
సాక్షి, జనగామ: జిల్లాలోని దేవరుప్పుల ఘటనతో పోలీస్ సెక్యూరిటీని బండి సంజయ్ నిరాకరించారు. భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకోవాలని తేల్చి చెప్పారు. ఆయన భద్రతను తన కార్యకర్తలే చూసుకుంటారన్నారు. బీజేపీ కార్యకర్తల తలల పగలకొడుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ చేతకాకుంటే సీపీ ఇంట్లో కూర్చోవాలన్నారు.
దాడి ఘటనపై వెంటనే డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర ప్రశాంతంగా జరిగేలా చాడాలని అన్నారు. లేదంటే గాయపడ్డ కార్యకర్తలను తమ దగ్గరికి తీసుకొస్తానని సవాల్ విసిరారు. జరగబోయే పరిణామాలకు పోలీసులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. పోలీసులకు జీతాలు కేసీఆర్ జేబుల్లోంచి ఇస్తున్నారా? అని నిలదీశారు.
చదవండి: బండి సంజయ్ పాద్రయాత్రలో ఉద్రిక్తత.. బీజేపీ, టీఆర్‌ఎస్ నేతల మధ్య ఫైట్
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తిన విషయం తెలిసిందే. దేవరుప్పల సభలో సంజయ్ ప్రసంగిస్తుండగా.. టీఆర్‌ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. టీఆర్‌ఎస్ సర్కార్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని బండి సంజయ్ ప్రశ్నించారు. దేశంలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని సంజయ్‌ను టీఆర్‌ఎస్ నేత అడగడంతో వివాదం మొదలైంది.
టీఆర్ఎస్ కార్యకర్తలు సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య ఘర్షమ జరిగింది. పరస్పరం రాళ్లు విసురుకున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు.
Comments
Please login to add a commentAdd a comment