సాక్షి,హైదరాబాద్ : రైతు భరోసా చెల్లింపుల కోసం భూముల్ని తాకట్టుపెట్టి వేలకోట్లు అప్పుగా తెచ్చారు. మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలిందని కాంగ్రెస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ ప్రశ్నలు సంధించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.‘ఇంకెన్నాళ్లీ డైవర్షన్ పోలిటిక్స్. ప్రజలను మోసం చేయడంలో కాంగ్రెస్ గురువు కేసీఆర్ (kcr).ఆయన బాటలోనే రేవంత్ (revanth reddy) ప్రభుత్వం నడుస్తోంది.
ఒక్కో రైతుకు ఏడాది బకాయితో కలిసి ఎకరాకు రూ.18 వేల బకాయి చెల్లిస్తారా?.70 లక్షల మంది రైతులకు రూ.12 వేల 600 కోట్లు జనవరి 26న చెల్లిస్తారా? లేదా?.రైతు భరోసా (rythu bharosa) సొమ్ము చెల్లించేందుకు టీఎస్ఐఐసీ భూములను తాకట్టు పెట్టి రూ.10 వేల కోట్లు తెచ్చారు? మరి వచ్చే దఫా రైతు భరోసా సొమ్ము కోసం మీ దగ్గర తాకట్టు పెట్టడానికి ఇంకేం మిగిలింది?
లోకల్ బాడీ ఎలక్షన్లలో ఓట్లేయించుకునేందుకే అప్పు తెచ్చి రైతు భరోసా చెల్లిస్తున్నారు. ఎన్నికల తర్వాత రైతు భరోసా ఆపేయడం ఖాయం.తెలంగాణ ప్రజాలారా..కాంగ్రెస్ మోసాలను తెలుసుకోండి.
ఫాంహౌజ్‌లో పడుకునే కేసీఆర్..మీకు ప్రతిపక్ష నేత పదవి ఎందుకు?.ప్రజా సమస్యలపై స్పందించని మీరే ప్రతిపక్ష నేత? చేతనైతే ఆ పదవిని హరీష్, గంగుల, తలసాని, జగదీష్ రెడ్డిలలో ఎవరికైనా ఇచ్చే దమ్ముందా?.ఫీజు రీయంబర్స్ మెంట్, ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులు, పేదలు అల్లాడుతున్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి అంతు లేకుండా పోయింది’అని బండి సంజయ్ ఆరోపించారు.
👉ఇదీ చదవండి : ‘రేవంత్‌ను వదిలిపెట్టం’
Comments
Please login to add a commentAdd a comment