
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రైతుబంధుకు ఈసీ బ్రేక్ ఇవ్వడంతో బీఆర్‌ఎస్ బిగ్ షాక్ తగిలినట్టు అయ్యింది. దీంతో, బీఆర్‌ఎస్‌పై ప్రతిపక్ష పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల సందర్భంగా రైతుబంధుతో ఓట్లు దండుకోవాలని వేసిన ప్లాన్‌కు బ్రేక్ పడిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌పై ఫైరయ్యారు.
కాగా, రేవంత్ ట్విట్టర్ వేదికగా..‘రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు. హరీశ్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం. ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు న్యాయం జరగదు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందవద్దు. పది రోజుల్లో కాంగ్రెస్ రాగానే రూ.15 వేల రైతు భరోసా మీ ఖాతాల్లో వేస్తాం’ అని అన్నారు.
రైతుబంధుతో ఓట్లు దండుకోవాలన్న దురాశ, ఆత్రుత, అహంకారం తప్ప, నిజంగా రైతులకు మేలు జరగాలన్న ఉద్ధేశం మామా - అల్లుళ్లకు లేదు.
— Revanth Reddy (@revanth_anumula) November 27, 2023
హరీష్ రావు వ్యాఖ్యల కారణంగానే రైతుబంధుకు ఇచ్చిన అనుమతిని ఉపసంహరించుకుంటున్నట్టు ఈసీ ఆదేశాలు ఇవ్వడం దీనికి నిదర్శనం.
ఈ ద్రోహులను ఇంటికి పంపితే తప్ప రైతులకు… pic.twitter.com/H56vhAiNlk
ఇక, రైతుబంధును ఎన్నికల సందర్భంగా నిలిపివేయడానికి హరీశ్ కామెంట్స్ కారణమని ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రైతుబంధుపై మంత్రి హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళికి విరుద్ధమని పేర్కొంటూ ఈసీ అనుమతి నిరాకరించింది. దీంతో, బీఆర్‌ఎస్ ప్లాన్ రివర్స్ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment