పశువుకు టీకా వేస్తున్న మంత్రి రామన్న
ఆదిలాబాద్‌రూరల్ : ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని పశు పోషకులు ఆర్థికాభివృద్ధి సాధించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న అన్నారు. మండలంలోని అంకోలి గ్రామంలో వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ (ఆత్మ) సౌజన్యంతో పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో బుధవారం మెగా ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన హాజరై పశువులకు టీకా వేసి శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు.
గ్రామాల్లో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలను కాపరులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గొల్ల కుర్మలకు అందించిన సబ్సిడీ గొర్రెలను విక్రయించకుండా వాటిని పోషించుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నారు. కార్యక్రమంలో ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆరె రాజన్న, జెడ్పీటీసీ సభ్యుడు ఇజ్జగిరి అశోక్, రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ అడ్డి భోజారెడ్డి, వైస్ ఎంపీపీ గంగారెడ్డి, ఏఎంసీ వైస్‌చైర్మన్ అప్కం గంగయ్యయాదవ్, అంకోలి ఎంపీటీసీ కనక రమణ, జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ సురేష్, ఏడీ రామారావు, మండల పశు వైద్యాధికారి గోపీ కిషన్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment