సాక్షి, హైదరాబాద్(గోల్కోండ): మొదటి, రెండవ విడత ప్రజాసంగ్రామ యాత్రల్లో బీజేపీ సీనియర్ నాయకులు దేవర శ్రీనివాస్ అలుపెరగకుండా యాత్ర భోజన విభాగానికి పనిచేశారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన దేవర శ్రీనివాస్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు పరిచయం చేశారు.
ప్రజాసంగ్రామ యాత్రలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలందరి తలలో నాలుకగా వ్యవహరించే దేవర శ్రీనివాస్ ప్రతి ఒక్కరి మన్ననలు పొందారని అమిత్‌షాకు వివరించారు. ఒక్కపూట భోజన పదార్థాల్లో రుచి తగ్గకుండా జయప్రదంగా తన బాధ్యతను నిర్వర్తించారని అన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి అమిత్ షా దేవర శ్రీనివాస్‌ను శెభాష్ అంటూ కితాబిచ్చారు.
చదవండి: (బండి సంజయ్‌కు మోదీ ఫోన్.. ‘హౌ ఆర్యూ బండి..శభాష్’)
Comments
Please login to add a commentAdd a comment