Praja Sangrama Yatra
-
సంగ్రామ యాత్ర స్ఫూర్తితో ప్రజల్లోకి వెళ్లండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్ర స్ఫూర్తిని ఇతర రాష్ట్రాలూ కొనసాగించాలని ప్రధాని మోదీ పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజలకు పార్టీని చేరువ చేసిన మాదిరే ఇతర రాష్ట్రాల్లోనూ యాత్రలు నిర్వహించి ప్రజలతో మమేకం కావాలని సూచించారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల చివరి రోజున ప్రధాని మోదీ ముగింపు ఉపన్యాసం చేశారు. ఈ సందర్భంగా బండి ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించారు. ‘సార్వత్రిక ఎన్నికలకు కేవలం 400 రోజులే సమయముంది. ఈ ఏడాదే 9 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఎన్నికల రాష్ట్రాలతో పాటు, కేంద్రంలో మరోసారి అధికారంలోకి రావాలంటే పార్టీ శ్రేణులు, నేతలు మరింతగా ప్రజల్లోకి వెళ్లాలి. వారితో మమేకం కావాలి. అక్కడి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణలో ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్లారు. ప్రభుత్వ అణిచివేతను ఎదుర్కొని నిర్వహించిన ఈ యాత్రకు మంచి స్పందన లభించింది. ఇలాంటి యాత్రల ద్వారా ప్రజలతో మమేకం అవ్వొచ్చు. వారి సమస్యలు వినే అవకాశం ఉంటుంది. తద్వారా వాటికి పరిష్కారాలు దొరుకుతాయి. ఇలాంటి యాత్రలే దేశంలో అవసరమైన అన్ని రాష్ట్రాల్లోనూ నిర్వహించండి’ అని మోదీ చెప్పారు. ఇదే సమయంలో యాత్ర జరుగుతున్న తీరును ప్రతి రాష్ట్రం నుంచి ఐదుగురు సభ్యులు బృందాలుగా వెళ్లి యాత్ర అనుభవాలు గమనించాలని, ప్రజల స్పందనను వినాలని ఆయన సూచించారు. తెలంగాణలో పార్టీ మెరుగు: అమిత్ షా ఇక జాతీయ కార్యవర్గాల సమావేశాల భేటీ సందర్భంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలాన్ని వచ్చే ఏడాది జూన్ వరకు పొడిగించాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సమావేశ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లోనూ జేపీ నడ్డా నేతృత్వంలో పార్టీ అద్భుతంగా పనిచేసిందని, ప్రజలకు సేవ చేసిందని కొనియాడారు. నడ్డా అధ్యక్షతన మహారాష్ట్ర, హరియాణాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయగా, యూపీ ఉత్తరాఖండ్, మణిపూర్, అస్సాం, గుజరాత్ రాష్ట్రాల్లో బీజేపీ భారీ విజయాన్ని సాధించిందని కొనియాడారు. ఆయన నేతృత్వంలోనే పశ్చిమబెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో పార్టీ గణనీయంగా మెరుగుపడిందని, చెప్పుకోదగ్గ విజయాలు సాధించిందని అన్నారు. రెండో రోజు మరో ముగ్గురు: కాగా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో తెలంగాణకు పార్టీ నాయకత్వం చాలా ప్రాధాన్యాన్నిచ్చింది. సమావేశాల మొదటి రోజున తెలంగాణలో జరిగిన ప్రజా సంగ్రామ యాత్రపై బండి సంజయ్ ప్రజెంటేషన్‌ను ఇవ్వగా, రెండో రోజు దేశంలోని పరిస్థితులపై ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టగా, సామాజిక, ఆర్ధిక అంశాలపై వివేక్ వెంకట్‌స్వామి, కేంద్ర పథకాలపై పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడారు. అధికారమే లక్ష్యంగా కొట్లాడండి: నడ్డా తెలంగాణలో అధికార పీఠమే లక్ష్యంగా కొట్లాడాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాష్ట్ర నేతలకు పిలుపునిచ్చారు. నడ్డా పదవీకా లాన్ని పొడిగించిన నేపథ్యంలో కార్యవర్గ సమావేశం అనంతరం బండి సంజయ్, డీకే అరుణ, జితేందర్‌రెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, ఇంద్రసేనారెడ్డి తదితరులు ఆయన్ను కలిసి అభినందించారు. ఈ సందర్భంగా వారితో ముచ్చటించిన నడ్డా తెలంగాణలో పార్టీ గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకువెళ్లాలని సూచించారు. తాను కూడా తరచూ తెలంగాణలో పర్యటిస్తానని నేతలకు చెప్పారు. -
త్వరలో మరో విడత సంజయ్ పాదయాత్ర?
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాష్ట్రంలో మరిన్ని విడతల ‘ప్రజాసంగ్రామయాత్ర’చేపట్టాలనే ఒత్తిడి బీజేపీ నాయకత్వంపై పెరుగుతోంది. పాదయాత్రలతో కార్యకర్తలతో కొత్త ఉత్సాహం నెలకొన్నందున ఆ యాత్రలు కొనసాగించాలనే డిమాండ్ పెరుగుతోంది. దీనికి సంబంధించి కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో కనీసం మరో విడత పాదయాత్ర నిర్వహించే అవకాశమున్నట్టు పార్టీవర్గాల సమాచారం. ఇప్పటిదాకా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఐదు విడతలుగా చేపట్టిన పాదయాత్రలకు వచ్చిన భారీ స్పందన ద్వారా బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అనే అభిప్రాయం ఏర్పడిందని పార్టీనేతలు చెబుతున్నారు. ఈ నేపత్యంలో ఈ నెల 18 లేదా 20వ తేదీ నుంచి పాదయాత్రను మళ్లీ మొదలుపెట్టే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల పరిధిలోని అసెంబ్లీ సీట్లలో లేదా కొడంగల్ నుంచి నిజామాబాద్, ములుగు నుంచి ఖమ్మం, అచ్చంపేట నుంచి సూర్యాపేట, పెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో ఈ యాత్ర చేపట్టే అవకాశాలున్నట్టు పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇటీవల జరిగిన ముఖ్యనేతల భేటీలోనూ ఆరోవిడత పాదయాత్రకు బీజేపీ ప్రధానకార్యదర్శి (సంస్థాగత) బీఎల్ సంతోష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీని తర్వాత బస్సుయాత్ర లేదా మరిన్ని విడతల పాదయాత్రలు నిర్వహించే యోచనలో ఉన్నట్టు సమాచారం. 7న అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిర్వహించే పోలింగ్‌బూత్ కమిటీ సభ్యుల సమావేశాల్లో జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రికార్డెడ్ ఉపన్యాసాన్ని వినిపించడంతోపాటు హాజరైన వారంతా మిస్డ్‌కాల్ ఇవ్వడం ద్వారా నమోదు చేసుకోవాలని నిర్ణయించారు. స్థానికంగా అసెంబ్లీలో బూత్ కమిటీలు, శక్తికేంద్రాల (నాలుగైదు పోలింగ్‌బూత్‌లు కలిపి) సమావేశాలు నిర్వహించనున్నారు. ఆదివారం రాత్రి జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జీలు, అసెంబ్లీ కన్వీనర్లు, జాయింట్ కన్వీనర్లతో సంజయ్ నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్‌లో ఆయా అంశాలు చర్చకు వచ్చాయి. ఇక బీజేపీదే అధికారం రాష్ట్రంలో ఇక బీజేపీదే అధికారమని సంజయ్ తెలిపారు. ఖైరతాబాద్ నియోజకవర్గం కేంద్రంగా జరి గిన బీజేపీ బూత్ కమిటీ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ టీఆర్ఎస్తో తెలంగాణకు బంధం తెగిపోయిందని, సీఎం కేసీఆర్ ఇక్కడ దుకాణం మూసేసి ఇంకోదానిని తెరిచారని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ శాంతిభద్రతల సమస్యను సృష్టించి బీజేపీ మీద వేయాలని చూస్తోందని ఆరోపించారు. -
Telangana BJP: బండికి బ్రేక్ ఎందుకు పడింది?
తెలంగాణ కమల దళపతి బండి సంజయ్ సంగ్రామ యాత్రకు బిజేపీ హైకమాండ్ రెడ్ సిగ్నల్ వేసింది. నేల విడిచి సాము చేయవద్దని సూచించింది. 5 వ విడత ముగియగానే 6వ విడత ప్రారంభించాలని అనుకున్న పరిస్థితులు అందుకు అనుగుణంగా లేవు. సంస్థాగత అంశాల పై దృష్టి పెట్టాలని హై కమాండ్ ఆదేశించింది. దీంతో పాదయాత్ర ఇప్పట్లో మొదలు అయ్యేలా కనిపించడం లేదు. బండి వద్దు.. బస్ వద్దు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వ అవినీతి, నియంతృత్వ, కుటుంబ పాలనకు వ్యతిరేకంగా అంటూ పాదయాత్ర చేపట్టారు. ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఇప్పటికే 5 విడతలు పూర్తి అయింది. 6వ విడత పాద యాత్ర ఎప్పటి నుండి అనేది 5వ విడత ముగింపు సందర్భంగా బండి సంజయ్ ప్రకటిస్తారు అని పార్టీ నేతలు తెలిపారు. 5వ విడత ముగిసిన వారం లోపే 6వ విడత షురూ అవుతుందని చెప్పారు. అయితే నెక్స్ట్ విడత పాదయాత్ర ఎప్పుడు అనేది ప్రకటించలేదు. గ్రేటర్ పరిధిలో మిగిలిన నియోజక వర్గాల్లో యాత్ర చేస్తారని పార్టీ నేతలు అన్న అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. 6వ విడత 10 రోజుల పాటు చేసి ఆ తర్వాత బస్ యాత్ర చేపడుతారని పార్టీ నేతలు అన్నారు. సంక్రాంతి కి ముందు 6 వ విడత సంక్రాంతి తరవాత బస్ యాత్ర ఉండొచ్చు అని ప్రచారం జరిగింది. సంజయ్ మొదటి టర్మ్ ముగిసే లోపు ఫిబ్రవరి చివరి వరకు బస్ యాత్ర క్లోజ్ అవుతుంది అని... పాద యాత్ర , బస్ యాత్ర ల ద్వారా రాష్ట్రం లోని అన్ని అసెంబ్లీ లను టచ్ చేయడం పూర్తి అవుతుందని అనుకున్నారు. ఇప్పట్లో వద్దులే.! బండి సంజయ్ యాత్రలకు తాత్కాలిక బ్రేక్ పడ్డట్టే అని తెలుస్తుంది. పార్టీ హై కమాండ్ అన్ని పక్కన బెట్టి సంస్థాగత నిర్మాణం, బూత్ కమిటీ ల పై దృష్టి పెట్టాలని ఆదేశించింది. మండలాల వారిగా బూత్ కమిటీ ల సమ్మేళనం ఏర్పాటు చేయాలని జనవరి మొదటి వారం లోపు పూర్తి చేయాలని పార్టీ నిర్ణయించింది. ఇక జనవరి 7 రాష్ట్రం లోని 119 నియోజక వర్గాల్లో బూత్ కమిటీలతో అసెంబ్లీ సదస్సులు నిర్వహించాలని డిసైడ్ అయింది. ఈ సదస్సులనుద్దేశించి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా వర్చువల్ గా ప్రసంగించనున్నారు. ఈ నెల 28,29, 30 తేదీల్లో దక్షిణాది రాష్ట్రాల పూర్తి సమయ కార్యకర్తల సమావేశం, తెలంగాణ అసెంబ్లీ కోర్ కమిటీలసమావేశం హైదారాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమాలు ఉండడం తో సంజయ్ పాదయాత్ర సంక్రాంతి ముందు జరిగే అవకాశం లేదు... ఇక సంక్రాంతి తర్వాత కూడా బండి అసెంబ్లీల వారీగా పర్యటించాలని భావిస్తున్నారు. రోజు మూడు అసెంబ్లీల చొప్పున సంస్థాగత అంశాల పై సమీక్ష చేయాలని.. బూత్ కమిటీలను నేరుగా కలవాలని అనుకుంటున్నారు. ఈ కార్యక్రమం పూర్తి అయ్యే సరికి నెల టైమ్ పడుతుంది. సంజయ్ యాత్ర ఇప్పట్లో స్టార్ట్ కాదని స్పష్టం అవుతుంది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
కరీంనగర్లో సభలో కన్నీళ్లు పెట్టుకున్న బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తనను ఎన్నో అవమానాలకు గురిచేశారంటూ కరీంనగర్లో సభలో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభలో ఆయన మాట్లాడుతూ, ‘‘నాకు గెలుపు ముఖ్యం కాదు.. గెలుపు కోసం పనిచేస్తా. నాకు ప్రజలే ముఖ్యం.. పదవులు కాదు. నాకు డిపాజిట్ రాదని హేళన చేశారు. కరీంనగర్ నుంచి లక్ష ఓట్ల మెజార్టీతో గెలిచా’’ అని అన్నారు. కరీంనగర్ గడ్డపై గాండ్రిస్తే కొందరికి వణుకు పుట్టాలని, కరీంనగర్ గడ్డ బీజేపీ అడ్డా అంటూ ఆయన వ్యాఖ్యానించారు. ‘‘హిందూ ధర్మ పరిరక్షణ కోసం పనిచేస్తా. బీజేపీ అధినాయకత్వం నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేయడానికి కారణం కార్యకర్తలే. కరీంనగర్లో కొట్లాడినట్లే రాష్ట్రమంతా కొట్లాడమని మోదీ, అమిత్‌షా, నడ్డా చెప్పారు. తెలంగాణ కాషాయ జెండా రెపరెపలాడాలని చెప్పారు. ధర్మ కోసం యుద్ధం చేస్తా. అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఏం చేశారో కేసీఆర్ చెప్పడం లేదు. మోదీని తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారు’’ అంటూ బండి సంజయ్ దుయ్యబట్టారు. చదవండి: కేసీఆర్ సెంటిమెంట్‌పై బీజేపీ స్పెషల్ ఫోకస్.. సంజయ్ సక్సెస్ అయ్యేనా? -
కేసీఆర్ మళ్లీ సెంటిమెంట్‌ను రగిలిస్తున్నారు: బండి సంజయ్
-
ఈసారి కేసీఆర్ సెంటిమెంట్ వర్క్ ఔట్ కాదు: బండి సంజయ్
సాక్షి, కోరుట్ల: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న కుట్రలను తెలంగాణ వాసులు గమనిస్తున్నారని విమర్శించారు రాష్ట్ర బీజేపీ చీఫ్ బండి సంజయ్. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం జిగిత్యాల జిల్లాలో ఉన్న బండి సంజయ్.. కేసిఆర్‌పై ధ్వజమెత్తారు. ఆయన మళ్లీ తెలంగాణలో సెంటిమెంట్‌ని రగిల్చి ప్రజల మనసు గెలుచుకునేందుకు పావులు కదుపుతున్నారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఈ సెంటిమెంట్‌తో రాజకీయ లబ్ది పోందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డారు. కేసీఆర్ తన పాలనలో సాగించిన ఆగడాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరు మీకు తగిన బుద్ధి చెబుతారంటూ విరుచుపడ్డారు. దేశంలో ఎక్కడ ఆరోపణలు వచ్చినా సీబీఐ వస్తుందన్న బండి సంజయ్.. లిక్కర్ స్కామ్‌తో కవితకు సంబంధం లేదని కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు. కేసీఆర్ ఏ యాగం చేసినా ఫలితం ఉండదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్తో కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. అంతేగాదు జగిత్యాల పర్యటనలో ముందుగా కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే అని డిమాండ్ చేశారు. (చదవండి: ముథోల్ నుంచి అసెంబ్లీ ఎన్నికల బరిలో బండి సంజయ్?) -
నన్ను ఆరు ముక్కలు చేసినా సరే..
కోరుట్ల/కోరుట్ల రూరల్: ‘నన్ను ఆరు ముక్కలు చేస్తారట. నన్ను చంపినా సరే.. కానీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను సీఎం కేసీఆర్ అమలు చేయాలి’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆయన నిర్వహిస్తున్న ప్రజాసంగ్రామ యాత్ర ఆదివారం.. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం గుమ్లాపూర్, మోహన్‌రావుపేటలో సాగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రచ్చబండలో సంజయ్ మాట్లాడారు. ప్రధాని మోదీ పేరుచెప్పి వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగిస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. 24 గంటల ఉచిత కరెంటు మాట ఉత్తదేనన్నారు. గల్ఫ్ బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. బీడీ కార్మికుల సమస్యలు యధాతథంగా ఉన్నాయని, ఉద్యోగాలు, ఉపా«ధి లేక గల్ఫ్ వెళ్తున్న కుటుంబాలను ఆదుకునే దిక్కులేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అ«ధికారంలోకొస్తే ఉచిత విద్య, వైద్యం, గల్ఫ్ కార్మికుల ప్రత్యేక పాలసీ అమలు చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం కరెంటు బిల్లులు, ఆర్టీసీ చార్జీలు పెంచి పేదలపై పెనుభారం మోపిందని ధ్వజమెత్తారు. దేశంలో అత్యంత సంపన్న కుటుంబం కేసీఆర్‌దేనని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ దందాకే పరిమితం కాలేదని, పత్తాల ఆటలోనూ పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. ఇంద్రభవనం తీరుగా ఉన్న కవిత ఇల్లు చూసి లిక్కర్ స్కామ్ విచారణకు వెళ్లిన సీబీఐ అధికారులు కూడా విస్తుపోయారన్నారు. 50 గ్రామాలకు వాడాల్సిన కరెంటును కేసీఆర్ తన ఫామ్‌హౌస్ కోసం ఉపయోగించుకుంటున్నారని ఆరోపించారు. -
అది ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి: సంజయ్
కోరుట్ల/కోరుట్ల రూరల్: దొంగసారా దందాతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఉన్న లింకులు బయటపడటంతో తెలంగాణ ఆడబిడ్డలు తలదించుకునే పరిస్థితి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం యూసుఫ్‌నగర్, అయిలాపూర్, కోరుట్ల మున్సిపాలిటీలో శనివారం కొనసాగిన ప్రజాసంగ్రామ పాదయాత్రలో ఆయన సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కవితపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. రూ.లక్ష కోట్ల దొంగసారా దందా చేసిన కేసీఆర్ బిడ్డను చూసి దేశమంతా నవ్వుకుంటోందని ఎద్దేవా చేశారు. బిడ్డను అరెస్ట్ చేస్తారనే భయంతోనే తెలంగాణ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టి లబ్ధిపొందాలని కేసీఆర్ యత్నిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో చెల్లని రూపాయిగా మారిన సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ సభలు టీఆర్ఎస్ సంతాప సభలను తలపిస్తున్నాయని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పేరిట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ నేతలతో కలిసి దేశ పర్యటన అంటూ కేసీఆర్ అటే వెళ్లిపోతారని, తెలంగాణకు తిరిగిరారని అన్నారు. వేములవాడ, బాసర పుణ్యక్షేత్రాలకు రూ.వంద కోట్ల చొప్పున మంజూరు చేస్తానని చెప్పి ఒక్క రూపాయి కూడా ఇవ్వని కేసీఆర్ తాజాగా కొండగట్టుకు రూ.వంద కోట్లు ఇస్తానని చెప్పడం హాస్యాస్పదమన్నారు. రాష్ట్రాన్ని అప్పులకుప్పగా చేసి ప్రతిఒక్కరి తలపై రూ.1,20,000 భారం వేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మండిపడ్డారు. కేంద్రప్రభుత్వం ఇచ్చే రాయితీలను రైతుబంధు పేరిట కాజేస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. టీఆర్ఎస్ నేతలు క్యాసినోలో పెట్టిన రూ.లక్ష కోట్ల పెట్టుబడుల వ్యవ హారం త్వరలోనే బయటపడుతుందని అన్నారు. కేటీఆర్‌ను సీఎం చేయాలని చూస్తున్నారు.. టీఆర్ఎస్లో పరిపాలనాదక్షులు లేరా? సీఎంగా పనిచేయడానికి ఎవరూ పనికిరారా? కేటీఆర్‌ను సీఎం చేయాలని కేసీఆర్ ఎందుకు ఆలోచిస్తున్నడు? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్లలో శనివారంరాత్రి జరిగిన ప్రజాప్రస్థానం పాదయాత్ర సభలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ శ్రేణులు బీజేపీతో కలిసి వచ్చి ప్రగతిభవన్‌ను బద్ధలుకొట్టాలని పిలుపునిచ్చారు. -
దేశాన్ని మోసగించడానికే బీఆర్ఎస్
మెట్పల్లి(కోరుట్ల): ఎన్నికల హామీలు నెరవేర్చకుండా ఇప్పటివరకు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ వచ్చిన సీఎం కేసీఆర్.. దేశ ప్రజలను మోసగించడానికి బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. హామీలు ఎందుకు నెరవేర్చలేదో రాష్ట్ర ప్రజలకు ముందుగా కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. ఐదోవిడత ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా శుక్రవారం ఆయన జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జరిగిన సభలో మాట్లాడారు. దళిత ముఖ్య మంత్రి, దళితులకు మూడెకరాలు, రైతు రుణమాఫీ, అర్హులందరికీ డబుల్‌బెడ్ రూం ఇళ్లు, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి, ఉచితంగా ఎరువుల పంపిణీ, పోడుభూములకు పట్టాలు వంటి హామీలు ఏమయ్యాయని బండి ప్రశ్నించారు. తెలంగాణను దేశానికి మోడల్‌గా చేశామని గొప్పలు చెప్పుకుంటున్న కేసీఆర్ మిగులు ఆదాయమున్న రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని సంజయ్ దుయ్యబట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో వేతనాలు చెల్లించడం లేదన్నారు. పంజాబ్‌లో రైతులకు ఆర్థిక సాయం పేరిట చెల్లని చెక్కులు అందజేసి తెలంగాణ పరువు తీశారని మండిపడ్డారు. తండ్రికి ఇష్టమైన వ్యాపారమే చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లిక్కర్, క్యాసినోలో అవినీతి సొమ్మును పెట్టుబడిగా పెట్టా రని ఆరోపించారు. ఉపాధి కోసం గల్ఫ్ వెళ్లి ఇబ్బందులు పడుతున్న కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎందుకు ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేయలేదని సంజయ్ ప్రశ్నించారు. ఈ నెల 15న కరీంనగర్లో లక్షలాది మందితో బహిరంగ సభ నిర్వహిస్తామని సంజయ్ వెల్లడించారు. -
ఇద్దరు ముఖ్యమంత్రుల డ్రామా
మల్లాపూర్ (కోరుట్ల): కవిత లిక్కర్ స్కామ్ పక్కకు పోయేందుకు వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి సీఎం కేసీఆర్ కుట్ర చేస్తున్నాడని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. జగిత్యాల జిల్లాలో ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్న సంజయ్.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. ఇది ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఆడుతున్న డ్రామా అని విమర్శించారు. కమీషన్ల ఒప్పందంతో స్కామ్‌లను పక్కకు తప్పించేందుకే రెచ్చ గొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు కుట్ర లిక్కర్ స్కాంలో కవితకు ఈడీ నోటీసులు ఇస్తే, తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చేందుకు కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు కుట్ర చేస్తున్నారని సంజయ్ ఆరోపించారు. రూ.లక్ష కోట్లు దోచుకుని లిక్కర్ దందా చేసి అడ్డంగా దొరికిన కేసీఆర్ బిడ్డ కోసం తెలంగాణ ప్రజలు ఎందుకు ఉద్యమించాలని ప్రశ్నించారు. అవినీతిపరుల అంతుచూసేందుకు మోదీ సర్కారు చర్యలు ప్రారంభించిందని.. కేసీఆర్‌ను, ఆయన కొడుకు, బిడ్డను త్వరలోనే జైలుకు పంపుతామని వ్యాఖ్యానించారు. చట్టంలో విద్యుత్ మీటర్ల ఊసు లేదు.. రాష్ట్రంలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తున్నామని పదేపదే చెబుతున్న సీఎం కేసీఆర్.. ఎక్కడైనా అలా ఇస్తున్నట్టుగా నిరూపిస్తే రాజకీయాల్లోంచి తప్పుకుంటానని సంజయ్ సవాల్ చేశారు. నిరూపించలేకపోతే కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోవాలని అన్నారు. ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం లేకుండా మోటార్లకు మీటర్లు పెట్టడం అసాధ్యమని, కేంద్రం చేసిన కొత్త చట్టంలో కూడా మీటర్ల ఊసు లేదని చెప్పారు. కేంద్రం మీటర్లు పెట్టకపోతే ప్రజలకు కేసీఆర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. షుగర్ ఫ్యాక్టరీని కేంద్రానికి అప్పగించు రూ.లక్షల కోట్లతో దొంగ దందాలు చేస్తున్న కేసీఆర్ కుటుంబానికి ముత్యంపేట నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపించడం చేతకావడం లేదని సంజయ్ విమర్శించారు. ఫ్యాక్టరీ నడపడం చేతకాదని రాసిస్తే, కేంద్రాన్ని ఒప్పించి రూ.250 కోట్లతో ఫ్యాక్టరీని తెరిపించే బాధ్యతను తాను తీసుకుంటానని చెప్పారు. కేసీఆర్ దేవుళ్లకు కూడా శఠగోపం పెడుతున్నాడని అన్నారు. ‘వేములవాడ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు అన్నాడు.. ఒక్క పైసా ఇవ్వలేదు. బాసర ఆలయ అభివృద్ధికి 120 కోట్ల రూపాయలని ఒక్క పైసా ఇవ్వలేదు. ఇప్పుడు కొండగట్టుకు రూ.100 కోట్లు అంటూ దేవుళ్లకే శఠగోపం పెడుతున్నాడు..’అని ధ్వజమెత్తారు. ప్రజా సంగ్రామ యాత్ర గురువారం జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలంలోని మొగిలిపేట నుంచి నడికుడ, రాఘవపేట, ముత్యంపేట గ్రామాల మీదుగా మెట్పల్లి మండలం వేంపేట వరకు సాగింది. -
భయపడి బయటకొచ్చిండు కేసీఆర్
నిర్మల్/మల్లాపూర్(జగిత్యాల): ‘ప్రజాసంగ్రామ యాత్ర దె బ్బకు భయపడి బయటకొచ్చిన కేసీఆర్.. జగిత్యాలలో ఏదే దో వాగినవ్. నీ సంగతేందో చూస్తాం. ఫామ్‌హౌస్‌లో తాగి, తిని జల్సాలు చేస్తున్నవు. దళితబంధు, దళితులకు మూడెకరాల భూమి, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, నిరుద్యోగ భృతి హా మీలు ఏమయ్యాయి? పేదల పథకాలకు పైసలు ఉండవు.. కానీ, లక్షల కోట్లు దండుకోవడానికి మాత్రం పైసలుంటా యా’ అంటూ జగిత్యాలలో సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగాన్ని తిప్పికొడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. ప్రజాసంగ్రామయాత్రలో భాగంగా బుధవారం నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండల కేంద్రంలో, జిల్లా సరిహద్దు గ్రామమైన బాదన్‌కుర్తిలో ప్రసంగించారు. యాత్ర బాదన్‌కుర్తి వద్ద జగిత్యాల జిల్లాలో ప్రవేశించింది. కేంద్రం పేరుచెప్పి మీటర్లు పెడతావా.. ‘కేసీఆర్ వరద కాలువలకు పెట్టే మోటార్లకు మీటర్లు పెడతాడట. ఎన్నికలు వస్తే చాలు మోటార్లకు మీటర్లు అంటూ.. కేసీఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నాడు. కేంద్రం పేరు చెప్పి మోటార్లకు మీటర్లు పెడదామని చూస్తున్నాడు. మోటార్లకు మీటర్లు పెడితే బయటికి గుంజుకొస్తాం. కేసీఆర్ ఏమైనా బిచ్చపోడా? రైతులకు ఉచిత కరెంటు ఇవ్వకుండా, తన ఫామ్‌హౌస్‌కు ఉచిత కరెంటు తీసుకుంటున్నాడు. తన ఫామ్‌హౌస్‌లో వాడే కరెంటును 30–40 గ్రామాలకు ఇవ్వవచ్చు. రూ.30–40 వేల కోట్లు డిస్కంలకు బకాయి ఉన్నాడు’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ గురువారం ఒక పెళ్లికి వెళ్లాల్సి ఉందని, ఆ పెళ్లి పేరు చెప్పుకుని ఒకరోజు ముందు జగిత్యాలలో మీటింగ్ పెట్టారన్నారు. బీఎల్ సంతోష్ గొప్పవ్యక్తి.. బీఎల్ సంతోష్ గొప్పవ్యక్తి అని, దేశం, ధర్మం, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి ప్రచారక్‌గా పనిచేస్తున్నారని సంజయ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ ఓర్వలేక ఆయనపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని ఆరోపించారు. అయ్యకు ఇష్టమైన లిక్కర్ దందానే బిడ్డ కవిత చేసిందని, కవితను అరెస్టు చేస్తే... బాదనకుర్తి బ్రిడ్జి వద్ద మహిళలు ధర్నా చేయాల్నా అని ప్రశ్నించారు. కేసీఆర్ యుద్ధం మొదలుపెట్టాడని, దీనికి మనం సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కాగా, యాత్ర ముగింపు సభ ఈ నెల 15న కరీంనగర్‌లోని ఎస్సారార్ కళాశాల మైదానంలో నిర్వ హిస్తామని పాదయాత్ర ప్రముఖ్ మనోహర్‌రెడ్డి పేర్కొన్నారు. ము ఖ్యఅతిథిగా జేపీ నడ్డా వస్తున్నారని చెప్పారు. -
పరీక్షలకు సిద్ధమా..?
నిర్మల్: ‘కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు డ్రగ్స్ వాడతాడు. రక్తం, వెంట్రుకల నమూనాలిస్తే నిరూపించేందుకు సిద్ధం. నేను తంబాకు తింటానని పచ్చి అబద్ధాలు చెప్పినవ్ కదా కేటీఆర్.. నువ్వు, నేను పరీక్షలు చేయించుకుందాం. నా శరీరంలోని ఏభాగమైనా పరీక్షలకు ఇచ్చేస్తా. నీకు ఖాళీ.. రక్తం, రెండు వెంట్రుకలిచ్చే దమ్ముందా..?’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. దేశమంతా ఓవైపు ఉంటే.. కేసీఆర్ మరోవైపు ఉంటాడని, ప్రధాని మోదీ అంటే పడనివాళ్లు సైతం దేశం కోసం జీ–20 నిర్వహణ సమావేశానికి వెళ్లారని చెప్పారు. కేసీఆర్ మాత్రం తన బిడ్డను లిక్కర్ స్కాం నుంచి ఎలా బయటపడేయాలా అని లాయర్లతో మీటింగ్ పెట్టాడని విమర్శించారు. నిర్మల్ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర మంగళవారం మామడ మండల కేంద్రం నుంచి ఖానాపూర్ నియోజకవర్గ కేంద్రానికి చేరుకుంది. మార్గంమధ్యలో దిమ్మదుర్తిలో అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి సంజయ్ నివాళులర్పించారు. అక్కడ నిర్వహించిన సభలో ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొప్పు భాష, ఎంపీ సోయం బాపురావుతో కలిసి మాట్లాడారు. అంబేడ్కర్ భిక్షతోనే ఎంపీనయ్యా.. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ భిక్షతోనే ఎంపీనయ్యానని, అతిపెద్ద పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడి స్థాయికి ఎదిగానని బండి సంజయ్ అన్నారు. అలాంటి మహనీయుడిని గుర్తించిన ఘనత కూడా బీజేపీదే అన్నారు. భారతరత్నతో గౌరవించుకున్నామని, అంబేడ్కర్‌కు సంబంధించిన స్థలాలను పంచతీర్థాలుగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. రామ్‌నాథ్ కోవింద్‌ను రాష్ట్రపతిని చేయడంతో పాటు 12 మంది ఎస్సీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా, పలువురిని గవర్నర్లు, ముఖ్యమంత్రులగా చేసిన ఘనత తమ పార్టీదేనని చెప్పారు. కనీసం అంబేడ్కర్ వర్ధంతి, జయంతిలకు రాని దౌర్భాగ్యపు సీఎం కేసీఆర్ అని మండిపడ్డారు. దేశం కంటే బిడ్డే ముఖ్యమా? జీ–20 దేశాల సమావేశాన్ని నిర్వహించే అవకాశం మన దేశానికి రావడం గర్వకారణమని సంజయ్ పేర్కొన్నారు. ఈ సమావేశం నిర్వహణపై సలహాలు, సూచనలు తీసుకునేందుకు ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అన్ని పార్టీల అధ్యక్షులను ఆహ్వానిస్తే కేసీఆర్ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. దేశం కంటే బిడ్డ ముఖ్యమా అని నిలదీశారు. -
ముగ్గురితోనే సర్కార్‌ను కూలుస్తమా?
నిర్మల్: ‘రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందట. కేసీఆర్.. ఎందుకు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతవ్. బీజేపీకి ఉన్నది ముగ్గురు ఎమ్మెల్యేలే. నీ సర్కార్‌ను కూల్చాలంటే 57 మంది ఎమ్మెల్యేలు కావాలె. అలాంటప్పుడు కూల్చడం ఎలా సాధ్యం? అయినా నీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం మాకేంటి? రాష్ట్ర ప్రజల ఆశలను కూల్చింది నువ్వే. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 37 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినవ్’అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారంటూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి ఘాటుగా స్పందించారు. ప్రజాసంగ్రామయాత్ర ఎనిమిదో రోజు సోమవారం నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్‌కాండ్లి నుంచి మామడ సాగింది. లక్ష్మణచాంద మండలం కనకాపూర్, మామడ మండల కేంద్రంలో నిర్వహించిన కార్నర్ మీటింగ్‌ల్లో బండి మాట్లాడారు. ఆ మంత్రి అవినీతి చిట్టా ఉంది.. నిర్మల్ జిల్లాకు చెందిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అవినీతి, అక్రమాలు, భూకబ్జాల చిట్టా తనవద్ద ఉందని, పిచ్చిపిచ్చిగా మాట్లాడితే సంగతి చూస్తామని బండి హెచ్చరించారు. మంత్రిపైనా విచారణ జరపాల్సిందేనన్నారు. కాగా, ప్రజాసంగ్రామయాత్రలో స్వల్ప మార్పు చేసినట్లు పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్‌రెడ్డి తెలిపారు. ఈ నెల 16న కరీంనగర్లో ఐదో విడత యాత్ర ముగుస్తుందన్నారు. అక్కడి ఎస్ఆర్ఆర్ కాలేజ్ గ్రౌండ్లో ముగింపు సభ ఉంటుందన్నారు. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా వస్తారని చెప్పారు. డ్రగ్స్‌దందాలో ఇంకొకరు.. ఇప్పటికే కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో దొరికారని, డ్రగ్స్ దందాలో కల్వకుంట్ల కుటుంబం నుంచి మరొకరు జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి కేటీఆర్‌ను ఉద్దేశించి బండి వ్యాఖ్యానించారు. హైదరాబాద్, బెంగళూర్ డ్రగ్స్ కేసులను తక్షణమే రీ–ఓపెన్ చేసి, విచారణను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఏ తప్పు చేయకపోతే 10 ఫోన్లను కవిత ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్‌కు మద్యం అంటే ఇష్టమని, అందుకే కవిత మద్యం దందా చేసిందని ఎద్దేవా చేశారు. ఈడీ, ఐటీ లాంటి సంస్థలు ఎక్కడ దాడులు చేసినా ఆమె పేరే బయటికి వస్తోందన్నారు. లక్ష కోట్ల లిక్కర్ దందా చేసిన కేసీఆర్ బిడ్డకు విచారణకు పోతే సీబీఐ అరెస్టు చేస్తుందనే భయం పట్టుకుందన్నారు. అందుకే తండ్రీబిడ్డలు కూర్చుని ఒకళ్లను పట్టుకుని ఒకళ్లు ఏడుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఒకవేళ అరెస్టయితే సానుభూతి పొందేందుకు తెలంగాణ సెంటిమెంట్ రగిలించే స్కెచ్ వేస్తున్నారని ఆరోపించారు. -
నంబర్ వన్ తెలంగాణ ద్రోహి కేసీఆర్
నిర్మల్: కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుగా 575 టీఎంసీలు రావాల్సి ఉండగా.. 299 టీఎంసీలకే సంతకం పెట్టి, మన వాటాకు గండి కొట్టిన నంబర్ వన్ తెలంగాణ ద్రోహి, సారా స్కాంలో తన బిడ్డను అరెస్టు చేస్తే ఉద్యమం చేయాలంటున్న దుర్మార్గుడు కేసీఆర్ అని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంగ్రామ యాత్ర ఏడోరోజు నిర్మల్ జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా? బీజేపీని, మోదీని తిట్టడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నాడని సంజయ్ విమర్శించారు. బీజేపీ మద్దతుతోనే తెలంగాణ ఏర్పడిందని, అందుకే సీఎం పీఠంపై కూర్చున్నావన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. కేసీఆర్ బిడ్డ కవిత ఏమైనా స్వాతంత్య్ర సమరయోధురాలా..? లేక రజాకార్లపై పోరాడిన మరో ఝాన్సీ లక్ష్మీబాయా..? అని ప్రశ్నించారు. ప్రజల సొమ్ముతో లక్ష కోట్ల లిక్కర్ దందా చేసిందని ఆరోపించారు. అలాంటి కవితను అరెస్ట్ చేస్తే తెలంగాణ ప్రజలెందుకు ధర్నా చేయాలని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ ఆయన కుమార్తె కవిత ప్రస్తుతం కేసుల భయంతో ఒకటే విలపిస్తున్నారని, వారి కన్నీళ్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిండుతోందని బండి సంజయ్ ఎదేవా చేశారు. అల్లోల అవినీతి తిమింగలం.. రెండు వేల ఎకరాలు దోచుకుని వేలకోట్లు సంపాదించిన కబ్జాకోరు ఇంద్రకరణ్‌రెడ్డి అని, అధికారంలోకి వచ్చాక అల్లకల్లోల అవినీతి మంత్రి అంతు చూస్తామని సంజయ్ హెచ్చరించారు. మున్సిపాలిటీలో స్వీపర్ ఉద్యోగాల కోసం లక్షల రూపాయలు లంచంగా తీసుకున్నాడని ఆరోపించారు. జనవరి 10లోపు ఆ డబ్బులు తిరిగి ఇవ్వకపోతే తామేంటో చూపిస్తామని హెచ్చరించారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాలి బొట్టు పెట్టుకున్నంత మాత్రాన హిందువులు కాలేరని, ధర్మం కోసం, దేశం కోసం పనిచేయాలని సంజయ్ సూచించారు. హిందువులు ఓటు బ్యాంకుగా మారాలన్నారు. హిందు అమ్మాయిలను లవ్‌జిహాద్ పేరిట వేధించే వాళ్ల బట్టలు ఊడదీసి కొడతామని హెచ్చరించారు. ఢిల్లీలో శ్రద్ధావాకర్‌ను 35 ముక్కలుగా నరికితే ఒక్క సెక్యులర్ నాయకుడు, ఏ సంఘమూ మాట్లాడలేదని మండిపడ్డారు. కేరళలో లవ్ జిహాద్ పేరిట అమ్మాయిలను ఎత్తుకెళ్తుంటే, ట్రిపుల్ తలాక్ పేరిట మహిళలను ఇబ్బందులు పెడుతుంటే క్రైస్తవ, ముస్లిం సంఘాలు ఎటుపోయాయని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబాన్ని జైలుకు పంపుతాం తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండానే అని చెప్పారు. బీజేపీ అధికారంలోకొస్తే అందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని, అర్హులందరికీ పక్కా ఇళ్లు కట్టిస్తామని అన్నారు. నిర్మల్‌కు బుల్డోజర్లను పంపి అక్రమంగా నిర్మించిన బడా బాబుల ఇళ్లను కూల్చివేయిస్తామని హెచ్చరించారు. కేసీఆర్ అవినీతి కుటుంబాన్ని జైలుకు పంపి తీరతామని పునరుద్ఘాటించారు. -
పొలిటికల్ ప్లాన్ చేంజ్.. బండి పాదయాత్రపై రూట్ మార్చిన బీజేపీ!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. టీఆర్ఎస్ సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి.. బీజేపీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో బీజేపీ నేతలు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. కాగా, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వచ్చే ఏడాది సంక్రాంతి తర్వాత బండి సంజయ్ బస్సు యాత్రను ప్రారంభించనున్నారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో పాదయాత్రకు బదులుగా బస్సు యాత్ర చేసేందుకు బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. కాగా, ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర ముగిసిన వెంటనే హైదరాబాద్‌లో బండి సంజయ్ ఆరో విడత పాదయాత్ర 10 రోజుల్లో ముగించేలా రూట్ మ్యాప్ ఖరారు చేశారు. ఇదిలా ఉండగా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన సోమ, మంగళవారాల్లో బీజేపీ జాతీయపదాధికారుల సమావేశం జరుగనుంది. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి డీకే అరుణ, ఎంపీ లక్ష్మణ్, మురళీధర్ రావు, పొంగులేటి హాజరుకానున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో బండి సంజయ్ బిజీగా ఉండటంతో ఈ సమావేశానికి హాజరుకావడం లేదు. ఇక, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రత్యేకంగా తెలంగాణ పాలిటిక్స్‌పైనే బీజేపీ ఎక్కువ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. -
Praja Sangrama Yatra: ప్రజల గోస అరుసుకోవాలనే!
తెలంగాణలో మెజారిటీ వర్గాల ప్రయోజనాల కోసం ‘బీసీ బంధు’, అణగారిన ఎస్టీ బిడ్డల కోసం ‘గిరిజన బంధు’ను తీసు కురావడమే లక్ష్యంగా, సకల జనులు కలలుగన్న తెలంగాణ పునర్నిర్మాణమే ధ్యేయంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌కుమార్ తలపెట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర ఐదో విడత నవంబర్ 28న ప్రారంభమయ్యింది. భావి సామాజిక తెలంగాణ కోసం బండి సంజయ్ ఇప్పటికే నాలుగు విడతల్లో పాదయాత్రను విజయవంతంగా పూర్తి చేసిన్రు. గతేడాది ఆగస్టు 28 వ తేదీన చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మ వారి ఆలయం నుంచి ప్రారంభమైన ఈ పాదయాత్రకు, టీఆర్ఎస్ప్రభుత్వం అడుగడు గున అడ్డంకులు సృష్టించింది. అయినా వెనకడుగు వెయ్య కుండా, వెన్ను చూపకుండా ఇప్పటి వరకు విడతలుగా 21 జిల్లాల్లో 1,178 కిలోమీటర్లు నడిచి బండి సంజయ్ తెలంగాణ ప్రజల మనసులు గెలుచు కున్నారు. నవంబర్ 28న నిర్మల్‌లోని ఆడెల్లి పోచమ్మ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం, ఆశేష జనవాహిని మధ్య ముధోల్ నుంచి పాదయాత్ర ప్రారం భమయింది. 8 అసెంబ్లీ నియోజకవర్గాల సహా... ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ పార్లమెంట్ నియోజక వర్గాల్లో 225 కిలోమీటర్ల మేర కొనసాగే ఈ పాద యాత్ర డిసెంబర్ 17న, కరీంనగర్లో నిర్వహించే బహిరంగ సభతో ముగుస్తది. టీఆర్ఎస్ ప్రభుత్వ తొమ్మిదేండ్ల ఏలుబడిలో మన బిడ్డలకు ఉద్యోగాలు రాలే. మన పొలాలకు నీళ్లు రాలే. మన డబ్బా ఇండ్లు డబుల్ బెడ్రూం కాలే. మన ఊరికి నిధులు రాలే. మన రైతుల అప్పులు తీరలే. తెలంగాణ ప్రజల బతుకులు బాగుపడలే. తెలంగాణకు దళితుడే ముఖ్యమంత్రి అనీ, దళితులకు మూడెకరాల భూమి ఇస్తమనీ దళితులను మోసం చేసిన్రు. కేజీ టు పీజీ ఉచిత విద్య మాటలకే పరిమితమైంది. రైతులకు రుణమాఫీ, ఉచిత ఎరువుల హామీలు అమలుకే నోచుకోలే. బీసీ రుణాలను మూలకు పడేసి ఐదేండ్లు కావొస్తున్నది. పోడు భూముల్లో మొక్కలు నాటాలని ఒక వైపు అధికారులకు ఆదేశాలు ఇచ్చేదీ ప్రభుత్వమే. ఇంకోవైపు పోడు భూములకు పట్టాలిస్తామని ఆశ పెట్టేదీ ముఖ్యమంత్రే. ఈ రెండు నాలుకల నిర్వాకం వల్ల అధికారులు, పోడు రైతుల మధ్య గొడవలయ్యి, అమాయకుల ప్రాణాలు పోతున్నయ్. (చదవండి: ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే.. సంయమనం పాటించాలి) భారతీయ జనతా పార్టీ భావజాలాన్ని, మౌలిక లక్ష్యాలైన జాతీయవాదం, జాతీయ సమైక్యత, ప్రజాస్వామ్యం, సామాజిక ఆర్థిక వ్యవస్థకు గాంధేయ విధానాలను అన్వ యించడం విషయంలో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తం. దోపిడీ నుంచి విముక్తి, సమానతపై ఆధారపడ్డ సమాజం (‘సమతా యుక్త్, శాసన్ ముక్త్’)తో పాటు, విలువలతో కూడిన రాజకీయాలను ప్రచారం చేస్తం. తొలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పార్టీగా, మలిదశ ఉద్యమంలో తెలంగాణ బిల్లుకు సహకరించి తెలంగాణ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన పార్టీగా బీజేపీకి తెలంగాణ ఆకాంక్షలపై స్పష్ట మైన అవగాహనతో పాటు, అవసరమైన ప్రణాళికలు ఉన్నయ్. ప్రజారంజక పాలన తీసుకురావడానికి ప్రతి ఒక్కరూ ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొనాలని స్వాగతిస్తున్నం. (చదవండి: ఓబీసీల వర్గీకరణకు మోక్షం ఎప్పుడు?) - డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి ఉపాధ్యక్షులు, బీజేపీ తెలంగాణ శాఖ (‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’ 5వ విడత సందర్భంగా) -
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఊరట
-
హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. కదలనున్న ‘బండి’.. కండీషన్స్ అప్లై!
సాక్షి, నిర్మల్ జిల్లా: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్రకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. బైంసా సిటీలోకి వెళ్లకుండా బయట నుంచి పాదయాత్ర జరుపుకోవాలని తెలిపింది. అలాగే బహిరంగ సభ బైంసా టౌన్లో నిర్వహించడానికి వీళ్లేదని.. సిటీకి 3 కిలోమీటర్ల దూరంలో నిర్వహిస్తేనే సభకు అనుమతించాలని కోర్టు పేర్కొంది. కాగా బండి సంజయ్ పాదయాత్రకు రాష్ట్ర పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో బీజేపీ సోమవారం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. బండి సంజయ్ పాదయాత్రపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వ తీరును ఖండిస్తూ పాదయాత్రకు తక్షణమే అనుమతి ఇవ్వాలని కోరింది. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు బండి సంజయ్ పాదయాత్రపై విచారణ చేపట్టింది ఉన్నత న్యాయస్థానం. బైంసా సిటీలోకి పాదయాత్ర వెళ్లదని బీజేపీ తరపున న్యాయవాది రామచందర్ రావు కోర్టుకు తెలిపారు. దీంతో బైంసాలోకి పాదయాత్ర వెళ్లకుంటే పోలీసులకు అభ్యంతరమేంటని హైకోర్టు ప్రశ్నించింది. సభలు, పాదయాత్రలు రాజకీయ పార్టీలకు రాజ్యాంగం కల్పించిన హక్కు అని హైకోర్టు ఈ సందర్భంగా పేర్కొంది. చదవండి: హైదరాబాద్ మెట్రోకు అయిదేళ్లు.. తీరని నష్టాలు.. తప్పని సవాళ్లు బైంసాలో టెన్షన్ బండి సంజయ్ చేపట్టే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు అనుమతి నిరాకరించడంతో సోమవారం బైంసాలో టెన్షన్ నెలకొంది. బైంసాలోని ప్రజా సంగ్రామ యాత్ర బహిరంగ సభ వద్ద ఏఎస్పీ కిరణ్ కారే ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సభ వద్ద బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. సభా ప్రాంగణాన్ని ఖాళీ చేయించారు. అక్కడికి ఎవరిని రాకుండా అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బైంసాలో 144 సెక్షన్ విధించారు. మరోవైపు పోలీసులు తీరుపై బీజేపీ నాయకులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
భైంసాలో టెన్షన్.. టెన్షన్..!
భెంసాటౌన్/ఆదిలాబాద్/హైదరాబాద్: నిర్మల్ జిల్లా భైంసా నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టే ఐదో విడత ప్రజాసంగ్రామయాత్రకు అనుమతి నిరాకరించినట్లు భైంసా ఏఎస్పీ కిరణ్ ఖారె తెలిపారు. భైంసాలో నిర్వహించే సభకు కూడా అనుమతి లేదని పేర్కొన్నారు. భైంసాలోని సున్నిత పరిస్థితుల దృష్ట్యా పాదయాత్రతోపాటు సభకు ఎస్పీ ప్రవీణ్‌కుమార్ అనుమతి నిరాకరించినట్లు వెల్లడించారు. ప్రజాసంగ్రామ యాత్రకు పోలీసులు అనుమతి నిరాకరించడంతో బీజేపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. రెండు, మూడురోజులుగా ఎంపీ సోయం బాపురావు, ఇతర జిల్లాల నాయకులు భైంసాలోనే మకాం వేసి సభ ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. పార్డి(బి) బైపాస్ రోడ్లో జరిగే భారీ బహిరంగసభకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పారీ్టకి రాజీనామా చేసిన డీసీసీ మాజీ అ«ధ్యక్షుడు రామారావు పటేల్ ఈ సభావేదికగానే బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. ఈ మేరకు పట్టణంలో భారీఫ్లెక్సీలతో విస్తృత ప్రచారం చేసుకున్నారు. బీజేపీ టికెట్ ఆశావహులు సైతం భైంసా రహదారులను ఫ్లెక్సీలతో కాషాయమయం చేశారు. ఈ నేపథ్యంలో బండి యాత్రకు అనుమతి నిరాకరించడంతో ఎప్పుడేం జరుగుతుందోననే టెన్షన్ నెలకొంది. ఎంఐఎంకు భయపడే: సోయం ఎంఐఎంకు భయపడే సంజయ్ యాత్రకు అనుమతి ఇవ్వట్లేదని ఎంపీ సోయం బాపురావ్ ఒక ప్రకటనలో విమర్శించారు. ప్రజాసమస్యలను పరిష్కరించలేక బండి యాత్రను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని పేర్కొన్నారు. ‘న్యాయస్థానం తలుపు తడతాం. న్యాయస్థానం అనుమతి తీసుకుని యాత్ర కొనసాగిస్తాం’అని ప్రకటించారు. ‘సభావేదిక వేసేదాక చూసి, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దిగే హెలీప్యాడ్‌ను కూడా పరిశీలించిన పోలీసులు అకస్మాత్తుగా అనుమతి రద్దు చేయడం వెనుక సీఎం కేసీఆర్ ప్రోద్బలం ఉంది’అని పేర్కొన్నారు. యాత్రతో బీజేపీకి ప్రజాదరణ పెరుగుతుందని భయపడి, అనుమతులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. అడ్డుకోవడం పిరికిపంద చర్య: డీకే అరుణ సంజయ్ పాదయాత్రను అడ్డుకోవడం సీఎం కేసీఆర్ పిరికిపంద చర్యకు నిదర్శనమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ప్రజల కోసం చేస్తున్న యాత్రగా కేసీఆర్ గ్రహించి అనుమతించాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ప్రజల్లో టీఆర్ఎస్పై పెరుగుతున్న వ్యతిరేకతను తట్టుకోలేకనే బీజేపీని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ‘మత ఘర్షణలు జరుగుతాయనే సాకుతో అడ్డుకోవడం సరికాదు. తెలంగాణ పోలీసులకు సత్తా ఉంటే యాత్రకు అనుమతివ్వాలి. బందోబస్తులో ఉండి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలి.అయితేనే పోలీస్ వ్యవస్థకు మనుగడ ఉన్నట్లు’అని అరుణ పేర్కొన్నారు. భైంసా సభను అడ్డుకోవడం కుట్ర రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోంది: కె.లక్ష్మణ్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అరాచక పాలన నడుస్తోందని, బీజేపీ ప్రజాస్వామ్యయుతంగా నిర్వహించ తలపెట్టిన భైంసా సభకు అనుమతి నిరాకరించడం సరికాదని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, ఎంపీ కె.లక్ష్మణ్ మండిపడ్డారు. తెల్లారితే సభ ఉండగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను నిర్మల్ వెళ్లకుండా అడ్డుకోవడం ఏమిటని నిలదీశారు. భైంసా సభను అడ్డుకోవడం వెనుక కేసీఆర్ కుట్ర ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందని, ఆయన ఎన్ని కుట్రలు చేసినా బీజేపీని ఆపలేరని పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా కల్వకుంట్ల కుటుంబ పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని చెప్పారు. కేసీఆర్ తనకు తాను నయా నిజాం అనుకుంటున్నారని.. నిజాం మెడలు వంచినట్లే కేసీఆర్ నిరంకుశ పాలనకు అంతం పలికే రోజు దగ్గర్లోనే ఉందని వ్యాఖ్యానించారు. ఇదీ చదవండి: జగిత్యాలలో హై టెన్షన్.. బండి సంజయ్ మరోసారి అరెస్ట్ -
కేసీఆర్‌కు పాలించే అర్హత పోయింది
సాక్షి, హైదరాబాద్: ఎనిమిదేళ్లలో ఇష్టారాజ్యంగా చేసిన రూ.5లక్షల కోట్ల అప్పులకు ఏటా రూ.30వేల కోట్లు వడ్డీల కిందే కడుతున్న కేసీఆర్ సర్కార్‌కు రాష్ట్రాన్ని పాలించే అర్హత లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. టీఆర్ఎస్కు మళ్లీ అధికారమిస్తే మరో రూ.5 లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలను నిండా ముంచేస్తారని ఆరోపించారు. అందుకే ప్రజలంతా తమ క్షేమం కోరే బీజేపీ ప్రభుత్వం రావాలని గట్టిగా కోరుకుంటున్నారని చెప్పారు. కేసీఆర్ కేవలం తమ కుటుంబం గురించి మాత్రమే ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. తాను ఇప్పటివరకు చేపట్టిన నాలుగు విడతల యాత్రకు ప్రజలు మద్దతు తెలిపి అండగా నిలిచారని.. ఇక ముందూ విశేష స్పందన లభిస్తుందని నమ్మకం ఉందని తెలిపారు. ఐదో విడత ప్రజా సంగ్రామయాత్రకు సిద్ధమైన నేపథ్యంలో బండి సంజయ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోని ముఖ్యాంశాలివీ.. సాక్షి: నాలుగు విడతల పాదయాత్ర ద్వారా ఏం సాధించారు? సంజయ్: ప్రజల వద్దకు వెళ్లి దగ్గరి నుంచి వారి బాధలను తెలుసుకున్నాం. రాష్ట్రంలో పేదలు, ఇతర వర్గాల వారు ఎదుర్కుంటున్న తీవ్ర సమస్యలను గుర్తించే ఉచిత విద్య, ఉచిత వైద్యం హామీలిచ్చాం. ఇళ్లు లేని పేదలకు పక్కాగృహాలు నిర్మిస్తామని చెప్పాం. ఐదో విడత లక్ష్యాలు, ఉద్ధేశాలేమిటి? టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక గత 8 ఏళ్లుగా, అంతకు ముందు కాంగ్రెస్ హయాంలోనూ నిత్యం సమస్యలతో తల్లడిల్లుతూనే ఉన్న గ్రామీణ ప్రాంతాల పరిధిలో ఈ విడత పాదయాత్ర నిర్వహిస్తున్నాం. యాత్రలో తెలుసుకునే అంశాలతో అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టో రూపొందించి.. అధికారంలోకి వచ్చాక కచి్చతంగా అమలు చేస్తాం. టీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత తీవ్రస్థాయికి చేరుకున్నందున ఐదో విడత గతంలో జరిగిన వాటి కంటే సూపర్ సక్సెస్ అవుతుంది. ప్రతిసారి మా యాత్రలు, కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ వివిధ రూపాల్లో ఆటంకాలు కలి్పస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లు వినిపిస్తున్నాయి. దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కేసీఆర్ తంటాలు పడుతున్నారు. రాష్ట్ర రాజకీయాల పరిస్థితి ఎలా ఉంది? మునుగోడు ఉప ఎన్నికలో మాదిరిగానే టీఆర్ఎస్, కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి లోపాయకారీ ఒప్పందాలతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తారు. అయినా తెలంగాణలో కేసీఆర్ గద్దె దిగడం ఖాయం. కాషాయ జెండా రెపరెపలాడటం ఖాయం. ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా ప్రజల్లో మార్పు వచి్చంది. ఎప్పుడు ఎన్నికలొచి్చనా టీఆర్ఎస్కు గుణపాఠం చెప్పాలని ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ కుటుంబ, అవినీతి, నియంత పాలనకు చరమగీతం పాడి.. పేదల ఆధ్వర్యంలో తెలంగాణ అమరుల కలలు నిజం చేసేలా బీజేపీ ముందుకు సాగుతుంది. మోదీ ప్రభుత్వం సీబీఐ, ఈడీ, ఐటీలను ఉసిగొల్పుతోందనే ఆరోపణలపై స్పందన? అవన్నీ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థలు. సీబీఐ డైరెక్టర్ ఎంపిక కమిటీలో ప్రధాన ప్రతిపక్షనేతతోపాటు సుప్రీంకోర్టు సీజే కూడా ఉంటారు. అలాంటి సంస్థలపై రాజకీయ ఆరోపణలు చేయడం సరికాదు. పన్ను ఎగవేతలు, అక్రమాలపై ఐటీ, ఈడీ విచారణ చేపడతాయి. తప్పు చేయనప్పుడు భయమెందుకు? టీఆర్ఎస్ నేతలు భుజాలెందుకు తడుముకుంటున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ జాతీయ నేతలపై ఆరోపణలకు సమాధానం? ఇది కేసీఆర్ అండ్ కో ఆడుతున్న డ్రామా. అది జరిగింది టీఆర్ఎస్ ఎమ్మెల్యే గెస్ట్‌హౌజ్‌లో.. అక్కడికి వచి్చంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. యాక్షన్ చేసింది కేసీఆర్ చెప్పినట్లు ఆడే పోలీసులు. అంతా టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా ఎదుగుతున్న బీజేపీపై బురద చల్లి ఇమేజ్ను దెబ్బతీసే కుట్ర. కేసీఆర్ నీచ రాజకీయాలకు నిదర్శనం. కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకున్నారా? కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో భూస్థాపితమైంది. ఢిల్లీ నుంచి గల్లీదాకా కనుమరుగవుతోంది. భారత్‌జోడో యాత్ర పేరుతో రాహుల్ గాంధీ దేశమంతా తిరుగుతున్నా జనం పట్టించుకోవడం లేదు. వాళ్లు పాదయాత్రలు కాదు.. మోకాళ్ల యాత్ర చేసినా, పొర్లు దండాల యాత్ర చేసినా కాంగ్రెస్‌ను జనం నమ్మరు. ఇక రాష్ట్రంలో కాంగ్రెస్ టీఆర్ఎస్తో అంటకాగుతోంది. కాంగ్రెస్‌లో భవిష్యత్ లేదనే నిర్ణయానికొచ్చే ఆ పార్టీ నేతలు బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. కొద్దిరోజుల్లో ఆ పార్టీ ఖాళీ కాబోతోంది. గాందీభవన్‌కు ‘టు లెట్’ బోర్డు తగిలించే పరిస్థితి రాబోతోంది. కేసీఆర్‌ను జనం అసహ్యించుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ టీఆర్ఎస్కు వ్యతిరేకంగా బీజేపీ చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి అద్భుత స్పందన వస్తోంది. అందుకే సీఎం కేసీఆర్ అభివృద్ధిని పక్కనపెట్టి.. కేంద్రాన్ని, ›ప్రధాని మోదీని, బీజేపీని విమర్శించడం, అర్థం లేని ఆరోపణలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ వైఖరిని, టీఆర్ఎస్ నేతల తీరును, చేస్తున్న విమర్శలను చూసి రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారు. – బండి సంజయ్ -
20 రోజులు.. 222 కిలోమీటర్లు
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్ర సోమవారం నిర్మల్ జిల్లా భైంసాలో ప్రారంభం కానుంది. డిసెంబర్ 18న కరీంనగర్లో ముగియనుంది. మొత్తం 20 రోజులపాటు ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలో 222 కి.మీ మేర సాగనుంది. సంజయ్ సోమవారం ఉదయం నిర్మల్ నియోజకవర్గంలోని ఆడెల్లి పోచమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి భైంసా నుంచి యాత్ర ప్రారంభిస్తారు. భైంసాలో నిర్వహించే ప్రారంభసభలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. ఈ సందర్భంగా నిర్మల్ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడు రామారావు పటేల్‌తోపాటు వివిధస్థాయిల నాయకులు బీజేపీలో చేరనున్నారు. ఈ యాత్ర సాగుతున్న క్రమంలో పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్లకు చెందిన సర్పంచ్‌లు, మాజీ సర్పంచ్‌లు, ఇతర స్థానిక నాయకులు చేరతారని అంచనా వేస్తున్నారు. సంజయ్ తొలిరోజు పాదయాత్రలో 6.3 కి.మీ. నడిచి.. ముథోల్ నియోజకవర్గంలోని గుండగామ్ సమీపంలో రాత్రి బస చేస్తారు. ఈ యాత్రలో భాగంగా 8 అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే సభలకు కేంద్రమంత్రులు, బీజేపీ జాతీయనేతలు పాల్గొంటారు. ముగింపుసభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. పాదయాత్ర ఇలా... 29న రెండోరోజు గుండగామ్ నుంచి మహాగాన్ దాకా 13 కి.మీ; 30న లింబా నుంచి కుంటాల, అంబకంటి మీదుగా 13.7 కి.మీ; డిసెంబర్ 1న నిర్మల్‌లోని బామిని బూజుర్గ్ నుండి నందన్, నశీరాబాద్ మీదుగా 10.4 కి.మీ.; 2న రాంపూర్ నుంచి లోలమ్ మీదుగా చిట్యాల దాకా 11.1 కి.మీ; 3న చిట్యాల నుండి మంజులాపూర్, నిర్మల్ రోడ్, ఎడిగాం, ఎల్లపల్లి, కొండాపూర్ మీదుగా ముక్తాపూర్ వరకు 12.3 కి.మీ; 4న లక్మణ్ చందా మండలంలోని వెల్మల, రాచాపూర్, లక్మణ్ చందా, పోటపల్లి వరకు 12.7 కి.మీ; 5న మమ్డా మండలంలోని కొరైకల్ మమ్డా, దిమ్మతుర్తి వరకు 11.5 కి.మీ; 6న ఖానాపూర్ నియోజకవర్గంలో దొమ్మతుర్తి, ఇక్బాల్‌పూర్, తిమ్మాపూర్, ఖానాపూర్ మీదుగా 12.8 కి.మీ; 7న మస్కాపూర్ లోని సూరజ్ పూర్, బడాన్ ఖర్తి, ఓబులాపూర్, మొగల్ పేట మీదుగా 12.8 కి.మీ; 8, 9 తేదీల్లో కోరుట్ల నియోజకవర్గంలోని మల్లాపూర్, కోరుట్ల మండలాల్లో 21.7 కి.మీ; 10న కోరుట్ల పట్టణం వెంకటాపురం, మోహన్ రావు పేట మీదుగా 12.3 కి.మీ; 11న వేములవాడలోని మేడిపల్లి నుండి తాటిపల్లి మీదుగా 10.1 కి.మీ; 12న జగిత్యాలలో 10.4 కి.మీ; 13న చొప్పదండిలోని చిచ్చాయ్, మల్యాల చౌరస్తా, మల్యాల మీదుగా 13.3 కి.మీ; 14, 15 తేదీల్లో చొప్పందండి నియోజకవర్గంలో 20 కి.మీ.; 16, 17న కరీంనగర్లో 18 కి.మీ. యాత్ర సాగనుంది. 18న కరీంనగర్లో ఎస్సారార్ కళాశాల వద్ద ముగింపు బహిరంగ సభ. ఈ విడతకు భారీగా ప్రజాస్పందన బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ లోక్‌సభ స్థానాల పరిధిలో ఈ యాత్ర సాగనుంది. అదీగాక, ఈ విడత యాత్ర హిందుత్వ భావజాలం నేపథ్యమున్న ప్రాంతాల్లో జరగనుంది. అందుకే ఈ విడత యాత్రను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. ఇప్పటిదాకా జరిగిన నాలుగువిడతల కంటే ఈ విడత యాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తుందని భావిస్తున్నాం. – పాదయాత్ర ప్రముఖ్ డా. గంగిడి మనోహర్‌రెడ్డి -
సంజయ్ ఐదో విడత యాత్ర.. భైంసాలో మొదలుపెట్టి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 15 నుంచి ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ విడతలో 20 రోజులపాటు 12, 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 200–240 కి.మీ మేర పాద యాత్ర నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని బాసర సరస్వతీమాత ఆలయంలో పూజ చేసి భైంసాలో మొదలుపెట్టి కరీంనగర్లో ముగించేలా యాత్రకు రూపకల్పన చేశారు. వచ్చేనెల మొదటివారంలో మునుగోడు ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ ప్రకటించిన పక్షంలో యాత్ర తాత్కాలికంగా వాయిదాపడే అవకాశమున్నట్లు తెలుస్తోంది. 4 విడతల్లో 1,260 కి.మీ. గతేడాది ఆగస్టు 28న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం నుంచి సంజయ్ పాదయాత్ర మొదలుకాగా మధ్య మధ్యలో బ్రేక్‌లు ఇస్తూ 4 విడతలు సాగింది. నాలుగో విడత ఈ నెల 22న రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌పేటలో ముగిసింది. నాలుగు దశల్లో మొత్తం 102 రోజులపాటు 48 అసెంబ్లీ స్థానాల్లో 1,260 కి.మీ మేర సాగింది. ఒక్కో విడతలో భిన్నమైన సమస్యలు, అంశాలను ఎంచుకుని యాత్ర సాగింది. (క్లిక్: కేసీఆర్ పర్యటనల కోసం రూ.80 కోట్లతో ప్రత్యేక విమానం) -
ఎంఐఎం కనుసన్నల్లో పీఎఫ్ఐ.. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్
నాగోలు/లింగోజిగూడ: హిందువుల తలలు నరికి చంపుతున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్ఐ) తెలంగాణలో బాంబులు పేల్చి విధ్వంసం సృష్టించేందుకు కుట్ర చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చెప్పారు. ఎంఐఎం నేతల కనుసన్నల్లోనే ఆ సంస్థ పనిచేస్తోందని ఆరోపించారు. తెలంగాణలో పీఎఫ్ఐ విస్తరించడానికి టీఆర్ఎస్సే కారణమని, ఆ పార్టీ నేతలు కొంతమంది చందాలిచ్చి పెంచి పోషిస్తున్నారని అన్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా బుధవారం ఎల్బీనగర్ నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న బండికి.. నాగోలు చౌరస్తా వద్ద స్థానిక ప్రజలు, పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. 100 రోజుల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా గజమాలతో సత్కరించారు. గొర్రెపిల్లను బహూకరించారు. కాగా నాగోలు, కొత్తపేట డివిజన్ మోహన్‌నగర్, చైతన్యపురిలో ఆయన ప్రసంగించారు. సీఎంకు సోయి ఎందుకు లేదు? పీఎఫ్ఐకి చెందిన సంస్థలపై ఎన్ఐఏ దాడులు చేసేంతవరకు సీఎం కేసీఆర్‌కు సోయి ఎందుకు లేదని సంజయ్ ప్రశ్నించారు. యూపీకి చెందిన ఓ ముఠా బిహార్‌లో బాంబులు తయారు చేసి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను పేల్చేందుకు కుట్ర చేసిందని చెప్పారు. 2040 నాటికి భారత్‌ను ఇస్లామిక్ రాజ్యంగా మార్చేందుకు పీఎఫ్ఐ కుట్ర చేస్తోందని అన్నారు. ఎంఐఎం ఆగడాలను అడ్డుకునేది బీజేపీ మాత్రమే అని పేర్కొన్నారు. హిందూ సమాజ సంఘటితమే బీజేపీ లక్ష్యమని స్పష్టం చేశారు. క్వారంటైన్‌కు కేసీఆర్ కుటుంబం ఏ స్కాం చూసినా కేసీఆర్ కుటుంబానిదే పాత్ర ఉంటోందని సంజయ్ అన్నారు. కొడుకు, బిడ్డ తప్పు చేసినా జైల్లో పెడతానన్న సీఎం.. లిక్కర్ స్కాంపై నోరెందుకు మెదపట్లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల కష్టాలను గాలికి వదిలేసి దేశ రాజకీయాలంటూ తిరుగుతున్నాడని విమర్శించారు. సీబీఐ, ఈడీ దాడులు చూసి ఆయన కుటుంబం క్వారంటైన్‌కు వెళుతోందని ఎద్దేవా చేశారు. బీజేపీ జాతీయ కార్యదర్శి మురళీధర్‌రావు, జాతీయ కార్యవర్గ సభ్యుడు పేరాల శేఖర్జీ తదితరులు పాల్గొన్నారు. నేటితో ముగియనున్న ‘బండి’ నాలుగో విడత యాత్ర పెద్దఅంబర్‌పేటలో బహిరంగ సభ.. ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి రాక బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన నాలుగోవిడత ప్రజా సంగ్రామ యాత్ర గురువారం ముగియనుంది. పెద్దఅంబర్‌పేట మున్సి పాలిటీలో నిర్వహిస్తున్న ముగింపు బహిరంగ సభలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. బండి సంజయ్ గతేడాది ఆగస్టు 28న చార్మినార్ నుంచి మొదలు పెట్టిన పాదయాత్ర ఇప్పటివరకు మొత్తం నాలుగు విడతలుగా సాగింది. 4విడతల్లో 102 రోజుల పాటు 48 అసెంబ్లీ స్థానాల్లో దాదాపు 1,250కి.మీ. మేర యాత్ర సాగింది. భాగ్యలక్ష్మి అమ్మవారి గుడి నుంచి ప్రారంభం.. బండి సంజయ్ మొదటివిడత పాదయాత్రను హైదరాబాద్ పాతబస్తీ భాగ్య లక్ష్మి అమ్మవారి గుడి నుంచి ప్రారంభించారు. పాతబస్తీతో పాటు హైదరాబాద్ మహానగరంలో, ఇతర చోట్ల వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తారు. రెండో విడతలో ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లోని సమస్యలను ప్రస్తావించారు. మూడో విడతలో ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాల పరిధిలో యాత్ర సాగింది. మల్కాజ్గిరి లోక్‌సభస్థానం పరిధిలోని అసెంబ్లీ నియోజ వకవర్గాలు, అలాగే ఇబ్రహీంపట్నం శాసనసభా నియోజక వర్గంలో సాగిన నాలుగో విడతలో హైదరాబాద్, శివారు ప్రాంతాల్లోని రోడ్లు, డ్రైనేజీలు, పరిశ్రమల కాలుష్యం, డంపింగ్ యార్డు.. వంటి సమస్యలపై గళం ఎత్తారు. టీఆర్ఎస్ వైఫల్యాలు ఎండగట్టేందుకే మొగ్గు.. పాదయాత్ర సభల్లో బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, జేపీ నడ్డా, జి.కిషన్‌రెడ్డి సహా పలువురు కేంద్రమంత్రులు, బండి సంజయ్ టీఆర్ఎస్ పాలనా వైఫల్యాలను ఎండగట్టడానికి ప్రాధాన్యతనిచ్చారు. కేసీఆర్ హామీల అమల్లో వైఫల్యాలు, కేసీఆర్ కుటుంబ పాలన, నియంతృత్వ విధానాలపై విమర్శలు ఎక్కుపెట్టారు. కాగా, నెలలో 20 రోజుల పాటే పాదయాత్ర చేపట్టాలని, మిగతా పది రోజులు హైదరా బాద్‌లో ఉంటూ పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర నాయకులను జాతీయ నాయకత్వం ఆదేశించింది. ఈ నేపథ్యంలో బండి సంజయ్ మొత్తం 8 విడతల్లో వంద అసెంబ్లీ స్థానాల్లో పాదయాత్ర పూర్తి చేయాలని నిర్ణయించారు. ఐదో విడత యాత్రను అక్టోబర్ 8–10 తేదీల మధ్య మొదలు పెట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. -
‘ఖాసీం చంద్రశేఖర్ రజ్వీని గద్దె దింపుతాం’
మల్కాజిగిరి (హైదరాబాద్): నిరంకుశ పాలన చేస్తున్న ఖాసీం చంద్రశేఖర్ రజ్వీ (కెసీఆర్)ని గద్దె దింపుతామని బీజెపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. సంజయ్ నాలుగో విడవ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఆదివారం మల్కాజిగిరి వెంకటేశ్వరనగర్ నుంచి పాదయాత్ర ప్రారంభమైంది. ఈ సందర్భంగా మల్కాజిగిరి చౌరస్తాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో 1,450 మంది ప్రాణ త్యాగం చేశారన్నారు. కానిస్టేబుల్ కిష్ణయ్య, శ్రీకాంతాచారి లాంటి పేదవాళ్లు ప్రాణత్యాగం చేస్తే వచ్చిన రాష్ట్రాన్ని పెద్దోడు ఏలుతున్నారని అన్నారు. ప్రజలు కాంగ్రెస్, టీఆర్ఎస్కు ఓటు వేస్తే మజ్లిస్‌కు వేసినట్లేనన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్లకు అవకాశమిచ్చారని.. ఒక్కసారి బీజేపీకి అవకాశమిస్తే మోదీ నాయకత్వంలో నీతివంతమైన పాలన అందిస్తామని పేర్కొన్నారు. కేంద్రం 2.4 లక్షల ఇళ్లు కేటాయిస్తే ఈ ప్రాంతం వారికి ఒక్కటైనా వచి్చందా? అని ప్రశ్నించారు. ఎంఎంటీఎస్ కోసం కేంద్రం రూ.600 కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం తనవంతు నిధులు మంజూరు చేయలేకపోయిందన్నారు. మల్కాజిగిరిలో టీఆర్ఎస్ నాయకులు భూ కబ్జాలకు పాల్పడ్డారన్నారు. సమస్యలపై ప్రశి్నస్తే టీఆర్ఎస్ నాయకులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. ప్రజల కోసం ఎన్ని కేసులైనా ఎదుర్కొంటామని, ఎన్ని సార్లయినా జైలుకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి..: నాలుగువేల ఐదువందల మంది ప్రాణత్యాగం చేస్తే తెలంగాణకు నిజాం నుంచి విముక్తి లభించిందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ మహిళలను వివస్త్రలు చేసి ఆటాడిపించిన రజాకార్లు, నిజాంకు వత్తాసు పలుకుతున్న కెసీఆర్‌కు సిగ్గులేదన్నారు. దీనికి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలన్నారు. దారుసలాం నుంచి ఒవైసీ.. కేసీఆర్, కేటీఆర్‌లకు కృతజ్ఞతలు చెబుతున్నాడంటే ప్రభుత్వం ఎవరి కనుసైగల్లో నడుస్తున్నదో ప్రజలు గమనించాలన్నారు. పాతబస్తీలో పాకిస్తాన్ జెండాలు పట్టుకున్న చేతులు ఈ రోజు జాతీయ జెండాను పట్టుకున్నాయంటే బీజెపీ వల్లనే నన్నారు. ఎస్టీ రిజర్వేషన్ల గురించి మాట్లాడుతున్న కెసీఆర్.. ఇన్ని రోజులు కేంద్రం అడ్డుకుందని చెప్పి వారిని మోసగించారన్నారు. గిరిజనులకు పోడుభూములకు పట్టాలు ఇవ్వని కేసీఆర్, వారు పండించుకున్న పంటను సైతం నాశనం చేసి.. మహిళలను కూడా అరెస్ట్ చేశారన్నారు. ఎస్టీ సోదరులు ఈ సంఘటనలు గుర్తుంచుకోవాల్సిన అవసరముందన్నారు. కాగా, ఈ సందర్భంగా కురుమ రిజర్వేషన్ పోరాట సమితి నాయకులు వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని బండి సంజయ్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి విజయరామారావు, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కార్పొరేటర్లు శ్రవణ్, రాజ్యలక్ష్మి, సునీతా యాదవ్, జిల్లా అధ్యక్షుడు హరీశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇదీ చదవండి: ఈడీ లేకుంటే బీజేపీనే లేదు -
కేసీఆర్ జాతీయ పార్టీ.. పెద్ద జోక్
సాక్షి, మేడ్చల్ జిల్లా: ‘కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టడమనేది ఈ దశాబ్దంలోనే అతిపెద్ద జోక్’ అని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. దేశంలో ఎన్డీఏకు ఎప్పటికీ కేసీఆర్ ప్రత్యామ్నాయం కాలేరన్నారు. దేశంలో కుటుంబపాలన తేవాలనే లక్ష్యంతో కుటుంబ పార్టీలన్నిటినీ కేసీఆర్ కలిపే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సోమవారం కుత్బుల్లాపూర్‌లో ప్రారంభమైన ప్రజాసంగ్రామయాత్రలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ 17 స్థానాల్లో ఒక్క సీటు కూడా గెలవదన్నారు. తమ పార్టీ విద్యుత్ మోటార్లకు మీటర్లు పెట్టదని, కేసీఆర్ అవినీతికి మాత్రం తప్పకుండా మీటర్లు పెడుతుందన్నారు. తెలంగాణలో విద్యుత్ ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి ఉందన్నారు. మజ్లిస్‌కు భయపడే.. మజ్లిస్‌కు, ఒవైసీకి బీజేపీ భయపడదని కిషన్‌రెడ్డి అన్నారు. కేసీఆర్ మజ్లిస్ పార్టీ మోచేతి నీళ్లు తాగుతున్నారని, కేసీఆర్ సీఎం కుర్చీలో కూర్చున్నా.. స్టీరింగ్, బ్రేక్ మాత్రం ఒవైసీ చేతిలోనే ఉన్నాయన్నారు. ‘8వ నిజాం కేసీఆర్. ఆయనలాంటి అరాచక వ్యక్తి, అవినీతిపరుడు ఇంకెవరూ లేరు. కల్వకుంట్ల కుటుంబానికి తెలంగాణను దోచుకున్నది సరిపోవట్లేదు. దేశంలోని బీజేపీయేతర పార్టీలకు కేసీఆర్ ఎలా డబ్బులు పంపిస్తున్నాడో ప్రజలందరికీ తెలుసు. దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాలు, కేజీ టు పీజీ హామీలు ఏమయ్యాయి? సంక్షేమ హాస్టళ్లలో కలుషితాహారం తిని విద్యార్థులు మరణిస్తున్నారు. ఏం చేశాడని ఇలాంటి వ్యక్తి పాలన దేశానికి కావాలి?. తెలంగాణనే పరిపాలించే సత్తాలేని కేసీఆర్ దేశాన్ని ఉద్ధరిస్తానంటే ప్రజలు నమ్ముతారా?’ అని ఆయన ధ్వజమెత్తారు. కేసీఆర్ తెలంగాణలో చెల్లని రూపాయని, ఇక దేశంలో చెల్లుతుందా? అని అన్నారు. ప్రజా ఉద్యమాలను అడ్డుకోవడం, ప్రజలకు అందుబాటులో లేకపోవడమే తెలంగాణ మోడలా? అని కిషన్‌రెడ్డి వ్యంగ్యంగా అన్నారు. రజాకార్లను ఉరికించిన చరిత్ర తెలంగాణదని, ఖాసీంరజ్వీ పాకిస్తాన్‌కి పారిపోగా, అతడి చెంచాలను చంకలో పెట్టుకుని కేసీఆర్ తిరుగుతున్నాడన్నారు. లక్షమంది కేసీఆర్‌లు, లక్షమంది ఒవైసీలు వచ్చినా 2024లో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనన్నారు. ప్రజాసంగ్రామయాత్రతో కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని, బండి సంజయ్ యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు.