
హైదరాబాద్: నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్‌పై టీఆర్‌ఎస్ నాయకులు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, సీఎం కేసీఆర్ నియంత వైఖరిని ప్రశ్నిస్తే జీర్ణించుకోలేక భౌతిక దాడులకు తెగబడటం సిగ్గు చేటన్నారు. ఇది మూమ్మాటికీ పిరికిపంద చర్య అని బండి సంజయ్ మండిపడ్డారు.
‘ప్రజాస్వామ్యవాదులంతా టీఆర్ఎస్ దుశ్చర్యలను ముక్తకంఠంతో ఖండించాలని కోరుతున్నా. టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి. సీఎం కేసీఆర్ పాలనను, టీఆర్ఎస్ నేతల తీరును ప్రజల అసహ్యించుకుంటున్నారు. అయినా వారిలో మార్పు రాకపోగా ప్రశ్నించే వారిపై భౌతిక దాడులకు తెగబడటం వారి అవివేకానికి నిదర్శనం.టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేదు. ప్రజా సమస్యలపై నిలదీస్తూనే ఉంటాం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరును కొనసాగిస్తూనే ఉంటాం’ అని అన్నారు బండి సంజయ్.
Comments
Please login to add a commentAdd a comment