సాక్షి,హైదరాబాద్:రైతులను విజయవంతంగా మోసం చేసినందుకు రైతు పండుగ నిర్వహిస్తున్నావా రేవంత్‌రెడ్డి? అని బీఆర్‌ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావు నిలదీశారు. ఈ మేరకు హరీశ్‌రావు శనివారం(నవంబర్ 30) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.
‘మేనిఫెస్టోలో చెప్పి,రైతులను నమ్మించి అధికారంలోకి వచ్చాక దగా చేసినందుకు విజయోత్సవాలా రేవంత్ రెడ్డి? రైతుల బతుకులు మార్చేందుకు కేసీఆర్ తీసుకొచ్చిన రైతు బంధు పథకాన్ని నిలిపివేసే కుట్రను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది.
నేడు మహబూబ్‌నగర్‌లో నిర్వహించే కార్యక్రమంలో రైతు బంధు అమలుపై స్పష్టత ఇవ్వాలి.పెండింగ్‌లో ఉన్న వానకాలం రైతుబంధుతో పాటు యాసంగికి పంట పెట్టుబడి సాయం వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.
Comments
Please login to add a commentAdd a comment