![ramanujaya shock to see ysr image on auto - Sakshi](/styles/webp/s3/article_images/2018/01/12/ysr.jpg.webp?itok=pvNAm1iS)
వైఎస్సార్ ఫొటో ఏర్పాటు చేసుకున్న లబ్ధిదారుడు
కలిదిండి (కైకలూరు) : ఓ లబ్ధిదారుడికి ప్రభు త్వ పథకం కింద అం దించిన ఆటోపై దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో చూసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ఒక్కసారిగా ఉలికిపడ్డారు. గురువారం మెగా గ్రౌండింగ్ మేళా జరిగింది. కలిదిండి బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ఆయా రుణాలతో పాటు వాహనాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖరెడ్డి ఫొటో ఉన్న ఆటో ఆయన వద్దకు వచ్చింది. దీంతో ఖంగుతిన్న ఆయన ఆ ఆటోను ప్రారంభించేందుకు నిరాకరించారు.
ముందుగానే ఇలాంటివి గమనించాల్సిన అవసరం లేదా? అంటూ అధికారులపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అసలేం జరిగిందంటే.. గతంలోనే లబ్ధిదారుడు రుణ పథకం కింద ఆటో తీసుకున్నాడు. ఆ ఆటోను రామానుజయ చేతుల మీదుగా ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారుడు, ఆటోలో సినీనటుల ఫొటోల పక్కన చంద్రబాబు ఫొటో పెట్టి దానిపైన తన ఆరాధ్య దైవమైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ఉంచాడు. ఇది రామానుజయకు తీవ్ర ఇబ్బంది కలిగించింది.
Comments
Please login to add a commentAdd a comment