
మాయాబజార్ సినిమా గుర్తుంది కదా. నిజానికి ఆ చిత్రాన్ని ముందుగా బ్లాక్ అండ్ వైట్‌లోనే రిలీజ్ చేశారు. కానీ కొన్నేళ్ల తర్వాత ఇటీవల దాన్ని కలర్ సినిమాగా మార్చి థియేటర్లలో విడుదల చేశారు. బ్లాక్ అండ్ వైట్ సినిమాను కలర్‌లోకి మార్చేందుకు ప్రత్యేకంగా ఓ యూనిట్ కొంతకాలం పని చేసింది. అయితే టెక్నాలజీ పెరుగుతున్న ఈ రోజుల్లో అలాంటి వ్యయప్రయాసలు అవసరం లేకుండా బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌లను కలర్‌లోకి మార్చుకోవచ్చు. మీ తాతగారి ఫోటో.. నానమ్మ ఫోటో..వంటి మీ జ్ఞాపకంగా ఉన్న బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌ను క్షణాల్లో కలర్‌లోకి చేంజ్ చేయవచ్చు. ఇందుకు చాట్‌జీపీటీ అవకాశం కల్పిస్తుంది.
జనరేటివ్ ఏఐ అభివృద్ధి చెందుతూ సృజనాత్మక అవకాశాలను మునుపెన్నడూ లేనంత ముందుకు తీసుకెళ్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత ఇమేజ్ ప్రాసెసింగ్‌లో తాజా పురోగతి ఇందుకు నిదర్శనం. జనరేటివ్ ఏఐ నమూనాలు మోనోక్రోమ్ చిత్రాలను అద్భుతమైన పూర్తి కలర్ వర్షన్లుగా మారుస్తున్నాయి. చాట్‌జీపీటీ జీబ్లీ ఇమేజ్ ప్రాసెసింగ్ ద్వారా ప్రత్యేకమైన ప్రాంప్ట్‌తో బ్లాక్ అండ్ వైట్ ఇమేజ్‌ను కలర్‌లోకి మార్చవచ్చని కంపెనీ తెలిపింది.
ఇదీ చదవండి: రోజూ 13,698 వాహనాలు అమ్ముతారట!
కలర్‌లోకి ఎలా మార్చాలంటే..
వినియోగదారులు చాట్‌జీపీటీ జీబ్లీలో బ్లాక్ అండ్ వైట్ చిత్రాన్ని అప్‌లోడ్ చేయాలి. ‘Convert this black and white image to color’ అనే ప్రాంప్ట్ అందించాలి. ఈ అభ్యర్థన ఆధారంగా ఏఐ సదరు ఇమేజ్‌ను ప్రాసెస్ చేస్తుంది. చివరగా కలర్ ఇమేజ్‌ను అందిస్తుంది. ఇలా ప్రాసెస్ చేసిన ఇమేజ్‌ను యూజర్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. వాస్తవిక రంగులను అంచనా వేయడానికి, ఏక్కడైనా తప్పిపోయిన రంగులను పూరించడానికి విస్తారమైన డేటాసెట్లపై శిక్షణ పొందిన డీప్ లెర్నింగ్ నమూనాలను ఇందుకు ఉపయోగిస్తుంది.