image
-
ఇండోనేషియా నగదు నోటుపై గణపతి చిత్రం
హిందువుల తొలిపూజలు అందుకునే గణపతి చిత్రం ఇతర దేశాల నగదు నోటుపై ముద్రించడం విశేషమే. ఇండోనేషియా దేశంలోని రూ. 20 వేల నోటుపై గణపతి చిత్రం ముద్రించి ఉండటం మనకు ఆసక్తి కలిగించే అంశమే. ఆ దేశం ఒక ఇస్లామిక్ దేశం. ఇప్పటి వివరాల ప్రకారం ఆ దేశంలో 88 శాతంపైగా ముస్లింలు ఉండగా మూడు శాతం మంది మాత్రమే హిందువులు ఉన్నారు. కానీ కొన్ని వేల సంవత్సరాల ముందు ఆ దేశం హిందూ మతానికి చాలా ప్రాముఖ్యమైన ప్రదేశంగా వెలుగొందింది. అక్కడవున్న ఎన్నో పురాతన దేవాలయాలు ఇప్పటికీ దేశ, విదేశీయులకు ప్రముఖ దర్శనీయ స్థలాలుగా వెలుగొందుతున్నాయి.ఒకటవ శతాబ్దం నుంచి ఆ దేశంలో ఎక్కువగా హిందూ మతం ఉన్నదని భావిస్తారు. ఆ దేశానికి చెందిన రూ. 20వేల (రూపియా) కరెన్సీ నోటు మీద జ్ఞానాన్ని ప్రసాదించే విజ్ఞాన గణపతి చిత్రాన్ని చిహ్నంగా ముద్రించబడి ఉంటుంది. అదే నోటు మీద ఆ దేశంలోని పిల్లలందరికీ విద్య అందించడానికి విశేష కృషి చేసిన ఇండోనేషియా జాతీయ విద్యా పితామహుడిగా పిలువబడిన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు హజర్ దేవంతర చిత్రం ప్రచురించబడి వుంటుంది. తదనంతర క్రమంలో (1950) ఆయన ఆ దేశ విద్యాశాఖ మంత్రిగాను పనిచేశారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన కృషికి ఫలితంగా ఆయన పుట్టినరోజును జాతీయ విద్యాదినోత్సవంగా జరుపుకుంటున్నారు.ఈ విధంగా ఆ నోటుపై జ్ఞానాన్ని అందించే విద్యాగణపతి, విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖుని చిత్రాలతోపాటు, ఆ నోటు వెనుక తరగతి గదిలో వున్న పిల్లల చిత్రం ముద్రించబడి వుండటం విశేషం. -
వాట్సాప్‌లో త్వరలో ఏఐ ఇమేజ్ ఎడిటర్!
వాషింగ్టన్: కృత్రిమ మేధ (ఏఐ) అందుబాటులోకి వచ్చాక దానిని విరివిగా వాడేందుకు జనం ఎంతో ఉత్సాహం చూపిస్తు న్నారు. తాము వాడే యాప్‌లలో ఏఐ ఉంటే దాని సాయంతో సరదా సరదా ప్రయోగాలు చేస్తుంటారు. దీంతో ఫొటోలు, ఇమేజ్‌లను ఎడిట్ చేసే ఏఐ ఆధారిత ఫీచర్ త్వరలో ప్రముఖ సామాజిక మాధ్యమం వాట్సాప్‌లో అందుబుటులోకి వచ్చే అవకాశ ముంది. బీటా వెర్షన్ వినియోగదారులకు మొదట దీనిని వాడే అవకాశం ఇవ్వొచ్చని ‘వెబ్బేటాఇన్ఫో’ తన కథనంలో పేర్కొంది. ఆ ఫీచర్ అందుబాటులోకి వస్తే.. యాప్‌లోని ఆప్షన్లను తమ అభిరుచికి అనుగుణంగా వాడుకుంటున్న యూజర్లు.. ఈ కొత్త ఫీచర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇది అంబుబాటులోకి వస్తే ఇమేజ్ను తమకు నచ్చినట్లుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇమేజ్ సైజు, బ్యాక్గ్రౌండ్లను మార్చుకోవచ్చు. ఆండ్రాయిడ్ 2.24.7.13 వెర్షన్‌ను అప్డేట్ చేసుకున్న వాళ్లకు ఏఐ ఇమేజ్ ఎడిటర్ ఫీచర్ ప్రాథమిక కోడ్‌ను అందుబాటులోకి తేవచ్చు. బేటా ప్రోగ్రామ్‌లో భాగస్వాములైన టెస్టర్లనే తొలుత దీనిని వాడేందుకు అనుమతిస్తారు. సెర్చ్ బార్లో టైప్‌చేసి నేరుగా ఏఐ సర్వీస్‌తోనే చాటింగ్ చేసి కావాల్సిన ఫలితాలు పొందే ఫీచర్‌పైనా వాట్సాప్ కసరత్తు చేస్తోంది. వాయిస్ నోట్ వచ్చే సందేశాలనూ ఓపెన్ చేయకుండానే టెక్ట్స్ రూపంలో చదవగలిగేలా మరో ఫీచర్‌ను యూజర్లకు అందివ్వాలని వాట్సాప్ భావిస్తోంది. -
పార్లేజీ పాప మాయం! సర్ప్రైజ్ ఇచ్చిన బిస్కెట్ కంపెనీ
ప్రముఖ బిస్కెట్ల తయారీ కంపెనీ పార్లే గురించి మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆ కంపెనీ బిస్కెట్ ప్యాకెట్లపై ఉండే పాప బొమ్మ బాగా పాపులర్. అయితే పార్లేజీ కంపెనీ ఉన్నట్టుండి సర్ప్రైజ్ ఇచ్చింది. తమ పార్లే జీ బిస్కెట్ ప్యాకెట్ కవర్‌పై పాప బొమ్మను మార్చేసింది. ఆ స్థానంలో ఓ ఇన్ఫ్లుయన్సర్ ఫొటోను తీసుకొచ్చింది. అయితే పార్లేజీ ఇదంతా చేసింది ఇన్స్టాగ్రామ్ పేజీలో. జెరాన్ జే బున్‌షా అనే ఇన్ఫ్లుయన్సర్ పోస్ట్ చేసిన ఓ వైరల్ వీడియోకు స్పందనగా పార్లేజీ.. తమ బిస్కెట్ ప్యాకెట్‌పై ఆయన ఫొటో ఉన్నట్లు రూపొందించి షేర్ చేసింది. తాజాగా జెరాన్ జే బున్‌షా పార్లేజీపై తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. ‘ఒక వేళ మీరు పార్లే ఓనర్‌ను కలిస్తే ఏమని పిలుస్తారు.. పార్లే సర్, మిస్టర్ పార్లే అనా లేక పార్లే జీ అనా?’ అంటూ అయోమయంలో ఉన్నట్లు వీడియో రూపొందించి షేర్ చేశారు. ఈ వీడియో వైరల్‌గా మారింది. అధిక సంఖ్యలో వ్యూవ్స్, కామెంట్లు వచ్చాయి. చివరికి పార్లే కంపెనీ కూడా స్పందించింది. బిస్కెట్ ప్యాకెట్‌పై ఆ ఇన్ఫ్లుయన్సర్ ఫొటోను వేసినట్లుగా చిత్రాన్ని రూపొందించి తమ ఇన్‌స్టా పేజీలో పోస్ట్ చేసింది. View this post on Instagram A post shared by Parle-G (@officialparleg) -
మరోసారి పేరు మార్చుదామంటారా సార్..!
మరోసారి కూటమి పేరు మార్చుదామంటారా సార్..! -
ఏఐ అద్భుత చిత్రం.. చీకట్లో ల్యాండర్ ఇలాగే ఉంటుందా?
చంద్రుని దక్షిణ ధ్రువంలో అడుగుపెట్టి భారత దేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పిన 'చంద్రయాన్-3' గురించి దాదాపు అందరికి తెలిసిందే. ప్రారంభంలో అక్కడి సమాచారాన్ని చాలావరకు భూమిపైకి పంపిన ల్యాండర్, రోవర్ రెండూ కూడా ప్రస్తుతం స్లీపింగ్ మోడ్‌లో ఉన్నాయి. ఈ సమయంలో ఇవి అక్కడ ఎలా ఉంటాయనే సన్నివేశం ఊహించడానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించారు. ఏఐ ఊహాజనిత ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నిజానికి ప్రస్తుతం చంద్రుని మీద చీకటి ఉన్న కారణంగా అవి నిద్రలోకి జారుకున్నాయి. చంద్రుడి సూర్యుని చుట్టూ తిరగటానికి పట్టె సమయం 28 రోజులు, కావున అక్కడ 14 రోజులు చీకటి, మరో 14 రోజులు వెలుతురు ఉంటుంది. ఇదీ చదవండి: నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు! ఏఐ ఫోటోలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అక్కడి పరిసరాలు మొత్తం గ్రీన్ కలర్లో.. దాని మధ్యలో ల్యాండర్ ఉండటం ఇక్కడ గమనించవచ్చు. ప్రస్తుతం చంద్రుని మీద ఉష్ణోగ్రతలు చాలా తక్కువగా గడ్డకట్టేంత ఉంటాయని, ఇలాంటికివన్నీ రోవర్ తట్టుకోగలదా అనేది ప్రశ్నార్థకం. అయితే ఈ నెల 22న పగటి సమయం మొదలవుతుంది. అన్నీ సవ్యంగా జరిగితే ల్యాండర్ అండ్ రోవర్ మళ్ళీ పరిశోధనలు మొదలుపెడతాయి. AI imagines Chandrayaan-3's Vikram lander during cold night on the Moon..#Chandrayaan3 #Moon #AI #ISRO pic.twitter.com/lQow6B72s4 — Muskmelon (@gova3555) September 12, 2023 -
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని చంద్రుని ఉపరితలం..
బెంగళూరు: చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. రోవర్ ప్రగ్యాన్ ఇప్పటికే బయటకు వచ్చింది. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఇస్రో తెలిపింది. అన్ని ప్రక్రియలు అనుకున్న ప్రకారమే షెడ్యూల్లో పూర్తి అయ్యాయని స్పష్టం చేసింది. రోవర్ కదలికలు ప్రారంభమయ్యాయని తెలిపింది. అయితే.. విక్రమ్ ల్యాండర్ చంద్రునిపై దిగేప్పుడు చివరి క్షణంలో తీసిన జాబిల్లి వీడియోను షేర్ చేసింది. Chandrayaan-3 Mission: All activities are on schedule. All systems are normal. 🔸Lander Module payloads ILSA, RAMBHA and ChaSTE are turned ON today. 🔸Rover mobility operations have commenced. 🔸SHAPE payload on the Propulsion Module was turned ON on Sunday. — ISRO (@isro) August 24, 2023 దక్షిణ ధృవంపైనే ఎందుకు..? చంద్రయాన్ 3 దిగ్విజయంగా జాబిల్లిపై కాలు మోపింది. నాలుగేళ్ల ఇస్రో కష్టానికి ఫలితం దక్కింది. బుధవారం సాయంత్రం 6.04 గంటలకు విక్రమ్ ల్యాండర్ అజేయంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది. ప్రపంచ చరిత్రలో చంద్రుని దక్షిణ ధృవానికి చేరిన మొదటి దేశంగా భారత్ నిలిచింది. అయితే.. దక్షిణ ధృవాన్ని ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నపై ఇస్రో చీఫ్ సోమనాథ్ సమాధానమిచ్చారు. 'చంద్రుని దక్షిణ ధృవంపై సూర్మరశ్మి పడే అవకాశాలు లేవు. నీరు, ఖనిజాలకు సంబంధించిన వివరాలు లభించే ఛాన్స్ ఉంది. అంతేకాకుండా చంద్రుని నివాసానికి సంబంధించిన వివరాలు కూడా దక్షిణ ధృవం వద్ద లభిస్తాయి. అందుకే ఈ ధృవం వైపే అందరి దృష్టి ఉంది. ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడానికి పలు దేశాలు ప్రయత్నించాయి' అని తెలిపారు. 'చంద్రయాన్ 2 ప్రయత్నంలో విఫలమైన తర్వాత మరో ప్రయోగానికి సిద్ధమయ్యాం. ఓ ఏడాది చంద్రయాన్ 2లో జరిగిన తప్పిదాలపైనే అధ్యయనం చేశాం. మరో ఏడాది ఆ తప్పులను సరిచేయడంపైనే పనిచేశాం. మరో ఏడాది వాటిని పరీక్షించి చూసుకున్నాం. చివరగా నాలుగేళ్లకు చంద్రయాన్ 3ని ప్రయోగించాం.' అని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ తెలిపారు. చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతమైంది. విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై ల్యాండ్ అయింది. ఇప్పటికే ప్రగ్యాన్ రోవర్ బయటకు వచ్చింది. మరో 14 రోజులపాటు చంద్రునిపై పనిచేయనుంది. ఇదీ చదవండి: జాబిల్లిపై మూడు సింహాల అడుగులు.. రోవర్‌కు సారనాథ్ అశోక చిహ్నం.. -
4 వేల ఏళ్ల నాటి ఎద్దు చిత్రం
సాక్షి, హైదరాబాద్/అడ్డాకుల: దాదాపు నాలుగు వందల అడుగుల ఎత్తులోని ఓ గుట్ట చిటారు గుండుపై రాయితో చెక్కిన ఎద్దు బొమ్మ ఇది. 4 వేల ఏళ్ల క్రితంనాటి చిత్రమిది. మహబూబ్‌నగర్‌కు చేరువలో ఉన్న మూసాపేట శివారులోని రామస్వామి గుట్టపైనున్న ఈ బొమ్మను ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి గుర్తించారు. స్థానిక రామలింగేశ్వరస్వామి దేవాలయ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్ తయారు చేసే పనిలో భాగంగా ఆదివారం ఆయన స్థానికులతో కలిసి వెళ్లారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న 400 అడుగుల ఎత్తున్న గుట్ట పైభాగానికి చేరుకోగా, అక్కడున్న గుండుపై ఈ చిత్రం కనిపించింది. 10 సెం.మీ. పొడవు, 8 సెం.మీ.ఎత్తుతో ఉన్న ఈ బొమ్మ దిగువన మరికొన్ని జంతువులు, మనుషుల చిత్రాలు కూడా ఉన్నాయి. వాతావరణ ప్రభావానికి గురై అవి కొంతమేర మసకబారిపోయాయని ఆయన తెలిపారు. గుట్టపై నాటి మానవుల్లో ఓ సమూహం నివాసంగా ఉండి ఉంటుందని, ఆ క్రమంలోనే నిత్యం కలిసి ఉండే పశువులను చూసి ఈ చిత్రాలు చిత్రించి ఉంటారని పేర్కొన్నారు. -
ఇదేమిటో తెలుసా? 90ల నాటి పిల్లలైతే ఇట్టే చెప్పేస్తారు!
మీరు 90లలో పుట్టారా? మీ సమాధానం ‘అవును’ అయితే పైన కనిపించే ఫొటోను చూస్తే మీ బాల్యం తప్పకుండా గుర్తుకువస్తుంది. ఆ సమయంలో ఈ వస్తువును ప్రతీ ఇంటిలోనూ వినియోగించేవారు. ఆ రోజుల్లో ఇంటింటా కిరోసిన్ వాసన వచ్చేది. వంటవండేందుకు కిరోసిన్ స్టవ్‌తో తంటాలు పడేవారు. మీరు కొంచెం లోతుగా ఆలోచిస్తే ఇదేమిటో ఇట్టే చెప్పేస్తారు. అయితే మీరు దీనిని మరచిపోయి ఉంటే ఇప్పుడు ఆ వివరాలు తెలుసుకుందాం. ఇప్పటికైనా ఇదేమిటో మీకు తెలిసిందా? ఈ వస్తువును ప్రిమస్ పిన్ అని అంటారు. సాధారణంగా దీనిని పిన్ అనే అని పిలుస్తుంటారు. ఈ పిన్ను ఆనాటి రోజుల్లో కిరోసిన్ స్టవ్‌ను శుభ్రపరిచేందుకు వినియోగించేవారు. స్టవ్ బర్నర్ మూసుకుపోయినప్పుడు ఈ పిన్సాయంతో స్టవ్ బర్నర్‌ను శుభ్రం చేసేవారు. ఫలితంగా స్టవ్ పూర్తి ఫ్లేమ్‌తో మండేది. ఈ పిన్ను వినియోగించి స్టవ్‌ను శుభ్రం చేసినప్పుడు కిరోసిన్ బర్నర్ వరకూ చేరుకునేది. నాటి రోజుల్లో అధికశాతం ఇళ్లలో కిరోసిన్ స్టవ్ మాత్రమే ఉన్నకారణంగా, ఈ పిన్ ప్రతీ కిరాణా దుకాణంలో దొరికేది. How many of you know what this is ????? pic.twitter.com/9bzsy15kU5 — Hasna Zaroori Hai 🇮🇳 (@HasnaZarooriHai) June 26, 2023 ‘బాల్యం గుర్తుకు వచ్చింది’ ఈ ఫొటోను ట్విట్టర్లో @HasnaZarooriHai పేరుతో ఉన్న పేజీలో షేర్ చేశారు. ఈ ఫొటోతో పాటు దీనిని ఏమంటారో తెలుసా? అనే ప్రశ్న కూడా అడిగారు. దీనికి చాలామంది సమాధానం రాశారు. కొందరు దీనికి సరైన సమాధానం రాయగా, మరికొందరు తాము జీవితంలో ఇలాంటి వస్తువును చూడలేదని పేర్కొన్నారు. అయితే పలువురు దీనిని చూడగానే తమకు బాల్యం గుర్తుకువచ్చిందంటూ తమ అనుభవాలను షేర్ చేశారు. ఇప్పటి వరకూ ఈ పోస్టుకు 22 లక్షల వీక్షణలు దక్కాయి. 5 వేల మంది దీనిని లైక్ చేశారు. ఇది కూడా చదవండి: ఒకే వేదికపై రెండు పెళ్లిళ్లు.. సంబరపడిన బంధువులకు సడెన్ షాక్! -
ఈ చిత్రంలో దాగున్న చిన్నారిని గుర్తుపట్టగలరా?
ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో నీలి ఆకాశంలో రాతిబండలు కనిపిస్తున్నాయి. కాని దానిలో రెండు గోధుమ రాళ్ల మధ్య ఓ చిన్నారి దాక్కుంది. అది కూడా పర్పుల్ కలర్(ఊదారంగు) టాప్ ధరించి రెండు చేతులు పైకి ఎత్తి ఉన్నట్లు కనిపిస్తుంది. చాలా ఓపికతో కనిపెటండి. మొదట చూస్తున్నప్పుడూ కాస్త గందరగోళం కనిపించిన కొద్ది సేపటి తర్వాత ఆ ఇమేజ్ స్పష్టంగా కనిపిస్తుంది. ట్రై చేయండి. ఈ చిత్రానికి వేల వ్యూస్, లైక్‌లు వచ్చాయి. మీరు కూడా తెలివిగా ట్రై చేసి కనుక్కొండి. లేదంటే కింద క్లియర్‌గా కనిపించే ఇమేజ్‌లో చూడండి మీకే తెలుస్తుంది ఆ చిన్నారి ఎక్కడ ఉన్నది. (చదవండి: స్కూల్ నిర్మించడం కోసం ఆ రైతు ఏం చేశాడంటే..) -
ప్రధాని ఇమేజ్‌ని డ్యామేజ్ చేయటం అంత ఈజీ కాదు!
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై లోక్‌సభ అనర్హత వేటు పడిన నేపథ్యంలో అనుహ్యంగా విపక్షాలన్నీ ఏకమై నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ రాహుల్‌పై వాగ్దాడిని పెంచింది. ఈ క్రమంలోనే కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాహుల్‌పై విరుచుకపడ్డారు. రాహుల్ ప్రధాని నరేంద్ర మోదీ ఇమేజ్‌ని డ్యామేజ్ చేసేందుకు యత్నించారని ఆరోపించారు. అయితే అది అంత ఈజీ కాదని, ఎందుకంటే మోదీ బలం భారతదేశ ప్రజలేనని నొక్కి చెప్పారు. ఆయన 2019లో ఒక పత్రిక ఇంటర్యూలో మోదీకి బలం తన ఇమేజేనని దాన్ని దెబ్బతీస్తానని చెప్పారన్నారు. దీంతో రాహుల్‌లో దాగి ఉన్న పొలిటకల్ సైకో బహిర్గతమైందని విమర్శించారు. అలాగే మోదీని పార్లమెంట్లో దుర్భాషలాడి, నిందించాడే తప్ప తన ధోరణి సరైనదేనా అని ఒక్కసారి కూడా ఆత్మపరిశీలన చేసుకోలేపోయడన్నారు. తను అనుకున్నది జరగకపోవడంతో రాజకీయంగా నిరాశ చెంది ఇలా మోదీపై విరుచకుపడుతున్నారని అన్నారు. అలాగే మంత్రి స్మృతి ఇరానీ.. రాహుల్ పరువు నష్టం కేసులో దోషిగా తేలి శిక్ష పడటం గురించి ప్రస్తావిస్తూ.. మన దేశంలోని ఓబీసీ వర్గాన్ని క్షమించమని చెప్పే ఔదార్యాన్ని పెంపొందించు కోలేకపోయారన్నారు. ఇది గాంధీ కుటుంబాల దురహంకారానికి నిలువెత్తు నిదర్శంన అని మండిపడ్డారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. (చదవండి: ‘రాహుల్ గాంధీ’ వ్యవహారంపై స్పందించిన అమెరికా) -
బీజేపీ పవర్ ప్లే..ఎలా పట్టు సాధించింది ?
భారతీయ జనతా పార్టీ దేశాన్ని చుట్టేస్తోంది. ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రధాని మోదీ ఇమేజ్‌ని పెట్టుబడిగా పెట్టి, డబుల్ ఇంజిన్ నినాదంతో రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ రాష్ట్రాల్లో గురువారం వెలువడిన ఎన్నికల ఫలితాలు కమలం దళంలో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అభివృద్ధి, శాంతి స్థాపన లక్ష్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎన్నికల్ని ఎదుర్కొని, అధికార వ్యతిరేకతను ఎదురొడ్డి త్రిపుర, నాగాలాండ్‌లో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా ఒకప్పటి మిత్రపక్షం కాన్రాడ్ సంగ్మాకు చెందిన నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ)కి మద్దతు ఇచ్చి అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూడు రాష్ట్రాల్లోనూ అధికారంలోకి రావడం ద్వారా 2024లో జరగనున్న లోక్ సభ ఎన్నికలకు బలమైన పునాదులు వేసుకుంటోంది. ఎలా పట్టు సాధించింది ? ఈశాన్య రాష్ట్రాల్లో అసోం, త్రిపురలో హిందూ జనాభా ఎక్కువ. మిగి లిన రాష్ట్రాల్లో గిరిజనులు, క్రిస్టియన్లదే పట్టు. ఆయా రాష్ట్రాల్లో అత్యధికులు బీఫ్ తింటారు. ఇంగ్లిష్ మాట్లాడతారు. దీంతో ఇతర పార్టీలు బీజేపీ హిందూత్వ, హిందీ ఎజెండాను పదే పదే ఎత్తి చూపుతూ కాషాయ దళాన్ని ఇరుకున పెట్టాలని చూశాయి. అయినప్పటికీ ఈశాన్యంలో కాషాయ జెండా రెపరెపలాడింది. త్రిపుర లో శాంతి స్థాపన, అభివృద్ధికే బీజేపీ మొదట నుంచి ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది. మౌలిక సదుపాయాలు, హైవేల నిర్మాణం, సురక్షిత మంచి నీరు, ఉచిత రేషన్ , విద్యుత్ సౌకర్యం వంటివన్నీ బీజేపీ వైపు ప్రజలు మొగ్గు చూపడానికి కారణాలే. ఎన్నికలకు కాస్త ముందు ప్రభుత్వ ఉద్యోగులకు 12% డీఏ ప్రకటించి వారిని తమ వైపు తిప్పుకుంది. కేంద్రంలో అధికారంలో ఉండడంతో నాగాలాండ్‌లో కూడా శాంతి చర్చలు చేసి వారి సమస్య పరిష్కారానికి హా మీలు ఇచ్చింది. ఎన్డీపీపీతో పొత్తుతో అధికారా న్ని మళ్లీ నిలబెట్టుకుంది. కొద్ది రోజుల క్రితం మేఘాలయ బీజేపీ చీఫ్ ఎర్నెస్ట్ మావ్రీ బీఫ్ తినడం రాష్ట్ర ప్రజల జీవనశైలిలో ఒక భాగమంటూ వ్యాఖ్యానించి ఈశాన్య రాష్ట్రాల్లో బీఫ్ తినడాన్ని బీజేపీ అడ్డుకోదన్న సందేశాన్ని ఇచ్చారు. మైనార్టీ వ్యతిరేక పార్టీ అని విపక్షాలు ప్రచారం చేసినప్పటికీ నాగాలాండ్‌లో 15% నుంచి 19 శాతానికి ఓటు షేర్‌ను పెంచుకోగలిగింది. మేఘాలయలో 9% ఓట్లను రాబట్టింది. నాగాలో శాంతి మంత్రం.. నాగాలాండ్‌లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు ఉద్యమం చేస్తున్న నాగాలతో శాంతి చర్చలు జరుపుతూ వారి సమస్యను పరిష్కరిస్తామని నచ్చజెప్పడంలో బీజేపీ విజయం సాధించింది. మరోవైపు కాంగ్రెస్, నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) పరిమితమైన సీట్లలో పోటీ చేశాయి. 60 అసెంబ్లీ స్థానాల్లో ఎన్పీఎఫ్ 22 స్థానాల్లో పోటీ చేస్తే, కాంగ్రెస్ 23 స్థానాల్లో పోటీకే పరిమితమైంది. నాగా సమస్యని ఎన్డీపీపీతో కలిసి సమష్టిగా పరిష్కరిస్తామని బీజేపీ ఇచ్చిన హామీలు తిరిగి ఆ కూటమి అధికారాన్ని నిలబెట్టుకునేలా చేశాయి. పక్కా వ్యూహంతో సీఎంల మార్పు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎన్నికల జరగడానికి ఏడాది ముందు ముఖ్యమంత్రుల్ని హఠాత్తుగా మార్చి పరిస్థితుల్ని అనుకూలంగా మార్చుకునే వ్యూహంలో బీజేపీ విజయం సాధిస్తోంది. త్రిపురలో కాంగ్రెస్–లెఫ్ట్ కూటమి, తిప్రా మోథాలను దీటుగా ఎదుర్కొని అధికార వ్యతిరేకతను ఎదు రొడ్డడానికి ముఖ్య కారణం నాలుగేళ్ల పాటు సీఎంగా ఉన్న విప్లవ్‌దేవ్‌ను పది నెలల క్రితం మార్చడమే. ఆయన స్థానంలో మిస్టర్ క్లీన్‌గా పేరున్న మాణిక్ సాహాను సీఎంను చేయడంతో అధికార వ్యతిరేకత తుడిచిపెట్టుకుపోయింది. గతంలో ఉత్తరాఖండ్‌లో ఇద్దరు సీఎంలను, గుజరాత్లో సీఎంను మార్చి నెగ్గింది. హిమాచల్‌లోనూ సీఎంను మార్చాలని ఎన్నో గళాలు వినిపించినా జైరామ్ ఠాకూర్‌నే కొనసాగించి ఈ ఏడాది మొదట్లో జరిగిన ఎన్నికల్లో ఓటమిపాలైంది. చిన్న నియోజకవర్గాలున్న త్రిపురలో అభివృద్ధిని చేసి చూపించడంతో పాటు సీఎంను మార్చడం కూడా బీజేపీకి కలిసివచ్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ ఈశాన్య రాష్ట్రాలపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుండటం కూడా ఒక కారణం. అసోం నుంచి త్రిపుర వరకు ► 2016లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ అసోం అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించి కాంగ్రెస్ 15 ఏళ్ల పరిపాలనకు తెర దించింది. ► 2017లో మణిపూర్‌లో బీజేపీ విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ మాజీ సభ్యుడు ఎన్. బైరాన్ సింగ్ ముఖ్యమంత్రి అయ్యారు. ► 2018లో త్రిపుర ఎన్నికల్లో బీజేపీ 25ఏళ్ల లెఫ్ట్ పాలనకు తెరదించి అధికారంలోకి వచ్చింది ► అదే ఏడాది బీజేపీ మేఘాలయ, నాగాలాండ్‌లలో ప్రాంతీయ పార్టీలతో చేతులు కలిపి అధికారంలోకి వచ్చింది. ► 2019లో అరుణాచల్ ప్రదేశ్‌లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 41 స్థానాలను కైవశం చేసుకొని విజయ ఢంకా మోగించింది. ► 2021లో అసోంలో మళ్లీ అధికారాన్ని కాపాడుకుంది. ► 2022లో బీజేపీ మణిపూర్‌లో కూడా తిరిగి అధికారంలోకి వచ్చింది. ► 2023లో త్రిపుర, నాగాలాండ్‌లలో అధికారాన్ని నిలబెట్టుకుంది. మేఘాలయలో కూడా అధికారంలో భాగస్వామ్యం కావడానికి ప్రయత్నాలు మొదలు పెట్టింది. వాజ్‌పేయి హయాంలోనే అభివృద్ధికి బీజం ► 2016లో అసోంతో మొదలైన బీజేపీ జైత్రయాత్ర 2023 వచ్చినా ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కోసం వాజ్‌పేయి హయాంలో తొలి బీజం పడింది. కేంద్రంలో మంత్రులతో కమిటీని కూడా ఏర్పాటు చేసి కొత్త ప్రాజెక్టులకు రూప కల్పన చేశారు. అప్పుడు మొదలైన అభివృద్ధి పథం 2014లో నరేంద్ర మోదీ ప్రధాని మంత్రి అయ్యాక పరుగులు తీసింది. అభివృద్ధి కంటికి కనిపించేలా సాగింది.ప్రజల్లో మంచి పట్టు ఉన్న కాంగ్రెస్ నాయకుడు హిమాంత బిశ్వ శర్మ 2015లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రావడంతో ఈశాన్య రాష్ట్రాల్లో కమలదళానికి పట్టు పెరిగింది. ప్రస్తుతం అసోం ముఖ్యమంత్రి అయిన శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటైన నార్త్ ఈస్ట్ డెమొక్రాటిక్ అలయెన్స్(ఎన్‌డీపీఏ)తో కాంగ్రెస్‌ను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలన్నీ జత కట్టాయి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నుంచే బిశ్వ శర్మ మూడు రాష్ట్రాల్లోనూ విస్తృతంగా పర్యటిస్తూ తమకు అనుకూలంగా ఉండే చిన్న పార్టీలను ఎన్‌డీపీఏ గూటికి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. డబుల్ ఇంజిన్ నినాదంతో బీజేపీ తనకు అనుకూలంగా ఉండే ప్రాంతీయ పార్టీలను కలుపుకొని పోతూ ఒక్కో రాష్ట్రంలో అధికారాన్ని కొల్లగొడుతూ వచ్చింది. ఎన్. బైరాన్ సింగ్, ప్రేమ ఖాండూ వంటి నాయకులు కాంగ్రెస్‌ను వీడడంతో ఆ పార్టీ ఉనికి కూడా కోల్పోసాగింది. ఎన్‌డీపీఏ కంటే ముందే ఆరెస్సెస్ ఈశాన్య రాష్ట్రాల్లోని గిరిజన తండాల్లో పని చేస్తూ పట్టు పెంచుకోవడం బీజేపీకి కలిసి వచ్చింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇదీ భారత్ గ్లోబల్ ఇమేజ్ అంటూ ఆనంద్ మహింద్రా ట్వీట్
-
ఇది మోదీ ఆలోచన కాదు! ఫ్రెంచ్ నటి కీలక వ్యాఖ్యలు
ఫ్రెంచ్ నటి ప్రధాని మోదీపై కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు 75 ఏళ్ల మరియన్ బోర్గ్ ఆస్తి వివాదం కారణంగా గోవాలోని తన ఇంట్లోనే తాను బంధీగా ఉన్నాని వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రెండ్లీ టూరిజం కోసం పర్యాటకాన్ని ఎంతగానో అభివృద్ధి చేసనప్పటికీ తాను చాలా నిరాశ చెందానని చెప్పుకొచ్చారు. గోవాలోని బీచ్ టౌన్లో కలాంగుట్లో ఉన్న తన బంగ్లాను వదలి వెళ్లిపోయినట్లు చెప్పారు. తన ఆస్తిని లాక్కుకుని కొందరూ వ్యక్తులు.. ఆ ఇంటికి విద్యుత్, నీళ్లు రాకుండా చేసి వేధించారని చెప్పారు. తాను స్నానం చేయకుండా ఉండలేని కారణంగా ఆ ఇంటిన ఖాళీ చేసి వెళ్లిపోయినట్లు తెలిపారు. అదీగాక ప్రస్తుత పరిస్థితులు కారణంగా తన ఆరోగ్యం క్షీణిస్తోందని బోర్గో అన్నారు. మోదీ సానుకూల స్నేహపూర్వక పర్యాటక ఇమేజ్ కోసం చాలా శ్రమిస్తున్నారు. బహుశా ఇది మోదీ ఆలోచన కాకపోవచ్చు కానీ ఇటీవల జరిగిన సంఘటనలు నన్ను ఎంతగానో నిరాశపరిచాయి. ఆయన సాధించిన విజయాలు గోవా రాష్ట్ర స్థాయికి చేరుకోక పోవడం బాధకరం అన్నారు. వాస్తవానికి ఫ్రెంచ్ నటి బోర్గో ఫ్రాన్సిస్కో సౌసా అనే న్యాయవాది నుంచి 2008లో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. ఐతే కోవిడ్ మహమ్మారి సమయంలో అతడు మరణించడం పరిస్థితులన్ని ఒక్కసారిగా తలకిందులు అయిపోయాయని ఆవేదనగా చెప్పుకొచ్చారు. గోవా స్థానిక పోలీసుల ఈ కేసు కోర్టులో నడుస్తున్నందున తాము జోక్యం చేసుకోలేమని చెబుతున్నారు. నేషనల్ డి'ఆర్టే డ్రామాటిక్ (నేషనల్ అకాడమీ ఆఫ్ డ్రమాటిక్ ఆర్ట్స్)లో శిక్షణ పొందిన బోర్గో యూరప్, భారతదేశ అంతటా చలనచిత్రాలు, టెలివిజన్, థియేటర్లలో విస్తృతంగా పనిచేశారు. ఆమె ఫ్రెంచ్ థ్రిల్లర్ సిరీస్ “ప్రొఫైలేజ్”లో ప్రముఖ పాత్రను పోషించారు. అలాగే ఇటీవల భారతీయ నిర్మాణంలో “డానీ గోస్ ఓమ్”కి కూడా దర్శకత్వం వహించింది బోర్గ్. (చదవండి: బాల్య వివాహాలపై ఉక్కుపాదం..ఏకంగా 18 వందల మంది అరెస్టు!) -
Photo Feature: ప్రకృతి గీసిన చిత్రం
ప్రకృతి.. మనల్ని ఎన్ని రకాల సొబగులతో మురిపిస్తుందో కదా! కొండలు.. గుట్టలు.. లోయలు.. సముద్రం.. నదులు.. చెట్లు.. కొమ్మలు.. ఆకులు.. పూలు.. అసలు అందలేనిదేది? ఆకట్టుకోనిదేది? కవుల వర్ణనలో కనిపించే అందాలకు నెలవు మన విశాఖ. చదవండి: వీటిని ఎక్కువ కాలం వాడుతున్నారా.. అయితే డేంజర్లో పడ్డట్టే! ఇది పర్యాటకుల స్వర్గధామం. ఆహ్లాదపరిచే పర్యావరణం.. పచ్చని అందాలతో అలరారే జీవ వైవిధ్యం.. సహజ అందాల సాగరతీరం.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో అందాలు.. మరెన్నో అనుభూతులు.. అలాంటి దృశ్యమే ఇది. ఆకుపచ్చగా గడ్డి.. మబ్బులు కమ్మిన ఆకాశం.. అల్లంతదూరంలో సముద్రం.. నిర్మాణంలో ఉన్న పడవ.. ఆహా ఏం అందం.! ప్రకృతి గీసిన ఈ చిత్రం.. కోస్టల్ బ్యాటరీ వద్ద ఆదివారం సాయం సంధ్య వేళలో ఆవిష్కృతమైంది. -ఫొటో: సాక్షి ఫొటోగ్రాఫర్, విశాఖపట్నం -
హీరో కార్తికేయ ‘రాజా విక్రమార్క’ మూవీ స్టిల్స్
-
రిషబ్ బర్త్ డే.. ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్న ఫోటోలు
-
సోషల్ డిస్టెన్స్ అంటే ఇలా కాదురా అబ్బాయిలు!
న్యూఢిల్లీ: ఆనంద్ మహీంద్ర.. పరిచయం అక్కర్లేని పేరు. దేశీ ఆటోమొబైల్ రంగంలో తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న వ్యాపార దిగ్గజం. ఆయన ఇతర వ్యాపార ప్రముఖుల కంటే భిన్నంగా ఆలోచిస్తూ ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తుంటారు. అందుకు తగ్గట్లు సమయం, సందర్భాన్ని బట్టి నెటిజన్లతో తన అభిప్రాయాల్ని పంచుకుంటుంటారు. అభిప్రాయల్ని పంచుకోవడమే కాదు ఆపన్న హస్తం అందించేందుకు ఎప్పుడూ ముందుంటారు. అయితే దేశంలో కరోనా సెకండ్ వేవ్ వణికిస్తోంది. ఈ నేపథ్యంలో సామాన్యుడి నుంచి సెలబ్రిటీల వరకు కరోనా నిబంధల్ని పాటించాలని ప్రచారం చేస్తున్నారు. బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో శానిటైజర్లను వినియోగించడం, మాస్క్‌లు ధరించడం, సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. తాజాగా కరోనా పరిస్థితులకు ఆపాదిస్తూ 2017 నాటి ఓ ఫోటోను ఆనంద్ మహీంద్ర షేర్ చేశారు. ఆ ఫోటోలో ఇద్దరు ద్విచక్ర వాహన దారులు నిచ్చెన రెండు చివర్లలో తలల్ని దూర్చి దాన్ని తరలిస్తున్నారు. ఆఫోటోను నెటిజన్లతో పంచుకున్న ఆనంద్ మహీంద్ర .. 'ఈ ఫోటో నవ్వుతెప్పిస్తుంది. సామాజిక దూరం అంటే ఇలా ప్రమాదకరమైన స్టంట్లు కాదు. ఇలాంటి అనుకోని ప్రమాదాల్ని తెచ్చి పెడుతుంటాయి జాగ్రత్త’ అంటూ పోస్ట్ లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన పోస్టు నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. కాగా, దేశవ్యాప్తంగా ఆక్సిజన్ సిలిండర్ల కొరత తీవ్రంగా వేధిస్తున్నా సంగతి తెలిసిందే. సిలిండర్ల కొరతను అధిగమించేందుకు ఆనంద్ మహింద్రా తన వంతుగా పలు సేవా కార్యక్రమాల్ని ప్రారంభించారు. 'ఆక్సిజన్ వీల్స్' పేరుతో ప్రధాన నగరాలకు చెందిన 13 ఆస్పత్రులకు 61 జంబో సిలిండర్లను మహీంద్రా వాహనాల్లో తరలించే ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా విస్తరించాలనే యోచనలో ఉన్నట్లు ఆనంద్ మహీంద్ర ఇటీవల తెలిపారు. -
హైదరాబాద్‌లో ‘ఇమేజ్’ సెంటర్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గేమింగ్, వీఎఫ్ఎక్స్, కంప్యూటర్ విజన్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ రంగాల కోసం భారత్‌లో తొలి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ‘ఇమేజ్’ పేరుతో సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) దీనిని నెలకొల్పింది. ఈ రంగాల్లో మేధో సంపత్తిపై దృష్టిసారించిన కంపెనీలకు ఇది తొలి ఇంక్యు బేషన్ సెంటర్ కావడం విశేషం. ఎస్టీపీఐ ఫెసిలిటీలో 10,000 చదరపు అడుగుల్లో దీనిని ఏర్పాటు చేశారు. ఏటా 25–30 స్టార్టప్స్‌కు ఇక్కడ అవకాశం కల్పిస్తామని ఎస్టీపీఐ డీజీ ఓంకార్ రాయ్ తెలిపారు. అయిదేళ్ల కాలానికిగాను రూ.19.68 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా 28 ఎక్సలెన్స్ కేంద్రాలు ప్రారంభించాలని నిర్ణయించామని, ఇప్పటికే ఏడు అందుబాటులోకి వచ్చాయని, మిగిలిన 21 సెంటర్లు పలు దశల్లో ఉన్నాయని వివరించారు. ఇమేజ్ కేంద్రంలో చోటు కోసం మార్చి 31లోగా ఔత్సాహికులు దరఖాస్తు చేసుకోవాలి. ఎంపికైన దరఖాస్తుదారులకు రూ.5 లక్షల సీడ్ ఫండ్ ఇస్తారు. స్టార్టప్స్‌ను ప్రోత్సహించేందుకు తెలంగాణ వీఎఫ్ఎక్స్, యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్, హైదరాబాద్ ఏంజిల్స్, హైసియా, ఐఐఐటీ హైదరాబాద్, టై హైదరాబాద్‌తో ఇమేజ్ కేంద్రం అవగాహన ఒప్పందం చేసుకుంది. కాగా, ఎస్టీపీఐ నుంచి ఎగుమతులు 2018–19లో రూ.4,24,000 కోట్లు నమోదైంది. 2019–20లో 10 శాతం వృద్ధి ఆశిస్తున్నట్టు ఓంకార్ రాయ్ తెలిపారు. -
దారితెన్నులు
లక్షల మంది మహిళల పదఘట్టనలకు ఒకవేళ ట్రంప్ అదురుపాటుగా కిందపడినా, ఆయనతో పాటు పదవి దిగిపోయే సమస్యలు పోయేవి పోగా, మిగిలిన వాటిపై మహిళల మార్చ్ కొనసాగుతూనే ఉంటుందని వాళ్లు వచ్చిన దారి, వెళుతున్న తీరు చెబుతున్నాయి. మాధవ్ శింగరాజు స్త్రీని అదోలా చూసే పురుషుడి ఇమేజ్‌కి భూమ్మీద ఆట్టే నూకలు ఉండవు. అస్సలు సహించరు ఆడవాళ్లు. అయినప్పటికీ డొనాల్డ్ ట్రంప్ రెండేళ్లుగా చక్కగా టై కట్టుకుని ఓవల్ ఆఫీస్‌కి వచ్చి వెళుతూనే ఉన్నారు! మధ్యలో ఎవరైనా ఎదురు పడితే ‘హాయ్.. బేబ్’ అంటూనే ఉన్నారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసి రేపటికి రెండేళ్లు. 2017 జనవరి 20న ఆయన.. ‘ఐ డు సాలెమ్నీ స్వేర్ దట్ ఐ ఫెయిత్‌ఫుల్లీ..’ అని అంటుండగానే, అధ్యక్ష భవనం బయట అమెరికన్ మహిళామణులు ఆయన్ని గద్దె దింపడానికి ప్రతిజ్ఞ చేసి, మర్నాడే పెద్ద ర్యాలీ తీశారు. ఏడాది తర్వాత మళ్లీ 2018 జనవరిలో, ఏడాది తర్వాత మళ్లీ ఇప్పుడు.. ఇవాళ న్యూయార్క్‌లో, వాషింగ్టన్లో, ఇంకా చాలా చోట్ల, చాలా దేశాల్లో ‘ఉమెన్ మార్చ్ 2019’ నిర్వహిస్తున్నారు. వచ్చే ఏడాదీ చేస్తారు. ఆ పైయ్యొచ్చే ఏడాదీ చెయ్యొచ్చు.. ట్రంప్ ఇంకా సీట్లోనే ఉంటేనో, మరో టెర్మ్ ఉండబోతుంటేనో.ట్రంప్‌కు వ్యతిరేకంగా మొదలైన ఈ మహిళా మార్చ్‌లో క్రమంగా వేరే లక్ష్యాలు కూడా వచ్చి చేరాయి. మీటూ, సాధికారత, సమానత్వం, ఎల్జీబీటీ హక్కులు.. ఇలాంటివి. ఆత్మాభిమాన సమస్యలు కొన్ని.. బయట తిరిగే మగాళ్లకు అర్థం కావు. ఇంట్లో ఉండే ఆడవాళ్లకు అర్థం కాకుండా ఉండవు. చెప్పినా అర్థం చేసుకునే మగవాళ్లు, చెప్పనిచ్చే మగవాళ్లు తక్కువ కనుకే, ‘ట్రంప్’ అనే ఆడవాళ్ల ఆత్మాభిమాన సమస్య వైట్‌హౌస్‌లో కూర్చోగలిగింది. మహిళలపై ఆయన వెలిబుచ్చే అభిప్రాయాలు, వాళ్లపై తరచూ ఆయన వేస్తుండే జోకులు, అది చేస్తాను, ఇది చేస్తాను అని ఆయన పలికిన ‘పొలిటికల్లీ మిసాజనిస్ట్’ డాంబికాలు మగాళ్లకు నచ్చి ఆయనకు ఓటేశారేమో కానీ, ఆడవాళ్లకు నచ్చే ఫేస్ కాదు ట్రంప్‌ది. యు.ఎస్.లోకి ఎవర్నీ రానివ్వకపోవడం, గోడ కడతాననడం, వలస వచ్చిన తల్లుల నుంచి బిడ్డల్ని వేరు చెయ్యడం అసలే నచ్చేవి కావు. నచ్చకనే.. ఫ్రమ్ డే వన్ ఆయనకు వ్యతిరేకంగా ‘మార్చ్’ చేస్తున్నారు మహిళలు. అయితే రిడిక్యులస్ అంటున్నారు మగవాళ్లు ఈ మార్చ్‌ని! నవ్వి కొట్టిపారేసే విషయం అని ‘రిడిక్యులస్’ అంటే. అవును. ఇంట్లో బియ్యం లేకపోవడం మగవాళ్లకు రిడిక్యులస్. ఇరవై నాలుగు గంటలూ ఇంట్లోనే ఉండలేకపోతున్నానని ఆడవాళ్లు ఏడుపుముఖం పెట్టడం రిడిక్యులస్. ‘నేనూ ఓటేస్తా’ అనడం రిడిక్యులస్. ‘యుద్ధాల్లేకుండా దేశాలు ప్రశాంతంగా ఉండలేవా?’ అని అడగడం రిడిక్యులస్. అయితే చరిత్రలో ఇలా మగవాళ్లు రిడిక్యులస్ అనిన ప్రతి సందర్భంలోనూ మహిళలే ముందుకొచ్చి వందలు, వేలు, లక్షల్లో ‘మార్చ్’ చేశారు. మార్పు తెచ్చారు. 1789 ఫ్రెంచి విప్లవం మహిళల మార్చ్ నుంచే మొదలైంది! ప్యారిస్‌లో రొట్టె ముక్కల ధరలు ఆకాశంలో చుక్కలై కూర్చున్నాయి. ధనిక, పేద లేకుండా ప్రతి ఇల్లూ పస్తులతో ఎంగిలి పడుతోంది. పిల్లలు ‘అమ్మా.. ఆకలీ’ అని ఏడుస్తున్నారు. ‘కింగ్ పదహారవ లూయీ ఏమైనా చేయకపోతాడా’ అని మగవాళ్లంతా ఎదురుచూస్తున్నారు. ఎదురు చూస్తున్నారంతే. మగాళ్లూ ఏం చేయడం లేదు. రాజుగారూ ఏం చేయడం లేదు. చూసి, చూసి మహిళలే గడప బయటికి వచ్చారు. ఏడు వేల మంది కలిసి, ప్యారిస్‌కి పన్నెండు మైళ్ల దూరంలో రాజుగారి ప్యాలెస్‌కు ‘మార్చ్’ చేశారు. ‘కష్టం. ఖజానాలో డబ్బుల్లేవు’ అన్నారు రాజుగారు. ‘తమరసలు రాజుగారేనా?’ అన్నారు మహిళలు. హింస చెలరేగింది. మహిళల ఒంటిపై దెబ్బ పడింది. రాజ్యానికే చేటు. చెంపలు వేసుకుని ప్యాలెస్ నుంచి ప్యారిస్ వచ్చి కూర్చున్నారు రాజుగారు. మహిళా విజయం!యు.ఎస్.లో మహిళలకు ఓటు హక్కు కూడా మహిళల ‘మార్చ్’ వల్ల వచ్చిందే. 1913లో ఉడ్రో విల్సన్ అమెరికా అధ్యక్షుడి సీటులో సర్దుకుని కూర్చోబోతుండగా ఐదు వేల మంది మహిళలు శ్వేతసౌధానికి వెళ్లే మార్గంలో ధనాధన్మని మార్చింగ్ చేశారు. ‘మహాశయా బయటికి రండి’ అని నినదించారు. ఆయన రాలేదు. వీళ్లూ కదల్లేదు. చివరికి విల్సన్గారి వర్తమానం బయటికి వచ్చింది. ‘రాష్ట్రాలన్నిటితో మాట్లాడి అలాగే చేద్దాం’ అని. మహిళా విజయం! 1970లో న్యూయార్క్ సిటీలో యాభై వేల మంది మహిళలు సమానత్వం కోసం పెద్ద ‘మార్చ్’ జరిపారు. విద్యావకాశాల్లో సమానత్వం, ఉద్యోగావకాశాల్లో సమానత్వం, రాజకీయ అవకాశాల్లో సమానత్వం. ఓటు హక్కు పోరాటం తర్వాత మళ్లీ అంత పెద్ద మార్చ్ ఇదేనని ‘టైమ్’ మేగజీన్ వర్ణించింది. ఈ సమానత్వ పోరును మిగతా దేశాల్లోని మహిళలూ అందుకున్నారు. సమానత్వ చట్టాలు తెచ్చుకున్నారు. మహిళా విజయం! దేశాల మధ్య యుద్ధాలకు వ్యతిరేకంగా 1976లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన ‘పీస్ మార్చ్’లు మహిళలు ప్రారంభించినవే. ఉత్తర ఐర్లండ్‌లో ఇరవయ్యో శతాబ్దాంతపు అతి భయానక గెరిల్లా యుద్ధాన్ని ఆపింది మహిళలే! 2003లో లైబీరియా అంతర్యుద్ధాన్ని చర్చల బల్లల మీదికి తెచ్చి శాంతి శంఖం పూరించిందీ మహిళలే. పిల్లల్ని, పాలు తాగే పసికందుల్నీ వెంటేసుకుని మరీ మార్చ్ చేశారు!నేడు జరగబోతున్న ‘ఉమెన్స్ మార్చ్’లో ప్రపంచంలోని అన్ని దేశాల్లో కలుపుకుని అరవై లక్షల మంది మహిళలకు పైగా పాల్గొంటున్నారు. హిస్టారిక్ ఇది. స్త్రీజాతిని చులకనగా చూడ్డం ఒక్కటే డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న కంప్లయింట్ కాదు. డొనాల్డ్ ట్రంప్ ఒక్కరే ఇవాళ్టి హిస్టారిక్ మార్చ్‌కి కేంద్ర బిందువూ కాదు. ట్రంప్‌ను దింపేందుకు రెండేళ్ల క్రితం ప్రారంభమైన మహిళా మహోద్యమం.. ఒకవేళ ట్రంప్ దిగిపోయినా కూడా.. ప్రపంచంలోని అన్ని రకాల వివక్షల్ని, అసమానతల్ని చదును చేసేవరకు ఆగబోయేది లేదని ఇప్పటి వరకు జరిగిన చరిత్రాత్మక మహిళా ఉద్యమాల దారితెన్నులను బట్టి స్పష్టం అవుతోంది. -
వైఎస్ ఫొటో చూసి రామానుజయ ఉలికిపాటు
కలిదిండి (కైకలూరు) : ఓ లబ్ధిదారుడికి ప్రభు త్వ పథకం కింద అం దించిన ఆటోపై దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో చూసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ఒక్కసారిగా ఉలికిపడ్డారు. గురువారం మెగా గ్రౌండింగ్ మేళా జరిగింది. కలిదిండి బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ఆయా రుణాలతో పాటు వాహనాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖరెడ్డి ఫొటో ఉన్న ఆటో ఆయన వద్దకు వచ్చింది. దీంతో ఖంగుతిన్న ఆయన ఆ ఆటోను ప్రారంభించేందుకు నిరాకరించారు. ముందుగానే ఇలాంటివి గమనించాల్సిన అవసరం లేదా? అంటూ అధికారులపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అసలేం జరిగిందంటే.. గతంలోనే లబ్ధిదారుడు రుణ పథకం కింద ఆటో తీసుకున్నాడు. ఆ ఆటోను రామానుజయ చేతుల మీదుగా ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారుడు, ఆటోలో సినీనటుల ఫొటోల పక్కన చంద్రబాబు ఫొటో పెట్టి దానిపైన తన ఆరాధ్య దైవమైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ఉంచాడు. ఇది రామానుజయకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. -
పట్టు చీరపై పవన్ కల్యాణ్
అనంతపురం, హిందూపురం అర్బన్: అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని ముద్దిరెడ్డిపల్లిలో పట్టుచీరల తయారీదారుడైన ఆనంద్ తన అభిమాన హీరో పవన్‌కల్యాణ్ ముఖచిత్రం ముద్రతో చీరను తయారుచేసి అభిమానం చాటుకున్నాడు. పట్టుచీరల తయారీలో ఆధునిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో పవన్‌కల్యాణ్ గిటార్ వాయిస్తున్న చిత్రాన్ని చీరపై ముద్రించాడు. ఇందుకోసం సుమారు రూ.25వేలు ఖర్చయినట్లు ఆనంద్ తెలిపాడు. -
సొమ్మొకరిది.. సోకొకరిది
► కేంద్ర నిధులతో ఇచ్చిన ఇన్నోవా కార్లపై సీఎం చంద్రబాబు బొమ్మ ► ఆ బొమ్మను తొలగించిన లబ్ధిదారుల నుంచి కార్లు స్వాధీనం ► ఎస్సీ కార్పొరేషన్లో వింతపోకడ సాక్షి, అమరావతి బ్యూరో: సొమ్మొకరిది, సోకొకరిది అన్న చందంగా టీడీపీ ప్రభుత్వ వ్యవహారం ఉందనే విషయం మరోసారి వెల్లడైంది. దళిత సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన నిధులతో కొన్న వాహనాలపై సీఎం చంద్రబాబు బొమ్మ వేసి పంపిణీ చేస్తున్నారు. దళిత యువకులకు ఉపాధి చూపేందుకు కేంద్ర నిధులతో కార్లు పంపిణీ చేస్తుండగా ఆ ఘనతను తమ ఖాతాలో వేసుకునేందుకే ఇలా చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వంఇచ్చిన నిధులపై వీరి రుబాబు ఏమిటో అర్థం కావడం లేదంటూ పలువురు లబ్ధిదారులు వాపోతున్నారు. చంద్రబాబుపై స్వామి భక్తిని చాటుకునేందుకే జూపూడి ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని దళిత యువత మండిపడుతోంది. వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఎస్ఎఫ్డీసీ పథకం ద్వారా ఏటా దళిత సంక్షేమం కోసం నిధులు కేటాయిస్తుంది. ఆ పథకం ద్వారా గత ఏడాది రూ.120 కోట్లు కేటాయించగా... అందులో కొంత వెచ్చించి రాష్ట్రవ్యాప్తంగా దళిత యువతకు ఆర్థిక తోడ్పాటు అందించేందుకు కార్లను పంపిణీ చేశారు. వాటిపై సీఎం చంద్రబాబు బొమ్మను అంటించడంతో బాడుగకు తీసుకునేందుకు కొందరు ఇష్టపడక లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారు. దీంతో వారు సీఎం బొమ్మను తొలగించారు. దీనిని పెద్ద నేరంగా జూపూడి భావిస్తున్నారు. ఇటీవల నెల్లూరులో లబ్ధిదారులతో సమావేశమైన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్‌రావు ఇన్నోవా కార్లపై ఉన్న చంద్రబాబు ఫొటోను తొలగించిన 8 మంది లబ్ధిదారులపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు బొమ్మ ఉంచుకోవాలని, అది గర్వకారణమని పేర్కొన్నారు. ఆ బొమ్మలేకుండా తిరిగే వాహనాలను స్వాధీనం చేసుకుని వేరొకరికి పంపిణీ చేయాలని నెల్లూరు ఎస్సీ కార్పొరేషన్ ఈడీకి ఆదేశాలు ఇచ్చారు. ఈ ఆదేశాలు వివాదాస్పదంగా మారాయి. స్వామి భక్తిని చాటుకునేందుకు జూపూడి ఇలా వ్యవహరించారని దళిత యువత తప్పుపడుతోంది. కేంద్ర ని«ధులతో పంపిణీ చేసిన వాహనాలపై సీఎం బొమ్మ ఎలా అతికిస్తారని దళితులు ప్రశ్నిస్తున్నారు. మాజీ ఎంపీ తనయుడికి ఇన్నోవా .. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం తనయుడు రాజేష్‌కు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఇన్నోవా వాహనం పంపిణీ చేశారు. దళితుల్లో పేదలకు కేటాయించాల్సిన వాహనాలను అడ్డదారుల్లో నేతలే దక్కించుకుంటున్నారనేందుకు ఇది నిదర్శనం. పేద దళిత యువకుతకు సవాలక్ష నిబంధనలు వినిపించే అధికారులు మాజీ ఎంపీ తనయుడికి కారు పంపిణీ చేయడం విమర్శలకు తావిస్తోంది. వాహనాలకు ఇచ్చే సబ్సిడీలో కూడా టీడీపీ నేతలు వాటాలు పుచ్చుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. -
సంచలనం రేపుతున్న సుష్మ ఫోటో
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోదీ క్యాబినెట్ లో చురుకైన మంత్రిగా తనదైన పేరు గడించిన కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మ స్వరాజ్ ఒక అపురూపమైన ఫోటోను ట్విట్టర్ లో షేర్ చేశారు. బీజేపీ సీనియర్ నాయకురాలైన సుష్మ బుధవారం తమ వివాహ వార్షికోత్సవం సందర్భంగా పెళ్లినాటి ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా తమకు శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మరి ఈ సందర్భంగా మనం కూడా లెట్స్ విష్ దెమ్ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ .. కాగా సుష్మ భర్త, మాజీ ఎంపీ స్వరాజ్ కౌషల్ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా ఉన్నారు. ఆయన గతంలో మిజోరాం గవర్నర్ గా పనిచేశారు. 1998-2004 కాలంలో పార్లమెంటు సభ్యుడిగా ఉన్నారు. -
పొగాకు ఉత్పత్తులపై ‘85% హెచ్చరిక’ వద్దు
పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు హైదరాబాద్: పొగాకు ఉత్పత్తులపై 85% గ్రాఫిక్ ఆరోగ్య హెచ్చరికలు ఉండాలన్న నిబంధనను ఉపసంహరించాలని పాన్ షాప్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో పాన్‌షాప్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రంగరాజ్ శంకర్రావు, నేతలు సతీష్‌నాయక్, మహ్మద్ ఆఫ్జలుద్దీన్లు మాట్లాడుతూ ప్రపంచంలోనే పొగాకు అత్యధికంగా వినియోగించే యూఎస్ఏ, జపాన్, చైనా వంటి దేశాల్లో సున్నా ఛాయాచిత్ర హెచ్చరికలుంటే ఇండియాలో 85% ఉండాలన్న నిబంధన విధించడం ఎంతవరకు సబబమని ప్రశ్నించారు. వేలాది కుటుంబాలు పాన్‌షాప్‌ల ద్వారా జీవనం కొనసాగిస్తున్నాయని, అంతేగాక, తంబాకు అమ్మే వ్యాపారులు, రిటైలర్లు జీవనోపాధి పొందుతున్నారని, ఇలాంటి హెచ్చరికల ద్వారా వారి కుటుంబాలు రోడ్డున పడే అవకాశం ఉందన్నారు. -
మూతపడ్డ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లు
జపాన్ భూకంపం స్థానిక ఎలక్ట్రానిక్, ఆటో సంస్థలకు భారీగానే నష్టాలను తెచ్చిపెట్టింది. ఎలక్ట్రానిక్స్ దిగ్గజం సోనీ కార్పొరేషన్ తమ తయారీ కేంద్రాలను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వెల్లడించింది. జపాన్ లో వరుసగా సంభంవించిన భూకంపాల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉండటంతో సోనీ... తయారీ కేంద్రాలను మూసివేసింది. దక్షిణ ద్వీపప్రాంతం క్యుషు.. కుమామోటోలో నెలకొన్న సోనీ ప్రధాన ఉత్పత్తి కేంద్రానికి దగ్గరలో భూకంపం సంభవించడంతో తమ ప్లాంట్లలొ కలిగిన నష్టాన్ని అంచనా వేసే పనిలో పడింది. యాపిల్ ఇంక్ సహా అనేక స్మార్ట్ ఫోన్ల తయారీదారులకోసం ఉత్పత్తి చేసే ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లను సోనీ తాత్కాలికంగా మూసి వేసినట్లు వెల్లడించింది. నాగసాకితోపాటు క్యుషులో ఉన్న తమ ఇమేజ్ సెన్సార్ ప్లాంట్లలో కార్యకలాపాలను పాక్షికంగా నిలిపివేశామని, తిరిగి ఎప్పుడు ప్రారంభించేది ఇంకా చెప్పలేమని ప్లే స్టేషన్ మేకర్ సోనీ తెలిపింది. ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ తో కాంతిని విద్యుత్ సంకేతాలుగా మార్చే 'కాంప్లిమెంటరీ మెటల్-ఆక్సైడ్ సెమీ కండక్టర్' (సీఎంఓఎస్) ఇమేజ్ సెన్సార్లను క్యుషులోని సోనీ కేంద్రాల్లో తయారు చేస్తారు. ముఖ్యంగా యాపిల్ ఐ ఫోన్లలో వినియోగించే ఈ సెన్సార్లతో సోనీ.. 40 శాతం మార్కెట్ ను నియంత్రిస్తుంది. ప్రస్తుతం భూకంపంతో ప్లాంట్ల లో జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నామని, ప్లాంట్లను తిరిగి ఎప్పుడు తెరుస్తామో చెప్పలేమని సోనీ ప్రతినిధులు చెప్తున్నారు. తాము సప్లై నిలిపివేయడంవల్ల యాపిల్ వంటి కష్టమర్లపై ఎటువంటి ప్రభావం పడుతుందో చెప్పలేమంటున్నారు. మార్చి 2011 లో ఉత్తర జపాన్ లో సంభవించిన తీవ్ర భూకంపం, సునామీ.. ప్రభావం జపాన్ లోని ఆటో సరఫరా వ్యవస్థపై తీవ్రంగా పడింది. అప్పటినుంచీ కొన్ని కంపెనీలు తమ ఉత్పత్తి విధానాలను సవరించుకొని, భారీ నష్టాలు కలగకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్తపడుతున్నాయి. ప్రస్తుతం భూకంపం ప్రభావంతో క్యుషులోని ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తి కేంద్రాలు కూడా తాత్కాలికంగా తయారీని నిలిపివేశాయి. జపాన్ లోని సెమీకండక్టర్ల ఉత్పత్తి సుమారు 25 శాతం వరకూ క్యుషులోనే జరుగుతుంది. దీంతో సోనీతోపాటు క్యుషులో స్థానికంగా నెలకొన్నఅనేక కంపెనీలు తమ ఉత్పత్తుల తయారీని భూకంపం కారణంగా నిలిపివేశాయి. భూకంప నష్టాన్ని అంచనా వేసేవరకూ ఈ ప్లాంట్లు తిరిగి ప్రారంభించే అవకాశం కనిపించడంలేదు. శనివారం సంభవించిన ప్రకృతి విపత్తు ప్రభావం అనేక ఆటో మేకర్ సంస్థలపైనా పడింది. దీంతో ఆయా కంపెనీలు కూడ ఉత్పత్తిని నిలిపివేశాయి. హోండా మోటార్ కంపెనీ కూడ తమ కుమామోటో మోటార్ సైకిల్ ప్లాంట్ లో నష్టాన్ని అంచనా వేసేందుకుగాను తయారీని సోమవారం వరకూ నిలిపివేసినట్లు తెలిపింది. అలాగే టయోటా మోటార్స్ ప్రొడక్షన్ ప్లాంట్ లో పెద్దగా నష్టం వాటిల్లకపోయినప్పటికీ పరిస్థితిని ఆదివారం వరకూ సమీక్షించాల్సిన అవసరం ఉన్నట్లు తెలిపింది.