ఖర్చు తగ్గిద్దాం..కలసి పెళ్లి చేసుకుందాం.. | Mass marriages in Karanji | Sakshi
Sakshi News home page

ఖర్చు తగ్గిద్దాం..కలసి పెళ్లి చేసుకుందాం..

Published Mon, May 8 2017 3:01 AM | Last Updated on Tue, Sep 5 2017 10:38 AM

ఖర్చు తగ్గిద్దాం..కలసి పెళ్లి చేసుకుందాం..

ఖర్చు తగ్గిద్దాం..కలసి పెళ్లి చేసుకుందాం..

కరంజిలో సామూహిక వివాహాలు

తలమడుగు(బోథ్‌): ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం కరంజి గ్రామంలో ఆదివారం అంగరంగ వైభవంగా సామూహిక వివాహాలు జరిపించారు. పెళ్లిళ్లకు ఆడంబరాలను, వృథా ఖర్చులను అరికట్టాలనే ఉద్దేశంతో గ్రామస్తులు 25 ఏళ్ల క్రితం సామూహిక వివాహాలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికీ ఆ ఆనవాయితీ కొనసాగిస్తున్నారు. ఆదివారం 11 జంటలకు వివాహం జరిపించారు. 

వీరిలో కరంజి గ్రామానికి చెందిన ఐదు జంటలు, చుట్టుపక్కల గ్రామాలతోపాటు మహారాష్ట్రకు చెందిన వారూ ఉన్నారు. వధూవరులను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్‌ తదితరులు ఆశీర్వదించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement