padmakarreddi
-
ఓట్ల కోసమే బండి సంజయ్ పాదయాత్ర : కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి
కరీంనగర్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌కుమార్ ఓట్ల కోసమే పాదయాత్ర ప్రారంభించారని కాంగ్రెస్ పార్టీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్‌రెడ్డి అన్నారు. శనివారం ప్రెస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాలు జరుగుతుంటే వాటిని గాలికి వదిలేసి పాదయాత్ర పేరుతో సానుభూతి రాజకీయాలకు తెరలేపారని అన్నారు. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే భగవంతుని పేరుతో రాజకీయాలు చేసే బండి సంజయ్ కరీంనగర్, వేములవాడ, కొండగట్టు దేవస్థానాల అభివృద్ధి కోసం ఒక్క రూపాయి కూడా తేలేదని తెలిపారు. ఇప్పటికైనా మతం, సెంటిమెంట్ల పేరుతో రాజకీయాలు చేయడం మానుకోవాలన్నారు. ఈ సమావేశంలో డీసీసీ ఉపాధ్యక్షుడు మడుపు మోహన్, కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు పులి ఆంజనేయులుగౌడ్, నాయకులు రహ్మత్ హుస్సేన్, రామిడి రాజిరెడ్డి, కంకణాల అనిల్ కుమార్, బాలబద్రి శంకర్, మహ్మద్ ఆమేర్, పరుశురాంగౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి చదవండి: వారి నోళ్లు మూయించేందుకే ప్రజాహిత యాత్ర.. -
కూతుళ్లకు ఆస్తులు ఇవ్వలేకపోయానని.. ఉత్తరాలు రాసి.. తీవ్ర నిర్ణయం!
సంగారెడ్డి: ఆర్థిక ఇబ్బందులు, కూతుళ్లకు ఏ ఆస్తులు ఇవ్వలేకపోయాననే బాధతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండల కేంద్రంలో శనివారం చోటు చేసుకుంది. గ్రామస్తులు, తొగుట ఎస్ఐ లింగం తెలిపిన వివరాలు. గ్రామానికి చెందిన కొమ్మెర పద్మాకర్‌రెడ్డి కుటుంబం కొంత కాలంగా హైదరాబాద్‌లోని రామంతపూర్‌లో నివాసం ఉంటుంది. ఈ క్రమంలో కుటుంబ అవసరాల కోసం అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు గ్రామంలోని వ్యవసాయ భూమిని విక్రయించాడు. అదికాస్త వివాదాస్పదం కావడంతో సకాలంలో చేతికి డబ్బులు అందలేదు. చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనోవేదనకు గురైన పద్మాకర్‌రెడ్డి రెండు రోజుల క్రితం హైదరాబాద్ నుంచి గ్రామానికి వచ్చాడు. శుక్రవారం రాత్రి భార్యతో ఫోన్లో మాట్లాడాడు. ఇద్దరు కూతుళ్లకు ఎలాంటి ఆస్తులు ఇవ్వలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉత్తరాలు రాసి పెట్టి శుక్రవారం అర్ధరాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం ఉదయం ఆయన అన్న కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి గమనించి తొగుట పోలీసులకు సమాచారం అందించాడు. ఎస్ఐ లింగం ఘటనా స్థలానికి చేరుకుని శవాన్ని కిందకు దించారు. ఉత్తరాలను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య లత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడిగా పద్మాకర్‌రెడ్డి
విద్యారణ్యపురి : తెలంగాణ ప్రాంత ఉ పాధ్యాయ సంఘం (టీపీయూఎస్) జిల్లాస్థాయి సమావే శం శుక్రవారం హన్మకొండలోని వివేకానంద నిలయంలో నిర్వహించారు. ఈ సమావేశంలో టీపీయూఎస్ జిల్లా కార్యవర్గం లోని సీనియర్ ఉపాధ్యక్షుడైన సల్లగొండ పద్మాకర్రెడ్డిని అడహక్ జిల్లా అధ్యక్షుడిగా నియమాకం చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన పద్మాకర్‌రెడ్డి గతంలో వెంకటాపూర్ మండలం అధ్యక్షుడిగాను, జిల్లా కార్యదర్శిగా కూడా పని చేశారు. ముఖ్యఅతిథులుగా విచ్చేసిన టీపీయూఎస్ రాష్ట్ర సహ అధ్యక్షుడు సుధాకర్, కార్యదర్శి వెంకటరమణ మాట్లాడుతూ సంఘం శ్రేయస్సుకు, అభివృద్ధి కోసం పనిచేస్తూ ఆదర్శంగా నిలవాలని కోరారు. టీపీయూఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి భిక్షపతి, ఎం.మహేందర్, కె.వెంకటకృష్ణ, ఎ.శేఖర్, సీని యర్ నాయకులు పాల్గొన్నారు.