సాక్షి,హైదరాబాద్ : సీఎం రేవంత్‌రెడ్డి భాష మార్చుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై చర్చకు తాను సిద్ధమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఏడాది పాలన వైఫల్యాలపై 6 అబద్ధాలు.. 66 మోసాలు.. పేరిట కిషన్‌రెడ్డి ఛార్జిషీట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..
భాష మార్చుకుంటేనే రేవంత్‌రెడ్డితో చర్చకు వస్తాం.కేసీఆర్ లాగా అదే భాష కాకుండా.. నిర్మాణాత్మక అంశాలపై మేము చర్చకు సిద్ధం. కుల గణనను మేము వ్యతిరేకించడం లేదు. జాబ్ క్యాలెండర్ ప్రకారం.. గ్రూప్ 1, 2, 3, 4 నియామకాలు ఎప్పుడో పూర్తవ్వాలి. ఇప్పటి వరకు ఫస్ట్ ఫేస్ కూడా పూర్తికాలేదు.షెడ్యూల్ ప్రకారం ఇప్పటివరకు ఏదీ పూర్తవ్వలేదు.బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు.. భూసేకరణ చేపట్టవద్దని కాంగ్రెస్ నేతలు ధర్నాలు చేశారు.
కాంగ్రెస్ కూడా భూసేకరణ చేపట్టే సమయంలో పద్ధతి ప్రకారం చేయాలి.. రైతులతో మాట్లాడి పరిష్కారం చేసుకోకుండా రైతులపై దాడులా..ప్రజాభీష్టం మేరకు ప్రభుత్వం నడుచుకోవాలి.ఫామ్ హౌజ్‌లో ఉన్న కేసీఆర్‌తో కాంగ్రెస్ సంబంధాలు పెట్టుకుంది
కేసీఆర్ పుట్టిందే కాంగ్రెస్‌లో..కాంగ్రెస్ హయాంలో మంత్రిగా పనిచేశారు. రేవంత్ దృష్టిలో ఆయన్ను ప్రశ్నించే వారు.. వార్తలు రాసేవారు కూడా మానవ మృగాలే. కాంగ్రెస్ మేనిఫెస్టో అమలుకు ఆర్థిక వనరులు ఎలా సమకూర్చుకోవాలో కూడా రోడ్డు మ్యాప్ లేదు’అని మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment