సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుకు సంబంధించి ఆదివారం మరిన్ని నిధులను విడుదల చేసింది. 8.53 లక్షల ఎకరాలకు చెందిన 1.87 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 426.69 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 56.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,754.64 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు.
ప్రతీ రైతుకు రైతుబంధు సాయం అందుతుందని పేర్కొన్నారు. పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ప్రతీసారి రైతుబంధు పథకం నిధులు విడుదల చేసేముందు, అలాగే ఏటా ధాన్యం కొనుగోలు సమయంలో విపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లడం లక్ష్యంగా పెట్టుకున్నాయ న్నారు. కానీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా వీటిని విజయవంతంగా పూర్తి చేస్తోందని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment