీపీటీతో ఓ చాయ్ దుకాణాన్ని నగరంలోని మధురానగర్‌లో గత సంవత్సరం ప్రారంభించారు ఈ ఇద్దరు అన్నదమ్ములు రోహిత్, కిరణ్ దుమ్ము. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఈ ఇద్దరూ చదువు నిమిత్తం నగరానికి వచ్చారు. రోహిత్ విప్రో కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. కిరణ్ డిగ్రీ చదువుతున్నాడు. ఉద్యోగాలు కాకుండా తమ సొంత కాళ్ళపై నిలబడాలన్న తపనలో చాయ్ జీపీటీ పేరిట చాయ్ స్టోర్‌ని ప్రారంభించారు. చాయ్‌లో ఏఐని తీసుకొని ఏఐ(అడ్రక్–ఇలాచి), జీపీటీని( జెన్యూన్లీ ప్యూర్ టీ)గా మలిచారీ అన్నదమ్ములు. ఆయుర్వేద మూలికలతో.. తెలుగు టీలలో ఎక్కువగా ఇలాచి, అడ్రక్లను ఆయుర్వేద మూలికగా ఆరోగ్యానికి ఉపయోగిస్తారు. మనం రోజువారీ విధానంతో పాటు చలికాలంలో ఎక్కువగా అల్లం, యాలుకల టీని తీసుకుంటాం. నిజానికి వీటిలో చాలా ఔషధగుణాలున్నాయి. వీటిని టీలో తీసుకుంటే ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా, ఉత్సాహంగా అనిపిస్తుంది. అందుకే టీలలో వీటికి అధిక ప్రాధాన్యతను ఇస్తూ మన తెలుగుదనాన్ని ఉట్టిపడేలా టీని తయారుచేస్తున్నాం. మార్కెట్లో ఉండే వాటికంటే భిన్నంగా మా టీ ఉత్పత్తి ఉండేలా సన్నాహాలు చేస్తున్నాం. మన రుచిని మిస్ అవ్వకుండా టీ పౌడర్‌లో కలపి చాయ్ జీపీటీ ప్రాడెక్ట్ చిన్న ప్యాకెట్లతో పాటు పెద్ద ప్యాకెట్లలో మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. త్వరలో అన్ని పర్మిషన్స్ తీసుకొని వినియోగదారుల ముందుకొస్తామని, అయితే తమకు ఇన్వెస్టర్స్ తోడైతే మరింత తోడ్పాటు అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చదువు, ఉద్యోగం కోసం ఓ మారుమూల ప్రాంతం నుంచి నగరానికి వచి్చ.. సరికొత్త ఆలోచనతో చాయ్ జీపీటీ ప్రాడక్ట్‌ను మార్కెట్లో తీసుకురావాలన్న ఆలోచన చేసిన ఈ ఇద్దరి అన్నదమ్ముల కృషి యువతకు ఆదర్శనంగా నిలుస్తుంది. తెలుగురుచికి తగ్గట్టుగా.. నేను డిగ్రీ చదువుతున్నాను. అన్నయ్య రోహిత్ బాటలో నడవాలన్నది నా ఆకాంక్ష. ఇప్పుడిప్పుడే స్టోర్ బాగా నడుస్తోంది. అల్లం, యాలుకలు మన ఆయుర్వేద ఔషధ మూలికలకు మన దైనందిన జీవితంలో ప్రత్యేకస్థానం ఉంది. వీటిని చాయ్ జీపీటీలో కలిపి మన తెలుగురుచికి తగ్గట్టుగా అసలు సిసలైన టీని అందించాలన్నది మా లక్ష్యం. అన్నయ్యతో కలిసి సాధిస్తాం. – కిరణ్, డిగ్రీ విద్యార్థి, చాయ్ జీపీటీ నిర్వాహకుడు మరింత మందికి ఉపాధి..ఉపాధిలో మనకున్న ప్రతిభతో అక్కడ రాణిస్తాం. కానీ వ్యాపారంలో మన ఆలోచనలు, సృజనాత్మకతను జోడించి మరికొంతమందికి ఉపాధిని అందిస్తాం. అందుకే ఉద్యోగం కన్నా వ్యాపారమే చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉంది. మా దగ్గర ఉన్న పెట్టుబడితో టీ స్టోర్‌ని ఏర్పాటుచేశాం. కానీ మా లక్ష్యం మన తెలుగుదనం ఉట్టిపడేలా చాయ్ జీపీటీ టీ పౌడర్ బ్రాండ్‌ని మార్కెట్లోకి తీసుకొచ్చి మన సత్తాచాటడమే. దానికి అనుగుణంగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. – రోహిత్, సాఫ్ట్వేర్ ఉద్యోగి. చాయ్ జీపీటీ నిర్వాహకుడు -
ప్రపంచ యుద్ధంపై చాట్ జీపీటీ హెచ్చరిక?
రష్యా-ఉక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల తరువాత మూడవ ప్రపంచ యుద్ధం సంభవించే అవకాశం ఉందని ప్రపంచంలోని పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపధ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తన చాట్ జీపీటీలో మూడవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన అంచనాలను వెల్లడించింది. మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభమయ్యే ఆరు దేశాలు ఇవేనంటూ తన భవిష్యవాణి వెల్లడించింది. కొద్ది రోజుల క్రితం బ్రిటిష్ ఆర్మీ చీఫ్ ఆఫ్ జనరల్ స్టాఫ్ పాట్రిక్ సాండర్స్, నాటో జనరల్‌లు పౌరులను యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పౌరులు ఆయుధాలు చేతబట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆర్మీ చీఫ్ కోరారు. ప్రతి దేశం ‘పౌర సైన్యం’ మాదిరిగా శిక్షణ పొందాలని, యుద్ధం అంటూ ప్రారంభమైతే, రిజర్వ్ దళాల సామర్థ్యం సరిపోదని వారు పేర్కొన్నారు. ఈ ప్రకటనలతో యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. ఈ నేపధ్యంలో అమెరికా, నాటో దేశాలు మూడో ప్రపంచ యుద్ధానికి సిద్ధమవుతున్నాయని పలు దేశాలు భావిస్తున్నాయి. ఇదిలావుండగా తాజాగా మూడవ ప్రపంచ యుద్ధం జరిగే అవకాశం ఉన్న ప్రదేశాల గురించి తెలియజేయాలని చాట్ జీటీపీని అడగగా, అది ఆరు హాట్స్పాట్లను వెల్లడించింది. ‘డైలీ స్టార్’ నివేదిక ప్రకారం, ఈ ఆరు ప్రదేశాలు ప్రపంచ యుద్ధం తలెత్తే ఘర్షణ పాయింట్లు. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొరియా ద్వీపకల్పం: ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరింది. ఈ వివాదంలో అమెరికా ప్రమేయంతో పరిస్థితి మరింత దిగజారుతోంది. ఉత్తర కొరియా తరచూ నూతన క్షిపణులను పరీక్షిస్తోంది. ఉత్తర కొరియాకు చైనా తదితర దేశాల నుంచి మద్దతు లభిస్తోంది. అందుకే ఇక్కడ నుండి ఎప్పుడైనా మూడవ ప్రపంచ యుద్ధం మొదలు కానుంది. మిడిల్ ఈస్ట్: కొన్ని దశాబ్దాలుగా మిడిల్ ఈస్ట్ ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య వివాదం ఇంకా ఒక గట్టున పడలేదు. ఇంతలో ఇరాన్‌తో పాటు పొరుగు దేశాల ప్రమేయం ఈ దేశాల ఉద్రిక్తతలను మరింతగా పెంచింది. సిరియాలో అంతర్యుద్ధం జరుగుతోంది. ఇది ఎప్పుడైనా ప్రపంచ యుద్ధానికి దారితీయవచ్చు. తైవాన్ జలసంధి: చైనా, తైవాన్ మధ్య చోటుచేసుకున్న ఉద్రిక్తత మరిన్ని మలుపులు తిరుగుతోంది. దీనిపై అమెరికా దృష్టి సారించడంతో పరిస్థితిని మరింత దిగజారుతోంది. ఆసియా-పసిఫిక్‌కు చెందిన ఈ ప్రాంతంలో ఏ సమయంలోనైనా మూడో ప్రపంచ యుద్ధం తలెత్తవచ్చు. తూర్పు ఐరోపా: ఈ జాబితాలో తూర్పు ఐరోపా ప్రాంతాలు నాల్గవ స్థానంలో ఉన్నాయి. రష్యా, ఉక్రెయిన్, నాటోకు సంబంధించిన ఘర్షణల కారణంగా తూర్పు ఐరోపాలో ఉద్రిక్తత అంతకంతకూ పెరుగుతోంది. ఇది ఎప్పుడైనా తీవ్ర ఘర్షణలకు దారితీయవచ్చు. దక్షిణ చైనా సముద్రం: దక్షిణ చైనా సముద్రానికి సంబంధించి చైనా, దాని పొరుగు దేశాల మధ్య నిరంతర వివాదాలు నడుస్తున్నాయి. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు దీనికి ఆజ్యం పోస్తున్నాయనే ఆరోపణలున్నాయి. అటువంటి పరిస్థితిలో ఇక్కడి ఉద్రిక్తతలు ఎప్పుడైనా తీవ్రస్థాయికి చేరుకోవచ్చు. మూడవ ప్రపంచ యుద్ధం ఇక్కడి నుంచే మొదలయ్యే అవకాశం ఉంది. భారత్-పాక్ సరిహద్దు: భారత్-పాక్ మధ్య దశాబ్దాలుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. సరిహద్దుల్లో తరచూ కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య రెండుసార్లు యుద్ధం జరిగింది. అయితే అది ఇతర దేశాలను ప్రభావితం చేయలేదు. గత నాలుగు సంవత్సరాలుగా సరిహద్దులో శాంతియుత వాతావరణ ఉంది. అయినప్పటికీ ఇక్కడ నుంచి కూడా ప్రపంచ యుద్ధం మొదలయ్యే అవకాశాలున్నాయని చాట్ జీపీటీ అంచనా వేస్తోంది. ఈ రెండు దేశాలకు అణు సామర్థ్యం ఉందని కూడా చాట్ జీపీటీ గుర్తు చేస్తోంది. -
చాట్‌జీపీటీలో వ్యక్తిగత సమాచారం ఇస్తున్నారా? ఇది తెలియాల్సిందే..
దేశానికి రక్షణ ఎంత అవసరమో, దేశంలోని పౌరులకు అన్ని విధాలా భద్రత కల్పించడమూ అంతే కీలకం. వ్యక్తిగత వివరాలను దొంగలించడం, బహిర్గతం చేయడం వంటివి ప్రజల భద్రతకు, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తాయి. దురదృష్టవశాత్తు దేశంలో అటువంటి ఘటనలు కొన్నేళ్లుగా అధికమవుతున్నాయి. పౌరులే కాదు, కట్టుదిట్టమైన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ సమాచార చౌర్యానికి బలవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో సగం జనాభా వివరాలు ఇప్పుడు అంగడి సరకుగా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 24 రాష్ట్రాలు, ఎనిమిది ముఖ్య నగరాలకు చెందిన దాదాపు 66.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ఫరీదాబాద్‌కు చెందిన ముఠా గతంలో అంతర్జాలంలో అమ్మకానికి పెట్టిన సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం చాలామంది చాట్‌జీపీటీ వాడుతున్నారు. అయితే తెలిసీ తెలియక కొందరు అందులో వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారు. చాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్‌లో ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వటానికి ఉపయోగపడుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు. ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ.. సైబర్ నేరస్థులు మన వ్యక్తిగత వివరాలను అంగట్లో బేరానికి పెట్టే ప్రమాదముంది. కాబట్టి చాట్‌జీపీటీకి సొంత విషయాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవటమే మంచిదని కంప్యూటర్ సైన్స్ నిపుణులు సూచిస్తున్నారు. మన చాట్స్లోని సమాచారాన్ని జీపీటీ వాడుకోకుండా సెటింగ్స్‌లోకి వెళ్లి, అన్ని చాట్స్‌కు సంబంధించిన వివరాలను నిత్యం డిలీట్ చేయాలని చెబుతున్నారు. -
‘ఎక్స్’లో కొత్త చాట్‌బాట్.. ప్రత్యేకతలివే..
ప్రపంచవ్యాప్తంగా జనరేటివ్ ఏఐపై ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు. దానికి అనువుగా కంపెనీలు అందులో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. దిగ్గజ కంపెనీల యాజమాన్యాలు భవిష్యత్తు జనరేటివ్ ఏఐదేనని బలంగా విశ్వసిస్తున్నాయి. అందులో భాగంగా గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి ప్రతిష్టాత్మక కంపెనీలు ఇప్పటికే ఆ దిశగా పయనిస్తున్నాయి. అయితే అందులో కొన్ని కంపెనీలు ఉచితంగా ఈ చాట్‌బాట్ సేవలు అందిస్తున్నాయి. కానీ కొన్నింటికి మాత్రం ప్రీమియం చెల్లించి వాటి సేవలు వినియోగించుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఎలన్ మస్క్ ఎక్స్‌లో ‘గ్రోక్ ఏఐ’అనే చాట్‌బాట్‌ను ప్రవేశపెట్టారు. అయితే ఈ చాట్‌బాట్ ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ ఏఐ చాట్‌బాట్‌ను కేవలం ఎక్స్ ప్రీమియం+ యూజర్లు మాత్రమే యాక్సెస్ చేసుకునే వెసులుబాటు ఉంది. ఎక్స్ హోమ్‌పేజ్ ఓపెన్ చేసి లాగిన్ అవగానే సైడ్ మెనూలో గ్రోక్ పేరిట న్యూ ట్యాబ్ కనిపిస్తుంది. అందులోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చని కంపెనీ తెలిపింది. గ్రోక్ఏఐ వినియోగించుకునేందుకు ప్రీమియం+ సబ్‌స్క్రైబ్ చేయాలనుకుంటే భారత్‌లో సబ్స్క్రిప్షన్ నెలకు రూ.1300 కాగా, వెబ్ వెర్షన్‌కు ఏడాదికి రూ.13,600గా ఉంది. చాట్‌జీపీటీ కంటే ఎక్స్ ప్రవేశపెట్టిన గ్రోక్ఏఐ చాట్‌బాట్ కొంత ఖరీదుగా ఉందని టెక్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గ్రోక్ ఏఐతో ప్రత్యేకతలివే.. Edit post Longer posts Undo post Post longer videos Top Articles Reader Background video playback Download videos Get paid to post Creator Subscriptions X Pro (web only) Media Studio (web only) Analytics (web only) Checkmark Encrypted direct messages ID verification SMS two-factor authentication App icons Bookmark folders Customize navigation Highlights tab Hide your likes Hide your checkmark Hide your subscriptions -
జియో భారత్ జీపీటీ రెడీ.. కీలక విషయాలు చెప్పిన ఆకాశ్ అంబానీ
ముంబై: దేశీయంగా ‘భారత్ జీపీటీ’ ప్రోగ్రామ్‌ను రూపొందించడంపై రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ కసరత్తు చేస్తోంది. ఇందుకోసం ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ–బాంబేతో (ఐఐటీ–బీ) జట్టు కట్టింది. ఐఐటీ–బీ వార్షిక టెక్‌ఫెస్ట్‌లో పాల్గొన్న సందర్భంగా కంపెనీ చైర్మన్ ఆకాశ్ అంబానీ ఈ విషయాలు తెలిపారు. టెలివిజన్ల కోసం ఆపరేటింగ్ సిస్టమ్‌ను కూడా ప్రవేశపెట్టే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం భారీ ల్యాంగ్వేజ్ మోడల్స్, జనరేటివ్ ఏఐ (కృత్రిమ మేథ) వంటి సాంకేతికతలను పైపైనే చూస్తున్నామని, వచ్చే దశాబ్దంలో ఇవి విస్తృతంగా వినియోగంలోకి వస్తాయని ఆకాశ్ చెప్పారు. ఉత్పత్తులు, సర్వీసులను ఏఐ సమూలంగా మార్చేయగలదని ఆయన వివరించారు. సోదరుడు అనంత్ అంబానీ వివాహం జరగనుండటంతో వచ్చే ఏడాది (2024) తమ కుటుంబానికి ప్రత్యేకంగా ఉండగలదని ఆకాశ్ పేర్కొన్నారు. -
Generative AI: చాట్ జీపీటీ-4కు ప్రత్యామ్నాయాలు ఇవిగో...
చాట్‌జీపీటీ.. ఆన్లైన్ సెర్చ్‌ను కొత్త పుంతలు తొక్కించిన తాజా సంచలనం. మెయిళ్లు రాయడం మొదలుకొని కథలల్లడం వరకూ ఎన్నో పనులను చిటికెలో చక్కబెట్టేయగలదీ కృత్రిమ మేధ ఆధారిత టెక్నాలజీ. అయితే జీపీటీ 4ను వాడటం పూర్తిగా ఉచితం కాదు. కొంతవరకూ ఫ్రీగా వాడుకోవచ్చు కానీ.. ఆ తరువాత మాత్రం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మరి సమాచారం ఉచితంగా పొందాలంటే? ప్రత్యామ్నాయ మార్గాలు బోలెడున్నాయి. బింగ్ ఏఐ గూగుల్‌కు బదులుగా ఏఐ ఆధారిత సెర్చింజన్ బింగ్‌నూ వాడుకోవచ్చు. మైక్రోసాఫ్ట్‌కు చెందిన దీనిలో ఏఐ ఆధారిత జీపీటీ-4 కూడా ఉంది. దీని వెబ్సైట్లోకి వెళ్లి బింగ్ చాట్‌తో బోలెడన్ని విషయాలు తెలుసుకోవచ్చు. యాప్ రూపంలోనూ దీని సేవలను పొందొచ్చు. కంటెంట్‌ను సృష్టించుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. బింగ్‌లోని రైటింగ్ అసిస్టెంట్ సాయంతో మెయిళ్లు రాసుకోవచ్చు. సెలవుల్లో ఎక్కడికైనా వెళ్లాలంటే ప్రయాణం సాఫీగా సాగటానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఉద్యోగం కోసం ఇంటర్వ్యూను ఎదుర్కోవటానికి సన్నద్ధం కావొచ్చు. ఇక ఇమేజ్ జనరేటర్ ద్వారా ప్రాంప్ట్‌ను అందించి ఉచితంగా బొమ్మలను గీయించుకోవచ్చు. దీనిలోని ట్రాన్స్‌లేటర్ బోలెడన్ని భాషలను ఇట్టే అనువదిస్తుంది. ఇక ఏఐ ఆధారిత కోపైలట్ క్రెడబులిటీ ఉన్న సమాచారాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఏఐ సహాయంతో మన ఉద్దేశాన్ని అర్థం చేసుకొని, కచ్చితమైన సమాచారాన్ని ముందుంచుతుంది. మన ప్రాధాన్యాలు, గతంలో జరిపిన చర్చలను దృష్టిలో పెట్టుకొని వాటికి తగ్గట్టుగా స్పందిస్తుంది. మెర్లిన్ ఇదో క్రోమ్ చాట్‌జీపీటీ ఎక్స్టెన్షన్. ఏ వెబ్సైట్ మీదైనా యాక్సెస్ చేయొచ్చు. మెర్లిన్‌ను ఇన్స్టాల్ చేసుకొని, ఖాతాను ఓపెన్ చేస్తే చాలు. కంట్రోల్/ కమాండ్ ప్రాంప్ట్ రూపంలో ఆదేశాలు ఇస్తూ మనకు కావాల్సిన సమాచారాన్ని పొందవచ్చు. చిటికెలో బ్లాగులు, యూట్యూబు వీడియోలు, వెబ్సైట్ల సారాంశాన్ని ముందుంచుతుంది. సోషల్ మీడియా కంటెంట్‌నూ సృష్టించుకోవచ్చు. ఈమెయిళ్లు, కోడ్స్ రాసి పెడుతుంది. దీనిలోని చాట్‌జీపీటీ ప్లగిన్లు ఉత్పాదకత పెంచటానికి ఎంతగానో తోడ్పడతాయి. మెర్లిన్‌లోని కృత్రిమ మేధ ఎంతటి సంక్లిష్టమైన ప్రశ్నలకైనా సైడ్‌బార్‌లో సమాధానాలిస్తుంది. పోయ్ ఇది కోరాకు చెందిన ఏఐ యాప్. ఆంత్రోపోనిక్ సంస్థ రూపొందించిన క్లౌడ్ దగ్గరి నుంచి ఓపెన్ఏఐకి చెందిన జీపీటీ వరకు రకరకాల ఏఐ మోడళ్లను వాడుకోవటానికి వీలు కల్పిస్తుంది. ప్రశ్నలను సంధించి జవాబులు రాబట్టుకోవచ్చు. అత్యంత అధునాతన ఏఐ టెక్నాలజీ దీని సొంతం. అంతరాయాలులేని సంభాషణ, సృజనాత్మక కంటెంట్‌ను దృష్టిలో పెట్టుకొని పోయ్‌ను రూపొందించారు. దీని ఇంటర్ఫేస్ యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఏదైనా బాట్ లేదా ప్రాంప్ట్‌తో తేలికగా వాడుకోవచ్చు. ఇదీ చదవండి: ‘కనీసం రూ.100 చెల్లించలేకపోతున్నాం’.. మాకు వారితోనే పోటీ: సీఈఓ -
ఉత్పాదకతకు ఊపు
కంచర్ల యాదగిరిరెడ్డి : అదండీ విషయం...ఈ రోజుల్లో మీకు ఏం కావాలన్నా క్షణంలో సమాచారంతో పాటు మీకు కావాల్సింది ఇచ్చే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లు పుట్టుకొచ్చేశాయి. ఏడాది క్రితం చాట్ జీపీటీ విడుదలతో మొదలైన కృత్రిమ మేధ (ఏఐ) అప్లికేషన్లు ఇప్పుడు ఓ ప్రభంజనంలా మారిపోయాయి. జనరేటివ్ ఏఐ సాఫ్ట్వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరుగుతుందని, అమ్మకాలు ఎక్కువవుతాయని, సాధారణ వినియోగదారులకూ లాభమని అంటున్నారు. బాగానే ఉంది కానీ, ఇది ఎంతవరకూ నిజం? వాటికంటూ విలువ కట్టగలమా? అవును అంటోంది .అంతర్జాతీయ కన్సల్టెన్సీ సంస్థ మెకిన్సే! భవిష్యత్తులో జనరేటివ్ ఏఐ కారణంగా ప్రపంచ వాణిజ్యానికి ఏటా కనీసం 2.6 లక్షల కోట్ల నుంచి 4.4 లక్షల కోట్ల డాలర్ల వరకూ లబ్ధి చేకూరనుందని తెలిపింది. చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా.. జనరేటివ్ ఏఐ మొదలై ఏడాది కూడా కాలేదు. మరి ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాల్లో ప్రభావం ఎలా చూపగలదన్న ప్రశ్న ఉత్పన్నం కావడం సహజం. మెకిన్సే అంచనా ప్రకారం ఇవి పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చేందుకు ఇంకా కొంత సమయం పట్టవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ఇప్పటినుంచే వేగం పుంజుకుంటుందని 2030– 2060 మధ్యకాలంలో చాలావరకు పనులు ఆటోమేటిక్‌గా అయిపోతాయని చెబుతోంది. ఇప్పుడు చేస్తున్న పనుల్లో సగం 2030 నాటికల్లా ఆటోమేటిక్ అవుతాయని తెలిపింది. మునుపటి అంచనాల కంటే ఇది పదేళ్లు తక్కువ కావడం గమనార్హం. కార్మికుల ఉత్పాదకత విషయానికి వస్తే 2040 నాటికి ఇది ఏటా 0.1 –0.6 శాతం పెరుగుతుందని కాకపోతే చేసే పనులు మారిపోతాయి కాబట్టి ఆ మార్పునకు అనుగుణంగా కారి్మకులు కొత్త నైపుణ్యాలను అందిపుచ్చుకునేందుకు సాయం అందించాల్సి ఉంటుందని మెకిన్సే తెలిపింది. ఒకవేళ అన్ని రంగాల్లోనూ జనరేటివ్ ఏఐ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తే మాత్రం పనుల ఆటోమేషన్ వల్ల ఉత్పాదకత 0.2 –3.3 శాతం వరకు పెరుగుతుంది. బ్యాంకింగ్, జీవశాస్త్రంలో ఎక్కువ ప్రభావం! లక్షల కోట్ల మాట కాసేపు పక్కనపెడితే జనరేటివ్ ఏఐ అప్లికేషన్లకు అన్ని రంగాల్లోనూ చొచ్చుకుపోయే సామర్థ్యం ఉంది. అయితే బ్యాంకింగ్, జీవశాస్త్రంలో కాస్త ఎక్కువ ప్రభావం ఉంటుందని మెకిన్సే అంచనా వేసింది. ఒక్క బ్యాంకింగ్ రంగంలోనే ఈ సాఫ్ట్వేర్ల వాడకం వల్ల ఉత్పాదకత పెరిగి ఏటా రూ.16 వేల కోట్ల నుంచి రూ.30 వేల కోట్ల వరకూ లాభం చేకూరుతుందని తేలింది. ఇక రిటైల్, కన్సూ్యమర్ ప్యాకేజ్డ్ గూడ్స్లలో జనరేటివ్ ఏఐని పూర్తిస్థాయిలో వాడితే కలిగే లాభం రూ.60 వేల కోట్లకు పైమాటే. ఇక ఈ కృత్రిమ మేధ వాడకం కేవలం లాభాలకు మాత్రమే పరిమితం కాదు. చేసే పని తీరుతెన్నులు కూడా మారిపోతాయి. ఒక వ్యక్తి చాలా సాధారణంగా చేసే పనులన్నింటినీ ఆటోమేట్ చేయడం ద్వారా ఏఐ వారి ఉత్పాదకతను పెంచుతుంది. మెకిన్సే లెక్కల ప్రకారం మనుషులు చేసే వాటిల్లో 60 నుంచి 70 శాతం పనులను ఏఐలు ఆటోమేటిక్‌గా చేయగలవు. చాట్ జీపీటీ లాంటి వాటికి భాషను అర్థం చేసుకోగల సామర్థ్యం కూడా ఉండటం వల్ల బోధన వంటి పనులకు బాగా ఉపయోగపడుతుందని అంచనా. ఈ రంగాల్లో లాభాలెక్కువ జనరేటివ్ ఏఐతో అన్ని రంగాల్లోనూ ఉత్పాదకత పెరుగుతుంది. తద్వారా లాభాలూ పెరుగుతాయి. కానీ.. వినియోగదారుల వ్యవహారాలు, మార్కెటింగ్, సేల్స్ రంగాలతో పాటు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, జీవశా్రస్తాల్లో ఇవి మరింత ఎక్కువగా ఉండనున్నాయి. మెకిన్సే జరిపిన సర్వే ప్రకారం ఐదు వేల మంది సేల్స్ సరీ్వస్ ఉద్యోగులున్న కంపెనీలో జనరేటివ్ ఏఐ వాడకంతో ఒక్కో వినియోగదారుడి సమస్యను పరిష్కరించేందుకు పట్టే సమయం దాదాపుగా 10 శాతం తగ్గింది. కంపెనీ మొత్తమ్మీద చూస్తే గంటకు 14 శాతం ఎక్కువగా వినియోగదారుల సమస్యలు పరిష్కారమయ్యాయి. అలాగే ‘మీ మేనేజర్‌ను పిలవండి..’అన్న ఫిర్యాదులు 25 శాతం వరకూ తగ్గిపోయాయి. వినియోగదారుల డిమాండ్లు, పనిఒత్తిళ్ల కారణంగా ఉద్యోగాలు మానేయడం కూడా తగ్గినట్లు ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ఇక మార్కెటింగ్, సేల్స్ రంగాల విషయానికి వస్తే జనరేటివ్ ఏఐ వినియోగంతో ఖర్చులు సగానికి సగం తగ్గడం మాత్రమే కాకుండా అమ్మకాలు పది రెట్లు పెరుగుతాయి. మార్కెటింగ్‌కు అవసరమైన సమాచారాన్ని వేగంగా సృష్టించడం, ప్రాంతాలకు, ఒక్కో వినియోగదారుడికి తగి న విధంగా మార్చడం కూడా ఈ జనరేటివ్ ఏఐతో సాధ్యమవుతుందని, భాషల అంతరం తొలగిపోయి ఎవరికి కావల్సిన భాష లో సమాచారం ఈమెయిళ్ల రూపంలో ఠకీమని పంపవచ్చునని మెకిన్సే చెబుతోంది. జనరేటివ్ ఏఐకి ఉన్న మరో సామర్థ్యం సాఫ్ట్వేర్ కోడ్ రాయగలగడం. దీనివల్ల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు చేసే చిన్నచిన్న పనులను వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తిచేయవచ్చు. సాఫ్ట్వేర్ టెస్టింగ్, క్వాలిటీ, బగ్స్ ను తొలగించడం వంటివి సులువైపోతాయి. చివరగా పరిశోధనలకు ఫార్మా వైద్యం వంటి రంగాలకు జనరేటివ్ ఏఐ ఎంతో ఉపయోగకరం. ఈ రంగానికి ఏటా రూ.25 వేల కోట్ల విలువను జోడించగల సామర్థ్యం దీనికి ఉంది. అమెరికాలో పెరుగుతున్న చాట్ జీపీటీ వాడకం అమెరికాలో చాట్ జీపీటీ వాడకం ఊపందుకుంటోంది. స్టాటిస్టా జరిపిన సర్వే ప్రకారం జనవరిలో సొంత అవసరాల కోసం ఈ జనరేటివ్ ఏఐని వాడామని 12 శాతం మంది చెప్పగా, ఇతరులు వాడటం చూశామని 38 శాతం మంది చెప్పారు. సర్వేలో పాల్గొన్న వారిలో 43 శాతం మంది మహిళలు మాత్రం తాము చాట్ జీపీటీ గురించి అస్సలు వినలేదని చెప్పారు. 2030 నాటికి రెండు లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ నెక్స్ట్ మూవ్ స్ట్రాటజీ కన్సల్టింగ్ అంచనాల ప్రకారం 2030 నాటికి కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ మార్కెట్ విలువ దాదాపుగా రెండు లక్షల కోట్ల డాలర్లు. హాలీవుడ్లో రచయితలు, డబ్బింగ్ ఆర్టిస్ట్స్ లు వారం రోజులుగా ఆందోళన నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో తమ స్థానంలో ప్రొడక్షన్ కంపెనీలు జనరేటివ్ ఏఐలను వాడరాదని వారు డిమాండ్ చేస్తున్నారు. సినిమాలకు అవసరమైన స్క్రిప్ట్ లు రాయడం మొదలుకొని, మనుషులను పోలిన గొంతులను కూడా సృష్టించగలదీ జనరేటివ్ ఏఐ. స్నాప్‌చాట్ ఇప్పటికే యానిమేషన్ల కోసం జనరేటివ్ ఏఐని వాడటం మొదలుపెట్టగా.. ఆహార డెలివరీ సంస్థ స్విగ్గీ కూడా అదే బాట పట్టింది. ఓరియో బిస్కెట్లు తయారు చేసే సంస్థ సినీ నటుడు ఫర్హాన్ అక్తర్, జనరేటివ్ ఏఐల సాయంతో సరికొత్త వాణిజ్య ప్రకటనను సృష్టించింది. -
సంచలనం రేపుతున్న AI ఉద్యోగాలు ఉంటాయా, ఉడతాయా ..!
-
Chat GPT చెప్పింది అని విద్యార్దులను ఫెయిల్ చేసాడు.. చివరికి ఏమైందంటే..
-
ట్విట్టర్ మైక్రోసాఫ్ట్ మధ్య చాట్ జీపీటీ చిచ్చు..
-
గూగుల్ కి షాకిస్తున్నసెల్ ఫోన్ కంపెనీస్..
-
ప్రమాదంలో 30 కోట్ల ఉద్యోగాలు.. వెలుగులోకి సంచలన నివేదిక!
టెక్ వరల్డ్‌లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) తో పనిచేసే ‘చాట్ జీపీటీ’ వినియోగం రోజురోజుకీ పెరిగిపోతుంది. తమకు తెలియని ఎన్నో ప్రశ్నలకు సమాధానాలను చాట్ జీపీటీని అడిగి తెలుసుకుంటున్నారు. అయితే మెరిసేదంతా బంగారం కాదని.. ఏఐ టూల్స్ జాబ్ మార్కెట్లో అలజడులు సృష్టిస్తాయంటూ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ దిగ్గజం గోల్డ్‌మన్ సాక్స్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 300 మిలియన్ల (30 కోట్ల) ఫుల్‌టైమ్ ఉద్యోగాలపై ప్రభావం పడనున్నట్లు అంచనా వేసింది. ఏఐ పూర్తి స్థాయిలో తన సామార్ధ్యాలను వినియోగిస్తే లేబర్ మార్కెట్ కుప్పకూలిపోవడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తం చేసింది. అమెరికా, యూరప్ దేశాల నుంచి సేకరించిన డేటా ఆధారంగా 2/3 వంతుల ఉద్యోగాలు ఆటోమేషన్‌కు గురవుతున్నాయని, ప్రస్తుత పనిలో నాలుగింట ఒక వంతు వరకు భర్తీ చేయగలదని గుర్తించినట్లు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ తెలిపారు. ఇక ఏఐతో అడ్మినిస్ట్రేటివ్ 46 శాతం, లీగల్ జాబ్స్ 44 శాతం ఉద్యోగాల్ని ఏఐ భర్తీ చేయనున్నట్లు ఆ రిపోర్ట్ పేర్కొంది. నిర్మాణ, మెయింటెనెన్స్ రంగాల్లో ఉద్యోగాలు వరుసగా 6 శాతం, 4 శాతం మేర దెబ్బతింటాయని సమాచారం. జనరేటివ్ ఏఐతో కార్మికుల డిమాండ్ తగ్గుతుందని, కార్మిక ఉత్పాదక వృద్ధిపై సానుకూల ప్రభావం ఉంటుందని గోల్డ్‌మన్ సాక్స్ తన రిపోర్ట్‌లో తెలిపింది. -
ఎక్కడ చూసినా ఇదే చర్చ.. చాట్ జీపీటీ! గూగుల్‌ని మించి? ఏది అడిగినా..
కంచర్ల యాదగిరిరెడ్డి ఆవకాయ పెట్టడం ఎలాగో అడిగితే గూగుల్ చెప్పగలదేమోగానీ.. సొంతంగా ఓ సినిమా కథ రాయమంటే మాత్రం చేతులెత్తేస్తుంది! మనమేది అడిగినా అవసరమైనదానితో పాటు సంబంధం లేని ఎన్నో విషయాలనూ గూగుల్ ఇస్తుంది. ఎందుకంటే.. ఎక్కడెక్కడి సమాచారాన్నో సేకరించి ఇవ్వడమే గూగుల్ చేయగలిగిన పని. సొంతంగా ఆలోచించడం దానికి సాధ్యం కాదు. ..అయితే మారుతున్న టెక్నాలజీతో ఈ పరిస్థితి మారిపోతోంది. గత ఏడాది నవంబర్‌లో విడుదలైన కృత్రిమ మేధ సాఫ్ట్వేర్ ‘చాట్ జీపీటీ’ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. అడిగిన సమాచారమేంటో కచ్చితంగా ఇస్తోంది. తప్పుగా అడిగితే తప్పనీ చెప్తోంది. విద్యార్థుల సందేహాలు తీరుస్తోంది. పిల్లల కథల నుంచి సాఫ్ట్వేర్ కోడ్ల దాకా రాసిపెడుతోంది. మరి ఏమిటీ చాట్ జీపీటీ? ఎలా పనిచేస్తుంది? ప్రయోజనం, ప్రభావాలేమిటి? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే చర్చ. అచ్చం మనిషిలా ఆలోచించి, స్పందించే కృత్రిమ మేధ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో చాట్ జీపీటీ తాజా అవతారం. గతేడాది నవంబర్లోనే విడుదలైంది. దీనిపై ఎవ రికీ హక్కుల్లేకపోవడం విశేషం.ఓపెన్ఏఐ.కామ్ అన్న వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుని మీరూ దీంతో సంభాషించవచ్చు. ఆవకాయ నుంచి అణ్వాస్త్రాల వరకు, స్టాక్ మార్కెట్ నుంచి ఖగోళపు అంచుల వరకూ ఏ అంశంపైనైనా మాట్లాడవచ్చు. సినిమా స్క్రిప్ట్ రాయాలని రామ్‌గోపాల్ వర్మ అడిగితే.. మూడే సెకన్లలో రాసేసింది. ఇదంతా బాగానే ఉందికానీ.. ఏమిటీ చాట్ జీపీటీ? ఒక్క ముక్కలో చెప్పాలంటే చాటింగ్ చేయగల కృత్రిమ మేధ రోబో అనాలి! కాకపోతే యాంత్రికంగా కాకుండా మనలా ఆలోచించి చేస్తుందన్నమాట.ఈ–కామర్స్ సహా వివిధ రంగాల కంపెనీల వెబ్సైట్లలోనూ చాటింగ్ కోసం రోబోలను వాడుతున్నారు. కానీ వాటి స్పందనలు చాలా పరిమితం. కంపెనీకి లేదా సైట్‌కు సంబంధించిన అంశాలపై మాత్రమే వివరాలు ఉంటాయి. చాట్ జీపీటీ దీనికి భిన్నం. ఇది చేయగల పనులకు అంతం లేదని చెప్పవచ్చు. తప్పుదారి పట్టిస్తే.. పట్టేస్తుంది కంప్యూటర్ ప్రోగ్రాములు రాయడం, వాటిలోని తప్పులను (బగ్స్)ను గుర్తించి తొలగించడం కూడా చాట్ జీపీటీ చేయగలదు. సంగీతాన్ని పొందుపరచడం, టెలివిజన్ నాటకాలు, కల్పిత కథలు రాయడం వంటివీ అలవోకగా చేసేస్తుంది. విద్యార్థులకు వ్యాసాలు రాయడమే కాకుండా పరీక్షల్లో ప్రశ్నలకూ జవాబులిస్తుంది. పాటలు రాయడం, కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ డేటా అనలిటిక్స్‌ను తయారు చేయడం, చాట్ రూమ్‌ను రూపొందించడం, టిక్–టాక్–టో వంటి ఆటలాడటం కూడా చేయగలదు. ఇలాంటి పనులు ఇతర రోబోలతోగానీ, గూగుల్‌తో కానీ అస్సలు సాధ్యం కాదని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ చాట్‌జీపీటీ ఎంత తెలివైందంటే ఎప్పుడో వందల ఏళ్ల కింద అమెరికాను కనిపెట్టిన.. ‘క్రిస్టోఫర్ కొలంబస్ 2015లో అమెరికాకు వచ్చినప్పుడు ఏమైందో చెప్పు’అని అడిగామనుకోండి. మనం పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్న విషయాన్ని గుర్తిస్తుంది. ప్రశ్నలో ఉన్నట్టుగా క్రిస్టోఫర్ ఒకవేళ 2015లో అమెరికాకు వచ్చి ఉంటే ఏమై ఉండేదో ఊహించుకుని సమాధానం సిద్ధం చేస్తుంది. కొలంబస్ గతంలో చేసిన పనులపై ఇప్పుడు మనుషులేం అనుకుంటున్నారో కూడా పరిగణించి సమాధానాలిస్తుంది. అంతా బాగున్నట్టేనా? చాట్ జీపీటీకి కూడా ఎన్నో పరిమితులు ఉన్నాయి. ప్రస్తుతానికి ఇది ప్రయోగాత్మకంగా విడుదల చేసిన బీటా వెర్షన్ మాత్రమే. అయితే ఇన్‌స్ట్రక్ట్ జీపీటీ పేరుతో సిద్ధం చేసిన ఏఐ సాఫ్ట్‌వేర్‌ను ఆధునీకరించడంతో.. దీనిద్వారా వచ్చే ప్రమాదకరమైన, మోసపూరితమైన సమాధానాలు తగ్గాయని నిపుణులు చెప్తున్నారు. ఇక జాతి విద్వేషాలు, ఉగ్రవాదం వంటి అంశాలకు సంబంధించిన సమాచారం చాట్‌జీపీటీకి దక్కకుండా ఓపెన్ ఏఐ సంస్థ జాగ్రత్తలు తీసుకుంటోంది. చాట్ జీపీటీ కొన్నిసార్లు తిక్క సమాధానాలు ఇస్తుందని.. అది దాని పరిమితి అని చెప్తోంది. పైగా 2022 డిసెంబర్ వరకూ చాట్ జీపీటీ రాజకీయాలపై వ్యాఖ్యలు చేయకుండా సాఫ్ట్‌వేర్‌లోనే పరిమితులు చేశారు. మొత్తంగా చాట్ జీపీటీ ద్వారా తప్పుడు సమాచారం లేదా తప్పుదోవ పట్టించే సమాచారం అందకుండా చూసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మధ్య మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల మన దేశానికి వచ్చినప్పుడు ఓ ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. చాట్ జీపీటీతో మాట్లాడుతూ ఆయన ఓ ప్రశ్న వేశాడు. దక్షిణ భారతదేశంలో టిఫిన్ల రుచిని బట్టి ఓ జాబితా తయారు చేయమన్నారు. చాట్ జీపీటీ జాబితా తయారు చేసిందిగానీ.. అందులో బిర్యానీని కూడా చేర్చేసింది. ఆయనకు చిర్రెత్తుకొచ్చి.. బిర్యానీని టిఫిన్ అంటావా? నాలాంటి హైదరాబాదీని అవమానిస్తావా? అని కోపగించారు! మామూలు సాఫ్ట్వేర్ అయితే సంభాషణ ఇక్కడితో ఆగిపోయేదేమో! కానీ అది చాట్ జీపీటీ. వెంటనే ‘సారీ’చెప్పేసింది. పొరబాటుపడ్డానని ఒప్పేసుకుంది. సినీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఇటీవలే చాట్ జీపీటీతో చాటింగ్ చేశారు. చాలా అంశాలపై అవగాహన ఉన్న ఆయన.. త్వరగానే దాని సామర్థ్యాన్ని గుర్తించారు. వరుసగా కనీసం 17 ట్వీట్ల ద్వారా చాట్ జీపీటీతో జరిపిన సంభాషణలను దృష్టిలో ఉంచుకుని.. దాని ద్వారా భవిష్యత్తులో జరిగే పరిణామాలను అంచనా వేశారు. చాట్ జీపీటీ విశేషాలు, ప్రత్యేకతలెన్నో.. నార్తర్న్ మిషిగన్ యూనివర్సిటీలో బుర్ఖా నిషేధంపై ఓ వ్యాసం రాయాల్సిందిగా ప్రొఫెసర్ ఆంటోని ఔమన్ విద్యార్థులను కోరారు. ఒక విద్యార్థి నుంచి విస్పష్టమైన ఆలోచనలతో సమాధానపత్రం అందింది. నిషేధం, నైతికత వంటి అంశాలన్నీ అందులో ఉన్నాయి. వ్యాసం అద్భుతంగా ఉందని అంటూనే.. సదరు విద్యార్థిని నువ్వే రాశావా అని ప్రొఫెసర్ నిలదీశారు. దీనితో అసలు విషయం బయటపడింది. ఆ వ్యాసం రాసింది చాట్ జీపీటీ. ఈ ఉదంతం తర్వాత వ్యాసరచన నిర్వహించే పద్ధతుల్లో మార్పులు చేయాలని ప్రొఫెసర్ నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలోని పలు వర్సిటీల అధ్యాపకులుకూడా ఇదే ఆలోచనలో ఉండటం గమనార్హం. ►ఓపెన్ ఏఐ కంపెనీ అభివృద్ధి చేసిన మరో కృత్రిమమేధ సాఫ్ట్వేర్ డాల్–ఈ2. కేవలం కొన్ని వివరాలిస్తే చాలు. ఇది వాటి ఆధారంగా బొమ్మలు గీస్తుంది. ►చాట్ జీపీటీని పరిశీలించిన తర్వాత చాలా పాఠశాలల్లో చాట్బోట్లను క్లాస్‌రూమ్‌లలో వాడే విషయంపై మల్లగుల్లాలు పడుతున్నారు. సియాటెల్‌లోని కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిషేధం విధించారు కూడా. ►2900 కోట్ల డాలర్లు ఓపెన్ఏఐ మార్కెట్ విలువ చాట్ జీపీటీ–3 విడుదల తరువాత ఏకంగా 2900 కోట్ల డాలర్లకు చేరుకుంది. త్వరలోనే మరింత మెరుగైన జీపీటీ–4ను విడుదల చేసే ఆలోచనలో కంపెనీ ఉంది. ►గూగుల్ కూడా ల్యామ్డా పేరుతో ఓ చాట్‌బోట్‌ను తయారు చేయగా.. మైక్రోసాఫ్ట్ చాట్ జీపీటీనే తన అజ్యూర్ క్లౌడ్ సర్వర్‌లో ఏర్పాటు చేస్తోంది. అంతేకాకుండా ఓపెన్ ఏఐ కంపెనీలో సుమారు 1,000 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతోంది. ►కొంతమంది విద్యార్థులు చాట్‌జీపీటీతో తమకు ఎంతో మేలు జరుగుతుందని విశ్వసిస్తున్నారు. కొంతమంది తమ సాఫ్ట్వేర్ కోడ్లలో తప్పులు వెతికేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. ►57.8 కోట్లు టిక్‌టాక్‌లో చాట్‌జీపీటీ హ్యాష్‌ట్యాగ్‌కు నమోదైన వ్యూస్ ఎలా పని చేస్తుంది? చిన్నపిల్లలకు మనం ఏ అంశమైనా ఎలా నేర్పిస్తాం? అక్షరాలైతే ఒకటికి వందసార్లు చెప్పించడం, రాయించడం చేస్తాం. అలాగే సమాచారమిచ్చి చదవడం అలవాటు చేస్తాం. చాట్‌జీపీటీ శిక్షణా ఇలాగే జరుగుతుంది. బులెటిన్ బోర్డ్ సిస్టమ్, పైథాన్ వంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లు, యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్‌లో వాడే ‘మ్యాన్ పేజెస్’వంటివి ఉంటాయి. టీచర్ల మాదిరిగా కొంతమంది సాఫ్ట్వేర్ డెవలపర్లు చాట్‌జీపీటీకి పలు విషయాలను నేర్పించడంతోపాటు నేర్చుకుంటున్న విషయాలను గమనిస్తూ వాటిలో మార్పులు, చేర్పులు చేస్తూ వచ్చారు. పదే పదే రాయడం, లేదా వల్లె వేయడం ద్వారా మనం నేర్చుకున్నట్టే.. చాట్‌జీపీటీకి పలు విషయాలను నేర్పారు. చాట్‌జీపీటీ స్పందనలను ర్యాంక్ చేయడం ద్వారా అది తన తప్పొప్పులను తెలుసుకునేలా చేశారు. మంచి ర్యాంకులివ్వడం ద్వారా ఫలానా అంశం నేర్చుకుంటే లాభమన్న భావన కల్పించారు. దీనికితోడు చాట్‌జీపీటీ ఇంటర్నెట్ ద్వారా ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరించి తాను నేర్చుకున్న అంశాలకు మెరుగులు దిద్దుకుంటుంది. ఈ క్రమంలో మనం చాట్‌జీపీటీతో జరిపిన సంభాషణలనూ వాడుకుంటుంది. చాట్ జీపీటీ స్పందనలకు మన అభిప్రాయాలను అప్వోట్ లేదా డౌన్‌వోట్ ద్వారా తెలియజేస్తే దాని ఆధారంగా తప్పులు దిద్దుకోవడమూ చేస్తుంది. Best AI Tools You Need To Know#chatgpt #chatgpt3 #ArtificialIntelligence #ai pic.twitter.com/0jfr8cOMoo — John Vianny (@johnvianny) January 13, 2023 -
పీఎన్బీ హౌసింగ్- జీపీటీ ఇన్ఫ్రా.. జూమ్
వరుసగా రెండో రోజు దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ట్రేడవుతున్నాయి. ప్రస్తుతం సెన్సెక్స్ 258 పాయింట్లు జంప్‌చేసి 38,309కు చేరగా.. నిఫ్టీ 86 పాయింట్లు ఎగసి 11,333 వద్ద ట్రేడవుతోంది. ఈ నేపథ్యంలో నిధుల సమీకరణ వార్తలతో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోపక్క కోల్‌కతా మెట్రో ప్రాజెక్ట్ గెలుచుకున్నట్లు వెల్లడించడంతో మౌలిక సదుపాయాల సంస్థ జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ సైతం జోరు చూపుతోంది. ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు క్యూకట్టడంతో ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ ప్రిఫరెన్షియల్, రైట్స్ ఇష్యూల ద్వారా నిధుల సమీకరణకు ప్రతిపాదించినట్లు ఇప్పటికే పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ వెల్లడించింది. ఈ ప్రతిపాదనపై బుధవారం(19న) సమావేశంకానున్న బోర్డు నిర్ణయం తీసుకోనున్నట్లు తాజాగా తెలియజేసింది. ఈక్విటీ షేర్ల జారీ ద్వారా రూ. 600 కోట్లు సమకూర్చుకునే యోచనలో ఉన్నట్లు వివరించింది. ఈ నేపథ్యంలో పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 12 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 270ను అధిగమించింది. ప్రస్తుతం 10 శాతం లాభంతో రూ. 265 వద్ద ట్రేడవుతోంది. ట్రేడింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే ఈ కౌంటర్లో ఎన్ఎస్ఈ, బీఎస్ఈలలో 19 లక్షలకుపైగా షేర్లు చేతులు మారడం గమనార్హం! జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ పీఎస్‌యూ రైల్వే వికాస్ నిగమ్.. కోల్‌కతా నుంచి రూ. 196 కోట్లకుపైగా విలువైన కాంట్రాక్టు లభించినట్లు జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ తాజాగా పేర్కొంది. కాంట్రాక్టులో భాగంగా మెట్రో రైల్వే వయాడక్ట్సహా.. రెండు రైల్వే స్టేషన్ల అభివృద్ధిని సైతం చేపట్టవలసి ఉంటుందని తెలియజేసింది. ఈ నేపథ్యంలో జీపీటీ ఇన్ఫ్రాప్రాజెక్ట్స్ షేరు ఎన్ఎస్ఈలో తొలుత 12 శాతం వరకూ దూసుకెళ్లింది. రూ. 31ను అధిగమించింది. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 30 వద్ద ట్రేడవుతోంది. -
రిటైర్డ్ ఉద్యోగిని దారుణ హత్య.
కాకినాడ క్రైం : పట్టపగలు కాకినాడలో ఓ రిటైర్డ్ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. ఆమె ఒంటరిగా ఉండడాన్ని గమనించి, పథకం ప్రకారమే హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కాకినాడ గరల్స్ పాలిటెక్నిక్ (జీపీటీ) సమీపంలోని స్నేహ అపార్ట్మెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్లో కాకర్లమూడి అనురాగం (61) ఒంటరిగా నివసిస్తోంది. కాకినాడ ప్రభుత్వాస్పత్రిలో హెడ్ నర్సుగా పనిచేసిన ఆమె సుమారు మూడేళ్ల క్రితం పదవీ విరమణ పొందారు. సుమారు 15 ఏళ్ల క్రితం నుంచి అదే అపార్ట్మెంట్లో ఆమె నివసిస్తోంది. మంగళవారం మధ్యాహ్నం మూడు గంటలకు వాచ్‌మన్ అయినవిల్లి శ్రీనివాసరావు కుమార్తె భవాని తల దువ్వుకుంటుంటే అనురాగం బయటకు వచ్చి ఆమెతో మాట్లాడి వెళ్లింది. శ్రీనివాసరావు భార్య అమ్ములుకు అనారోగ్యంగా ఉండడంతో వైద్యులు రాసిచ్చిన మందులు ఎలా వేసుకోవాలో అడిగేందుకు వారి కుమారుడు మాధవ్ సాయంత్రం 5.30 గంటల సమయంలో అనురాగం ఉండే ఫ్లాట్‌కు వెళ్లాడు. ఆమె చలనం లేకుండా పడిఉండడంతో మాధవ్ ఈ విషయాన్ని తన తండ్రి శ్రీనివాసరావు తెలియజేశాడు. అతడు వెళ్లి సంఘటన స్థలాన్ని చూసి అపార్ట్మెంట్ వాసులకు విషయం చెప్పాడు. దీంతో వారు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీఎస్పీ రామిరెడ్డి విజయభాస్కర రెడ్డి, టూ టౌన్ సీఐ మోహనరావు, క్రైం సీఐ అల్లు సత్యనారాయణ, ఎస్సై శేఖర్‌బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బీరువాలు తెరిచి ఉండడం, ఇల్లంతా చిందరవందరగా పడి ఉండడంతో నగదు, బంగారం, డాక్యుమెంట్ల కోసం ఆమెను హతమార్చి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అనురాగం కాళ్లు ప్లాస్టిక్ తాడుతో కట్టి, తలగడ ముఖంపై పెట్టి ఊపిరాడకుండా హతమార్చినట్టు సంఘటన స్థలంలో పరిస్థితులను బట్టి తెలుస్తోంది. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం ఆధారాలు సేకరించాయి. అనురాగం బంధువులు హైదరాబాద్, పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండడంతో పోలీసులు వారికి సమాచారం అందించారు. శవపంచనామా నిర్వహించి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానికంగా కలకలం రేపింది. చుట్టుపక్కల అపార్ట్మెంట్లకు చెందిన వారు పెద్దఎత్తున అక్కడకు చేరుకుని భయాందోళనలు వ్యక్తం చేశారు. అనురాగం నివసించే ప్రాంతం నిర్మానుష్యంగా ఉండడంతో ఎవరికీ అనుమానం రాలేదని స్థానికులు చెబుతున్నారు. వాచ్‌మన్ శ్రీనివాసరావు కుటుంబం అక్కడే నివసిస్తుండడంతో బయటివారు లోపలికి వచ్చే అవకాశం లేదని అంటున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ విజయ భాస్కర రెడ్డి తెలిపారు.