govt scheme
-
డబ్బుల కోసం ఇంత కక్కుర్తా? స్వయానా అన్ననే.. వైరల్ స్టోరీ
పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటూ పవిత్రంగా భావిస్తారు. ప్రభుత్వం పోత్సాహం పథకం డబ్బుల కోసం కక్కుర్తి పడి, సొంత అన్నాచెలెళ్లే పెళ్లి తంతు ముగించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో ముఖ్యమంత్రి సమూహిక్ వివాహ్ యోజన పథకం కింద నిర్వహించిన కమ్యూనిటీ వివాహ కార్యక్రమంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 2024, మార్చి 5న మహారాజ్‌గంజ్ జిల్లాలోని లక్ష్మీపుర్ బ్లాక్‌లో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 38 నిరుపేద కుటుంబాలకు చెందిన జంటలకు సామూహిక వివాహం కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం వారందరికీ ‘సీఎం వివాహ పథకం’ కింద వధువుకు మంగళసూత్రం, ట్రంకుపెట్టె, దుస్తులతో పాటు రూ.51 నగదు అందించారు. అయితే మహారాజ్‌గంజ్ జిల్లాలో ఒక మహిళకు అప్పటికే పెళ్లయిపోయింది. కానీ భర్త దూరంగా ఉన్నాడు. దీంతో ప్రభుత్వ పథకం కోసం సొంత అన్నతో కలిసి పన్నాగం పన్నింది. ఏమాత్రం సంకోచం లేకుండా సోదరుడిని వివాహం చేసుకుంది. 'సప్తపది' (ఏడు సార్లు అగ్ని ప్రదక్షిణం) తో సహా అన్ని ఆచారాల్ని పాటించింది. అనంతరం బహుమతులు అందుకుంది. అయితే ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు విస్తుపోయారు. ఈ విషయం అధికారుల దృష్టికి కూడా చేరడంతో, పరిశీలించిన అధికారులు అప్పటికే ఆమెకు వివాహమైనట్లు గుర్తించారు. దీంతో లక్ష్మీపూర్ బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ అమిత్ మిశ్రా విచారణకు ఆదేశించారు. వారికిచ్చిన బహుమతులను కూడా వెనక్కి తీసుకున్నామనీ, ఈ పథకం కింద ఇచ్చే నగదు సహాయం నిలిపి వేస్తామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మిశ్రా తెలిపారు. కాగా ఇటీవల యూపీలోని బల్లియా జిల్లాలో కమ్యూనిటీ వెడ్డింగ్ స్కీమ్‌లో ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. ఇద్దరు అమ్మాయిలు, తమకు తామే దండలు వేసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. -
‘పీఎం సూర్య ఘర్’కు కోటి రిజిస్ట్రేషన్లు
న్యూఢిల్లీ: సుమారు నెల క్రితం ప్రారంభించిన రూఫ్ టాప్ సోలార్ స్కీం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజిలీ యోజన’కు అనూహ్య స్పందన వచ్చిందని ప్రధాని మోదీ తెలిపారు. ఈ పథకం కోసం ఇప్పటికే కోటి మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేయించుకోవడం అద్భుతమంటూ శనివారం ‘ఎక్స్’లో హర్షం వ్యక్తం చేశారు. అస్సాం, బిహార్, గుజరాత్, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ట్రాల నుంచి ఎక్కువ రిజిస్ట్రేషన్లు అయ్యాయన్నారు. ఇప్పటికీ రిజస్ట్రేషన్ చేయించుకోని వారు సాధ్యమైనంత త్వరగా ఆ పని చేయాలని సూచించారు. -
TS: పథకం ఏదైనా ఒకటే దరఖాస్తు!
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 28 నుంచి ప్రారంభం కానున్న ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు సభల్లో ప్రజలు సమర్పించాల్సిన దరఖాస్తు ఫారాన్ని ప్రభుత్వ వర్గాలు సిద్ధం చేశాయి. అభయహస్తం పేరుతో రూపొందించిన ఈ ఉమ్మడి దరఖాస్తును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం విడుదల చేయనున్నట్లు సమాచారం. రెండు విభాగాలుగా ఉండే ఈ దరఖాస్తు ఫారంలో వ్యక్తిగత వివరాలతోపాటు ప్రభుత్వ పథకాల లబ్ధికి అవసరమయ్యే వివరాలను పొందుపర్చాల్సి ఉంటుంది. మొదటి విభాగంలో దరఖాస్తుదారుని పేరు (ఇంటి యజమాని), లింగం, కులం, పుట్టిన తేదీ (ఆధార్ ప్రకారం), ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, వృత్తి, కుటుంబ సభ్యుల వివరాలతోపాటు చిరునామా, రేషన్‌కార్డు నంబర్ ఇవ్వాలి. అలాగే దరఖాస్తుదారుని ఫొటోను కూడా జత చేయాలి. రెండో విభాగంలో ఏ పథకం కింద లబ్ధి పొందాలనుకుంటున్నారో ఆ పథకానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. దరఖాస్తు ఫారాలన్నీ బుధవారం రాత్రికల్లా గ్రామాలు, వార్డులకు చేరతాయని, వీలును బట్టి బుధవారం లేదంటే గురువారం నుంచి జరిగే సభలకు వచ్చే సరికి వాటిని దరఖాస్తుదారులు పూర్తి చేయాల్సి ఉంటుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దరఖాస్తుతోపాటు ఆధార్ జిరాక్స్, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ జతపరచాలి. దరఖాస్తులో పేర్కొన్న వివరాలన్నీ నిజమేనని ధ్రువీకరిస్తూ సంతకం చేయాలి. ప్రతిపాదిత లబ్ధిదారులకు సంబంధిత అధికారులు దరఖాస్తును స్వీకరించినట్లు రశీదు అందించాలి. ఏ పథకం కోసం ఏయే వివరాలివ్వాలంటే... ► మహాలక్ష్మి పథకం కింద నెలకు రూ. 2,500 ఆర్థిక సాయం కావాలంటే అక్కడ టిక్ చేయాల్సి ఉంటుంది. రూ. 500 గ్యాస్ సిలిండర్ కోసం గ్యాస్ కనెక్షన్ నంబర్, సరఫరా చేస్తున్న కంపెనీ, సంవత్సరానికి వినియోగించే సిలెండర్ల సంఖ్యను పేర్కొనాలి. ► రైతు భరోసా పథకం కోసమైతే సాగు రైతా లేక కౌలు రైతో పేర్కొనాలి. సాగు రైతు అయితే దరఖాస్తులో పట్టాదారు పాస్‌బుక్ నంబర్ ఇవ్వాలి. కౌలు రైతు అయితే కౌలు చేస్తున్న భూమి వివరాలు సమర్పించాలి. వ్యవసాయ కూలీలైతే ఉపాధి హామీ కార్డు నంబర్ రాయాల్సి ఉంటుంది. ► ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద ఇల్లులేని వారు ఇంటి నిర్మాణ ఆర్థిక సాయం కోసం అని రాసి ఉన్న చోట టిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు 250 గజాల ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేయాలనుకుంటే అమరవీరుడి పేరు, అమరుడైన సంవత్సరం, ఎఫ్ఐఆర్ నంబర్, డెత్ సరి్టఫికెటనంబర్ సమర్పించాలి. ఉద్యమకారులైతే తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న సందర్భంగా అయిన కేసు తేదీ, సంఖ్య, జైలుకు వెళ్లి ఉంటే వాటి వివరాలను పేర్కొనాలి. ► గృహ జ్యోతి కింద నెలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందేందుకు విద్యుత్ మీటర్ కనెక్షన్ నంబర్ ఇవ్వాలి. ► చేయూత పథకం కింద నెలకు రూ. 4 వేల పింఛన్ కోసమైతే ఏ కేటగిరీ (వృద్ధాప్య, గీత కార్మికులు, డయాలసిస్ బాధితులు, బీడీ కారి్మకుల జీవన భృతి, ఒంటరి మహిళ జీవన భృతి, వితంతు, చేనేత కారి్మకులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు, ఫైలేరియా బాధితులు, బీడీ టేకేదారు జీవన భృతి)లో పింఛన్ అడుగుతున్నారో టిక్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగుల రూ. 6 వేల పింఛన్ కోసమైతే సదరం సర్టిఫికెట్ నంబర్‌ను పేర్కొనాల్సి ఉంటుంది. -
ఆమె మాటలు విని ఉద్వేగానికి లోనైన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్( కోవిడ్ 19)పై వస్తున్న వదంతులను నమ్మొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కోరారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శనివారం ఆయన జన ఔషధీ కేంద్రాల యజమానులు, ప్రధానమంత్రి జన ఔషధి పరియోజన(పీఎంబీజేపీ) లబ్ధిదారులతో సంభాషించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ..కరోనా వైరస్‌పై వస్తున్న పుకార్లను నమ్మొద్దని, డాక్టర్ల సలహాలు పాటించాలని ప్రజలను కోరారు. షేక్ హ్యాండ్ బదులు నమస్తే పెట్టాలని సూచించారు. ఇప్పుడు ప్రపంచం మొత్తం నమస్తే పెట్టడం అలవాటు చేసుకుంటోందని అన్నారు. భాగోద్వేగానికి లోనైన మోదీ లబ్దిదారులతో మాట్లాడే క్రమంలో ప్రధాని మోదీ భాగోద్వేగానికి లోనయ్యారు. పక్షవాతానికి లోనై.. జన ఔషధి పథకం ద్వారా లబ్ది పొందిన దీపా షా అనే ఓ మహిళ మాట్లాడిన మాటలు విని మోదీ ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. సరిగా మాట్లాడలేకపోయిన తాను.. తన రోగాన్ని సరిచేసుకునేందుకు ఎంతో ఖర్చయ్యే పరిస్థితి ఎదుర్కొన్నాననీ, ఐతే... జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ రేటుకే మందులు కొనుక్కొని సమస్య నుంచీ బయటపడినట్లు మోదీకి వివరించారు. ‘ 2011లో నాకు పక్షవాతం వచ్చింది. దీంతో సరిగా మాట్లాడలేకపోయాను. వైద్యం ఖర్చులు భారీగా అయ్యేవి. అయితే జన ఔషధి పథకం ద్వారా నాకు పెద్ద ఉపశమనం లభించింది. జన జౌషధ కేంద్రాల ద్వారా తక్కువ రేటుకే మందులు కొనుక్కోగలుగుతున్నాను. రూ. 5000 విలువల చేసే మందులు.. రూ.1500 లకే లభిస్తున్నాయి. వైద్యం ఖర్చులు తగ్గడంతో కడుపు నిండా తినగలుగుతున్నాను. ఈ పథకంగా తెచ్చిన మోదీకి కృతజ్ఞతలు. నేను దేవున్ని ప్రత్యేక్షంగా చూడలేదు. మీలో నాకు దేవుడు కనిపిస్తున్నాడు’ అంటూ దీపా కనీళ్లు పెట్టుకున్నారు. ఇది చూసిన మోదీ భాగోద్వేగానికి లోనయ్యారు. కొన్ని క్షణాల పాటు తలను కిందకు దించి దుఃఖాన్ని దిగమింగుకొని ఆమె మాటలు శ్రద్ధగా విన్నారు. #WATCH Prime Minister Narendra Modi gets emotional after Pradhan Mantri Bhartiya Janaushadi Pariyojana beneficiary Deepa Shah breaks down during interaction with PM. pic.twitter.com/Ihs2kRvkaI — ANI (@ANI) March 7, 2020 -
‘గోకులం’ గోవిందా..!
సాక్షి, అమరావతి: గోకులాలు నిర్మించుకునే రైతులకు 90 శాతం సబ్సిడీ ఇస్తామని ఊరూరా ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ పశు సంవర్థకశాఖ అకస్మాత్తుగా ప్లేట్ తిప్పేసింది. తూచ్...90 కాదు 70 శాతం రాయితీనే ఇస్తామని కొత్తగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రైతులు బిత్తరపోతున్నారు. రాయితీ అధికంగా వస్తుందనే ఆశతో అప్పు చేసి మరీ గోకులాల నిర్మాణాలు ప్రారంభించిన రైతులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా నిధుల కొరత వెన్నాడుతోందంటూ పది రోజుల క్రితం చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు రాయితీ కూడా తగ్గిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నెల వ్యవధిలో దెబ్బ మీద దెబ్బ తగలడంతో ప్రభుత్వం తమను నమ్మించి మోసం చేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు ఉపయోగపడే పథకాలకు రాయితీలు తగ్గించిన ప్రభుత్వం మరోవైపు వారు ఆసక్తి చూపని పథకాలకు రాయితీలు పెంచుతోంది. ఇతర రాష్ట్రాల్లో పాడిపశువులు కొనుగోలు చేసే రైతులకు రవాణా ఖర్చులు కూడా ఇస్తామని ఇటీవల ప్రకటించింది. గతంలో రైతులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి పాడిపశువులను ఎంపిక చేసుకుని, వాటిని తరలించడానికి అయ్యే ఖర్చును తామే భరించేవారు. అయితే ఇటీవల ఆ రవాణా ఖర్చులు ప్రభుత్వమే భరించాలని నిర్ణయించింది. కానీ ఈ పథకంపై రైతులు ఆసక్తి చూపడంలేదు. ఇతర రాష్ట్రాల్లోని వాతావరణ పరిస్థితులు ఇక్కడి పరిస్థితులకు భిన్నంగా ఉండటంతో దూడలు చనిపోవడం లేదా పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతోంది. ఈ రెండు కారణాల వల్ల రైతులు ఇతర రాష్ట్రాల్లోని పాడి పశువుల కొనుగోలు పథకం పట్ల ఆసక్తి చూపడం లేదు. అయితే ఈ పథకం అమలుతో పశు సంవర్థకశాఖ అధికారులు, వైద్యులకు మామూళ్లు అధికంగా వస్తుండటంతో ఆ పథకం కొనసాగింపునకు రవాణా ఖర్చులు భరించే విధంగా నిర్ణయం తీసుకున్నారనే అభిప్రాయం వినపడుతోంది. దరఖాస్తులు పెరగడంతో చేతులేత్తేసిన ప్రభుత్వం రెండు పశువుల షెడ్లకు రూ.లక్ష, నాలుగు పశువుల షెడ్‌కు రూ.1.50 లక్షలు, ఆరు పశువుల షెడ్‌కు రూ.1.90 లక్షలు విడుదల చేస్తున్నట్టు అధికారులు రైతులకు చెప్పారు. రెండు పశువులకు షెడ్ నిర్మించుకునే రైతులు రూ.10 వేలు సమకూర్చుకుంటే షెడ్ నిర్మించుకోవచ్చని చెప్పారు. ఈ మేరకు కృష్ణా, గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల్లో 2 వేల మంది రైతులు తమ నిర్మాణాలను ప్రారంభించి సగం వరకు పూర్తి చేశారు. మిగిలిన నిర్మాణానికి డబ్బులు లేకపోవడంతో పార్ట్బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఉపాధిహామీ పథకం నిధులను కూడా ఈ పథకానికి వినియోగిస్తున్న నేపధ్యంలో నిబంధనల ప్రకారం పరికరాల కొనుగోలుకు అధికంగా నిధులు ఖర్చు చేయడంతో రైతుల నిర్మాణాలకు నిధులు విడుదల చేయలేని పరిస్థితి ఏర్పడింది. తాజాగా ప్రభుత్వం 20 పశువులను ఒకేచోట పెంచేందుకు చేపట్టే పెద్ద గోకులాలకు రాయితీని తగ్గించింది. ఒక్కో జిల్లాకు 38 గోకులాలు నిర్మించాలని నిర్ణయించింది. అయితే అన్ని జిల్లాల్లో గోకులాలు, మినీ గోకులాలకు భారీ సంఖ్యలో దరఖాస్తులు రావడంతో ప్రభుత్వం చేతులెత్తేసింది. మొదట్లో ప్రకటించిన విధంగా 90 శాతం రాయితీ కాకుండా 70 శాతం రాయితీనే ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసింది. పెద్ద గోకులాల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకం కింద రూ.18.50 లక్షలు, మిగిలిన రూ.2.50 లక్షలు పశుసంవర్థక శాఖ భరిస్తుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తగ్గిన రాయితీ ప్రకారం పెద్ద గోకులాల యూనిట్ విలువ రూ.20.50 లక్షల నుంచి రూ.13. లక్షలకు తగ్గిపోయింది. ఒక్కో యూనిట్‌కు రూ.7.50 లక్షల రాయితీ తగ్గిపోవడంతో రైతులు ఆసక్తి చూపడం లేదు. ఇచ్చిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవద్దని, తాము ఇప్పట్లో వాటిని నిర్మించలేమని కొందరు రైతులు చెప్పడం ప్రారంభించారు. ఇదే విధంగా మినీ గోకులాల్లోనూ ఇదే పరిస్ధితి... రూ.లక్ష విలువైన యూనిట్‌కు రూ.30 వేలు రైతులు భరించాల్సి రావడంతో ఆ మొత్తాన్ని భరించలేక తమకు ఆ పథకం వద్దని చెబుతున్నారు. ఇదీ గోకుల పథకం రాష్ట్రంలో పాడి రైతులకు చేయూత నిచ్చేందుకు ఎనిమిది వేల షెడ్ల (మినీ గోకులాలు) నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండు, నాలుగు, ఆరు పాడి పశువులు కలిగిన రైతులు ఈ షెడ్ల నిర్మాణాలకు దరఖాస్తు చేసుకోవచ్చని, పాడి పశువుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని నిధులు విడుదల చేస్తామని ప్రకటించింది. ఈ 8 వేల షెడ్లను నిర్ణీతకాల వ్యవధిలో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జిల్లాల వారీగా అధికారులకు లక్ష్యాలను నిర్ణయించింది. అధికారులు గ్రామాల్లో పర్యటించి 90 శాతం రాయితీ ఇస్తున్న గోకుల పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రచారం చేశారు. -
అ‘పరిష్కృతే’ !
పాల్వంచ: ప్రభుత్వం అక్రమ లే అవుట్లను క్రమబద్ధీకరించేందుకు ప్రవేశపెట్టిన లే అవుట్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్ఆర్ఎస్)దరఖాస్తులు అపరిష్కృతంగానే మిగిలిపోతున్నాయి. అక్రమ లేఅవుట్లను క్రమబద్ధీకరించడం ద్వారా మున్సిపాలిటీల ఆదాయం గణనీయంగా పెంచుకునేందుకు ఈ స్కీం ఉపయోగ పడుతుంది. జిల్లాలోని మణుగూరు, ఇల్లెందు మున్సిపాలిటీలకు ఇది వర్తించకపోగా, కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీల్లో అనేక మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ పథకంపై ప్రజలకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమయ్యారనే ఆరోపణలు వస్తున్నాయి. వెల్లువలా దరఖాస్తులు.. ఎల్ఆర్ఎస్ స్కీం ద్వారా పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీల్లో దరఖాస్తులు వెల్లువలా వచ్చాయి. 2015లో ప్రవేశపెట్టిన ఈ స్కీం గడువు తేదీని ప్రభుత్వం పలుమార్లు పొడిగించింది. చివరిసారిగా గత అక్టోబర్ 30 వరకు కొనసాగించారు. పాల్వంచ మున్సిపాలిటీలో 2700 దరఖాస్తులు రాగా, 1700 దరఖాస్తులు మాత్రమే పరిష్కారం అయ్యాయి. మరో 1000 అప్లికేషన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సర్వే నంబర్ 817లో గత రెండున్నర సంవత్సరాలుగా రిజిస్ట్రేషన్లు నిలిపి వేయడంతో 500 దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి. మరికొన్ని సకాలంలో డబ్బు చెల్లించక పరిష్కారం కాలేదని తెలుస్తోంది. కొత్తగూడెం సింగరేణి పరిధిలో ఉన్నప్పటికీ కొంత వరకు ప్రైవేట్ భూములు ఉండడంతో 120 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. అయితే ఇందులో 89 పరిష్కారం అయ్యాయి. 13 దరఖాస్తులు వివిధ కారణాలతో తిరస్కరించగా, మిగతా 18 పెండింగ్‌లో ఉన్నాయి. ఇల్లెందు. మణుగూరులో నిల్.. మణుగూరు మున్సిపాలిటీ 1 /70 యాక్ట్‌లో ఉండటంతో అక్కడ దరఖాస్తులు స్వీకరించలేదు. ఇల్లెందు మున్సిపాలిటీ సింగరేణి కాలరీస్ సంస్థకు చెందిన భూముల పరిధిలో ఉండడంతో అక్కడ కూడా దరఖాస్తుల స్వీకరణకు అనర్హం. దీంతో ఈ రెండు మున్సిపాలిటీల్లో దరఖాస్తులు లేకపోవడంతో ఆదాయం లభించలేదు. పాల్వంచ మున్సిపాలిటీలో ఎల్ఆర్ స్కీం ద్వారా సుమారు రూ.12 కోట్ల వరకు ఆదాయం లభించి ప్రథమ స్థానంలో ఉండగా, కొత్తగూడెంలో రూ.70 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈ మున్సిపాలిటీల్లో పెండింగ్‌లో ఉన్న వాటిని పరిష్కరించాలని లబ్ధిదారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా «సకాలంలో చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. త్వరలోనే పరిష్కరిస్తాం పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులు కూడా త్వరలోనే పరిష్కరిస్తాం. ఎన్నికల పనుల్లో నిమగ్నం కావడంతో కొంత ఆలస్యం అవుతున్నాయి. పాల్వంచకు సుమారు రూ.12కోట్ల వరకు ఆదాయం లభించి ప్రథమ స్థానంలో ఉంది. ఇల్లెందు సింగరేణి, మణుగూరు 1 /70 యాక్ట్‌ల వల్ల అక్కడ దరఖాస్తులు స్వీకరించే అవకాశం లేదు.--శ్రీనివాస్, టీపీఓ -
అందని ‘అభయం’
పాల్వంచరూరల్: స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలోప్రవేశపెట్టిన అభయహస్తం పథకం ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ పథకం ద్వారా అందించే పింఛన్లు గత 11 నెలలుగా నిలిచిపోయాయి. జిల్లాలో అభయహస్తం లబ్ధిదారులు 8 వేల మంది ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జిల్లాలో నెలకు రూ.40 లక్షల పింఛన్లు చెల్లించాల్సి ఉంది. 2017 నవంబర్ వరకు తర్వాత ఇంతవరకు తమకు రూపాయి కూడా ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అభయహస్తంతో ఎంతో ప్రయోజనం.. అభయహస్తం పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేంది. స్వయం సహాయక సంఘాల్లోని నిరుపేద మహిళలకు నెలకు రూ.500 వస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది. 18 నుంచి 59 సంవత్సరాల మహిళలు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు. వారు రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం ద్వారా మరో రూ. 365 జమ చేసి జనశ్రీ బీమా పథకంలో లబ్ధిదారులుగా చేరుస్తారు. ఆ తర్వాత 60 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 పింఛన్ చెల్లిస్తారు. అంతేకాక గ్రూపులోని మహిళలకు 9 నుంచి ఇంటర్ వరకు చదివే పిల్లలు ఉంటే ఏడాదికి రూ.1200 చొప్పున ఒక్కో కుటుంబంలో ఇద్దరికి ఉపకార వేతనాలు అందిస్తారు. సభ్యులు అకాల మరణం పొందితే కుటుంబసభ్యులకు బీమా కంపెనీ ద్వారా రూ.30 వేలు చెల్లిస్తారు. ప్రమాదంలో మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యం కలిగితే రూ.37, 500 చొప్పున పరిహారం చెల్లిస్తారు. అయితే ఇటీవల ఈ పరిహారాన్ని రెండు లక్షలకు పెంచారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన అభయహస్తం పింఛన్ డబ్బును వెంటనే ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు. 11 నెలలుగా ఇబ్బంది పడుతున్నాం అభయహస్తం పింఛన్ గత 11 నెలలుగా రావడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే రూ.500 అయినా నెలనెలా సక్రమంగా ఇవ్వాలి.లేకుంటే తమ జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. అసరా పింఛన్లోనైనా చేర్చి ప్రతినెలా పింఛన్ ఇస్తే బాగుటుంది. – నూనావత్ చాందిని, లబ్ధిదారురాలు వెంటనే విడుదల చేయాలి ప్రభుత్వం ఇచ్చే పింఛన్ పైనే ఆధారపడి వృద్ధాప్యాన్ని గడుపుతున్నాం. గత 11 నెలలుగా పింఛన్లు ఇవ్వకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పింఛన్ల కోసం సంబంధిత అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. నెలనెలా విధిగా పింఛన్ ఇవ్వాలి. – ధర్మసోతు మారు, లబ్ధిదారురాలు నిధులు విడుదల కాగానే పంపిణీ చేస్తాం అభయహస్తం పించన్లు గత 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మాట నిజమే. ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. మంజూరు కాగానే లబ్ధిదారులకు పంపిణీ చేస్తాం. – ప్రదీప్, అభయహస్తం పింఛన్ల జిల్లా ఇన్చార్జి -
సౌర సుజల యోజనతో..
రాయ్‌పూర్: అది మారుమూల గిరిజన కొండ ప్రాంతం. అక్కడి రైతులకు ఎలాంటి ఆదాయ మార్గాలులేవు. కనీసం విద్యుత్ కూడా ఉండేది కాదు. దీంతో పూట గడవడమే కష్టంగా ఉండేది. అలాంటి సమయంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకం వారికి వరంలా మారింది. రెండేళ్లలో వారి దశ తిరిగింది. ఆదాయం లక్షల్లోకి చేరింది. ఛత్తీస్‌గఢ్‌లోని జష్పూర్ జిల్లాలో ప్రభుత్వం అమలు చేస్తున్న ‘సౌర సుజల యోజన’ పుణ్యమే ఇదంతా. గిరిజనులు ఎక్కువగా ఉండే ఆ ప్రాంతంలో ఈ పథకం కింద మిరప వంటి పంటలను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించింది. విద్యుత్ సౌకర్యం లేని ప్రాంతాల్లోని రైతులకు తక్కువ ధరకే సౌర విద్యుత్ పంప్సెట్లు సమకూర్చింది. కోపా గ్రామానికి చెందిన గుజ్‌నాథ్ రామ్ ఆహార పంటలను సాగుచేస్తూ సరైన దిగుబడులు రాక ఇబ్బందులు పడుతుండేవాడు. ఈ పథకం అమలు తర్వాత తనకున్న ఐదెకరాల్లో రెండేళ్లుగా ఆయన మిర్చితోపాటు, టమాటా, వరి కూడా సాగు చేస్తున్నారు. రామ్ ఏమంటున్నారంటే.. ‘ఇప్పటి వరకు వచ్చిన మిర్చి, టమాటాలను విక్రయించగా రూ.80వేలు వచ్చాయి. ఆగస్టు, సెప్టెంబర్ వరకు కూడా దిగుబడులు చేతికందుతాయి. ఇలా ఎకరానికి రూ.లక్ష వరకు మిగులుతాయి’. ‘సౌర్ సుజల యోజన’ ద్వారా లబ్ధి పొందుతున్న బగీచా, మనోరా ప్రాంతాల్లోని 50 గ్రామాలకు చెందిన 500 మంది రైతుల్లో రామ్ కూడా ఒకరు. ‘2016 వరకు జిల్లాలో కేవలం 300 ఎకరాల్లో మాత్రమే మిరప సాగు జరుగుతుండేది. ఇప్పుడు అది రెండువేల ఎకరాలకు పెరిగింది. దీంతో ఇక్కడి రైతుల జీవనప్రమాణాల్లో గణనీయ మార్పులు వచ్చాయి’ అని జష్పూర్ జాయింట్ కలెక్టర్ ప్రియాంక శుక్లా తెలిపారు. -
సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
ఆదిలాబాద్‌రూరల్ : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పశు పోషకులు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని అంకోలి గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై పశువులకు టీకా వేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలను కాపరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గొల్ల కుర్మలకు అందించిన సబ్సిడీ గొర్రెలను విక్రయించకుండా వాటిని పోషించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ అడ్డి భోజారెడ్డి, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ అప్కం గంగయ్యయాదవ్, అంకోలి ఎంపీటీసీ కనక రమణ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సురేష్, ఏడీ రామారావు, మండల పశు వైద్యాధికారి గోపీ కిషన్, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ ఫొటో చూసి రామానుజయ ఉలికిపాటు
కలిదిండి (కైకలూరు) : ఓ లబ్ధిదారుడికి ప్రభు త్వ పథకం కింద అం దించిన ఆటోపై దివంగత ముఖ్యమంత్రి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో చూసిన కాపు కార్పొరేషన్ చైర్మన్ రామానుజయ ఒక్కసారిగా ఉలికిపడ్డారు. గురువారం మెగా గ్రౌండింగ్ మేళా జరిగింది. కలిదిండి బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని లబ్ధిదారులకు ఆయా రుణాలతో పాటు వాహనాలను పంపిణీ చేశారు. ఈ క్రమంలో వైఎస్ రాజశేఖరెడ్డి ఫొటో ఉన్న ఆటో ఆయన వద్దకు వచ్చింది. దీంతో ఖంగుతిన్న ఆయన ఆ ఆటోను ప్రారంభించేందుకు నిరాకరించారు. ముందుగానే ఇలాంటివి గమనించాల్సిన అవసరం లేదా? అంటూ అధికారులపై అగ్గిమీద గుగ్గిలమయ్యారు. అసలేం జరిగిందంటే.. గతంలోనే లబ్ధిదారుడు రుణ పథకం కింద ఆటో తీసుకున్నాడు. ఆ ఆటోను రామానుజయ చేతుల మీదుగా ఇప్పించేందుకు ఏర్పాట్లు చేశారు. లబ్ధిదారుడు, ఆటోలో సినీనటుల ఫొటోల పక్కన చంద్రబాబు ఫొటో పెట్టి దానిపైన తన ఆరాధ్య దైవమైన వైఎస్ రాజశేఖరరెడ్డి ఫొటో ఉంచాడు. ఇది రామానుజయకు తీవ్ర ఇబ్బంది కలిగించింది. -
తెలంగాణలో ఒకేరోజు సామాజిక సర్వే
హైదరాబాద్: తెలంగాణ వ్యాప్తంగా ఒకేరోజు సామాజిక, ఆర్థిక స్థితిగతులపై సర్వే చేయించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సామాజిక సర్వే ఆధారంగానే ప్రభుత్వ పథకాల లబ్దిదారులను గుర్తించనున్నారు. తెలంగాణలో సమగ్ర, ఆర్థిక, సామాజిక సర్వేపై సలహాదార్లు, అన్ని శాఖల కార్యదర్శులతో ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం సమావేశమయ్యారు. ప్రతి పౌరుడు, కుటుంబం సర్వేలో పాల్గొనేలా చర్యలు తీసుకోవాలని అన్ని శాఖల అధికారులను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదేశించారు.