Rythu Bandhu
-
నేను కొడితే.. వట్టిగ ఉండదు: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్రంలో జరుగుతున్న విషయాలను నేను గంభీరంగా, మౌనంగా చూస్తున్నా.. నాకు కొడితే వట్టిగా కొట్టుడు అలవాటు లేదు కదా. నాలుగు రోజులు కానీయ్ అన్నట్లు చూస్తున్నా. కాంగ్రెస్(congress party) అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిపోయింది. సంగమేశ్వర, బసవేశ్వర, పాలమూరు ఎత్తిపోతల పథకాలు నిలిచిపోయాయి. కాళేశ్వరం ప్రాజెక్టు(Kaleshwaram Project) ను ఎండబెడుతున్నరు. ఈ అన్యాయాలపై ఫిబ్రవరి నెలాఖరులో బహిరంగ సభ పెట్టి వీళ్ల సంగతి చూడాలి. పెద్ద ఎత్తున సభకు తరలివచ్చి తెలంగాణ శక్తిని మరోమారు చాటాలి. కాంగ్రెస్ మెడలు వంచి భవిష్యత్తు కోసం కొట్లాడాలి’ అని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు(Kcr) పిలుపునిచ్చారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం ఝరాసంగం మండలం మేదపల్లి గ్రామం నుంచి వందలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు 140 కిలోమీటర్లు పాదయాత్ర చేసి శుక్రవారం ఎర్రవల్లిలోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘మన పార్టీకి కులం, మతం, జాతి అనే భేదభావం లేదు. తెలంగాణ సరిహద్దు లోపల ఉన్న వారందరికీ న్యాయం జరిగి బాగుపడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే కొట్లాడేందుకు ఎవరూ ముందుకు రారు. ప్రాణం పోయినా సరే తెలంగాణకు రక్షకులం మనమే. తెలంగాణ హక్కుల కోసం తెగించి కొట్లాడాల్సింది బీఆర్ఎస్ అనే విషయంలో రెండో మాటే లేదు. ప్రత్యక్ష ప్రజా పోరాటాలు లేవదీసైనా సరే ప్రాజెక్టులు, నీళ్లు సాధించుకోవాలి. అవసరమైన సందర్భంలో నేను, జిల్లా నాయకులు ఇచ్చే పిలుపునకు స్పందించి ప్రజలకు జరిగే అన్యాయాలపై ఎదురు తిరిగి కొట్లాడాలి. తెలంగాణ కోసమే బయలుదేరిన గులాబీ జెండా తెలంగాణను సాధించి దేశంలోనే నంబర్ వన్‌గా నిలబెట్టింది. కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు.. ఇన్నాళ్లూ కోటి రూపాయలు పలికిన భూమిని ఇప్పుడు రూ.50లక్షలకు కొనే పరిస్థితి లేదు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి మార్చి వరకు రూ.15వేల కోట్ల ఆదాయం తగ్గుతోందని కాగ్ రిపోర్టు చెబుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏటా ఆదాయంలో రూ.15 వేల కోట్ల వృద్ధిని సాధించింది. ఇప్పుడు మరో నాలుగైదు నెలల్లో ఉద్యోగులకు జీతాలు ఇవ్వడమే కష్టమనే పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇవ్వలేని విధంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారు.మనం ప్రాజెక్టులు, చెరువుల కింద నీటి తీరువా రద్దు చేసి రైతులకు ఎన్నో సదుపాయాలు కల్పించాం. కానీ కొన్ని నియోజకవర్గాల్లో అత్యాశకు పోయి ఓట్లేసి బావిలో పడ్డారు. మంది మాటలు పట్టుకుని మార్వాణం పోతే మళ్లీ వచ్చేసరికి ఇల్లు ఆగమైందన్నట్టు పరిస్థితి తయారైంది. తులం బంగారం ఇస్తామంటే నమ్మి ఓటేస్తే ఏమవుతుందో తెలంగాణలో మంచి గుణపాఠం అయింది. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు కాంగ్రెస్ మోసాలకు బలయ్యారు. ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నరు.. రైతుబంధుతో వ్యవసాయం మెరుగై అప్పులు తీర్చుకుని, చిట్టీలు వేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడా సంతోషం మంటగలిసింది. వాళ్లు ఎన్నికల సమయంలో ఇస్తరో ఎప్పుడు ఇస్తరో దేవుడికే ఎరుక. కరోనా సమయంలో మేం రైతుబంధు ఇచ్చి రైతులను కాపాడుకున్నాం. కాంగ్రెస్ పార్టీ ముస్లింల ఓట్లు వేయించుకుని వారి బాగోగులను పట్టించుకోవడంలేదు. మనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకుల పాఠశాలల ద్వారా పేద విద్యార్థులకు కాన్వెంట్ విద్య అందిస్తే.. ఇప్పుడు పిల్లలు విషాహారం, పురుగుల అన్నం, కడుపునొప్పితో ఇంటి బాట పడుతున్నరు. కాంగ్రెస్ పాలన లోపాలను ప్రశ్నిస్తే పోలీసు స్టేషన్లకు పట్టిస్తున్నారు. ఏడాది పాలనతోనే కాంగ్రెస్ వాళ్లు దొరికితే కొడతం అన్నట్లుగా జనం ఉన్నరు. ఫామ్‌హౌజ్‌కు వస్తే పార పట్టొచ్చు వాళ్ల పార్టీ నిన్న ఒక పోలింగ్ పెట్టింది. అందులో 70శాతం మనకు, 30శాతం వాళ్లకు వచ్చింది. ఫామ్ హౌజ్ అంటే ఇక్కడ వరి, మక్కలు, అల్లం తప్ప ఏముంటది. కాంగ్రెస్ వాళ్లు వస్తే తలాకొంత సేపు పారపట్టి పనిచేయచ్చు. ఫామ్‌హౌజ్ అని బదనాం చేసి అధికారంలోకి వచ్చారు. ఏడాదిలోనే కాంగ్రెస్ పాలనకు విసిగి మళ్లీ మనమే రావాలని ప్రజలు వందశాతం కోరుకుంటున్నరు. కచ్చితంగా రాబోయే ప్రభుత్వం మనదే..’’ అని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రైతులను సమీకరించి ఉద్యమం జహీరాబాద్ నియోజకవర్గంలో సంగమేశ్వర, బసవేశ్వర లిఫ్టులను బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసినా.. ప్రస్తుత ప్రభుత్వం ఆ పనులు నిలిపివేసి రైతులను ఇబ్బందులు పెడుతోందని కేసీఆర్ మండిపడ్డారు. రైతులకు నష్టం జరుగుతుంటే ఆ జిల్లా మంత్రి ఏం చేస్తున్నారని నిలదీశారు. దీనిపై రైతులను భారీ స్థాయిలో సమీకరించి ఉద్యమం చేపట్టాలని మాజీ మంత్రి హరీశ్‌రావుకు కేసీఆర్ సూచించారు.పాదయాత్రగా ఎర్రవల్లికి వచ్చిన మాజీ సర్పంచులు పరమేశ్వర్ పాటిల్, బోయిని చంద్రయ్య, పార్టీ నేతలు సంగమేశ్వర్, ప్రశాంత్, బోయిని శ్రీనివాస్, ప్రదీప్ తదితరులు కేసీఆర్‌ను సత్కరించి కేతకీ సంగమేశ్వర స్వామి ఆలయ ప్రసాదం అందజేశారు. సమావేశంలో ఎమ్మెల్యేలు మాణిక్ రావు, సునీతా లక్ష్మారెడ్డి, చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. -
‘రేవంత్‌ను వదలిపెట్టం’
సాక్షి,తెలంగాణ భవన్ : మోసానికి, నయ వంచనకు కాంగ్రెస్ (Congress) కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Ktr) మండిపడ్డారు. ప్రస్తుత, రాష్ట్ర రాజకీయాలపై కేటీఆర్ మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ..మోసం,నయ వంచనకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ అపహాస్యం చేస్తుంది. కేసీఆర్ చెప్పినట్టే కాంగ్రెస్ మోస పూరిత హామీలు ఇచ్చింది. సోనియా గాంధీ మాటగా రూ.15 వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. కేసీఆర్ రైతు బంధుగా..రేవంత్‌రెడ్డి రాబందుగా వరంగల్ డిక్లరేషన్ కింద రాహుల్ గాంధీ స్వయంగా రైతు భరోసా (Rythu bharosa) కింద ఎకరాకు రూ.15 వేలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వం రూ.12 వేలకు కుదించి రైతులకు తీరని ద్రోహం చేస్తోంది. దేశంలోనే కేసీఆర్ రైతుబంధుగా..రేవంత్‌రెడ్డి రాబందుగా మిగిలిపోతారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని విస్మరిస్తున్నారు. 👉చదవండి : రైతు భరోసాపై రేవంత్ పేచీ..ఓడ దాటేంత వరకు ఓడ మల్లన ..ఓడ దాటగా బోడ మల్లన అన్నటుగా కాంగ్రెస్ ప్రభుత్వ నైజం మరోసారి బయట పడింది. సీఎం రేవంత్ రాష్ట్రాన్ని, ప్రభుత్వ ఉద్యోగులను కించ పరిచేలా, చిన్న చూపు చూసేలా మాట్లాడుతున్నారు. పథకాలు హామీల విషయంలో రేవంత్‌వి దివాలాకోరు మాటలు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ పరిస్థితే బాగలేదు.రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని రైతులను,మహిళలను,ఓటర్లను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోంది. లక్షా ముప్పై ఎనిమిది వేల కోట్లు ఎక్కడికి పోయాయి. రుణ మాఫీ, రైతు రుణమాఫీ కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. ఢిల్లీకి మూటలు పంపుతున్నారు తప్పితే ..రైతుల గురించి పట్టించుకోవడం లేదు. రూ.5,493 కోట్ల రెవెన్యూ సర్ప్లేస్ని కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పగించాం. ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీ, డీఏలు ఎగ్గొట్టేలా రేవంత్ రెడ్డి మాటలు ఉన్నాయి.ప్రతి రైతుకు రూ.17,500 ఎకరాకి ఇచ్చే వరకు రేవంత్‌ను వదిలి పెట్టం.రేపు రాష్ట్రంలో బీఆర్ఎస్ నిరసనలురైతులకు సంఘీ భావంగా రేపు అన్ని జిల్లాలో, నియోజక వర్గాల్లో, మండలాల్లో నిరసనలు చేపడుతాం. కాంగ్రెస్ పార్టీ స్థానిక ఎన్నికల గండాన్ని తప్పించుకునేందుకే ఎకరానికి రూ. 12 వేలు ఇస్తామని కాంగ్రెస్ డ్రామా ఆడుతోంది. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత రైతు భరోసా పధకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బొంద పెట్టె ప్రయత్నం చేస్తోంది’ అని కేటీఆర్ ఆరోపించారు. -
ఒక్క రూపాయి అయినా ఇచ్చావా రేవంత్!
-
రైతు సాయానికి కోతలు పెట్టే కుట్ర
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయంలో కోతలు పెట్టేందుకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే రైతు బంధుపై దుష్ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ఎలాంటి ఆంక్షలు, కత్తిరింపులు లేకుండా రైతు భరోసా అమలు చేయాలని డిమాండ్ చేశారు. శాసనసభలో శనివారం రైతు భరోసా అంశంపై స్వల్పకాలిక చర్చ జరిగింది. వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చర్చను ప్రారంభిస్తూ.. ఈ పథకంపై సభ్యులు సూచనలు చేయాలని, దీని ఆధారంగా విధివిధానాలు రూపొందిస్తామని తెలిపారు.కేటీఆర్ ఈ చర్చలో మాట్లాడారు. ‘‘రైతు భరోసాకు రూ.23 వేల కోట్లు అవసరమైతే రూ.15 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించడం కోత విధించడానికే. రైతు భరోసాపై మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదికను ప్రజల ముందుంచాలి. ఎన్నికల హామీ ప్రకారం రాష్ట్రంలో ఉన్న 22 లక్షల మంది కౌలుదార్లకు కూడా రైతు భరోసా ఇస్తారా?’’అని ప్రశ్నించారు. ప్రభుత్వం యాసంగి, వానాకాలం కలిపి ఒక్కో రైతుకు రూ.17,500 చొప్పున... రైతులందరికీ కలిపి రూ.26,775 కోట్లు బాకీ పడిందని చెప్పారు. గెలిచిన వెంటనే ఎకరానికి రూ.15 వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఆంక్షలు లేకుండా పెట్టుబడి సాయం ఇవ్వాలిరైతులు పచ్చగా ఉంటే కొంతమంది కళ్లు మండుతున్నాయని కేటీఆర్ విమర్శించారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో 98 శాతం సన్న, చిన్నకారు రైతులే ఉన్నారని తెలిపారు. 91.33 శాతం లబ్ధిదారులు ఐదెకరాల కంటే తక్కువ ఉన్నవారేనని.. 5 నుంచి 10 ఎకరాలు 7.28 శాతం మందికే ఉన్నాయని, 10 ఎకరాలు పైబడి ఉన్నవాళ్లు 1.39 శాతమేనని పేర్కొన్నారు. 25 ఎకరాలపైన ఉన్న పెద్ద రైతులు కేవలం 0.09 శాతం మాత్రమేనని చెప్పారు.రైతుబంధు నిధుల్లో 70 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల ఖాతాల్లోనే పడ్డాయని వివరించారు. గిరిజనులకు చెందిన 4.5 లక్షల ఆర్వోఎఫ్ఆర్ భూములకు, పత్తి, కంది ఉద్యానవనాలకు రైతు భరోసా ఇస్తారా? లేదా? చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరిగే వరకు కూడా ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతు బంధు ఇవ్వాలన్నదే తమ ఉద్దేశమని తెలిపారు.రుణమాఫీ నిరూపిస్తే రాజీనామా.. ‘‘రాష్ట్రంలో ఏ గ్రామంలోనైనా వంద శాతం రుణమాఫీ జరిగినట్టు కాంగ్రెస్ సర్కారు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా. రుణమాఫీకి రూ.49,500 కోట్లు అవసరమని లెక్క తేల్చారు. రూ.40 వేల కోట్లు అవుతుందని సీఎం అన్నారు. కేబినెట్లో రూ.31 వేల కోట్లు అన్నారు. తీరా బడ్జెట్లో రూ.26 వేల కోట్లు కేటాయించారు. ఆఖరుకు రూ.17,934 కోట్లే మాఫీ చేశారు..’’అని కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎక్కడన్నా 24 గంటల ఉచిత విద్యుత్ అందించినట్టు లాక్బుక్కుల్లో చూపిస్తే తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు.నల్లగొండకు నీళ్లు ఇచ్చిన అంశంపై ఆ జిల్లాలోనే తేల్చేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు చేపట్టి వలసలు ఆపామని చెప్పారు. తెలంగాణలో ఎవరైనా చనిపోతే స్నానానికి కూడా నీళ్లు లేని పరిస్థితి ఉందని గతంలో కాంగ్రెస్ పారీ్టపై సీఎం రేవంత్ చేసిన విమర్శలను కేటీఆర్ గుర్తు చేశారు. రైతుబంధు వల్ల రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తి పెరిగిందని కేటీఆర్ తెలిపారు.రుణమాఫీపై చర్చిద్దాం.. రెడీనా?సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ ఇచ్చిన మాట మేరకు పెట్టుబడి సాయం పెంచి ఇవ్వాల్సిందేసాక్షి, హైదరాబాద్: మొత్తం రుణమాఫీ చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెబుతున్నారని... దీనిపై ఆయన స్వగ్రామం కొండారెడ్డిపల్లిలో అయినా, సొంత నియోజకవర్గం కొడంగల్లోనైనా రైతుల ముందు చర్చిద్దామా? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కె.తారక రామారావు సవాల్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘రుణమాఫీ విషయంలో సీఎం రేవంత్‌రెడ్డి బండారం బయటపడటంతో అసెంబ్లీలో ఆగమయ్యారు. ఆరు గ్యారంటీలు, రుణమాఫీ అమలు చే యడం చేతకాదని చెప్పకనే చెప్పారు. రూ.49,500 కోట్ల రుణమాఫీ రూ.26 వేల కోట్లతో ఎలా అయిందో రేవంత్ చెప్పలేకపోయారు. కేవలం 25శాతం రుణమాఫీ చేసి 100శాతం అయిందని చెబుతున్నారు. రైతుబంధులో రూ.22 వేల కోట్లు ఎవరికి ఇచ్చారో అడిగితే ప్రభుత్వం సమాధానం ఇవ్వలేదు. కంది, పత్తి, మొక్కజొన్నల రెండో పంటకు రైతుబంధు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారు. బీఆర్ఎస్ పదేళ్లలో రూ.28 వేల కోట్ల రుణమాఫీ చేస్తే.. కాంగ్రెస్ రూ.12 వేల కోట్లు మాత్రమే చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి రైతుబంధుకు పాన్‌కార్డు ఆప్షన్ పెడితే 1.30 కోట్ల మంది నష్టపోతారు. ఐటీ ఉన్న వారందరికీ రైతుబంధు కట్ చేస్తే ఇక మిగిలేదెవరు? మాజీ సీఎం కేసీఆర్ చెప్పినట్టుగా కాంగ్రెస్ వస్తే రైతుబంధు బంద్ అయింది. రుణమాఫీ, రైతుబంధు ఏమైందని స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ప్రజలంతా నిలదీయాలి. ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలయ్యేదాకా కాంగ్రెస్ పార్టీని వదిలేది లేదు. రేవంత్‌రెడ్డిని, కాంగ్రెస్ పార్టీని నీడలా వెంటాడుతూనే ఉంటాం. రైతు ఆత్మహత్యలపై అన్నీ అబద్ధాలే.. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలపై కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలు చెప్పే దుస్థితికి దిగజారింది. కేంద్ర నేర గణాంక సంస్థ (ఎన్సీఆర్బీ) లెక్కల ప్రకారం... 2014లో 1,348 రైతు ఆత్మహత్యలు జరిగితే... రైతు బంధు పథకం ప్రారంభమైన తర్వాత 2022 నాటికి కేవలం 178 మందికే తగ్గింది. పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయ రంగానికి ప్రోత్సాహం ఇవ్వడంతోనే ఆత్మహత్యలు తగ్గాయి. రాష్ట్రం ఏర్పడక ముందు దేశంలోనే తెలంగాణ ప్రాంతం రైతు ఆత్మహత్యల్లో తొలి రెండు స్థానాల్లో ఉండేది. ఓటుకు నోటు దొంగ రేవంత్‌రెడ్డి చెప్పే ప్రతీ మాటా నమ్మాల్సిన అవసరం లేదు. రైతు భరోసా ఇచ్చేదెప్పుడో! సంక్రాంతి తర్వాత రైతుభరోసా ఇస్తామంటున్న ప్రభుత్వం ఏ సంక్రాంతికో చెప్పడం లేదు. రైతు భరోసాపై కాలయాపన కోసమే కమిటీ వేశారు. ప్రజలు కోరుకున్నది పేర్ల మార్పిడి కాదు, గుణాత్మకమైన మార్పు. మేం సీఎం రేవంత్‌రెడ్డి కేసులకు, ఈడీ, మోదీలకు భయపడబోం’’అని కేటీఆర్ పేర్కొన్నారు. -
అదే నిరూపిస్తే.. స్పీకర్ ఫార్మట్‌లో రాజీనామా చేస్తా: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో పాటు అధికార పార్టీ నేతలకు మాజీ మంత్రి,బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. ఏ గ్రామంలోనైనా రుణమాఫీ పూర్తయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటానని అన్నారు.తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసాపై శనివారం చర్చ కొనసాగుతుంది. చర్చలో భాగంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భరోసా ఇవ్వలేదు.రెండు పంటలది రైతు భరోసా ఇవ్వలేదు.ఏడాది కాంగ్రెస్ పాలనలో రూ.17వేల బాకి పడ్డారు.రూ.26వేల కోట్లు రైతులకు బాకీ పడ్డారు.రైతులకు ఉన్న బకాయిలను క్లియర్ చేసి...కొత్త రైతు భరోసా రైతులకు ఇవ్వాలి.రుణమాఫీ రూ.40 వేల కోట్లు సిఎం రేవంత్ రెడ్డి అన్నారు...కేబినెట్లో రూ.31వేలు అయ్యింది. బడ్జెట్ కి వచ్చే సరికి రూ.26 వేల కోట్లయ్యింది.రుణమాఫీ కాలేదు...కొండారెడ్డి, సిరిసిల్ల పోదామా? ఏ ఊరిలో అయినా రుణమాఫీ పూర్తి అయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయ సన్యాసం తీసుకుంటా. ఎన్నికల హామీలు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలి’అని కేటీఆర్ సూచించారు. -
‘రైతుపండుగ’పై హరీశ్‌రావు సెటైర్లు
సాక్షి,హైదరాబాద్:రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్‌రెడ్డి? అని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం(నవంబర్ 30) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘మేనిఫెస్టోలో చెప్పి,రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి? రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.నేడు మహబూబ్‌నగర్‌లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలి.పెండింగ్‌లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. -
రూ.2 లక్షల రుణమాఫీ ఇంకా చేయలేదు: మంత్రి పొంగులేటి
సాక్షి,హైదరాబాద్: ప్రజల నుంచి ఇందిరమ్మ ఇళ్లు, ధరణి సమస్యలు ఎక్కువగా వచ్చాయని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఈ విషయమై పొంగులేటి బుధవారం(నవంబర్ 13) మీడియాతో మాట్లాడారు.‘భూములున్న వారిని గత ప్రభుత్వం ఎంతో ఇబ్బంది పెట్టింది.గ్రామ సభలో ఇంధిరమ్మ ఇళ్ళ లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది.పైరవీలు అవసరం లేదు.కొత్త ఆర్ ఓ ఆర్ చట్టంతో భూ సమస్యలు పరిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాం.అసెంబ్లీలో కొత్త భూ చట్టం వివరాలు వెల్లడిస్తాం.ప్రతిపక్ష నేతల సలహాలు కూడా కొత్త చట్టం లో తీసుకుంటాం.ఇటీవల ధరణి బాధ్యతలు ఎన్ఐసికి ఇచ్చాం. త్వరలో రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తాం. రైతు భరోసా కూడా ఇస్తాం’అని పొంగులేటి తెలిపారు.ఇదీ చదవండి: రేవంత్‌రెడ్డికి లిక్కర్ అమ్మకాలపై ప్రేమ ఎక్కువైంది: హరీశ్‌రావు -
రైతుల ద్రోహి కాంగ్రెస్: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రైతుల ద్రోహి కాంగ్రెస్ పార్టీ అంటూ సీరియస్ కామెంట్స్ చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రైతుబంధు ఎగిరపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘రైతుబంధు కావాలా..? రాబందు కావాలా?. ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా?. రైతుబంధు ఎగిరిపోయింది.. రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!. నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి... ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి.. ఉన్న పదివేలు ఊడగొట్టారు!. పంట పెట్టుబడి ఎగ్గొట్టడం అంటే.. అన్నదాత వెన్ను విరవడమే..!. రైతు ద్రోహి కాంగ్రెస్.. చరిత్ర నిండా అనేక రుజువులు.. ఇప్పుడు ఇంకొకటి!’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.రైతుబంధు కావాలా..? రాబందు కావాలా..? ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఇచ్చిన నినాదం గుర్తుందా..? రైతుబంధు ఎగిరిపోయింది..రాబందుల రెక్కల చప్పుడే మిగిలింది!నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలైనట్టుంది పరిస్థితి..!ఎకరానికి 15వేలు ఇస్తామని ఊదరగొట్టి..ఉన్న పదివేలు ఊడగొట్టారు..!పంట పెట్టుబడి… pic.twitter.com/fGpgRLZDB3— KTR (@KTRBRS) October 21, 2024 -
రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం.. తహసీల్దార్ అరెస్ట్
సూర్యాపేట, సాక్షి: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు. ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్ జగదీష్ సహకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తహసీల్దారు జయశ్రీ, ధరణీ ఆపరేటర్ జగదీష్‌ను అరెస్ట్ చేశారు. గోప్యంగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం. గతంలో హుజూర్నగర్ తహసీల్దార్‌గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులును స్వాహా చేశారు. రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ పక్కదారి పట్టించారు. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు తహసీల్దార్ జయశ్రీ జారీ చేశారు. తహసీల్దార్, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున రైతుబంధు నదులు పంచుకున్నారు. తహసీల్దార్ పై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేవారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్‌గా జయశ్రీ పనిచేస్తున్నారు. గోప్యంగా రిమాండ్‌కు తరలించడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
రైతుబంధు దరఖాస్తులు తీసుకోండి
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేయనున్న ఫార్మాసిటీ భూములకు సంబంధించి పిటి షన్లు దాఖలు చేసిన రైతుల నుంచి రైతుబంధు దరఖాస్తులు స్వీక రించాలని అధికారులను హైకోర్టు ఆదేశించింది. వారంలో గా ఈ దరఖాస్తులను స్వీకరించాల ని స్పష్టం చేస్తూ మధ్యంతర ఉత్తర్వు లు జారీ చేసింది. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేసింది. ప్రతిపాదిత ఫార్మా సిటీలో భూములున్న రైతులు, భూ యజమాను లకు రెవెన్యూ అధికారులు అడ్డంకులు సృష్టిస్తు న్నారని కుర్మిద్దకు చెందిన పి.నరసింహతోపాటు మరో 37 మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇలాగే మరికొందరు కూడా పిటిషన్లు దాఖలు చేశారు. మేడిపల్లి, కుర్మిడ గ్రామాలకు చెందిన పిటిషనర్లు భూసేకరణ ప్రక్రియను సవాల్ చేసి విజయం సాధించామన్నారు. నానక్ నగర్‌కు చెందిన పిటిషనర్లు దాఖలు చేసిన కేసు లకు సంబంధించి కోర్టు స్వాధీన ప్రక్రియపై స్టే విధించిందని.. అయినా అధికారులు తమ భూ ములను నిషిద్ధ జాబితాలోనే కొనసాగించడంతో రైతుబంధు పథకం, పంట రుణాలు, భూముల లావాదేవీలు వంటి ప్రయోజనాలు లేకుండా పోయాయని పేర్కొన్నారు. ఈ పిటిషన్లపై జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం విచారణ చేపట్టారు. పిటిష నర్ తరఫు న్యాయవాది రవికుమార్ వాదనలు వినిపిస్తూ.. ఫార్మా సిటీకోసం వారి భూములను సేకరించేందుకు జారీచేసిన నోటిఫికేషన్‌ను పరి హారం ప్రకటించినప్పటి నుంచి రద్దు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందన్నా రు. రైతుల భూమి వివరాలను రెవె న్యూ రికార్డుల్లో నమోదు చేయడా నికి అధికారులు అనుమతించడం లేదని, వ్యవసాయ భూములకు పూర్తి యాజమాన్య హక్కులను పొందకుండా నిరోధిస్తున్నారని చె ప్పారు. ఫార్మాసిటీని ఏర్పాటు చేయ బోమని సీఎం రేవంత్ పత్రికా ప్రకటన లు చేయడంతోపాటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పేర్కొందని వెల్లడించారు.ఫార్మా సిటీపై అప్పీల్ పెండింగ్‌లో ఉంది..ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) ఎ.సు దర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ‘‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మా సిటీ’ఏర్పాటు ప్రతిపాదనను రద్దు చేసినట్టు వస్తున్న వార్తలు నిరాధారమైనవన్నారు. ఫార్మాసిటీ ఏర్పాటుకు 2016, జూన్ 10న ప్రభుత్వం జారీ చేసిన జీవో 31కి కట్టుబడి ఉన్నామన్నారు. ప్రభుత్వం రైతులకు అండగా ఉంది. రైతులతో చర్చలు జరిపి న్యాయమైన, సహేతుకమైన పరిహారం అందేలా చర్యలు తీసుకుంటుంది.పరిహారంతోపాటు రైతుబంధు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తాం. సింగిల్ జడ్జి భూసేకరణ పరిహార ఉత్తర్వులను గత ఆగస్టులో రద్దు చేశారు. దీనిపై ప్రభుత్వం అప్పీల్ దాఖలు చేసింది. అప్పీల్ పెండింగ్‌లో ఉంది’అని పేర్కొన్నారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. పిటిషనర్ల నుంచి రైతుబంధుకు దరఖాస్తులు స్వీకరించాలని ఆర్డీవోను ఆదేశించారు. తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా వేశారు. -
తెలంగాణలో జాబ్ క్యాలెండర్! కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
-
రైతులతో సమావేశం
-
10 ఎకరాల వరకే రైతు భరోసా..
-
రైతు బంధు నిధుల్ని వెనక్కి ఇవ్వండి: ప్రభుత్వం కీలక ఆదేశాలు
హైదరాబాద్, సాక్షి: వ్యవసాయేతర భూములకు ఇచ్చిన రైతుబంధుపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ భూములపై తీసుకున్న రైతుబంధు నిధులను తిరిగి ఇవ్వాలని లబ్ధిదారులకు నోటీసులు పంపించనుంది. ఈ మేరకు సొమ్ము రికవరీకి చర్యలు తీసుకోనుంది. -
లేఅవుట్‌కు రూ.20 లక్షల రైతుబంధు
సాక్షి,మేడ్చల్ జిల్లా: మేడ్చల్ జిల్లాలో రైతుబంధు పక్కదారి పట్టింది. సాగుకు నోచుకోని లేఅవుట్లు, వెంచర్లు, గుట్టలు, రాళ్లురప్పలు, కంచెలు ఉన్న వేలాది ఎకరాలకు కూడా పెట్టుబడి సాయం అందింది. ఘట్కేసర్ మండలం పోచారం మున్సిపాలిటీ పరిధిలోని 38, 39, 40 సర్వేనంబర్లలోని 33 ఎకరాల లేఅవుట్‌కు రైతుబంధు అందింది. ఇందులో కొంత వ్యవసాయభూమి కూడా ఉంది. రైతు మోత్కుపల్లి యాదగిరిరెడ్డి పేరిట ఐదేళ్లుగా ఈ వెంచర్‌కు రూ. 20 లక్షలు రైతుబంధు పేరిట జమ అయిన విషయం బయటకు పొక్కింది. పోచారానికి చెందిన ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా, రెవెన్యూ అధికారులు విచారించి ఇది వాస్తవమేనని తేల్చారు. మోత్కుపల్లి యాదగిరిరెడ్డి నుంచి రూ.16.80 లక్షలు రికవరీ చేయాలని అధికారులు నిర్ణయించారు. కీసర ఆర్డీఓ ఉపేందర్‌రెడ్డి ఆదేశాల మేరకు ఘట్కేసర్ తహసీల్దార్ రైతు యాదగిరిరెడ్డి నుంచి రూ.16.80 లక్షల రికవరీ పేరిట నోటీసులు జారీ చేశారు. నగర శివారులో ఇలా.. నగర శివారులో ఉన్న మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 28,162 ఎకరాల్లో మాత్రమే వివిధ పంటలు సాగవుతున్నాయి. అయితే ఏటా ప్రతి సీజన్లో పెట్టుబడి సాయం కింద 66,519 ఎకరాలకు రూ. 39.92 కోట్లు విడుదల అవుతున్నాయి. ఆధార్‌కార్డు అనుసంధానం ఆధారంగా రూ. 33.25 కోట్లు సంబంధిత రైతుల బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమ చేస్తోంది. అయితే మిగతావి సాగు భూములు కావని, వెంచర్లు, ఫామ్ ల్యాండ్స్, బీడు భూములనే ఆరోపణలున్నాయి. రంగారెడ్డి జిల్లాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. రంగారెడ్డి జిల్లాలో 4,45,428 ఎకరాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం ప్రతీ సీజన్లో రూ.345.36 కోట్ల చొప్పున ఏడాదిలో రెండు పర్యాయాలు ప్రభుత్వం చెల్లిస్తోంది. రంగారెడ్డి జిలాల్లో సీజన్ల వారీగా సాగవుతున్న భూములకు రూ.222.71 కోట్లు సరిపోతుందని రైతు సంఘాల ప్రతినిధులు పేర్కొంటున్నారు. ఈ లెక్కన ప్రభుత్వం అదనంగా రూ.117 కోట్లు మేర లేఅవుట్లు, రాళ్లు, రప్పలు, గుట్టలు, కంచెలు ఉన్న భూములకు చెల్లిస్తుందని వారు ఆరోపిస్తున్నారు. -
రైతు బంధుపై కమిటీ అంటే మోసమే: జగదీష్‌రెడ్డి
సాక్షి,హైదరాబాద్: ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, ఎట్టి పరిస్థితుల్లో రైతుబంధు సాయాన్ని ఆపడానికి వీలులేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం(జూన్23)తెలంగాణ భవన్లో మరో నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.‘రైతు భరోసా పేరుతో రూ. 15,000 ఇస్తామని మాట తప్పారు. రైతు భరోసాపై కేబినెట్ సబ్ కమిటీ ఎందుకు వేస్తున్నారు. కేబినెట్ సబ్ కమిటీ వెనుక ఉన్న మతలబు ఏంటి? రైతు రుణమాఫీతో సంబంధం లేకుండా రైతులకు ఇవ్వాలి. కమిటీ అంటే రైతులను మోసం చేయడమే. కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం. పింఛన్ల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదు. విద్యుత్ బిల్లుల మాఫీ స్కీమ్ రాష్ట్రంలో అమలు కావడం లేదు. యాసంగిలో రైతులకు ఏ విధంగా రైతుబంధు ఇచ్చారో ఇప్పుడు అట్లాగే ఇవ్వండి. బీఆర్ఎస్ హయాంలో జూన్ నెలాఖరులోగా రైతుల ఖాతాల్లోకి రైతు బంధు వచ్చేది. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా దెబ్బతిన్నది. పురుషులు,మహిళలు అన్న తేడా లేకుండా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. వీధి కుక్కలు సైతం మహిళలపై దాడులు చేస్తున్నాయి. విద్యుత్ కమిషన్ నుంచి నాకు లెటర్ వచ్చింది. వారం రోజుల్లో కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారిపై మీ అభిప్రాయం చెప్పాలని లెటర్ పంపించారు. పవర్ కమిషన్ ముందుకు వెళ్లి నాకు ఉన్న సమాచారాన్ని ఇస్తాను. కమిషన్‌కు వాంగ్మూలం ఇచ్చిన వారి తప్పులను బయటపెడతాను. ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం రమణ్ సింగ్,విద్యుత్ అధికారుల నుంచి సమాచారం తీసుకోవాలి. లేదంటే కమిషన్ చైర్మన్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ నుంచి తప్పుకోవాలి’అని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
పాత పద్ధతిలోనే రైతుభరోసా!
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్ వరకు పాత పద్ధతిలోనే రైతుభరోసా (రైతుబంధు) అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇప్పటివరకు ఈ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు ఖరారు కాకపోవడం, వానాకాలం సీజన్ ప్రారంభమై రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్న నేపథ్యంలో సర్కారు ఈ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. వ్యవసాయ శాఖ కూడా ఇదే ప్రతిపాదనను ప్రభుత్వం ముందుంచింది. గత యాసంగి సీజన్లో ఇచ్చిన రైతులకే ఈసారి కూడా రైతుభరోసా సొమ్ము ఇస్తారు. వాస్తవంగా ప్రతి ఏడాది జూన్‌లోనే రైతుబంధు సొమ్ము ఇస్తారు. వానాకాలం సీజన్ ప్రారంభానికి ముందే ఇవ్వాలన్నది రైతుబంధు నిబంధన. సీజన్‌కు ఎకరానికి రూ.7,500 ఇస్తామన్న కాంగ్రెస్ రైతుబంధు పథకాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభించిన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతి సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున ప్రతి రైతుకు అందజేశారు. అలా ఏడాదికి ఎకరానికి రూ.8 వేల చొప్పున రైతులకు అందేవి. ఆ తర్వాత సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేలు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ సీజన్‌కు ఎకరానికి రూ.7,500కు పెంచి ఇస్తామని హామీ ఇచ్చింది. ఆ ప్రకారం రెండు సీజన్లకు కలిపి రూ.15 వేలు ఇవ్వాలి. అయితే అధికారంలోకి వచ్చాక తొలిసారిగా యాసంగి సీజన్లో మాత్రం పెరిగిన సొమ్మును కాకుండా పాత పద్ధతిలోనే ఎకరాకు రూ.5 వేలే ఇచ్చింది. వానాకాలం సీజన్ నుంచి ఎకరాకు రూ.7,500 ఇస్తామని పేర్కొంది. అయితే వానాకాలం సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది. కానీ రైతుభరోసా మార్గదర్శకాలు ఇంకా ఖరారు కాలేదు. పైగా ఈ మార్గదర్శకాలను అసెంబ్లీలో చర్చించి ఖరారు చేస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పటికిప్పుడు అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయితే ఈ వానాకాలం సీజన్లో రైతులకు నిర్ణీత సమయంలోగా రైతుభరోసా సొమ్మును ఇవ్వాలని భావిస్తున్న ప్రభుత్వం.. పాత పద్ధతిలో సొమ్ము అందజేయనుంది. అంటే ఎకరాకు తొలుత రూ.5 వేలే ఇస్తారు. ఆ తర్వాత రైతుభరోసా మార్గదర్శకాలు ఖరారు చేసి వచ్చే నెల మరో రూ.2,500 ఎకరాకు ఇవ్వాలనేది సర్కారు ఆలోచనగా ఉన్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. యాసంగిలో 1.52 కోట్ల ఎకరాలకు రూ.7,625 కోట్లు విడుదల చేసింది. ఈ వానాకాలంలోనూ ఇదే మొత్తం రైతులకు ఇచ్చే అవకాశముంది. మార్గదర్శకాలపై కసరత్తు రైతుభరోసా మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ కసరత్తు ప్రారంభించింది. సీలింగ్ ప్రకారం ఇవ్వాలా? ఎలా చేయాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. పంట వేసినట్లు నిర్ధారణ అయిన భూముల రైతులకే ఆర్థిక సాయం అందించాలని కూడా భావిస్తున్నారు. అంతేకాదు దీనిని గరిష్టంగా ఐదెకరాలకే పరిమితం చేసే అంశమూ చర్చకు వస్తోంది. గత యాసంగి సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.97 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేశారు. అందులో ఐదెకరాలోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.32 లక్షల మంది కాగా, వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే మొత్తం రైతుభరోసా అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉండటం గమనార్హం. దీంతో ఐదెకరాలకు పరిమితం చేసినా 90 శాతం మందికి రైతుభరోసా ఇచ్చినట్లు అవుతుందని అంటున్నారు. రాష్ట్రంలో ఎకరాలోపున్న రైతులు 22.55 లక్షల మంది, ఎకరా నుంచి రెండెకరాల వరకున్న రైతులు 16.98 లక్షల మంది, రెండెకరాల నుంచి మూడెకరాల లోపున్న రైతులు 10.89 లక్షల మంది ఉన్నారు. మూడెకరాల నుంచి నాలుగెకరాల లోపున్న రైతులు 6.64 లక్షల మంది, నాలుగెకరాల నుంచి ఐదెకరాల లోపున్న రైతులు 5.26 లక్షల మంది ఉన్నారు. ఇక ఐదెకరాలకు పైగా భూమి ఉన్న రైతులు 6.65 లక్షల మంది ఉన్నారు. కొండలు, గుట్టలను కూడా రైతుభరోసా నుంచి మినహాయిస్తారు. ఉపగ్రహ ఛాయా చిత్రాల ఆధారంగా అటువంటి భూములను గుర్తిస్తారు. -
రైతు భరోసా అందేనా!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఆరు గ్యారంటీల హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఏడాదికి రూ. 15 వేలు పంట పెట్టుబడి సాయాన్ని అందజేస్తామ ని హామీ ఇచ్చింది. దీనిని ఈ ఏడాది ఖరీఫ్ నుంచే అమలు చేస్తామని ప్రకటన చేసింది. కానీ, సాగు పనులు ప్రారంభమైనప్పటికీ ఇంత వరకు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు. ప్రభు త్వం మళ్లీ దీని ఊసెత్తకపోవడంతో పెట్టుబడి సాయం వస్తుందో లేదో తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లా రైతులు మాత్రం ‘రైతు భరోసా’ కోసం ఎదురు చూస్తున్నారు.గత ప్రభుత్వం ‘రైతు బంధు’ పేరుతో ఎకరానికి రూ. 5వేల చొప్పున ఏడాదికి రెండు సీజన్లలో పంట పెట్టు బడిని అందజేసింది. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీనిని కొనసాగించి మొన్నటి ఎండాకాలం సీజన్లో పాత విధానంలోనే రైతులకు పెట్టుబడిని అందజేసింది. జిల్లా లో మొత్తం 2,73,595 మంది రైతులు 4,42, 882 ఎకరాలకు గాను రూ. 271.44కోట్లు రైతు ల ఖాతాల్లో పడ్డాయి. అయితే, రైతుభరోసా పథకం కింద ఖరీఫ్ నుంచి రైతులకు ఏడాదికి రూ. 15వేలు ఇవ్వాల్సి ఉంది. పెట్టుబడి డబ్బు లు ఇంకా రాకపోవడంతో రైతులు సొంతంగా విత్తనాలు, మందులు, ఎరువులు కొనుగోలు చేస్తున్నారు. చాలామంది సాగు పనులు ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులకైనా పెట్టుబ డి సాయాన్ని అందజేయాలని కోరుతున్నారు.బోనస్ మాటేంటి..?ఎన్నికలకు ముందు వరికి రూ. 500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ గెలిచిన తర్వాత కేవలం సన్నాలకు మాత్రమే బోనస్ ఇస్తామని ఇటీవల ప్రకటించింది. దీంతో రైతులంతా దొడ్డు రకాల నుంచి సన్నాల వైపు మళ్లారు. ఎక్కువగా బీపీటీ రకాల విత్తనాలను కొనుగోలు చేసి సాగు చేయడానికి సిద్ధమయ్యారు. ఈ సీజన్లో పండించిన ధాన్యానికి బోనస్ వస్తుందా లేదా అని చాలామంది రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది లా ఉండగా వ్యాపారులతో ఒప్పందం చేసు కుని సీడ్ విత్తనాలు సాగు చేస్తున్న రైతుల్లో కొంత ఆందోళన నెలకొంది. సీడ్ విత్తనాలు సాగు చేస్తున్నామని చెబితే ప్రభుత్వం బోనస్ ఇస్తుందో లేదోనని వ్యవసాయాధికారులకు సరైన సమాచారం ఇవ్వడం లేదు. రైతులు సమాచారం ఇవ్వకపోవడంతో పంటల నమోదుకు ఏఈవోలు ఇబ్బందులు పడుతున్నారు.పెట్టుబడి సాయం ఇవ్వాలిప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ సీజన్ నుంచే రైతులకు పంట పెట్టుబడి సాయాన్ని అందజేయాలి. ఇప్పటికే ఆలస్యమైంది. సొంత ఖర్చులతో విత్తనాలు, ఎరువుల కొనుగోలు చేస్తున్నాం. వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు చేసి చిన్న, సన్నకారు రైతులను ఆదుకోవాలి.– ఆరే గంగాధర్, రైతు, మారంపల్లి -
తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
సాక్షి,హైదరాబాద్: అయిదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం తాజాగా రైతు బంధు నిధులు విడుదలచేయడంపై ఎన్నికల కమిషన్(ఈసీ ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్ తర్వాతే నిధులు విడుదల చేయాలని ఈసీ ఆదేశించింది. రైతు బంధుపై ఈసీకి ఎన్.వేణు కుమార్ అనే వ్యకి ఫిర్యాదు చేశారు. రైతు బంధు చెల్లింపులపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో రంగంలోకి దిగిన ఈసీ రైతుబంధు నిధుల పంపిణీకి బ్రేకులు వేసింది. -
తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి నగదు
సాక్షి,హైదరాబాద్: ఐదు ఎకరాల కంటే ఎక్కువ వ్యవసాయ భూమి ఉన్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం సోమవారం(మే 6)రైతు బంధు నిధులు విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసేందుకుగాను రూ.2 వేల కోట్ల దాకా ప్రభుత్వం విడుదల చేసినట్లు సమాచారం. మూడు రోజుల్లో మొత్తం రైతుబంధు చెల్లింపు ప్రక్రియ పూర్తవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఐదు ఎకరాల్లోపు భూమి ఉన్న రైతులకు రైతు బంధు నిధులు ఇప్పటికే విడుదల చేశారు. తాజాగా ఐదెకరాల పైన ఉన్నవారికి నగదు బదిలీ ప్రారంభించారు. -
రైతులకు గుడ్‌న్యూస్.. రైతుభరోసాపై సీఎం రేవంత్ కీలక ప్రకటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త చెప్పారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా నిధులు జమ చేస్తామని రేవంత్ చెప్పారు.కాగా, ఖమ్మం జిల్లాలో ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ..‘ఎన్నికల వేళ సీఎం రేవంత్ కీలక ప్రకటన చేశారు. రైతులకు శుభవార్త అందించారు. ఈనెల తొమ్మిదో తేదీలోపు రైతుభరోసా డబ్బులు జమ చేస్తామన్నారు. అలాగే, ఆగస్ట్ 15వ తేదీలోపు రుణమాఫీ కూడా చేస్తామని ప్రకటించారు. రైతు భరోసా ఏడు లక్షల 60 వేల మందికి ఇప్పటికే వేశాం. మిగిలిన నాలుగు లక్షల మందికి వేస్తాం’ అని కామెంట్స్ చేశారు.ఇదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్..‘ఖమ్మం జిల్లా దేశ రాజకీయాలకు దిక్సూచి. కేసీఆర్ నామా నాగేశ్వరరావును బకరాను చేస్తున్నారు. ఏ సంకీర్ణంలో చేరుతావు. ఆ ఇంటి మీది కాకి ఈ ఇంటి మీద వాలితే కాల్చేస్తారు. నామాకు సూచన చేస్తున్నాను. కేసీఆర్ మాటలు వినకు. గత డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు సెమీ ఫైనల్స్. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఫైనల్ తీర్పు రాబోతుంది. గుజరాత్ టీమ్‌ను ఇంటికి పంపించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది. రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కాబోతున్నారు’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.అయితే, రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సీఎం రేవంత్ ఇలాంటి ప్రకటన చేయడం కోడ్ ఉల్లంఘనకు కిందకు వస్తుందని ప్రతిపక్ష పార్టీల నేతలు కామెంట్స్ చేస్తున్నారు. అలాగే, ఎన్నికల్లో ఓట్లు పొందడం కోసమే రేవంత్ ఇలాంటి కామెంట్స్ చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. రిజర్వేషన్ల రక్షణకు సీఎం రేవంత్ రెడ్డి పోరాటం చేస్తున్నారు. తప్పుడు కేసులతో ఢిల్లీకి పిలిస్తే భయపడతామా?. రాజ్యాంగాన్ని కాపాడతామని రాహుల్ గాంధీ చెప్పిన మాటనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. కాలం చెల్లిన థర్మల్ పవర్ స్టేషన్లను తిరిగి వాడకంలోకి తెస్తాం. కార్మికులకు రావాల్సిన లాభాలు ఇవ్వకుండా, సింగరేణికి బొగ్గు బావులు తవ్వకుండా గత ప్రభుత్వం 10 సంవత్సరాలు మొద్దు నిద్రపోయింది.సింగరేణి పరిసరాల్లోని బొగ్గు బావులన్నీ ప్రైవేటు వ్యక్తులకు కాకుండా సింగరేణికే చెందేలా కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుంది. కొత్తగూడెంలో స్పాంజ్ ఐరన్ ఫ్యాక్టరీ తెరిపించి స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తాం. రాబోయే ఐదేళ్లలో డ్వాక్రా సంఘాలకు లక్ష కోట్ల వడ్డీ లేని రుణాలు అందజేస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెప్పపాటుసేపు కూడా కరెంటు పోవడం లేదు. ఆర్థిక క్రమశిక్షణతో ముందుకు పోతున్నాం. ఎన్ని అవరోధాలు ఎదురైనా ఆగిపోయే ప్రసక్తే లేదు. మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. రాహుల్‌ను ప్రధానిని చేయడానికి, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడటానికి రఘురామిరెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి’ అని కామెంట్స్ చేశారు. -
రైతుబంధు సొమ్ము వెనక్కి
సాక్షి, హైదరాబాద్: అధికార యంత్రాంగ నిర్లక్ష్యం రైతుల పాలిట శాపంగా మారింది. రైతుబంధు సొమ్ము సక్రమంగా రైతుల ఖాతాల్లో వేయకపోవడంతో అవి తిరిగి ప్రభుత్వ ఖాతాల్లోకే వచ్చిపడుతున్నాయి. ఇటీవల యాసంగి సీజన్‌కు సంబంధించి వేసిన రైతుబంధు సొమ్ము వేలాదిమంది రైతులకు వెళ్లకుండానే వెనక్కి రావడంపై వారు భగ్గుమంటున్నారు. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారమే 19 వేల మంది రైతుల ఖాతాల్లోకి వెళ్లాల్సిన రైతుబంధు సొమ్ము బ్యాంకుల వరకు వెళ్లి తిరిగి వెనక్కి వచ్చింది. అనేకమంది రైతులకు ఇంకా పూర్తిస్థాయిలో రైతుబంధు సొమ్ము అందలేదన్న ఆరోపణలు ఉన్నాయి. రైతుబంధు సొమ్ము వెనక్కి వచ్చినట్టు లెక్కలు తీసిన వ్యవసాయశాఖ అధికారులు, వాటిని ఇంకా పూర్తిస్థాయిలో సరిదిద్దలేదు. తిరిగి రైతుబంధు చెల్లింపులు చేయకపోవడంపైనా విమర్శలు ఉన్నాయి. అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి... » వ్యవసాయశాఖ అధికారుల తప్పుల వల్లే ఈ పరిస్థితి నెలకొందన్న ఆరోపణలు ఉన్నాయి. » ఇంటిపేర్లు, రైతుల పేర్లు తప్పుగా రాయడం, బ్యాంకు ఖాతాల నంబర్లు సరిచూసుకోకుండా నంబర్లలో తప్పులు దొర్లడం వంటి కారణాల వల్ల రైతుల ఖాతాలకు వేసిన డబ్బులు వెనక్కి వస్తున్నాయి. » ఒక్క అక్షరం తప్పుగా వచ్చినా కూడా బ్యాంకులు తిరిగి వెనక్కి వేస్తున్నాయి. » కొందరు రైతుల బ్యాంకు ఖాతాలు ఫ్రీజ్ కావడం, ఖాతాదారులు డిఫాల్టర్‌గా మారడం, కొందరి ఖాతాలు క్లోజ్ అవ్వడం, రుణాలు రెన్యువల్ చేసుకోవడంతో పాత ఖాతాలు పోయి కొత్త ఖాతాలు రావడం, పాత ఖాతాల వివరాలే వ్యవసాయశాఖ వద్ద ఉండటం తదితర కారణాలు కూడా రైతుబంధు సొమ్ము తిరిగి వెనక్కి రావడానికి కారణంగా ఉంటుందని ఒక వ్యవసాయ ఉన్నతాధికారి తెలిపారు. » వ్యవసాయశాఖకు రైతులు ఫిర్యాదు చేస్తున్నా, పూర్తిస్థాయిలో స్పందించడం లేదన్న విమర్శలొస్తున్నాయి. » సాంకేతిక సమస్యలను పూర్తిస్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. » బ్యాంకులతో వ్యవసాయ శాఖ సమన్వయం చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. యాసంగిలో ఐదెకరాలకే రైతుబంధు పరిమితం... రైతుభరోసా పథకం వచ్చే వానాకాలం నుంచి ప్రారంభిస్తామని, అప్పటివరకు గత రైతుబంధు మార్గదర్శకాలనే అమలు చేస్తామని కాంగ్రెస్ సర్కారు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రైతుబంధు మార్గదర్శకాల ప్రకారం భూమి విస్తీర్ణంతో సంబంధం లేకుండా రైతులందరికీ రైతుబంధు సొమ్ము వేయాలి. కానీ ఇప్పటివరకు ఐదు ఎకరాలున్న రైతులకు మాత్రమే రైతుబంధు సొమ్ము అందజేసినట్టు వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి.కాగా, కొందరు రైతులు మాత్రం ఐదెకరాల వరకే ఉన్నా తమకు అందలేదంటున్నారు. దీనిపై కొంత గందరగోళం నెలకొంది. గత వానాకాలం సీజన్ లెక్కల ప్రకారం రైతుబంధు సొమ్ము తీసుకున్న రైతులు 68.99 లక్షలు ఉన్నారు. ఈ యాసంగి సీజన్లోనూ అంతే మంది రైతులకు సొమ్ము విడుదల చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఆ ప్రకారం 1.52 కోట్ల ఎకరాలకు రూ. 7,625 కోట్లు విడుదల చేయాలి. ఇప్పటివరకు ఐదెకరాల వరకున్న రైతులకు మాత్రమే రూ. 5,202 కోట్ల రైతుబంధు సాయం అందిందని వ్యవసాయ వర్గాలు తెలిపాయి. -
ఎకరాకు రూ.25వేలు పరిహారమివ్వాలి
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఈ నెల 5న కరీంనగర్‌కు వస్తున్నా రని తెలిసే గాయత్రి పంప్‌హౌస్ ద్వారా నీళ్లను లిఫ్ట్ చేసి వదులుతున్నారని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యమ కాలంలో చేనేత కారి్మకులను ఆదుకునేందుకు జోలె పట్టిన కేసీఆర్ ప్రస్తుతం రైతులకు ధైర్యం చెప్పేందుకు పంటల పొలాలకు వెళ్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితుల్లో రైతులను ఆదుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ బీఆర్ఎస్ ప్రతినిధి బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారిని కలిసి వినతిపత్రం సమర్పించింది. రైతుబంధు సకాలంలో రాకపోవడం, రైతు రుణమాఫీ జరగకపోవడంతో రైతులు ఒత్తిడి ఎదుర్కొంటున్నారని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. 3 నెలల్లోనే 200మందికి పైగా రైతులు మరణించారని, 20 లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజధాని హైదరాబాద్‌లోనూ తాగునీటి ఇబ్బందులు తీవ్రమయ్యా యని పేర్కొన్నారు. పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ఎకరాకు రూ.25వేల చొప్పున పరిహారం, క్వింటాలుకు రూ.500 బోనస్ ఇవ్వాలని కోరారు. రూ.2లక్షల రుణమాఫీని తక్షణమే అమ లు చేయాలని, రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సీఎస్‌ను కలిసిన బీఆర్ఎస్ ప్రతినిధి బృందంలో మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, గంగుల, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద, కౌశిక్‌రెడ్డి, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, శేరి సుభా‹Ùరెడ్డి, దండె విఠల్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, బీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్‌రెడ్డి ఉన్నారు. ఎన్నాళ్లు కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు? అనంతరం తెలంగాణ భవన్లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో రైతాంగం కష్టాల్లో ఉందనే సోయి లేకుండా సీఎం రేవంత్‌రెడ్డి మూటలతో ఢిల్లీకి పోవడమే సరిపోతోందని ఎద్దేవా చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌పై అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సాగు చేస్తేనే ‘భరోసా’!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పంట పెట్టుబడి సాయం రూపుమారుతోంది. రైతులు పంట వేసినట్టు నిర్ధారణ అయిన భూములకే ‘రైతు భరోసా’ కింద ఆర్థిక సాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. పంటలు సాగైన భూములపై పక్కాగా లెక్క తీశాకే సాయం విడుదల చేయాలని భావిస్తోంది. అది కూడా పంటల సాగుకు ముందుగాకుండా.. సీజన్ మధ్యలో లేదా చివరిలో సాయం సొమ్మును విడుదల చేయాలని కూడా యోచిస్తున్నట్టు సమాచారం. సీజన్‌కు ముందే ఎందరు రైతులు ఎంతమేర భూముల్లో పంటలు వేశారో తెలియదని వ్యవసాయ అధికారులు చెప్తున్నారు. అందుకే సీజన్ మధ్యలో సర్వే చేసి ఎన్ని ఎకరాల్లో సాగుచేశారో నిర్ధారించి, సాయం అందించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ మేరకు ‘రైతు భరోసా’మార్గదర్శకాలపై కసరత్తు జరుగుతున్నట్టు ఒక ఉన్నతాధికారి తెలిపారు. రైతుల నుంచి వ్యతిరేకత వస్తే ఎలా? రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసుకునేందుకు, దుక్కుల సమయంలో అయ్యే ఖర్చుల కోసం సీజన్ కన్నా ముందే పెట్టుబడి సాయం అందించేలా గత ప్రభుత్వం 2018లో ‘రైతు బంధు’పథకాన్ని తెచ్చింది. పంటలు సాగు చేసినా, చేయకున్నా.. సాగుభూముల కింద నమోదై ఉన్న అన్ని భూములకు ‘రైతుబంధు’ సాయం అందించింది. అలాంటిది ఇప్పుడు పంటల సాగు మొదలయ్యాక, చివరిలో ఆర్థిక సాయం ఇస్తే రైతులకు ఇబ్బంది అవుతుందని అధికారులు తర్జనభర్జన పడుతున్న ట్టు సమాచారం. ఈ క్రమంలో సీజన్‌కు ముందే ఆర్థిక సాయం చేసి, ఒకవేళ ఎవరైనా రైతులు సాగుచేయనట్టు తేలితే.. వారికి తదుపరి సీజన్లో ఆర్థిక సాయానికి కోత పెట్టే ప్రతిపాదనలు కూడా వచ్చినట్టు తెలిసింది. కానీ దీనిపై రైతుల నుంచి వ్యతిరే కత రావొచ్చన్న సందేహాలు నెలకొన్నాయి. దీనితో మార్గదర్శకాల రూపకల్పన కత్తిమీద సాములా మారినట్టు అధికారవర్గాలు పేర్కొంటున్నాయి. యాసంగిలో సగానికిపైగా తగ్గనున్న సాయం! కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున ‘రైతు భరోసా’ఇస్తామని ప్రకటించింది. ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టిన తర్వాత.. ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా ‘రైతుబంధు’ను పునఃసమీక్షిస్తామని ప్రకటించింది. వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతు భరోసా పథకం అమలు చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో పంటలు సాగుచేసే భూములకే రైతుభరోసా ఇస్తే పెట్టుబడి సాయం వ్యయం భారీగా తగ్గుతుందని అంచనా. ఉదాహరణకు గత వానాకాలం సీజన్లో 1.52 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. అప్పుడు సాగైన భూమి 1.26 కోట్ల ఎకరాలే. ఇకపై ఇలా పంటలు వేయని 26 లక్షల ఎకరాలకు రైతుభరోసా సొమ్ము అందదు. ఇక ప్రస్తుత యాసంగిలో ఇప్పటివరకు 66.30 లక్షల ఎకరాల్లో పంటలు సాగుచేశారు. కొత్త సర్కారు నిర్ణయం మేరకు.. వీటికి మాత్రమే ఆర్థిక సాయం అందుతుంది. మిగతా 85.70 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకు సొమ్ము అందే పరిస్థితి ఉండదు. రెండు సీజన్లకు కలిపి గతంలో సుమారు 3.04 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందగా.. ఇప్పుడు దాదాపుగా 2.09 కోట్ల ఎకరాలకే పరిమితం కానుందని అంచనా వేస్తున్నారు. అంటే 98లక్షల ఎకరాలకు రైతుభరోసా అందదని పేర్కొంటున్నారు. పరిమితం చేసేందుకే మొగ్గు బీఆర్ఎస్ సర్కారు రైతుబంధు పథకం మొదలుపెట్టిన నాటి నుంచి గత వానాకాలం సీజన్ వరకు మొత్తంగా రైతులకు రూ.72,815 కోట్లు అందజేసింది. ఇందులో గత వానాకాలంలో 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి 68.99 లక్షల మంది రైతులకు రూ.7,625 కోట్లు అందజేసింది. యాసంగి సీజన్ కొనసాగుతున్న సమయంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. ఈ సీజన్‌కు సంబంధించి గతంలో మాదిరే రైతులకు ఆర్థిక సాయం ఇస్తామని ప్రకటించింది. అంటే 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.7,625 కోట్లు విడుదల చేయాలి. అయితే ఇప్పటివరకు నాలుగైదు ఎకరాల మేర భూమి ఉన్న రైతులకే ఆర్థిక సాయం అందిందని వ్యవసాయశాఖ వర్గాలు చెప్తున్నాయి. గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఐదెకరాల వరకే రైతుబంధు ఇస్తున్నట్టు చెప్పారు. అంటే యాసంగికి సంబంధించి కూడా ఐదెకరాల వరకు ఉన్న భూములకే ఆర్థిక సాయం పరిమితం కానుంది. రాష్ట్రంలో ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల సంఖ్య 62.34 లక్షల మందికాగా.. వారి చేతిలో కోటి ఎకరాల భూమి ఉంది. అంటే రైతుబంధు అందుకుంటున్న రైతుల్లో ఐదెకరాలోపు రైతులే 90.36 శాతం ఉన్నారని వ్యవసాయ వర్గాలు చెప్తున్నాయి. పక్కాగా సాగు లెక్కలు తీసి.. శాటిలైట్ రిమోట్ సెన్సింగ్, ఇతర పద్ధతుల ద్వారా పక్కాగా సాగు లెక్క తేల్చా లని అధికారులు నిర్ణయించారు. ఇందులోనూ ఐదెకరాల్లోపు భూములున్న రైతు లకే ఆర్థిక సాయం అందనుంది. ఆదాయ పన్ను చెల్లించే ఉద్యోగులు, ఇతర వర్గాలవారికి రైతుభరోసా నిలిపివేయనున్నారు. ఐదెకరాల వరకే సాయం ఇవ్వాలన్న ఆలోచనా అమలు చేస్తే.. నిధుల వ్యయం మరింతగా తగ్గుతుంది. ఇప్పటివరకు 1.52 కోట్ల ఎకరాలకు ఆర్థిక సాయం ఇచ్చినట్టుగా.. కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఎకరాకు రూ.15 వేల చొప్పున అమలు చేయాలంటే ఏడాదికి రూ.22,800 కోట్లు కావాలి. అయితే సాగుచేయని భూమిని తొలగించడం, ఐదెకరాలకు పరిమితం చేయడం, ఆదాయ పన్ను చెల్లించేవారు, ధనికులు, ప్రజాప్రతినిధులు, సినీ నటులు, వ్యాపారవేత్తలకు రద్దు చేయడం వంటివి అమలు చేస్తే.. దాదాపు రూ.10వేల కోట్ల వరకు మిగులుతాయని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
అన్నదాతకు అండ
సాక్షి, అమరావతి: ఆరు గాలం శ్రమించే అన్నదాతకు వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తోంది. వైఎస్సార్ రైతు భరోసా వంటి పథకాల ద్వారా అవసరమైన ఆర్థిక చేయూతనిస్తోంది. అలాగే బ్యాంకర్ల సాయంతో ముందెన్నడూ లేని రీతిలో రైతులకు పెద్ద ఎత్తున రుణాలు మంజూరు అయ్యేలా చూస్తోంది. గతంలో రుణాల కోసం అన్నదాతలు చెప్పులరిగేలా బ్యాంకుల చుట్టూ తిరిగేవారు. అయినా సకాలంలో అప్పులు పుట్టక వడ్డీ వ్యాపారుల ఉచ్చులో పడి అప్పుల ఊబిలో కూరుకుపోయేవారు. సీఎం జగన్ పాలనలో ఆ పరిస్థితి మారింది. అడిగిందే తడవుగా అన్నదాతలకు రుణాలు మంజూరవుతున్నాయి. రైతులకు లబ్ధి చేకూరుస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల కారణంగా బ్యాంకులు సైతం వ్యవసాయ రంగానికి రుణాల మంజూరును ఏటా పెంచుతున్నాయి. ఈ ఐదేళ్లలో వైఎస్సార్ రైతు భరోసా కింద 53.58 లక్షల రైతు కుటుంబాలకు రూ.34,288 కోట్ల పెట్టుబడి సాయం.. వైఎస్సార్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం కింద 84.67 లక్షల మందికి రూ.2,051 కోట్ల లబ్ధి చేకూర్చింది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద 54.58 లక్షల మందికి రూ.7,802.05 కోట్లు, ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 30.85 లక్షల మందికి రూ.3,411 కోట్లు అందించింది. ఫలితంగా రైతుల ఆర్థిక పరపతి గణనీయంగా పెరిగింది. దీనికి తోడు రికార్డు స్థాయిలో దిగుబడులు వస్తున్నాయి. వాటికి మార్కెట్లో ఎమ్మెస్పీకి మించి మంచి ధరలు లభిస్తున్నాయి. దీంతో తీసుకున్న రుణాలను రైతులు కూడా సకాలంలో చెల్లిస్తున్నారు. రికార్డు స్థాయిలో మొండి బకాయిలు సైతం వసూలవుతున్నాయి. 2019–20లో మొండి బకాయిలు 3.57 శాతం ఉండగా, 2023–24కు వచ్చేసరికి 2.50 శాతానికి తగ్గింది. దీంతో గత ఐదేళ్లుగా రైతులకు రుణాలు మంజూరు చేసేందుకు బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయి. రికార్డు స్థాయిలో మంజూరు.. 2014–15 నుంచి 2018–19 మధ్య ఐదేళ్లలో 3.97 కోట్ల మందికి రూ.3,64,624 కోట్ల రుణాలు మంజూరు చేస్తే.. గత 57 నెలల్లో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 5.27 కోట్ల మంది రైతులకు ఏకంగా రూ.8,70,964 కోట్ల రుణాలను బ్యాంకులు మంజూరు చేశాయి. అంటే టీడీపీ ఐదేళ్ల పాలనలో ఏటా సగటున 79 లక్షల మందికి రూ.72,925 కోట్ల రుణాలిస్తే.. వైఎస్ జగన్ పాలనలో ఇప్పటివరకు ఏటా సగటున 1.05 కోట్ల మంది రైతులకు ఏకంగా రూ.1,74,193 కోట్ల రుణాలు బ్యాంకులు అందించాయి. టీడీపీ హయాంతో పోలిస్తే రైతుల సంఖ్య దాదాపు 30 శాతం పెరిగితే, మంజూరు చేసిన రుణాలు ఏకంగా 142 శాతం పెరిగింది. అంటే ఏ స్థాయిలో రుణాలు మంజూరయ్యాయో అర్థం చేసుకోవచ్చు. 2023–24 ఆర్థిక సంవత్సరంలో రూ.2.31 లక్షల కోట్ల రుణాలు మంజూరు చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకోగా.. 2024 ఫిబ్రవరి నాటికి 99.65 లక్షల మందికి 2.08 లక్షల కోట్ల రుణాలను బ్యాంకులు అందించాయి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది షార్ట్ టర్మ్ రుణాలు రూ.1.22 లక్షల కోట్లు కాగా, అగ్రి టర్మ్ రుణాలు రూ.66 వేల కోట్లు, వ్యవసాయ మౌలిక సదుపాయాల రంగానికి రూ.20,816 కోట్లు మంజూరు చేశాయి. కౌలు రైతులకు వెన్నుదన్ను భూ యజమానుల హక్కులకు రక్షణ కల్పిస్తూనే వాస్తవ సాగుదారులకు ప్రభుత్వం పంట సాగుదారు హక్కు పత్రాల(సీసీఆర్సీ)ను జారీ చేస్తోంది. వైఎస్ జగన్ పాలనలో ఇప్పటివరకు ఏటా సగటున 5.80 లక్షల మంది చొప్పున 26 లక్షల మంది కౌలు రైతులకు సీసీఆర్సీ కార్డులు జారీ చేసింది. అలాగే ఈ ఐదేళ్లలో 15 లక్షల మందికి రూ.8,577 కోట్ల రుణాలు మంజూరు చేసింది. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 8.31 లక్షల మందికి సీసీఆర్సీ కార్డులు జారీ చేయగా.. వీరిలో ఇప్పటికే 5.48 లక్షల మందికి రూ.1,908 కోట్ల పంట రుణాలు మంజూరయ్యాయి. -
తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. వారికి రైతుబంధు కట్!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. రైతుబంధులో సీలింగ్‌ను ప్రభుత్వం మొదలు పెట్టింది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ఏడు శాతం రైతులకు రైతు బంధును కట్ చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వివరాల ప్రకారం.. తెలంగాణలో రైతుల కోసం అమలవుతున్న రైతుబంధు పథకంపై కాంగ్రెస్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైతుబంధులో సీలింగ్‌ను మొదలుపెట్టింది. ఇందులో భాగంగా ఏడు శాతం రైతులకు రైతుబంధును కట్ చేయడానికి నిర్ణయించింది. ఈ ఏడు శాతంలో పాడుబడ్డ భూములు(సాగులో లేని భూములు), ట్యాక్స్ పేయర్స్, పలువురు పొలిటికల్ లీడర్లకు సంబంధించిన భూములు ఉన్నాయి. వీరి భూములకు రైతు బంధు కట్ చేసేందుకు కేబినెట్ కూడా ఆమోదం తెలిపినట్టు సమాచారం. మరోవైపు.. రాష్ట్రంలో రైతు భరోసా అమలు సమయానికి మరింత సీలింగ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. తెలంగాణలో ఇప్పటి వరకు 84 శాతం రైతులకు రైతుబంధు నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. మరో రెండు రోజుల్లో 93 శాతం మందికి రైతుబంధు నిధులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో, త్వరలోనే రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ కానున్నాయి. -
రైతుబంధు, రైతుబీమా నిధులు పక్కదారి!
కొందుర్గు: రైతుబంధు, రైతుబీమా నిధులను దారి మళ్లించిన కారణంగా రంగారెడ్డి జిల్లాలో ఒక ఏఈవోను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. 2020 నుంచి ఇప్పటివరకు దాదాపు 20 మందికిపైగా రైతుబీమా డబ్బులు, 130 మంది రైతుబంధు డబ్బులు పక్కదారి పట్టినట్లు తెలిసింది. రైతుబీమాకు సంబంధించి క్లెయిమ్ చేసే సమయంలో నామినీ వివరాలు, తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి సదరు ఏఈవో తన ఖాతా, కుటుంబసభ్యుల ఖాతా, బంధువులు, స్నేహితుల ఖాతా నంబర్లను ఎడిట్ చేసి బీమా కంపెనీకి పంపినట్లు సమాచారం. ఒకే ఖాతాకు వరుసగా డబ్బులు జమ అవుతున్నాయని అనుమానం వచ్చిన బీమా కంపెనీవారు వ్యవసాయ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేయగా విషయం వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. సంబంధిత అధికారుల సూచన మేరకు హైదరాబాద్ పోలీసులు ఆదివారం తెల్లవారుజామున ఏఈవోను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. రైతుబంధు డబ్బులను కూడా ఇలాగే నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి కాజేసినట్లు ప్రచారం జరుగుతోంది. రైతుబంధు, రైతుబీమా కలిపి సుమారు రూ.2 కోట్ల వరకు కాజేసినట్లు సమాచారం. హైదరాబాద్ కర్మన్‌ఘాట్‌లోని మరో ఇంట్లో కూడా విచారణ జరిపినట్లు సమాచారం. సదరు ఏఈవో కొందుర్గు, జిల్లేడ్ చౌదరిగూడ మండలాల్లో వ్యవసాయ భూములు కొనుగోలు చేసినట్లు స్థానికంగా చర్చించుకుంటున్నారు. అయితే ఈ విషయమై వ్యవసాయ శాఖ అధికారులు, పోలీసులు ఎలాంటి సమాచారాన్ని వెల్లడించడంలేదు. -
ఐదెకరాలా.. పదెకరాలా?
సాక్షి, హైదరాబాద్: రైతులకు పంట పెట్టుబడికోసం ఆర్థిక సాయం అందించే రైతుభరోసా (రైతుబంధు) పథకానికి సీలింగ్ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సాయాన్ని ఐదెకరాలకా లేదా పదెకరాలకా.. ఎంతకు పరిమితం చేస్తే బాగుంటుందన్న దానిపై తర్జనభర్జన పడుతోంది. ఐదెకరాలకే పరిమితం చేస్తే బాగుంటుందని అధికారులు సూచిస్తున్నట్లు సమాచారం. అంతేగాకుండా ఆదాయ పన్ను చెల్లిస్తున్నవారు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, సెలబ్రిటీలకు రైతుభరోసా ఇవ్వకూడదని భావిస్తున్నట్టు తెలిసింది. ఇటీవలి బడ్జెట్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధును పునఃసమీక్షిస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పథకంతో అనర్హులు కూడా లబ్ధి పొందుతున్నారన్నది కొత్త సర్కారు ఉద్దేశం. దీనికి అనుగుణంగా ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు ఢిల్లీలోని ‘ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రిమోట్ సెన్సింగ్’ను సంప్రదించారు. ఉపగ్రహ చిత్రాల ద్వారా సాగు, బీడు భూములను గుర్తించి.. ఆ వివరాల ఆధారంగా రైతు పెట్టుబడి సాయానికి పరిమితులు విధించనున్నారు. దీనిపై మార్గదర్శకాలను రూపొందించిన అనంతరం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారంగా వచ్చే వానాకాలం సీజన్ నుంచి కొత్త మార్గదర్శకాల ప్రకారం రైతుభరోసా అమలులోకి రానుంది. ఇచ్చే మొత్తం పెంచి.. 90% మందికే ఇచ్చి.. రైతుబంధు పథకం 2018 వానాకాలం సీజన్ నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. మొదట్లో ప్రతీ సీజన్‌కు ఎకరాకు రూ.4 వేల చొప్పున రైతులందరికీ ఇచ్చారు. ఇలా ఏడాదిలో రెండు సీజన్లకు కలిపి ఎకరానికి రూ.8 వేల చొప్పున అందేవి. తర్వాత ఈ సొమ్మును ప్రభుత్వం సీజన్‌కు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ. 10 వేలు చేసింది. అంటే రెండు సీజన్లు కలిపి 1.52 కోట్ల ఎకరాలకు చెందిన 68.99 లక్షల మంది రైతులకు ఏటా సుమారు రూ.15,250 కోట్లు అందజేశారు. కాంగ్రెస్ సర్కారు రైతుభరోసా కింద ఎకరాకు ఏటా రూ.15 వేలు ఇస్తామని ప్రకటించింది. ఈ లెక్కన 1.52 కోట్ల ఎకరాలకు సంబంధించి రూ.22,800 కోట్లు అవుతుంది. అలాకాకుండా ఐదెకరాలలోపు భూమి ఉన్న రైతులనే పరిగణనలోకి తీసుకుంటే.. పెట్టుబడి సాయం అందుకుంటున్న రైతుల్లో వారు 62.34 లక్షల మంది ఉన్నారు. అంటే.. మొత్తం లబ్దిదారుల్లో 90.36 శాతం. వీరికి మాత్రమే రైతుభరోసా పరిమితం చేయాలనుకుంటే.. రూ. 15వేల కోట్లు ఇస్తే సరిపోతుందని అంచనా. దీనివల్ల గత ప్రభుత్వం కన్నా రూ.5 వేలు ఎక్కువ ఇచ్చినట్టు ఉంటుందని.. అదే సమయంలో ఏటా ఇచ్చే మొత్తంలో పెద్దగా మార్పు ఉండదని అధికార వర్గాలు చెప్తున్నాయి. పైగా రూ. 7,800 కోట్లు ఆదా చేసుకోవచ్చని అంటున్నాయి. వాళ్లందరికీ కట్..! సాగుభూములకే రైతుభరోసా ఇస్తామని కొత్త ప్రభుత్వం ప్రకటించింది. సాగుచేయని, సాగుకు పనికిరాని కొండలు, గుట్టలకు, ఆఖరికి రోడ్లు ఉన్న స్థలాలకు కూడా రైతుబంధు ఇచ్చారని ప్రస్తుత ప్రభుత్వం చెప్తోంది. ఈ నేపథ్యంలో రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీ ద్వారా సాగు, బీడు భూములను గుర్తించనున్నామని.. తద్వారా అనర్హులను తొలగిస్తామని వ్యవసాయ శాఖ చెబుతోంది. అలాగే రాజకీయ నేతలు, ప్రజాప్రతినిధులు, సెలబ్రిటీలు, ఆదాయ పన్ను కట్టేవారికి కూడా పెట్టుబడి సాయం ఇవ్వకూడదని భావిస్తున్న నేపథ్యంలో.. ప్రభుత్వంపై రైతుభరోసా భారం మరింత తగ్గుతుందని పేర్కొంటున్నారు. -
రైతుబంధు ఇవ్వడానికి ఏం రోగం వచ్చింది
-
పెట్టుబడి.. మొక్కుబడి..!
సంగారెడ్డి: జిల్లాలో రైతుబంధు సాయం నత్తనడకన సాగుతోంది. ఇప్పటివరకు రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు జమయ్యాయి. మిగతావారు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టుబడి సాయం విడుదల చేస్తున్నామని నెలరోజుల క్రితం ప్రకటించింది. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో రైతుల ఖాతాల్లో దానికి సంబంధించిన డబ్బు జమ కాలేదు. రెండెకరాల భూమి ఉన్న రైతులకు మాత్రమే వారికి మాత్రమే పెట్టుబడి అందిందని రైతాంగం పేర్కొంటోంది. ఈ నెలాఖరు వరకు అర్హులందరికీ రైతు బంధు అందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఇప్పటికే యాసంగి పనులు మొదలయ్యాయి. సాయం సకాలంలో అందక సాగు కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సి వస్తుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతుబంధు పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఎకరం భూమికి ఒక్కో సీజన్లో రూ.7,500 వంతున సాయం అందిస్తామని ఎన్నికల ముందు ప్రకటించింది. రైతు భరోసా విధి విధానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో ఈ సీజన్‌కు గాను పాత విధానంలోనే ఎకరానికి రూ.5వేల వంతున సాయం అందిస్తోంది. సంగారెడ్డి జిల్లాలో 4,16,210 మంది రైతులు ఉన్నారు. ఈ సీజన్‌కు గాను రూ.393.21 కోట్ల మేర పెట్టుబడి సాయం రైతాంగం ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమచేయడం జరిగిందని అధికారులు పేర్కొంటున్నారు. అయితే ఎకరం లోపు ఉన్న కొంత మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం జమకాలేదని పేర్కొంటున్నారు. పెట్టుబడి సాయాన్ని ఐదెకరాలకు కుదించడం, ప్రభుత్వ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు, బడా వ్యాపారులు, ఆర్థికంగా వృద్ధి చెందిన వారికి ఇవ్వకూడదనే డిమాండ్ ముందు నుంచి వినిపిస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇదేమీ పరిగణనలోకి తీసుకోకుండా భూమి ఉండి.. పట్టాపాసు పుస్తకం పొందిన ప్రతి ఒక్కరికీ రైతుబంధు నిధులు జమ చేసింది. వందల ఎకరాల భూమి ఉన్న రైతులు, వ్యాపారులు, పారిశ్రామిక వేత్తలు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులకు కూడా పెట్టుబడి సాయం తీసుకున్నారు. ఈ విధానంతో రాష్ట్ర ఖజానా దివాలా తీసే పరిస్థితి ఏర్పడిందని అప్పట్లో ప్రతిపక్షాలు విమర్శించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసా కింద అందించే సాయం విషయంలో లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా సాగుతుందని ప్రకటించారు. యాసంగి సీజన్ సమయం మొదలు కావడంతో ఇప్పుడు విధి విధానాలు రూపొందించి సాయం జమచేయాలంటే ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో ప్రస్తుతం పాత పద్ధతిలోనే నిధులు జమచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వర్షాకాలం సీజన్ వరకు కొత్త మార్గదర్శకాలతో పెట్టుబడి సాయం జమచేసే అవకాశం ఉంది. పాత పద్ధతిలోనైనా మెజార్టీ రైతులకు సాయం అందలేదు. ప్రభుత్వ ఖజానాలో నిధుల కొరత కారణంగా జాప్యం జరుగుతోందనే అభిప్రాయం అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెట్టుబడి సాయం త్వరగా అందించాలని రైతాంగం కోరుతోంది. నెలాఖరుకు ఖాతాల్లో జమ రైతు బంధు విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ నెలాఖరు వరకు అందరి ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. ఇప్పటి వరకు రెండున్నర ఎకరాలు ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేశాం. ఇప్పటివరకు రూ.108 కోట్ల మేర రైతుల ఖాతాల్లో వేశాం. –నర్సింహారావు, జేడీఏ, సంగారెడ్డి -
రైతులకు గుడ్ న్యూస్: నేటి నుంచి రైతుబంధు జమ
నల్లగొండ టౌన్ : యాసంగి సీజన్ రైతుబంధు డబ్బుల జమ నేటి నుంచి వేగవంతం కానుంది. గత డిసెంబర్ 12న రైతుల ఖాతాల్లో రైతుబంధు జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. మొదటి రోజు ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమచేసే ప్రక్రియ ప్రారంభమైంది. అయితే ఈ కార్యక్రమం అట్టహాసంగా ప్రారంభమైనా నిధుల లేమితో ఈ ప్రక్రియ నత్తనడకన సాగింది. ప్రక్రియ ప్రారంభమై 26 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఎకరం భూమి ఉన్న రైతుల ఖాతాల్లో మాత్రమే డబ్బులు జమయ్యాయి. దీంతో రైతులు అసలు రైతుబంధు డబ్బులు వస్తాయా.. రావా అన్న మీమాంసలో ఉన్నారు. ప్రతి రోజు బ్యాంకుల చుట్టూ, వ్యవసాయ శాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. యాసంగి పెట్టుబడులకు ఉపయోగపడుతాయన్న రైతుబంధు డబ్బులు జమకాకపోవడంతో పెట్టబడుల కోసం రైతులు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు.. జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు రైతుబంధు పథకానికి అర్హులు కాగా ప్రతి సీజన్లో ప్రభుత్వం రూ.624,14,84,629 వారి ఖాతాల్లో జమ చేస్తుంది. ప్రస్తుత యాసంగి సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో ఎకరంలోపు భూమి ఉన్న రైతులు 1,14,542 మంది ఖాతాల్లో మాత్రమే రూ.27 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ గణాంకాలు చెపుతున్నాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు శనివారం రాష్ట్ర స్థాయి వ్యవసాయశాఖ అధికారుల సమావేశంలో రైతుబంధు పథకం డబ్బులు వేగంగా రైతుల ఖాతాల్లో జమచేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశంతో సోమవారం నుంచి రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం డబ్బులను జమ చేయనున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు చెపుతున్నాయి. దశల వారీగా జిల్లా వ్యాప్తంగా మిగిలిన నాలుగు లక్షలకు పైగా రైతుల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమకానున్నాయి. జనవరి నెలాఖరు నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేసేలా వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేసినట్లు తెలుస్తోంది. పెట్టుబడులకు ఇబ్బంది పడుతున్నాం యాసంగి సీజన్ పూర్తి కావస్తున్నందున రైతుబంధు పథకం డబ్బులను జమచేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం వేగవంతంగా పూర్తి చేయాలి. రైతుబంధు జమకాకపోవడం వల్ల పెట్టుబడులకు నానా ఇబ్బందులు పడుతున్నాం. – సోమగోని అంజయ్య, రైతు, గుండ్లపల్లి, నల్లగొండ మండలం -
ఎకరంలోపు వారికే రైతుబంధు జమ అయ్యాయి!
నల్లగొండ టౌన్: యాసంగి సీజన్ ఆరంభమై నెలన్నర గడుస్తున్నా రైతుబంధు పెట్టుబడి సాయం అందక రైతులు ఆందోళన చెందుతున్నారు. గత ప్రభుత్వం ఎకరానికి రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేల పెట్టుబడి సాయం అందజేస్తోంది. ఇప్పటి వరకు 12 విడతలుగా రైతుల ఖాతాల్లో సీజన్ ప్రారంభంలోనే పెట్టుబడి సాయ జమచేసింది. కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఎకరానికి రూ.7,500ల చొప్పున ఏటా ఎకరానికి రూ.15 వేల చొప్పున రైతుభరోసా పేరుతో పెట్టుబడి సాయం అందిస్తామని రైతులకు హామీ ఇచ్చింది. కానీ, ప్రభుత్వం రైతు భరోసాకు విధివిధానాలను సిద్ధం చేయని కారణంగా పాత పద్ధతిలోనే రైతులకు పెట్టుబడి సాయం అందిస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 12న రైతుల ఖాతాల్లో డబ్బులను జమచేయడం ప్రారంభించింది. ప్రక్రియ ప్రారంభించి 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేవలం ఎకరంలోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో సుమారు రూ.27 కోట్లు జమచేసింది. దీంతో ఎకరంపైగా భూమి ఉన్న మిగతా రైతులు పెట్టుబడి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. 5.42లక్షల మంది అర్హులుంటే.. రైతుబంధు పథకానికి జిల్లా వ్యాప్తంగా 5,42,406 మంది రైతులు అర్హులు కాగా వారి బ్యాంకు ఖాతాల్లో ప్రతి సీజన్‌కు రూ.624,14,84,629లను గత ప్రభుత్వం జమచేసింది. మొదట ఎకరంలోపు రైతులకు తర్వాత రెండెకరాలు, ఆ తర్వాత మూడు, నాలుగు ఇలా దశలవారీగా గత ప్రభుత్వం నెల రోజులలోపునే రైతులందరి ఖాతాల్లో రైతుబంధు సాయం జమచేసింది. ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు ఎకరం లోపు భూమి ఉన్న 1,14,542 మంది రైతులకు రూ.26,94,65,516లను జమచేసింది. వీరిలో పూర్తిగా ఎకరం భూమి ఉన్న వారికి కూడా డబ్బులు జమచేయని పరిస్థితి. జిల్లాలో ఇంకా 4లక్షల మందికిపైగా రైతులు రైతుబంధు డబ్బుల కోసం ఎదురుచూస్తున్న పరిస్థితి నెలకొంది. రైతుబంధు పెట్టుబడి సాయం కోసం వ్యవసాయ శాఖ కార్యాలయాలు, బ్యాంకుల చుట్టూ తిరిగి వాకబ్ చేస్తున్నా ఫలితం లేకుండా పోయిందని రైతులు వాపోతున్నారు. అసలు ప్రస్తుత ప్రభుత్వం పెట్టుబడి సాయం అందిస్తుందో లేదోనన్న రందీ రైతులలో నెలకొంది. యాసంగి సీజన్ ప్రారంభమై నెలదాటిన నేపథ్యంలో తమ పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం ఇప్పటికై నా రైతు బంధు డబ్బులు జమచేయాలని రైతులు కోరుతున్నారు. -
నేటి నుంచే రైతుబంధు నిధుల విడుదల..
సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకుఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేసే ప్రక్రియ మంగళవారం నుంచి ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వ్యవసాయశాఖపై సోమవారం ఆయన డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ తెలంగాణ సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీని వాసరెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంఓ కార్యదర్శి శేషాద్రి, వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావు తదితర అధికారులు పాల్గొన్నారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమీక్ష సమావేశంలో వ్యవసాయశాఖ, సంబంధిత విభాగాల పనితీరు, రైతు సంక్షేమ కార్యక్ర మాల అమలుపై విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ఏ ఒక్క రైతుకు ఇబ్బంది కలగకుండా పంట పెట్టుబడిసాయం అందించాలన్నారు. రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో జమచేసే విధానం గతంలో ఉన్న మాదిరిగానే కొనసాగించాలని ఆయన స్పష్టం చేశారు. 68.99 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందనుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రైతులకు రెండు లక్షల మేరకు రుణమాఫీ చేసేందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. వారానికి రెండ్రోజులు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజాదర్బార్‌ప్రజావాణిగా మార్పు ప్రజాదర్బార్‌ను ఇకనుంచి ప్రజావాణిగా పిలవాలని సీఎం ఆదేశించారు. దీనిని ప్రతీ మంగళ, శుక్రవారాల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహిస్తామన్నారు. ప్రజావాణికి ఉదయం 10లోగా జ్యోతిరావు పూలే ప్రజాభవన్‌కు చేరుకున్న వారికి అవకాశం ఇవ్వాలని సూచించారు. వికలాంగులు, మహిళలకు ప్రత్యేక క్యూలు ఏర్పాటు చేయాలని, తాగునీరు, ఇతర సౌకర్యాలు కల్పించాలని సీఎం ఆదేశించారు. తొలి ప్రజాదర్బార్ శుక్ర వారం నిర్వహించగా, ఆ తర్వాత రెండు రోజులు శని ఆదివారాలు సెలవు కావడంతో ప్రజా దర్బార్ నిర్వహించలేదు, సోమ వారం ప్రజా దర్బార్ ఉన్నా, సీఎం రేవంత్‌రెడ్డి కాకుండా ఐటీ మంత్రి శ్రీధర్ బాబు నిర్వహించారు, ఇకపై దీనికి ఎవరెవరు హాజరవుతారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. సీఎం ప్రజావాణికి హాజరై విజ్ఞప్తులు స్వీకరిస్తే అవి త్వరితగతిన పరిష్కారం అవుతాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
మూడింటిపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో బహుముఖ వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తేగా.. ఇప్పుడు రైతులకు సంబంధించిన అంశాలపై ఫోకస్ చేశారు. రైతు బంధు, రుణమాఫీలను వీలైనంత త్వరగా కొలిక్కి తెచ్చే యోచనలో రేవంత్ ఉన్నారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. వీటితోపాటు నామినేటెడ్ పోస్టుల భర్తీపైనా ఆయన దృష్టి సారించారని అంటున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) నుంచి ముఖ్య నేతల పేర్లు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శుల పేర్లను తెప్పించుకుని.. పదవుల పంపిణీపై కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. నామినేటెడ్ పదవుల్లో భాగంగా ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ హోదాపై స్పష్టత వచ్చిందని, తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఈ పదవి ఇవ్వాలని రేవంత్ నిర్ణయించుకున్నారని గాందీభవన్ వర్గాలు చెప్తున్నాయి. బ్యాంకులకు వాయిదాలు..రైతులకు ఒకేసారి రైతుల పంట రుణాల మాఫీ విషయంలో సీఎం రేవంత్ ఒక ఆలోచనకు వచ్చినట్టు సీఎంవో వర్గాల్లో చర్చ జరుగుతోంది. రైతుల కు రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో.. అందుకు అవసరమైన మొత్తాన్ని ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపై రేవంత్ పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్టు తెలిసింది. రైతులకు బ్యాంకుల్లో ఉన్న రుణమొత్తాన్ని బట్టి నిధులు విడుదల చేస్తూ దశల వారీగా మాఫీ చేయాలా? లేక ఒకేసారి రుణమాఫీ చేస్తున్నట్టు ప్రకటించాలా అన్న దానిపై ఉన్నతాధికారులు, ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నట్టు సమాచారం. రైతు రుణమాఫీ కోసం మొత్తంగా ఎంత ఖర్చవుతుందన్న దానిపై సీఎం ఇప్పటికే ఓ అంచనాకు వచ్చారని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. అంత మొత్తాన్ని ఒకేసారి విడుదల చేయడం సాధ్యంకాని పరిస్థితుల్లో.. బ్యాంకులతో చర్చించడం ద్వారా రుణమాఫీ అంశాన్ని పరిష్కరించాలనే యోచనలో ఉన్నారని వివరిస్తున్నాయి. మాఫీ కోసం రూ.36 వేల కోట్లు! రూ.లక్ష వరకు రుణమాఫీకి రూ.18–19 వేల కోట్ల వరకు అవసరమని.. రూ.2లక్షల వరకు అయితే రూ.30 వేల కోట్లు కావాలని ఆర్థిక శాఖ అధికారులు సీఎంకు వివరించినట్టు తెలిసింది. ఈ మొత్తాన్ని నెలవారీ వాయిదాలుగా బ్యాంకులకు చెల్లించే ప్రతిపాదనపై ముందుకెళ్లాలని ఆయన ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించినట్టు సమాచారం. మొత్తం రూ.30వేల కోట్లను ఐదేళ్లపాటు వడ్డీతో కలిపి చెల్లించాలంటే.. మొత్తంగా రూ.36 వేల కోట్లు అవుతాయన్న అంచనా వేసినట్టు తెలిసింది. దీంతో ప్రతి నెలా రూ.600 కోట్ల చొప్పున ఐదేళ్లపాటు రుణమాఫీ నిధులను బ్యాంకులకు చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇందుకోసం నోడల్ బ్యాంకును ఏర్పాటు చేసుకోవాలని, అవసరమైతే రిజర్వ్ బ్యాంకు (ఆర్బీఐ)తో చర్చించాలని భావిస్తున్నట్టు తెలిసింది. బ్యాంకులకు నెలవారీ వాయిదాల్లో చెల్లించినా.. రైతులకు మాత్రం ఒకేసారి మొత్తం రుణమాఫీ చేసేలా బ్యాంకులను ఒప్పించాలన్నది సీఎం ఆలోచన అని సీఎంవో వర్గాలు చెప్తున్నాయి. ఈ ప్రతిపాదనపై అన్ని వర్గాల నుంచి సానుకూలత వస్తే.. త్వరలోనే అధికారికంగా ప్రకటన చేయాలని భావిస్తున్నట్టు పేర్కొంటున్నాయి. 15వ తేదీకల్లా రైతు బంధు.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఇప్పటికే ఆ శాఖ అధికారులతో చర్చించిన సీఎం రేవంత్.. వీలైనంత త్వరగా రైతుబంధు సొమ్ము విడుదల చేసేలా నిధులు సమీకరించాలని ఆదేశించారు. ఎన్నికల ప్రచార సమయంలో రైతుబంధు విడుదలకు ఈసీ అనుమతించి, తర్వాత నిలిపివేసిన విషయం తెలిసిందే. దాంతో తాము డిసెంబర్ 9న అధికారంలోకి వస్తామని, తర్వాత 10 రోజుల్లో రైతుబంధు సొమ్మును జమ చేస్తామని పీసీసీ చీఫ్ హోదాలో రేవంత్ హామీ ఇచ్చారు. ఈ మేరకు 19వ తేదీనాటికి రైతుబంధు నిధులను విడుదల చేయాల్సి ఉంది. అంతకు నాలుగు రోజుల ముందే, అంటే ఈ నెల 15వ తేదీకల్లా సుమారు 70లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7 వేల కోట్లను జమ చేయాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. నామినేటెడ్ పదవులపై కసరత్తు ఓ వైపు పాలన, మరోవైపు పథకాల అమలుపై దృష్టి సారించిన సీఎం రేవంత్.. వాటికి సమాంతరంగా నామినేటెడ్ పదవుల భర్తీపై కసరత్తు చేస్తున్నారు. పదేళ్లుగా అధికారానికి దూరమై ప్రభుత్వ పదవుల కోసం ఎదురుచూస్తున్నవారు, గత ఎన్నికల్లో పోటీ అవకాశం రాని నేతలను నామినేటెడ్ పదవుల్లో నియమించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు గాందీభవన్ నుంచి ముఖ్య నేతలు, టీపీసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అనుబంధ సంఘాల నేతల పేర్లను తెప్పించుకున్నారని టీపీసీసీ వర్గాలు తెలిపాయి. పార్టీలోని నేతలతోపాటు పార్టీకి అండగా నిలిచిన బయటి ముఖ్యుల సేవలనూ వినియోగించుకోవాలని రేవంత్ యోచిస్తున్నారని వెల్లడించాయి. ఇందులో భాగంగా టీజేఎస్ అధినేత కోదండరాం, మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి తదితరుల పేర్లను పరిశీలిస్తున్నారని వివరించాయి. ఆప్తుడికి తొలి నామినేటెడ్ పదవి? సీఎం రేవంత్‌రెడ్డి నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా తొలి పదవిని తనకు సన్నిహితుడైన మాజీ ఎమ్మెల్యే వేం నరేందర్‌రెడ్డికి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయనను కేబినెట్ హోదా ఉండే రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్‌గా నియమించాలని రేవంత్ భావిస్తున్నట్టు తెలిసింది. వేం నరేందర్‌రెడ్డి చాలా కాలం నుంచి రేవంత్ వెన్నంటే ఉంటున్నారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ.. పీసీసీ చీఫ్‌గా ఉన్న రేవంత్ శిబిరంలో కీలకంగా వ్యవహరించారు. తెర వెనుక ఉండి ప్రచారం, అభ్యర్థులతో సమన్వయం, కేడర్‌ను కదిలించడం, సభల ఏర్పాటు, నిర్వహణ వంటివి చూసుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని కూడా పట్టుబట్టలేదు. ఈ నేపథ్యంలో వేం నరేందర్‌రెడ్డికి తగిన గుర్తింపు ఇవ్వాలని రేవంత్ యోచిస్తున్నారని, త్వరలోనే ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని టీపీసీసీ వర్గాలు చెప్తున్నాయి. -
‘రైతుబంధు’ ఇంకా ఇవ్వలేదేం?
సాక్షి, హైదరాబాద్: అధికారంలోకి రాగానే రైతుబంధును పెంచిన డబ్బు (ఎకరాకు రూ. 5 వేల బదులు రూ. 7,500)తో రైతుల ఖాతాల్లో వేస్తామన్న మాటేమైందని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో డిసెంబర్ 9న రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో వేస్తామని చెప్పారని, ఇచ్చిన మాటపై రైతులకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. శనివారం అసెంబ్లీ మీడియా పాయింట్లో విలేకరులతో హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి ప్రభు త్వంపై విమర్శలు చేయట్లేదని... దీనిపై ప్రజలు, రైతులపక్షాన ప్రభుత్వాన్ని అడుగుదామని వచ్చామన్నారు. ఎకరాకు ఏటా రూ. 15 వేలు అంటే.. యాసంగి పంటకు ఎకరానికి రూ. 7,500 చొప్పున ఇవ్వాలన్నారు. యాసంగి పంట పనులు ప్రారంభమయ్యాయని, రైతులకు ఇచ్చిన మాట ప్రకారం రైతుబంధు ఎప్పటి నుంచి వేస్తారో రైతులకు చెప్పా లని కోరారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం యాసంగి పంటకు నవంబర్ చివరివారం లేదా డిసెంబర్ మొదటి వారంలో రైతుబంధు డబ్బు వేసేవాళ్లమని గుర్తు చేశారు. ప్రమాణస్వీకారం చేసిన ఎమ్మెల్యేలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. బోనస్‌తో పంటను కొనాలి.. రైతాంగం అంతా ప్రభుత్వం పంట ఎప్పుడు కొంటుందోనని ఎదురు చూస్తోందని హరీశ్‌రావు తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల ప్రచారంలో రైతులను వడ్లు అమ్ముకోవద్దని చెప్పారని... అధికారంలో రాగానే రూ. 500 బోనస్‌తో వడ్లు కొంటామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. పంట మొత్తం కల్లాల్లో ఉందని, రైతులంతా కళ్లలో వత్తులేసుకొని ఎదురుచూస్తున్నారని, ఒకవైపు తుపాను ప్రభావంతో కొన్ని చోట్ల వడ్లు తడుస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘రూ. 500 బోనస్ ఎప్పుడు ఇస్తారు? వడ్లు ఎప్పటి నుంచి కొంటారు’అని హరీశ్ ప్రశ్నించారు. -
తెలంగాణ తీర్పును దేశం గమనిస్తోంది
సాక్షి, కామారెడ్డి: ‘కేసీఆర్ పాములాంటి వాడు. ఓటు వేశారో మిమ్మల్నే కాటు వేస్తాడు. కేసీఆర్‌ను నమ్మడం అంటే పాముకు పాలుపోసి పెంచినట్టే. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడుతుంది. పదో తేదీన రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తాం’అని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. మంగళవారం కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు దోమకొండ, బీబీపేట మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, కార్నర్ మీటింగుల్లో ఆయన ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. కేసీఆర్ ఓడినా, గెలిచినా ఫాంహౌస్‌లోనే పడుకుంటాడని, కామారెడ్డి ప్రజల భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడేందుకే తాను వచ్చానని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ డబుల్ బెడ్రూంలు ఎంతమందికి ఇచ్చాడని, నిరుద్యోగులకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడని ప్రశ్నించారు. గజ్వేల్‌ను వదిలి సిద్దిపేటకో, సిరిసిల్లకో పోకుండా కామారెడ్డికి రావడంలోనే మతలబు ఉందన్నారు. మాస్టర్ ప్లాన్‌ను తాత్కాలికంగా రద్దు చేసినా, ఎన్నికల తరువాత మళ్లీ తెరపైకి తెచ్చి భూములను లాక్కుంటారని వివరించారు. తెలంగాణ దశ, దిశను మార్చే తీర్పును దేశమంతా గమనిస్తోందన్నారు. బీఆర్ఎస్ నేతలు ఓటుకు రూ.పది వేలు ఇచ్చి, రూ.పదివేల కోట్ల విలువైన భూములు లాక్కుంటారని ఆరోపించారు. వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం.... పదేళ్లుగా అధికారంలో ఉన్న కేసీఆర్ వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేస్తానని చెప్పి వైశ్యులను మోసం చేశాడని, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి కాంగ్రెస్ కృషి చేస్తుందని రేవంత్ చెప్పారు. గల్ఫ్ కార్మికులకు సంక్షేమ నిధిని ఏర్పాటుచేసి వారికి అండగా ఉంటామని, కామారెడ్డిలో పరిశ్రమల కారిడార్‌ను ఏర్పాటు చేసి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. అందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కోరారు. -
కేసీఆర్‌కు కొత్త సంకటం.. రేవంత్ వ్యూహం ఫలించేనా?
తెలంగాణ శాసనసభ ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్), కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ఒకదానిపై ఒకటి పోటీ పడుతూ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించాయి. ఈ క్రమంలో తాజాగా వచ్చిన వివాదం రైతుబంధు నిధుల పంపిణీ. తొలుత రైతులకు ఈ నిధుల పంపిణీకి అనుమతించిన ఎన్నికల సంఘం, మళ్లీ దానిని నిలిపివేయడంతో పార్టీల మధ్య రచ్చరచ్చ అయింది. రైతుబంధు ఆగడం వల్ల ఎవరికి నష్టం? ఎవరికి ప్రయోజనం అన్నది ఆలోచిస్తే రాజకీయంగా బీఆర్ఎస్కు కొంత ఇబ్బందికర పరిస్థితి అని చెప్పక తప్పదు. నిజానికి రైతుబంధు పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ పేటెంట్. ఆయన కొన్ని సంవత్సరాలుగా దీనిని విజయవంతంగా అమలు చేస్తున్నారు. ప్రతీ సీజన్లోనూ ఎకరాకు ఐదువేల రూపాయల చొప్పున రైతుల బ్యాంకు ఖాతాలలో పెట్టుబడి సాయం కింద జమ చేస్తున్నారు. ఎన్నికల ముందు ఈ డబ్బు వేస్తే రాజకీయంగా ఉపయోగం ఉంటుందని ఏ పార్టీ అయినా ఆలోచిస్తుంటుంది. అలా చేయడం రైటా? రాంగా? అన్న చర్చలోకి వెళ్లడం లేదు. కొద్ది రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల సంఘం అనుమతి కోరడం, దానికి ఈసీ ఓకే చేస్తూ కొన్ని కండీషన్లు పెట్టడం జరిగింది. వాటి ప్రకారం ఈ అంశాన్ని ఎన్నికల ప్రచారంలో వాడుకోరాదు. కానీ, మంత్రి హరీశ్‌రావు అత్యుత్సాహంతో ఎన్నికల ప్రచార సభలో పోలింగ్‌కు ముందే రైతుబంధు డబ్బులు జమ అవుతాయంటూ చేసిన వ్యాఖ్య ఆ పార్టీకి చికాకు అయింది. తాను కేవలం ఎన్నికల సంఘం నిర్ణయాన్ని స్వాగతించానని, కాంగ్రెస్ ఫిర్యాదువల్లే ఇది ఆగిందని ఆయన అంటున్నారు. ఈ పరిణామంతో నెగిటివ్ రాకుండా చూసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఎమ్మెల్సీ కవిత తదితర బీఆర్ఎస్ నేతలంతా ఒక్కసారిగా రంగంలోకి దూకారు. రైతు బంధు నిలిపివేత అంశం అంతటిని కాంగ్రెస్‌పై నెట్టడానికి బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా యత్నించారు. కానీ, ఎన్నికల సంఘం నేరుగా హరీశ్ రావు పేరు ప్రస్తావించడంపై వివరణ ఇవ్వలేని పరిస్థితిలో వారు పడ్డారు. అయితే, ఎటూ తామే పవర్లోకి వస్తామని, డిసెంబర్ ఆరో తేదీన ఈ డబ్బు రైతులకు ఇస్తామని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ఇన్నేళ్లుగా ఈ స్కీమును అమలు చేస్తున్నారు కనుక రైతులు విశ్వసించే అవకాశం ఉంటుంది. అందువల్ల ఆ కోణంలో బీఆర్ఎస్కు పెద్ద నష్టం ఉండదు. నిజానికి రైతులకు మరో పది రోజుల తర్వాత వారి ఖాతాలలోకి రైతుబంధు నిధులు జమ చేస్తే వచ్చే సమస్య ఏమీ ఉండదు. ఇన్నాళ్లు ఆగిన రైతులు మరో పది రోజులు ఆగలేకపోరు. కానీ, బీఆర్ఎస్ వేసిన వ్యూహానికి ఆటంకం ఏర్పడిందని చెప్పాలి. సరిగ్గా పోలింగ్ రెండు రోజుల మందు డబ్బులు పడితే రైతులంతా సంతోషిస్తారని, తద్వారా రాజకీయంగా తమకు మేలు కలుగుతుందని అనుకొని ఉండవచ్చు. కానీ, అనూహ్యంగా ప్లాన్ రివర్స్ అవడం వారికి నిరుత్సాహం కలిగించవచ్చు. బీఆర్ఎస్ నేతలంతా జనంలోకి వెళ్లి కాంగ్రెస్ నేత నిరంజన్ ఫిర్యాదువల్లే రైతుబంధు ఆగిందని చెబుతున్నారు. దీనిని కాంగ్రెస్ తిప్పికొట్టడానికి కృషి చేస్తున్నా, రైతులు ఈ పార్టీ వల్లే రైతుబంధు నిలిచిందని నమ్మితే కొంత నష్టం జరగవచ్చు. ఇప్పటికే రేవంత్, తదితరులపై రైతు వ్యతిరేక ముద్ర వేస్తూ కేసీఆర్ తదితరులు ప్రచారం సాగిస్తున్నారు. మూడు గంటల ఉచిత విద్యుత్ సరిపోతుందని రేవంత్ అన్నారని, రైతుబంధు డబ్బులు దండగ అని మరో కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారంటూ వీరు ఈ నెల రోజులపాటు విపరీత ప్రచారం చేశారు. దానిని తోసిపుచ్చలేక కాంగ్రెస్ సతమతమైంది. ఇప్పుడు రైతుబంధు నిధులను కాంగ్రెస్ ఆపిందన్న విమర్శను ఎదుర్కోవలసి వస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి తెలివిగా కౌంటర్ ఇస్తూ, కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తాము హామీ ఇచ్చిన విధంగా పదిహేను వేల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేస్తామని ప్రకటించారు. దీనికి రైతులు ఆకర్షితులైతే కాంగ్రెస్‌కు రాజకీయంగా ప్రయోజనం జరగవచ్చు. కాకపోతే అధికారంలోకి వచ్చిన ఎన్నాళ్లకు పదిహేనువేలు ఇస్తారో రేవంత్ చెప్పలేదు. పైగా అది అంత తేలికకాదన్న విషయం అందరికీ తెలుసు. పదివేల రూపాయలనే రెండు విడతలుగా ఇవ్వడానికే వేల కోట్ల రూపాయల వ్యయం అవుతోంది. అలాంటిది ఒకేసారి ఎకరాకు పదిహేనువేల చొప్పున ఇవ్వడం అంటే దాదాపు అసాధ్యమే కావచ్చు. అయినా రైతులు తమకు ఇంకా ఎక్కువ మొత్తంలో డబ్బు వస్తుందని నమ్మితే అది కాంగ్రెస్‌కు మేలు చేయవచ్చు. బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఈ విషయంలో రెండు పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని విమర్శించారు. గతంలో కూడా ఎన్నికల సమయంలో ఇలాంటి ఘట్టాలు జరగకపోలేదు. 1999 ఎన్నికల సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ఏపీలోని చంద్రబాబు ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్ష కాంగ్రెస్ ఆరోపించింది. ఆనాటి కాంగ్రెస్ నేత రోశయ్య ఈ మేరకు ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. దానిపై తెలుగుదేశం పార్టీ నానా యాగీ చేసింది. కాంగ్రెస్ వల్ల పేదలకు నష్టం జరుగుతోందని చంద్రబాబు ప్రచారం చేశారు. ఆ ఎన్నికలలో దీని ప్రభావం ఎంత పడిందన్నది వేరే విషయం. ఎందుకంటే వాజ్ పేయిపై ప్రజలలో ఉన్న సానుభూతి ఉపయోగపడి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆయా స్కీములలో ఎన్నికల ముందు డబ్బులు ఇచ్చినంత మాత్రాన పార్టీలు అధికారంలోకి రావాలని లేదు. ఒక్కోసారి ప్రయోజనం ఉంటుంది. ఇంకోసారి ఉండకపోవచ్చు. ఉదాహరణకు 2019లో ఏపీలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ అంటూ హడావుడిగా రెండు స్కీములు తెచ్చి వేల కోట్ల పందారం చేసింది. అయినా ఆ ఎన్నికలలో ఘోరంగా ఓడిపోయింది. 2018 ఎన్నికలలో తెలంగాణలో బీఆర్ఎస్కు రైతుబంధు పథకం బాగా ఉపయోగపడింది. దానికి కారణం కేసీఆర్‌ను జనం నమ్మడమే. అయితే, ఎన్నికల సమయంలో ఇలాంటివి చాలా సెన్సిటివ్‌గా ఉంటాయి. ఈ తరహా స్కీముల విషయంలో ఫిర్యాదు చేస్తే ఒకరకంగా, ఫిర్యాదు చేయకపోతే ఇంకో రకంగా రాజకీయం ఉంటుంది. అది ఆ సందర్భాన్ని బట్టి ప్రజల మూడ్‌ను బట్టి ఉంటుంది. రైతుబంధు నిధుల తాత్కాలిక నిలిపివేత వల్ల రాజకీయ పార్టీలకు ఏమైనా ఇబ్బంది ఉంటుందేమో కానీ, రైతులకు పెద్ద నష్టం ఉండదని చెప్పవచ్చు. -కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
తెలంగాణలో రైతుబంధు కింద నగదు బదిలీకి అనుమతి రద్దు చేసిన ఎన్నికల సంఘం.. ఇంకా ఇతర అప్డేట్స్
-
రైతుబంధుకు బ్రేక్.. రేవంత్ ఆసక్తికర కామెంట్స్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధుకు ఈసీ బ్రేక్ ఇవ్వడంతో బీఆర్ఎస్ బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. దీంతో, బీఆర్ఎస్పై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా రైతుబంధుతో ఓట్లు దండుకోవాలని వేసిన ప్లాన్‌కు బ్రేక్ పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌పై ఫైరయ్యారు. కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. హరీశ్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం’ అని అన్నారు. రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk — Revanth Reddy (@revanth_anumula) November 27, 2023 ఇక, రైతుబంధును ఎన్నికల సందర్భంగా నిలిపివేయడానికి హరీశ్ కామెంట్స్ కారణమని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ ఈసీ అనుమతి నిరాకరించింది. దీంతో, బీఆర్ఎస్ ప్లాన్ రివర్స్ అయ్యింది. -
మోదీ-కేసీఆర్ ఫెవికాల్ బంధం బయటపడిందిలా..: రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో డబ్బు సంచులతో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారని.. ఓటుకు పదివేలు ఇచ్చి నగదు బదిలీ పథకం మొదలైందని, ఈ ఓట్ల కొనుగోలు రాజకీయానికి బీజేపీ సహకారం అందిస్తోందని టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో రైతు బంధు నిధుల జమకు సీఈసీ అనుమతులు ఇవ్వడంపైనా అభ్యంతరం వ్యక్తం చేస్తూ బీఆర్ఎస్-బీజేపీలపై తీవ్ర విమర్శలే గుప్పించారాయన. ‘‘కేసీఆర్, మోదీ మధ్య ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ఇక్కడ ప్రధానంగా నేను మూడు అంశాలను ప్రస్తావిస్తున్నా. రైతు బంధు, వివేక్.. పొంగులేటి ఇంట్లో ఐటీ దాడులు, గోయల్ ఇంట్లో 300 కోట్లను సీజ్ చేయకపోవడం.. కాంగ్రెస్ నాయకులపై లాఠీ ఛార్జ్ చేయడం. .. 2018లో జూన్ లో రైతు బంధు పథకం ప్రారంభించారు. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో 2018లో షెడ్యూల్ వచ్చాక రైతు బంధు విడుదల చేశారు. ఆనాడు ప్రజల సొమ్ముతో ఎన్నికలను ప్రభావితం చేశారని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. 2023 ఎన్నికల నేపథ్యంలో నవంబర్ 15లోగా రైతు బంధు వేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం పథకాన్ని దుర్వినియోగం చేయకుండా చూడాలని కోరాం. కానీ పోలింగ్ నాలుగు రోజులు ఉండగా రైతు బంధు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బీఆరెస్ కు సహకరించింది. .. అలా బీజేపీ బీఆర్ఎస్ ఫెవికాల్ బంధం మరోసారి బయటపడింది. ఎన్నికల ముందు రైతు బంధు వేయడంతో.. రైతులకు నష్టం జరుగుతోంది. కౌలు రైతులు, రైతు కూలీలైతే పూర్తిగా నష్టపోతున్నారు. బీఆర్ఎస్ ఇచ్చే రైతు బంధుతో రైతులు ప్రలోభాలకు గురి కావొద్దు. రైతులు ఆందోళన చెందొద్దు. కేసీఆర్ ఇచ్చేవి తీసుకోండి. కాంగ్రెస్ వచ్చాక.. మేం ఇవ్వాల్సింది మేం ఇస్తాం. .. ప్రభుత్వ సొమ్ముతో ప్రజల ఓట్లు కొనాలని కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. 2018లాగే ఇప్పుడూ కేసీఆర్ ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా.. మోదీ జేసీబీలు పెట్టి లేపినా బీఆరెస్ ఓటమి ఖాయం. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు భరోసాను పూర్తిగా అమలు చేస్తుంది. .. వివేక్ బీజేపీలో ఉండగా రాముడికి పర్యాయపదంగా ఆయన్ను చూపించారు. కానీ కాంగ్రెస్ లో చేరాక బీజేపీ కి ఆయన రావణాసురుడిగా కనిపించారు. బీజేపీ, బీఆరెస్ కలిసి ఆయన్ని అంతర్జాతీయ ఆర్థిక ఉగ్రవాదిగా చిత్రీకరిస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బంధువైన పాపానికి రఘురామ్ రెడ్డిపై అక్రమ కేసులు పెట్టారు బంధుత్వం కూడా బీఆరెస్ దృష్టిలో నేరంగా కనిపిస్తోంది. సీనియర్ నేత ఆర్. సురేందర్ రెడ్డిపై ఇప్పటివరకు వేలెత్తి చూపిన వారు లేరు. ఒప్పందంలో భాగంగానే బీజేపీ, బీఆరెస్ వారిని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ సలహాదారు ఏకే గోయల్ ఇంట్లో వెయ్యి కోట్ల రూపాయల పంపిణీ జరిగిందని మేం ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. వికాస్ రాజ్ కు కాంగ్రెస్ నేతల ఫోన్స్ కూడా ఎత్తడం లేదు. ఈడీలు, ఇన్ కమ్ టాక్స్ లు కేవలం కాంగ్రెస్ పైనే పనిచేస్తాయా?. జరుగుతున్న పరిణామాలను తెలంగాణ సమాజం గమనించాలి. బీఆరెస్, బీజేపీ ప్రసంగాలకు , జరుగుతున్న తతంగాలకు పోలిక లేదు. కాంగ్రెస్ గెలుస్తుందనే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ప్రజల సొమ్ముతో బీఆరెస్ ఓట్ల కొనుగోలుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తోంది. జరుగుతున్న పరిణామాలను గమనించి తెలంగాణ ప్రజలు విచక్షణతో ఓటు వేయాలి అని తెలంగాణ ప్రజల్ని రేవంత్ కోరారు. -
కారుకు తోడుగా ‘రైతుబంధువులు’
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన రైతుబంధు సమితి సభ్యులు ఇప్పుడు బీఆర్ఎస్కు ఎన్నికల్లో పూర్తిస్థాయిలో సహకారం అందిస్తున్నారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా ఊరూరా రైతులను కలుస్తూ ఈ సమితులు పార్టీ గెలుపునకు వ్యూహరచన చేస్తున్నాయి. రైతుబంధు పంపిణీ, రైతుబీమా పథకంలో రైతులను చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన సమన్వయ సమితులు... ఇప్పుడు ఆయా సాయాలను గుర్తుచేస్తూ రైతులను పార్టీ వైపు తిప్పేందుకు పని చేస్తున్నాయి. విత్తనం వేసింది మొదలు పంట పండాక మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు అండగా ఉండేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు సమితులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఆ చెక్కుల పంపిణీ, రైతుబీమాలో రైతుల చేరిక వంటి సందర్భాల్లో ఈ సభ్యులు అంతా తామై వ్యవహరించారు. చెక్కుల పంపిణీకి, బీమా పథకంలో చేరికకు సంబంధించి ఎవరు నిజమైన రైతులో కాదో నిర్ధారించింది కూడా వీళ్లే. ఇంతలా గ్రామస్థాయిలో రైతులతో మమేకమై పనిచేసిన ఈ సమితులు ఇప్పుడు రైతులకు అందిన లబ్ధిని వివరిస్తూ, ఓట్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నాయి. ఇప్పటికే రైతుబంధు సొమ్ము రూ.75 వేల కోట్లు రైతులకు చెల్లించినట్లు వారు ప్రజల్లో ప్రచారం చేస్తున్నారు. 1.61 లక్షల మంది సభ్యులు... రైతుబంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ సమితుల్లోని సభ్యులు ప్రభుత్వపరంగా నామినేట్ పదవుల్లో ఉన్నట్టు. రాష్ట్రంలోని 10,733 గ్రామాల్లోనూ రైతు సమన్వయ సమితులు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 15 మంది చొప్పున అన్ని గ్రామాల్లోనూ 1.61 లక్షల మంది సభ్యులను నియమించారు. దాంతోపాటు ప్రతీ గ్రామానికి ఒక సమన్వయకర్త ఉంటారు. ఆపై 24 మందితో మండల సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. అలా అన్ని మండలాలకు 13,416 మందిని నియమించారు. ప్రతీ మండలానికి మళ్లీ ఒక మండల రైతు సమితి సమస్వయకర్తను నియమించారు. వీరందరితో కలిపి జిల్లా సమన్వయ సమితిని ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకు 24 మంది చొప్పున జిల్లా సమితి సభ్యులను నియమించారు. దీనికి జిల్లా సమన్వయకర్త ఉంటారు. అనంతరం రాష్ట్రస్థాయిలోనూ సమన్వయ సమితి పనిచేస్తుంది. రాష్ట్ర రైతుబంధు సమితికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య చైర్మన్‌గా నియమించి, కేబినెట్ హోదా కల్పించారు. అంతకుముందు దీనికి గుత్తా సుఖేందర్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి చైర్మన్లుగా పనిచేశారు. నామినేట్ పదవులు కావడంతో వారంతా సుశిక్షితులైన సైన్యంగా బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి వర్గాలు చెబుతున్నాయి. ఇప్పుడు వీరందరినీ సమన్వయం చేసుకుంటూ తాటికొండ రాజయ్య పర్యవేక్షిస్తున్నారు. ఒక అంచనా ప్రకారం ప్రతీ 32 మంది రైతులకు ఒక రైతు సమన్వయ సమితి సభ్యుడున్నారు. ఆయా రైతులందరినీ సమన్వయపరిచి బీఆర్ఎస్కు ఓటేసేలా వీరంతా కసరత్తు చేస్తున్నారు. కాగా, ప్రసుతం వీరికి రెమ్యునరేషన్ లేదు. వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నట్లు ఒక్కో సభ్యునికి నెలకు రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు రెమ్యునరేషన్ రాబోయే రోజుల్లో ఇచ్చే అవకాశం ఉంది. -బొల్లోజు రవి -
ఎన్నికలు రాగానే ఆగం కావొద్దు: కేసీఆర్
-
రైతు బంధు ఆపాలని ఎక్కడా చెప్పలేదు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పంపిణీని ఆపాలని తాను ఎక్కడా చెప్పలేదని, కాంగ్రెస్ నేతలెవరూ ఎప్పుడూ అనలేదని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. రైతుబంధు ఆపాలని కాదు, ఇంకా పెంచాలనే తాము డిమాండ్ చేశామన్నారు. శనివారం గాందీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఓటమి భయంతో సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇష్టారాజ్యంగా అసత్యాలు మాట్లాడుతున్న కేసీఆర్ కుటుంబం తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పిన తర్వాతే ఓట్లు అడగాలని డిమాండ్ చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే.. తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వమేనని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. రైతులకు ఒకేసారి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని తమ మేనిఫెస్టోలో పెట్టామని చెప్పారు. ప్రస్తుత బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని, కాంగ్రెస్ అధికారంలో వచ్చి న తర్వాత రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చి తీరుతామని ప్రకటించారు. అలాగే వరి ధాన్యానికి రూ.500 బోనస్ ఇస్తామని, రైతుబంధు కంటే మిన్నగా రైతు భరోసాను తీసుకొచ్చి రూ.15 వేలు ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. విజయశాంతిని స్వాగతిస్తున్నాం కాంగ్రెస్ పార్టీ లోకి విజయశాంతిని స్వాగతిస్తున్నామని.. ఆమెను పార్టీ ప్రచార, ప్రణాళిక కమిటీ చీఫ్ కోఆర్డినేటర్‌గా హర్షణీయమని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. విజయశాంతి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని, ఆమె చేరికతో కాంగ్రెస్‌కు మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. -
రైతుబంధుని కాంగ్రెస్ 2014లోనే తీసుకువచ్చింది: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్
-
ఎన్నికల సమయంలో‘రైతుబంధు’ ఆపండి
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు నిధులను రాష్ట్రంలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందు కానీ, నవంబర్ 30న పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత కానీ విడుదల చేసేలా జోక్యం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు బుధవారం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. పింఛన్లు మినహా ఇతర నగదు ప్రయోజనాల పంపిణీని నోటిఫికేషన్ రోజు నుండి పోలింగ్ రోజు వరకు 27 రోజుల పాటు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. రైతుబంధు పథకం రెండోవిడత నిధులను ఇప్పటివరకు విడుదల చేయలేదని తెలిపారు. నోటి ఫికేషన్ విడుదలైన తర్వాత నిధులు విడుదల చేయడం ద్వారా బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటర్లను ప్రభావితం చేసే అవకాశాలున్నాయని చెప్పారు. 2018 ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున రైతుబంధు నిధులు విడు దల చేసి ఓటర్లను ప్రభావితం చేశారని ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్‌రావ్ ఠాక్రే, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సల్మాన్ ఖుర్షిద్, జైరామ్ రమేష్‌లు బుధవారం ఢిల్లీలో ఈసీని కలిశారు. ఈ భేటీ అనంతరం రేవంత్ మీడియాతో మాట్లాడారు. పలు అంశాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశామని తెలిపారు. కేసీఆర్ ప్రైవేట్ సైనికులుగా..: రేవంత్ రాష్ట్రంలోని కొంతమంది అధికారులను బీఆర్ఎస్ సొంత పార్టీ నాయకులు మాదిరి ఉపయోగించుకుంటోందని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన డీజీపీ అంజనీ కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రలతో పాటు రిటైర్డ్ ఆఫీసర్లు వేణుగోపాలరావు, నర్సింగరావు, భుజంగరావు, జగన్మోహన్ రావులు ఈ జాబితాలో ఉన్నారన్నారు. సర్విసులో ఉన్న వాళ్లను సిట్, ఇంటెలిజెన్స్‌లో నియమించి ప్రతిపక్ష పార్టీలపై నిఘా పెట్టాల్సిందిగా ఆదేశించారని, టెలిఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఆరోపించారు. ఈ అధికారులందరూ కేసీఆర్ ప్రైవేట్ సైనికులుగా పనిచేస్తున్నారని ఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు. అధికారులు అరవింద్ కుమార్, సోమేశ్ కుమార్, స్మిత సబర్వాల్, రాజశేఖర్‌లు బీఆర్ఎస్ ఎన్నికల నిర్వహణను పర్యవేక్షిస్తున్నారని ఆరోపించారు. దీర్ఘకాలంగా ఒకే పదవిలో కొనసాగుతున్న వారిపై దృష్టి పెట్టాల్సిందిగా ఈసీని కోరామన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంచడం, లిక్కర్ సరఫరా విపరీతంగా జరుగుతోందని, గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో 20 రోజుల్లో రూ.300 కోట్ల మద్యం అమ్మారని అన్నారు. ఓటర్లను మద్యంలో ముంచి ఓట్లు వేయించుకోవా లని కేసీఆర్ చూస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో నామినేషన్లు మొదలు ఓటింగ్ ముగిసేవరకు మద్యాన్ని నిషేధించాల్సిందిగా ఈసీని కోరినట్లు తెలిపారు. ఖర్గే కార్యక్రమాల సమన్వయకర్తగా... తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కార్యక్రమాల సమన్వయకర్తగా ఏఐసీసీ కార్యదర్శి బీఎం సందీప్ నియమితులయ్యారు. ఈ మేరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. బీఆర్ఎస్పై ఫిర్యాదు: ఉత్తమ్ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నికలు అత్యంత అవినీతిమయంగా మారాయని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి అనుకూలమైన అధికారులను కీలక ఎన్నికల విధుల్లో పెట్టడంపై ఫి ర్యాదు చేశామని చెప్పారు. ప్రభుత్వ భవనాలైన ముఖ్యమంత్రి అధికారిక నివాసం, ఎమ్మెల్యేల క్యాంపు కార్యాలయాలను రాజకీయ కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారని కూడా ఫిర్యాదు చేశామన్నారు. -
రైతుబంధు చైర్మన్‌గా టి.రాజయ్య బాధ్యతలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతుబంధు సమితి చైర్మన్‌గా తాటికొండ రాజయ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ తెలంగాణ రైతుబంధు సమితి సీఎం కేసీఆర్ మానస పుత్రిక అన్నారు. ఈ సమితిలో 1.60 లక్షల మంది సభ్యులున్నారని, సీఎం కేసీఆర్ సహకారంతో ఈ సంస్థను మరింత బలోపేతం చేస్తానని తెలిపారు. పదేళ్లలో వ్యవసాయ రంగానికి తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యం ఇచ్చిందని, ప్రపంచంలోనే వినూత్నమైన రైతుబంధు, రైతు బీమా పథకాలను ప్రవేశపెట్టిందని రాజయ్య పేర్కొన్నారు. -
సాగు పరిశోధనలో అమెరికా సహకారం కావాలి.. మంత్రి నిరంజన్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పరిశోధన రంగంలో అమెరికా సహకారం ఆశిస్తున్నామని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. తెలంగాణ రైతాంగం అధునాతన సాంకేతికతను అందిపుచ్చుకోవాలన్నదే తమ ఆకాంక్ష అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న నిరంజన్ రెడ్డి బృందం మూడో రోజు గురువారం వాషింగ్టన్ డీసీలో వ్యవసాయ శాఖ ప్రతినిధులతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఐటీ, ఫార్మ్ ఎకనామిక్స్, సీడ్ టెక్నాలజీ, పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ తదితర రంగాల్లో కలిసి పనిచేసే అవకాశాలపై చర్చించింది. వాషింగ్టన్ డీసీలో ఉన్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ అగ్రికల్చర్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా రైతు బంధు పథకం ప్రారంభించి రైతులకు పంట పెట్టుబడి ఇస్తున్నామన్నారు. ఎన్ఐఎఫ్ఏ డైరెక్టర్ మంజిత్ మిశ్రా మాట్లాడుతూ వ్యవసాయ అభివృద్ధికి పరిశోధన చాలా ముఖ్యమన్నారు. కానీ ఆ పరిశోధనను అర్థవంతమైన ఫలితాలుగా మార్చడంలో రాజకీయ నాయకుల పాత్ర చాలా కీలకమని చెప్పారు. నిరంజన్ రెడ్డి వెంట వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ కేశవులు, తెలంగాణ డిజిటల్ మీడియా డైరెక్టర్ కొణతం దిలీప్ ఉన్నారు. ఇది కూడా చదవండి: వీవోఏల గౌరవ వేతనం రూ.8 వేలకు పెంపు -
‘రైతుబంధు పక్కదారి’ నిజమే!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పథకం సొమ్మును పక్కదారి పట్టించిన విషయంపై వ్యవసాయ శాఖ స్పందించింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం ముడుదండ్ల గ్రామంలో జరిగిన అక్రమాలు, మరణించిన లబ్దిదారుల పేరుతో ఇతరులు రైతుబంధు సొమ్ము తీసుకుంటున్న వైనంపై ‘రైతుబంధు పక్కదారి’శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వ్యవసాయ శాఖ అధికారులు స్పందించారు. నల్లగొండ ఏడీఏ శ్రావణ్‌కుమార్ నేతృత్వంలో దేవరకొండ ఏడీఏ వీరప్పన్, ఇతర అధికారులు ముడుదండ్లలో శుక్రవారం విచారణ నిర్వ హించారు. పెరికేటి రాఘవాచారి కుటుంబసభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నా రు. రైతుబంధు డబ్బులు రెండేళ్లుగా ఇతరుల అకౌంట్లలో జమ అవుతున్న తీరును అడిగారు. లబ్దిదారులు వాస్తవాలను అధికారులకు తెలియజేశారు. వ్యవసాయ శాఖ కార్యాలయంలోనే ఈ అక్రమాలు జరిగినట్లు గుర్తించారు. ఏడీఏ విచారణ నివేదిక ఇవ్వగానే అక్రమాలకు పాల్పడినవారిపై చర్యలు చేపడతామని జిల్లా వ్యవసాయ అధికారి సుచరిత తెలిపారు. -
రైతుబంధుకు బ్యాంకర్ల మోకాలడ్డు.. బ్యాంకుల చుట్టూ రైతుల ప్రదక్షిణలు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వానాకాలానికి సంబంధించి రైతుబంధు సాయాన్ని ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటివరకు ఐదెకరాల లోపు భూమి ఉన్న రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఐదెకరాల లోపు ఉన్న వారంతా చిన్న, సన్నకారు రైతులే ఉంటారు. ప్రభుత్వం నుంచి వచ్చే ఆర్థిక సాయాన్ని అందుకోకుండా బ్యాంకర్లు మోకాలడ్డుతున్నారు. పంట రుణం బకాయిలున్నాయంటూ ఈ రైతుబంధు డబ్బులను డ్రా చేసుకోనివ్వడం లేదు. ఆయా రైతుల ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నారు. ఈ డబ్బుల కోసం బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేసి రైతులు తీవ్ర నిరాశతో వెనుదిరగాల్సి వస్తోంది. ఒక్క శాఖలోనే 500 ఖాతాలు హోల్డ్ ఏపీజీవీబీ బ్యాంకుకు సంబంధించి సంగారెడ్డి జిల్లాలో 53 శాఖలు ఉన్నాయి. ఒక్క వట్పల్లి బ్రాంచ్‌లోనే సుమా రు 500 మంది రైతుల ఖాతాలను బ్యాంకర్లు హోల్డ్‌లో పెట్టారు. వీరి ఖాతాల్లో జమ అవుతున్న రైతుబంధు, ధాన్యం డబ్బులను విత్‌డ్రా చేసుకోనివ్వడం లేదు. దీంతో రైతులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసు కెళ్లగా.. ఫీల్డ్ ఆఫీసర్ లేడని, రెండు రోజుల్లో సమస్యను పరిష్కరిస్తామని బ్యాంకు అధికారులు చెప్పారు. సాగు ఖర్చుల కోసం.. ప్రస్తుతం వానాకాలం పంట సీజను ప్రారంభమైంది. ఎరువులు, విత్తనాలు, ట్రాక్టర్ కిరాయి ఇలా సాగు ఖర్చుల కోసం రైతులకు డబ్బులు అవసరం ఉంటుంది. వచ్చిన రైతుబంధు డబ్బులను బ్యాంకర్లు ఇవ్వకపోవడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈ ఖర్చుల కోసం తాము ప్రైవేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నదాతలు వాపోతున్నారు. అధిక వడ్డీకైనా అప్పు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే, గత రబీ సీజనులో ధాన్యం విక్రయించిన రైతులకు ధాన్యం డబ్బులను ప్రభుత్వం వారి ఖాతాల్లో జమచేసింది. పంట రుణం రెన్యువల్ చేసుకోలేదంటూ ఈ డబ్బులను కూడా డ్రా చేసుకోనివ్వడం లేదని రైతులు వాపోతున్నారు. రెన్యువల్ చేసుకుంది 20 శాతం లోపే.. రూ.లక్ష వరకు పంట రుణాలను మాఫీ చేస్తామని ప్రభుత్వం ఎన్నికల్లో హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రుణాలను ప్రభుత్వం విడతల వారీగా మాఫీ చేస్తోంది. మాఫీ కాని చాలామంది రైతులు తమ పంట రుణా లను రెన్యువల్ చేసుకోలేదు. కొన్ని నెలల్లోనే ఎన్నికలు ఉండటంతో ప్రభుత్వం ఎలాగైనా మాఫీ చేస్తుందని రెన్యు వల్ చేసుకోలేదు. రుణాలను రెన్యువల్ చేసుకున్న రైతు లు 20 శాతంలోపే ఉంటారని బ్యాంకర్లు చెబుతున్నారు. దీంతో మిగిలిన 80 శాతం మంది రైతుల్లో చాలామందికి ఇలాంటి సమస్య ఎదురవుతోందని అంచనా. బదిలీపై వచ్చిన మేనేజర్లకు తెలియక కొన్ని బ్రాంచ్‌లకు మేనేజర్లు ఇతర రాష్ట్రాల నుంచి బదిలీపై వస్తుంటారు. రైతుబంధు డబ్బులు ఆపొద్దని తెలియక వారు ఖాతాలను హోల్డ్‌లో పెడుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. రైతుబంధు డబ్బులు ఆపొద్దని అన్ని బ్యాంకులకు ఆదేశాలిచ్చాం. ఎక్కడైనా సమస్య వస్తే వెంటనే పరిష్కరిస్తున్నాం. రుణమాఫీ అవుతుందనే కారణంగా చాలామంది పంట రుణాలను రెన్యువల్ చేసుకోవడం లేదు. – గోపాల్‌రెడ్డి, లీడ్‌బ్యాంకు మేనేజర్, సంగారెడ్డి ఈ రైతు పేరు నరేందర్‌గౌడ్. సంగారెడ్డి జిల్లా నాగులపల్లి గ్రామం. తన 2.62 ఎకరాలకు సంబంధించి రైతుబంధు కింద రూ.13,100 బ్యాంకు ఖాతాలో జమయ్యాయి. ఖరీఫ్ పంట సాగు ఖర్చుల కోసం డబ్బులు తీసుకునేందుకు వట్‌పల్లిలోని ఏపీజీవీబీ బ్యాంకుకెళ్లాడు. అయితే, బ్యాంకు అధికారులు రూ.1.60 లక్షల పంట రుణ బకాయి ఉందని, ఈ రుణాన్ని రెన్యువల్ చేసుకోనందున ఖాతాను హోల్డ్‌లో పెట్టామని చెప్పారు. దీంతో రైతుబంధు డబ్బులు డ్రా చేసుకోలేక నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం తిరుమలపూర్ డీకే గ్రామానికి చెందిన అంబయ్యకు మూడెకరాల భూమి ఉంది. మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంకులో రూ.80 వేల వరకు పంట రుణం ఉంది. ఇటీవల రైతుబంధు కింద ఖాతాలో జమ అయిన డబ్బులను పంట పెట్టుబడికి డ్రా చేసుకుందామంటే బ్యాంకర్లు అనుమతించడం లేదని అంబయ్య వాపోయాడు. -
TS: గుడ్‌న్యూస్.. నేటి నుంచే రైతుబంధు జమ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధు నేటి నుంచి రైతుల ఖాతాల్లో జమ కానుంది. వానాకాలం(ఖరీఫ్ సీజన్) పంటకుగానూ.. 1.54కోట్ల ఎకరాలకుగానూ సుమారు 70 లక్షల మందికి సాయంగా దాదాపు రూ.7,720 కోట్లకుపైనే కేసీఆర్ సర్కార్ ఈ దఫా ఆదివారమే విడుదల చేసింది. రైతులకు పంట సాయం రూపంలో.. ఆర్థికంగా చేయూతనిచ్చేందుకు ప్రారంభించిందే ఈ రైతుబంధు. రైతన్నకు పెట్టుబడి సాయంగా ఏటా ఎకరానికి రూ.10వేల చొప్పున సర్కారు అందిస్తుండగా.. కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం ఇప్పటికే పది విడుతల్లో రైతుల ఖాతాల్లో నిధులు జమ చేసింది. పదకొండో విడత కోసం నిన్ననే నిధుల్ని ప్రభుత్వం విడుదల చేయగా.. భాగంగా నేడు(జూన్ 26, సోమవారం) నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ చేయనున్నట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. రైతు బంధు పంపిణీలో భాగంగా తొలిరోజైన ఇవాళ.. గుంట భూమి నుంచి ఎకరం విస్తీర్ణం గల భూయజమానులు 22,55,081 మంది రైతుల ఖాతాల్లో రూ.642.52 కోట్ల నగదు జమ కానుంది. ఇక.. ఇక ఈ ఏడాది కొత్తగా 5 లక్షల మంది రైతులకు పథకాన్ని వర్తింప చేస్తున్నారు. అలాగే.. 1.5లక్షల మంది పోడు రైతులకు కూడా రైతుబంధు అమలు చేయనున్నట్లు చెప్పారు. వ్యవసాయ శాఖ ఈ నిధుల్ని నేటి నుంచే అకౌంట్లలో వేయనుంది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్లకు వేసే నగదుతో.. ఈసారి సర్కార్ ఖజానా నుంచి సుమారు రూ.300 కోట్ల అదనం కానుంది. 11వ విడతతో కలిపి ఇప్పటివరకూ రైతులకు రైతుబంధు ద్వారా మొత్తం రూ.72,910 కోట్ల సాయం అందించారు. ఇదీ చదవండి: దళిత బంధు.. క్లారిటీ లేని తీరు! -
అందరికీ రైతుబంధు
కరీంనగర్ అర్బన్: రైతుబంధు ఇక అందరికీ అందనుంది. పట్టాదారు పాసుపుస్తకం పొందిన రైతులు, రిజిస్ట్రేషన్ జరిగిన తదుపరి జారీ అయ్యే భూ యాజమాన్య హక్కుపత్రం ఉన్న రైతులు పెట్టుబడి సాయం పొందనున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల క్రమంలో కట్ ఆఫ్ తేదీని పొడిగించడంతో అన్నదాతల్లో ఆనందం వ్యక్తమవుతోంది. తొలుత గత డిసెంబర్ 20 నాటికి పాసు పుస్తకా లు పొందినవారు మాత్రమే రైతుబంధుకు అర్హులని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కట్ ఆఫ్ తేదీని ఈ నెల 16గా నిర్ణయించడంతో కొత్తగా పాసుపుస్తకాలు పొందిన రైతులందరికీ పెట్టుబడి సాయం(రైతుబంధు) అందనుంది. ఈ నెల 26 నుంచి పెట్టుబడి సాయం రైతుల ఖాతాలకు చేరనుండగా యుద్ధప్రతిపాదికన రైతుల వివరాలను చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఏ ఒక్క రైతు మిగలకుండా వారి వివరాలను సైట్లో అప్లోడ్ చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్ ఏఈవోలను ఆదేశించారు. కట్ ఆఫ్ తేదీ ప్రామాణికంగా తీసుకుని రైతుల పట్టాదారు పాసుపుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు పాసుపుస్తకం సేకరిస్తున్నారు. ప్రభుత్వ తాజా ప్రకటన క్రమంలో జిల్లాకు రూ.183.03కోట్ల పెట్టుబడి సాయం రానుంది. తొలుత సన్న, చిన్న కారు రైతులకు, తదుపరి పెద్ద రైతులకు సాయం అందనుంది. పెరుగుతున్న సాగు విస్తీర్ణం గత సంవత్సరం వరకు వర్షాలు సమృద్ధిగా కురియడంతో పాటు ప్రాజెక్టులు పూర్తవడంతో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరుగుతోంది. పడావు ఉన్న భూములు ప్రస్తుతం పచ్చని పైరుగా రూపాంతరం చెందాయి. 2016 వానాకాలం సీజన్లో 2,53,463 ఎకరాల్లో పంటలు సాగవగా 2022లో 3,40,390 ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. అపుడు వరి 81,755 ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం 2,72,500ల ఎకరాలకు చేరింది. భూగర్బజలాలు పెరగడం, కాలువల ద్వారా నీరందుతుండటంతో వరి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక అపుడు పత్తి 1,17,476 ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం 48వేల ఎకరాలకు పరిమితమైంది. మొక్కజొన్న 46,068 ఎకరాల్లో సాగవగా ప్రస్తుతం 4,500ల ఎకరాలకు మాత్రమే పరిమితమవడం గమనార్హం. తృణధాన్యాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తం గ్రామాలు: 313 ఏఈవో క్లస్టర్లు: 76 జిల్లాలో సాగు భూమి: 3,39,050ఎకరాలు తాజాగా రెవెన్యూ రికార్డుల ప్రకారం రైతులు: 2,00,075 వానాకాలం అందనున్న సాయం: రూ.182.03కోట్లు ఏఈవోలు అప్డేట్ చేసిన రైతుల సంఖ్య: 1,81,445 ఇంకా యాప్‌లో నమోదు చేయాల్సింది: 18,630 -
వర్షాభావం ఎదురైనా.. నీళ్లు ఇద్దాం!
సాక్షి, హైదరాబాద్: రుతుపవనాల ఆలస్యంతో వర్షాభావ పరిస్థితులు ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో.. రాష్ట్రంలో సాగు, తాగునీటికి ఎలాంటి ఇబ్బందీ రాకుండా చూడాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. వర్షాభావ పరిస్థితులు కొనసాగితే.. రైతులకు సాగు నీటిని సరఫరా చేసేలా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. అందుకు ఎంత ఖర్చ యినా ఫర్వాలేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతల కోసం ఏర్పాట్లు చేయాలని, అన్ని రిజర్వాయర్లను నింపాలని సూచించారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవడమే ప్రభుత్వ ప్రధాన కర్తవ్యమన్నారు. అయితే.. ప్రస్తుత వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా సాగునీటి విడుదలకు కొన్నిరోజులు విరామం ఇచ్చి, తాగునీటి సరఫరాకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జూలై తొలి వారం నాటికి వర్షపాతం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, ఇతర అంశాలపై మరోసారి సమీక్షించుకుని, పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో చేపట్టాల్సిన ముందస్తు చర్యలపై సీఎం కేసీఆర్ సోమవారం సచివాలయంలో సమీక్షించారు. కాళేశ్వరం ద్వారా ఎత్తిపోతలతో.. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలను ఆగస్టులోనే సమీక్షించి.. కొరత ఏర్పడిన పక్షంలో శ్రీరాంసాగర్ పునరుజ్జీవన పథకం ద్వారా 30– 35 టీఎంసీల నీటిని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎత్తిపోయాలని సమీక్షలో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ ఏడాది మల్లన్నసాగర్లో మరో 10 టీఎంసీలు నింపాలన్నారు. రంగనాయకసాగర్‌లో 3 టీఎంసీల సామర్థ్యానికిగాను 0.69 టీఎంసీలే ఉన్నాయని ఇంజనీర్లు వివరించగా.. మిడ్‌మానేరు నుంచి వెంటనే 2 టీఎంసీలను ఎత్తిపోయాలని, దీంతో రంగనాయకసాగర్ కింద వానాకాలం పంటలకు నీరు అందించడానికి వీలవుతుందని సూచించారు. నిజాంసాగర్‌లో ఉన్న 4.95 టీఎంసీల నీళ్లు ఆగస్టు చివరివరకు 3 తడులకు సరిపోతాయని, తర్వాత మరో 3 తడులకు 5 టీఎంసీలు అవసరమని ఇంజనీర్లు సమీక్షలో వివరించారు. దీనితో ఆగస్టులో కొండపోచమ్మసాగర్ ద్వారా 5 టీఎంసీలను నిజాంసాగర్‌కు తరలించాలని సీఎం సూచించారు. జలాశయాలన్నీ నింపి పెట్టుకోవాలి వానాకాలం ముగిసి జలాశయాల్లోకి ఇన్‌ఫ్లో ఆగిపోయాక కూడా.. అక్టోబర్, నవంబర్ నెలల్లో కాళేశ్వరం వద్ద గణనీయంగా గోదావరిలో ప్రవాహాలు ఉంటాయి. రెండో పంట అవసరాలకు ఆ నీటిని ఎత్తిపోసి ఎల్లంపల్లి, శ్రీరాంసాగర్, మిడ్‌మానేరు, లోయర్ మానేరు, అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మసాగర్లలో తగినంత నీటిని నింపి పెట్టుకోవాలని సమీక్షలో నిర్ణయించారు. ఇందుకోసం ఎన్ని పంపులు, ఏ సమయంలో ఆన్ చేయాలనే విషయంపై ఒక ఆపరేషన్ మ్యాన్యువల్ తయారు చేయాలని సీఎం ఆదేశించారు. వార్ధా ప్రాజెక్టుకు అనుమతులివ్వండి వార్ధా బ్యారేజీ ప్రాజెక్టు కోసం రూ.4,252.53 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని, పరిపాలన అనుమతులు త్వరగా ఇవ్వాలని నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్ కోరగా.. దీనికి సంబంధించిన ప్రక్రియను వెంటనే పూర్తిచేయాలని సంబంధిత అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, గంగుల కమలాకర్, సీఎస్ శాంతికుమారి, ఈఎన్సీలు మురళీధర్, ఎన్.వెంకటేశ్వర్లు, శంకర్, సీఈలు హమీద్‌ఖాన్, రమణారెడ్డి, శ్రీనివాస్, అజయ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ‘పాలమూరు’ లిఫ్టింగ్‌కు సిద్ధం చేయండి తాగునీటి అవసరాల కోసం ఆగస్టు చివరికల్లా పాలమూరు–రంగారెడ్డి నుంచి నార్లాపూర్, ఏదుల, కరివెన, ఉద్ధండాపూర్ జలాశయాల్లోకి నీటిని ఎత్తిపోయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. అందుకు అవసరమైన అన్ని పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పనుల్లో జాప్యం చేస్తున్న కాంట్రాక్టర్లను తొలగించి, సమర్థులైన కాంట్రాక్టర్లకు పనులు అప్పగించాలని సూచించారు. ఇక తాగునీటి అవసరాల కోసం మిడ్‌మానేరు నుంచి గౌరవెల్లి జలాశయంలోకి నీటిని ఎత్తిపోయాలని ఆదేశించారు. గౌరవెల్లి ఆయకట్టుకు సాగునీటి సరఫరా కోసం కాల్వల నిర్మాణానికి చర్యలు చేపట్టాలన్నారు. 26 నుంచి రైతుబంధు వానాకాలం పంటల కోసం జూన్ 26 నుంచి రైతుబంధు సొమ్ము పంపిణీని ప్రారంభించాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు, ఆ శాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. పోడు భూముల పట్టాల పంపిణీ పూర్తయ్యాక పట్టాలు పొందిన గిరిజన రైతులకు రైతుబంధు అందేలా చర్య లు తీసుకోవాలని సూచించారు. -
10 రోజుల్లో ‘రైతుబంధు’ జమ
సాక్షి, హైదరాబాద్: వానాకాలం సీజన్ రైతుబంధు సొమ్మును వారం, పది రోజుల్లో రైతుల ఖాతాల్లో వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ సీజన్లో ఎకరాకు రూ. 5 వేల చొప్పున పంట పెట్టుబడి సాయాన్ని దాదాపు 65 లక్షల మంది లబి్ధదారులకు అందించేందుకు రూ. 7,400 కోట్లు అవసరమవుతాయని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నాయి. ఈ వానాకాలం సీజన్లో రాష్ట్రవ్యాప్తంగా కోటిన్నర ఎకరాలకుపైగా ఉన్న భూములకు చెందిన రైతులకు రైతుబంధు వర్తింపజేస్తామని తెలిపాయి. కొత్తగా పట్టాదారు పాసుపుస్తకాలు పొందిన రైతులు, మొదటిసారి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొనే రైతులు ఏఈవోలను సంప్రదించి ఆయా వివరాలు సమర్పించాలని సూచించాయి. సమీకరించిన నిధుల్లోంచి నేషనల్ పేమెంట్ పోర్టల్ ద్వారా రోజువారీగా నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేస్తామని పేర్కొ న్నాయి. మొదటి రోజున ఎకరాలోపున్న వారికే మొదట ప్రాధాన్యం ఇవ్వనుండగా మర్నాటి నుంచి ఒక్కో ఎకరా పెంచుకుంటూ నెలాఖరు వరకు అర్హులైన రైతులందరి ఖాతాల్లో నిధులు జమ చేయనుంది. -
ఎమ్మెస్పీకి మించి మార్కెట్ ధరలు
సాక్షి, అమరావతి: గతంలో విత్తుకునే సమయంలో ఉండే ధర పంటలు కోతకోసే నాటికి ఉండేది కాదు. దీంతో కాస్త మంచిరేటు వచ్చేవరకు మార్కెట్ గోదాముల్లో నిల్వచేసుకుని, ‘రైతుబంధు’ పథకం కింద రుణాలు తీసుకుని సాగుకోసం పెట్టిన అప్పులను తీర్చుకునేవారు. కానీ, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. నాలుగేళ్లుగా రాష్ట్రంలో పండే ప్రధాన వ్యవసాయ, ఉద్యాన పంటలకు గతంలో ఎన్నడూలేని రీతిలో కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ)లకు మించి మార్కెట్లో ధరలు పలుకుతున్నాయి. కల్లాల నుంచి నేరుగా కొనేందుకు వ్యాపారులు పోటీపడుతున్నారు. ఫలితంగా తాము పండించిన పంట ఉత్పత్తులను నిల్వచేసుకునేందుకు గోదాముల వైపు కన్నెత్తి కూడా చూడడంలేదు. రుణాలు పొందేందుకు ఆసక్తి చూపడంలేదు. ఈ వాస్తవాలను తెలుసుకోకుండా ప్రభుత్వంపై బురదజల్లడమే పనిగా ఈనాడు కట్టుకథలను అచ్చేస్తూ నిత్యం అభాసుపాలవుతోంది. ఏటా బడ్జెట్ కేటాయింపులు.. కనీస మద్దతు ధర దక్కని పంట ఉత్పత్తులకు మంచి ధర లభించేంత వరకు వారికి అండగా నిలిచేందుకు ఉద్దేశించిందే రైతుబంధు పథకం. మార్కెట్ గోదాముల్లో నిల్వచేసిన పంట ఉత్పత్తులపై గరిష్టంగా రూ.2 లక్షల వరకు అందించే రుణంపై 180 రోజుల వరకు వడ్డీ ఉండదు. ఆ తర్వాత 181వ రోజు నుంచి 270 రోజుల వరకు 12శాతం చొప్పున వడ్డీ వసూలుచేస్తారు. ఈ పథకానికి 2019–20లో రూ.70 కోట్లు, 2020–21లో రూ.70 కోట్లు, 2021–22లో రూ.80 కోట్లు కేటాయించగా, గడిచిన 2022–23లో ఏకంగా రూ.90 కోట్లు కేటాయించింది. 2019–20లో ఈ పథకం కింద తమ పంట ఉత్పత్తులను నిల్వచేసుకోవడం ద్వారా 1,826 మంది రూ.17.23 కోట్ల రుణాలు పొందగా, 2020–21లో 517 మంది రూ.71లక్షలరుణాలు పొందారు. ఎమ్మెస్పీకి మించి మార్కెట్ ధరలు సీఎం యాప్ ద్వారా గ్రామస్థాయిలో పంట ఉత్పత్తుల ధరలను ప్రభుత్వం పర్యవేక్షిస్తోంది. ఎమ్మెస్పీకి మించి ధరలు పతనమైన ప్రతీసారి మార్కెట్లో జోక్యం చేసుకుంటూ ధరలు పెరిగేలా చేస్తోంది. సాధారణ, గ్రేడ్–ఏ రకం ధా న్యాన్ని ఆర్బీకేల ద్వారా ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది. ఫలితంగా ఇతర పంట ఉత్పత్తులకు కూడా మంచి రేటు పలుకుతోంది. కోతల దశలోనే ఎమ్మెస్పీకి మించి ధరలు పలుకుతుండడంతో మంచి ధర కోసం పంట ఉత్పత్తులను గోదాముల్లో నిల్వచేసుకోవడం, రైతుబంధు పథకం కింద రుణాలు పొందాలన్న ఆసక్తి రైతుల్లో కనిపించడంలేదు. కళ్లెదుట వాస్తవాలిలా ఉంటే.. రైతుబంధు పథకాన్నే రాష్ట్ర ప్రభుత్వం ఎత్తేసినట్లు, పంట నిల్వచేసుకునే రైతులకు రుణాలివ్వడానికి ప్రభుత్వం ముఖం చాటేసినట్లుగా ఈనాడు విషప్రచారం చేస్తుండడంపట్ల రైతుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రైతుబంధుకు ఏటా కేటాయింపులు మార్కెట్లో మించి ధరలు లభిస్తుండడంవల్లే గోదాముల్లో దాచుకునేందుకు రైతులు ముందుకు రావడంలేదు.అలాగే రైతులెవ్వరూ రైతుబంధు పథకం కింద రుణం పొందేందుకు ముందుకు రావడం లేదు. దీనిని రద్దు చేయడంగానీ, ఏటా నిధుల కేటాయింపులు ఆపడంగానీ చేయలేదు. రుణాలు మంజూరు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. – రాహుల్ పాండే, కమిషనర్, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ -
రైతుబంధు వచ్చేదెప్పుడో? లక్షన్నర మంది రైతుల నిరీక్షణ
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: రాష్ట్రంలో గతేడాది జూలై నుంచి ఇప్పటివరకు కొత్తగా పట్టాదారు పాస్‌పుస్తకాలు పొంది రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్న దాదాపు లక్షన్నర మంది రైతులందరిదీ ఇదే బాధ. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారి వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం ఈ యాసంగి సీజన్లో పెట్టుబడి సాయం అందించే క్రమంలో రైతుబంధు పథకానికి 2022 డిసెంబర్ 20 నాటికి కొత్తగా పాస్ పుస్తకాలు లభించిన వారు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. జిల్లాల్లో వ్యవసాయ అధికారులు కూడా స్థానికంగా ప్రకటనలు జారీ చేశారు. జనవరి 7 వరకు గడువు ఇచ్చారు. దీంతో హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, కామారెడ్డి మినహా మిగతా 28 జిల్లాల్లో 1,40,668 మంది రైతులు రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొని ఎదురుచూస్తున్నారు. నిలిచిన లాగిన్ సౌకర్యం.. గత వానాకాలం సీజన్లో జూన్ 28 నుంచి పెట్టుబడి సాయం అందించారు. జూన్ 20 వరకు పాస్‌పుస్తకాలు కలిగిన లేదా రిజిస్ట్రేషన్లు అయిన రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ప్రభుత్వం సాయం అందించింది. జూలై 20 తరువాత కొనుగోలు చేసిన లేదా వారసత్వం కింద రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వారికి యాసంగి పెట్టుబడి కోసం రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. మరోవైపు ధరణి సమస్యలతో నిషేధిత జాబితాలో పడిన భూముల సమస్యలకు ఇటీవల పరిష్కారం లభించింది. అలాంటి వారికి పాస్ పుస్తకాలు వచ్చాయి. వారంతా మండల స్థాయిలో రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నారు. వారి వివరాలను ఏవో, ఏఈవోలు రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంది. అయితే అప్పటి నుంచి ఇప్పటివరకు ఆ పోర్టల్‌లో అధికారులకు ప్రభుత్వం లాగిన్ అవకాశం ఇవ్వలేదు. దీంతో దరఖాస్తుదారుల వివరాలను వారు ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఫలితంగా ఆయా రైతులకు యాసంగి పెట్టుబడి సాయం అందలేదని అధికారులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన ఈమె పేరు కాలం రజిత. ఇటీవలే 2.16 ఎకరాలకు పాసు పుస్తకం వచ్చింది. నవంబర్ 16నే రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకున్నా ఇప్పటికీ రాలేదు. దీంతో పెట్టుబడి కోసం ఎకరానికి రూ. 20 వేలు అప్పు చేయాల్సి వచ్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గోపాలరావుపల్లెకు చెందిన ఈయన కడారి శ్రీనివాస్‌రెడ్డి. అదే మండలంలోని వెంకటాపూర్ శివారులో 6 నెలల కిందట 3 ఎకరాల భూమి కొన్నారు. పాస్ బుక్ వచ్చింది. రైతుబంధుకు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. ఈమె నల్లగొండ జిల్లా పెద్ద వూర మండలం చింతపల్లికి చెందిన కట్టెబోయిన విష్ణుప్రియ. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చి న ఆరెకరాల భూమికి ఆగస్టులో పాసుపుస్తకం వచ్చింది. యాసంగి రైతుబంధు సహా యం కోసం ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో దరఖాస్తు చేసుకుంది. అయినా రైతుబంధు మంజూరు కాలేదు. దీంతో పెట్టుబడి కోసం అప్పు చేయాల్సి వచ్చింది. -
రైతుబంధు ఐదెకరాలకే పరిమితం చేయండి
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకాన్ని పెద్ద రైతులకు కాకుండా, కేవలం ఐదెకరాల వరకు భూము లున్న రైతులకు మాత్రమే అమలు చేయాలని కోరు తూ నల్లగొండ జిల్లా కట్టంగూరు వ్యవసాయ విస్తర ణాధికారి (ఏఈవో) కల్లేపల్లి పరశురాములు ఏకంగా సీఎం కేసీఆర్‌కు లేఖ రాయడం వ్యవసాయశాఖలో సంచలనమైంది. అలా మిగిలిన సొమ్మును రైతులు పొలా లకు, చేన్లకు వెళ్లే డొంకలు, బండ్ల బాటల అభివృద్ధికి కేటాయించాలని సీఎంకు విన్నవించారు. నగరాలుగా అభివృద్ధి చెందిన గ్రామాల్లో రియల్ ఎస్టేట్ భూము లకు, పంటలు పండించనటువంటి భూములకు రైతు బంధు ద్వారా వచ్చే డబ్బులు వృ«థా అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ లేఖను మంగళవారం రాసి సీఎంకు సాధా రణ పోస్టులో పంపించినట్లు తెలిపారు. గ్రామాల్లో రైతుల బాధలు చూశానని, వారి పొలాలకు వెళ్లే దారులు దారుణంగా మారా యని పేర్కొన్నారు. గతంలో వల సలు ఉండేవని, కానీ కేసీఆర్ నిర్ణ యాల వల్ల వలసలు ఆగిపోయాయ న్నారు. రైతులు చల్కలు, పొలా ల దగ్గరకు వెళ్లే బండ్ల బాటలు నడ వడానికి కూడా కష్టంగా మారాయన్నారు. వాటిని బాగు చేయిస్తే రైతులు ప్రయోజనం పొందుతారన్నారు. తెలంగాణ అంటే ఒకప్పుడు మెట్ట భూమి. కానీ ఇప్పుడు తరి భూమి అయిందన్నారు. అలా ఎంతో సాధించిన కేసీఆర్‌ను జాతిపితగా ఏఈవో పరిగణించారు. ఈ లేఖ రాయడానికి కారణాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లా డుతూ, రైతుబంధు ధనికులకు ఇవ్వడం వల్ల డబ్బులు వృథా అవుతున్నాయనే ఆవేదన తనకు ఉందన్నారు. ఎవరికి చెప్పాలో అర్థంగాక తాను సీఎంకే లేఖ రాసినట్లు తెలిపారు. తమలాంటి వారికి దశాబ్దానికిపైగా పదో న్నతులు ఇవ్వలేదని, దీంతో నిరాశగా ఉందన్నారు. -
రైతుబంధుకు రూ.426 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుకు సంబంధించి ఆదివారం మరిన్ని నిధులను విడుదల చేసింది. 8.53 లక్షల ఎకరాలకు చెందిన 1.87 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 426.69 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 56.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,754.64 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. ప్రతీ రైతుకు రైతుబంధు సాయం అందుతుందని పేర్కొన్నారు. పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ప్రతీసారి రైతుబంధు పథకం నిధులు విడుదల చేసేముందు, అలాగే ఏటా ధాన్యం కొనుగోలు సమయంలో విపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లడం లక్ష్యంగా పెట్టుకున్నాయ న్నారు. కానీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా వీటిని విజయవంతంగా పూర్తి చేస్తోందని పేర్కొన్నారు. -
Rythu Bandhu: 4 లక్షల మందికి రైతుబంధు దూరం!.. కారణాలివే..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత యాసంగికి సంబంధించి రైతుబంధు సొమ్మును ప్రభుత్వం బుధవారం నుంచి అన్నదాతల ఖాతాల్లో జమ చేయడం మొదలుపెట్టింది. తాజా లెక్కల ప్రకారం.. మొత్తం 70.53 లక్షల మంది పట్టాదారులు ఉన్నట్టు సీసీఎల్ఏ గుర్తించగా.. అందులో నాలుగు లక్షల మంది రైతులు రైతుబంధుకు దూరమయ్యారు. దీనికి చిన్నచిన్న సమస్యలే కారణమని, గుర్తించి సరిచేయకపోవడం వల్ల ఇబ్బంది నెలకొందని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. తమకు సంబంధించి ఎలాంటి సమస్య లేకపోయినా రైతుబంధు ఆగిందని, తమకు సొమ్ము ఇచ్చి న్యాయం చేయాలని కొందరు రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏయే సమస్యలతో.. మొత్తం ఈసారి 4.04 లక్షల మందికి రైతుబంధును నిలిపివేసినట్టు వ్యవసాయశాఖ అంతర్గత నివేదికలో వెల్లడించింది. అందులో 1.78 లక్షల మంది బ్యాంకు వివరాలు లేకపోవడం, 19,494 మందికి బ్యాంకు డీబీటీ వైఫల్యం, 124 మందికి ఐఎఫ్ఎస్సీ కోడ్ సమస్యలు ఉన్నాయని.. ఇక ఇతరత్రా స్టాప్ పేమెంట్ లిస్ట్‌లో ఉన్న 2.07 లక్షల మంది రైతులకు కూడా రైతుబంధును నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఈ స్టాప్ పేమెంట్ లిస్టులో ధరణి సమస్యలు, కోర్టు కేసులున్న భూములతోపాటు రైతులు చనిపోయిన వారి స్థానంలో వారసులు/ఇతరులు తిరిగి దర ఖాస్తు చేసుకోకపోవడం వంటివి ఉన్నట్టు అధికార వర్గాలు చెప్తున్నాయి. దీనితో నికరంగా 66.49 లక్షల మందికి రైతుబంధు నిధులు జమచేయనున్నారు. గత వానాకాలం సీజన్లో 63.99 లక్షల మందికి రైతుబంధు నిధులు అందాయి. మరోవైపు కొత్తగా పట్టాదారు పాస్‌బుక్‌లు వచ్చిన రైతులకు దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. జనవరి మొదటి వారం వరకు కొత్త దరఖాస్తులను పరిశీలించాలని క్షేత్రస్థాయి అధికారులకు అంతర్గత ఆదేశాలు జారీ అయ్యాయి. రంగారెడ్డి జిల్లాల్లో అధికంగా.. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో రైతుబంధు నిలిచిపోయింది. ఈ జిల్లాలో మొత్తం పట్టాదారులు 3,82,237 మంది ఉండగా, అందులో 61,159 మందికి రైతుబంధు సొమ్ము అందడం లేదు. తర్వాత సంగారెడ్డి జిల్లాలో 3,88,230 మందికిగాను 37,908 మంది రైతుబంధును నిలిపి వేశారు. నల్లగొండ జిల్లాలో 5,18,902 మంది పట్టా దారులు ఉండగా 25,453 మందికి ఆపేశారు. కాగా ఈనెల 20వ తేదీ వరకు కొత్తగా పాస్ పుస్తకాలు వచ్చిన 2,47,822 రైతులకు యాసంగి రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సదరు రైతులు ఏఈవోను కలిసి దరఖాస్తుతోపాటు పట్టాదారు పాస్‌బుక్, ఆధార్ కార్డు, బ్యాంకు పాస్‌బుక్ ప్రతులను అందజేయాలి. ఏఈవోలు ఆ దరఖాస్తులను, బ్యాంకు వివరాలను అప్లోడ్ చేస్తారు. రైతులు దరఖాస్తు చేసిన 24 గంటల్లో ఏఈవోలు నమోదు పూర్తి చేయాలి. ఏఈవో ధ్రువీకరించడంలో ఆలస్యమై, అందుకు సంబంధించి ఫిర్యాదులేమైనా వస్తే వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు హెచ్చరించారు. సమస్యలున్న భూములకు నిలిపేశాం ‘‘రాష్ట్రంలో కొందరికి రైతుబంధు సొమ్ము నిలిపివేసిన మాట వాస్తవమే. కోర్టు కేసులు, వివిధ సంస్థలకు చెందిన భూములు, రైతు బీమా మరణాల కేసులు, ఎన్నారై భూముల కేసులు, గంజాయి సాగు చేస్తున్న భూములకు చెందిన వారికి రైతుబంధు నిలిపివేశాం. – రఘునందన్‌రావు, వ్యవసాయశాఖ కార్యదర్శి చదవండి: మరో గుడ్‌న్యూస్.. త్వరలోనే జేఎల్ఎం పోస్టుల భర్తీ -
Rythu Bandhu: పదో విడత రైతుబంధు నిధుల జమకు అంతా సిద్ధం
హైదరాబాద్: తెలంగాణలో రైతుల ఖాతాల్లో రేపటి నుంచి(బుధవారం, డిసెంబర్ 28వ తేదీ) నుంచి పదో విడత రైతు బంధు నిధులు జమ కానున్నాయి. ఇప్పటికే పదో విడత కింద రూ.7,676.61 కోట్లు విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం. అర్హులైన 70.54 లక్షల మంది రైతలు ఖాతాల్లో రైతు బంధు నిధులు జమ కానున్నాయి. -
రైతుబంధుకు మరో అవకాశం.. కరీంనగర్ రైతులకు జనవరి 7 వరకు చాన్స్
కరీంనగర్ అర్బన్: యాసంగి రైతుబంధు కింద ప్రభుత్వం సాయం అందిస్తోంది. పలు జిల్లాల్లో పథకం డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ కాగా కరీంనగర్ జిల్లాలో వివరాల నమోదుకు అవకాశం కల్పించింది. భూక్రయవిక్రయాల నేపథ్యంలో రోజురోజుకూ పట్టాదారులు మారుతుండగా మళ్లీ మళ్లీ చాన్స్ ఇస్తోంది. యాసంగి పెట్టుబడి సాయం పొందేందుకు కొత్త పట్టాదారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. పట్టాదారు పాసుపుస్తకం ఉన్న ప్రతీ అన్నదాతకు పెట్టుబడి సాయం అందనుంది. అలాంటి వారి వివరాలపై క్షేత్రస్థాయిలో మరోసారి విచారణ జరపాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. జిల్లాలో మొత్తం 1,72,877 మంది రైతులు గుర్తించగా ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. పాసుపుస్తకాలున్నా నమోదు కాలేదు జిల్లాలో చాలామంది రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు ఉన్నప్పటికీ ప్రభుత్వం విధించిన గడువులోగా సంబంధిత బ్యాంకు పాసుపుస్తకంతో ఇతర జిరాక్స్‌లు ఇవ్వకపోవడం వల్ల ఆన్లైన్లో నమోదు చేయలేదు. ఫలితంగా పెట్టుబడి సాయం అందుకోలేకపోయారు. కొంతమంది గ్రామాల్లో అందుబాటులో లేకపోవడం వల్ల నమోదు కాలేదు. సమస్య ఉంటే ఏఈవోను కలవాలి రైతుబంధు సాయం పొందేందుకు ప్రభుత్వం మరోసారి అవకాశవిుచి్చంది. డిసెంబర్ 20, 2022 వరకు ఆన్లైన్లో నమోదైన వారందరి ఖాతాల్లో డబ్బులు పడనున్నాయి. జనవరి 7 వరకు దరఖాస్తుకు మరో చాన్స్ ఇవ్వగా వ్యవసాయ అధికారులు రైతులకు సమాచారం ఇస్తున్నారు. గత సీజన్లలో డబ్బులు జమ అయ్యి, ఈ సీజన్లో అసలే రాకపోయినా లేదా ఉన్న భూ విస్తీర్ణం కంటే తక్కువ భూమికి మాత్రమే డబ్బు జమ అయినా రైతుబంధు పోర్టల్‌లో పేరు కనిపించి, బ్యాంకు ఖాతా వివరాలు ఇప్పటికీ ఇవ్వకపోయినా, బ్యాంకు వివరాలు తప్పుగా నమోదు కావడం, ఏ ఇతర కారణాల వల్ల డీబీటీ ఫెయిల్ అని మీకు సందేశం వచ్చినా వెంటనే దరఖాస్తుతోపాటు స్వయంగా పట్టాదారు పాసుపుస్తకం, బ్యాంకు ఖాతా పుస్తకం, ఆధార్ కార్డు జిరాక్స్‌లతో ఏఈవోను సంప్రదించాలి. వాళ్లు రైతులా.. బినావీులా? ప్రభుత్వ సాయమంటే ఎవరైనా ముందుకు వస్తారు. ఎకరాన రూ.5 వేలిస్తుండగా ఏటా రూ.6 కోట్ల వరకు తిరిగి ప్రభుత్వ ఖజానాకు చేరుతుండటం అనుమానాలకు తావిస్తోంది. మూడేళ్ల క్రితం పెట్టుబడి సాయం పథకం ప్రారంభం కాగా మొదటి నుంచీ 2500 మందికి పైగా ప్రభుత్వ సాయానికి దూరంగా ఉంటున్నారు. వివరాలివ్వాలని వ్యవసాయ శాఖ విçస్తృత ప్రచారం చేస్తున్నా పెడచెవిన పెడుతుండటం విడ్డూరం. వారంతా బినావీులా, సంపన్నులా అన్నది సస్పెన్స్. చొప్పదండి మండలంలో 195, గంగాధరలో 161, రామడుగులో 158, ఇల్లందకుంటలో 102, హుజూరాబాద్‌లో 146, జమ్మికుంటలో 147, సైదాపూర్‌లో 126, వీణవంకలో 138, కరీంనగర్ అర్బన్‌లో 1, కరీంనగర్ రూరల్‌లో 115, కొత్తపల్లిలో 118, చిగురుమామిడిలో 131, గన్నేరువరంలో 70, మానకొండూరులో 157, శంకరపట్నంలో 596, తిమ్మాపూర్ మండలంలో 139 మంది ఇలాంటి వారున్నారు. పథకానికి దూరమవడానికి కారణాలు.. ► ప్రాజెక్టులకు సేకరించిన భూములను పెండింగ్‌లో పెట్టడం. ► ఆధార్ కార్డులు, బ్యాంకు ఖాతాల నంబర్లు తప్పుగా ఉండటం. ► కొంతమందికి పట్టాలు ఇచ్చినప్పటికీ వాటిపై ఆంక్షలు విధించడం. ► ఒకే సర్వే నంబర్‌తో రెండు పాసుపుస్తకాలు ఉండటం. ► భూములు విక్రయించడం వల్ల కొనుగోలు చేసిన రైతుల పట్టా పాసుపుస్తకాలు పెండింగ్‌లో ఉండటం. ► కొందరు రైతులు మృతిచెందడం వల్ల వారి వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడం. జిల్లాలో రైతుబంధు గణాంకాలిలా.. పోర్టల్‌లో నమోదైన రైతులు - 1,97,097 బ్యాంకు ఖాతా, వివరాలిచ్చిన రైతులు - 1,79,599 గత వానాకాలంలో పెట్టుబడి సాయం పొందిన రైతులు - 1,64,197 ఖాతా వివరాలివ్వాల్సిన వారు - 6,191 బ్యాంకు ఖాతా సమస్య ఉన్నవారు - 881 సరిచేయాల్సినవి - 134 చదవండి: TS: సంక్షేమ శాఖల్లో 581 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ -
రైతుబంధు నిధులు వచ్చే నెల విడుదల
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు యాసంగి సీజన్ నిధులు వచ్చే నెలాఖరు వరకు రైతుల ఖాతాల్లో పడతాయని వ్యవసాయశాఖ వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది వానాకాలం సీజన్లో 64.95 లక్షల మంది రైతులకు చెందిన 1.47 కోట్ల ఎకరాలకు రూ. 7,372.56 కోట్లు చెల్లించారు. ఒక్కో రైతుకు ఎకరాకు రూ. 5 వేల చొప్పున రైతుబంధు సొమ్ము అందింది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 30 ఎకరాల వరకు సాగు భూములున్న రైతులకు రైతుబంధు సొమ్ము విడుదల చేశారు. ప్రస్తుత యాసంగి సీజన్‌కు మరికొందరు రైతులు కొత్తగా వచ్చే అవకాశం ఉందని, ఆ ప్రకారం రూ. 7,500 కోట్ల వరకు విడుదల చేయాల్సి ఉంటుందని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధు సొమ్ము కోసం ఎదురుచూపు... యాసంగి సీజన్ అక్టోబర్ ఒకటో తేదీ నుంచే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పటికే నెల రోజులు దాటింది. యాసంగి సీజన్‌కు సంబంధించిన సాగు పనులు జరుగుతున్నాయి. అయితే రైతులు అందుకు అవసరమైన పెట్టుబడి సొమ్ము కోసం ఎదురుచూస్తున్నారు. వాస్తవంగా సీజన్ ప్రారంభమైన సమయంలోనే రైతుబంధు నిధులు అందజేయాలన్నది ఉద్దేశం. కానీ సకాలంలో వివరాలు పంపకపోవడం తదితర కారణాలతో రైతుబంధు సొమ్ము రైతులకు చేరడంలో ఆలస్యం అవుతుంది. దీంతో రైతులు అప్పులు చేయాల్సిన దుస్థితి నెలకొంది. వానాకాలం సీజన్లో వేసిన పత్తి దిగుబడి తగ్గుతుండటం, గతం కంటే ధర కూడా తక్కువగా ఉండటంతో రైతులకు నష్టాలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో యాసంగికి పెట్టుబడులు పెట్టాలంటే సకాలంలో రైతుబంధు నిధులు విడుదల చేయాలని రైతులు కోరుతున్నారు. దీనిపై వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్‌రావును ‘సాక్షి’ వివరణ కోరగా గత యాసంగిలో డిసెంబర్ చివరి నాటికి రైతుబంధు నిధులు విడుదల చేసిన విషయాన్ని గుర్తుచేశారు. ఈసారి ఎప్పుడు విడుదల చేయాలన్న దానిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. -
ఏది ఉచితం? ఏది అనుచితం?
రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు ఇస్తున్న రాయితీలను, సబ్సిడీలను ఉచితాలుగా ప్రకటించి... వాటిని రద్దు చేయాలంటూ కేంద్ర ప్రభుత్వం సూచనలు, సలహాలు ఇస్తూ ప్రకటన చేసింది. ఏవి ఉచితాలో, వేటిని ఉపసంహరించుకోవాలో స్పష్టంగా చెప్పలేదు. ఉచితం అంటే పూర్తి సబ్సిడీగా ఇచ్చేది. ఎలాంటి శ్రమ, ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చేది. ఈరోజు దేశంలో 80 కోట్ల మంది దారిద్య్ర రేఖకు దిగువన బతుకుతున్నారు. వారికి కనీస పౌష్టికాహారం అందుబాటులో లేదు. ఐదేళ్ల లోపు పిల్లలు వెయ్యికి 40 మంది మరణిస్తున్నారు. ఉత్పత్తి ధర చెల్లించి కొనుగోలు చేసే శక్తి ప్రజలలో లేదు. అలాంటి ప్రజలకు రాయితీలు ఇవ్వాలి. శ్రమ చేయడానికి శక్తిలేని వారు, వయస్సు మళ్లినవారు, ఆనారోగ్యానికి గురైన వారికి ప్రభుత్వం ఉచితంగా సహకారం అందించాలి. ప్రస్తుతం రాష్ట్రాలు చౌక డిపోల ద్వారా బియ్యం ఇస్తున్నాయి. వీటికి తోడు ఆసరా పింఛన్లు, భరోసా పింఛన్లు వికలాంగులకు, ఒంటరి మహిళలకు ఇస్తున్నారు. వీటితోనే వీరు బతుకుతున్నారు. ఈ ఉచితాలు రద్దు చేస్తే వీరిలో చాలామంది బతకలేరు. వ్యవసాయ రంగానికి ఎరువులు, విత్తనాలు, విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పేర్లతో రాయితీలు ఇస్తున్నారు. వ్యవసా యోత్పత్తులకు పెట్టిన పెట్టుబడిని శాస్త్రీయంగా ప్రభుత్వం లెక్కించడంలేదు. చివరికి మార్కెట్లలో రైతులు పెట్టిన పెట్టుబడి కూడా రాక దేశంలో ఏటా 12,600 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుండి ఏదో రూపంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణగారిన ప్రజలకు సబ్సిడీల పేరుతో రాయితీలు ఇస్తూనే ఉన్నాయి. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ రాయితీలన్నింటినీ రద్దు చేయాలని సలహా ఇస్తున్నది. వార్షిక తలసరి ఆదాయం దేశంలో రూ. 1,50,326గా కేంద్రం ప్రకటించింది (2021–22). అంతకు తక్కువ వచ్చిన వారు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నట్లు చెప్తున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల రాయితీలను గమనించి ఆహార సబ్సిడీ (రూ. 2,06,831 కోట్లు), ఎరువుల సబ్సిడీ (రూ. 1,06,222 కోట్లు), గ్యాస్ (రూ. 8,940 కోట్లు), పెట్రోల్ సబ్సిడీ (రూ.3.30 లక్షల కోట్లు) ఏటా ఇస్తున్నది. ఈ మధ్య రైతు కుటుంబానికి రూ. 6,000 చొప్పున కిసాన్ సమ్మాన్ పేర రూ.68,000 కోట్లు, వడ్డీమాఫీకి రూ. 19,500 కోట్లు, పంట బీమాకు రూ. 15,500 కోట్లు... మొత్తం రూ.1,03,000 కోట్లు సబ్సిడీగా ఇస్తున్నది. దళిత, గిరిజన, వెనుకబడిన, మైనారిటీ కార్పొరేషన్లు, ఆయా వర్గాలకు 20 శాతం సీడ్‌మనీ పేర సబ్సిడీలు ఇచ్చి బ్యాంకు రుణాలు ఇప్పిస్తున్నారు. వాటితో ఉపాధి చాలామంది సంపాదించుకుంటున్నారు. రాష్ట్రాలు రాయితీలను రద్దు చేయాలంటున్న కేంద్రం ఈ రాయితీలను కూడా రద్దు చేయాల్సి ఉంటుంది! పేదలు తమ పిల్లలను బడికి పంపకుండా కూలీకి తీసుకుపోవడంతో అక్షరాస్యత పెరగడం లేదు. అక్ష్యరాస్యతను పెంచడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేద కుటుంబాలకు సంవత్సరానికి ఉచితంగా రూ. 12,500 ఇవ్వడంతో వారు పిల్లలను పాఠశాలకు పంపిస్తున్నారు. ఆ విధంగా విద్య వ్యాప్తి జరుగుతున్నది. మరి ఈ సహాయాన్ని ఆపాలంటారా? కాలేజీలలోగానీ, యూనివర్సిటీలలో గానీ పేదలకు అనేక రాయితీలు ఉన్నాయి. వైద్య రంగంలో ఆరోగ్యశ్రీ పేరుతో ఉచిత వైద్యం చేయిస్తున్నారు. ఈ ఉచితాలన్నింటినీ లెక్కవేసినా... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లలో 15 శాతానికి మించవు. కానీ, కార్పొరేట్ సంస్థలు ఈ రాయితీలను రద్దు చేయాలనీ, తమకు అనుకూల విధానాలు తేవాలనీ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయి. దీంతో ప్రభుత్వం కార్పొరేట్లకు తలొగ్గింది. సెప్టెంబర్ 2019న ఒక జీఓ ద్వారా కార్పొరేట్లు చెల్లించే 30 శాతం పన్నును 22 శాతానికి తగ్గించారు. మార్చి 2033 నాటికి 25 శాతం నుండి 15 శాతానికి తగ్గిస్తామని ప్రకటించారు. విదేశాలలో 35 నుండి 40 శాతం పన్నులు వసూలు చేస్తున్నారు. కానీ, ఇక్కడ పన్నులు తగ్గిస్తున్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ లాంటివాళ్ళు 13 రంగాలలో మోసాలు చేసి లక్షల కోట్లు ఎగనామం పెట్టారు. 2019 ఏప్రిల్ 14కు ముందు రూ. 7 లక్షల కోట్లు వారి ఖాతాల నుండి ‘రైట్ ఆఫ్’ చేశారు. నిరర్థక ఆస్తుల పేర 10 లక్షల కోట్లు రీక్యాపిటలైజేషన్ చేశారు. రూ. 2.11 లక్షల కోట్లు బెయిల్ ఔట్ కింద ఇచ్చారు. జర్మనీ, జపాన్, ఇంగ్లాండ్, ఇటలీ తదితర దేశాలలో కార్పొరేట్లపై 30–40 శాతం పన్నులు వసూళ్ళు చేయడంతోపాటు నెలవారీ వేతనాలపై పన్ను వసూలు చేస్తూ ఆహార, ఇతర సంక్షేమ సబ్సిడీలు పెద్ద ఎత్తున ఇస్తున్నారు. ఈ విషయాలు తెల్సినప్పటికీ భారత దేశంలో ఉచితాల పేరుతో రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీలను రద్దుచేసి, కార్పొరేట్లకు బహి రంగంగా లాభాలు కట్టబెట్టడానికి చేస్తున్న ప్రయత్నమే ఇది. కేంద్రం ప్రకటించిన ‘ఉచితాల రద్దు విధానాన్ని’ ఉపసంహరించుకోవాలి. (క్లిక్: రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసే కుట్ర) - సారంపల్లి మల్లారెడ్డి అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు -
‘రైతుబంధు’తో వ్యవసాయ విప్లవం
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు ప్రపంచ వ్యవసాయ రంగంలో ఒక విప్లవం అని, ఈ పథకం రైతులకు బతుకుపై భరోసా కల్పించిందని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ తీసుకున్న పలు రైతు కేంద్రీకృత నిర్ణయాలతో తెలంగాణ వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయిందన్నారు. ఈ మేరకు ఆయన ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘వానాకాలం, యాసంగి సీజన్‌కు ముందు అప్పు చేయాల్సిన అవసరం లేకుండా పెట్టుబడి సాయంగా రైతులకు ప్రభుత్వం రైతుబంధు అందజేస్తుంది. ఏటా ఎకరానికి రూ.10 వేలు ఇస్తుంది. ఇప్పటివరకు తొమ్మిది సీజన్లలో రూ.58 వేల కోట్లను రైతులకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ప్రస్తుత సీజన్లో ఐదు ఎకరాల్లోపు 56.43 లక్షల మంది రైతులకు రూ.4,801 కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయి. గతంలో ఏ కారణంగానైనా రైతు మరణిస్తే.. ఆ కుటుంబం రోడ్డున పడేది. ఇప్పుడు రైతు బీమాతో బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా అందిస్తున్నాం. ఇప్పటివరకు 83,471 కుటుంబాలకు రూ.4,173 కోట్లను ప్రభుత్వం అందించింది. రూ. 572 కోట్ల వ్యయంతో 2,601 క్లస్టర్లలో రైతు వేదికలను నిర్మించాం. వీటి నిర్వహణకు నెలకు రూ. 9 వేలు ఇస్తున్నాం’ అని వివరించారు. బడ్జెట్లో రూ. 30 వేల కోట్లు... మిషన్ కాకతీయ, కాళేశ్వరం ప్రాజెక్టుతోపాటు ఇతర ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటి గోసను తీర్చారు. ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయానికి రూ. 30 వేల కోట్లు కేటాయించింది. ఉచిత విద్యుత్ చెల్లించే రూ. 10 వేల కోట్లు ఇందుకు అదనం. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో పండిన ధాన్యం 24 లక్షల టన్నులు మాత్రమే. అదే గతేడాది ఏకంగా 1.41 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. రైతులు వరితోపాటు ఇతర పంటల సాగుపై ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇందులో భాగంగానే ప్రభుత్వం తరఫున పంట మార్పిడిపై రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. -
తొలి రోజు రూ.586 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్‌కు సంబంధించి రైతుబంధు నిధులు మంగళవారం నుంచి రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. తొలి రోజు రూ.586.65 కోట్లు ఇచ్చినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ సొమ్ము 19.98 లక్షల మంది రైతుల ఖాతాల్లో డిపాజిట్ చేసినట్లు తెలిపారు. మొదటిరోజు 11.73 లక్షల ఎకరాలకు సాయం అందినట్లు వెల్లడించారు. దేశంలో రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని, కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆయా పార్టీలు ఈ పథకాన్ని ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ కాగితాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. ‘జాతీయ పార్టీలకు జాతీయ విధానాలు ఉండవా ? రాష్ట్రానికో విధానం ఉంటుందా ?’ అని ప్రశ్నించారు. అధికార కాంక్ష తప్ప కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రం మీద ప్రేమ లేదని, ఆ పార్టీల పిల్లిమొగ్గలను ప్రజలు తెలంగాణ ఉద్యమ సమయంలోనే చూశారని అన్నారు. -
నేటి నుంచి ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: ఈ వానాకాలం సీజన్లో 68.10 లక్షలమంది రైతుబంధు కింద పెట్టుబడి సాయం పొందడానికి అర్హులని వ్యవసాయ శాఖ ప్రకటించింది. మంగళవారం(నేడు) నుంచి రైతుబంధు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు వెల్లడించింది. మొదటిరోజు ఎకరా వరకు భూమి ఉన్న 19.98 లక్షల మంది రైతులకు 586.65 కోట్లు జమ చేస్తామని పేర్కొంది. 1,50,43,606 ఎకరాలకు చెందిన రైతులకు రైతుబంధు సొమ్ము అందజేసేందుకు అధికారులు సన్నాహాలు చేశారు. అందుకోసం రూ.7,521.80 కోట్లు సిద్ధం చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
కొత్త లబ్ధిదారులకు రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: కొత్త లబ్ధిదారులకు రైతుబంధు పథకం అమలుకానుంది. ఈ మేరకు ప్రభుత్వం ఈ నెల ఐదు వరకు కటాఫ్ తేదీని నిర్ణయించింది. అంటే ఆ తేదీ వరకు రిజిస్ట్రేషన్ అయిన, పట్టాదారు పాస్‌పుస్తకాలు జారీ అయిన భూములను రైతుబంధు పోర్టల్‌లో నమోదు చేసుకునే అవకాశాన్ని కల్పించారు. కొత్తగా యాజమాన్య హక్కులు పొందిన రైతులు, పట్టాదారు పాస్ బుక్, ఆధార్, బ్యాంకు ఖాతా పుస్తకం జిరాక్సు కాపీలను స్థానిక వ్యవసాయ విస్తరణాధికారి(ఏఈవో)కి అందజేయాలి. ఆదివారం ఉదయం నుంచి ఏఈవో లాగిన్‌ను ఓపెన్ చేశారు. సీసీఎల్ఎ డేటా ఆధారంగా రైతుల వివరాలను అధికారులు అప్లోడ్ చేస్తారు. ముందుగా కటాఫ్ తేదీని ప్రకటించి కొత్త లబ్ధిదారుల నమోదు ప్రారంభిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కొత్త లబ్ధిదారుల నమోదుకు రెండు రోజులు మాత్రమే అవకాశం కల్పించటంపై అసంతృప్తి వ్యక్తం అవుతోంది. అయితే ఒకవైపు మంగళవారం రైతుబంధు నిధుల పంపిణీ జరుగుతున్నా, మరోవైపు లబ్ధిదారుల నమోదు ప్రక్రియ కొనసాగుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పదిహేను రోజుల వరకు నగదు బదిలీ చేస్తారని, ఇదే సమయంలో ఏఈవోలు రైతుబంధు పోర్టల్‌లో కొత్త లబ్ధిదారులను కూడా నమోదు చేస్తారని చెబుతు న్నారు. టైటిల్ క్లియరెన్స్ వచ్చిన భూమి విస్తీర్ణం పెరిగితే నిధులు కూడా పెరిగే అవకాశాలున్నాయి. -
‘రైతుబంధు’ ఇవ్వాలంటూ కాంగ్రెస్ ఆందోళనలు
సాక్షి, హైదరాబాద్: రైతుల ఖాతాలో వెంటనే రైతుబంధు సొమ్ము జమ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీ బుధవారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహించింది. అలాగే, హైదరాబాద్‌లోని వ్యవసాయ శాఖ కమిషనరేట్ ముందు ఆందోళనకు దిగింది. కాగా, ఖరీఫ్ సీజన్లో రైతులకు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతుబంధు నిధుల విడుదల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ మూడు రోజుల్లో ఈ నిధులు రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని, లేదంటే ప్రత్యక్ష ఉద్యమాలకు దిగుతామని హెచ్చరిం చింది. ఈనెల 26 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, మండలాలు, నియోజ కవర్గాలు, జిల్లాల వారీగా రైతులను సమీకరించి ఉద్యమించాలని, అవసర మైతే ‘చలో హైదరాబాద్’కు పిలుపునివ్వాలని ఆ పార్టీ నేతలు నిర్ణయిం చారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి బుధవారం ఈ మేరకు ట్వీట్ చేశారు. రైతుబంధు సాయం చేయండి.. పరిహారం ఇప్పించండి ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో రైతులకు ఇవ్వాల్సిన పెట్టుబడి సాయాన్ని వెంటనే అందించాలని టీపీసీసీ కిసాన్‌సెల్ డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం టీపీసీసీ కిసాన్‌సెల్ నేతలు బుధవారం వ్యవసాయ కమిషనరేట్ ముందు ఆందోళన నిర్వహించి ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేశారు. అనంతరం గాంధీభవన్‌లో విలేకరుల సమావేశంలో ఏఐసీసీ కిసాన్‌సెల్ వైస్‌చైర్మన్ ఎం.కోదండరెడ్డి మాట్లాడుతూ మే నెలాఖరుకే రైతుబంధు నిధులు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ జూన్ నెలాఖరుకు కూడా ఇవ్వకుండా ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతోందని విమర్శించారు. -
28 నుంచి ‘రైతుబంధు’ జమ
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు కింద అన్నదాత లకు ఈ నెల 28 నుంచి పెట్టుబడి సాయం అందనుంది. ఈ అంశంపై బుధవారం సీఎస్ సోమేశ్ కుమార్, ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుతో చర్చించిన సీఎం కేసీఆర్... వర్షాలు బాగా కురుస్తున్నందున రైతులకు రైతు బంధు సొమ్ము అందించాలని ఆదేశించారు. ఈ వానాకాలం సీజన్‌కు 65 లక్షల మంది రైతులకు రూ.7,500 కోట్లు ఇచ్చే అవకాశం ఉందని, ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు వ్యవసాయ వర్గాలు వెల్లడించాయి. ముందుగా ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, ఆ తర్వాత ఒకటి నుంచి రెండెక రాల రైతులకు.. ఇలా రైతుబంధు సొమ్మును దశల వారీగా వారి ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్‌రావు ‘సాక్షి’కి తెలి పారు. వచ్చే నెల 15 నాటికి అందరి ఖాతాల్లో పెట్టు బడి సాయం జమ అయ్యే అవకాశం ఉంది. అంతే గాకుండా బుధవారం రాత్రి వరకు క్రయవిక్ర యాలు జరిగిన భూములకు చెందిన రైతులకు కూడా రైతుబంధు సాయం అందుతుందని ఆయన స్పష్టం చేశారు. గతేడాది వానాకాలంలో 60.84 లక్షల మంది రైతులకు రూ. 7,360.41 కోట్ల రైతు బంధు సాయం అందగా గత యాసంగిలో 63 లక్షల మంది రైతులకు రూ.7,412.53కోట్ల సాయం అందింది. 2022–23 సంవత్సరానికి బడ్జెట్లో రైతుబంధు కోసం ప్రభుత్వం రూ. 14,800 కోట్లు కేటాయించింది. ఇప్పటివరకు ఎనిమిది విడతల్లో రూ. 50,447.33 కోట్ల సాయం అందించింది. కేంద్రం కొర్రీలు పెట్టినా రైతుబంధు ఆగదు: మంత్రి నిరంజన్‌రెడ్డి కేంద్రం ఆర్థిక నిబంధనల పేరుతో కొర్రీలు పెట్టి ఇరికించాలని చూసినా రైతుబంధు పథకం ఆగదని వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. సీఎం ఆదేశాల మేరకు ఈ నెల 28 నుంచి 9వ విడత రైతుబంధు సాయం జమ చేస్తామన్నారు. సీఎం కేసీ ఆర్కు నిరంజన్‌రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి వేర్వేరు ప్రకటనల్లో ధన్యవాదాలు తెలిపారు. చదవండి: (సీఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్) -
ఫామ్‌లోకి ఆ యిల్‌పామ్
సాక్షి, హైదరాబాద్: మొత్తంగా వ్యవసాయ రంగానికి రూ. 24,254 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. అయితే గతేడాది కంటే వ్యవసాయానికి నిధులు స్వల్పంగా తగ్గించింది. గత ఏడాది రూ.25 వేల కోట్లు కేటాయించగా ఈసారి అందులో రూ.746 కోట్లు తగ్గించి బడ్జెట్ ప్రతిపాదనలు చేసింది. రైతుబంధు పథకానికి రూ.14,800 కోట్లు కేటాయించింది. ఎన్ని ఆర్థిక కష్టాలు ఎదురైనా రైతుకు, సాగుకు అండగా నిలిచే రైతుబంధు పథకానికి ప్రభుత్వం అవసరమైన కేటాయింపులు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు రైతుబంధు కింద ఎనిమిది విడతల్లో రూ.50,448 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసింది. తద్వారా 63 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. ఇక రైతుబీమా ప్రీమియం కోసం గతేడాది రూ.1,200 కోట్లు కేటాయించిన ప్రభుత్వం.. ఈసారి రూ.1,488 కోట్లు కేటాయించింది. ఈ ఏడాది రైతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున అదనపు కేటాయింపులు చేసింది. రైతు ఏ కారణంతోనైనా మరణిస్తే ఈ పథకం కింద అతని కుటుంబానికి రూ.5 లక్షల పరిహారం అందుతుంది. ఇప్పటివరకు వివిధ కారణాలతో మరణించిన సుమారు 75 వేల మంది రైతుల కుటుంబాలకు రూ. 3,775 కోట్ల సాయం అందజేసింది. ఉద్యానశాఖకు గణనీయంగా పెరిగిన బడ్జెట్ ఉద్యానశాఖకు కూడా ప్రభుత్వం ఈ బడ్జెట్లో భారీగా రూ.994.85 కోట్లు కేటాయించింది. గతేడాదితో (రూ.242.30 కోట్లు) పోల్చితే రూ.752.55 కోట్లు అధికంగా కేటాయించడం గమనార్హం. రైతులను వరి నుంచి మళ్లించి ఇతర పంటల సాగుకు ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉద్యానశాఖకు కూడా అధిక కేటాయింపులు చేసింది. మరోవైపు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి రూ.75 కోట్లు, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ.17.50 కోట్లు కేటాయించింది. వచ్చే ఏడాది రూ.75 వేల లోపు రుణాల మాఫీ ఈ ఏడాది బడ్జెట్లో రైతు రుణమాఫీకి రూ.2,939.20 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత 35.32 లక్షల మంది రైతులకు చెందిన రూ.16,144 కోట్ల పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ దఫా రుణమాఫీలో భాగంగా ఇప్పటివరకు 5.12 లక్షల మంది రైతులకు సంబంధించిన రుణాలను ప్రభుత్వం మాఫీ చేసింది. దీంతో రూ.50 వేలలోపు రుణాలు ఈ మార్చిలోపు మాఫీ అవుతాయి. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.75 వేల లోపు ఉన్న పంట రుణాలను ప్రభుత్వం మాఫీ చేస్తుందని బడ్జెట్లో స్పష్టంగా ప్రకటించారు. ఇలావుండగా ఈసారి వ్యవసాయ యంత్రీకరణకు నిధులను గణనీయంగా తగ్గించారు. 2021–22 బడ్జెట్లో రూ.1,500 కోట్లు కేటాయిస్తే, ఈసారి కేవలం రూ.377.35 కోట్లకే పరిమితం అయ్యారు. కేంద్ర ప్రభుత్వ వాటా నిధులు కలిస్తే ఇది దాదాపు రూ.500 కోట్లు మాత్రమే ఉండే అవకాశముందని వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఆయిల్‌పామ్ సాగుపై ప్రత్యేకంగా దృష్టి కేంద్రీకరించింది. రాష్ట్రంలో నీటి వనరులు పుష్కలంగా ఉండటం, అనుకూల వాతావరణం నేపథ్యంలో వరికి ప్రత్యామ్నాయంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని నిర్ణయించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏకంగా రెండున్నర లక్షల ఎకరాలకు ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని భావిస్తోంది. అందుకోసం బడ్జెట్లో ఏకంగా రూ.1,000 కోట్లు కేటాయించింది. -
అంగడి లో సరుకులా భూములు అమ్మేసారు..
-
తెలంగాణలో నీళ్లున్నా బీళ్లాయె! ఆ భయాలతోనే ఈ పరిస్థితి తలెత్తిందా?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కావాల్సినన్ని నీళ్లున్నాయి. అయినా వ్యవసాయ భూములు ఖాళీగా కనిపిస్తున్నాయి. వరి వేయొద్దని సర్కారు సూచించడంతో రైతులు ఆ పంట సాగు గణనీయంగా తగ్గించేశారు. రైతుబంధు రాదనే ప్రచారం వల్ల కూడా చాలామంది వెనక్కు తగ్గారు. మరోవైపు చెరువుల కింద ఉన్న భూములకు నీరు వదలక పోవడంతో ఆ ప్రాంతాల్లో వరి నాట్లు పడలేదు. అదే సమయంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు పెంచాలన్న వ్యవసాయ శాఖ పిలుపును రైతులు పెద్దగా పట్టించుకోలేదు. వరి సాగు తగ్గడం, ప్రత్యామ్నాయ పంటల సాగు పెరగక పోవడంతో లక్షలాది ఎకరాల్లో పంట భూములు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. అన్ని వసతులున్నా భూములు ఖాళీగా ఉండటం ప్రమాదకరమైన ధోరణి అని, మంచి పరిణామం కూడా కాదని వ్యవసాయ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఆందోళనకరంగా సాగు యాసంగిలో పంటల సాధారణ సాగు విస్తీర్ణం 46.49 లక్షల ఎకరాలు కాగా గత ఏడాది ఏకంగా 68.14 (187%) లక్షల ఎకరాల్లో పంటలు సాగయ్యాయి. కానీ ఇప్పుడు ఇబ్బడిముబ్బడిగా నీళ్లున్నా పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అలాగే గతేడాది యాసంగి సీజన్ మొత్తం తీసుకుంటే ఏకంగా 52.78 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దాంతో పోలిస్తే ఇప్పుడు నాలుగో వంతు కూడా నాట్లు పడలేదు. పొద్దుతిరుగుడు, మినుము మినహా వరికి ప్రత్యామ్నాయంగా జొన్న, పొద్దు తిరుగుడు, శనగ, వేరుశనగ, మినుము వంటి పంటలను సాగు చేయాలని, వాటి విస్తీర్ణాన్ని పెంచాలని ప్రభుత్వం పిలుపు నిచ్చింది. కొద్ది మొత్తంలో సాగయ్యే పొద్దుతిరుగుడు, మినుము మినహా మిగతా పంటల సాగు పెరగలేదు. పొద్దు తిరుగుడు సాధారణ సాగు విస్తీర్ణం 10,947 ఎకరాలు కాగా, 23,881 ఎకరాల్లో సాగైంది. అలాగే మినుము సాధారణ సాగు విస్తీర్ణం కేవలం 24,018 ఎకరాలు కాగా, 70,827 ఎకరాల్లో సాగైంది. వేరుశనగ సాధారణ సాగు విస్తీర్ణం 3.01 లక్షల ఎకరాలు కాగా, 3.13 లక్షల ఎకరాల్లో సాగైంది. వేరుశనగను కనీసం ఐదారు లక్షల ఎకరాలకు పెంచాలని అధికారులు భావించినా ఆ మేరకు సాగవలేదు. ఇక శనగ సాధారణ సాగు విస్తీర్ణం 2.84 లక్షల ఎకరాలు కాగా, కొద్దిగా పెరిగి 3.27 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ల„ý ల ఎకరాల్లో వరిని నిలిపివేస్తున్నప్పుడు ఆ మేరకు ప్రత్యామ్నాయ పంటల సాగు కూడా లక్షల ఎకరాల్లో అదనంగా పెరగాలన్నది సర్కారు ఆకాంక్ష. కానీ ఆ పరిస్థితి లేకుండా పోయింది. కేవలం వేల ఎకరాల్లో ఉన్న చిన్నపాటి పంటల విస్తీర్ణం మాత్రమే రెండు మూడింతలు పెరిగింది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యం వ్యవసాయశాఖ నిర్లక్ష్యం వల్లే ప్రత్యామ్నాయ పంటల సాగు అనుకున్నంత స్థాయిలో జరగలేదన్న విమర్శలున్నాయి. ప్రత్యామ్నాయ పంటలు వేయాలని అధికారులు సకాలంలో రైతులకు చెప్పలేకపోయారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పైగా అవసరమైన విత్తనాలను పూర్తిస్థాయిలో అందించలేదన్న విమర్శలున్నాయి. కొన్ని రకాల విత్తనాలను సరఫరా చేశారే కానీ, రైతులు కోరిన వెరైటీలను అందుబాటులోకి తీసుకురాలేక పోయారు. ఇదిగో ఇలా బీడుగా వదిలేసిన ఈ భూమి మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం రాపల్లికి చెందిన రాంరెడ్డిది. తొమ్మిదెకరాల ఈ పొలం పక్క నుంచే గూడెం ఎత్తిపోతల పథకం కాలువ ఉంది. గతంలోనే బోరుబావి కూడా తవ్వించాడు. ఏటా వరి సాగుచేస్తున్నాడు. ప్రస్తుతం పుష్కలంగా నీరున్నా ఈ యాసంగిలో ఏ పంట వేయాలో తెలి యక ఆరెకరాలు బీడుగా వదిలేశాడు. ప్రభుత్వం యాసంగిలో వడ్లు కొనబోమని, వరి సాగు చేయొ ద్దని సూచించడంతో వరి వేస్తే ధాన్యం అమ్ముకోవ డం ఇబ్బంది అవుతుందని రెండెకరాల్లోనే వరివేశాడు. కూరగాయలు, నువ్వులు అరెకరం చొప్పున సాగు చేస్తున్నాడు. మిగతా పంటలు ఏం వేయాలో తెలియక ఆరెకరాలు ఇలా బీడుగా వదిలేశాడు. – మంచిర్యాల, అగ్రికల్చర్ మూడెకరాల వరి పొలం బీడే.. ఏటా ప్రాజెక్టు కాలువ కింద యాసంగి వరి పంట సాగు చేసుకునేది. ఈ ఏడాది వరి సాగు వద్దని ప్రభుత్వం చెప్పింది. పంట వేసుకుంటే నష్టపోవుడేనని, వేరే పంటలు వేసుకోవలన్నరు. గట్లని కంది, పెసలు, నువ్వులు వేసుకుంటే పొద్దంతా ఆవులు, రాత్రి అడవి పందులతో నష్టం ఉంటది. చుట్ట పక్కల పొలం రైతులూ వరి వేయలేదు. నా మూడెకరాల వరి పొలం కూడా ఈ ఏడాది బీడే ఉన్నది. – తోట బాపయ్య, నెన్నెల, మంచిర్యాల జిల్లా మాకు తెలిసింది వరి పంటే.. బోరుకింద ఏటా యాసంగిలో దొడ్డు వరి సాగు చేసేది. వరి పంట వేయద్దని చెప్పడంతో పోయిన ఏడాది మూడెకరాల వరి సాగు చేసుకుంటే ఈ ఏడాది ఎకరంలోనే నాటు వేసుకున్నా. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నా రెండు ఎకరాలు బీడు పోయింది. ఏళ్ల తరబడి వరి పంట తప్ప ఏ పంట వేయలే. మాకు తెలిసిందల్లా వరి పంటే. – ఇజ్జగిరి చంద్రయ్య, కుందారం, జైపూర్, మంచిర్యాల జిల్లా పర్యవసానం తీవ్రంగా ఉంటుంది రైతుకు మార్కెట్లో ఎంతో కొంత మంచి ధర వచ్చేది వరితోనే. మిగతా పంటల్లో రాదు. ఇప్పుడు వరి వేయొద్దనడంతో దాన్ని నిలిపివేశారు. అలాగని మిగతా పంటలూ వేయడం లేదు. ఎవరికి వారు పంటల విరామం ప్రకటించుకున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదో ఒక రకమైన నిరసన. వేరే పంటలకు మద్దతు ధర ఇవ్వకపోవడంపై కూడా రైతులు నిరసన వ్యక్తం చేస్తున్నట్లే లెక్క. దీన్ని సాధారణమైన పరిణామం, స్థితిగా తీసుకోకూడదు. దీని పర్యవసానం తీవ్రంగా ఉంటుంది. వరి భారీగా పండుతున్న సమయంలోనే బియ్యం ధర కిలో రూ. 60కు పైగా పలుకుతోంది. ఆ మేరకు వినియోగదారుడు కొనుగోలు చేస్తున్నాడు. పంట మంచిగా పండితేనే ఆహారం అందరికీ సరిగా దొరకడం లేదు. భవిష్యత్తులో ఎలాంటి ఆహారం అందే పరిస్థితి ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో మున్ముందు ప్రభుత్వం మీద భారం పడుతుంది. రేషన్ బియ్యానికి డిమాండ్ 70–80 శాతానికి పెరుగుతుంది. అంతేకాదు పడావు బడ్డాక భూమి ఆరు నెలలు అలాగే ఉంటే పూర్తిగా ఎండిపోతుంది. దాని భూసారం పడిపోతుంది. వరి పండించే భూమి పడావు పడితే ఉప్పు తేలిపోతుంది. – డి.నర్సింహారెడ్డి, జాతీయ వ్యవసాయ నిపుణులు -
రైతుబంధు.. టాప్‌లో ఏ జిల్లా అంటే?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో 62.99 లక్షల మంది రైతులకు యాసంగి రైతుబంధు సొమ్ము అందింది. మొత్తం 1.48 కోట్ల ఎకరాలకు చెందిన రైతుల ఖాతాల్లో రూ.7,411.52 కోట్లు జమయ్యాయి. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 4,69,696 మంది రైతులకు రూ. 601,74,12,080 నిధులు అందాయి. అత్యల్పంగా మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 33,452 మంది రైతులకు రూ.33.65 కోట్లు జమయ్యాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధి హామీని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలని ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. వ్యవసాయరంగంలో కూలీల కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు మద్దతు ధరలను ఆయా రాష్ట్రాలను, ప్రాంతాలను బట్టి నిర్ణయించాలని సూచించారు. పండించిన పంటలన్నీ కేంద్రం మద్దతు ధరలకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. -
ఐదో రోజు రూ.1,047.41 కోట్లు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం కింద ఐదో రోజు సోమవారం రూ.1,047.41 కోట్లు జమ చేసినట్లు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఈమేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. 4,89,189 మంది రైతుల ఖాతాల్లోకి ఈ రైతుబంధు నిధులు జమ చేశామన్నారు. ఇప్పటి వరకు 57,60,280 మంది రైతులకు రూ.5,294.09 కోట్లు పంపిణీ చేశామని వెల్లడించారు. 20–30 ఎకరాల భూమి ఉన్న రైతులు కూడా ఒకప్పుడు తెలంగాణలో కంట్రోల్ బియ్యం కోసం ఎదురుచూసిన పరిస్థితి ఉండేదని గుర్తుచేశారు. సీఎం కేసీఆర్ ముందుచూపుతో సాగునీటి వసతి కల్పన, వ్యవసాయ అనుకూల పథకాలు, విధానాలతో వ్యవసాయ రంగ స్వరూపం మారిందని పేర్కొన్నారు. రైతుబంధు కింద రైతులకు రూ.50 వేల కోట్లు అందజేసిన పథకం ప్రపంచంలో, దేశంలో ఎక్కడాలేదని నిరంజన్‌రెడ్డి తెలిపారు. -
‘రైతుబంధు’ వినూత్నం: నిరంజన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక ముద్ర ఉందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు. ఇది ప్రపంచంలోనే వినూత్న ఆలోచన అని పేర్కొన్నారు. సోమవారం ఆయన అన్ని జిల్లాల డీఏఓలు, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు ఇందులో పాల్గొన్నారు. నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వ విజయ కిరీటంలో వ్యవసాయ శాఖ పాత్ర వజ్రంలాంటిదన్నారు. కరోనా కష్టకాలంలోనూ వ్యవసాయ ఉత్పత్తుల్లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రం వరి పంటలో పంజాబ్‌ను మించిపోవడం అసాధారణ విజయమన్నారు. 8వ విడతతో కలిపి ఒక్క రైతుబంధు పథకం కిందనే రైతులకు ఇచ్చిన డబ్బులు రూ.50 వేల కోట్లకు చేరాయని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా రైతాంగానికి ఇన్ని నిధులు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. వ్యవసాయ రంగానికి ఏటా రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వెల్లడించారు. -
బ్యాంకులు, ఏటీఎంలకు వెళ్లకుండానే పీఎం కిసాన్, రైతుబంధు డబ్బులు
సాక్షి, హైదరాబాద్: అటు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి, ఇటు రాష్ట్ర ప్రభుత్వ రైతుబంధు పథకం.. ఈ రెంటి లబ్ధిదారులు డబ్బుల కోసం బ్యాంకులకో, ఏటీఎం కేంద్రాలకో వెళ్లాల్సిన అవసరం లేకుండా తపాలా సిబ్బందే అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని లబ్ధిదారులు డబ్బులు తీయడానికి దగ్గర్లోని పట్టణాలకు వెళ్లకుండా పోస్టాఫీసులు అందుబాటులోకి తెచ్చిన మైక్రో ఏటీఎంలతో డబ్బులు అందజేస్తున్నారు. లబ్ధిదారులు గ్రామంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌కార్డు చూపి బయోమెట్రిక్ విధానంలో సులభంగా డబ్బులు తీసుకోగలుగుతున్నారు. ఇందుకోసం తపాలాశాఖ తెలంగాణ సర్కిల్ పరిధిలోని 4,700 పోస్టాఫీసుల్లో ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే రైతుబంధు పథకం ద్వారా 29,545 మందికి రూ.15.39 కోట్లను చెల్లించగా, ప్రధాన్‌మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద శనివారం నుంచి చెల్లింపులు ప్రారంభించారు. సమీపంలోని పోస్టాఫీసుకు వెళ్లి ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతా నంబరు, మొబైల్ నంబరు చెబితే అక్కడి సిబ్బంది వివరాలను బయోమెట్రిక్‌తో ఉండే మైక్రో ఏటీఎం యంత్రంలో నమోదు చేస్తారు. రిజిస్టర్డ్ మొబైల్ నంబరుకు వచ్చే ఓటీపీని చెప్పి యంత్రంలోని బయోమెట్రిక్ స్క్రీన్‌పై వేలిముద్ర వేస్తే చాలు.. ఆ పథకాల తాలూకు డబ్బులు అందుతాయి. అయితే ఒకసారి గరిష్టంగా రూ.10 వేలు మాత్రమే తీసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ప్రక్రియకు రుసుము చెల్లించాల్సిన పని లేదు. (కొత్త ఏడాది ఊపుతో తెగ తాగేశారు.. రాష్ట్రంలో ఎన్ని కోట్ల మద్యం అమ్ముడైందో తెలుసా?) -
4వరోజు రూ.1144.64 కోట్ల రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు నిధులు విడుదలలో భాగంగా నాలుగో రోజు 6,75, 824 మంది రైతుల ఖాతాల్లో రూ.1144.64 కోట్లు జమ అయ్యాయని వ్యవసాయశాఖమంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటి వరకు 52,71,091 మంది రైతుల ఖాతాల్లో రూ.4246.86 కోట్ల రైతుబంధు నిధులు జమ అయ్యాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. -
మరో 17.31 లక్షల మందికి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: రైతు బంధు పథకం కింద రెండోరోజు రూ.1255.42 కోట్లు రైతుల ఖాతాలో జమ చేసినట్టు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. బుధవారం ఒక్కరోజే 17,31,127 మంది రైతులకు సాయం అందించామన్నారు. మంగళ, బుధవారాల్లో మొత్తంగా 35,43,783 మంది రైతుల ఖాతాల్లో రూ.1799.99 కోట్లు జమ చేసినట్టు చెప్పారు. రాష్ట్రంలో సాగు విస్తీర్ణం, పంటల దిగుబడులు పెరగడంతో పలు రంగాలకు ఉపాధి లభించిందన్నారు. -
రైతు బంధు, దళిత బంధుపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు అమలు చేస్తామని శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. వరివేస్తే రైతులకు రైతు బంధు ఆపాలని తెలిపిన అధికారుల సూచనలను కేసీఆర్ తిరస్కరించారు. అధికారుల సూచనలపై తెలంగాణ భవన్లో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో చర్చించిన సీఎం.. రైతు బంధు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపేది లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితబంధు దళిత బంధు పథకాన్ని దశల వారీగా రాష్ట్రమంతా అమలు చేస్తామని సీఎం కేసీఆర్ వెల్లడించారు. దళితబంధుపై విపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని, వాటి దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని కేసీఆర్ స్పష్టంచేశారు. మొదట హుజురాబాద్‌తో పాటు నాలుగు నియోజకవర్గాల్లోని నాలుగు మండలాల్లో పూర్తిస్థాయిలో దళితబంధు అమలు చేస్తామని, తరువాత రాష్ట్ర వాప్తంగా అమలు చేస్తామని కేసీఆర్ పేర్కొన్నారు. -
పాలన పరుగు.. పార్టీకి మెరుగు
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియడంతో రాష్ట్రంలో వరుస ఎన్నికలకు బ్రేక్ పడింది. పదవీకాలం పూర్తికాక ముందే ఏవైనా సీట్లు ఖాళీ అయితే తప్ప.. వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఎలాంటి ఎన్నికలు జరిగే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇటు పాలన వ్యవహారాలు, అటు పార్టీ బలోపే తంపై పూర్తిస్థాయి దృష్టి సారించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా రెండేళ్ల కార్యా చరణ అమలుకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో వరుసగా జిల్లాల పర్యటనలు చేయనున్నారు. పలు జిల్లాల పర్యట నలు ఇప్పటికే ఖరారు కాగా.. ఇతర జిల్లాలకు వెళ్లే తేదీలను త్వరలో నిర్ణయించ నున్నారు. జిల్లాల పర్యటనల సందర్భంగా జిల్లా స్థాయి నేతలు, కార్యకర్తలతో కేసీఆర్ ముఖాముఖి మాట్లాడనున్నట్టు సమాచారం. ఈ పర్యటనలకు ముందే హైదరా బాద్‌లో పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలతో, జిల్లా కలెక్టర్లతో వేర్వే రుగా సమావేశాలు నిర్వహించను న్నారు. ప్రభుత్వ ప్రాథమ్యాలు, లక్ష్యా లను స్పష్టం చేయడంతోపాటు రానున్న రెండేళ్లలో ప్రభుత్వపరంగా, పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలు, సాధించాల్సి పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు. 17న పార్టీ నేతలతో సమావేశం తెలంగాణ భవన్లో 17న మధ్యాహ్నం 2 గంటలకు సీఎం కేసీఆర్ అధ్యక్షతన పార్టీ సమావేశం జరగ నుంది. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్లు, డీసీఎంఎస్, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్రస్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ నేతలు ఈ సమావేశంలో పాల్గొనను న్నారు. ఈ సందర్భంగా సంస్థాగతంగా పార్టీ బలో పేతం, నేతల మధ్య సఖ్యతతోపాటు నామినేటెడ్ పదవుల భర్తీ అంశాలపై దృష్టిసారించనున్నట్టు సమాచారం. వరుసగా జిల్లాల్లో.. సీఎం కేసీఆర్ ఈ నెల 19న వనపర్తి జిల్లాలో పర్యటించి కలెక్టర్ కార్యాలయాన్ని, టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. స్థానికంగా వైద్య కళాశాల నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. 20న జనగామ జిల్లాలో కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించడంతో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అనంతరం మరి కొన్ని జిల్లాల్లోనూ సీఎం పర్యటించనున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలో పర్యటించి ఉమామ హేశ్వర లిఫ్టు, జలాశయం పనులకు శంకుస్థాపన, 100 పడకల దవాఖానా ప్రారంభోత్స వంలో కేసీఆర్ పాల్గొనాల్సి ఉంది. ఇక నిజామాబాద్, జగిత్యాల, యాదాద్రి–భువనగిరి, వికారాబాద్ జిల్లాల్లోనూ పర్యటించి కలెక్టరేట్లను ప్రారంభించి, స్థానిక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఇదే సమయంలో ఆయా జిల్లాల టీఆర్ఎస్ పార్టీ కార్యాల యాలను సైతం సీఎం ప్రారంభించను న్నారు. ఈ పర్యటనల తేదీలు త్వరలో ఖరారు కానున్నాయి. 18న కలెక్టర్లతో సదస్సు సీఎం కేసీఆర్ ఈ నెల 18న ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లతో దళితబంధు, ఇతర అంశాలపై సమా వేశం నిర్వహించనున్నారు. మంత్రులు, సీఎస్, ఇతర సీనియర్ అధికారులు అందులో పాల్గొంటా రు. ఈ సందర్భంగా హుజూరాబాద్ నియోజక వర్గం, ఇతర చోట్ల దళితబంధు అమలుపై సీఎం సమీక్షించనున్నారు. పథకం అమలు విషయంలో అధికారులు, ప్రజాప్రతినిధులకు శిక్షణ కార్యక్రమా ల నిర్వహణపై నిర్ణయం తీసుకోనున్నారు. అదే సందర్భంలో ధాన్యం సేకరణ, యాసంగిలో ప్రత్యామ్నాయ పంటల సాగుకు ప్రోత్సాహం, రాష్ట్రపతి కొత్త ఉత్తర్వుల ప్రకారం కొత్త లోకల్ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులు, ధరణి పోర్టల్ సమస్యలు, పల్లె/పట్టణ ప్రగతి కార్యక్రమాలు, పోడు భూముల సమస్యకు పరిష్కారం వంటి అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది. కలెక్టర్ల సమావేశంలో జిల్లాల వారీగా కలెక్టర్ల పనితీరు, వివిధ కార్యక్రమాల అమల్లో సాధించిన పురోగతిపై సీఎం సమీక్షించనున్నారని తెలిసింది. -
ఈనెల 15 నుంచి రైతుబంధు!
సాక్షి, హైదరాబాద్: ఎకరాకు రూ.5 వేల చొప్పున కోటిన్నర లక్షల ఎకరాలకు రూ.7,500 కోట్ల రైతుబంధు నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నిధుల సర్దుబాటుపై ఆర్థిక శాఖ ఇప్పటికే దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈనెల 15 నుంచి అంటే మరో పది రోజుల్లోనే తెలంగాణ రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమ చేయాలని ఈ సందర్భంగా అధికారులను సీఎం ఆదేశించినట్లు తెలియవచ్చింది. వానాకాలం సీజన్‌కు సంబంధించి జూన్ నెలలో 60.84 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయంగా రూ.7,360.41 కోట్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1.47 కోటి ఎకరాలకు నిధుల పంపిణీ జరిగింది. అయితే ఈ యాసంగిలో నిధుల పంపిణీ మరింత పెరిగే అవకాశముంది. కొత్తగా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందిన రైతుల సంఖ్య, అందుకు అనుగుణంగా భూ విస్తీర్ణం పెరిగితే బడ్జెట్ కూడా పెరగనుంది. ఈ నేపథ్యంలోనే రూ.7,500 కోట్లు అవసరమని వ్యవసాయ, ఆర్థిక శాఖలు అంచనా వేశాయి. గత వానాకాలంలో మొదటి రోజు ఒక ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు, రెండో రోజు రెండెకరాలు, మూడో రోజు మూడెకరాలున్న వారికి నగదు బదిలీ చేశారు. ఈసారీ అలాగే పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్నారు. -
కౌలురైతుకూ ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కౌలురైతులకూ ‘రైతుబంధు’ పథకాన్ని వర్తింపజేయాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ డిమాండ్ చేశారు. గత ఎన్నికల్లో సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు తక్షణమే బీసీ సబ్‌ప్లాన్ చట్టాన్ని తీసుకురావాలన్నారు. ‘దళితబంధు’తోపాటు ‘బీసీబంధు’పథకాన్ని కూడా ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. గొర్ల పంపిణీలో కేంద్రం నయాపైసా కూడా ఇవ్వడం లేదంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై సంజయ్ మండిపడ్డారు. గొర్ల పంపిణీకి ఇచ్చే రుణంలో కేంద్రం రూ.వెయ్యి కోట్ల సబ్సిడీ ఇస్తున్న విషయం వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. బీసీలపట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తున్న నిర్లక్ష్యధోరణికి నిరసనగా ఉధృత పోరాటాలకు ఓబీసీ మోర్చా సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శనివారం బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్రాజ్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో సంజయ్ మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ నియంత, అవినీ తి, కుటుంబ పాలనపట్ల విసిగిపోయిన ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. బీసీ కుటుంబాలకు ‘బీసీబంధు’పేరిట రూ.10 లక్షల చొప్పున సాయం అందించాలని డిమాండ్ చేశారు. ‘బీసీ నిరుద్యోగులు, ఉపాధి కరువైన వాళ్లు లక్షల్లో ఉన్నరు. వాళ్లకు ఉద్యోగాల్లేవు. స్వయం ఉపాధితో బతుకుదామంటే రుణాలిచ్చే దిక్కులేదు. లోన్లు ఇస్తామని గత ఎన్నికల ముందు గొప్పగా ప్రకటించిన కేసీఆర్ మాటలు నమ్మి దాదాపు 6 లక్షల మంది బీసీ యువత దరఖాస్తు చేసుకున్నరు. ఎన్నికలప్పుడు కొద్దిమందికి ఇచ్చి ఆశజూపిన కేసీఆర్ ఓట్లు దండుకున్నాక ఆ ఊసే ఎత్తడం లేదు’అని విమర్శించారు. బీసీబంధు కోసం పోరు: లక్ష్మణ్ రాష్ట్రప్రభుత్వం దళితబంధు పథకం ప్రకటించినట్లుగానే ‘బీసీబంధు’పథకం కోసం పోరాటం చేస్తామని బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ వెల్లడించారు. బీసీబంధు కింద కుటుంబానికి రూ.పది లక్షలు కేటాయించి కులవృత్తులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ వర్గాలకు బీజేపీని దగ్గర చేసే ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో బీసీల బలం వెల్లడౌతుందన్న భయంతోనే సమగ్ర కుటుంబ సర్వే వివరాలను కేసీఆర్ ప్రభుత్వం బయటపెట్టడం లేదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకున్న 34 శాతం రిజర్వేషన్లను కేసీఆర్ 18 శాతానికి కుదించారని విమర్శించారు. ఓబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. -
‘సంక్షేమం’లో రాష్ట్రం రోల్‌మోడల్
హుజూరాబాద్/ఎల్కతుర్తి: సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలుస్తోందని రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. మంగళవారం హుజూరాబాద్‌లోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సీపీఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు పొనగంటి శ్రవణ్‌కుమార్ తన అనుచరులతో కలిసి పార్టీలో చేరగా మంత్రి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మంత్రి మాట్లాడుతూ ‘తెలంగాణ అంటే వలసలు, బొగ్గుబాయి పని. ఇప్పుడు ఈ ఏడేళ్లలో ఇతర రాష్ట్రాల వారు వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారు. రైతుబంధు తెలంగాణ మోడల్. 24 గంటల ఉచిత విద్యుత్ తెలంగాణ మోడల్. రైతు బీమా తెలంగాణ మోడల్. టీఎస్ ఐపాస్ తెలంగాణ మోడల్. ఇది మనం చెబుతున్నది కాదు. కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ సభ్యులే అంటున్నారు’ అని చెప్పారు. హుజూరాబాద్‌లో అరాచానికి.. అభివృద్ధికి మధ్య పోటీ నడుస్తోందని.. ఈటల మాటల్లో ఒక్క నీతివంతమైన మాట ఉందా? అని నిలదీశారు. ‘గ్యాస్ సిలిండర్ ధర బీజేపీ పాలనలో వెయ్యి రూపాయలకు పెరిగింది. రాజేందర్ మాట్లాడుతూ రాష్ట్ర పన్ను రూ.291 ఉందన్నారు. రూ.291 రాష్ట్ర పన్ను ఉంటే నేను ముక్కు నేలకు రాస్తా. దీనిపై హుజూరాబాద్ అంబేద్కర్ చౌరస్తా వద్ద చర్చకు వస్తావా’ అని సవాల్ విసిరారు. సిలిండర్ ధరను రూ.500కు తగ్గిస్తామని చెప్పి బీజేపీ ఓట్లు అడగాలని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ను అభివృద్ధి చేసి చూపిస్తాం.. హుజూరాబాద్ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను గెలిపిస్తే నియోజక వర్గాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసి చూపిస్తామని హరీశ్‌రావు హామీ ఇచ్చారు. మంగళవారం హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికలపేట గ్రామ శివారులో జరిగిన వడ్డెర కుల ఆశీర్వాద సభలో హరీశ్ మాట్లాడారు. ఆత్మగౌరవం అంటూ ఈటల రాజేందర్ వింతగా మాట్లాడుతున్నాడని, నియోజకవర్గ ప్రజలకు గడియారాలు, కుక్కర్లు పంచిననాడే ఆయన ఆత్మగౌరవం మంటకలిసిందని విమర్శించారు. సమావేశంలో మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీఆర్ రైతుబాంధవుడు: హరీశ్
హుజూరాబాద్/గజ్వేల్: ‘రాష్ట్రానికి సీఎంగా ఉన్నా కేసీఆర్ వ్యవసాయం చేస్తున్నారు. అప్పట్లో కరువు మంత్రిగా, రవాణా మంత్రిగా, కేంద్రమంత్రిగా ఉన్నా వ్యవసాయాన్ని విడవని రైతు మన సీఎం కేసీఆర్. ఆయన రైతు గనుకనే రైతుల కష్టాలు తెలుసు. నీటితీరువా, కాళేశ్వరం ప్రాజెక్టు, రైతుబంధు, రైతుబీమా, రైతువేదికలు వంటివి ప్రవేశపెట్టిన రైతు బాంధవుడు కేసీఆర్. బీజేపీ మాత్రం రైతుల ఉసురు పోసుకుంటోంది’ అని రాష్ట్ర ఆర్థికమంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో జరిగిన విత్తనోత్పత్తి రైతుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ కింద వారంలోపే రూ.50 వేల రుణాలను మిత్తి సహా చెల్లిస్తామని చెప్పారు. ఇక్కడ విత్తనోత్పత్తి రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసే అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ పాల్గొన్నారు. చేనేతబీమా అమలు చేస్తాం రైతుబీమా తరహాలో చేనేత కార్మికులకు సైతం రూ. 5 లక్షల బీమాను అమలు చేయనున్నట్లు మంత్రి హరీశ్‌రావు తెలిపారు. సోమవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డితో కలసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, కొండా లక్ష్మణ్‌బాపూజీ విగ్రహావిష్కరణ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ నేతన్నల రుణమాఫీతోపాటు సబ్సిడీ ద్వారా ముడి సరుకులు అందిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు. -
విద్యుత్ సంస్కరణలతో రైతులపై భారం
శాలిగౌరారం/ మోత్కూరు/చిట్యాల/ నార్కట్‌పల్లి: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యుత్ సంస్కరణలు రైతులకు భారంగా మారనున్నాయని మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. నూతన వ్యవసాయ చట్టాలతో ఒప్పంద వ్యవసాయవిధానం అమలుకు అవకాశం కల్పించిందని, రైతులు కార్పొరేట్ వ్యవస్థలోకి వెళ్లనున్నారని దీంతో వ్యవసాయ మార్కెట్లు నిర్వీర్యమవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం, యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి ఆయన శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు చేశారు. మోత్కూరు మార్కెట్ పాలకవర్గ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్, రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు కూడా దమ్ముంటే అటువంటి పథకాలు అమలు చేయాలని సవాలు విసిరారు. రాష్ట్రంలో కేంద్రప్రభుత్వ అధీనంలోని 6 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలన్నారు. సంక్షేమ పథకాల అమలుతో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్న రాష్ట్రాన్ని చూసి ఓర్వలేకే ప్రతిపక్ష పార్టీలు యాత్రలు చేస్తున్నాయని నిరంజన్‌రెడ్డి మండిపడ్డారు. శాలిగౌరారం వెళ్తూ మార్గమధ్యంలో చిట్యాలలో రైతు కొంతం సత్తిరెడ్డి వ్యవసాయక్షేత్రాన్ని పరిశీలించి అక్కడ పండించిన వంకాయలను మంత్రి కొనుగోలు చేశారు. నార్కట్‌పల్లిలోని ఓ ఎడ్ల బండిని చూసి.. చాలా రోజుల తర్వాత చూస్తున్నానని ఆనందం వ్యక్తం చేశారు. మావోయిస్టు దళ సభ్యురాలు లొంగుబాటు చర్ల: మావోయిస్టు పార్టీ దళ సభ్యురాలు, పార్టీ రాష్ట్ర కమిటీ కార్యదర్శి హరిభూషణ్ రక్షణదళ గార్డు ముసికి బుద్రి అలియాస్ బీఆర్ శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏఎస్పీ డాక్టర్ వినీత్ ఎదుట లొంగిపోయింది. ఏఎస్పీ వివరాలు వెల్లడించారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్ జిల్లా రాంపురంవాసి, గొత్తికోయ తెగకు చెందిన ముసికి బుద్రి ఆరేళ్లుగా పార్టీలో పని చేస్తోంది. ఆమె భర్త ముసికి సోమడాల్ అలియాస్ సోమనార్ కూడా ఊసూరు ఏరియా కమిటీ సభ్యుడిగా పనిచేస్తున్నాడు. ఈ దంపతులకు నెలల వయసు ఉన్న బాబు ఉన్నాడు. కొంతకాలంగా రక్తహీనతతో బాధపడుతుండడంతో బుద్రి పోలీసులకు లొంగిపోయింది. -
పెద్దల యూటర్న్!
సాక్షి, హైదరాబాద్: పెద్దల మనసు మారింది.. పేదల సరసన చేరారు.. వద్దనుకున్న రైతుబంధు సొమ్ము తమకు కూడా ముద్దంటున్నారు.. ‘అప్పుడు ఏదో తెలియక గివ్ ఇట్ అప్ పథకం కింద రైతుబంధు సొమ్ము వెనక్కు ఇచ్చాం. పొరపాటు చేశాం. ఇప్పుడు మాకు రైతుబంధు సొమ్ము కావాలి. గివ్ ఇట్ అప్ కింద మేం ఇచ్చిన హామీని రద్దు చేయండి’అంటూ వ్యవసాయశాఖకు కొందరు పెద్దల నుంచి విన్నపాలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఎకరాకు రూ.5 వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. పెద్ద రైతులు ఎవరైనా ఆ సొమ్మును వద్దనుకుంటే, వెనక్కు ఇచ్చేలా గివ్ ఇట్ అప్ పథకాన్ని ప్రభుత్వం అప్పట్లో ప్రవేశపెట్టింది. అలా వచ్చిన డబ్బును రైతుబంధు సమితికి కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి రైతు సంక్షేమానికి ఖర్చు చేయాలని నిర్ణయించింది. మొదట్లో రైతుబంధు సొమ్ము తీసుకున్న పెద్ద రైతులు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సినిమా నటులు తదితర పెద్దలు చెక్కులను వెనక్కు ఇచ్చారు. అప్పట్లో దాదాపు రూ.2.50 కోట్ల వరకు సొమ్మును వదులుకున్నారు. కానీ, అలా వదులుకున్నవారు తిరిగి తాము రైతుబంధు సొమ్ము తీసుకుంటామని, తామిచ్చిన గివ్ ఇట్ అప్ హామీని రద్దు చేయాలని ఇప్పుడు వ్యవసాయశాఖకు విన్నవించుకుంటున్నారు. ఇది స్వచ్ఛందం కావడంతో వ్యవసాయశాఖ కూడా వారి విన్నపాన్ని పరిగణనలోకి తీసుకుంది. వారికి సొమ్ము ఇచ్చింది. దీంతో ఈసారి గివ్ ఇట్ అప్ కింద సొమ్ము వదులుకున్నవారి సంఖ్య భారీగా పడిపోయిందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. పెద్దలు తీసుకోవడంపై విమర్శలు తనకూ పెట్టుబడి సొమ్ము వస్తుందని, అయితే స్వచ్ఛందంగా వదులుకుంటానని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పట్లో రైతుబంధు సమితి సదస్సులో ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, సినిమా పెద్దలు, ప్రతిపక్ష పార్టీల నాయకులు పలువురు అదే బాటలో నడిచారు. పేద, మధ్య తరగతి రైతులకు దక్కాల్సిన సొమ్మును పెద్దలు తీసుకుంటే ప్రజల్లో విమర్శలు వస్తాయి కాబట్టి వారిని తప్పించేందుకు ప్రభుత్వం గివ్ ఇట్ అప్ పథకాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. పైగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీనేతలు స్వచ్ఛందంగా వదులుకునేలా చేస్తే మంచి పేరు వస్తుందని ప్రభుత్వం భావించింది. అయితే 50 ఎకరాలుంటే ఏడాదికి రెండు సీజన్లకు కలిపి రూ. 5 లక్షలు వస్తాయి. ఇలా భారీగా భూములున్నవారు లక్షలాది రూపాయలు వదులుకోవడానికి ఇప్పుడు ఏమాత్రం సిద్ధంగా లేరని వ్యవసాయశాఖ వర్గాలు అంటున్నాయి. వందల కోట్ల ఆస్తిపరులు కూడా ఈ సొమ్మును తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నారు. -
రైతుబంధు అక్రమార్కులకు షాక్.. రూ. 300 కోట్లు ఆదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం కోసం సేకరించిన భూముల బదలాయింపు జరగకపోవడంతో, రైతుల పేరిట దర్జాగా ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం తీసుకుంటున్న అక్రమార్కులకు షాక్ తగిలింది. భూముల లెక్కలు పక్కాగా తేలడంతో, ప్రాజెక్టుల కిందికి వచ్చే సుమారు లక్షా యాభై వేల ఎకరాల భూమిని ఇరిగేషన్ శాఖ స్వాధీనం చేసుకుంది. మ్యుటేషన్ ప్రక్రియ కూడా పూర్తి కావడంతో ప్రభుత్వానికి పెద్దమొత్తంలో ఆర్థిక భారం తగ్గింది. అక్రమార్కులకు ఏటా కనీసంగా రూ.300 కోట్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయింది. ప్రాజెక్టుల ముంపు భూములతో పాటు, గుట్టలకు, ఎప్పుడో ఏర్పడిన కాలనీల భూములకు సైతం కొందరు అక్రమార్కులు.. రైతుల పేరిట ‘రైతుబంధు’ సాయం పొందుతుండటంపై ‘సాక్షి’ ఇటీవల కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఏడాదిగా కసరత్తు..ఎట్టకేలకు కొలిక్కి రాష్ట్రంలో వివిధ సాగు నీటి ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములు, వాటిల్లో కబ్జాకు గురైన భూములు, మ్యుటేషన్ జరగని భూముల వివరాలు తేల్చాలని గత ఏడాది కేసీఆర్ ఇరిగేషన్ శాఖను ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు ఇన్వెంటరీ (ఆస్తుల జాబితా) పేరుతో శాఖ ఆస్తులు, భూముల వివరాలు సేకరించారు. ఇందులో భాగంగానే నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్, నిజాంసాగర్, బీమా, నెట్టెంపాడు, కాళేశ్వరంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని మధ్యతరహా ప్రాజెక్టుల కింద ఉన్న భూముల వివరాలు సేకరించారు. ఆయా భూముల నిమిత్తం రైతులకు పరిహారం అందజేసినా, మ్యుటేషన్ కాని కారణంగా వాటిని భూ యజమానులే అనుభవిస్తున్నారని, రైతుబంధు సైతం పొందుతున్నారని గుర్తించారు. అలాగే కొన్నిచోట్ల ముంపులో ఉన్న భూములకు కొందరు అక్రమార్కులు పెట్టుబడి సాయం పొంతున్నారని తేల్చారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో భూములు మ్యుటేషన్ కాలేదని గుర్తించిన సాగునీటి శాఖ, ఆయా ప్రాజెక్టుల పరిధిలోని జిల్లాల్లో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కార్యాలయాల్లో రికార్డుల ఆధారంగా ఆ భూముల వివరాలను బయటకు తీసింది. భారీ ప్రాజెక్టుల కింద 6.19 లక్షల ఎకరాలు, మధ్యతరహా ప్రాజెక్టుల కింద 76 వేల ఎకరాలు, చిన్నతరహా ప్రాజెక్టుల కింద 5.84 లక్షల ఎకరాలు కలిపి మొత్తంగా 12.79 లక్షల ఎకరాలు శాఖకు చెందినవిగా గుర్తించింది. ఇందులో సుమారు 1.50 లక్షల ఎకరాల భూమి మ్యుటేషన్ జరగలేదని గుర్తించింది. వీటిల్లో ప్రధాన ప్రాజెక్టులైన ఎస్సారెస్పీ స్టేజ్–1లో సుమారు 10,600 ఎకరాలు, స్టేజ్–2లో 6,300 ఎకరాలు, ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు పరిధిలో 7,170 ఎకరాలు, ప్రాణహితలో 5 వేలు, వట్టివాగులో 740, సత్నాలలో 730, బీమాలో 425 ఎకరాలు, నెట్టెంపాడులో 2,700 ఎకరాలు, కాళేశ్వరం ప్రాజెక్టులో సుమారు 22 వేలు, వరద కాల్వ పరిధిలో 4,500, మిడ్‌మానేరులో 2వేల ఎకరాల మేర మ్యుటేషన్ కాలేదని గుర్తించారు. ఈ భూములకు అక్రమార్కులు రైతుబంధు పొందుతున్నారని తేల్చారు. ఇటీవల ఈ భూముల తిరిగి స్వాధీనంపై సమావేశాలు నిర్వహించి, రెవెన్యూ శాఖతో సమన్వయం చేసుకుంటూ భూములను శాఖ పేరుపై బదలాయించారు. దీంతో ప్రభుత్వంపై ఏటా రూ.300 కోట్ల మేర రైతుబంధు భారం తగ్గుతుందని లెక్కగట్టారు. -
పొలాల్లోనే రైతుబంధు నగదు
సాక్షి, హైదరాబాద్: మైక్రో ఏటీఎంలు అందు బాటులోకి తెచ్చి బ్యాంకులు, ఏటీఎంల వరకు వెళ్లాల్సిన పని లేకుండా ఊళ్లలోనే రైతు బంధు నగదు అందజేస్తున్న తపాలాశాఖ.. ఏరువాక పున్నమి సందర్భంగా వినూత్న కార్య క్రమానికి శ్రీకారం చుట్టింది. పొలం దున్నకాల్లో తలమునకలై ఉన్న రైతుల వద్దకే వెళ్లి హ్యాండ్ హెల్డ్ మైక్రో ఏటీఎంల ద్వారా వారి బయోమెట్రిక్ తీసు కుని అక్కడికక్కడే రైతుబంధు నగదు అంద జేసింది. ఈ విధానానికి రైతుల నుంచి హర్షం వ్యక్త మవుతోంది. తాజా విడతకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు తపాలాశాఖ లక్ష మందికి పైగా రైతులకు రూ.66 కోట్ల నగదు అందజేసింది. -
రైతుబంధు డబ్బులు ఇవ్వలేదని తల్లిని కొట్టి చంపాడు
కేటీదొడ్డి (గద్వాల): జోగుళాంబ గద్వాల జిల్లాలో రైతుబంధు డబ్బులు ఇవ్వనందుకు కన్నతల్లినే ఓ కొడుకు కొట్టి చంపేశాడు. పోలీసుల కథనం ప్రకారం.. కేటీదొడ్డి మండలంలోని గువ్వలదిన్నెకు చెందిన దాసరి శాంతమ్మ (52), హన్మంతుకు ఇద్దరు కుమారులు. కొన్నేళ్ల క్రితమే భర్త ఎటో వెళ్లిపోయి ఇంతవరకు తిరిగి రాలేదు. పెద్ద కుమారుడు, కోడలు బతుకుదెరువుకోసం హైదరాబాద్ వలస వెళ్లారు. రెండో కుమారుడు వెంకటేశ్, తల్లి శాంతమ్మ స్వగ్రామంలోనే ఉంటూ తమకున్న రెండెకరాల్లో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రెండో పెళ్లి చేసుకున్న వెంకటేశ్‌ను తల్లి ఇంటి నుంచి గెంటేసింది. దీంతో వేరే కాపురం పెట్టిన అతను మద్యానికి బానిసై తరచూ డబ్బుల కోసం తల్లిని వేధించేవాడు. రెండు రోజుల క్రితమే ‘రైతుబంధు’డబ్బులు వచ్చాయని తెలుసుకున్న వెంకటేశ్ మంగళవారం అర్ధరాత్రి తల్లి వద్దకు వచ్చి గొడవపడ్డాడు. డబ్బులు ఇవ్వాలని అడగ్గా అమె నిరాకరించడంతో అంతు చూస్తానని చెప్పి కర్రతో తలపై కొట్టాడు. దాంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. బుధవారం ఉదయం విషయం తెలుసుకున్న గ్రామస్తులు, బంధువులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలాన్ని డీఎస్పీ యాదగిరి, ఎస్ఐ కుర్మయ్య పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. -
రైతు బంధుతో సమస్యలా? ఈ నెంబర్లకు కాల్ చేయండి
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసిన రైతుబంధు సొమ్మును రైతులు విత్ డ్రా చేయడానికి కొన్ని బ్యాంకులు అంగీకరించడం లేదని, పాత బకాయిల క్రింద ఆ మొత్తాన్ని సర్దుబాటు చేస్తున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ విషయమై బ్యాంకర్లతో అత్యవసర సమావేశాన్ని నిర్వహించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ ఆదేశాల అనుసరించి రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ బ్యాంకర్లతో మంగళవారం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతుబంధు నిధులను నిలిపివేయడానికి ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఈ సందర్భంగా బ్యాంకర్లు తెలిపారు. భవిష్యత్తులో రైతుబంధుకు సంబంధించి ఎలాంటి మొత్తాన్ని నిలిపివేయవద్దని గౌరవనీయ ఆర్ధిక మంత్రి బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నిలిపివేయబడిన/సర్దుబాటు చేయబడిన ఏదైనా మొత్తం ఉన్నట్లయితే తిరిగి రైతుల ఖాతాకు జమ చేయాలన్నారు. ఈ అంశంపై బ్యాంకర్లు తమ తమ బ్యాంకు బ్రాంచీలకు ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయాలన్నారు. ఈ విషయాన్ని జిల్లా స్థాయిలో పర్యవేక్షించుటకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయిలో ఉన్నత స్థాయి టీం మానిటరింగ్ చేస్తుంది. రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించడానికి రెండు టోల్ ఫ్రీ నెంబర్లు 1800-200-1001, 040-33671300 ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవి ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు పనిచేస్తాయి. ఆదే విధంగా పంట రుణాల రెన్యూవల్, పంపిణీని బ్యాంకర్లు వేగవంతం చేయాలని మంత్రి బ్యాంకర్లను ఆదేశించారు. చదవండి: రూ.7444 ఇంజెక్షన్ @రూ.35 వేలు! -
ఐదెకరాలకే ఇస్తే రూ.4 వేల కోట్లు మిగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు సాయాన్ని 5 ఎకరాలకే పరిమితం చేసినా, చిన్న, సన్నకారు రైతులకే లాభం కలుగుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) అంచనా వేసింది. ఇలా చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి రూ.4,500 కోట్ల వరకు మిగులుతుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌జీజీ వినతిపత్రం అందజేసింది. అంతకు ముందు ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి రైతుబంధు పథకానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. 2020 యాసంగిలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 147.14 లక్షల ఎకరాలకు సంబంధించి 59.21 లక్షల పట్టాదారులకు రూ.7,357.02 కోట్లు రైతుబంధు సాయం అందించినట్లు తెలిపింది. ఇందులో ఐదు ఎకరాల లోపు ఉన్నవాళ్లు 53.30 లక్షల మంది 102.24లక్షల ఎకరాలు కలిగి ఉన్నారు. వీరికి ఎకరాకి రూ.5వేల చొప్పున ప్రతి సీజన్‌కి రైతులకు రైతుబంధు సాయాన్ని అందజేసిన రూ.5,111 కోట్లు ఖర్చు కానుంది. ఇలా రెండు సీజన్లు కలిపి సుమారు రూ.4,500 కోట్లు మిగలనున్నట్లు ఎఫ్‌జీజీ తెలిపింది. అదే పది ఎకరాల లోపు ఉన్న 58.07 లక్షల మంది రైతులకు(132.65 లక్షల ఎకరాలకు) ప్రతి సీజన్‌కి రైతులకు రైతుబంధు సాయాన్ని అందజేస్తే రూ.6,632.74 కోట్లు ఖర్చు అవుతుంది. చదవండి: ఎస్బీఐ వినియోగదారులకి హెచ్చరిక -
జాతీయస్థాయిలో తెలంగాణ టాప్
సాక్షి, హైదరాబాద్: రైతు ఇంటికే రైతుబంధును చేరవేయడం ద్వారా తెలంగాణ తపాలా సర్కిల్ రికార్డు సృష్టించింది. మైక్రో ఏటీఎంల ద్వారా ఎక్కువ మందికి నగదు పంపిణీ చేసి జాతీయ స్థాయిలో తొలిస్థానంలో నిలిచింది. చదవండి: కేసీఆర్‌ను జైలులో పెట్టే దమ్ముందా? రాష్ట్రవ్యాప్తంగా... ‘తపాలా’ద్వారా ఇంటి వద్దే నగదు అందుకున్న రైతుల సంఖ్య: 3,01,000. ఇలా పంపిణీ చేసిన మొత్తం: రూ.190 కోట్లు. (ఇందులో రైతుబంధుతోపాటు పీఎం కిసాన్ యోజన లబ్ధి కూడా ఉంది) దేశవ్యాప్తంగా... ‘తపాలా’ద్వారా ఇంటి వద్దే నగదు అందుకున్న రైతుల సంఖ్య: 26,40,000 ఇందులో తెలంగాణ తపాలాశాఖ లావాదేవీల శాతం: 11.4 జాతీయస్థాయిలో పంపిణీ చేసిన మొత్తం: రూ.910.6 కోట్లు ఇందులో తెలంగాణ తపాలాశాఖ బట్వాడా చేసిన శాతం: 21 ► తెలంగాణలోని 27 గ్రామీణ జిల్లాలతో ఉన్న హైదరాబాద్ రీజియన్ పరిధిలో పంపిణీ అయిన మొత్తం: రూ.165.5 కోట్లు మధ్యస్థ రాష్ట్రాల జాబితాలో తెలంగాణ.. రాష్ట్రాల జనాభా ఆధారంగా జాతీయ స్థాయిలో రాష్ట్రాలను మూడు కేటగిరీలుగా విభజించారు. ఇందులో తెలంగాణ మధ్యస్థ కేటగిరీలో ఉంది. తెలంగాణతోపాటు కేరళ, బిహార్, ఒడిశా, పశ్చిమబెంగాల్, పంజాబ్, అస్సాంలు అందులో ఉన్నాయి. ఈ కేటగిరీలో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది. ఇక పెద్ద రాష్ట్రాల కేటగిరీలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్, మహారాష్ట్ర, తమిళనాడు తదితర రాష్ట్రాలున్నాయి. అన్ని కేటగిరీలో కలిపి పరిశీలిస్తే.. పీఎం కిసాన్యోజన/రైతుబంధు లబ్ధి పంపిణీలో తెలంగాణ టాప్–5లో నిలిచింది. -
ఎకరాలోపు 16.04లక్షల మందికి రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: యాసంగి రైతుబంధు సొమ్ము రైతుల ఖాతాల్లో జమ కావడం మొదలైంది. ఎకరాలోపు భూములున్న రైతులకు రైతుబంధు సొమ్మును రాష్ట్ర ప్రభుత్వం సోమవారం అందజేసింది. తొలిరోజు 16,03,938 మంది రైతులకు రైతుబంధు అందింది. ఎకరానికి రూ. 5 వేల చొప్పున 9,88,208 ఎకరాలకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించింది. ఎకరంలోపు భూములున్న రైతుల ఖాతాల్లో రూ. 494,10,86,470 బదిలీ అయింది. వాస్తవానికి ఎకరంలోపున్న భూములకు రూ. 559.99 కోట్లు సిద్ధం చేయగా 2.65 లక్షల మంది రైతుల బ్యాంకు వివరాలు లేకపోవడంతో రూ. 65.88 కోట్లు మిగిలాయి. రాష్ట్రంలో మొత్తం 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు రైతుబంధు అర్హత ఉన్నట్లు అధికారులు గుర్తించారు. యాసంగిలో ఎకరానికి రూ. 5 వేల చొప్పున ప్రభుత్వం రూ. 7,515 కోట్లు పంట సాయంగా అందించనుంది. చదవండి: (బ్రహ్మోత్సవాలలోపే యాదాద్రి ప్రారంభం?) తొలిరోజు ఎకరంలోపు భూములున్న వారికి ఇచ్చామని, ఇలా వరుసగా రెండెకరాలు, మూడు ఎకరాల చొప్పున రైతులందరికీ విడతలవారీగా రైతుబంధు సాయం రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి వెల్లడించారు. తొలిరోజు ఆదిలాబాద్ జిల్లాలో అత్యల్పంగా 9,239 మంది రైతులకు రైతుబంధు అందగా అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 1,05,545 మందికి రైతుబంధు అందింది. మొదటి రోజున నిధులు తక్కువ అందిన జిల్లాగా అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నిలిచింది. ఇక్కడ 12,884 మంది ఎకరంలోపున్న రైతులు ఉండగా రూ. 3.37 కోట్ల నిధులు మాత్రమే అందాయి. -
పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!
లాభాలొచ్చే చోట అమ్ముకోవచ్చు... ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతిసారీ ఇలా చేయడం సాధ్యంకాదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు పంటలను లాభమొచ్చే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. సర్కారుకు రూ.7,500 కోట్ల నష్టం తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం చేపట్టిన ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనగలు తదితర పంటల కొనుగోళ్లతో దాదాపు రూ.7,500 కోట్ల నష్టం వచ్చింది. రైతులకు మద్దతు ధర చెల్లించి కొన్నా, ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేక తక్కువ ధరకు అమ్మాల్సి రావడంతో నష్టం వాటిల్లింది. సాక్షి, హైదరాబాద్: గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వివిధ రకాల పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడంతో సర్కార్ భారీగా నష్టపోయిందని, వచ్చే ఏడాది నుంచి ఇలా కొనడం సాధ్యం కాదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. నియంత్రిత సాగు విధానం సైతం ఇకపై అవసరం లేదని నిర్ణయం తీసుకుంది. రైతుబంధు పంపిణీతో సహా వ్యవసాయానికి సంబంధించిన వివిధ అంశాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో పాల్గొన్న వారందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు సీఎంఓ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ సమావేశంలో పంటల కొనుగోళ్లు, నియంత్రిత సాగు, మార్కెట్లో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాలు–కొనుగోళ్లు, రైతుబంధు సమితుల బాధ్యతలు, రైతు వేదికల వినియోగం, సకాలంలో విత్తనాలు–ఎరువులు అందుబాటులో ఉంచడం, రైతులకు సాగులో సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించడం తదితర అంశాలపై విస్తృత చర్చ జరిగిందని వెల్లడించింది. లాభాలొచ్చే చోట అమ్ముకోవాలి... ‘ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. ప్రతీసారి ఇలా చేయడం సాధ్యంకాదు. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదు. కొనుగోళ్లు–అమ్మకాలు ప్రభుత్వ బాధ్యత కాదు. దేశంలో అమలవుతున్న కొత్త చట్టాలు కూడా రైతులు పంటలను లాభమొచ్చే చోట ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెబుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం గ్రామా ల్లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదు. వ్యవసాయ మార్కెట్లలో అమ్మకాలు, కొనుగోళ్లు సక్రమంగా, పద్ధతి ప్రకారం నిర్వహించాలి. రైతుబంధు సమితులు, మార్కెట్ కమిటీలు, వ్యవసాయ విస్తరణాధికారులు సమన్వయంతో వ్యవహరించి ఏ గ్రామానికి చెందిన రైతులు ఎప్పుడు మార్కెట్‌కు పంట తీసుకురావాలో నిర్ణయించాలి. దాని ప్రకారం రైతులకు టోకెన్లు ఇవ్వాలి. ఈ పద్ధతిని పకడ్బందీగా అమలు చేయాలి ’అని సమావేశంలో పాల్గొన్న వారంతా ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. చదవండి: (మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి) సర్కారుకు రూ.7,500 కోట్ల నష్టం... తెలంగాణ ఆవిర్భవించిన నాటి నుంచి ప్రభుత్వం చేపట్టిన ధాన్యం, మక్కలు, జొన్నలు, కందులు, శనగలు, పొద్దు తిరుగుడు, మినుములు తదితర పంటల కొనుగోళ్లతో ఇప్పటివరకు దాదాపు రూ.7,500 కోట్ల నష్టం వచ్చిందని అధికారులు నివేదించారు. రైతులకు మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసినా, ఆ పంటలకు మార్కెట్లో డిమాండ్ లేక ప్రభుత్వం తక్కువ ధరకు అమ్మాల్సి రావడంతో నష్టం వాటిల్లినట్లు చెప్పారు. ఏటా ఇదే పరిస్థితి తలెత్తుతున్నదని అభిప్రాయపడ్డారు. వ్యవసాయ శాఖపై ఇతర బాధ్యతలు.. ‘వ్యవసాయ అధికారులపై ఇతర బాధ్యతలు ఎన్నో ఉన్నాయి. రైతు బీమా ప్రారంభించిన నాడు కేవలం రూ.630 కోట్ల కిస్తీ చెల్లించాల్సి వచ్చేది. రైతులు తమ కుటుంబ సభ్యులందరికీ బీమా వర్తింపజేయాలనే ఉద్దేశంతో తమకున్న భూమిని వారి పేర రిజిస్టర్ చేయించడంతో రైతుల సంఖ్య పెరిగింది. ప్రీమియం దాదాపు రెట్టింపైంది. కిస్తీ ఏడాదికి రూ.1,144 కోట్లు కట్టాల్సి వస్తోంది. అయినా ప్రభుత్వం ఈ పథకాన్ని కొనసాగించాలనే నిర్ణయించుకుంది. సాగుకు 24 గంటల ఉచి త విద్యుత్ సరఫరా, సకాలంలో నాణ్యమైన, కల్తీలేని విత్తనాలు, ఎరువులు, పురుగు మం దులు రైతులకు అందేట్లు చూడాలి. కల్తీలను, నకిలీలను గుర్తించి అరికట్టాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయం ద్వారా మరిన్ని పరిశోధనలు జరగాలి. కొత్త వంగడాలను సృష్టిం చాలి. వ్యవసాయదారులకు ఆధునిక, సాంకేతిక విజ్ఞానాన్ని అందించాలి’అని అంతా అభిప్రాయపడ్డారు. నియంత్రిత సాగు అవసరం లేదు... ‘రాష్ట్ర వ్యాప్తంగా ఏ రైతు ఏ పంట వేయాలనే విషయంలో ఇకపై ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు ఇవ్వకపోవడమే మంచిది. నియంత్రిత సాగు విధానం అవసరం లేదు. రైతులు ఏ పంటలు వేయాలనే విషయంలో వారే నిర్ణయం తీసుకోవాలి. ఈ విధానం ఉత్తమం. రాష్ట్రవ్యాప్తంగా రైతు వేదికల నిర్మాణం జరుగుతోంది. ఈ వేదికల్లో రైతులు, అధికారులు సమావేశం కావాలి. స్థానిక, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలనేది నిర్ణయించాలి. మద్దతు ధర వచ్చేందుకు అనువైన వ్యూహం ఎక్కడికక్కడ రూపొందించుకోవాలి’అనే అభిప్రాయం ఈ భేటీలో వ్యక్తమైంది. 28 నుంచి రైతుబంధు పంపిణీ నేటి నుంచి వచ్చే నెల (జనవరి–2021) వరకు రాష్ట్రంలోని రైతులందరికీ రైతుబంధు కింద ఆర్థిక సాయం అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. 61.49 లక్షల మంది రైతులకు చెందిన 1.52 కోట్ల ఎకరాల వ్యవసాయ భూములకు, ఎకరానికి రూ.5 వేల చొప్పున 2020 రబీ సీజన్ కోసం ప్రభుత్వం రూ.7,515 కోట్లను పెట్టుబడి సాయంగా అందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలోని ఏ ఒక్క రైతూ మిగలకుండా ప్రతి ఎకరానికీ డబ్బులు నేరుగా బ్యాంక్‌లో జమ చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రులు కేటీ రామారావు, ఎస్.నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. -
శుభవార్త: రైతు బంధు ఇక ఇంటికే..!
సాక్షి, హైదరాబాద్: రైతుల బ్యాంకు ఖాతాలో నేటి నుంచి రైతు బంధు డబ్బు జమ కానుంది.. కానీ, దాన్ని తీసుకోవా లంటే బ్యాంక్ ఉన్న పట్టణానికో, ఏటీఎం ఉన్న పొరుగు ఊరికో వెళ్లాలి.. అసలే చలికాలం, ఆపై కరోనా వ్యాప్తి.. పట్టణాలకు వెళ్లాలం టే భయం. మరి డబ్బు తీసుకోవడం ఎలా?. ఇకపై ఇలాంటి ఇబ్బందులేమీ లేకుండా నేరుగా రైతు చేతికే రైతుబంధు సొమ్ము అందనుంది. ఈ మేరకు తపాలా శాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. తపాలా కార్యాలయంలో ఖాతా ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. మైక్రో ఏటీఎం సేవలు.. జనానికి మళ్లీ చేరువయ్యేందుకు తపాలా శాఖ ఎన్నో వినూత్న పద్ధతులు చేపడుతోంది. గతంలో ఉత్తరాల బట్వాడాతోనే సరిపుచ్చిన తపాలాశాఖ.. వాటికి కాలం చెల్లుతున్న నేపథ్యంలో కొత్త కార్యాచరణతో ముందుకొస్తోంది. ఈ క్రమంలోనే మైక్రో ఏటీఎం సేవలు ప్రారంభించింది. తపాలా ఉద్యోగి మన ఇంటికే వచ్చి డబ్బు అందజేసి వెళ్తాడు. మన బ్యాంకు ఖాతా నుంచి అంత మొత్తం తపాలాశాఖకు బదిలీ అవుతుంది. బ్యాంకుకో, ఏటీఎంకో వెళ్లాల్సిన పని లేకుండానే సొమ్ము చేతికందుతుంది. అనారోగ్యంతో ఉన్నవారు, కరోనా విపత్కర పరిస్థితులతో ఇబ్బంది పడుతున్న వారికి ఈ సేవలు ఉపయుక్తంగా ఉంటు న్నాయి. ఇప్పుడు తపాలాశాఖ రైతు బంధును దీనితో అనుసంధానించనుంది. రబీ సీజన్‌కు సంబంధించి 59 లక్షల మంది రైతులకు ఆదివారం రైతుబంధు సొమ్ము విడుదల కానుంది. దీంతో సోమవారం నుంచి మైక్రో ఏటీఎం సేవల ద్వారా రైతుబంధు నగదు చెల్లింపును తపాలాశాఖ ప్రారంభించనుంది. చదవండి: (అన్నదాతల ధర్మాగ్రహం) సొమ్ము అందుతుందిలా.. తపాలాశాఖకు తెలంగాణలో 4,860 పోస్టాఫీసులున్నాయి. చాలా చిన్న గ్రామాల్లో బ్రాంచీలను కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆయా బ్రాంచీ పోస్టాఫీస్‌లు సహా అన్ని కార్యాలయాలకు ప్రత్యేకంగా ఓ సెల్‌ఫోన్‌ను, బయోమెట్రిక్ డివైస్‌ను అందజేశారు. సంబంధిత రైతు ఆ తపాలా కార్యాలయానికి వెళ్లినా లేదా ముందస్తు సమాచారమిస్తే ఆ సిబ్బందే వారి ఇంటికి వెళ్లైనా సరే నగదు అందజేస్తారు. ఆ రైతు బ్యాంకు ఖాతా కచ్చితంగా ఆధార్‌తో అనుసంధానమై ఉండాలి. రైతు తన ఆధార్ నంబర్ తెలిపి బయోమెట్రిక్ డివైస్‌లో వేలిముద్ర వేయగానే అది అతని బ్యాంకు ఖాతాతో అనుసంధానం అవుతుంది. రోజుకు గరిష్టంగా రూ.10 వేల వరకు తన ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఆ వివరాలను సంబంధిత తపాలా సిబ్బంది మొబైల్ ఫోన్ ద్వారా నమోదు చేస్తాడు. అప్పుడు రైతు మొబైల్‌కు ఓటీపీ నంబర్ వస్తుంది. దాన్ని తపాలా సిబ్బందికి తెలిపితే చాలు.. అతను కావాల్సిన మొత్తాన్ని రైతు చేతికి అందిస్తాడు. ఎలాంటి చార్జీలు లేవు.. దీనికోసం సంబంధిత తపాలా కార్యాలయాల్లో అవసరమైన నగదు నిల్వలను సిద్ధం చేశారు. రాష్ట్రంలో పట్టణ ప్రాంతాల్లో మాత్రమే బ్యాంక్‌లు, ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. మారుమూల గ్రామాలకు చెందిన రైతులు రైతుబంధు సొమ్ము తీసుకోవాలంటే పట్టణాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పుడు ఈ మైక్రో ఏటీఎంల ద్వారా ఇంట్లో కూర్చునే సొమ్ము పొందవచ్చు. తపాలా కార్యాలయంలో ప్రత్యేకంగా పొదుపు ఖాతా ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ సేవలు మొదలవుతున్నాయి. ఈ సేవలు పొందినందుకు నయా పైసా ఛార్జీ కూడా లేకపోవడం విశేషం. కోవిడ్ మహమ్మారి ఆవరించిన కష్ట సమయంలో ఈ సరికొత్త మైక్రో ఏటీఎం సేవను రైతులంతా వినియోగించుకోవాలి. పట్టణాల్లో ఉండే బ్యాంక్‌ల వరకో, ఏటీఎంల వరకో కష్టపడి వెళ్లే పనిలేదు. ఊళ్లో ఉండే పోస్టాఫీస్‌కు వెళ్తే సరిపోతుంది. సంబంధిత సిబ్బందికి ఇంటిమేట్ చేస్తే వారే ఇంటికి వచ్చి నగదు అందించే ఈ సౌలభ్యాన్ని వినియోగించుకోవాలి. – పీవీఎస్ రెడ్డి, రీజియన్ పోస్టుమాస్టర్ జనరల్, తపాలాశాఖ హైదరాబాద్ -
పాడిరైతుకు రూ.40కోట్లు
సాక్షి, నారాయణఖేడ్: విజయ డెయిరీకి పూర్వ వైభవం తీసుకొస్తామని, పాడి రైతులకు బకా యిలు ఉన్న రూ.40 కోట్ల ప్రోత్సాహక నిధులు వారం రోజుల్లో విడుదల చేసి వారి ఖాతాల్లో జమ చేయనున్నట్లు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ప్రభుత్వ పంపిణీ ద్వారా పొందిన పశువులు మృతి చెందితే వాటి స్థానంలో జనవరి తొలివారంలో కొత్తవి కొని రైతులకు అందిస్తామని తెలిపారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో బుధవారం వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. జిల్లాలోని పాడి రైతులు సరఫరా చేసిన పాలకు రూ.4 ఇన్సెంటివ్‌తోపాటు గేదె పాలకు మరో రూ.2 అదనంగా అందజేస్తామన్నారు. చదవండి: (స్మార్ట్ సిటీలు.. కావాలా..వద్దా?) రాష్ట్రం లోని రైతులకు యాసంగి సాగుకు రూ.5వేల చొప్పున రూ.7,250 కోట్ల రైతుబంధు సాయంను వచ్చే సోమవారంలోగా వారి ఖాతాల్లో జమచేయనున్నట్లు తెలిపారు. రాష్ట్రం లో అమలు చేస్తున్న రైతుబంధు, కల్యాణలక్ష్మి తదితర పథకాలను చూసి కర్ణాటక, మహారాష్ట్రల్లోని తెలంగాణ సరిహద్దు గ్రామాల సర్పంచ్‌లు వచ్చి తమను తెలంగాణలో కలుపుకొమ్మని కోరుతున్నారన్నారు. ఇది ప్రభుత్వ అభివృద్ధి తీరుకు నిదర్శనమన్నారు. సమావేశంలో ఖేడ్, ఆందోల్ ఎమ్మెల్యేలు భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్ పాల్గొన్నారు. -
రైతుబంధు పథకంపై కేంద్రం ప్రశంసలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో అమలవుతున్న పథకాలపై కేంద్రప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. రైతుబంధు, రైతు సమన్వయ సమితిల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం అభినందించింది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ గురువారం వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, వ్యవసాయ శాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తెస్తున్న అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్షర్ ఫండ్ స్కీమ్ పై రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలు కోరారు. (మహిళా ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసిన బామ్మ) కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సంజయ్ అగర్వాల్ దేశంలో వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిణామాలపై ఈ సందర్భంగా మాట్లాడారు. ఆయనిచ్చిన ప్రెజెంటేషన్‌లో తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బంధు సమితిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. రైతుబంధు పథకం రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని చెప్పడంతో పాటు, తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో విజయవంతంగా అమలు చేస్తున్నారని ప్రశంసల వర్షం కురిపించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ తరపున వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. (డీప్ కోమాలోకి ప్రణబ్ ముఖర్జీ) -
చిట్ట చివరి రైతుకూ రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైతుబంధు సాయం అందని రైతులు ఏ మూలన ఎవరున్నా వెంటనే గుర్తించి, చిట్టచివరి రైతు వరకు అందరికీ ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ‘కాస్తులో ఉన్నప్పటికీ కొంతమంది రైతులకు యాజ మాన్య హక్కుల విషయంలో చిన్నచిన్న సమస్యలు ఉండటం వల్ల రైతుబంధు సాయం అందడంలో ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అలాంటి వారిని జిల్లా కలెక్టర్లు గుర్తించాలి. సమస్యలు వెంటనే పరిష్కరించాలి. యాజమాన్య హక్కు గుర్తించడానికి మోకా మైనా (స్పాట్ ఎంక్వైరీ) నిర్వహించాలి. చుట్టుపక్కల రైతులను విచారించి యాజమాన్య హక్కులు కల్పించాలి. అందరి సమస్యలు పరిష్కరించి, అందరికీ సాయం అందిం చాలి. ఈ విషయంలో రైతుబంధు సమితుల, స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. ఒకసారి పరిష్కారం అయిపోతే, ఎప్పటికీ గొడవ ఉండదు. అది అన్ని తీర్లా మంచిది’అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి శనివారం నగరానికి చేరుకున్న సీఎం కేసీఆర్ రైతుబంధు సాయం, ఇతర వ్యవసాయ అంశాలపై ప్రగతిభవన్‌లో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ‘మేడ్చల్ జిల్లా లక్ష్మాపూర్ గ్రామానికి అసలు రెవెన్యూ రికార్డే లేదు. ఆ జిల్లాకు చెందిన మంత్రి మల్లారెడ్డి చొరవ వల్ల ప్రభుత్వం మొత్తం గ్రామంలో సర్వే జరిపింది. ఏ భూమికి ఎవరు యజమానో నిర్ధారించడం జరిగింది. మిగతా చోట్ల కూడా అదే జరగాలి’అని సిఎం కోరారు. 99.9 % రైతులకు సహాయం అందింది.. ‘కరోనా కష్టకాలంలో ఆర్థిక పరిస్థితి అంత ఆశాజనకంగా లేకపోయినప్పటికీ ప్రభుత్వం రైతులకు అండగా నిలవాలనే సదుద్దేశంతో రైతుబంధు సాయం విడుదల చేసింది. అధికారులు ఎంతో సమన్వయంతో వ్యవహరించి రైతులందరికీ సకాలంలో రైతుబంధు సాయం అందించారు. ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం 99.9 శాతం మంది రైతులకు రైతుబంధు సాయం అందింది. చివరి రైతుకు సాయం అందే వరకు విశ్రమించవద్దు. మంత్రులు తమ జిల్లాలో, ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో రైతులందరికీ సాయం అందిందా? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలను వెంటనే తెలుసుకుని, అందరికీ డబ్బులు అందించే ఏర్పాట్లు చేయాలి. దీనికి ఎంత వ్యయం అయినా ప్రభుత్వం వెనుకాడదు. రైతుబంధు సాయం అందించడానికి టైమ్ లిమిట్ లేదు. వందకు వంద శాతం రైతులందరికీ సాయం అందడమే ప్రభుత్వ లక్ష్యం. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా తనకు రైతుబంధు సాయం అందలేదని అనవద్దు’అని సీఎం స్పష్టం చేశారు. ‘రైతుబంధు సాయం ఎంత మందికి అందింది? ఇంకా ఎవరైనా మిగిలిపోయారా? అనే విషయాలపై వెంటనే నివేదిక సమర్పించాలి. క్లస్టర్ల వారీగా నివేదికలు తెప్పించాలి. రైతుబంధు సమితుల ద్వారా కూడా వివరాలు తెప్పించాలి. ఇంకా ఎవరైనా మిగిలిపోతే వారికి వెంటనే సాయం అందించాలి. భూముల క్రయవిక్రయాలు జరిగితే ఆ వివరాలను కూడా వెంటనే నమోదు చేయాలి’అని సీఎం ఆదేశించారు. రైతులందరికీ శుభాకాంక్షాలు.. ‘రాష్ట్రంలోని రైతులంతా ప్రభుత్వం సూచించిన మేరకే వానాకాలం పంటల సాగు చేస్తున్నారు. మక్కల సాగు వద్దంటే ఎవరూ వేయలేదు. నియంత్రిత సాగు పద్ధతి వందకు వంద శాతం విజయవంతం కావడం గొప్ప పరిణామం. తెలంగాణ రైతులందరికీ శుభాకాంక్షలు. రైతు సంక్షేమం– వ్యవసాయాభివద్ధి కోసం మరింతగా పనిచేయడానికి ఇది ప్రేరణగా నిలుస్తున్నది’అని కేసీఆర్ అన్నారు. ‘దసరాలోగా రైతు వేదికల నిర్మాణం పూర్తయ్యేలా కలెక్టర్లు చొరవ చూపించాలి. ఒకసారి రైతువేదికల నిర్మాణం పూర్తయితే, అవే రైతులకు రక్షణ వేదికలు అవుతాయి’అని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారు. విత్తనాలకు కోల్డ్ స్టోరేజీ ‘‘తెలంగాణ గొప్ప వ్యవసాయిక రాష్ట్రంగా రూపాంతరం చెందుతున్నది. పెద్ద ఎత్తున విత్తన ఉత్పత్తి కార్యక్రమాలు జరుగుతున్నాయి. రైతులకు అవసరమైన మేలు రకమైన, నాణ్యమైన విత్తనాల తయారీని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లు చేపట్టాయి. అలా తయారు చేసిన విత్తనాలను నిల్వ ఉంచడానికి రూ.25 కోట్ల వ్యయంతో అతి భారీ అల్ట్రా మోడర్న్ కోల్డ్ స్టోరేజిని నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి కావాల్సిన నిధులు కూడా వెంటనే విడుదల అవుతాయి. ఏడాదిలోగా నిర్మాణం పూర్తిచేసి అందుబాటులోకి తేవాలి’’అని సిఎం చెప్పారు. మంత్రులు ఎస్. నిరంజన్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్ రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ముఖ్య కార్యదర్శులు బి.జనార్థన్ రెడ్డి, రామకష్ణ రావు, నర్సింగ్ రావు, సీడ్ కార్పొరేషన్ ఎండి కేశవులు, వ్యవసాయ శాఖ ఉప సంచాలకులు విజయ్ కుమార్, డిడిఎ శైలజ, సిఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్ తదితరులు పాల్గొన్నారు. -
కొత్త విధానానికి సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు
-
నియంత్రిత సాగే రైతు‘బంధు’ : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేసి, రాష్ట్రంలోని రైతులంతా వందకు వంద శాతం రైతుబంధు సాయం, పండించిన పంటకు మంచి ధర పొందాలన్నదే తన అభిమతమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. ‘రైతులంతా ఒకే పంట వేస్తే డిమాండ్ పడిపోయి నష్టపోతున్నారు. ఈ పరిస్థితిని నివారించడానికే ప్రభుత్వం నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేయాలని సూచిస్తోంది. ఏ సీజన్లో ఏ పంట వేయాలి? ఎక్కడ ఏ పంట సాగు చేయాలి? ఏ రకం సాగు చేయాలి? అనే విషయాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు నిర్ణయించారు. ఏ పంటకు మార్కెట్లో డిమాండ్ ఉందో ఆగ్రో బిజినెస్ విభాగం వారు నిర్ధారించారు. దాని ప్రకారం ప్రభుత్వం రైతులకు తగు సూచనలు చేస్తుంది. ప్రభుత్వం చెప్పినట్టు పంటలు వేయడం వల్ల రైతులు నష్టపోయే అవకాశం ఉండదు’అని సీఎం పేర్కొన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానంపై ఆయన గురువారం ప్రగతి భవన్లో మంత్రులు, కలెక్టర్లు, జిల్లా వ్యవసాయాధికారులు, రైతుబంధు సమితుల అధ్యక్షులు, వ్యవసాయ యూనివర్సిటీ అధికారులు, శాస్త్రవేత్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేయాలన్న నిర్ణయాన్ని రాష్ట్రంలో అత్యధిక మంది రైతులు స్వాగతిస్తున్నట్లు సర్వేలో తేలిందని, ఇది మంచి పరిణామమని పేర్కొన్నారు. 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు ‘రాష్ట్రంలో గతేడాది తరహాలోనే వర్షాకాలంలో40 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాలి. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈసారి70 లక్షల ఎకరాల్లో సాగు చేయాలి. గతేడాది దాదాపు 7 లక్షల ఎకరాల్లోకంది పంట వేశారు. ఈ సారి 15 లక్షల ఎకరాల్లో కంది సాగు చేయాలి. సోయాబీన్, పసుపు, మిర్చి, కూరగాయలు తదితర పంటలు గతేడాది మాదిరిగానే వేసుకోవచ్చు. వివిధ రకాల విత్తనోత్పత్తి చేసే రైతులు యథావిధిగా చేసుకోవచ్చు. పచ్చిరొట్టను విరివిగా సాగు చేసుకోవచ్చు. వర్షకాలంలో మక్కల సాగు లాభసాటి కాదు కాబట్టి, అది వద్దు. యాసంగిలో మక్కలు వేసుకోవచ్చు. వర్షాకాలంలో మక్కలు వేసే అలవాటు ఉన్న వారు పత్తి, కంది తదితర పంటలు వేసుకోవాలి. వరి విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. డిమాండ్ ఉన్న తెలంగాణ సోనా రకం వేసుకోవాలి. 6.5 ఎంఎం సైజు కలిగిన బియ్యం రకాలకు అంతర్జాతీయ మార్కెట్ ఉంది. దానిని కూడా పండించాలి’అని ముఖ్యమంత్రి సూచించారు. సీఎం సమీక్షలో పాల్గొన్న రైతు బంధు సమితుల అధ్యక్షులు, కలెక్టర్లు, వ్యవసాయ శాఖ అధికారులు 2,602రైతు వేదికలు.. రాష్ట్రంలోని 2,602 క్లస్టర్లలో నాలుగైదు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. తన వ్యవసాయ క్లస్టర్ అయిన ఎర్రవెల్లిలో సొంత ఖర్చుతో రైతువేదిక నిర్మిస్తానని సీఎం ప్రకటించగా.. రాష్ట్రంలోని మంత్రులందరితో పాటు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, శేరి సుభాష్‌రెడ్డి, మారెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు కూడా సొంత ఖర్చుతో రైతు వేదికలను నిర్మించడానికి ముందుకొచ్చారు. గురువారం ప్రగతి భవన్లో నియంత్రిత సాగుపై జరిగిన సమీక్షలో పాల్గొన్న మంత్రులు మల్లారెడ్డి, జగదీశ్‌రెడ్డి, తలసాని, కేటీఆర్, ఇంద్రకరణ్‌రెడ్డి సమావేశంలో సీఎం సూచనలివీ... ►ఈ వర్షాకాలం నుంచే రాష్ట్రంలో ఏ గుంటలో ఏ పంట వేస్తున్నారనే లెక్కలు తీయాలి. ►నియంత్రిత పద్ధతిలో పంట సాగు విధానంపై అవగాహన కల్పించేందుకు వచ్చే నాలుగైదు రోజుల్లోనే క్లస్టర్ల వారీగా రైతు సదస్సులు నిర్వహించాలి. మంత్రులు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్లు, డీసీఎంఎస్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, మార్కెట్ కమిటీ చైర్పర్సన్లు, సింగిల్ విండో చైర్పర్సన్లు, ఎంపీటీసీలు, సర్పంచులను ఈ సదస్సులకు ఆహ్వానించాలి. ►ఏ ప్రాంతంలో ఎంత విస్తీర్ణంలో ఏ పంట సాగు చేయాలనే విషయం ముందే నిర్ధారిస్తారు. ఆ పంటలకు సరిపడా విత్తనాలను ముందే గ్రామాలకు చేర్చాలి. విత్తనాభివృద్ధి సంస్థ ఈ విషయంలో క్రియాశీలంగా వ్యవహరించాలి. ►మంచి వంగడాలు తయారు చేయడానికి, మార్కెట్ పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వ్యవసాయ శాఖలో వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ, రీసెర్చ్ అండ్ అనాలసిస్ కమిటీలను త్వరలో నియమిస్తాం. ►రైతులు పండించిన పంటలకు మంచి ధర రావడం కోసమే రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ప్రభుత్వం సెజ్‌లను ఏర్పాటు చేస్తోంది. రైసు మిల్లులు, దాల్ మిల్లులు, ఆయిల్ మిల్లులు, ఇతర ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తాయి. ఈ సెజ్‌ల పక్కనే గోదాముల నిర్మాణం చేపట్టాలి. సెజ్‌లు, గోదాములున్న ప్రాంతంలో ఇళ్ల లేఔట్‌కు అనుమతి ఇవ్వొద్దు. ►కల్తీ విత్తన వ్యాపారుల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలి. అలాంటివారిని గుర్తించి పీడీ యాక్టు కింద అరెస్టు చేసి, జైలులో వేయాలి. ప్రజా ప్రతినిధులెవ్వరూ కల్తీ విత్తన వ్యాపారులను కాపాడే ప్రయత్నం చేయొద్దు. ►ఈ నెల 25లోగా ఖాళీగా ఉన్న వ్యవసాయ విస్తరణాధికారుల నియమాకం పూర్తిచేయాలి. ►గోదావరి ప్రాజెక్టుల కింద సత్వరం నీరు వచ్చే ప్రాంతంలో దీర్ఘకాలిక వరి రకాలు సాగు చేయాలి. కృష్ణా ప్రాజెక్టు పరిధిలో ఆలస్యంగా నీరు వచ్చే ప్రాంతాల్లో స్వల్పకాలిక వరి రకాలు వేసుకోవాలి. ►పత్తికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తెలంగాణలోనే కోటి బెయిళ్ల సామర్థ్యం కలిగిన 320 జిన్నింగు మిల్లులున్నాయి. 70 లక్షల ఎకరాల్లో సాగు చేసినా మద్దతు ధరకు ఢోకా ఉండదు. పత్తి ఎక్కువ పండి, జిన్నింగ్ మిల్లులు లేని ప్రాంతాలు గుర్తించి, అక్కడ కొత్త మిల్లులు వచ్చేలా పరిశ్రమల శాఖ చొరవ చూపాలి. ►రాష్ట్రంలో పచ్చి రొట్ట ఎరువు సాగును ప్రోత్సహించాలి. ►జిల్లాలవారీగా అగ్రికల్చర్ కార్డును రూపొందించాలి. దాని ప్రకారమే పంటలను సాగు చేయాలి. ►జిల్లా, మండల, గ్రామాల వారీగా హార్వెస్టర్లు, ట్రాక్టర్లు, కల్టివేటర్లు, పాడి ప్లాంటేషన్ మిషన్స్ తదితర వ్యవసాయ యంత్రాలు ఎన్ని ఉన్నాయో లెక్క తీయాలి. ►అన్ని జిల్లాల్లో భూసార పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ►జిల్లా, డివిజన్, మండల, క్లస్టర్ స్థాయి వ్యవసాయ అధికారులకు ప్రతీ నెలా వాహన అలవెన్సు/ప్రయాణ భత్యం ఇవ్వాలి. ► మార్కెట్లలో వెంటనే పసుపు యార్డులు తెరిచి, క్రయ విక్రయాలు కొనసాగించాలి. -
నిబంధనలు పాటించినవారికే ఇకపై రైతుబంధు
-
కేసీఆర్‌కు ఫ్యాషన్‌గా మారింది: వివేక్
సాక్షి, పెద్దపల్లి : అబద్దాలు చెప్పడం, ఇచ్చిన హామీలను విస్మరించడం సీఎం కేసీఆర్‌కు ఫ్యాషన్‌గా మారిందని మాజీ ఎంపీ గడ్డం వివేక్ విమర్శించారు. కమీషన్ల కోసం ప్రాజెక్టుల దందాను కొనసాగిస్తున్నారని ఆరోపించారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రాజెక్టుల రీ డిజైన్ చేస్తూ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేస్తున్నారని మండిపడ్డారు. పోతిరెడ్డిపాడు వ్యవహారంలో ప్రతిపక్షాలను కేసీఆర్ నిందించడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న 12 కిలోల బియ్యంలో 10 కిలోలు కేంద్ర ప్రభుత్వమే పంపిణీ చేస్తోందని తెలిపారు. రైతుల ధాన్యం కొనుగోలు కూడా కేంద్రమే బరిస్తోందని గుర్తుచేశారు. రైతు బంధును నిలిపివేసే కుట్రలో భాగంగానే పంటలపై సీఎం కేసీఆర్ ఆంక్షలను విధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతల పట్ల వారి సమస్యల పట్ల నిజంగా చిత్తశుద్ది ఉంటే రూ. లక్ష వరకు రుణమాఫీని ఒకే దఫాలో అమలు పరచాలని డిమాండ్ చేశారు. చదవండి: కరోనా: ఇంటి అవసరం.. ఇంకా పెరిగింది! కరోనాకు ప్రైవేట్ వైద్యం -
చైనా, అమెరికాలను అధిగమించాలి
సాక్షి, హైదరాబాద్: చైనా, అమెరికా దేశాల ఉత్పాదకతలను మనం అధిగమించాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పిలుపునిచ్చారు. మన దగ్గర మానవ వన రులు, సాగుభూమి పుష్కలంగా ఉన్నా వారిని అందుకోలే కపోతున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బుధవారం సమగ్ర వ్యవసాయ విధానంపై జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు, జిల్లా వ్యవసాయ అధికారులు, వ్యవసాయ ఉన్నతాధికారులు, శాస్త్రవేతలతో జరిగిన సమావేశంలోనూ, ఆ తర్వాత జరిగిన విలేకరుల సమావేశంలోనూ మంత్రి నిరంజన్‌రెడ్డి మాట్లాడారు. అమెరికాలో వ్యవసాయం చేసేవారు 30 శాతం నుండి 3 శాతానికి పడిపోయినా వారు అగ్రస్థానంలోనే ఉన్నారన్నారు. మన దేశంలో 60 శాతం జనాభా వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాల మీదే ఆధారపడిందన్నారు. ఈ నేపథ్యంలోనే చారిత్రక మార్పునకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు. మన ఆహార అవసరాలకు సరిపడిన పంటలు పండిస్తున్నామని, కానీ ప్రపంచానికి అవసరమైన, ఆదాయాన్నిచ్చే పంటలను పండించాల్సి ఉందన్నారు. అంబలి కేంద్రాలతో ఆకలి తీర్చుకున్న తెలంగాణ ఆరేళ్లలో అన్నపూర్ణగా మారిందన్నారు. 42 శాతం జీడీపీ వ్యవసాయరంగం నుండే వస్తోందన్నారు. అర్థికవేత్తలు 14.5 శాతం అంటారు కానీ వ్యవసాయ అనుబంధ రంగాలు కలిపితే 42 శాతమన్నారు. వ్యవసాయరంగంపై పెట్టే పెట్టుబడులను ఆర్థిక నిపుణులు ఎందుకు చిన్నచూపు చూస్తున్నారో అర్థంకావడం లేదన్నారు. 52 శాతం రైతులు అప్పుల్లో ఉంటారన్నది నిపుణుల నివేదిక సారాంశమని, వారిని ఆ అప్పుల ఊబి నుండి బయటపడెయ్యాలనే వ్యవసాయరంగంలో విప్లవాత్మక పథకాలు ప్రవేశపెట్టామన్నారు. రైతులు మార్చి చివరి నాటికి యాసంగి వరి కోతలు పూర్తయ్యేలా సాగు చేస్తే అకాల వర్షాల మూలంగా నష్టపోయే పరిస్థితి తప్పుతుందన్నారు. తెలంగాణ ఆహార సెజ్‌లు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు భారీ ఎత్తున వస్తాయన్నారు. దీనికి సంబంధించిన విధాన నిర్ణయం ముఖ్యమంత్రి త్వరలో ప్రకటిస్తారని తెలిపారు. మరో విప్లవం దిశగా ముందుకు వెళ్లాలి... ఈ దేశం ఏర్పడినప్పటి నుండి వ్యవసాయ రంగంలో హరిత, శ్వేత, నీలి, పసుపు తదితర రకాల విప్లవాలు వచ్చాయని నిరంజన్‌రెడ్డి అన్నారు. మనం మరో వి ప్లవం దిశగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిం దన్నారు. అదే నియంత్రిత సమగ్ర వ్యవసాయం అని అన్నారు. 40 రోజులుగా అధికారులు, నిపుణులు, శాస్త్రవేత్తలతో సుదీర్ఘ చర్చలు జరిపామన్నారు. ప్రపం చవ్యాప్తంగా మొక్కజొన్న అధిక ఉత్పత్తితో నిల్వలు పేరుకు పోయాయని అన్నారు. అందుకే ఈసారి ప్రత్యామ్నాయంగా కంది వేయాలని చెబుతున్నామన్నారు. వ్యవసాయ సంస్కరణలను రైతులు ఆహ్వానిస్తున్నారన్నారు. నిర్మాణాత్మకమైన సూచనలను విపక్షాలు ఎప్పుడైనా తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చాయా అని మంత్రి ప్రశ్నించారు. రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, ప్రాజెక్టులు ఇవన్నీ వారిని సంప్రదించే చేశామా అని ప్రశ్నించారు. ఆహార భద్రతతో పాటు పోషక భద్రత కల్పించాలన్నది తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆత్మహత్యలను రాజకీయంగా వాడుకోవడం తప్పితే రైతాంగంలో ఆత్మస్థైర్యం నింపే కార్యాచరణ కాంగ్రెస్ ఎప్పుడూ చేయలేదన్నారు. వ్యవసాయంలో కూలీల కొరత తీర్చడానికే తెలంగాణ ప్రభుత్వం ఉపాధి హామీని అనుసంధానం చేయాలని కోరు తున్నదన్నారు. ఈ సమావేశంలో రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, వీసీ ప్రవీణ్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
నిర్భరమో.. దుర్భరమో!
ఎంత కర్ణపేయమైన మాట అది. ఈ కరోనా రుతువులో మన ప్రధానమంత్రి ప్రజలను ఉద్దేశించి ఐదోసారి చేసిన ప్రసంగంలో ఒక వీనుల విందైన మాట దొర్లింది. ఆత్మ నిర్భర భారత్! ఆ లక్ష్యసాధన కోసం కంకణం కట్టుకుందామని ఉత్తేజపూరితమైన పిలుపునిచ్చారు ప్రధాని. గతంలో మన ప్రధానులు, జాతీయ నాయకులు ఇదే మాటను ఇంగ్లిష్‌లో సెల్ఫ్ రిలయన్స్ అనే వారు. మనం తెలుగులో స్వావలంబన అని రాసుకునేవాళ్లం. చదువుకునేవాళ్లం. స్వతంత్రం వచ్చిన డెబ్బయ్ మూడేళ్లలో కనీసం నూటా డెబ్బయ్మూడు సార్లు మన దేశాధినేతలు మనచేత స్వావలంబన కంకణాన్ని కట్టింపజేసి ఉంటారు. కానీ, చిత్రమేమిటంటే ఇప్పటికీ చాలామందికి ఆ మాటకు అర్థం తెలియదు. అయినా చెవులు తుప్పుపట్టేంత డెసిబుల్స్ మోతను ఆ శబ్దం మోసుకొచ్చింది. తొలి భారత ప్రధానమంత్రి పండిత జవహర్లాల్ నెహ్రూ 1951లో పంచవర్ష ప్రణాళికల బిల్లును పార్లమెంటులో ప్రవేశపెడుతూ, వీటి లక్ష్యం ‘సెల్ఫ్ రిలయన్స్’ అంటూ తొలి బాణాన్ని సంధించారు. అప్పటి నుంచి ప్రతి పంచ వర్ష ప్రణాళికలోనూ ప్రధాన లక్ష్యంగా ఈ మాట చోటు చేసు కుంటూనే ఉన్నది. ప్రతియేటా భారత రాష్ట్రపతి పార్లమెంట్ సమావేశాలను ప్రారంభిస్తూ ఈ లక్ష్యాన్ని నొక్కి వక్కాణిస్తూనే ఉన్నారు. ప్రతి వార్షిక బడ్జెట్ ప్రసంగంలోనూ అప్పటి ఆర్థిక మంత్రి ఈ గణపతి పూజను నిష్టగా నిర్వహిస్తూనే ఉన్నారు. ప్రతి పంద్రాగస్టునాడు భారత ప్రధాని గాత్రంలోంచి వెలువడే ఈ మాటకు ఎర్రకోట కోరస్ పాడుతూనే వస్తున్నది. ఇన్నేళ్లుగా తపస్సు చేస్తూ వస్తున్నా సాక్షాత్కరించని స్వావలంబన శబ్దంపై ఒకరకమైన నిర్లిప్తత జనంలో ఏర్పడిపోయింది. అందువల్లనే భారత ప్రధాని మొన్నటి ప్రసంగంలో ఈ మాటను హిందీలో రీడిజైన్ చేసి వాడటంతో గొప్ప రిలీఫ్ లభించింది. నిజం చెప్పా లంటే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ చేసిన ‘ఉద్దీపన’ కంటే ‘ఆత్మనిర్భర్’ అనే పంచాక్షరీ వల్ల కలిగిన ఉద్దీపనే గొప్ప. నిజంగానే ఈ పంచాక్షరీ మంత్రం ఫలితమిచ్చి, కరోనా నంతర ప్రపంచ పరిణామాల్లో భారత్ స్వావలంబనను సాధిం చగలిగితే, చరిత్రలో ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్, డెంగ్ షియావో పింగ్ల సరసన నరేంద్ర మోదీ పేరు చేరిపోతుంది. 1929–30ల నాటి మహా మాంద్యం (గ్రేట్ డిప్రెషన్) ప్రపంచాన్ని అతలాకుతలం చేసింది. అమెరికాను మరింతగా. ఈ సంక్షోభం అనంతరం అమెరికా అధ్యక్షుడైన ఫ్రాంక్లిన్ రూజ్వెల్ట్ ‘న్యూడీల్’ పాలసీతో ఆర్థిక స్థితిని చక్కదిద్దడం ప్రారంభించి రెండో ప్రపంచయుద్ధం ముగిసేవరకూ మూడు పర్యాయాలు పదవిలో కొనసాగారు. ఆ తర్వాత అమెరికా వెనుతిరిగి చూడలేదు. సైనికపరంగా కొంత కాలంపాటు సోవియట్ రష్యాతో పోటీపడవలసి వచ్చినప్పటికీ, ఆర్థికంగా మాత్రం అజేయశక్తిగానే కొనసాగుతున్నది. 1950వ దశకంలో అప్పటికి వ్యవసాయిక దేశంగా ఉన్న చైనాను ఉన్న పళంగా కమ్యూనిస్టు వ్యవస్థగా తీర్చిదిద్దడంకోసం చైర్మన్ మావో జెడాంగ్ ప్రారంభించిన ‘గొప్ప ముందడుగు’ (గ్రేట్ లీప్ ఫార్వర్డ్) అనే ఆర్థిక ఉద్యమం విధ్వంసకరంగా తయారైంది. లక్ష లాదిమంది గ్రామీణ ప్రజలు ఆకలి చావులకు బలయ్యారు. మావో ప్రారంభించిన సాంస్కృతిక విప్లవం కూడా వికటించి చైనా పెను సంక్షోభంలో కూరుకొనిపోయింది. ఈ దశలో చైనా విప్లవ అగ్ర నాయకత్రయంగా ప్రసిద్ధిచెందిన చైర్మన్ మావో, ఝౌ ఎన్లై, జనరల్ ఝూడే ఏడాదికాల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరు కన్నుమూశారు. అప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీ పగ్గాలు చేతబట్టిన డెంగ్ షియావో పింగ్ ప్రాప్తకాలజ్ఞతతో వ్యవహరించి దేశంలో సోషలిస్టు మార్కెట్ ఎకానమీని ప్రారం భించి తొలిసారిగా అంతర్జాతీయ సమాజానికి చైనా తలుపులు తెరిచారు. అక్కడి నుంచి బయల్దేరిన చైనా ఆర్థిక ప్రగతి పయనం రెండో బలమైన ఆర్థిక వ్యవస్థ దశకు చేరుకున్నది. నేడు ప్రపం చంలో రెండు బలమైన ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న ఈ రెండు దేశాలూ పెను సంక్షోభాల్లోంచి ఫీనిక్స్ పక్షుల్లాగా పైకెగసిన పాఠం మనముందున్నది. ఇప్పుడు భారత్ ఎదుర్కొంటున్నది కూడా పెను సంక్షోభ దశే. ఈ దశ దాటిన తర్వాత దేశ భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతున్నదనేదే మిలియన్ డాలర్ ప్రశ్న. పారిశ్రామిక విప్లవం ఫలితంగానే యూరప్ దేశాలు ప్రపంచం మీద పెత్తనం చేశాయనీ, వలస దేశాలను పీల్చి పిప్పి చేసిన కారణంగానే అవి అభివృద్ధి చెందాయనే విషయాలు మనకు తెలుసు. తొలి పారిశ్రామిక విప్లవం యూరప్ కంటే కనీసం వెయ్యేళ్లు ముందుగానే భారత్‌లో వచ్చి ఉండాల్సిందని చాలామంది చరిత్రకారులు ఇప్పటికీ అభిప్రాయపడుతుంటారు. ఎందుకంటే, వేదకాలం నుంచే ఈ దేశంలో శాస్త్ర, సాంకేతిక, ఇంజనీరింగ్ రంగాలకు సంబంధించిన అద్భుత పరిజ్ఞానం ఉంది. 14వ శతాబ్దంలో విజయనగర సామ్రాజ్య ఆస్థానంలో కొలువుదీరిన సాయన సంస్కృతంలో మహాపండితుడు రుగ్వే దానికి భాష్యం రాశాడు. ఒక రుగ్వేద శ్లోకానికి అర్థం చెబుతూ కాంతివేగాన్ని సెకనుకు 3,25,940 కిలోమీటర్లుగా నిర్ధారించా రని పేర్కొన్నారు. ఆధునిక శాస్త్ర విజ్ఞానం ఆ వేగాన్ని 3 లక్షల కిలోమీటర్లుగా తేల్చింది. దాదాపు కచ్చితత్వంతో రెండువేల సంవత్సరాలు ముందుగానే భారతీయ విజ్ఞానం లెక్కతేల్చింది. ప్రస్తుత కొలమానాల ప్రకారం చూస్తే ఒక మీటర్ పరిమాణాన్ని వందకోట్ల భాగాలుగా విభజిస్తే చివరికి మిగిలే పరిమాణమే పరమాణువు అని అగ్నిపురాణం పేర్కొన్నదనీ, ఆ లెక్కను ఆధు నిక విజ్ఞానం అంగీకరించిందనీ చెబుతారు. సున్నాను ప్రవే శపెట్టి గణిత శాస్త్రాన్ని మలుపుతిప్పిన ఆర్యభట్ట అంతరిక్ష శాస్త్రానికి కూడా పితామహుడు. ఘనమైన వైజ్ఞానిక నేపథ్య మున్న దేశంలో ముందుగా పారిశ్రామిక విప్లవం ఎందుకు పురివిప్పలేదన్న అంశంపై భిన్నమైన వాదనలున్నాయి. బౌద్ధ మతం ప్రబలంగా ప్రచారంలో ఉన్నంతకాలం కులాలకు అతీ తంగా విజ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టే ప్రయత్నం చేశారు. ప్రబుద్ధ కాత్యాయనుడు ఆటమిక్ థియరీని, ఆచార్య నాగా ర్జునుడు రసాయన శాస్త్రాన్ని బోధించేవారని చెబుతారు. మనం స్వర్ణయుగంగా కొనియాడుతున్న గుప్తుల కాలం వచ్చేనాటికి బౌద్ధవ్యాప్తి క్షీణించడం మొదలైంది. వైదికం రాజ్యమతమైంది. వేదవిజ్ఞానం పూజాక్రతువుగా మారిపోయింది. సంస్కృతం కులీన వర్గానికే పరిమితమైంది. శ్రామికవర్గాలు, ఉత్పత్తి కులాల వారు పొరపాటున వేదం వింటే చెవుల్లో సీసం పోసే మనుధర్మ శాస్త్రం నాలుగు పాదాల మీద నడవడం ప్రారంభమైంది. విద్యకు, విజ్ఞానానికి ఉత్పత్తి కులాలను దూరం చేసిన ఫలితంగా ఉత్పత్తి రంగంలో నూతన ఆవిష్కరణలు సాధ్యంకాలేదు. రవి అస్తమించని భారతీయ సామ్రాజ్యం ఏర్పడే అవకాశాన్ని చెరిపి వేసి బానిస దేశంగా బతికే దౌర్భాగ్యాన్ని ఈ సామాజిక వివక్ష ప్రసాదించింది. నాడు సంస్కృతాన్ని, విద్యనూ పేదవర్గాలకు నిరాకరించినట్లే ఈనాడు ఇంగ్లిష్ విద్యను కూడా శ్రామిక కులా లకు నిరాకరిస్తే ఇకముందు కూడా ఈ దేశ భవిష్యత్తు దౌర్భా గ్యమస్తుగానే మిగులుతుంది. దేశంలో ఈనాటికీ సగం జనాభా వ్యవసాయరంగంపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి వుంది. అందువల్ల ఈ రంగంలో ఉత్పాదకతను పెంచడానికి చర్యలు తీసుకుని, లాభ సాటి రంగంగా మార్చడం ద్వారానే భారత ఆత్మ నిర్భరత గమ్యంలో తొలి అడుగు వేయడం సాధ్యమవుతుంది. అగ్రికల్చర్ సెన్సస్ 2015–16 ప్రకారం దేశంలోని మొత్తం రైతు జనాభాలో 86 శాతం మంది ఐదెకరాల లోపు చిన్న రైతులే. సగటు కమతం విస్తీర్ణం రెండున్నర ఎకరాలు. ఇందులో కూడా అత్యధిక సంఖ్యా కులు ఒకటిన్నర ఎకరం వారే. ఈ ఒకటిన్నర ఎకరం రైతు కుటుంబం స్వయం సమృద్ధమైతేనే వ్యవసాయ రంగం లాభ సాటిగా మారినట్టు. అర ఎకరం విస్తీర్ణంలో రైతు కుటుంబానికి కావలసిన తిండి గింజలు, కూరగాయలను ఉత్పత్తి చేసుకొని మిగిలిన ఎకరం ద్వారా రెండు లేదా మూడు పంటలు తీసి, కోళ్ల పెంపకం, పాడి వగైరా సమీకృత విధానాల ఆచరణతో, ఖర్చులు పోను సాలీనా లక్ష రూపాయల లాభం తీస్తేనే రైతు ఆత్మగౌరవంతో జీవిస్తాడు. వ్యవసాయ రంగంలో ఆత్మనిర్భర తకు ఇదే గీటురాయి. ఈ దిశలో ఇప్పటికే అడుగులేసిన తెలుగు రాష్ట్రాల కార్యక్రమాలను కేంద్రం అధ్యయనం చేయాలి. రైతు భరోసా, రైతు బంధు పేర్లతో రెండు రాష్ట్రాలూ రైతుకు పెట్టుబడి ఖర్చులను ముందుగానే అందజేస్తున్నాయి. కేంద్రం కూడా ఆలస్యంగా రంగంలోకి దిగినా నామమాత్రంగా రెండు వేల రూపాయల చొప్పున మాత్రమే ఇస్తున్నది. ఐదెకరాల లోపు చిన్న, సన్నకారు రైతులందరికీ కనీసం పదివేలు చొప్పున పెట్టు బడి ఖర్చుల కింద కేంద్రం కూడా అందజేస్తే వ్యవసాయ రంగంలో ఉత్సాహపూరిత వాతావరణం ఏర్పడుతుంది. తెలం గాణ ప్రభుత్వం రాష్ట్రంలో పంటలు పండించే తీరుతెన్నులు, స్థానిక ప్రజల ఆహారపు అలవాట్లపై ఒక సర్వే నిర్వహించింది. ఆ సర్వే ఫలితాల ఆధారంగా రాష్ట్రంలో వినియోగమయ్యే ఆహార ఉత్పత్తులను సాధ్యమైనంత మేరకు రాష్ట్రంలోనే పండించే విధంగా ఒక ప్రణాళికను రూపొందించింది. ఏయే ప్రాంతంలో రైతులు ఏయే పంటలు వేస్తే లాభసాటిగా ఉంటుందో నిపుణుల చేత అంచనాలు వేయించి రైతులకు సూచించబోతున్నారు. ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం నాడు రైతుబంధు సమితి సభ్యులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించబోతున్నారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో ఉన్న రైతుబంధు సమితుల పర్యవేక్షణలో ఈసారి రైతులు క్రమబద్ధీకరించిన విధంగా పంటలు వేయబోతున్నారు. ఈనెల 30వ తేదీనాడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకే) ప్రారంభం కాబోతు న్నాయి. ప్రతి గ్రామంలో ఈ ఆర్బీకేలు రైతులకు అందుబా టులో ఉంటాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, వ్యవసాయ పరికరాలు మొదలైనవన్నీ గ్రామంలోనే ఆర్బీకేల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా నియోజకవర్గ కేంద్రంలో ఉన్న అగ్రీ ల్యాబ్స్ పరీక్షించి ధృవీకరించిన విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులనే ఆర్బీకేలలో విక్రయిస్తారు. వాటిని రైతు ఇంటికే చేరుస్తారు. ఈ కేంద్రంలో ఉండే గ్రామ వ్యవసాయ సహాయాధికారి రైతులకు అవసరమైన సలహాలు ఇవ్వడానికి అందుబాటులో ఉంటారు. గ్రామ వలంటీర్లు, గ్రామ సచివాలయాల ఏర్పాటుతో ఇప్పటికే పునరుజ్జీవం పొందిన పల్లెసీమలు ఆర్బీకేల ఏర్పాటుతో మరింత కళకళలాడబోతున్నాయి. 3 వేల సంవత్సరాల నాగరిక చరిత్ర అనంతరం చేనులో కలుపు తీసే యంత్రాన్ని కూడా దక్షిణ కొరియా నుంచి దిగుమతి చేసుకునే దుస్థితిలో ఉన్న భారత వ్యవసాయ రంగాన్ని ఆత్మనిర్భరత దిశగా మళ్లించాలంటే తెలుగు రాష్ట్రాలు చూపుతున్నటువంటి చొరవనే కేంద్రం కూడా చూపవలసి ఉంటుంది. అంతే తప్ప బ్యాంకుల ద్వారా అప్పు లిప్పించి, పీఎఫ్‌లో దాచుకున్న సొమ్మును అడ్వాన్స్‌గా ఇప్పించి పండుగ చేసుకోమనే ప్యాకేజీల ద్వారా వచ్చేది ఆత్మ నిర్భరత కాదు. ఆత్మ దుర్బలతో, ఆర్థిక బర్బరతో అనాల్సి ఉంటుంది. -వర్ధెల్లి మురళి muralivardelli@yahoo.co.in -
‘అప్పుడు కరెంట్ బందు.. ఇప్పుడు రైతు బంధు’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ విమర్శలను ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావు తిప్పికొట్టారు. కాంగ్రెస్ వద్దుల పార్టీ అని అందుకే ప్రజలు కూడా వద్దని ఆ పార్టీని రద్దు చేశారని ఎద్దేవా చేశారు. బడ్జెట్‌పై ప్రజలకు నిరాశ లేదని.. కాంగ్రెస్ పార్టీ నాయకులే నిరాశ చెందుతున్నారని విమర్శించారు. సంక్షేమ రంగానికి బడ్జెట్లో నిధులు పెంచామని ఆయన గుర్తు చేశారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా హరీష్‌రావు శాసనసభలో గురువారం మాట్లాడారు. (చదవండి: టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు) కాంగ్రెస్ ప్రభుత్వాల హయాంలో కరెంట్ కోతలు, వారానికి మూడు రోజులు పవర్ హాలిడే ఉండేదని.. తమ ప్రభుత్వం విద్యుత్ సమస్యలు పూర్తిగా పరిష్కరించిందని మంత్రి పేర్కొన్నారు. పరిశ్రమలకు, రైతులకు, గృహ అవసరాలకు 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని హరీష్‌రావు తెలిపారు. రైతాంగానికి 24 గంటల కరెంటుతోపాటు పెట్టుబడి సాయంగా రూ.10 వేలు అందిస్తున్నామన్నారు. ‘కరెంటు బందు ప్రభుత్వం మీది.. రైతు బంధు ప్రభుత్వం మాది’ అని మంత్రి వ్యాఖ్యానించారు. (శాసనసభ: కాంగ్రెస్ నేతలకు సీఎం కేసీఆర్ క్లాస్!) ఐటీ రంగంలో కూడా మంత్రి కేటీఆర్ నేతృత్వంలో తెలంగాణ గొప్ప అభివృద్ధి సాధించిందని ఆయన కొనియాడారు. ప్రపంచ వేదికలపై హైదరాబాద్ ఐటీ పరిశ్రమ గురించి మాట్లాడటం మన రాష్ట్రానికి దక్కిన గౌరవమన్నారు. డబుల్ బెడ్రూం నిర్మాణాలు శరవేగంగా సాగుతున్నాయని ఆయన తెలిపారు. కేంద్రం నిధులు ఇవ్వకపోయినా.. హైదరాబాద్ అభివృద్ధికి 10వేల కోట్లు కేటాయించామని చెప్పారు. తమను విమర్శించే ముందు కాంగ్రెస్ నేతలు ఆత్మవిమర్శ చేసుకోవాలని హరీష్‌రావు హితవు పలికారు. (చదవండి: ప్రైవేటుకు పరుగు) -
మహబూబ్‌నగర్‌లో రైతుబంధు కొందరికే..!
సాక్షి, మహబూబ్‌నగర్: రైతులకు ఆర్థిక చేయూత అందించి వ్యవసాయ రంగానికి ఊతం ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతుబంధు పెట్టుబడి సాయం నేటికీ చాలామంది రైతులకు అందలేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నా సాయం రాలేదు. పెట్టుబడి సాయం కోసం ఆశగా ఎదురుచూస్తున్న రైతులు మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాలో 79,263 మంది ఉన్నారు. తొలి విడతలో మురిపించి.. రెండో విడతలో ఆశలు రేపి.. మూడో విడతకల్లా ఉసూరుమనిపించారని అన్నదాతలు వాపోతున్నారు. దీనికి తోడు బ్యాంకు రుణాలు మాఫీ కాకపోవడంతో కొత్తవి పొందలేకపోతున్నారు. దీంతో ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి అప్పుల పాలవుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్న లెక్కల ప్రకారం 90శాతం రైతుల ఖాతాల్లో నగదు జమ అయినట్లు తెలుస్తున్నా.. వాస్తవానికి ఆ మేరకు కూడా ఖాతాల్లో డబ్బు జమ అయిన దాఖలాలు కనిపించడం లేదు. ఏ గ్రామానికి వెళ్లినా రైతులు తమ ఖాతాల్లో పంట పెట్టుబడి సాయం జమ కాలేదని, ఎప్పుడు అవుతుందని అధికారులను అడగడం కనిపిస్తోంది. అధికారులు ఖాతాల్లో డబ్బు జమ విషయమై ఎప్పటికప్పుడు సరైన సమాచారం ఇస్తే ఇలాంటి గందరగోళ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండదు. గత ఖరీఫ్, రబీ సీజన్లకు గాను ప్రభుత్వం ఒక్కో సీజన్లో ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు సీజన్లకు కలిపి రూ.8వేల సాయం అందించింది. ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఈ ఖరీఫ్ సీజన్ నుంచే ఎకరాకు రూ.5వేలకు పెంచింది. అంటే రెండు సీజన్లకు కలిపి ఎకరాకు రూ. 10వేల సాయం అందాల్సి ఉంది. 2018 ఖరీఫ్‌లో 2,82,783 మంది రైతులకు రూ.219.67 కోట్లు అందించారు. రబీలో 2,62,612 మంది రైతులకు రూ.307.7 కోట్లు పంపిణీ చేశారు. రైతుబంధు పథకం కింద రెండు సీజన్లకు కలిపి రూ.697.33 కోట్లు కేటాయించినా.. రూ.526.33 కోట్లు మాత్రమే పెట్టుబడి సాయం కింద రైతులు అందించారు. అందని సాయం... ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో పాలమూరు జిల్లాలో 1,78,012మంది రైతులకు పెట్టుబడి సాయం గా రూ.223.71 కోట్లు పంపిణీ చేయాల్సి ఉంది. వ్యవసాయశాఖ అధికారుల లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 1,16,141మంది రైతులకు రూ.135.55 కోట్లు సాయంగా అందించారు. ఇంకా 61,871 మంది రైతులకు రూ.88.16 కోట్ల పెట్టుబడి సాయం అందించాల్సి ఉంది. నారాయణపేట జిల్లాకు సంబంధించి 1,33,689మంది రైతులకు రూ.207.73కోట్ల బడ్జెట్‌ను కేటాయించారు. ఇప్పటి వరకు 1,16,297మంది రూ.159.69 కోట్లు పంపిణీ చేశారు. ఇంకా 17,392మంది సంబంధించి రూ.48.04కోట్లు పెండింగ్‌లో ఉంది. దీంతో సదరు రైతులు తమకు డబ్బులు ఎందుకు జమ కాలేదో తెలుసుకునేందుకు నిత్యం కార్యాలయా ల చుట్టూ తిరుగుతున్నారు. వ్యవసాయ, బ్యాం కు అధికారులను సంప్రదించినా సరైన సమాధానం లభించడం లేదు. ఖరీఫ్ సీజన్ ముగింపు దశకు చేరుకున్నా తమకు పెట్టుబడి సాయం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డబ్బులు రాలేదు నాకు గ్రామంలో రెండెకరాల భూమి ఉంది. ఖరీఫ్‌లో రైతుబంధు డబ్బులు అందలేదు. అదనులో పంట సాగు చేస్తేనే దిగుబడి బాగా వస్తుంది. డబ్బులు లేక సాగు ఆలస్యమైంది. పెట్టుబడి కోసం వడ్డీకి డబ్బులు తీసుకున్నాను. ఈసారి కొంతమందికే మాత్రమే రైతుబంధు డబ్బులు వచ్చాయి. సర్కార్ త్వరగా డబ్బులు ఖాతాల్లో జమ చేయాలి. – కేశవులుయాదవ్, రైతు, బోయపల్లి ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో అర్హత ఉన్న ప్రతి రైతు వివరాలను ఆన్లైన్లో అప్లోడ్ చేశాం. ఇందులో 1,16,141 మందికి పెట్టుబడి సాయం అందగా మరో 61,871 మంది రైతులకు రావాల్సి ఉంది. రైతుబంధు అందని వారి వివరాలను ప్రభుత్వానికి పంపించాం. త్వరలోనే రైతులకు డబ్బులు వచ్చే అవకాశం ఉంది. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
రైతుబంధు సహాయం మరొకరి ఖాతాలోకి..
సాక్షి, తాండూరు: వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ రైతుబంధు డబ్బులు మరొకరి బ్యాంక్ ఖాతాలో జమయ్యాయి. సంబంధిత రైతు ఖాతాలో పడాల్సిన డబ్బులు హైదరాబాద్‌లోని ఓ వ్యక్తి ఖాతాలో పడ్డాయి. తాండూరు మండలం గౌతపూర్ గ్రామానికి చెందిన జెన్నె ఎల్లమ్మకు అల్లాపూర్ గ్రామ సమీపంలో సర్వే నంబర్ 200, 201లో 4.35 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. వ్యవసాయం చేస్తూ ఆమె జీవిస్తోంది. అయితే ఆమెకు అందించాల్సిన రైతుబంధు పెట్టుబడి సహాయం ఆమె ఖాతాలో జమ కాలేదు. తనకు డబ్బులు పడలేదని ఆమె వ్యవసాయ అధికారులు, ఆంధ్రాబ్యాంక్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతోంది. అయితే ఆమెకు రావాల్సిన 2018, 2019 కు సంబంధించిన రైతుబంధు డబ్బులు ఆమె ఖాతాలో కాకుండా ఇతరుల ఖాతాల్లో పడ్డాయని సమాచారం తెలిసింది. హైదరాబాద్‌లోని ప్రగతినగర్‌కు సంబంధించిన సిండికేట్ బ్యాంక్ ఖాతా ఉన్న ఓ వ్యక్తి ఖాతాలో జమ అయినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఎల్లమ్మ కుటుంబసభ్యులు హైదరాబాద్‌కు వెళ్లి సిండికేట్ బ్యాంకులో వెళ్లి నగదు విషయమై బ్యాంక్ అధికారులను అడగ్గా తిరస్కరించారు. దీంతో ఎల్లమ్మ తాండూరులోని వ్యవసాయ కార్యాలయం చుట్టూ రైతుబంధు డబ్బుల కోసం తిరుగుతున్నా అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా సంబంధిత వ్యవసాయ ఉన్నతాధికారులు స్పందించి రైతుబంధు డబ్బులు ఎల్లమ్మ ఖాతాలో జమ చేయాలని కోరుతున్నారు. -
మాంద్యం ఎఫెక్ట్.. బడ్జెట్ కట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వార్షిక బడ్జెట్ తగ్గనుంది. గత ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పోల్చితే త్వరలో ప్రవేశపెట్ట బోతున్న పూర్తిస్థాయి బడ్జెట్లో కేటాయింపులను 8 నుంచి 12 శాతం వరకు కుదించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దాదాపు రూ.14 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు కేటాయింపుల్లో కోత పడనుందని తెలుస్తోంది. రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా.. పూర్తిస్థాయి బడ్జెట్‌ను సుమారు రూ.లక్షా 65 వేల కోట్లకు కుదించే అవకాశాలున్నట్లు సమాచారం. దేశవ్యాప్తంగా అన్ని రంగాలపై తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం నెలకొని ఉన్న నేపథ్యంలో రాష్ట్ర రాబడుల్లో వృద్ధి సైతం మందగించిందని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడు తున్నాయి. ఆర్థిక మాంద్యానికి తోడు కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి నిధుల కేటాయింపులు కూడా తగ్గాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో వాస్తవికతతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో నిధుల కేటాయింపుల్లో కోతలు తప్పవని స్పష్టమవుతోంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కాలపరిమితి సెప్టెంబర్ 30తో ముగియనుంది. అక్టోబర్ ఒకటో తేదీ నుంచి ఆరు నెలల పాటు అమలు చేయాల్సిన పూర్తిస్థాయి బడ్జెట్‌కు తుదిరూపునిచ్చే పనిలో సీఎం కేసీఆర్ తలమునకలై ఉన్నారు. గత నెలాఖ రులో తొలి దఫా కసరత్తు చేసిన ఆయన.. గత బుధ, గురువారాల్లో ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో సమావేశమై బడ్జెట్‌కు తుదిరూపునిచ్చారు. ఈ నెల 9న ఉదయం 11.30 గంటలకు రాష్ట్ర శాసనసభను సమావేశపరిచి అదే రోజు బడ్జెట్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. రూ.20 వేల కోట్లకు గండి! రాష్ట్ర ఆదాయం–అవసరాలను బేరీజు వేసుకుని ప్రభుత్వం బడ్జెట్‌కు తుది రూపునిస్తోంది. రోజురోజుకూ ఆర్థిక మాంద్యం తీవ్రరూపం దాల్చుతుండ డంతో లక్ష్యాలతో పోల్చితే వచ్చే ఆరేడు నెలల్లో సుమారు రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల ఆదాయానికి గండి పడే అవకాశం ఉందని ప్రభుత్వం అంచనాకు వచ్చినట్లు తెలిసింది. 2018–19లో రాష్ట్రం రూ.72,777 కోట్ల సొంత రెవెన్యూ రాబడులు సాధించగా, 2019–20లో రూ.94,776 కోట్లు సాధించే అవకాశాలున్నాయని ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం లెక్కకట్టింది. అలాగే కేంద్రం నుంచి వివిధ గ్రాంట్ల రూపంలో రూ.28,042 కోట్లు రానున్నాయని అంచనా వేసింది. అయితే మాంద్యం తీవ్ర రూపం దాల్చుతున్న నేపథ్యంలో రాష్ట్ర సొంత రెవెన్యూ రాబడులు రూ.80వేల కోట్లకు మించే అవకాశాలు లేవని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిసింది. జీఎస్టీ ఆదాయం బాగానే ఉన్నప్పటికీ.. పెట్రోల్ ఉత్పత్తులు, రవాణా రంగాల నుంచి రావాల్సిన పన్నుల ఆదాయం కొంత తగ్గినట్లు ప్రభుత్వం గుర్తించింది. ఇక కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన కేటాయింపులు కూడా తగ్గాయి. ఇటీవల కేంద్రం ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్లో తెలంగాణకు కేటాయించాల్సిన కేంద్ర ప్రన్నుల్లో రాష్ట్ర వాటాలో రూ.840 కోట్లు కోత పెట్టింది. దీంతో ఈ మేరకు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపులను సైతం ప్రభుత్వం తగ్గించనుంది. రైతుబంధు భారం తగ్గింపు దిశగా.. ఆర్ధికంగా రానున్న రోజుల్లో క్లిష్ట పరిస్థితులు ఉత్పన్నం కానున్నాయని ప్రభుత్వం భావిస్తోంది. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడున్న పరిస్థితులతో పోల్చితే ప్రస్తుతం పరిస్థితులు మారినందున దాదాపు అన్ని శాఖలకు బడ్జెట్ కేటాయింపుల్లో కొంత వరకు కోతలు పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అధికారవర్గాలు చెబుతున్న ప్రకారం.. సాగు, సంక్షేమం, విద్యుత్ రంగాలకు ప్రాధాన్యతను కొనసాగించి మిగిలిన రంగాలకు కోతలు పెట్టే అవకాశాలున్నట్లు తెలిసింది. ఓటాన్ అకౌంట్లో సాగునీటి రంగానికి రూ.22,500 కోట్లను కేటాయించగా, పూర్తిస్థాయి బడ్జెట్లో దాదాపు రూ.20వేల కోట్లకు తగ్గించే అవకాశాలున్నాయి. వ్యవసాయాభివృద్ధి కేటాయింపులు రూ.20,107 కోట్ల నుంచి రూ.18 వేల కోట్లకు తగ్గనున్నట్టు సమాచారం. రైతుబంధు పథకం భారాన్ని కొంత వరకు తగ్గించుకోవాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. విద్యుత్ సంస్థలు తీవ్ర ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో రూ.4,650 కోట్ల విద్యుత్ సబ్సిడీని మాత్రం యథావిధిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బడ్జెట్లో కొత్త పథకాలకు కేటాయింపులు, కొత్త ప్రకటనలకు ఉండే అవకాశాలు సన్నగిల్లాయి. గత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీల్లో ప్రధానమైన సామాజిక పింఛన్ల పెంపును ఇప్పటికే ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇంకా అమలు చేయాల్సిన ఇతర హామీలకు ఈ ఏడాది కేటాయింపులు ఉండే అవకాశాలు లేనట్లే. కొన్ని ప్రతిష్టాత్మక పథకాలు, ప్రాజెక్టులు మినహా మిగిలినవాటికి బడ్జెట్లో భారీగా కోతలకు అవకాశాలున్నట్లు చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాది నుంచి పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టుకు రూ.10 వేల కోట్లు కేటాయించవచ్చని తెలిసింది. -
10 ఎకరాలకే ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్ : రైతుబంధు పథకంలో కీలక మార్పులు జరగనున్నాయి. ఎన్ని ఎకరాలు ఉన్నా రైతుబంధు సొమ్ము అందజేయాలనే నిబంధనను మార్చాలని వ్యవసాయశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు విశ్వసనీయ సమాచారం. రైతుకు ఎన్ని ఎకరాలు ఉన్నప్పటికీ, పది ఎకరాలకు మాత్రమే పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని నిర్ణయించి, ఆ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రతిపాదన పంపినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ప్రస్తుత ఆర్థికమాంద్యం నేపథ్యంలో దీన్ని వచ్చే రబీ నుంచి లేదా ఆ తర్వాత వచ్చే ఖరీఫ్ నుంచి అమలు చేయాలని ప్రతిపాదించినట్లు సమాచారం. ‘‘నిబంధనల్లో మార్పు చేసినా ప్రతీ రైతుకు రైతుబంధు సొమ్ము అందుతుంది. అయితే పదెకరాలకు మించి భూమి ఉన్నా పదెకరాల వరకు మాత్రమే సొమ్ము ఇవ్వా లనేది ఆలోచన’’అని ఆ వర్గాలు వివ రించాయి. అయితే ముఖ్యమంత్రి దీనిపై అంతగా సుముఖంగా లేరని తెలిసింది. ఎంత భూమి ఉన్నా ఇస్తా మని రైతులకు హామీ ఇచ్చినందున, మాట తప్పకూడదని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఆర్థికశాఖ మాత్రం పదెకరాల సీలింగ్ అమలు చేస్తే ఏడాదికి దాదాపు రూ.2వేల కోట్ల వరకు మిగులుతాయని, తద్వారా అనేక శాఖల్లో అమలు చేస్తున్న పథకాలకు నిధులు ఖర్చు చేయడానికి వీలు పడుతుందని చెబుతున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఆర్థికశాఖ నుంచి వచ్చిన ప్రతిపాదన ప్రకారమే వ్యవసాయశాఖ ఈ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ఎకరానికి రూ.10వేలు... రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ఖరీఫ్‌లో రైతుబంధు పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత ఖరీఫ్, రబీల్లో కలిపి ఎకరానికి రూ.8వేల చొప్పున రైతులకు అందజేసింది. 53 లక్షల మంది రైతులకు దాదాపు రూ.10వేల కోట్లు చెల్లించింది. ఈ ఏడాది నుంచి ప్రతి ఎకరానికి రెండు సీజన్లకు కలిపి రూ.10వేలు ఇవ్వాలని నిర్ణయించింది. అందుకోసం ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో రూ.12వేల కోట్లు కేటాయించింది. ఆ మేరకు ఇప్పటికే ఖరీఫ్‌లో ఎకరాకు రూ.5వేల చొప్పున అందజేస్తోంది. ఇప్పటివరకు 40 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.4,400 కోట్లు జమ చేసింది. మరో 14 లక్షల మందికిపైగా రైతుల ఖాతాల్లో దాదాపు రూ.2వేల కోట్లు జమ చేయాల్సి ఉంది. అయితే, వంద ఎకరాలు ఉన్న రైతుకు కూడా రైతుబంధు ఇస్తుండటంతో గ్రామాల్లోనూ, వివిధ వర్గాల్లోనూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ధనిక రైతులకు ఇవ్వాల్సిన అవసరముందా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుబంధుకు పదెకరాలు సీలింగ్ అమలు చేస్తే ఇలాంటి విమర్శలు వచ్చ అవకాశం ఉండదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయ శాఖ ఈ మేరకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు పంపించింది. -
కొందరికే రైతుబంధు..
సాక్షి, సిరిసిల్ల: జిల్లాలోని చిన్న, సన్నకారు రైతులకు ఎకరానికి రూ.5వేల చొప్పున పెట్టుబడి సాయం అందింది. ఐదెకరాల కన్నా గుంటభూమి ఎక్కువగా ఉన్నా పెట్టుబడిసాయం అందలేదు. తొలిసారిగా 2018 ఖరీఫ్ సీజన్లో రైతులకు నేరుగా చెక్కులు అందించిన ప్రభుత్వం రబీ సీజన్లో రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని వేసింది. ఈ సారి ఖరీఫ్ సీజన్లో రైతుల సమగ్ర సమాచారాన్ని సేకరించిన అధికారులు అన్నదాతల బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సాయాన్ని జమ చేస్తున్నారు. ఐదెకరాల కన్నా ఎక్కువ ఉన్న పెద్దరైతులు ఖరీఫ్ సీజన్లో పెట్టుబడుల కోసం అందించే సాయం కోసం నిరీక్షిస్తున్నారు. జిల్లాకు అందిన పెట్టుబడి సాయం రూ.65.68 కోట్లు జిల్లావ్యాప్తంగా 64122 మంది రైతులకు రూ.65.68 కోట్ల పెట్టుబడి సాయం ఇప్పటి వరకు అందింది. వాస్తవానికి 95,129 మంది రైతుల బ్యాంకు ఖాతా, ఆధార్ నంబరు వివరాలను ట్రెజరీకి వ్యవసాయ అధికారులు అందించారు.ఇంకా 26,669 మంది రైతులకు పెట్టుబడి సాయం రాలేదు. ఆన్లైన్లో అప్లోడ్ చేసినా సాయం దక్కలేదు. ప్రభుత్వం ఇచ్చే పెట్టుబడి సాయం కోసం రైతులు బ్యాంకు చుట్టూ తిరుగుతున్నారు.ఆన్లైన్లో పహాణీల వివరాలను చెక్ చేసుకుంటూ.. బ్యాంకుకు వెళ్లి డబ్బులు జమ అయ్యాయా అంటూ ఆరా తీస్తున్నారు. ఖరీఫ్ సీజన్ పెట్టుబడుల కాలం కావడంతో సర్కారు డబ్బుల కోసం ఆశగా చూస్తున్నారు. కొందరి ఖాతాల్లో డబ్బులు జమ కాగా.. మరి కొందరి ఖాతాల్లో జమ కాకపోవడంతో అయోమయానికి గురవుతున్నారు. ఇప్పటికీ కొందరు ఎన్ఆర్ఐలు తమ ఆధార్, బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వకపోవడంతో 12,349 మంది రైతుల వివరాలు తెలియక వ్యవసాయ అధికారులు ఆన్లైన్లో నమోదు చేయలేదు. మా ఊరిలో చాలా మందికి రాలేదు.. మాది కోనరావుపేట మండలం మర్తనపేట. కొలనూర్ గ్రామ శివారుల్లో నాకు భూమి ఉంది. నాకు నిరుడు పెట్టుబడి సాయం వచ్చింది. ఒక్కసారి చెక్కు ఇచ్చిండ్రు.. ఇంకోసారి బ్యాంకులో వేసిండ్రు. ఈ సారి మాత్రం ఇంకా రాలేదు. నేను బ్యాంకు వెళ్లి చూసినా.. రాలేదని చెప్పిండ్రు. మా ఊరిలో చాలా మంది రైతులకు ఇంకా డబ్బులు పడలేదు. ఇప్పు డు వస్తే.. పెట్టుబడికి అక్కర కొస్తాయి. – బురవేణి కొండయ్య, రైతు, మర్తనపేట అందరి ఖాతాలు అప్లోడ్ చేశాం.. జిల్లాలోని రైతుల అందరి బ్యాంకు ఖాతా నంబర్లు, ఆధార్ నంబరు, ఆన్లైన్ పహాణీ ఆధారంగా అప్లోడ్ చేశాం. రైతుబంధు సాయం జిల్లాలోని రైతులందరికీ అందుతుంది. ఇప్పటికే 64వేల మంది రైతుల ఖాతాల్లో జమ అయింది. మిగితా వారికి పేమెంట్ ట్రెజరీల్లో పెండింగ్‌లో ఉంది. జిల్లాలో రైతుల డేటాను పూర్తి స్థాయిలో అన్లైన్లో నమోదు చేశాం. – కె.రణధీర్‌కుమార్, జిల్లా వ్యవసాయాధికారి, సిరిసిల్ల -
రుణమాఫీ గజిబిజి
సాక్షి, హైదరాబాద్ : రైతు రుణమాఫీపై సర్కారు కసరత్తు ప్రారంభించింది. మాఫీ అమలుకు సంబంధించి మార్గ దర్శకాలను ఖరారు చేసే ప్రక్రియ ను వ్యవసాయశాఖ మొదలు పెట్టింది. రుణమాఫీని ఎలా, ఎప్పటినుంచి అమలు చేయాలి? అర్హులను ఎలా గుర్తించాలి? గత రుణమాఫీ సందర్భంగా ఎటువంటి సమస్యలు తలెత్తాయి? ఈసారి అటువంటి విమర్శలు రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తది తర అంశాలపై అధికారులు మేధోమథనం చేస్తున్నారు. అందులో భాగంగా అసలు రుణమాఫీ ఎంత చేయాల్సి వస్తుందన్న దానిపై లెక్కలు తీస్తున్నారు. అయితే రుణమాఫీకి ఎంత సొమ్ము అవసరమన్న దానిపై గందరగోళం నెలకొంది. బ్యాంకు లెక్కలకు, వ్యవసాయశాఖ లెక్కలకు మధ్య పొంతన లేకుండా పోయింది. రుణమాఫీ అమలుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండగా ఈ గందరగోళం నెలకొంది. ఏది సరైన సమాచారమన్న అంశంపై ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. బ్యాంకులు మాత్రం రూ.20 వేల కోట్లు రుణమాఫీకి సరిపోతాయని సర్కారుకు విన్నవించగా, వ్యవసాయ వర్గాలు రూ.26 వేల కోట్లు అవసరమని అంచనా వేశాయి. బ్యాంకులైతే తమ అంచనాను ఆర్థికశాఖకు కూడా అందజేసినట్లు సమాచారం. అయితే ఈ లెక్కలు ఏమేరకు సరిగ్గా ఉన్నాయనే దానిపై అధికారుల్లో పలు సందేహాలున్నాయి. ఎందుకంటే ప్రభుత్వం ప్రస్తుత రుణమాఫీకి కటాఫ్ తేదీని 2018 డిసెంబర్ 11గా ప్రకటించింది. కటాఫ్ తేదీని ప్రకటించిందేకానీ, ఎప్పటినుంచి అమలన్న దానిపై స్పష్టత ఇవ్వలేదు. చెరకు, పసుపు రైతులను మరిచారా? బ్యాంకర్లు, వ్యవసాయశాఖ వర్గాలు మాత్రం గత రుణమాఫీ కింద చివరి విడత సొమ్ము చెల్లించిన నెల నుంచి పరిగణలోకి తీసుకుంటున్నాయి. 2017 సెప్టెంబర్ నాటికి గత రుణమాఫీ పూర్తిగా చెల్లించిన నెలగా వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటి నుంచి 2018 డిసెంబర్ 11 వరకు లెక్కలోకి తీసుకున్నట్లు వారంటున్నారు. ఆ ప్రకారమే తాము రుణమాఫీకి అర్హులను, సొమ్మును అంచనా వేశామని అంటున్నారు. బ్యాంకర్లు చెరకు, పసుపు రైతులను పరిగణలోకి తీసుకోలేదని వ్యవసాయశాఖ వర్గాలు ఆరోపిస్తున్నాయి. దానివల్ల బ్యాంకర్లు తక్కువ సొమ్ము చూపారని వ్యవసాయాధికారులు అంటున్నారు. తాము ఆ రైతులను కూడా పరిగణలోకి తీసుకున్నామని, అందుకే రూ.26 వేల కోట్ల వరకు లెక్క తేలిందంటున్నారు. అయితే ఎప్పటినుంచి అమలు చేస్తారన్న తేదీ ఖరారు చేసి మార్గదర్శకాలు విడుదల చేశాకే రైతుల సంఖ్య, చెల్లించాల్సిన సొమ్ముపై స్పష్టత రానుంది. 39లక్షల మంది రైతులకు మాఫీ! రెండోసారి అధికారంలోకి వచ్చాక మరోసారి రుణమాఫీ చేస్తానని అధికార పార్టీ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. లక్ష రూపాయలు మాఫీ చేస్తానని ప్రకటించింది. అందులో భాగంగానే గత ఓటాన్ అకౌంట్ బడ్జెట్లో ప్రభుత్వం రూ.6వేల కోట్లు కేటాయించింది. అయితే ఎన్ని విడతలనే విషయాన్ని మాత్రం సర్కారు ప్రకటించలేదు. 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు కూడా లక్ష రూపాయల రుణమాఫీ ప్రకటించి అమలుచేసింది. 35.29 లక్షల మంది రైతులకు సంబంధించి రూ.16,124 కోట్ల రుణాలను మాఫీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సొమ్మును ప్రభుత్వం నాలుగు విడతలుగా నాలుగు బడ్జెట్లలో నిధులు కేటాయించి మాఫీ చేసింది. మొదటి విడత 2014–15లో రూ.4,040 కోట్లు, రెండో విడత 2015–16లో రూ.4,040 కోట్లు, 2016–17లో మూడో విడత రూ 4,025 కోట్లు, నాలుగో విడత 2017–18లో రూ.4,033 కోట్లు మాఫీ చేసింది. ఈసారి ఎన్ని విడతలుగా మాఫీ చేస్తారన్న దానిపై స్పష్టత రాలేదు. మార్గదర్శకాలు వచ్చాకే.. దీనిపై ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశముంది. గత డిసెంబర్ 11వ తేదీని కటాఫ్‌గా ప్రకటించగా, డిసెంబర్ 31 వరకు ఎస్ఎల్బీసీ వద్ద లెక్కలున్నాయి. ఆ లెక్కల ప్రకారం చూస్తే 48 లక్షల మందికి రూ.31 వేల కోట్లు రుణాలు తీసుకున్నట్లు ఉంది. అయితే లక్ష లోపు రుణాలు ఉన్నవారెందరనేది తేలాల్సి ఉంది. అంతేకాదు అంటే డిసెంబర్ 11వ తేదీకి, డిసెంబర్ 31వ తేదీకి మధ్య భారీ తేడా కనిపిస్తుంది. ఎందుకంటే గత రబీకి సంబంధించి అనేక మంది రైతులు ఆ తేదీల మధ్య కొత్త రుణాలు తీసుకొని ఉంటారు. కాబట్టి వారిని మినహాయించాల్సి ఉంది. ఏదేమైనా వ్యవసాయశాఖ మాత్రం 39లక్షల మంది రైతులకు రూ.26 వేల కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంటుందని అంచనా వేసింది. గత రుణమాఫీకి ఇప్పటికీ రైతుల సంఖ్య మరో నాలుగు లక్షలు పెరిగే అవకాశముంది. రైతుబంధు తర్వాతేనా! ఈ ఖరీఫ్ రైతుబంధు సొమ్మును ప్రభుత్వం రైతుల ఖాతాల్లో జమ చేస్తోంది. ఇప్పటికీ రైతులకు అందజేసే ప్రక్రియ కొనసాగుతోంది. వ్యవసాయశాఖ లెక్కల ప్రకారం ఈ ఖరీఫ్‌లో 50లక్షల మంది రైతులకు రూ.6,900 కోట్లు రైతుబంధు కింద చెల్లించాల్సి ఉంది. అందులో ఇప్పటివరకు 33లక్షల మందికి రూ.3,500 కోట్లు రైతుబంధు సొమ్ము చెల్లించినట్లు వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారధి తెలిపారు. ఇంకా మిగిలిన రైతులకు త్వరలో చెల్లిస్తామని ఆయన చెబుతున్నారు. రైతుబంధు సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేయడం పూర్తయిన తర్వాత రుణమాఫీ ప్రక్రియ మొదలయ్యే అవకాశాలున్నట్లు వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. అప్పటివరకు బ్యాంకులు రైతులకు సహకరించాలని కోరుతున్నారు. రైతులకు పంటరుణాలు సక్రమంగా ఇవ్వాలని, రుణమాఫీతో ముడిపెట్టకుండా ఇవ్వాలని కోరుతున్నారు. కానీ ప్రభుత్వ విన్నపాన్ని బ్యాంకర్లు పెడచెవిన పెడుతున్నారన్న ఆరోపణలున్నాయి. ఇప్పటివరకు ఖరీఫ్ పంట రుణాల కింద రూ.2 వేల కోట్లు కూడా ఇవ్వలేదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. -
ఏడాది ముందుగానే రైతు భరోసా పథకం అమలు
-
తెలంగాణ వచ్చాక లక్ష కోట్లు అప్పు..
-
రాష్ట్ర అప్పులు 1,82,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ. 1.82 లక్షల కోట్లు అని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. అం దులో తెలంగాణ రాకముందు రూ. 82 వేల కోట్ల అప్పులుండగా, రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రూ. లక్ష కోట్లు అప్పు చేసినట్లు వివరిం చారు. అప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిబం ధనలు, చట్ట పరిధిలోనే చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంగళ వారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పెన్షన్లు, ప్రాజెక్టుల బిల్లులు, సంక్షేమ పథకా లకు నిధులను సకాలంలోనే చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడాది అధిక ఆర్థికవృద్ధి నమోదైం దన్నారు. ఆర్థిక వృద్ధిరేటు నమోదులో తెలం గాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, స్టేట్ ఓన్ ట్యాక్స్‌లోనూ తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. కేంద్ర గణాంకాల లెక్కల ప్రకారం 2018–19 రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,65,875 కోట్లు అని ఆయన వెల్లడించారు. గతేడాది రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 15 శాతమన్నారు. ఐదేళ్లలో తెలంగాణ కాపిటల్ ఎక్స్పెండిచర్ 1,64,519 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తుంటామని, నెలకు సుమారు రూ. 2 వేల కోట్ల వరకు బిల్లులు క్లియర్ చేస్తుంటామని తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.46,960 కోట్లు అని, ఇప్పటివరకు ప్రాజెక్టుపై రూ. 27,509 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిషన్ భగీరథలో పెండింగ్ బిల్లులు రూ. 659 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, రైతుబంధుకోసం రబీ సీజన్లో రూ. 5,200 కోట్లు విడుదల చేశామని చెప్పారు. పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తెలిపారు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయన్నారు. రైతుబంధు పథకం నిధులు రైతులకు ఆన్లైన్లో చెల్లిస్తామని, రైతుకు ఇబ్బంది లేకుండా రుణమాఫీని అమలు చేస్తామన్నారు. ‘మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తాం. పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి’అని స్పష్టం చేశారు. రాష్ట్రం వృద్ధిరేటు 14 శాతం కంటే తక్కువ ఉంటే... కేంద్రం జీఎస్టీ మినహాయింపు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు కేవలం రూ. 3,474 కోట్లు మాత్రమే అని వివరించారు. ట్యాక్స్ పెరిగింది... తెలంగాణ ఏర్పాటయ్యాక అత్యంత వృద్ధిని సాధించామని రామకృష్ణారావు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లలో జరిగిన అభివృద్ధికంటే ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఎక్కువుందన్నారు. ప్రాథమిక రంగంలో 10.9 శాతం, సెకండరీ సెక్టార్లో 14.9 శాతం వృద్ధి సాధించామని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ట్యాక్స్ రెవెన్యూ 2018–19లో 14.5 శాతం పెరిగిందన్నారు. అంటే రూ. 64,714 కోట్లు వచ్చిందన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండేచర్ బడ్జెట్ 22,904 కోట్లు, బడ్జెటేతర ఖర్చు 24,130 కోట్లు అని తెలిపారు. నెలన్నరలోగా మొత్తం బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు. రైతుబంధు, రుణ మాఫీ, ఆసరా పింఛన్లకు ఓట్ ఆన్ అకౌంట్లో 6 నెలలకు బడ్జెట్ పెట్టామన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల ఇబ్బంది లేకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. బిల్లుల చెల్లింపులో జాప్యం నిజమే ఎఫ్ఆర్బీఎం 2004 ప్రకారం జీడీపీలో 3 శాతం రుణాలు తీసుకోవచ్చు. ఆ ప్రకారం ఈ ఏడాది రూ. 29,750 కోట్లు తీసుకోవడానికి అనుమతి ఉందన్నారు. నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరిగినమాట నిజమేనన్నారు. ఏప్రిల్ నెలలో సహజంగా ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు. ప్రతి నెల రూ.12 వేల కోట్లు నిధులు వస్తాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేస్తున్నామన్నారు. రైతుబంధు చెల్లింపులో బకాయిలు లేవని, రబీలో 52 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందజేశామన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బందులు లేకుండా ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 14 లక్షల మంది విద్యార్థులకు రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో వృద్ధి రేటు భారీగా పెరిగిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జీడీపీలో 9 శాతం పన్నుల రూపంలో వసూలు చేస్తున్నామన్నారు. 2018–19లో ట్యాక్స్ రెవెన్యూ 14.5 శాతమని, గత ఐదేళ్ల సరాసరి 16.5 శాతంగా ఉందని చెప్పారు. గ్రామీణ రోడ్లు, గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానం, వ్యవసాయానికి చేస్తున్న ఖర్చులు అభివృద్ధి కిందకే వస్తాయని వివరించారు. కేంద్రం క్యాపిటల్ ఎక్స్పెండేచర్ 10 శాతముంటే, రాష్ట్రంలో 25 శాతం ఉందన్నారు. రాష్ట్ర రెవెన్యూ, పన్నుల రాబడిని చూసి ఆర్బీఐ ప్రశంసించిందన్నారు. కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు జీడీపీలో 35 నుంచి 45 శాతం వరకు అప్పులు తీసుకుంటే, తెలంగాణ కేవలం 22 శాతమే తీసుకుందన్నారు. గత డిసెంబర్ వరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే జీడీపీ పెరుగుతుందని ఆయన తెలిపారు. -
భూమి దక్కకపోతే చచ్చిపోవాలనుకున్న..!
సాక్షి,బెల్లంపల్లి: ‘‘మాకున్న గా ఏడెకరాల భూమిని నమ్ముకుని బతుకుతున్నం. గా భూమి దప్ప మాకింకేదిక్కులేదు. ఎలాంటి ఆస్తిపాస్తులు సుత లేవ్. మా అయ్య కాపాడుకుంట అచ్చిన భూమి నాగ్గాక్కుండ పోయినంక ఇక బతుకుడెందుకు..? నా భూమి నాకు పట్టా కాకపోతే చచ్చిపోవాలని అనుకున్న..’’ ఇదీ నెన్నెల మండలం నందులపల్లి గ్రామానికి చెందిన బాధిత రైతు కొండపల్లి శంకరయ్య ఆవేదన. యాభై ఏళ్ల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని రెవెన్యూ అధికారులు మామూళ్లకు కక్కుర్తిపడి మరో వ్యక్తి పేరిట పట్టా చేయడంతో శంకరయ్య పది నెలల నుంచి పడిన బాధ వర్ణణాతీతం. వివరాలిలా ఉన్నాయి.. కొండపల్లి మల్లయ్యకు కూతురు, కుమారుడు శంకరయ్య ఉన్నారు. కూతురికి పెళ్లి చేసి అత్తారింటికి పంపించాడు. శంకరయ్యకు కూడా పెళ్లి చేయడంతో ఆయనకు ఇద్దరు కుమారులు, కూతురు ఉన్నారు. ముప్పై ఏళ్ల క్రితం శంకరయ్య తండ్రి మల్ల య్య చనిపోయాడు. ఆయన మరణాంతరం నందులపల్లి గ్రామ శివారు సర్వేనంబర్ 271/ఏలో 7.01 ఎకరాల భూమి వారసత్వంగా శంకరయ్య పేరిట 20 ఏళ్ల క్రితం పట్టా అయింది. ఆ భూమిలో నుంచి రెండు ఎకరాల్లో పత్తి పంట, మిగతా 5 ఎకరాల్లో వరి సాగు చేసుకుంటూ శంకరయ్య కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకం డబ్బులు తనకు కూడా వస్తాయని ఎంతగానో ఆశపడ్డాడు. కానీ ఆ పథకం కింద నయాపైసా చేతికి అందలేదు. భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా అందరి మాదిరిగా పట్టాదారు పాసు పుస్తకం కూడా రాలేదు. దీంతో ఆందోళనకు గురైన శంకరయ్య పలుమార్లు రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెద్దిరాజు, గ్రామ వీఆర్వో కరుణాకర్‌ను కలిసి పాసుపుస్తకం ఇప్పించాలని ప్రాధేయపడ్డాడు. ఎప్పుడు కలిసి అడిగినా ధరణి వెబ్సైట్ పని చేయడం లేదని, ఆన్లైన్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయని నిరక్షరాస్యుడైన శంకరయ్యకు ఇన్నాళ్లూ రెవెన్యూ ఉద్యోగులు నమ్మబలుకుతూ వచ్చారు. తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ.. పట్టాదారు పాసు పుస్తకం కోసం రెవెన్యూ అధికారుల చుట్టూ శంకరయ్య ఎంతగా తిరిగాడో లెక్కలేదు. భూ ప్రక్షాళన కార్యక్రమం ఆరంభమైనప్పటి నుంచి తహసీల్దార్ కార్యాలయం చుట్టూ వందకు పైబడి సార్లు చెప్పులరిగేలా తిరిగాడు. అంతకుమించి ఆర్ఐ, వీఆర్వో చుట్టూ రోజు గుడికి వెళ్లి దేవుడిని దర్శించుకున్నట్లుగానే తహసీల్ కార్యాలయం చుట్టు ప్రదక్షిణ చేశాడు. ఏ ఒక్కనాడూ ఆ అధికారులు కరుణించిన పాపాన పోలేదు. కనీసం ఆన్లైన్లో పట్టాదారు పేరు మార్పిడి చేసి, శంకరయ్య పేరున పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేసి, చేసిన తప్పును సరిదిద్దుకోలేకపోయారు. పైగా అమాయకుడైన శంకరయ్యను ఎప్పటికప్పుడు తిప్పించుకుని ఎంతో వేదన కలిగించారు. కాసులకు ఆశపడి ఏకంగా మరొకరి పేరుమీద భూమిపట్టా చేసి ఆ పేద కుటుంబానికి ప్రత్యక్ష నరకం చూపించారు. బాధపడని రోజు లేదు..! భూప్రక్షాళన కార్యక్రమం అయిపోయినప్పటి నుంచి పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు కోసం శంకరయ్య దిగులు ప్రారంభమైంది. భూమి తన వద్దే ఉన్నా.. ఆ భూమిని తానే సాగు చేసుకుంటున్నా ఎందువల్ల పట్టా పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు ఇవ్వడం లేదో రోజు ఇంట్లో భార్యాబిడ్డలతో కుమిలిపోయే వాడు. ఎప్పుడిస్తారో అని రోజు పడిగాపులు కాసేవాడు. ఆ దిగులుతో అన్నం ముద్ద నోట్లోకెళ్లేది కాదు. భార్య, కొడుకులు ఎంత ధైర్యం చెప్పినా ప్రయోజనం లేకపోయింది. ఆయనను చూసీ ఆ ఇల్లాలు, కొడుకులు కూడా సరిగా అన్నం తినని రోజులు కోకోల్లలు. ఆ తీరుగా భూమి పట్టా రాకుండా ఆ బాధిత కుటుంబం బాధ పడని రోజంటూ లేకుండా పోయింది. చివరికి శంకరయ్య పెద్ద కొడుకు శరత్ ఓ ఆలోచన చేసి ఫేస్బుక్లో ‘మన వ్యవసాయం–మన పంటలు’ గ్రూపులో తన తాత మల్లయ్య పేరిట పట్టాదారు పాసు పుస్తకం, రైతుబంధు చెక్కు అందించని తీరును వీడియో లైవ్‌గా పోస్టు చేశాడు. ఆ పోస్టు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యంత్రి కేసీఆర్ కంట పడడం, ఆ సమస్య ఏంటో పరిశీలించాలని కలెక్టర్ భారతీ హోళీకేరీని ఆదేశించడంతో శంకరయ్య సమస్య వెలుగు చూసింది. సీఎం కేసీఆర్ ఫోన్ చేసి నేరుగా శరత్‌తో మాట్లాడడం, ఆడియో వైరల్ కావడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కేసీఆర్ ఆదేశాలతో కలెక్టర్ విచారణలో రెవెన్యూ అధికారులు లీలలు ఒక్కసారిగా బయట పడ్డాయి. చివరికి కలెక్టర్ విచారణ జరిపి బాధిత రైతు పేరిట పట్టాదారు పాసుపుస్తకం ఆన్లైన్లో మార్చారు. మొదటి విడత రైతుబంధు చెక్కు అందజేసి రెండో విడతకు సంబంధించి బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని అధికారులు చెప్పారు. అక్రమాలకు పాల్పడిన ఆర్ఐ, వీఆర్వోలను సస్పెండ్ చేయడంతో కథ సుఖాంతమైంది. -
రైతుబంధు, రుణమాఫీ యథాతథం
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల కోడ్ ప్రభావం రైతుబంధు, రుణమాఫీ పథకాలపై పడదని వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతుబంధు కొనసాగుతున్న కార్యక్రమమే అని, రుణమాఫీకి బడ్జెట్లో నిధులు కేటాయించినందున దానికీ అభ్యంతరం ఉండబోదని చెబుతున్నాయి. ఈ రెండు పథకాలకు రూ.18 వేల కోట్లు.. రైతుబంధు కోసం రూ.12 వేల కోట్లు, రుణమాఫీ కోసం రూ.6 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్లో కేటాయించింది. రైతుబంధుకింద ప్రతి రైతుకు ఏడాదికి ఎకరానికి రూ.10 వేల చొప్పున అందజేయనుంది. ఇక రబీ సమయంలోనే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. ఆ సమయంలో పెట్టుబడి చెక్కులు ఇవ్వకూడదని, రైతులకు నేరు గానే వారి బ్యాంకు ఖాతాలకు రైతుబంధు సొమ్ము అందజేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో చెక్కుల ముద్రణను నిలిపివేసి రైతులకు బ్యాంకుల్లోనే నగదు జమ చేశారు. ఈసారి కూడా అదే జరగనుందని అంటు న్నారు. ఏప్రిల్ 11న తెలంగాణలో ఎన్నికలు జరుగుతాయి. మే 23న ఫలితాలు విడుదల వుతాయి. కాబట్టి ఫలితాల వెల్లడివరకూ ఎన్నికల కోడ్ ప్రభావం ఉంటుంది. ఈలోగా రైతులకు ఖరీఫ్ పెట్టుబడి సొమ్ము ఇవ్వాలి కాబట్టి ఈసారి కూడా రైతుల బ్యాంకు ఖాతాలకు సొమ్ము జమ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. ఇక రుణమాఫీ లబ్ధిదారుల నిర్ధారణపై బ్యాంకులు, వ్యవసాయ శాఖ కసరత్తు చేస్తున్నాయి. వారిని గుర్తించి చెక్కులు ఇస్తారా? నగదు బ్యాంకులకు అందజేస్తా రా తెలియాల్సి ఉంది. రుణమాఫీకి సంబంధించి రైతు ఖాతాలకు సొమ్ము వేస్తే బ్యాంకులు తమ అప్పుల కింద జమ చేసుకుంటున్నాయని, కాబట్టి చెక్కులు ఇస్తామని ఇటీవల సీఎం కేసీఆర్ వెల్లడిం చిన నేపథ్యంలో ఎలా చేస్తారన్న దానిపై చర్చ జరుగుతోంది. కోడ్ పూర్తయిన తర్వాతే చెక్కుల కింద ఇస్తారన్న ప్రచారమూ ఉంది. -
పెద్ద రైతులకు రేషన్ కట్..!
బడా రైతులకు రేషన్ బంద్ అయ్యింది. తప్పుడు వివరాలతో రేషన్ పొందుతున్న పెద్ద రైతులకు.. రైతు బంధు పథకంతో చెక్ పడింది. రైతుబంధు వివరాలను రేషన్ సర్వర్‌తో అనుసంధానం చేయడంతో పదెకరాల పైన ఉన్న రైతులకు రేషన్ నిలియిపోయింది. సాక్షి, నల్లగొండ : పదెకరాలు, ఆపైన భూమి ఉన్న రైతులు రేషన్‌కు అనర్హులు అయ్యారు. ఇప్పటివరకు తక్కువ భూమి చూపించి.. పలువురు బడా రైతులు తెల్లరేషన్ కార్డులు పొందారు. మరికొందరు భూమి ఉన్నా సేద్యంలో లేదంటూ తప్పుడు ధ్రువీకరణ పత్రాలు చూపించి రేషన్ పొందుతున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతుబంధు పథకానికి.. సాగులోలేని భూములు కూడా సేద్యం చేస్తున్నామంటూ 10 ఎకరాల పైన భూమి ఉన్నవారు ఇప్పటికే రెండు పర్యాయాలు లబ్ధిపొందారు. దీంతో బడారైతులు రేషన్ పొందకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో పౌర సరఫరాల శాఖ రైతుబంధుకు సంబంధించిన వివరాలను తెప్పించి రేషన్ సర్వర్‌కు అనుసంధానం చేసింది. దీంతో పది ఎకరాలు ఉన్నవారి బండారం బయటపడింది. ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్–2013 ప్రకారం 10 ఎకరాలు, ఆపైన ఉన్న రైతులు ఆహార భద్రత కార్డు పొందేందుకు అనర్హులు. దీనిపై వెంటనే కమిషనర్ అకున్ సబర్వాల్ అధికారులతో సమావేశం నిర్వహించి 10 ఎకరాలపైన ఉన్న రైతులకు రేషన్‌ను నిలిపివేయాలని నిర్ణయించారు. ఇలా జిల్లాలో 80 నుంచి 90 వేల కుటుంబాలకు రేషన్ నిలిచిపోయింది. ‘రైతుబంధు’తో గుట్టు రట్టు.. పౌర సరఫరాల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా రేషన్ పొందుతున్న వారి గుట్టు రైతుబంధు పథకంతో రట్టయింది. రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం రైతుబంధు పెట్టి ఎకరాకు రూ.4వేల చొప్పున రెండు పంటలకు ఇచ్చింది. దీంతో ఎవరెవరికి ఎన్ని ఎకరాల భూమి ఉందో లెక్క తేలిపోయింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ రైతుల ఆధార్ నంబర్లను పీడీఎస్ రైస్ ఈపాస్ సర్వర్‌కు అనుసంధానం చేయించారు. దీంతో అనర్హులు దొరికిపోయారు. దీంతో వారికి రేషన్ నిలివేశారు. ఆన్లైన్లో పదెకరాలు ఉన్న రైతులు వేలిముద్రలు వేసిన సందర్భంలో ఇన్వ్యాలిడ్ అని వచ్చేస్తుంది. దీంతో డీలర్లు పదెకరాల భూమి ఉన్నవారికి రేషన్ నిలిపివేశారంటూ చెప్తున్నారు. విచారించాలని డీఎస్‌ఓలకు ఆదేశం జిల్లాలో 10 ఎకరాలపైన ఉన్న రైతులు ఎవరెవరు ఉన్నారో విచారించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ల ద్వారా జిల్లా పౌర సరఫరాల అధికారులకు లిఖితపూర్వక ఆదేశాలు అందాయి. పదెకరాల రైతుల వివరాలను సేకరించి వారికి నిజంగా 10 ఎకరాలు, ఆపైన ఉందా, లేదా విచారించి నివేదికలు పంపాలని వెంటనే అన్ని మండలాల తహసీల్దార్లను ఆదేశించారు. ఇప్పటికే డీఎస్‌ఓలకు లిఖిత పూర్వక లేఖలు అందాయి. 80వేల పైచిలుకు కుటుంబాలకు రేషన్ బంద్ జిల్లా వ్యాప్తంగా 80 వేల పైచిలుకు కుటుంబాలకు రేషన్ సరుకులు ఆగనున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 4,54,019 మంది ఆహారభద్రత పొందుతున్న కుటుంబాలు ఉండగా అందులో 3,46,000 మంది వరకు 5 ఎకరాలలోపు భూమిఉన్న రైతులు ఉన్నారు. అయితే 10 ఎకరాలపైన భూమి ఉన్నవారు 80వేల పైచిలుకే ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లాలో కార్డుదారులు ఇలా.. జిల్లాలో మొత్తం 4,54,019 మంది ఆహారభద్రత కార్డులు కలిగి ఉన్నారు. వారికి సంబంధించి 13,85,787 మంది లబ్ధి పొందుతున్నారు. అయితే ఆ కార్డులకు సంబంధించి ప్రతి నెలా 7513.752 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పంపిణీ చేస్తుండగా, 420 కిలో లీటర్ల కిరోసిన్‌ను అందజేస్తున్నారు. జిల్లాలో 991 రేషన్ షాపుల ద్వారా సరుకులను పంపిణీ చేస్తున్నారు. అర్హులకు ఇబ్బంది లేదు అర్హులకు ఎలాంటి ఇబ్బంది లేదు. పదెకరాల కంటే తక్కువ భూమి ఉన్నవారు ఎక్కడైనా రేషన్ ఆగిపోతే సంబంధిత తహసీల్దార్ల ద్వారా లెటర్ తీసుకురావాలి. అర్హులకు రేషన్ బియ్యం అందే విధంగా చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదెకరాల పైన భూమి ఉన్నవారికి రేషన్ సరుకుల పంపిణీ ఆగిపోయింది. – ఉదయ్‌కుమార్, డీఎస్ఓ, నల్లగొండ -
చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారు
-
స్వయం ప్రకాశం లేకపాయె
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు, కేసీఆర్‌కు నక్కకు, నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు దుర్మార్గపు పాలన పోవాలని ఏపీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. తమను తిడుతూనే తెలంగాణ పథకాలను కాపీ కొడుతున్నారని విమర్శించారు. ఎవరో ఒకరితో పొత్తు లేకుండా బతలకలేరంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలకు ముందు రైతులపై హఠాత్తుగా చంద్రబాబుకు ప్రేమ పుట్టుకొచ్చిందన్నారు. ‘రైతు బంధు వంటి పథకాల ద్వారా కేసీఆర్.. ప్రజల మనస్సు గెల్చుకున్నారని చంద్రబాబు, రాహుల్ గాంధీ, నరేంద్ర మోదీకి అర్థమైంది. దీన్ని అంగీకరించేందుకు వారికి బేషజం, అహంకారం అడ్డొస్తోంది. మనం రైతు బంధు అని పెట్టుకుంటే ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పేరు మార్చి మోదీ కాపీ కొట్టారు. ఫర్వాలేదు. దేశంలో రైతులకు మంచి చేస్తే మంచిదే. చంద్రబాబు నాయుడు తెల్లారిలేస్తే మనల్ని తిడతాడు. కానీ మన పథకాలన్నీ కాపీ కొడతడు. మనం రైతు బంధు పెట్టి రెండేళ్లయితే ఎన్నికలు దగ్గర పడటంతో చంద్రబాబుకు సడన్‌గా రైతులు గుర్తొచ్చారు. అన్నదాత సుఖీభవ పేరుతో రైతు బంధును కాపీ కొట్టిండు మనమిక్కడ కళ్యాణలక్ష్మీ అంటే పసుపు-కుంకుమ అని అక్కడొకటి పెట్టిండు. మనం ఇక్కడ అన్నపూర్ణ అని క్యాంటీన్లు పెడితే అన్నపూర్ణలో పూర్ణ తీసేసి అన్న క్యాంటీన్లు అని అక్కడ పెట్టిండు. అన్ని కాపీలు కొట్టుడే. కుట్రలు, కుతంత్రాలు, ముసుగు రాజకీయాలు, చీకటి దోస్తానాలు మాకు సేతకాదు. వీటన్నింటిపై ఒక్క చంద్రబాబుకు మాత్రమే పేటెంట్ ఉంది. కేసీఆర్ చక్రవర్తా, కాదా అనేది ప్రజలు మొన్ననే తీర్పు ఇచ్చారు. ఒకవేళ కేసీఆర్ చక్రవర్తి అనుకుంటే మొక్కలు నాటించిన అశోక చక్రవర్తి. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయించిన నీరో చక్రవర్తి నువ్వు. నీకు, కేసీఆర్‌కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. కేసీఆర్ సొంతంగా ఒక పార్టీ పెట్టుకుని, ఎవరితో పొత్తు పెట్టుకోకుండా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు. మంది పెట్టిన పార్టీలో దూరి, మామ పెట్టిన పార్టీలో దూరి.. చీమలు కట్టుకున్న పుట్టలో పాము దూరినట్టు మామగారిని వెన్నుపోటు పొడిచి పార్టీని గుంజుకుంటివి. అప్పటి నుంచి ఇప్పటివరకు ఎవరోని తోని పొత్తుపెట్టుకోకుండా బతుకులేకపాయె. స్వయం ప్రకాశం లేకపాయె. మాటలు మాత్రం పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నడు. తెలంగాణ ప్రజల చైతన్యం మొన్న దేశం మొత్తం చూసింది. నాకు విశ్వాసం ఉంది. తెలుగు దేశం పార్టీని ఆంధ్రప్రదేశ్‌లో కూడా ప్రజలు తిప్పికొడతరు. బాబు పోతేనే జాబులు వస్తాయని ఏపీ ప్రజలకు అర్థమైంద’ని కేసీఆర్ అన్నారు. -
రైతుబంధు.. గందరగోళం!
నల్లగొండ అగ్రికల్చర్ : రైతు పెట్టుబడి డబ్బులకు ఇబ్బంది పడొద్దన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం జిల్లాలో గందరగోళంగా మారింది. లెక్కలు అంతా గజిబిజిగా ఉండడంతో ఏమి చేయాలో తెలియక అటు రెవెన్యూ, ఇటు వ్యవసాయశాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాస్థాయిలో జరిగే సమావేశాల్లో మాత్రం అధికారులు కాకి లెక్కలు వేసుకుని సమాధానాలు చెబుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 4,38,154 మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి సాయంకింద రూ.467.19 కోట్ల విలువ చేసే చెక్కులను అందజేసింది. తిరిగి రబీలో కూడా ఎకరానికి రూ.4వేల చొప్పున పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతున్న తరుణంలో శాసనసభ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చింది. దీంతో ఎన్నికల సంఘం పెట్టుబడి సాయాన్ని చెక్కుల రూపంలో కాకుండా రైతుల బ్యాంక్ ఖాతా ల్లో నేరుగా నగదు జమచేయాలని ఆదేశించింది. దీంతో జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు రైతుల వారీగా బ్యాంక్ ఖాతానంబర్లను సేకరించి ఆన్లైన్లో ఎంటర్ చేసే ప్రక్రియను గత ఏడాది సెప్టెంబర్ మాసంనుంచి చేపట్టారు. ఆన్లైన్లో ఖాతాలను న మోదు చేసిన వెంటనే డబ్బులు పడుతాయని చెప్పారు. ఈ ప్రక్రియను ప్రారంభించి ఏడు నెలలు గడుస్తున్నా, ఇప్పటివరకు స గం మంది రైతుల ఖాతాల్లో పెట్టుబడి సాయం పడని పరిస్థితి నె లకొంది. రబీలో పెట్టుబడి సాయం కోసం 4,14,477 మంది రై తుల పాస్‌బుక్కులు ఎలాంటి తిరకాసులు లేకుండా క్లియర్‌గా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వారి నుంచి పాస్‌బుక్కులు, బ్యాంక్‌ఖాతాలను తెప్పించుకునే పనిలో జిల్లా వ్యవసాయశాఖ ఏడు నెలలుగా కసరత్తు చేస్తూనే ఉంది. ఇప్పటివరకు 3,45,925 మంది రైతుల ఖాతాలను ఆన్లైన్లో నమోదు చేశారు. 68,552 మందివి నమోదు చేయాల్సి ఉంది. ఆన్లైన్లో నమో దు చేసిన రైతుల్లో ఇప్పటివరకు కేవలం 2,24,571 మందికి మాత్రమే న గదు జమయ్యాయి. ఇంకా 2,13,583 మంది రైతులు రబీ పెట్టుబడి నగదు కోసం కళ్లుకాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. 23,677మంది రైతుల లెక్క ఎక్కడ? గత ఖరీఫ్‌లో పెట్టుబడి సాయం అందుకున్న రైతుల్లో రబీలో 23,677 మంది పేర్లు లెక్కలనుంచి గల్లంతయ్యాయి. కేవలం పాస్‌పుస్తకాల్లో దొర్లిన తప్పులను, భూములు తక్కువ, ఎక్కువ వాటిని సరిచేయాలని, పేరు మార్పిడి తదితర అంశాలను సరిచేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకున్న పాపానికి వారు నగదు సాయానికి నోచుకోవడం లేదు. దీనికితోడు సరిచేసిన పాస్‌పుస్తకాల కోసం పడిగాపులు కాస్తున్నారు. కొందరి రైతుల పాస్‌పుస్తకాలను సరిచేసిన తహసీల్దార్ డిజిటల్ సంతకం పెట్టినప్పటికీ వారి పేర్లు ధరణి వెబ్సైట్లో చూపడం లేదు. రెవెన్యూ అధికారులు సరిచేసిన పాస్‌పుస్తకాల వివరాల ఆన్లైన్లో, ధరణిలో నమోదు చేయడంతోపాటు వెంటనే వాటికి సంబంధించిన సాఫ్ట్‌కాపీలను రాష్ట్ర వ్యవసాయశాఖకు పంపించడంలో జరిగిన జాప్యంతో వారి పేర్లు ధరణిలో చూపడం లేదు. దీంతో వారందరికీ ప్రస్తుత రబీ పెట్టుబడి సాయం వస్తుందా.. రాదోననే ఆందోళనలో ఉన్నారు. ఎప్పుడు వస్తాయో కూడా చెప్పలేని స్థితిలో అధికారులు జిల్లావ్యాప్తంగా సగం మంది రైతులకు రబీ పెట్టుబడి సాయం జమకావాల్సి ఉంది. అసలు వారికి డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా సమాచారం చెప్పలేని స్థితిలో జిల్లా వ్యవసాయశాఖ అధికారులు ఉన్నారు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా రైతులు ఇబ్బందులు పడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. అన్లైన్లో నమోదు చేయాల్సిన రైతుల వివరాలు కూడా ఎప్పుడు పూర్తి చేస్తారో తెలియని పరిస్థితి. . ట్రెజరీలకు పంపించారు జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు 3,35,749 మంది పేర్లు ట్రెజరీకి పంపించారు. 2,24,571 మందికి మాత్రమే డబ్బులు ఖాతాల్లో పడ్డాయి. మిగతా వారికి రావాల్సి ఉంది. పాస్‌పుస్తకాలు, ఖాతా నంబర్లను ఆన్లైన్లో నమోదు చేసే ప్రక్రియను కొనసాగిస్తున్నాం. ప్రతి రైతుకు రబీ డబ్బులు వస్తాయి. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – జి.శ్రీధర్‌రెడ్డి, జేడీఏ రబీ పెట్టుబడి సాయం అందలేదు మాకు ఎకరం ఇరువై గుంటల భూమి ఉంది. కాని ఇప్పటివరకు రబీ పెట్టుబడి సాయం అందలేదు. ఎందుకు రాలేదో ఎవరూ సమాధానం చెప్పడం లేదు. అధికారులను అడిగితే తప్పక వస్తాయని చెబుతున్నారు. అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావడం లేదు. వెంటనే పెట్టుబడి సాయం డబ్బులు జమ చేయాలి. -బచ్చలకూరి భద్రమ్మ, త్రిపురారం రెండో విడత రైతు బంధు అందలేదు నాకు నాలుగు ఎకరాల భూమి ఉంది. మొదటి విడతలో రైతుబంధు చెక్కు వచ్చింది. రెండో విడత మాత్రం ఇప్పటికీ అందలేదు. ఇప్పటికే రెండు, మూడుసార్లు అధికారులకు జీరాక్స్‌లు ఇచ్చా. ఎప్పుడు అడిగినా వస్తాయిలే అని అంటున్నారు. కొంత భూమి చేర్చాల్సి ఉన్నా అదీ జరగలేదు. – కుప్ప శ్రీకాంత్ రైతు, గుర్రంపోడు ఇంకా పెట్టుబడి డబ్బులు రాలేదు మా నాన్న పేరున రెండున్నర ఎకరాల భూమి ఉంది. అయితే ఒక సర్వేనంబర్‌లో మా నాన్న పేరుతో ఇంకొకరు కూడా ఉండడంతో సరిచేయమని దరఖాస్తు చేసుకున్నాం. ఇప్పటివరకు సరిచేయలేదు. ఖరీఫ్‌లో, రబీలో కూడా పెట్టుబడి సాయం రాలేదు. ఎప్పుడు సరిచేస్తారో, ఎప్పుడు డబ్బులు వస్తాయో ఎవరూ చెప్పడం లేదు. -మాచర్ల పాండు, కుమ్మరిగూడెం, కనగల్ మొదటి విడత లేదు.. రెండో విడత లేదు నాకు చేపూరు గ్రా మ శివారులో మూ డు ఎకరాల భూ మి ఉంది. రెండేళ్ల క్రితమే మ్యూటేషన్ కోసం డ్యాకుమెంటు ఇచ్చా. ఇంతవరకు నాకు పాస్‌పుస్తకం రాలేదు. ముగు ్గరు వీఆర్ఓలు మారడంతో మారినప్పుడల్లా ఆన్లైన్లో మ్యుటేషన్ చేసినా ఇం తవరకు అతీగతీ లేదు. మొదటి విడత, రెండో విడత రైతుబంధు అందలేదు. – చేగొండి లక్ష్మీపతి, రైతు, గుర్రంపోడు పాస్‌పుస్తకం రాలేదు..రైతుబంధు అందలేదు మొదటి విడతకు ముందే మూడు ఎకరాల భూమి కొన్నా. అప్పుడు అమ్మిన రైతు పేరు మీదే డబ్బులు రావడంతో అతనే తీసుకున్నాడు. రెండో విడత అందలేదు. ఆన్లైన్లో ఉన్నా పాస్‌పుస్తకం రాలేదు. పాస్‌పుస్తకం లేక డబ్బులు అందలేదు. -వడ్డగోని గంగాధర్ గౌడ్, రైతు, నడికూడ -
పాస్‌బుక్ కోసం... సెల్ టవర్ ఎక్కిన యువకుడు
సాక్షి, మెదక్ : అధికారుల అలసత్వంపై నిరసన తెలుపుతూ ఓ యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు. ఈ ఘటనతో జిల్లాలోని నర్సాపూర్‌లో బుధవారం కలకలం రేగింది. రేషన్ కార్డు, పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడంతో రైతుబంధు పథకం రాలేదంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తన సమస్యల్ని అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయిందని యువకుడు ఆరోపించాడు. సమస్య పరిష్కారం కాకపోతే తనకు చావే శరణ్యమని అంటున్నాడు. యువకుడిని మండలంలోని ఆత్మకూరు తండాకు చెందిన రవిగా గుర్తించారు. కాగా, సమస్యలు పరిష్కరిస్తామని నర్సాపూర్ ఎస్సై వెంకటరాజు గౌడ్ హామి ఇచ్చినప్పటికీ యువకుడు కిందకి దిగి రావడానికి ససేమిరా ఒప్పుకోవడం లేదని సమాచారం. -
‘రైతుబంధు’ ఒక్కటే సరిపోదు
తెలంగాణ ప్రభుత్వం 2018–19 నుండి రైతులకు ఎకరానికి రూ. 4 వేలు పెట్టుబడి రాయి తీలు రైతుబంధు పేరుతో అమలు చేస్తున్నది. వానా కాలం 4 వేలు, వేసంగి 4 వేలు ప్రతి ఎకరాకు ఇస్తారు. వాస్తవ భూమి హక్కు కలిగి, పట్టా పాస్ పుస్తకం ఉన్న వారికి మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుంది. రాష్ట్ర స్థాయి కమిటీ, జిల్లా స్థాయి కమిటీలు ఈ నిర్వహణా బాధ్యతలు చూస్తాయి. రెవెన్యూ శాఖ నిర్వహించిన సర్వేలో 71.25 లక్షల మంది రైతులు ఉన్నట్లు తేలింది. కానీ, ఇందులో చాలా మందికి భూముల పై పట్టా హక్కులు లేవు. మొత్తం రాష్ట్రంలో ప్రభుత్వం పరిశీలించిన భూమి 2.56 కోట్ల ఎకరాలు కాగా ఇందులో 2.38 కోట్ల ఎకరాలు ఎలాంటి సమస్యలు లేకుండా క్లియర్‌గా ఉన్నాయి. ఇందులో సాగుభూమి 1.43 కోట్ల ఎకరాలు ఉన్నది. 1.43 కోట్ల ఎకరాలకు రుణ రాయితీ యివ్వడానికి 2018–19 బడ్జెట్లో వ్యవసాయ బడ్జెట్ కింద రూ. 12,733 కోట్లు కేటాయించారు. ఈ రాయితీ లేక ముందు 65 వేల కోట్లు కేటాయించారు. 2014 నుండి 2017 మార్చి నాటికి రైతుల రుణమాఫీ కింద రూ.16,630 కోట్లు కేటాయించి రైతుల ఖాతాలలో జమ చేశారు. 2018– 19లో కేటాయించిన వ్యవసాయ బడ్జెట్లో రూ.8,9 81 కోట్లు కేటాయించారు. వాస్తవానికి పాస్ బుక్కులు ఉన్న వారి లెక్కలు తీస్తే 57,24,115 మంది రైతులు ఉన్నారు. భూములు ఉండి పాస్ పుస్తకాలు లేని వారు 14.01 లక్షల మంది ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలే చెప్తున్నాయి. వీరికి పాస్ పుస్తకాలు ఇస్తామని, వారి భూ సమస్యలు పరిష్కరిస్తామని, వీరిని పార్ట్–2లో చేర్చారు. ఎన్నికలు రావడంతో పార్ట్–2 జాబితాలోని రైతుల సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పాస్ పుస్తకాలున్న 57,24,115 మందికి రూ. 5,618.51 కోట్లు వానా కాలం రాయితీ కింద పంపిణీ చేశారు. వేసంగి రాయితీ కొంత మేరకు రైతుల ఖాతాలో జమచేయడంతో ఎన్నికల కమిషన్ అభ్యంతరం తెలిపిన కార ణంగా నిలిపివేశారు. రుణాలు రద్దు చేసినా, పెట్టుబడి రాయితీ యిచ్చినా రైతుల ఆత్మహత్యలు సాగుతూనే ఉన్నాయి. రూ. 34 లక్షల అప్పు కాగానే పేద రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. దీనికి ప్రధానంగా ప్రైవేటు రుణ భారమే కారణం. ప్రస్తుతం రాష్ట్రంలో రూ. 20 వేల కోట్లు ప్రైవేటు రుణాలున్నాయి. 36 శాతం నుండి 50 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రుణమాఫీ చేసినప్పటికీ నేటికీ రూ. 37 వేల కోట్ల రుణాలలో రైతులు కూరుకుపోయి ఉన్నారు. రైతు పెట్టుబడి రాయితీ కొంత లాభించినా పూర్తిగా సమస్యలు పరిష్కరించలేదు. కొంత మంది వాస్తవ సాగుదారులు కాని వారికి వేల కోట్ల లబ్ధి కలిగింది. భూములు సాగు చేసినా, సాగుచేయకున్నా ప్రస్తుతం ప్రభు త్వం పాస్ పుస్తకాలున్న వారికి రాయితీలిస్తున్నారు. రియల్ ఎస్టేట్ కింద భూములు కొనుగోలు చేసినవారికి కూడా రాయితీలు ఇస్తున్నారు. గ్రామ, జిల్లా, రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీలు ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేసే అవకాశాలున్నప్పటికీ వారు పెద్దగా పట్టించుకోవడం లేదు. నేడు రైతుల ఉత్పత్తులకు ఉత్పత్తి ధర రావడం లేదు. ప్రధాన మంత్రి మోదీ ప్రకటించిన కనీస మద్దతు ధరలు కూడా ఉత్పత్తి ఖర్చులపై 50 శాతాన్ని కలిపి నిర్ణయించినవి కావు. ఉపకరణాల ఖర్చు, కుటుంబ ఖర్చులు మాత్రమే లెక్కలోకి తీసుకొని ఆ మొత్తానికి 50 శాతం కలిపి ధర ప్రకటించారు. ఆ విధంగా ధాన్యానికి క్వింటాలుకు రూ. 1166లు వ్యయం కాగా దానికి 50 శాతం కలిపి క్వింటాల్‌కు రూ. 1770 రూపాయలు ధర నిర్ణయించారు. వాస్తవానికి క్వింటాల్ వ్యయం రాష్ట్ర ప్రభుత్వ గణాంకాల ప్రకారం రూ. 2000లు అవుతుంది. 50 శాతం కలిపి రూ. 3 వేలుగా ధర నిర్ణయించాలి. భూమిపై కౌలు, వడ్డీ, యంత్రాల అరుగుదల తదితర అంశాల వ్యయాన్ని పరిగణలోకి తీసుకోవాలి. అందువల్ల ప్రధాని నిర్ణయించిన ధర ఉత్పత్తి వ్యయంపై 50 శాతానికి తక్కువగా ఉన్నది. ప్రధాని ప్రకటించిన ధరలు కూడా అమలు కావడం లేదు. క్వింటాల్‌కు రూ.1300–1400 లు మాత్రమే మార్కెట్లో వ్యాపారులు చెల్లిస్తున్నారు. ప్రధాని ప్రకటించిన ధరలు రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయాలని కేంద్రం చెబుతున్నది. కేంద్రం ప్రకటించింది కాబట్టి మార్కెట్లో వచ్చే లోటును కేంద్రమే రాష్ట్రాలకు ఇవ్వాలని రాష్ట్రాలు చెప్తున్నాయి. ధరల అమలు బాధ్యతను ఏ ప్రభుత్వం తీసుకోకపోవడం వల్ల రైతులు తక్కువ ధరలకు అమ్ముకుంటున్నారు. ఈ విధంగా నష్టపోయిన రైతుకు ఎకరా రూ. 4 వేల రైతుబంధు రాయితీ కొంత ఉపశమనం కలిగించవచ్చునేమో కానీ, ధరల సమస్యను పరిష్కరించదు. సారంపల్లి మల్లారెడ్డి వ్యాసకర్త అఖిల భారత కిసాన్ సభ ఉపాధ్యక్షులు, 94900 98666 -
రైతు సమితులకు గౌరవ వేతనం
సాక్షి, హైదరాబాద్ : రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ వేతనంపై రాష్ట్ర వ్యవసాయశాఖ కసరత్తు ప్రారంభించింది. ఎన్నికల సందర్భంగా సభ్యులకు వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన నేపథ్యంలో ఆ విషయంపై అధికారులు దృష్టిసారించారు. వారికి వేతనం, విధులు వంటి వాటిపై విస్తృతస్థాయిలో మార్గదర్శకాలు తయారు చేయాలని యోచిస్తున్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు దక్కేలా చూడటం, మార్కెట్లో సమస్యలు రాకుండా రైతులను సమన్వయపరచడం, రైతుబంధు, బీమా అమలు తదితర అంశాల్లో సమితులే కీలక పాత్ర వహించాలని సర్కారు స్పష్టంచేసింది. రైతులకు అమలు చేసే ప్రభుత్వ పథకాలకు సంబంధించి సమితులకు విస్తృతమైన అధికారాలు కల్పించేలా కొత్త మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశముందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. రానున్న రోజుల్లో పంట కాలనీల ఏర్పాటులోనూ, ఆహారశుద్ధి పరిశ్రమలను నెలకొల్పడంలోనూ రైతు సమన్వయ సమితి సభ్యులను భాగస్వాములను చేసే అవకాశముంది. వెయ్యి నుంచి రూ.ఐదు వేల వరకు వేతనం... రైతులను సంఘటిత పరచి వారికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిల్లో సమితులను ఏర్పాటు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా వివిధ స్థాయిల్లో మొత్తం 1.61 లక్షల మంది సమితి సభ్యులున్నారు. గ్రామస్థాయిలో 15 మంది, మండల, జిల్లా స్థాయిల్లో 24 మంది సభ్యుల వంతున సమితులు ఏర్పడ్డాయి. రాష్ట్రస్థాయిలో 42 మందితో ఏర్పాటు చేయాల్సి ఉంది. గతేడాది రైతుబంధు, రైతుబీమా అమలులో రైతు సమితి సభ్యులు కీలకపాత్ర పోషించారు. ప్రభుత్వానికి రైతులకు మధ్య వారధిగా వ్యవహరించారు. వారికి ఎటువంటి గౌరవ వేతనం ఇవ్వడంలేదు. దీంతో ఈ ఏడాది నుంచి వారికి వేతనం ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. వచ్చే ఆర్థిక ఏడాది నుంచి వేతనాలిచ్చే అవకాశమున్నట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. ఎంతివ్వాలన్న దానిపై అధికారులు తర్జనభర్జన పడుతున్నారు. గ్రామ సమితి సభ్యులకు రూ.వెయ్యి, సమన్వయకర్తకు రూ.1,500 ఇస్తే ఎలా ఉంటుందని చర్చిస్తున్నారు. ఇక మండల సమితి సభ్యునికి రూ. 1,500, సమన్వయకర్తకు రూ. 2 వేలుపై కసరత్తు చేస్తున్నారు. ఇక జిల్లా సమన్వయ సమితి సభ్యునికి రూ. 2,500, జిల్లా సమన్వయకర్తకు రూ. 5 వేలుపై చర్చిస్తున్నారు. రాష్ట్రస్థాయి సభ్యునికి రూ. 5 వేలు, చైర్మన్‌కు క్యాబినెట్ హోదా ఇస్తున్నందున ఆ మేరకు జీతభత్యాలుంటాయి. ప్రభుత్వ పెద్దలతో వీటిపై చర్చించాల్సి ఉందని అధికారులు అంటున్నారు. వారికి గౌరవ వేతనాలు ఇవ్వాలంటే ఏడాదికి రూ. 200 కోట్లు ఖర్చయ్యే అవకాశముంది. అలాగే మండల, జిల్లా సమన్వయకర్తలకు కార్యాలయాలు కేటాయించే ఆలోచనా ఉంది. జిల్లా సమన్వయకర్తకు వాహన సౌకర్యం కల్పించనున్నట్లు సమాచారం. రాష్ట్ర రైతు సమితిలో వ్యవసాయ నిపుణులు... రాష్ట్ర రైతు సమితిని సర్కారు ఇప్పటికీ నియమించలేదు. 42 మందితో కూడిన రాష్ట్ర సమితిలో కొందరు వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తలను నియమిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర రైతు సమితిలో సలహాలు సూచనలు ఇచ్చే వ్యవసాయ నిపుణులు, మేధావులు అవసరమనేది సర్కారు యోచన. అందువల్ల రాష్ట్ర సమితిలో జాతీయస్థాయి వ్యవసాయ నిపుణులను నియమించుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రస్థాయిలో ఉన్న వ్యవసాయ నిపుణులు, శాస్త్రవేత్తల పేర్లను కూడా పరిశీలిస్తున్నారు. ఇక రాష్ట్రరైతు సమన్వయ సమితి కార్పొరేషన్ హోదా కలిగి ఉంది. దానికి రూ. 500 కోట్ల నిధిని కేటాయించనున్నారు. -
రైతన్నలు గెలిచేదెలా?
ఈ దేశంలో రైతు జీవితం దుర్భరం. 1995 నుంచి రుణభారంతో, అవమానభారంతో రైతులు ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. వ్యవస్థీకృతం కాని వ్యవసాయరంగంలో ఎంత సంక్షోభం నెలకొన్నా ఉద్యమాలు రగలవు. రైతులు ప్రదర్శన చేశారంటే వారిలో సహనం పూర్తిగా నశించిందని అనుకోవాలి. కొన్ని మాసాలుగా దేశంలో రైతులు నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు. పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తింటున్నారు. మహారాష్ట్రలో వేలాదిమంది రైతులు 160 కిలోమీటర్ల దూరం నడుచుకుంటూ ముంబయ్ చేరుకొని నిరసన ప్రదర్శన చేశారు. తమిళనాడు రైతులు రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నదనే వాస్తవాన్ని ప్రభుత్వాల దృష్టికి తెచ్చేందుకు మెడలో పుర్రెల దండలు వేసుకొని, నోళ్ళతో సజీవంగా ఉన్న ఎలుకలను పట్టుకొని వినూ త్నంగా ప్రదర్శన చేశారు. వైద్యులూ, లాయర్లూ, టీచర్లూ, వివిధ రంగా లకు చెందిన యువతీయువకులు భోజనాలూ, నీళ్ళూ సరఫరా చేయడం ద్వారా ఢిల్లీ వీధులలో ఊరేగింపు జరిపిన వేలాదిమంది రైతులకు సంఘీభావం ప్రకటించారు. రుణాలు మాఫ్ చేయాలనీ, కనీస మద్దతు ధర (మినిమమ్ సపోర్ట్ ప్రైస్–ఎంఎస్పీ)ను న్యాయంగా నిర్ణయించాలనీ, పెట్టుబడికి సాయం చేయాలనీ వారు ఉద్ఘోషించారు. 2019 ఎన్నికలలో గెలుపొందాలంటే రైతులను శాంతింపజేయడం అత్యవసరమని ప్రధాని నరేంద్రమోదీకీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాకీ స్పష్టంగా తెలుసు. రైతులకు ఏ రకమైన సహాయం చేయాలన్నా లక్షల కోట్ల రూపాయలు కావాలి. అందుకే రిజర్వుబ్యాంకు నుంచి నిధులు సమీకరించాలని ఎన్డీఏ ప్రభుత్వం కొంతకాలంగా ప్రయత్నిస్తున్నది. కేంద్రానికీ, ఆర్బీఐకీ మధ్య వివాదం తలెత్తడానికి ఇదే ప్రధాన కారణం. తమకు నిధుల నిల్వలు ఉండాలనీ, ప్రభుత్వానికి ఇవ్వలేమనీ ఆర్బీఐ గవర్నర్లు వాదిస్తున్నారు. అంతలేసి నిధులు ఆర్బీఐలో మూలుగుతూ ఉండటం ఎందుకనీ, వాటిని సర్క్యులేషన్లో పెట్టాలనీ, అభివృద్ధికోసం ఖర్చు చేయాలనీ (సంక్షేమం అనడం లేదు) ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నొక్కి చెబుతున్నారు. ఈ వాదనతో వేగలేకనే ఆర్థికవేత్త ఊర్జిత్పటేల్ ఆర్బీఐ గవర్నర్ పదవి నుంచి తప్పుకున్నారు. ఆయన స్థానంలో వచ్చిన ఐఏఎస్ అధికారి శక్తికాంతదాస్ ఎంతకాలం పదవిలో ఉంటారో తెలియదు. ఆర్బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని రఘురాంరాజన్ వంటి ఆర్థికవేత్తలూ, మాజీ గవర్నర్లూ ప్రబోధిస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతకీ తేలడం లేదు. సార్వత్రిక ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. మోదీ ప్రభుత్వంపైన ఒత్తిడి పెరుగుతోంది. అందుకే మాజీ గవర్నర్ బిమల్‌జలాన్ నాయకత్వంలో ఒక కమిటీని నియమించారు. కనీస నిల్వలు ఏ మేరకు ఉంటే ఆర్బీఐకి ఇబ్బంది ఉండదో నిర్ణయించ వలసిందిగా ఈ కమిటీని ప్రభుత్వం కోరింది. నయానో, భయానో ఆర్బీఐ నుంచి నిధులు సేకరించినప్పటికీ వాటిని రైతులకు ఏ రూపంలో, ఏ పథకం కింద అందజేయాలో మోదీ ఇంకా నిర్ణయించుకోలేదు. ఆర్థికంగా శక్తికి మించిన భారంగా కాకుండా, రాజకీయంగా ఆకర్షణీయంగా ఉండే పథకం కోసం అన్వేషణ కొంతకాలంగా సాగుతున్నది. ఆర్థిక సంస్కరణలను విశ్వసించే ప్రవీణులు రైతుల రుణాలను మాఫ్ చేయడాన్ని ఆమోదించరు. వైఎస్ రాజ శేఖరరెడ్డి ఒత్తిడి చేయడం వల్ల 2004లో ఆంధ్రప్రదేశ్‌లో రైతు రుణ మాఫీకి నాటి ప్రధాని మన్మోహన్సింగ్ కష్టం మీద ఒప్పుకున్నారు. 2008లో యూపీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రూ. 77 వేల కోట్ల మేరకు రైతుల రుణాలు మాఫ్ చేసింది. 2014 ఎన్నికల ప్రచారంలో రైతులకు అరచేతిలో స్వర్గం చూపించిన మోదీ ఆచరణలో చేయవలసినంత చేయలేకపోయారు. 22 పంటలకు పెట్టుబడిపైన ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర ప్రకటించానంటూ శని వారంనాడు ఉత్తరప్రదేశ్ ఘాజీబాద్ బహిరంగసభలో మోదీ చెప్పారు. కానీ కనీస మద్దతు ధర నిర్ణయించడంలో డాక్టర్ స్వామినాధన్ సూచించిన పద్ధతిని అనుసరించలేదు. పెట్టుబడి వ్యయం అంటే కేవలం విత్తనాలూ, ఎరువులూ, క్రిమిసంహారకాల ఖర్చు మాత్రమే కాదు. ఆ ఖర్చుతోపాటు పొలంలో పని చేసే వ్యక్తులందరి వార్షిక వేతనాలనూ, పొలం అద్దెకు (కౌలుకు) ఇస్తే సాలీనా ఎంత ఆదాయం వస్తుందో ఆ మొత్తాన్నీ, పంట బీమాకోసం చెల్లించవలసిన మొత్తాన్నీ కూడితే వచ్చే మొత్తానికి ఒకటిన్నర రెట్లు కనీస మద్దతు ధర నిర్ణయించాలని స్వామినాధన్ చెప్పారు. అది జరగలేదు. కేసీఆర్ మోడల్ రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీ పరాజయానికి ప్రధాన కారణం రెండు లక్షల మేరకు రుణం మాఫ్ చేస్తామంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ చేసిన విస్తృత ప్రచారాన్ని రైతులు విశ్వసించడమే. అధికారంలోకి వచ్చిన పది రోజులలో రుణాలు మాఫ్ చేస్తానంటూ రాహుల్ వాగ్దానం చేశారు. అన్నట్టుగానే మూడు రాష్ట్రాలలో కొత్త ముఖ్యమంత్రులు కమల్‌నా«ద్, భూపేశ్ బఘేల, అశోక్ గహ్లోత్‌లు రుణాలు మాఫ్ చేస్తున్నట్టు ప్రకటించారు. రైతులను సుముఖం చేసుకోవడం ఎన్డీఏకి అత్యవసరం. ఏమి చేయాలో పాలుపోవడం లేదు. రుణమాఫీ అమలు చేస్తామని చెప్పాలా? తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు (కేసీఆర్) చేసినట్టు పెట్టుబడి సాయం అందజేయాలా? స్వామినాధన్ చెప్పినట్టు రైతు పెట్టుబడి పోగా యాభై శాతం లాభం మిగిలే విధంగా మద్దతు ధర నిర్ణయించి, మద్దతు ధరకూ, మార్కెట్ ధరకూ ఉన్న వ్యత్యాసాన్ని కేంద్రం చెల్లించాలా? కేంద్ర రాష్ట్రాలు కలసి భర్తీ చేయాలా? రకరకాల ఆలోచనలతో సతమతం అవుతున్న మోదీని కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ యాత్రలో భాగంగా ఢిల్లీ వెళ్ళినప్పుడు కలుసుకున్నారు. నాలుగున్నరేళ్ళు అధికారంలో ఉన్న తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేకపోగా అంత భారీ మెజారిటీలతో అన్ని సీట్లు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలవడానికి దోహదం చేసిన అంశాలు ఏమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రధాని సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ, అన్ని పార్టీల నాయకులకూ ఉండటం సహజం. బుధవారం మధ్యాహ్నం 4 గంటల నుంచి 5 వరకూ మోదీతో కేసీఆర్ సమావేశమైనారు. ఇతర విషయాలతో పాటు రైతుబంధు, రైతుబీమా పథకాల వివరాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ చెప్పింది ఆలకించిన వెంటనే మోదీ రంగంలో దిగారు. అదే రోజు రాత్రి పార్టీ అధ్యక్షుడు అమిత్‌షా, ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ, వ్యవసాయమంత్రి రాధామోహన్‌సింగ్‌లను పిలిపించుకొని సుదీర్ఘ సమాలోచన చేశారు. మర్నాడు ప్రధాని కార్యాలయం (పీఎంవో) సంబంధిత శాఖల అధికారులను సమ న్వయం చేసి అభిప్రాయాలు సేకరించింది. కసరత్తు జరుగుతోంది. వాగ్దానం చేయగానే సరిపోదు రుణమాఫీ ప్రకటించడం సులువే. అమలు కష్టం. తెలంగాణలో వాయిదాలలో రుణాలు ప్రభుత్వం తీర్చింది. ఒకేసారి మాఫ్ చేస్తే బాగుండేదని రైతుల అభిప్రాయం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలో అంత మొత్తం సిద్ధంగా ఉండదు. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితి అన్యాయం. 2014 జూన్8న చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు రైతులపైన ఉన్న రుణభారం రూ. 87,612 కోట్లు. అంత భారీ రుణం తీర్చే స్థోమత కొత్త రాష్ట్రానికి ఉండదనే ఉద్దేశంతో రుణమాఫీ వాగ్దానం చేయడానికి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి సంకోచించారు. చంద్రబాబు నిస్సంకోచంగా వాగ్దానం చేసి గెలిచాక ప్రభుత్వం చెల్లించవలసిన మొత్తాన్ని తగ్గించడానికి అనేక అడ్డదారులు తొక్కవలసి వచ్చింది. అర్హతపైనా, చెల్లింపులపైనా పరిమితులు విధించి దాన్ని రూ. 24 వేల కోట్లకు కుదించారు. అంటే, వాగ్దానం చేసిన మొత్తంలో నాలు గింట ఒక వంతుకు తగ్గించారు. అది కూడా వాయిదాలలో చెల్లిస్తామని చెప్పారు. ఇంతవరకూ మూడు విడతలలో చెల్లించిన మొత్తం రూ. 15,147 కోట్లు మాత్రమేనని చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రం వెల్లడించింది. ఈ సంవత్సరం వాయిదా ఇంతవరకూ చెల్లించలేదు. కొత్తగా కాంగ్రెస్ పాలనలోకి వచ్చిన మూడు హిందీ రాష్ట్రాలలో కూడా రైతుల రుణాలు మాఫ్ చేయాలంటే ఖజానాలో డబ్బు లేదు. బయటి నుంచి అప్పు తీసుకొని తీర్చవలసిందే. ఉదాహరణకు, రాజస్థాన్‌లో 2018–19 బడ్జెట్ వ్యయం మొత్తం రూ. 1,07, 865 కోట్లు. అందులో 70 శాతం నిధులు వసుంధరే రాజే ప్రభుత్వం ఖర్చు చేసింది. రైతుల రుణాలు మొత్తం రూ. 18 వేల కోట్లు. ఈ మొత్తం రుణాల మాఫీకి కేటాయిస్తే రాష్ట్ర సిబ్బందికి జీతాలు చెల్లించడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు ఉండవు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లోనూ ఇదే పరిస్థితి. ఆర్థిక సంవత్సరం ఆరంభమైన తర్వాత ఏడు మాసాలలోనే నాలుగింట మూడు వంతుల బడ్జెట్ బీజేపీ ప్రభుత్వాలు ఖర్చు చేశాయి. అందుకే నిష్క్ర మించేముందు బీజేపీ ప్రభుత్వాలు ఖజానా ఖాళీ చేశాయంటూ కమల్‌నాథ్, గహ్లోత్ ఆరోపించారు. కేరళ ప్రయోగం రుణమాఫీకి మోదీ సుముఖంగా లేరని ఉత్తరప్రదేశ్ పర్యటనలో ఆయన కాంగ్రెస్‌పైన చేసిన విమర్శ స్పష్టం చేస్తున్నది. కాంగ్రెస్ రుణ మాఫీ పేరుతో రైతులకు లాలీపాప్‌లు ఇచ్చి మోసం చేస్తున్నదనీ, అబద్ధాలు చెబుతున్నదనీ మోదీ ధ్వజమెత్తారు. ఏదో ఒక రూపంలో రైతులకు సాయం చేయవలసిన అవసరం మాత్రం ఉంది. 2006 కేరళ రైతుకు నరకం చూపించిన సంవత్సరం. కేరళలో వాణిజ్య పంటలు అధికం. రబ్బర్, మిరియం పండించి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఆ సంవత్సరం అంతర్జాతీయ విపణిలో ఈ రెండు పంటల ధరలు దారుణంగా పడిపోయాయి. రైతులపైన అప్పుల భారం పెరిగింది. దాదాపు 1500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరణించిన రైతుల భార్యలతో ఢిల్లీలో జరిగిన ఊరేగింపునకు ప్రఖ్యాత రచయిత అరుంధతీరాయ్ నాయకత్వం వహించారు. అప్పుడే యూడీఎఫ్ ప్రభుత్వం నిష్క్రమించి అచ్యుతానందన్ నాయకత్వంలో ఎల్డీఎఫ్ సర్కార్ ప్రవేశించింది. వామపక్ష ఆర్థికవేత్త ప్రభాత్ పట్నాయక్‌ను ఆయన కేరళ ప్రణాళికా సంఘం ఉపా ధ్యక్షుడిగా నియమించి రైతు సంక్షోభాన్ని పరిష్కరించే బాధ్యత అప్పగించారు. మన రాష్ట్రాలలో వలె కాకుండా కేరళలో సహకార బ్యాంకుల వ్యవస్థ సుస్థిరంగా ఉంది. కేరళ ప్రభుత్వం వ్యవసాయ రుణాల విమోచన కమిషన్‌ను నియ మించింది. రైతు ప్రతినిధులూ, వ్యవసాయరంగ నిపుణులూ, సామాజిక కార్య కర్తలూ, రాజకీయ నాయకులూ కలసి బృందాలుగా ఏర్పడి గ్రామాలలో పర్యటించి, రుణగ్రస్తులైన రైతులతో, వారికి రుణాలు ఇచ్చిన సహకార బ్యాంకుల అధికారులతో సమాలోచనలు చేసి ఏ మేరకు మాఫ్ చేయాలో అక్కడికక్కడే నిర్ణయించేవారు. సహకార బ్యాంకు సిబ్బంది రైతుల ఇళ్ళకు వెళ్ళి వడ్డీ వ్యాపారులలాగా అవమానించరు. బృంద సభ్యులు రైతులకు అండగా ఉంటామంటూ భరోసా ఇచ్చారు. ఈ చొరవ ఫలితంగా బలవన్మరణాలు క్రమేపీ తగ్గుముఖం పట్టాయి. తెలంగాణ అమలు చేస్తున్న పథకం చూసి జార్ఖండ్ ప్రభుత్వం కూడా రైతుబంధును పోలిన పథకం డిసెంబర్ 21న ప్రవేశపెట్టింది. ఇటువంటి పథకం ప్రవేశపెట్టిన తొలి బీజేపీ పాలిత రాష్ట్రం ఇది. ఆ మర్నాడు ఒడిశా ప్రభుత్వం రైతుబంధులో స్వల్ప మార్పులు చేసి కొత్త పథకం ప్రకటించింది. రైతుబంధు పథకం కౌలు రైతులకు వర్తించడం లేదు. భూమి ఎవరి పేరున ఉంటే వారి పేరనే చెక్కు ఇస్తున్నారు. భూమిపైన పరిమితి లేకుండా ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎనిమిది వేల చొప్పున చెల్లిస్తున్నారు. రుణభారంతో వేగలేక ఆత్మహత్య చేసుకుంటున్నవారిలో దాదాపు 75 శాతం కౌలు రైతులే. అటువంటి రైతులు తెలంగాణలో 15 లక్షల మంది ఉంటారని అంచనా. భూమి యజమానికీ, కౌలురైతుకీ మధ్య ప్రభుత్వం ఒక వారధిగా ఉంటూ యాజ మాన్య సమస్య ఉత్పన్నం కాకుండా, యజమానికి అభద్రతాభావం లేకుండా కౌలురైతుకు బ్యాంకు రుణాలు అందేవిధంగా, రైతుబంధు వంటి పథకం వర్తించే విధంగా ఏదో ఒక మార్గాన్ని కనిపెట్టవలసిన బాధ్యత ఉన్నది. రైతు బంధు నమూనాను అమలు చేయాలని మోదీ తలపెట్టిన ట్లయితే ఈ అంశాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటే నిజంగా రుణగ్రస్తులైనవారిని ఆదుకున్నట్టు అవు తుంది. పంట దిగుబడికి గిట్టుబాటు ధర చెల్లించడంతో పాటు ప్రాసెసింగ్ వ్యవస్థనూ, మార్కెటింగ్ సదుపాయాలనూ కల్పించగలిగితే రైతులు గౌరవ ప్రదంగా జీవించే పరిస్థితులు ఏర్పడతాయి. త్రికాలమ్ కె. రామచంద్రమూర్తి -
సంక్షేమం కొత్త పుంతలు!
సాక్షి, హైదరాబాద్: ‘ఆదాయం పెంచాలి.. పేదలకు పంచాలి’అనే నినాదంతో సర్కారు నడుస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు చెబుతుంటారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు ఈ ఏడాది ఇలాగే కొనసాగాయి. కంటివెలుగు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో సంక్షేమం ఈ ఏడాది కొత్త పుంతలు తొక్కింది. ప్రతిష్టాత్మక ఎయిమ్స్ మంజూరైంది. కాళేశ్వరం ప్రాజెక్టు పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇతర ప్రాజెక్టుల పరిధిలో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. ఇవన్నీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు సానుకూలంగా మారాయి. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వినూత్న పథకాలపై రౌండప్ మీకోసం. పెళ్లికి లక్షా నూట పదహార్లు.. అడబిడ్డ పెళ్లి చేయాలంటే భారంగా భావించే పేదలకు అండగా ఉండేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ను ప్రవేశపెట్టింది. 2014లో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు అమలైన ఈ పథకాన్ని ఆ తర్వాత బీసీలకు, అగ్రవర్ణాల్లోని పేదలకూ వర్తింపజేసింది. పథకం మొదలైన కొత్తలో రూ.51 వేలుగా ఉన్న సాయాన్ని గతేడాది రూ.75,116 వేలకు పెంచింది. ఈ ఏడాదిలో దీన్ని రూ.1,00,116కు పెంచింది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద ఈ ఏడాది 1,21,793 మందికి సాయం అందింది. ఈ రెండు పథకాలతో లబ్ధిపొందిన వారిలో ఎస్సీలు 18,626, ఎస్టీలు 12,105, బీసీలు 62,453, ఈబీసీలు 6,369, మైనార్టీలు 22,240 మంది ఉన్నారు. అన్నదాతకు బీమా.. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడుతుంది. ఇలాంటి దుస్థితిని మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకాన్ని ప్రవేశపెట్టింది. వ్యవసాయ కుటుంబంలోని పెద్ద చనిపోతే ఆ కుటుంబానికి రూ.5 లక్షలు ఇవ్వాలని నిర్ణయించింది. ఎల్ఐసీతో ఒప్పందం చేసుకుని ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆగస్టు 15న ఈ పథకం ప్రారంభమైంది. పట్టాదారుగా నమోదై, 60 ఏళ్లలోపు ఉన్న ప్రతి రైతుకు ఈ పథకం వర్తిస్తుంది. ఒక్కో రైతు పేరుమీద రూ.2,271 చొప్పున రూ.650 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసీకి ఏడాది ప్రీమియం చెల్లించింది. రాష్ట్రంలో 60 ఏళ్లలోపు వయసున్న 28.3 లక్షల మంది ఈ పథకం కింద నమోదయ్యారు. రైతు బీమా అమల్లోకి వచ్చినప్పటి నుంచి దురదృష్టవశాత్తు 5 వేలకు పైగా రైతులు చనిపోయారు. వీరికి ఎల్ఐసీ రూ.230 కోట్లు విడుదల చేసింది. తెలంగాణకు ఎయిమ్స్.. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)ను మంజూరు చేస్తూ కేంద్రం ఈ ఏడాది నిర్ణయం తీసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్‌లో ఎయిమ్స్ ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.1,028 కోట్లు, ఎయిమ్స్ నిర్వహణలో కీలకమైన డైరెక్టర్ పోస్టును మంజూరు చేసింది. ఎయిమ్స్ మొదటి దశ పనులను 10 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించింది. మూడు విడతల్లో పూర్తిస్థాయిలో ఎయిమ్స్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. 2019–20 విద్యా సంవత్సరంలో ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ కోర్సులు ప్రారంభించేలా నోటిఫికేషన్ జారీ చేసింది. రైతు బంధు.. రైతులకు పెట్టుబడి సాయమందించే విషయంలో తెలంగాణ ప్రభుత్వం వినూత్న నిర్ణయం తీసుకుంది. ‘రైతు బంధు’పేరిట రైతులకు నగదు ఇచ్చే పథకానికి శ్రీకారం చుట్టింది. 2018 ఖరీఫ్ నుంచి అమల్లోకి వచ్చింది. రబీలోనూ విజయవంతంగా అమలు చేశారు. రైతుబంధు పథకం అమలుకు ముందుగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టింది. పట్టాదారు పాసు పుస్తకాల ఆధారంగా సీజనుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పంపిణీ చేయాలని నిర్ణయించింది. వర్షాకాలం సీజన్లో 1.4 కోట్ల ఎకరాలకు పెట్టుబడి సాయం ఇచ్చింది. చిన్న, సన్నకారు, పెద్ద రైతులు అనే తేడా లేకుండా వ్యవసాయ భూమి ఉన్న అందరికీ రైతుబంధు సాయం అందింది. రాష్ట్రంలో 58.16 లక్షల పట్టాదారులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 58.81 లక్షల చెక్కులను ముద్రించింది. 51.4 లక్షల చెక్కులను రైతులకు పంపిణీ చేశారు. పంపిణీ చేసిన చెక్కుల విలువ మొత్తం రూ.5,437 కోట్లు. రబీలో 44 లక్షల మందికి రూ.4,500 కోట్ల పెట్టుబడి సొమ్మును బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేశారు. నీళ్లు పారాయి.. సాగునీటి రంగంలో ఈ ఏడాది గణనీయ పురోగతి కనిపించింది. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రారంభించిన పనుల ఫలాలు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరందేలా ప్రభుత్వం కృషి చేసింది. మిషన్ కాకతీయ కింద నాలుగు విడతల్లో పునరుద్ధరించిన చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఈ ఏడాది నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ ప్రాజెక్టులు నిండాయి. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులు పూర్తి కావడంతో ఏడు లక్షల ఎకరాలకు కొత్త నీరు అందించింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ మధ్యతరహా ప్రాజెక్టుల కింద గరిష్ట ఆయకట్టుకు నీరు చేరింది. కాళేశ్వరం పనులు మరింత వేగవంతమయ్యాయి. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇప్పటి వరకు పూర్తయిన పనులతో కొత్త ఆయకట్టుకు నీరు చేరింది. కోటి కళ్ల కొత్త చూపు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ‘కంటి వెలుగు’పథకానికి శ్రీకారం చుట్టింది. మారుతున్న జీవనశైలితో కంటి జబ్బుల బాధితుల సంఖ్య పెరుగుతోంది. సీఎం కేసీఆర్ సొంత నియోజకవర్గం గజ్వేల్‌లోని ఎర్రవల్లిలో కంటి పరీక్షల నిర్వహణ కార్యక్రమం ఈ పథకానికి స్ఫూర్తిగా నిలిచింది. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేయడం, శస్త్ర చికిత్సలు చేయించడం ఈ పథకం ఉద్దేశం. ఆగస్టు 15 నుంచి కంటి వెలుగు కార్యక్రమం మొదలైంది. వైద్య, ఆరోగ్య శాఖ నివేదిక ప్రకారం కోటి మందికిపైగా కంటి పరీక్షలు చేయించుకున్నారు. వీరిలో 45.15 లక్షల మంది పురుషులు, 54.85 లక్షల మంది మహిళలు ఉన్నారు. కంటి పరీక్షలు చేయించుకున్న కోటి మందిలో 36.61 లక్షల మందికి దృష్టి లోపాలు ఉన్నట్లుగా వైద్యులు నిర్ధారించారు. వీరిలో 16.66 లక్షల మందికి అక్కడికక్కడే ఉచితంగా సాధారణ కళ్లద్దాలు(రీడింగ్) పంపిణీ చేశారు. దృష్టి లోపం ఎక్కువగా ఉన్న మరో 12.95 లక్షల మందికి ప్రత్యేకంగా అద్దాలను తయారు చేసి ఇవ్వాలని నిర్ణయించారు. మరోవైపు 4.47 లక్షల మందికి కంటి శస్త్ర చికిత్సలు చేయాలని వైద్యులు నిర్ధారించారు. త్వరలోనే శస్త్ర చికిత్సలు మొదలుకానున్నాయి. కొత్తగా 7 లక్షల ఎకరాలకు.. కొత్తగా చేపట్టిన ప్రాజెక్టుల కంటే నిర్మాణంలో ఉన్న వాటిని పూర్తి చేసేందుకు ప్రభుత్వం గట్టిగా కృషి చేసింది. సాగునీటి మంత్రిగా హరీశ్‌రావు పట్టుదల తోడవడంతో మంచి ఫలితాలొచ్చాయి. కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు నిధులు కేటాయించడంతో కొత్తగా ఏడు లక్షల ఎకరాలకు నీరు చేరింది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని కాలువ ఆధునీకరణతో హుజూరాబాద్, పెద్దపల్లి, పరకాల, వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లోని పంటలకు, చెరువులకు నీరు అందింది. ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భూసేకరణ అడ్డంకులతో పదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 57 చెరువు పనులు ఈ ఏడాది పూర్తయ్యాయి. దీంతో 82 వేల ఎకరాల కొత్త ఆయకట్టు సాధించారు. ప్రతిష్టాత్మక కాళేశ్వరం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు 75 శాతం పూర్తయ్యాయి. 2019 జూన్ నాటికి మొత్తం పనులను పూర్తి చే సి నీటిని తరలించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేడిగడ్డ నుంచి కనిష్టంగా 90 టీఎంసీల నీటిని ఎల్లంపల్లికి... అక్కడి నుంచి మిడ్‌మానేరు వరకు తరలించేలా పనులు కొనసాగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో ఇప్పటికే రూ.24 వేల కోట్లు రుణాల రూపంలో ఖర్చు చేశారు. మరో ఎనిమిది వేల కోట్ల రుణాలతో తుపాకులగూడెం, సీతారామ, వరదకాల్వ పనులు చేశారు. రుణాల ద్వారా చెల్లింపులు చేస్తున్నా ప్రతి నెలా రూ.5 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉంటున్నాయి. కొత్త ఏడాదిలో ఈ సమస్యను అధిగించేందుకు ప్రభుత్వం ఏం చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. మహిళా పారిశ్రామికవేత్తల కోసం వీ–హబ్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మార్చి 8న రాష్ట్ర ప్రభుత్వం వీ–హబ్ ఇంక్యుబేటర్‌ను ప్రారంభించింది. స్టార్టప్‌ల ఏర్పాటుకు ఐడియాలతో వచ్చే ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం దీని ద్వారా అవసరమైన ప్రోత్సాహం అందిస్తోంది. గతేడాది రాష్ట్రంలో జరిగిన ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు (జీఈఎస్) ముగింపు సందర్భంగా మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా ‘వీ–హబ్’పేరుతో ఇంక్యుబేటర్ ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. -
దేశమంతా రైతుబంధు
సాక్షి, హైదరాబాద్: దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకొచ్చే దిశగా సాహసోపేతంగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త ఫ్రంట్ అధికారంలోకి రాగానే.. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసి.. రైతుల జీవితాల్లో వెలుగులు తీసుకొచ్చేలా వ్యూహాలు రూపొందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. టీఆర్ఎస్ శాసనసభ పక్ష నేతగా ఎన్నికైన అనంతరం.. బుధవారం తెలంగాణ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలోని రైతులు, పేదలు, మైనారిటీలు అన్ని వర్గాల వారి స్థితిగతులను మార్చే లక్ష్యంతోనే జాతీయ రాజకీయాల్లో కొత్త శక్తిని ప్రారంభించనున్నామని.. ఈ ప్రయత్నం కచ్చితంగా విజయవంతం అవుతుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రం ఆదాయం బాగానే ఉందని.. అందువల్ల వీలైనంత త్వరగా రూ.2.3 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పనులు కొనసాగుతున్న దుమ్ముగూడెం. కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులతోపాటు.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును కూడా త్వరలోనే పూర్తిచేసి సాగునీటిని అందుబాటులోకి తెస్తామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమపథకాలు, అభివృద్ధి ద్వారా దేశవ్యాప్తంగా తెలంగాణ పతార (పరపతి) పెరిగిందని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఏపీ సీఎం చంద్రబాబు రెండునాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం మంచిదేనని.. అయితే ఈ కార్యక్రమం అమలును మధ్యలోనే ఆపేయడం వల్ల అసలు లక్ష్యం నెరవేరలేదన్నారు. ఈ సమావేశంలో కేసీఆర్ వెల్లడించిన అంశాలు ఆయన మాటల్లోనే.. గెలిస్తే.. దేశవ్యాప్తంగా రైతుబంధు ‘రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వం పెత్తనం చెలాయిస్తోంది. రాష్ట్రాల పరిస్థితి దిగజారుతోంది. చిన్న చిన్న అంశాల్లోనూ కేంద్రానికిదే అధికారం. వ్యవసాయం, విద్య, ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి శాఖలు కేంద్రం వద్ద ఉండాల్సిన అవసరం లేదు. ఐఐటీ వంటి పరిశోధన సంస్థలు కేంద్రం పరిధిలో ఉంటే పర్వాలేదు. కేంద్రం వద్ద పరిధికి మంచిన అధికారాలు ఉన్నాయి. ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఒకేతీరుగా వ్యవహరిస్తున్నాయి. ప్రధాని మోదీ సహకార సమాఖ్య అంటున్నారు. కానీ చేతల్లో మాత్రం వికేంద్రీకరణను మరింత కేంద్రీకృతం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాల ఫ్యూడల్ పద్ధతి నశించాలి. అప్పుడే దేశంలో గుణాత్మక మార్పు వస్తుంది. నాకు ధైర్యం ఉంది. నేను అలాంటి మార్పును తీసుకొస్తా. ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా రైతు బంధు పథకాన్ని అమలు చేస్తాం. దీని కోసం ఏటా మూడున్నర లక్షల కోట్ల రూపాయలు అవసరమవుతాయి. నా దగ్గర అజెండా ఉంది. లెక్కలున్నాయి. రైతుల పరిస్థితి మారుస్తాం’ చెవ్స్ పండించలేకపోయా! ‘దేశంలో కొత్త ఆర్థిక, వ్యవసాయ విధానాలు రావాలి. పంటలను అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకునే పరిస్థితి లేదు. పురుగు మందులు అని, ఇంకోటని మెలికపెట్టి తిరస్కరిస్తారు. కట్ ఫ్లవర్ పంటలో ప్రపంచవ్యాప్తంగా 90% ఇజ్రాయిల్‌లోనే సాగు చేస్తున్నారు. చెవ్స్ పంట పండిద్దామనుకున్నా. అంతర్జాతీయ మార్కెట్లో అమ్ముకోలేమని తెలిసింది. దేశంలో అన్ని ఉన్నా రైతుల ఆత్మహత్యలు ఆగడంలేదు. రాహుల్‌గాంధీ ఏదో రాష్ట్రానికి వెళ్లి క్వింటాల్ ధాన్యానికి రూ.2500 అన్నారు. కనీస మద్దతు ధర దేశమంతా ఒకేలా ఉండాలి. లేకుంటే తక్కువ ధర రాష్ట్రంలోనే వ్యాపారులు ఎక్కువ కొంటారు. కాంగ్రెస్ జాతీయ పార్టీ అంటారు. రాష్ట్రానికో విధానం చెబుతారు. ఓట్లు ఉంటే ఒక రకంగా లేకుంటే మరో రకంగా మాట్లాడుతారు. సీపీఎస్‌పై ద్వంద్వ విధానం జాతీయ పార్టీలు పచ్చి రాజకీయ అవకాశవాదంతో వ్యవహరిస్తున్నాయి. ఉద్యోగుల సీపీఎస్ విధానం తెచ్చింది యూపీఏ ప్రభుత్వం. ఇక్కడ అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇప్పుడు వాళ్లే తీసేయాలి అని డిమాండ్ చేస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సీపీఎస్‌ను రద్దు చేయదు. ఇక్కడ బీజేపీ వాళ్లు రద్దు చేయాలని అంటారు. జాతీయ పార్టీల వైఫల్యాలకు వ్యతిరేకంగా ఎవరో ఒకరు నడుంబిగించాలి. జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తా. నేను ప్రాణానికి తెగించి ముందుకు సాగుతున్నా. కేంద్ర ప్రభుత్వాలవి చెత్త విధానాలు. యూపీఏ ప్రభుత్వం మోడల్ స్కూళ్లను తీసుకొచ్చింది. ఎన్డీయే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. అలా మధ్యలో వదిలేస్తే ఎలా? అందుకే వీటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోవాల్సి వచ్చింది’ మేనిఫెస్టో 100% అమలుచేస్తాం ‘నాలుగున్నరేళ్లలో మేనిఫెస్టోను 100% అమలు చేసిన ఏకైక పార్టీ టీఆర్ఎస్. రైతుబంధు, రైతుబీమా పథకాలను మేం మేనిఫెస్టోలో పెట్టలేదు. రైతు బీమాతో ఎలాంటి పైరవీలు లేకుండానే పేద రైతులకు సాయం వస్తోంది. ప్రజల అవసరాన్ని బట్టి ఇలాంటి 76 అంశాలను అమలు చేస్తున్నాం. కంటి వెలుగు కార్యక్రమంలో కోటి మంది పరీక్షలు చేయించుకున్నారు. అమ్మ ఒడికి మంచి పేరు వచ్చింది. ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు పెరుగుతున్నాయి. కాన్పుకు అయ్యే రూ.30 వేల ఖర్చు తప్పుతోంది. తల్లి, బిడ్డ ఆరోగ్యంగా ఉంటున్నారు. కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలతో బాల్య వివాహాలు లేకుండాపోయాయి. ఆర్థిక వ్యవస్థ పెరిగింది. సంక్షేమ పథకాలను అమలు చేశాం. ఎరువులకు రైతులు ఇబ్బందిపడే రోజులు పోయాయి. గోదాములు లేక ఈ సమస్య అని గుర్తించాం. నాలుగు లక్షల టన్నుల సామర్థ్యం నుంచి 25 లక్షల టన్నుల సామర్థ్యం పెంచాం. అన్ని రంగాలలో నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నాం. మా పనితీరు, సంక్షేమ కార్యక్రమాలను చూసే ప్రజలు మాకు 88 స్థానాల్లో విజయం కట్టబెట్టారు. ఉద్యమ పార్టీగా గత ఎన్నికలలో ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని సరిగా చేసి చూపినం. ప్రజలు అన్ని చూసి తీర్పు ఇచ్చారు’ టీఎస్పీఎస్సీతో మైనస్ ‘మాకన్నా ముందు పాలించిన కాంగ్రెస్, టీడీపీలు ఎన్ని ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చాయి? విపక్షాలు పచ్చి అబద్దాలు చెప్పి యువతను పక్కదోవ పట్టిస్తున్నాయి. అనవసరంగా నిరుద్యోగులను రెచ్చగొట్టొద్దు. ఇంటికో ఉద్యోగం అని ఎప్పుడూ చెప్పలేదు. నిరుద్యోగులను రెచ్చగొంటేందుకు కొందరు డ్రామాలు చేశారు. ఏటా లక్ష ఉద్యోగాల భర్తీ అంటే ఎలా? టీడీపీ, కాంగ్రెస్ అధికారంలో ఉన్న 60 ఏళ్లు ఇలాగే చేసుంటే.. 60 లక్షల ఉద్యోగాలు అయ్యేవి. ఇదో ఎన్నికల నినాదంగా మారింది. ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి అధికారం చేపట్టిన పార్టీలే అధికారం పోయాక ధర్నాలు చేస్తాయి. మేం అలా కాదు. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న పోస్టులను 100% భర్తీ చేస్తాం. ప్రైవేటు రంగంలో ఉద్యోగ అవకాశాలు విస్తృతమయ్యేలా కృషి చేస్తాం. టీఎస్పీఎస్సీ మాకు మైనస్ అయ్యింది. పనికిమాలిన పనులు ముందు పెట్టుకుని ఉద్యోగాల భర్తీలో జాప్యం చేసింది. అందుకే చివరికి కొన్ని పోస్టులను తీసి ఆయా శాఖలే భర్తీ చేసుకునేలా నిర్ణయాలు తీసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ప్రభుత్వ ఉద్యోగాల కల్పన ఒక శాతం కంటే తక్కువే ఉంటుంది. ప్రైవేటులోనూ ఎక్కువ ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నాం’ 33 జిల్లాలు చేస్తాం ‘టీఆర్ఎస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర స్వీయ పన్నుల ఆదాయం వృద్ధిరేటు 29.90%గా ఉంది. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ దీంట్లో సగం కూడా లేదు. అప్పులు ఎలా చెల్లించాలో మాకు తెలుసు. సాధారణంగా పెరిగేవి తప్ప ప్రత్యేకంగా పన్నులు పెంచం. వచ్చే నాలుగేళ్లలో రూ.10 లక్షల కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది. రుణాల కింద రూ.2.30 లక్షల కోట్లు చెల్లిస్తాం. దీని వల్ల అదనంగా రూ.1.30 లక్షల కోట్ల రుణం పొందే అర్హత వస్తుంది. అన్నింటిపైనా అవగాహన ఉంది. సాగునీటి ప్రాజెక్టులకు రూ.70 వేల కోట్లు అవసరమవుతాయి. ఖమ్మం జిల్లాలో మాకు సీట్లు రాకపోయినా.. అక్కడ దుమ్ముగూడెం ప్రాజెక్టుతో వచ్చే జులైలో నీళ్ళు అందిస్తాం. 18 నెలల్లో కాళేశ్వరం, సీతారామ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం. అప్పటికి పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు 90%పూర్తవుతుంది. ప్రాజెక్టుల వద్దకు నేనే స్వయంగా వెళ్లి పరిశీలిస్తా. తెలంగాణ అన్ని రాంగాల్లో సాధిస్తున్న అభివృద్ధి, సుస్థిర ప్రభుత్వంతో రాష్ట్ర పతార (పరపతి)పెరిగింది. రూ.15 వేల కోట్లను అప్పుగా ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్ఈసీ చైర్మన్ ఫోన్ చేశారు. తాజా తీర్పుతో ప్రజలు ఈ పతారను మరింత పెంచారు. ఎన్నికలలో హామీ ఇచ్చినట్లుగా మరో రెండు జిల్లాలను ఏర్పాటు చేస్తాం. రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 33కు పెరుగుతుంది’ క్రమంగా అధికారాల బదిలీ ‘స్థానిక సంస్థలను బలోపేతం చేసి క్రమంగా అధికారాలను వికేంద్రీకరిస్తాం. గత ప్రభుత్వాలు ఈ సంస్థల అధికారాలను ఒకొక్కటిగా వెనక్కి తీసుకున్నాయి. పంచాయతీ సమితి పరిధిలోనే అన్ని జరిగేవి. ప్రాథమిక పాఠశాలలో టీచర్లను, ఆరోగ్య కేంద్రాల్లో సిబ్బందిని నియమించే అధికారాలు బీడీవోలకు ఉండేవి. బీడీవోలను తొలగించారు. అన్ని ఆధికారాలను తీసుకున్నారు. ఇప్పుడు ఆర్థిక సంఘం నిధులు వస్తేనే జిల్లా పరిషత్‌లకు పనులు. వాటి పరిస్థితి దయనీయంగా ఉంది. నిర్మాణాత్మక మార్పులు రావాలి’ 10 లక్షల మందికి నిరుద్యోగ భృతి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి నిరుద్యోగభృతిని చెల్లిస్తాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి దశలో ఉంది. ఈలోపు వరుసగా పంచాయతీ, లోక్‌సభ, స్థానిక సంస్థల ఎన్నికలున్నాయి. మధ్యలో అమలు చేయడం వీలు కాదు. నిరుద్యోగుల భృతి అర్హతలపై నియమావళి రూపకల్పన కోసం కమిటీని నియమిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం పథకాన్ని అమలు చేస్తాం. మా అంచనా ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మందికి నిరుద్యోగభృతి చెల్లింపు జరుగుతుంది’ వదిలిపెట్టే ప్రసక్తే లేదు ‘అధికారంలో ఉన్నప్పుడు ఎవరేం చేశారో అందరికీ తెలుసు. కుంభకోణాలు చేసినోళ్లను, దొంగలను ఎప్పుడైనా బయటకి తీసుకురావచ్చు అని ఊరుకున్నా. వాటిని బయటికి తీస్తే.. సంక్షేమాన్ని పక్కన పెట్టి ఇదేం పద్ధతి అంటరని ఊరుకున్నా. ఈ నాలుగున్నరేళ్లలో ఎవరినీ ముట్టుకోలేదు. ఈసారి మాత్రం వదలిపెట్టే ప్రసక్తే లేదు. ఏది పడితే అది మాట్లాడితే ఊరుకునేది లేదు. కుక్కలు మొరిగినట్లు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం. కచ్చితంగా చికిత్స చేస్తాం. ఓటుకు నోటు కేసు విచారణ కొనసాగుతోంది’ కోఠి చౌరాస్తాలో అమ్ముతరు ‘ప్రభుత్వాధినేత గట్టిగా ఉండాలి. మన ప్రజాస్వామిక వ్యవస్థ అలాగే ఉంది. అక్కడ ప్రధానమంత్రి, ఇక్కడ ముఖ్యమంత్రి ప్రత్యేకమే. నేను కొంచెం ఎక్కువ కట్టిక ఉంటా. అట్ల లేకపోతే.. సర్కారు కాదు సర్కస్ అయితది. గట్టిగా ఉండకపోతే నన్ను కోఠి చౌరస్తాలో రూపాయి పావలకు అమ్ముతరు. నేను గట్టిగ ఉండడం వల్లనే.. మా పాలనలో అవినీతికి తావులేదు. నేనెవర్నీ కలవడం లేదనేది సరికాదు. రాజ్‌దీప్ సర్దేశాయ్, ప్రణయ్‌రాయ్ వంటి మీడియా ఎడిటర్లు ఫోన్లు చేసి కలుస్తామని అడుగుతారు. వారిని పిలిచి ఊరికే ముచ్చట చెప్పి పంపేంత సమయం నాకు లేదని చెప్పా. ప్రజల కోసం ఏం చేయాలనే దానికే ప్రాధాన్యత ఇస్తా. కంటివెలుగు వంటి పథకాలు అమలు చేస్తుంటే ప్రతికూల మీడియాకు అవేవి కనిపించవు. సమాచార శాఖ నా దగ్గరే ఉంటది. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు తప్పకుండా ఇస్తాం. రిటైర్డ్ జర్నలిస్టులకు పింఛను విధానంపై అధ్యయనం చేయిస్తాం. కమిటీ ప్రతిపాదనల ప్రకారం నిర్ణయం తీసుకుంటాం’ 106 సీట్లు వస్తాయనుకున్నా! అసెంబ్లీ ఎన్నికలలో తాను ఆశించిన ఫలితాలు రాలేదని కేసీఆర్ అన్నారు. టీఆర్ఎస్ఎల్పీ సమావేశం అనంతరం ఎమ్మెల్యేలతో భోజనం చేస్తూ ఆయన విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. ‘అసెంబ్లీ ఎన్నికలలో 96 నుంచి 106 సీట్లు వస్తాయని అనుకున్నా. ఆశించిన ఫలితాలు రాలేదు. కాంగ్రెస్ నుంచి గెలిచిన వారు టీఆర్ఎస్లోకి వస్తామని ఫోన్లు చేస్తున్నారు. ఓడిపోయిన మంత్రులను కేబినెట్లోకి తీసుకుంటే విమర్శలొస్తాయి. మంత్రివర్గంలో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉంటుంది.’అని ఆయన వెల్లడించారు. ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియాగాంధీని కుటుంబంతో వెళ్లి కలిశా. కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనంపై చర్చించాం. దిగ్విజయ్‌సింగ్‌తో ఆ విషయం మాట్లాడాలని సోనియా అన్నారు. ఆ తర్వాత దిగ్విజయ్‌సింగ్‌ను కలిశా. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకత్వం మీకిస్తే ఎలా అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఈ విషయంపై కనీసం మాట్లాడలేదు. వెంటనే హైదరాబాద్‌కు వచ్చి పార్టీ నేతలతో చర్చించాం. ఏదైనా సరే ఒంటరిగా పోటీ చేద్దామని అందరు అన్నారు. అదే నిర్ణయించుకున్నాం. మొండిగా ఎన్నికల్లో పోరాడాం. ప్రజలకు మాకు అధికారం ఇచ్చారు. వారు ఇచ్చిన బాధ్యతను నిర్వహిస్తున్న తీరుపై సంతృప్తితో మళ్లీ గెలిపించారు’కేసీఆర్ అన్నారు. -
ఉద్యమ కాలం నాటి ఉప్పెనలా లేవాలి..
తెలంగాణ ఇప్పుడిప్పుడే చల్లబడుతూ ఉన్నది కుట్రలన్నీ ఛేదించి కుదుట పడుతు ఉన్నది.. చిగురు వేసి చిందులేసి...మొగ్గ తొడుగుతున్నది పూతపూసి కాత కాసి.. చేతికందనున్నది ఇంతలోనే కక్షగట్టి కూటమి వస్తున్నది.. అభివృద్ధిని అడ్డుకునే ఆపద వస్తున్నది.. కుట్రలన్ని తిప్పికొట్టి..ప్రజలంతా జట్టుకట్టి.. ఉద్యమ కాలం నాటి ఉప్పెనలా లేవాలి.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తిరిగి తెచ్చుకోవాలి.. కేసీఆర్ కలలన్నీ పరిపూర్ణం కావాలి.. తెలంగాణ తల్లి సంకెళ్లను తెంపాలని.. తెలంగాణ∙బతుకులలో పచ్చదనం నింపాలని నడుం కట్టి కేసీఆర్ ఎక్కిన కొండలు ఎన్ని.. మొక్కిన బండలెన్ని.. నాయకుడై వెచ్చించిన కాలమెంత..కన్నీరెంత రంది పడ్డ తన గుండెలో తపన ఎంత.. తపస్సు ఎంత అంత మరిచిపోదామా... గుంతలోన పడదామా.... మన కళ్లను మన వేళ్లతో మనమే పొడుచుకుందామా.. చావునోట్లో తలపెట్టి.. కేసీఆర్ సాధించిన రాష్ట్రాన్ని చేజేతులా జారవిడుచుకుందామా.. తెలంగాణ రాష్ట్రమొస్తే చిమ్మచీకటైతదని శాసనసభ నడిబొడ్డున తెలంగాణ వాళ్లకు ఒక రూపాయి ఇవ్వనన్న కిరికిరి పరిపాలకుల హేళన కావాలా.. 24 గంటలు కరెంటు వెలుగందించే రైతు బంధు కేసీఆర్ పాలన కావాలా.. పొలాలన్నీ ఎండబెట్టి.. బతుకు మీద మట్టికొట్టి.. వలసల పాల్జేసే నరక యాతన కావాలా.. ఆకుపచ్చ తెలంగాణ అందరికీ చెందాలనే ఆత్మగళ్ల కేసీఆర్ చేతన కావాలా తేల్చుకునే సమయమిది.. గెలవాల్సిన సమరమిది.. నీతి మాలిన కూటమి కుట్రను ఓడగొట్టాలి.. అత్తరబిత్తర పొత్తులు తత్తరపడి పోవాలి నిండు బొక్కెనను మధ్యలో తెంపకుండా చూడాలి.. మండుతున్న కుండ పగులగొట్టెటోళ్లను ఆపాలి అందబోయే ఫలం ప్రజల ఇళ్ల దాకా చేరాలి.. మళ్లీ కేసీఆరే మనకు సీఎంగా రావాలి ఓట్ల దండ కేసీఆర్ మెళ్లో మనం వేయాలి. ఆఆ..కళళలాడే చెరువులనడుగు.. కాళేశ్వర ప్రాజెక్టును అడుగు.. కల్వకుర్తి ఎత్తిపోతలనడుగు.. కాల్వల పారే నీళ్లను అడుగు.. పాడి పంటల పల్లెలనడుగు..కొత్తగేర్పడిన జిల్లలను అడుగు 24 గంటలు వచ్చే ఇరాం లేని కరెంటు నడుగు..చల్ ఎందుకు వేయాల్నో...కారుకు ఎందుకు ఓటెయ్యాల్నో... ఎందుకు వేయాల్నో...సారును ఎందుకు గెలిపించాల్నో.. సారు కేసీఆర్.. సర్కారు మళ్లా ఎందుకు రావాల్నో.. కారుకు ఓటేసి..కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాలో.. అడుగూ.. చెబుతవి.. ఆ..ఆసర పింఛన్ అందుకున్న మా అవ్వతాతల నవ్వులనడుగు.. పెరిగిన రేషన్ బియ్యంతోని కడుపునిండిన పేదలనడుగు కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ కానుక పొందిన చెల్లెల్ని అడుగు... ఇంటింటిలో వెలుగులు నింపిన కంటివెలుగు కనురెప్పలనడుగు మా కేసీఆర్ కిట్లను అడుగు..అమ్మ ఒడి ఆత్మీయతనడుగు... సర్కారు బడిలో సన్న బువ్వ తిని సదువుకుంటున్న పిల్లలనడుగు.. ఎందుకు వేయాల్నో కారుకు ఎందుకు ఓటెయ్యాల్నో... కారుకు ఓటేసి కేసీర్‌ను ఎందుకు గెలిపించాల్నో.. ఎందుకు వేయాల్నో...కారుకు ఎందుకు ఓటేయాల్నో సారు కేసీఆర్..సర్కారు మళ్లా ఎందుకు రావాల్నో అడుగు బై..చెబుతది... ఆ...నిండిన చెరువు నీళ్లపైన వెండి మెరుపుల తీగను అడుగు... ముదిరాజులకు భరోస నింపిన చెరువుల ఈదే చేపలనడుగు... కుర్మ గొ ల్ల..మా యాదవన్నల గొర్రె పిల్లల మందలనడుగు.. గౌడన్నల మా గడపలనడుగు...బీడి కార్మికుల బతుకులనడుగు.. చేనేత మగ్గాలను అడుగు..చేతివృత్తుల చేతులనడుగు సారు కేసీఆర్ సర్కారు నిలవెట్టిన కులవృత్తులనడుగు..చల్ ఎందుకు వేయాల్నో..కారుకు ఓటెందుకు వేయాల్నో చెబుతది..ఎందుకు వేయాల్నో సారును ఎందుకు గెలిపించాల్నో.. కారుకు ఓటేసి..కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాల్నో.. సారు కేసీఆర్ సర్కారు మళ్లా ఎందుకు రావాల్నో... అవే చెబ్తయ్..అడగరాదే..అన్న రైతుబంధును అందుకున్న మా అన్నదాతల ఆనందాన్నడుగు బీమాతోని ధీమా పెరిగిన రైతుల గుండె చప్పుడునడుగు అహ..మిషన్ భగీరథ నల్లా నీళ్లతో మిన్నంటిన ఆనందాన్నడుగు ఆశా వర్కర్లను అడుగు..అంగన్వాడీ అక్కలనడుగు.. మా కళాకారుల దరువులనడుగు..తెలుగు మహాసభ ఖ్యాతిని అడుగు...బోనాల వైభోగాన్నడుగు..బతుకమ్మ ఆటపాటనడుగు... ఎందుకు వేయాల్నో కారుకు ఓటెందుకు వేయాల్నో.. ఎందుకు వేయాల్నో సారును ఎందుకు గెలిపించాల్నో కారుకు ఓటేసి కేసీఆర్‌ను ఎందుకు గెలిపించాల్నో... సారు కేసీఆర్ సర్కారు మళ్లా..ఎందుకు రావాల్నో... ఇంకా ఏమన్న డౌటుంటే..నన్నడుగు చెప్తా... ...:: సేకరణ: పిన్నింటి గోపాల్ -
‘రైతుబంధు’తో సామాజిక ఆర్థిక భద్రత
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు, రైతుబీమా పథకాలు అన్నదాతలకు సామాజిక ఆర్థిక భద్రత కల్పించాయని వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి సి.పార్థసారథి అన్నారు. రోమ్‌లో శుక్రవారం ఐక్యరాజ్యసమితి(ఐరాస)కి చెందిన ఆహార వ్యవసాయ సంస్థ(ఎఫ్ఏవో) నిర్వహించిన ‘వ్యవసాయంలో వినూత్న ఆవిష్కరణలు’అనే అంశంపై జరుగుతున్న అంతర్జాతీయ సింపోజియంలో పార్థసారథి ప్యానల్ స్పీకర్ హోదాలో మాట్లాడారు. తెలంగాణ నాలుగున్నరేళ్ల క్రితం ఏర్పాటైన కొత్త రాష్ట్రమని, వర్షాభావ పరిస్థితులతో నిరంతరం కరువు కాటకాలతో ఉంటుందన్నారు. రాష్ట్రంలో ఎక్కువమంది సన్న,చిన్నకారు రైతులేనని, ఈ నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు ‘రైతుబంధు’పథకాన్ని ప్రవేశపెట్టామన్నారు. అప్పులకు పోకుండా నిరోధించాం రైతుబంధు పథకం ద్వారా రైతులు ప్రైవేటు అప్పులకు పోకుండా నిరోధించగలిగామని పార్థసారథి తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4 వేల చొప్పున అందజేస్తున్నామని, ఈ మొత్తం వ్యవసాయ సీజన్ ప్రారంభంలో విత్తనాలు, ఎరువులు, ఇతర సాగు ఖర్చుల కోసం ఉపయోగపడుతున్నాయని తెలిపారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 51 లక్షలమంది రైతులకు రైతుబంధు పథకం ద్వారా రూ.5,200 కోట్లు ఇచ్చామన్నారు. మరోవైపు రైతు చనిపోతే వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు రైతుబీమా పథకాన్ని సర్కారు తీసుకొచ్చిందని పార్థసారథి తెలిపారు. ఇప్పటివరకు రైతుబీమా కింద లబ్ధిపొందిన వారిలో 90% సన్న,చిన్నకారు రైతులేనని స్పష్టం చేశారు. రైతు కుటుంబాలకు పది రోజుల్లోగా రూ.5 లక్షలు బీమా పరిహారం ఆ కుటుంబానికి అందేలా చర్యలు తీసుకున్నామన్నారు. -
ప్రపంచానికే ఆదర్శం ‘రైతుబంధు’
సాక్షి, హైదరాబాద్: రైతుల అభివృద్ధికి ప్రపంచంలో అమలు చేస్తున్న 20 వినూత్న పథకాలలో రైతుబంధు, రైతుబీమా పథకాలను ఐక్యరాజ్యసమితి (ఐరాస) గుర్తించడం పట్ల వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఇది తెలంగాణకు, రాష్ట్ర రైతాంగానికి దక్కిన గొప్ప గౌరవమన్నారు. తెలంగాణ అమలు చేస్తున్న పథకాలు దేశానికే కాదు ప్రపంచానికే ఆదర్శమని మరోసారి నిరూపణ అయిందన్నారు. వ్యవసాయరంగం అభివృద్ధి, రైతు సంక్షేమం అనే గొప్ప ఆశయంతో ఈ రెండు పథకాలను అమలు చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రైతులు అప్పుల ఊబినుండి బయటపడి తలెత్తుకొని తిరగాలన్నదే తమ ప్రభుత్వ ధ్యేయమన్నారు. అందుకే వ్యవసాయానికి అవసరమైన కరెంటును 24 గంటలు ఉచితంగా, నాణ్యతతో సరఫరా చేస్తున్నామన్నారు. ఎరువులు, విత్తనాలకు కొరత లేకుండా చేశామన్నారు. పెట్టుబడికి రైతుబంధు ద్వారా ఆర్థిక వెన్నుదన్ను ఇస్తున్నామన్నారు. రైతులకు సలహాలు ఇవ్వడానికి ప్రతి ఐదు వేల ఎకరాలకు ఒక వ్యవసాయ విస్తరణ అధికారిని నియమించామన్నారు. మద్దతు ధరతో పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులకోసం భారీగా గోదాములు నిర్మించామని, ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, అమలుచేస్తున్న పథకాలతో ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు భరోసా వచ్చిందన్నారు. తమ వెనుక ప్రభుత్వం ఉందన్న ధైర్యం వచ్చిందన్నారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో రాష్ట్ర రైతులకు ఇంకా మంచి రోజులు రాబోతున్నాయన్నారు. అంతర్జాతీయ సదస్సుకు పార్థసారథి ఐరాస ఆధ్వర్యంలోని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏవో) ప్రధాన కార్యాలయం రోమ్‌లో జరగనున్న అంతర్జాతీయ సదస్సులో రైతుబంధు, రైతుబీమా పథకాలపై ప్రసంగించేందుకు వ్యవసాయశాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి ఈనెల 20న ఇక్కడినుంచి రోమ్ బయలుదేరనున్నారు. ఆయనతోపాటు రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ కేశవులు కూడా పర్యటిస్తారు. ఈ మేరకు పార్థసారథి ఒక ప్రకటన విడుదల చేశారు. 21 నుంచి 23వ తేదీవరకు రోమ్ అంతర్జాతీయ సదస్సులో ప్రసంగిస్తారు. తెలంగాణ విత్తన హబ్‌పైనా ఆయన మరో సదస్సులో ప్రసంగిస్తారు. 24న ఎఫ్ఏవో కార్యాలయంలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. 26–27 తేదీల్లో స్విట్జర్లాండ్ రాజధాని జ్యూరిచ్‌కు వెళతారు. -
ఎన్నికల ఏరువాకలో ఓట్ల సాగు
ఎన్నికల ఏరువాకలో ఓట్లు పండించడానికి రైతు సమన్వయ సమితులు సిద్ధమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) గెలుపే లక్ష్యంగా.. ఊరూరా రైతులను కలుస్తూ ఈ సమితులు పార్టీ గెలుపునకు వ్యూహరచన చేస్తున్నాయి. గత ఖరీఫ్ సీజన్లో రైతుబంధు చెక్కుల పంపిణీ సందర్భంలో.. రైతుబీమా పథకంలో రైతులను చేర్పించడంలో కీలకంగా వ్యవహరించిన సమన్వయ సమితులు.. ఇప్పుడు ఆయా సాయాలను గుర్తుచేస్తూ రైతులను పార్టీ వైపు తిప్పేందుకు పని చేస్తున్నాయి. విత్తనం వేసింది మొదలు పంట పండాక మార్కెట్లో గిట్టుబాటు ధర వచ్చే వరకు రైతులకు అండగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. రైతుబంధు చెక్కుల పంపిణీ, రైతుబీమాలో రైతుల చేరిక వంటి సందర్భాల్లో ఈ సమితుల సభ్యులు అంతా తామై వ్యవహరించారు. చెక్కుల పంపిణీకి, బీమా పథకంలో చేరికకు సంబంధించి ఎవరు నిజమైన రైతులో కాదో నిర్ధారించింది వీరే. ఇంతలా గ్రామస్థాయిలో రైతులతో మమేకమై పనిచేసిన ఈ సమితులు ఇప్పుడు రైతులకు అందిన లబ్ధిని వివరిస్తూ.. ఓట్లుగా మలిచేందుకు కృషి చేస్తున్నాయి. 1.61 లక్షల మంది సభ్యులు గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయ సమితులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. అంటే ఈ సమితుల్లోని సభ్యులు ప్రభుత్వ పరంగా నామినేట్ పదవుల్లో ఉన్నట్టు. రాష్ట్రంలోని 10,733 గ్రామాల్లోనూ రైతు సమన్వయ సమితులు ఉన్నాయి. ఒక్కో గ్రామంలో 15 మంది చొప్పున అన్ని గ్రామాల్లోనూ 1.61 లక్షల మంది సభ్యులను నియమించారు. దాంతోపాటు ప్రతీ గ్రామానికి ఒక సమన్వయకర్త ఉంటారు. ఆపై 24 మందితో మండల సమన్వయ సమితులను ఏర్పాటు చేశారు. అలా 559 మండలాలకు 13,416 మందిని నియమించారు. ప్రతీ మండలానికి మళ్లీ ఒక మండల రైతు సమితి సమన్వయకర్తను నియమించారు. వీరందరితో కలిపి జిల్లా సమన్వయ సమితిని ఏర్పాటు చేశారు. ప్రతీ జిల్లాకు 24 మంది చొప్పున జిల్లా సమితి సభ్యులను నియమించారు. దీనికి ఓ జిల్లా సమన్వయకర్త ఉంటారు. అనంతరం రాష్ట్రస్థాయిలో సమన్వయ సమితిని 42 మందితో ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ సాంకేతిక సమస్యలు రావడంతో కార్యరూపం దాల్చలేదు. రాష్ట్ర సమన్వయ సమితికి ఛైర్మన్‌గా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డిని నియమించి.. క్యాబినెట్ హోదా కట్టబెట్టారు. జిల్లా సమన్వయకర్తకు జిల్లా కేంద్రంలో ఒక కార్యాలయం ఏర్పాటు చేశారు. మండల స్థాయిలోనూ కార్యాలయం ఏర్పాటుకు రంగం సిద్ధం చేశారు. నామినేట్ పదవులు కావడంతో వారంతా సుశిక్షితులైన సైన్యంగా టీఆర్ఎస్ గెలుపునకు కృషిచేస్తున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి. వీరందరినీ సమన్వయం చేసుకుంటూ గుత్తా సుఖేందర్‌రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ప్రతీ 32 మంది రైతులకు ఒకరు ఒక అంచనా ప్రకారం ప్రతీ 32 మంది రైతులకు ఒక రైతు సమన్వయ సమితి సభ్యుడున్నారు. ఆయా రైతులందరినీ సమన్వయపరిచి టీఆర్ఎస్కు ఓటేసేలా వీరంతా కసరత్తు చేస్తున్నారు. ఈసారి అధికారంలోకి వచ్చాక రైతు సమన్వయ సమితి సభ్యులందరికీ రెమ్యునరేషన్ ఇస్తామని టీఆర్ఎస్ తన పాక్షిక మేనిఫెస్టోలో ప్రస్తావించడంతో 1.61 లక్షల మంది సభ్యులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. వ్యవసాయశాఖ వర్గాలు చెబుతున్నట్లు ఒక్కో సభ్యునికి నెలకు రూ.500 నుంచి రూ. వెయ్యి వరకు రెమ్యునరేషన్ ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో రైతుబంధు సొమ్మును బ్యాంకుల్లో జమ చేస్తున్నారు. దీనిపై రైతుల్లో అవగాహన కల్పించడంలో రైతు సమితులు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. రైతులకు బీమా సొమ్ము ఇప్పించడంలోనూ సభ్యులు కీలకంగా వ్యవహరిస్తున్నారు. ...::: బొల్లోజు రవి -
‘ప్రకటించని మేనిఫెస్టో కాపీ ఎలా సాధ్యం?’
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మేనిఫెస్టో ఇంకా ప్రకటించలేదని, అలాంటప్పుడు కాపీ కొట్టడం ఎలా జరుగుతుందని కరీంనగర్ ఎంపీ బి.వినోద్‌కుమార్ ప్రశ్నించా రు. రైతుబంధు, రైతు బీమా కొనసాగిస్తామని చెబుతున్న కాంగ్రెస్ నేతలు.. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కొనసాగిస్తామని చెబితే ఇంకా బాగుంటుందని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డితో కలిసి తెలంగాణభవన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్ నేతలు ప్రజల మధ్య లేరు. అందుకే మేమే గెలుస్తామని చెబుతూ ఊహల్లో పయనిస్తున్నారు. అధికారం లేనప్పుడు ప్రజల్లో తిరిగే అలవాటు కాంగ్రెస్ నేతలకు లేదు. 2014 మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశాం. చెప్పనివీ చేశాం. అందుకే కేసీఆర్‌ను జనం నమ్ముతున్నారు. రూ.200 ఉన్న పింఛను కూడా ఇవ్వని కాంగ్రెస్.. రూ.2వేలు ఎలా ఇస్తుందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాంగ్రెస్ నేతలవి బక్వాస్ మాటలు. ఎన్నికలు వద్దని డీకే అరుణ సుప్రీంకోర్టుకు వెళ్లారు. అంటే ఎన్నికలకు ఎవరు భయపడుతున్నారు? ప్రజాకోర్టులో తేల్చుకుందామని కేసీఆర్ సవాల్ విసిరితే సై అన్నారు. ఇప్పుడు ప్రజాకోర్టును చూసి భయపడి హైకోర్టు, సుప్రీంకోర్టుల చుట్టూ తిరుగుతున్నారు‘ అని అన్నారు. -
‘రైతుబంధు’కు ఈసీ గ్రీన్ సిగ్నల్
సాక్షి, హైదరాబాద్: రైతులకు పెట్టుబడి సాయంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీ చేస్తున్న 'రైతుబంధు' చెక్కుల పంపిణీకి అడ్డంకి తొలగింది. రైతుబంధు రెండో విడత చెక్కుల పంపిణీకి కేంద్ర ఎన్నికల సంఘం షరుతులతో అనుమతినిచ్చింది. రాష్ట్ర వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి రాసిన నేపథ్యంలో ఈసీ శుక్రవారం స్పందించింది. ఇప్పటికే అమలులో ఉన్న పథకమే కాబట్టి ఎన్నికల నిబంధనల పరిధిలోకి రాదని తేల్చిచెప్పింది. అయితే చెక్కులు రైతుల చేతికి నేరుగా కాకుండా బ్యాంకుల ఖాతాల్లో జమ చేయాలని సూచించింది. మొదటి విడత రైతుబంధులో ఇచ్చినవారికే రెండో విడతలో నగదు చెల్లించాలని, అదనంగా కొత్తవారికి ఇవ్వకూడదని నిబంధన పెట్టింది. అదేవిధంగా రైతుబంధులో రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూదని తేల్చి చెప్పింది. ఈసీ నిర్ణయంతో టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం కింద ప్రతీ రైతుకు ఎకరాకు రూ.4వేల చొప్పున సంవత్సరానికి రూ.8 వేలు ఇస్తుంది. తొలి సీజన్లో రూ.4వేలు ఇచ్చిన ప్రభుత్వం.. రెండోదఫా రూ.4వేలు ఇవ్వనుంది. తెలంగాణలో ఎన్నికల కోడ్ అమలులో ఉందని, రైతుబంధు చెక్కుల పంపిణీ చేయొద్దంటూ ప్రతిపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
రైతుల పొట్ట కొట్టొదని కోర్టు మొట్టిచెంపలు వేసింది
-
రేపటి నుంచే రైతు బంధు చెక్కుల పంపిణీ
సాక్షి, నల్గొండ : రాష్ట్రంలోని రైతులందరికి శుక్రవారం నుంచే రైతు బంధు చెక్కులను అందిస్తామని అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. గురువారం ఆయన నల్గొండ బహిరంగ సభలో మాట్లాడుతూ.. రైతు బంధు చెక్కుల పంపిణీకి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు. చెక్కుల పంపిణీ నిలిపి వేయడానికి కాంగ్రెస్ కుట్రలు పన్నిందని ఆరోపించారు. చెక్కులు పంపిణీని నిలిపివేయాలని కాంగ్రెస్‌నేత మర్రి శశిథర్ కోర్టుకు పోతే చెంపలు వాయించి పంపింది. రైతుల పొట్ట కొట్టొందని మొట్టిచెంపలు వేసింది’ అని కేసీఆర్ సభలో పేర్కొన్నారు. రేపటి నుంచే చెక్కుల పంపిణీ చేపడతామన్నారు. -
రసాభాసగా ఏవోల బదిలీ
సాక్షి, హైదరాబాద్: మండల వ్యవసాయాధికారుల (ఏవో) బదిలీలపై ఉద్యోగుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. గత నెల కౌన్సెలింగ్ చేసి పోస్టింగ్‌లు ఖరారు చేసిన అధికారులు, చివరకు జాబితాలో అనేక మార్పులు చేసి ఆదివారం అర్ధరాత్రి ఇష్టారాజ్యంగా ఉత్తర్వులు జారీ చేశారని మండిపడుతున్నారు. వ్యవసాయశాఖ ఉన్నతాధికారుల నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల వ్యవసాయ ఉద్యోగు లు సోమవారం కమిషనరేట్ వద్ద నిరసన చేపట్టారు. కౌన్సెలింగ్‌లో ఖరారు చేశాక మార్పులు చేర్పులు చేయాల్సిన అవసరమేమిటని నిలదీశారు. లక్షలు చేతులు మారాయని విమర్శించారు. రంగారెడ్డి జిల్లా లో ఒక మండల ఏవో బదిలీ నిలుపుదలకు ఏకంగా రూ.20 లక్షలు తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. తెలంగాణ అగ్రిడాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కె.రాములు ఆధ్వర్యంలో వ్యవసాయ కమిషనరేట్ ముందు ధర్నా జరిగింది. అక్రమంగా పోస్టింగ్‌లు కేటాయించిన వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈమేరకు తాము ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి విన్నవించామని రాములు తెలిపారు. 20 పోస్టుల్లో మార్పులు చేర్పులు... ఏవోల బదిలీలకు గాను జూలై 9, 10 తేదీల్లో వ్యవసాయశాఖ కౌన్సెలింగ్ జరిపింది. ఓ కమిటీ ద్వారా దాదాపు 390 మంది ఏవోలకు కౌన్సెలింగ్ జరిపారు. అయితే రైతుబంధు బీమా ప్రక్రియ నడుస్తున్నందున వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వకుండా తాత్సారం చేశారు. దాదాపు 2 నెలలపాటు ఈ జాబితాను ఉన్నతాధికారులు తమ దగ్గరే ఉంచుకున్నారు. మంత్రులు, కొందరు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడులు, మరికొందరు లంచం ఎర చూపిన ఫలితంగా దాదాపు 20 పోస్టుల్లో మార్పులు చేర్పులు చేసినట్లు అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ నేతలు ఆరోపించారు. ప్రభుత్వ సీఎస్‌కు ఇచ్చిన వినతిలో 11 మంది బదిలీల్లో జరిగిన మార్పులు చేర్పుల వివరాలను పొందుపరచినట్లు రాములు తెలిపారు. -
రాష్ట్ర వ్యవసాయ పథకాలు ఆదర్శం
హైదరాబాద్ : వ్యవసాయ రంగంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న వివిధ పథకాలు అనేక రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని జాతీయ వర్షాధారిత ప్రాంత అథారిటీ (నేషనల్ రెయిన్ ఫెడ్ ఏరియా అథారిటీ) సీఈఓ డాక్టర్ అశోక్‌దళ్వాయ్ అన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం 4వ వ్యవస్థాపక దినోత్సవం సోమవారం విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా ‘రిమాండేటింగ్ అగ్రికల్చర్ ఫర్ ఇండియా అండ్ ఇట్స్ ఫార్మర్స్’అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. చెరువుల మరమ్మతులతో భూగర్భ జలాల పెంపుకోసం చేపట్టిన మిషన్ కాకతీయ పథకం దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించిందన్నారు. రైతులకు పెట్టు బడి కోసం ఎకరాకు రూ.4వేలు ఇచ్చే రైతుబంధు పథకంపై కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్రాలు, దేశాలు ఆసక్తి చూపుతున్నాయన్నారు. రాష్ట్ర ప్రభు త్వం చేస్తున్న కార్యక్రమాలు దేశానికి రోల్‌మోడల్‌గా నిలుస్తున్నాయన్నారు. వ్యవసాయరంగంలో ఎదురయ్యే సవాళ్లకు ఆధునికశాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానాలే సరైన పరిష్కారాన్ని చూపగలవన్నారు. ఉద్యాన పంటల ఉత్పత్తిలో మిగతా దేశాలతో పొలిస్తే మనం అగ్రగామిగా ఉన్నప్పటికీ రైతుల ఆదాయం పెరగకపోవడం అందరినీ నిరుత్సాహపరుస్తోందన్నారు. సంప్రదాయ పరిష్కారాలు అవసరం: సీఎస్ జోషి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి మాట్లాడుతూ.. భారత వ్యవసాయ రంగానికి సంప్రదాయ పరిష్కారాలు అవసరమన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి సాగు ఖర్చులు తగ్గించి, ఉత్పాదకత పెంపుపై దృష్టి నిలపాలన్నారు. గడిచిన నాలుగున్నరేళ్లలో 30.29 లక్షల మంది రైతులకు చెందిన రూ.17 వేల కోట్ల రుణాలు మాఫీ చేశామన్నారు. నకిలీ విత్తనాలు అరికట్టడం, ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతుల కుటుంబీకులకు అందించే పరిహారాన్ని రూ.6 లక్షలకు పెంపు, 24 గంటల పాటు వ్యవసాయానికి విద్యుత్ అందించడం, కోటి ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టులను చేపట్టామన్నారు. పంటల పెట్టుబడి కోసం ప్రతీ సీజన్లో ఎకరాకు రూ.4 వేల వంతున 49.4 లక్షల మంది రైతులకు రూ.5011 కోట్లు అందించామన్నారు. రైతులను పంటమార్పిడి వైపు శాస్త్రవేత్తలు ప్రోత్సహించాలని సూచించారు. యూనివర్సిటీ వార్షికోత్సవం సందర్భంగా ఏడుగురు ఆదర్శ రైతులకు ఉత్తమ రైతు అవార్డులను అందజేశారు. ఉత్తమ సేవలు అందించిన ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, వ్యవసాయ శాస్త్రవేత్తలకు అవార్డులు అందజేశారు. చదువులో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్ధులకు బంగారు పతకాలు, మెరిట్ సర్టిఫికెట్లను అందజేశారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రచురించిన పలు పుస్తకాలు, సంచికలను విడుదల చేశారు. కార్యక్రమంలో వర్సిటీ వీసీ డాక్టర్ వి.ప్రవీణ్‌రావు, తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కె.కోటేశ్వరరావు, పీజీ స్టడీస్ డీన్ మీనాకుమారి పాల్గొన్నారు. -
పథకాల కన్నా కేసీఆర్‌కే ఆదరణ
-
వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ నినాదం ఇదే!
సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆరే మా సారు’అనే నినాదంతో రానున్న ఎన్నికలకు వెళ్లాలని టీఆర్ఎస్ భావిస్తోంది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన తర్వాత అమలుచేసిన పథకాలు, ప్రజల్లో వాటి ప్రభావంపై టీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సర్వే చేయించారు. సంక్షేమ పథకాల కన్నా ఎక్కువగా కేసీఆర్‌కే అన్నివర్గాలు ఆదరణ చూపించినట్లు సర్వే ఫలితాలు రావడంతో ఆ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయానికి వచ్చినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కేసీఆర్ నేతృత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల్లో ఎక్కువగా ఆదరణ ఉన్న పథకాన్ని లేదా అంశాన్ని రానున్న ఎన్నికల్లో నినాదంగా చేసుకోవాలనే యోచనతో ఈ సర్వే చేయించినట్లు సమాచారం. మిషన్ భగీరథ, రైతు బంధు, సాగునీటి ప్రాజెక్టులు, కల్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్లు వంటి అన్ని అంశాలపైనా నిర్దిష్టమైన సర్వే జరిపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక చేసిన అభివృద్ధి పనులు, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, పరిపాలనా తీరు వంటివి సర్వే చేయించి, సమగ్ర వివరాలు తీసుకున్నారు. అన్ని పథకాల కంటే కూడా సీఎం కేసీఆర్‌కే ఎక్కువ ఆదరణ ఉన్నట్లు సర్వే ఫలితాలు వచ్చినట్లుగా టీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, కల్యాణక్ష్మి, షాదీ ముబారక్, రైతు బంధు వంటి ముఖ్యమైన పథకాల కంటే కేసీఆర్ నాయకత్వంపైనే ఎక్కువమంది విశ్వాసాన్ని చూపించినట్లు సర్వే ఫలితాలు వచ్చినట్టుగా తెలిపారు. దీంతో కేసీఆర్ నాయకత్వమే ప్రచారాస్త్రంగా చేసుకోవాలని భావిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల్లో కేసీఆర్‌కు సరితూగే నాయకుడెవరూ లేరని అన్నివర్గాలు ఆమోదిస్తున్నాయని చెబుతున్నారు. కేసీఆర్ నాయకత్వంపైనే ప్రజలు విశ్వాసంతో ఉన్నారని వచ్చిన సర్వే ఫలితాలను ఆసరాగా చేసుకుని ప్రతిపక్షపార్టీలపై దాడికి దిగాలని భావిస్తున్నారు. కాంగ్రెస్‌లో బహుళ నాయకత్వం, సరైన సయోధ్య లేకపోవడం, అంతర్గత వైరుధ్యాలతో ఆ పార్టీని ఎవరూ నమ్మట్లేదని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. -
రైతుబంధు సాయం వద్దట
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 39 వేల చెక్కుల చెల్లుబాటు ప్రశ్నార్థకంగా మారింది. పంట పెట్టుబడికి ప్రోత్సాహకంగా రాష్ట్ర సర్కారు పంపిణీ చేస్తున్న ‘రైతుబంధు’ చెక్కుల గడువు ఈ నెల 10వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో చెక్కుల గడువు పొడగింపుపై ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతోంది. వీటిని నగదుగా ఉపసంహరించుకోవడానికి మరికొన్ని నెలల గడువు ఇచ్చే అంశంపై బ్యాంకర్లతో సంప్రదింపులు జరుపుతోంది. రైతాంగానికి పెట్టుబడి సాయంగా ఎకరాకు ఏటా రూ.8 వేలు ఇవ్వాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రెండు నెలల క్రితం చెక్కుల పంపిణీకి శ్రీకారం చుట్టింది. జిల్లావ్యాప్తంగా 2,87,307 మంది రైతులకు సహాయం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న వ్యవసాయశాఖ.. ఇందులోభాగంగా ఇప్పటివరకు 2,48,104 మందికి చెక్కులను జారీ చేసింది. పట్టాదారు పాస్ పుస్తకాల సంఖ్యకు అనుగుణంగా చెక్కులను ముద్రించింది. ఈమేరకు వీటిని పంపిణీ చేయాలని భావించినప్పటికీ 39,203 మంది చెక్కులను స్వీకరించేందుకు ముందుకు రాలేదు. ఇందులో అధికశాతం ప్రవాస భారతీయులేనని జిల్లా యంత్రాంగం భావిస్తోంది. విదేశాల్లో స్థిరపడినవారి సంఖ్య గణనీయంగా ఉండడం.. సంపన్న వర్గాలు, ఇతర సెలబ్రిటీలకు జిల్లా పరిధిలో భారీగా వ్యవసాయ భూములుండడంతో రైతుబంధు కింద సాయం తీసుకునేందుకు ఆయా వర్గాలు ఆసక్తి కనబరచడం లేదని తెలుస్తోంది. ఎన్ఆర్ఐలు మాత్రం అందబాటులో లేకపోవడం.. పాస్ పుస్తకాలను ఎప్పుడైనా తీసుకోవచ్చనే ధీమాలో చెక్కులను అంతగా పట్టించుకోవడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వీటి కోసమే స్వగ్రామాలకు రావాలనే ఆలోచన లేకపోవడంతో ఇవి వ్యవసాయ శాఖ అధికారుల వద్దే మూలుగుతున్నాయి. ఏప్రిల్ 19, మే 1, 10, 15వ తేదీల్లో చెక్కులను ప్రింట్ చేసిన ప్రభుత్వం వాటి చెల్లుబాటు గడువు మూడు నెలలు అంటే.. జూలై 19, ఆగస్టు 1, 10, 15వ తేదీతో ముగియనుంది. ఈనేపథ్యంలో వ్యవధి ముగుస్తున్న చెక్కుల పరిస్థితి ఏంటనే ప్రశ్న అధికారుల మదిని తొలుస్తోంది. రూ.31.05 కోట్లు పెండింగ్! గురువారం నాటికీ 2.81 లక్షల చెక్కుల పంపిణీ చేసిన యంత్రాంగం.. దాదాపు రూ.252 కోట్ల మేర సాయాన్ని రైతుబంధు కింద అన్నదాతకు అందజేసింది. మరో 39,203 చెక్కులు పెండింగ్‌లో ఉండడంతో రూ.31.05 కోట్ల సొమ్ము బ్యాంకులో భద్రంగా ఉంది. ప్రవాస భారతీయలు స్థానికంగా అందుబాటులో లేకపోవడం, చెక్కులు తీసుకునేందుకు మొగ్గు చూపకపోవడంతో మగ్గుతున్న చెక్కుల విషయంలో ముందడుగు వేసే అంశంపై ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం లేఖ రాసింది. విత్‌డ్రా గడువు ముగిసిన తర్వాత చెక్కులను రిటర్న్ చేయాలని ఇదివరకే స్పష్టం చేసినందున.. ఈ అంశంపై స్పష్టత కోరింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కూడా ఈ చెక్కుల వినియోగంపై బ్యాంకర్లతో చర్చిస్తున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. చెక్కులను మళ్లీ ముద్రించడం.. వాటిలో తప్పొప్పులను పరిశీలించడం పెద్ద ప్రహసనం కావడంతో ఇవే చెల్లుబాటు అయ్యే విషయాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సూచిస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకర్ల నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా చెక్కుల కాలం ఆధారపడి ఉండొచ్చని అధికారవర్గాలు అభిప్రాయపడుతున్నాయి. కొత్తగా 10,456 పాస్ పుస్తకాలు వివిధ కారణాలతో పెండింగ్‌లో పెట్టిన పాస్ పుస్తకాల జారీకి రెవెన్యూ యంత్రాంగం రంగం సిద్ధం చేసింది. జిల్లావ్యాప్తంగా కొత్తగా 10,456 పట్టాదారు పాస్ బుక్కులను త్వరలోనే రైతులకు పంపిణీ చేయనుంది. ఈమేరకు ఈ రైతులకు రైతుబంధు కింద పెట్టుబడి సాయం అందించేందుకు చెక్కుల ముద్రణ చేపట్టడానికి వ్యవసాయశాఖ కార్యాచరణ తయారు చేస్తోంది. మ్యుటేషన్లు, వారసత్వ బదలాయింపు(సక్సేసన్) తదితర కేటగిరీల కింద 10,456 పాస్ పుస్తకాలను ఇవ్వాలని యంత్రాంగం నిర్ణయించింది. ఈమేరకు ఈ పాస్‌పుస్తకాల్లో నమోదైన భూ విస్తీర్ణం లెక్కలు తీసే పనిలో నిమగ్నమైంది. -
పెట్టుబడి సాయం బాగుంది: మమ్ముట్టి
సాక్షి, హైదరాబాద్ : మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావును కలిశారు. హైదరాబాద్‌లోని బేగంపేట క్యాంపు కార్యాలయంలో శుక్రవారం వీరిద్దరూ భేటీ అయ్యారు. ఈ నెల 25న రవీంద్రభారతిలో జరగనున్న ఇన్నిటెక్ అవార్డు ప్రదాన కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రి కేటీఆర్‌ను మమ్ముట్టి ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వ భాగస్వామ్యంతో తెలంగాణ ప్రాంత మలయాళీ అసోసియేషన్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని తెలిపారు. స్టార్టప్స్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డులను అందించనున్నట్లు మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కొన్ని పథకాలపై మమ్ముట్టి ఆసక్తి వ్యక్తం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న పెట్టుబడి సాయం పథకంపై మమ్ముట్టి ప్రశంసలు కురిపించారు. కేరళ ప్రభుత్వ సహకారంతో శబరిమల దేవస్థానం వద్ద తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలతోపాటు, తెలంగాణలో ఉన్న మలయాళీలకు ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా మమ్ముట్టికి వివరించారు. -
పరుగెత్తే నీటికి నడక నేర్పాలి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ భూభాగం నుంచి ఒక్క చుక్క నీరు కూడా జారిపోకుండా ఎక్కడికక్కడ ఒడిసిపట్టుకొని చెరువులకు మళ్లించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువుపట్టుగా మార్చుకొని సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వలతో, వర్షాలతో, పడబాటు (రీ జనరేటెడ్)తో వచ్చే నీటితో చెరువులను నింపే వ్యూహం ఖరారు చేయాలని చెప్పారు. పరుగెత్తే నీటికి నడక నేర్పాలని సూచించారు. ఏడాదంతా తెలంగాణలోని అన్ని చెరువులూ నిండుకుండల్లా కళకళలాడాలని ఆకాంక్షించారు. కాల్వలను చెరువులకు అనుసంధానిస్తూ మండలాలవారీగా ఇరిగేషన్ మ్యాపులను సిద్ధం చేయాలని ఆదేశించారు. భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల కాలువలతో గొలుసుకట్టు చెరువుల అనుసంధానంపై ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రి టి. హరీశ్‌రావు, ఎంపీలు కె.కేశవరావు, బి. వినోద్‌కుమార్, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, దివాకర్‌రావు, గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్, నీటిపారుదలశాఖ ఇంజనీర్–ఇన్–చీఫ్ మురళీధర్, సీఈలు, ఎస్ఈలు పాల్గొన్నారు. గొలుసుకట్టు చెరువులపై నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ, ఇస్రో రూపొందించిన మ్యాపింగ్‌పై ఆయకట్టు అభివృద్ధి సంస్థ (కాడా) కమిషనర్ మల్సూర్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. తెలంగాణలోని వేలాది చెరువులను ఉపయోగించుకుని వ్యవసాయానికి సాగునీరు అందించే అవకాశాలపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. చెరువులు మన వారసత్వ సంపద... ‘మనకు వారసత్వంగా వచ్చిన వేలాది చెరువులు ఉన్నాయి. బచావత్ ట్రిబ్యునల్ 1974లోనే తెలంగాణలోని చెరువులకు 265 టీఎంసీల నీటిని కేటాయించింది. అంటే అంత భారీగా నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యంగల గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉంది. సమైక్యపాలనలో చెరువులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక మనం మిషన్ కాకతీయ కార్యక్రమం ప్రారంభించి చెరువులను పునరుద్ధరించుకుంటున్నాం. ఎన్నో వ్యయ ప్రయాసలకోడ్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. అలా నిర్మించుకున్న ప్రాజెక్టులతో పొందే నీటిలో ఒక్క చుక్క కూడా వృథా కాకుండా చెరువులకు మళ్లించాలి. గొలుసుకట్టు చెరువులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో గొలుసుకట్టులో 20 నుంచి 70 వరకు చెరువులు ఉన్నాయి. గొలుసుకట్టులో మొదటి చెరువును గుర్తించి ప్రాజెక్టు కాలువకు అనుసంధానించాలి. దాన్ని నింపుకుంటూ వెళ్తే కింద ఉన్న చెరువులూ నిండుతాయి. దీనికోసం కట్టు కాలువ (ఫీడర్ చానల్), పంట కాలువ (క్రాప్ కెనాల్)లను సిద్ధం చేయాలి. ప్రతి మండల అసిస్టెంట్ ఇంజనీర్ దగ్గర ఆ మండలంలోని చెరువుల మ్యాపులు ఉండాలి. ఏ కాలువతో ఏ చెరువును నింపాలనే దానిపై వ్యూహం ఖరారు చేయాలి. ఏ చెరువు అలుగు పోస్తే ఏ చెరువుకు నీరు పారుతుందో తెలిసుండాలి. ప్రాజెక్టుల కాల్వల నుంచే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా నిర్మిస్తున్న వేలాది చెక్ డ్యాములతోపాటు పడబాటు, వానలతో వచ్చే ప్రతి నీటి బొట్టునూ చెరువులకు మళ్లించాలి. తెలంగాణలో నీళ్లు పరిగెత్త కూడదు. అవి మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్ డ్యాములు, చెరువుల నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపోతుంది. వర్షాలూ బాగా కురుస్తాయి. భూగర్భ జలాలు పెరుగుతాయి’అని ముఖ్యమంత్రి వివరించారు. రెండు నెలల్లో వ్యూహం... రాబోయే రెండు నెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహం ఖరారు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా అన్ని చెరువులూ నింపేందుకు అవసరమైన కాల్వల నిర్మాణం చేపట్టాలని, దీనికోసం నిధులు వెంటనే విడుదల చేస్తామని చెప్పారు. ‘వచ్చే ఏడాది జూన్ నుంచి కాళేశ్వరం నుంచి పుష్కలంగా నీళ్లు వస్తాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే చెరువుల అనుసంధానం పూర్తి కావాలి. దీన్ని అత్యంత ప్రాధాన్యతా అంశంగా నీటిపారుదలశాఖ గుర్తించాలి. చెరువులు, కట్టు కాలువలు, పంట కాల్వలను పునరుద్ధరించాలి. అవి ఎప్పటికీ బాగుండేలా చర్యలు తీసుకోవాలి. గతంలో ఆయకట్టుదారులే కాల్వలు, తూములను మరమ్మతు చేసుకునే వారు. ఎండాకాలంలో చెరువుల్లోని మట్టిని పూడిక తీసేవారు. మళ్లీ ఆ రోజులు రావాలి. గ్రామీణ ప్రజలకు దీనిపై అవగాహన, చైతన్యం కలిగించాలి. చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటిపారుదల ఇంజనీర్లతో సమావేశం నిర్వహిస్తాం. నీటిపారుదల వ్యవస్థను మెరుగుపర్చడానికి మనం అత్యంత ప్రాధాన్యత ఇచ్చాం. ఇప్పటికే గోదావరి, కృష్ణా నదుల్లో మనకున్న వాటాను సంపూర్ణంగా వినియోగించుకొవడానికి వీలుగా నీటిపారుదల ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. ఇంకా ఎక్కడెక్కడ నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందో గుర్తించాలి. అక్కడ అవసరమైన ఎత్తిపోతలు, కాలువలు, రిజర్వాయర్లను నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. తమ్మిడిహట్టి బ్యారేజీ నిర్మాణం చేపట్టాలి. కడెంకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉండే కుఫ్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలి. దీంతో కుంటాల జలపాతానికీ నీటి వనరు ఏర్పడుతుంది. కృష్ణా నదిలోనూ కావాల్సినంత నీరు ఉంది. ఈ నీటినీ సమర్థంగా వినియోగించుకునేలా వ్యూహం అమలు చేయాలి’అని సీఎం చెప్పారు. ‘రైతు బంధు’కు దేశవ్యాప్తంగా ప్రశంసలు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. ‘తెలంగాణలో 65 శాతం మంది ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి జీవిస్తున్నా ఇంతవరకు వ్యవసాయాన్ని అప్రాధాన్యతా రంగంగా చూశారు. అది దురదృష్టకరం. యూరప్, అమెరికాలలో రైతులతోపాటు పంట ఉత్పత్తులు, ఉత్పాదకత పెంచేందుకు అక్కడి ప్రభుత్వాలు చాలా ప్రాధాన్యత ఇస్తాయి. కానీ మన దగ్గర సమైక్య పాలనలో రైతులు వంచనకు గురయ్యారు. తెలంగాణ వచ్చాక రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. వాస్తవిక దృక్పథంతో ఆలోచించబట్టే ఇంత మంచి పథకాల రూపకల్పన జరిగింది. రైతు బంధు పథకాన్ని ఆర్థికవేత్తలు అభినందిస్తున్నారు. ఈ పథకాన్ని ఒక మార్గదర్శకంగా కేంద్ర ప్రభుత్వ మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ అభివర్ణించారు’అని కేసీఆర్ చెప్పారు. -
1,44,000 : జిల్లా రైతు బీమా సభ్యుల సంఖ్య..!
సాక్షి, మహబూబ్‌నగర్ రూరల్ : సాగును ప్రోత్సహించడం.. రైతులకు వెన్నుదన్నుగా నిలవడం.. పంట పెట్టుబడితో ఆదుకోవడమే కా కుండా రైతులు ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోయినా, అకాల మరణం సంభవించినా, ఆత్మహత్య చేసుకున్నావారి కుటుంబాలను ఆదుకునేందుకు రైతుబంధు సామూహిక బీమా పథకాన్ని రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా రైతుల కుటుంబాలకు రూ.5 లక్షలు అందనుండగా.. ఒక్కో రైతుకు రూ. 2,271 చొప్పున ఎల్ఐసీకి ప్రీమియంను ప్రభుత్వమే చెల్లించనుంది. రైతుబంధు సామూహిక జీవిత బీమా చేయించేందుకు వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికీ తిరుగుతూ రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరిస్తున్నారు. గత నెల 23వ తేదీ నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కాగా, నామినీ పత్రాల సేకరణను ఈనెల 10వ తేదీ వరకు ప్రభుత్వం గడువు పొడిగించింది. ఇంకా మూడు రోజుల గడువు ఉన్న నేపథ్యంలో మొత్తం రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరించాలనే లక్ష్యంతో అధికారులు ముందుకు సాగుతున్నారు. అటు ఖరీఫ్.. ఇటు సమన్వయ లోపం... రైతుబంధు సామూహిక బీమా పథకంపై వ్యవసాయ శాఖ అధికారులు ఇంటింటికీ వెళ్లి రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరిçస్తున్నా.. ప్రజాప్రతినిధులు, రైతు సంఘాల నేతల మధ్య సమన్వయం లేకపోవడంతో ఆశించిన రీతిలో ముందుకు సాగడం లేదు. రైతుబంధు పథకం కింద రైతులకు పంపిణీ చేసిన కొత్త పాసు పుస్తకాల్లో తప్పులు దొర్లడం, చాలామందికి పాసు పుస్తకాలు అందకపోవడం తదితర సమస్యల వల్ల రైతు బీమా పథకానికి అవరోధాలు ఏర్పడుతున్నాయి. వ్యవసాయశాఖ ఏఈఓలే ఇంటింటికీ తిరగడం వల్ల పనిభారంతో రైతు బీమా పథకం జిల్లాలో అనుకున్న స్థాయిలో వేగంగా సాగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. దీనికి తోడు ప్రస్తుతం వ్యవసాయ సీజన్ కావడం.. వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాలకు వెళ్లే సరికే రైతులు పొలం పనులకు వెళ్లిపోతున్నారు. ఇక బీమా పథకానికి సంబంధించి నామినీ పత్రాలు సేకరించేందుకు ప్రభుత్వం విధించిన గడువు 10వ తేదీ మంగళవారంతో ముగియనుంది. అయితే, జిల్లాలోని మొత్తం 3,35,852 మంది రైతుల్లో 2,22,510 మందిని పథకానికి అర్హులని గుర్తించారు. ఇక ఇందులో ఇప్పటివరకు 1.44 లక్షల మంది నుంచే నామినీ పత్రాలు సేకరించగలిగారు. అంటే మిగిలిన మూడు రోజుల్లో ఇంకా 78,510 మంది రైతుల నుంచి సేకరించాల్సి ఉంది. ఇది ఎంత వరకు సాధ్యమవుతుందో వేచి చూడాల్సిందే. ఏదైనా ఒక్కచోటే... 18 నుంచి 59 ఏళ్లలోపు వయసున్న వారికి బీమా సౌకర్యం కల్పించే విషయంపై సరైన ప్రచారం లేకపోవడం వల్ల కూడా బీమాపై రైతుల్లో ఆసక్తి సన్నగిల్లింది. అంతేకాక ఒకే రైతుకు రెండు, మూడు చోట్ల భూములు ఉండటం వల్ల రికార్డుల్లో విస్తీర్ణం ఎక్కువగా కనిపించడంతో లబ్ధిదారుల సంఖ్య పెరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. భూములు ఒకచోట.. నివాసం మరోచోట ఉండటం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు. అయితే రైతు ఏదైనా ఒకచోట బీమా చేయించుకోవచ్చని.. అన్ని చోట్లా అవసరం లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఏదీఏమైనా దూర ప్రాంతాల్లో ఉన్న రైతులు బీమా పథకంపై నిరాసక్తత కనబరుస్తున్నారు. నామినీ పత్రాల సేకరణ వేగవంతం జిల్లాలో రైతుల వద్ద నుంచి రైతు బీమా పథకానికి సంబంధించి నామినీ పత్రాల స్వీకరణ వేగంగా కొనసాగుతోంది. అర్హులైన రైతుల ఇళ్ల వద్దకే వెళ్లి ఏఈఓలు పత్రాలు స్వీకరిస్తున్నారు. బీమా పత్రాల ఆన్లైన్ ప్రక్రియ సైతం చురుగ్గా సాగుతోంది. గడువు లోగా మొత్తం రైతుల నుంచి నామినీ పత్రాలు సేకరిస్తాం. – సుచరిత, జిల్లా వ్యవసాయశాఖ అధికారి -
కత్తి వ్యాఖ్యలపై స్పందించిన జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: సమాజ సామరస్యానికి భంగం కలిగించే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. కత్తి మహేశ్ లాంటి వారి వ్యాఖ్యలు వర్గాలను రెచ్చ గొట్టే విధంగా ఉన్నాయన్నారు. సమాజంలో ఆందోళనలు కలిగించే విధంగా మాట్లాడటం క్షమించరానిదన్నారు. ఇలాంటి విషయాల్లో జర్నలిస్టులు సంయనం పాటించాలని, అసహ్యమైన మాటలు ప్రచురించకూడదన్నారు. అలాంటప్పుడే రాజకీయ నాయకులు.. ఇది సరికాదని తెలుసుకుంటారన్నారు. సంస్కార హీనంగా ఎవరు మాట్లాడినా తప్పేనని ఆయన వ్యాఖ్యానించారు. రైతుబంధుపై వివరణ ఇవ్వాలి మరోవైపు రేషన్ డీలర్ల సమస్య విషయంలో ప్రభుత్వం దిగి వచ్చినందుకు అభినందిస్తున్నామన్నారు. రైతుబంధు పథకాన్ని ప్రభుత్వం ఎందుకు పెట్టిందో వివరణ ఇవ్వాలన్నారు. రైతులకు పెట్టుబడి సహాయం కోసమే పథకం అయితే పర్వాలేదు. కానీ పథకం లక్ష్యం నెరవేరటం లేదని పేర్కొన్నారు. ప్రభుత్వం వద్ద లెక్కలు లేకపోవటంతో వ్యవసాయం చేసే వారికి నష్టం జరుగుతుందన్నారు. రైతుబంధు పథకాన్నీ స్వాగతిస్తూనే.. నిజమైన సాగుదార్లకు న్యాయం చేయాలని కోరుతున్నట్టు ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైతే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలన్నారు. వివరాలు, సూచనలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నామని, వ్యవసాయం చేసే వారికి మాత్రమే సహాయం అందాలన్నారు. అవసరమైతే పట్టాదారుల నుంచి సాగుదార్లకు సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
ఆందోళనలో అన్నదాతలు
అనంతగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, భూ ప్రక్షాళనలో చాలా తప్పులు దొర్లడంతో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని తెలంగాణ జన సమితి జిల్లా ఇన్చార్జి శ్రీశైల్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. టీజెఎస్ ఆధ్వర్యంలో బాధిత రైతులతో కలిసి కలెక్టర్ కార్యాలయాన్ని మంగళవారం ముట్టడించారు. నాయకులు, రైతులతో కలిసి దాదాపు 3 గంటల పాటు ధర్నా చేశారు. కలెక్టర్ కార్యాలయం ఆవరణలో కూర్చుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ధర్నా చేస్తున్న రైతులు తాము కలెక్టర్‌తో మాట్లాడుతామని, వెంటనే బయటకు రావాలని నినాదాలు చేశారు. ఓ దశలో రైతులు కలెక్టర్ కార్యాలయంలోకి Ðవెళ్లేందుకు ప్రయత్నించగా సీఐ వెంకట్రామయ్య, డీఎస్పీ శిరీష నచ్చజెప్పి శాంతింపజేశారు. పోలీసులు అక్కడికి మరింత మంది సిబ్బందిని రప్పించారు. కాగా జేసీ అరుణకుమారి రైతుల ధర్నా వద్దకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో కంకల్ గ్రామానికి చెందిన రైతులు తన సమస్యలు చెప్పుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు. తాము కలెక్టర్‌కు కూడా కలిసి తమ సమస్యలు చెబుతామని అక్కడే భీష్మించుకుని కూర్చున్నారు. లోపలికి వెళ్లేందుకు సిద్ధపడగా పోలీసులు వారికి నచ్చజెప్పారు. చివరకు కలెక్టర్ రైతుల వద్దకు వచ్చి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం వికారాబాద్ విషయంలో మాత్రం చిన్నచూపు చూస్తోందన్నారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా పట్టా పాసుపుస్తకాలు, చెక్కులు రాలేవడంలేదని రైతులు ఆయనతో తెలిపారు. ఈ సందర్భంగా శ్రీశైల్‌రెడ్డి మాట్లాడుతూ టీజేఎస్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పలు గ్రామాల్లో తమ బృంధం పర్యటించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకుందని అన్నారు. రైతులతో మాట్లాడితే వారు కన్నీటి పర్యంతమవుతున్నారని వాపోయారు. భూ ప్రక్షాళన పేరిట రైతులు ఏళ్ల తరబడి ఉన్న భూముల పట్టా పాసుపుస్తకాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారన్నారు. ఏళ్ల తరబడి తాము సాగుచేస్తున్న భూమిపై పలుచోట్ల వేరే వారి పేర్లు వచ్చాయన్నారు. ఇలాంటి తప్పిదాలతో రైతులు భయందోళనలకు గురవుతున్నారన్నారు. అధికారులకు తక్కువ సమయం ఇచ్చి వారిపై పనిఒత్తిడి పెంచి ఎన్నికల స్టంట్‌గా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నారని ఆయన ఆరోపించారు. జైదుపల్లి, కంకల్ గ్రామాల్లో రైతులు ఏళ్లతరబడి సాగుచేస్తున్న భూముల్లో ఇప్పుడు అటవీ శాఖ అధికారులు వచ్చి ఈ భూములు తమవి అంటున్నారని, దున్నుకోవడానికి అనుమతించడం లేదని వాపోయారు. పట్టా ఒకరిపై ఉంటే కొత్తపాసు పుస్తకాలు మరొకరి పేరిట వచ్చాయని, అలాంటి వారి సమస్యలను ప్రభుత్వం వెంటనే తెలుసుకుని పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వందల ఎకరాలు ఉన్న రైతులకేమో రైతుబంధు చెక్కులు లక్షల్లో వస్తున్నాయని, పంట పండించే రైతులకు మాత్రం చిన్నపాటి సమస్యలు అడ్డుపెట్టుకుని చెక్కులు ఇవ్వకపోవడంతో వారి పరిస్థితి దయనీయంగా మారిందని అన్నారు. అనంతరం జిల్లా నాయకులు గడ్డం రాంచందర్, కల్కోడ నర్సింలు మాట్లాడుతూ భూ రికార్డులు, పాసు పుస్తకాల్లో జరిగిన అవకతవకల వల్ల రైతుల బతుకులు వీధిన పడుతున్నాయన్నారు. ఈ విషయంలో కలెక్టర్ వెంటనే కల్పించుకుని వారి రికార్డులను సరిచేసి కొత్త పాసు పుస్తకాలు, రైతుబంధు చెక్కులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నాయకులు వినతిపత్రం అందజేసి అక్కడి నుంచి డీఎఫ్ఓ కార్యాలయానికి వెళ్లారు. ఈ కార్యక్రమంలో టీజేఎస్ నాయకులు జగదీష్, మాణిక్‌రెడ్డి, లక్ష్మణ్, గోపాల్, అజయ్, విక్రం, సుధీర్, మురళి, శ్రీనివాస్, రైతులు తదితరులు పాల్గొన్నారు. -
రైతుబంధం తెగుతోంది!
బెల్లంపల్లి : భూరికార్డుల ప్రక్షాళన సర్వే, రైతుబంధు చెక్కుల పంపిణీ హత్యలకు పురిగొల్పుతున్నాయి. రక్త సంబంధీకులు, బంధువుల మధ్య వైరుధ్యాన్ని పెంచుతున్నాయి. భవిష్యత్‌లో ఎలాంటి భూ వివాదాలు తలెత్తకుండా ఉండాలనే సంకల్పంతో ప్రారంభించిన భూ ప్రక్షాళన సర్వే కొనసాగుతున్న క్రమంలోనే ఒకరిపై ఒకరు కత్తులు దూసుకుంటున్నారు. ఆస్తి కోసం అయిన వారు అని చూడకుండా ఏకంగా ప్రాణాలే తీస్తున్నారు. భూ వివాదాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నెల రోజుల వ్యవధిలో ముగ్గురు వ్యక్తులు హత్యకు గురయ్యారు. పలువురిపై దాడులు జరిగాయి. రోజు ఏదో ఓ చోట ఈ ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. భూ వివాదాలు లేకుండా.. నిజాంకాలంలో చేసిన భూముల సర్వే తర్వాత రాష్ట్ర ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళనకు సిద్ధపడింది. దశాబ్దాల నుంచి అపరిష్కృతంగా, వివాదాలతో ఉన్న భూముల రికార్డులను సరి చేసి, భవిష్యత్‌లో ఎలాంటి గొడవలకు తావు ఉండకూడదనే ఉద్దేశంతో ప్రభుత్వం భూ ప్రక్షాళనకు నడుం బిగించింది. ఈ సర్వే 2017 సెప్టెంబర్ 15 నుంచి లాంఛనంగా ప్రారంభించారు. గ్రామాల వారీగా ముందస్తుగా నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారంగా భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. తొలి దఫా సర్వే చేసిన భూములను పార్ట్-ఏ కింద గుర్తించగా, వివాదాలు, తగాదాలు, సర్వే నంబర్ల తారుమారు, ప్రభుత్వ ,అటవీ భూములు, పంపకాలు జరగని, ఇతరాత్ర కారణాలు కలిగిన భూములను పార్ట్-బీ కింద పరిగణించారు. ప్రస్తుతం పార్ట్-ఏ పరిధిలో ఉన్న భూముల సర్వేను పూర్తి చేశారు. పార్ట్-బీ పరిధిలో చేర్చిన భూముల వివరాలను నమోదు చేసుకుంటున్నారు. అధికారికంగా ఆన్లైన్లో మాత్రం వివరాలు నమోదు చేయడం లేదు. వీఆర్వోలు మాత్రం వివరాల సేకరణలో నిమగ్నమయ్యారు. భూ సర్వేతో... భూ ప్రక్షాళన సర్వేతో గ్రామాల్లో స్థబ్దతగా ఉన్న భూ వివాదాలు క్రమంగా మొదలయ్యాయి. పాలి పంపకాలు, భూమి అమ్మకం, కొనుగోళ్లతో తలెత్తిన తగాదాలు, విరాసత్ తదితర రకాల భూ సమస్యలు బహిర్గతం అయ్యి గొడవలకు ప్రేరేపించాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం పంట పెట్టుబడి సాయం కింద ఎకరానికి రూ.4 వేల చొప్పున ఆర్థిక వితరణ ప్రకటించింది. పార్ట్-ఏ కొంద భూ సర్వే పూర్తి చేసిన భూములకు పంట పెట్టుబడిని చెక్కుల రూపంలో అందజేసింది. గత మే 10 నుంచి 18 వరకు గ్రామగ్రామాన చెక్కుల పంపిణీ నిర్వహించారు. దీంతో భూ వివాదాలు, పగలు మరింత రెట్టింపయ్యాయి. భూమి, పంట పెట్టుబడి దక్కడం లేదనే కసితో మరణాయుధాలతో దాడులు చేసి, రక్తం కళ్ల జూస్తున్నారు. హత్యా,హత్యాయత్నాలకు సిద్ధపడుతున్న ఘటనలు ఎప్పటికప్పుడు చోటు చేసుకుంటున్నాయి. భూమి కోసం ఎంతకైనా తెగిస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పార్ట్-బీ సర్వే ఆరంభమయ్యాక మరిన్నీ హింసాత్మక ఘటనలు జరిగే అవకాశాలు లేకపోలేదని పలువురు భావిస్తున్నారు. అసలైన భూమి చిక్కు ముడులన్నీ కూడా పార్ట్-బీలోనే ఉండటం గమనార్హం. తలనొప్పిగా మారిన భూ తగాదాలు గ్రామాల్లో చోటు చేసుకుంటున్న భూ తగాదాలు పోలీసులకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఏ చిన్న భూ సమస్య ఏర్పడిన ఘర్షణ పడి పోలీసుస్టేషన్‌కు వెళ్తున్నారు. ఒకరిపై ఒకరు కేసు పెడుతున్నారు. క్షణికావేశంలో ఏకంగా హత్య చేస్తున్నారు. హత్యాయత్నాలకు పాల్పడుతున్నారు. భూ వివాదాలు సివిల్ మ్యాటర్‌గా పరిగణించి పోలీసులు ఇరువర్గాలను సముదాయించి పంపిస్తుండగా చిలికిచిలికి గాలివానగా మారి ఘర్షణ పడుతుండటంతో క్రిమినల్ కేసులుగా రూపాంతరం చెందుతున్నాయి. ప్రస్తుతం గ్రామాల్లో ఇతర కేసులు తగ్గుముఖం పట్టగా భూముల కోసం పొట్లాడుకుంటున్న కేసులు అధికంగా ఠాణాలకు వస్తున్నట్లు పోలీసువర్గాలు చెబుతున్నాయి. ఈతీరు పోలీసులకు సంకటంగా మారింది. ఇటీవల జరిగిన ఘటనలు మంచిర్యాల జిల్లా నెన్నెల మండలం బొప్పారం గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డిపై అన్న బాపురెడ్డి ఈనెల 13న భూ వివాదంతో వేట కత్తితో పట్టపగలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. తృటిలో తమ్ముడు లక్ష్మారెడ్డి ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. కుమురం భీం జిల్లా కౌటాల మండలం మొగడ్‌దగడ్ గ్రామంలో భూ వివాదంతో ఈనెల 15న మెస్రం వచలాబాయి, మెస్రం కమలాబాయి అనే ఇద్దరు మహిళలను వరుసకు కొడుకైన మెస్రం నానాజీ గొడ్డలితో అతికిరాతంగా నరికి చంపాడు. రెబ్బెన మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన దుర్గం సాంబయ్య అతని కుటుంబ సభ్యులు తమ భూమి అక్రమంగా రెవెన్యూ అధికారులు మరొకరికి రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపిస్తూ ఈ నెల 22న తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళన చేశారు. కాగజ్‌నగర్ మండలం బోడేపల్లి గ్రామంలో భూ తగాదాలతో బోర్లకుంట లక్ష్మి అనే మహిళపై రక్త సంబంధికుడైన బోర్లకుంట పోచయ్య గొడ్డలితో ఈ నెల 23న దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు.రెబ్బెన మండలం ధర్మారం గ్రామంలో ఈనెల 27న నాయిని లచ్చయ్యను అతని అన్న నాయిని వెంకటేశ్ గొడ్డలితో దారుణంగా హత్య చేశాడు. -
వలసజీవికి చేయూత ఏదీ?
కామారెడ్డి : రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెడుతున్న పథకాలు విదేశాలకు వెళ్లిన వలస జీవులకు దక్కడం లేదు. పథకాలు అందక ముఖ్యంగా గల్ఫ్‌కు వెళ్లిన వలసకార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టిన రైతులందరికీ కొత్త పాసుపుస్తకాలు అందించింది. అంతేగాక రైతుబంధు కార్యక్రమం ద్వారా ఎకరాకు పంటకు రూ.4 వేల చొప్పున పెట్టుబడిసాయం అందించింది. వీటికితోడు ప్రతీ రైతుకు రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తోంది. అయితే ఇవేవీ వలస జీవులకు అందడం లేదు. ఇదేమంటే భూ యజమాని నేరుగా వచ్చి తమ పేరిట ఉన్న పాసుపుస్తకాన్ని, రైతుబంధు చెక్కు అందుకోవాలని చెబుతున్నారు. వేల మైళ్ల దూరాన ఉన్న వాళ్లు రైతుబంధు కోసమో, పాసుపుస్తకం కోసమో ఇంటికి రావాలంటే ఎంతో వ్యయంతో కూడుకున్న పని. అప్పు చేసైనా వద్దామంటే అక్కడి ప్రభుత్వాలు అత్యవసర పరిస్థితుల్లో వీసాలు కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. తమ పేరిట ఉన్న పాసుపుస్తకాలను కుటుంబ సభ్యులకు ఇవ్వాలన్న వలస జీవుల వినతులు ప్రభుత్వానికి వినపడడం లేదు. తెలంగాణ రాష్ట్రంలోని ఆయా జిల్లాలకు చెందిన వారు దాదాపు 10 లక్షల మంది దాకా గల్ఫ్ దేశాల్లో ఉన్నట్టు అంచనా. అయితే భూమి ఉండి విదేశాల్లో ఉంటున్న వారి సంఖ్య దాదాపు 1.50 లక్షలు ఉంటుందని రెవెన్యూ అధికారుల లెక్కలు వేశారు. ఈ 1.50 లక్షల మందిలో 90 శాతం గల్ఫ్‌లోనే ఉంటున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉన్నవారిలో అందరూ సన్న, చిన్నకారు రైతులే కావడం గమనార్హం. చాలా మంది వ్యవసాయం దెబ్బతిని, బోర్లు తవ్వించి అప్పులపాలై పొట్ట చేతపట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లినవారే ఉంటారు. అమలుకు నోచుకోని హామీ... వలస వెళ్లిన రైతులకు కూడా పాసుపుస్తకాలు అందిస్తామని, రైతుబంధు సాయం అందుతుందని ప్రభుత్వం హామీ ఇచ్చింది. కానీ, ఇప్పటి వరకు వలస రైతులకు పాసుపుస్తకాలపై ఇంకా ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాన్నీ వెలువరించడం లేదు. దీంతో ఆ కుటుంబాలు మనోవేదనకు గురవుతున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులను కలిసి తమకు న్యాయం చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘బీమా’ ధీమా లేదు.. వ్యవసాయ భూములు కలిగి ఉన్న వలస జీవులకు కనీసం బీమా కూడా దక్కడం లేదు. రైతుబంధు ద్వారా రైతులందరికీ సాయం అందించడంతో పాటు ప్రతీ ఒక్కరికి రూ.5 లక్షల బీమా సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం వలస జీవులకు ఆ అవకాశం కల్పించడం లేదు. భూమిని నమ్ముకుని బతికిన తమవాళ్లు వ్యవసాయం దెబ్బతినడం మూలంగానే విదేశాలకు వెళ్లారని, అలాంటి తమవారిని ఇబ్బందులకు గురిచేయడం తగదంటున్నారు. పాత రికార్డుల ఆధారంగా ఇప్పటికైనా ప్రభుత్వం పాసుపుస్తకాలు అందించడంతో పాటు రైతుబంధు సాయం అందించాలని, బీమా సౌకర్యం కల్పించాలని కోరుతున్నారు. -
రైతుబంధు సాయం లేఖపై స్పందించిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: రైతుబంధు పథకం వల్ల ప్రభుత్వ ఖజానా ఖాళీ అయిపో తోందని, అర్హులకే ఆర్థిక సాయం అందచేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలంటూ నల్లగొండ జిల్లాకు చెందిన న్యాయవాది పి.యాదగిరిరెడ్డి రాసిన లేఖపై హైకోర్టు స్పందించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలని మంగళవారం ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ, ఆర్థిక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూలై 17కి వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు రూ.4 వేల సాయాన్ని రైతులందరికీ ఇవ్వడం వల్ల ప్రజాధనం వృథా అవుతోందని, అందువల్ల చిన్న, సన్నకారు రైతులకే ఆర్థిక సాయం అందించేలా చూడాలంటూ యాదగిరి రెడ్డి రాసిన లేఖను హైకోర్టు పిల్‌గా స్వీకరించింది. -
35 వేల పాస్ పుస్తకాల్లో తప్పులు
ఎల్లారెడ్డి/తాడ్వాయి(ఎల్లారెడ్డి): పట్టా పాసు పుస్తకాలలో వచ్చిన తప్పులను సరిదిద్ది ఈ నెలాఖరులోగా కొత్త పాసు పుస్తకాలను అందిస్తామని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న పట్టాపాసు పుస్తకాల సవరణ పనులను ఆయన పరిశీలించారు. త్వరగా పూర్తి చేయా లని తహసీల్దార్‌కు సూచించారు. అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. ధరణి సాఫ్ట్వేర్ వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. జి ల్లాలో 35 వేల పట్టాపాసు పుస్తకాలలో తప్పులు దొర్లినట్లు గుర్తించామని చెప్పారు. వీటిలో 14,500 పాసు పుస్తకాల్లోని మొదటి పేజీల్లో త ప్పులు రావడంతో సరి చేసేందుకు హైదరాబాద్ కు పంపించామని తెలిపారు. 10,200 పట్టా పా సుబుక్కుల్లో రెండో పేజీలో తప్పులు రావడంతో తప్పులను సరిచేసి ఇక్కడే అందించేందుకు చర్య లు చేపట్టామన్నారు. ఆధార్ సీడింగ్ లేనందువల్ల 8,900 రైతులకు పట్టాపాసు పుస్తకాలు రాలేదని.. వీరికి త్వరలోనే అందిస్తామని చెప్పారు. 2 వేల పౌతి కేసులు, 7,700 అసైన్డ్ భూములకు సంబంధించిన వాటిని కూడా క్లియర్ చేస్తామని తెలిపారు. పార్ట్–బీకి సంబంధించిన కేసులను తరువాత పరిశీలిస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.75 లక్షల పట్టా పాసు పుస్తకాలను అందించామ ని వివరించారు. రైతు బీమా పథకానికి సంబంధించిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. ఆగస్టు 15 తరువాత రైతులకు బీమా బాండ్లను అందిస్తామన్నారు. ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్లు అంజయ్య, బాసిద్, సయీద్ తదితరులు పాల్గొన్నారు. -
యాంకర్ సుమకు ‘రైతు బంధు’ చెక్కు
బాలానగర్ (జడ్చర్ల): మండలంలోని హేమాజీపూర్ గ్రామ పాఠశాలను సినీ నటుడు రాజీవ్ కనకాల, యాంకర్ సుమ దంపతులు బుధవారం సందర్శించారు. హేమాజీపూర్ శివార్లలో వారికి వ్యవసాయం పొలం ఉండగా వచ్చారు. ఈ సందర్భంగా వారు గతంలో పాఠశాలలకు ప్రొజెక్టర్, లాప్‌ట్యాప్‌లు బహూకరించగా వాటిని వారు పరిశీలించారు. అనంతరం రాజీవ్–సుమ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కంప్యూటర్ విద్య అందాలనే భావనతో రూ.లక్ష వ్యయంతో వీటిని అందజేశామన్నారు. తెలంగాణలోని గురుకుల పాఠశాలల్లో ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.లక్షలు వెచ్చిస్తున్నందున ప్రైవేటు పాఠశాలల్లో చేరి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ఈ మేరకు సుమ, రాజీవ్‌తో పలువురు గ్రామస్తులు ఫొటోలు దిగారు. ‘రైతు బంధు’ చెక్కు వెనక్కి.. హేమాజీపూర్ గ్రామ శివారులో తమకు ఉన్న భూమికి సంబంధించి సినీ నటుడు రాజీవ్‌కు ప్రభుత్వం నుంచి తాజాగా రూ.29 వేల విలువైన పెట్టుబడి సాయం చెక్కు అందింది. అయితే, తాను ఆర్థికంగా కొంత మేర స్థిరపడినందున రైతుల సంక్షేమానికి ఉపయోగించేలా చూడాలని కోరుతూ ఆ చెక్కును రాజీవ్ బుధవారం తహసీల్దార్ రాంబాయికి అందజేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్ మురళీదర్ రెడ్డి, ఉప సర్పంచ్ రమేష్, కరుణాకర్‌తో పాటుబాలానగర్ రైతు సమన్వయ కన్వీనర్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో... జడ్చర్ల టౌన్: జడ్చర్ల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి బుధవారం రాజీవ్ కనకాల, సుమ దంపతులు వచ్చారు. భూమికి సంబంధించిన లావాదేవీల విషయంలో వారు కార్యాలయానికి చేరుకుని అధికారులతో మాట్లాడారు. -
‘రైతుబంధు’లో రాబందులు
ఇల్లెందురూరల్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ‘రైతుబంధు’ప«థకంలోకి రాబందులు చొరబడ్డాయి. రెవెన్యూ, వ్యవసాయ అధికారులు మూడు నెలలు కుస్తీ పట్టి భూ రికార్డులను కొలిక్కి తెచ్చారు. అయినా రికార్డులను తారుమారు చేసి, ఫొటోలను మార్ఫింగ్ చేసి దర్జాగా నిధులు స్వాహా చేశారు. లబ్ధిదారులకు చెక్కులు అందకపోవటంతో వ్యవసాయశాఖ కార్యాలయానికి వెళ్లి వాకబు చేయగా అసలు బండారం బయట పడింది. కారేపల్లి మండలం మంగళతండాకు చెందిన రైతులు పిల్లలమర్రి మంగీకి రైతుబంధు పథకంలో రూ.24వేల చెక్కు మంజూరైంది. మంగీ ఆధార్‌కార్డును నెహ్రునగర్‌కు చెందిన బోడ పార్వతి(దళారీ బావమరిది భార్య) ఫొటోతో మార్ఫింగ్ చేసి చెక్కును తీసుకొని బ్యాంకుకు వెళి నగదు డ్రా చేసుకున్నారు. ఇల్లెందు మండలం చల్లసముద్రం రెవెన్యూ గ్రామానికి చెందిన జాటోత్ రమేశ్, తేజావత్ కృష్ణ, జాటోత్ సత్యం, బానోత్ చందర్, తేజావత్ వర్మ, తేజావత్ బరత్, భూక్య శ్రీను, మాలోత్ వస్ర తదితర రైతుల చెక్కులను మార్ఫింగ్ చేసి నగదు పొందారు. ఇదే గ్రామానికి చెందిన మృతి చెందిన రైతులు బానోత్ బాలు నాలుగు ఎకరాలకు చెందిన రూ.16వేల చెక్కును, భూక్య మల్లుకు చెందిన నాలుగు ఎకరాలకు చెందిన రూ.16వేలు, బానోత్ భీముడుకు చెందిన రూ.27వేల చెక్కును కూడా తీసుకుని నగదు పొందారు. మంగళతండాకు చెందిన నాయకుడు చెక్కుల గురించి రైతులకు సమాచారం ఇవ్వగా.. బుధవారం వారు మండల వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి తమకు చెక్కులు రాలేదని ఏఓ నరసింహారావును ప్రశ్నించారు. అయితే చెక్కులన్నీ పంపిణీ పూర్తయిందని, మీకు కూడా అందజేశామని అన్నారు. తమకు అందలేని రైతులు నిలదీయగా జాబితాను పరిశీలించగా చెక్కులు పొంది బ్యాంకులో డ్రా అయినట్లు తేలటంతో అధికారులు అవాక్కయ్యారు. క్షుణ్ణంగా పరిశీలన చేయగా ఆధార్‌కార్డులను మార్ఫింగ్ చేసినట్లు తేటతెల్లమైంది. ఈ వ్యవహారం తమ దృష్టికి వచ్చిందని, విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఇల్లెందు తహసీల్దార్ శ్రీనివాసులు తెలిపారు. -
భూమి అమ్మేసుకున్నా రైతు బీమా
సాక్షి, హైదరాబాద్ : పట్టాదారు పాసు పుస్తకమున్న రైతు ‘రైతు బంధు బీమా’లో నమోదయ్యాక తన భూమిని అమ్మేసుకున్నా కూడా.. ఆ ఏడాది మొత్తం బీమా కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే ఆగస్టు 15వ తేదీ తరువాత కొత్తగా వ్యవసాయ భూములు కొనుగోలు చేసి, పట్టాదారు పాసుపుస్తకాలు పొందే రైతుల పేర్లతో నెలవారీగా జాబితా తయారు చేస్తామని.. ఏడాది మొత్తానికి ప్రీమియం చెల్లించి బీమా పరిధిలోకి తీసుకువస్తామని పేర్కొంది. అయితే తమ పేరిట వ్యవసాయ భూమి ఉండి, 18 ఏళ్ల వయసు నిండే పట్టాదారులకు మాత్రం తర్వాతి ఏడాది రెన్యువల్ తేదీలోనే పాలసీ ఇవ్వనున్నట్టు స్పష్టం చేసింది. ఇక బీమా పరిధిలో ఉన్న రైతులెవరైనా మరణిస్తే.. ఆరునెలల్లోపు క్లెయిమ్ చేసుకోవాలి. ఆ తరువాత పరిహారం కావాలంటే ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు రైతు బీమా అమలు మార్గదర్శకాలతో వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి.పార్థసారథి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రపంచంలోనే ఎల్ఐసీకి ఎక్కువ మంది పాలసీదారులు ఉన్నారని.. విశ్వాసం, విస్తృతమైన సంస్థ కావడంతోనే రైతుబంధు బీమాకు ఎంపిక చేశామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటివరకు 4 వేల గ్రామాల్లోని 6.5 లక్షల మంది రైతులను బీమా పరిధిలోకి తీసుకొచ్చినట్టు, ప్రక్రియ ఇంకా కొనసాగుతున్నట్టు తెలిపారు. నామినీ పేరు మార్చుకునే అవకాశం ఆగస్టు 15వ తేదీ నుంచి ‘రైతు బంధు బీమా’పథకం అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. 18 ఏళ్ల నుంచి 59 ఏళ్ల మధ్య వయసు ఉండి, పట్టాదారు పాస్‌పుస్తకం ఉన్న రైతులు ఈ పథకానికి అర్హులు. బీమా చేసుకున్న రైతు ఏదైనా కారణంతో మరణిస్తే రూ.5 లక్షలు అందిస్తారు. ఒకసారి నామినీ పేరు ఇచ్చిన తరువాత కూడా నామినీలను మార్చుకునేందుకు అవకాశం ఇవ్వనున్నారు. అలాగే టీవీ చానళ్లు, వార్తా పత్రికల ద్వారా ప్రచారం కల్పించి గ్రామాల్లో నివాసం ఉండని రైతులకు సమాచారమిచ్చి.. రైతు బీమాలోకి తీసుకురానున్నారు. ఇందుకు రైతు సమితి సభ్యులు, ఆయా గ్రామ సర్పంచ్ల సహకారం తీసుకుంటారు. అవసరమైతే గ్రామాల్లో ఉండని రైతులకు సమాచారం ఇవ్వాలని.. వారి ఇరుగుపొరుగు వారికి తెలియజేయాలని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. ఎల్ఐసీ సంస్థ ఏటా బీమా ధ్రువపత్రాలను రైతులకు అందజేస్తుంది. మార్గదర్శకాల్లోని అంశాలివీ.. ఏటా ఆగస్టు 1న అర్హత కలిగిన ఒక్కో రైతు పేరు మీద ప్రభుత్వం జీఎస్టీతో కలిపి రూ.2,271.50 ప్రీమియం సొమ్మును ఎల్ఐసీకి చెల్లిస్తుంది. పథకం అమలుకు వ్యవసాయశాఖ కమిషనర్‌ను నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుంది. రైతుల వివరాలను, నామినేషన్ పత్రాలను జూన్ నెలలో సేకరించి, ఎప్పటికప్పుడు ఆన్లైన్లో నమోదు చేస్తారు. ప్రస్తుతమున్న ప్రీమియంను పాలసీ నిబంధనలకు అనుగుణంగా రెండేళ్లకోసారి సమీక్షిస్తారు. ఆధార్ కార్డు ఆధారంగానే బీమా నమోదు ప్రక్రియ ఉన్నందున.. డూప్లికేషన్ లేకుండా జాగ్రత్తలు తీసుకోనున్నారు. బీమా పరిధిలోకి వచ్చిన రైతుల వివరాలను ఒక రిజిస్టర్లో నమోదు చేస్తారు. రెండు పాసు పుస్తకాలున్నా ఒకే బీమా పాలసీని అమలుచేస్తారు. రెవెన్యూ శాఖ రికార్డుల ఆధారంగా 18–59 ఏళ్ల వయసున్న పట్టాదారు రైతుల నుంచి బీమా, నామినీ పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15వ తేదీ ఆధారంగా రైతు వయసును పరిగణనలోకి తీసుకుంటారు. అంటే 14 ఆగస్టు 1959 నుంచి 15 ఆగస్టు 2000 మధ్య పుట్టినవారే బీమాకు అర్హులు. ఆధార్‌కార్డులో రైతు పుట్టిన సంవత్సరం మాత్రమే ఉండి తేదీ లేకపోతే.. అలాంటివారికి జూలై ఒకటో తేదీని పుట్టిన రోజుగా పరిగణిస్తారు. రైతు సమన్వయ సమితి సభ్యులను ఈ పథకంలో ఏఈవోలు భాగస్వాములు చేయాలి. ఏఈవోలు ఇచ్చిన వివరాలను రెవెన్యూశాఖ ఇచ్చిన రికార్డులకు అనుగుణంగా ఉన్నాయో లేదో ఏవోలు పరిశీలించాలి. నామినీ మైనర్ అయితే.. రైతు సూచించిన వారి పేరు (సంరక్షకులుగా) ఇవ్వాలి. సేకరించిన బీమా పత్రాలన్నింటినీ వ్యవసాయ సహాయ సంచాలకుల కస్టడీలో రెండేళ్లపాటు భద్రంగా ఉంచాలి. రైతులెవరైనా మరణిస్తే.. కుటుంబసభ్యులు పరిహారం కోసం నోడల్ ఏజెన్సీ ద్వారా సమాచారం ఇవ్వాలి. మరణ ధ్రువీకరణ పత్రం, నామినీ ఆధార్ కార్డు సమర్పించాలి. ఎల్ఐసీ సంస్థ పది రోజుల్లోగా నేరుగా నామినీ బ్యాంకు ఖాతాలో రూ.5 లక్షల పరిహారం సొమ్మును జమ చేస్తుంది.