
సాక్షి రంగారెడ్డి జిల్లా: కృష్ణా నదీజలాల పంపిణీ విషయంలో సీఎం కేసీఆర్ అప్పటి ఏపీ సీఎం చంద్రబాబుతో కుమ్మకై తెలంగాణకు తీరని అన్యా యం చేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ య్ ఆరోపించారు. 575 టీఎంసీల నీటివాటాను 299 టీఎంసీలకు తగ్గించేందుకు అంగీకరించి దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేసిన మూర్ఖుడు కేసీఆర్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
సంజయ్ చేపట్టిన ప్రజాసంగ్రామ పాదయాత్ర మంగళవారం రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం తొమ్మిదిరేకుల గ్రామానికి చేరుకుంది. అక్కడ సభలో ఆయన మాట్లాడుతూ.. కృష్ణా జలాల కేటాయింపులో కేసీ ఆర్ పాల్పడిన అక్రమాలను ఆధారాలతోసహా బయటపెట్టడానికి తాను సిద్ధంగా ఉన్నానని, అయితే కేసీఆర్ ఇందుకు సిద్ధమేనా అంటూ సవాల్ విసిరారు.
కేసీఆర్ చర్యల వల్ల ఉమ్మడి పాలమూ రు, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాలకు తీరని అన్యా యం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర నిధులతో రాష్ట్రం అభివృద్ధి అవుతోందని, కేంద్రం వాటా లేకుండా వైకుంఠధామాలు, రైతువేదికలు, పల్లె ప్రకృతివనాలు వచ్చేవా అని అన్నారు.
కరెంటు చార్జీలపై రెఫరెండం పెట్టాలి
సాక్షి.హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యు త్ చార్జీలను వెంటనే ఉపసంహరించాలని లేదంటే, ఈ అంశంపై ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధం కావా లని సీఎం కేసీఆర్‌ను సంజయ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఎనిమిదేళ్లుగా అనుసరిస్తున్న విధానాలతో టీఆర్ ఎస్ ప్రభుత్వం ప్రజలపై రూ.6 వేల కోట్ల విద్యుత్ చార్జీల భారం మోపిందన్నారు. ‘విద్యుత్‌చార్జీల పెంపుదలపై బీజేపీ రెఫరెండం నిర్వహిస్తుంది. దానికి మీరు సిద్ధమా?’అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment