Kalvakuntla Kavitha Counter Reply To Bandi Sanjay Tweet - Sakshi
Sakshi News home page

ఆడబిడ్డ తలుచుకుంది.. ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది: కల్వకుంట్ల కవిత

Published Tue, Jun 13 2023 4:50 PM | Last Updated on Tue, Jun 13 2023 5:47 PM

kalvakuntla kavitha Counter Reply To Bandi Sanjay Tweet - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ట్విటర్‌ వేదికగా బీజేపీ రాష్ట్ర చీఫ్‌ బండి సంజయ్‌ కుమార్‌కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కౌంటర్‌ ఇచ్చారు. తెలంగాణ ఆడబిడ్డల పట్ల కేసీఆర్‌ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని,  కానీ, ఇంటి బిడ్డకు(కవితను ఉద్దేశించి..) అన్ని విధాల అండగా ఉంటావంటూ కేసీఆర్‌పై ట్వీట్‌లో బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు. దీనికి సోషల్‌ మీడియా వేదికగానే కవిత కౌంటర్‌ ట్వీట్‌ చేశారు. 

పార్లమెంట్‌ ప్రారంభోత్సవానికి రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడం, మహిళా రెజ్లర్ల ఉద్యమాన్ని పట్టించుకోకపోగా.. బీజేపీ ఎంపీపై బ్రిజ్‌పై  చర్యలు తీసుకోకపోవడం, సిలిండర్ల ధరలు పెంచడం.. ఇలా ప్రతీ అంశాన్ని లేవనెత్తి కౌంటర్‌ ట్వీట్‌ చేశారామె. 

గవర్నర్ కు దక్కదు గౌరవం. 
ఆడబిడ్డలకు లేదు అండ. 
గిరిజన మహిళలపై పోలీస్‌ గిరీ. 
బతుకమ్మను అవమానపరిచినోడితో ఆలింగనం. 
ఇంటి బిడ్డకు మాత్రం బలగంతో నిలబడతవ్ అడ్డం. 
అదిరింది కేసీఆర్ నీ మహిళా సంక్షేమం. 

పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో గిరిజన మహిళా రాష్ట్రపతికి దక్కదు గౌరవం దేశ రాజధాని ఢిల్లీలో వేధింపులకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు రాత్రింబవళ్ళు ధర్నా చేస్తున్నా తప్పు చేసిన బీజేపీ ఎంపీపై చర్యలు ఉండవు దేశరాజధాని నడి వీధుల్లో ఆడబిడ్డలను రోడ్డు మీద ఈడ్చుకుంటూ తీసుకెళ్లిన వైనం నినాదాలకే పరిమితమైన భేటీ బచావో... భేటీ పడావో సిలిండర్ ధరలు విపరీతంగా పెంచి మహిళలకు కిచెన్ లో కన్నీళ్లు తెప్పిస్తున్న దుస్థితి మహిళకు విద్యా, వైద్యంపై పూర్తి నిర్లక్ష్యం ఆడబిడ్డల సంక్షేమం కంటే కొందరి అభివృద్ధే ముఖ్యం ఆడబిడ్డ తలుచుకుంది ఇక మీ అడ్రస్ గల్లంతవుతుంది అంటూ కౌంటర్‌ ట్వీట్‌ చేశారామె.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement