సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఘాటు విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఎంతమందికి ఇచ్చారని ప్రశ్నించారు. బీసీ బంధు ఇస్తారా? నిరుద్యోగులకు ఉద్యోగాలు ప్రకటిస్తారా అని నిలదీశారు. నెలలో సగం రోజులు సీఎం కేసీఆర్ ఫాం హౌజ్‌లో ఉంటారని, మిగతా సగం రోజులు మోదీని తిట్టడానికే సరిపోతుందని దుయ్యబట్టారు.
యాదాద్రి నుంచి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మూడో విడుత ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పాలిట కేసీఆర్ శాపంగా మారారు. దేశాన్ని ఉద్ధరించడం కాదని, ముందు రాష్ట్ర సమస్యలపై స్పందిచాలి. ఈడీ గురించి మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌కు లేదు. కేజీ టు పీజీ ఏమైంది. ఏడాది తరువాత రాష్ట్రంలో మార్పు వస్తుంది. మజ్లిస్, టీఆర్‌ఎస్ దొంగాట ఆడుతున్నాయి’ అని మండిపడ్డారు.
చదవండి: ఎంపీ నామా కొడుకుపై దుండగుల దాడి.. కత్తితో బెదిరించి
Comments
Please login to add a commentAdd a comment