ఔరంగజేబులంతా ఏకమైనా కానీ ఆ నలుగురినే.. : బండి సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

ఔరంగజేబులంతా ఏకమైనా కానీ ఆ నలుగురినే.. : బండి సంజయ్‌

Published Thu, Feb 22 2024 1:52 AM | Last Updated on Thu, Feb 22 2024 9:27 AM

- - Sakshi

క్రేన్‌ సాయంతో గజమాల వేస్తున్న నాయకులు

ఆదిలాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఔరంగజేబులంతా ఏకమై బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు యత్నించినా ధీటుగా ఎదుర్కొని ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర ఆదిలాబాద్‌ ప్రజలదని కరీంనగర్‌ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌ అన్నారు. ఆపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడతోపాటు ఆదిలాబాద్‌లో నిర్వహించిన కార్నర్‌ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు.

ఆదిలాబాద్‌ జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి వందనాలు చెబుతున్నానన్నారు. జిల్లా ప్రజలదెబ్బకు బీఆర్‌ఎసోళ్లు ఫామ్‌ హౌస్‌కే పరిమితం అయ్యారన్నారు. రాంమందిర్‌ నిర్మాణం కోసం తపించిన కరసేవకులను కాల్చి చంపిన ములాయం సింగ్‌ గతేమైందో, బతుకేమైందే ప్రజలు గ్రహించాలన్నారు. అయోధ్యలోనే రాముడు పుట్టారా అనిప్రశ్నించే నాకొడుకులా భవిష్యత్తును ఖతం చేస్తామని, అలాంటి పార్టీలకు భవిష్యత్తే లేకుండా చేస్తామన్నారు. నిర్మల్‌ జిల్లాలో రాంజీగోండ్‌ చరిత్రను తెరమరుగు చేసేందుకు వెయ్యి ఊడలమర్రి వద్ద సమాధి చేసిన బీఆర్‌ఎస్‌ను ప్రజలు సమాధి చేశారన్నారు.

కాంగ్రెస్‌ మే ల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే బీఆర్‌ఎస్‌ కు పట్టిన గతే పడుతుందన్నారు. వెయ్యి ఊడల మ ర్రి వద్ద రాంజీగోండ్‌ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దేశం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోదీకి ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ స్థానం బహుమతి గా అందించాలన్నారు. ఎంపీ సీటును గెలిపిస్తే ఆది లాబాద్‌ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నా రు. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడబోతుందని, అధికారం చేపట్టిన వెంటనే ఆది లాబాద్‌–ఆర్మూర్‌ రైల్వేలైన్‌కు మోదీతో శంకుస్థాప న చేయిస్తామన్నారు.

కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రాష్ట్రంలో ఖజానా లేదని చెబుతున్న కాంగ్రెస్‌ నాయకులు ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లేది కొత్త స్క్రాచ్‌ రుచి చూసేందుకే తప్పా.. ఎలాంటి పొత్తుల కోసం కాదన్నారు. కేసీఆర్‌కు ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్‌ ఇస్తారని ప్రశ్నించా రు. ఎన్నికలకు ముందు సొంత వాహనాలు లేని చంద్రశేఖర్‌రావుకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు.

హిందువులు ఓటు బ్యాంక్‌గా మారకపోవడంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయామని, దేశానికి కావాల్సింది రామ రాజ్య మా.. రజాకార్ల రాజ్యమా అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో యాత్ర ఇన్‌చార్జి పల్లె గంగారెడ్డి, జెడ్పీచైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌, జిల్లా అధ్యక్షుడు ప తంగే బ్రహ్మానంద్‌, మాజీఎంపీ రమేశ్‌ రాథోడ్‌, మా జీ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపూరావు, పార్లమెంట్‌ కన్వీ నర్‌ బోయర్‌ విజయ్‌, లోక ప్రవీణ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లాలామున్నా, వేదవ్యాస్‌, నాయకులు రాజేశ్‌బాబు, అభినవ్‌ సర్దార్‌, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు.

అధికారం పోయినా.. తీరుమారలే..
ఆదిలాబాద్‌ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నను ప్రజలు ఓడించి ఆ పార్టీని అధికారం లేకుండా చేసినా ఇంకా అధికారంలో ఉన్నట్లే మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని ఆదిలాబా ద్‌ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. వంద మంది రామన్నలు వచ్చినా ఆదిలాబాద్‌ ఎంపీగా బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ఆదిలాబా ద్‌–ఆర్మూర్‌, ఆర్మూర్‌–పఠాన్‌చెరు వరకు 316 కిలో మీటర్ల దూరం ఫైనల్‌ లొకేషన్‌ సర్వే పూర్తయిందని, ఇందు కోసం రూ.7,313 కోట్లు కేంద్రం కేటాయించిందని పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌–గడ్‌చందూర్‌ రైల్వే లైన్‌ ఫైనల్‌ లొకేషన్‌ సర్వే కూడా పూర్తయిందని, రూ.1.75 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయం తెలియని జోగు రామన్న రాజకీయ లబ్ధి కోసం రైల్వే సాధన సమితి పేరిట డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో పనిచేసిన ఎంపీలకు పిట్‌లైన్‌ అంటే తెలియదని, ఆదివాసీ బిడ్డగా దాన్ని తీసుకురావడం జరిగిందన్నారు.

ఢిల్లీలో మోదీ ఉండాల్సిందే..
ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్లలో ప్రధాని మోదీ ప్ర పంచానికే నాయకత్వం వహించే దిశగా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు. గల్లీ లో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలని ప్రజ లంతా కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ లోనూ బీజేపీ గెలవడం ఖాయమన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్‌ఎస్‌ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారన్నారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏ వర్గానికై నా న్యాయం చేసిందా అని ఆయన ప్రశ్నించారు.

‘బండి’కి ఘన స్వాగతం..
బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లా నుంచి ఆదిలాబాద్‌ జిల్లాలో ప్రవేశించిన బండి సంజయ్‌కు నేరడిగొండ మండలం రోల్‌మామడ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. క్రేన్‌ సాయంతో గజ మాల వేశారు. నేరడిగొండలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడినుంచి ఇచ్చోడకు చేరుకోగా పార్టీ శ్రేణుల స్వాగతం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.

గుడిహత్నూర్‌లో ఓ స్వామిజీ నివాసంలో భోజనం చేసి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మావల బైపాస్‌ వద్ద బండి సంజయ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి 5కిలోమీట ర్ల మేర బైక్‌ ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప్రధానవీధులగుండా అంబేద్కర్‌ చౌక్‌ కు యాత్ర చేరుకోగా, పార్టీ శ్రేణులు ఆయన ను భుజాలపై ఎత్తుకొని స్వాగతం పలికారు.

ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement