ఎల్లారెడ్డిలో రికార్డులు పరిశీలిస్తున్న కలెక్టర్ సత్యనారాయణ
ఎల్లారెడ్డి/తాడ్వాయి(ఎల్లారెడ్డి): పట్టా పాసు పుస్తకాలలో వచ్చిన తప్పులను సరిదిద్ది ఈ నెలాఖరులోగా కొత్త పాసు పుస్తకాలను అందిస్తామని, రైతులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పని లేదని కలెక్టర్ సత్యనారాయణ స్పష్టం చేశారు. గురువారం ఎల్లారెడ్డి తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న పట్టాపాసు పుస్తకాల సవరణ పనులను ఆయన పరిశీలించారు. త్వరగా పూర్తి చేయా లని తహసీల్దార్‌కు సూచించారు.
అనంతరం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ.. ధరణి సాఫ్ట్‌వేర్ వలన ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. జి ల్లాలో 35 వేల పట్టాపాసు పుస్తకాలలో తప్పులు దొర్లినట్లు గుర్తించామని చెప్పారు. వీటిలో 14,500 పాసు పుస్తకాల్లోని మొదటి పేజీల్లో త ప్పులు రావడంతో సరి చేసేందుకు హైదరాబాద్ కు పంపించామని తెలిపారు. 10,200 పట్టా పా సుబుక్కుల్లో రెండో పేజీలో తప్పులు రావడంతో తప్పులను సరిచేసి ఇక్కడే అందించేందుకు చర్య లు చేపట్టామన్నారు.
ఆధార్ సీడింగ్ లేనందువల్ల 8,900 రైతులకు పట్టాపాసు పుస్తకాలు రాలేదని.. వీరికి త్వరలోనే అందిస్తామని చెప్పారు. 2 వేల పౌతి కేసులు, 7,700 అసైన్డ్ భూములకు సంబంధించిన వాటిని కూడా క్లియర్ చేస్తామని తెలిపారు. పార్ట్–బీకి సంబంధించిన కేసులను తరువాత పరిశీలిస్తామన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 1.75 లక్షల పట్టా పాసు పుస్తకాలను అందించామ ని వివరించారు. రైతు బీమా పథకానికి సంబంధించిన పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. ఆగస్టు 15 తరువాత రైతులకు బీమా బాండ్లను అందిస్తామన్నారు. ఆర్డీవో దేవేందర్‌రెడ్డి, తహసీల్దార్లు అంజయ్య, బాసిద్, సయీద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment