bandi sanjay kumar
-
దేశ నేతలను కులాలకు పరిమితం చేస్తారా?
కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర మాజీ అద్యక్షుడు బండి సంజయ్‌కు సడన్‌గా ఆంధ్ర ప్రాంత పూర్వ నేతలపై అభిమానం పుట్టుకువచ్చినట్ల అనిపిస్తోంది. ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు, 1953లో అప్పటి మద్రాస్ రాష్ట్రం నుంచి ఆంధ్రుల కోసం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో 58 రోజులపాటు దీక్ష చేసి అసువులు బాసిన పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా సంజయ్ చేసిన వ్యాఖ్యలు అంత చిత్తశుద్దితో చేసినట్లు కనిపించడం లేదు.. .. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ పేరును సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్శిటీగా మార్చడానికి తెలంగాణ ప్రభుత్వం బిల్లు పెట్టిన నేపథ్యంలో సంజయ్ ఈ అవకాశాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకున్నట్లు అనుమానం కలుగుతోంది. దీనికి ప్రతిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టిగానే సమాధానం ఇచ్చారని చెప్పాలి. ఏపీలో పొట్టి శ్రీరాములు పేరుతో యూనివర్శిటీ ఉందని, విభజన కారణంగా ఈ మార్పులు చేస్తున్నామని అన్నారు. కేంద్ర ప్రభుత్వ అధీనంలోని చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు ఈయన పేరు పెడితే ఇంకా సమున్నతంగా ఉంటుందని బీజేపీ నేతలకు సూచించారు. అదే టైమ్ లో మాజీ సీఎం కొణిజేటి రోశయ్య పేరును ప్రకృతి వైద్యశాలకు పెడుతున్నామని, ఆయన విగ్రహం కూడా ఏర్పాటు చేసి జయంతి, వర్ధంతి నిర్వహిస్తామని, ఆర్యవైశ్యుల పట్ల తమకు పూర్తి గౌరవం ఉందని అన్నారు. 👉పొట్టి శ్రీరాములు పేరుతో ఉన్న యూనివర్శిటీ పేరును తొలగిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశ పెట్టవలసిన అవసరం ఏముందని సంజయ్ ప్రశ్నిస్తున్నారు. శ్రీరాములు గొప్ప దేశ భక్తుడు, గాంధేయవాది, స్వాతంత్ర సమర యోధుడని, ఆర్యవైశ్యులకు ఆరాధ్య నాయకుడని సంజయ్ వ్యాఖ్యానించారు. కరీంనగర్ ఆర్యవైశ్య పట్టణ సంఘం ఈ జయంతి సభను నిర్వహించింది. తెలంగాణలో ఆయా చోట్ల వైశ్య సామాజిక వర్గ ప్రభావం కూడా గణనీయంగానే ఉంటుంది. దానిని దృష్టిలో ఉంచుకుని సంజయ్ ఈ ప్రసంగం చేసి ఉండవచ్చు. సురవరం ప్రతాపరెడ్డి అంటే తమకు గౌరవం ఉందని, తెలుగు భాష అభివృద్దికి కృషి చేశారని, దీనికి సంబంధించిన కార్యక్రమాలకు ఆయన పేరు పెట్టవచ్చని బండి సలహా ఇచ్చారు. బాగానే ఉంది. అక్కడితో ఆగి ఉంటే అదో తరహా అనిపించేది. .. ఇక్కడే సంజయ్ తన రాజకీయ ఆలోచనను అమలు చేసే యత్నం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన ఒక ఆరోపణ చేస్తూ, తన కులాభిమానంతోనే పొట్టి శ్రీరాములు పేరు తొలగించి, ప్రతాపరెడ్డి పేరు ప్రతిపాదించారని అన్నారు. ఇందులో నిజం ఎంత ఉందన్నది ఒక ప్రశ్న. పొట్టి శ్రీరాములు పేరు మార్చకుండా ఉండాలని కోరవచ్చు. అంతవరకు ఓకే. కారణం ఏమైనా కాంగ్రెస్ ప్రభుత్వం పేరు మార్చాలని ప్రతిపాదించింది. దీనిని శాసనసభలో కూడా బీజేపీ వ్యతిరేకించింది. ఇందులో కూడా కులం కోణమే ఉందన్న భావన కలుగుతుంది. 👉ప్రతాప్ రెడ్డి పేరును తెలుగు యూనివర్శిటీకి పెడితే రేవంత్ రెడ్డి(Revanth Reddy)కి కులం ఆపాదించడం ఏమిటి? రేవంత్ ను విమర్శించే క్రమంలో సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖుడిని కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా! అంతేకాదు.. ముఖ్యమంత్రి తీరు దేశభక్తులు, స్వాతంత్ర్య సమర యోధులతోపాటు, ఆర్యవైశ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని అనడం ద్వారా బండి సంజయ్(Bandi Sanjay) ఎజెండా ఏమిటో తెలిసిపోతుంది కదా! అంటే ఆర్యవైశ్యుల ఓట్లు తనవైపు ఉండేందుకు, కాంగ్రెస్‌కు నష్టం చేసేందుకు ఈ వ్యాఖ్యలు చేసినట్లు అనిపిస్తుంది. అదే టైమ్ లో పొట్టి శ్రీరాములును కూడా ఒక కులానికి పరిమితం చేసినట్లు అనిపించదా! ఇది దురదృష్టకరం. శ్రీరాములు అయినా, ప్రతాపరెడ్డి అయినా కులాలకు అతీతం అన్న సంగతిని విస్మరించరాదు. నేతలు ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని వ్యాఖ్యలు చేస్తే బాగుండనిపిస్తుంది. వర్తమాన సమాజంలో అలాంటి ఆశించడం అత్యాశే కావచ్చు. ఈ అంశాన్ని తొలుత చేపట్టి, అక్కడ నుంచి ఆయన తన విమర్శలను కాంగ్రెస్ పై ఎక్కుపెట్టారు.మహనీయులను అవమానించడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందని ఆరోపించారు. బీఆర్ అంబేద్కర్ ను కూడా అడుగడుగునా అవమానించిందని సంజయ్ విమర్శించారు. అంబేద్కర్ ను ఆయా పార్టీలు తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. 👉అంబేద్కర్ పై అంత అభిమానం ఉంటే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన భారీ అంబేద్కర్ విగ్రహ స్థలాన్ని బీజేపీ నేతలు ఎన్నిసార్లు సందర్శించారో తెలియదు. అదే టైంలో.. సంజయ్ మరో వివాదాస్పద ప్రశ్న సంధించారు. హైదరాబాద్ లో ఉన్న ఎన్టీఆర్ పార్కు పేరు మార్చే దమ్ముందా? అని ఆయన అంటున్నారు. అలాగే కాసు బ్రహ్మానందరెడ్డి, నీలం సంజీవరెడ్డి పేర్లు ఉన్న పార్కులకు వాళ్ల పేర్లను తొలగించగలరా? కోట్ల విజయ భాస్కరరెడ్డి పేరుతో ఉన్న స్టేడియంకు కొత్త పేరు పెట్టే దమ్ము ఉందా? అని ఆయన అడగడంలోని ఆంతర్యాన్ని అర్థం చేసుకోవడం కష్టం కాదు. 👉పొట్టి శ్రీరాములు మీద గౌరవం ప్రకటిస్తూనే, ఈ మాజీ ముఖ్యమంత్రుల పేర్లు తొలగించగలరా అని అడగడంలో అర్థం ఏమైనా ఉందా? సంజయ్‌కు తెలుసో లేదో కాని.. కాసు, నీలం, కోట్ల వంటివారు కూడా దేశ స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న వాళ్లే.. జైళ్లకూ వెళ్లొచ్చిన వాళ్లే. మరి వారి పేర్లు మార్చగలరా అని అనడంలో ఆయనలో కుల కోణం కనిపిస్తుందే తప్ప సహేతుకత కనిపించదు. ఎన్టీఆర్ ప్రముఖ నటుడు , రాజకీయాలలోకి వచ్చి ప్రాంతాలకు అతీతంగా తెలుగు ప్రజల అభిమానం చూరగొన్నారు. ఆయన పేరు మార్చగలరా? అని అడగడం ఏమిటి. పరోక్షంగా వారి పేర్లు తీసివేయాలని సూచించడమా? అనే అనుమానం కూడా కలుగుతోంది. లేదంటే.. వీరు రెడ్డి,కమ్మ వర్గానికి చెందినవారు కనుక వాటి జోలికి వెళ్లడం లేదని పరోక్షంగా చెప్పదలిచారా! టాంక్ బండ్ పై అనేకమంది ఆంధ్రుల విగ్రహాలు ఉన్నాయని ,వాటిని తొలగిస్తారా అని ప్రశ్నించడం కూడా రాజకీయ ప్రేరితంగానే కనిపిస్తుంది.తెలంగాణ ఉద్యమ సమయంలో కొన్నిచోట్ల కాసు, నీలం ఎన్టీఆర్ విగ్రహాలను కొంతమంది ధ్వంసం చేసినప్పుడు బీజేపీ పెద్దగా అభ్యంతరం చెప్పినట్లు కనిపించదు. అలాగే టాంక్ బండ్‌పై ఉన్న ఆంధ్ర ప్రముఖుల విగ్రహాలను ఉద్యమ సమయంలో ఇప్పటికే ఒకసారి కూల్చారు. ఆ రోజుల్లో కూడా ఈ అంశంపై బీజేపీ గట్టిగా స్పందించినట్లు కనబడలేదు. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి విగ్రహాలను వెంటనే పునరుద్దరించారు. బండి సంజయ్ కులపరమైన ఆలోచనలతో కాకుండా చిత్తశుద్దితో పేర్ల మార్పుపై మాట్లాడితే స్వాగతించవచ్చు. కాని ఆర్యవైశ్యులకు, దేశభక్తులకు రేవంత్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయడంలోని ఆంతర్యం తెలుస్తూనే ఉంది. ఇక్కడ ఇంకో సంగతి చెప్పాలి. 👉అసలు పేర్లు మార్చడంలో బీజేపీకి ఉన్న ట్రాక్ రికార్డు మరెవరికి ఉండకపోవచ్చు. పేర్ల మార్పిడి అన్నది కొత్త విషయం కాదు. కాని బీజేపీ కేంద్రంలోను, ఆయా రాష్ట్రాలలో పవర్లోకి వచ్చాక అవసరం ఉన్నా, లేకపోయినా తమ విధానాలను దృష్టిలో ఉంచుకుని మార్పులు చేసిందన్న విమర్శలు ఉంది.ఇంకో సంగతి చెప్పాలి. ఏపీలో బీజేపీ భాగస్వామిగా ఉన్న కూటమి ప్రభుత్వం(Kutami Prabhutvam) కొన్ని ప్రాజెక్టులకు రెడ్డి ప్రముఖుల పేర్లు ఉంటే వాటిని తొలగించింది. మాజీ మంత్రులు గౌతం రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి, మాజీ ఎంపీ అనంత వెంకటరెడ్డి పేర్లను తొలగించారు. అంటే దాని అర్థం అక్కడ ప్రభుత్వం రెడ్లకు వ్యతిరేకమని.. ఆ విధానానికి బీజేపీ సమర్థిస్తోందన్న భావన కలగదా?. కొంతమంది తెలుగుదేశం వారు విశాఖలోని స్టేడియంకు ఉన్న వైఎస్ పేరును తీసివేసే యత్నం చేశారు. వారిది కుల జాఢ్యమని బీజేపీ చెబుతుందా! సంజయ్ తెలంగాణలో కులపరమైన ఆరోపణలు చేస్తే, బీజేపీ దేశంలో మతపరమైన విమర్శలు ఎదుర్కుంటోంది. మతాన్ని దృష్టిలో ఉంచుకుని, ఢిల్లీలో పలు రోడ్ల పేర్లు మార్చింది. ఉత్తరప్రదేశ్ లోని బీజేపీ ప్రభుత్వానికి ఇందులో ఒక రికార్డు ఉంది. ఏకంగా 24 నగరాలు, పట్టణాల పేర్లను మార్చడానికి ప్రతిపాదించింది. వాటిలో పలు నగరాల పేర్లను మార్పు కూడా చేసింది.వీటికి ఉన్న గత ముస్లిం పాలకుల పేర్లను తొలగించి హిందూ పేర్లను పెట్టడం స్పష్టంగా కనిపిస్తుంది.సెక్యులర్ దేశంగా ఉన్న భారత్ లో ఇలా చేయడం సరైనదేనా? అనే ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది. వీటిలో కొన్నిటికి అభ్యంతరాలు వచ్చినా బీజేపీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఎప్పటి నుంచో ఉన్న అలహాబాద్ పేరును ప్రయాగ్ రాజ్ గా మార్చారు. ఫైజాబాద్ ను అయోధ్యగా మార్చారు. అంటే బీజేపీ ఎక్కడ అవసరం అయితే అక్కడ మతం లేదంటే కులం ప్రాతిపదికన రాజకీయం చేయడానికి వెనుకాడడం లేదని అనిపించదా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
‘కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో’.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి,కరీంనగర్: కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..మేధావులారా.. బాకీల సర్కార్‌ను బండకేసి బాదండి’ అంటూ బీజేపీ కేంద్రమంత్రి బండిసంజయ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ బీజేపీ మండలాధ్యక్షులతో నిర్వహించిన టీచర్ ఎమ్మెల్సీ సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్యానించారు.సీఎం రేవంత్‌రెడ్డి తీరును చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో తెలియని పరిస్థితి. కొందరు మంత్రులు ప్రతి పనికి 15 శాతం కమిషన్ దండుకుంటున్నారు. రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ కేబినెట్ మంత్రుల్లో, ఎమ్మెల్యేల మధ్య చీలిక వచ్చింది. కుల గణనతో కాంగ్రెస్ కొరివితో తలగొక్కోంటోంది.కాంగ్రెస్ అంటేనే బాకీల సర్కార్..నిరుద్యోగులకు 56 వేల నిరుద్యోగ భృతి.2 లక్షల ఉద్యోగాల బాకీ.. ప్రతి విద్యార్ధికి 5 లక్షల భరోసా కార్డు బాకీ. 18 ఏళ్లు నిండిన ప్రతి యువతికి స్కూటీ బాకీ. ప్రతి టీచర్లు సహా ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి నాలుగు డీఏలు బాకీ. ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి రెండో పీఆర్సీ బాకీ. ప్రతి విద్యార్థికి, కాలేజీ యాజమాన్యానికి ఫీజు రీయింబర్స్ మెంట్ బాకీ.ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఓల్డ్ పెన్షన్ స్కీం బాకీ. జీపీఎఫ్‌లో దాచుకున్న డబ్బులు కూడా బాకీ. మేధావులారా..బాకీల సర్కార్‌ను బండకేసి బాదండి.మూడు ఎమ్మెల్సీ స్థానాల్లో బీజేపీ గెలవబోతోంది. ఎమ్మెల్సీ ఎన్నికల తరువాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేదాకా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించేది బీజేపీదే. బీఆర్ఎస్ పనైపోయింది. అందుకే అభ్యర్థిని కూడా నిలబెట్టలేకపోయింది. కాంగ్రెస్‌తో కుమ్కక్కై బీజేపీని ఓడించాలని బీఆర్ఎస్ చూస్తోంది. బీసీల్లో ముస్లింలను చేర్చి బీసీలను మోసం చేస్తున్నారు. ఇంత జరుగుతుంటే సంఘాలు ఎందుకు స్పందించడం లేదు?.ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ముకాయడమే కుల సంఘాల పనా?’ అని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు. -
సీఎం రేవంత్ రెడ్డి కి కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ లేఖ
-
అర్హులకే పద్మ అవార్డులు వచ్చాయి: బండి సంజయ్
-
పద్మ అవార్డులపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, సాక్షి: పద్మ పురస్కారాలపై వివాదం నెలకొన్న వేళ.. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతీ ఒక్కరికీ కేంద్రం అవార్డులు ఇవ్వదని, అర్హులకే మాత్రమే ఇస్తుందని అన్నారు. ఈ క్రమంలో గద్దర్(Gaddar)కు అవార్డు రాకపోవడంపై ఆయన తీవ్ర వ్యాఖ్యలే చేశారు. పద్మ అవార్డుల విషయంలో తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ఆరోపణలకు దిగారు. ఈ ఆరోపణలకు బండి సంజయ్ కౌంటర్‌గా స్పందించారు. ‘‘పద్మ అవార్డులు(Padma Awards Row) స్థాయి ఉన్న వారికి ఇస్తాం. గద్దర్‌కు ఎలా ఇస్తాం? ఆయన భావజాలం ఏంటి?. బీజేపీ కార్యకర్తలను, పోలీసులను చంపిన వారికి అవార్డులు ఎలా ఇస్తాం?. మా కార్యకర్తలను చంపిన వ్యక్తులపై ఆయన పాటలు పాడారు. మరి అలాంటి వ్యక్తికి పద్మ అవార్డు ఎలా ఇస్తాం?. బరాబర్ ఇవ్వం’’.. అని అన్నారాయన. పద్మ అవార్డుల జాబితాలో అర్హులకే అవార్డు లు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వం మంచి పేర్లు పంపితే కేంద్రం పరిశీలిస్తుంది. ఏ పేరు పడితే ఆ పేరు పంపితే ఇవ్వరు అని బండి సంజయ్ పేర్కొన్నారు. మాకు భేషజాలు లేవుతెలంగాణ ప్రభుత్వానికి అభివృద్ధి మీద చిత్తశుద్ధి లేదు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ(Telangana) అభివృద్ధికి సహకరిస్తుంది. తెలంగాణకు కేంద్రం గత పదకొండేళ్లలో 12 లక్షల కోట్ల రూపాయలు కేటాయించింది. తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేర్లను మార్చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఆపేది లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకు పథకాలు అందేలా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.. ప్రయత్నం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం పథకాలకు పేర్లను మార్చి అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వం చూస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వ కుటిల రాజకీయాల కారణంగా పేదలకు అన్యాయం జరిగే ప్రమాదం ఉంది. బియ్యం కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది.. రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. పేదలకు ఇడ్లు ఇవ్వాలని ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.. కేవలం పేరు కోసమే పాకులాడుతోంది. మండలానికి ఒక గ్రామానికి మాత్రమే పథకాలను అమలు చేయడం ఎంటి ?. మండలంలో మిగతా గ్రామాల పరిస్థితి ఎంటి ?. ప్రభుత్వం దగ్గర పైసలు లేవు.. ఉన్న పైసలు ఢిల్లీ లో కప్పం కట్టడానికే సరిపోతోంది. తెలంగాణలో 14 శాతం కమీషన్ల ప్రభుత్వం నడుస్తోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తున్నాయి. మాకు బేషజాలు లేవు.. కి కేంద్రం, రాష్ట్రం కలిస్తేనే అభివృద్ధి. రాష్ట్ర ప్రభుత్వానికి పాకిస్థాన్, బంగ్లాదేశ్ నుంచి నిధులు వస్తున్నాయా ?. పేరు కోసం పాకులాడి గతంలో కేసీఆర్ ఒక్క ఇళ్లు కూడా ఇవ్వలేదు. 2 లక్షల 40 వేల ఇళ్లను కేంద్రం తెలంగాణకు కేటాయిస్తే.. పేరు కోసం లబ్ధిదారులకు ఇవ్వలేదు. తెలంగాణ సెంటిమెంట్ తో లాభపడింది ఎవరనేది ప్రజలకు తెలుసు అని బండి సంజయ్ అన్నారు.ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్బండి సంజయ్ వాఖ్యలు ఈ మధ్య విడ్డూరంగా ఉన్నాయి. పథకాలకు ఇంధిరమ్మ పేరు పెడితే తప్పేంటి?. బండి వ్యాఖ్యలు గద్దర్‌ను అవమానించేలా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తిని పద్మ అవార్డులకు ప్రతిపాదిస్తే తప్పా?. నక్సలైట్ భావాజాలం అయితే అవార్డులు ఇవ్వరా?. నక్సలైట్లకు ఎంపీ ,ఎమ్మెల్యే టిక్కెట్ లు ఇవ్వొచ్చు కాని అవార్డులకు పనికి రారా?. లెఫ్ట్ భావజాలం ఉన్న ఈటల బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్య పదవి రేసులో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. అంటే.. ఈటల ఆ పదవికి అనర్హుడా?. దీనికి బండి సంజయ్ చెప్పాలి. గతంలో ప్రగతి భవన్ ముందు గద్దర్‌ను నిలబెట్టి కేసీఆర్ అవమానిస్తే.. ఇప్పుడు పద్మా అవార్డు ల విషయంలో బండి సంజయ్ అవమానిస్తున్నారు అని ఆది శ్రీనివాస్ మండిపడ్డారు. -
మ్యారిటల్ రేప్ నేరం కాదు: కేంద్రం
న్యూఢిల్లీ: భార్యతో ఆమె ఇష్టానికి విరుద్ధంగా భర్త సంభోగంలో పాల్గొనడాన్ని(మ్యారిటల్ రేప్) నేరంగా పరిగణించే ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భార్య వయసు 18 ఏళ్లు దాటి ఉంటే ఆమెతో భర్త బలవంతంగా లైంగిక కార్యం జరిపినా నేరం కాదని వెల్లడించింది. ఒకవేళ ఆమె వయసు 18 ఏళ్లలోపు ఉంటే ఆ లైంగిక కార్యం నేరమేనని ఉద్ఘాటించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ బుధవారం రాజ్యసభలో సమాధానమిచ్చారు. భారతీయ న్యాయ సంహిత–2023లోని సెక్షన్ 74, 75, 76, 85తోపాటు గృహహింస నుంచి మహిళలకు రక్షణ కలి్పంచే చట్టం–2005 వివాహిత మహిళలకు పలు హక్కులు, రక్షణలు, గౌరవం కలి్పస్తున్నాయని వెల్లడించారు. -
మహిళ ప్రాణాలు కాపాడిన మంత్రి బండి సంజయ్
కరీంనగర్, సాక్షి: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సింగాపూర్ వద్ద ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. మానకొండూరు మండలం కెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీ అనే మహిళ లారీ కింద ఇరుక్కుపోయింది. కేకలు వేయడంతో హుజూరాబాద్ సమీపంలోని సింగాపూర్ శివారులో కొద్దిదూరం వెళ్లాక డ్రైవర్ లారీని ఆపాడు.ఈ క్రమంలో ములుగు వెళుతూ ఘటనా స్థలం వద్ద కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆగారు. లారీ కింద చిక్కుకుని రక్తమోడుతున్న దివ్యశ్రీని బండి సంజయ్ కాపాడారు. అటువైపు వెళుతున్న లారీలను ఆపి జాకీలు, కత్తెర తెప్పించారు. కేంద్ర మంత్రి సూచనతో జుట్టు కత్తిరించి ఆమె మహిళ ప్రాణాలను స్థానికులు కాపాడారు. అనంతరం ఆ మహిళను చూసిన ఆమె పిల్లలు భోరున విలపించారు. గాయాలపాలైన మహిళను కరీంనగర్‌లోని లైఫ్ లైన్ ప్రైవేట్ ఆసుపత్రికి బండి సంజయ్ పంపించారు. దివ్యశ్రీ చికిత్సకు అయ్యే ఖర్చును తానే చెల్లిస్తానని ఆసుపత్రి వైద్యులకు మంత్రి సంజయ్ తెలిపారు. -
కేసీఆర్ ‘రీ ఎంట్రీ’ ఇక కలే: బండి సంజయ్
హైదరాబాద్, సాక్షి: లోక్ సభలో ప్రతిపక్షనేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై బీజేపీ మంత్రి బండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ క్విట్ ఇండియా అని వ్యాఖ్యానించారు. ఆయన బుధవారం శేరిలింగంపల్లి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని హాట్ కామెంట్లు చేశారు.‘‘రాహుల్ గాంధీ.. క్విట్ ఇండియా. విదేశాలకు వెళ్లి భారత ఎన్నికల వ్యవస్థను విమర్శిస్తావా?. రిజర్వేషన్లపై నోటికొచ్చినట్లు మాట్లాడతావా?. కేసీఆర్ కుటుంబాన్ని జైల్లో వేయడం సీఎం రేవంత్‌కు సాధ్యం కావడం లేదు. కేసీఆర్ ఢిలీ వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడుకుని వచ్చారు. బీజేపీ అధికారంలోకి వస్తే కేసీఆర్ అంతు చూసేటోళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డికి పట్టిన గతే కేసీఆర్ కుటుంబానికి పట్టేది. కేసీఆరే దశమ గ్రహం.. నవగ్రహాలు చేయడం విడ్డూరం. వరదలతో జనం అల్లాడుతుంటే కేసీఆర్ ఎందుకు బయటకు రావడం లేదు?. ప్రజలు కేసీఆర్ కు ‘నో ఎంట్రీ బోర్డు’పెట్టేశారు. ఇగ రీ ఎంట్రీ కలే. ఆరు గ్యారంటీలపై డైవర్ట్ చేసేందుకే హైడ్రా పేరుతో ‘హైడ్రామా’లాడుతున్నారు.దేశ ప్రజలారా.. కాంగ్రెస్ ముక్త్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగండి. అత్యధిక సభ్యత్వం నమోదు చేసిన డివిజన్ కార్యకర్తలను నేను సన్మానిస్తా. ఈసారి జీహెచ్ఎంసీ మేయర్ బీజేపీదే. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం కలిసి పోటీ చేయడం తథ్యం. లౌకికవాదులారా.. జైనూర్ ఘటనపై నోరెందుకు మెదపడం లేదు?. హిందూ పండుగలపై ఆంక్షలు పెడుతుంటే ఎందుకు స్పందించరు?. జరుగుతున్న అన్యాయంపై ప్రశ్నించని వాళ్లు నా దృష్టిలో భారతీయులే కాదు’ అని అన్నారు.చదవండి: ‘వాల్మీకి’ స్కామ్‌లో మేం చెప్పిందే జరిగింది: కేటీఆర్చదవండి: అప్పుడే రిజర్వేషన్లు తీసేయాలి: రాహుల్ -
బీజేపీలో చేరడానికి చాలా మంది సిద్దం: బండి సంజయ్
కరీంనగర్, సాక్షి: పార్టీకోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తామని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన కరీంనగర్లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు.‘‘కేసీఆర్ దశ గ్రహ యాగాలు చేయాలి. కేసీఆరే ఓ దశమ గ్రహం. వరదల వల్ల నష్టపోయిన వారి కోసం యాగాలు చేయాలి. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి.. బిడ్డ కోసం యాగాలు చేస్తున్నాడు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబంకు ఇక నోఎంట్రీ బోర్డే. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను దృష్టి మరల్చడానికే హైడ్రా పేరుతో కూల్చివేతలు. బీజేపీలో చేరడానికి ఇంకా చాలా మంది సిద్దంగా ఉన్నారు. కరీంనగర్ పార్లమెంటులోనే బీజేపీ అత్యధిక సభ్యత్వం నమోదు కావాలి’’ అని అన్నారు. -
ఆరు గ్యారంటీలను మరిపించేందుకే ‘హైడ్రా’: బండి సంజయ్
సిరిసిల్ల: ఆరు గ్యారంటీలను మరిచిపోయేందుకు హైడ్రా తెచ్చారని, ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండూ ఒక్కటేనని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట, సిరిసిల్లలో గురువారం పర్యటించిన సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జన్వాడ ఫామ్‌హౌ స్ నిర్మాణం కూల్చివేతలో రేవంత్ రోషం ఏమైందని ప్రశ్నించారు. సల్కం చెరువు ఆక్రమణలపై ఒవైసీ బెదిరిస్తే భయపడతావా? అని ముఖ్యమంత్రిని బండి ప్రశ్నించారు. విద్యార్థులకు అన్యాయం జరగకుండా ఒవైసీ అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని చెప్పారు. రైతు రుణమాఫీ బోగస్ అని, రైతు భరోసా లేదని, మహిళలను ప్రభుత్వం ఆదుకోలేదని, నోటిఫికేషన్లు ఇవ్వలేదని విమర్శించారు. ఇప్పుడు యువరాజు అమెరికా వెళ్లాడని, ఆయన్ని కలిసేందుకు కాంగ్రెస్ నేతలు వెళ్తున్నారని, ఆ రెండు పార్టీల విలీనం ఖరారు అయిందన్నారు. ప్రభుత్వ విధానాలతో నేతన్నలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. సిరిసిల్ల నేతన్నలకు గత ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా దాట వేస్తోందన్నారు . రూ.లక్షల విద్యుత్ బకాయిలతో నేతన్నలు ఇబ్బందుల్లో ఉన్నారని, ఈ సమస్యకు పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డికి లేఖ రాస్తానని బండి సంజయ్ అన్నారు. -
బీఆర్ఎస్ విలీనం.. బండి సంజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: రుణమాఫీపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘నిజంగా రుణమాఫీ చేస్తే.. రైతులు ఎందుకు రోడ్లపైకి వస్తున్నారు. రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేత పత్రం వడుదల చేయాలి. రైతులకు క్లియరెన్స్ సర్టిఫిటికెట్ ఇవ్వాలి. చనిపోయిన రైతులకు రుణమాఫీ చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపై ఉంది. సోనియాగాంధీ బర్త్ డే రోజున కూడా కూడా మోసం చేశారు. ప్రజలను అయోమయానికి గురి చేస్తోంది కాంగ్రెస్. రుణమాఫీ చేస్తే రైతులు ఎందుకు రోడ్ల మీదకు వస్తున్నారు?. రైతుల పక్షాన పోరాడుతాం. విలీనాలు వద్దు.. దండం పెడుతా. ..గతంలో రేవంత్ రెడ్డి బీజేపీ అని బీజేపీలోకి పోతారని ప్రచారం చేశారు. 30 వేల ఉద్యోగాలు ఏ దేశంలో ఇచ్చారో కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్పాలె. నోటిఫికేషన్ ఇవ్వలేదు. బీఆర్ఎస్ను చేర్చుకోవాల్సిన అవసరరం బీజేపీకి లేదు. కాంగ్రెస్ వాళ్ళకు మాత్రమే ఉంది. బీఆర్ఎస్ను కలుపుకుంటే మా ప్రభుత్వం ఏమైనా వస్తదా?. కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు పక్కాగా కలుస్తాయి. కేసీఆర్ కుటుంబాన్ని లోపల ఎందుకు వేయలేదు?. కేసీఆర్ ఢిల్లీలో లాబీయింగ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్, భూ స్కామ్ అన్నీ అటకెక్కాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఇక చేరికలు మాత్రమే ఉన్నాయ్. ప్రజలు కోరితే తప్ప అధికారులు, నాయకులూ స్పందించే పరిస్థితి లేదు. సాగు, తాగు నీటి వంటివాటిపై రివ్యూ లేదు’అని అన్నారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్‌కే ఉంది: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఆయన ఆదివారం హైదరాబాద్‌లోని కోఠిలో మీడియాతో మాట్లాడారు. ‘‘ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవసరం కాంగ్రెస్ పార్టీకే ఉంది. బీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాల్సిన కర్మ మాకు లేదు. విలీనం, పొత్తులు గంగలో కలవనీయండి. వాటితో ప్రజలకేం సంబంధం?. కేసీఆర్, కేటీఆర్ పేరెత్తితేనే జనం రాళ్లతో కొట్టే పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ అవుట్ డేటెడ్ పార్టీ. రుణమాఫీ కాక రైతులు కాంగ్రెస్ దిష్టిబొమ్మలు కాల్చేస్తున్నా పట్టించుకోరా? రుణమాఫీ సహా 6 గ్యారంటీలపై చర్చను పక్కదారి పట్టించేందుకు విలీన డ్రామాలు. ...కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఆడుతున్న డ్రామాలు. రుణమాఫీపై కాంగ్రెస్ మాట తప్పింది. 64 లక్షల మంది రుణాలు తీసుకుంటే 22 లక్షల మందికే మాఫీ చేస్తారా? రైతులందరికీ రుణాలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చి.. ఎన్నికల్లో 40 వేల కోట్ల రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించి.. చివరకు రూ.17 వేల కోట్లు మాత్రమే మాఫీ చేస్తారా?. కాంగ్రెస్ మోసాలు ప్రజలకు అర్ధమయ్యాయని తెలిసే విలీన డ్రామాలాడుతూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారు’’ అని మండిపడ్డారు. -
బండి సంజయ్ సీఎం రేవంత్‌కు కోవర్టు: కేపీ వివేకానంద
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద మండిపడ్డారు. ఆయన ఆదివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కేంద్రమంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు. ‘నిరుద్యోగులు రోడ్డెక్కుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. బీజేపీ నాయకులు అసలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించటం లేదు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బండి సంజయ్ కేంద్ర సహాయ మంత్రి కాదు.. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా మారాడు. బండి సంజయ్ రేవంత్ రెడ్డికి కోవర్టుగా మారారు. కాంగ్రెస్ బీజేపీ బంధం అసెంబ్లీ వేదికగా బయటపడింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలని పొగుడుతూ మాట్లాడాడు. ఢిల్లీలో కుస్తీ గల్లిలో దోస్తీ కాంగ్రెస్, బీజేపీ పని. ఈ రెండు పార్టీలకు చెరో 8 పార్లమెంట్ స్థానాలను ప్రజలు ఇచ్చారు.. ఇస్తే రాష్ట్రానికి ఏం తెచ్చారు?. కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలని అంటున్నారు బండి సంజయ్. ఎందుకు కేసిఆర్‌ను అరెస్ట్ చేయాలి?. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసినందుకు కేసిఆర్ అరెస్ట్ చేయాలా?. ఈ నెల రెండో తేదీన సుంకిశాల ప్రమాదం జరిగింది. సుంకిశాల ప్రమాదం చిన్నదిగా చూపుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎందుకు ఆ కాంట్రాక్టు కంపెనీని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడం లేదు ప్రభుత్వం’అని అన్నారు.బండి సంజయ్ శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ..‘సీఎం రేవంత్ మీద నాకు పూర్తి నమ్మకం ఉంది. కేటీఆర్‌ను కచ్చితంగా జైలులో వేస్తారు. ఒకవేళ కేటీఆర్‌ను జైల్లో పెట్టకపోతే బీజేపీ నుంచి పెద్ద యుద్ధమే ఉంటుంది. బీఆర్ఎస్ పాలనను మా కేడర్ మరిచిపోదు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అనే ప్రసక్తే లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్ను ఎదుర్కొనే శక్తి బీజేపీ కేడర్‌కు ఉంది’ అని అన్నారు. -
పవన్, అనితలకు బిగ్ షాక్
న్యూఢిల్లీ, సాక్షి: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనితలకు కేంద్రం షాకిచ్చింది. ఏపీలో మహిళల మిస్సింగ్ కేసులపై వీళ్లిద్దరూ చేసిన వ్యాఖ్యలన్నీ పచ్చి అబద్ధమని తేల్చింది. ఈ మేరకు లోక్‌సభలో టీడీపీ ఎంపీల ప్రశ్నలతోనే ఆ బండారమంతా బయటపడింది. గతంలో.. జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే క్రమంలో పవన్ కల్యాణ్ అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. జగన్ పాలనలో వేల మంది మహిళలు అదృశ్యం అయ్యారని, వాళ్లందరినీ గుర్తించి వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉందంటూ ప్రకటనలు చేశారు. అందరినీ రెచ్చగొట్టారు. కూటమి అధికారంకి వచ్చాక సైతం పవన్ వాళ్లను వెనక్కి రప్పిస్తానంటూ చెబుతూ వస్తున్నారు. మరోవైపు హోం మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే వంగలపూడి అనిత సైతం అలాంటి విమర్శలే చేస్తూ వచ్చారు. అయితే.. జగన్ ప్రభుత్వంపై ఈ ఇద్దరి ఆరోపణలు అబద్ధమని కేంద్ర హోం శాఖ తేల్చింది. ఏపీలో పిల్లలు, మహిళల మిస్సింగ్ కేసుల పై లోక్ సభలో టీడీపీ ఎంపీలు లావు కృష్ణదేవరాయ, బీకే పార్థసారథిలు ప్రశ్నించారు. దీనికి కేంద్రమంత్రి బండి సంజయ్ సమాధానం ఇచ్చారు. మొత్తం ఐదేళ్లలో అదృశ్యమైన వాళ్లలో 663 మందిని మాత్రమే ఇంకా గుర్తించాల్సి ఉన్నట్టు స్పష్టం చేశారాయన. -
బడ్జెట్ కేటాయింపుల్లో అన్యాయం అవాస్తవం..
కరీంనగర్: కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని, కరీంనగర్‌కు మొండిచేయి చూపారని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలతోపాటు ఒక సెక్షన్ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు కరీంనగర్లో ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రం ప్రతీ పథకానికి ఖర్చు చేసే నిధుల్లో కరీంనగర్ సహా తెలంగాణకూ వాటా ఉంటుందనే సోయి మర్చిపోయి కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేయడం వారి అవకాశవాదానికి పరాకాష్ట అని మండిపడ్డారు.కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కేంద్రం గత ఐదేళ్లలో రూ.8 వేల కోట్లకుపైగా నిధులు వెచ్చించిన విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కరీంనగర్ నుంచి వరంగల్, ఎల్క తుర్తి నుంచి సిద్దిపేట జాతీయ రహదారి నిర్మాణం, కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణం, రైల్వేస్టేషన్ ఆధునీకరణ, స్మార్ట్‌సిటీ నిధులు కేంద్రానివే అన్నారు. కరీంనగర్– జగిత్యాల రహదారి నిర్మాణం కేంద్ర ప్రభుత్వ ప్రాధాన్యతలో భాగమే అని వివరించారు. కాంగ్రెస్ మాదిరిగా వంద రోజుల్లోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చాక వాటిని గాలికొదిలేసే పార్టీ బీజేపీ కాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. -
ఆ సీట్లలో గెలిస్తే కేంద్రమంత్రులే!
సాక్షి, హైదరాబాద్: బీజేపీ నాయకుల్లో కొన్నేళ్లుగా బలపడిన సెంటిమెంట్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లోనూ నిజమైంది. గత ముప్పై ఏళ్లుగా ఉమ్మడి ఏపీలో, ఇప్పుడు తెలంగాణలోనూ ఈ సెంటిమెంట్ బలపడుతూ వస్తోంది. ఉమ్మడి ఏపీలోని సికింద్రాబాద్, కరీంనగర్ నుంచి గెలిచిన బండారు దత్తాత్రేయ, సీహెచ్.విద్యాసాగరరావు, నరసాపురం నుంచి గెలిచిన రెబెల్‌స్టార్ యూవీ కృష్ణంరాజు గతంలో వాజ్‌పేయి కేబినెట్లో సహాయమంత్రులుగా పనిచేశారు. 2014లో తెలంగాణ ఏర్పడ్డాక జరిగిన ఎన్నికల్లోనూ సికింద్రాబాద్ నుంచి గెలిచిన దత్తాత్రేయ కేంద్ర సహాయమంత్రిగా ఉన్నారు. ఆ తర్వాత గవర్నర్‌గా నియమితులయ్యారు.2019 లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి గెలిచిన జి.కిషన్‌రెడ్డి తొలుత మోదీ కేబినెట్లో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి పదవిని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన పర్యాటక, సాంస్కృతిక, ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధిశాఖ మంత్రిగా కేబినెట్ హోదా పొందారు. తాజాగా జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచే గెలిచి తిరిగి మోదీ కేబినెట్లో ఈ దఫా బొగ్గు, గనులశాఖ మంత్రి అయ్యారు. ఇక గతంలో కరీంనగర్ నుంచి గెలిచిన విద్యాసాగరరావు వాజ్‌పేయి కేబినెట్లో కేంద్ర హోం శాఖ సహాయమంత్రిగా బాధ్యతలు చేపట్టారు.ఇప్పుడు కరీంనగర్ నుంచి రెండోసారి గెలుపొందిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సైతం తాజాగా మోదీ మంత్రివర్గంలో అదే పదవిని పొందారు. ఉమ్మడి ఏపీలోని నరసాపురం నుంచి గెలిచిన సినీ హీరో కృష్ణంరాజుకు కేంద్ర సహాయమంత్రి పదవి దక్కగా, 2024 ఎన్నికల్లో బీజేపీ టికెట్‌పై గెలిచిన శ్రీనివాసవర్మకు మోదీ కేబినెట్లో గ్రామీణ సహాయమంత్రి శాఖ లభించింది.ఎప్పుడూ అవే స్థానాలకు పదవులా? గతంలో మాదిరిగానే సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే మళ్లీ పదవులు కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈసారైనా తెలంగాణలోని వెనకబడిన జిల్లాలైన మహబూబ్‌నగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ వంటి జిల్లాలకు మోదీ కేబినెట్లో చాన్స్ లభిస్తుందేమోననే ఆశాభావం వ్యక్తమైంది. కానీ మళ్లీ సికింద్రాబాద్, కరీంనగర్ ఎంపీలకే చోటు లభించడంతో కొందరు నిరుత్సాహపడటం కొసమెరుపు. -
పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఏర్పడి పదేళ్లయినా ఉద్యమ ఆకాంక్షలైన నీళ్లు–నిధులు–నియామకాల గురించి పాలకులు పట్టించుకోకపోవడం బాధాకరమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘పదేళ్లుగా అమరుల ఆత్మ క్షోభిస్తూనే ఉంది. ఉద్యమ ఆకాంక్షలు సాకారం కాలేదనే అశాంతి, ఆగ్రహం ఉద్యమకారులను కలచి వేస్తూనే ఉంది’అని ఆదివారం ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. బీఆర్ఎస్ పాలనలో తమ బతుకులు పెనం మీద ఉంటే.. కాంగ్రెస్ పాలనలో పొయ్యిలో జారిపడ్డట్లయిందని రాష్ట్రంలోని అన్ని వర్గాల వారు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారన్నారు.‘గతపదేళ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు. పేపర్ లీకేజీలు, పరీక్షల రద్దు పేరుతో ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అవినీతి, కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. బీఆర్ఎస్ పాలకులను గద్దె దించి పదేళ్ల పీడ విరగడైందని సంతోషిద్దామంటే.. అధికారం చేపట్టిన కాంగ్రెస్ సర్కార్ సైతం బీఆర్ఎస్ బాటలోనే నడుస్తోంది’అని సంజయ్ మండిపడ్డారు. ‘కాంగ్రెస్ 6 నెలల పాలనలోనే 6 గ్యారంటీలుసహా ఇతర ఎన్నికల హామీలను తుంగలో తొక్కింది. వేల కోట్ల అవినీతికి పాల్పడుతోంది. కాళేశ్వరం, ఫోన్ ట్యాపింగ్, వడ్ల టెండర్లు సహా ప్రతి దాంట్లో కమీషన్లు దండుకోవడమే పనిగా పెట్టుకుంది. తెలంగాణను కాంగ్రెస్ పెద్దలకు ఏటీఎంగా మారుస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతోంది’అని ధ్వజమెత్తారు. అందుకే ప్రజల పక్షాన, అమరుల ఆశయాల కోసం, తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం బీజేపీ మరో ఉద్యమానికి సిద్ధమైందన్నారు. -
మంత్రి ఉత్తమ్ కుమార్‌పై నమ్మకముంది: బండి సంజయ్
సాక్షి, నల్లగొండ: తెలంగాణలో తక్కువ సమయంలో రెట్టింపు వ్యతిరేకతను కాంగ్రెస్ పార్టీ మూటగట్టుకుందన్నారు బీజేపీ ఎంపీ బండి సంజయ్. రాష్ట్రంలో బీఆర్ఎస్పై వ్యతిరేకత కారణంగానే కాంగ్రెస్‌కు ఓటు వేశారని అన్నారు. మేధావులందరూ బీజేపీకే ఓటు వేస్తారని చెప్పుకొచ్చారు.కాగా, పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ నల్గొండలో ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఆఫీసులో బండి సంజయ్ మాట్లాడుతూ.. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ స్థానాలను గెలుస్తుంది. ప్రజల కోసం కొట్లాడి జైలుకు పోవడానికి బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ అమలు చేయలేదు.బీఆర్ఎస్ పార్టీ వ్యవసాయాన్ని సర్వనాశనం చేసింది. అదే పంథాను కాంగ్రెస్ అమలు చేస్తోంది. కొనుగోలు కేంద్రాల్లో తరుగు లేకుండా కొనలేదు. బోనస్ ఇస్తామని ఇవ్వలేదు. అవినీతి అక్రమాలకు సివిల్ సప్లై శాఖ అడ్డాగా మారింది. కాళేశ్వరం తర్వాత అతిపెద్ద అవినీతి సివిల్ సప్లై శాఖలో జరిగింది. ఆ శాఖ నష్టాల్లో ఉండటానికి కారణం ఏంటి?. మధ్యవర్తిగా ఉన్న సివిల్ సప్లై శాఖ ఎందుకు నష్టాల్లో ఉంది. కొందరు కాంగ్రెస్ నాయకులు శాఖను అడ్డం పెట్టుకుని అవినీతి చేస్తున్నారు.కాంగ్రెస్ నేతలు మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. కాంగ్రెస్ నేతలు వేల కోట్ల రూపాయలు దండుకుని ఢిల్లీకి పంపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై నాకు నమ్మకం ఉంది. కానీ ఆయన కత్తి తీయడం లేదు. ఏ రైస్ మిల్లర్ల నుంచి ఏ నాయకుడికి ఎంత వాటా ముట్టిందో బయట పెట్టాలి. సివిల్ సప్లై శాఖలో అవినీతిపై సిట్టింగ్ జడ్జీతో విచారణ చేయించాలి.కృష్ణా జలాల విషయంలో చంద్రబాబుతో కేసీఆర్ కుమ్మక్కై దక్షిణ తెలంగాణకు మోసం చేశారు. విద్యా, వ్యవసాయం, అన్ని రంగాలను బీఆర్ఎస్, కాంగ్రెస్ నాశనం చేసింది. మైనార్టీ డిక్లరేషన్ అంటే కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి. రాములోరి అక్షింతలు, ప్రసాదాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ హేళన చేస్తోంది. ఓ వర్గానికి కొమ్ముగాస్తే బీజేపీ అడ్డుకుంటుంది. ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు కాంగ్రెస్ నేతలు ఇంకొకరికి అవకాశం ఇవ్వరు. ప్రభుత్వాన్ని పడగొట్టే ప్రయత్నం బీజేపీ చేయదు. పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ నేతలు రోడ్లపై తిరిగే పరిస్థితి ఉండదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
జవాన్లను అవమానిస్తారా..!?
సిరిసిల్ల/కరీంనగర్‌టౌన్: కరీంనగర్లో ముస్లిములంతా ఒక్కటై తనను ఓడించాలని కేసీఆర్ అన్నారని, ‘నేను హిందువుల ఓటు బ్యాంకుతో బంపర్ మెజార్టీతో గెలుస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే పార్టీ దుకాణం బంద్ చేస్తావా? మగాడివైతే, హిందువైతే నీ శరీరంలో మందు కాకుండా రక్తమే ప్రవహిస్తే నా సవాల్‌ను స్వీకరించాలని బండి సంజయ్ సవాల్ విసిరారు.దేశ రక్షణ కోసం సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన జవాన్లను అవమానించిన కాంగ్రెస్‌కు ఓటెందుకు వేయాలని ప్రశ్నించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో శనివారం సాయంత్రం బీజేపీ శ్రేణులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిసిల్ల గాం«దీచౌక్‌లో ఆయన మాట్లాడుతూ..సర్జికల్ స్ట్రయిక్స్‌ను సమర్థించే వారంతా పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటేయాలన్నారు. గాడిద గుడ్డూ పెట్టదు..కాంగ్రెస్ 6 గ్యారంటీలు అమలూ చేయదని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు సర్వనాశనం చేసేస్తారు మోదీ ప్రధాని కాకపోతే కాంగ్రెస్ వాళ్లు దేశాన్ని సర్వనాశనం చేస్తారని పేర్కొన్నారు. తెలంగాణలో బీజేపీ 12ఎంపీ సీట్లు గెలవబోతోందని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లాకేంద్రంలో సంజయ్‌కు మద్దతుగా ‘మహా బైక్ ర్యాలీ’నిర్వహించగా, ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దేశ ద్రోహానికి పాల్పడ్డారని ఆరోపించారు.ఫోన్ ట్యాపింగ్ కేసులో దొరికిపోతారనే భయంతో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ వద్దనున్న దేశ భద్రత డేటాను ధ్వంసం చేశారని, అలాంటి కేసీఆర్‌ను ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో బీజేపీ అధికార ప్రతినిధి రాణీరుద్రమారెడ్డి, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తదితరులు పాల్గొన్నారు. -
‘బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారు’
సాక్షి, కరీంనగర్: హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేసే ఆలోచనలో ఉన్నారు జాగ్రత్తగా ఉండాలని ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏపీలో చంద్రబాబు గెలిస్తే.. బాబు, రేవంత్ కలిసి హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధాని చేస్తారని అన్నారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడారు.‘‘రేవంత్ రెడ్డి బీజేపీతో పొత్తు పెట్టుకుని హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతోంది. నేను గెలిస్తే వాటిని కొట్లాడి అడ్డుకుంటా. హైదరాబాద్ నుండి కరీంనగర్‌కు రైలు రాబోతుంది.. అది నేను చేసిన పని.. గెలిస్తే వస్తుంది. తెలంగాణా నిధుల కోసం మోదీని నేను కలిసినన్ని సార్లు బండి సంజయ్ కలిశాడా?. కరీంనగర్ స్మార్ట్ సిటీకి వేయి కోట్లు తెచ్చిన. యువకుల్లరా మీకు ఉద్యోగాలు కావాలా.. విధ్వంసాలు కావాలా? అభివృద్ధి కోసం నా వెంట రండి.ప్రజా స్పందన చూస్తే భారీ మెజరిటితో గెలువబోతున్నానన్న ధీమా కలుగుతోంది.పాంప్లెంట్లులో మోదీ బొమ్మ పెట్టకుండానే సంజయ్ ప్రచారం చేసిండు. కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం కేంద్రంలో ప్రతి మంత్రిని కలిసినా నేను. బండి సంజయ్ కరీంనగర్ అభివృద్ధి కోసం మోదీని ఏనాడూ కలువలేదు. కేబుల్ బ్రిడ్జిపైన నేడు చెత్త పేరుకు పోయింది.. అభివృద్ధి ఎటు పోతుంది? నా కళ్ళకు నీళ్లు వస్తున్నాయి. ఓటర్ మహాశయులకు విజ్ఞప్తి చేస్తున్న నన్ను భారీ మెజారిటీతో గెలిపించండి. కరీంనగర్‌ను వైబ్రెంట్ కరీంనగర్‌గా మార్చి చూపిస్తా’’ అని వినోద్ కుమార్ అన్నారు. -
‘బండి’ని గెలిపించాలి..
కరీంనగర్: కరీంనగర్ మండలంలోని బొమ్మకల్‌లో శుక్రవారం బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌కు మద్దతుగా ఆ పార్టీ నాయకులు ప్రచారం నిర్వహించారు.నల్ల చెరువులో ఉపాధిహామీ పనులు చేస్తున్న కూలీలు, ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులను కలిసి ఎంపీగా సంజయ్ చేసిన అభివృద్ధి పనులను వివరించారు. ఆయనను మరోసారి గెలిపించాలని కోరారు. అనంతరం అభివృద్ధి పనులకు సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు దాది సుధాకర్, పాశం తిరుపతి, చిందం అశోక్, దాసరి రమణారెడ్డి, పుట్టపాక శ్రీధర్, పెద్ది లక్ష్మణ్, కాల్వ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.సంజయ్‌కి పలు బీసీ సంఘాల మద్దతు..బీజేపీ కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్‌కి శుక్రవారం పలు బీసీ సంఘాలు మద్దతు తెలిపాయి. నాయకులు మాట్లాడు తూ.. జనాభాలో 50 శాతం ఉన్న బీసీలందరూ ఏకమై, బీసీ అభ్యర్థి అయిన సంజయ్‌ని గెలి పించాలని కోరారు. ప్రధాన రాజకీయ పార్టీల్లో ఒక్క బీజేపీ మాత్రమే బీసీ అభ్యర్థికి అవకాశం ఇచ్చిందని,ఈ అవకాశాన్ని ఉపయోగించుకొ ని, ఆయనను గెలిపించాలని పిలుపునిచ్చారు. నాయకులు కేశిపెద్ది శ్రీధర్ రాజు, ఎన్నం ప్రకా శ్, నాగుల కనకయ్య గౌడ్, నారోజు రాకేశ్‌చారి, దొగ్గలి శ్రీధర్, మియాపురం రవీంద్రాచారి, కాయితోజు బ్రహ్మచారి, రంగు సంపత్ గౌడ్, మాదాసు సంజీవ్, బోయిని ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
నేను.. పక్కా లోకల్
కరీంనగర్: ‘నేను పక్కా లోకల్.. రూ.12 వేల కోట్ల నిధులతో కరీంనగర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం కృషి చేశా’నని బీజేపీ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. హుస్నాబాద్‌లో సోమవారం కార్యకర్తల సమావేశం నిర్వహించారు.ముందుగా గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి స్వాగతం పలికారు. సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు అభ్యర్థులు దొరకక, బయటి ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారన్నారు. గత ప్రభుత్వం గ్రామ పంచాయతీలకు నయా పైసా ఇవ్వలేదని, అందుకే మాజీ సర్పంచ్‌లు బీజేపీలో చేరుతున్నారని తెలిపారు. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అభివృద్ధికి కేంద్రమే నిధులు ఇచ్చిందన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులతోనే గత బీఆర్ఎస్ ప్రభుత్వం కరెంట్ బిల్లులను కట్టిందన్నారు. పల్లెల అభివృద్ధికి పాటుపడిన సర్పంచ్‌లను నిలువునా మోసం చేసిందన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలో ప్రజలు ఆలోచించాలన్నారు. కరీంనగర్ ఎంపీగా నన్ను ఓడించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు లోపాయికారి ఒప్పందం చేసుకున్నాయని ఆరోపించారు. ‘హుస్నాబాద్ ఎమ్మెల్యే నన్ను వెధవ అంటున్నారు. ఆయనపై నాకు ఎలాంటి ద్వేషం లేదు. ఆయన నన్ను ఎంత తిట్టినా పడతా’నని బండి అన్నారు. హామీలపై మొదట శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్, ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కల్యాణ్ నాయక్, పార్టీ రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కేసీఆర్ లాంటి దొరలే..! -
ఈసారి మూడు పార్టీలకు ప్రతిష్టాత్మకం.. కానీ రాజపూజ్యం ఎవరికో?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. వీటిలో జగిత్యాల, మెట్పల్లి నిజామాబాద్ పరిధిలోకి, సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, కరీంనగర్, మానకొండూరు, హుజూరాబాద్, హుస్నాబాద్ కరీంనగర్ పరిధిలోకి, పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని పెద్దపల్లి ఎంపీ సెగ్మెంట్ పరిధిలోకి వస్తాయి. మూడు స్థానాల్లోనూ అభ్యర్థులకు ఈ ఎన్నికలు చాలా కీలకం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా వీటిని కై వసం చేసుకోవాలని చూస్తున్నాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండింటినైనా గెలిచి, తిరిగి పట్టు నిలుపుకోవాలని పావులు కదుపుతోంది. ఐదేళ్ల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సామాన్యులుగా రంగంలోకి దిగిన బండి సంజయ్(కరీంనగర్) సిట్టింగ్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌ను ఓడించి, ధర్మపురి అర్వింద్(నిజామాబాద్) సిట్టింగ్ ఎంపీ కవితపై పైచేయి సాధించి, అనూహ్య విజయాలను అందుకున్నారు. ఈసారి తమ స్థానాలను నిలబెట్టుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తుండగా.. అదే స్థాయిలో కాంగ్రెస్ కూడా వ్యూహాలు రచిస్తోంది. నినాదాలు.. మేనిఫెస్టోలు.. నిజామాబాద్, పెద్దపల్లిల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ ఎస్ తమ అభ్యర్థుల్ని ఇప్పటికే ప్రకటించాయి. వా రు ఇప్పటికే ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. నిజామాబాద్ నుంచి బాజిరెడ్డి గోవర్దన్(బీఆర్ఎస్), ధర్మపురి అర్వింద్(బీజేపీ), తాటిపర్తి జీవన్‌రెడ్డి(కాంగ్రెస్)లు పోటీ పడుతున్నారు. పెద్దపల్లి నుంచి గడ్డం వంశీ(కాంగ్రెస్), గోమాస శ్రీనివాస్ (బీజేపీ), కొప్పుల ఈశ్వర్ (బీఆర్ఎస్)లు బరిలో ఉన్నారు. కీలకమైన కరీంనగర్ నుంచి బండి సంజయ్(బీజేపీ), బి.వినోద్‌కుమార్(బీఆర్ఎస్)లు బరిలో ఉండగా.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. దేశభక్తి, అయోధ్య రామాలయం, ఉమ్మడి జిల్లాలో ప్రారంభించిన ప్రాజెక్టులు, హిందుత్వమే ఏజెండాగా బీజేపీ దూకుడుగా వెళ్తోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో తమకు అధికారం కట్టబెట్టిన 6 గ్యారంటీలనే కాంగ్రెస్ నమ్ముకుంది. దీనికితోడు కేంద్ర నాయకత్వం ప్రకటించిన ‘పంచన్యాయ్’, రాష్ట్రానికి ప్రత్యేకంగా ప్రకటించిన మేనిఫెస్టో తమకు మేలు చేస్తాయని భావిస్తోంది. జాతీయ పా ర్టీలు రాష్ట్ర అభివృద్ధిని పట్టించుకోవని, తెలంగా ణగళం పార్లమెంట్లో వినిపించాలంటే.. తప్పకుండా తమను గెలిపించాలని బీఆర్ఎస్ కోరుతోంది. ఈసారి ఖర్చు రూ.కోట్లలోనే.. ఈసారి పార్లమెంట్ ఎన్నికల ఖర్చు క్రితంసారితో పోలిస్తే పెరిగేలా ఉంది. ప్రచారం, పెట్రోల్, భో జనం, సభల నిర్వహణ ఖర్చు అమాంతం పెరిగింది. ఇక, జన సమీకరణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ లెక్కన అభ్యర్థుల వ్యయం శ్రీ క్రోధి నా మ సంవత్సరంలో రూ.కోట్లలో ఉండనుందని స మాచారం. దీనికి ప్రతిఫలంగా ప్రజలు ఓట్ల రూపంలో ఆదాయం ఇవ్వనున్నారు. ఇది ఎవరికి అధికంగా ఉంటే వారినే రాజయోగం వరించనుంది. ఈ నేపథ్యంలో ఎంపీ అభ్యర్థులు ఇప్పటికే తమ జాతకాలను పరీక్షించుకుంటున్నారు. ఎవరి ఆదాయ, వ్యయాలు ఎంత? ఎవరి రాజపూజ్యం ఎంత? ఎవరికి రాజయోగం ఉంది? తదితర వివరాలను పండితులను అడిగి తెలుసుకుంటున్నారు. ఇవి చదవండి: బస్సు యాత్రతో ‘కారు’ ప్రచారం -
రాహుల్ గాంధీ హామీలు పెద్ద జోక్
బోయినపల్లి(చొప్పదండి): కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశంలో ప్రతి మహిళ పేరిట రూ.లక్ష చొప్పున బ్యాంకులో జమచేస్తా మని, ఉద్యోగాల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తానంటూ ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ చేస్తున్న హామీలు పెద్దజోక్ అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ విమర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో గురువారం జరిగిన ప్రజాహితయాత్రలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి ఎలాగూ రాలేదని అర్థమై, అడ్డగోలు హామీలు ఇస్తున్నారన్నారు. రిజర్వేషన్ల విషయం తర్వాత కానీ.. మొదట కాంగ్రెస్ పార్టీ పదవులు, లోక్‌సభ ఎన్నికల్లో 50 శాతం టికెట్లు మహిళలకు ఇవ్వాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలకు ఇప్పటికీ దిక్కులేదని చెప్పారు. 17 ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే రాష్ట్రానికి అధిక నిధులు తీసుకొస్తామన్నారు. బోయినపల్లి మండలకేంద్రంలో మెదక్ ఎంపీ అభ్యర్థి రఘునందన్‌రావు మాట్లాడుతూ బండి సంజయ్ గెలిస్తే మోదీ ప్రభుత్వంలో మంత్రిపదవి వస్తుందని పేర్కొన్నారు. -
‘పెడితే పెళ్లి లేదంటే చావు కోరే వ్యక్తి కేసీఆర్’
సాక్షి, కరీంనగర్: తెలంగాణ సమాజం చీదరించుకుని ఒడగొట్టిన కేసీఆర్‌కు బుద్ధిలేదని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మండిపడ్డారు.ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘ కేసీఆర్.. నిస్సిగుగా అబద్దాలు మాట్లాడుతూ ప్రజలని మళ్లీ మోసగిస్తున్నారు. మళ్లీ మాయ మాటలతో తెలంగాణ సెంటిమెంట్‌ని రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. ఏడు మండలాలను ఆంధ్రలో కలిపేందుకు సహకరించిందే కేసీఆర్. ఆఫ్ట్రాల్ ఏడు మండలాలు పోతే పోనీ అన్నాడు కేసీఆర్. పెడితే పెళ్లి లేదంటే చావు కోరే వ్యక్తి కేసీఆర్. అక్రమంగా ఆస్తులు సంపాదించిన వ్యక్తి వినోద్ కుమార్. అయినా ఆయన్ని నిజయితీ పరుడు అంటూ ప్రచారం చేస్తున్నారు.కేసీఆర్‌పై సహారా, ఈఎస్ఐ కేసులు కూడా ఉన్నాయి. అందుకే నాడు కేంద్ర మంత్రిగా ఉన్న కేసీఆర్‌ని తొలగించారు. కనీసం పార్లమెంట్ కూడా రాకపోతే.. నాటి ప్రధాని మన్మోహన్ సింగ్ కేసీఆర్ రాజీనామా చేయమన్నారు’ అని సంజయ్ అన్నారు. -
మీకు, కేసీఆర్‌కు తేడా ఏముంది?
కోహెడ (హుస్నాబాద్)/ కరీంనగర్ టౌన్: ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను బీఆర్ఎస్ మోసం చేస్తే, వంద రోజుల్లో 6 గ్యారంటీలను అమలు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చి కాంగ్రెస్ మోసం చేసిందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కాంగ్రెస్, బీఆర్ఎస్లపై విరుచుకుపడ్డారు. తెలంగాణకు కేంద్రం నయా పైసా సాయం చేయలేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుపట్టారు. మలిదశ ప్రజాహిత యాత్రలో భాగంగా సోమవారం హుస్నాబాద్ నియోజకవర్గంలోని చిగురుమామిడి కేంద్రంలో ఆయన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నరేంద్ర మోదీ పాలనలో తెలంగాణకు రూ.10 లక్షల కోట్లకుపైగా నిధులిచ్చిందని, అసలు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పాలన సాగుతోందంటే మోదీ ఇస్తున్న నిధుల పుణ్యమేనని అన్నారు. కాంగ్రెస్‌కి దమ్ముంటే ప్రజలకు ఇచ్చిన హమీ మేరకు వంద రోజుల్లోనే 6 గ్యారంటీలను అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని బండి సవాల్ విసిరారు. ‘కాంగ్రెస్‌కు, బీఆర్ఎస్ ప్రభుత్వానికి తేడా ఏముంది? 10 ఏళ్లలో బీఆర్ఎస్ రూ.5 లక్షల కోట్ల అప్పు తెస్తేం మీరు 2 నెలల్లోనే రూ.10 వేల కోట్ల అప్పు తెచ్చారు’అని కాంగ్రెస్‌ను విమ ర్శించారు. ‘వంద రోజుల్లోనే 6 గ్యారంటీలన్నీ అమలు చేస్తానన్నారు, 75 రోజులు దాటిపోయా యి. రూ.2 లక్షల రుణమాఫీ, రైతు బంధు ఎకరాకు రూ.15 వేలు, మహిళలకు నెలనెలా రూ.2,500, ఆసరా పెన్షన్ రూ.4 వేలు ఇస్తానన్న హమీ ఎందుకు అమలు చేయడం లేదు’అని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వం తెలంగాణలో 2 లక్షల 40 వేల ఇళ్లు మంజూరుచేస్తే ఒక్క ఇల్లు కూడా కట్టివ్వకుండా మోసం చేసిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిదని అన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలను గెలుస్తాం సీబీఐ, ఈడీని శాసించే అధికారం బీజేపీకి లేదని, ఢిల్లీ లిక్కర్ కేసులో సాక్ష్యాలు, ఆధారాలతోనే కవితకు నోటీసులిచ్చారని, ఆధారాలుంటే ఎంత పెద్దవారైనా ఉపేక్షించకూడదన్నదే బీజేపీ విధానమని బండి అన్నారు. రెండోవిడత ప్రజాహిత యాత్ర ప్రారంభం సందర్భంగా కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో పూజలు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతోందని అన్నారు. విజయ సంకల్పయాత్రకు ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందన్నారు. బీజేపీ ఐదారు రోజుల్లో ఎంపీ అభ్యర్థులను ప్రకటించబోతోందని, బీఆర్ఎస్తో పొత్తు అంటే చెప్పుతో కొట్టాలని తానే చెబుతున్నానని స్పష్టం చేశారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బోయినపల్లి వినోద్ కుమార్ చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మోదీని మరోసారి ప్రధానిని చేయడమే లక్ష్యంగా ప్రజాహిత యాత్ర కొనసాగిస్తున్నామని తెలిపారు. -
ఔరంగజేబులంతా ఏకమైనా కానీ ఆ నలుగురినే.. : బండి సంజయ్
ఆదిలాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో ఔరంగజేబులంతా ఏకమై బీజేపీ అభ్యర్థులను ఓడించేందుకు యత్నించినా ధీటుగా ఎదుర్కొని ఉమ్మడి జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించిన చరిత్ర ఆదిలాబాద్ ప్రజలదని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. ఆపార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన విజయ సంకల్పయాత్రలో భాగంగా బుధవారం జిల్లాలోని నేరడిగొండ, ఇచ్చోడతోపాటు ఆదిలాబాద్‌లో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ శిరస్సు వంచి వందనాలు చెబుతున్నానన్నారు. జిల్లా ప్రజలదెబ్బకు బీఆర్ఎసోళ్లు ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారన్నారు. రాంమందిర్ నిర్మాణం కోసం తపించిన కరసేవకులను కాల్చి చంపిన ములాయం సింగ్ గతేమైందో, బతుకేమైందే ప్రజలు గ్రహించాలన్నారు. అయోధ్యలోనే రాముడు పుట్టారా అనిప్రశ్నించే నాకొడుకులా భవిష్యత్తును ఖతం చేస్తామని, అలాంటి పార్టీలకు భవిష్యత్తే లేకుండా చేస్తామన్నారు. నిర్మల్ జిల్లాలో రాంజీగోండ్ చరిత్రను తెరమరుగు చేసేందుకు వెయ్యి ఊడలమర్రి వద్ద సమాధి చేసిన బీఆర్ఎస్ను ప్రజలు సమాధి చేశారన్నారు. కాంగ్రెస్ మే ల్కొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే బీఆర్ఎస్ కు పట్టిన గతే పడుతుందన్నారు. వెయ్యి ఊడల మ ర్రి వద్ద రాంజీగోండ్ స్మృతి వనాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దేశం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోదీకి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానం బహుమతి గా అందించాలన్నారు. ఎంపీ సీటును గెలిపిస్తే ఆది లాబాద్ జిల్లా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తామన్నా రు. మరోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ సర్కారు ఏర్పడబోతుందని, అధికారం చేపట్టిన వెంటనే ఆది లాబాద్–ఆర్మూర్ రైల్వేలైన్‌కు మోదీతో శంకుస్థాప న చేయిస్తామన్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లించి కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారన్నారు. రాష్ట్రంలో ఖజానా లేదని చెబుతున్న కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారంటీలను ఏ విధంగా అమలు చేస్తారో ప్రజలకు చెప్పాలన్నారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లేది కొత్త స్క్రాచ్ రుచి చూసేందుకే తప్పా.. ఎలాంటి పొత్తుల కోసం కాదన్నారు. కేసీఆర్‌కు ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్ ఇస్తారని ప్రశ్నించా రు. ఎన్నికలకు ముందు సొంత వాహనాలు లేని చంద్రశేఖర్‌రావుకు లక్షల కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. హిందువులు ఓటు బ్యాంక్‌గా మారకపోవడంతోనే రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయామని, దేశానికి కావాల్సింది రామ రాజ్య మా.. రజాకార్ల రాజ్యమా అనేది ప్రజలు ఆలోచించాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ తరఫున పోటీ చేసేందుకు అభ్యర్థులే కరువయ్యారని, అలాంటి పార్టీతో పొత్తు పెట్టుకోవాలా అని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో యాత్ర ఇన్చార్జి పల్లె గంగారెడ్డి, జెడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, జిల్లా అధ్యక్షుడు ప తంగే బ్రహ్మానంద్, మాజీఎంపీ రమేశ్ రాథోడ్, మా జీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు, పార్లమెంట్ కన్వీ నర్ బోయర్ విజయ్, లోక ప్రవీణ్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు లాలామున్నా, వేదవ్యాస్, నాయకులు రాజేశ్‌బాబు, అభినవ్ సర్దార్, సుహాసినిరెడ్డి పాల్గొన్నారు. అధికారం పోయినా.. తీరుమారలే.. ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్నను ప్రజలు ఓడించి ఆ పార్టీని అధికారం లేకుండా చేసినా ఇంకా అధికారంలో ఉన్నట్లే మాట్లాడుతుండటం హాస్యాస్పదంగా ఉందని ఆదిలాబా ద్ ఎంపీ సోయం బాపూరావు అన్నారు. వంద మంది రామన్నలు వచ్చినా ఆదిలాబాద్ ఎంపీగా బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ఆదిలాబా ద్–ఆర్మూర్, ఆర్మూర్–పఠాన్‌చెరు వరకు 316 కిలో మీటర్ల దూరం ఫైనల్ లొకేషన్ సర్వే పూర్తయిందని, ఇందు కోసం రూ.7,313 కోట్లు కేంద్రం కేటాయించిందని పేర్కొన్నారు. ఆదిలాబాద్–గడ్చందూర్ రైల్వే లైన్ ఫైనల్ లొకేషన్ సర్వే కూడా పూర్తయిందని, రూ.1.75 కోట్లు కేటాయించడం జరిగిందన్నారు. ఈ విషయం తెలియని జోగు రామన్న రాజకీయ లబ్ధి కోసం రైల్వే సాధన సమితి పేరిట డ్రామా ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో పనిచేసిన ఎంపీలకు పిట్‌లైన్ అంటే తెలియదని, ఆదివాసీ బిడ్డగా దాన్ని తీసుకురావడం జరిగిందన్నారు. ఢిల్లీలో మోదీ ఉండాల్సిందే.. ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ.. తొమ్మిదిన్నరేళ్లలో ప్రధాని మోదీ ప్ర పంచానికే నాయకత్వం వహించే దిశగా దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లారన్నారు. గల్లీ లో ఎవరున్నా ఢిల్లీలో మోదీ ఉండాలని ప్రజ లంతా కోరుకుంటున్నారన్నారు. తెలంగాణ లోనూ బీజేపీ గెలవడం ఖాయమన్నారు. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ నేతలు గిలగిలా కొట్టుకుంటున్నారన్నారు. మోసపూరిత హామీలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గానికై నా న్యాయం చేసిందా అని ఆయన ప్రశ్నించారు. ‘బండి’కి ఘన స్వాగతం.. బీజేపీ పార్టీ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా నుంచి ఆదిలాబాద్ జిల్లాలో ప్రవేశించిన బండి సంజయ్‌కు నేరడిగొండ మండలం రోల్మామడ వద్ద పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. క్రేన్ సాయంతో గజ మాల వేశారు. నేరడిగొండలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. అక్కడినుంచి ఇచ్చోడకు చేరుకోగా పార్టీ శ్రేణుల స్వాగతం అనంతరం ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. గుడిహత్నూర్‌లో ఓ స్వామిజీ నివాసంలో భోజనం చేసి జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. మావల బైపాస్ వద్ద బండి సంజయ్‌కు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. అక్కడినుంచి 5కిలోమీట ర్ల మేర బైక్ ర్యాలీగా జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. ప్రధానవీధులగుండా అంబేద్కర్ చౌక్ కు యాత్ర చేరుకోగా, పార్టీ శ్రేణులు ఆయన ను భుజాలపై ఎత్తుకొని స్వాగతం పలికారు. ఇవి చదవండి: మేడారంలో నేడు అసలు ఘట్టం ఆవిష్కరణ! -
‘బండి’ది ఓట్ల రాజకీయం..!
కరీంనగర్: ఇన్నాళ్లు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న ఎంపీ బండి సంజయ్‌కుమార్ పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఓట్ల రాజకీయానికి తెరలేపారని కరీంనగర్, జగిత్యాల, హన్మకొండ జెడ్పీ చైర్మన్లు కనుమల్ల విజయ, దావ వసంత, సుధీర్‌బాబు ఆరోపించారు. కరీంనగర్‌లోని ఓ హోటల్లో బుధవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఎంపీగా ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధి గురించి పట్టించుకోని సంజయ్ సర్పంచ్ల పదవీ కాలం ముగిశాక సానుభూతి చూపిస్తూ మొసలి క న్నీరు కారుస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ను అబాసుపాలు చేయడానికే సర్పంచులకు రావాల్సి న బిల్లులపై పోరాటం చేస్తామని ఓట్ల జిమ్మిక్కులు చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్‌కుమార్ బెస్ట్ పార్లమెంటేరియన్‌గా గుర్తింపు పొందారని గుర్తు చేశారు. ఎంపీగా ఏం చేశావో చెప్పి ఓట్లు అడగాలని స్పష్టం చేశారు. శ్రీరాముని ఫొటో, అక్షింతలు పంపి సెంటిమెంట్‌తో ఓట్లు దండుకునే ప్రయత్నం సరికాదన్నారు. ఇప్పటికైనా సంజయ్ అభివృద్ధిపై అబద్ధాలు మాట్లాడడం మానుకోవాల ని హితవు పలికారు. బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు మారుతి, నయీం పాల్గొన్నారు. ఇవి చదవండి: ఎన్నికల సమయంలోనే రాజకీయాలు -
మళ్లీ గెలిపిస్తే ఎములాడను అభివృద్ధి చేస్తా.. : బండి సంజయ్
కరీంనగర్: మళ్లీ ఎంపీగా గెలిపిస్తే వేములవాడ రాజన్న ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని కరీంనగర్ ఎంపీ, బీజేపీజాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. వేములవాడరూరల్ మండలం చెక్కపల్లి, నూకలమర్రి, నమిలిగుండుపల్లి, వట్టెంల, శాత్రాజుపల్లి గ్రామాలలో సోమవారం ప్రజాహితయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా బండి సంజయ్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. అయోధ్య అక్షింతలను కూడా రేషన్ బియ్యమంటూ హేళన చేస్తూ కాంగ్రెస్ నేతలు ప్రధాని మోదీపై అక్కసు వెళ్లగక్కుతున్నారన్నారు. వేములవాడకు రూ.500 కోట్లు ఇస్తానని కేసీఆర్ మోసం చేసిండని, మూలవాగుపై బ్రిడ్జి రెండుసార్లు కూలిందన్నారు. బ్రిడ్జి నుంచి రాజన్న ఆలయం, బద్ది పోచమ్మ గుడి వరకు రోడ్డు విస్తరణ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారన్నారు. వేములవాడ నియోజకవర్గ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం రూ.575.95 కోట్లకు పైగా నిధులు ఇచ్చిందని తెలిపారు. రెండోసారి ఎంపీగా గెలిపిస్తే వేములవాడ, కొండగట్టు ఆలయాలను అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అధికారం పోయినా కేసీఆర్ మంది కొంపలు ఎట్లా ముంచాలనేదానిపైనే కుట్రలు చేస్తున్నాడన్నారు. నిరుద్యోగులు, రైతుల కోసం పోరా డితే తనపై వంద కేసులు బనాయించి, రెండు సా ర్లు జైలుకు పంపారని గుర్తు చేశారు. బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, నాయకులు చెన్నమనేని వికాస్‌రావు, తిరుపతి, రవికిశోర్ పాల్గొన్నారు. కరెంట్ సౌకర్యం కల్పించండి శాత్రాజుపల్లిలో ఆయుష్మాన్ సెంటర్‌ను బండి సంజయ్ తనిఖీ చేశారు. సెంటర్లో కరెంట్ సౌకర్యం, ఫ్యాన్లు, టేబుళ్లు లేకపోవడంతో వెంటనే విద్యుత్ సిబ్బందికి ఫోన్ చేసి 24 గంటల్లో కరెంట్ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. టాయిలెట్లు కూడా లేకపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాథమిక పాఠశాలకు బెంచీలను తన సొంత ఖర్చుతో ఏర్పాటు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఇవి చదవండి: 25 మంది ఎమ్మెల్యేలతో హరీష్ రావు కాంగ్రెస్‌లోకి వస్తే..: రాజగోపాల్ రెడ్డి -
బీఆర్ఎస్, కాంగ్రెస్‌ల దుష్ప్రచారం నమ్మొద్దు
చందుర్తి (వేములవాడ): రానున్న పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుస్తుందని సర్వేలు చెబుతుండడంతో రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి తమ పార్టీపై దుష్ప్రచారం చేస్తున్నాయని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ అన్నారు. దీనిని ప్రజలు నమ్మొద్దని ఆయన కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో ఆదివారం బండి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా కట్టలింగంపేటలో విలేకరులతో మాట్లాడారు. బీజేపీని ఓడించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్లు కుట్రలు చేస్తున్నాయని, బీజేపీ, బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటాయన్న ప్రచారం నమ్మొద్దని కోరారు. స్వయం ప్రకటిత మేధావి గత ఎన్నికల్లో ఎక్కడి నుంచో వచ్చి కరీంనగర్లో పోటీ చేశాడని, ఇప్పుడు సైతం ఇక్కడ ఎంపీగా గెలుస్తానని కలలు కంటున్నాడని విమర్శించారు. మేడిగడ్డ ప్రాజెక్టు నాణ్యత లోపించి కూలేందుకు సిద్ధమైందని చెబుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, అవినీతి, అక్రమాలకు పాల్పడిన బీఆర్ఎస్ పార్టీ నాయకులపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ రెండు నెలల పాలనతో ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మోసపోయామని భావి స్తున్నారని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. -
మోదీతోనే దేశాభివృద్ధి : బండి సంజయ్‌కుమార్
కరీంనగర్: ప్రధాని నరేంద్రమోదీతో దేశం అభివృద్ధిలో దూసుకుపోతుందని కరీంనగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్‌కుమార్ పేర్కొన్నారు. గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనుల్లో కేంద్ర ప్రభుత్వం నిధులే అధికమని వివరించారు. ఆదివా రం రెండో రోజు ప్రజాహిత యాత్ర కథలాపూర్ మండలం సిరికొండ, కథలాపూర్, దుంపేట, దూలూర్, పోసానిపేట, తాండ్య్రాల, అంబారిపేట, కలిగోట గ్రామాతో పాటు రుద్రంగి, చందుర్తి మండలాల్లో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక మహిళలు భారీ ఎత్తున తరలివచ్చి స్వాగతం పలికారు. బండి సంజయ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో గ్రామాల్లో సీసీ రోడ్లు, మొక్కల పెంపకం, మరుగుదొడ్ల నిర్మాణాలు, చెత్త సేకరణకు ట్రై సైకిళ్లు కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఆయా గ్రామాల్లో ఇంటింటా తిరిగి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కలిగోట సూరమ్మ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి కాలువలు నిర్మిస్తే ఈ ప్రాంతానికి సాగునీటి సమస్య తీరుతుందని ప్రజలు ఎంపీ దృష్టికి తీసుకెళ్లారు. పలు గ్రామాల్లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయని ప్రజలు విన్నవించగా.. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో తారు రోడ్లు నిర్మించామని, మరోసారి అధికారంలోకి వచ్చాక మండలంలోని అన్ని గ్రామాల్లో రోడ్డు సౌకర్యం మెరుగుపరుస్తామని తెలిపారు. పలువురు యువకులు ఎంపీతో సెల్పీ ఫొటోలు దిగేందుకు పోటీ పడ్డారు. ఆయా గ్రామాల్లో రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్, ఛత్రపతి శివాజీ విగ్రహాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. రుద్రంగిలోని ప్రధానమంత్రి కిసాన్ సమృద్ధి కేంద్రాన్ని సందర్శించారు. చందుర్తి మండలంలోని పలు గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర ప్రజలను పలకరిస్తూ, సమస్యలు తెలుసుకుంటూ ముందుకుసాగింది. లింగంపేటలోని రేషన్‌షాపులలో పేదలకు అందిస్తున్న బియ్యాన్ని పంపిణీ చేశా రు. అక్కడ ఉన్న వారితో ఉపాధిహామీ పథకం గు రించి మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఏడు పథకాల గురించి వారికి వివరించారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, బీజేపీ నియోజకవర్గ నేత చెన్నమనేని వికాస్‌రావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణరావు, ప్రతాప రామకృష్ణ ఎంపీ సంజయ్‌కుమార్‌కు మద్దతు ప్రకటించి పాదయాత్ర చేశారు. ఇవి చదవండి: బీఆర్ఎస్కు ఊహించని ఎదురుదెబ్బ! -
రామ రాజ్యమా.. రాక్షస రాజ్యమా..? : బండి సంజయ్
కోరుట్ల/మేడిపల్లి/కొండగట్టు: మోదీ రామరాజ్యం కావాలా?.. రాహుల్ రాక్షస రాజ్యం కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివా రం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలో ప్రజాహిత యా త్రకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మాట్లాడారు. రాహుల్ కాదు.. రౌల్.. అంటే స్పానిష్ భాషలో తోడేలు లాంటి వాడని అర్థమని, అలాంటి రాహుల్ గాందీని ప్రజలు నమ్మరని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన నిలిచి, దేవుడిని హేళన చేసే పార్టీలకు తగిన గుణపాఠం చెప్పాలని ప్రజలను కోరారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందని, మళ్లీ కాంగ్రెస్ పాలన వస్తే అక్కడ బాబ్రీ మసీదు కట్టిస్తారని విమర్శించారు. అయోధ్యలో రాముడు పుట్టాడని చెప్పడానికి ఆధారాలేమిటని కాంగ్రెస్ నేతలు చేస్తున్న వివాదాలను ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడైన పీవీ నరసింహారావును కాంగ్రెస్ పార్టీ ఏనాడూ గుర్తించలేదని, పీవీ ఘాట్ కూల్చేస్తామని మజ్లిస్ వార్నింగ్ ఇస్తే, కాంగ్రెస్ కనీసం నోరు మెదపలేదన్నారు. పీవీ ఘాట్‌పై చేయి వేస్తే దారుస్సలాంను కూల్చేస్తామని వారి్నంగ్ ఇచ్చి న పార్టీ బీజేపీ అని గుర్తు చేశారు. దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన ప్రధాని మోదీ కులాన్ని ప్రశ్నించడం రాహుల్ అజ్ఞానానికి నిదర్శనమని విమర్శించారు. బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ మోసం..: బడ్జెట్ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ ప్రజలను దారుణంగా మోసం చేసిందని సంజయ్ అన్నారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు అమలు కావాలంటే కనీసం రూ.5 లక్షల కోట్లు కావాలని, ప్రస్తుత బడ్జెట్లో కేవలం రూ.53 వేల కోట్లు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకున్నారని చెప్పారు. ఇచ్చి న హామీలకు బడ్జెట్లో కేటాయించిన నిధులకు ఏమాత్రం సంబంధం లేదని, హామీలు నెరవేర్చలేమని కాంగ్రెస్ పరోక్షంగా చేతులెత్తేసిందని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఫామ్‌హౌస్ తాంత్రిక నిలయం..: కేసీఆర్ ఫామ్‌హౌస్ తాంత్రిక పూజలకు నిలయమని సంజయ్ ఆరోపించా రు. ఫామ్‌హౌస్‌కు వెళ్లడానికి ప్రస్తుతం ఎవరూ సాహసం చే యడం లేదన్నారు. ‘నా కాళ్లు, చేతులు పడిపోవాలని, నేను చనిపోవాలని ఫామ్‌హౌస్‌లో కేసీఆర్ తాంత్రిక పూజలు నిర్వహించారు’అని ఆరోపించారు. ఇతరుల నాశనం కోరుకునే వారు ఎవరైనా చివరకు వారే నాశనం అవుతారని బండి పేర్కొన్నారు. రాష్ట్రంలో 17 ఎంపీ స్థానాలు గెలుస్తాం: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానా లు గెలవడమే ప్రజాహిత యాత్ర ముఖ్య ఉద్దేశమని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. శనివారం జగిత్యాల జి ల్లా కొండగట్టు అంజన్న ఆలయంలో ఆయన ప్రత్యేక పూజ లు నిర్వహించి యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆ లయ అర్చకులు సన్మానించి, స్వామివారి ప్రసాదం అంద జే శారు. అనంతరం సంజయ్ మాట్లాడుతూ, మోదీని మూడో సారి ప్రధాని చేయడమే యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొండగట్టు, వేములవాడ, ధర్మపురి ఆలయాలకు నిధులు కేటాయిస్తానని వాగ్ధానం చే సి ఇవ్వలేదని విమర్శించారు. దేవుళ్లను, ప్రజలను మోసం చే సిన ఘనత బీఆర్ఎస్ పా ర్టీదేనని అన్నారు. ఈనెల 15 వరకు వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాల్లో యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. -
ఓట్ల కోసమే బండి సంజయ్ పాదయాత్ర : కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి
కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఓట్ల కోసమే పాదయాత్ర ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే వాటిని గాలికి వదిలేసి పాదయాత్ర పేరుతో సానుభూతి రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని పేరుతో రాజకీయాలు చేసే బండి సంజయ్ కరీంనగర్, వేములవాడ, కొండగట్టు దేవస్థానాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తేలేదని తెలిపారు. ఇప్పటికైనా మతం, సెంటిమెంట్ల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు మడుపు మోహన్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, నాయకులు రహ్మత్ హుస్సేన్, రామిడి రాజిరెడ్డి, కంకణాల అనిల్ కుమార్, బాలబద్రి శంకర్, మహ్మద్ ఆమేర్, పరుశురాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: వారి నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర.. -
పరేడ్ గ్రౌండ్ బుక్ చేస్తా.. తిట్టుకోండి
హుజూరాబాద్: ‘ఒకరేమో అసెంబ్లీలో మీ సంగతి తేలుస్తానంటారు. ఇంకొకరు నన్ను టచ్ కూడా చేయలేవంటారు. అసెంబ్లీ నిర్వహించుకునేది ఒకరినొకరు తిట్టుకోవడానికా? ప్రజా సమస్యలు పరిష్కరించడానికా? మీరు తిట్టుకోవాలనుకుంటే హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్ నేనే బుక్ చేస్తా. తిట్టుకుంటారో, కొట్టుకుంటారో అక్కడే తేల్చుకోండి. అసెంబ్లీని మాత్రం ప్రజలకి చ్చిన హామీలను అమలు చేయడానికి వేదికగా మార్చండి’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ‘గావ్ చలో అభియాన్’కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం రంగాపూర్‌లో మంగళవారం రాత్రి బస చేసిన ఆయన బుధవారం ఉదయం గ్రామంలో పర్యటించారు. కేంద్ర ప్రభుత్వ నిధులతో చేసిన అభివృద్ధి పనులు పరిశీలించి, గ్రామస్తుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. సర్కారు వద్ద పైసల్లేవని, అప్పుల ఊబిలో కూరుకుపోయిందని సాక్షాత్తూ ముఖ్యమంత్రే చెప్పారని, మరి ప్రజలకిచ్చిన ఆరుగ్యారంటీల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. రేషన్‌కార్డు ప్రాతిపదికన రూ.500కే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్లలోపు ఉచిత విద్యుత్ హామీలు అమలు చేయాలని నిర్ణయించడం అన్యాయమన్నారు. రాష్ట్రంలో పదేళ్లుగా అర్హులైన 10 లక్షల కుటుంబాలు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్నాయని, వారి పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. వారంరోజుల్లో అందరికీ రేషన్‌కార్డులు మంజూరుచేసేలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకో వాలని డిమాండ్ చేశారు. కొందరు బీఆర్ఎస్ నేత లు హద్దుమీరి మాట్లాడుతున్నారని, ముఖ్యమంత్రి పదవికి గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఈ సందర్భంగా ఆయన సూచించారు. -
గ్రామాలకు వచ్చే నిధులన్నీ కేంద్రానివే..
కరీంనగర్‌టౌన్/హుజూరాబాద్: రాష్ట్రంలోని అన్ని పంచాయతీల్లో జరిగే అభివృద్ధి పనులన్నింటికీ కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వమే నిధులిస్తోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు పైసా ఇవ్వడం లేదని, పంచాయతీ సిబ్బందికి జీతాలు, కరెంటు బిల్లులు సహా అన్నింటికీ కేంద్రనిధులనే వాడుకుంటున్నారన్నారు. ‘గావ్ చలో అభియాన్’ కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా రంగాపూర్ గ్రామానికి వచ్చి న బండి.. రాత్రి పొద్దుపోయే వరకూ గ్రామంలో పర్యటించారు. వివిధ వర్గాల ప్రజలను కలిశారు. పార్టీ బూత్ కమిటీ సభ్యులతో సమావేశమయ్యారు. మహిళలతో ముచ్చటించారు. కాగా, అంతకుముందు ఆయన కరీంనగర్లో విలేకరులతో మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని మొత్తం 17 స్థానాల్లో విజయం సాధించడమే బీజేపీ లక్ష్యమన్నారు. ‘గావ్ చలో అభియాన్’లో భాగంగా ప్రతి నేత గ్రామాల్లో పల్లెనిద్ర, నగరాల్లో బస్తీ నిద్ర చేయాలన్నారు. 24 గంటలపాటు ఆ గ్రామంలో, బస్తీలో ఉండి ప్రజలతో, కార్యకర్తలతో మమేకం కావాలని తెలిపారు. రాజకీయ పారీ్టల నేతల భవిష్యత్తు బాగుండాలంటే వారంతా బీజేపీలో చేరడం ఉత్తమమని అన్నారు. -
'నేను పక్కా లోకల్..' : ఎంపీ బండి సంజయ్
కరీంనగర్: ‘నేను పక్కా లోకల్.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులను చెప్పి జనంలోకి వెళ్లి ఓట్లు అడగుతా. దమ్ముంటే మీరు ఎంపీగా చేసినప్పుడు తెచ్చిన నిధులేమిటో.. మీరు చేసిన అభివృద్ధి ఏమిటో.. చెప్పి ఓట్లడిగే దమ్ముందా?’ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. శనివారం కరీంనగర్‌లోని తీగలగుట్టపల్లి కోదండ రామాలయం సమీపంలో రూ.10లక్షల ఎంపీ నిధులతో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. కరీంనగర్ జిల్లాజైలు వద్ద రూ.15 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులతో కొనుగోలు చేసిన అంబులెన్స్, వైద్య పరికరాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలనే పట్టించుకోని మేధావి వినోద్ కుమార్ అని, ప్రజలను ఎలా గుర్తుపడతారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఉన్న లోపాయికారి ఒప్పందం ఏమిటో కరీంనగర్ ప్రజలకు తెలుసని, తనపై మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలను జనం పట్టించుకోవడం లేదని అన్నారు. గ్రామాల్లోకి వెళితే మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఏమిటో తెలుస్తుందన్నారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి రూ.12వేల కోట్లకు పైగా నిధులు తీసుకొచ్చానని స్పష్టంచేశారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలు, జైలు అధికారులు పాల్గొన్నారు. ఇవి చదవండి: ఐదేళ్లలో ఐదు పైసలు కూడా తేలేదు! -
బీజేపీ నేత ఈటల దారెటు?
హైదరాబాద్: బీజేపీ నేత ఈటల రాజేందర్ పార్లమెంట్ ఎన్నికల బరిలో దిగేది ఎక్కడి నుంచి? మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం సాగుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుని మరోచోటు నుంచి ఎంపీగా పోటీ చేస్తారంటూ టాక్ నడుస్తోంది. తాను కాంగ్రెస్‌లో చేరడంలేదని ఈటల చెబుతున్నా ప్రచారం మాత్రం ఆగడంలేదు. మరి ఈటల కాంగ్రెస్‌లో చేరతారా? హస్తం గూటికి చేరితే ఎక్కడి నుంచి పోటీచేస్తారు? అసలు ఆయన ఆలోచన ఏంటి?.. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా.. కరీంనగర్ ఎంపీగా మరోసారి విజయఢంకా మోగించాలనే కసితో బీజేపీ నేత బండి సంజయ్ కృషి చేస్తున్నారు. బూత్ లెవల్ మీటింగ్స్ నిర్వహిస్తూ.. సుమారు 20 వేల మంది కార్యకర్తలతో ఓ భారీ సమావేశానికి బండి ఇప్పటికే స్కెచ్ వేసేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తన చిరకాల ప్రత్యర్థి గంగులపైనే ఈసారీ ఓటమిపాలైన బండి.. అదే స్థాయిలో ఓట్లను తెచ్చుకోవడం మాత్రం ఈసారి ఆయనకు మరింత బూస్టప్ ఇచ్చిన అంశం. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా కార్యకర్తలు, మీడియాకు ఓ పెద్దపార్టీ అరేంజ్ చేసి.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లోనూ తనకు బాసటగా ఉండేలా ఓ పథకం వేశారు. మరోవైపు కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అభ్యర్థిగా తెరపైకొస్తున్న మాజీ ఎంపీ వినోద్ కుమార్ పర్యటిస్తున్నారు. గత ఎన్నికల్లో బండి సంజయ్ పై ఓటమిపాలైన వినోద్ ఈసారెలాగైనా గెలవాలన్న తపనతో.. ప్రస్తుత నియోజకవర్గ వ్యాప్తంగా శుభకార్యాలతో పాటు.. అన్ని కార్యక్రమాలకూ హాజరవుతూ అందరినీ కలుపుకుపోతున్నారు. కారు, కమలం అభ్యర్థుల పేర్లు ఖరారైనట్లుగా తెలుస్తున్నా.. రాష్ట్రంలో అధికారంలోకొచ్చిన కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనేదే ఇప్పుడు ఆసక్తికర చర్చకు తెర లేపుతోంది. సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కరీంనగర్ నుంచి ఎంపీగా పోటీ చేయబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ వ్యవహారాల ఇంఛార్జ్ గా జీవన్ రెడ్డిని నియమించడంతో.. ఆయన నిజామాబాద్ నుంచి బరిలో ఉండే అవకాశాలున్నట్టుగా సమాచారం. కానీ, జీవన్ రెడ్డి మనసు మాత్రం కరీంనగర్ పార్లమెంట్ పైనే ఉన్నట్టుగా మరో ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నిజామాబాద్ నుంచి బరిలో ఉంటారా.. లేక, కరీంనగర్ నుంచి పోటీకి దిగుతారా అన్న చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. కాంగ్రెస్ నుంచి బరిలో.. ఇదిలాఉంటే.. మరోవైపు కరీంనగర్ నుంచి ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉండబోతున్నారనే ప్రచారం మొదలైంది. ప్రస్తుతం బీజేపీలో కీలకపాత్రలో ఉన్న రాజేందర్ బీజేపీని వీడేది లేదని పైకి చెబుతున్నప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో తన అనుచరుల నుంచి మాత్రం కాంగ్రెస్ అభ్యర్థిగా కరీంనగర్ నుంచి బరిలో ఉంటే కలిసొస్తుందనే సూచనలు వస్తున్నట్టుగా సమాచారం. ఈటల మల్కాజిగిరి నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉంటారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. మల్కాజ్గిరి కంటే.. కరీంనగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగితే కచ్చితంగా విజయం సాధించవచ్చు.. మళ్లీ రాజకీయంగా స్ట్రాంగ్ కావచ్చని అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రిగా కరీంనగర్ జిల్లాపై పట్టున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కాంగ్రెస్‌కు భారీ ఓట్ షేరింగ్ ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లతో ఈటలకు అనుకూల పవనాలు వీస్తాయని కొందరు సలహాలిస్తూ ఫోర్స్ చేస్తున్నట్టుగా సమాచారం. త్రిముఖ పోరు..? మొత్తం మీద కరీంనగర్ పార్లమెంట్ సీటుకు గనుక ఈటల రాజేందర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండి గెలిస్తే ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్టుగా ఆసక్తికర పరిణామాలు జరుగుతాయంటున్నారు. ఇంతకాలం సొంతపార్టీ బీజేపీలోనే ప్రధాన ప్రత్యర్థిలా తయారైన బండికి.. మరోవైపు తన చిరకాల ప్రత్యర్థి పార్టీ అయిన బీఆర్ఎస్ కూ ఏకకాలంలో చెక్ పెట్టినట్టవుతుందనే ఆయనపై ఒత్తిడి పెరుగుతున్నట్లు సమాచారం. ఈనేపథ్యంలో.. బీజేపీ నుంచి బండి సంజయ్, బీఆర్ఎస్ నుంచి వినోద్, కాంగ్రెస్ నుంచి ఈటల గనుక బరిలో ఉంటే కచ్చితంగా కరీంనగర్ లో త్రిముఖ పోరు రసవత్తరంగా జరుగుతుందనే టాక్ వినిపిస్తోంది. అదే సమయంలో జీవన్ రెడ్డి బరిలోకి దిగినా ఫైట్ టఫ్ గా ఉండే అవకాశాలున్నాయనే చర్చ జరుగుతోంది. మరి బీజేపీ నేత ఈటల దారెటు? కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి ఎవ్వరనేది ఇప్పుడు జిల్లా రాజకీయవర్గాల్లో అత్యంత ఆసక్తిని కలిగిస్తోంది. ఇదీ చదవండి: సందిగ్ధంలో ఎన్నికలు -
కరీంనగర్ లోక్‌సభ సెగ్మెంట్: నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు!
ఎన్నికల టైమ్‌లో ప్రత్యర్థుల లోపాలు వెతికి నెగిటివ్ ప్రచారం చేయడం మామూలే. కాని కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఈ నెగిటివ్ ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోందని టాక్. మూడు పార్టీల ప్రధాన నేతలు ఎదుటివారి మైనస్‌లను పట్టుకుని ప్రచారం చేస్తున్నారు. వ్యక్తిగత ప్రచారాలను ఆపడానికి ఏకంగా పోలీసుల ఫిర్యాదుల వరకు వెళుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల ముంగిట ప్రత్యర్థి నేతల విమర్శలు, ప్రతి విమర్శలతో రచ్చ రచ్చగా మారుతోంది. ఈ నాయకులు చేస్తున్న ఆరోపణలేంటి? ఆ నేతలు ఎవరు? గులాబీ పార్టీ తరపున కరీంనగర్ లోక్‌సభ స్థానానికి మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మరోసారి పోటీ చేస్తారని వినిపిస్తోంది. ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ ఆయనైతే ప్రచారంలో నిమగ్నమైపోయారు. ఇదిలా ఉంటే..వినోద్‌కుమార్‌కు సమీప బంధువు ఒకరికి జెన్కోలో ఉద్యోగం ఇప్పించారంటూ సోషల్ మీడియాలో జరిగిన రచ్చ... ఆ మాజీ ఎంపీ మనస్సును తీవ్రంగా గాయపర్చింది. తనపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండిస్తూ.. వినోద్ ఓ ప్రెస్ మీట్ నిర్వహించి వివరణ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో క్యాష్ చేసుకునేందుకే తనను బద్నాం చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరైతే జెన్కోలో ఉద్యోగం చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారో ఆ వ్యక్తి ఇంటి పేరు.. తన ఇంటి పేరూ ఒకటైనంత మాత్రాన తన బంధువని ఎలా అంటారంటూ ఫైరయ్యారు వినోద్. బండి సంజయ్ తన అనుచరులతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో తనను ఎదుర్కోలేక బీజేపీ, కాంగ్రెస్‌లు ఏకమై తన మీద దుష్ప్రచారం చేస్తున్నాయన్నది బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ వాదన. అయితే ఈ రచ్చ అంతటితో ఆగలేదు. వినోద్ విమర్శలపై బీజేపీ నేతలు కూడా కౌంటర్ అటాక్ ప్రారంభించారు. ఈ ఇద్దరు నేతల మాటల యుద్ధం పార్లమెంట్ ఎన్నికల ముంగిట కరీంనగర్ లో పొలిటికల్ హీట్‌ను బాగా పెంచాయి. బంధుప్రీతి లేకుంటే కరీంనగర్ మేయర్ గా సునీల్ రావు ఎలా అయ్యాడని.. కరీంనగర్ కార్పొరేషన్లో అవినీతి ఎలా రాజ్యమేలుతుందో చెప్పాలంటూ బీజేపీ నేతలు పలు అంశాలపై ప్రశ్నలు సంధించారు. వినోద్ ప్రమేయం లేకుంటే ఆయనెందుకంత ఉలికి పడుతున్నారో చెప్పాలని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అయితే, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాగైనా మరోసారి గెలవాలన్న తలంపుతో అందరికంటే ముందస్తుగానే బండి సంజయ్ తన వ్యూహాల్ని తాను రచించుకుంటున్నారు. ఇక బీఆర్ఎస్ అభ్యర్థిగా ఇప్పటివరకూ వినోద్ పేరే వినిపిస్తుండటం.. ఆయనే పార్లమెంట్ సెగ్మెంట్ మొత్తం కలియ తిరుగుతుండటంతో.. ఇప్పటివరకు వీరిద్దరి మధ్యే గట్టి పోటీ కనిపిస్తోంది. ఇక కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సోదరుడైన శ్రీనుబాబుతో పాటు.. ఈటల రాజేందర్ పేరు కూడా ప్రచారంలోకొస్తున్నాయి. బరిలోకి దిగే అభ్యర్థిని బట్టి కరీంనగర్లో జరగబోయేది ముఖాముఖీ పోటీనా.. లేక, ముక్కోణపు పోటీనా అన్నది తేలుతుంది. మూడు ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే బీజేపీ తరపున సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్, బీఆర్ఎస్ తరపున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్‌లు మరోసారి తలపడతారని తెలుస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎవరో తేలితే ఇక కరీంనగర్ హీట్ మామూలుగా ఉండదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చదవండి: బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్ -
బీజేపీ, కాంగ్రెస్ మళ్లీ కలిసి పని చేయబోతున్నాయి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయం హీటెక్కుతోంది. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కాంగ్రెస్ పార్టీలో చాలా మంది మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోవర్టులు ఉన్నారని, కాంగ్రెస్, బీజేపీ కలిసి తెలంగాణను అభివృద్ధి చేద్దామన్న విషయం తెలిసిందే. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇటు బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీల్లో కూడా చర్చనీయాంశంగా మారింది. తాజాగా బండి సంజయ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే కేటీఆర్ ‘ఎక్స్’ ట్విటర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. 2018లో కరీంనగర్, నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో బీజేపీ గెలుపులో కాంగ్రెస్ కీలకపాత్ర పోషించిందని అన్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ చెప్పినట్లుగా ఇరు పార్టీలు మళ్లీ కలిసి పని చేయబోతున్నట్లు తెలుస్తోందని అన్నారు. Congress was instrumental in BJP’s victory in Karimnagar and Nizamabad parliament segments in 2018 It appears that they are going to work together again as per BJP National General Secretary BS Kumar https://t.co/PJUdaNz7V7 — KTR (@KTRBRS) January 14, 2024 ఇక.. బండి సంజయ్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. బండి సంజయ్ వ్యాఖ్యలతో బీఆర్ఎస్, బీజేపీలు ఒకటేనని మరోసారి బయటపడిందని మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ రెండుగా చీలి పోతుందని అన్నారు. చదవండి: రేవంత్ ప్రభుత్వానికి మేము సహకరిస్తాం.. బండి సంజయ్ ఆసక్తికర కామెంట్స్ -
ఇప్పుడైనా సర్దుకుంటారా?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ ముఖ్య నేతలకు క్లాస్ తీసుకోవడం, అందుకు దారితీసిన పరిణామాలపై రాష్ట్ర పార్టీలో వాడీవేడి చర్చ జరుగుతోంది. అసెంబ్లీ ఫలితాల సమీక్ష, లోక్‌సభ ఎన్నికల దిశానిర్దేశం సందర్భంగా గురువారం రాష్ట్ర నేతల వ్యవహారశైలిపై అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. పార్టీకి నష్టం కలిగించేలా వ్యవహరించినా, క్రమశిక్షణను ఉల్లంఘించినా ఎంత పెద్ద నాయకుడినైనా చర్య తీసుకోకుండా విడిచిపెట్టే ప్రసక్తి లేదంటూ ఆయన చేసిన హెచ్చరికలు ఇప్పుడు చర్చాంశనీయమయ్యాయి. రాష్ట్రంలో పార్టీకి పెరిగిన మద్దతు, వివిధ సమస్యలపై చేపట్టిన పోరాటం ఆధారంగా అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం 30 సీట్లు గెలిచి ప్రభుత్వ ఏర్పాటులో కీలకపాత్ర పోషిస్తామని భావిస్తే 8 సీట్లకే పరిమితం కావడం తమకు అసంతృప్తిని కలిగించిందని అమిత్ షా స్పష్టం చేసినట్టు తెలిసింది. ఆ ముగ్గురితో విడిగా భేటీ రాష్ట్ర కోర్‌కమిటీతో జరిగిన ఈ భేటీ ముగిశాక నేతలంతా బయటకు వెళుతుండగా, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి, జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్, జాతీయకార్యవర్గసభ్యుడు ఈటల రాజేందర్‌ను వేచి ఉండాలని అమిత్ షా చెప్పినట్టు పార్టీవర్గాల సమాచారం. అనంతరం ఆ ముగ్గురితో భేటీ అయ్యారని కొంతమంది, ఒక్కొక్కరితో విడివిడిగా సమావేశమయ్యారని మరికొందరు చెబుతున్నారు. మొత్తంగా ఆ ముగ్గురితో ప్రత్యేకంగా చర్చలు జరపడం చూస్తే వీరికి గట్టిగా క్లాస్ పీకారనే ప్రచారం పార్టీలో సాగుతోంది. పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ ఉన్నప్పటి నుంచి ఆయనకు ఈటల రాజేందర్ మధ్య సరైన సమన్వయం లేకపోవడం, వీరి అనుచరులు సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకుని పరస్పరం బురదజల్లుకోవడం పార్టీ శ్రేణులందరికీ తెలిసిన రహస్యమే. ఐతే అసెంబ్లీ ఎన్నికల సందర్భంగానూ వీరి మధ్య ఆధిపత్యపోరు తగ్గకుండా సోషల్ మీడియాలో వ్యతిరేక పోస్టులు పెట్టడం వంటి వాటిపై అందిన రిపోర్ట్ ఆధారంగానే అమిత్ షా ఈ భేటీల్లో తీవ్రంగా స్పందించినట్టుగా చెబుతున్నారు. పార్టీ విస్తృత భేటీ సందర్భంగా కూడా వీరిద్దరూ పక్కపక్కనే కూర్చున్నా ఎడ మొహం, పెడమొహంగానే ఉన్నారే గానీ కనీసం మాట్లాడుకున్నట్టు కనిపించలేదని ఆ సమావేశానికి హాజరైన నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా వారికి గట్టిగానే క్లాస్ పీకి ఉంటారని పార్టీ నాయకులు అంచనావేస్తున్నారు. భేటీ తర్వాత ఒకే ‘బండి’లో ఈటల భేటీ అనంతరం సంజయ్, ఈటల ఇద్దరూ కలిసి ఒకే వాహనంలో రాష్ట్రస్థాయి విస్తృత సమావేశం జరుగుతున్న కొంగరకలాన్‌కు చేరుకోవడం పలువురి దృష్టిని ఆకర్షించింది. సమావేశంలో చేసిన తీర్మానాలపై మీడియాకు వీరిద్దరూ బైట్ ఇస్తారని తొలుత పార్టీ మీడియాసెల్ సమాచారం ఇచి్చంది. రాజకీయతీర్మానాన్ని బలపరుస్తూ మాట్లాడిన ఈటల దానికి సంబంధించిన విశేషాలను మీడియాకు వివరించారు. కానీ సంజయ్ మాత్రం మీడియా సమావేశానికి రాలేదు. ఏదేమైనా అమిత్ షా క్లాసుతోనైనా లోక్‌సభ ఎన్నికల నాటికి పార్టీలో అంతా సర్దుకుని నేతలంతా సమన్వయంతో పనిచేస్తారనే ఆశాభావం రాష్ట్ర శ్రేణుల్లో వ్యక్తమవుతోంది. -
ఇకపై వారానికి 4 రోజులు కరీంనగర్–తిరుపతి రైలు
సాక్షి, న్యూఢిల్లీ: కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ఇకపై వారానికి నాలుగు రోజులపాటు నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమైంది. ఆదివారం, గురువారం మాత్రమే నడిచే ఈ రైలు ఇకపై వారంలో 4 రోజులపాటు నడవనుంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ శుక్రవారం ఢిల్లీలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ను కలిసి రైల్వే పెండింగ్ పనులకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్లే రైలు ప్రయాణికులతో విపరీతమైన రద్దీ ఏర్పడినందున వారానికి నాలుగు రోజులపాటు పొడిగించాలని కోరారు.బండి సంజయ్ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఆది, గురువారాల్లో మాత్రమే నడుస్తున్న ఈ రైలును మరో రెండ్రోజులు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, ఉమ్మడి కరీంనగర్, వరంగల్ జిల్లాల ప్రజల ఆకాంక్ష మేరకు కరీంనగర్ – హసన్‌పర్తి కొత్త రైల్వే లేన్ కోసం ఫైనల్ లొకేషన్ సర్వే పనులు వెంటనే పూర్తి చేసి కొత్త రైల్వే లేన్ పనులను మంజూరు చేయాలని ఈ సందర్భంగా రైల్వే మంత్రిని బండి సంజయ్ కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రైల్వే మంత్రి వెంటనే దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఫోన్ చేసి త్వరగా ఫైనల్ లోకేషన్ సర్వే పనులను పూర్తి చేయాలని ఆదేశించారు. జమ్మికుంటలో పలు రైళ్ల హాల్ట్ ప్రజల సౌకర్యార్థం పలు ఎక్స్‌ప్రెస్ రైళ్లను జమ్మికుంట స్టేషన్లో ఆపే (హాల్ట్) విధంగా చర్యలు తీసుకోవాలని బండి సంజయ్ రైల్వే మంత్రిని కోరారు. సికింద్రాబాద్ – గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12590–89), యశ్వంతపూర్ – గోరక్‌పూర్ ఎక్స్‌ప్రెస్ (12592–91 ), హైదరాబాద్ – న్యూఢిల్లీ తెలంగాణ ఎక్స్‌ప్రెస్ (12723–23), సికింద్రాబాద్ – పట్నా దానాపూర్ ఎక్స్‌ప్రెస్ (12791–92), చెన్నై – అహ్మదాబాద్ నవజీవన్ ఎక్స్‌ప్రెస్ (12656–55) రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. వెంటనే స్పందించిన రైల్వే మంత్రి సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఆయా రైళ్లను జమ్మికుంట స్టేషన్లో నిలిపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. -
ఇంకా దొరకని బండి సంజయ్ ఫోన్?
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: పోగొట్టుకున్న సెల్ఫోన్లను గుర్తించి తిరిగి అప్పగించడంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోలీసులు మంచి ఫలితాలు సాధిస్తున్నారు. సీఈఐఆర్ విధానం ఉపయోగించి ఫోన్లను గుర్తిస్తున్నారు. ప్రస్తుతం సెల్‌ఫోన్ విద్యార్థి నుంచి వృద్ధులు, అధికారి నుంచి కూలీవరకు, ఉన్నతాధికారి నుంచి చిరుద్యోగి వరకు, వార్డు మెంబరు నుంచి ప్రధాని వరకు అందరిని కలిపే సామాజిక మాధ్యమంగా మారింది. అలాంటి సెల్‌ఫోన్ పొరపాటున పోగొట్టుకున్నా.. చోరీకి గురైనా అందులోని డేటాతోపాటు, విలువైన సమాచారం పోతుంది. అందుకే పోలీసులు అలా పోగొట్టుకున్న పోన్లను వేటాడి గుర్తించేందుకు సీఈఐఆర్ విధానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఈ సాంకేతికతను తొలిసారిగా కరీంనగర్ కమిషనరేట్‌లో ప్రయోగపూర్వకంగా ప్రారంభించారు. ప్రస్తుతం 50శాతం వరకు ప్రజలు పోగొట్టుకున్న ఫోన్లను గుర్తించగలిగారు. నేటికీ దొరకని ‘బండి’ ఫోన్.. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు జరుగుతున్న సమయంలో వాట్సాప్‌లలో పేపర్ లీకేజీ కలకలం రేపింది. ఈ వ్యవహారంలో ఎంపీ బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో సంజయ్ ఫోన్ అదృశ్యమైంది. పోలీసులే తన ఫోన్ మాయం చేశారని సంజయ్ ఆరోపించారు. ఆయన ఫోన్‌తో తమకు సంబంధం లేదని పోలీసులు వివరణ ఇచ్చారు. ఆరోపణల పర్వం ఎలా ఉన్నా.. బండి సంజయ్ ఫోన్ నేటికీ లభించలేదు. అందులో అనేక కీలక విషయాలు ఉన్నాయని, తన ఫోన్ వెంటనే అప్పగించాలని బండి అనుచరులు పలుమార్లు విజ్ఞప్తి చేసినా.. పోలీసుల తరఫు నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాకపోవడం గమనార్హం. ఫోన్ల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌గా గుర్తింపు తెచ్చుకున్న తెలంగాణ పోలీసులు ఎంపీ సెల్‌ఫోన్ విషయంలో ఎలాంటి పురోగతి సాధించకపోవడంపై ఆయన అనచరులు విమర్శలు గుప్పిస్తున్నారు. 1,318 ఫోన్ల అందజేత! ఈ ఏడాది ఏప్రిల్‌లో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సాంకేతికతపై కరీంనగర్ కమిషనరేట్‌లో పోలీసులకు శిక్షణ ఇచ్చారు. ఆ వెంటనే రామగుండం, జగిత్యాల, సిరిసిల్ల జిల్లా సిబ్బందికి శిక్షణను విస్తరించారు. ఈ సాంకేతికత వినియోగంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకూ 5,449 ఫోన్లు ఉమ్మడి జిల్లాలో పోయినట్లు రిపోర్టయ్యాయి. అందులో 1,318 ఫోన్లను రికవరీ చేశారు. సెల్ఫోన్ల రికవరీ అత్యధికంగా 418 రామగుండం పరిధిలో ఉండగా, అత్యల్పంగా 157 జగిత్యాల పరిధిలో ఉండటం గమనార్హం. సీఈఐఆర్ సాంకేతికత అంటే.? డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్ ఆధ్వర్యంలో సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్ (సీఈఐఆర్) సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా పోయిన సెల్‌ఫోన్‌ను తిరిగి కనిపెట్టొచ్చు. సీఈఐఆర్ వెబ్సైట్లోకి వెళ్లి సెల్‌ఫోన్‌ను ఐఎంఈఐ నంబరు సాయంతో బ్లాక్ చేయవచ్చు. ఈ తరువాత ఆ సెల్‌ఫోన్ ఎట్టి పరిస్థితుల్లోనూ పనిచేయదు. ఒకవేళ ఫోన్ ఆన్చేసినా, అందులో కొత్త సిమ్‌కార్డు వేసినా.. ఆ విషయం ఫోన్ యజమానికి ఎస్ఎంఎస్ ద్వారా తెలిసిపోతుంది. ఎలా పనిచేస్తుంది..? సెల్‌ఫోన్ పోగొట్టుకున్న వెంటనే డబ్లూ.డబ్లూ.డబ్లూ.సీఈఐఆర్.జీవోవీ.ఐఎన్ పోర్టల్ ఓపెన్ చేయాలి. అందులో బ్లాక్ ఫోన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో మొబైల్ నంబర్–1, మొబైల్ నంబరు–2, సెల్‌ఫోన్ బ్రాండ్, మోడల్, ఇన్వాయిస్ (బిల్) ఫొటో సూచించిన గడుల్లో నింపాలి. పోగొట్టుకున్న స్థలం, పోయిన తేదీ, ఇతర చిరునామా, అంతకుముందే ఇచ్చిన పోలీస్ కంప్లయింట్ నంబరు, ఫోన్ యజమాని చిరునామా, ఈమెయిల్ ఐడీ, ధ్రువీకరణ కార్డులు, చప్టాలను సూచించిన బాక్సుల్లో నింపాలి. వెంటనే సెల్‌ఫోన్ (పాత నెంబరు మీద తీసుకున్న కొత్త సిమ్) నంబరుకు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తరువాత ఫామ్‌ను సబ్మిట్ చేయాలి. ఆ తరువాత ఫోన్ దానంతట అదే బ్లాక్ అవుతుంది. ఇకపై దాన్ని ఎవరూ ఆపరేట్ చేయలేరు. అందులోని డేటా సురక్షితంగా ఉంటుంది. ఒకవేళ దొంగించించిన వ్యక్తి లేదా సెకండ్ హ్యాండ్లో కొన్న వ్యక్తి సిమ్ వేయగానే.. మీ నంబరుకు మెసేజ్ వస్తుంది. ఆ సందేశం ఆధారంగా ఫోన్ ఎక్కడ ఉన్నా.. పట్టుకోవడం సులభతరంగా మారుతుంది. అన్‌బ్లాక్ చేయండిలా.. మీఫోన్‌ను పోలీసులు పట్టుకున్నా.. లేక మీకే దొరికినా.. మీ పాత ఐడీని, ఫోన్‌నంబరు, ఇతర వివరాలు నింపిన తరువాత ఫోన్‌ను అన్‌బ్లాక్ చేసుకోవచ్చు. ఇవి చదవండి: ఔను..! నిజంగానే కలెక్టర్‌కు కోపమొచ్చింది! -
ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా చేస్తా! : మేయర్ వై.సునీల్‌రావు
కరీంనగర్: ఎంపీ బండి సంజయ్ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి, అసహనంతో కేసీఆర్, బీఆర్ఎస్లపై మతిభ్రమించి మాట్లాడుతున్నారని మేయర్ వై.సునీల్‌రావు అన్నారు. కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్హాల్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజలను మోసం చేయడం, యువతను రెచ్చగొట్టడం ఎంపీ నైజమని పేర్కొన్నారు. అవినీతి ఆరోపణలు చేయడం కాదని.. వాటిని నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని, లేకుటే క్షమాపణ చెప్పి, ఎంపీ పదవికి రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో రూపాయి లేదని చెప్పి, గెలిచి, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రూ.50 కోట్లు ఎలా ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. మున్సిపల్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు. ఎంపీగా గెలిచాక బండి సంజయ్ ఈ ఐదేళ్లలో ఏనాడూ ప్రజల మధ్యలో లేరన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొంతమంది ప్రజాప్రతినిధులను కొనుగోలు చేశారని ఆరోపించారు. ప్రలోభాలకు లొంగనివారిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ల నాయకత్వంలో కరీంనగర్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని పేర్కొన్నారు. ఐదేళ్లలో ఎంపీ చేసిందేమిటో చెప్పాలన్నారు. కార్పొరేటర్లు గంట కల్యాణి, ఐలేందర్ యాదవ్, గందె మాధవి, సల్ల శారద, కోల మాలతి, కుర్ర తిరుపతి, వంగల శ్రీదేవి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజలే ‘బండి’ని సీజ్ చేశారు! ఎంపీ బండి సంజయ్ అర్థం లేని మాటలు మానుకోవాలని, ఎమ్మెల్యేగా ఓటమి చెందాననే నిరాశలో కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతల పాస్‌పోర్టులు సీజ్ చేయాలని మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణను అన్ని రంగాల్లో ముందు నిలిపారన్నారు. ఐదేళ్లలో ఎంపీగా కరీంనగర్ పార్లమెంట్ అభివృద్ధి కోసం తెచ్చిన నిధుల వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల పాస్‌పోర్టులు సీజ్ చేయాలని మాట్లాడుతున్న బండి సంజయ్‌ని మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలే సీజ్ చేశారని విమర్శించారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేయకుండా బీఆర్ఎస్ను టార్గెట్ చేసి, మాట్లాడటం దేనికి నిదర్శమని ప్రశ్నించారు. ఇవి చదవండి: 'ఏం పాపం చేశామని ప్రజలు మోసం చేశారు!' : బానోత్ శంకర్‌నాయక్ -
Telangana: బీజేపీ టార్గెట్ @8!
సాక్షి, హైదరాబాద్: బీజేపీలో అప్పుడే ఎంపీ టికెట్ల ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైన నేతలు మరో మారు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఏ పార్టీ తోనూ పొత్తు లేకుండా సొంతంగా పోటీచేసిన బీజేపీ 4 సెగ్మెంట్లలో గెలిచి అందరినీ ఆశ్చర్యపరి చింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక ఎమ్మెల్యే సీటు గెలిచి 7% ఓట్లు సాధించిన పార్టీ, మరుసటి ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 18 శాతానికి ఓటింగ్‌ను పెంచుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 8 స్థానాల్లో గెలుపొందడమే కాకుండా 18 శాతం ఓటింగ్‌ను నిలుపుకుంది. 19 అసెంబ్లీ సెగ్మెంట్లలో బీజేపీ అభ్యర్థులు రెండోస్థానంలో నిలవగా, 49 స్థానాల్లో డిపాజిట్లు దక్కించుకున్నారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో 25శాతానికి ఓటింగ్ పెంచుకొని ఎనిమిది సీట్లు సాధించాలనేది బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. సిట్టింగ్ స్థానాలపై స్పష్టత ! సిట్టింగ్ ఎంపీలైన కేంద్రమంతి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి (సికింద్రాబాద్), జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ (కరీంనగర్), అర్వింద్ ధర్మపురి (నిజామాబాద్) ఆయా స్థానాల నుంచే మళ్లీ పోటీకి ఇప్పటికే సిద్ధమయ్యారు. బోథ్ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీచేసి ఓటమిపాలైన ఆదిలాబాద్ ఎంపీ సొయం బాపూరావుకు ఈసారి పోటీకి మళ్లీ అవకాశం కల్పిస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందే బీఆర్ఎస్కి రాజీనామా చేసి బీజేపీలో చేరిన రాథోడ్ బాపూరావును ఈసారి ఆదిలాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేయించే అవకాశాలున్నాయనే చర్చ పార్టీలో సాగుతోంది. ఆయనతోపాటు ఈసారి ఖానాపూర్ నుంచి ఓడిన మాజీ ఎంపీ రమేశ్‌రాథోడ్ కూడా ఈ సీటును ఆశిస్తున్నట్టు తెలిసింది. ఆదిలాబాద్ ఎంపీ సెగ్మెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో ఆదిలాబాద్, నిర్మల్, సిర్పూర్, ముథోల్ గెలిచిన జోరు మీదున్న బీజేపీ ఎంపీ సీటును కచ్చితంగా కైవసం చేసుకుంటామనే ధీమాతో ఉంది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని మూడు ఎమ్మెల్యే సెగ్మెంట్లలోనూ పార్టీ విజయం సాధించడం, జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు హామీని నిలుపుకున్నందున నిజామాబాద్ ఎంపీ స్థానాన్ని మళ్లీ కైవసం చేసుకుంటామనే విశ్వాసం పార్టీ నాయకుల్లో వ్యక్తమవుతోంది. మిగిలిన స్థానాల్లో ఇలా.... సిట్టింగ్ స్థానాలు మినహా మిగిలిన 13 ఎంపీ సీట్లలో పోటీకి కొందరు ముఖ్యనేతలు గట్టిగానే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. ► మల్కాజిగిరి నుంచి పోటీకి బీజేపీ నేత, మధ్యప్రదేశ్ ఇన్చార్జ్ పి.మురళీధర్‌రావు, మహబూబ్‌నగర్ నుంచి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే.అరుణకు జాతీయ నాయకత్వం నుంచి ఇప్పటికే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. అయితే మహబూబ్‌నగర్ నుంచి పోటీకి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, కల్వకుర్తి నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన టి.ఆచారి సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ► మెదక్ నుంచి పోటీకి తాను సిద్ధమైనట్టు మాజీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు ఇప్పటికే ప్రకటించారు. మల్కాజిగిరి, మెదక్, కరీంనగర్‌లలో ఎక్కడో ఒకచోట నుంచి పార్టీ అగ్రనాయకత్వం అవకాశం కల్పిస్తే పోటీకి సిద్ధమేనని సీనియర్‌నేత ఈటల రాజేందర్ తన సన్నిహితుల వద్ద సంకేతాలిచ్చి ఆ దిశలో ప్రయత్నాలు కూడా ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. ► చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి పోటీకి మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎప్పటి నుంచో కసరత్తు కూడా ప్రారంభించారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచే దానికి సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టు పార్టీవర్గాల సమాచారం. ► భువనగిరి సీటు తనకు టికెట్ వస్తుందని మాజీ ఎంపీ డా. బూరనర్సయ్యగౌడ్ ఆ లోక్‌సభ పరిధిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెబుతున్నారు. ► గోషామహల్ ఎమ్మెల్యే టి.రాజాసింగ్ జహీరాబాద్ నుంచి ఎంపీగా పోటీకి గతం నుంచి ఉత్సాహం కనబరుస్తున్నారు. అయితే ఇక్కడి నుంచి వీరశైవ లింగాయత్ సమాజ్‌కు చెందిన జాతీయనేత అశోక్ ముస్తాపురె, అక్కడి ప్రజల్లో గుర్తింపు ఉన్న సోమయప్ప స్వామిజీ, చీకోటి ప్రవీణ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. ► పెద్దపల్లి నుంచి పార్టీ ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి సోగల కుమార్‌కు మళ్లీ పోటీకి అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ► నాగర్‌కర్నూల్ స్థానానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బంగారు శృతిని బరిలో దింపడం లేదా కొత్త అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చే అవకాశముంది. ► వరంగల్ టికెట్ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్ గట్టిగా కోరుతున్నట్టు తెలిసింది. ► నల్లగొండ స్థానానికి గతంలో పోటీ చేసిన గార్ల జితేందర్ లేదా సూర్యాపేట నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిన సంకినేని వెంకటేశ్వర్రావుకు చాన్స్ దక్కుతుందా, ఇంకా ఎవరైనా కొత్తవారికి ఇస్తారా అన్న దానిపై చర్చ సాగుతోంది. ► హైదరాబాద్ స్థానం నుంచి భగవంత్‌రావుకు అవకాశం కల్పించవచ్చుననే ప్రచారం జరుగుతుండగా, ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పోటీ చేయించినా అనూహ్య ఫలితాలు సాధించవచ్చనే చర్చ పార్టీ నేతల్లో ఉంది. ► మహబూబాబాద్ నుంచి రామచంద్రునాయక్, హుస్సేన్‌నాయక్, దిలీప్‌నాయక్‌లు పోటీపడుతున్నట్టు సమాచారం. ► ఖమ్మం నుంచి పార్టీనేత, తమిళనాడు సహ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డికి అవకాశం కల్పిస్తారా ఇంకా మరెవరికైనా టికెట్ ఇస్తారా చూడాలని పార్టీ నేతలు అంటున్నారు. -
లెక్క ఎక్కడ తప్పింది?
సాక్షి, హైదరాబాద్: కమలదళంలో అంతర్మథనం సాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో సీట్లు రాకపోవడానికి కారణాలేమిటి? గట్టిగా పోరాడినా కూడా అనుకున్న విధంగా ఫలితాలను ఎందుకు సాధించలేకపోయామనే కోణంలో పార్టీలో చర్చోపచర్చలు నడుస్తున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీచేసిన 111 సీట్లలో 8 స్థానాల్లో మాత్రమే గెలుపునకు పరిమితం కావడంపై రాష్ట్ర, జిల్లా, అసెంబ్లీ స్థాయిల్లో అంతర్గత సమీక్షలకు రంగం సిద్ధమైంది. పార్టీకి పట్టుతో పాటు, ముగ్గురు ఎంపీలు గెలిచిన ఉమ్మడి జిల్లాల పరిధిలో, ముఖ్యనేతలు (ముగ్గురు ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ ధర్మపురి, సోయం బాపూరావు, ఎమ్మెల్యే ఈటల రాజేందర్) ఓటమి పాలవడం, దుబ్బాకలో మరో ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఓటమికి కారణాలు ఏమిటంటూ పార్టీలో అంతర్గత చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే, 2023లో 8 సీట్లలో గెలుపు, ఓటింగ్ శాతం 14కి పెంచుకోవడం ద్వారా మరీ తీసికట్టుగా కాకుండా గౌరవప్రదమైన ఫలితాలనే సాధించినా పెద్ద సంఖ్యలో సీట్లు గెలుచుకోలేక పోయేందుకు ప్రభావం చూపిన అంశాలేమిటా అన్న లోతైన చర్చ సాగుతోంది. గతం కంటే మెరుగే కానీ.. ఎక్కడి నుంచి ఎక్కడికి పడ్డాం.. ఈ ఎన్నికల్లో 111 స్థానాల్లో పోటీచేసి 46 చోట్ల డిపాజిట్లు దక్కించుకోవడం (2018లో 118 సీట్లలో పోటీచేస్తే 104 చోట్ల డిపాజిట్లు గల్లంతు), పలు సీట్లలో ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలవడంతో పాటు గణనీయమైన సంఖ్యలో ఓట్లను సాధించడం వంటివి పార్టీకి కలిసొచ్చే అంశాలేనని అంచనా వేస్తున్నారు. గత రెండు, మూడేళ్లుగా కేసీఆర్ సర్కార్‌పై, అధికార బీఆర్ఎస్పై హోరాహోరీగా పోరాడినా.. వివిధ వర్గాల ప్రజల సమస్యలపై ఉద్యమించినా.. ఆ మేరకు గణనీయమైన సంఖ్యలో సీట్లు గెలవకపోవడానికి కారణాలు ఏమిటనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు. శాసనసభ ఎన్నికలపై దృష్టితో బీజేపీ సాగించిన కృషితో అధికార బీఆర్ఎస్కు బీజేపీనే తగిన ప్రత్యామ్నాయం అన్న స్థాయికి వెళ్లి అక్కడి నుంచి పరిస్థితి దిగజారడానికి దారితీసిన పరిణామాలను విశ్లేషిస్తున్నారు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనన్న దుష్ప్రచార ప్రభావమే బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనంటూ కాంగ్రెస్ క్రమం తప్పకుండా సాగించిన దుష్ప్రచారం ప్రభావం చూపిందని భావిస్తున్నారు. ఈ ఆరోపణలను ఎప్పటికప్పుడు రాష్ట్రనేతలు గట్టిగా తిప్పికొట్టలేకపోవడం, ఎన్నికల సమయంలో పార్టీని వీడిన కొందరు నేతలు అదే విషయాన్ని ప్రముఖంగా ప్రస్తావించడం వంటివి నష్టాన్ని కలగజేశాయని అంచనా వేస్తున్నారు. లోపాయికారిగా మిలాఖత్ కారణంగానే బీఆర్ఎస్ సర్కార్ అవినీతి, అక్రమాలపై కేంద్రప్రభుత్వం, వివిధ దర్యాప్తు సంస్థలు, ఏజెన్సీలు తగిన చర్యలు తీసుకోలేదనే పద్ధతుల్లో కాంగ్రెస్ సహా కొన్ని పక్షాలు చేసిన ప్రచారాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. దీంతో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ కాదంటూ ఓటర్లు కాంగ్రెస్ వైపు మొగ్గుచూపేలా చేసిందనే చర్చ కూడా పార్టీలో వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత తొందరలో క్షేత్రస్థాయి సమీక్షలు ముగించుకుని వాస్తవ పరిస్థితులను అంచనా వేయాలని భావిస్తోంది. నిర్ణీత గడువు ప్రకారమైతే మరో నాలుగు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి మెజారిటీ ఎంపీ సీట్లు గెలవడం ద్వారా మళ్లీ బీజేపీ సత్తాను చాటాలనే భావన పార్టీ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది. -
నన్ను ఓడించేందుకే కుట్రలకు తెరలేపారు: బండి సంజయ్ ధ్వజం
సాక్షిప్రతినిధి, కరీంనగర్/కొత్తపల్లి/కరీంనగర్ టౌన్: కరీంనగర్లో తన గెలుపు ఖాయమైన నేపథ్యంలో సీఎం కేసీఆర్ రంగంలోకి దిగి ప్రత్యేక టీంతో డబ్బులు పంచుతూ కుట్రలకు తెరలేపి, దిగజారిపోయారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. ‘కేసీఆర్.. సీఎంగా ఉంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడానికి సిగ్గు లేదా?’అంటూ ధ్వజమెత్తారు. మీరెన్ని కుట్రలు చేసినా కరీంనగర్లో బండి సంజయ్ గెలవబోతున్నాడని, డిసెంబర్ 3న కేసీఆర్ మాజీ సీఎం కాబోతున్నారని చెప్పారు. కరీంనగర్‌లోని కొత్తపల్లిలో బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో మంగళవారం రాత్రి అక్కడికి వెళ్లిన బండి సంజయ్ తర్వాత మీడియాతో మాట్లాడారు. డబ్బుల పంపిణీపై తమ కార్యకర్తలు సమాచారం అందించారని చెప్పారు. గంగుల కమలాకర్ కొంతమంది మహిళా గ్రూపులు, మరి కొంతమంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల ద్వారా డబ్బులు పంపిణీ చేయిస్తున్నారని ఆరోపించారు. కొంతమంది పోలీస్ సిబ్బంది కూడా ఓటుకు రూ.10 వేలు చొప్పున పంచి పెడుతున్నారని ఆరోపించారు. అడ్డుకోవడానికి వెళ్లిన తమ కార్యకర్తలపై బీఆర్ఎస్ నేతలు నిస్సిగ్గుగా దాడులకు యత్నించారని అన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ నిజాయితీగా, నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్నా, కొందరు కింది స్థాయి సిబ్బంది గంగులకు అమ్ముడుపోయారని ఆరోపించారు. బీఆర్ఎస్ నేతలు డబ్బులు పంచుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో సంజయ్ సహా బీజేపీ శ్రేణులు కొత్తపల్లికి చేరుకోవడం, బీఆర్ఎస్ నేతలు కొందరు గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించడం, రెండు వర్గాల నినాదాలతో పట్టణంలో అర్ధరాత్రి ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకోగా, బీఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుంటే ఏం చేస్తున్నారంటూ సంజయ్ వారిని నిలదీశారు. -
కబ్జా భూములపై బుల్డోజర్లు దించుతా..
కరీంనగర్ టౌన్/ కరీంనగర్ రూరల్: ‘ప్రభుత్వ స్థలాలేమైనా మీ అయ్య జాగీరనుకున్నరా? నేనెవ్వరికీ భయపడ. బరాబర్ చెబుతున్నా. బీఆర్ఎస్ నేతలు కబ్జా చేసిన స్థలాల్లో బుల్డోజర్లు దించుతా.. వాటిని స్వాదీనపర్చుకుని ఆ స్థలాల్లో పేదలకు ఇండ్లు కట్టించి పంచుతా’అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ ప్రకటించారు. కరీంనగర్లో బీఆర్ఎస్ నేతల భూకబ్జాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందని, తనను గెలిపిస్తే వాళ్ల సంగతి తేలుస్తానని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కరీంనగర్ మండలంలోని తాహెర్‌కొండాపూర్, బహుదూర్‌ఖాన్‌పేట, నగునూరు గ్రామాలతోపాటు కరీంనగర్ 17, 38, 39వ డివిజన్లలో సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. స్థానికులు ఆయనకు డప్పు వాయిద్యాలతో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి నగునూరు, విద్యానగర్‌లో ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ‘కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో 3 కోట్ల ఇళ్లు కట్టించింది. తెలంగాణకు 2.40 లక్షల ఇళ్లు మంజూరు చేసింది. వాటిని కట్టిస్తే మరో 5 లక్షల ఇళ్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉంది. కానీ, కేసీఆర్ ఇంతవరకూ ఒక్క ఇల్లు కూడా పేదలకు పంచలేదు. ఆ నిధులు దారి మళ్లించిండు. నగునూరులోని దుర్గామాత గుడి సమీపంలో 669 సర్వే నంబర్లో 26 ఎకరాలను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారు. ఆ భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తే బాగుండేది కదా.. నేను గెలిచాక కబ్జాకోరులపై బుల్డోజర్లు దించుతా.. ఆ భూములన్నీ పేదలకు పంచుతా’అని పేర్కొన్నారు. ‘కరీంనగర్లో పోటీచేస్తున్న కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల చరిత్రను పరిశీలించండి.. ఎవరు ప్రజల కోసం పోరా డుతున్నారో, ఎవరు భూకబ్జాలకు పాల్పడుతున్నా రో బేరీజు వేయండి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలిద్దరూ భూకబ్జాదారులే. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి కుట్రలు చే స్తున్నాయి. పొరపాటున కాంగ్రెస్‌కు ఓట్లేస్తే అవన్నీ డ్రైనేజీలో వేసినట్లే.. దయచేసి కాంగ్రెస్ ట్రాప్‌లో పడొద్దని కోరుతున్నా.. నన్ను అవినీతిపరుడిగా చిత్రీకరించేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు కలిసి కుట్ర చేస్తున్నారు. నేను సవాల్ చేస్తున్నా.. దమ్ముంటే నాపై చేసిన ఆరోపణలను నిరూపించాలి. నిరూపిస్తే ఉరేసుకుంటా.. లేకపోతే మీరు ఏ శిక్షకైనా సిద్ధమా?’అంటూ సవాల్ విసిరారు. బియ్యం గోల్మాల్ నిరూపించేందుకు సిద్ధం! మంత్రి గంగుల కమలాకర్ బియ్యం టెండర్లలో రూ.1,300 కోట్ల గోల్మాల్ చేశారని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని బండి సవాల్ చేశారు. ఆయన తప్పు చేయకుంటే దేవుని గుడిలో ప్రమాణం చేయాలన్నారు. వడగండ్ల వానతో పంటలు నష్టపోతే ఎకరానికి రూ.10 వేలిస్తానన్న కేసీఆర్ ఇక్కడ ఇవ్వకుండా పంజాబ్ రైతులకు ఇచ్చా రని బండి మండిపడ్డారు. తనకు సంబంధించిన ఆస్తిపాస్తుల డాక్యుమెంట్లను కమలాకర్ తీసుకొస్తే ప్రజలకు రాసిస్తానని, ఆయన అక్రమ ఆస్తులను ప్రజలకు పంచే దమ్ముందా అని ప్రశ్నించారు. -
ప్రజల కోసం పోరాడుతున్నాం.. మద్దతివ్వండి
కరీంనగర్ టౌన్: నిరుపేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం ఇస్తానని రెండుసార్లు ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కేసీఆర్ తెలంగాణ ప్రజలను మోసం చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ మండిపడ్డారు. ప్రజల కోసం పోరాడుతున్న బీజేపీకి మద్దతివ్వాలని కోరారు. బుధవారం కరీంనగర్‌లోని రేకుర్తి, మంకమ్మతోటలో నిర్వహించిన కార్నర్ మీటింగుల్లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోదీ 2,40,000 ఇళ్లు ఇస్తే కేసీఆర్ ఒక్కఇల్లు కూడా ఇవ్వలేదన్నారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వకుండా కేసీఆర్ మాత్రం 100 గదులతో ప్రగతి భవన్ కట్టుకున్నారని దుయ్యబట్టారు. పదేళ్లలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా 30 లక్షల మంది నిరుద్యోగులను మోసం చేశారన్నారు. కేసీఆర్ ఇంట్లో మాత్రం ఐదుగురికి ఉద్యోగాలు ఉన్నాయని ఎద్దేవా చేశారు. నిరుద్యోగులు ప్రశ్నించిన పాపానికి కేసీఆర్ కొడుకు కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇటీవల అన్ని పరీక్షల ప్రశ్నపత్రాలను లీక్ చేశారని, పేపర్ లీకేజీలపై తాను కొట్లాడితే... తన ఇంటిపై వందల మంది పోలీసులతో దాడి చేయించి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు. -
'భూకబ్జాలు చేశానా? గుట్టలను మాయం చేశానా?' : బండి సంజయ్‌కుమార్
సాక్షి, కరీంనగర్: నేను అవినీతిపరుడినట.. నా దగ్గర డబ్బు సంచులున్నయట.. అందుకే అధ్యక్ష పదవి నుంచి నన్ను తీసేశారట.. నేనేమన్నా ఆయన లెక్క మంత్రినా? అధికారంలో ఉన్నామా? నీ లెక్క భూకబ్జాలు చేశానా? గుట్టలను మాయం చేశానా? భూములు కబ్జా చేసి కమీషన్లు తీసుకున్నానా? నేనెట్లా అవినీతికి పాల్పడుతానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్ అన్నారు. తెలంగాణలోనే అత్యంత అవినీతిపరుడైన మంత్రి గంగుల కమలాకర్‌కు తనను విమర్శించే నైతికహక్కు లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 22, 23, 24 డివిజన్లతో పాటు కరీంనగర్ మండలం చామనపల్లిలో ప్రచారం నిర్వహించారు. చామనపల్లికి వచ్చిన సంజయ్‌కు యువకులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ.. నన్ను ఎంపీగా గెలిపిస్తే ప్రజల కోసం కొట్లాడితే సీఎం కేసీఆర్ 74 కేసులు పెట్టించి జైలుకు పంపించాడన్నారు. పదేళ్ల నుంచి తీగలగుట్టపల్లి ఆర్వోబీని పట్టించుకోని మంత్రి గంగుల కమలాకర్, నిధులు తీసుకొచ్చిన తనకు తెలియకుండానే కొబ్బరికాయ కొట్టి తానే తెచ్చినట్లు ప్రచారం చేసుకున్నాడని విమర్శించారు. నేను చామనపల్లికి రాలేదంటున్న కమలాకర్‌కు అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చి ప్రభుత్వంతో కొట్లాడిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. పంటలకు నష్టపరిహారం సీఎం కేసీఆర్ నుంచి రైతులకు ఎందుకు ఇప్పించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రిగా ఉండి కొత్తగా ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని, గంగుల ఓడిపోవడం ఖాయమని అన్నారు. తెలంగాణలోనే అత్యంత అవినీతిపరుడైన గంగుల కమలాకర్‌కు సీఎం కేసీఆర్ బీఫామ్ ఇవ్వకుండా సతాయించి, కరీంనగర్‌కే పరిమితం చేసిండని అన్నారు. నేను అవినీతికి పాల్పడితే ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వరని, హెలిక్యాప్టర్ ఇచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయాలని పంపారని తెలిపారు. ఓటమి భయంతో కమలాకర్ కార్యకర్తలకు లక్ష సెల్ఫోన్లు, ఓటుకు రూ.10వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను పరిశీలించి మీ కోసం కొట్లాడి జైలుకెళ్లిన తనకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గండ్ర నళిని, ఎం.సంతోశ్‌కుమార్, ఎం.కుమార్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నాగులమల్యాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం! కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామంలో బీజేపీ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు. కొత్తపల్లి మండల ఇన్చార్జి జాడి బాల్‌రెడ్డి, శక్తి కేంద్రం ఇన్చార్జి రంజిత్, నాయకులు రమేశ్, అంజన్‌కుమార్, కరుణాకర్, రవీందర్, గంగారాజు, అనిల్, శ్రీనివాస్, ప్రసాదరావు తదితరులు ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేసి మచ్చలేని అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్ పెంట సత్యనారాయణ కరీంనగర్ కార్పొరేషన్‌లోని 15వ డివిజన్ మాజీ కార్పొరేటర్, బీఆర్ఎస్ నాయకుడు పెంట సత్యనారాయణ శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. తన అనుచరులు, బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఎంపీ కార్యాలయానికి వచ్చిన పెంట సత్యనారాయణను బండి సంజయ్ సాదరంగా ఆహ్వానించారు. ఆయనతోపాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు మంచిర్యాల జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు నాయకులు పలువురు కరీంనగర్‌కు వచ్చి బండి సంజయ్ సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుదు రఘు, జిల్లా నాయకులు పాల్గొన్నారు. ఇవి చదవండి: నేతలకు కోవర్టుల టెన్షన్..! అన్ని పార్టీల్లో భయం భయం! -
RTCని ప్రభుత్వంలో విలీనం ఓ ముసుగు మాత్రమే: సంజయ్
-
కాంగ్రెస్ అభ్యర్థుల ఖర్చు కేసీఆరే ఇస్తున్నారు
సిర్పూర్(టి)/కౌటాల, సిరిసిల్ల: కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థుల ఎన్నికల ఖర్చును బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆరే పెడుతున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఆరోపించారు. అందుకే కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్లోకి వెళ్తారని చెప్పారు. బీఆర్ఎస్లోని పలువురు అభ్యర్థులను ఓడించేది కూడా కేసీఆరేనని అని తీవ్ర ఆరోపణలు చేశారు. కుమురంభీం జిల్లా సిర్పూర్(టి)లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి పాల్వాయి హరీశ్‌బాబుకు మద్దతుగా శుక్రవారం నిర్వహించిన విజయ సంకల్ప సభలో సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులకు మూడు నెలలకోసారి జీతాలిస్తారని వ్యాఖ్యానించారు. సీఎం కేసీఆర్ ఇటీవల ఫాంహౌస్‌లో చేసింది రాజశ్యామల యాగం కాదని.. వశీకరణ పూజలు చేశారని ఆరోపించారు. బీసీని సీఎం చేస్తామంటే ఓర్వలేకపోతున్నారు. బీజేపీ ఈ రాష్ట్రంలో బీసీని ముఖ్యమంత్రిని చేస్తామంటే బీఆర్ఎస్ ఓర్వలేకపోతోందని బండి సంజయ్ అన్నారు. కులం కంటే గుణం ముఖ్యమని కేసీఆర్ అంటూ బీసీలను అవమానిస్తున్నడని.. వాళ్లు సీఎం పదవికి పనికిరారా.. అని ప్రశ్నించారు. సిరిసిల్లలో బీజేపీ అభ్యర్థిగా రాణీరుద్రమ శుక్రవారం నామినేషన్ వేయగా.. ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. బీజేపీ రాష్ట్రంలో లేదని అహంకారంతో బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతున్నారని.. కానీ పార్టీ ప్రజల గుండెల్లో ఉందని సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపీకి అవకాశమిస్తే ఎలాంటి మచ్చ లేని పేద బీసీ నాయకుడు సీఎం అవుతారని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. -
వారెవరు గెలిచినా మళ్లీ ఎన్నికలే!
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/ కరీంనగర్‌టౌన్: రాష్ట్రంలో బీఆర్ఎస్సో, కాంగ్రెస్సో అధికారంలోకి వస్తే మళ్లీ ఎన్నికలు వచ్చే ప్రమాదముందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే సీఎం కుర్చీ కోసం కొట్లాటలు తప్పవని, తద్వారా కొద్దిరోజులకే ఆ ప్రభుత్వం కుప్పకూలుతుందన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుతారని, అప్పుడు ఆ పారీ్టలో చీలికలొచ్చి ప్రభుత్వం పడిపోతుందని జోస్యం చెప్పారు. రాష్ట్రం సుస్థిరంగా ఉండాలంటే బీజేపీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ వ్యక్తిని సీఎంను చేసి తీరుతామన్నారు. నారాయణపేట నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కె.రతంగ్‌పాండురెడ్డి బుధవారం నామినేషన్ వేశారు. అనంతరం సత్యనారాయణ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ బండి మాట్లాడారు. కేసీఆర్ లేకుంటే నిన్ను కుక్కలు కూడా దేకవు అని కేటీఆర్‌ను బండి దుయ్యబట్టారు. ‘‘అమెరికాలో చిప్పలు కడుక్కునే వాడివి...2004లో నెలకు జీతం రూ.4 లక్షలు అన్నావు...ఇప్పుడేమో కోటి అంటావు...నెలకు కోటి లెక్క చేసిన ఐదేళ్లకు దాదాపు వంద కోట్లు అనుకో...మరి లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసినవ్ కదా..ముందు ఆ లక్ష కోట్ల సంగతి తేల్చు’’అని సవాల్ విసిరారు. హెలికాప్టర్లో ఎన్నికల ప్రచారానికి బండి బండి సంజయ్‌ను స్టార్ క్యాంపెయినర్‌గా ఎంపిక చేసిన బీజేపీ అధిష్టానం రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించి సభల్లో పాల్గొనేందుకు ఆయనకు హెలికాప్టర్‌ను కేటాయించింది. దీంతో బుధవారం కరీంనగర్ నుంచి నారాయణపేట జిల్లాకు సభలో పాల్గొనేందుకు సంజయ్ హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు. రెండోరోజు బుధవారం పాదయాత్రలో భాగంగా కరీంనగర్‌లోని 6, 29, 30 పాతబజార్ శివాలయం నుంచి ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు పగడాకుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షుడు సత్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
'బండి సంజయ్' నామినేషన్ సందర్భంగా.. భారీ ర్యాలీ!
సాక్షి, కరీంనగర్: భారతీయ జనతాపార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థిగా పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌కుమార్ సోమవారం నామినేషన్ వేయనున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి బీజేపీ సీనియర్ నేత ప్రకాశ్‌జవదేకర్, గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అతిథులుగా హాజరుకానున్నారు. నామినేషన్ సందర్భంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ చౌరస్తా నుంచి ప్రారంభం కానున్న బైక్ ర్యాలీ కమాన్‌చౌరస్తా, వెంకటేశ్వర టెంపుల్, రాజీవ్ చౌక్, కోర్టు చౌరస్తా, శివటాకీస్, జ్యోతి నగర్, రాంనగర్, గీతాభవన్ చౌరస్తా వరకు సాగనుంది. అక్కడి నుంచి పాదయాత్ర ర్యాలీ ద్వారా సంజయ్ కలెక్టరేట్‌కు చేరుకుని నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఇవి చదవండి: 'నామినేషన్లకు' ఎప్పుడెలా ఉందో.. కాస్త చూసి చెప్పండి! పురోహితుల వెంట.. -
TS Election 2023: జమిలి ఎన్నికలొస్తే.. కరీంనగర్ నుంచే పోటీ!: బండి సంజయ్
కరీంనగర్: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నుంచే పోటీ చేస్తానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. మంత్రి గంగుల కమలాకర్‌తో కుమ్మక్కయినట్లు జరుగుతున్న దుష్ప్రచారాన్ని కొట్టిపారేశారు. తాను పార్లమెంట్ సమావేశాలు, అమెరికా పర్యటనలో ఉండడంతోనే కోర్టుకు హాజరుకాలేకపోయానని తెలిపారు. గురువారం కరీంనగర్‌లోని తన నివాసంలో మాట్లాడారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి దీక్ష ను భగ్నం చేసి, కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండించారు. రాష్రాన్ని రూ.5.5 లక్షల కోట్ల అప్పుల పాలుజేసి, కేసీఆర్ చెల్లని రూపాయిలా మారారని ఎద్దేవా చేశారు. ఓవైసీ చెబితేనే సెప్టెంబర్ 17న జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటించారని ఆరోపించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరిపి తీరాల్సిందేనని డిమాండ్ చేశారు. తాను ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయంలో క్లారిటీ ఉందని, ఎంపీ, అసెంబ్లీ ఎన్నికలు వేర్వేరుగా జరిగితే కరీంనగర్ అసెంబ్లీ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కరీంనగర్లో గంజాయి ఏరు లై పారిస్తూ యువతను చిత్తు చేస్తున్నా పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. పోలీసులు గంజాయిని కంట్రోల్ చేయని పక్షంలో తామే యువకులతో దళాలను ఏర్పాటు చేసి కట్టడిచేస్తామని ప్రకటించారు. కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండబోరనే హామీ ఏమైంది? రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఉద్యోగులే ఉండబోరని ప్రకటించిన కేసీఆర్‌కు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగులను విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులరైజ్ చేయాలని బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్న తెలంగాణ సమగ్ర శిక్షా ఉద్యోగుల శిబిరం వద్దకు వెళ్లి సంఘీభావం తెలిపారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్ర శిక్షా ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. -
ఆ అభిమానం మరువలేనిది
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ పట్ల ప్రవాస భారతీయులు చూపుతున్న అభిమానానికి బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. మోదీపై చూపుతున్న అభిమానాన్ని ఓట్లరూపంలో కురిపించాలని కోరారు. అమెరికా పర్యటనలో ఉన్న సంజయ్ భారత కాలమానం ప్రకారం ఈ రోజు మధ్యాహ్నం అట్లాంటాలో ప్రవాస భారతీయులతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ ‘‘మీ అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. మోదీపై మీరు చూపుతున్న అభిమానం వెలకట్టలేనిది. మోదీ 9 ఏళ్ల పాలన అవినీతికి తావు లేకుండా కొనసాగుతోంది. అభివృద్ధిలో భారత్ ప్రపంచదేశాల్లో అగ్రగామిగా నిలవాలంటే మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందుకోసం మీరంతా సమయం తీసుకుని ఎన్నికల సమయంలో భారత్ రండి. మోదీ తరఫున ప్రచారం చేయడంతోపాటు ఓట్లు వేయాలి’అని కోరారు. మోదీ పాలనలో భారత్ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని, స్వదేశంలో పెట్టుబడులు పెట్టాలని ఎన్నారైలను సంజయ్ కోరారు. -
TS: సంఘ్ పెద్దలతో బీజేపీ నేతల భేటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంతో.. రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, ఎన్నికల సమన్వయంపై ఆ పార్టీ నేతలు సంఘ్ పెద్దలతో మంగళవారం భేటీ అయ్యారు. తెలంగాణ ఎన్నికల సహ ఇంఛార్జ్ సునీల్ బన్సల్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, కే.లక్ష్మణ్, బండి సంజయ్‌లు ఈ సమావేశానికి హాజరయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారంలో సంఘ్ పరివార్ కీలకంగా వ్యవహరించనుంది. ఈ నేపథ్యంలోనే ఈ భేటీ జరిగినట్లు తెలుస్తోంది. పార్టీపరంగా వెంటనే చేయాల్సిన పనులేంటో ఈ సందర్భంగా సంఘ్ పెద్దలు తెలంగాణ బీజేపీ నేతలకు సూచించారని పార్టీ శ్రేణులు వెల్లడించాయి. మేనిఫెస్టో, అభ్యర్థుల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించినట్లు సమాచారం. -
లోక్ సభలో రాహుల్ గాంధీపై బండి సంజయ్ సెటైర్లు
-
ఆర్టీసీ బిల్లు జాప్యంపై బండి సంజయ్ కామెంట్లు
సాక్షి, కరీంనగర్: ఆర్టీసీ బిల్లు విషయంలో తొందరపాటు పనికి రాదని.. గవర్నర్ భుజాలపై తుపాకీ పెట్టి కాల్చాలని చూస్తోందంటూ బీఆర్ఎస్ ప్రభుత్వం కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇవాళ(శనివారం) తొలిసారి ఆయన సొంత జిల్లాలో పర్యటించారు. శంకరపట్నం మండలం కల్వల ప్రాజెక్టు వద్ద బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ బిల్లు విషయంలో గవర్నర్ తమిళిసై భుజాలపై తుపాకీ పెట్టి ఈ ప్రభుత్వం కాల్చాలని చూస్తోంది. గవర్నర్‌ను రెండు రోజుల్లోనే పరిశీలించి ఆమోదించాలంటే ఎలా?. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల జీవితాలకు సంబంధించిన బిల్ అది. కార్మికులకు సరైన న్యాయం చేసేందుకే ఇంతలా పరిశీలన చేస్తారు. ఇలాంటి బిల్స్ లో ఏ గవర్నరైనా ఇలానే పరిశీలిస్తారు అని తెలిపారాయన. ఆర్టీసీ కార్మికులకు బీజేపీ కానీ, తెలంగాణ గవర్నర్ తమిళిసై కానీ వ్యతిరేకం కాదని గుర్తించాలి బండి సంజయ్ కోరారు. ఆర్టీసీ కార్మికులు కొంత సంయమనంతో ఉండండి. మీకు సరైన న్యాయం జరుగుతుంది. రేపొద్దున తిరకాసు చేసి.. ఆ నెపాన్ని గవర్నర్‌పై నెట్టేసే వ్యక్తి కేసీఆర్. ఆర్టీసీ ఆస్తుల్ని అమ్మేసే కుట్ర జరగుతుందోని అని ఆరోపించారాయన. అంతకు ముందు.. మొట్టమొదటిసారిగా జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ కు వచ్చిన బండి సంజయ్‌కు బీజేపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. రామడుగు మండలంలో వర్షాలకు దెబ్బ తిన్న మోతె వాగు బ్రిడ్జ్, శంకరపట్నం మండలంలో దెబ్బ తిన్న కల్వల ప్రాజెక్టులను సందర్శించారాయన. ఇదీ చదవండి: హలో కేటీఆర్‌గారూ.. ఇది గుర్తుందా? -
శభాష్ సంజయ్, బాగా కష్టపడ్డారు.. 20 నిముషాలపాటు మోదీతో బండి భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: ‘శభాష్ సంజయ్.. బాగా కష్టపడ్డారు. తెలంగాణలో పార్టీని గెలిపించడానికి ఇదేవిధంగా దూకుడు కొనసాగించండి. క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై మరింత దృష్టి పెట్టండి’అని బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి బండి సంజయ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దిశానిర్దేశం చేశారు. కుటుంబసభ్యులతో కలిసి వెళ్లిన సంజయ్ ప్రధాని మోదీని గురువారం పార్లమెంట్లో కలిశారు. జాతీ య ప్రధాన కార్యదర్శిగా నియమితులైన తరువాత తొలిసారి ప్రధానిని కలిసిన సంజయ్ 20 నిమిషాలపాటు ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో బీజేపీ బలోపేతానికి ఎంతగానో కష్టపడ్డారని సంజయ్‌ను మోదీ అభినందించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు మరింత కష్టపడాలని సూచించారు. ఈ సందర్భంగా సంజయ్ కుటుంబసభ్యులతో ఫొటోలు దిగడంతోపాటు వారి యోగ క్షేమాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. -
బండి సంజయ్‌ని కలిసిన చీకోటి ప్రవీణ్
సాక్షి, ఢిల్లీ: చికోటి ప్రవీణ్.. తెలంగాణలో సంచలనం సృష్టించిన పేరు. విదేశాల్లో అక్రమ క్యాసినో నడిపించిన వ్యవహారంలో ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా చెల్లింపులపై ఈడీ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్.. అటుపై నిబంధనలకు విరుద్ధంగా కొన్ని జంతువుల్ని పెంచుకున్నాడనే అభియోగాలు సైతం ఉన్నాయి. ఈ క్రమంలో గతకొంతకాలంగా రాజకీయాల్లోకి వస్తాడంటూ జరుగుతున్న ప్రచారానికి తాజా పరిణామాలు మరింత ఊతం ఇచ్చాయి. చికోటి ప్రవీణ్ రాజకీయాల్లోకి వస్తాడనే ప్రచారానికి బలం చేకూర్చేలా ఇవాళ కొన్ని పరిణామాలు జరిగాయి. బీజేపీలో చేరొచ్చనే సంకేతాలు ఇస్తూ.. గురువారం ఢిల్లీలో కొందరు తెలంగాణ బీజేపీ నేతలను కలిశాడు ప్రవీణ్. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణలను కలిశాడు. వాళ్లకు శాలువా కప్పి సత్కరించాడు. వీళ్లతో పాటు తాజాగా బీజేపీలో చేరిన జయసుధను సైతం ప్రవీణ్ కలిశాడు. బీజేపీలో చేరడానికి లైన్ క్లియర్ చేసుకునే క్రమంలోనే వీళ్లందరినీ కలుస్తున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అయితే ఇక్కడి నేతలను ఢిల్లీ వెళ్లి మరీ కలవడం గమనార్హం. ఇక.. వివాదాలతో వార్తల్లోకి ఎక్కుతున్న వ్యక్తి, పైగా ఈడీలాంటి దర్యాప్తు సంస్థ విచారణ ఎదుర్కొంటున్న ప్రవీణ్‌ను బీజేపీ అక్కున చేర్చుకుంటుందా? తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. -
మోదీని కలవనున్న బండి సంజయ్
సాక్షి, ఢిల్లీ: కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రేపు(గురువారం) ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఉదయం 11 గంటల ప్రాంతంలో కుటుంబ సమేతంగా కలవనున్నట్లు సమాచారం. జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి దక్కిన నేపథ్యంలోనే కృతజ్ఞతలు తెలియజేయడానికి ఆయన కలుస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన హస్తినలో పలువురు పెద్దలను వరుసగా కలుస్తూ వచ్చారు. ఇదిలా ఉంటే.. ఎల్లుండి(శుక్రవారం) ఉదయం ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆపై మధ్యాహ్నానికి హైదరాబాద్‌కు చేరుకుంటారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు శ్రేణులు సిద్ధమవుతున్నాయి. అనంతరం శంషాబాద్లోనే ఓ ఫంక్షన్ హాల్లో సంజయ్ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం జరగనుంది. దానికి బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్‌రెడ్డి, ముఖ్యనేతలు హాజరు కానున్నారు. ఏ రాష్ట్రం ఇస్తారో.. జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాతో బండి సంజయ్‌కు ఏదో ఒక రాష్ట్రం బాధ్యతలు ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే.. దక్షిణాది రాష్ట్రం అయితే బాగుంటుందన్న భావనలో బండి సంజయ్ ఉన్నట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో పార్టీ ఇన్ చార్జ్ పోస్ట్ ఖాళీగా ఉంది. -
బండి బలమేంటో కమలానికి తెలిసొచ్చిందా?
కరీంనగర్ ఎంపీ, తెలంగాణ బీజేపీ నేత బండి సంజయ్ విషయంలో బీజేపీ అధిష్టానం వేసిన అంచనా ఘోరంగా తప్పిందా?. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవి నుంచి తొలగించడమనే పెను మార్పు బెడిసి కొట్టిందా?. బీజేపీ స్టేట్ కేడర్ మాత్రమే కాదు.. చిన్నాచితకా పదవుల్లో ఉన్న వాళ్లు.. సంజయ్ ఫ్యాన్స్‌తో పాటు హార్డ్‌కోర్ బీజేపీ అభిమానుల నుంచి కూడా తీవ్రస్థాయిలో అసంతృప్తి ఎదుర్కొంది అధిష్టానం. ఈ తరుణంలో డ్యామేజ్ కంట్రోల్ కోసం కమలాధిష్టానం తాజా నిర్ణయం తీసుకుందనే విశ్లేషణ నడుస్తోంది. అందుకు కారణాలను గమనిస్తే.. మాజీ తెలంగాణ బీజేపీ చీఫ్, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్‌కి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి(మొత్తం ఎనిమిది మందిలో ఆయనొకరు) దక్కింది. ఆయన్ని బుజ్జగించే క్రమంలోనే ఈ ‘ప్రమోషన్’ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో.. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందాన వ్యవహరించింది. అటు బండితో పాటు ఇటు ఆయన్ని తప్పించడంపై అసంతృప్తితో రగిలిపోతున్న వాళ్లనూ చల్లార్చినట్లయ్యింది. తద్వారా రాష్ట్రంలో పార్టీ శ్రేణుల్లో జోష్ నిండి.. ఉత్సాహాంగా పని చేయాలనే ఆలోచనగా స్పష్టమవుతోంది. ✍️ ఊహించని పరిణామం కరోనా సమయంలో బాధ్యతలు చేపట్టిన కరీంనగర్ బండి సంజయ్ కుమార్.. కారు పార్టీని కమలంతో ఢీ కొట్టే స్థాయిలో దూకుడుగా ముందుకు నడిపించారు. ఈ క్రమంలో.. ప్రభుత్వాన్ని ఏకేసే క్రమంలో ప్రతిపక్ష కాంగ్రెస్‌కు చొరబడే సందు కూడా ఇవ్వలేదు ఆయన. ఛాన్స్ దొరికినప్పుడల్లా కేసీఆర్ అండ్ కోపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ.. తన అగ్రెసివ్నెస్తో బీజేపీకి ఒక ఊపు తీసుకురావడమే కాదు.. నిత్యం పొలిటికల్ చర్చల్లో ఉండేలా చేసింది కూడా ఆయనే. ఈ క్రమంలో అరెస్టయి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. అలాంటి వ్యక్తిని పార్టీ బలపడుతుందనుకున్న టైంలో.. అదీ ఎన్నికల ముందర తప్పించడంపై పార్టీ మెజార్టీ శాతం నుంచి వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. బండిని తొలగించిన ప్రకటన వెలువడగానే.. పలుచోట్ల రాజీనామాల పర్వం కూడా కొనసాగింది. అయితే ఈ స్థాయి వ్యతిరేకతను బీజేపీ అధిష్టానం సైతం ఊహించలేదు. ✍️ వ్యూహాత్మక నిర్ణయమేనా? పాదయాత్రల ద్వారా పార్టీపై జనాల్లో ఫోకస్ పెరిగే చేయడమే కాకుండా.. పార్టీ అగ్రనేతలను తెలంగాణకు రప్పించగలిగారు బండి సంజయ్. ఆ సమయంలో ‘సాహో.. సంజయ్’ అంటూ భుజం తట్టారు బీజేపీ పెద్దలు(ప్రధాని సహా). కానీ, అవమానకర రీతిలో తొలగించడాన్ని ఆయన అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. బండి సారథ్యంలో బీజేపీ వర్గపోరుతో క్యాడర్లో అయోమయం నెలకొందనే సాకు.. పైగా చేరికలు ఆగిపోవడానికి బండినే కారణమంటూ ఇచ్చిన ‘తప్పుడు’ నివేదికలు ఆయనకు పదవిని దూరం చేశాయనే ప్రచారం ఒకటి ఉంది. అయితే.. బండిని మార్చడం ద్వారా తెలంగాణలో పూడ్చలేని అపఖ్యాతిని కాషాయం పార్టీ మూటగట్టుకుంది. సోషల్ మీడియాలో ఈ నిర్ణయం తప్పుబడుతూ సాధారణ పౌరులు సైతం పోస్టులు చేశారు. కార్యకర్తలు, బండి అభిమానులు పార్టీలో యాక్టివ్‌గా పని చేయడం తగ్గించేశారు. ఈ నిరసన సెగ.. హస్తినకు చేరింది. ఈ తరుణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటే.. క్యాడర్ చల్లబడుతుందని, పార్టీ మళ్లీ పుంజుకుంటుందనే సమాలోచనలు జరుపుతూ వచ్చింది బీజేపీ అధిష్టానం. వీటికి తోడు.. దూకుడు మీదున్న బండి సంజయ్‌ను మార్చడం బీఆర్ఎస్కే అనుకూలిస్తుందనే సంకేతాల్ని ప్రజల్లోకి పంపినట్లు అవుతుందన్న కేడర్ అభిప్రాయంతో ఢిల్లీ పెద్దలు సైతం ఏకీభవించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకే మళ్లీ సాహో సంజయ్ అనాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే తెలంగాణ పార్టీ చీఫ్ మార్పు-ఎంపిక విషయంలో మాత్రం స్ట్రాటజికల్గానే నిర్ణయం తీసుకున్నట్లు ఓ హస్తిన నేత చెబుతున్నారు. ✍️ బండి సేవలు అలానా? బండి సంజయ్‌కు కేంద్ర మంత్రి పదవి ఇస్తారనే ఊహాగానాలు వినిపించినా.. అవి మీడియా కథనాలకే పరిమితం అవుతూ వచ్చాయి. అయితే.. ఈలోపే పార్టీకి జరిగిన డ్యామేజ్‌తో బండి బలమేంటో బీజేపీ అధిష్టానం గుర్తించింది. తీవ్ర మల్లాగుల్లాల తర్వాత బండి సంజయ్‌కు జాతీయ పదాధికారుల బృందంలో చోటు కల్పించింది. తెలంగాణలో కిషన్‌రెడ్డి సారథ్యంలో పని చేయాలని సూచిస్తూనే.. ఏదైనా ఒక రాష్ట్రానికి బండి సంజయ్‌ను ‘వ్యవహారాల ఇంఛార్జి’గానూ నియమించే అవకాశాలు ఉండొచ్చని తెలుస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. రాష్ట్రాలకు పార్టీ చీఫ్‌లు, ఇన్‌ఛార్జిల నియామకాల విషయంలో బీజేపీ వ్యూహాత్మక ధోరణి ప్రదర్శిస్తోంది. కొన్ని రాష్ట్రాలకు అనుభవజ్ఞులను.. మరికొన్ని రాష్ట్రాలకు దూకుడు స్వభావం ఉన్న వాళ్లను నియమిస్తోంది. ఆ లెక్కనే బండికి ఏదైనా రాష్ట్రం అప్పగిస్తారనే టాక్ నడుస్తోంది. అయితే బండికి ‘బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి’ పదవి దక్కడమనేది ఆయన్ని అభిమానుల్ని ఖుషీ చేసేదే అయినా.. తెలంగాణ రాజకీయాలకూ ఆయన దూరం అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం!. ఇదీ చదవండి: సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే సహా అంతా ఆ పార్టీలోకేనా? -
గెలుపే లక్ష్యంగా దూసుకెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో రానున్న అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు బండి సంజయ్ కుమార్‌కు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగట్టేందుకు మరింత దూకుడుగా వ్యవహరించాలని చెప్పారు. సోమవారం ఢిల్లీలో తనను కలిసిన బండి సంజయ్‌తో సుమారు 30 నిమిషాలపాటు రాష్ట్ర రాజకీయ వ్యవహారాలపై అమిత్ షా చర్చించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి అప్పగించిన తర్వాత మొదటిసారి బండి సంజయ్ అమిత్ షాను కలిశారు. ఈ సందర్భంగా పారీ్టకి సంబంధించిన వ్యవహారాలు, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, ప్రధాని సహా కేంద్రమంత్రుల పర్యటనలు తదితర అంశాలపై అమిత్ షా పలు సూచనలు చేశారు. అంతేగాక ఇటీవల కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల స్వీకరణ రోజు బండి సంజయ్ సహా పలువురు నాయకులు చేసిన వ్యాఖ్యల గురించి అమిత్ షా అడిగి తెలుసుకున్నారని సమాచారం. పార్టీ అంతర్గత విషయాలను బహిరంగ వేదికలపై, మీడియాతో మాట్లాడరాదని అమిత్ షా సూచించారని తెలిసింది. బండితో భేటీకి సంబంధించిన సమాచారాన్ని అమిత్ షా స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలను బండితో చర్చించినట్లు చెప్పారు. అనంతరం షాతో భేటీకి సంబంధించి బండి సైతం ట్వీట్ చేశారు. రాజకీయ చాణక్యుడు అమిత్ షాను కలవడం సంతోషంగా ఉందని, ఆయన మార్గదర్శనంలో పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేస్తానని బండి వెల్లడించారు. -
బండి Vs ఈటల.. బీజేపీలో సోషల్ మీడియా పోస్టుల చిచ్చు
సాక్షి, హైదరాబాద్: సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు బీజేపీ సోషల్ మీడియా వింగ్‌లో కలకలం రేపాయి. ఈ పోస్టులపై సోషల్వింగ్ పార్టీ రాష్ట్ర కార్యాలయంలోనే రెండు వర్గాలుగా విడిపోయింది. కొన్నిరోజుల కిందటివరకు నేతల గ్రూపుల విభేదాలు బయటపడగా.. సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టులు తాజా వివాదానికి కారణమయ్యాయి. రాష్ట్ర పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను కించపరిచే విధంగా పోస్ట్‌లు పెడుతున్నారని పలువురు ఈటల వర్గీయులు సోషల్ మీడియా వింగ్ వద్ద ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతల కేంద్రంగా కాకుండా, పార్టీకి మేలు చేసేలా పోస్టులు ఉండాలని సూచించారు. బండి సంజయ్‌ను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి బాధ్యతల నుంచి తప్పించొచ్చని వార్తలొచ్చిన సందర్భంగా అటు బండి వర్గం, ఇటు ఈటల వర్గం ఒకరికి ఒకరు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో తాజాగా పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇంచార్జుల సమావేశానికి నాంపల్లి కార్యాలయానికి వచ్చిన ఈటల వర్గీయులు... ఈటలకు వ్యతిరేకంగా కొందరు పోస్టులు పెట్టడంపై స్టేట్ ఆఫీస్ సోషల్ మీడియా ప్రతినిధులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా బండి, ఈటల వర్గాలు పరస్పరం దూషించుకున్నాయి. బీజేపీ సోషల్ మీడియా ఉద్యోగి ప్రశాంత్‌పై కొందరు దూషణకు దిగారు. వీరిలో ఈటల, కిషన్ రెడ్డి అనుచరులు అమర్ నాథ్, గిరివర్ధన్ రెడ్డి ఉన్నట్లు సమాచారం. సోషల్ మీడియా రూమ్‌కు తాళం వేసి మరీ దాడికి ప్రయత్నించినట్టు, ఈటలకు అనుకూలంగా కొందరు నినాదాలు కూడా చేసినట్టు తెలుస్తోంది. బీజేపీ కార్యాలయ సిబ్బంది ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో అప్పటికి వివాదం సద్దుమణిగింది. చదవండి: రేవంత్ ‘ఉచిత’ ఉపన్యాసం.. ఆత్మరక్షణలో కాంగ్రెస్.. చేజేతులా! -
కేసీఆర్ గడీలు బద్దలు కొడతాం
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణలో కాషాయ రాజ్యం స్థాపించి, కేసీఆర్ గడీలు బద్దలు కొడతామని బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ పాల నపై విసిగి వేసారిన రాష్ట్ర ప్రజలు ఆయన పాలనకు చరమగీతం పాడేందుకు సిద్ధంగా ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని పేర్కొన్నారు. శనివారం హనుమకొండ ఆర్ట్స్అండ్ సైన్స్ కళాశాల మైదానంలో ప్రధాని మోదీ సభలో పాల్గొన్న బండి సంజయ్.. భావోద్వేగ ప్రసంగం చేశారు. సాధారణ కార్యకర్తగా ఉన్న తనను పార్టీ, కార్పొరేటర్ స్థాయి నుంచి ఎంపీగా చేసిందని, అంతేకాక రాష్ట్ర అధ్యక్షుడిగా అవకాశమిచ్చిందని.. బీజేపీకి రుణపడి ఉంటానని అన్నారు. ‘శిరస్సు వంచి దండాలు పెడుతున్నా.. బీజేపీ జెండాను మోసిన భుజం అన్నా, 140 కోట్ల మంది ప్రజలకు భరోసా ఇచ్చే మహానుభావుడు మోదీ భుజం తడితే ఎట్లా ఉంటదో ఈ నా భుజాన్ని అడిగితే చెబుతుంది’అంటూ భావోద్వేగానికి గురయ్యారు. ‘ఒక్కసారి ప్రధాని మోదీ తన నోటినుంచి సంజయ్.. అని ఎప్పుడంటారా? అని ఎదురు చూసిన’అని అన్నారు. ప్రపంచమే బాస్‌గా గుర్తించిన నేత ప్రధాని మోదీ అని కొనియాడారు. ‘నన్ను ఎంపీగా గెలిపించిన కరీంనగర్ ప్రజలకు దండాలు.. మా జాతీయ నాయకత్వం నన్ను రాష్ట్ర అధ్యక్షుడినిగా చేసింది. మోదీగారు నా భుజం తట్టి బండి.. అంటూ ఆప్యాయంగా పలకరించారు. ఇది నా పూర్వజన్మ సుకృతం. ఈ జన్మకు ఇది చాలు. రాబోయే రోజుల్లో కిషన్‌రెడ్డి నాయకత్వంలో కేసీఆర్ సర్కార్ గడీలను బద్దలు కొడతాం. తెలంగాణలో మోదీ రాజ్యం... కాషాయ రాజ్యం స్థాపించేందుకు నిరంతరం కృషి చేస్తాం’అని పేర్కొన్నారు. మోదీ ఏ ముఖం పెట్టుకుని తెలంగాణకు వస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆయన దీటుగా స్పందించారు. ‘రూ.6,100 కోట్ల నిధులను తెలంగాణకు తెచ్చేందుకు మోదీ వచ్చారు. వరంగల్‌కు రైల్వే వ్యాగన్ ఫ్యాక్టరీ తేవడానికి వచ్చారు. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు వచ్చారు’అంటూ ఎదురుదాడి చేశారు. మరి సీఎం కేసీఆర్ ఇక్కడికి ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని బండి సంజయ్ నిలదీశారు. మోదీ వద్దకు రావడానికి కేసీఆర్‌కు ముఖం చెల్లడం లేదని, ఆయనను చూస్తేనే కేసీఆర్‌కు జ్వరం, కోవిడ్లు వస్తాయని ఎద్దేవా చేశారు. మీరు జై మోదీ.. అనే నినాదాలు చేస్తే కేసీఆర్ చెవుల నుంచి రక్తం కారాలంటూ సభికులను ఉత్సాహపరిచారు. -
సమయం తక్కువ.. సవాళ్లు ఎక్కువ!
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: పార్టీలో సమన్వయ లోపం, పదవులు దక్కని అసంతృప్తులు, పాత–కొత్త నేతల మధ్య భేదాభిప్రాయాలను సరిదిద్దడం ఓ వైపు.. అధికార బీఆర్ఎస్ను, సీఎం కేసీఆర్ వ్యూహాలను ఎదుర్కొంటూ, విమర్శలను తిప్పికొడుతూ పార్టీని ముందుకు దూకించాల్సిన బాధ్యత ఇంకోవైపు.. ముంచు కొస్తున్న అసెంబ్లీ ఎన్నికలు మరోవైపు.. రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డికి ముప్పేట ముసిరిన సవాళ్లు ఇవి. వీటన్నింటినీ చక్కదిద్ది రాష్ట్రంలో బీజేపీని విజయతీరాలకు నడిపించేందుకు ఆయనకు ఉన్న సమయం కూడా నాలుగైదు నెలలే.. రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై అవగాహన, సంఘ్ పరివార్ అండదండలున్న కిషన్‌రెడ్డికి తోడుగా.. కేసీఆర్ వ్యూహాలు, ఎత్తుగడలపై పూర్తి అవగాహన ఉన్న ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమించిన నేపథ్యంలో వారు పరిస్థితులను ఎలా అధిగమిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇంత తక్కువ సమయంలోనే పార్టీని చక్కదిద్ది, ఎన్నికలకు సిద్ధం చేయడం కత్తిమీద సామేనని బీజేపీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి. అన్నింటికన్నా ముందు ఈ నెల 8న ప్రధాని మోదీ వరంగల్ పర్యటన, బహిరంగ సభను విజయవంతం చేయడం కిషన్‌రెడ్డి ముందున్న ప్రథమ లక్ష్యమని అంటున్నాయి. పార్టీని చక్కదిద్దడమే ప్రధాన ఎజెండాగా.. అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడిన నేపథ్యంలో రాష్ట్ర బీజేపీలో అయోమయ, గందరగోళ పరిస్థితులను చక్కదిద్దడం ప్రధాన ఎజెండాగా మారిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. బండి సంజయ్ స్థానంలో అధ్యక్షుడిగా నియమితుడైన కిషన్‌రెడ్డి ఈ దిశగా అవసరమైన చర్యలు చేపట్టి పార్టీ నాయకులు, కేడర్‌లో విశ్వాసాన్ని నింపే చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అంటున్నాయి. దాదాపు నాలుగేళ్లుగా (ఎంపీగా ఎన్నిక, కేంద్ర మంత్రి పదవి చేపట్టిన నాటి నుంచి) రాష్ట్ర పార్టీ వ్యవహారాలు, నిర్ణయాల్లో పెద్దగా జోక్యం చేసుకోకుండా ఉన్న కిషన్‌రెడ్డి.. ఇప్పుడు పార్టీని గాడిలో పెట్టేందుకు పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రకరించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొంటున్నాయి. పార్టీలో సంస్థాగత మార్పులతో.. బండి సంజయ్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన రాష్ట్ర కార్యవర్గం, పదాధికారులు, జిల్లా అధ్యక్షుల మార్పు వంటి సంస్థాగత చర్యలు కిషన్‌రెడ్డికి తలకు మించిన భారంగా మారే అవకాశం ఉందని పార్టీ నేతలు అంటున్నారు. అధ్యక్ష మార్పు, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా ఈటల రాజేందర్‌కు కీలక పదవి ఇవ్వడంపై పార్టీలో అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించడం, పార్టీ మారకుండా చూడటంపైనా కిషన్‌రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని చెప్తున్నారు. అధికార బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగట్టడం, రాష్ట్ర ప్రభుత్వంపై, కేసీఆర్‌పై ప్రజల్లో నెలకొన్న వ్యతిరేకతను బీజేపీకి అనుకూలంగా మార్చుకోవడం కూడా కీలకమని అంటున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గించి.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒక్కటేననే భావాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని స్పష్టం చేస్తున్నారు. మొత్తంగా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీనే అనేలా ప్రజల్లో అభిప్రాయం కలిగించేందుకు చర్యలు చేపట్టాల్సి ఉందని పేర్కొంటున్నారు. నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరిగే నేపథ్యంలో ఆలోగా వీటన్నింటినీ ఏ మేరకు చక్కదిద్దగలరనే చర్చ జరుగుతోంది. అయిష్టత.. అసంతృప్తి మధ్య.. తనకు అధ్యక్ష బాధ్యతలను కట్టబెట్టడంపై కిషన్‌రెడ్డి ఒకింత అసంతృప్తిగా ఉన్నారని.. అయిష్టంగానే బాధ్యతల స్వీకరణకు సిద్ధమవుతున్నారని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన కేబినెట్ భేటీకి ఆయన హాజరుకాకపోవడంతో కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేశారనే ప్రచారం జరిగింది. తర్వాత ఆయన పొడిపొడిగానే మీడియాతో మాట్లాడారు. అనారోగ్య కారణాలతోనే కేబినెట్ భేటీకి వెళ్లలేదన్నారు. అధిష్టానం నిర్ణయం శిరోధార్యమని, పార్టీ ఏది ఆదేశిస్తే దానిని సైనికుడిగా పాటిస్తానని సాయంత్రం మీడియాతో పేర్కొన్నారు. ఢిల్లీలోనే బండి సంజయ్.. పెద్దలతో చర్చలు అత్యంత కీలకమైన ఎన్నికల సమయంలో తనను అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించడంపై బండి సంజయ్ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని.. ఈ క్రమంలో కేంద్ర మంత్రి పదవి ఇస్తామన్నా స్వీకరించేందుకు అయిష్టత చూపుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఈ విషయాన్ని ఆయన పార్టీ జాతీయాధ్యక్షుడు నడ్డాతోపాటు ఇతర పెద్దలకు వివరించినట్టు ప్రచారం జరుగుతోంది. సంజయ్‌తో సునీల్ బన్సల్ భేటీ అయి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వెనక్కి తగ్గలేదని అంటున్నారు. అయితే తనకు వ్యతిరేకంగా పనిచేసిన కొందరు నేతల అంశాన్ని బన్సల్ వద్ద ప్రస్తావించారని.. తనతోపాటు అధిష్టానం పెద్దలపై ఎమ్మెల్యే రఘునందన్‌రావు చేసిన వ్యాఖ్యల విషయాన్ని వివరించారని చెప్తున్నారు. ఈ క్రమంలో రఘునందన్‌రావుపై చర్యలు తీసుకునే విషయంపై అధిష్టానం సమాలోచనలు చేస్తున్నట్టు పేర్కొంటున్నారు. మరోవైపు పార్టీ తీసుకునే నిర్ణయానికి తాను కట్టుబడి ఉంటానని సంజయ్ ఢిల్లీలో మీడియాకు చెప్పారు. రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్‌తో అపాయింట్మెంట్ ఉన్న కారణంగా బుధవారం ఢిల్లీలోనే ఆగి.. గురువారం హైదరాబాద్ వెళుతున్నట్టు వివరించారు. -
కమల దళపతి కిషన్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై గత కొన్నిరోజులుగా కొనసాగుతున్న ఊహాగానాలు, ప్రచారానికి ఫుల్స్టాప్ పెడుతూ బీజేపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ స్థానంలో.. ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్న గంగాపురం కిషన్‌రెడ్డిని రాష్ట్ర పార్టీ చీఫ్‌గా నియమించింది. ఇదే సమయంలో పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌కు ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు అప్పగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆదేశాల మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన బండిని త్వరలోనే కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారనే ప్రచారం జరుగుతుండగా, దీనిపై మరో రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. అనుభవం, అణుకువ ప్రామాణికంగా.. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడి మార్పు సహా పలు కమిటీల నియామకంపై బీజేపీ అధిష్టానం గడిచిన నెల రోజులుగా చర్చోపచర్చలు కొనసాగించింది. పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌లు ఈ అంశాలపై దృష్టి పెట్టారు. రాష్ట్ర నేతల అభిప్రాయాలు తీసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో అధికార బీఆర్ఎస్ను ఢీ కొట్టాలంటే మార్పు చేర్పులు అవసరమని కొందరు పార్టీ నేతలు అధిష్టానానికి సూచించారు. రాష్ట్ర నాయకత్వంపై తమ అసంతృప్తిని కొందరు అగ్రనేతల దృష్టికి తీసుకెళ్లారు. ఇదే సమయంలో నేతల మధ్య సమన్వయ లేమిని జాతీయ నాయకత్వం పరిగణనలోకి తీసుకుందని, సంజయ్‌ను తప్పించాలనే నిర్ణయానికి వచ్చిందని సమాచారం. కాగా ఈటల రాజేందర్, డీకే అరుణ సహా మరొకొందరి పేర్లు పరిశీలించిన బీజేపీ అధిష్టానం చివరికి పార్టీలో సుదీర్ఘ అనుభవం, అణుకువ, విధేయతలు ప్రామాణికంగా తీసుకుని కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డిని తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించింది. యువ మోర్చా రాష్ట్ర, జాతీయ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించడం, మూడుసార్లు ఎమ్మెల్యే ఉండటం, గతంలోనూ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేయడం, ఎంపీగా గెలిచి కేంద్రమంత్రిగా ఉండటం, అన్నింటికన్నా ముఖ్యంగా తెలంగాణలో బలంగా ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో కిషన్‌రెడ్డి వైపే అధిష్టానం మొగ్గు చూపింది. అయితే కిషన్‌రెడ్డిని కేంద్ర మంత్రిగా కొనసాగిస్తారా? లేక తొలగిస్తారా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. బీజేపీలో జోడు పదవుల వ్యవహారం లేనందున ఆయన్ను కేంద్ర కేబినెట్ నుంచి తొలగిస్తారని ప్రచారం జరుగుతున్నా దీన్ని ఎవరూ ధ్రువీకరించడం లేదు. దీనిపైనా రెండు, మూడురోజుల్లో స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. చదవండి: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు? అన్నీ పరిగణనలోకి తీసుకుని ఈటలకు బాధ్యతలు రాష్ట్ర అధ్యక్ష పదవికి తొలినుంచి బలమైన పోటీదారుగా ఉన్న ఈటల రాజేందర్‌ను అత్యంత కీలకమైన ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా బీజేపీ నియమించింది. రాష్ట్రంలో అధికంగా ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడం, అందులోనూ అత్యంత కీలకమైన ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వారవడం, సీఎం కేసీఆర్‌ను ఎదిరించి పార్టీలోంచి బయటకు వచ్చి పోరాడుతున్న నేతగా పేరుండటం, అన్ని పార్టీలు, వర్గాలు, తెలంగాణ ఉద్యమ సంఘాలతో ఆయనకు ఉన్న సాన్నిహిత్యం ఈటల ఎంపికకు కలిసొచ్చిందని చెబుతున్నారు. వీటిని దృష్టిలో పెట్టుకునే ఎన్నికల ప్రచార బాధ్యతలు, వ్యూహాల ఖరారు, అభ్యర్థుల ఎంపిక అంశాలపై పట్టు ఉండే ఎన్నికల నిర్వహణ కమిటీ బాధ్యతలు ఆయనకు కట్టబెట్టినట్లు తెలుస్తోంది. నడ్డాతో సంజయ్ భేటీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పు సహా పలు ఇతర అంశాలపై చర్చించేందుకు అధిష్టానం పెద్దల పిలుపు మేరకు ఢిల్లీకి వచ్చిన బండి సంజయ్ మంగళవారం మధ్యాహ్నం పార్టీ జాతీయ కార్యాలయంలో జేపీ నడ్డాతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలోనే అధ్యక్ష పదవికి సంజయ్ రాజీనామాను తీసుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ఎంపికకు గల కారణాలు, మున్ముందు పార్టీలో, కేంద్ర పదవుల్లో కల్పించే ప్రాధాన్యం, ఇతర అంశాలను సంజయ్‌కు నడ్డా వివరించారు. కేంద్ర కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో చోటు కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తున్నా దీనిపై స్పష్టత రాలేదు. భేటీ అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడకుండానే అక్కడినుంచి వెళ్లిపోయారు. ఇక అదే సమయంలో ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు సైతం నడ్డాతో భేటీ అయినట్లు తెలిసింది. ఎస్టీ సామాజికవర్గం నుంచి ఆయనకు కేబినెట్లో చోటు దక్కుతుందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్న సమయంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత ఏర్పడింది. -
బండి సంజయ్ తొలగింపు తట్టుకోలేక ఆత్మహత్యాయత్నం!
-
బండి సంజయ్ అభిమాని ఆత్మహత్యాయత్నం
సాక్షి, ఖమ్మం: సంజయ్ అన్నా.. ఇక సెలవు అంటూ తెలంగాణ బీజేపీ మాజీ చీఫ్ అభిమాని చేసిన పని చర్చనీయాంశంగా మారింది. బండి సంజయ్‌ను తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు. ఖమ్మం బీజేపీ టౌన్ ఉపాధ్యక్షుడు గజ్జెల శ్రీనివాస్.. ఆత్మహత్యాయత్నం చేశాడు. బండి సంజయ్‌ను తొలగించడాన్ని తట్టుకోలేకే తాను ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు మరీ ప్రకటించుకున్నాడతను. కుటుంబ సభ్యులు స్థానికంగా టౌన్‌లోని ఓ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘‘అన్నా.. ఇక సెలవు.. సంజయన్నను అధ్యక్ష పదవి నుండి తొలగించడం తట్టుకోలేకపోతున్నా’’ అంటూ తన సహచరులకు, పార్టీ నేతలకు ఫోన్లు చేసి ఆత్మహత్యకు పాల్పడ్డారని జిల్లా నేతలు చెబుతున్నారు. బండి సంజయ్ కుమార్ ను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుండి తప్పిస్తూ బీజేపీ అధిష్టానం తీసుకున్న నిర్ణయం తెలంగాణలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో లక్షలాది సంఖ్యలో తప్పుపడుతున్నారు. అదే సమయంలో బండి సంజయ్ ను తప్పించడాన్ని పార్టీ శ్రేణులు ఏమాత్రం జీర్ణించుకోలేకపోతున్నాయి. కష్టపడే నాయకుడికి దక్కిన ప్రతిఫలం ఇదేనా? అంటూ నిలదీస్తున్నాయి. మరోవైపు బండి సంజయ్ అభిమానులు తీవ్రమైన నిరాశలో కూరుకుపోయారు. ఇదీ చదవండి: బండి సంజయ్‌ను అసలు ఎందుకు తొలగించారు? -
Bandi Sanjay Resigned: బండి సంజయ్ ను ఎందుకు తప్పించారు?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ బీజేపీలో ఊహించిందే జరిగింది. తెలంగాణ బీజేపీ చీఫ్ పదవికి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అనంతరం ఆయన ఈ నిర్ణయం ప్రకటించారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పలు విడతల్లో తెలంగాణలోని చాలా జిల్లాల్లో పాదయాత్ర చేసి పార్టీకి కొత్త ఊపు తీసుకొచ్చిన బండి సంజయ్ పదవి సరిగ్గా ఎన్నికల సమయానికి ఎందుకు పోయింది? ఇది బండి సంజయ్ చేసుకున్న స్వయంకృతపరాధమా? లేక పార్టీ పెద్దలు ఇచ్చిన డెడ్ లైన్ ముగిసిందా? అధ్యక్ష పదవికి రాజీనామా చేయగానే తన ట్విట్టర్ అకౌంట్ లో హోదా మార్చుకున్నారు. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడి స్థానంలో బీజేపీ కార్యకర్త అని పేర్కొన్నారు. Officially signing off as @BJP4Telangana State President 🙏 Thank you to Hon’ble PM Shri @narendramodi ji, Hon’ble HM Shri @AmitShah ji and @BJP4India President Shri @JPNadda ji, Shri @blsanthosh ji, Shri @shivprakashbjp ji, Shri @tarunchughbjp ji, Shri @sunilbansalbjp ji, Shri… — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 4, 2023 బలాలు - విజయాలు ఎన్ని విమర్శలున్నా, ఎన్ని వివాదాలొచ్చినా.. బండి సంజయ్ అధ్యాయం తెలంగాణ బీజేపీలో ఎప్పటికి మరిచిపోలేనిది. నిస్తేజంగా ఉన్న పార్టీకి ఒక ఊపును తీసుకొచ్చిన నాయకుడు బండి సంజయే. అది పాదయాత్ర అయినా, లేక పాత బస్తీ అయినా.. అధికార పార్టీ BRSతో సై అంటే సై అన్నట్టుగా సాగింది బండి ప్రయాణం. బండి సంజయ్‌కి ఆది నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) నుంచి మద్దతు ఉంది. RSS సపోర్ట్ కారణంగా.. బండి సంజయ్‌ని పదవులు వరించాయి. ఒకానొక దశలో కరీంనగర్ నుంచి ఎమ్మెల్యేగా ఓడిపోయిన సంజయ్.. కట్టెలమ్మిన చోటే.. పూలమ్మాలన్నట్టుగా లోక్ సభ ఎన్నికల్లో గెలిచి ఎంపీగా నిలిచారు. బక్కపలచని ఆహార్యం, పూర్తి మాస్ తరహాలో డైలాగ్ లు కమలనాథుల్లో ఓ కొత్త జోష్ నింపేందుకు ఆరంభంలో బండి సంజయ్ బాగా ప్రయత్నించారు. ఒకానొక దశలో కెసిఆర్ ను ఢీ కొట్టే నాయకుల్లో బండి సంజయ్ పేరు బలంగా నిలిచింది. Best moment of the day... pic.twitter.com/u8xaEeDOpL — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) July 3, 2022 వివాదాలు - విమర్శలు బండి సంజయ్ పై ఉన్న ప్రధాన విమర్శ నోటి దురుసు. తొందరగా మాట జారేయడం, దాన్ని వెనక్కి తీసుకోలేక.. ఇబ్బంది పడడం. ఆయనపై ఉన్న మరో ఆరోపణ నాయకత్వ లోపం. క్యాడర్ ను బాగా చూసుకుంటాడని మంచి పేరున్నా.. చుట్టున్న నేతలను కలుపుకుని పోలేడని అంటారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ పెద్ద తలకాయల్లో చాలా మందితో బండి సంజయ్ కు పొసగదని అంటారు. కొందరయితే బండి సంజయ్ ఉన్నంత కాలం బీజేపీ ఆఫీసుకు రానని శపథం పట్టారని చెప్పుకుంటారు. తన సహచర ఎంపీలయిన ధర్మపురి అరవింద్ తోనూ సంజయ్ కు సత్సంబంధాలు లేవు. బండి సంజయ్ ఉంటే ఇతర పార్టీల నుంచి నాయకులను తీసుకురావడం కష్టమన్నది మరికొందరి ఆరోపణ. అలాగే చాలా నియోజకవర్గాల్లో ఒక బలమైన నేతను పార్టీ కోసం నిలపలేకపోయారంటారు. ఇప్పటికీ చాలా చోట్ల ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరో ఎవరికి తెలియదు. బండి సంజయ్ కు ఉన్న మరో బలహీనత కార్పోరేట్ పాలిటిక్స్ అలాగే ఢిల్లీ పాలిటిక్స్ గురించి పూర్తి ఔపాసన పట్టకపోవడం. మాస్ లీడర్ గా ఎదిగే క్రమంలో క్లాస్ ను మరిచిపోవడం వల్ల బండి సంజయ్ పడ్డ కష్టానికి సరైన ఫలితం దక్కలేదంటారు ఆ పార్టీ నాయకులు. Old - బండెనక బండి గట్టి, పదహారు బండ్లు గట్టి యే బండ్లే బోతవ్ కొడుకో... నైజాము సర్కరోడా New - బండెనక బండి గట్టి, 600 బండ్లు గట్టి యే రాష్ట్రానికి బోతవ్ కొడుకో... నయా నైజాము సర్కరోడా This is a Drunk and Drive Sarkar. KCR’s son #TwitterTillu is driving the car rashly and BRS party… pic.twitter.com/Q2Ih7MKoi5 — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 29, 2023 బండి ప్రస్థానం బండి సంజయ్ తండ్రి ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఒకటో తరగతిలో సరస్వతి శిశుమందిర్ లో సంజయ్ ను చేర్పించాడు, అక్కడే ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవాడు ఆర్ఎస్ఎస్లో ఘటన్ నాయక్‌గా, ముఖ్య శిక్షక్‌గా ప్రాథమిక విద్యా స్థాయిలోనే పనిచేశాడు. అద్వానీ రథయాత్ర నిలిచిపోయినప్పుడు బండి సంజయ్‌ను ఢిల్లీ సెంట్రల్ ఆఫీస్‌లో సహాయక్‌గా నియమించారు బండి సంజయ్ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)లో కరీంనగర్ పట్టణ కన్వీనర్, పట్టణ ఉపాధ్యక్షునిగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగానూ బాధ్యతలు నిర్వర్తించాడు. 1994-2003 మధ్య ది కరీంనగర్ కో-ఓపరేటివ్ అర్బన్ బ్యాంక్‌లో రెండు పర్యాయాలు డైరెక్టర్‌గా పనిచేశాడు భారతీయ జనతా యువమోర్చా కరీంనగర్ పట్టణ ప్రధాన కార్యదర్శి, పట్టణ అధ్యక్షునిగా, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, రాష్ట్ర ఉపాధ్యక్షునిగా, నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్‌గా, జాతీయ కార్యదర్శిగా పని చేశాడు. భారతీయ జనతా పార్టీ కేరళ, తమిళనాడు ఇంచార్జిగా బాధ్యతలు నిర్వహించాడు. 2005 లో కరీంనగర్ 48వ డివిజన్ నుండి బిజెపి కార్పొరేటర్ గెలిచాడు రెండు పర్యాయాలు కరీంనగర్ బిజెపి అధ్యక్షునిగా పనిచేశాడు. 2014 సాధారణ ఎన్నికల్లో కరీంనగర్ శాసనసభ బిజెపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యాడు 2018లో అసెంబ్లీ ఎన్నికలో కరీంనగర్ నుంచి పోటీ చేసి గంగుల కమలాకర్ చేతిలో ఓడిపోయాడు 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో అదే కరీంనగర్ నుంచి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్‌పై 89508 ఓట్ల మెజారిటీతో గెలిచాడు. 2020 మార్చి 11న తెలంగాణ బీజేపీకి అధ్యక్షుడయ్యారు 2023 జులై 4న తెలంగాణ బీజేపీకి అధ్యక్ష పదవికి హైకమాండ్ ఆదేశాలతో రాజీనామా చేశారు Mr. #TwitterTilluపోరాటం పుట్టిందే ఈ గడ్డలో.... అందరూ కలిసి పోరాడితేనే పుట్టింది ఈ రాష్ట్రంఒక్కడి వల్ల రాలేదు తెలంగాణ - అందరూ ఒక్కటైతే వచ్చింది తెలంగాణమీ నాయన వల్ల రాలేదు తెలంగాణ - ఒకడి అబ్బ సొత్తు కాదు తెలంగాణఅధికార అహంకారం ఎక్కువై అమరుల త్యాగాలను కించపరిస్తే సహించదు…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 16, 2023 -
బండికి 100 కోట్లు ఎక్కడివి?
సాక్షి, న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా బీజేపీ అధిష్టానం తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు..సోమవారం పార్టీ కేంద్ర, రాష్ట్ర నాయకత్వాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో పాటు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా లక్ష్యంగా పదునైన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ పత్రికల్లో రూ.100 కోట్ల విలువైన యాడ్లు ఇచ్చారని, అసలు భార్య పుస్తెలమ్మి ఎన్నికల్లో పోటీ చేసిన ఆయనకు అన్ని డబ్బులు ఎక్కడివని నిలదీశారు. రెండు, మూడేళ్లయినా పార్టీలో పదవులను భర్తీ చేయడంలో రాష్ట్ర అధ్యక్షుడు విఫలమయ్యారని విమర్శించారు. పార్టీ అధ్యక్షుడి మార్పు విషయమై వస్తున్న కథనాలు వాస్తవమేనని చెప్పారు. పార్టీ జాతీయ అధ్యక్షుడికి ఏయే పదవులు ఖాళీగా ఉన్నాయో కూడా తెలియదని విమర్శించారు. పార్టీకి ఎల్పీ నేత లేరన్న విషయమూ నడ్డాకు తెలియదన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీని గెలిపిస్తానన్న అమిత్ షా గెలిపించలేకపోయారని ధ్వజమెత్తారు. దుబ్బాకలో తనను చూసి ఓట్లేశారు తప్పితే.. పార్టీ గుర్తును చూశో, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్ ఛుగ్‌ను చూశో కాదని స్పష్టం చేశారు. తాను కోరిన పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వకుంటే తన దారి తనదేనని అల్టిమేటమ్ ఇచ్చారు. కిషన్‌రెడ్డిని కలిసిన కొద్ది సేపట్లోనే .. రానున్న ఎన్నికల దృష్ట్యా పార్టీలో మార్పుచేర్పులపై బీజేపీ జాతీయ నాయకత్వం ఫోకస్ పెంచిన నేపథ్యంలో పార్టీ పెద్దలతో భేటీ అయ్యేందుకు రఘునందన్‌రావు ఆదివారం రాత్రి ఢిల్లీకి వచ్చారు. సోమవారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిశారు. 3 గంటల సమయంలో కిషన్‌రెడ్డి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లోనూ ఆయన పక్కనే కూర్చున్నారు. ఆ తర్వాత కొద్ది సేపటికి అక్కడే ఉన్న మీడియాతో ఆయన చిట్‌చాట్ చేశారు. అధ్యక్షుడి మార్పు విషయంలో వస్తున్న కథనాలన్నీ వాస్తవమేనని, సంజయ్‌ను మార్చేందుకే అధిస్టానం నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఈ విషయంలో సంజయ్‌ది స్వయంకృతాపరాధం అన్నారు. ‘పార్టీల ఇన్చార్జిలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్‌ల ఫొటోలు పెట్టి రూ.100 కోట్లతో పత్రికల్లో యాడ్లు వేశారు. పార్టీ కోసం పనిచేస్తున్న నా ఫోటోనో, ఈటల రాజేందర్ ఫొటోనో వేయలేదు. తరుణ్ఛుగ్నో, బన్సల్‌ను చూసి ప్రజలు ఓట్లేయరు కదా..’అని రఘునందన్ ప్రశ్నించారు. జాతీయ అధ్యక్షుడికే తెలియదంటే ఎలా..? పార్టీ శాసనభా పక్షనేత పదవి రెండేళ్లుగా ఖాళీగా ఉన్నా దానిపై బండి సంజయ్ నిర్ణయం తీసుకోలేక పోయారని, ఈ విషయమై నడ్డాను అడిగితే.. ’అవునా..నిజమా’అంటూ తననే ప్రశ్నించారని రఘునందన్ తెలిపారు. ‘పదవుల నియామకంపై పార్టీ జాతీయ అధ్యక్షుడికే తెలియకుంటే ఎలా? అట్లుంది పార్టీ పరిస్థితి..’అంటూ వ్యాఖ్యానించారు. జీహెచ్ఎంసీ ఫ్లోర్‌లీడర్ విషయంలోనూ నాన్చుడు ధోరణినే అవలంబించారని, చివరకు ఫ్లోర్ లీడర్ పదవి అడిగిన కార్పొరేటర్ చనిపోయినా, ఇంతవరకు దానిపై నిర్ణయమే లేదని విమర్శించారు. పదేళ్లుగా కష్టపడుతున్నా.. పార్టీ కోసం పదేళ్లుగా కష్టపడుతున్నానని రఘునందన్ అన్నారు. మధ్యలో వచ్చిన నేతలు పదవులకు పనికొస్తారు కానీ నేను పనికిరానా? అని ప్రశ్నించారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి తాను సైతం అర్హుడనేనని అన్నారు. తనకు రాష్ట్ర అధ్యక్ష పదవి, జాతీయ అధికార ప్రతినిధి పదవి, శాసనసభాపక్ష నేత పదవుల్లో ఏదో ఒకటి ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే తన దారి తనదేనంటూ వ్యాఖ్యానించారు. కీలక పదవులకు తనకు కులమే శాపంగా పరిణమించిందని ఆవేదన చెందారు. సేవలకు ప్రతిఫలం దక్కకుంటే నడ్డాపై ప్రధాని మోదీకి ఫిర్యాదు చేస్తానని అన్నారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేక పోయారు.. దుబ్బాక ఉప ఎన్నికల్లో తాను పూర్తిగా సొంత బలంతోనే గెలిచానని రఘునందన్ చెప్పారు. ‘దుబ్బాకలో నేను స్వయంశక్తితో గెలిచా. నాకు ఎవరూ సహాయం చేయలేదు. ఇక్కడ పార్టీ గుర్తు చివరి అంశమే. మళ్లీ నా సొంత బలంతోనే దుబ్బాకలో గెలుస్తా’అని స్పష్టం చేశారు. తన గెలుపు తర్వాతే ఈటల పార్టీలోకి వచ్చారని గుర్తు చేశారు. మునుగోడు ఉప ఎన్నికల అంశాన్ని ప్రస్తావిస్తూ.. ఈ ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి భుజంపై చేయి వేసి మరీ నేను గెలిపిస్తానని అమిత్‌షా ప్రకటించారని, కానీ గెలిపించలేకపోయారని విమర్శించారు. రూ.100 కోట్లు ఖర్చు చేసినా గెలవలేకపోయారని అన్నారు. -
వ్యాగన్ల తయారీ కేంద్రంగా కాజీపేట
సాక్షిప్రతినిధి, వరంగల్: తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఎంత సహకారం అందిస్తున్నా.. రాష్ట్ర సర్కారు తప్పుడు ప్రచారం చేస్తూ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి జి.కిషన్‌రెడ్డి విమర్శించారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ అభివృద్ధికే ఎక్కువ నిధులు ప్రాజెక్టులు కేటాయిస్తున్నామని చెప్పారు. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ వరంగల్‌కు రానున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, జాతీయ నాయకులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్‌రెడ్డి తదితరులతో కలిసి ఆదివారం ఆయన నగరంలో పర్యటించారు. కాజీపేట అయోధ్యపురంలో పీఓహెచ్, వ్యాగన్ల తయారీ కేంద్ర నిర్మాణ ప్రాంతం, బహిరంగ సభ జరిగే ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానాన్ని సందర్శించారు. ఎస్వీ కన్వెన్షన్ హాల్లో మోదీ విజయసంకల్ప సభ సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరిత కాకతీయ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బండి సంజయ్ తదితరులతో కలిసి కిషన్‌రెడ్డి మాట్లాడారు. ‘బయ్యారం’ఏమైందో కేసీఆర్ చెప్పాలి.. కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వివిధ కారణాలతో సాధ్యం కాలేదని, దీంతో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్‌తో పాటు అదనంగా వ్యాగన్ ఉత్పత్తి కేంద్రం కూడా ఏర్పాటు చేయాలని ప్రధాని ఆదేశించారని కిషన్‌రెడ్డి చెప్పారు. ఈ నెల 8వ తేదీలోగా దీనికి భూమి కేటాయింపు కూడా పూర్తవుతుందన్నారు. కాగా సుమారు రూ.5,587 కోట్ల వ్యయంతో వరంగల్‌ను కలిపే, పలు జాతీయ రహదారులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారని తెలిపారు. బయ్యారం ఉక్కు కర్మాగారాన్ని కేంద్రం ఏర్పాటు చేయకున్నా.. రాష్ట్రం ఏర్పాటు చేస్తుందని ఎన్నికలకు ముందు ఇచి్చన హామీ ఏమైందో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ బాధ్యత కేసీఆర్, కల్వకుంట్ల ఫ్యామిలీదేనని స్పష్టం చేశారు. దేశంలోనే తొలిసారిగా ఔటర్ రింగ్ రైలు.. తెలంగాణలోని పలు జిల్లాలను కలుపుతూ 340 కిలోమీటర్ల మేర హైదరాబాద్ రీజినల్ రింగ్ రోడ్డును నిర్మిస్తున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. ఇందుకు రూ.26 వేల కోట్ల మేరకు ఖర్చవుతుందని చెప్పారు. ట్రిపుల్ ఆర్కు అనుసంధానంగా దేశంలో తొలిసారిగా హైదరాబాద్‌కు ఔటర్ రింగ్ రైలు ప్రాజెక్టు రానుందని తెలిపారు. ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు వెళ్లే రైల్వే లైన్లకు ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్ ఉపయోగకరంగా ఉంటుందని, సిటీకి రాకుండా సరిహద్దుల నుంచే గమ్యస్థానాలకు వెళ్లవచ్చని పేర్కొన్నారు. రింగ్ రైలు ప్రాజెక్టు వివరాలను రాష్ట్ర ప్రభుత్వానికి అందించామని, భూసేకరణ పూర్తయితే వెంటనే పనులు మొదలు పెడతామని వివరించారు. అధ్యక్షుడి మార్పుపై ఎవరైనా చెప్పారా..? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుపై జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు కిషన్‌రెడ్డి నేరుగా స్పందించకుండా జవాబు దాటవేసే ప్రయత్నం చేశారు. ‘అధ్యక్ష మార్పు ఉంటుందని ఎవరైనా మీకు చెప్పారా.. అందరం వేదికపై కలిసే ఉన్నాముగా.. ఇంతకంటే క్లారిటీ ఏముంటుంది.. అలాంటిదేమీ లేదు’అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ కిరాణ దుకాణం లాంటిది.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ అంటేనే ద్రోహం, కుట్రలకు ప్రతిరూపమని బండి సంజయ్ ధ్వజమెత్తారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా ప్రజల దృష్టిని మళ్లించేందుకు దుష్ట రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి కట్టుబడి ఉన్నా కేసీఆర్ మాత్రం సహకరించడం లేదన్నారు. తెలంగాణలో అభివృద్ధి జరిగితే బీజేపీకి ఎక్కడ పేరొస్తుందో అన్న భయంతోనే సహకరించకుండా ప్రజలకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ కిరాణ దుకాణం లాంటిదని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ లేదని, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయేనని సంజయ్ చెప్పారు. బీజేపీ ఆధ్వర్యంలో ఈ నెల 8న హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో 15 లక్షల మంది జనంతో కనీవినీ ఎరగని రీతిలో సభ నిర్వహించనున్నామని తెలిపారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు ఈటల రాజేందర్, ఏపీ జితేందర్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, మాజీ మంత్రులు మర్రి శశిధర్ రెడ్డి, జి.విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి.ప్రేమేందర్ రెడ్డి, బంగారు శ్రుతి, హనుమకొండ, వరంగల్, కరీంనగర్ జిల్లాల అధ్యక్షులు రావు పద్మ, కొండేటి శ్రీధర్, గంగాడి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ అధ్యక్షుడిగా వస్తానో.. లేదో?
హనుమకొండ: హనుమకొండలో ఈనెల 8న జరిగే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో వస్తానో.. లేదో.. అని బండి సంజయ్‌కుమార్ వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బహిరంగ సభకు జన సమీకరణపై ఆదివారం సాయంత్రం హనుమకొండలో సమావేశం జరిగింది. అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారంటూ ప్రచారం జరుగుతోందని.. వాస్తవమేనా? అని బండి సంజయ్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా ఆయన పై విధంగా వ్యాఖ్యానించారు. బండి వల్లే రాష్ట్రంలో బీజేపీ గ్రామీణ స్థాయి వరకు విస్తరించిందని.. ఆయన పోరాట స్ఫూర్తితోనే గ్రామాల్లో అధికార పార్టీ నాయకుల అరాచకాలను ఎదుర్కొనగలుగుతున్నాం.. ప్రజల్లో గౌరవం పెరిగింది అని కార్యకర్తలు స్పష్టం చేశారు. మీరే అధ్యక్షుడిగా కొనసాగాలి.. అని కన్నీటి పర్యంతమయ్యారు. మీ కష్టం వృథా కాదు.. భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు మీకే ఉంటాయి.. అని కార్యకర్తలు బండి సంజయ్‌కుమార్‌కు బాసటగా నిలిచారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యమని, ప్రధాని మోదీ పాల్గొనే బహిరంగ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ కార్యకర్తలకు చెప్పారు. -
మనసున్న కేసీఆర్‌ను మూడోసారి సీఎం చేద్దాం
సిరిసిల్ల: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తొమ్మిదేళ్ల పాలనలో అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు వచ్చాయని మంత్రి కేటీ రామారావు చెప్పారు. కరోనాతో రూ.లక్ష కోట్ల నష్టం వచ్చినా కల్యాణలక్ష్మి ఆగలేదని, ఆసరా పెన్షన్లు, రైతుబంధు, ఉచిత కరెంట్ ఇచ్చామని తెలిపారు. దివ్యాంగుల సంక్షేమానికి కృషి చేస్తున్నామని, దేశంలో ఆసరా పెన్షన్లు అధికంగా ఇచ్చే ప్రభుత్వం మనదేనని అన్నారు. ఇలాంటి మనసున్న కేసీఆర్‌ను మూడోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని చెప్పారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గోరింట్యాలలో అదనపు తరగతి గదులు, ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జెడ్పీ హైస్కూల్ కాంప్లెక్స్, సిరిసిల్లలో వాలీబాల్ అకాడమీని మంత్రి ప్రారంభించారు. దివ్యాంగులకు ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మనసున్న ముఖ్యమంత్రి కాబట్టే.. ‘మనసున్న ముఖ్యమంత్రి కాబట్టి కేసీఆర్ దివ్యాంగుల సంక్షేమానికి బాటలు వేస్తున్నారు. దివ్యాంగులకు పక్కనే ఉన్న ఛత్తీస్‌గఢ్‌లో రూ.200, కర్ణాటక లో రూ.1,100, మహారాష్ట్రలో రూ.300, ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో రూ.600 పెన్షన్ ఇస్తుంటే..మన రాష్ట్రంలో మాత్రం రూ.3,0 16 చొప్పున చెల్లిస్తున్నాం. వచ్చే నెలనుంచి రూ.4,0 16 ఇస్తాం. గుజరాత్లో 47 వేల మంది దివ్యాంగులకు పెన్షన్ ఇస్తున్నారు. అదే మన రాష్ట్రంలో 5.15 లక్షల మందికి ఇస్తున్నాం. వారి సంక్షేమానికి రూ.1,800 కోట్లు వెచ్చించాం. ఉద్యోగాల్లో 4%, డబుల్ బెడ్రూం ఇళ్లలో 5% రిజర్వేషన్లు కల్పించాం. ఇలా ఆసరా కల్పించడం తప్పని, ఆర్థిక వ్యవస్థ దెబ్బ తింటుందని ప్రధాని మోదీ చెబుతున్నారు. బడా వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు మాఫీ చేయడం మాత్రం మంచిదట. ఎవరేం అన్నా..ఇంకా సదరం సర్టిఫికెట్ రాని వారికి, అర్హత ఉండి పెన్షన్ రాని వాళ్లను గుర్తించి వారికి కూడా పింఛన్లు ఇస్తాం..’ అని కేటీఆర్ తెలిపారు. బండి సంజయ్ అరపైసా సాయం చేయలే.. ‘ఎంపీ బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కేంద్రంలో ఆ పార్టీ అధికారంలో ఉన్నా అరపైసా సాయం చేయలేదు. ఒక్క నవోదయ పాఠశాల, మెడికల్ కాలేజీ అయినా, సిరిసిల్లకు మెగా పవర్లూమ్ క్లస్టర్, కరీంనగర్‌కు ట్రిపుల్ ఐటీ అయినా తేలేదు. కానీ కాళ్లళ్ల కట్టెలు పెడుతు న్నారు..’ అని విమర్శించారు. ఈ కార్యక్రమాల్లో ప్రణాళికా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.వినోద్ కుమార్, ఎమ్మెల్సీ రఘోత్తమరెడ్డి, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, పలు సంస్థల చైర్మన్లు, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. మన పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలి ‘గంభీరావుపేటలో కేజీ టూ పీజీ స్కూల్ రాష్ట్రానికి ఆదర్శమైంది. అక్కడ ప్రభుత్వ హాస్టళ్లను కూడా ప్రారంభిస్తాం. విద్యతోనే వికాసం..విజ్ఞానం. ఒకతరం చదువుకుంటే ఇక వెనక్కి చూడాల్సిన పని ఉండదు. ప్రపంచంతో పోటీపడే స్థాయికి ఎదగాలి. జిల్లాలోని 60 స్కూళ్లలో ఆరు నుంచి పదో తరగతి వరకు పిల్లలకు కంప్యూటర్ బేసిక్స్ నేర్పిస్తున్నాం. ఈ నైపుణ్య శిక్షణ విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా సర్కారు స్కూళ్లలో అమలు చేస్తాం. బాలి కలకు ఆత్మరక్షణ కార్యక్రమాలు అన్ని పాఠశా లల్లో నిర్వహిస్తాం..’ అని మంత్రి చెప్పారు. -
పవర్లోకి వస్తామని కాంగ్రెస్ పగటి కలలు
సాక్షి, హైదరాబాద్, సాక్షి, నాగర్‌కర్నూల్, కొత్తపల్లి (కరీంనగర్): తెలంగాణలో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ నాయకులు పగటి కలలు కంటున్నారని, అప్పుడే గాలిలో మేడలు కడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో జరిగిన వివిధ ఉప ఎన్నికలతో పాటు జీహెచ్ఎంసీ, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైన విషయాన్ని వారు సులభంగా మరిచిపోయినట్టు ఉన్నారని ఎద్దేవా చేశారు. టీపీసీసీ అంటే టెయింటెడ్ పొలిటీషియన్స్ ఆఫ్ క్రైమ్ అండ్ కరప్షన్.. అని విమర్శించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్ని సామాజిక భద్రతా పథకాలను కొనసాగిస్తామని స్పష్టం చేశారు. గతంలోని లోటుపాట్లను తొలగించి మరింత మెరుగ్గా అవి అమలయ్యేలా ప్రజలకు ప్రయోజనం చేకూరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ మేరకు ఆదివారం ట్విట్టర్ వేదికగా సంజయ్ ట్వీట్ చేశారు. ఇప్పటికే ధరణి, సంక్షేమ పథకాలు, పెన్షన్లు వంటి వాటిపై రాష్ట్ర ప్రజల్లో అనిశ్చితి, అయోమయం రేకెత్తించే ప్రయత్నాల్లో కాంగ్రెస్ నిమగ్నమైతే... మరోవైపు బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రాకపోతే సంక్షేమ పథకాలు రద్దవుతాయంటూ సీఎం కేసీఆర్ ప్రజల్లో అలజడి సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నారని సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్వేలోనే బీఆర్ఎస్కు 30 స్థానాలు కేసీఆర్ నిర్వహించిన సర్వేలోనే బీఆర్ఎస్కు 30 స్థానాలకు మించి రావని తేలిపోయిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ గెలవాలనే సీఎం కేసీఆర్ కోరుకుంటున్నారని సంజయ్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే చెప్పారని గుర్తుచేశారు. గుంట నక్కలే గుంపులుగా వస్తాయని, బీజేపీ సింగిల్‌గానే పోటీ చేస్తుందని బండి స్పష్టం చేశారు. బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్‌లో భాగంగా కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం బద్దిపల్లిలో ఆదివారం టిఫిన్ బైటక్లో బండి సంజయ్ పాల్గొన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ :రాష్ట్ర అభివృద్ధిపై సీఎం కేసీఆర్ శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మహిళా దుస్తులపై రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్పందించిన తీరు అవమానకరమన్నారు. -
బీజేపీ అధ్యక్షుడు మార్పు.. క్లారిటీ ఇచ్చిన రాష్ట్ర ఇన్చార్జి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర పార్టీ ఇన్చార్జి తరుణ్‌చుగ్ స్పష్టం చేశారు. నాయకులందరూ ఒకే తాటిపై ఉన్నారనీ తామంతా కలిసికట్టుగానే ఉన్నామని తెలిపారు. బుధవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ మార్పు ఉంటుందా అన్న ప్రశ్నకు ఆయన బదులిస్తూ.. సంజయ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులను నియమించామని, ఇక అధ్యక్షుడి మార్పు ఎక్కడిదని ఎదురు ప్రశ్నించారు. తుపాను ప్రభావం అనేక రాష్ట్రాలపై పడే అవకాశాలుండడంతో గురువారం కేంద్రమంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడిందని చెప్పారు. ఖమ్మంలో అమిత్ షా బహిరంగ సభను కూడా వాయిదా వేశామన్నారు. మళ్లీ అమిత్ షా రాష్ట్ర పర్యటన ఖరారు చేసి, ఖమ్మం సభకు సంబంధించిన వివరాలు కూడా త్వరలోనే ప్రకటిస్తామని తరుణ్‌చుగ్ తెలిపారు. త్వరలో ఖమ్మంలోనే అమిత్ షా సభ: బండి సంజయ్ త్వరలోనే ఖమ్మంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ సభ నిర్వహించడం ఖాయమని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. బుధవారం సంజయ్ మీడియాతో మాట్లాడుతూ అనివార్య కారణాల వల్ల ఈ సభ రద్దుతో కార్యకర్తలెవరూ నిరాశ పడొద్దని చెప్పారు. గుజరాత్, మహారాష్ట్రలలో తుపాను పరిస్థితుల కారణంగా అమిత్ షా 24 గంటలూ పర్యవేక్షించాల్సి ఉన్నందున ఈ సభకు రాలేకపోయారని తెలిపారు. -
25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు
కుత్బుల్లాపూర్: అధికార బీఆర్ఎస్కు చెందిన 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని, తమ పార్టీలో చేరేందుకు మంతనాలు జరుపుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంలో బుధవారం గాజులరామారంలో మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలంగౌడ్ ఆధ్వర్యంలో జరిగిన బహిరంగ సభకు పార్టీ రాష్ట్ర ఇంచార్జి తరున్చుగ్, బండి సంజయ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్‌లు మిలాఖత్ అయ్యాయని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో 30 మంది బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు గెలవరని తెలుసుకున్న కేసీఆర్... కాంగ్రెస్ పార్టీకి చెందిన 30 మంది అభ్యర్థులకు డబ్బులు వెచ్చించాలని భావిస్తూ ఇప్పుడే కుట్రలకు తెర లేపారని విమర్శించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను కూకటి వేళ్లతో పెకిలించే సత్తా ఒక్క బీజేపీకే ఉందన్నారు. కేసీఆర్ ఎలాగైనా రాష్ట్రంలో తిరిగి అధికారం చేపట్టేందుకు మోసపూరిత హామీలు ఇస్తున్నారని ధ్వజమెత్తారు. దేశం కోసం.. ధర్మం కోసం.. సమాజం కోసం పనిచేసే ఏకైక పార్టీ బీజేపీ అని, తెలంగాణ రాష్ట్రంలో నిజాం, రజాకార్ల పాలనను అంతమొందించేందుకు రాష్ట్ర ప్రజలు బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. బహిరంగ సభలో ఎంపీ డాక్టర్ లక్ష్మణ్, మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్, పార్టీ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షుడు మల్లారెడ్డి, మేడ్చల్ అర్బన్, రూరల్ జిల్లాల అధ్యక్షులు హరీష్‌రెడ్డి, విక్రమ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైతుల చేతులకు సంకెళ్లు!
సాక్షి, యాదాద్రి: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) అలైన్మెంట్ మార్చాలని ఆందోళన చేసిన రైతులకు యాదాద్రి భువనగిరి పోలీసులు సంకెళ్లు వేయడం తీవ్ర వివాదానికి దారితీసింది. పోలీసుల తీరుపై రాజకీయ పార్టీల నేతలు, రైతు, ప్రజా సంఘాల ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నల్లగొండ జైల్లో ఉన్న రైతులను మంగళవారం భువనగిరి కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకు వచ్చే క్రమంలో వారి చేతులకు పోలీసులు సంకెళ్లు వేశారు. వాస్తవానికి ఆ రైతులకు సోమవారమే బెయిల్ వచ్చింది. అయినా పోలీసులు సంకెళ్లు వేసి తీసుకురావడంపై వారు కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకోవడంతో.. భువనగిరి మండలం రాయిగిరి గ్రామ రైతులు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని డిమాండ్ చేస్తూ చాలా రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ రోడ్డుతో తాము భూములను పూర్తిగా కోల్పోతున్నా మని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మే 30న భువనగిరి కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తుండగా.. అదే సమయంలో మంత్రి జగదీశ్‌రెడ్డి కలెక్టరేట్లో సమావేశం ముగించుకుని వెళ్తున్నారు. ధర్నా చేస్తున్న రైతులు మూకుమ్మడిగా వెళ్లి మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. పోలీసులు వారిని చెద రగొట్టారు. అదే రోజు భువనగిరి రూరల్ పోలీసులు ఆరుగురు రైతులపై కేసు నమోదు చేశారు. రాత్రికల్లా గడ్డమీద మల్లేశ్ (ఏ1), పల్లెర్ల యాదగిరి (ఏ2), అవిశెట్టి నిఖిల్ (ఏ3), మల్లెపోయిన బాలు (ఏ4) అనే నలుగురు రైతులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఏ5 తంగళ్ళపల్లి రవికుమార్, ఏ6 గూడూరు నారాయణరెడ్డి (బీజేపీ నేత)లు పరా రీలో ఉన్నట్టుగా చూపించారు. తొలుత భువనగిరి సబ్ జైలుకు తరలించిన నలుగురు రైతులను.. వారికి రాజకీయ నాయకుల పరామర్శలు అధికం కావడంతో శాంతిభద్రతల సమస్యను కారణంగా చూపుతూ 4న నల్లగొండ జైలుకు తరలించారు. బెయిల్ ప్రక్రియ ఆలస్యం కావడంతో.. రిమాండ్‌లో ఉన్న నలుగురికి సోమవారం భువన గిరి జిల్లా కోర్టులో కండిషనల్ బెయిల్ మంజూరైంది. అయితే బెయిల్ ప్రక్రియలో జాప్యం కావడంతో వారి విడుదల ఆలస్యమైంది. అయితే సోమవారా నికి 14 రోజుల రిమాండ్ పూర్తి కావడంతో మంగళ వారం ఉదయమే భువనగిరి కోర్టులో హాజరుపర్చ డానికి తీసుకువచ్చారు. కోర్టు ముందువరకు సంకెళ్లు వేసి రైతులను వాహనంలో తీసుకువచ్చిన పోలీసులు.. వారిని జడ్జి ముందు హాజరుపరిచి తిరిగి పోలీస్ వాహనంలో ఎక్కించుకునిపోయే క్రమంలోనూ బేడీలు వేయడంతో వివాదం తలెత్తింది. తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ఇలావుండగా ఈ రైతులు మంగళవారం సాయంత్రం నల్లగొండ జైలు నుంచి బెయిల్‌పై విడుదలయ్యారు. కళ్లల్లో నీళ్లు తిరిగాయి: ఎంపీ కోమటిరెడ్డి సాక్షి, హైదరాబాద్: రైతులకు బేడీలు వేయడం చూసి తన కళ్లల్లో నీళ్లు తిరిగాయని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రాష్ట్ర రైతాంగాన్ని అవమానపర్చడమేనని, అన్నం పెట్టే రైతులకు సంకెళ్లు వేయడం కేసీఆర్ నిరంకుశ పాలనకు నిదర్శనమని చెప్పారు. దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా?: బండి సంజయ్ రైతులకు బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వారికి న్యాయం చేయాల్సింది పో యి దొంగలు, రౌడీల మాదిరిగా బేడీలు వేస్తారా? అని మండిపడ్డారు. కాగా రైతులేమైనా తీవ్రవాదులు, రేపిస్టులు, బందిపోట్లా? సంకెళ్లు వేసి తీసుకెళ్ల డానికి.. అని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలావుండగా రైతుల దగ్గర ఏకే 47 తుపాకులున్నాయని సంకెళ్లు వేశారా? అని కాంగ్రెస్ నేత వీహెచ్ ప్రశ్నించారు. న్యాయం చేయమని ప్రాధేయపడితే సంకెళ్లు వేస్తారా? నల్లగొండ క్రైం: న్యాయం చేయమని ప్రాధేయ పడితే సంకెళ్లు వేశారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జైలు నుంచి విడుదల అయిన తర్వాత వారు మీడియాతో మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ మార్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రజా ప్రతినిధులను అడిగిన ప్పటికీ ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టు కాల్వ కోసం, వరంగల్ రహదారి కోసం, హైటెన్షన్ విద్యుత్ లైన్ కోసం మూడు దశలుగా ఇప్పటికే తమ భూములు త్యాగం చేశామని, ఇప్పుడు మళ్లీ ఆర్ఆర్ఆర్కు భూములు ఇవ్వాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారని చెప్పారు. ఉన్న కొద్దిపాటి భూమి కూడా పోతే తమ కుటుంబాల భవిష్యత్ అంధకారమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. -
ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది: కల్వకుంట్ల కవిత
సాక్షి, హైదరాబాద్: ట్విటర్ వేదికగా బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ కుమార్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని, కానీ, ఇంటి బిడ్డకు(కవితను ఉద్దేశించి..) అన్ని విధాల అండగా ఉంటావంటూ కేసీఆర్‌పై ట్వీట్లో బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. దీనికి సోషల్ మీడియా వేదికగానే కవిత కౌంటర్ ట్వీట్ చేశారు. పార్లమెంట్ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, మహిళా రెజ్లర్ల ఉద్యమాన్ని పట్టించుకోకపోగా.. బీజేపీ ఎంపీపై బ్రిజ్‌పై చర్యలు తీసుకోకపోవడం, సిలిండర్ల ధరలు పెంచడం.. ఇలా ప్రతీ అంశాన్ని లేవనెత్తి కౌంటర్ ట్వీట్ చేశారామె. గవర్నర్ కు దక్కదు గౌరవం. ఆడబిడ్డలకు లేదు అండ. గిరిజన మహిళలపై పోలీస్ గిరీ. బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం. ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం. అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం నినాదాలకే పరిమితమైన భేటీ బచావో... భేటీ పడావో సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం ఆడబిడ్డ తలుచుకుంది ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది అంటూ కౌంటర్ ట్వీట్ చేశారామె. పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం… https://t.co/V05XeA3vR5 — Kavitha Kalvakuntla (@RaoKavitha) June 13, 2023 -
వేడి రాజుకుంది.. తెలంగాణ బీజేపీలో ఆసక్తికర పరిణామాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. త్వరలోనే పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్ నియామకం, ఇతర మార్పులు జరగనున్నాయనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం సమావేశమైన సీనియర్ నేతలు కొందరు ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకంతో పాటు రాష్ట్ర అధ్యక్షుడి మార్పు వంటి అంశాలపై అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు తమ అభిప్రాయాన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్లు సమాచారం. వారం క్రితం ‘అసంతృప్తి’ సెగ దాదాపు వారం రోజుల క్రితం కొందరు అసంతృప్త నేతలు సమావేశమై, సీనియర్లమైన తమకు పార్టీలో తగిన ప్రాధాన్యత, గుర్తింపు లభించడం లేదని, పార్టీ ముఖ్యనేత ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తూ పార్టీకి నష్టం చేస్తున్నారని ధ్వజమెత్తారు. నేతల మధ్య సమన్వయం కొరవడటం లాంటి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జాతీయ నాయకత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ కమిటీల్లో మార్పులు, బండి సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి, ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకం అనే ప్రచారం జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం రాత్రి మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీలో మార్పులపై జరుగుతున్నది ప్రచారం మాత్రమేనని అన్నారు. తాను పార్టీ కోసం కమిట్మెంట్తో కష్టపడి పనిచేస్తానని, బీజేపీలో ఏ పదవీ శాశ్వతం కాదని, నాయకత్వం ఏ నిర్ణయం తీసుకున్నా పాటించేందుకు బిస్తర్ రెడీగా పెట్టుకున్నానంటూ వ్యాఖ్యానించారు. తాజాగా అనుకూల వర్గం భేటీ.. ఆదివారం పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో జాతీయ కార్యవర్గసభ్యులు జి.వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, మాజీ ఎంపీలు రవీంద్రనాయక్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, డా.బూర నర్సయ్యగౌడ్, డా.విజయ రామారావు, సుద్దాల దేవయ్య, సీహెచ్ విఠల్, రచనారెడ్డి తదితరులు పాల్గొన్నారు. బండి సంజయ్‌కు అనుకూల వర్గంగా భావిస్తున్న ఈ నేతలు.. ఇతర అంశాలతో పాటు రాష్ట్ర నాయకత్వ మార్పు, జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్‌ను రాష్ట్ర ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించడంపై ప్రధానంగా చర్చించినట్టు తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బండి సంజయ్‌ను మార్చొద్దని, ఈటలకు కీలక పదవి ఇవ్వొద్దంటూ అధిష్టానాన్ని గట్టిగా కోరాలని నిర్ణయించినట్లు సమాచారం. తాము కూడా ఉద్యమకారులమేనని, జాతీయ కార్యవర్గసభ్యులుగా ఉన్నామని, సీనియర్ నేతలైన తమకు తెలియకుండానే కీలక నిర్ణయాలు ఎలా తీసుకుంటారంటూ అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈటలకు ప్రాధాన్యత ఇవ్వడాన్ని వ్యతిరేకించడంతో పాటు, ఆయనకు కీలక పదవి ఇవ్వొద్దని, తాము ఆయన కంటే సీనియర్లమని, తమకు కూడా తగిన గుర్తింపునిచ్చే పదవులు ఇవ్వాలని అభిప్రాయ పడినట్లు సమాచారం. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న తమకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడం లేదని కొందరు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలన్నీ జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించినట్టు చెబుతున్నారు. తమతో కలిసి భోజనం చేసేందుకు రావాలనే ఆహ్వానంతో ఒక మాజీ ఎంపీ అక్కడకు వెళ్లగా, కొంతకాలంగా అంతగా చురుగ్గా లేని ఒకరిద్దరు నేతలు కూడా ఇదే విధమైన ఆహ్వానంతో అక్కడకు వెళ్లారని తెలుస్తోంది. అసలు ఆ పోస్టే ఉండదు.. బీజేపీలో ప్రచార కమిటీ చైర్మన్ అనే పదవి లేదని సమావేశానంతరం జితేందర్‌రెడ్డి మీడియాతో అన్నారు. ‘రాష్ట్ర నేతలతో చర్చించకుండా అధ్యక్షుడి మార్పుపై జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. పదవులు ఇచ్చే ముందు లీకులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో ఉండదు. దీనిపై సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో వస్తున్న లీకులను పార్టీ క్యాడర్ నమ్మొద్దు. బీజేపీ స్టేట్ చీఫ్‌ను మారుస్తున్నారని కేసీఆర్ లీకులు ఇప్పిస్తున్నారు. బీజేపీ బలం తగ్గిందని చెప్పడానికే కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. క్యాడర్‌ను కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి ప్రచారం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ బలంగా ఉంది. మాకు ఎలాంటి రహస్య అజెండా లేదు. బీజేపీ బలోపేతమే మాకు ముఖ్యం. పొంగులేటి, జూపల్లి కూడా బీజేపీలో చేరాలని కోరుతున్నా. శత్రువుకు శత్రువు.. మిత్రుడు అన్నట్టు కేసీఆర్‌ను కొట్టాలంటే పొంగులేటి, జూపల్లి బీజేపీ వైపు రావాలి..’ అని వ్యాఖ్యానించారు. భేటీపై స్పందించేందుకు ఈటల నిరాకరణ.. బీజేపీ సీనియర్ నేతలు ప్రత్యేకంగా భేటీ కావడంపై స్పందించేందుకు ఈటల రాజేందర్ నిరాకరించారు. ఇలాంటి వాటిపై తాను మాట్లాడనని, ఎలాంటి చిట్‌చాట్ చేయనని తన నివాసం వద్ద ఆయన మీడియాతో చెప్పారు. అధిష్టానం ఎలా స్పందిస్తుందో? సీనియర్ల భేటీ బీజేపీలో చర్చకు దారితీసింది. ఇది దేనికి సంకేతం? దీనిపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? సీనియర్ల అభ్యంతరాలను ఎలా తీసుకుంటుంది? ప్రచార కమిటీ చైర్మన్‌గా ఈటల నియామకంపై ఈ సమావేశం ఎఫెక్ట్ పడుతుందా? అనే దానిపై పార్టీ నేతల్లో ఆసక్తి నెలకొంది. మీడియా ద్వారా లీకులు సరికాదు: విజయశాంతి బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పుపై మీడియా ద్వారా లీకులు సరికాదని విజయశాంతి అన్నారు. బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యేవరకూ బండి సంజయ్ కొనసాగుతారని రాష్ట్రపార్టీ ఇన్చార్జి తరుణ్ చుగ్ గతంలో చెప్పారని గుర్తు చేశారు. ఇప్పటివరకు ఇదే అధికారిక ప్రకటన అని, ఊహాగానాలతో మీడియాలో వచ్చే కథనాలు అధికారిక ప్రకటనలు కావని స్పష్టం చేశారు. -
బండికి కేంద్రమంత్రి పదవి.. టీబీజేపీ చీఫ్‌గా డీకే అరుణ!
సాక్షి, ఢిల్లీ: రాబోయే రోజుల్లో ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఈ ఐదు రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా వర్గపోరుతో కేడర్‌ను అయోమయంలో నెట్టేసిన తెలంగాణ బీజేపీకి బూస్టింగ్ ఇచ్చే పనిలో తలమునకలైంది అధిష్టానం. నాయకత్వ మార్పు తప్పదనే ఊహాగానాల నడుమ.. వారం రోజులుగా ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నాయి బీజేపీ పార్టీ శ్రేణులు. వర్గపోరుకు చెక్ పెట్టేలా హస్తినలో ఆ పార్టీ అధిష్టానం పావులు కదుపుతోంది. క్యాడర్లో నెలకొన్న అయోమయాన్ని తొలగించడానికి.. మరీ ముఖ్యంగా ఎన్నికలు దగ్గర పడుతుండడంతో పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలను వేగవంతం చేసింది. ఈ క్రమంలో నాయకత్వంలో ప్రధాన మార్పులు చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. కీలక నేతలు అసంతృప్తికి లోనుకాకుండా చూసుకుంటూనే.. కేడర్‌ను పటిష్టంగా మార్చాలన్నది బీజేపీ అధిష్టానం అభిమతంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలైన డీకే అరుణకి.. బీజేపీ తెలంగాణ బీజేపీ చీఫ్ పగ్గాలు అప్పజెప్పాలని యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. జాబితాలో ఉన్న పలువురి పేర్ల పరిశీలన తర్వాతే ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది. అలాగే.. కరీంనగర్ ఎంపీ అయిన బండి సంజయ్(ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు)ని కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకోవాలని భావిస్తోందట. ఇక ఇప్పటికే ఈటల రాజేందర్‌కు ఎన్నికల ప్రచార సారథిగా బాధ్యతలు అప్పజెప్పగా.. ఆయన ఆల్రెడీ రంగంలోకి దిగి క్షేత్రస్థాయి పనులు మొదలుపెట్టారు కూడా. తద్వారా.. పార్టీని పటిష్టం చేయాలని బీజేపీ భావిస్తోంది. గత పక్షం రోజులుగా ఇక్కడి నుంచి నేతలు వరుసగా అక్కడికి వెళ్తుండడం.. వాళ్లతో మంతనాలు కొనసాగిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ క్రమంలోనే నాయకత్వ మార్పుపై సాధారణంగానే ఊహాగానాలు నడుస్తున్నాయి. ఈ నెల 15న ఖమ్మం లో అమిత్ షా పర్యటించనున్నారు. ఆ పర్యటనకు ముందే నాయకత్వ మార్పుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. -
పగ్గాల మార్పుకే మొగ్గు?.. తెలంగాణపై బీజేపీ హైకమాండ్ స్పెషల్ ఫోకస్..
సాక్షి, హైదరాబాద్: కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. అక్కడి తప్పులు రాష్ట్రంలో పునరావృతం కాకుండా చేపట్టాల్సిన కార్యాచరణపై కసరత్తు ప్రారంభించింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తర్జనభర్జన పడుతోంది. రాష్ట్ర పార్టీలో సంస్థాగత మార్పుల దిశగా అధిష్టానం ఆలోచన చేస్తోందనే ప్రచారం జోరుగా సాగుతోంది. పలు కమిటీల్లో మార్పులు చేయవచ్చని తెలుస్తోంది. అలాగే రాష్ట్ర అధ్యక్షుడి మార్పు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. బండి సంజయ్ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు ఢీ అంటే ఢీ అనే స్థాయికి చేర్చినా, తెలంగాణలో పాగా వేయాలంటే అది చాలదని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నట్టు చెబుతున్నారు. సంజయ్‌కి కేంద్ర మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉందని, సామాజిక సమీకరణలను దృష్టిలో పెట్టుకుని, రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇతరులకు కట్టబెట్టవచ్చనే ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది జరగాల్సిన తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల కార్యాచరణపై ఢిల్లీలో ప్రస్తుతం కొనసాగుతున్న అగ్రనేతల సమాలోచనలు..రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల ప్రకటనలు ఈ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. కర్ణాటకలో ఓటమి నేపథ్యంలో.. దక్షిణాదిలో సానుకూల పరిస్థితులున్నాయని జాతీయ నాయకత్వం మొన్నటివరకు భావిస్తూ వచ్చింది. అయితే కర్ణాటక ఎన్నికల్లో ఓడిపోవడం, పార్టీ స్వయంకృతాపరాధమే ఇందుకు కారణమనే కచ్చితమైన అంచనాల నేపథ్యంలో తెలంగాణలో జాగ్రత్తగా వ్యవహరించాలని నిర్ణయించింది. కర్ణాటకలో పార్టీ అధికారంలో ఉండడంతో ముఖ్యనేతల మధ్య సమన్వయం లోపించింది. మంత్రులు, సీనియర్ నాయకులు ఎవరికివారు అన్నట్టుగా వ్యవహరించారు. దీనితో పాటు 40 శాతం కమీషన్ల సర్కార్ అంటూ రాష్ట్ర ప్రభుత్వంపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చి బీజేపీని ఓడించారనే అంచనాకు జాతీయ నాయకత్వం వచ్చినట్లు తెలిసింది. అక్కడ పరిస్థితిని సరిగా అంచనా వేయలేకపోయామని భావిస్తున్న జాతీయ నేతలు.. తెలంగాణ బీజేపీలోనూ పాత, కొత్త నాయకుల మధ్య పూర్తిస్థాయిలో సత్సంబంధాలు ఏర్పడకపోవడం, బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను రాష్ట్ర నేతలు ఐక్యంగా ఎదుర్కోకపోవడం, పార్టీలో సమన్వయలేమి, పార్టీని, రాష్ట్ర నాయకత్వాన్ని, నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేలా కొందరు వ్యాఖ్యానాలు చేయడం వంటి వాటిని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు తెలిసింది. అధికార బీఆర్ఎస్తో కొందరు పార్టీ నేతలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారనే ఆరోపణలు కూడా వారి దృష్టికి వచ్చాయి. మరికొందరు పార్టీ ప్రయోజనాలను దెబ్బతీసే కుట్ర చేస్తున్నారనే ఫిర్యాదులు కూడా వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే అధినాయకత్వం అప్రమత్తమైందని చెబుతున్నారు. గత మూడు, నాలుగు రోజులుగా ఢిల్లీలో ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కీలక నేతలు మేథోమథనం చేస్తుండడంతో, అతి త్వరలోనే ఈ రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల వ్యూహాలు, పొత్తులు, కార్యాచరణ ప్రణాళికపై స్పష్టమైన ప్రకటన వెలువడనుందని, ఈ మేరకు తమకు సంకేతాలు అందినట్టుగా ముఖ్యనేతలు చెబుతున్నారు. ఈ కృషి సరిపోదు..! గత మూడేళ్లలో ప్రస్తుత రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీని బలోపేతం చేసి అధికార బీఆర్ఎస్తో ఢీ అంటే ఢీ అనే స్థాయికి తీసుకొచ్చారనే అభిప్రాయంతో పలువురు నేతలున్నారు. అయితే పార్టీ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్, ప్రధాన ప్రతిపక్షాన్ని ఎదుర్కొనేందుకు ప్రస్తుతం అనుసరిస్తున్న వ్యూహాలు, విధానాలు, కార్యక్రమాలు సరిపోవని కొందరు నేతలు జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. దీంతోపాటు ఇతర పరిస్థితులన్నీ పరిగణనలోకి తీసుకుని రాష్ట్ర అధ్యక్షుడి మార్పుతో పాటు పార్టీ ఎన్నికల కమిటీ, మేనిఫెస్టో కమిటీ, సంస్థాగతంగా వివిధ స్థాయిల్లో మార్పులపై జాతీయ నాయకత్వం దృష్టి సారించిందనే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇంతవరకు రాష్ట్రంలో పార్టీని సమర్ధంగా నడిపించిన సంజయ్‌కు కేంద్రమంత్రి పదవి కట్టబెట్టి సముచిత గౌరవాన్ని కల్పిస్తారనే ప్రచారం ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. జాతీయ నాయకత్వం చేపట్టబోయే మార్పులకు సంబంధించిన సమాచారాన్ని ప్రస్తుతం ఇక్కడ పర్యటిస్తున్న అధిష్టానం దూతలు రాష్ట్ర పార్టీ ముఖ్యనేతలతో సూచాయగా పంచుకున్నట్టు తెలిసింది. కీలక పదవులు అప్పగించే వారితో వారు భేటీ కూడా అయినట్టు సమాచారం. రాష్ట్రంలో రాజకీయంగా బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తికి అధ్యక్ష పదవి, బీసీ వర్గానికి చెందిన ముఖ్యనేతకు ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలకమైన పదవిని కట్టబెట్టడం లేదా బీసీ నేతకు అధ్యక్ష పదవి, రెడ్డి సామాజికవర్గ నేతకు ఎన్నికల బాధ్యతలు అప్పగించే అవకాశాన్ని కొట్టిపారేయలేమని పలువురు నేతలు అంటున్నారు. -
టీడీపీతో బీజేపీ పొత్తు ఊహాజనితమే
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు ఉంటుందంటూ వస్తున్నవి ఊహాగానాలేనని, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ఆదివారం వివిధ జిల్లాల నేతలతో టెలికాన్ఫరెన్స్‌లో సంజయ్ మాట్లాడుతూ కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను టీడీపీ అధినేత చంద్రబాబు కలిస్తే తప్పేముందని ప్రశ్నించారు. గతంలో మమతా బెనర్జీ, స్టాలిన్, నితీశ్ కుమార్ వంటి ప్రతిపక్ష నేతలను కూడా ప్రధాని మోదీ, అమిత్ షా కలిసిన విషయాన్ని గుర్తుచేశారు. దేశాభివృద్ధే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. కేసీఆర్ మాదిరిగా ప్రజలను, ప్రతిపక్ష పార్టీలను కలవకుండా ప్రగతి భవన్‌కే పరిమితమై తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టే నైజం బీజేపీది కాదు. తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పెరుగుతోందని, పార్టీని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్ సహా మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆయన ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లండి మోదీ సర్కార్ తొమ్మిదేళ్ల పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో నెలాఖరు వరకు నిర్వహించే ‘మహాజన్ సంపర్క్ అభియాన్’ను విజయవంతం చేయాలని పార్టీ నేతలకు సూచించారు. గడప గడపకూ బీజేపీ పేరుతో కేంద్ర ప్రభుత్వ ఫలాలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అందుకోసం కార్యక్రమాలను ఉధృతం చేయాలన్నారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలన్నీ కలిసే పోటీ చేయబోతున్నాయని సంజయ్ చెప్పారు. అయితే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పాలనపట్ల విసిగిపోయారని, బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఖాయమని సంజయ్ ధీమా వ్యక్తం చేశారు. -
4 కోట్ల ప్రజలకు డబ్బిస్తే నలుగురు దోచుకుంటున్నారు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం గత తొమ్మిదేళ్లలో తెలంగాణ అభివృద్ధికి, 4 కోట్ల ప్రజల కోసం రూ.4 లక్షల కోట్లు కేటాయిస్తే, ఆ డబ్బును నలుగురు మాత్రమే దోచుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ డబ్బును ఆ నలుగురికే పంచుతూ తెలంగాణ సమాజాన్ని గాలికొదిలేశారని అన్నారు. కొట్లాడి సాధించిన రాష్ట్రం వారి చెరలో బందీ అయ్యిందంటూ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణలో అంతో ఇంతో అభివృద్ధి జరిగిందంటే, ప్రజలు బాగున్నారంటే కేంద్ర నిధులు, మోదీ అమలు చేస్తున్న పథకాలే కారణమని పేర్కొన్నారు. శుక్రవారం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పార్టీ కార్యాలయంలో సంజయ్ జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ కోసం ఎంతోమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటుంటే.. ‘మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. తెలంగాణ కల సాకారం చేస్తాం..’అంటూ సుష్మా స్వరాజ్ పార్లమెంట్ వేదికగా చెప్పడమే కాకుండా, తెలంగాణ బిల్లుకు మద్దతు ప్రకటించారని చెప్పారు. బీజేపీ ధాటికి తట్టుకోలేక దేశమ్మీద పడ్డారు.. దేశాభివృద్ధికి మోదీ ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుంటే, తెలంగాణలో మాత్రం మూర్ఖపు పాలన సాగుతోందని బండి విమర్శించారు. తెలంగాణలో సంపద సృష్టికి కేంద్రం లక్షల కోట్లు కేటాయిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం సహకరించపోగా కేంద్ర పథకాలను అమలు కూడా చేయడం లేదన్నారు. తెలంగాణకు ఇచ్చిన కేంద్ర నిధులతో పాటు, చేసిన అభివృద్ధిపై చర్చకు రమ్మంటే కేసీఆర్ పారిపోతున్నాడని, బీజేపీ ధాటికి తట్టుకోలేక టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చుకుని దేశమ్మీద పడ్డారని వ్యాఖ్యానించారు. కేసీఆర్ మూర్ఖపాలనలో తెలంగాణ అధోగతి పాలైందని, ఏ వర్గాన్ని కదిలించినా కష్టాలు, కన్నీళ్లే అని అన్నారు. ఉద్యమకారులు కలిసి రావాలి.. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదలపై భారం పడకుండా ఉచితంగా విద్య, వైద్యాన్ని అందిస్తామని, నిలువనీడలేని పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని సంజయ్ హామీ ఇచ్చారు. ఫసల్ బీమా అమలు చేయడంతో పాటు 25 వేల టీచర్ పోస్టులు సహా ఉద్యోగ ఖాళీలన్నిటినీ భర్తీ చేస్తామని అన్నారు. బీజేపీని దెబ్బతీసేందుకు, వివిధ ఎన్నికల్లో డిపాజిట్లు రాని కాంగ్రెస్‌ను లేపేందుకు బీఆర్ఎస్ కుట్రలు చేస్తోందని ఆరోపించారు. బీఆర్ఎస్ సర్కార్ ఓటమి లక్ష్యంగా గతంలో చేసిన మిలియన్ మార్చ్, వంటావార్పు, సకల జనుల సమ్మె స్ఫూర్తితో కలిసి పోరాడదామని, బీజేపీ చేసే పోరాటాలకు ఉద్యమకారులందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, జి.వివేక్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, బూర నర్సయ్యగౌడ్, రవీంద్రనాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చాక దారుస్సలాం స్వాదీనం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవంలో ఒవైసీ పాల్గొనకపోవడంపై బీఆర్ఎస్, కాంగ్రెస్ సమాధానం చెప్పాలని సంజయ్ డిమాండ్ చేశారు. శుక్రవారం రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఆయన ఇష్టాగోష్టిగా మాట్లాడారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన జెండా ఎగురవేయని వారికి రాష్ట్రంలో పోటీ చేసే అర్హత లేదన్నారు. అక్కడ జెండా ఎగరవేయనందుకు కేసీఆర్‌కు దమ్ముంటే దారుస్సలాంకు తాళం వేయాలన్నారు. ఆర్నెల్లలో తాము అధికారంలోకి వచ్చాక దారుస్సలాంను స్వాధీనం చేసుకుని పేద ముస్లింలకు ఇచ్చేస్తామని చెప్పారు. రేవంత్‌లా పార్టీలు మారడం నాకు చేతకాదు తనకు రేవంత్‌రెడ్డి మాదిరిగా పార్టీలు మారడం చేతకాదని బండి వ్యాఖ్యానించారు. ఆయనలాగా ఓటుకు నోటు కేసులో మాదిరి డబ్బులు పంచడం కూడా రాదన్నారు. తనకు పార్టీ నడపడం రాదని చెబుతున్న రేవంత్.. ఏ విధంగా పార్టీని నడిపిస్తున్నారో జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, జగ్గారెడ్డి వంటి నేతలను అడిగితే తెలుస్తుందని చెప్పారు. తమది కుటుంబ పార్టీ కాదని, అయ్య పేరు చెప్పి కూతురు, కొడుకు సీఎంలు అయ్యే పార్టీ కాదని, అలాగే అయ్య లేకుంటే బిడ్డ, బిడ్డ లేకుంటే కొడుకు సీఎం అయ్యే పార్టీ కూడా కాదని చెప్పారు. -
నేటి నుంచి బీజేపీ ‘కౌంటర్’
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది ఉత్సవాలకు వ్యతిరేకంగా పలు కార్యక్రమాలు (కౌంటర్ ప్రోగ్రామ్స్) నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమైంది. రాష్ట్ర ప్రభుత్వం 21 రోజుల పాటు నిర్వహిస్తున్న వివిధ అధికారిక కార్యక్రమాలపై శాఖలు, విభాగాల వారీగా వ్యతిరేక ప్రచారం (నెగటివ్ క్యాంపెయిన్) చేపట్టాలని, నిరసనలతో కేసీఆర్ సర్కార్ తీరును ప్రజల్లో ఎండగట్టాలని (రివర్స్ గేర్) నిర్ణయించింది. శుక్రవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన జరిగిన పార్టీ నేతల సమావేశంలో ఆయా విభాగాల వారీగా చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ప్రతీరోజు ఆయా రంగాల్లో ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడంతో పాటు ప్రజల ఇబ్బందులను ఎండగట్టేలా వివిధ రూపాల్లో, వినూత్న రీతిలో కార్యక్రమాలు రూపొందించినట్లు తెలిపారు. శనివారం ప్రభుత్వం రైతు దినోత్సవం నిర్వహిస్తున్న నేపథ్యంలో.. కేసీఆర్ పాలనలో వ్యవసాయ రంగం ఏవిధంగా దెబ్బతిందో, రైతులకిచ్చిన హామీలను అమలు చేయడంలో ఎలా విఫలమైందో ప్రజలకు వివరించనున్నారు. ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నారు. ఈ కార్యక్రమాల్లో రాష్ట్రంలోని పార్టీ సీనియర్ నేతలందరనీ భాగస్వాములను చేయనున్నారు. ఏ రోజు ఏ అంశంపై.. ఈ నెల 3న రైతు వ్యతిరేక విధానాలపై, 4న పోలీస్ వ్యవస్థను కేసీఆర్ కుటుంబం సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్న విధానంపై, 5న విద్యుత్ చార్జీల పెంపుతో ప్రజలపై పడు తున్న భారం, విద్యుత్ సంస్థలు దివాలా తీయడంపై నిరనన కార్యక్రమాలుంటాయి. అలాగే 6న కేసీఆర్ పాలనలో పారిశ్రామిక రంగం సంక్షోభం, 7న, సాగునీటి ప్రాజెక్టుల్లో దోపిడీపై, 8న చెరువుల కబ్జాలపై, 9న సంక్షేమ రంగం ప్రమాదంలో పడటంపై, 10న పెచ్చరిల్లిన అవినీతిపై, 11న తెలంగాణలో కవులు, కళాకారులతో పాటు సాహిత్యకారులకు జరుగుతున్న అన్యాయంపై ప్రచారోద్యమం ఉంటుంది. 12న ‘తెలంగాణ రన్’కు వ్యతిరేకంగా యువ, మహిళా మోర్చా ఆధ్వర్యంలో ‘రివర్స్ రన్’ఉంటుంది. 13న మహిళలకు అన్యాయంపై, 14న కుంటుపడ్డ వైద్యం–ప్రజల తిప్పలు, 15, 16 తేదీల్లో స్థానిక సంస్థల నిర్వీర్యం, ప్రజాప్రతినిధుల బాధలపై, 17న గిరిజన హామీలు, పోడుభూములు, ఎజెన్సీల్లో ప్రజ ల ఇబ్బందులపై, 18న మంచినీటి సమస్యపై (ఖాళీ బిందెలతో నిరసన), 19న హరిత హారానికి కేంద్రం ఇచ్చిన నిధుల దుర్వినియోగంపై, 20న విద్యా వ్యవస్థ దుర్గతిపై, 21న దేవాలయ భూముల కబ్జా, హిందువులపై జరుగుతున్న దాడులపై, 22న తెలంగాణ అమర వీరుల కుటుంబాలతో పాటు ఉద్యమకారులకు జరుగుతున్న అన్యాయంపై వినూత్న కార్యక్రమాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు పార్టీ నేతలు తెలిపారు. ఆ బాధ్యతలను దరువు ఎల్లన్న, పుల్లారావులకు అప్పగించారు. -
ఇది.. సారు– కారు–60% సర్కారు
సాక్షి, హైదరాబాద్: ‘దళితబంధులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు 30 శాతం కమీషన్లు తీసుకుంటే.. మరో 30 శాతం కమీషన్ సీఎం కుటుంబానికి పోతోంది. కాళేశ్వరం, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, సచివాలయ నిర్మాణంతోపాటు భూ దందాల్లోనూ 60 శాతం కమీషన్లు వెళ్తున్నాయి. ఇది అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ కాదు. సారు–కారు–60 పర్సంట్ భ్రష్టాచార్ సర్కార్’అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ 60 పర్సంట్ సర్కార్‌ను సాగనంపేదాకా తాము పోరాడతామని చెప్పారు. సోమవారమిక్కడ జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ భేటీలో సంజయ్ మాట్లాడారు. ‘111 జీవో రద్దు అనేది మహా కుట్ర, బీఆర్ఎస్ కార్యాలయానికి కోకాపేట భూముల కేటాయింపు వెనుక కూడా కుట్ర ఉంది. వీటిపై న్యాయపోరాటం చేస్తాం’అని ప్రకటించారు. ‘రాష్ట్ర ప్రజలకు ప్రధాన విలన్ కేసీఆరే. కాంగ్రెస్ సైడ్ విలన్ పాత్ర పోషిస్తోంది. బీఆర్ఎస్–కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీల చీకటి ఒప్పందాలను బయటపెడతామని పేర్కొన్నారు. ఈ భేటీలో జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్సీ కేవీఎన్ రెడ్డి, మురళీధర్ రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, నల్లు ఇంద్రసేనారెడ్డి, జితేందర్‌రెడ్డి, ఈటల, వివేక్ పాల్గొన్నారు. జూన్ 30 దాకా ‘మహాజన సంపర్క్ అభియాన్’ కేంద్రంలో మోదీ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని, తెలంగాణకు చేకూర్చిన ప్రయోజనాలను ఇంటింటికీ తెలియజేసేలా ఈనెల 30 నుంచి జూన్ 30 దాకా ‘మహాజన సంపర్క్ అభియాన్’ నిర్వహిస్తా మని బండి సంజయ్ చెప్పారు. ‘ఒకనాడు ప్రధాని మోదీని విశ్వగురుగా, నిజాయితీపరుడిగా కీర్తించిన కేసీఆరే ఇప్పుడు ఆయనను అవినీతిపరుడు, రాక్షసుడంటూ తిడుతున్నారు. ఇలాంటి విశ్వాస ఘాతకుడిని నా రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదు’అని సంజయ్ మండిపడ్డారు. పదేళ్ల పాలనలో ఏం సాధించారని వందలకోట్లు ఖర్చుతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నారని నిలదీశారు. కాగా, బండి, బన్సల్ సమక్షంలో బీఆర్ఎస్ నేతలు గోవింద్ రాఠీ, మనోజ్, మాజీ మంత్రి శంకర్ రావు కుమార్తె సుస్మిత బీజేపీలో చేరారు. పనిచేసేవారికే టికెట్లు: సునీల్‌బన్సల్ ‘ఫ్లెక్సీలు పెట్టి, సొంత ఫొటోలతో వ్యక్తిగత ప్రచారం చేసుకునే వాళ్లు లీడర్లు కారు, ప్రజల్లోకి వెళ్లి పనిచేసే వారే నాయకులు. పార్టీ, ప్రజల కోసం పనిచేసే వారికే టికెట్లు ఇస్తాం. పార్టీ క్రమశిక్షణను అందరూ విధిగా పాటించాలి. గీత దాటితే కఠినచర్యలు తప్పవు’అని జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర సంస్థాగత ఇన్చార్జి సునీల్ బన్సల్ చెప్పారు. ‘బీజేపీ ముఖ్యనేతలు పార్టీ మారుతున్నట్టు, వారిలో ఈటల, వివేక్, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి వంటి నేతలున్నారంటూ కొందరు చేస్తున్న ప్రచారాన్ని విశ్వసించకండి. మన ప్రత్యర్థులు రేవంత్‌రెడ్డి వర్గానికి చెందిన వారు చేస్తున్న ఈ దుష్ప్రచారాన్ని నమ్మొద్దు’అని పార్టీ జాతీయ సంస్థాగత సహ ప్రధానకార్యదర్శి శివప్రకాష్ పేర్కొన్నట్టు సమాచారం. -
ఈ రజాకార్ల రాజ్యాన్ని పాతరేస్తాం
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో రజాకార్ల పాలన సాగుతోందని, మరో ఐదు నెలల్లో ఈ పాలనను పాతరేసి రామరాజ్యాన్ని స్థాపిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కర్ణాటక ఫలితాలతో హిందుత్వంపై కొన్ని శక్తులు విష ప్రచారం చేస్తున్నా యని మండిపడ్డారు. హిందూ ఏక్తాయాత్ర సందర్భంగా ఆదివారం సాయంత్రం కరీంనగర్‌లోని వైశ్యభవన్ వద్ద మొదలైన ర్యాలీలో అసోం సీఎం హిమంత బిశ్వశర్మతో కలసి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంజయ్ మాట్లాడారు. తాను ఎవరికీ వ్యతిరేకంగా హిందూ ఏక్తాయాత్ర చేయడం లేదని, హిందూ సమాజాన్ని సంఘటిత పర్చేందుకు, ఐక్యంగా ఉంచేందుకే చేపట్టానని తెలిపారు. కుహానా లౌకికవాదుల నుంచి హిందూ సమాజాన్ని జాగృతం చేయాల్సి ఉందన్నారు. ఈ యాత్రతో రాష్ట్రమంతా హిందూ సమాజాన్ని జాగృతపరుస్తానని చెప్పారు. పావు గంటపాటు పోలీసులు తప్పుకుంటే తామేంటో చూపిస్తామన్న వారిని పరుగులు పెట్టించే రోజులు ఎంతో దూరంలో లేవని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో బీజేపీ ఓటమి చెందగానే.. హిందూత్వానికి మనుగడ లేదని కొన్ని పార్టీలు ప్రచారం మొదలుపెట్టాయని.. అలాంటి వారంతా ఒక్కసారి కరీంనగర్ గడ్డ వైపు చూస్తే సమాధానం దొరుకుతుందన్నారు. దేశంలో హిందుత్వం లేకపోతే ఎప్పుడో పాకిస్తాన్ అయ్యేదన్నారు. నిజాం రజకార్ల సమా ధుల వద్ద మోకరిల్లిన వారికి గుణపాఠం చెప్పాలన్నారు. ఎగిరేది కాషాయ జెండానే.. జగిత్యాల ఎస్సై భార్యకు, బురఖా వేసుకున్న మహిళకు మధ్య జరిగిన వాగ్వాదంలో ఎంఐఎం నేతలు అకారణంగా జోక్యం చేసుకుని సదరు ఎస్సైని సస్పెండ్ చేయించారని సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది కాషాయం జెండానే అని చెప్పారు. కేరళ స్టోరీ సినిమాలో హిందూ మహిళలపై జరుగుతున్న లవ్ జిహాద్ దాడులను కళ్లకు కట్టారని పేర్కొన్నారు. త్వరలోనే ఉమ్మడి పౌరస్మృతి: హిమంత బిశ్వశర్మ రాష్ట్రంలో రజాకార్ల ప్రభుత్వం పోయి, త్వరలోనే రామరాజ్యం వస్తుందని తనకు నమ్మకంగా ఉందని అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యానించారు. సూర్యచంద్రులు ఉన్నంత కాలం దేశంలో సనాతన ధర్మం బతికే ఉంటుందన్నారు. పదేళ్ల క్రితం దేశంలో అయోధ్యలో రామమందిర నిర్మాణం, కశ్మీర్లో ఆర్టీకల్ 370 రద్దును ఎవరూ ఊహించలేదని.. కానీ అవన్నీ సాకారం అయ్యాయని చెప్పారు. కొందరు నాలుగు పెళ్లిళ్లు చేసుకుందామని కలలు కంటున్నారని.. కానీ త్వరలోనే ఉమ్మడి పౌరస్మృతితో వాటికి ప్రధాని మోదీ అడ్డుకట్ట వేస్తారన్నారు. అసోంలో డీజిల్ ధర రూ.97 ఉంటే తెలంగాణలో మాత్రం రూ.106గా ఉందన్నారు. తెలంగాణ సర్కారు ఉద్యోగాలను కూడా సరిగా భర్తీ చేయడం లేదని ఆరోపించారు. తెలంగాణ నేతల పేర్లు ఢిల్లీ లిక్కర్ స్కాంలో వినిపిస్తున్నాయన్నారు. బండి సంజయ్ హనుమంతుడిలా యుద్ధం చేస్తున్నారని పేర్కొన్నారు. తాను సీఎం అయ్యాక అసోంలో పలు మదర్సాలను రద్దు చేశానని, మరికొన్నింటిని రద్దు చేసేందుకు సిద్ధమని చెప్పారు. ఐదు నెలలు శక్తివంచన లేకుండా కృషి చేస్తే.. తెలంగాణలో అధికారం మనదేనని బీజేపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. -
రైతులకు నష్టపరిహారం ఇచ్చేందుకు కేసీఆర్‌కు చేతులు రావట్లేదు: బండి సంజయ్
-
2 లక్షల ఉద్యోగ ఖాళీల భర్తీపై తొలి సంతకం..
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘బీజేపీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాల భర్తీపై తొలి సంతకం చేయిస్తాం. ఎవరు ముఖ్యమంత్రి అయినా సరే.. ఆయా ఉద్యోగాల నియామకాలను పూర్తి చేయిస్తాం. త్యాగాలకు, పోరాటాలకు నిలయమైన ఓరుగల్లు గడ్డపై నిరుద్యోగ మార్చ్ సాక్షిగా మాట ఇస్తున్నా’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రకటించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, ఇందుకు కారకులైన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేలి్చచెప్పారు. ఈ కేసును పక్కదోవ పట్టించేందుకే సీఎం కేసీఆర్ టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసులో తనను ఇరికించారని ఆరోపించారు. శనివారం హనుమకొండ కాకతీయ యూనివర్సిటీ చౌరస్తా నుంచి అంబేడ్కర్ జంక్షన్ వరకు వేలాది మందితో బండి సంజయ్ నిరుద్యోగ మార్చ్ నిర్వహించారు. ఈ మార్చ్‌లో బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, జాతీయ కార్యవర్గ సభ్యులు, ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్‌రావు, గరికపాటి మోహన్‌రావు, మాజీ ఎంపీలు చాడ సురేశ్‌రెడ్డి, రమేశ్ రాథోడ్ సహా పలువురు రాష్ట్ర నేతలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగిన నిరుద్యోగ మార్చ్ ముగింపు సభలో బండి సంజయ్ ప్రసంగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబంపై నిప్పులు చెరిగారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించట్లేదేం? టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో ప్రభుత్వం తప్పు చేయనప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ ఎందుకు జరిపించడం లేదు? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ‘తప్పు చేశాడు కాబట్టే నీ కొడుకును కాపాడుకోవాలనుకుంటున్నావు. వెంటనే నీ కొడుకును బర్తరఫ్ చెయ్. మెడపట్టి గెంటేయ్. తప్పు చేస్తే కేసీఆర్ కుటుంబానికి ఒక న్యాయం? సామాన్యులకు ఒక న్యాయమా? ‘ఈ వేదికపై సీఎంకు చెబుతున్నా.. సిట్ విచారణకు మేం ఒప్పుకోం. నయీం, మియాపూర్ ల్యాండ్ స్కాం, డ్రగ్స్ కేసులో సిట్ విచారణ నివేదికలు ఏమయ్యాయి? కేసీఆర్ కుటుంబాన్ని, బీఆర్ఎస్ నాయకులను కాపాడుకొనేందుకే సిట్ విచారణ చేస్తున్నారు. మీరు వేసుకొనే సిట్లను ఇంకా నమ్మాలా’ అని బండి ప్రశ్నించారు. నిరుద్యోగ మార్చ్‌లు ఆగవు... పేపర్ లీకేజీపై తక్షణమే ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. పరీక్షల రద్దుతో నష్టపోయిన నిరుద్యోగులకు రూ. లక్ష చొప్పున పరిహారమివ్వాలని, అందుకోసమే నిరుద్యోగ మార్చ్ చేపట్టామని, ఈ మార్చ్ ఇంతటితో ఆగదని, ఈ నెల 21న పాలమూరు గడ్డమీద నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని ప్రకటించారు. వరుసగా అన్ని ఉమ్మడి జిల్లాల్లోనూ నిరుద్యోగ మార్చ్ నిర్వహించి తీరుతామని, ఆ తరువాత హైదరాబాద్‌లో లక్షలాది మందితో నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహిస్తామని స్పష్టం చేశారు. అంబేడ్కర్ స్ఫూర్తిగల పార్టీ బీజేపీనే... ‘సీఎం కేసీఆర్‌కు తెలంగాణతో తెగదెంపులయ్యాయి. అంబేడ్కర్ జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు హాజరుకాని మూర్ఖుడు కేసీఆర్. ఆయనకు అంబేడ్కర్ విగ్రహాన్ని తాకే అర్హత లేదు. దళితులను అడుగడుగునా అవమానించిన పార్టీ బీఆర్ఎస్. అంబేడ్కర్ స్ఫూర్తితో పాలన కొనసాగిస్తున్న పార్టీ బీజేపీ. దళిత, గిరిజన, బలహీనవర్గాల అభ్యున్నతికి పాల్పడుతున్న పార్టీ బీజేపీ. రాష్ట్రపతి, గవర్నర్లు, కేంద్ర మంత్రులుగా దళిత, గిరిజన, బలహీన వర్గాల వారిని చేసిన ఘనత బీజేపీదే’ అని బండి వివరించారు. ఒక్క అవకాశం ఇవ్వండి... ‘బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అప్పీల్ చేస్తున్నా... నిరుద్యోగులారా నిరాశ పడకండి. బీజేపీ అండగా ఉంది. మాకు నేషన్ ఫస్ట్... ఫ్యామి లీ లాస్ట్. తెలంగాణలో యువత మాకు ఫస్ట్.. 30 లక్షల మంది నిరుద్యోగుల పక్షాన పోరాడేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. తెలంగాణ ప్రజలు, యువతను కోరుతున్నా. ఒక్కసారి బీజేపీకి అవకాశం ఇవ్వండి. తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను ఎగరేస్తాం. రామరాజ్యం ఏర్పాటు చేస్తాం’ అని బండి సంజయ్ తెలిపారు. బీజేపీ హనుమకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ అధ్యక్షతన జరిగిన ఈ సభలో జాతీయ, రాష్ట్ర నాయకులు గంగిడి మనోహర్ రెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, మార్తినేని ధర్మారావు, విజయరామారావు, కన్నబోయిన రాజయ్య, దరువు ఎల్లన్న, ఆకుల విజయ పలువురు పాల్గొన్నారు. -
ఎన్నికలకు దగ్గర పడుతున్న సమయం.. బీజేపీలో ఎలక్షన్ మోడ్..
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో బలం, బలగాన్ని పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో కార్యక్రమాలు ఓవైపు.. రాష్ట్రస్థాయిలో ఆందోళనలు, పోరాటాలతో మరోవైపు ‘ఎలక్షన్ మోడ్’లోకి వెళ్లిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా యావత్ యంత్రాంగాన్ని సన్నద్ధం చేయడంతోపాటు పార్టీ నిర్మాణాత్మకంగా బలహీనంగా ఉన్నప్రాంతాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలని నిర్ణయించింది. ముఖ్యంగా గెలిచేసత్తా ఉన్న నేతలు కూడా కరువయ్యారంటూ ఇతర పార్టీల నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఉమ్మడి ఖమ్మం, నల్లగొండ, వరంగల్, మెదక్ జిల్లాల్లో దూకుడుగా ముందుకు వెళ్లాలని భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ఉమ్మడి జిల్లాల పరిధిలో నిరుద్యోగ మార్చ్‌లు నిర్వహిస్తూనే.. ఈ నాలుగు జిల్లాల్లో స్థానికంగా ప్రజా సమస్యలపై ఉద్య మాలు, ఆందోళనలు, నిరసనలకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఈ మేరకు త్వరలో ఖమ్మం జిల్లాలో భారీ ధర్నా చేపట్టాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాలో పాదయాత్రలు, సభలను ఇటీవలే నిర్వహించడంతో.. మరిన్ని భిన్నమైన కార్యక్రమాలకు రూపకల్పన చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. గతంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలో పార్టీ బలంగా ఉండగా.. ఇటీవలి కాలంలో జిల్లాలోని ముఖ్యనేతల మధ్య సమన్వయం కొరవడడంతో సాఫీగా ముందుకు సాగడం లేదనే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. అటు ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనూ వివిధ రూపాల్లో నిరసనలు, ఆందోళనలు చేపట్టాలని భావిస్తున్నారు.. అనుబంధ సంఘాలతో.. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కేడర్‌ను సిద్ధం చేసేదిశగా.. పార్టీ అనుబంధ విభాగాలైన ఎస్సీ, ఎస్టీ, మహిళా, ఇతర మోర్చాల ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఇతర అనుబంధ సంఘాలనూ వీటిలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, ఇతర వర్గాల ఓటర్లను ఆకర్షించేలా కార్యాచరణను రూపొందిస్తోంది. ప్రధానంగా 19 ఎస్సీ, 12 ఎస్టీ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మెజారిటీ సీట్లను గెలుచుకునేలా వ్యూహాలను సిద్ధం చేస్తోంది. ప్రత్యామ్నాయం బీజేపీయే అనిపించేలా..! పార్టీ నేతలు, అభ్యర్థులతో నిమిత్తం లేకుండా.. రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీయే అనిపించేలా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ పెద్దలు కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నారు. వివిధ అంశాలు, సమస్యలపై ఆందోళనలు, నిరసనలు, పోరాటాలతో.. బీజేపీ పట్ల ప్రజల్లో సానుకూల దృక్పథం, అభిప్రాయం ఏర్పడేలా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇక జాతీయ రాజకీయాల్లో ప్రధాని మోదీ పాత్రను, దేశాభివృద్ధికి చేస్తున్న కృషి, కేంద్రం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో ప్రజలకు, ముఖ్యంగా పేదవర్గాలకు చేకూరుతున్న ప్రయోజనాలపై విస్తృతంగా ప్రచారం నిర్వహించనున్నారు. ఇదే సమయంలో కేసీఆర్ సర్కార్ వైఫల్యాలు, ఎన్నికల హామీల అమలు, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వంటివాటిని ఎత్తిచూపనున్నారు. 21న మహబూబ్‌నగర్‌లో ‘మార్చ్’ టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతోపాటు ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందంటూ.. శనివారం వరంగల్‌లో నిర్వహించిన నిరుద్యోగ మార్చ్ అంచనాలకు మించి విజయవంతం కావడంతో ఈ నెల 21న ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మార్చ్ నిర్వహించాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. మే చివరిలోగా మిగతా 8 ఉమ్మడి జిల్లాల్లో నిరుద్యోగ మార్చ్‌లను పూర్తిచేయాలని భావిస్తున్నారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన మిలియన్ మార్చ్ తరహాలో భారీ కార్యక్రమాన్ని చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. సర్వేలు, నివేదికలతో.. మిషన్ తెలంగాణ–90 (కనీసం తొంబై సీట్లలో గెలుపు లక్ష్యం) కార్యాచరణ ప్రణాళిక అమలు ఎలా జరుగుతోంది, రాష్ట్రంలోని అన్ని ఎమ్మెల్యే, ఎంపీ నియోజకవర్గాల పరిధిలోని కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయన్న దానిపై పార్టీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నట్టు బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. జిల్లాల వారీగా కార్యక్రమాలు, ఎన్నికలకు సన్నద్ధమవుతున్న తీరుపై ఆయా జిల్లా పార్టీ అధ్యక్షులతో జేపీ నడ్డా నేరుగా సమీక్షిస్తున్నారని అంటున్నాయి. రాష్ట్రంలో పోలింగ్ బూత్ స్థాయి వరకు ‘కమలం పువ్వు’ గుర్తును ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు.. క్షేత్రస్థాయి వరకు కేడర్‌ను బలోపేతం చేసేందుకు.. మే నెలలో మరోవిడత స్ట్రీట్‌కార్నర్ సమావేశాలు నిర్వహించనున్నట్టు వివరిస్తున్నాయి. మోదీ సభతో జోష్.. ఇటీవల సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన ప్రధాని మోదీ బహిరంగ సభతో పార్టీలో ‘ఎన్నికల మోడ్’ మొదలైందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. ప్రధాని ప్రసంగంతో కేడర్‌లో ఉత్సాహం నెలకొందని అంటున్నాయి. ఇప్పటికే పోలింగ్‌బూత్ స్థాయి నుంచీ పార్టీ బలోపేతం కోసం కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, పార్టీ జాతీయ నేతల పర్యటనలు మరింత జోష్ తెస్తున్నాయని చెప్తున్నాయి. వచ్చే నెలలో ప్రధాని మోదీ మరోసారి తెలంగాణలో పర్యటించే అవకాశం ఉందని గుర్తు చేస్తున్నాయి. మొత్తంగా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీ ఆఫీసులో ఘనంగా డా.బీఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు
-
బండి సంజయ్ పిటిషన్‌పై నేడు హై కోర్టు విచారణ
-
సీఎం కోసం శాలువా తెచ్చిన..
సాక్షి, హైదరాబాద్: ‘సీఎం కేసీఆర్ చాలా బిజీ.. తెలంగాణ అభివృద్ధి కోసం రూ.11,360 కోట్ల పనుల ప్రారంభానికి మోదీ వస్తే కూడా హాజరు కాలేనంత బిజీ.. ప్రధాని వచ్చినా రాలేకపోయేంత ముఖ్యమైన పని ఆయనకు ఏముంది?’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. ‘ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీఎంను నేను స్వయంగా కోరా. ఆయన కోసం ప్రత్యేకంగా సీటు కేటాయించాం. సన్మానించేందుకు శాలువా కూడా తెచ్చిన. మరి సీఎం ఎందుకు రాలేదు?’ అని సంజయ్ నిలదీశారు. తన చర్యల ద్వారా సీఎం కేసీఆర్ అభివృద్ధి నిరోధకుడిగా నిలిచిపోతున్నారని, ఇది సిగ్గుచేటని ధ్వజమెత్తారు. శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో ప్రధాని సభ ముగిసిన అనంతరం సంజయ్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమానికి హాజరుకాని కేసీఆర్ తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలని, ప్రధాని, గవర్నర్, కేంద్ర మంత్రులు వచ్చిన సభకు కేసీఆర్ ఎందుకు రాలేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఎన్నికలప్పుడే రాజకీయాలు.. ఎన్నికలయ్యాక అభివృద్ధే ముఖ్యమని ప్రధాని చెప్పారు. రాజకీయాలతో సంబంధం లేకుండా తెలంగాణ అభివృద్ధికి భారీగా నిధులు వెచ్చిస్తున్నాం. అలాంటి కార్యక్రమానికి సీఎం హాజరుకాని విషయాన్ని ప్రజలంతా గమనిస్తున్నారు. తగిన సమయంలో కేసీఆర్‌కు బుద్ది చెప్పడం ఖాయం’ అని సంజయ్ అన్నారు. -
కేంద్రం,బీజేపీ నాయకత్వం మీకు అండగా ఉంది
-
కరీంనగర్ టు కరీంనగర్.. బండి అరెస్ట్ ఎపిసోడ్లో హైడ్రామా (ఫొటోలు)
-
మోదీ దృష్టికి బండి అరెస్టు
సాక్షి, న్యూఢిల్లీ: పదో తరగతి ప్రశ్నపత్రం లీక్ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు అంశం దేశ రాజధాని హస్తినను తాకింది. సంజయ్ అరెస్టుపై బీజేపీ అగ్రనేతలు, కేంద్ర మంత్రులు భగ్గుమన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీతోపాటు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఇతర నేతలు అత్యవసర సమావేశాలు నిర్వహించి తదుపరి కార్యాచరణపై చర్చించారు. సంజయ్‌కు బాసటగా నిలిచేందుకు కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పంపాలని, న్యాయ పోరాటానికి బాసటగా నిలవాలని నిర్ణయించారు. ఇదే సమయంలో రాజకీయ పోరాటంలో భాగంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగించాలని రాష్ట్ర నేతలకు సూచించినట్టు తెలిసింది. పరిణామాలను మోదీకి వివరించిన నడ్డా, షా.. బండి సంజయ్ అరెస్ట్, తదనంతర పరిస్థితులను జేపీ నడ్డాకు బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్‌ఛుగ్, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి వివరించారు. ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారో చెప్పకుండానే సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నారని వివరించారు. దీనిపై స్పందించిన నడ్డా.. పార్టీ నేత, న్యాయవాది అయిన రామచందర్‌రావు, కొందరు నేతలతో మాట్లాడారు. అనంతరం దాదాపు అరగంట పాటు అమిత్‌షాతో భేటీ అయ్యారు. అరెస్టును న్యాయపరంగా ఎదుర్కోవాల్సిన తీరు, రాజకీయంగా ఎండగట్టేందుకు చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించారు. తర్వాత నడ్డా, అమిత్‌షా ఇద్దరూ మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో పార్లమెంట్లో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. కక్షపూరితంగా సంజయ్‌ను అరెస్ట్ చేశారని ప్రధానికి వివరించారు. ఈ సందర్భంగా సంజయ్ అరెస్ట్‌పై తొలుత న్యాయపరంగా కొట్లాడాలని, అవసరమైతే ఢిల్లీ నుంచి ప్రత్యేక న్యాయబృందాన్ని రాష్ట్రానికి పంపాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇదే సమయంలో రాజకీయంగా ప్రత్యేక కార్యాచరణ తీసుకోవాలని, నిరసన కార్యక్రమల్లో పాల్గొనేలా కేంద్ర మంత్రులను రాష్ట్రానికి పంపాలని భావనకు వచ్చినట్టు సమాచారం. ఈ భేటీ జరిగిన కొంతసేపటికే రాష్ట్ర నేతలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన తరుణ్ ఛుగ్.. గురువారం నుంచి చేపట్టాల్సిన ఆందోళనలపై మార్గనిర్దేశం చేసినట్టు తెలిసింది. లోక్‌సభ స్పీకర్‌కు ఫిర్యాదు బండి సంజయ్ అరెస్టుపై బీజేపీ ఎంపీలు బుధవారం లోక్‌సభ స్పీకర్ ఓం ప్రకాశ్బిర్లాను కలసి ఫిర్యాదు చేశారు. ఎంపీ అయిన సంజయ్ హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ రూల్ 223 ప్రకారం బీజేపీ ఎంపీ సోయం బాపురావు ప్రివిలేజ్ నోటీసులు అందించారు. అరెస్టుకు కారణాలు చెప్పలేదని.. గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్న సంజయ్‌ను మందులు కూడా తీసుకోనివ్వలేదని ఆరోపించారు. తర్వాత ఈ అంశంపై పార్లమెంటులోని గాంధీ విగ్రహం వద్ద ఎంపీలు కె.లక్ష్మణ్, జీవీఎల్ నరసింహారావు, సోయం బాపురావు నిరసన తెలిపారు. సంజయ్ అరెస్టును ట్విట్టర్ వేదికగా కేంద్రమంత్రులు పీయూష్ గోయల్, ధర్మేంద్ర ప్రధాన్, అనురాగ్ ఠాకూర్ తదితరులు ఖండించారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణను ఓర్వలేక, అవినీతిని కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఆరోపించారు. మెసేజ్ వస్తే చూడటం తప్పా? కేసీఆర్ ప్రభుత్వం ఏ వ్యవస్థలనూ గౌరవించడం లేదు. కారణాలు చెప్పకుండా అరెస్టులు చేస్తున్నారు. పరీక్ష పత్రాల లీకేజీ వ్యవహారాల్లో ప్రజలను తప్పదోవ పట్టించేలా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. మెసేజ్‌లు వస్తే చూడటం కూడా తప్పేనా? సంజయ్ అరెస్టుపై, కేసీఆర్ కుటుంబ అవినీతి పాలనపై బీజేపీ శ్రేణులు అన్ని రకాలుగా పోరాడుతాయి. పాలన తీరును ప్రశ్నించినందుకు జైల్లో వేస్తామంటే.. బీజేపీ నేతలెవరూ భయపడరు. – తరుణ్ ఛుగ్, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి బీఆర్ఎస్కు ఇవి చివరి రోజులు సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేయడం ద్వారా దాష్టీకానికి పాల్పడ్డారు. అవినీతి ఆరోపణలతో సతమతమవుతున్న బీఆర్ఎస్ పార్టీ, దాని నాయకత్వం రాజకీయ అస్తిత్వానికి ఇవి చివరి రోజులు. – బీఎల్ సంతోష్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రధాని పర్యటనను పక్కదోవ పట్టించేందుకే.. వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమికి తనను కన్వీనర్‌ను చేస్తే పార్టీలకు నిధులిస్తానని కేసీఆర్ చెప్పిన విషయాన్ని ప్రముఖ పాత్రికేయుడు రాజ్‌దీప్ సర్దేశాయ్ బయటపెట్టారు. పైగా ఈనెల 8న హైదరాబాద్‌లో ప్రధాని పర్యటన ఉంది. ఈ అంశాలను పక్కదోవ పట్టించేందుకే బండి సంజయ్‌ను అక్రమంగా అరెస్ట్ చేశారు. – ధర్మపురి అరవింద్, ఎంపీ లీకేజీలు, ప్యాకేజీలు బయటకు రావొద్దనే.. బండి సంజయ్‌ను అకారణంగా, అన్యాయంగా అరెస్టు చేశారు. లీకేజీలు, ప్యాకేజీల విషయం బయటికి రాకుండా ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నమిది. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్కు గుణపాఠం తప్పదు. – కె.లక్ష్మణ్, ఎంపీ -
బండికి రిమాండ్.. కరీంనగర్లో హైఅలర్ట్!
సాక్షిప్రతినిధి, వరంగల్: పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం లీక్, కాపీ కుట్ర కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మరో ముగ్గురికి హనుమకొండ మొదటి సెషన్స్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇందులో బండి సంజయ్‌ను కరీంనగర్ జైలుకు, మిగతా ముగ్గురిని ఖమ్మం జైలుకు తరలించాలని ఆదేశించింది. ఈ మేరకు పోలీసులు వారిని జైళ్లకు తరలించారు. అటూ ఇటూ తిప్పి కోర్టుకు.. : మంగళవారం కమలాపూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి హిందీ ప్రశ్నపత్రం బయటికి వచ్చిన కేసులో పోలీసులు బండి సంజయ్‌తోపాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ఆయనను అర్ధరాత్రి తర్వాత యాదాద్రి జిల్లా బొమ్మలరామారం పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు.. బుధవారం ఉదయం అక్కడి నుంచి బయలుదేరి జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో హనుమకొండలోని నాలుగో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఇన్చార్జి జడ్జి రాపోలు అనిత ఎదుట హాజరుపర్చారు. తన అరెస్టు సందర్భంగా పోలీసులు దురుసుగా వ్యవహరించారని, తనకు గాయాలు అయ్యాయని జడ్జికి సంజయ్ విన్నవించారు. దానిపై స్పందించిన న్యాయమూర్తి.. కాజీపేట ఏసీపీ శ్రీనివాస్, కమలాపూర్ సీఐ సంజీవ్‌లను పిలిపించుకుని విచారించారు. తర్వాత బండి సంజయ్, ఇతర నిందితులను రిమాండ్ చేయాలంటూ పోలీసులు ఇచ్చిన రిపోర్టుపై న్యాయమూర్తి విచారణ చేపట్టారు. నిందితుల అభ్యంతరాలను తిరస్కరించి.. విచారణ సందర్భంగా బండి సంజయ్‌పై కేసు నమోదు, అరెస్టు తీరుపై ఆయన తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేశారు. సీఆర్పీసీ 41ఏ ప్రకారం నిందితులకు నోటీసులు ఇచ్చాకే అరెస్టు చేయాలని.. ఈ కేసులో అలా చేయలేదని, రిమాండ్‌ను తిరస్కరించాలని పిటిషన్ వేశారు. వాదనలు విన్న జడ్జి.. నిందితుల అభ్యర్థనను తిరస్కరించి, పోలీసుల రిమాండ్ రిపోర్టును అంగీకరించారు. బండి సంజయ్‌తోపాటు బూర ప్రశాంత్ (మాజీ జర్నలిస్టు), గుండెబోయిన మహేశ్ (కేఎంసీలో ల్యాబ్ అసిస్టెంట్), మౌటం శివగణేశ్ (డ్రైవర్)లకు 14 రోజులు రిమాండ్ విధించారు. సంజయ్‌కు హాని ఉందనడంతో.. అయితే బండి సంజయ్‌కు ప్రాణహాని ఉందని, ఆహారంలో విష ప్రయోగం చేసి చంపే అవకాశం ఉందని న్యాయవాదులు కోర్టులో ఆందోళన వ్యక్తం చేశారు. దీనితో సంజయ్‌కు ఇచ్చే ఆహారాన్ని పరీక్షించిన మీదటే అందజేయాలని జడ్జి ఆదేశించారు. ఇక వరంగల్ కోర్టు పరిధిలోని నిందితులను రిమాండ్ నిమిత్తం ఖమ్మం జైలుకు తరలిస్తారు. కానీ సంజయ్ తరఫు న్యాయవాదులు ఆయనను కరీంనగర్ జైలుకు తరలించాలని కోరగా న్యాయమూర్తి అంగీకరించారు. ఈ మేరకు బండి సంజయ్‌ను భారీ బందోబస్తు మధ్య కరీంనగర్ జైలుకు తీసుకెళ్లారు. మిగతా నిందితులను ఖమ్మం జైలుకు తరలించారు. కరీంనగర్లో హైఅలర్ట్ కరీంనగర్ క్రైం: పోలీసులు బండి సంజయ్‌ను బుధవారం రాత్రి 10 గంటలకు కరీంనగర్ జైలుకు తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కరీంనగర్ పట్టణంలో హైఅలర్ట్ ప్రకటించారు. మానేరు బ్రిడ్జి నుంచి బస్టాండ్ వరకు, జైలు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంజయ్ కుటుంబ సభ్యులు జైలు వద్దకు చేరుకుని ఆయనను కలిసేందుకు ప్రయత్నించినా ఒకే చెప్పలేదు. బీజేపీ మాజీ అధ్యక్షుడు, సీనియర్ న్యాయవాది బాస సత్యనారాయణను మాత్రమే జైలు వద్దకు అనుమతించారు. దౌర్జన్యంగా లాక్కెళ్లారు: సంజయ్ భార్య అపర్ణ పోలీసులు తన భర్తను దౌర్జన్యంగా లాక్కెళ్లారని బండి సంజయ్ సతీమణి అపర్ణ బుధవారం ఆరోపించారు. మంగళవారం అర్ధరాత్రి తమ ఇంటికి వచ్చిన పోలీసులు.. సంజయ్ భోజనం చేసిన తర్వాత గుండెకు సంబంధించిన మందులు వేసుకోవాల్సి ఉందని చెప్పినా వినకుండా దౌర్జన్యం చేశారని మండిపడ్డారు. వారెంట్ చూపించాలని అడిగితే ఎలాంటి సమాధానం ఇవ్వలేదని చెప్పారు. పోలీసుల తీరు బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై పెట్టిన సెక్షన్లు ఇవీ.. బండి సంజయ్, ఇతర నిందితులపై కమలాపూర్ పోలీసులు 4ఏ, 6 రెడ్‌విత్ 8 ఆఫ్ తెలంగాణ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ యాక్ట్–1997; సెక్షన్ 66డి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ)యాక్ట్లతోపాటు ఐపీసీ సెక్షన్లు 120బీ,420, 447, 505 కింద కేసు నమోదు చేశారు. ► ఇందులో ప్రధాన నిందితుడి (ఏ1)గా బండి సంజయ్‌ను, ఏ2గా ప్రశాంత్, ఏ3గా మహేశ్, ఏ4గా మైనర్ బాలుడు, ఏ5గా మోతం శివగణేశ్, ఏ6గా పోగు సుభాష్, ఏ7గా పోగు శశాంక్, ఏ8గా దూలం శ్రీకాంత్, ఏ9గా పెరుమాండ్ల శ్రామిక్, ఏ10గా పోతబోయిన వర్షిత్ పేర్లను చేర్చారు. ► మొత్తం పది మందిపై కేసు నమోదు చేయగా.. మొదట నలుగురిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చినట్టు పోలీసులు వెల్లడించారు. -
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్.. దృశ్యాలు
-
బండి సంజయ్ అరెస్టు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్ / కరీంనగర్‌క్రైం: కరీంనగర్లో మంగళవారం హైడ్రామా చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటలు దాటిన తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకున్న నగర పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. ఈ క్రమంలో పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య భారీ తోపులాట జరిగి ఉద్రిక్తతకు దారి తీసింది. టెన్త్ పేపర్ల లీకేజీకి సంబంధించి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా సంజయ్‌ను హైదరాబాద్ వైపు తీసుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ అదనపు డీసీపీ చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు , సీఐలు నటేష్, లక్ష్మీబాబు, దామోదర్‌రెడ్డి దాదాపు 50 మందికి పైగా పోలీసులు అర్ధరాత్రి సమయంలో బండి సంజయ్ ఇంటి వద్దకు చేరుకున్నారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నామని సహకరించాలని కోరారు. తన అరెస్టుకు కారణంగా చూపించాలని, తనకు వారెంటు చూపాలంటూ పోలీసులతో సంజయ్ వాగ్వాదానికి దిగారు. మరో వైపు బండి సంజయ్పే అరెస్టు చేస్తున్నారనే ప్రచారంతో బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండడంతో సంజయ్‌ను పోలీసులు ఇంటి నుండి బలవంతంగా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. పోలీసుల ప్రయత్నాన్ని కార్యకర్తలు ప్రతిఘటించారు. పోలీసుల జులుం నశించాలని నినాదాలు చేస్తూ ఆయన అరెస్టును అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు బలవంతంగా సంజయ్‌ను వాహనంలో ఎక్కించి అక్కడి నుంచి తరలించారు. ఎక్కడికి తీసుకెళ్తున్నారో చెప్పాలంటూ కార్యకర్తలు, అనుచరులు కోరినా పట్టించుకోకుండా అరెస్టు చేసి తీçసుకెళ్ళారు. తిమ్మాపూర్ మీదుగా సంజయ్‌ను తీసుకెళ్తుండగా వాహనం మొరాయించడంతో మరో వాహనంలో సంజయ్‌ను తీసుకెళ్లారు. అయితే పోలీసు వాహనాలు హైదరాబాద్ వైపు వెళ్లాయి. బుధవారం బండి సంజయ్ అత్త ( సంజయ్ భార్య తల్లి) మరణించి తొమ్మిది రోజులు అవుతుండటంతో సంజయ్ కరీంనగర్‌కు వచ్చారు. బుధవారం ఉదయం టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రెస్ మీట్ పెట్టేందుకు సిద్ధమవుతుండగా పోలీసులు ఆకస్మికంగా అరెస్టు చేయడం గమనార్హం. కాగా సంజయ్ అరెస్టును బీజేపీ తీవ్రంగా పరిగణిస్తోందని, అరెస్టుకు కారణం చెప్పకుండా అర్ధరాత్రి ఇంటిపై దాడి చేసి అరెస్టు చేస్తారా? అని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్‌కు మూడిందని అన్నారు. -
రూ.100 కోట్ల దావా
సాక్షి, హైదరాబాద్: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీక్‌కు సంబంధించి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. తనపై నిరాధారమైన, అసత్య ఆరోపణలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం వారికి తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీసులు పంపించారు. వారిద్దరూ తనపై చేసిన వ్యాఖ్యలను వారం రోజుల్లోపు వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పకుంటే రూ.100 కోట్ల పరువు నష్టం దావాను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు. వ్యక్తిత్వాన్ని కించపరిచేలా వ్యాఖ్యలు ‘ఈ నెల 17 నుంచి 25 వరకు వివిధ టీవీ చానెళ్లతో పాటు డిజిటల్, సోషల్ మీడియాలో తన పరువుకు భంగం కలిగించేలా ఇద్దరు నేతలు ప్రెస్మీట్లు పెట్టి మాట్లాడారు. 2009 నుంచి 2018 వరకు సిరిసిల్ల నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలుపొంది, మంత్రిగా పనిచేస్తున్న, విద్యావంతుడినైన నా ప్రతిష్టకు.. బండి సంజయ్, రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భంగం కలిగించాయి. నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఆ వ్యాఖ్యలు ఉన్నాయి..’ అని కేటీఆర్ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. దురుద్దేశంతోనే పదేపదే అబద్ధాలు ‘సుదీర్ఘ కాలం పాటు ప్రజా జీవితంలో ఉన్న నా పరువుకు భంగం కలిగించాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్, రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నంత మాత్రాన ఎదుటివారిపై అసత్య ప్రేలాపనలు చేసే హక్కు వీరికి లేదు. ఈ నేపథ్యంలోనే ఇండియన్ పీనల్ కోడ్‌లోని 499, 500 సెక్షన్ల ప్రకారం పరువు నష్టం దావా నోటీసులు పంపుతున్నా. ఇప్పటికైనా ఎలాంటి ఆధారాలు లేని సత్య దూరమైన ఆరోపణలు మానుకోవాలి. ఇప్పటికే చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేనిపక్షంలో దావాను ఎదుర్కోవాల్సి ఉంటుంది..’ అని మంత్రి స్పష్టం చేశారు. బండి సంజయ్, రేవంత్ రెడ్డిలు చేసిన ఆరోపణల వివరాలను నోటీసుల్లో కేటీఆర్ పొందుపరిచారు. ఇవే సెక్షన్ల కింద రాహుల్‌కు జైలు శిక్ష గుజరాత్‌లోని సూరత్ కోర్టులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఐపీసీ సెక్షన్లు 499, 500 కిందే కేసు నమోదైంది. ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఈ కేసులోనే రాహుల్‌కు రెండేళ్ల జైలు శిక్షతో పాటు రూ.15 వేలు జరిమానా కూడా న్యాయమూర్తి విధించారు. ఈ తీర్పు నేపథ్యంలోనే రాహుల్‌గాంధీని లోక్‌సభ సభ్యత్వానికి అనర్హుడిగా సెక్రటేరియట్ ప్రకటించింది. ప్రస్తుతం కేటీఆర్ కూడా ఇవే సెక్షన్ల కింద లోక్‌సభ సభ్యులుగా ఉన్న రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లకు లీగల్ నోటీసులు పంపించడం ఆసక్తికరంగా మారింది. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌ల స్థానిక చిరునామాలకు, అలాగే ఢిల్లీ చిరునామాలకు కూడా కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. ముందే హెచ్చరించి నోటీసులు టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ ఘటనను బూచిగా చూపి ఉద్యోగ నియామకాల ప్రక్రియను ఆపేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర పన్నాయని కేటీఆర్ పలు సందర్భాల్లో విమర్శించారు. తన వ్యక్తిగత సహాయకుడిపై రేవంత్ చేసిన వ్యాఖ్యలను కూడా రెండు రోజుల క్రితం ఖండించారు. ఉద్యోగాల భర్తీని అడ్డుకునే కుట్రలను సహించేది లేదని పదే పదే చెప్పిన కేటీఆర్.. ఇద్దరు విపక్ష నేతలకు లీగల్ నోటీసులు ఇస్తానని ఈ నెల 23నే చెప్పారు. చెప్పినట్టుగానే మంగళవారం నోటీసులు పంపించారు. -
కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే! పేపర్ల లీకేజీ నిర్వాకం ఆయనదే..
సాక్షి, హైదరాబాద్: ‘‘టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీకి కేటీఆర్ నిర్వాకమే కారణం. ఏ శాఖలో తప్పులు జరిగినా కేటీఆరే స్పందిస్తున్నారు. ఆయన షాడో సీఎం. టీఎస్పీఎస్సీ పేపర్ లీకైతే మాత్రం తనకేం సంబంధం లేదంటున్నారు. తప్పు చేయకపోయినా మంత్రులను బయటికి పంపిన సీఎం కేసీఆర్.. తన కొడుకు తప్పుచేస్తే ఎందుకు బర్తరఫ్ చేయడం లేదు. కేటీఆర్ రాజీనామా చేయాలి. పేపర్ లీకేజీపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేపట్టాలి, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా పోరాడుతాం..’’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. శనివారం హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు ధర్నాచౌక్‌లో ‘మా నౌకరీలు మాగ్గావాలే’నినాదంతో బీజేపీ నిరుద్యోగ మహాధర్నా నిర్వహించింది. బండి సంజయ్ ధర్నాలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ దొంగ సారా దందాలో దొరికిన బిడ్డను, లీకు వీరుడు కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నిస్తూ.. నిరుద్యోగులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పరీక్షల్లో స్కాం, లిక్కర్లో, ధరణిలో, ఇరిగేషన్ టెండర్లలో స్కాంలు.. కేసీఆర్ పాలన అంతా స్కాములమయమని ఆరోపించారు. తప్పు చేయకపోతే భయమెందుకు? లీకేజీపై ప్రశ్నించిన తమకు నోటీసులు ఇస్తున్నారని... మరి కేటీఆర్‌కు ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదని సంజయ్ ప్రశ్నించారు. మొదట ఇద్దరికే లీకేజీతో సంబంధం ఉందని కేటీఆర్ చెప్పారని.. కానీ ఈ కేసులో ఇప్పటికే 13 మందిని అరెస్ట్ చేశారని గుర్తు చేశారు. కేటీఆర్ ఏ హోదాతో అలా చెప్పారు? ఆయనకు సిట్ నోటీసులు ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. లీకేజీకి సంబంధించి కేటీఆర్ పాత్ర ఉందని.. ఆయనకూ నోటీసులు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ‘‘టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యులను ఎందుకు తొలగించడం లేదు? తొలగిస్తే బయటకొచ్చి వాస్తవాలు బయటపెడతారనే భయంతోనే వారిపై చర్యల్లేవు. 30లక్షల మంది నిరుద్యోగుల భవిష్యత్తును నాశనం చేసిన లీకేజీపై కేసీఆర్ ఎందుకు నోరు మెదపడం లేదు? తప్పు చేయకపోతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి భయమెందుకు? దీనిపై తెలంగాణ ఉద్యమకారులు స్పందించాలి. మీకు అండగా మేమున్నాం. నిరుద్యోగుల తరఫున రొడ్డెక్కి కొట్లాడుదాం..’’అని పిలుపునిచ్చారు. ఆందోళనలు ఉధృతం చేస్తాం.. బీజేపీ నిరుద్యోగుల పక్షాన ఆందోళనలను ఉధృతం చేస్తుందని బండి సంజయ్ తెలిపారు. ఏప్రిల్ 2 నుండి 6 వరకు ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిరుద్యోగ మార్చ్ నిర్వహిస్తామని.. తర్వాత హైదరాబాద్‌లో భారీ ఎత్తున నిరుద్యోగ మిలియన్ మార్చ్ చేపడతామని చెప్పారు. అవసరమైతే సర్కార్‌కు సెగ తగిలేందుకు రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామని ప్రకటించారు. కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు వస్తాయనే ఆశలు పోయాయని.. బీజేపీ అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని సంజయ్ ప్రకటించారు. నిరుద్యోగుల పక్షాన కొట్లాడిన బీజేవైఎం నాయకులను జైల్లో వేశారని.. అక్కడ ఇష్టానుసారం వేధిస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్కు రోజులు దగ్గరపడ్డాయ్: బీజేపీ నేతలు బిడ్డ లిక్కర్ దందాపై కేసీఆర్ నోరెందుకు విప్పడం లేదని.. తెలంగాణ ప్రభుత్వాన్ని మొత్తం ఢిల్లీకి ఎందుకు తీసుకుపోయారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. ‘‘కేసీఆర్ ప్రభుత్వానికి, బీఆర్ఎస్కు రోజులు దగ్గర పడ్డాయ్.. ఎప్పుడు ఎన్నికలొచ్చినా కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజీకి సంబంధించి కేటీఆర్ రాజీనామా చేయాల్సిందే..’’అని బీజేపీ సీనియర్ నేతలు ఈటల రాజేందర్, ఎం.రఘునందన్‌రావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి, పొంగులేటి సుధాకరరెడ్డి మండిపడ్డారు. బీజేపీ దీక్షలో నేతలు నల్లు ఇంద్రసేనారెడ్డి, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్‌తోపాటు పలు ప్రజా, విద్యార్ధి, యువజన సంఘాల నాయకులు, అన్ని యూనివర్సిటీల విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
మళ్లీ భావోద్వేగాలను రెచ్చగొట్టే మహాకుట్ర
సాక్షి, హైదరాబాద్: ‘బీఆర్ఎస్ నాయకత్వంపై, కల్వకుంట్ల కుటుంబంపై రాష్ట్ర ప్రజలతోపాటు పార్టీ నేతలు, కార్యకర్తలకు కూడా నమ్మకం సడలిందనడానికి సీఎం కేసీఆర్ రాసిన లేఖే ఉదాహరణ. ఏనాడూ కార్యకర్తలను పట్టించుకోని కేసీఆర్ ఈరోజు వారిని ఉద్దేశించి లేఖ రాయడం వెనుక పెద్దకుట్ర దాగి ఉంది’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. దగాపడ్డ తెలంగాణ ప్రజలారా, మళ్లీ భావోద్వేగాలను రెచ్చగొట్టే మహాకుట్ర జరుగుతోంది. ఈసారి మోసపోతే గోస పడతాం. తస్మాత్ జాగ్రత్త. లిక్కర్ స్కామ్‌లో బిడ్డ, పేపర్ లీకేజీలో కొడుకు, అవినీతి స్కాంల నుంచి దారి మళ్లించే కుట్రలో భాగమే సీఎం లేఖ’అని పేర్కొంటూ సోమవారం రాత్రి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. ‘సమస్యలు చెప్పుకుందామని ప్రగతిభవన్‌కు వస్తే పోలీసులను ఉసిగొల్పి లాఠీలు ఝుళిపించిన కేసీఆర్, ఫాంహౌస్‌కే పరిమితమై పాలన కొనసాగిస్తూ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కార్యకర్తల మనోభావాలను గాలికొదిలేశారు’అని మండిపడ్డారు. ‘తన కుటుంబమే పరమావధిగా వేల కోట్ల రూపాయలు సంపాదించిన కేసీఆర్ అవినీతి కోటలు బద్దలయ్యే సమయం ఆసన్నమయ్యేసరికి అకస్మాత్తుగా కార్యకర్తలపై ప్రేమ పుట్టుకొచ్చింది’అని ఆరోపించారు. ‘ఇప్పటికే కాళేశ్వరం స్కామ్, ఇంటర్మీడియట్ విద్యార్థుల మరణాలకు కారణమైన ఐటీ స్కాం, ధరణి స్కాం, రియల్ ఎస్టేట్ మాఫియా వంటివి అనేకం రాబోయే రోజుల్లో మరిన్ని బయటకు వస్తాయనే భయంతో తన కుటుంబంపైకి, తన పార్టీ కార్యకర్తలే తిరగబడకుండా వారిని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి ప్రతిపక్షాలపైకి ఉసిగొల్పే కుట్రకు తెరదీశారు’అని ధ్వజమెత్తారు. ‘బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి ఏటా యూపీఎస్సీ తరహాలో జాబ్ కేలండర్ ప్రకటిస్తాం. పేదలందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తాం. రైతులందరికీ ఫసల్‌బీమా యోజన కింద నష్టపరిహారం అందిస్తాం’ అని సంజయ్ పేర్కొన్నారు. అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన రైతాంగాన్ని వెంటనే ఆదుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈమేరకు మరో లేఖ రాశారు. -
లీకేజీలో నమ్మలేని నిజాలు
సాక్షి, హైదరాబాద్: గ్రూప్–1 పరీక్షలో నమ్మలేని నిజాలు బయటకొస్తున్నాయని... బీఆర్ఎస్ నేతల పిల్లలు, బంధువులు, వారి వద్ద పనిచేసే వాళ్లు గ్రూప్–1 పరీక్షలో క్వాలిఫై అయినట్లు తమకు సమాచారం అందిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘లక్షలాది మంది నిరుద్యోగులను వంచించిన కేసీఆర్ ప్రభుత్వం దీనిపై 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. గ్రూప్–1 పరీక్షల్లో జరిగిన అక్రమాలు, కేసీఆర్ కొడుకు నిర్వాకంపై అతిత్వరలో వాస్తవాలు బయటపెడతాం. అసలైన దోషులను తెలంగాణ సమాజం ముందుంచుతాం’అని సంజయ్ పేర్కొన్నారు. జెడ్పీటీసీ, సర్పంచ్, సింగిల్‌విండో చైర్మన్ పిల్లలు క్వాలిఫై... ‘జగిత్యాల జిల్లాలోని ఓ మండలంలో 50 మందికిపైగా క్వాలిఫై అయ్యారు. ఒక చిన్న గ్రామంలో ఆరుగురు అర్హత సాధించారు. వారంతా బీఆర్ఎస్ నేతల కొడుకులు, బంధువులు, వాళ్ల వద్ద పనిచేసే వాళ్లే. నలుగురు సర్పంచుల కొడుకులు, సింగిల్ విండో చైర్మన్ కొడుకుతోపాటు ఒక జెడ్పీటీసీ వద్ద బాడీగార్డ్‌గా పనిచేసే వ్యక్తి కొడుకు, ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కుమారుడు క్వాలిఫై అయ్యాడు. ఒక సర్పంచ్ కుమారుడికి అర్హత అయ్యే అవకాశమే లేనప్పటికీ క్వాలిఫై చేశారు’అని సంజయ్ ఆరోపించారు. కేటీఆర్ సహకారంతోనే లీకేజీ... ‘కేసీఆర్ కొడుకు మంత్రి కేటీఆర్ సహకారంతోనే పేపర్ లీకేజీ జరిగింది. ఆయన సన్నిహిత వ్యక్తే ఇదంతా చేశాడు. ఒక్కొక్కరి నుంచి రూ. 3 నుంచి రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం ఉంది. తక్షణమే కేసీఆర్ కొడుకును కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలి’అని సంజయ్ డిమాండ్ చేశారు. సీఎం కొడుకు ప్రమేయం ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నియమించిన సిట్‌తో విచారణ ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తేనే వాస్తవాలన్నీ వెలుగులోకి వస్తాయని పునరుద్ఘాటించారు. నయీం డైరీ, సినీ తారల డ్రగ్స్ కేసుల తరహాలోనే పేపర్ లీకేజీ కేసును సైతం సిట్‌కు అప్పగించి పక్కదారి పట్టించే కుట్ర జరుగుతోందని సంజయ్ ఆరోపించారు. -
లీకేజీ వ్యవహారం.. కేసీఆర్ సర్కార్‌పై బండి ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈ పరీక్షా పత్రం లీక్ కావడం దుమారాన్ని రేపుతోంది. ఈ ప్రభావం మిగతా పరీక్షలపైనా పడొచ్చనే ఆందోళన అభ్యర్థుల్లో నెలకొంది ఇప్పుడు. మరోవైపు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేసే కీలక బోర్డు నుంచి పేపర్లు బయటకు రావడంపై రాజకీయపరమైనా విమర్శలు మొదలయ్యాయి. కేసీఆర్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారాయన. TSPSC నిర్వహించిన పరీక్షల క్వశ్చన్ పేపర్లన్నీ లీక్ అయ్యాయని ఆరోపిస్తున్నారు బండి సంజయ్. ఈ మేరకు గ్రూప్-1 ప్రశ్నాపత్రం సైతం లీకేజీ అయ్యిందని చెబుతూ.. ప్రవీణ్ ఓఎంఆర్ షీట్‌ను సాక్ష్యంగా విడుదల చేశారాయన. ‘‘పేపర్ లీక్ చేసిన టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏ ప్రవీణ్‌కు అన్ని మార్కులా?. ఇప్పుడు ప్రవీణ్ వల్ల ఆయన పరీక్ష రాసే కాలేజీకి ప్రత్యేకంగా పరీక్ష నిర్వహిస్తారా? నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడతారా? అంటూ బండి విమర్శలు గుప్పించారు. టీఎస్పీఎస్సీ ఛైర్మన్, సభ్యులందరితో కూడిన కమిషన్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేసిన బండి సంజయ్.. రాబోయే రెండు నెలల్లో జరగబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కూడా లీక్ అయ్యాయని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో సింగరేణి పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూసిందని, కేసీఆర్ పాలనలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన అన్ని పరీక్షల పేపర్లు కూడా లీక్ అయ్యాయని ఆరోపిస్తూ.. ఈ లీకేజీలన్నింటిపై న్యాయ విచారణ జరగాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారాయన. రాష్ట్రంలో ఉద్యోగాలివ్వలేక.. ఇంత దారుణాలకు ఒడిగడతారా? అంటూ టీ సర్కార్‌ను నిలదీసిన బండి సంజయ్.. నిరుద్యోగులతో ప్రగతి భవన్, టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ లీకేజీ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్ కోసం గ్రూప్ 1 పరీక్షా సమయాన్ని సైతం మార్చారని, అభ్యర్థులందరికీ ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరీక్ష నిర్వహిస్తే... ప్రవీణ్ పరీక్ష రాసే కాలేజీకి మాత్రం మధ్యాహ్నం తరువాత నిర్వహించారని ఆరోపించారు బండి సంజయ్. దీనిపై ఓ పత్రికలో వార్త వచ్చేంతవరకు కూడా టీఎస్పీఎస్సీ స్పందించలేదని విమర్శించారాయన. లీకేజీ వ్యవహారం వెనుక మతలబు ఉందని, సీఎం కేసీఆర్‌తోపాటు టీఎస్పీఎస్సీ పెద్దల పాత్ర లేనిదే ఇలాంటివి జరగడం వీలుకాదని బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతున్న ఈ అంశాన్ని గవర్నర్ తమిళిసై సీరియస్‌గా తీసుకోవాలని విజ్ఞప్తి చేశారాయన. సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణకు ఆదేశించాలని గవర్నర్‌ను కోరారు బండి సంజయ్. బండి సంజయ్ ప్రకటన.. ► ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ప్రశ్నాపత్రాల లీకేజీ అంతులేని రీతిలో కొనసాగుతోంది. ఉద్యోగాలకున్న డిమాండ్ రీత్యా ఎలాగైనా పోటీ పరీక్షల్లో తమకు అనుకూలురైన వాళ్లు నెగ్గాలన్న తాపత్రయంతో చేసే తప్పిదాలతో లక్షలాది మంది నిరుద్యోగుల జీవితాలను ఫణంగా పెట్టడం క్షమించరాని నేరం. ► మున్సిపాలిటీల పరిధిలో పని చేసే అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాల కోసం జరిగిన పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 55 వేల మంది అభ్యర్ధులు పాల్గొన్నారు. కానీ పరీక్షపత్రం లీకేజి వ్యవహారం వెలుగు చూడటంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ పరీక్షను రద్దు చేసింది. దీంతోపాటు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఎగ్జామ్ ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు సమాచారం అందుతోంది. ► ఇవి మాత్రమే కాకుండా గ్రూప్-1 పరీక్ష ప్రశ్నాపత్రం సైతం లీకైనట్లు స్పష్టమైన ఆధారాలు కన్పిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ సెక్రటరీ పీఏగా పనిచేస్తున్న ప్రవీణ్ ముందుగానే గ్రూప్-1 ప్రశ్నాపత్రంలోని ప్రశ్నలను సేకరించి పరీక్ష రాశారు. ► ఇంకా ఆశ్చర్యపోయే విషయం ఏమిటంటే... ప్రవీణ్ కోసం పరీక్ష రాసే సమయ వేళలను కూడా మార్చేసినట్లు తమ ద్రుష్టికి వచ్చింది. ఈ అంశంపై ఓ పత్రికలో వార్త వచ్చేదాకా టీఎస్పీఎస్సీ స్సందించనేలేదు. దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే అనుమానాలొస్తున్నాయి ► తమకు వస్తున్న ఫిర్యాదులు, సమాచారాన్ని పరిశీలిస్తే... టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలన్నీ కేసీఆర్ కుటుంబానికి ముందుగానే చేరుతున్నాయని అర్ధమవుతోంది. రాబోయే 2 నెలల్లో నిర్వహించబోయే పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలకు సంబంధించిన సమాచారం సైతం కేసీఆర్ కుటుంబీకుల వద్దకు చేరినట్లు తెలుస్తోంది. ► గతంలో కూడా ఇటువంటి లీకేజీలు పెద్ద ఎత్తున జరిగినా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించటంతో లీకేజీ వీరులు చెలరేగిపోతున్నారు. 2018లో పదో తరగతి పరీక్షల సమయంలో పరీక్ష పత్రాలు రాష్ట్ర వ్యాప్తంగా లీక్ కావటం, ఎంసెట్ పశ్నాపత్రాల లీకేజీ వాట్సప్ గ్రూపుల్లో ప్రత్యక్షం కావటం విద్యార్ధుల్లోనూ తల్లితండ్రుల్లోనూ ఆందోళనకు దారితీసింది. లేనిపోని నిబంధనల పేరుతో కానిస్టేబుల్, ఎస్ఐ పరీక్షల్లోనూ అనేక అవకతవకలు జరిగిన విషయం సైతం అనేక ఆందోళనలకు తావిస్తోంది. ► అయినప్పటికీ ఈ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చెదురుమదురు ఘటనగా పరిగణించింది. అప్పుడే ఈ వ్యవహారంపై లోతైన దర్యాప్తు జరిపించి ఉంటే వాస్తవాలు వెలుగులోకి వచ్చేవి. అయినా పట్టించుకోలేదంటే దీనివెనుక కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. ► నిబంధనల ప్రకారం.... టీఎస్పీఎస్సీలో కాన్ఫిడెన్షియల్ డిపార్ట్ మెంట్ ఛైర్మన్ పరిధిలో మాత్రమే ఉంటుంది. ఛైర్మన్ కు తెలియకుండా పేపర్ లీక్ కావడం అసాధ్యం. క్వశ్చన్ పేపర్ ఏ ఒక్క ఉద్యోగి కంప్యూటర్లో ఉండటానికి వీల్లేదు. అట్లాంటిది ఒక సెక్షన్ ఆఫీసర్ కంప్యూటర్లో ప్రశ్నాపత్రాలు ఎట్లా ప్రత్యక్షమవుతాయి? వాటిని ప్రవీణ్, రాజశేఖర్ ఎట్లా పెన్ డ్రైవ్ లోకి తీసుకుంటారు? టీఎస్పీఎస్సీ ఛైర్మన్, కార్యదర్శి ప్రమేయం లేకుండా ఇది అసాధ్యం? ► దీనివెనుక పెద్ద కుట్ర దాగి ఉంది. తెలంగాణలోని లక్షలాది నిరుద్యోగుల జీవితాలతో ముడిపడి ఉన్న ఈ అంశాన్ని కేసీఆర్ ప్రభుత్వం తేలికగా కొట్టిపడేసేందుకు యత్నిస్తోంది. ప్రవీణ్, రాజశేఖర్, మరికొందరు కిందిస్థాయి ఉద్యోగులను మాత్రమే ఈ మొత్తం కుట్రకు బాధ్యులను చేసి తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు పెద్ద స్కెచ్ వేసినట్లు అర్ధమవుతోంది. ► వాస్తవానికి తెలంగాణలో ఉద్యోగాలను భర్తీ చేయడం సీఎం కేసీఆర్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. తెలంగాణను ఆర్దికంగా పూర్తిగా దివాళా తీయించిన కేసీఆర్ కొత్త ఉద్యోగాలను భర్తీ చేయలేని స్థితిలో ఉన్నారు. లక్ష ఉద్యోగాలను భర్తీ చేస్తామని అసెంబ్లీలో ఇచ్చిన హామీని అమలు చేయడం అసాధ్యమని తెలిసి.. నోటిఫికేషన్లు, ప్రశ్నాపత్రాల లీకేజీ పేరుతో కాలయాపన చేస్తూ నిరుద్యోగుల నోట్లో మట్టి కొడుతున్నారు. అందులో భాగంగానే గ్రూప్-1సహా ఇతర పరీక్షా పత్రాలన్నీ లీకేజీ చేస్తున్నట్లు అర్ధమవుతోంది. ► తెలంగాణలో బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం... సుమారు 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉంటే... అందులో 80 వేలు భర్తీ చేస్తామని అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలకు మరి కొద్ది నెలల సమయం మాత్రమే ఉన్నప్పటికీ ఇప్పటి వరకు 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ జారీ చేశారు. ఆ ఉద్యోగాలకు సంబంధించిన పరీక్షా పత్రాలన్నీ లీకేజీ కావడం పరిశీలిస్తే... ఇందులో కచ్చితంగా కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ► సీఎం కుటుంబంపై గతంలోనూ అనేక ఆరోపణలొచ్చాయి. కేసీఆర్ హయాంలో సింగరేణి సంస్థలో జరిగిన నియామకాల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయని అనేక వార్తలొచ్చాయి. ఫిర్యాదులు అందాయి. సింగరేణి బొగ్గు గని కార్మిక సంఘం గౌరవాధ్యక్షురాలిగా ఉన్న సీఎం కూతురు కల్వకుంట్ల కవిత ఆయా ఉద్యోగాలన్నింటినీ అమ్ముకుందనే ఆరోపణలు వచ్చినయ్.. అయినా వాటిపై సమగ్ర విచారణ జరపకపోవడం బాధాకరం. ► గతంలో జోన్ల పేరుతో, గుణాత్మక మార్పు పేరుతో కేసీఆర్ సర్కార్ ఉద్యోగాలను భర్తీ చేయకుండా నిరుద్యోగులను మభ్యపెట్టింది. ఆ తరువాత ప్రతిపక్షాలను, కోర్టు కేసులను బూచీగా చూపి ఉద్యోగులను మోసం చేసింది. ఇప్పుడు ఎన్నికల సమీపించడంతోపాటు లీకేజీ, ఉద్యోగుల ప్యాకేజీ పేరుతో డ్యామేజీ చేసి నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టేందుకు కుట్ర చేయడం క్షమించరాని నేరం. ► తాజాగా టీఎస్పీఎస్పీ నియమకాల్లోనూ ఛైర్మన్, కార్యదర్శులతోపాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం పాత్ర ఉందనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై తక్షణమే సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర శాఖ డిమాండ్ చేస్తోంది. ► ఈ మొత్తం వ్యవహారంపై రాష్ర గవర్నర్ తమిళ సై సౌందరరాజన్ జోక్యం చేసుకుని తెలంగాణలోని నిరుద్యోగులకు న్యాయం చేయాలని, వారికి అభయం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. -
సీబీఐ దర్యాప్తు జరిపించాలి
సాక్షి, హైదరాబాద్: జీహెచ్ఎంసీ పరిధిలోని పాతబస్తీలో ఎలాంటి ఆధారాల్లేకుండా జారీచేసిన 27 వేల జనన, 4 వేల మరణ ధ్రువీకరణ పత్రాలతోపాటు రేషన్, ఓటర్ కార్డులపై వెంటనే సమగ్ర దర్యాప్తు చేయించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యానికి, జీహెచ్ఎంసీలో పేరుకుపోయిన అవినీతికి ఈ ఉదంతం నిదర్శనమన్నారు. ఇందుకు నైతిక బాధ్యత వహించి సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పెద్దలు, ఎంఐఎం నేతల హస్తం లేనిదే ఇంత భారీగా సర్టిఫికెట్ల జారీకి అవకాశం లేదని.. అందువల్ల దీనిపై సీబీఐ దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం తూతూమంత్రంగా విచారణ జరిపి కిందిస్థాయి సిబ్బంది, అధికారులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవాలని చూస్తోందని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలో వేలాదిగా సర్టిఫికెట్ల జారీ ఆందోళన కలిగించే అంశమన్నారు. దేశంలో అల్లర్లకు ఉగ్ర కుట్ర.. జీహెచ్ఎంసీ జారీచేసిన బర్త్ సర్టిఫికెట్లతో పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఉగ్రవాదులు పాస్‌పోర్టులు పొంది హైదరాబాద్ కేంద్రంగా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపించారు. ‘ఓట్లు, సీట్ల కోసం పాతబస్తీని ఎంఐఎంకు కేసీఆర్ ధారాదత్తం చేశాడు. ఎంఐఎం చెప్పినట్లు ఆడుతున్నాడు. మా అనుమతి లేకుండా పాతబస్తీలోకి అడుగుపెట్టే దమ్ముందా? అని అనడంతోపాటు 15 నిమిషాలు టైమిస్తే హిందువులను నరికి చంపుతామని ఒవైసీ సోదరులు సవాల్ విసిరినా నోరు మెదపని చేతగాని దద్దమ్మ కేసీఆర్’అని మండిపడ్డారు. టీఆర్ఎస్, ఎంఐఎం ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్‌లో అల్లర్లకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. పాతబస్తీ మొత్తం జల్లెడపడితే లక్షల్లో ఇలాంటి సర్టిఫికెట్లు మరిన్ని బయటపడే అవకాశం ఉందన్నారు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అంశాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, పార్టీ కార్పొరేటర్లు, నాయకులతో కలసి వాస్తవాలు వెలుగులోకి వచ్చేదాకా ఉద్యమిస్తామన్నారు. -
మళ్లీ 'షా'రొస్తున్నారు..అప్పటిదాకా ఇక్కడే మకాం..!
తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేయడం లక్ష్యంగా కేంద్ర హోంమంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా నేరుగా కదన రంగంలోకి దిగుతున్నారు. బీజేపీ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఇన్చార్జిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఎన్నికల వ్యూహాల రూపకల్పన నుంచి క్షేత్రస్థాయిలో ప్రచారం దాకా పర్యవేక్షించనున్నారు. ఇందుకోసం అసెంబ్లీ ఎన్నికల పోరు ముగిసేదాకా అమిత్‌షా హైదరాబాద్‌లోనే మకాం వేసి పార్టీ శ్రేణులను ఉరుకులు, పరుగులు పెట్టించనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి, ఆధిపత్య పోరు సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టనున్నారని వివరించాయి. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ఆయన తెలంగాణపైనే పూర్తిగా దృష్టి కేంద్రీకరించనున్నారని పేర్కొన్నాయి. ఇప్పటికే కర్ణాటకలో షురూ.. కర్ణాటకలో మరో మూడు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. అయితే కొంతకాలం నుంచి కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వంపై అసంతృప్తి పెరుగుతోందన్న అభిప్రాయం ఉంది. దీనికితోడు రాహుల్ గాంధీ భారత్‌జోడో యాత్రతో కాంగ్రెస్ పార్టీ కాస్త పుంజుకుందన్న అంచనాలూ వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన బీజేపీ. ఆ రాష్ట్రంలో పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతను అమిత్‌షాకే అప్పగించింది. గత ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీకి పూర్తి మెజారిటీ దక్కకపోవడానికి నేతల మధ్య కుమ్ములాటలు, సమన్వయం లేకపోవడమే ముఖ్య కారణమని గుర్తించిన నాయకత్వం.. ఈసారి ఆ సమస్య పునరావృతం కాకుండా అమిత్‌షా నేతృత్వంలో జాగ్రత్తలు తీసుకుంటోంది. ఆ రాష్ట్రంలో యావత్ ఎన్నికల వ్యూహ రచన ఆయన కనుసన్నల్లోనే సాగుతోంది. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో.. అక్కడే ఇల్లు అద్దెకు తీసుకుని, పూర్తి సమయం కేటాయించేందుకూ అమిత్‌షా సిద్ధమవుతున్నారు. కర్ణాటకలో ఎన్నికలు ముగిశాక.. అదే తరహాలో తెలంగాణపైనా దృష్టి పెట్టనున్నారు. సమన్వయ లేమి సమస్యతో.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వచ్చేందుకు సానుకూల వాతావరణం ఉందని.. కానీ రాష్ట్ర పార్టీ ముఖ్య నేతల మధ్య సమన్వయ లేమి సమస్యగా మారిందని ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిని పార్టీ అగ్ర నాయకత్వం గుర్తించిందని అంటున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా బీజేపీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరగడం, అందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం సాధించిన ఫలితాలు, సుపరిపాలన దోహదపడ్డాయని ఆ పార్టీ నేతలు అంటున్నారు. రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్‌కు వ్యతిరేకంగా బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలు, అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర, మోదీ, అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రుల పర్యటనలతో మంచి ఫలితాలు వచ్చాయని చెప్తున్నారు. కాషాయ జెండా ఎగిరేందుకు ఇంత అనుకూలంగా ఉన్న పరిస్థితిని.. ఎట్టి పరిస్థితుల్లోనూ చేజార్చుకోవద్దనే అభిప్రాయంతో అధినాయకత్వం ఉందని వివరిస్తున్నారు. ఇప్పటికే పరోక్షంగా పర్యవేక్షణ అమిత్‌షా ఇప్పటికే పరోక్షంగా రాష్ట్ర పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడి రాజకీయ పరిస్థితులు, బీఆర్ఎస్ సర్కార్ తీరు, సీఎం కేసీఆర్ వ్యవహారశైలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిశీలిస్తున్నారు. పార్టీ పరంగా చేపడుతున్న కార్యక్రమాలన్నీ ఆయన అదుపాజ్ఞలు, పర్యవేక్షణలోనే కొనసాగుతున్నాయని పార్టీ నేతలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే అమిత్‌షా, ఇతర అగ్రనేతలు కలసి.. గతంలో లోక్‌సభ, యూపీ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం కృషిచేసిన జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్‌ను రాష్ట్ర పార్టీ సంస్థాగత ఇన్చార్జిగా నియమించారు. ప్రస్తుతం బన్సల్ నేతృత్వంలోనే ‘ప్రజాగోస– బీజేపీ భరోసా’ స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌లు, పోలింగ్ బూత్ స్థాయిలో పార్టీ సంస్థాగత పటిష్టత, బూత్ సశక్తికరణ్ అభియాన్ వంటివి చేపడుతున్నారు. ఇక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఐదు విడతల్లో చేపట్టిన పాదయాత్రతో దాదాపు సగం అసెంబ్లీ నియోజకవర్గాలు కవర్ అయ్యాయి. ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పాదయాత్రలు కాకుండా.. రాష్ట్రంలోని నాలుగైదు రూట్లలో ముఖ్యనేతలంతా సమాంతరంగా పాల్గొనేలా రథయాత్రలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్టు పార్టీ నేతల సమాచారం. దీనికి సంబంధించి త్వరలోనే జాతీయ నాయకత్వం ఓ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. -
Telangana: పది నెలలూ ప్రజల్లోనే
సాక్షి, న్యూఢిల్లీ /సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని అన్ని స్థాయిల బీజేపీ నాయకులు సమన్వయంతో, సమష్టిగా వ్యవహరిస్తూ ఎన్నికల కురుక్షేత్రానికి సిద్ధం కావాలని ఆ పార్టీ అధిష్టానం పిలుపునిచ్చింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ సర్కార్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటికి సాగనంపేలా, తెలంగాణలో కచ్చితంగా కాషాయజెండా ఎగురవేసేలా.. స్పష్టమైన వ్యూహాలు, కార్యాచరణతో ముందుకు సాగాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో కొనసాగుతున్న నియంత, కుటుంబ పాలనకు చరమగీతం పాడే సత్తా కేవలం బీజేపీకే ఉందనే సంకేతాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించింది. ‘ఇంటింటికీ కమలం పువ్వు’ నినాదంతో వచ్చే పది నెలలు నిరంతరం ప్రజల్లోనే ఉంటూ వారి విశ్వాసాన్ని, మద్దతును కూడగట్టేలా వివిధ రూపాల్లో కార్యాచరణ ప్రణాళికను అమలు చేయాలని సూచించింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా మంగళవారం ఢిల్లీలో రాష్ట్ర పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అంతకుముందు నడ్డా, అమిత్‌షాతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ , తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జిలు తరుణ్‌ఛుగ్, సునీల్ బన్సల్, సహ ఇన్చార్జి అరవింద్ మీనన్, రాష్ట్రనేతలు సమావేశమయ్యారు. ఈ భేటీ మధ్యలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌తో అమిత్‌షా, నడ్డా, ఇతర నేతలు విడిగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రానికి చెందిన ఇతర నేతలు బయటే ఉండిపోయారు. ఆ తర్వాత మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి రెండున్నర గంటల వరకు రాష్ట్ర నేతలు కిషన్‌రెడ్డి, డీకే అరుణ, కె.లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, ఏపీ జితేందర్‌రెడ్డి, ధర్మపురి అరవింద్, పొంగులేటి సుధాకర్ రెడ్డి, విజయశాంతి, ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావులతో అమిత్‌షా, నడ్డా భేటీ అయ్యారు. మొత్తం మీద రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, పార్టీ సంస్థాగత బలోపేతం, అసెంబ్లీ ఎన్నికలు లక్ష్యంగా రాష్ట్ర పార్టీ సంసిద్ధత, వ్యూహాల ఖరారు వంటి అంశాలపై నాలుగు గంటల పాటు చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ‘ప్రజాగోస–బీజేపీ భరోసా’ స్ట్రీట్‌కార్నర్ మీటింగ్‌లకు ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని అభినందించిన నడ్డా, షా.. పలు అంశాలపై రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేశారు. గెలుపు లక్ష్యంగా ప్రజల్లోకి... ‘అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఇప్పటికే నిర్వహించిన కార్యక్రమాలకు ప్రజా స్పందన మెరుగ్గా ఉందని మాకు నివేదికలు అందాయి. ఈ మార్చి నుంచి సెప్టెంబర్ దాకా పోలింగ్ బూత్‌లు, నియోజకవర్గాల వారీగా సభలు, ర్యాలీలు, వివిధస్థాయిల నాయకుల చేరికలు వంటి వాటిని విస్తృతంగా చేపట్టి ప్రజలను బీజేపీ వైపు ఆకర్షితులను చేయాలి. ఎన్నికలకు పూర్తిస్థాయిలో సన్నద్ధమయ్యేందుకు క్షేత్రస్థాయి నుంచి సంస్థాగతంగా పటిష్టం కావడం, కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను ఎండగట్టడం, కేంద్ర ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజా బాహుళ్యంలోకి తీసుకెళ్లడంపై పార్టీ యావత్ యంత్రాంగం దృష్టి పెట్టాలి. రాష్ట్రంలో ఏమాత్రం అభివృద్ధి జరగకపోవడం, వివిధ వర్గాలు ఇంకా తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతుండటం వంటి అంశాలను మరింత ఉధృతంగా జనంలోకి తీసుకెళ్లాలి. 119 నియోజకవర్గాల్లోనూ సభలు నిర్వహించాలి. వీటికి జాతీయ నేతల్లో ఎవరో ఒకరు హాజరవుతారు. ఇక పాత పది జిల్లాల్లో నిర్వహించే బహిరంగ సభలకు అగ్ర నేతల్లో ఎవరో ఒకరు హాజరవుతారు..’ అని చెప్పారు. లిక్కర్ స్కాంపై చర్చ జరగలేదా? సాయంత్రం మూడున్నర గంటల సమయంలో ఈ భేటీలు ముగిశాయి. ఈ సమావేశాల్లో ఢిల్లీ లిక్కర్ స్కామ్‌పై చర్చిస్తారని వార్తలు వచ్చినా అలాంటిదేమీ జరగలేదని నేతలు తెలిపారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశం, పార్టీ అధ్యక్షుడి మార్పు వంటి అంశాలు కూడా చర్చకు రాలేదని చెప్పారు. అయితే బీఆర్ఎస్ పార్టీపై కొద్దిసేపు సరదాగా చర్చించిన నేతలు.. ఆ పార్టీ జాతీయ పార్టీ అయితే మొన్నటి త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదంటూ వ్యాఖ్యానించారని తెలిసింది. ఇకపై ప్రతి నెలా తమలో ఒకరి రాష్ట్ర పర్యటన ఉంటుందని, రెండు లేక మూడు సభలకు ప్రధాని మోదీ హాజరయ్యేలా చూస్తామని నడ్డా, షా అన్నట్టు నేతలు తెలిపారు. కాగా రాష్ట్రంలో పెద్దెత్తున ప్రజా ఉద్యమాన్ని నిర్మించడంలో భాగంగా ప్రభుత్వంపై చార్జిషీట్లు విడుదల చేయాలని రాష్ట్ర పార్టీ నేతలు సూచించినట్టు సమాచారం. అన్ని స్థాయిల్లో చేరికలు ప్రోత్సహించాలి ‘రాష్ట్రంలో కేసీఆర్ నియంత పాలనపై ప్రజలు విసుగుతో ఉన్నారు. పార్టీ గెలుపునకు అవకాశాలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు చేరికలను ప్రోత్సహించాలి. నేతలు సమన్వయంతో వ్యవహరించాలి.’ అని నడ్డా, షా సూచించారు. ముమ్మర పర్యటనలు.. బహిరంగ సభలు ‘రాష్ట్రంలో 119 అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిల్లో సమావేశాలæ తర్వాత, పది ఉమ్మడి జిల్లాల పరిధిలో ఒక్కోచోట 50 వేల మందికి తగ్గకుండా బహిరంగ సభలు నిర్వహించాలి. మార్చిలో అగ్రనేతలు అమిత్‌షా, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు, ఇతర ముఖ్య నేతలు పర్యటించాలి. ఏప్రిల్‌లో ప్రధాని పాల్గొనే విధంగా, రాష్ట్రవ్యాప్తంగా 34 వేలకు పైగా పోలింగ్ బూత్‌ల్లోని పార్టీ కమిటీలు, కార్యకర్తలతో హైదరాబాద్‌లో భారీ బహిరంగ సభను నిర్వహించాలి..’ అని సమావేశాల్లో నిర్ణయించారు. -
‘పచ్చగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ల చేతుల్లో పెట్టొద్దు’
సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: కేసీఆర్, టీ(బీ)ఆర్ఎస్ లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని ప్రతిపక్షాలను నిలదీశారు తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు. భూపాలపల్లిలో గురువారం జరిగిన బహిరంగ సభలో మంత్రి కేటీఆర్.. రాష్ట్ర కాంగ్రెస్, బీజేపీ నాయకత్వంపై విమర్శలు ఎక్కుపెట్టారు. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్‌లను ఒక్కటే అడుగుతున్నా. తెలంగాణ రాకుంటే మీ ఇద్దరినీ ఎవరైనా పట్టించుకునేవాళ్లా? పార్టీలకు అధ్యక్షులు అయ్యేవాళ్లా? అని ప్రశ్నించారు కేటీఆర్. ‘ఓ పిచ్చోడు ప్రగతి భవన్ తేల్చేస్తామంటాడు. మరో పిచ్చోడు సెక్రెటేరియేట్‌ను పేల్చేస్తామంటాడు. అలాంటి పిచ్చోళ్ళ చేతుల్లో పార్టీలు ఉంటే.. రాష్ట్ర మొత్తానికి నష్టమే జరుగుతుంది. పచ్చగా ఉన్న తెలంగాణను పిచ్చోళ్ళ చేతుల్లో పెట్టద్దు’ అని సభకు హాజరైన ప్రజానీకాన్ని ఉద్దేశించి కేటీఆర్ పిలుపు ఇచ్చారు. ఒక్క ఛాన్స్ ఇవ్వండని రేవంత్ రెడ్డి అడుక్కుంటున్నాడు. ఈ డెబ్భై ఏళ్లలో ఒక్కటి కాదు.. పది ఛాన్సులు ఇచ్చాం. మరి ఏం చేశారో చెప్పండి అంటూ తీవ్ర విమర్శలు చేశారాయన. అలాంటి దిక్కుమాలిన అసమర్థ పాలన మళ్లీ మనకు కావాలా? అని ప్రశ్నించారు కేటీఆర్. బీఆర్ఎస్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల చేరికపై రేవంత్‌రెడ్డి చేస్తున్న విమర్శలపై కేటీఆర్ స్పందించారు. భారత రాజ్యాంగం కల్పించిన హక్కుతోనే.. ఎమ్మెల్యే గండ్ర బజాప్తుగా కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లో చేరారు. రాజస్థాన్‌లో ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ చేర్చుకోలేదా?. రాజస్థాన్‌లో కాంగ్రెస్ చేస్తే సంసారం.. ఇక్కడ బీఆర్ఎస్ చేస్తే వ్యభిచారమా? అని రేవంత్ రెడ్డిని నిలదీశారు కేటీఆర్. ఇదెక్కడి నీతి? ఒక్కటే అడుగుతున్నా.. ఆలోచించుమని కోరుతున్నా. ప్రజల మనసు గెలవాలంటే అధికారంలోకి రావాలంటే.. ఏం చేసినమో చెప్పాలి. ఏం చేస్తామో చెప్పాలి అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. మనపై కక్షగట్టి శత్రుదేశంపై దాడి చేసినట్లు.. ప్రధాని మోదీ, బిజేపీ వేటకుక్కల్లా దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయి. అసమర్థ ప్రధానిని.. బలవంతంగా విశ్వగురువు.. విశ్వగురువు అంటున్నారు. ఢిల్లిలో ఉన్నోడు పేకుడు.. ఇక్కడున్నోడు జోకుడు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ను నిర్మించిన ఘనత కేసీఆర్‌ది. ముమ్మాటికీ మాది కుటుంబ పాలనే. తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులే. మనది వసుదైక కుటుంబం.. కుల పిచ్చి మత పిచ్చి మాకు లేదు అని కేటీఆర్ హాట్ కామెంట్లు చేశారు. అలాగే.. దేశంలో ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో 95% రిజర్వేషన్ తెలంగాణలో ఇస్తున్నామని కేటీఆర్ ప్రస్తావించారు. సింగరేణిపై బీజేపీ కన్నుపడింది. సింగరేణిని ప్రైవేట్‌పరం కానివ్వం.. అవసరమైతే సకల జనుల సమ్మెకు సైతం సిద్ధమవుతాం అని కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను చూసి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు కూడా తమ దగ్గర అమలు చేయాలని కోరుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణలో మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే.. నాలుగు కోట్ల ప్రజలకు లాభమని పేర్కొన్నారు. -
TS: అధికారిక లాంఛనాల్లోనూ ఇదేం వివక్ష?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు మనవడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన ఈ ప్రభుత్వం.. కంటోన్మెంట్ సాయన్న విషయంలో ఎందుకు వివక్ష ప్రదర్శించిందని? మండిపడ్డారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యే, మాజీ మంత్రులు, సినీ ప్రముఖులు చనిపోతే.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించలేదా? అని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారాయన. ఐదుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన దళితుడు సాయన్న విషయంలోనే ఎందుకీ వివక్ష? అని కేసీఆర్ సర్కార్‌ను ప్రశ్నించారు బండి సంజయ్. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించే విషయంలో.. సర్కార్ అనుసరిస్తున్న తీరును బీజేపీ తెలంగాణ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారాయన. శాసనసభ్యుడిగా ఐదు సార్లు గెలిచి ప్రజలకు సేవలందించిన వ్యక్తి సాయన్న. ఆయన మరణిస్తే అధికార లాంఛనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించకపోవడం శోచనీయమని బండి సంజయ్ ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రజలను హింసించిన నిజాం రాజు వారసుడికి అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వం.. సుదీర్ఘ కాలం ప్రజలకు సేవలందించిన ఒక శాసనసభ్యుడికి.. అదీ పదవిలో ఉండగానే మరణించిన వ్యక్తికి మాత్రం అధికారిక లాంఛనాలతో వీడ్కోలు పలకకపోవడం గర్హనీయమన్నారు. గతంలో నాగార్జున సాగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతూ మరణించిన నోముల నర్సింహయ్యతోపాటు మాజీ మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, ఎం.సత్యనారాయణరావు, సినీ రాజకీయ ప్రముఖుడు హరికృష్ణ లాంటి వాళ్లకు అధికారిక లాంఛనాలతో కేసీఆర్ ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించిన విషయాన్ని బండి సంజయ్ ప్రస్తావించారు. దళితుడైన సాయన్న విషయంలో వివక్ష చూపడం క్షమించరాని విషయమన్నారు. కేసీఆర్ స్పందనేది? సాయన్న అంత్యక్రియల ఉదంతం మరవక ముందే.. ఇవాళ హైదరాబాద్ నడిబొడ్డునున్న అంబర్ పేట నియోజకవర్గంలో గంగపుత్ర సామాజికవర్గానికి చెందిన 4 ఏళ్ల బాలుడు వీధి కుక్కల దాడిలో మరణించగా.. సీఎం కేసీఆర్ స్పందించకపోవడం బాధాకరమని బండి సంజయ్ తన ప్రకటనలో పేర్కొన్నారు. దళిత, గిరిజన, బహుజనులంటే కేసీఆర్ కు ఎంత వివక్ష ఉందో రాష్ట్ర ప్రజలు అర్ధం చేసుకోవాలని ప్రజానీకానికి ఆయన పిలుపు ఇచ్చారు. ‘‘సమాజంలో అంతరాలుండకూడదని, అంటరానితనం నిర్మూలన జరగాలని కలలుకన్న బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు భిన్నంగా పాలన కొనసాగిస్తూ.. కేసీఆర్ దళిత, గిరిజన, బలహీనవర్గాలను అణిచివేస్తున్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘాలు, ప్రజా సంఘాలతోపాటు సమానత్వం కోరుకునే నాయకులు, మేధావులు, బడుగు, బలహీనవర్గాల నాయకులు ఈ విషయంలో మౌనంగా ఉండటం బాధాకరం. దళిత జాతికే అవమానం. తక్షణమే స్పందించాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావ్రుతం కాకుండా చూడాల్సిన అవసరం ఉందని బండి సంజయ్ పేర్కొన్నారు. -
తెలంగాణ కొత్త సచివాలయంలో అగ్ని ప్రమాదం
సాక్షి, హైదరాబాద్/ ఖైరతాబాద్: హుస్సేన్‌సాగర్ తీరాన తుది మెరుగులు దిద్దుకుంటున్న తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీనివల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని, కేవలం నాలుగు ఫ్లోర్లు పొగ చూరాయని పోలీసులు తెలిపారు. స్వల్ప మరమ్మతులు మాత్రమే అవసరమవుతాయని, సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా వేయాల్సిన అవసరం లేదని అధికారులు స్పష్టం చేశారు. సచివాలయ ప్రారంభోత్సవ సమయం దగ్గరపడుతుండటంతో భవన నిర్మాణ సిబ్బంది మూడు షిఫ్టుల్లో పనులు చేస్తున్నారు. మింట్ కాంపౌండ్ వైపు ఉన్న డూమ్ పనులతో పాటు ఇతర పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఎలక్ట్రికల్, ఉడ్ వర్క్, పెయింటింగ్, ఫాల్ సీలింగ్ తదితర పనులు ఏకకాలంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పేరుకుపోతున్న చెక్క, ఫోమ్, థర్మకోల్ తదితర వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాల్సి ఉంది. కాగా శుక్రవారం తెల్లవారుజామున సచివాలయం వెనుక వైపు లోయర్ గ్రౌండ్ ఫ్లోర్లో వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. అయితే అకస్మాత్తుగా ఆ వైర్లలో షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు మొదలయ్యాయి. క్షణాల్లోనే అక్కడున్న వ్యర్థాలకు అంటుకుని వ్యాపించాయి. ఈ పరిణామంతో అక్కడ పనిచేస్తున్న సిబ్బంది పరుగులు తీశారు. థర్మకోల్ వ్యర్థాలకు మంటలు అంటుకోవడంతో నల్లని పొగలు పెద్ద ఎత్తున కమ్ముకున్నాయి. లోయర్ గ్రౌండ్‌తో పాటు గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్ల వరకు వ్యాపించాయి. ఓ డోమ్ కూడా నల్లగా మారింది. సీఎంవో ఉన్న భవనంలోనే.. ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అక్కడికి చేరుకున్న 11 అగ్నిమాపక శకటాలు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో మంటలు పూర్తిగా ఆరిపోయాయి. మంటలు చెలరేగిన భవనం ఆరో అంతస్తులోనే సీఎం కార్యాలయం సిద్ధమవుతోంది. ఈ భారీ భవన నిర్మాణం చేపట్టిన కాంట్రాక్టర్లు సరైన రక్షణ చర్యలు తీసుకోకపోవడం, అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. భవనం తుది మెరుగుల్లో ఉండటంతో ఫైర్ సేఫ్టీ వ్యవస్థ ఇంకా అందుబాటులోకి రాలేదు. అయితే భారీయెత్తున సచివాలయం నిర్మాణమవుతున్నా.. ఫైర్ ఇంజన్‌ను సమీపంలో అందుబాటులో ఉంచకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ భవన నిర్మాణ పనుల్లో నిర్లక్ష్యం, అగ్నిప్రమాదంపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ప్రమాద కారణాలను, ఇతర వివరాలను బయటకు రానీయకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అగ్ని ప్రమాదానికి కారణాలు వెల్లడించేందుకు విముఖత చూపుతున్నారు. ఓ దశలో ఇదో మాక్‌డ్రిల్ అంటూ నమ్మించడానికి ప్రయత్నించారు. మింట్ కాంపౌండ్ రోడ్డులో పనులు జరుగుతుండటం, సచివాలయం వెనుక వైపు రోడ్లపై నిర్మాణ సామాగ్రి ఉండటం, ఎక్కడికక్కడ తవ్వకాల వల్ల ఫైర్ ఇంజన్లు లోపలికి, వెనుక వైపునకు వెళ్లడం కష్టసా«ధ్యమైంది. ఫైర్ సరీ్వసెస్ డైరెక్టర్ జనరల్ వై.నాగిరెడ్డి తెల్లవారుజామునే ఘటనాస్థలానికి చేరుకున్నారు. మింట్ కాంపౌండ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్ రోడ్డు, ఎన్టీఆర్ మార్గ్‌ల్లో భారీగా బారికేడ్లు ఏర్పాటు చేసిన పోలీసులు ఎవరినీ సచివాలయం సమీపానికి అనుమతించలేదు. -
కరెంట్ ఉందో లేదో అలా తెలుసుకో.. సంజయ్‌కు పువ్వాడ కౌంటర్
సాక్షి, ఖమ్మం: ఖమ్మం బీఆర్ఎస్ తలపెట్టిన భారీ బహిరంగ సభ విజయవంతమైంది. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సహా ఖమ్మం బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆనందం వ్యక్తం చేశారు. కాగా, సభలో సీఎం కేసీఆర్.. కేంద్రంలోని బీజేపీ, కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి సంచలన కామెంట్స్ చేశారు. ఇక, కేసీఆర్ కామెంట్స్ బీజేపీ, కాంగ్రెస్ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నేతలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పువ్వాడ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ తనను తానే ఓడించుకుంటోంది. కంటి వెలుగులో బండి సంజయ్ అద్దాలు తీసుకోవాలి. బండి అన్ని తొండి మాటలు మాట్లాడుతున్నారు. లాభాల్లో నడుస్తున్న సంస్థలను కేంద్రం మూసివేస్తోంది. తెలంగాణలో 24 గంటల కరెంట్ ఉందో లేదో తెలియాలంటే ఏ మోటర్‌లోనైనా బండి సంజయ్ వేలు పెట్టి చూడాలని చురకలంటించారు. మాకు వ్యక్తులు కాదు పార్టీ ముఖ్యం. ఇంత పెద్ద సమావేశానికి ప్రత్యేకమైన ఆహ్వానం అవసరం లేదు.. బొట్టుపెట్టి పిలవరు’ అంటూ కామెంట్స్ చేశారు. మరోవైపు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో చారిత్రాత్మక సభ జరిగింది. కరీంనగర్ సింహగర్జన సభం తెలంగాణ ఏర్పాటుకు స్పూర్తి. ఖమ్మం సభ దేశ అభివృద్దికి నాంది కాబోతోంది. ఖమ్మం సభ విజయంతో బీఆర్ఎస్ పార్టీ మొదటి అడుగు ప్రారంభమైంది. సభపై ఎంత మంది విమర్శలు చేసినా, వక్రభాష మాట్లాడిని ప్రజలు సీఎం కేసీఆర్ వెంటే ఉన్నారని రుజువైంది అంటూ వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ సభకు వారెందుకు రాలేదు.. బండి సంజయ్ సూటి ప్రశ్న -
వివాదంలో బండి సంజయ్ కుమారుడు.. తోటి విద్యార్థిపై..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమారుడిపై దుండిగల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తోటి విద్యార్థిని దుర్భాషలా డుతూ దాడిచేసిన దృశ్యాలు సోషల్ మీడియా లో చక్కర్లు కొట్టడంతో కలకలం రేగింది. కుత్బు ల్లాపూర్ నియోజకవర్గం బహదూర్‌పల్లిలోని మహేంద్ర వర్సిటీలో బీటెక్ చదువుతున్న సంజయ్ కుమారుడు తోటి విద్యార్థిని అసభ్య పదజాలంతో తిట్టడమే కాకుండా, చంపేస్తానంటూ బెదిరిస్తూ తీవ్రంగా కొట్టాడు. దీంతో వర్సిటీకి చెందిన స్టూడెంట్ అపెక్స్ కోఆర్డినేటర్ మంగళవారం దుండిగల్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు సీఐ రమణారెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. అందుకే కొట్టాడు: కాగా బండి కుమారుడిపై కేసు నమోదైన విషయం తెలిశాక...అతని చేతిలో దెబ్బలు తిన్న విద్యార్థి మంగళవారం రాత్రి 11 గంటలకు ఒక వీడియో విడుదల చేశాడు. బండి సంజయ్ కుమారుడు స్నేహితుడి చెల్లెల్ని తాను ఇబ్బంది పెట్టానని, ఆ కారణంతోనే తనపై చేయిచేసుకున్నాడని వీడియోలో పేర్కొన్నాడు. ఇప్పుడు తామంతా మంచిగానే ఉన్నామని చెప్పాడు. -
19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 19న రాష్ట్రానికి రానున్నారు. నెల వ్యవధిలోనే రెండోసారి తెలంగాణ పర్యటనకు వస్తున్న ప్రధానమంత్రి.. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. గత ఏడాది కాలంలో ప్రధాని తెలంగాణకు రావడం ఇది ఐదోసారి కావడం గమనార్హం. కాగా గత నవంబర్ 12న రామగుండంలో జరిగిన బహిరంగ సభలో కూడా ఆయన ప్రసంగించిన సంగతి తెలిసిందే. తాజా రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని రూ.7,076 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. 19న ఉదయం 10 గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో వందేభారత్ రైలును (సికింద్రాబాద్–విశాఖపట్నం) మోదీ పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారు. అక్కడే సికింద్రాబాద్ స్టేషన్ ఆధునీకరణ పనులకు భూమిపూజ చేస్తారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్‌కు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివిధ అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు. అనంతరం అక్కడే బహిరంగ సభలో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. మొత్తంగా చూస్తే వందేభారత్ రైలు, సికింద్రాబాద్– మహబూబ్‌నగర్ డబ్లింగ్ పనులు (రూ.1,410 కోట్ల వ్యయం), ఐఐటీ హైదరాబాద్‌లో చేపట్టిన వివిధ నిర్మాణాలు (రూ. 2,597 కోట్లు) కలిపి రూ.4,007 కోట్ల విలువైన ప్రాజెక్టులను మోదీ జాతికి అంకితం చేస్తారు. అలాగే సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ (రూ.699 కోట్లు), కాజీపేట వర్క్ షాపు నిర్మాణం (రూ. 521 కోట్లు)తో పాటు మూడు జాతీయ రహదారుల విస్తరణ పనులు కలిపి మొత్తం రూ.3,069 కోట్ల విలువైన ప్రాజెక్టులకు భూమి పూజ చేస్తారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్సీఆర్ అధికారులతో బీజేపీ నేతల భేటీ మోదీ పర్యటన నేపథ్యంలో సోమవారం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సందర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు ఎంపీ డా.కె.లక్ష్మణ్ దక్షిణ మధ్య రైల్వే అధికారులతో సమావేశమయ్యారు. వందే భారత్ రైలుతో పాటు ఆరోజు ప్రధాని ప్రారంభించనున్న వివిధ కార్యక్రమాల ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం బండితో కలిసి లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలకు ప్రధాని పెద్దపీట ‘రాష్ట్ర ప్రయోజనాలకు ప్రధాని మోదీ పెద్ద పీట వేస్తున్నారు. ఇప్పటికే రూ.1.04 లక్ష కోట్ల వ్యయంతో తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణాన్ని కేంద్రం చేపట్టింది. ఈ విషయంలో తెలంగాణ దేశంలోనే రెండో స్థానానికి చేరుకుంది. వందే భారత్ రైలుతో ప్రయాణికులకు మూడున్నర గంటల సమయం ఆదా కానుంది. మరోవైపు ప్రధానమంత్రి సడక్ యోజన కింద పెద్ద ఎత్తున రోడ్డు నిర్మాణ పనులు చేపడుతూ గ్రామాలను పట్టణాలతో అనుసంధానిస్తున్నారు. దీంతోపాటు నదుల అనుసంధాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వడం లేదంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మీడియా ప్రస్తావించగా స్పందిస్తూ..‘నూతన సంవత్సర కానుకగా ప్రధాని తెలంగాణలో రైల్వే అభివృద్ధి పనుల కోసం రూ.2,400 కోట్లకుపైగా నిధులు ఖర్చు చేయబోతున్నారు. అబద్ధాలు ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు ఈ పర్యటనతోనైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నా..’ అని అన్నారు. అనంతరం రైల్వే ఉన్నతాధికారులతో కలిసి బండి సంజయ్, లక్ష్మణ్ పరేడ్ గ్రౌండ్స్‌ను సందర్శించారు. అక్కడ చేయాల్సిన వివిధ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు గరికపాటి మోహన్‌రావు, చింతల రామచంద్రారెడ్డి తదితరులతో పాటు దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్‌కుమార్ జైన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బండి సంజయ్ పర్యటన ఉద్రిక్తం!
సాక్షి, కామారెడ్డి: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డి పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. శుక్రవారం రాత్రి సంజయ్ పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులతో కలిసి కలెక్టరేట్ ముట్టడికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీనితో తీవ్ర తోపులాట, వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకున్నాయి. తొలుత బండి సంజయ్ జిల్లాలోని అడ్లూర్ ఎల్లారెడ్డి గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు పయ్యావుల రాములు కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతూ.. కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌పై తేల్చుకునేందుకు కలెక్టరేట్‌కు వెళతానని అక్కడే ప్రకటించారు. కాసేపటికే పార్టీ శ్రేణులు, రైతులతో కలిసి జిల్లా కలెక్టరేట్‌కు బయలుదేరారు. ఈ విషయం తెలిసిన పోలీసులు కామారెడ్డి ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టి అడ్డుకునే ప్రయత్నం చేసినా.. బీజేపీ శ్రేణులు బారికేడ్లను తోసివేసి, బండి సంజయ్ కాన్వాయ్‌ను ముందుకు తీసుకువెళ్లాయి. కలెక్టరేట్ ముందు ఘర్షణ కామారెడ్డి పట్టణంలో కలెక్టరేట్ ప్రధాన గేటుకు కొంత ముందు పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి సంజయ్, బీజేపీ శ్రేణులను అడ్డుకున్నారు. కానీ వందల సంఖ్యలో చేరిన బీజేపీ కార్యకర్తలు బలంగా తోయడంతో బారికేడ్లు కింద పడిపోయాయి. బండి సంజయ్, ఇతర నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్‌లోకి చొచ్చుకువెళ్లే ప్రయత్నం చేశారు. ప్రధాన గేటును మూసి ఉండటంతో అది సాధ్యపడలేదు. కొందరు కార్యకర్తలు గేటు ఎక్కి లోపలికి దూకాలని చూడగా పోలీసులు అడ్డుకున్నారు. ఇలా దాదాపు గంట పాటు బీజేపీ శ్రేణులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. చివరికి పోలీసులు సంజయ్‌ను అదుపులోకి తీసుకుని పోలీసు వాహనంలో ఎక్కించారు. కానీ పార్టీ శ్రేణులు పోలీసు వాహనం ముందుకు కదలకుండా అడ్డుకున్నారు. కొందరు ఆ వాహనం అద్దాలన్నీ ధ్వంసం చేశారు. బానెట్‌పై, అన్ని వైపులా గట్టిగా బాదడంతో కారు దెబ్బతిన్నది. అయినా పోలీసులు బీజేపీ శ్రేణులను పక్కకు తప్పించి వాహనాన్ని ముందుకు తీసుకువెళ్లారు. బండి సంజయ్‌ను హైదరాబాద్‌కు తరలించారు. ఈ ఘటనలో మరో వాహనం కూడా దెబ్బతిన్నట్టు చెప్తున్నారు. కానీ అంతా చీకటిగా ఉండటంతో స్పష్టత రాలేదు. ఇక పోలీసులపై, వాహనంపై దాడి చేసిన వారిలో కొందరిని పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. -
బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్
సాక్షి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ హాట్ కామెంట్స్ చేశారు. డ్రగ్స్ టెస్ట్ కోసం తాను రెడీ అంటూనే.. బండి సంజయ్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు ఆయన. డ్రగ్స్ టెస్ట్ కోసం నా రక్తం, కిడ్నీ, బొచ్చు.. ఏది కావాలంటే అది ఇస్తా. ఇక్కడే ఉంటా. డాక్టర్లను తీసుకుని రా? క్లీన్‌చిట్‌తో బయటకు వస్తా. చెప్పినట్లు బండి సంజయ్ తన చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా? అంటూ కేటీఆర్ మండిపడ్డారు. జిల్లా పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడుతూ.. బండి సంజయ్ మనిషా? పశువా? అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు కేటీఆర్. ఫాల్తూ మాటల రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. నాకు క్లీన్చిట్ వస్తే కరీంనగర్లో కమాన్ దగ్గర సంజయ్ చెప్పుతో తనను తాను కొట్టుకుంటాడా? అని మండిపడ్డారు కేటీఆర్. ఇంకా ఆయన ఏమన్నారంటే.. 👉రైతు బంధు రూ. 65 వేల కోట్ల ఇచ్చిన ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం. ఇంత కన్నా మేలు చేసిన ప్రభుత్వాలు ఏవైనా ఉన్నాయా?. 👉కేంద్ర ప్రభుత్వం వడ్లు కొనం అన్నా.. కేసీఆర్ నాయకత్వం కొన్నది. ఎర్రటి ఎండలో నీటి ప్రవాహం వచ్చింది అంటే కేసీఆర్ ఘనత కాదా?. 👉ఇక్కడ నిలబడ్డ బిజెపి అభ్యర్థులను కోరుతున్నా.. నేతన్న కార్మికులకు, రైతులకు మీరు ఏమైనా చేశారా?. బండి సంజయ్‌ను అడుగుతున్నా.. భైంసా ను దత్తత తీసుకున్న అంటున్నావు తీసుకో కానీ నీవు గెలిచిన నీ నియోజక వర్గంలో ఎం చేసినావు? 👉వేములవాడ కు 100 కోట్ల తో అభివృద్ది చేపించావా?. 👉IIIT అడిగాము. కానీ అదికూడా తీసుకు రాలేవు. ఈ బడ్జెట్ కి ఎంపికి ఇదే చివరి అవకాశం. ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకు ఏమైనా తీసుకు రా. బడ్జెట్ సమావేశాలకు వెళ్లు.. హిందీ రాకపోతే ఇంగ్లీష్ మాట్లాడు. కానీ, కరీంనగర్ కు ఏమైనా తీసుకు రా. 👉ఇద్దరు గుజరాత్ వాళ్ళు దేశాన్ని నడుప్పొచ్చు. కానీ మన రాష్ట్రాన్ని నడిపే ముఖ్యమంత్రి దేశాన్ని నడుపరాదు అంట!. 👉బిజెపి సోదరులు లక్ష్మణ్ మాట్లాడుతూ బి అర్ ఎస్ అట్టర్ ప్లాప్ అంటున్నారు. మహారాష్ట్ర లోని కొన్ని మండలాల ప్రజలు తెలంగాణలో కలుపుకోవాలి అని అంటున్నారు. లచ్చన్నకు గెలుపు గర్వం వద్దు అని అంటున్న అని కేటీఆర్ ప్రసంగించారు. -
ఎక్కడో తేడా కొట్టింది?.. తెలంగాణలో బీజేపీ స్పీడ్ ఎందుకు తగ్గింది?
తెలంగాణలో కమలం పార్టీ వేగం తగ్గిందా? మునుగోడు తర్వాత నేతల్లో నిస్తేజం ఆవిరించిందా? రాష్ట్ర పార్టీ చీఫ్ పాదయాత్రపైనే ఫోకస్ పెట్టారా? సీనియర్ల సేవల్ని ఉపయోగించుకోవడంలో కాషాయసేన వెనుకబడుతోందా? బీజేపీ స్పీడ్ తగ్గడానికి కారణం ఎవరు? లోపం ఎక్కడుంది? వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి ఎలాగైనా అధికారంలోకి రావాలని తెలంగాణ బీజేపీ నాయకులు చాన్నాళ్ళ నుంచి అనుకుంటున్నారు. పార్టీ హైకమాండ్ కూడా వారికి ఆమేరకు దిశా నిర్దేశం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఇతర పార్టీలను ఆకర్షించే ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ఈటల రాజేందర్‌ను ఆకర్షించి మళ్ళీ అసెంబ్లీకి ఎన్నికయ్యేలా కమలనాథులు కృషి చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌ని బీజేపీలోకి ఆకర్షించినప్పటికీ.. ఉపఎన్నికల పోరాటంలో విజయం దక్కలేదు. కాని కమలానికి పునాదులు లేని నల్గొండ జిల్లాలో గులాబీ పార్టీకి గట్టి పోటీ ఇవ్వడంలో సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్‌ను వెనక్కు నెట్టేసి..టీఆర్ఎస్కు తామే ప్రత్యామ్నాయం అని చాటుకున్నారు కమలనాథులు. ఇటీవలే కాంగ్రెస్ నుంచి సీనియర్ నాయకుడు మర్రి శశిధర్‌రెడ్డి కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. ఇలా ప్రముఖులు బీజేపీలో చేరుతున్నారే గాని..వారి సేవల్ని సక్రమంగా వినియోగించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మునుగోడు వ్యూహం ఎదురు తన్నిందా? మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి విజయం సాధిస్తారనే స్థాయిలో ప్రచారం జరిగింది. ఆ మేరకు బీఆర్ఎస్ నాయకత్వానికి కంగారు పుట్టించారు కూడా. కాని ఫలితం దక్కలేదు. రాజగోపాల్‌రెడ్డిని విజయం వరించలేదు. దీంతో నాయకుల్లో స్పీడ్ తగ్గిందనే టాక్ వినిపిస్తోంది. ఇక మునుగోడు ఉప ఎన్నిక తర్వాత ఇప్పటివరకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పూర్తిగా తన ప్రజా సంగ్రామ యాత్ర మీదే పూర్తిస్థాయిలో ఫోకస్ పెట్టారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..ఏ మాత్రం అవకాశం దొరికినా తన సికింద్రాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభించినపుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మినహా మిగతా నేతలు ఎవరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. బండి సంజయ్ మాత్రమే ఫోకస్ కావాలనే ఉద్దేశంతో మిగతా నేతలను పాదయాత్రకు సంఘీభావంగా వెళ్ళాలని సూచించలేదా? లేక సంజయ్ పాదయాత్రను మిగతా నాయకులు లైట్ తీసుకున్నారా ? అన్నది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రెయిడ్స్ వర్సెస్ రెయిడ్స్ తెలంగాణలో రాజకీయాలు హాట్ హాట్‌గా ఉన్నాయి. ఎన్నికలు ఏడాదిలోపే ఉండటంతో మూడు ప్రధాన పార్టీలు కార్యక్రమాల్లో స్పీడ్ పెంచాయి. మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థలు కూడా అదే రేంజ్లో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. ఒకవైపు లిక్కర్ స్కాంపై సీబీఐ దర్యాప్తు... ఇంకోవైపు రాష్ట్ర మంత్రులపై ఈడీ విచారణ సాగుతోంది. ఇదిలా ఉంటే..తెలంగాణలో గులాబీ పార్టీ నేతల విమర్శలను తిప్పికొట్టడంలో కమలం పార్టీ నేతలు వెనకబడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. బండి సంజయ్ తన పాదయాత్ర ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నా.. ఆయనకు సపోర్టింగ్ గా ఇతర నేతలు ఎవరూ పెద్దగా మాట్లాడటం లేదు. దీంతో బీజేపీ వాయిస్ పూర్తి స్థాయిలో జనంలోకి వెళ్లలేకపోతుందనే టాక్ వినిపిస్తోంది. సీనియర్స్ స్ట్రాటజీ ఏంటీ? మునుగోడు ఉప ఎన్నికలో రాజగోపాల్‌రెడ్డి కోసం రాష్ట్రంలోని పెద్దా, చిన్నా నాయకులంతా యాక్టివ్ రోల్ ప్లే చేశారు. ఉప ఎన్నిక హడావుడి ముగియగానే వీరంతా సైలెంట్ అయిపోయారు. బండి సంజయ్ తనయాత్రలో మునిగిపోవడం..ఇతర నేతల మధ్య పనివిభజన లేకపోవడంతో ఎవరికీ పని లేకుండా పోయింది. అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టడం మినహా నాయకులకు దిశా నిర్దేశం చేసేవారు కరువయ్యారు. ఒకప్పుడు బీజేపీ నాయకులు చాలా కొద్దిమందే ఉండేవారు. ఇతర పార్టీలనుంచి వచ్చినవారితో ఇప్పుడు కమలం పార్టీ నిండుగా కనిపిస్తోంది. కాని సీనియర్ల సేవలను సరిగా వినియోగించుకోలేకపోవడం ఒక లోపంగా కనిపిస్తోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సీనియర్లను ఖాళీగా ఉంచడం వల్ల పార్టీకి నష్టం కలుగచేస్తుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
ఓట్లేయండి.. పేర్లు మారుస్తాం.. తెలంగాణలో కమలం పార్టీ కొత్త వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్న బీజేపీ సరికొత్త వ్యూహాలతో ముందుకెళ్తోంది. కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దే దించేందుకు సర్వశక్తులు ఒడ్డుతోంది. ఇందులో భాగంగా పట్టణాల పేర్ల మార్పుపై కమలం పార్టీ దృష్టి సారించింది. తాము అధికారంలోకి వస్తే కొన్ని ప్రాంతాల పేర్లు మారుస్తామని ఇప్పటికే ప్రకటించింది. బీజేపీ ప్రచార వ్యూహంలో ఇది కూడా ఓ భాగమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో హైదరాబాద్ పేరును భాగ్యనగర్‌గా మారుస్తామని బీజేపీ ప్రకటించింది. అయితే టీఎర్ఎస్కు గట్టి పోటీ ఇచ్చినప్పటికీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోలేకపోయింది. తాజాగా తెలంగాణలో మరికొన్ని పట్టణాల పేర్లు మారుస్తామని బీజేపీ జోరుగా ప్రచారం చేస్తోంది. తెలంగాణలో తమను అధికారంలోకి తీసుకొస్తే నిజామాబాద్ పేరును ఇందూరుగా, మహబూబ్‌నగర్ పేరును పాలమూరుగా, వికారాబాద్‌ను గంగవరంగా, భైంసాను మైసాగా, కరీంనగర్ పేరును కరినగర్‌గా మారుస్తామని బీజేపీ చెబుతోంది. ఇప్పటికే సంఘ్ పరివార్ క్షేత్రాలు ఈ పట్టణాలను ఇదే పేర్లతో ప్రస్తావిస్తున్నాయి. మరి ఊరి పేర్ల నినాదంతో ఓటర్లను ఆకర్షించాలని చూస్తున్న కమలం పార్టీ ప్రయత్నాలు ఏమేరకు ఫలిస్తాయో వచ్చే ఏడాది తేలిపోనుంది. చదవండి: ‘కాంగ్రెస్ సీనియర్లకు ఏమైంది?.. నేనింకా జూనియర్‌నే’ -
బండి కామెంట్లు.. బాధగా ఉంది: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, హైదరాబాద్: తనపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు బాధకలిగించాయని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. మహిళలను గౌరవించే సంస్కృతి బీజేపీలో లేనేలేదంటూ మండిపడ్డారామె. మంగళవారం మీడియాతో నిర్వహించిన చిట్‌ఛాట్ నిర్వహించిన ఆమె.. బీజేపీపై విరుచుకుపడ్డారు. బండి సంజయ్ వాఖ్యలు బాధాకరం. ఆయన మాటలు మంచివి కావు. రాజకీయ పరమైన విమర్శ చేయొచ్చు. కానీ, ఇలా కాదు. మహిళలను అవమానించడం బీజేపీకి కొత్తేం కాదు. మోదీ.. మమతా బెనర్జీని ఎలా అవమానించారో.. ఇక్కడ నన్ను బండి సంజయ్ అలా అవమానిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగురించి కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. అసభ్యంగా, అవహేళన చేస్తూ బండి సంజయ్ మాట్లాడారు. ఆయన ఎంపీగా ఇప్పటిదాకా ఒక్క రూపాయి కూడా ఇప్పటికీ తెలంగాణకు తేలేదు. పన్నెండేళ్ల కష్టంతో బూర్జ్ ఖలీఫాపై బతుకమ్మను పెట్టించాం. కానీ, బీజేపీ, ప్రతిపక్షాలు బతుకమ్మను ఎత్తుకోవడానికే భయపడ్డాయి. బీఆర్ఎస్ వల్ల బీజేపీలో వణుకు పుడుతోంది. అభివృద్ధిలో బీజేపీని కౌంటర్ చేస్తాం. బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీలతో కలిసి పోరాడతాం. అంతిమంగా బీజేపీని గద్దె దింపడమే మా లక్ష్యం. తెలంగాణ ప్రజలు బీజేపీని సరైన సమయంలో తిప్పి కొడతారు. పసుపు బోర్డు రాకపోవడానికి కేంద్ర మంత్రి నిర్మలా సీతారామనే కారణం. హిందీ భాషపై కాదు.. బలహీనపడుతున్న రూపాయి విలువపై మాట్లాడాలి. బీఆర్ఎస్ కేసీఆర్ మానస పుత్రిక. ఆ పార్టీలో ఏ పాత్ర ఇచ్చిన నేను పోషిస్తా. దేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్తితులపైనే మా కార్యాచరణ ఉంటుంది. పని చేయడం మాకు కొత్తేం కాదు. జాతీయ ప్రత్యామ్నాయంగానే మా పార్టీ ఉండనుంది. అలాగని జాగృతి ఏమీ సైలెంట్‌గా లేదు. ప్రతి రాష్ట్రంలో మా జాగృతి కార్యక్రమాలు కొనసాగిస్తాం. తెలంగాణలో తెలంగాణ జాగృతి అనే ఉంటుంది. అలాగే.. భారత జాగృతి ఎప్పుడో రిజిస్టర్ అయి ఉంది. దేశ వ్యాప్తంగా భారత జాగృతి పేరుతో, ఇక్కడ తెలంగాణ జాగృతి పేరుతో సాగుతుంది. జాగృతి ద్వారా ఏ రాష్ట్రానికి ఉండే కల్చర్ ఆ రాష్ట్రంలో గౌరవిస్తాం అని ఆమె పేర్కొన్నారు. -
భైంసాలో టెన్షన్.. టెన్షన్..!
భెంసాటౌన్/ఆదిలాబాద్/హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు అనుమతి నిరాకరించినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారె తెలిపారు. భైంసాలో నిర్వహించే సభకు కూడా అనుమతి లేదని పేర్కొన్నారు. భైంసాలోని సున్నిత పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రతోపాటు సభకు ఎస్పీ ప్రవీణ్‌కుమార్ అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రెండు, మూడురోజులుగా ఎంపీ సోయం బాపురావు, ఇతర జిల్లాల నాయకులు భైంసాలోనే మకాం వేసి సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్డి(బి) బైపాస్ రోడ్లో జరిగే భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసిన డీసీసీ మాజీ అ«ధ్యక్షుడు రామారావు పటేల్ ఈ సభావేదికగానే బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు పట్టణంలో భారీఫ్లెక్సీలతో విస్తృత ప్రచారం చేసుకున్నారు. బీజేపీ టికెట్ ఆశావహులు సైతం భైంసా రహదారులను ఫ్లెక్సీలతో కాషాయమయం చేశారు. ఈ నేపథ్యంలో బండి యాత్రకు అనుమతి నిరాకరించడంతో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఎంఐఎంకు భయపడే: సోయం ఎంఐఎంకు భయపడే సంజయ్ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదని ఎంపీ సోయం బాపురావ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాసమస్యలను పరిష్కరించలేక బండి యాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ‘న్యాయస్థానం తలుపు తడతాం. న్యాయస్థానం అనుమతి తీసుకుని యాత్ర కొనసాగిస్తాం’అని ప్రకటించారు. ‘సభావేదిక వేసేదాక చూసి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దిగే హెలీప్యాడ్‌ను కూడా పరిశీలించిన పోలీసులు అకస్మాత్తుగా అనుమతి రద్దు చేయడం వెనుక సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉంది’అని పేర్కొన్నారు. యాత్రతో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని భయపడి, అనుమతులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. అడ్డుకోవడం పిరికిపంద చర్య: డీకే అరుణ సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం సీఎం కేసీఆర్ పిరికిపంద చర్యకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రజల కోసం చేస్తున్న యాత్రగా కేసీఆర్ గ్రహించి అనుమతించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజల్లో టీఆర్ఎస్పై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే బీజేపీని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘మత ఘర్షణలు జరుగుతాయనే సాకుతో అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ పోలీసులకు సత్తా ఉంటే యాత్రకు అనుమతివ్వాలి. బందోబస్తులో ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి.అయితేనే పోలీస్ వ్యవస్థకు మనుగడ ఉన్నట్లు’అని అరుణ పేర్కొన్నారు. భైంసా సభను అడ్డుకోవడం కుట్ర రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించ తలపెట్టిన భైంసా సభకు అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. తెల్లారితే సభ ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిర్మల్ వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని, ఆయన ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఆపలేరని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ తనకు తాను నయా నిజాం అనుకుంటున్నారని.. నిజాం మెడలు వంచినట్లే కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతం పలికే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జగిత్యాలలో హై టెన్షన్.. బండి సంజయ్ మరోసారి అరెస్ట్ -
కేసీఆర్‌కు పాలించే అర్హత పోయింది
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లలో ఇష్టారాజ్యంగా చేసిన రూ.5లక్షల కోట్ల అప్పులకు ఏటా రూ.30వేల కోట్లు వడ్డీల కిందే కడుతున్న కేసీఆర్ సర్కార్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్కు మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలను నిండా ముంచేస్తారని ఆరోపించారు. అందుకే ప్రజలంతా తమ క్షేమం కోరే బీజేపీ ప్రభుత్వం రావాలని గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ కేవలం తమ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. తాను ఇప్పటివరకు చేపట్టిన నాలుగు విడతల యాత్రకు ప్రజలు మద్దతు తెలిపి అండగా నిలిచారని.. ఇక ముందూ విశేష స్పందన లభిస్తుందని నమ్మకం ఉందని తెలిపారు. ఐదో విడత ప్రజా సంగ్రామయాత్రకు సిద్ధమైన నేపథ్యంలో బండి సంజయ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలివీ.. సాక్షి: నాలుగు విడతల పాదయాత్ర ద్వారా ఏం సాధించారు? సంజయ్: ప్రజల వద్దకు వెళ్లి దగ్గరి నుంచి వారి బాధలను తెలుసుకున్నాం. రాష్ట్రంలో పేదలు, ఇతర వర్గాల వారు ఎదుర్కుంటున్న తీవ్ర సమస్యలను గుర్తించే ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలిచ్చాం. ఇళ్లు లేని పేదలకు పక్కాగృహాలు నిర్మిస్తామని చెప్పాం. ఐదో విడత లక్ష్యాలు, ఉద్ధేశాలేమిటి? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గత 8 ఏళ్లుగా, అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ నిత్యం సమస్యలతో తల్లడిల్లుతూనే ఉన్న గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఈ విడత పాదయాత్ర నిర్వహిస్తున్నాం. యాత్రలో తెలుసుకునే అంశాలతో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి.. అధికారంలోకి వచ్చాక కచి్చతంగా అమలు చేస్తాం. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకున్నందున ఐదో విడత గతంలో జరిగిన వాటి కంటే సూపర్ సక్సెస్ అవుతుంది. ప్రతిసారి మా యాత్రలు, కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ వివిధ రూపాల్లో ఆటంకాలు కలి్పస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ తంటాలు పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది? మునుగోడు ఉప ఎన్నికలో మాదిరిగానే టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి లోపాయకారీ ఒప్పందాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. అయినా తెలంగాణలో కేసీఆర్ గద్దె దిగడం ఖాయం. కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయం. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు వచి్చంది. ఎప్పుడు ఎన్నికలొచి్చనా టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడి.. పేదల ఆధ్వర్యంలో తెలంగాణ అమరుల కలలు నిజం చేసేలా బీజేపీ ముందుకు సాగుతుంది. మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతోందనే ఆరోపణలపై స్పందన? అవన్నీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. సీబీఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్షనేతతోపాటు సుప్రీంకోర్టు సీజే కూడా ఉంటారు. అలాంటి సంస్థలపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు. పన్ను ఎగవేతలు, అక్రమాలపై ఐటీ, ఈడీ విచారణ చేపడతాయి. తప్పు చేయనప్పుడు భయమెందుకు? టీఆర్ఎస్ నేతలు భుజాలెందుకు తడుముకుంటున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ జాతీయ నేతలపై ఆరోపణలకు సమాధానం? ఇది కేసీఆర్ అండ్ కో ఆడుతున్న డ్రామా. అది జరిగింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెస్ట్‌హౌజ్‌లో.. అక్కడికి వచి్చంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. యాక్షన్ చేసింది కేసీఆర్ చెప్పినట్లు ఆడే పోలీసులు. అంతా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీపై బురద చల్లి ఇమేజ్ను దెబ్బతీసే కుట్ర. కేసీఆర్ నీచ రాజకీయాలకు నిదర్శనం. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూస్థాపితమైంది. ఢిల్లీ నుంచి గల్లీదాకా కనుమరుగవుతోంది. భారత్‌జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నా జనం పట్టించుకోవడం లేదు. వాళ్లు పాదయాత్రలు కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా, పొర్లు దండాల యాత్ర చేసినా కాంగ్రెస్‌ను జనం నమ్మరు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్తో అంటకాగుతోంది. కాంగ్రెస్‌లో భవిష్యత్ లేదనే నిర్ణయానికొచ్చే ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిరోజుల్లో ఆ పార్టీ ఖాళీ కాబోతోంది. గాందీభవన్‌కు ‘టు లెట్’ బోర్డు తగిలించే పరిస్థితి రాబోతోంది. కేసీఆర్‌ను జనం అసహ్యించుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ అభివృద్ధిని పక్కనపెట్టి.. కేంద్రాన్ని, ›ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించడం, అర్థం లేని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ వైఖరిని, టీఆర్ఎస్ నేతల తీరును, చేస్తున్న విమర్శలను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. – బండి సంజయ్ -
20 రోజులు.. 222 కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నిర్మల్ జిల్లా భైంసాలో ప్రారంభం కానుంది. డిసెంబర్ 18న కరీంనగర్లో ముగియనుంది. మొత్తం 20 రోజులపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలో 222 కి.మీ మేర సాగనుంది. సంజయ్ సోమవారం ఉదయం నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భైంసా నుంచి యాత్ర ప్రారంభిస్తారు. భైంసాలో నిర్వహించే ప్రారంభసభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్‌తోపాటు వివిధస్థాయిల నాయకులు బీజేపీలో చేరనున్నారు. ఈ యాత్ర సాగుతున్న క్రమంలో పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెందిన సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఇతర స్థానిక నాయకులు చేరతారని అంచనా వేస్తున్నారు. సంజయ్ తొలిరోజు పాదయాత్రలో 6.3 కి.మీ. నడిచి.. ముథోల్ నియోజకవర్గంలోని గుండగామ్ సమీపంలో రాత్రి బస చేస్తారు. ఈ యాత్రలో భాగంగా 8 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే సభలకు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయనేతలు పాల్గొంటారు. ముగింపుసభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. పాదయాత్ర ఇలా... 29న రెండోరోజు గుండగామ్ నుంచి మహాగాన్ దాకా 13 కి.మీ; 30న లింబా నుంచి కుంటాల, అంబకంటి మీదుగా 13.7 కి.మీ; డిసెంబర్ 1న నిర్మల్‌లోని బామిని బూజుర్గ్ నుండి నందన్, నశీరాబాద్ మీదుగా 10.4 కి.మీ.; 2న రాంపూర్ నుంచి లోలమ్ మీదుగా చిట్యాల దాకా 11.1 కి.మీ; 3న చిట్యాల నుండి మంజులాపూర్, నిర్మల్ రోడ్, ఎడిగాం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తాపూర్ వరకు 12.3 కి.మీ; 4న లక్మణ్ చందా మండలంలోని వెల్మల, రాచాపూర్, లక్మణ్ చందా, పోటపల్లి వరకు 12.7 కి.మీ; 5న మమ్డా మండలంలోని కొరైకల్ మమ్డా, దిమ్మతుర్తి వరకు 11.5 కి.మీ; 6న ఖానాపూర్ నియోజకవర్గంలో దొమ్మతుర్తి, ఇక్బాల్‌పూర్, తిమ్మాపూర్, ఖానాపూర్ మీదుగా 12.8 కి.మీ; 7న మస్కాపూర్ లోని సూరజ్ పూర్, బడాన్ ఖర్తి, ఓబులాపూర్, మొగల్ పేట మీదుగా 12.8 కి.మీ; 8, 9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో 21.7 కి.మీ; 10న కోరుట్ల పట్టణం వెంకటాపురం, మోహన్ రావు పేట మీదుగా 12.3 కి.మీ; 11న వేములవాడలోని మేడిపల్లి నుండి తాటిపల్లి మీదుగా 10.1 కి.మీ; 12న జగిత్యాలలో 10.4 కి.మీ; 13న చొప్పదండిలోని చిచ్చాయ్, మల్యాల చౌరస్తా, మల్యాల మీదుగా 13.3 కి.మీ; 14, 15 తేదీల్లో చొప్పందండి నియోజకవర్గంలో 20 కి.మీ.; 16, 17న కరీంనగర్లో 18 కి.మీ. యాత్ర సాగనుంది. 18న కరీంనగర్లో ఎస్సారార్ కళాశాల వద్ద ముగింపు బహిరంగ సభ. ఈ విడతకు భారీగా ప్రజాస్పందన బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఈ యాత్ర సాగనుంది. అదీగాక, ఈ విడత యాత్ర హిందుత్వ భావజాలం నేపథ్యమున్న ప్రాంతాల్లో జరగనుంది. అందుకే ఈ విడత యాత్రను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా జరిగిన నాలుగువిడతల కంటే ఈ విడత యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని భావిస్తున్నాం. – పాదయాత్ర ప్రముఖ్ డా. గంగిడి మనోహర్‌రెడ్డి -
ఆయనేం తప్పు చేశారు? భావోద్వేగానికి లోనైన బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: రాజకీయ లబ్ధి కోసమే బీజేపీ ముఖ్య నేత బీఎల్ సంతోష్‌కు నోటీసులు పంపారని, ప్రచారక్‌ల జోలికి వస్తే ఊరుకునేది లేదని కేసీఆర్‌ను తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ హెచ్చరించారు. కేసీఆర్ కుట్రలు, కుతంత్రాలను ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఒకింత భావోద్వేగానికి లోనయ్యారు బండి సంజయ్. మంగళవారం ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘బీఎల్ సంతోష్ ఏం తప్పు చేశారు? ఆయన ఎమ్మెల్యే కాలేదు.. ఎంపీ కావాలనుకోలేదు.. ఆస్తిపాస్తులు సంపాదించుకోలేదు. కుటుంబ సభ్యులకు పదవులూ ఇప్పించుకోలేదు కూడా. కేవలం దేశం కోసం పని చేసే గొప్ప వ్యక్తి ఆయన. నోటీసుల పేరుతో ఒక ప్రచారక్‌ను అవమానపరిస్తే.. దేశ ప్రజలు సహించబోరని బండి సంజయ్ పేర్కొన్నారు. అంతేకాదు.. ప్రచారక్‌ల జోలికి వస్తే ఊరుకునేది లేదన్న బండి సంజయ్.. బీఎల్ సంతోష్‌కు ఫామ్ హౌజ్‌లు, బ్యాంకు ఖాతాలు లేవని పేర్కొన్నారు. కుటుంబాన్ని కాపాడుకునేందుకే కేసీఆర్.. సంతోష్‌కు నోటీసులు ఇప్పించరాని బండి సంజయ్ ఆరోపించారు. అయినా ధైర్యంగా పోరాడేతత్వం బీజేపీదని స్పష్టం చేశారు బండి సంజయ్. ఇదీ చదవండి: కనీస విలువ లేని పదవి నాకెందుకంటూ ‘బొక్కా’ అలక -
డిస్ట్రిబ్యూటర్లకు అండగా ఉండే రియల్ హీరో కృష్ణ గారు : బండి సంజయ్
-
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు పక్కాగా స్కెచ్చేశారు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: మునుగోడు ఓటర్లను డబ్బుతో ప్రలోభపెట్టేందుకు సీఎం కేసీఆర్ పకడ్బందీ ప్రణాళిక రచించారని... అందులో భాగంగానే ‘సారు’హెలికాప్టర్లో వచ్చి.. కాన్వాయ్‌లో డబ్బు సంచులు తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. నల్లగొండ జిల్లా మర్రిగూడలోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో ఆదివారం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డితో కలసి బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. ఉపఎన్నికలో ఒక్కో ఓటుకు రూ. 40 వేలు పంచేందుకు టీఆర్ఎస్ సిద్ధమైందన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించామంటూ సీఎం కేసీఆర్ బీజేపీపై ఆరోపణలు చేశారని, వాటిని నిరూపించడానికి యాదాద్రికి రమ్మన్నా, సిట్టింగ్ జడ్జితో విచారణ కోరినా, సీబీఐ విచారణకు డిమాండ్ చేసినా ముందుకు రాలేదని విమర్శించారు. తాము కోర్టును ఆశ్రయిస్తే విచారణ జరపొద్దంటూ కౌంటర్ వేస్తున్నారన్నారు. తప్పు చేయనప్పుడు విచారణ జరిపించడానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతిని ఉపసంహరించుకుంటూ జీఓ 51ను జారీ చేసి ఇంతవరకు బయట పెట్టలేదన్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ బిడ్డ పాత్ర ఉందనే కోణంలో దర్యాప్తు జరుగుతున్న సమయంలో ఆ జీఓ తీసుకొచ్చారని, సీబీఐ అంటే అంత భయమెందుకని ప్రశ్నించారు. నలుగురితో ప్రభుత్వం పడిపోతుందా? బీజేపీలో ఎవరు చేరినా పదవికి రాజీనామా చేసి రావాలనేది తమ విధానమని బండి సంజయ్ తెలిపారు. కానీ అధికార టీఆర్ఎస్ 36 మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్నా వారితో ఎందుకు రాజీనామా చేయించలేదని ప్రశ్నించారు. వారందరికీ ఎంత డబ్బిచ్చి, ఏ ప్రలోభాలకు గురిచేసి టీఆర్ఎస్లో చేర్చుకున్నారో చెప్పాలన్నారు. బీజేపీ ఆ నలుగురు ఎమ్మెల్యేలను ఎందుకు కొంటుందని, వారితో ప్రభుత్వం పడిపోతుందా? లేక తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామా? తమకేం అవసరమని ప్రశ్నించారు. చండూరు సభతో కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి కాబోతోందన్నారు. మునుగోడుకు సీఎం చేసిన మోసాలపై చార్జిషీట్ వేసేందుకు సిద్ధమా? అని బండి ప్రశ్నించారు. సీఎం కేసీఆరే జీఎస్టీ వేయాలని చెప్పారని, నూలు రంగులపై 50 శాతం సబ్సిడీ ఏమైందని, చేనేతబంధు ఏమైందని నిలదీశారు. ‘మోటార్లకు మీటర్లు పెట్టం.. అసలు నీ ఫాంహౌస్‌లోనే మీటర్లు పెడతం’అని ఆయన మండిపడ్డారు. అధికారులకు బెదిరింపులు.. కేసీఆర్ పాలనలో పోలీసులు అల్లాడుతున్నారని, 317 జీఓతో చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారని బండి సంజయ్ పేర్కొన్నారు. ఎస్పీ, కలెక్టర్లను మంత్రులు, ఎమ్మెల్యేలు బెదిరిస్తున్నారని... మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ను గెలిపించకపోతే వారిపై ఏసీబీ కేసులు పెట్టిస్తాం, బదిలీ చేస్తాం, లూప్లైన్లో వేస్తామని హెచ్చరిస్తున్నారన్నారు. పూర్తిస్థాయిలో టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరించాలని చెబుతున్నారన్నారు. యాదాద్రి కేటీఆర్ అయ్యదా? తాతదా? అని విమర్శించారు. టీఆర్ఎస్ చిల్లరగాళ్లకు కౌంటర్ ఇవ్వడానికి తామెందుకని అమిత్ షా, నడ్డా చెప్పారని సంజయ్ పేర్కొన్నారు. మిగిలిన రెండు రోజులు మునుగోడు నియోజకవర్గంలో భారీ ర్యాలీలు నిర్వహించబోతున్నామని, ఆ ర్యాలీలతో టీఆర్ఎస్కు దిమ్మతిరుగుతుందని బండి సంజయ్ అన్నారు. -
బండి సంజయ్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి : టీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత
-
గద్దె దింపి రాష్ట్రాన్ని సంప్రోక్షణ చేస్తాం
మునుగోడు: అధికారంలో ఉన్నామనే అహంకారంతో నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్న సీఎం కేసీఆర్ కుటుంబాన్ని త్వరలో గద్దె దింపి రాష్ట్రాన్ని సంప్రోక్షణ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ అన్నారు. ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో తమ పార్టీకి సంబంధం లేదని శుక్రవారం యాదగిరిగుట్టలో తడిబట్టలతో సంజయ్ ప్రమాణం చేయగా, ఆ దేవాలయాన్ని సంప్రోక్షణ చేయాలని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. మునుగోడులో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మందుతాగి లక్ష్మీనర్సింహ్మస్వామి పేరు ఉచ్ఛరిస్తున్నందుకు సంప్రోక్షణ చేయాలన్నారు. నాస్తికుడు దైవభక్తి గూర్చి మాట్లాడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. నలుగురు ఎమ్మెల్యేలు తప్పుచేయకపొతే ప్రగతిభవన్ నుంచి ఎందుకు బయటకు రావడం లేదని, కేసీఆర్‌కు ఎలాంటి సంబంధం లేకపొతే దేవుడి వద్ద ఎందుకు ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. మునుగోడులో కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ డబ్బులు ఇచ్చి ప్రచారం చేయిస్తోందని ఆరోపించారు. రాష్ట్రంలో రాహుల్‌గాంధీ చేస్తుంది కాంగ్రెస్ జోడోయాత్ర కాదని, అది టీఆర్ఎస్, కాంగ్రెస్ జోడుయాత్ర అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీలోని 16 మంది మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రగ్స్‌కు బానిసలయ్యారని, మమ్మల్ని విమర్శించే అర్హత ఆ బానిసలకు లేదని అన్నారు. మిగిలినివారికి సైతం డ్రగ్స్ అలవాటు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 31న నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో 9 బహిరంగ సభలు నిర్వహిస్తామని, వాటిల్లో తమ పార్టీ జాతీయ నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఆరోపణలు నిజం కాదు: తరుణ్‌ఛుగ్ నలుగురు ఎమ్మెల్యేలతో బీజేపీ బేరసారాలు చేస్తోందని ఇటీవల వచ్చిన ఆరోపణలు నిజం కాదని, అది అంతా సీఎం కేసీఆర్ ఆడిన డ్రామా అని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ చుగ్ అన్నారు. నిజంగా సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యేల కోనుగోళ్ల విషయంలో ఎలాంటి సంబంధం లేకపోతే బండి సంజయ్ సవాల్ మేరకు ఎందుకు యాదగిరిగుట్టలో ప్రమాణం చేయలేదని ప్రశ్నించారు. ఆయనకు సంబంధం ఉన్నందునే ప్రమాణానికి రాకుండా తప్పించుకున్నారని ఆరోపించారు. కేసీఆర్‌కు దమ్ముంటే గత 8 ఏళ్ల కాలంగా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. రామాయణంలో అహంకారం తలకెక్కిన రావణుడు ఎట్లా పతనమయ్యాడో కేసీఆర్‌కు సైతం అదే గతి పడుతుందన్నారు. మునుగోడు ఎన్నిక కేసీఆర్ అహంకారం వల్లే వచ్చిందన్నారు. సమావేశంలో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, నేతలు గంగిడి మనోహర్‌రెడ్డి, కంకణాల శ్రీధర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి...
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి పాదాల వద్ద తాను చేసిన ప్రమాణంతో సీఎం కేసీఆర్ రాజకీయ జీవితం సమాధి అవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ జోస్యం చెప్పారు. కేసీఆర్ తప్పుచేశారు కాబట్టే యాదాద్రికి రాలేదని, మునుగోడులో ఓడిపోతున్నామనే భయంతో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్‌కు తెరలేపారని ధ్వజమెత్తారు. ఈ కేసులో కేసీఆర్‌తోపాటు ఎమ్మెల్యేలందరూ లై డిటెక్టర్ పరీక్షలకు సిద్ధమా అని ప్రశ్నించారు. శుక్రవారం యాదాద్రి శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ముఖమండపంలో ఉత్సవ విగ్రహాల వద్ద ఆయన ప్రమాణం చేశారు. నలుగురు ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్లో తనకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు. అనంతరం కొండ కింద స్వామివారి పాదాల వద్ద ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సంజయ్ మాట్లాడారు. ఆడియో టేపుల పేరుతో తాజాగా మరో కొత్త సినిమా చూపే యత్నం చేసి కేసీఆర్ విఫలమయ్యారని ధ్వజమెత్తారు. అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటమ్ సాంగ్ యాడ్ చేసినట్లుగా.. చిత్తయిన డ్రామాను రక్తికట్టించేందుకు ఆడియో టేపు పేరుతో మరో కొత్త నాటకం ఆడుతున్నారని దుయ్యబట్టారు. 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్ ఆడియో టేపుల్లో చెప్పిన దాని ప్రకారం.. 1 అంటే కేసీఆర్, 2 అంటే కేటీఆర్ అని, సంతోష్ అంటే కేసీఆర్ సడ్డకుడి కొడుకు సంతోష్‌కుమార్ అని బండి సంజయ్ చెప్పారు. మునుగోడులో దుకాణం నడవలేదని, హైదరాబాద్‌కు షిఫ్ట్ చేశాడని, అక్కడా ఫెయిల్ కావడంతో ఢిల్లీ పేరుతో డ్రామా చేయబోతున్నాడన్నారు. లిక్కర్ దందాలో తన బిడ్డను, అవినీతి సొమ్మును ఎలా కాపాడుకోవాలన్నదే సీఎం తపన తప్ప ఇంకేమీ లేదన్నారు. తాను దేవుడిని నమ్ముకున్నానని, కేసీఆర్ దయ్యాలను, అవినీతి సొమ్ముతో కుట్రలు కుతంత్రాలను నమ్ముకుని రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మునుగోడు ఉప ఎన్నిక ఫలితాల తరువాత టీఆర్ఎస్ దుకాణం బంద్ అవుతుందనే భయంతోనే కేసీఆర్ ఈ డ్రామాకు తెరలేపాడన్నారు. తడి బట్టలతో ప్రమాణం యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని చెప్పినట్లుగానే బండి సంజయ్ శుక్రవారం ఉదయం యాదాద్రికి చేరుకున్నారు. ముందుగా ఆయన కొండపైకి చేరుకుని అక్కడే బిందెడు నీటితో తల స్నానం చేశారు. తడిబట్టలతోనే శ్రీ స్వామి దర్శనానికి వెళ్లారు. గర్భాలయంలో శ్రీస్వామి, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముఖ మండపంలోని ఉత్సవ మూర్తుల వద్ద ప్రమాణం చేశారు. బండి సంజయ్ రాకను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ శ్రేణులు నల్లజెండాలతో ఆందోళన చేశాయి. కాగా, చేనేతపై జీఎస్టీ ఎత్తివేయాలంటూ మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురంలో చేనేత కార్మికులు పోస్ట్‌కార్డులు, ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. -
‘దుబ్బాకలో రూ.10వేలు, హుజురాబాద్‌లో 20వేలు, మునుగోడులో 40వేలు’
సాక్షి, వరంగల్: మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్తుతో ముడిపడి ఉందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు ఒకటేనని ఆరోపించారు. ఇటీవల హనుమకొండలో మృతి చెందిన ఏబీవీపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు గుజ్జుల నర్సయ్య సంస్మరణ సభకు హాజరైన సందర్భంగా మాట్లాడారు బండి సంజయ్. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేందుకు బీఆర్ఎస్ అనేక అక్రమాలకు పాలుపడుతుందని ఆరోపించారు. ‘ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ కుట్రలకు కాంగ్రెస్ సహకరిస్తోంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల అక్రమాలను అడ్డుకుంటాం. దుబ్బాకలో ఓటుకు రూ. 10వేలు, హుజురాబాద్ రూ. 20 వేలు పంచిన బీఆర్ఎస్ ఇప్పుడు మునుగోడులో ఓటుకు రూ. 40వేలు పంచేందుకు సిద్ధమైంది. అధికార యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో వాడుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోంది. అనుకూలమైన అధికారులను బదిలీ చేయించుకున్నారు. పెద్ద ఎత్తున మంత్రులు, ఎమ్మెల్యేలను, మద్యం మునుగోడుకు పంపించడం చూస్తే సీఎం కేసీఆర్ ఎంత డిప్రెషన్లో ఉన్నారో అర్థమవుతుంది.’ అని దుయ్యబట్టారు బండి సంజయ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మా కోసం రాజీనామా చేశాడని మునుగోడు ప్రజలు ఆలోచిస్తున్నారని, ఎవరెన్ని కుట్రలు పన్నినా మునుగోడులో బీజెపీ భారీ మెజార్టీతో గెలుస్తుందనే ధీమా వ్యక్తం చేశారు బండి సంజయ్ కుమార్. ఫోన్ల ట్యాపింగ్ కోసం ఇజ్రాయిల్ టెక్నాలజీతో ఒప్పందం చేసుకుంది కేసీఆరేనని ఆరోపించారు. రాష్ట్ర మంత్రులు ఆ పార్టీ నేతలు బాహాటంగా చెబుతున్నారని తెలిపారు. నీచమైన, దుర్మార్గమైన ఆలోచన కేసీఆర్‌దేనని, బీజేపీపై విమర్శలు చేయడానికి సిగ్గుండాలన్నారు బండి సంజయ్. ఇదీ చదవండి: మునుగోడు టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించిన సీఎం కేసీఆర్ -
బీఆర్ఎస్ కు జెండా లేదు , అజెండా లేదు : బండి సంజయ్
-
TRS టు BRS: దారుణమైన సెటైర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి(TRS) కాస్త.. భారత్ రాష్ట్ర సమితి(BRS)గా మారిపోయింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇవాళ జరిగిన టీఆర్ఎస్ సర్వ సభ్య సమావేశంలో సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రకటించారు. దీంతో దేశమంతటా కేసీఆర్ ప్రకటనను ఆసక్తికరంగా వీక్షించింది. అయితే.. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు మాత్రం బీఆర్ఎస్పై వ్యంగ్యాస్త్రలు సంధిస్తున్నాయి. ఈ క్రమంలో.. తెలంగాణ బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్ ట్విటర్ వేదికగా స్పందించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ మారడం అనేది పందికి లిప్‌స్టిక్ పూసినట్లు ఉందని ఎద్దేవా చేశారు. ట్విటర్ టిల్లు ఏమో గేమ్ చేంజర్స్ అని ప్రకటించుకున్నాడు. కానీ, అయ్య ఏమో నేమ్ చేంజర్ అయ్యాడు. అంతిమంగా ఫేట్ ఛేంజర్స్ మాత్రం ప్రజలే అంటూ బీఆర్ఎస్ పరిణామంపై వ్యంగ్యంగా స్పందించారు బండి సంజయ్ కుమార్. TRS to BRS is like "Putting lipstick on a pig".#TwitterTillu Claimed to be Game Changers... But father became a Name Changer. People are the ultimate Fate Changers !! — Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 5, 2022 ఇక బీఆర్ఎస్ పరిణామం ఆశ్చర్యం కలిగించిందని అంటున్నారు బీజేపీ అధికార ప్రతినిధి కే కృష్ణ సాగర్ రావు. పేరు మార్చినంత మాత్రానా జాతీయ పార్టీ ఎలా అవుతుంది?. ఒక పార్టీ జాతీయ పార్టీగా గుర్తించబడాలంటే.. చాలా రాష్ట్రాల్లో గణించదగిన ఓటర్ల మద్దతు పొందాలి అని పేర్కొన్నారు. తెలంగాణ మోడల్ దేశమంతటా ఉండాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ ఆవిర్భావం జరిగిందని కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపైనా బీజేపీ సెటైర్లు పేల్చింది. తెలంగాణ మోడల్ అనేది కేవలం కేసీఆర్ ఊహ మాత్రమేనని అంటోంది. ‘‘పార్టీలు రావడం, మసకబారడం రాజకీయాల్లో కొత్తేమీ కాదు. ప్రళయం రాబోతోందని ఒకప్పుడు కేసీఆర్ చెప్పారు. అదే ఇదే(బీఆర్ఎస్ ప్రకటన) అంటూ సెటైర్ పేల్చారు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి. -
‘‘మునుగోడు’’ను జల్లెడ పట్టండి
మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తరువాత టీఆర్ఎస్ కనుమరుగు కాబోతుందని, బీజేపీ గెలుపు ఎప్పుడో ఖాయమైందని రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో బండి సంజయ్ పార్టీ నేతలతో ప్రత్యేకంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా ఈ ఉప ఎన్నికపై చర్చ జరుగుతోందన్నారు.' ఓటుకు రూ.30 వేలు పంచి గెలవాలని టీఆర్ఎస్ చూస్తోంది. బీజేపీ దమ్ము ఏంటో చూపించే అవకాశం మనకు ఈ ఎన్నిక ద్వారా మరోసారి వచ్చింది. ఇది మనందరికీ పరీక్షా సమయం. మీరంతా ఉప ఎన్నిక పూర్తయ్యేంత వరకు బిస్తర్ సర్దుకుని మునుగోడులోనే మకాం వేయండి. ప్రతి ఒక్క ఓటర్ ను పోలింగ్ బూత్ వరకు రప్పించి పువ్వు గుర్తుకు ఓటేయించండి‘‘అని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ► దాదాపు 40 నిమిషాలపాటు జరిగిన ఈ సమావేశంలో తొలుత వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ సర్వేలన్నీ బీజేపీ గెలుపు ఖాయమని స్సష్టం చేస్తున్నాయన్నారు. అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ.. మునుగోడులో పార్టీ బలోపేతం కోసం మనోహర్ రెడ్డి చేస్తున్న క్రుషిని ప్రత్యేకంగా అభినందించారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీపై నమ్మకంతో రాజీనామా చేసిన నేపథ్యంలో పార్టీ గెలుపే లక్ష్యంగా మనోహర్ రెడ్డి ఎంతగానో కష్టపడుతున్నారని కొనియాడారు. ► అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ... ‘‘ మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు దేశ భవిష్యత్ ను నిర్ణయించబోతోంది. అన్ని సర్వేలు బీజేపీ గెలుస్తుందని చెబుతున్నాయి. కేసీఆర్ మాత్రం ఓటుకు రూ.30 వేలు ఇచ్చి గెలవాలని కుట్ర చేస్తున్నడు. ఇది మనందరికీ పరీక్షా సమయం. ఎన్నికయ్యే వరకు అప్రమత్తంగా ఉందాం. మీరంతా బిల్లా బిస్తర్ సర్దుకుని ఎన్నికలయ్యే వరకు మునుగోడులోనే మకాం వేయండి. నియోజకవర్గం మొత్తం జల్లెడ పట్టండి... ప్రతి ఓటర్ ను ఒకటికి నాలుగు సార్లు కలవండి. అందరినీ పోలింగ్ కు తీసుకొచ్చి పువ్వు గుర్తుకు ఓటేయించండి’’అని కోరారు. ► ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీల్చడానికి టీఆర్ఎస్ కుట్ర చేస్తోందని, అందులో భాగంగా కాంగ్రెస్ పార్టీకి నిధులిస్తోందని పేర్కొన్నారు. కమ్యూనిస్టు పార్టీలు సహా అన్ని పార్టీలకు టీఆర్ఎస్ ఆర్ధిక సాయం చేస్తోందన్నారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా.. ఎంత డబ్బు ఖర్చు చేసినా ప్రజల ఆశీర్వాదం, అమ్మవారి క్రుప బీజేపీపై ఉందన్నారు. ► దేవీ నవరాత్రి ఉత్సవాల సమయంలో వచ్చిన ఎన్నికల్లో గెలుపు బీజేపీదేనన్నారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్ లో బీజేపీ కార్యకర్తలు తిండి తిప్పలు లేకుండా కష్టపడి పనిచేయడంవల్లే బీజేపీ గెలిచిందన్నారు. మునుగోడులోనూ తాడో పేడో తేల్చుకుందామని, ప్రతి కార్యకర్త మునుగోడులో మకాం వేయాలని కోరారు. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తరువాతే బీజేపీ కార్యకర్తలకు అసలైన దసరా, దీపావళి పండుగ రాబోతోందని పేర్కొన్నారు. -
‘ఖాసీం చంద్రశేఖర్ రజ్వీని గద్దె దింపుతాం’
మల్కాజిగిరి (హైదరాబాద్): నిరంకుశ పాలన చేస్తున్న ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ (కెసీఆర్)ని గద్దె దింపుతామని బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సంజయ్ నాలుగో విడవ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం మల్కాజిగిరి వెంకటేశ్వరనగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో 1,450 మంది ప్రాణ త్యాగం చేశారన్నారు. కానిస్టేబుల్ కిష్ణయ్య, శ్రీకాంతాచారి లాంటి పేదవాళ్లు ప్రాణత్యాగం చేస్తే వచ్చిన రాష్ట్రాన్ని పెద్దోడు ఏలుతున్నారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్, టీఆర్ఎస్కు ఓటు వేస్తే మజ్లిస్‌కు వేసినట్లేనన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లకు అవకాశమిచ్చారని.. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే మోదీ నాయకత్వంలో నీతివంతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. కేంద్రం 2.4 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఈ ప్రాంతం వారికి ఒక్కటైనా వచి్చందా? అని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ కోసం కేంద్రం రూ.600 కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తనవంతు నిధులు మంజూరు చేయలేకపోయిందన్నారు. మల్కాజిగిరిలో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు. సమస్యలపై ప్రశి్నస్తే టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని, ఎన్ని సార్లయినా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..: నాలుగువేల ఐదువందల మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ మహిళలను వివస్త్రలు చేసి ఆటాడిపించిన రజాకార్లు, నిజాంకు వత్తాసు పలుకుతున్న కెసీఆర్‌కు సిగ్గులేదన్నారు. దీనికి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. దారుసలాం నుంచి ఒవైసీ.. కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు చెబుతున్నాడంటే ప్రభుత్వం ఎవరి కనుసైగల్లో నడుస్తున్నదో ప్రజలు గమనించాలన్నారు. పాతబస్తీలో పాకిస్తాన్ జెండాలు పట్టుకున్న చేతులు ఈ రోజు జాతీయ జెండాను పట్టుకున్నాయంటే బీజెపీ వల్లనే నన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న కెసీఆర్.. ఇన్ని రోజులు కేంద్రం అడ్డుకుందని చెప్పి వారిని మోసగించారన్నారు. గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వని కేసీఆర్, వారు పండించుకున్న పంటను సైతం నాశనం చేసి.. మహిళలను కూడా అరెస్ట్ చేశారన్నారు. ఎస్టీ సోదరులు ఈ సంఘటనలు గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. కాగా, ఈ సందర్భంగా కురుమ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి, సునీతా యాదవ్, జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు -
బండి సంజయ్ ఖమ్మం పర్యటన పై మంత్రి పువ్వాడ స్పందన
-
‘హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్‌బండ్‌కు రండి’
కవాడిగూడ (హైదరాబాద్): పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఒక నాస్తికుడని అందుకే వినాయక నిమజ్జనానికి ఆటంకం కలిగిస్తూ హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. గణనాథులను ట్యాంక్బండ్లోనే నిమజ్జనం చేద్దామని, అందుకు హిందువులంతా సద్దికట్టుకుని ట్యాంక్‌బండ్‌పైకి రావాలని పిలుపునిచ్చారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక నిమజ్జన ఏర్పాట్లను బుధవారం సంజయ్ పలువురు నేతలతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి దీక్షలకు, బీజేపీ నిరసనలకు దిగొచ్చి ప్రభుత్వం ట్యాంక్‌బండ్‌పై క్రేన్లను ఏర్పాట్లు చేస్తోందన్నారు. ట్యాంక్‌బండ్‌పై వినాయక మండపాల నిర్వాహకులను పోలీసులు అడ్డుకుంటుంటే దారుసలాంలో సంబురాలు చేసుకుంటున్నారన్నారు. నిఖా ర్సయిన హిందువునని ప్రకటించుకునే సీఎం కేసీఆర్‌కు ఇది తగునా? అని ప్రశ్నించారు. ఇదీ చదవండి: Telangana: స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలి: బండి సంజయ్ -
‘దేశ రాజకీయాల పేరిట కేసీఆర్ కొత్త డ్రామా’
సాక్షి, హైదరాబాద్: ఇబ్రహీంపట్నంలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించి నలుగురు మహిళలు మృతి చెందడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాడులు, ఉద్యోగ నోటి ఫికేషన్ల విడుదలలో జాప్యం వంటి విషయా లపై నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం కేసీఆర్ దేశరాజకీయాలు, ఫ్రీ కరెంటు అంటూ కొత్త డ్రామాకు తెరదీశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ధ్వజమె త్తారు. ఇబ్రహీంపట్నం ఘటనలో వైద్యశాఖ మంత్రి హరీశ్‌ను బర్తరఫ్ చేయాలని, వైద్య శాఖ డైరెక్టర్‌ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం మీడియాతో మాట్లా డుతూ.. దేశంలో ఎక్కడ ఈడీ దాడులు జరి గినా, అవినీతి, అక్రమాలు బయటపడ్డా కేసీఆర్ కుటుంబసభ్యుల ప్రమేయం ఉన్నట్లు వార్తలొస్తున్నాయన్నారు. ఈ చర్చను, ప్రజా సమస్యలను, రాష్ట్రంలో జరుగుతున్న వరుస సంఘటనలను దారి మళ్లించేందుకే కేసీఆర్ కొత్త డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డా రు. ‘ఇబ్రహీంపట్నం ఘటనౖపై దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు, దీనికి బాధ్యుడైన హెల్త్ డైరెక్టర్‌ను విచారణ అధికారిగా నియమిస్తా రా? ఆయనపై ఉన్నన్ని ఆరోపణలు ఎవరి పైనా లేవు. పోస్టింగులు, డిప్యూటేషన్లు, ప్రమోషన్లుసహా ఏ పని చేసినా ఆయనకు పైసలియ్యాల్సిందే. నెలనెలా మూటముల్లె సీఎం, మంత్రికి అప్పగిస్తుండు. రేపోమాపో కేసీఆర్ ఆయనను ఎమ్మెల్సీ చేస్తాడేమో’ అని వ్యాఖ్యానించారు. ఈడీ దాడులపై విలేకరుల ప్రశ్నలకు సంజయ్ స్పందిస్తూ వాళ్ల పనివాళ్లు చేస్తరని, దాని గురించి తమకు సమాచారం లేదని అన్నారు. కేసీఆర్ మోసాలు చాటాలి ‘టీఆర్ఎస్ను గద్దె దించేది, బీజేపీని అధికారంలోకి తెచ్చేది మునుగోడు ఉప ఎన్నికే. ఈ నియోజకవర్గంలో ఒక్కో ఎస్సీ మోర్చా కార్యకర్త సగటున వంద ఇళ్లకు వెళ్లి టీఆర్ఎస్ మోసాలను ఎండగట్టండి. దళితులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చేసిన అన్యాయాలను వివరించండి’ అని బండి సంజయ్ పిలుపునిచ్చారు. మంగళ వారం ఎస్సీ మోర్చా రాష్ట్ర పదాధికారుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు జి.వివేక్ వెంకటస్వామి, మునుస్వామి, కొప్పు భాషా, కుమ్మరి శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: అమిత్ షా యాక్షన్‌ప్లాన్.. ఢిల్లీలో మెగా మీటింగ్.. ఇంక ఆ సీట్లపైనే గురి -
ఇంకా గృహ నిర్బంధంలోనే బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఇంకా గృహ నిర్బంధంలోనే ఉన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై దాడికి నిరసనగా జనగామ స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని పాంనూరులో ఆయన చేపట్టిన ధర్మధీక్షను భగ్నం చేసిన పోలీసులు.. అదుపులోకి తీసుకుని కరీంనగర్‌లోని ఆయన నివాసానికి తరలించి గృహ నిర్భంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే.. టీఆర్ఎస్ ప్రభుత్వ దమనకాండను నిరసిస్తూ.. బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ నిరసన దీక్షలకు పిలుపు ఇచ్చింది. దీక్షలను విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు బండి సంజయ్ పిలుపు ఇచ్చారు. ఇందులో భాగంగా తన నివాసంలోనే నిరసన దీక్ష చేపట్టనున్నారు బండి సంజయ్. మరోవైపు టీఆర్ఎస్ ప్రభుత్వ వ్యతిరేక చర్యలను ఎండగట్టాలని బీజేపీ తీవ్రంగా యత్నిస్తోంది. హైకోర్టుకు బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని, రెచ్చగొట్టే ప్రసంగాలతో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని, వీటితో పాటు ప్రస్తుత రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా బండి సంజయ్‌ను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెప్తున్నారు. అయితే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలంటూ తెలంగాణ పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడంపై బీజేపీ నేతలు నేడు హైకోర్టుకు వెళ్తున్నారు. ఈ మేరకు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తద్వారా యాత్ర కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని ఉన్నత న్యాయస్థానాన్ని కోరనున్నారు. ఇదీ చదవండి: ఒక్కసారిగా హీటెక్కిన తెలంగాణ! -
బండి సంజయ్‌కు షాక్.. పాదయాత్రకు పోలీసుల బ్రేక్!..
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు బ్రేక్ పడింది. ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని వరంగల్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. జనగామ జిల్లాలో పాదయాత్రకు అనుమతి లేదని నోటీసులో పేర్కొన్నారు. పాదయాత్ర పేరిట విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారన్నారని వర్దన్నపేట ఏసీపీ శ్రీనివాస్ రావు వెల్లడించారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని.. రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారని తెలిపారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు ఏసీపీ నోటీసులు జారీ చేశారు. జాఫర్ ఘడ్ మండలం ఉప్పుగల్‌లో చోటుచేసుకున్న పరిణామాలతో శాంతి భద్రతల దృష్ట్యా నోటీసులు జారీ చేశామని తెలిపారు. తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. చదవండి: అరెస్టుపై బండి సంజయ్ సూటి ప్రశ్న.. ఫోన్ చేసి ఆరా తీసిన అమిత్ షా మరోవైపు ఎట్టి పరిస్థితుల్లోనూ పాదయాత్రను ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్, బీజేపీ నాయకులు తేల్చి చెబుతున్నారు. తమ పాదయాత్రను ఎక్కడ అడ్డుకున్నారో.. అక్కడి నుండే మళ్లీ మొదలుపెడతానని సవాల్ చేశారు. కచ్చితంగా భద్రకాళి అమ్మవారి పాదాల చెంత వరకు పాదయాత్ర కొనసాగిస్తానని తెలిపారు. మూడో విడత పాదయాత్ర ముగింపు సందర్భంగా బహిరంగ సభ నిర్వహించి తీరుతామని దానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరవుతారని బండి సంజయ్ పేర్కొన్నారు. చదవండి: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్ హైకోర్టుకు బీజేపీ ఇక బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై బీజేపీ న్యాయ పోరాటానికి దిగింది. పాదయాత్రను నిలిపి వేయాలని పోలీసులు జారీ చేసిన నోటీసులను సవాలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర బీజేపీ పార్టీ తరుపున హైకోర్టులో హౌజ్ మోషన్ పిటీషన్ దాఖలు అయ్యింది. బీజేపీ హౌస్ మోషన్ పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.దీంతో రేపు మరోసారి పిటిషన్ దాఖలు చేయనున్నారు. కాగా ఓవైపు పోలీసుల నోటీసులు మరోవైపు బీజేపీ నేతల ప్రకటనలతో బండి సంజయ్ యాత్ర ముందుకు సాగుతుందా? లేక బ్రేక్ పడుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. -
మేము బలపడితే టీఆర్ఎస్ జీర్ణించుకోలేక పోతోంది: కిషన్ రెడ్డి
-
కూతురుకు ఓ న్యాయం... ఇతరులకు ఓ న్యాయమా?: బండి సంజయ్
-
అసలు సమస్య ఎక్కడిది? ఈ అరెస్టు ఎందుకు: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగాంలో అరెస్ఠ్ చేసి కరీంనగర్‌లోని ఆయన ఇంటికి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. 21 రోజులుగా యాత్రపైలేని సమస్య ఇవాళ ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. ఈరోజే తన యాత్రను అడ్డుకోవడానికి కారణం ఏంటని నిలదీశారు ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభిస్తానని బండి సంజయ్ తెలిపారు. కూతురిని కాపాడుకునేందుకు తన యాత్రను కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతుర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కూతురికి ఓ న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడలేదని నిలదీశారు. పాదయాత్రపై దాడి చేస్తే ప్రజలు బడిత పూజ చేస్తారని మండిపడ్డారు. అమిత్ షా ఆరా మరోవైపు పాదయాత్రలో బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. ఈ మేరకు సంజయ్‌కు అమిత్ షా ఫోన్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆమె ఇంటి వద్ద సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్పూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేశారు. చదవండి: మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్ -
ఎక్కడికక్కడే బీజేపీ నేతలు అరెస్ట్.. కిషన్ రెడ్డి స్పందన ఇదే..
Kishan Reddy.. సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు తెలంగాణలో రాజకీయ సంచలనాలు చోటుచేసుకుంటున్నాయి. ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద బీజేపీ ఆందోళనలు, దీక్ష నేపథ్యంలో బండి సంజయ్ సహా కొందరు బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా, బీజేపీ నేతల అరెస్ట్‌లపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల కేసీఆర్ అభద్రతా భావంతో ఉన్నారు. విష ప్రచారం చేయడం, అక్రమ కేసులు పెడుతున్నారు. సీఎం కార్యాలయమే స్వయంగా టీఆర్ఎస్ మంత్రులు, ప్రజా ప్రతినిధులను రెచ్చగొట్టి.. బండి సంజయ్ పాదయాత్రను అడ్డుకునే ప్రయత్నం జరుగుతోంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతోనే బీజేపీ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారు. వినాశకాలే.. విపరీత బుద్ధి అన్నట్టుగా.. త్వరలోనే కేసీఆర్ కుటుంబ, ప్రజా వ్యతిరేక పాలన నుంచి ప్రజలకు త్వరలోనే విముక్తి కలుగుతుంది. ప్రజలు కూడా ఇదే ఆశిస్తున్నారు’’ అని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. వరుస అరెస్టులపై బీజేపీ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈరోజు సాయంత్రం 5-6 గంటల వరకు అన్ని మండలాల్లో పార్టీ ఆఫీసుల వద్ద నిరసనలు తెలపాలని నిర్ణయించింది. నల్లబ్యాడ్జీలు ధరించి శాంతియుతంగా నిరసన దీక్ష చేపట్టాలని నేతలు పిలుపునిచ్చారు. మరోవైపు.. ఉప్పుగల్, కూనూర్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో బీజేపీ ఫ్లెక్సీలకు టీఆర్ఎస్ కార్యకర్తలు నిప్పంటించారు. ఇది కూడా చదవండి: మేము తలుచుకుంటే బీజేపీ నేతలు మిగులుతారా.. తలసాని మాస్ వార్నింగ్ -
దీక్ష భగ్నం.. బండి సంజయ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్/జనగామ: కరీంనగర్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. జనగామ పాంమ్నూరు వద్ద బండి సంజయ్ చేపట్టిన దీక్షను భగ్నం చేసిన పోలీసులు.. కార్యకర్తల తోపులాట మధ్యే ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ కార్యకర్తలపై తెలంగాణ ప్రభుత్వం-పోలీసుల దాడి నేపథ్యంతో ఆయన దీక్షకు ఉపక్రమించగా.. దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేశారు. ఇక పోలీసుల వాహనాన్ని బీజేపీ కార్యకర్తలు అడ్డుకునే యత్నం చేస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. బండి సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ దాడి చేసే అవకాశం ఉందని కేంద్రానికి నిఘా వర్గాలు నివేదించాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత తరుణ్ చుగ్ సహా కేంద్ర పెద్దల బండి సంజయ్‌ను ఫోన్లో పరామర్శించారు. ఇక దాడి నేపథ్యంలో భద్రత పెంచేందుకు పోలీసులు సిద్ధం కాగా, ఆ భద్రతను తిరస్కరించారు బండి సంజయ్.‘నా భద్రత సంగతి కార్యకర్తలే చూసుకుంటారు’ అని ఆయన పోలీసులతో తేల్చి చెప్పినట్లు సమాచారం. కార్యకర్తలకు ఏదైనా జరిగితే సర్కార్ అంతు చూస్తామని హెచ్చరించిన బండి సంజయ్.. పాదయాత్ర శిబిరం వద్ద ‘‘కేసీఆర్ కుటుంబ దమన నీతిపై ధర్మదీక్ష’’కు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బండి సంజయ్ పాదయాత్ర శిబిరం వద్ద ముందుగానే మోహరించిన పోలీసులు.. ఆయన భద్రతా కారణాల దృష్ట్యే అదుపులోకి తీసుకున్నట్లు చెబుతున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును టీఆర్ఎస్ ప్రభుత్వం కాలరాస్తోందని బీజేపీ నేతలు కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. లిక్కర్ స్కామ్‌లో కేసీఆర్ కుటుంబం పాత్రను తేల్చేంతవరకు తాము నిరసనలు కొనసాగిస్తామని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఇదీ చదవండి: చావడానికైనా రెడీ: రాజాసింగ్ షాకింగ్ కామెంట్స్ -
ఎవుసం బాగుండాలే... రైతన్న బాగుపడాలే
ఇప్పటివరకు రెండు విడతలుగా పాదయాత్ర చేసిన. మూడో విడత పాదయాత్ర ఆగస్ట్ 2న యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నర్సింహా దేవాలయం నుంచి వరంగల్‌లోని భద్రకాళి అమ్మవారి దేవాలయం వరకు కొనసాగనున్నది. ప్రజా సమ స్యలను తెలుసుకోవడం, ఇబ్బందుల్లో ఉన్న రైతాంగానికి భరోసా ఇవ్వడం, యావత్ తెలంగాణ ప్రజలపట్ల కేసీఆర్ సర్కార్ అను సరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడంతో పాటు రాబోయేది బీజేపీ ప్రభుత్వమే అనే విశ్వాసాన్ని ప్రజల్లో నింపడమే ఈ పాదయాత్ర లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న రైతాంగం కోసం ‘ఫసల్ బీమా యోజన’ పథకం తీసుకువచ్చింది. దీని వల్ల అకాల వర్షాలు, ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభ వించినప్పుడు రైతాంగానికి సత్వరమే నష్టపరిహారం చెల్లించే వీలు ఉంది. కానీ కేసీఆర్ ప్రభుత్వం ఈ పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయడం లేదు. రైతుల పట్ల కేసీఆర్ చిత్తశుద్ధికి ఇదే నిలువెత్తు నిదర్శనం. రాష్ట్రంలో 14 లక్షల మంది కౌలు రైతులున్నరు. కౌలు రైతులకు ఎటువంటి సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. కౌలు రైతుకు ‘రైతు బంధు’ పథకం ఎటూ అమలు కాకపోయినా... ఉచిత ఎరువులు, సబ్సిడీ రుణాల వంటి సౌకర్యాలన్నా ఉండాలి కదా. కౌలు రైతులు గుర్తింపు కార్డులతో నాబార్డు నుంచి రుణాలు పొందే సౌకర్యం ఉన్నా ప్రభుత్వం అందుకు సహకరించడం లేదు. ఏక కాలంలో లక్ష రూపాయల వరకూ ఉన్న రైతుల రుణాలను మాఫీ చేస్తమని కేసీఆర్ ఎన్నికల్లో వాగ్దానం చేసిన్రు. ఆ హామీ ఇప్పటికీ సంపూర్ణంగా అమలు కాలే. లక్ష లోపు రుణమాఫీ కావాల్సిన వారు ఇప్పటికే 31 లక్షల మంది ఉన్నరు. రూ. 25 వేల నుండి రూ. 50 వేల వరకు రుణమాఫీ కావాల్సిన వారు 5.72 లక్షలు, రూ. 50 వేల నుంచి 75 వేల వరకు రుణమాఫీ కావాల్సిన రైతులు 7 లక్షల మంది ఉన్నరు. రైతన్నలను మరింత వణికిస్తున్న సమస్య ‘ధరణి’. రైతాంగం ఎదుర్కొంటున్న మొత్తం సమస్యలకు ‘జిందాతిలిస్మాత్’లా ధరణి పోర్టల్ పనిచేస్తదని కేసీఆర్ డాంబికాలు పలికిన్రు. కానీ ఆచరణలో ధరణి పేరెత్తితే రైతులు హడలెత్తి పోతున్నారు. పాస్‌పుస్తకం చేతిలో ఉన్నా, ఆ భూమికి యజమాని తామేనా? కాదా? అన్న రీతిలో రైతన్నల దుఃస్థితి నెలకొన్నది. అసైన్డ్ భూములను సైతం ప్రభుత్వం వదలడం లేదు. అసైన్డ్ భూముల్లో వెంచర్లు వేస్తూ ప్రభుత్వం పేదల ఉసురు తీస్తున్నది. ఒక్క ‘రైతుబంధు’ ఇచ్చి అన్ని సబ్సిడీలు బంద్ పెట్టిన ఘనత కేసీఆర్‌దే. ట్రాక్టర్ల సబ్సిడీ బంద్. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీ బంద్. ‘రైతునే రాజు చేస్తా, బంగారు తెలంగాణలో ఎరువు లన్నీ ఉచితంగా అందిస్తాన’న్న కేసీఆర్ మాటలు నీటి మూటలయ్యాయి. ఇక పోడు రైతుల సమస్యలు చెప్పనలవి కాదు. ముఖ్యమంత్రి కేసీఆరే స్వయంగా కుర్చీ వేసుకుని పోడుభూముల పట్టా సమస్యలను పరిష్క రిస్తామని చెప్పిన్రు. పోడుభూముల సమస్య పరిష్కారం కాకుం డానే అదే భూముల్లో ఫారెస్ట్ అధికారులు వన సంరక్షణ పేరుతో మొక్కలు నాటుతుంటే కేసీఆర్ గుడ్లు అప్ప గించి చూస్తున్రు. రైతులు పండించిన ధాన్యం కొనుగోళ్ళ విష యంలో కేంద్రం స్పష్టమైన వైఖరిని ప్రకటించినా రాష్ట్రప్రభుత్వం ఆ సమస్యను రాజకీయం చేయాలను కున్నది. ఎఫ్‌సీఐ సోదాల్లో బయటపడ్డ రైస్‌మిల్లర్ల అక్ర మాలను కప్పిపుచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం చేయని ప్రయత్నం లేదు. గన్నీబ్యాగుల కొనుగోలు నుంచి ధాన్యం నిల్వ వరకూ ప్రతిపైసా కేంద్రమే చెల్లిస్తున్నా ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్రప్రభుత్వం నానా యాగీ చేసింది. ‘వరేస్తే ఉరే’ అంటూ కేసీఆర్ చేసిన ప్రకటన వల్ల యాసంగిలో 14 లక్షల ఎకరాలలో రైతులు వరిపంట వేయక నష్టపోయారు. రైతులకు ప్రత్యామ్నాయ పంటల విషయంలోనూ ప్రభుత్వం తగిన సూచనలు ఇచ్చిన దాఖలాలు లేవు. ప్రభుత్వం సకాలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడం వల్ల యాసంగి పంటను దళారులు కోరిన రేటుకే రైతులు అమ్ము కోవాల్సిన దుఃస్థితిని కేసీఆర్ కల్పించిన్రు. రైతు బంధుకు సకాలంలో నిధులియ్యరు. కుంటిసాకులు చెప్పి రైతుల బీమాను పక్కాగా అమలు చేయరు. రైతు రుణ మాఫీ ఊసే ఎత్తరు. కాళేశ్వరం పేరుతో ఖజానా ఖాళీ చేసిన కేసీఆర్ సర్కార్ మొన్నటి వరదల్లో మేడిగడ్డ సహా ఇతర లిఫ్టుల పరిస్థితి చూసి, ఇప్పుడు ప్రజల దృష్టి మళ్లియ్యడానికి నానా తిప్పలు పడుతున్నది. గిట్టుబాటు ధర అడిగిన రైతులకు బేడీలు వేసి జైళ్లకు పంపిన ఘనమైన చరిత్ర కూడా కేసీఆర్ ప్రభుత్వానిదే. కేసీఆర్ ప్రజలకు చేసింది శుష్కవాగ్దానాలు, శూన్య హస్తం తప్ప వేరే ఏమీ కనిపించవు. తెలంగాణ రైతాంగం పట్ల కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను ఎండగట్టేందుకు బీజేపీ ‘ప్రజాసంగ్రామ పాదయాత్ర’ చేపట్టింది. రైతుల కోసం కేంద్రం అమలు చేస్తున్న వివిధ పథకాలను కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం నీరు గారుస్తున్నది. రైతాంగం పట్ల కేసీఆర్ తీరును ప్రశ్నించేందుకు ఈ ప్రజా సంగ్రామ పాదయాత్రను ఒక అవకాశంగా భారతీయ జనతా పార్టీ భావిస్తున్నది. వ్యవసాయ రంగం అభివృద్ధి, రైతుల సంక్షేమమే ధ్యేయంగా సాగనున్న ఈ ప్రజా సంగ్రామ పాద యాత్రకు తెలంగాణ రైతాంగం అంతా బాసటగా నిల వాలని కోరుతున్నాం. ఎవుసం బాగుండాలే, రైతన్న బాగు పడాలే... అదే బీజేపీ లక్ష్యం. అందుకే నా పాదయాత్ర! - బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు -
భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర అనటం ఈ శతాబ్దపు జోక్: బండి సంజయ్
ఢిల్లీ: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో గోదావరి మహా ఉగ్రరూపం దాల్చింది. దీంతో తెలంగాణలోని చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంత ప్రజలు ఇంకా వరద నీటిలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందనడం ఈ శతాబ్దపు జోక్ అంటూ దుయ్యబట్టారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కేసీఆర్ డ్రామాలాడుతున్నారని ఆరోపించారు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్. 10వేల ఇండ్లతో కాలనీ, గోదావరిపై కరకట్ట నిర్మాణం పేరుతో మళ్లీ ప్రజలను వంచించే హామీలు ఇచ్చారని విమర్శించారు. కేసీఆర్ చేసిన తప్పిదాలవల్లే కాళేశ్వరం ప్రాజెక్టు మునిగిందన్నారు. వరదలపై ప్రజలను దారి మళ్లించేందుకే విదేశీ కుట్ర అంటూ వ్యాఖ్యలు చేశారని ఆరోపించారు. వారం రోజులుగా వరదలతో జనం అల్లాడుతుంటే పట్టించుకోని సీఎం.. ప్రాంతీయ పార్టీల నేతలతో రివ్యూలు చేస్తూ కేంద్రాన్ని బదనాం చేయడానికే పరిమితమయ్యారని పేర్కొన్నారు. కుట్రలకే పెద్ద కుట్రదారుడు కేసీఆర్ అని.. ఆయన మాటలను నమ్మేదెవరు? అని ప్రశ్నించారు. కాగా, ఈ స్థాయిలో వరదలు వస్తాయని ఎవరూ ఊహించలేదని.. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతిలో వరదలు సృష్టిస్తున్నారని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. గతంలో కశ్మీర్, లేహ్ వద్ద ఇలాంటి కుట్రలు జరిగినట్లు వార్తలొచ్చాయన్నారు. ఇతర దేశాలు క్లౌడ్ బరస్ట్‌తో ఇలాంటి కుట్రలు చేస్తున్నాయనే చర్చ ఉందన్నారు. గోదావరి ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ కుట్ర జరిగినట్లు అనుమానం ఉందన్నారు. దీనిపై నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందని వరద ముంపు ప్రాంతాల పర్యటనలో ఉన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఇదీ చూడండి: భారీ వర్షాలు, వరదలపై సీఎం కేసీఆర్ అనుమానాలు.. క్లౌడ్ బరస్ట్ కుట్ర కోణం దాగి ఉందా? -
ఇది రైతుల పాలిట వరమా... శాపమా?
‘‘ధరణి ఒక విప్లవం. ఈ పోర్టల్ నిర్మాణం కోసం నేను, చీఫ్ సెక్రటరీ ఆరు నెలలు రేయింబవళ్లు కష్టపడి పనిచేశాం. ఇది పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. ఇక ఏ రైతుకైనా తన భూమి సరిహద్దులు చిటికెలో తెలిసిపోతాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇక భూసమస్యలకు తావే ఉండదు’’– ‘ధరణి’ ప్రారంభ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ లోపలా, బయటా చేసిన ప్రసంగాల్లో నమ్మబలికిన మాటలివి. కానీ ఆచరణలో ధరణితో రైతన్నల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలోకి పడిన పరిస్థితి ఏర్పడింది. రైతన్నల ఈ గోసకు కారణమెవరంటే ముమ్మాటికీ కేసీఆర్ అసమర్థ విధానాలే అంటే అతిశయోక్తి కాదు. ఏళ్ల తరబడి భూ వివాదాలను పరిష్కరించేందుకు ధరణి కార్యక్రమం ఒక ‘జిందా తిలిస్మాత్’గా కేసీఆర్ ప్రభుత్వం ప్రచారం చేసింది. 2020 అక్టోబర్ 19న ప్రారంభమైన ‘ధరణి’ కార్యక్రమం ఎటువంటి సమస్యలనూ పరిష్కరించకపోగా మరిన్ని కొత్త సమస్యలను సృష్టించింది. ఈ కొత్త చిక్కులతో రైతులు చెప్పులు అరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు భూ సమస్యల పరిష్కారం కోసం 5 లక్షల దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో వున్నాయి. మరో 8.50 లక్షల సాదా బైనామా దరఖాస్తుల స్థితీ అదే. ఈ సమస్యలకు పరిష్కారం చెప్పే నాథుడే కనబడటం లేదు. రెవెన్యూ చట్టాల్లో సవరణలు చేయకుండా, ధరణి మాడ్యూల్స్‌లో మార్పులు చేయకుండా భూ సమస్యల పరిష్కారం సాధ్యం కాదంటూ ఇప్పటికే జిల్లా కలెక్టర్లు చేతులెత్తేశారు. ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన రెవెన్యూ సదస్సులు సైతం సరైన మార్గదర్శకాలు లేకపోవడం వల్లే వాయిదా పడ్డాయి. జిల్లా కలెక్టర్లకు వచ్చిన ధరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం 14 రోజుల సమయం కేటాయించింది. కానీ అది ఆచరణలో సాధ్యంకాదని జిల్లా కలెక్టర్లు వాపోతున్నారు. అగ్రికల్చరల్ అసైన్డ్ ల్యాండ్స్‌కు డిజిటల్ సైన్ కోసం అప్లై చేసుకునే అవకాశం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం ఎటువంటి స్పష్టతను ఇవ్వకపోవడంతో అసైన్డ్ ల్యాండ్ పొందిన లబ్ధిదారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక పట్టాదారుడు తనకు సంబంధించిన భూ విస్తీర్ణంలో మార్పులు చేర్పులు చేయించుకోవడం తలనొప్పి వ్యవహారంగా మారింది. ప్రస్తుతం ధరణి పోర్టల్ నిబంధనల ప్రకారం తనకున్న భూ విస్తీర్ణం కంటే ఎక్కువ భూమి నమోదైతే భూ విస్తీర్ణం పొందిన పట్టాదారుడు తనకు ఎక్కువ భూ విస్తీర్ణం నమోదైందని రూ. 1000 ఆన్లైన్లో కట్టి పట్టాలో మార్పులు కోరాలి. ఈ రకంగా తన భూ విస్తీర్ణాన్ని తగ్గించాలని ఎదురు డబ్బు కట్టి మరీ కోరేవారు ఎవరు ఉంటారో ధరణి పోర్టల్ డిజైన్ చేసిన ప్రభుత్వ పెద్దలు చెప్పాలి. ధరణి పోర్టల్ అమల్లోకి రాగానే నిమిషాల్లో మ్యూటేషన్లు జరిగిపోతాయంటూ కేసీఆర్ సెలవిచ్చారు. కానీ ప్రస్తుతం కనీసం సరిహద్దు మ్యాప్‌లు కూడా లేకుండానే రిజిస్ట్రే్టషన్లు జరిగిపోతున్నాయి. దీంతో గట్టు తగాదాలు, ఘర్షణలు నిత్యకృత్యాలయ్యాయి. ధరణిలో వచ్చిన మరో సమస్య బైనంబర్లతో రిజిస్ట్రేషన్లు. దీనివల్ల సామాన్యులకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. బైనంబర్లతో రిజిస్ట్రేషన్లు పొందినవారికి రెవెన్యూ అధికారులు బైనంబర్ల ఆధారంగా భూసరిహద్దులు చూపడం కష్టసాధ్యమౌతోంది. దీంతో ఎవరైనా ఏ భూమికైనా తానే హక్కుదారుడననే వాదనకు దిగేందుకు ఈ విధానం తావిస్తోంది. ధరణి పోర్టల్‌లో కొత్తగా తీసుకువచ్చిన ‘రైట్ టు ప్రైవసీ మాడ్యూల్’ ద్వారా రాజకీయ నాయకులు, అవినీతి అధికారులు అక్రమంగా సంపాదించిన భూములకు గోప్యత పొందే అవకాశం కలుగుతోంది. ధరణిలో వెల్లువెత్తిన భూ సమస్యలను పరిష్కారం చేయాలంటే క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరి. కానీ దానికి తగిన రెవెన్యూ సిబ్బంది ప్రభుత్వం వద్ద లేదు. ప్రస్తుతం ధరణి పోర్టల్‌లో 33 రకాల ట్రాన్సాక్షన్స్ మాడ్యూల్స్, 11 రకాల ఇన్ఫర్మేషన్ మాడ్యూల్స్ అందుబాటులో వున్నాయి. వీటితోపాటు భూ వివాదాల పరిష్కారానికి సరళతరమైన మాడ్యూల్స్‌ను ధరణి పోర్టల్‌లో చేర్చితే తప్ప ఈ సమస్యకు పరిష్కారం లభించదు. ధరణి లోపాలవల్ల భూ రిజిస్ట్రేషన్లు, వాస్తవ పట్టాదారులు పాసు పుస్తకాలలో వున్న సమస్యలతో... రైతుబంధు, రైతు బీమా, రుణ మాఫీ వంటి పథకాలకు నోచుకోవడం లేదు. పట్టాదారు పాసు పుస్తకం లేనిదే రైతన్నకు బ్యాంకులో రుణ సౌకర్యం పొందే అవకాశం కూడా లేదు. ధరణితో దగా పడ్డ రైతన్నలు ఇప్పటికే ఐక్య ఉద్యమాలకు సిద్ధమవుతున్నారు. అందుకు ఆదిలాబాద్ జిల్లా కంజర్ల గ్రామమే ఉదాహరణ. సాదా బైనామాపై వ్యవసాయ భూమి కొనుగోలు చేసిన జైపాల్ రెడ్డి కుటుంబానికి పట్టా లేకపోవడంతో ఆ భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నించారు. దీంతో ఆ గ్రామస్థులంతా తిరగబడి అదే రైతుకు భూమి దక్కేలా పోరాడారు. (క్లిక్: ఇది సర్కారీ కాంట్రాక్టుల దోపిడీ!) రాష్ట్రప్రభుత్వం మొద్దునిద్ర వీడి రాష్ట్రంలో వున్న భూ సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు చేపట్టాలి. ధరణి పోర్టల్‌లో వున్న సమస్యలను సంపూర్ణంగా ప్రక్షాళన చేయాలి. ధరణి పోర్టల్‌లో వున్న లోపాల దిద్దుబాటు కోసం ప్రభుత్వం టైమ్ బౌండ్ ప్రోగ్రాం రూపొందించాలి. రైతాంగం ఇచ్చిన లక్షలాది అర్జీల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు దోహదపడాలి. ప్రచార ఆర్భాటం కోసమే రెవెన్యూ సదస్సుల పేరుతో కాలయాపన చేస్తే... భూ సమస్యల బాధితులను సమీకరించి బీజేపీ ఉద్యమిస్తుంది. - బండి సంజయ్‌కుమార్ కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బీజేపీ తెలంగాణ అధ్యక్షులు -
ఇది ముమ్మాటికీ పిరికిపంద చర్య: బండి సంజయ్
హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై టీఆర్ఎస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, సీఎం కేసీఆర్ నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటన్నారు. ఇది మూమ్మాటికీ పిరికిపంద చర్య అని బండి సంజయ్ మండిపడ్డారు. ‘ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. సీఎం కేసీఆర్ పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజల అసహ్యించుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రాకపోగా ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనం.టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరును కొనసాగిస్తూనే ఉంటాం’ అని అన్నారు బండి సంజయ్. -
నీ ఇంట్లోనూ, పార్టీలోనే ‘ఏక్నాథ్ షిండే’లు
సాక్షి, హైదరాబాద్: ‘టీఆర్ఎస్లో ఏక్‌నాథ్‌షిండేలు చాలామంది ఉన్నారు. అందుకే సీఎం కేసీఆర్ భయపడుతున్నారు’ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఎద్దేవాచేశారు. ‘కేసీఆర్ ముఖంలో భయం తాండవిస్తోంది,. ఒకవేళ ఆయన కుటుంబసభ్యుల్లోనే ఎవరైనా ఏక్‌నాథ్‌షిండేలు ఉన్నారేమో తెలియదు. అందుకే పదేపదే మహారాష్ట్ర పరిణామాలను గుర్తుచేసుకుని మాట్లాడుతున్నారు’అని వ్యాఖ్యానించారు. ‘కేసీఆర్‌కు సొంతపార్టీపై ఏదో తెలియని భయం వెంటాడుతోంది. నీ బోడి ప్రభుత్వంలో ఉండటం అవసరమా? అని నీ పార్టీ ఎమ్మెల్యేలు ఆలోచిస్తున్నరు. మంచి పార్టీలోకి పోవాలని నీ పార్టీలోని ఏక్‌నాథ్‌షిండేలు ఆలోచిస్తున్నరు. అది తెలిసే ఆ పేరే తీస్తున్నవ్’అని వ్యంగ్యంగా అన్నారు. ఆదివారం రాత్రి పొద్దుపోయాక సంజయ్ విలేకరులతో మాట్లాడుతూ.. ‘మేం అధికారం కోసమే ఆలోచిస్తే మహారాష్ట్రలో ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకు తీసుకుంటం? మాకు అక్కడ సీఎం అయ్యే అవకాశమే ఉండేది.. నువ్వు చేస్తే సంసారం.. ఇతరులు చేస్తే వ్యభిచారమా?’అని నిలదీశారు. ‘దేశ్‌కీ నేత దిన్‌బర్ పీతా, మోదీపే రోత, ఫామ్హౌస్మే సోతా, అమవాస్య, పున్నమికి బాహర్ ఆతా’అన్నట్టుగా కేసీఆర్ పరిస్థితి ఉందని ధ్వజమెత్తారు. బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో ఏం చర్చించారో నీకెందుకుని, బీజేపీ అగ్రనేతలపై అవాకులు, చవాకులు పేలడం ఎందుకని ప్రశ్నించారు. బీజేపీ పేరు వింటేనే, ప్రధాని మోదీ అంటేనే కేసీఆర్‌కు నిద్రపట్టట్లేదని, అందుకే ఇన్ని రోజుల తర్వాత ఫామ్‌హౌస్ నుంచి బయటికొచ్చాక కూడా మోదీపై విమర్శలకు పరిమితమయ్యారని విమర్శించారు. తెలంగాణలో ప్రభావం కోల్పోతూ, ప్రతిష్ట దిగజారిందని గ్రహించిన కేసీఆర్ కేంద్రంపై, మోదీపై , బీజేపీపై విమర్శలు గుప్పించి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని సంజయ్ ధ్వజమెత్తారు. ఇకపై ప్రధానిపై, ఇతర అంశాలపై మాట్లాడేపుడు హద్దులు మీరొద్దని హెచ్చరించారు. మేమూ నీ భాషే వాడితే.. ‘ప్రధాని మోదీని గౌరవించలేని కుసంస్కారి కేసీఆర్. కేసీఆర్‌కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. మోదీని ఉద్ధేశించి ఇష్టానుసారం కేసీఆర్ మాట్లాడడాన్ని ఖండిస్తున్నాం. మేం కూడా మీరు మాట్లాడే భాషనే ఉపయోగిస్తే ముఖం ఎక్కడ పెట్టుకుంటారు?’అని కేసీఆర్‌ను ఉద్దేశించి సంజయ్ ప్రశ్నించారు. కేసీఆర్ విమర్శలను తెలంగాణ సమాజమే హర్షించదన్నారు. గతంలో మోదీది నీతివంతమైన పాలనని కీర్తించిన నోటితోనే కేంద్రంలో అవినీతి సర్కార్ ఉందని విమర్శించడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ‘హిందుగాళ్లు.. బొందుగాళ్లంటే కరీంనగర్లో బొందపెట్టిన సంగతి మర్చిపోయిండు. జోగులాంబ అమ్మవారు శక్తిపీఠం. అటువంటి అమ్మవారిని ఈ అంబ.. ఆ అంబ అని చులకనగా మాట్లాడుతవా? నీకు మూడింది.. దగ్గర పడింది...నువ్వు దేవుడిని తిడతవా?.. ధర్మాన్ని తిడతవా? ఎందుకు బతుకున్నవో అర్థం కావడంలేదు.. ఇదే నీ రాజకీయానికి సమాధి అవుతుంది గుర్తుంచుకో.. వెంటనే ప్రజలకు క్షమాపణ చెప్పు’అని సంజయ్ డిమాండ్ చేశారు. ‘ప్రధాని పదవిని గౌరవిస్తవా? యోగి ఆదిత్యనాథ్ ను కించపరుస్తవా? అక్కడ తప్పు చేయాలంటే భయపడే స్థాయికి తీసుకొచ్చిన యోగి గురించి.. ఇక్కడ అమ్మాయిలపై అత్యాచారాలు జరుగుతుంటే కనీసం పట్టుకోలేని నువ్వా మాట్లాడేది?’అని ప్రశ్నించారు. జనరంజక పాలన సాగిస్తున్నది కాబట్టే 18 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో కొనసాగుతోందన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో ఆదివాసీల ప్రతినిధి ద్రౌపది ముర్ముకు ఓటేసి మద్దతు తెలపాలని టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులకు విజ్ఞప్తి చేస్తున్నామని బండి సంజయ్ అన్నారు. -
సీఎమ్మార్ సేకరణ గడువు పొడిగింపు!
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో గత యాసంగి సీజన్‌కు సంబంధించిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎమ్మార్) సేకరణను నెల రోజుల పాటు పొడిగించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేసిన విజ్ఞప్తిపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. శుక్రవారం పార్లమెంట్లో కేంద్ర వాణిజ్య, ఆహార పంపిణీ వ్యవహారాల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌తో సంజయ్ భేటీ అయ్యారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (పీఎంజీకేఏవై) పథకం కింద దేశవ్యాప్తంగా పేదలకు ఒక్కొక్కరికి 5 కిలోల చొప్పున ఉచితంగా అందించే రేషన్ బియ్యాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు నెలలుగా పంపిణీ చేయని కారణంగా కేంద్రం సీఎమ్మార్ సేకరణను నిలిపేసిందని సంజయ్ తెలిపారు. దీంతో రైస్ మిల్లుల్లో ధాన్యం నిల్వలు భారీగా పేరుకుపోయాయని, దాని ప్రభావం ధాన్యం సేకరణపై పడిందని చెప్పారు. రాష్ట్రంలో మిల్లర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా వివరించారు. దీంతో సమస్య పరిష్కారంపై దృష్టి సారించాలని సంబంధిత శాఖ అధికారులను కేంద్ర మంత్రి ఆదేశించారు. దాదాపు 2 గంటల పాటు చర్చలు జరిపిన అధికారులు జూన్ 30తో ముగిసిన సీఎమ్మార్ సేకరణను మరో నెలపాటు పొడిగించడంపై సానుకూలంగా స్పందించారు. రాష్ట్ర సర్కారు మోసకారి తనం వల్లే.. గోయల్‌తో భేటీ అనంతరం ఢిల్లీలోని తన నివాసంలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ మోసకారితనంవల్లే ఈ సమస్య ఉత్పన్నమైందని మండిపడ్డారు. పీఎంజీకేఏవై పథకాన్ని తెలంగాణలో అమలు చేస్తే ప్రధాని మోదీకి పేరొస్తుందనే అక్కసుతోనే రాష్ట్రంలోని పేదలకు ఉచిత బియ్యాన్ని పంపిణీ చేయకుండా కేసీఆర్ అడ్డుకుంటున్నారని ఆరోపించారు. వాస్తవాలను కేంద్ర ఆహార పంపిణీ శాఖ మంత్రితో పాటు సంబంధిత శాఖ కార్యదర్శి సుధాంశ్ పాండేతో చర్చించినట్లు తెలిపారు. వాస్తవానికి 2020–21 రబీ ధాన్యం సేకరణ విషయంలో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆరుసార్లు గడువు పొడిగించిందని, తన వినతి మేరకు తాజాగా మరో నెలపాటు పొడిగించే విషయంపై సానుకూలంగా స్పందించారని చెప్పారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ పీఎంజీకేఏవై బియ్యం పంపిణీ చేయించాలని కోరారు. -
‘సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలే తమకు బాస్‌లు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తెలంగాణ సమాజానికి తమ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సమాధానం చెప్పారని పేర్కొన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నిమిత్తం ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. పర్యటన ముగిసిన నేపథ్యంలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్‌పోర్టు వద్ద సోమవారం ప్రధాని మోదీకి బండి సంజయ్ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఎయిర్‌పోర్టులో బండి సంజయ్ మాట్లాడుతూ.. సీఎం ఎవరు కౌన్ కిస్కా.. కేసీఆర్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు. ముందు తెలంగాణ ప్రజలకు కేసిఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ప్రజల వద్ద మొహం లేక రాష్ట్ర ముఖ్యమంత్రి పారిపోతున్నారు. మోదీని ఎదుర్కోడానికి ఫ్లెక్సీల కోసం పెట్టిన డబ్బులను ప్రజల కోసం ఖర్చు పెట్టు కేసిఆర్. నిన్నటి ప్రధాని సభకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. జాతీయ కార్యవర్గ సమావేశాలను తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం. కేసిఆర్ మీద ఉన్న వ్యతిరేకత నిన్నటి విజయ సంకల్ప సభతో మరోసారి బహిర్గతం అయింది. కేసీఆర్ తప్పుడు విధానాల పలితమే నిన్నటి సభ. తెలంగాణ ప్రజలకు మోదీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయిన ప్రధాని మోదీ! 'వెల్డన్' బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: పరేడ్ గ్రౌండ్‌లోని విజయ సంకల్ప సభకు భారీగా తరలి వచ్చిన ప్రజానీకాన్ని చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యారు. బేగంపేట విమానాశ్రయం నుంచి కాన్వాయ్‌లో వచ్చిన ప్రధాని.. వేదిక దగ్గర పుష్పాలతో అలంకరించిన ఓపెన్‌టాప్ వాహనంలో వస్తూ ప్రజలకు అభివాదం చేశారు. అనంతరం వేదికపైకి వచ్చాక హుషారుగా చేతులు ఊపుతూ సభికులను ఉత్సాహపరిచారు. పలుమార్లు ఆయన వంగి అభివాదం చేశారు. సభకు భారీ స్థాయిలో ప్రజలు హాజరుకావడాన్ని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి చూపిస్తూ.. వెల్డన్ అంటూ సంజయ్ భుజం తట్టి అభినందించారు. కేసీఆర్ గడీలు బద్దలు కొడదాం సీఎం కేసీఆర్ గడీలు బద్దలు కొట్టి.. తెలంగాణ తల్లికి విముక్తి కల్పిద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్న తెలంగాణ ప్రజలకు ధైర్యం నింపడం, టీఆర్ఎస్ గూండాల నుంచి అనేక దాడులు, పోలీసుల తప్పుడు కేసులు, చార్జిషీట్లతో అగచాట్లు పడుతున్న పార్టీ కార్యకర్తల్లో ధైర్యం నింపడానికే హైదరాబాద్‌లో పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించామని చెప్పారు. అవినీతి, అక్రమాలు, కుటుంబపాలనతో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కేసీఆర్‌ను చిత్తుగా ఓడించడానికే ఈ సమావేశాలని స్పష్టం చేశారు. విజయ సంకల్ప సభకు లక్షలాదిగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు తరలిరావడంతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని అన్నారు. ఆదివారం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో బండి సంజయ్ ప్రసంగించారు. జాతీయంగా, అంతర్జాతీయంగా ఎంతో ఆదరణ పొందిన మోదీని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన పార్టీ నాయకులు వ్యక్తిగతంగా విమర్శించడం ఎంతో బాధ కలిగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. పులిలాంటి మోదీని చూసి గుంటనక్కలు పారిపోవాల్సిందేనని వ్యాఖ్యానించారు. మోదీ తన దేవుడని అన్నారు. మోదీ గురించి దద్దమ్మలు, మూర్ఖులైన సీఎం, ఆ పార్టీ నాయకులకు ఏమి అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ‘మీరు మోదీని ఎందుకు తిడుతున్నారు. 200 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఇచ్చినందుకా? దేశ ప్రజలకు 28 నెలలుగా ఉచితంగా బియ్యం ఇస్తున్నందుకా..? యుద్ధ సంక్షుభిత ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను స్వదేశానికి రప్పించినందుకా..?’అని ప్రశ్నించారు. కేసీఆర్ గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటైనా నెరవేర్చారా అని నిలదీశారు. కేంద్రం కోట్లాది నిధులిస్తున్నా.. కేసీఆర్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉన్నా.. ఈ ప్రభుత్వం మోదీని వ్యతిరేకిస్తూ.. కేంద్రంపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసీ. ఒక్కొక్కరిపై రూ.1.20 లక్షల అప్పు మోపిన కేసీఆర్‌ను గద్దె దించాల్సిందేనని అన్నారు.