మాట్లాడుతున్న పద్మాకర్‌రెడ్డి
కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఓట్ల కోసమే పాదయాత్ర ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే వాటిని గాలికి వదిలేసి పాదయాత్ర పేరుతో సానుభూతి రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని పేరుతో రాజకీయాలు చేసే బండి సంజయ్ కరీంనగర్, వేములవాడ, కొండగట్టు దేవస్థానాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తేలేదని తెలిపారు.
ఇప్పటికైనా మతం, సెంటిమెంట్‌ల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు మడుపు మోహన్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, నాయకులు రహ్మత్ హుస్సేన్, రామిడి రాజిరెడ్డి, కంకణాల అనిల్ కుమార్, బాలబద్రి శంకర్, మహ్మద్ ఆమేర్, పరుశురాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment