సాక్షి, కరీంనగర్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను జనగామ జిల్లాలో పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. జనగాంలో అరెస్ఠ్ చేసి కరీంనగర్‌లోని ఆయన ఇంటికి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. తనను ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నించారు. 21 రోజులుగా యాత్రపైలేని సమస్య ఇవాళ ఎందుకు వచ్చిందని మండిపడ్డారు. ఈరోజే తన యాత్రను అడ్డుకోవడానికి కారణం ఏంటని నిలదీశారు
ఎక్కడ పాదయాత్ర ఆపారో అక్కడి నుంచి మళ్లీ ప్రారంభిస్తానని బండి సంజయ్ తెలిపారు. కూతురిని కాపాడుకునేందుకు తన యాత్రను కేసీఆర్ అడ్డుకున్నారని విమర్శించారు కేసీఆర్‌కు నిజాయితీ ఉంటే ఆయన కూతుర్ని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కూతురికి ఓ న్యాయం, ఇతరులకు ఓ న్యాయమా అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ పార్టీ నేతలను ఎందుకు అరెస్ట్ చేయడలేదని నిలదీశారు. పాదయాత్రపై దాడి చేస్తే ప్రజలు బడిత పూజ చేస్తారని మండిపడ్డారు.
అమిత్ షా ఆరా
మరోవైపు పాదయాత్రలో బండి సంజయ్‌ను అరెస్ట్ చేయడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆరా తీశారు. ఈ మేరకు సంజయ్‌కు అమిత్ షా ఫోన్ చేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం నేపథ్యంలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని ఆరోపిస్తూ బీజేపీ నేతలు ఆమె ఇంటి వద్ద సోమవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. దీంతో పలువురు బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. దీన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఈ క్రమంలో స్టేషన్ ఘన్‌పూర్ మండలం పామ్నూర్‌లో పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేసి అరెస్ట్ చేశారు.
చదవండి: మునుగోడు కోసం తెలంగాణను తగలబెడతారా?: అసదుద్దీన్ ఒవైసీ ఫైర్
Comments
Please login to add a commentAdd a comment