Jogu Ramanna
-
ప్రచారంపై ఫోకస్ పెంచిన ప్రధాన పార్టీలు..
సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల సంగ్రామంలో ఆయాపార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నా యి. సీఎం రేవంత్‌రెడ్డి ఈ సెగ్మెంట్ పరిధిలో ఆది లాబాద్, ఆసిఫాబాద్‌లలో జరిగిన సభల్లో వ్యూహా త్మకంగా బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గొడం నగేశ్, ఆత్రం సక్కును విమర్శించడం ద్వారా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన కూ డా ఇందులో భాగమేనని చర్చించుకుంటున్నారు. మరోపక్క బీజేపీలో ఇటీవల ఎమ్మెల్యేలకు ఆయా పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు తొలగించిన తర్వాత వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రచారంలో దూకుడు పెంచారు. ఒక విధంగా ఈ నిర్ణయం విభేదాలకు చెక్‌తో పాటు ప్రచారంలో స్పీడ్ పెంచేందుకు ఉపయోగపడిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ మైనార్టీ ఓట్లపై దృష్టి సారించిందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.సీఎం ప్రసంగంలో ఎంపీ సోయం ప్రస్తావన..సీఎం రేవంత్‌రెడ్డి ఆసిఫాబాద్ బహిరంగ సభలో ఎంపీ సోయం బాపూరావు ప్రస్తావన తీసుకురావడం వ్యూహాత్మకమేనన్న చర్చ సాగుతుంది. సిట్టింగ్ ఎంపీ సోయంకు టికెట్ ఇవ్వకుండా బీజేపీ ఆయనను అవమానించిందన్నారు. అంతేకాకుండా పార్లమెంట్ నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలని కేంద్ర మంత్రుల చుట్టూ సోయం తిరిగినా వారు పట్టించుకోలేదని చెప్పారు. ప్రధానంగా సోయంకు ఆదివాసీ ఓటర్లలో పట్టు ఉంది.ఈ నేపథ్యంలో సీఎం వ్యూహాత్మకంగానే సోయం ప్రస్తావన తీసుకువచ్చారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా బీజేపీ అభ్యర్థి నగేశ్, బీఆర్ఎస్ అభ్యర్థి సక్కు ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నప్పటికీ జిల్లా అభివృద్ధికి పాటుపడింది లేదని చెప్పడం ద్వారా విమర్శలు ఎక్కుపెట్టారు. ఇదిలా ఉంటే ఇటీవల మంత్రి సీతక్క, ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణ నార్నూర్ మండలం కొత్తపల్లి–హెచ్లో బంజారా దీక్షభూమి వేదిక వద్ద ప్రసంగిస్తూ తాము లంబాడాలకు వ్యతిరేకం కాదని చెప్పడం ద్వారా ఆ ఓటర్లను ఆకట్టునే ప్రయత్నం చేశారు.అంతే కాకుండా ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి పార్టీ పరంగా కో ఇన్చార్జీలను నియమించారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌తో పాటు ఏఐసీసీ సభ్యుడు నరేశ్ జాదవ్ నియామకం ఇందులో భాగమేనని తెలుస్తోంది. తద్వారా ఆ సామాజిక వర్గ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నమే ఈ చర్య అన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతుంది.బీజేపీలో విభేదాలు సమసినట్టేనా..బీజేపీలో ఎంపీ అభ్యర్థిగా నగేశ్‌ను ప్రకటించిన త ర్వాత పార్టీ ఎమ్మెల్యేల మధ్య సఖ్యత లేదన్న విమర్శలు జోరుగా సాగాయి. ఎమ్మెల్యేలకు పార్లమెంట్ ఇన్చార్జి బాధ్యతలు ఇచ్చిన తర్వాత వారి నియోజకవర్గాల్లో ఇతర నేతల జోక్యం పెరిగిందన్న భావం వ్యక్తమైందన్న ప్రచారం జరిగింది. పార్టీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్లడంతో నష్ట నివారణ చర్యలకు దిగింది.ఇందులో భాగంగానే పార్టీ ఎమ్మెల్యేలందరికీ ఆయా పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి బా ధ్యతల నుంచి తొలగించారు. ఈ పరిణామం తర్వా త ఆయా ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో ప్రచార స్పీడ్ పెంచారు. ఒకవిధంగా ఇది పార్టీకి మంచి జరిగిందేనన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. అంతేకాకుండా నగేశ్ ఇటీవల ఖానాపూర్ నియోజకవర్గంలో పర్యటించినప్పుడు మాజీ ఎంపీ రాథోడ్ రమేశ్‌తో కలిసి విస్తృతంగా తిరిగారు. ఇది లంబాడా ఓటర్లను ఆకర్షించేందుకు వ్యూహాత్మక చర్య అన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది.ఎంఐఎం నేతను కలిసిన బీఆర్ఎస్ నాయకులు..బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కుకు సంబంధించి ఈ పార్లమెంట్ సెగ్మెంట్లోని నియోజకవర్గాల్లో ఆయా నేతలు, కార్యకర్తలు విస్తృతంగా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు.ఇటీవల మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్సీ దండే విఠల్‌తో కలిసి భైంసాలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ వైస్ చైర్మన్ జాబిర్ అహ్మద్‌ను కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రధానంగా మైనార్టీ ఓటర్లను రాబట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో ఆదివాసీ, లంబాడా ఓటర్లతో పాటు గిరిజనేతర ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. -
ఔరంగజేబులంతా ఏకమైనా కానీ ఆ నలుగురినే.. : బండి సంజయ్
ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఔరంగజేబులంతా ఏకమై బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు యత్నించినా ధీటుగా ఎదుర్కొని ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర ఆదిలాబాద్ ప్రజలదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడతోపాటు ఆదిలాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి వందనాలు చెబుతున్నానన్నారు. జిల్లా ప్రజలదెబ్బకు బీఆర్ఎసోళ్లు ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారన్నారు. రాంమందిర్ నిర్మాణం కోసం తపించిన కరసేవకులను కాల్చి చంపిన ములాయం సింగ్ గతేమైందో, బతుకేమైందే ప్రజలు గ్రహించాలన్నారు. అయోధ్యలోనే రాముడు పుట్టారా అనిప్రశ్నించే నాకొడుకులా భవిష్యత్తును ఖతం చేస్తామని, అలాంటి పార్టీలకు భవిష్యత్తే లేకుండా చేస్తామన్నారు. నిర్మల్ జిల్లాలో రాంజీగోండ్ చరిత్రను తెరమరుగు చేసేందుకు వెయ్యి ఊడలమర్రి వద్ద సమాధి చేసిన బీఆర్ఎస్ను ప్రజలు సమాధి చేశారన్నారు. కాంగ్రెస్ మే ల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందన్నారు. వెయ్యి ఊడల మ ర్రి వద్ద రాంజీగోండ్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దేశం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోదీకి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బహుమతి గా అందించాలన్నారు. ఎంపీ సీటును గెలిపిస్తే ఆది లాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నా రు. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడబోతుందని, అధికారం చేపట్టిన వెంటనే ఆది లాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు మోదీతో శంకుస్థాప న చేయిస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రాష్ట్రంలో ఖజానా లేదని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లేది కొత్త స్క్రాచ్ రుచి చూసేందుకే తప్పా.. ఎలాంటి పొత్తుల కోసం కాదన్నారు. కేసీఆర్‌కు ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారని ప్రశ్నించా రు. ఎన్నికలకు ముందు సొంత వాహనాలు లేని చంద్రశేఖర్‌రావుకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హిందువులు ఓటు బ్యాంక్‌గా మారకపోవడంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయామని, దేశానికి కావాల్సింది రామ రాజ్య మా.. రజాకార్ల రాజ్యమా అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో యాత్ర ఇన్చార్జి పల్లె గంగారెడ్డి, జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, జిల్లా అధ్యక్షుడు ప తంగే బ్రహ్మానంద్, మాజీఎంపీ రమేశ్ రాథోడ్, మా జీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, పార్లమెంట్ కన్వీ నర్ బోయర్ విజయ్, లోక ప్రవీణ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లాలామున్నా, వేదవ్యాస్, నాయకులు రాజేశ్‌బాబు, అభినవ్ సర్దార్, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు. అధికారం పోయినా.. తీరుమారలే.. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నను ప్రజలు ఓడించి ఆ పార్టీని అధికారం లేకుండా చేసినా ఇంకా అధికారంలో ఉన్నట్లే మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని ఆదిలాబా ద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. వంద మంది రామన్నలు వచ్చినా ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ఆదిలాబా ద్–ఆర్మూర్, ఆర్మూర్–పఠాన్‌చెరు వరకు 316 కిలో మీటర్ల దూరం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిందని, ఇందు కోసం రూ.7,313 కోట్లు కేంద్రం కేటాయించిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్–గడ్చందూర్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయిందని, రూ.1.75 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయం తెలియని జోగు రామన్న రాజకీయ లబ్ధి కోసం రైల్వే సాధన సమితి పేరిట డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో పనిచేసిన ఎంపీలకు పిట్‌లైన్ అంటే తెలియదని, ఆదివాసీ బిడ్డగా దాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఢిల్లీలో మోదీ ఉండాల్సిందే.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్లలో ప్రధాని మోదీ ప్ర పంచానికే నాయకత్వం వహించే దిశగా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు. గల్లీ లో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలని ప్రజ లంతా కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ లోనూ బీజేపీ గెలవడం ఖాయమన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారన్నారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికై నా న్యాయం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. ‘బండి’కి ఘన స్వాగతం.. బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించిన బండి సంజయ్‌కు నేరడిగొండ మండలం రోల్మామడ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. క్రేన్ సాయంతో గజ మాల వేశారు. నేరడిగొండలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడినుంచి ఇచ్చోడకు చేరుకోగా పార్టీ శ్రేణుల స్వాగతం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గుడిహత్నూర్‌లో ఓ స్వామిజీ నివాసంలో భోజనం చేసి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మావల బైపాస్ వద్ద బండి సంజయ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి 5కిలోమీట ర్ల మేర బైక్ ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప్రధానవీధులగుండా అంబేద్కర్ చౌక్ కు యాత్ర చేరుకోగా, పార్టీ శ్రేణులు ఆయన ను భుజాలపై ఎత్తుకొని స్వాగతం పలికారు. ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ! -
కారు పార్టీ ఎమ్మెల్యేలను ఆ బ్రిడ్జీలు ముంచేస్తాయా? విపక్షాలకు సంబరమెందుకు!
నియోజకవర్గాల్లో అభివృద్ధి బాగానే చేశారు. అయినా ఆ ఎమ్మెల్యేలను భయం వెంటాడుతోంది. ఈసారి ఎన్నికల్లో గెలుస్తామా? లేదా? అని సందేహిస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ నలుగురు ఎమ్మెల్యేల భయానికి కారణం ఏంటి? ఎమ్మెల్యేలకు ఓడిపోతామనే భయం ఎందుకు పీడిస్తోంది? కారణాలేంటో చూద్దాం.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్మాణం పూర్తికాని అసంపూర్తి బ్రిడ్జీలు నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలకు గుబులు పుట్టిస్తున్నాయి. వారంతా తమ నియోజకవర్గాల్లో ప్రగతిని పరుగులు పెట్టించారు. కాని అసంపూర్తిగా ఆగిపోయిన బ్రిడ్జీల్ని పూర్తి చేయడంలో విఫలం అయ్యారు. మూడోసారి కోనప్ప ఆ వైఫల్యమే వారిపట్ల ప్రజల్లో వ్యతిరేకతను పెంచుతోంది. కుమ్రంబీమ్ జిల్లా సిర్పూర్ టి నియోజకవర్గానికి రెండుదఫాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు కోనేరు కోనప్ప. ముచ్చటగా మూడోసారి అసెంబ్లీలో అడుగు పెట్టాలన్న ఆయన కోరిక పెద్దవాగుపై కూలిపోయిన వంతెన వల్ల నెరవేరదేమోనని భయపడుతున్నారు. కాగజ్‌నగర్-దహేగామ్ మండలాలను కలిపే ఆ వారధి గత ఏడాది భారీ వర్షాలకు దెబ్బ తిని కూలిపోయింది. బ్రిడ్జి కూలిపోవడంతో దహేగామ్ మండలంలోని పద్దేనిమిది గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఏడాదిగా అక్కడి ప్రజలు పడరాని పాట్లు పడుతున్నారు. బ్రిడ్జి నిర్మాణానికి టెండర్లు పిలిచినా పనులు మాత్రం సాగడంలేదు. కూలిపోయిన వంతెన స్థానంలో కొత్తదాని నిర్మాణం ప్రారంభం కాకపోవడానికి ఎమ్మెల్యే కోనప్ప వైఫల్యమే కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పుడు ఆ వంతెన తన పుట్టి ముంచుతుందేమోనని కోనప్ప ఆందోళన చెందుతున్నారు. (చదవండి: మాజీ మంత్రి జూపల్లికి షాక్..!) రేఖ నాయక్‌కు షాకిచ్చేందుకు సిద్ధం? నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ప్రజలకు గంగాపూర్ బ్రిడ్జి కలగా మిగిలిపోయింది. కడెం నదిపై బ్రిడ్జి లేక గంగాపూర్ పరిసర ప్రాంతాల్లోని పది గ్రామాల ప్రజలు వర్షకాలంలో తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. అనేకసార్లు ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. ఇక్కడ వంతెన నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కాని ఆ పనులు పిల్లర్ల దశ దాటలేదు. అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జి ఎప్పుడు పూర్తవుతుందో తెలియకుండా ఉంది. రాకపోకలకు ప్రజలు ఇంత కష్టపడుతున్నా ఎమ్మెల్యే రేఖనాయక్ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. దీంతో ఎమ్మెల్యే తీరుపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందట. వంతెన నిర్మిస్తామని చెప్పి మాట తప్పిన ఎమ్మెల్యేకు ఎన్నికలలో బుద్ది చెప్పాలని ప్రజలు నిర్ణయించుకున్నారట. ఆత్రం సక్కు తీరుపై ఆగ్రహం.. కుమ్రంబీమ్ జిల్లా ఆసిఫాబాద్ నియోజకవర్గంలో గుండేగామ్ గ్రామానికి పక్కనే ఉన్న వాగుపై దశాబ్దం క్రితం వంతెన నిర్మాణం ప్రారంభించారు. ఇన్నేళ్ళయినా ఆ వంతెన పనులు పిల్లర్ల దశ దాటలేదు. వంతెన లేకపోవడంతో గ్రామస్థులు పుట్టి, తెప్పలపై ప్రయాణం సాగిస్తున్నారు. వాగుకు వరద వచ్చినపుడు ప్రమాదాల బారినపడుతున్నారు. అదేవిధంగా కెరమెరి మండలం కరంజీవాడ వాగుపై కూడా వంతెన లేదు. వంతెన కోసం పునాదులు తవ్వి వదిలేశారు. ఈ ప్రాంతంలో పది గ్రామాల ప్రజలు దశాబ్దాలుగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడినపుడు రోజుల తరబడి ఈ గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలుండవు. ప్రజల కష్టాలు తెలిసినప్పటికీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పట్టించుకోవడంలేదని ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. వంతెన కోసం అవసరమైతే ఎన్నికలు బహిష్కరించాలన్న ఆలోచనతో ఉన్నారని టాక్ నడుస్తోంది. (చదవండి: మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు) కష్టాలకు బదులివ్వడం ఖాయమా.. ఇక ఆదిలాబాద్ నియోజకవర్గంలోని జైనథ్ మండలం తరోడాలో అంతరాష్ట్ర రహదారిపై ఉన్న వాగుపై ఓ వంతెన ఉంది. పగుళ్లుబారి ప్రమాదకరమైన స్థితికి చేరడంతో దానిపై రాకపోకలు నిలిపివేశారు. దీంతో ఈ మార్గంలో ప్రయాణించేవారు నానా కష్టాలు పడుతున్నారు. నియోజకవర్గంలోని జైనథ్, బేల మండలాల ప్రజలకు ఈ వంతెన ఎంతో ముఖ్యమైనది. వంతెన నిర్మాణానికి నిధులు మంజూరైనా పనులు చేయించడంతో ఎమ్మెల్యే జోగు రామన్న విఫలమయ్యారని అక్కడి ప్రజలు, విపక్షాలు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు. ప్రజలకు అవసరమైన పనులు చేయించలేని ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలని ప్రతిపక్షాలు పిలుపునిస్తున్నాయి. ఈ వంతెనే అధికార పార్టీని ఓడించబోతోందని, తమను గెలిపించబోతోందని విపక్ష నేతలు సంబరపడుతున్నారు. ఇదిలా ఉంటే విపక్షాల విమర్శలను అధికార పార్టీ నేతలు కొట్టిపారేస్తున్నారు. వంతెనలు నిర్మించడం అంటే నిచ్చెనలు వేసినంత సులువుకాదంటున్నారు. బ్రిడ్జిల నిర్మాణానికి నిధులు మంజూరు చేయించినా తమ మీద అనవసరంగా విమర్శలు చేస్తున్నారని, నియోజకవర్గాల్లో తాము సాధించిన అభివృద్ధి పనులే మరోసారి తమను గెలిపిస్తాయని గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం!
ఆదిలాబాద్‌రూరల్: రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా మా వల మండల కేంద్రంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ముందుగా ట్రాక్టర్లతో చేపట్టిన భారీలో పాల్గొన్నారు. అనంత రం ఆయన మాట్లాడారు. రైతు బాగుపడితే సమాజం బాగుపడుతుందన్న ఉద్దేశంతో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అన్నివిధాలా అండగా నిలుస్తోందన్నారు. నాడు కాంగ్రెస్ హయాంలో రైతు ల సమస్యలు పరిష్కరించడంలో ఆ పార్టీ పూర్తిగా విఫలమయిందన్నారు. మూడు గంటల విద్యుత్ ఇస్తామంటున్న కాంగ్రెస్, మోటార్లకు మీటర్లు పెడతామన్న బీజేపీ అన్నదాతపై కక్ష సాధించేలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇందులో డీసీసీబీ చైర్మన్ అడ్డి భో జారెడ్డి, గ్రంథాలయ చైర్మన్ మనోహర్, జెడ్పీటీసీ వనిత రాజేశ్వర్, సర్పంచ్ ప్రమీల రాజేశ్వర్, ఎంపీపీ సంగీత, నాయకులు ప్రహ్లాద్, నారాయణ పాల్గొన్నారు. రేవంత్ క్షమాపణలు చెప్పకపోవడం సిగ్గుచేటు జైనథ్: సాగుకు కేవలం మూడు గంటల విద్యుత్ మా త్రమే చాలంటూ రైతాంగాన్ని కించపర్చిన రేవంత్ రెడ్డి ఇంకా రైతులకు క్షమాపణలు చెప్పకపోవడం సి గ్గుచేటని ఎమ్మెల్యే రామన్న అన్నారు. మండలంలోని సిర్సన్న గ్రామంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రైతులకు మళ్లీ కష్టాలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్, నాయకులు వెంకట్‌రెడ్డి, లింగారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఒకవేళ ఎన్నికల్లో ఓడితే..రేవంత్ కు జోగు రామన్న సవాల్
-
బీఆర్ఎస్ ఎమ్మెల్యేకు తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, ముంబై: బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు ఎన్‌హెచ్-44పై ఎద్దులను తప్పించబోయి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ క్రమంలో జోగు రామన్న స్వల్పంగా గాయపడ్డారు. దీంతో, అందరూ ఊపిరి పీల్చుకున్నారు. వివరాల ప్రకారం.. మహారాష్ట్రలోని పండ్రకవడలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు తృటిలో ప్రమాదం తప్పింది. ఎన్‌హెచ్-44పై ఎద్దులను తప్పించబోయి కారు డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎమ్మెల్యే రామన్నకు స్వల్పగాయాలయ్యాయి. కాగా, ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో ఎమ్మెల్యే రామన్న, మాజీ ఎంపీ నగేష్ ఉన్నారు. అయితే, వీరు నాగపూర్ వెళ్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం అనంతరం, ఎమ్మెల్యే జోగు రామన్న మరొక వాహనంలో నాగపూర్ వెళ్లిపోయారు. ఇది కూడా చదవండి: లిఖితది ఆత్మహత్య కాదు.. ప్రమాదం: వీసీ వెంకట రమణ -
ఆదిలాబాద్: అప్పుడే మొదలైన ఎన్నికల పోరు..
సాక్షి, ఆదిలాబాద్: ఆదిలాబాద్ నియోజకవర్గంలో అప్పుడే ఎన్నికల పోరు మొదలైంది. ఎమ్మెల్యే రామన్న ఇక్కడినుంచి నాలుగుసార్లు విజయం సాధించారు. ఐదోసారి పోటీచేసి విజయం సాధించాలనుకుంటున్నారు. మరోసారి మంత్రి పదవి కోసం తహతహలాడుతున్నారు. ఎమ్మెల్యే రామన్న కొంతకాలంగా ప్రజల మధ్యనే తిరుగుతున్నారు. ఎన్నికల ప్రచారాన్ని మరిపిస్తున్నారు. తెలంగాణ తొలి క్యాబినెట్లో మంత్రిగా పనిచేసిన రామన్న.. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు కూడా రవాణా సౌకర్యం కల్పించారు. పట్టణంలో సుందరీకరణ సహా అభివృద్ధి పనులు చేపట్టారు. పట్టణాన్ని అభివృద్ధి చేసినా.. కొన్ని పనులు జరగకపోవడం రామన్నకు మైనస్‌గా చెబుతున్నారు. పార్టీ నాయకుల భూ కబ్జాలు ఎమ్మెల్యేకు తలనొప్పిగా మారాయంటున్నారు. దీనికి తోడు.. డైరీ కార్పొరేషన్ చైర్మన్ లోకభూమారెడ్డి మరికొందరు రామన్నకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. అయితే మున్నూరు కాపులే నియోజకవర్గంలో గెలుపు ఓటములను నిర్ణయించే సామాజికవర్గం. ఎవరు ఎన్ని కుట్రలు చేసిన టిక్కెట్ తనకే దక్కుతుందని రామన్న భావిస్తున్నారట. ఇక రామన్నను ఓడిస్తానంటూ ప్రచారం చేసుకుంటున్నారు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న బీజేపీ నాయకుడు పాయల శంకర్. రామన్నను ఉక్కిరిబిక్కిరి చేసేలా వ్యూహాలను రచించినప్పటికీ ఆయన చేతిలో పాయల శంకర్ రెండుసార్లు ఓటమి చెందారు. ఈసారి బీజేపీలో టిక్కెట్ పోరు తారాస్థాయికి చేరింది. పాయల్ శంకర్‌కు టిక్కెట్ ఇవ్వవద్దని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుహసిని రెడ్డి, ఎన్అర్ఐ కంది శ్రీనివాస్ రెడ్డి లాబీయింగ్ చేస్తున్నారట. ఈ ఇద్దరు తమకే టిక్కెట్ దక్కుతుందని ప్రచారం చేసుకుంటున్నారు. దీనితో బీజేపీలో టిక్కెట్ పోరు అసక్తికరంగా మారింది. చదవండి: మునుగోడులో సర్వేల జోరు.. ఎవరైతే బెటర్! కాంగ్రెస్ జిల్లా ఇంచార్జ్ అధ్యక్షుడు షాజిద్ ఖాన్ తానే పార్టీ అభ్యర్థిని అంటూ ప్రచారం చేసుకుంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి ఓడిన గండ్రత్ సుజాత మళ్లీ పోటీకి సై అంటున్నారు. అయితే ఈ ఇద్దరికీ టీఆర్ఎస్, బీజేపీలను ఓడించే సత్తా లేదని భావించి మరో సమర్థుడైన అభ్యర్థి కోసం కాంగ్రెస్ నాయకత్వం వెతుకుతోందని తెలుస్తోంది. షెడ్యూల్డు తెగలకు రిజర్వైన బోథ్ నుంచి రాథోడ్ బాపురావు టీఆర్ఎస్ తరపున రెండుసార్లు విజయం సాధించారు. మూడోసారి కూడా పోటీ చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా నియోజకవర్గానికి ఏమీ చేయలేదని బాపురావు మీద ప్రజలకు తీవ్ర అసంతృప్తిగా ఉంది. అత్యంత మారుమూల ప్రాంతమైన బోథ్‌లోని అనేక గ్రామాలకు సరైన రవాణా సౌకర్యం లేదు. వెంటనే నిర్మాణపనులు ప్రారంభిస్తామన్న కుఫ్టీ ప్రాజెక్టు ఇంకా కాగితాలకే పరిమితమైంది. ఎమ్మెల్యే అసమర్థత వల్లనే స్థానిక సంస్థల్లో ప్రతికూల ఫలితాలు వచ్చాయని పార్టీ నాయకత్వం భావిస్తోంది. బాపురావు గ్రామాల్లోకి వెళితే అడ్డుకుంటూ తమ వ్యతిరేకతను ప్రజలు తెలియచేస్తున్నారు. పైగా సర్వేల్లో కూడా బోథ్ ఎమ్మెల్యే బాగా వెనుకబడినట్లు సమాచారం. నియోజకవర్గంలో ఇంతటి ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటున్న రాథోడ్ బాపురావుకు వచ్చేసారి టిక్కెట్ రాదని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఎంపీ సోయం బాపురావు గనుక కమలం పార్టీ తరపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగితే.. టీఆర్ఎస్ బాస్ ఇక్కడి ఎమ్మెల్యే టిక్కెట్ తనకే ఇస్తారని మాజీ ఎంపీ నగేష్ అంటున్నారు. పార్టీలో తనకు పోటీ పెరగడం, ప్రజల్లో పెరుగుతున్న వ్యతిరేకతతో బాపురావు తీవ్ర ఆందోళన చెందుతున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే బీజేపీ తరపున ఎంపీ సోయం బాపూరావు బరిలోకి దిగడం ఖాయం అంటున్నారు. పార్టీ నాయకత్వం కూడా సోయంకు ఓకే చెప్పిందని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి వస్తే...తాను ఎమ్మెల్యేగా నెగ్గితే మంత్రి పదవి ఖాయమని సోయం భావిస్తున్నారు. సోయంకు లోక్‌సభ ఎన్నికల్లో ఆదివాసీలు అండగా నిలిచారు. అందుకే ఆయన ఎంపీ అయ్యారు. ఎంపీ కాగానే తుండదెబ్బ బాధ్యతల నుంచి తప్పుకున్నారు సోయం బాపురావు. దీంతో ఆయనకు ఆదివాసీలు వ్యతిరేకంగా మారారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇక కాంగ్రెస్‌కు బోథ్‌లో అభ్యర్థే కనిపించడంలేదు. టీఆర్ఎస్లో టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న ఎంపీటీసీ అనిల్ జాదవ్...అక్కడ ఫలితం లేకపోతే కాంగ్రెస్‌లోకి జంప్ చేస్తారని ఆశిస్తున్నారు. -
ఎమ్యెల్యే VS రిమ్స్ డైరెక్టర్
-
‘ఎమ్మెల్యే క్షమాపణ చెప్పాలి’
ఉట్నూర్‌రూరల్: ఆదిలాబాద్ ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే జోగు రామన్న క్షమాపణ చెప్పాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం మండల కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహించారు. ఎంపీపై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో రాజశేఖర్, రమేశ్, దేవి దాస్, భాగ్యలక్ష్మీ, రాజమణి, హరిప్రసాద్, రాజేందర్, మోహన్, వెంకటేశ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఎంపీ జోలికోస్తే సహించేది లేదు ఇంద్రవెల్లి: ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ సోయం బాపురావు జోలికి వస్తే సహించేది లేదని బీజేపీ నాయకులు హెచ్చరించారు. ఎమ్మెల్యే జోగు రామన్న ఎంపీపై చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై బీజేపీ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యేపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో దీపక్‌సింగ్‌షెకవత్, మరప రాజు, వైస్ ఎంపీపీ పడ్వాల్ గోపాల్‌సింగ్, మడావి భీంరావు, ఆడవ్ చంపత్‌రావ్, ఆరెల్లి రాజలింగు, గేడం భరత్ పాల్గొన్నారు. -
మున్సిపల్ చైర్మన్‌గా ఎమ్మెల్యే కొడుకు
సాక్షి,ఆదిలాబాద్: ఆదిలాబాద్ బల్దియాపై సంపూర్ణంగా గులాబీ జెండా ఎగిరింది. చైర్మన్, వైస్ చైర్మన్ రెండూ పదవులను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. గత పాలకవర్గంలో ఎంఐఎం, స్వతంత్ర అభ్యర్థుల మద్దతుతో కారు పార్టీ గద్దెనెక్కింది. అయితే ఈమారు మాత్రం టీఆర్ఎస్ ఒంటరిగా అధికారం దక్కించుకుంది. చైర్మన్‌గా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న తనయుడు జోగు ప్రేమేందర్, వైస్ చైర్మన్‌గా టీఆర్ఎస్ పార్టీకే చెందిన మహ్మద్ జహీర్ రంజానిలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్లు ఏకగ్రీవం.. మున్సిపల్ ఎన్నికల్లో వార్డు సభ్యులుగా ఎన్నికైన వారికి ఆదిలాబాద్ మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. జేసీ సంధ్యారాణి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. తెలుగు అక్షరమాల ప్రకారం సభ్యులు ప్రమాణస్వీకారం చేశారు. కొంత మంది తెలుగులో, కొంత మంది హిందీలో, ఒకరు ఇంగ్లీషులో ప్రమాణస్వీకారం చేశారు. 11.53 గంటలకు ప్రమాణస్వీకారం ముగిసింది. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశంలో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక నిర్వహిస్తామని జేసీ పేర్కొనడం జరిగింది. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ నుంచి గెలిచిన 24 మంది సభ్యులకు తోడు స్వతంత్ర అభ్యర్థులుగా గెలిచిన ఇద్దరు పార్టీలో చేరడంతో బలం 26కు చేరుకుంది. బీజేపీ 11 మంది సభ్యులు, కాంగ్రెస్ ఐదుగురు, ఎంఐఎం ఐదుగురు, మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు ప్రత్యేక సమావేశానికి హాజరయ్యారు. కాగా బీజేపీ తరఫున ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు, టీఆర్ఎస్ తరఫున ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న మున్సిపాలిటీలో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. అయితే ఎంపీ సోయం బాపురావు గైర్హాజరు కాగా ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న హాజరయ్యారు. ఇకపోతే కౌన్సిలర్లు 49 మంది, ఎక్స్అఫీషియో మెంబర్ ఎమ్మెల్యేను కలుపుకొని 50 మంది ఉండగా, మెజార్టీ 25 వస్తే ఆ పార్టీ ప్రతిపాదించిన అభ్యర్థి చైర్మన్ అవుతారని జేసీ వివరించారు. అయితే కేవలం టీఆర్ఎస్ నుంచే విప్ నోటీస్ అందినట్లు తెలిపారు. ఇతర పార్టీలు విప్ నోటీస్ అందించలేదని స్పష్టం చేశారు. అనంతరం టీఆర్ఎస్ నుంచి 34వ వార్డు కౌన్సిలర్ జోగు ప్రేమేందర్ పేరును చైర్మన్ అభ్యర్థిగా, 45వ వార్డు కౌన్సిలర్ బండారి సతీష్ ప్రతిపాదించగా, 12వ వార్డు కౌన్సిలర్ జాదవ్ పవన్‌నాయక్ బలపర్చారు. ఇతర పార్టీల నుంచి చైర్మన్ అభ్యర్థిత్వానికి ఎవరూ పోటీ పడలేదు. దీంతో జోగు ప్రేమేందర్ ఏకగ్రీవంగా చైర్మన్‌గా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు. అనంతరం టీఆర్ఎస్కే చెందిన 29వ వార్డు కౌన్సిలర్ మహ్మద్ జహీర్ రంజాని పేరును వైస్ చైర్మన్ అభ్యర్థిత్వానికి ఆ పార్టీకి చెందిన 33వ వార్డు కౌన్సిలర్ అలాల అజయ్ ప్రతిపాదించగా, 9వ వార్డు కౌన్సిలర్ ఉష్కం రఘుపతి బలపర్చారు. ఇక్కడ కూడా ఇతర పార్టీల నుంచి ఎవరూ వైస్ చైర్మన్ అభ్యర్థిత్వానికి పోటీకి రాకపోవడంతో మహ్మద్ జహీర్ రంజాని కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు జేసీ ప్రకటించారు. తండ్రికి పాదాభివందనం.. నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌తో జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి ప్రమాణస్వీకారం చేయించడంతో ప్రత్యేక సమావేశం ముగిసింది. అనంతరం నూతన చైర్మన్, వైస్ చైర్మన్లతో కలిసి ఎమ్మెల్యే జోగురామన్న పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. టీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అంతకుముందు ప్రమాణస్వీకారం అనంతరం చైర్మన్ చాంబర్లో జోగు రామన్న కుటుంబ సభ్యులు అందరు కలిసి జోగు ప్రేమేందర్‌కు శుభాకాంక్షలు తెలిపారు. జోగు ప్రేమేందర్ తండ్రి జోగురామన్నకు పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకున్నారు. ఎంఐఎంకు చెక్.. వైస్ చైర్మన్ ఎన్నికలో టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మున్సిపల్ ఎన్నికల్లో పార్టీకి అవసరమైన మెజార్టీ లభించడంతో సొంతగానే పాలకవర్గం ఏర్పాటుకు ఆసక్తి చూపిందనేది స్పష్టమవుతుంది. గత పాలకవర్గంలో ఎంఐఎంకు వైస్ చైర్మన్ పదవిని కట్టబెట్టారు. ఈమారు టీఆర్ఎస్ నుంచి గెలిచిన ముస్లిం నాయకుడు మహ్మద్ జహీర్ రంజానికి పదవి కల్పించారు. తద్వారా ఎంఐఎంకు చెక్ పెట్టారన్న చర్చ సాగుతుంది. కాగా మున్సిపోల్స్‌లో ఆది నుంచి ఎమ్మెల్యే జోగురామన్న వ్యూహాత్మకంగా పావులు కదిపారన్న ప్రచారం జరుగుతోంది. చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక ఘట్టంలోనూ తన రాజకీయ చతురతను చాటి నియోజకవర్గంలో బలమైన నేతగా మరోసారి నిరూపించుకున్నారన్న భావన అందరిలో వ్యక్తమవుతోంది. -
రెండేళ్లలో కొత్త రైళ్లు..
సాక్షి, ఆదిలాబాద్ : ఆదిలాబాద్‌లో రైల్వే అభివృద్ధికి కృషి చేస్తానని, రెండేళ్లలో కొత్త రైళ్లు వేస్తామని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అన్నారు. వార్షిక తనిఖీలో భాగంగా శుక్రవారం ఆదిలాబాద్ రైల్వేస్టేషన్‌ను సందర్శించారు. పలు అభివృద్ధి పనులతోపాటు కొత్తగా నిర్మించిన భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ భద్రతపైనే ప్రధాన దృష్టి సారిస్తున్నట్లు పేర్కొన్నారు. రైల్వే ఇంజిన్ కండీషన్, కొత్త రైళ్ల పొడిగింపు, రైల్వేస్టేషన్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. ప్రయాణికుల డిమాండ్ మేరకు ప్రభుత్వానికి బడ్జెట్ కోసం నివేదికను పంపించామని, నిధులు విడుదలైతే రెండేళ్లలో కొత్త రైళ్లతోపాటు ఆయా పనులు చేపడుతామన్నారు. కలకత్తా, బెంగళూరు, తిరుపతి, తదితర ప్రాంతాలకు ఇక్కడి నుంచి రైళ్ల రాకపోకలు సాగించాలని ప్రయాణికుల నుంచి విజ్ఞప్తి ఉందని తెలిపారు. ఎలక్ట్రిసిటీ రైళ్ల కోసం టెండర్ పనులు ప్రారంభించామని, త్వరలోనే టెండర్లు పూర్తయితే పనులు ప్రారంభిస్తామన్నారు. గతంలో మీటర్‌గేజ్ రైలు, ప్రస్తుతం బ్రాడ్‌గేజ్ రైళ్లు నడుస్తున్నాయని, ప్రయాణికుల సౌకర్యార్థం మరింత నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని చెప్పారు. వివిధ ప్రాంతాల నుంచి నాందేడ్ వరకు వచ్చే రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని పలువురు విన్నవించారని, ఈ విషయంపై పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్నారు. పిప్పల్‌కోటి, ముత్ఖేడ్ ఎలక్ట్రేషన్ పనులు పూర్తయ్యాయని, వచ్చే ఏడాది డబ్లింగ్ పనులు మొదలు పెడుతున్నట్లు తెలిపారు. చిల్ర్డన్ పార్క్, సోలార్ ప్లాంట్, టీటీఈ రెస్ట్‌రూమ్‌లను ప్రారంభించారు. రైల్వే క్వార్టర్స్‌ను పరిశీలించి అక్కడ ఉంటున్న వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రహరీ పనులను పరిశీలించారు. రోడ్డు సౌకర్యం, బోరు వేయించాలని అందులో ఉంటున్న వారు విన్నవించడంతో సమస్య పరిష్కరించేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా రైల్వేస్టేషన్ ఆవరణలో మొక్కలు నాటి వాటికి నీరు పోశారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకనే ఆటంకాలు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతోనే రైల్వే పనుల్లో ఆటంకాలు ఎదురవుతున్నాయని దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా అన్నారు. ప్లైఓవర్, అండర్‌బ్రిడ్జి కోసం రూ.78 కోట్లు అవసరం ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం చెల్లించాల్సి ఉంటుందని, నిధులు విడుదల చేయకపోవడంతో ఈ పనులు చేపట్టడం లేదన్నారు. అలాగే ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వే లైన్ జాయింట్ వెంచర్‌కు సంబంధించిందని, ఈ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడం లేదన్నారు. ఈ విషయమై పలుసార్లు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శిని కలిశామని, మరోసారి కలిసి ఈ పనుల విషయమై చర్చిస్తామన్నారు. వినతుల వెల్లువ.. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌కు వచ్చిన దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యాకు పలువురు వినతులు సమర్పించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న రైల్వే జీఎంను కలిసి పెండింగ్‌లో ఉన్న పనులను పరిష్కరించాలని విన్నవించారు. చిల్ర్డన్ పార్కు, సోలార్ విద్యుత్, రైల్వే సిబ్బంది క్వార్టర్‌ను పరిశీలించారు. ఇతర ప్రాంతాల నుంచి నాందేడ్‌కు వచ్చే వివిధ రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని కోరారు. ఆయన వెంట జెడ్పీ వైస్‌చైర్మన్ రాజన్న, మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రహ్లాద్, టీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్, సీపీఎం జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్‌రెడ్డి, జిల్లా నాయకులు విలాస్, సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్, రాష్ట్ర నాయకులు బండి దత్తాత్రితోపాటు పలువురు రైల్వే జీఎంను కలిసి వినతిపత్రాలు అందజేశారు. రైల్వేఓవర్, అండర్‌బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాలని, ఆదిలాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్ పనులను చేపట్టాలని కోరారు. ఆదిలాబాద్–ఢిల్లీ రైలు వేయాలని, ఆదిలాబాద్–ముత్ఖేడ్ వరకు డబుల్ రైల్వే లైన్ పనులు చేపట్టాలని, నిజామాబాద్ వరకు వస్తున్న విశాఖ ఎక్స్‌ప్రెస్, రాయలసీమ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదిలాబాద్ వరకు పొడిగించాలని, ఆదిలాబాద్–హైదరాబాద్ వరకు ఉద యం పూట రైలు నడిపించాలని, ఆదిలాబాద్–నాగ్‌పూర్ రైలు సాయంత్రం వేళల్లో నడిపించాలని విన్నవించారు. కృష్ణ ఎక్స్‌ప్రెస్‌లో రెండు స్వీపర్ బోగీలను పెంచాలని కోరారు. -
బాల మేధావులు భళా !
సాక్షి, ఆదిలాబాద్ : విద్యార్థులు తయారు చేసిన ప్రదర్శనలు చూసి నివ్వరపోయేలా చేసింది. పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, రోడ్డు ప్రమాదాల నివారణ, వ్యర్థాలతో అర్థాలు, విద్యుత్, నీటి ఆదా, తదితర ప్రదర్శనలు తయారు చేశారు. భావితర శాస్త్రవేత్తలుగా నమూనాలను తయారు చేసి ఆలోచింపజేశారు. ఆదిలాబాద్ పట్టణంలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో జిల్లా వైజ్ఞానిక సైన్స్ ప్రదర్శన నిర్వహించారు. జిల్లాలోని 700లకు పైగా పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని ప్రయోగాలను ప్రదర్శించారు.కలెక్టర్ దివ్యదేవరాజన్, ఆదిలాబాద్, బోథ్ ఎమ్మెల్యేలు జోగురామన్న, రాథోడ్ బాపురావు, జిల్లా విద్య శాఖాధికారి డాక్టర్ ఎ.రవీందర్‌రెడ్డి తిలకించారు. వీరితో పాటు మార్కెట్ కమిటీ మెట్టు ప్రహ్లాద్, తదితరులు విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి రఘురమణ, అకాడమిక్ కోఆర్డినేటర్ నారాయణ, ఎంఈఓ జయశీల, శ్రీహరిబాబు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, ఓపెన్‌స్కూల్ కోఆర్డినేటర్ అశోక్, సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ ఆనంద్‌రెడ్డి పాల్గొన్నారు. పర్యావరణాన్ని కాపాడేందుకు.. పర్యావరణ కాలుష్యంతో గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది. ఫ్యాక్టరీలతో వాయు కాలుష్యం, నీటి కాలుష్యమై రోగాలు ప్రబలుతున్నాయి. సెల్ టవర్ల కారణంగా పిచ్చుకలు చనిపోతున్నాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు మొక్కలు నాటడడంతో పాటు ప్లాస్టిక్ వినియోగాన్ని అరికట్టాలి. భూగర్భ జలాలు పెంపొందించేందుకు ఇంకుడుగుంతలను ఏర్పాటు చేసుకోవాలి. – నవీన, ప్రతిభ, కేజీబీవీ, ఆదిలాబాద్ గాలి ద్వారా వంట.. గాలిద్వారా వంట చేసుకోవచ్చు. ఇందుకోసం పెట్రోల్, నీరు అవసరం ఉంటుంది. రెండు వేర్వేరు బాటిళ్లలో నీళ్లు, పెట్రోల్ పోసి పైపులను అమర్చుకోవాలి. పెట్రోల్ బాటిల్‌కు ఒక పైపును ఏర్పాటు చేసి గాలిని పంపాలి. ఆ గాలి పెట్రోల్లోకి వెళ్లి గ్యాస్లీన్ వాయువు తయారవుతుంది. దానిద్వారా వంట చేసుకోవచ్చు. పెట్రోల్ అలాగే ఉంటుంది. ఎలాంటి ఖర్చు లేకుండా వంట చేసుకోవచ్చు. పర్యావరణాన్ని కూడా కాపాడుకోవచ్చు. – తృప్తి, ఝాన్సీరాణి, జెడ్పీఎస్ఎస్, ఇచ్చోడ విషజ్వరాలు సోకకుండా.. ప్రస్తుతం దోమలతో జ్వరాలు ప్రబలుతున్నాయి. ప్రజలు డెంగీ, మలేరియా, విషజ్వరాలు సోకుతున్నాయి. దోమల నివారణ కోసం తులసీ, బంతి, సజ్జల మొక్కలను ఇంట్లో పెంచితే దోమలు వృద్ధి చెందవు. గడ్డి చామంతి, వేప ఆకులను ఎండబెట్టి పొగపెడితే దోమలు ఉండవు. వేప నూనె, కొబ్బరి నూనె చర్మానికి రాసుకుంటే కుట్టవు. బ్యాక్టీరియా దరిచేరదు. – వర్ష, కృష్ణవేణి, జెడ్పీఎస్ఎస్, మావల సహజ వనరుల వినియోగం సహజ వనరుల వినియోగంతో అనేక లాభాలు పొందవచ్చు. వర్షాకాలంలో ట్యాంకుల్లో నీరు నిల్వ ఉంచుకొని వర్షాలు లేనప్పుడు వాటిని డ్రిప్ ద్వారా వినియోగించుకుంటే పంటలు పండుతాయి. పశువుల పెంపకంతో గోబర్ గ్యాస్ తయారు చేసుకోవచ్చు. సౌర శక్తితో విద్యుత్‌ను తయారు చేసుకోవచ్చు. ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులను వినియోగించకుండా సహజసిద్ధమైన ఎరువులను తయారు చేసి వాడాలి. – యశశ్విని, దుర్గా, అరుణోదయ పాఠశాల, ఆదిలాబాద్ దోమలు వృద్ధి చెందకుండా.. దోమలు మురికి కాల్వలు, నిల్వ నీటిలో గుడ్లు పెట్టి వృద్ధి చెందుతాయి. దోమలను లార్వ దశలోనే నివారించేందుకు ఇంట్లో వాడిన మంచినూనె, రంపం పొట్టు, గుడ్డలను తీసుకోవాలి. రంపం పొట్టును గుడ్డలో కట్టి నూనెలో ముంచి మురికి కాల్వల్లో పారవేయాలి. ఆయిల్ పైకివచ్చి దోమల లార్వలకు ఆక్సిజన్ అందకుండా నూనె పైకితేలుతూ అవి నశించేలా చేస్తాయి. – దీపాలి, మారుతి, జెడ్పీఎస్ఎస్, మన్నూర్ సైన్స్ ప్రదర్శనలను తిలకిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యేలు చల్లని, వేడి గాలిచ్చే కూలర్.. తక్కువ ఖర్చుతో వేడి, చల్లని గాలినిచ్చే కూలర్‌ను తయారు చేసుకోవచ్చు. ఇందుకోసం బ్యాటరీ, ఫ్యాన్, స్విచ్, బెండ్ పైపు, వైర్ అవసరం ఉంటుంది. బ్యాటరీతో పనిచేస్తుంది. వేసవి కాలంలో చల్లని నీటిని అందులో పోస్తే చల్లని గాలి వస్తుంది. చలికాలంలో వేడి నీళ్లు పోస్తే వేడి గాలిలో గది వెచ్చగా ఉంటుంది. కాలానికి అనుగుణంగా దీనిని వినియోగించుకునే అవకాశం ఉంటుంది. – అవంతిక, ఆర్యభట్ట పాఠశాల, ఆదిలాబాద్ ద్రియ సాగు.. బహుబాగుసేం ప్రస్తుతం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులతో పంటలు పండించడంతో ఆహార పదార్థాలు విషహారంగా మారుతున్నాయి. దీంతో అనేక రోగాలు వస్తున్నాయి. సేంద్రియ వ్యవసాయ వల్ల సహజమైన పంటలు లభిస్తాయి. ఆవులు, గేదెల ద్వారా స్వచ్ఛమైన పాలు లభించడంతోపాటు వాటి పేడతో ఎరువులు, గోబర్‌గ్యాస్ తయారు చేసుకోవచ్చు. – కె.అంకిత, విశ్వశాంతి పాఠశాల, ఆదిలాబాద్ -
ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ?
సాక్షి, ఆదిలాబాద్ : ఈ ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య ప్రస్తుత వైరం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. భిన్న సిద్ధాంతాలు ఉన్న వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు కావడంతో సహజంగానే పార్టీల పరంగా చోటుచేసుకున్న విభేదాలా అన్న అనుమానాలు ఉన్నా అటువంటిది కాదనేది వారి మాటలను బట్టే స్పష్టమైంది. ఇరువురు నేతలు ఇటీవల ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తమకు వ్యక్తిగతంగా ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేశారు. అయినా మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. దీంతో ఈ రచ్చకు ఆజ్యం ఏమై ఉంటుందోనని అందరిని తొలుస్తుంది. కొనసాగుతున్న పర్వం.. గత నెల వివిధ వేదికల ద్వారా ఈ ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం ద్వారా మొదలైన పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు వేర్వేరుగా ప్రెస్మీట్లు పెట్టి మరీ ఒకరి వ్యాఖ్యలను మరొకరు ఖండిస్తూ నిరంతరంగా వ్యవహారం సాగుతోంది. అయితే ఇరువురు నేతల ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా జోగు రామన్న ఉన్న సమయంలో ఆ శాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు ఉండగా, పూర్తిస్థాయిలో ఖర్చు చేసినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సోయం బాపురావు సవాల్ విసిరారు. సోయం బాపురావు తాను గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లి సంతకం పెడితే ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం జరుగుతుందని చెప్పడం జరిగిందని, ఇప్పుడు నెలలు దాటినా తాను ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రతిసవాల్ విసిరారు. ఇలా ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకోవడం గమనార్హం. ఆజ్యం ఎక్కడ? ఆదివాసీలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుండగా, ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపు విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలతో చెప్పిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ రామన్న పేర్కొనడం గమనార్హం. అయితే ఈ ఇరువురు నేతల మధ్య ఇంతటి రగడకు ఆజ్యం ఎక్కడ పడిందన్న సందేహం ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను తొలుస్తుంది. తొలుత ఆగస్టు చివరిలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కనబడింది. అయితే అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్, రైతుబంధు విషయంలో కొనసాగడంతో అది ప్రభుత్వాల పరంగా సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అక్కడ విభేదాల స్థాయి అంతగా కనిపించలేదు. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీఆర్ఎస్ 9 జెడ్పీటీసీలను గెలవడం, బీజేపీ 5, కాంగ్రెస్ 3 స్థానాల్లో గెలవడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ క్రమంలో 17 జెడ్పీటీసీల్లో 9 మంది మెజార్టీ ఉన్న టీఆర్ఎస్ జెడ్పీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోవడం ఖాయమే అయినా అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ సభ్యులు జత కట్టడం ఆసక్తి కలిగించింది. దీనికి ఎంపీ సోయం బాపురావు నేతృత్వం వహించారు. ఇక టీఆర్ఎస్ నుంచి ఎవరినైన ఒకరిని ఇటువైపు తిప్పుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయన్న రాజకీయ వేడి జెడ్పీచైర్మన్ ఎన్నిక రోజు కనిపించింది. అయితే ఈ వ్యవహారంలో ముందు జాగ్రత్త పడ్డ టీఆర్ఎస్ ముఖ్యంగా ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావులు ఉట్నూర్ కాంగ్రెస్ జెడ్పీటీసీ చారులతను టీఆర్ఎస్ వైపు తిప్పుకున్నారు. జెడ్పీచైర్మన్ ఎన్నికలో చారులత టీఆర్ఎస్కు మద్దతిచ్చారు. బీజేపీ నుంచి ఆదివాసీ అభ్యర్థిని జెడ్పీచైర్మన్ పదవి కోసం పేరు ప్రతిపాదించాక ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్నకు విభేదాలు అప్పటి నుంచే పొడసూపాయా అన్న అభిప్రాయం వ్యక్తమైనా ఆ సమావేశం చివరిలో ఇరువురు నేతలు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఆసక్తి కలిగించింది. పట్టున్న నేతలే.. ఈ నేతల రాజకీయ అనుభవాన్ని పరిశీలించినా ఇరువురు పట్టున్న నేతలే. ఎంపీ సోయం బాపురావు ఆదివాసీ ఉద్యమం పరంగా తన జాతి కోసం పోరాటం చేస్తూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్‌కు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా గతంలో బోథ్ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశారు. ఇక ఎమ్మెల్యే జోగు రామన్న బీసీల ఆదరణతో ఆదిలాబాద్ నియోజకవర్గంలో పట్టు కలిగి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో మంత్రిగా పనిచేశారు. రాజకీయ అడుగులకు విరోధం కావడంతో ఇరువురి మధ్య ఈ విభేదాలు తలెత్తాయా.. లేదంటే మరేమైనా అయి ఉంటుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కేంద్రం నక్సల్ బాధిత జిల్లాలకు ఇచ్చే నిధులను మళ్లించారని జోగు రామన్నతోపాటు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై కూడా సోయం బాపురావు విమర్శలు సంధించారు. అలాంటప్పుడు నిధుల మళ్లింపు విషయంలో ఈ విభేదాలా.. లేనిపక్షంలో సామాజిక కోణంలో హక్కులు, నిధుల విషయంలో ఒకరిపై మరొకరి ఆరోపణలు అగ్నికి ఆజ్యం పోసిందా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా మున్సిపల్ ఎన్నికల ముందు టీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఇది రాజకీయ వేడి పుట్టిస్తోంది. -
సోయం పారిపోయే లీడర్ కాదు
సాక్షి, ఆదిలాబాద్ : ఇటీవల ఉట్నూర్‌లో జరిగిన ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావ్ సమస్యలపై చర్చించకుండా మధ్యలో నుంచి పారిపోయాడని ఎమ్మెల్యే జోగు రామన్న చేసిన వ్యాఖ్యలను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకర్ తీవ్రంగా ఖండించారు. సోయం బాపురావ్ పారిపోయే లీడర్ కాదని, ఇతరులను పారిపోయేలా చేసే లీడర్ అన్నారు. ఎంపీపై ఇకనైనా వ్యక్తిగత విమర్శలు చేయడం మానుకోవాలన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే జోగు రామన్న పదవుల కోసం రాజకీయం చేస్తే, ఎంపీ సోయం బాపురావ్ అన్ని రంగాల్లో వెనుకబడి ఉన్న ఆదివాసీ జాతి కోసం ఆయన ప్రాణాన్ని పణంగా పెట్టి పోరాటం చేస్తున్నాడన్నారు. జోగు రామన్న ఎంపీపై చేసిన వ్యాఖ్యలు అధికార దురహంకారానికి నిదర్శమని విమర్శించారు. విమర్శలు చేసేముందు ఎమ్మెల్యే సోయం బాపురావ్ చరిత్రను తెలుసుకోవాలని అన్నారు. ఎమ్మెల్యే వెంటనే ఎంపీకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. జిల్లాలోని అన్ని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించమని చెబుతున్న ఎమ్మెల్యే జోగు రామన్న, జిల్లాలో 243 ఆదివాసీ గ్రామాలు ఉంటే కేవలం 143 గ్రామాలకు మాత్రమే రోడ్డు సౌకర్యాలు కల్పించారని అన్నారు. ఐఏపీ నిధులు దుర్వినియోగం చర్చపై మా ఎంపీ అవసరం లేదని పార్టీ జిల్లా అధ్యక్షునిగా తనే వస్తానని స్థలం ఎక్కడ ఎంచుకుంటారో ఎంచుకోవాలని ఆధారాలతో రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు. సమావేశంలో బీజేపీ నాయకులు సునంద రెడ్డి, జ్యోతి, రవి, ప్రవీణ్, సతీష్, ప్రవీణ్ పాల్గొన్నారు. సోయం అంటే టీఆర్ఎస్కు వణుకు బోథ్: ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావ్ అంటే టీఆర్ఎస్ నేతలకు వెన్నులో వణుకు పుడుతుందని, ఆయన భయపడి పారిపోయే వ్యక్తి కాదని ఆత్మరాష్ట్ర మాజీ డైరెక్టర్ రాజుయాదవ్ ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్నను ఉద్దేశించి అన్నారు. శుక్రవారం బోథ్ మండల కేంద్రంలో ఆయన మాట్లాడుతూ... ఉట్నూర్‌లో జరిగిన ఐటీడీఏ పాలకవర్గం సమావేశంలో ఎంపీ సోయం బాపూరావ్ సమావేశం నుంచి పారిపోయాడని ఎమ్మెల్యే జోగురామన్న గురువారం చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. (చదవండి : సభలోంచి ఎందుకు పారిపోయావ్) జోగురామన్నకు ఆదివాసీలంటే ఏమిటో చూపెడతాం ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యుడు సోయం బాపురావుపై అవాకులు చవాకులు పేలితే ఆదివాసీల సత్తా ఏమిటో చూపెడతామని తుడుందెబ్బ బోథ్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ఆదివాసీలు ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేసి చేశారు. వారు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెంటనే ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో అట్రాసిటీ కేసు నమోదు చేయిస్తామని అన్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన నోటీసులపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చే విధంగా చూడాలన్నారు. స్వార్థ రాజకీయాలు కాకుండా లంబాడీలు ఎస్టీ కాదనే విషయంపై స్పష్టమైన వైఖరి తెలపాలన్నారు. కార్యక్రమంలో మండల అధ్యక్షుడు సాంబన్న, సోనేరావు, కోటేశ్వర్, నాయక్‌పోడ్ సంఘం మండల అధ్యక్షుడు గంగాధర్, వివిధ గ్రామాల పటేళ్లు, యువకులు తదితరులు పాల్గొన్నారు. -
సభలోంచి ఎందుకు పారిపోయావ్
ఆదిలాబాద్‌టౌన్: ఐటీడీఏ గవర్నింగ్ బాడీ సమావేశంలో గిరిజనుల సమస్యలను చర్చించకుండానే మధ్యలో నుంచి ఎందుకు పారిపోయావని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న ఎంపీ సోయం బాపురావును ప్రశ్నించారు. గురువారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ క్యాంప్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గిరిజనుల అభివృద్ధికి తమ ప్రభుత్వం ఎక్కడా అడ్డుపడటం లేదన్నారు. ఆదివాసీలకు ఒక పిలుపునిస్తే కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలే ఉండవన్నావు.. నక్సలైట్, ఉగ్రవాదుల మాట్లాడిన ఆ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని కోరితే సభ మధ్యలో నుంచే పారిపోయావని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఎంపీ వ్యాఖ్యలపై లీగల్ ఒపీనియన్ తీసుకొని చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తమకు చెప్పినట్లు వివరించారు. బీజేపీ నాయకులైన కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌ను పిలిచి ఆదిలాబాద్‌లో బహిరంగ సభ ఏర్పాటు చేసి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగిస్తామని చెప్పిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. లేకుంటే ఎంపీ పదవికి రాజీనామా చేస్తావా? అని బాపురావుకు సవాలు విసిరారు. ఎవరు అవినీతికి పాల్పడ్డారో బహిరంగ చర్చకు సిద్ధమా అని అన్నారు. నాగోబా, జంగుబాయి జాతరలకు, జోడెఘాట్ ఉత్సవాలకు ప్రభుత్వం నిధులు కేటాయించిందని గుర్తు చేశారు. హైదరాబాద్, ఆదిలాబాద్‌లో ఆదివాసీ భవన్లు నిర్మించామన్నారు. తనను గెలిపిస్తే లంబాడీలను తొలగించే అంశం ఒక సంతకంతో అయిపోతుందన్న బాపురావు.. ఎంపీగా గెలిచిన తర్వాత కూడా ఎందుకు సంతకం పెట్టడం లేదని ఎద్దేవా చేశారు. అనంతరం సీఎం సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సమావేశంలో ఏఎంసీ చైర్మన్ మెట్లు ప్రహ్లాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ మనిషా, నాయకులు గోవర్ధన్‌రెడ్డి, రాజేశ్వర్, సాజిదొద్దీన్, ఆశమ్మ, సతీష్, ఖయ్యుం పాల్గొన్నారు. -
రసాభాసగా ఐటీడీఏ సమావేశం
ఆదిలాబాద్: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఐటీడీఏ పాలకవర్గ సమావేశం బుధవారం రసాభాసగా జరిగింది. ఈ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు తనపై చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని మాజీ మంత్రి జోగు రామన్న పట్టుబట్టారు. దీంతో చేసేదేమిలేక సోయం బాపురావు వ్యాఖ్యలపై ఆత్రం సక్కు క్షమాపణ కోరారు. దీంతో ఐటీడీఏ సమావేశంలో రాజకీయాలు ఎలా ప్రస్తావిస్తారని బాపురావు ప్రశ్నించారు. తాను క్షమాపణ చెప్పేది లేదంటూ సమావేశం నుంచి బాపూరావు వెళ్లిపోయారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో కూడా బుధవారం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం జరిగింది. అయితే ఈ సమావేశంలో ‘తుడుం దెబ్బ’ ఆందోళనకారులు బయటకు వచ్చి లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే విధంగా ఆదివాసి తుడుందెబ్బ నాయకులు కొమరం భీం కాంప్లెక్స్ గేట్ ముందు ధర్నా చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు. -
మాజీ మంత్రికి క్షమాపణలు చెప్పిన అనసూయ
సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుతం టాలీవుడ్లో సేవ్ నల్లమల ఫారెస్ట్ అని ట్రెండ్ అవుతోంది. హీరోలు, హీరోయిన్లు అందరూ దీనిపై స్పందిస్తున్నారు. పనిలో పనిగా అన్నట్లు అనసూయ భరద్వాజ్ కూడా ఓ ట్వీట్ చేసింది. అయితే అంతవరకు బాగానే ఉన్నా.. తనకు కరెంట్ అఫైర్స్ పట్టు లేనందున ఓ తప్పు దొర్లింది. ఆ ట్వీట్‌ను అటవీ శాఖమంత్రి జోగు రామన్న అంటూ ట్యాగ్ చేసింది. అయితే అది గత ప్రభుత్వంలో అన్న విషయం ఆమెకు కాస్త లేట్‌గా తెలిసి వచ్చింది. దీంతో మరో ట్వీట్‌ను చేసింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జోగు రామన్నకు క్షమాపణలు తెలిపింది. తనకు కరెంట్ అఫైర్స్ మీద అంత అవగాహన లేకపోవడం వల్లే ఇలా జరిగిందని చెప్పి ప్రస్తుత అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డికి ట్యాగ్ చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో సేవ్ నల్లమల ఫారెస్ట్ అనే ఉద్యమం మంచి ఊపందుకుంటోంది. నల్లమల అడవిలో యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా ఇప్పటికే విజయ్ దేవరకొండ, సమంతలాంటి ప్రముఖులు స్పందిస్తూ.. ప్రజల్లోకి తీసుకెళ్లేలా కృషి చేస్తున్నారు. Apologies for wrong tag Shri @JoguRamannaTRS .. Never thought I would one day feel the need so forgive my lack of knowledge on current affairs..Sir .. this is to address you Shri @IKReddyAllola Please consider my intention and not any other diversion🙏🏻🙏🏻 https://t.co/n8YFsd8lKS — Anasuya Bharadwaj (@anusuyakhasba) September 12, 2019 -
కేసీఆరే మా నేత..
సాక్షి, ఆదిలాబాద్: తాను పార్టీని వీడేది లేదని, కేసీఆరే మా నాయకుడని ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. బుధవారం ఆదిలాబాద్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు.. ఆరోగ్యం బాగా లేకపోవడంతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందిన.. హైబీపీ ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఎవరితో మాట్లాడలేదు. గ్రామస్థాయి నుంచి మంత్రి వరకు పని చేసిన. ఎలాంటి మచ్చ లేకుండా ప్రజలకు నిస్వార్థమైన సేవలు అందించిన. మంత్రి పదవి వస్తుందని కార్యకర్తలు, నాయకులకు భరోసా ఇచ్చిన. పదవి రాకపోవడం నిరుత్సాహానికి గురి చేసింది. ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ ఆదేశాల మేరకు పనిచేసిన. పార్టీ పటిష్టతకు కృషి చేసిన..’అని జోగరామన్న పేర్కొన్నారు. పార్టీ వ్యతిరేక కార్యక్ర మాలు ఏ రోజూ చేయలేదన్నారు. కార్యకర్తలు తనకు ఆక్సిజన్‌లాంటి వారని.. మంత్రి పదవి ఆశించడంలో తప్పులేదని అన్నారు. మంత్రి పదవి రాలేదని కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహానికి లోనయ్యారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ఆవేదన తనకు అమాత్య పదవి దక్కకపోవడంతో అసంతృప్తికి గురైన ఎమ్మెల్యే జోగురామన్న సోమవారం ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండా పోయిన విషయం తెలిసిందే. దీంతో కార్యకర్తల్లో ఆందోళన వ్యక్తమైంది. మంగళవారం హైదరాబాద్‌లో అజ్ఞాతం వీడి అందరి మధ్యలోకి వచ్చారు. ఈ సందర్భంగా ఉద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెడుతూనే.. ముఖం కిందకు వాల్చారు. పక్కనే ఉన్న ఆదిలాబాద్ జెడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్ జోగు రామన్న వైపు చూస్తూ ఉండిపోయారు. మొత్తంగా ఎమ్మెల్యే మాటల్లో ఆవేదన కనిపించింది. కార్యకర్తలు ఎవరూ ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని సూచించారు. మీ అండదండలతోనే తాను ఈ స్థాయికి ఎదిగానని పేర్కొన్నారు. -
కారణం చెప్పి.. రామన్న కంటతడి
సాక్షి, హైదరాబాద్ : అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం సృష్టించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న ఎట్టకేలకు మీడియా ముందుకు వచ్చారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రామన్నకు చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఆయన సోమవారం అందుబాటులో లేకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే బుధవారం మీడియా ముందుకు వచ్చిన రామన్న.. తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. మంత్రి పదవి ఇస్తారనే ఆశ ఉండేనని, అది దక్కకపోవడంతో మనస్థాపానికి గురయ్యానన్నారు. బీపీ పెరిగి ఆస్పత్రిలో చేరానే తప్ప అజ్ఞాతంలోకి వేళ్లే అవసరం తనకు లేదన్నారు. సర్పంచ్ స్థాయి నుంచి మచ్చలేని వ్యక్తిగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడం బాధ కలిగించిందంటూ మీడియా ముందు కంటతడి పెట్టారు. తనకు మంత్రి పదవి రాకున్నా టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని, కేసీఆరే తమ నాయకుడు అని రామన్న అన్నారు. (చదవండి : గులాబీ పుష్పక విమానం.. ఓవర్ లోడ్!) కేసీఆర్ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న.. ఈ ప్రభుత్వంలోనూ అవకాశం వస్తుందని భావించారు. కాని మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డికి మాత్రమే చాన్స్ దక్కింది. తొలిదఫా రాకున్నా.. విస్తరణలో కచ్చితంగా అవకాశం ఉంటుందనే నమ్మకంతో ఉండగా.. ఇటీవల ఆ అవకాశమూ చేజారింది. దీంతో అలకబూనిన రామన్న సోమవారం నుంచి ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోయారు. రామన్న అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన సొంత నియోజకవర్గమైన ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ నాయకుడు జోగు రామన్నకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ఆయన అభిమాని జిల్లా కేంద్రంలో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దీంతో పోలీసులు, కార్యకర్తలు అప్రమత్తమై అడ్డుకున్నారు. మంత్రివర్గ విస్తరణ టీఆర్ఎస్లో పెద్ద చిచ్చేపెట్టింది. ఇప్పటికే పలువురు నేతలు పార్టీ అధిష్టానంపై అసంతృప్తిని వెళ్లబుచ్చారు. -
కారు పార్టీలో ఏం జరుగుతోంది..?!
సాక్షి, మంచిర్యాల: అజ్ఞాతంలోకి వెళ్లి కలకలం సృష్టించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జోగు రామన్న వ్యవహారంపై టీఆర్ఎస్ అధిష్టానం ఆరా తీస్తోంది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రామన్నకు చోటు దక్కకపోవడంతో అలకబూనిన ఆయన సోమవారం అందుబాటులో లేకపోవడం తెలిసిందే. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్‌లోనే ప్రత్యక్షమైన రామన్న.. తాను అనారోగ్య కారణంగానే అందుబాటులో లేనని చెప్పుకొచ్చారు. కాగా టీఆర్ఎస్లో మంత్రులు, మాజీమంత్రులు అసంతృప్తి రాగం వినిపిస్తున్న క్రమంలో.. జోగు రామన్న వ్యవహారంపై పార్టీ అధిష్టానం దృష్టిపెట్టింది. పరిస్థితిని చక్కదిద్దేందుకు టీఆర్ఎస్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. జోగు రామన్నకు స్వయంగా ఫోన్ చేసి ఏం జరిగిందని తెలుసుకున్నట్లు సమాచారం. జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఆదిలాబాద్ జిల్లాలో నెలకొన్న పరిణామాలపై నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందించాయి. అలకతో కూడిన అనారోగ్యం మాజీమంత్రి జోగు రామన్న వ్యవహారం ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. కేసీఆర్ గత ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన జోగు రామన్న.. ఈ ప్రభుత్వంలోనూ అవకాశం వస్తుందని భావించారు. కాని మంత్రివర్గ కూర్పులో ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి నిర్మల్ ఎమ్మెల్యే ఇంద్రకరణ్‌రెడ్డికి మాత్రమే చాన్స్ దక్కింది. తొలిదఫా రాకున్నా.. విస్తరణలో కచ్చితంగా అవకాశం ఉంటుందనే నమ్మకంతో ఉండగా.. రెండు రోజుల క్రితం ఆ అవకాశమూ చేజారింది. దీంతో అలకబూనిన రామన్న సోమవారం నుంచి ఎవరికీ అందుబాటులోకి రాకుండా పోయారు. రామన్న అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఆయన సొంత నియోజకవర్గమైన ఆదిలాబాద్ జిల్లాకేంద్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆయన నివాసం వద్ద ఓ కార్యకర్త కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామన్నకు మంత్రి పదవి రాకపోవడానికి కారణమంటూ.. టీఆర్ఎస్ మైనార్టీ నాయకులు ఇద్దరు కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం ఫోన్ ఆన్ చేసిన రామన్న.. అనారోగ్యం కారణంగానే ‘దూరంగా’ ఉన్నానంటూ వివరణ ఇచ్చారు. ఇక రామన్న కుటుంబ సభ్యులు మాత్రం మంత్రి పదవి రాకపోవడంతోనే రక్తపోటు (బీపీ) పెరిగి అనారోగ్యానికి గురయ్యాడని చెప్పారు. నిఘావర్గాల నివేదిక మాజీమంత్రి రామన్న అజ్ఞాతంలోకి వెళ్లిన అనంతరం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న పరిణామాలపై నిఘావర్గాలు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. పార్టీ అంతర్గత పరిస్థితి, ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించడం, పార్టీ నాయకులు కొట్టుకోవడంతో పాటు, ఇతర నియోజకవర్గాల్లో తాజా పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించినట్లు తెలిసింది. కేటీఆర్ ఫోన్..? మంత్రి పదవి దక్కకపోవడంతో జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లాడనే వార్తల నేపథ్యంలో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. స్వయంగా జోగు రామన్నకు ఫోన్ చేసినట్లు సమాచారం. తాము కూడా గులాబీ ఓనర్లమేనంటూ ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. ఇదే క్రమంలో సాంస్కృతిక సారథి మాజీ చైర్మన్ రసమయి బాలకిషన్ కూడా ఈటల వ్యాఖ్యలను సమర్థించడం.. మంత్రివర్గ విస్తరణ తరువాత మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డిప్యూటీ మాజీ సీఎం రాజయ్య ధిక్కార స్వరాన్ని వినిపించడం సంచలనం సృష్టించింది. ఈ క్రమంలోనే మాజీ మంత్రి జోగు రామన్న కూడా అలకబూని అజ్ఞాతంలోకి వెళ్లడంతో కేటీఆర్ ఆయనకు ఫోన్ చేసి భవిష్యత్‌పై భరోసా ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. -
అజ్ఞాతం వీడిన రామన్న.. పార్టీ మార్పుపై క్లారిటీ
సాక్షి, ఆదిలాబాద్: రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కకపోవడంతో అసంతృప్తి గురైన మాజీ మంత్రి.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతం వీడారు. ఆదివారం మంత్రివర్గ విస్తరణ అనంతరం కనిపించకుండాపోయిన ఆయన మంగళవారం నాడు మీడియా ముందుకు వచ్చారు. ‘నేను అజ్ఞాతంలోకి వెళ్లలేదు. మంత్రిపదవి రాకపోవడంతో మినిస్టర్ క్వార్టర్స్ ఖాళీ చేస్తున్నాం. రెండు రోజులుగా నా పిల్లలు ఆ పనిలో ఉన్నారు. నాకు కొంత ఆరోగ్యం బాగాలేక, లోబీపీ వల్ల రెస్ట్ తీసుకుందాం అని స్నేహితుడు ఇంటికి వెళ్ళాను. మంత్రి పదవి దక్కలేదని అలగలేదు. పార్టీ మరే ప్రసక్తే లేదు. చివరి వరకూ టీఆర్ఎస్లోనే ఉంటా. మా నాయకుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు మంచి గౌరవం కల్పించారు. గత ప్రభుత్వంలో మంతత్రిగా ప్రజలకు సేవ చేసే అవకాశం లభించింది. కేసీఆర్‌కు ఎప్పటికీ రుణపడి ఉంటా’ అని వ్యాఖ్యానించారు. కాగా ఆదివారం ఉదయం హైదరాబాద్ వెళ్లిన ఆయన.. కేబినెట్ విస్తరణ అనంతరం అదేరాత్రి మినిస్టర్ క్వార్టర్స్‌లో ఉన్నారు. సోమవారం ఉదయం నుంచి ఎవరికీ అందుబాటులో లేకుండాపోయిన విషయం తెలిసిందే. గన్మెన్లను, డ్రైవర్‌ను, చివరికి వాహనాన్ని కూడా క్వార్టర్స్ వద్దే ఉంచి ఆయన చెప్పా పెట్టకుండా అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆయన మొబైల్‌ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుండడంతో సమాచారం తెలియలేదు. కుటుంబ సభ్యులు కూడా ఎటువెళ్లారో తెలీదని చెప్పడంతో రామన్న అనుచరుల్లో గతరెండు రోజులు ఆందోళనకు గురయ్యారు. తాజాగా ఆయన బయటకు రావడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మనస్తాపం.. టీఆర్ఎస్ సర్కార్ తొలిసారి అధికారంలోకి వచ్చిన తర్వాత జోగు రామన్నకు రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ అమాత్య పదవిని కట్టబెట్టారు. ముందస్తు ఎన్నికల్లో భాగంగా సర్కార్‌ను రద్దుచేసే వరకూ ఆయన మంత్రిగా కొనసాగారు. ఆ సమయంలో ఉమ్మడి జిల్లా నుంచి జోగు రామన్నతోపాటు ఇంద్రకరణ్‌రెడ్డి కూడా మంత్రిగా ఉన్నారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ మొదటి మంత్రివర్గ విస్తరణలోనే అమాత్య పదవి వస్తుందని జోగు రామన్న గంపెడాశలు పెట్టుకున్నారు. కానీ.. ఉమ్మడి జిల్లా నుంచి నిర్మల్ ఎమ్మెల్యే అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డిని మాత్రమే మంత్రి పదవి వరించింది. ఈ క్రమంలో మలివిడతలో తనకు తప్పకుండా మంత్రి పదవి వస్తుందని రామన్న ఆశించారు. ఆ మేరకు అధినేత కూడా తనకు భరోసా ఇచ్చారని తన అనుచరుల వద్ద వ్యక్తం చేశారు. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఈయన మంత్రివర్గ కూర్పులో పేరుంటుందని భరోసా పెట్టుకున్నారు. అదే సామాజిక వర్గానికి చెందిన కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌కు మంత్రి పదవి రావడం, రామన్నకు చుక్కెదురు కావడంతో ఆయన తీవ్ర మనస్తాపం చెందినట్లు సమాచారం. -
అఙ్ఞాతంలోకి మాజీ మంత్రి జోగు రామన్న
-
పదవుల పందేరంపై టీఆర్ఎస్లో కలకలం
సాక్షి, హైదరాబాద్ : మంత్రివర్గ విస్తరణతోపాటు చీఫ్ విప్, విప్ తదితర పదవుల పందేరం టీఆర్ఎస్లో కొత్త సమస్యలు సృష్టి స్తోంది. అసమ్మతి గళాలకు చెక్ పెట్టేందుకు సీఎం కేసీఆర్ అనుసరించిన వ్యూహం మరిన్ని అసంతృప్త గళాలకు ఊపిరి పోస్తోంది. మంత్రి ఈటల రాజేందర్ వ్యాఖ్యలతో పార్టీలో మొదలైన కలకలం మంత్రివర్గం విస్తరణ తర్వాత కూడా సద్దుమణగడం లేదు. ఆదివారం మొదలైన అసెంబ్లీ సమా వేశాల సందర్భంగా తనకు ఎదురైన మీడియా ప్రతినిధు లతో మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీ నాయకత్వాన్ని సమాధానం చెప్పుకునే స్థితిలోకి నెట్టినట్లు కనిపిస్తోంది. తనను ఎమ్మెల్యేగా పోటీ చేయకుండా వారించిన సీఎం కేసీఆర్.. మంత్రి పదవి ఇస్తానని మాట తప్పారు అని నాయిని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘నాకు మంత్రి పదవి ఇస్తానని చెప్పి సీఎం కేసీఆర్ మాట తప్పారు. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటే వద్దన్నారు. కౌన్సిల్లో ఉండు. నీకు మంత్రి పదవి ఇస్తా అని అన్నాడు. మా అల్లుడికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తానని కేసీఆర్ చెప్పారు. నాకు ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దు. అందులో రసం లేదు. కేసీఆర్ మా ఇంటికి పెద్ద. మేమంతా ఓనర్లమే. కిరాయిదార్లు ఎంత కాలం ఉంటారో, ఎప్పుడు దిగిపోతారో వాళ్లిష్టం’’ అంటూ నాయిని వ్యాఖ్యానించారు. మరోవైపు మాజీ ఉప ముఖ్యమంత్రి తాడికొండ రాజయ్య కూడా తనకు ఏ పదవీ దక్కే పరిస్థితి లేదని వాపోయారు. అదే సమయంలో మాదిగ సామాజిక వర్గానికి కేబినెట్లో స్థానం కల్పించక పోవడాన్ని మీడియా వద్ద ప్రస్తావించడంతోపాటు మాదిగ కుల సంఘాలు ప్రశ్నించాలనే రీతిలో సంకేతాలు ఇచ్చారు. మంత్రివర్గ విస్తరణతో ఆశావహుల్లో నిరాశ మంత్రివర్గ విస్తరణలో అవకాశం దక్కుతుందని భావించిన కొందరు ఎమ్మెల్యేలు.. సీఎం తమను కనీసం పిలిచి మాట్లాడక పోవడంపై అవేదన చెందుతున్నారు. మంత్రివర్గ విస్తరణలో చోటు ఆశించిన మాజీ మంత్రి జోగు రామన్న ఆదివారం ఉదయం నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఫోన్ స్విఛాఫ్ చేయడంతోపాటు గన్మెన్లను కూడా వదిలి వెళ్లడంపై చర్చ జరుగుతోంది. తనకు తిరిగి మంత్రి పదవి లభిస్తుందనే ధీమాతో ఉన్న జోగు రామన్న మినిస్టర్ క్వార్టర్స్‌లోనే ఉంటున్నట్లు తెలిసింది. మంత్రి పదవిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీతోనే మినిస్టర్ క్వార్టర్స్‌లో కొనసాగుతున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. మరోవైపు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరు కావడం వెనుక కూడా అసంతృప్తే కారణమని సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరుగుతోంది. ఈటల వ్యాఖ్యలు సద్దుమణుగుతున్న వేళ తాజాగా అసెంబ్లీ బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) నుంచి ఆయన్ను తొలగించినట్లు సమాచారం. ఈటల స్థానంలో కొత్త మంత్రి గంగుల కమలాకర్ హాజరు కావడంతో ఈటలకు చెక్ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ ఓవైపు బీజేపీ పదేపదే ప్రచారం చేస్తున్న నేపథ్యంలో టీఆర్ఎస్ నేతల అసమ్మతి రాగం ఎటు దారి తీస్తుందోననే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. -
అజ్ఞాతంలోకి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్ : మాజీ మంత్రి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అజ్ఞాతంలోకి వెళ్లారు. మంత్రివర్గ విస్తరణలో తనకు అవకాశం లభించకపోవడంతో.. అలక వహించిన జోగు రామన్న ఇంటి నుంచి ఎక్కడికో వెళ్లిపోయినట్టుగా సమాచారం. ఆదివారం మధ్యాహ్నం నుంచి హైదరాబాద్‌లోని తన నివాసంలోనే ఉన్న జోగు రామన్న.. సోమవారం సాయంత్రం గన్మెన్లను వదిలి, కుటుంబ సభ్యులకు ఎవరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో జోగు రామన్న కుటుంబ సభ్యులు ఆయన ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఆయన ఫోన్లు కూడా అందుబాటులో లేనట్టుగా తెలుస్తోంది. కాగా, గత ప్రభుత్వంలో పర్యావరణ, అటవీ శాఖ మంత్రిగా జోగు రామన్న బాధ్యతలు నిర్వర్తించారు. అయితే ఈ సారి కేబినెట్ బెర్త్‌పై ఆశలు పెట్టుకున్న ఆయనకు నిరాశే మిగిలింది. ఆదివారం జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు దక్కుతుందని భావించిన జోగు రామన్న.. తనకు అవకాశం లభించకపోవడంతో అసంతృప్తికి గురైనట్టుగా తెలుస్తోంది. -
గజం వందనే..!
సాక్షి,ఆదిలాబాద్: టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు కోసం అప్పట్లో రెవన్యూ అధికారులు నిర్ధారించిన ధర కోట్ల నుంచి లక్షల రూపాయలకు దిగొచ్చింది. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్నీ జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త పాలసీ కారణంగా ఈ ధర దిగి వచ్చింది. ఎకరంలోపు.. అధికార పార్టీ టీఆర్ఎస్ అన్ని జిల్లాల్లో సొంత పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని గతేడాదే నిర్ణయించింది. జిల్లా కేంద్రాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాలను మార్కెట్ ధర ప్రకారం కొనుగోలు చేసి కనీసం ఎకరం స్థలంలో పార్టీ కార్యాలయం నిర్మించుకోవాలని గతేడాది పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. ఇందుకు అనుగుణంగా టీఆర్ఎస్ నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు జీఓ నెం.571 ప్రకారం ఆదిలాబాద్ జిల్లా రెవెన్యూ యంత్రాంగం స్పందించింది. గుర్తించిన భూమి... ఆదిలాబాద్ అర్బన్ పరిధిలోకి వచ్చే సర్వే నెం.346లో 36 గుంటల స్థలాన్ని గుర్తించారు. ఇది ఎకరానికి నాలుగు గుంటల స్థలం తక్కువగా ఉంది. పట్టణంలోని గాంధీ పార్కు, పాలశీతలీకరణ కేంద్రానికి ఎదురుగా కైలాస్‌నగర్‌లో వైట్ క్వార్టర్స్‌లో ప్రభుత్వ స్థలాన్ని ఎంపిక చేశారు. ఇది వరకు ఈ స్థలంలో దూరదర్శన్ రిలే కేంద్రం ఈ స్థలంలో ఉండేది. ప్రస్తుతం న్యాక్ శిక్షణ కేంద్రం కొనసాగుతోంది. శిథిలావస్థలో చిన్న భవనం మాత్రమే ఉంది. దీనిని ఆనుకొని వైట్ క్వార్టర్స్ ఉన్న స్థలం కలుపుకొని మొత్తం 36 గుంటల స్థలాన్ని గతేడాది గుర్తించారు. జెడ్పీ చైర్మన్ క్యాంప్ కార్యాలయం తర్వాత ప్రస్తుతం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా ఇదే దారిలో కడుతున్నారు. కలెక్టర్, ఎస్పీ, జేసీ, న్యాయమూర్తుల క్వార్టర్స్, డీఆర్వో, ఇతరత్ర ముఖ్యమైన ఉన్నతాధికారుల భవనాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి. పార్టీ కార్యాలయం కోసం అనువుగా ఉంటుందని టీఆర్ఎస్ పార్టీ వర్గాలు ఈ స్థలాన్ని ప్రభుత్వాన్ని అడగడం జరిగింది. అప్పుడు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి, ప్రస్తుత ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగురామన్న, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, డెయిరీ డెవలప్మెంట్ రాష్ట్ర చైర్మన్ లోక భూమారెడ్డిలు ఈ స్థలాన్ని ఎంపిక చేశారు. అప్పట్లో ఆదిలాబాద్‌అర్బన్ తహసీల్దార్ నుంచి ఆర్డీఓ ద్వారా కలెక్టర్ కార్యాలయానికి దీనికి సంబంధించిన పత్రాలను పంపించారు. కలెక్టర్ నుంచి సీసీఎల్ఏకు వెళ్లిన ఫైల్ చివరిగా ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ భూమి కేటాయింపు జరిగింది. అప్పట్లో ధర వివాదం.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం కోసం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో గుర్తించిన స్థలం కేటాయింపునకు సంబంధించి రెవెన్యూ యంత్రాంగం 2018లో ప్రభుత్వానికి పంపించిన ఓపెన్ మార్కెట్ ధర అప్పట్లో చర్చనీయాంశమైంది. అప్పట్లో గుంటకు రూ.10లక్షల చొప్పున మొత్తం 36గుంటలకు రూ.3.65 కోట్లు నిర్ధారించి పంపడం వివాదానికి కారణమైంది. ధర విషయంలో రెవెన్యూ అధికారులపై టీఆర్ఎస్ వర్గాలు భగ్గుమన్నాయి. అయితే ప్రభుత్వ బేసిక్ విలువపై ఎన్నో స్థాయిల రెట్టింపులో ఈ ధరను నిర్ధారించినట్లు పార్టీ వర్గాలు మండిపడ్డాయి. అంత ధరనా.. అని టీఆర్ఎస్ ముఖ్యనేతలు రెవెన్యూ అధికారులపై ఫైర్ అయ్యారు. కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పట్టణంలో ముఖ్యమైన కూడలిలోని ఈ స్థలం అంశం అప్పట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇదిలా ఉంటే అప్పట్లో జేసీగా ఉన్న కృష్ణారెడ్డి బదిలీ అయ్యే ముందు ధర విషయంలో ఓపెన్ మార్కెట్ ధరను ప్రభుత్వానికి పంపించారు. దీంతో ఈ వివాదానికి అప్పట్లో కారణమైంది. ఆ తర్వాత ఆయన బదిలీపై వెళ్లిపోయిన విషయం విధితమే. తాజాగా ఉత్తర్వులు.. జిల్లా కేంద్రాల్లో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల ఏర్పాటుకు ఒక్కో ఎకరం చొప్పున స్థలాలు కేటాయిస్తూ రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేష్ తివారి శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చేసిన విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. గుర్తింపు కలిగిన రాజకీయ పార్టీలు అన్ని జిల్లాకేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించుకోవడానికి చదరపు గజానికి రూ.100 చొప్పున ఎకరంలోపు స్థలం కేటాయించేందుకు ప్రభుత్వం ఈ కొత్త పాలసీ తీసుకొచ్చింది. దాని ప్రకారం తాజాగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో 36 గుంటల స్థలాన్ని రూ.4,35,600 లకు టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి కేటాయించారు. నేడు భూమిపూజ.. టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి గుర్తించిన స్థలంలో సోమవారం భూమిపూజ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలకు కేటాయించిన స్థలంలో భూమిపూజ జరగనుండడం విశేషం. ఆదిలాబాద్‌లో జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించనున్నారు. ఎమ్మెల్యే జోగురామన్న, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, రాష్ట్ర డెయిరీ డెవలప్మెంట్ చైర్మన్ లోక భూమారెడ్డిలతో పాటు ఇటీవల ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు.