సాక్షి,తెలంగాణ భవన్ : మోసానికి, నయ వంచనకు కాంగ్రెస్ (Congress) కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) మండిపడ్డారు. ప్రస్తుత, రాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..మోసం,నయ వంచనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తుంది. కేసీఆర్ చెప్పినట్టే కాంగ్రెస్ మోస పూరిత హామీలు ఇచ్చింది. సోనియా గాంధీ మాటగా రూ.15 వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు.
కేసీఆర్ రైతు బంధుగా..రేవంత్‌రెడ్డి రాబందుగా
వరంగల్ డిక్లరేషన్ కింద రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా (Rythu bharosa) కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం రూ.12 వేలకు కుదించి రైతులకు తీరని ద్రోహం చేస్తోంది. దేశంలోనే కేసీఆర్ రైతుబంధుగా..రేవంత్‌రెడ్డి రాబందుగా మిగిలిపోతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు.
👉చదవండి : రైతు భరోసాపై రేవంత్ పేచీ..
ఓడ దాటేంత వరకు ఓడ మల్లన ..
ఓడ దాటగా బోడ మల్లన అన్నటుగా కాంగ్రెస్ ప్రభుత్వ నైజం మరోసారి బయట పడింది. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను కించ పరిచేలా, చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారు. పథకాలు హామీల విషయంలో రేవంత్‌వి దివాలాకోరు మాటలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితే బాగలేదు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని రైతులను,మహిళలను,ఓటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడికి పోయాయి. రుణ మాఫీ, రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీకి మూటలు పంపుతున్నారు తప్పితే ..రైతుల గురించి పట్టించుకోవడం లేదు. రూ.5,493 కోట్ల రెవెన్యూ సర్‌ప్లేస్‌ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించాం. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్‌సీ, డీఏలు ఎగ్గొట్టేలా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి.ప్రతి రైతుకు రూ.17,500 ఎకరాకి ఇచ్చే వరకు రేవంత్‌ను వదిలి పెట్టం.
రేపు రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నిరసనలు
రైతులకు సంఘీ భావంగా రేపు అన్ని జిల్లాలో, నియోజక వర్గాల్లో, మండలాల్లో నిరసనలు చేపడుతాం. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల గండాన్ని తప్పించుకునేందుకే ఎకరానికి రూ. 12 వేలు ఇస్తామని కాంగ్రెస్ డ్రామా ఆడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా పధకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టె ప్రయత్నం చేస్తోంది’ అని కేటీఆర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment