దేశానికి రక్షణ ఎంత అవసరమో, దేశంలోని పౌరులకు అన్ని విధాలా భద్రత కల్పించడమూ అంతే కీలకం. వ్యక్తిగత వివరాలను దొంగలించడం, బహిర్గతం చేయడం వంటివి ప్రజల భద్రతకు, వారి వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తాయి. దురదృష్టవశాత్తు దేశంలో అటువంటి ఘటనలు కొన్నేళ్లుగా అధికమవుతున్నాయి. పౌరులే కాదు, కట్టుదిట్టమైన ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలూ సమాచార చౌర్యానికి బలవుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
దేశంలో సగం జనాభా వివరాలు ఇప్పుడు అంగడి సరకుగా మారాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా 24 రాష్ట్రాలు, ఎనిమిది ముఖ్య నగరాలకు చెందిన దాదాపు 66.9 కోట్ల మంది వ్యక్తిగత సమాచారాన్ని ఫరీదాబాద్‌కు చెందిన ముఠా గతంలో అంతర్జాలంలో అమ్మకానికి పెట్టిన సంఘటనలు ఉన్నాయి.
ప్రస్తుతం చాలామంది చాట్‌జీపీటీ వాడుతున్నారు. అయితే తెలిసీ తెలియక కొందరు అందులో వ్యక్తిగత వివరాలూ ఇస్తున్నారు. చాట్‌జీపీటీకి మనం ఇచ్చే సమాచారమంతా భవిష్యత్‌లో ఏఐ నమూనాలకు శిక్షణ ఇవ్వటానికి ఉపయోగపడుతుందని కొందరు నిపుణులు హెచ్చరిస్తున్నారు. మున్ముందు ఇదెక్కడికి దారితీస్తుందో ఎవరికీ తెలియదు.
ఇదీ చదవండి: భవిష్యత్తులో ప్రపంచాన్ని శాసించే టెక్నాలజీ ఇదే.. కానీ..
సైబర్ నేరస్థులు మన వ్యక్తిగత వివరాలను అంగట్లో బేరానికి పెట్టే ప్రమాదముంది. కాబట్టి చాట్‌జీపీటీకి సొంత విషయాలకు సంబంధించిన సమాచారం ఇవ్వకపోవటమే మంచిదని కంప్యూటర్ సైన్స్ నిపుణులు సూచిస్తున్నారు. మన చాట్స్‌లోని సమాచారాన్ని జీపీటీ వాడుకోకుండా సెటింగ్స్‌లోకి వెళ్లి, అన్ని చాట్స్‌కు సంబంధించిన వివరాలను నిత్యం డిలీట్ చేయాలని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment