funds released
-
పేదలకు పండగ..డీబీటీ నిధుల విడుదల
-
ఏపీలో డీబీటీ నిధులు విడుదల
-
ఈబీసీ నేస్తం నిధులను విడుదల చేసిన సీఎం జగన్
-
వైఎస్సార్ చేయూత 4వ విడత నిధులను బటన్ నొక్కి విడుదల చేసిన సీఎం జగన్
-
వైఎస్సార్ రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
బటన్ నొక్కి అక్క చెల్లెమ్మల ఖాతాల్లో డబ్బు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
జగనన్న విదేశీ విద్యాదీవెన నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
TS: రైతు భరోసా చెల్లింపులపై రేవంత్ సర్కార్ కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: రైతు భరోసా విషయంలో తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే రైతుల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. సోమవారం వ్యవసాయ శాఖపై సమీక్ష సందర్భంగా ఆయన అధికార యంత్రాంగానికి కీలక ఆదేశాలిచ్చారు. ‘‘ఇవాల్టి నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని సీఎం రేవంత్ సదరు సమీక్షలో అన్నారు. రాష్ట్ర ట్రెజరీలో ఉన్న నిధుల విడుదలకు ఆదేశాలు జారీ చేశారు. వెంటనే రైతులకు నిధులు చెల్లించాలని అధికారులకు చెబుతూనే.. అదే విధంగా రూ. 2 లక్షల వరకు రైతు రుణమాఫీపై కార్యారచణ ప్రారంభించాలని ఆదేశించారు. -
వైఎస్ఆర్ లా నేస్తం రెండో విడత నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
కాపు నేస్తం నిధులు జమ చేసిన సీఎం వైఎస్ జగన్
-
ఆల్ ది బెస్ట్ చరణ్: సీఎం జగన్
-
జగనన్న విదేశీ విద్య లేకపోతే నాలాంటి వాళ్ళ పరిస్థితి..
-
విదేశీ విద్యా దీవెన నిధులు విడుదల
-
జగనన్న విదేశీ విద్యా దీవెన నిధుల జమ కార్యక్రమంలో సీఎం జగన్ (ఫొటోలు)
-
నా కల నెరవేరింది సార్.. తిరిగి వచ్చి ఈ రాష్ట్రం ఋణం తీర్చుకుంటా..
-
రాజకీయాలకు అతీతంగా విద్యార్థులకు అండగా ఉంటున్నాం: సీఎం జగన్
-
మన విద్యార్థులను మనమే సపోర్టు చేయాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: పేద విద్యార్థులు సైతం ప్రపంచంలోని అగ్రశ్రేణి యూనివర్సిటీల్లో ఉన్నత విద్య అభ్యసించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేస్తున్న జగనన్న విదేశీ విద్యా దీవెన పథకం నిధులు లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. సీఎం జగన్ గురువారం తన క్యాంపు కార్యాలయం నుంచి బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ ఏమన్నారంటే.. 357 మంది విద్యార్ధులకు రూ.45.53 కోట్లు దేవుడి దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మంచి కాలేజీలలో సీట్లు వచ్చి కూడా అంతంత డబ్బులు అక్కడకి వెల్లి కట్టాలంటే కట్టలేని పరిస్థితుల్లో ఉంటూ.. ఆ స్ధోమత లేని రాష్ట్ర విద్యార్ధులకు విదేశాల్లో చదువులకు ఒక వరంలా జగనన్న విదేశీ విద్యాదీవెన పథకం అన్నిరకాలుగా తోడ్పాటు నిస్తుంది. వారికి ఒక భరోసా ఇస్తుంది. విదేశాల్లో ఉన్నత విద్యకోసం అటువంటి మంచి కాలేజీలలో సీట్లు వచ్చి చదువుతున్న దాదాపు 357 మంది పిల్లలకు ఫీజుల కింది రూ.45.53 కోట్లు ఇవాళ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేస్తున్నాం. ఈ పథకాన్ని అత్యంత పారదర్శకంగా ఎక్కడా వివక్ష, లంచాలు లేకుండా అమలు చేస్తున్నాం. ఏ ఒక్కరికైనా క్యూఎస్ లేదా టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచంలోనే అత్యుత్తమంగా నిల్చిన టాప్ –50 విద్యా సంస్ధల్లో సీటు వచ్చిన ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చు. సాచ్యురేషన్ పద్ధతిలో ఎవరు దరఖాస్తు పెట్టుకున్నా.. అర్హత ఉంటే వాళ్లకు సపోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పిల్లలు రూ.1.25 కోట్ల వరకు, ఇతరులకైతే రూ.1 కోటి వరకు చెల్లిస్తున్నాం. విదేశీ విశ్వవిద్యాలయాలకు వెళ్లే పిల్లలకు... వారి విమాన ఛార్జీలు, వీసా ఛార్జీల దగ్గర నుంచి మొదలుపెట్టి ప్రతి అడుగులోనూ వారిని చేయిపట్టుకుని నడిపిస్తున్నాం. టాప్ కాలేజీలు చూస్తే... ఈ టాప్ 50 కాలేజీల్లో చదవాలంటే... ఫీజులు ఏ రకంగా ఉన్నాయి ? ఎవరికైనా సీటు వచ్చినా సామాన్యుడు, పేదవాడు చదువుకునే పరిస్థితి ఉందా ? అని గమనిస్తే... చికాగోయూనివర్సిటీ బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.32 కోట్లు, యూనివర్సీటీ ఆఫ్ మాంఛెస్టర్‌లో ఎంఎస్ రూ.1.02 కోట్లు, కార్నిగీమిలన్ యూనివర్సిటీలో టెపర్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎంబీఏ రూ.1.16 కోట్లు, లండన్ బిజినెస్ స్కూల్లో ఎంబీఏ రూ.1.13 కోట్లు, కొలంబియా యూనివర్సిటిలో ఎంఎస్ రూ.1.11 కోట్లు, న్యూయార్క్ యూనివర్సిటీలో ఎంఎస్ రూ.1.09 కోట్లు, ఇన్సీడ్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఫ్రాన్స్‌లో ఎంబీఏ రూ.88 లక్షలు, హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో ఏంబీఏ రూ.68.86 లక్షలు, ఎంఐటీలో స్లోన్ స్కూల్ ఆఫ్ మేనేజిమెంట్‌లో రూ.67 లక్షలు, యూసీ బర్క్లీలో ఎంఎస్ రూ.61 లక్షల నుంచి రూ.2.06 కోట్ల వరకూ ఫీజులు ఉన్నాయి. ఉదాహరణగా పది మంచి విద్యాసంస్ధలు గురించి చెప్పాను. మన పిల్లలు లీడర్లు కావాలని.. ఇలాంటి ప్రపంచప్రఖ్యాత కాలేజీలలో మన పిల్లలకు ఎవరికైనా సీట్లు వచ్చినా.. సామాన్యుడికి, పేదరికంలో ఉండేవాళ్లకు ఇంత ఫీజులు కట్టి ఇలాంటి ప్రఖ్యాత యూనివర్సిటీల్లో చదవడం సాధ్యమేనా ? అన్నది మొట్టమొదట నేను ఈ పథకం గురించి అనుకున్నప్పుడు నాకు తట్టిన మొదట ఆలోచన. ఇలాంటి కాలేజీలలో మన పిల్లలు చదివి బయటకు వస్తేనే.. రేపు పొద్దున ప్రపంచాన్ని శాసించే విధంగా టాప్ మోస్ట్ కంపెనీలలో సీఈఓలుగా ఉద్యోగాలు చేసే స్ధాయి వస్తుంది. పెద్ద స్ధాయిలోకి వెళ్లే అవకాశం వస్తుంది. ఇటువంటి కాలేజీలలో సీట్లు సాధించిన మన పిల్లలను మనం సపోర్టు చేయాలని నిర్ణయించుకున్నాం. అలా చేయకపోతే... ఏ రకంగా మన పిల్లను, మన రాష్ట్రాన్ని లీడర్లుగా చూడగలుగుతాం అన్నది ఈ ఆలోచనలకు ప్రేరేణ. గత ప్రభుత్వంలో అరకొరగా.. గతంలో పరిస్థితి చూస్తే.. కేవలం రూ.10 లక్షలు, ఎస్సీ, ఎస్టీలకు అయితే రూ.15 లక్షలు మాత్రమే ఇచ్చేవారు. ఈ అమౌంట్ ఎక్కడ? ... మనమిస్తున్న రూ.1.02 కోటి, రూ.1.16 కోట్లు, రూ.1.09 కోట్లు, రూ.87 లక్షలు, రూ.70 లక్షలు, రూ.1.32 కోట్లు ఫీజు ఎక్కడ ? గతంలో ఇచ్చామంటే ఇచ్చామన్నట్టు ఇచ్చారు. అక్కడ కూడా ప్రతిదానిలో కోత పెట్టేవారు. దరఖాస్తు చేసుకున్నవారందిరికీ దొరికేది కాదు. సాచ్యురేషన్ విధానం లేదు. సిఫార్సులతో ఇచ్చేవారు. అది కూడా సక్రమంగా ఇవ్వకుండా 2016–17 నుంచి దాదాపు రూ.318 కోట్లు బకాయిలు పెట్టి ఈ పథకాన్ని నీరుకార్చే ప్రయత్నం చేశారు. మన ప్రభుత్వంలో ఈ రోజు మనం ఆ పథకానికి పూర్తిగా మార్పుతీసుకుని వచ్చి... సాచ్యురేషన్ విధానంలో ఏ ఒక్కరికైనా అర్హత ఉండి, టాప్ – 50 కాలేజీలు, దాదాపు 320 ఫ్యాకల్టీలలో సీట్లు ఎవరికి వచ్చినా వర్తింపు చేస్తున్నాం. గతంలో ఆదాయపరిమితి రూ.6లక్షలు ఉంటే దాన్ని రూ.8లక్షల వరకూ పెంచి సాచ్యురేషన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటే చాలు.. అర్హత ఉంటే రూపాయి లంచం ఇవ్వకుండా... వివక్షకు తావు ఇవ్వకుండా, పార్టీలతో సంబంధం లేకుండా అత్యంత పారదర్శకంగా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన పిల్లలకు తోడుగా ఉండే గొప్ప అడుగులు వేస్తూ దేవుడి దయతే చేయగలిగాం. విప్లవాత్మక అడుగు. ఇదో విప్లవాత్మకమైన అడుగు. రాబోయే రోజుల్లో, రాబోయే తరాలు ఆంధ్రరాష్ట్ర ఖ్యాతిని గుర్తుంచుకునే విధంగా.. ఈ రకంగా సపోర్ట్ చేస్తున్న రాష్ట్రం దేశంలో మరొకటి లేదు. ఒక్క మన రాష్ట్రంలో మాత్రమే టాప్– 50 కాలేజీలు, 21 ఫ్యాకల్టీలలో దాదాపు 320 కాలేజీలలో ఎవరికి సీటు వచ్చినా.. పారదర్శకంగా సపోర్టు చేస్తున్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ మాత్రమే. ఇదొక విప్లవాత్మకమైన అడుగుగా చరిత్రలో మిగిలిపోతుంది. ఈ పిల్లలు గొప్పగా ఎదగాలి. పెద్ద కంపెనీల్లో సీఈఓలుగానూ, పెద్ద పెద్ద స్ధాయిలో రాణించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాలుగు విడతలుగా స్కాలర్షిప్. ఈ స్కాలర్షిప్ పథకాన్ని నాలుగు విడతలుగా అమలు చేస్తున్నాం. ఇమ్మిగ్రేషన్ కార్డు పొందిన విద్యార్ధులకు వెంటనే తొలివిడత, ఫస్ట్ సెమిస్టర్ ఫలితాలు అనంతరం రెండో విడత, రెండో సెమిస్టర్ టెర్మ్ ఫలితాలు విడుదలైనప్పుడు మూడో విడత, విజయవంతంగా నాలుగో సెమిస్టర్ పూర్తి చేసి, మార్క్స్ షీటు అప్లోడ్ చేసిన తర్వాత చివరి విడతగా నాలుగో వాయిదా కూడా పిల్లలకు ఇచ్చే విధంగా దీన్ని డిజైన్ చేశాం. అండర్ గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ పిల్లలందరికీ ఈ టాప్–50 కాలేజీలలో, 21 ఫ్యాకల్టీలలో ఎక్కడ సీటు వచ్చినా... దరఖాస్తు పెట్టుకుంటే రాష్ట్ర ప్రభుత్వం సాయం చేస్తుంది. తోడుగా ఉంటుందని భరోసా ఇస్తున్నాను. ఈ కార్యక్రమం వల్ల మన పిల్లలకు ఇంతా మంచి జరగాలని,ఆ తల్లిదండ్రుల మీద ఎటువంటి భారం పడకూడదని, అప్పులపాలవుతామనే భయం లేకుండా తల్లిదండ్రులు ఆ పిల్లలను గొప్ప చదువులకు పంపించాలని, పిల్లలకు కూడా తమ తల్లిదండ్రులు అప్పులు చేసి తమను పంపించారన్న బాధ ఎక్కడా ఉండకూడదనే ఈ పథకాన్ని రూపొందించాం. ఆ పిల్లలు అక్కడకు వెళ్లి గొప్పగా చదివి మన రాష్ట్ర ఖ్యాతిని ఇంకా పెంచాలన్న మంచి సంకల్పంతో జరుగుతున్న ఈ కార్యక్రమానికి దేవుడి ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నాను. ఇది కూడా చదవండి: ‘పకడ్బందీగా కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్’ -
భారీ వర్షాల ఎఫెక్ట్.. రాష్ట్రాలకు విపత్తు నిధులు విడుదల
సాక్షి, ఢిల్లీ: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వానలు, వరదల కారణంగా కొన్ని రాష్ట్రాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాదిలో భారీ వర్షాల వల్ల జనజీవనవం అస్తవ్యస్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. కేంద్రం బుధవారం విపత్తు నిధులను విడుదల చేస్తున్నట్టు తెలిపింది. కాగా, భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో నిధుల విడుదల మార్గదర్శకాలను కేంద్రం సడలించింది. గతేడాది యటిలైజేషన్ సరిఫ్టికెట్ల కోసం ఎదురుచూడకుండా నేరుగా నిధులను విడుదల చేసింది. ఇక, ఏపీకి రూ.493.60 కోట్లు, తెలంగాణకు రూ.188.80 కోట్లు, మహారాష్ట్రకు అత్యధికంగా రూ.1,420.80 కోట్లు విడుదల చేసింది. The government of India today released Rs 7,532 crores to 22 State Governments for the respective State Disaster Response Funds (SDRF). pic.twitter.com/cyEkyHCuNg — ANI (@ANI) July 12, 2023 ఇది కూడా చదవండి: తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. మూడు రోజులు జోరు వానలే.. -
జగనన్న అమ్మఒడి నిధులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్
-
ప్రకాశం జిల్లా మార్కాపురంలో వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం నిధులు విడుదల
-
లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేసిన సీఎం జగన్
-
వైఎస్ఆర్ లా నేస్తం పథకం నిధులు విడుదల
-
రాజన్నకు 50, అంజన్నకు 100 కోట్ల రూపాయల నిధుల విడుదల
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయస్వామి దేవాలయ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ.100 కోట్లు విడుదల చేసింది. దేవాలయ అభివృద్ధికోసం ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్డీఎఫ్) కింద ఈ నిధులను మంజూరు చేస్తూ ప్రణాళికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె, రామకృష్ణా రావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కొండగట్టు ఆలయ అభివృద్ధికి నిధులు విడుదల చేసిన సీఎం కేసీఆర్‌కు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధన్యవాదాలు తెలిపారు జగిత్యాల జిల్లా మల్యాల మండలం ముత్యంపేట గ్రామంలో ఉన్న కొండగట్టులోని ఆంజనేయస్వామి ఆలయానికి రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాల భక్తులూ అధికసంఖ్యలో వస్తుంటారు. ఆలయ అభివృద్ధికి రూ.వంద కోట్లు విడుదల చేస్తామని గత డిసెంబరులో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆగమశాస్త్రం ప్రకారం ఆలయాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నిధులను వెచ్చించనున్నారు. ఉమ్మడి జిల్లాలోని కొండగట్టు అంజన్న, వేములవాడ రాజన్న ఆలయాలకు బడ్జెట్లో తగిన ప్రాధాన్యం దక్కినట్లయ్యింది. మొన్న రాజన్న ఆలయానికి రూ.50 కోట్లు కేటాయించిన సర్కారు.. తాజాగా కొండగట్టుకు రూ.100 కోట్లు ప్రకటించింది. దీంతో ఆలయాల అభివృద్ధికి ఏళ్ల తరబడిగా ఎదురుచూస్తున్న ఘడియలు వచ్చినట్లయ్యింది. రామ లక్ష్మణ జానకి జై బోలో హనుమాన్ కి.. కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్లు కేటాయించిన సీఎం గౌరవనీయులు శ్రీ కేసీఆర్ గారికి అశేష భక్తజనం తరపున ప్రత్యేక కృతజ్ఞతలు. pic.twitter.com/spGZ3N4NUb — Kavitha Kalvakuntla (@RaoKavitha) February 8, 2023 ఎములాడ జంక్షన్ల సుందరీకరణ.. రాజన్న గుడి అభివృద్ధిపై సీఎం కేసీఆర్ 18 జూన్ 2015న స్వయంగా గుడి, పట్టణం కలియ తిరిగారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఇందుకు ఏటా రూ.100 కోట్లు బడ్జెట్లో కేటాయిస్తామని ప్రకటించారు. ముందుగా రూ.71 కోట్లు మంజూరు చేశారు. అనంతరం వీటీడీఏ ఏర్పాటు చేసి కమిటీనీ ప్రకటించారు. చైర్మన్‌గా సీఎం కేసీఆర్, వైస్ చైర్మన్‌గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పురుషోత్తంరెడ్డిని నియమించారు. నిధులను వీటీడీఏ ద్వారానే ఖర్చు చేయాలని జీవో విడుదల చేశారు. వేములవాడ రాజన్న ఆలయం ఆ మేరకు ఆలయ అధికారులు రూ.410 కోట్లతో భక్తుల సౌకర్యాల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పించారు. గతేడాది, ఈసారి బడ్జెట్లో రూ.50 కోట్ల చొప్పున కేటాయించారు. తాజా నిధులతో బద్దిపోచమ్మ గుడి వద్ద సేకరించిన భూమికి ప్రహరీ, బోనాల మంటపం నిర్మిస్తామని వీటీడీఏ వైస్ చైర్మన్ వెల్లడించారు. నగరమంతా ఫుట్‌పాత్‌ల నిర్మాణం, గుడి ట్యాంక్‌బండ్‌పై వాకింగ్, సైక్లింగ్ ట్రాక్ పనులు చేపడతామని, నందికమాన్ నుంచి వేములవాడకు చేరుకునే రోడ్డు సుందరీకరణ, జంక్షన్లు అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. గోదావరినదిలో పడవల పోటీ(ఫైల్) కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక కాళేశ్వరం.. దాని అనుబంధ ప్రాజెక్టుల వద్ద పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పేరిట బడ్జెట్లో రూ.750 కోట్లు కేటాయించింది. సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ, గోదావరిఖని వంతెన, కోటిలింగాల బ్యాక్ వాటర్, లోయర్, మధ్య, ఎగువ మానేరు డ్యామ్‌ల వద్ద పర్యాటక అభివృద్ధికి ఈ నిధులు వెచ్చించనున్నారు. అయితే ఉమ్మడి జిల్లాను పర్యాటక క్షేత్రంగా మలచాలన్న ప్రభుత్వ లక్ష్యం ఎప్పటిలోగా నెరవేరుతుందోనన్న విషయం ఆసక్తికరంగా మారింది. కొండగట్టు కొండగట్టుకు మాస్టర్‌ప్లాన్ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి బడ్జెట్లో రూ.100 కోట్లు మంజూరు చేశారు. గత డిసెంబరు 7న జగిత్యాల సభలో స్వామివారికి రూ.100 కోట్లు ఇస్తామన్న సీఎం.. సరిగ్గా 50 రోజులకు తన మాట నిలబెట్టుకున్నారు. రానున్న 50 ఏళ్లలో భక్తుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పనులు చేపట్టాల్సి ఉందని, ప్రత్యేక ప్రణాళికతో ఆలయాన్ని అభివృద్ధి చేస్తామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ తెలిపారు. నాంపల్లి గుట్ట నాంపల్లి గుట్టకు రోప్‌వే వేములవాడను తీర్చిదిద్దే క్రమంలో మంత్రి కేటీఆర్ సూచనల మేరకు నాంపల్లిగుట్టపై రెండో ఘాట్ రోడ్డు నిర్మాణం జరగనుంది. వేములవాడకు వచ్చే కొత్తపల్లి – మనోహరాబాద్ రైల్వేట్రాక్ నాంపల్లి గుట్టను ఆనుకుంటూ వెళ్లనుంది. దీంతో హైదరాబాద్, మేడ్చల్, గజ్వేల్, సిద్దిపేట, సిరిసిల్ల నుంచి వచ్చే భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా ఇక్కడి పరిసరాలను తీర్చిదిద్దనున్నారు. ఈ పనులపై కేటీఆర్ ఇప్పటికే సమీక్షించారు కూడా. -
రైతుబంధుకు రూ.426 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధుకు సంబంధించి ఆదివారం మరిన్ని నిధులను విడుదల చేసింది. 8.53 లక్షల ఎకరాలకు చెందిన 1.87 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 426.69 కోట్లను జమ చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దీంతో ఇప్పటివరకు 56.58 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ. 4,754.64 కోట్లు జమ అయ్యాయని వెల్లడించారు. ప్రతీ రైతుకు రైతుబంధు సాయం అందుతుందని పేర్కొన్నారు. పదో విడత రైతుబంధును విజయవంతంగా పూర్తి చేస్తామన్నారు. వ్యవసాయం లాభసాటి కావాలన్నదే సీఎం కేసీఆర్ ఆకాంక్ష అన్నారు. ప్రతీసారి రైతుబంధు పథకం నిధులు విడుదల చేసేముందు, అలాగే ఏటా ధాన్యం కొనుగోలు సమయంలో విపక్షాలు ప్రభుత్వంపై బురదజల్లడం లక్ష్యంగా పెట్టుకున్నాయ న్నారు. కానీ ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు ఎదురైనా వీటిని విజయవంతంగా పూర్తి చేస్తోందని పేర్కొన్నారు. -
జగనన్న విద్యదీవెన నిధులు విడుదల చేసిన సీఎం జగన్
-
అర్హత ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడదు: సీఎం జగన్
-
అధికారం అంటే ప్రజలపై మమకారం: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: అధికారం అంటే అజమాయిషీ కాదు.. అధికారం అంటే ప్రజల మీద మమకారం.. ప్రజలందరి సంక్షేమం అని పేర్కొన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అర్హులై ఉండి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందనివారికి లబ్ధి చేకూరేలా.. కొత్త లబ్ధిదారుల ఖాతాలోకి సంక్షేమ నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన ప్రసంగించారు . ‘‘దేశంలో ఎక్కడా లేని విధంగా అందరికీ సంక్షేమంలో భాగంగా.. తాజాగా మరో 3 లక్షల పది వేల కుటుంబాలకు మేలు కలిగేలా ప్రభుత్వం వ్యవహరించింది. కొత్త లబ్ధిదారుల కోసం రూ.137 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు సీఎం జగన్. ‘ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతోంది. మరో 3 లక్షలకు పైగా కుటుంబాలకు మేలు జరిగేలా ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. అర్హత ఉన్న ఉన్న ఏ ఒక్కరికీ సంక్షేమ పథకాలు ఆగకూడద’’ని ఈ సందర్బంగా పేర్కొన్నారు ఆయన. దరఖాస్తు చేసిన 3,39, 096 మందికి సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూరుతుందని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఈబీసీ నేస్తం కింద మరో 6,965 మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. వైఎస్సార్ పింఛన్ కానుకకు కొత్తగా 2,99,085 మందిని ఎంపిక చేసినట్లు.. అదే విధంగా కొత్తగా 7,051 బియ్యం కార్డులు, 3,035 ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరు చేసినట్లు సీఎం జగన్ వెల్లడించారు. న్యాయంగా.. అవినీతికి తావులేకుండా కులం, మతం, వర్గం, పార్టీలకు అతీతంగా.. పారదర్శకంగా అర్హులైన అందరికీ సంక్షేమ ఫలాలు అందాలన్నదే వైఎస్సార్సీపీ ప్రభుత్వ సంకల్పమని సీఎం జగన్ మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత సంక్షేమ పాలనకు ఉన్న తేడాను ప్రజలకు వివరించి చెప్పాల్సిన అవసరం ఉందని సంబంధిత మంత్రులకు, అధికారులకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. -
ఏపీలో రైతు భరోసాతో రైతే రాజు
-
3 స్థాయిల్లో కమిటీలు.. దళితబంధు అమలుకు మార్గదర్శకాలు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన దళితబంధు పథకం కార్యరూపంలోకి వచ్చింది. మొదట హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని అనుకున్నా.. తాను దత్తత తీసుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామంలో తొలుత అమలు చేస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ప్రాథమిక మార్గదర్శకాలు విడుదల చేసింది. జిల్లా, మండలం, గ్రామస్థాయిల్లో కమిటీలను నియమించి పథకం అమలును పర్యవేక్షించనున్నట్టు ప్రకటించింది. వాసాలమర్రిలో 76 నిరుపేద దళిత కుటుంబాలను ఈ పథకం కింద ఎంపిక చేశారు. వీరికి ఆర్థిక సాయానికి సంబంధించి ‘రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల సహకార అభివృద్ధి కార్పొరేషన్ (ఎస్సీసీడీసీ)’ గురువారం రూ.7.6 కోట్లను యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ ఖాతాకు బదిలీ చేసింది. ‘దళిత బంధు’ పథకం అమలుకు సంబంధించి తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు సూచించింది. కాగా వాసాలమర్రిలో అమలును పరిశీలించిన అనంతరం.. రాష్ట్రస్థాయిలో పథకం అమలుకు సంబంధించి మార్గదర్శకాల్లో పలు మార్పులు, చేర్పులు చేసే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. నచ్చిన యూనిట్ పెట్టుకోవచ్చు దళితబంధు పథకం కింద ఒక్కో లబ్ధిదారుకు రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సాయాన్ని నేరుగా బ్యాంకు ఖాతాలో జమచేస్తారు. తమకు నచ్చిన, అనువైన యూనిట్లను లబ్ధిదారులు ఏర్పాటు చేసుకోవచ్చు. ► ఈ పథకం కింద ఇచ్చిన సొమ్మును తిరిగి ప్రభుత్వానికి చెల్లించాల్సిన అవసరం లేదు. ►ప్రభుత్వ సాయంతో ఏర్పాటు చేసుకునే యూనిట్లకు సంబంధించి ఎస్సీసీడీసీ కొన్ని సలహాలు, సూచనలు చేసింది. వివిధ రంగాల్లో డిమాండ్ ఉన్న అంశాలపై అవగాహన కల్పించేందుకు పలురకాల యూనిట్ల జాబితాలతో ప్రత్యేక ఫార్మాట్‌ను రూపొందించింది. ఇవేగాకుండా లబ్ధిదారులు తమకు ఇప్పటికే అవగాహన ఉన్న ఇతర యూనిట్లను కూడా ప్రారంభించుకునే వీలు కల్పించింది. మూడు స్థాయిల్లో ప్రత్యేక కమిటీలు ► దళిత బంధు పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేకంగా కమిటీలను ఏర్పాటు చేస్తోంది. జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన.. అదనపు కలెక్టర్ (రెవెన్యూ), జెడ్పీ సీఈవో, డీఆర్డీఏ/ వ్యవసాయ/ పశుసంవర్ధక/ రవాణా/ పరిశ్రమల విభాగాల నుంచి ఎంపిక చేసిన అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీతోపాటు కలెక్టర్ నామినేట్ చేసే మరో ఇద్దరు సభ్యులుగా కమిటీ ఉంటుంది. ► మండలస్థాయిలో ఎంపీడీవో, తహసీల్ధార్, వ్యవసాయ, పశుసంవర్ధక శాఖల అధికారులతోపాటు ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉంటారు. ► గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణ అధికారి, గ్రామ రెవెన్యూ అధికారి, ఇద్దరు నామినేటెడ్ సభ్యులతో కమిటీ ఉంటుంది. అన్నీ కమిటీల పర్యవేక్షణలోనే.. ప్రభుత్వం నిర్ధేశించిన కమిటీలే దళిత బంధు పథకం అమలులో కీలకంగా వ్యవహరించనున్నాయి. పథకంపై అవగాహన సదస్సులు నిర్వహించడం, డేటాబేస్‌లో అర్హత కలిగిన కుటుంబాల పేర్లు నమోదు చేయడం, జిల్లా కలెక్టర్ నుంచి మంజూరు పత్రాల పంపిణీ, లబ్ధిదారులకు శిక్షణ, అవసరమైన వనరుల కూర్పు, సలహాలు, సూచనలివ్వడం, క్యూఆర్ కోడ్లతో కూడిన ఐడీ కార్డుల జారీ, యూనిట్ల పనితీరు పరిశీలన, ఇన్సూరెన్స్ కవరేజీ తదితర అంశాలను ఈ కమిటీలు పర్యవేక్షిస్తాయి. ►మండల, గ్రామ కమిటీలు లబ్ధిదారులతో ప్రతినెలా సమావేశాలు నిర్వహిస్తాయి. వారితో చర్చించి.. సమస్యలేమైనా ఉంటే గుర్తించడం, వాటికి పరిష్కారం చూపడం వంటి చర్యలు తీసుకుంటాయి. ఈ సమావేశాలు, చర్చల నివేదికలను డేటాబేస్‌లోకి అప్లోడ్ చేస్తాయి. లబ్ధిదారులు, ప్రభుత్వ కాంట్రిబ్యూషన్తో ‘దళిత రక్షణ నిధి’ దళిత బంధు పథకం లబ్ధిదారుల రక్షణ కోసం జిల్లాస్థాయిలో దళిత రక్షణ నిధిని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. కలెక్టర్ అధ్యక్షతన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, పరిశ్రమల విభాగం జనరల్ మేనేజర్ సభ్యులుగా ఉండే కమిటీ దీనిని పర్యవేక్షిస్తుంది. రూ.10లక్షల సాయం మంజూరైన లబ్ధిదారుల నుంచి రూ.10వేల చొప్పున, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.10 వేల చొప్పున ‘రక్షణ నిధి’కి కాంట్రిబ్యూషన్‌గా జమ చేస్తారు. దీనితోపాటు లబ్ధిదారులు ఏటా రూ.1,000 చొప్పున నిధికి జమచేయాలి. ఎవరైనా లబ్ధిదారులు ఏదైనా ఆపదకు లోనైనప్పుడు ఈ నిధి నుంచి సాయం అందిస్తారు. -
‘ఈటల’ నియోజకవర్గానికి భారీగా నిధులు
సాక్షి, కరీంనగర్: మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గానికి రాష్ట్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసింది. హుజురాబాద్ మున్సిపాలిటీకి బుధవారం రూ.35 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ప్రకటించారు. ఈటల రాజీనామాతో హుజురాబాద్ ఉప ఎన్నిక రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం నిధులు విడుదల చేసిందని తెలుస్తోంది. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మంత్రి గంగుల ఈటల తీరుపై మండిపడ్డారు. ఈటల అసమర్థతతోనే హుజురాబాద్ అభివృద్ధికి నోచుకోలేదని ఆరోపించారు. యుద్ధంలో వెనుతిరిగిన, పారిపోయిన సైనికుడు ఈటల అని అభివర్ణించారు. అధికారంలో ఉండి హుజురాబాద్ అభివృద్ధి చేయకపోవడం సిగ్గుగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇక హుజూరాబాద్ అభివృద్ధి తాను చూసుకుంటానని తక్షణమే రూ.35 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హుజురాబాద్‌ను అభివృద్ధి చేస్తానని, వారం రోజులు అభివృద్ధి పనులు చేపట్టి పరిగెత్తిస్తానని తెలిపారు. ఆత్మగౌరవం పేరుతో బీజేపీలోకి వెళ్లి ఢిల్లీలో చెట్టుకింద ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టాడని విమర్శించారు. త్వరలోనే ఆ నియోజకవర్గానికి ఉప ఎన్నిక రాబోతుండడంతో అభివృద్ధి పనులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ క్రమంలోనే ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించేందుకు టీఆర్ఎస్ అన్ని చర్యలు తీసుకుంటోందని కరీంనగర్ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ స్థానం నుంచి వరుసగా గెలుపొందుతూ హుజురాబాద్‌లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్న ఈటలను ఓడించేందుకు గులాబీ దళం ఇప్పటి నుంచే కార్యచరణ మొదలుపెట్టింది. -
రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టాం: సీఎం జగన్
-
ఉచిత పంటల బీమా నగదు జమ చేసిన సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం కింద ఖరీఫ్-2020 సీజన్‌కు సంబంధించి అర్హులైన 15.15 లక్షల మంది రైతుల ఖాతాల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.1,820.23 కోట్ల పరిహారం విడుదల చేసింది. మంగళవారం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని సీఎం కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కంప్యూటర్ బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి ఉచిత పంటల బీమా నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. రైతుల కోసం మరో మంచి కార్యక్రమం చేపట్టామని, వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పరిహారం విడుదల చేస్తున్నామని తెలిపారు. ఈనెలలోనే రైతు భరోసా కింద సుమారు 3,900 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలో 60 శాతానికిపైగా వ్యవసాయంపైనే ఆధారపడి ఉన్నారని తెలిపారు. రైతులు, రైతు కూలీలు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. గతేడాది ఖరీఫ్‌లో 15.15 లక్షల మంది రైతులకు పంట నష్టం జరిగిందని, పంట నష్టపోయిన రైతులందరికీ రూ.1,820.23 కోట్లు జమ చేస్తున్నామని తెలిపారు. 2018-19 ఇన్సూరెన్స్ బకాయిలను కూడా 715 కోట్లు విడుదల చేశామని, 2019-20 ఉచిత పంటల బీమా పరిహారంగా మరో రూ.1253 కోట్లు ఇచ్చామని సీఎం జగన్ తెలిపారు. గత ప్రభుత్వాలు ఇన్సూరెన్స్, ఇన్పుట్ సబ్సిడీలను నిర్లక్ష్యం చేశాయన్నారు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉండేదని, తాము వచ్చాక ఖరీఫ్‌లో నష్టపోయిన రైతులకు అదే సీజన్లో పరిహారం చెల్లిస్తున్నామని తెలిపారు. రైతులపై భారం పడకుండా పంటల బీమాని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. 23 నెలల కాలంలో రైతుల కోసం రూ.83వేల కోట్లకుపైగా ఖర్చు చేశామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి 2వేల జనాభాకు గ్రామ సచివాలయం ఏర్పాటు చేశామని, గ్రామ సచివాలయాలతోపాటు 10,778 ఆర్బీకేలు ఏర్పాటు చేశామని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. సీఎం జగన్ రైతుల పక్షపాతి అని, 2020 ఖరీఫ్‌లో పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం అందజేశారని తెలిపారు. నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమ చేశారని పేర్కొన్నారు. 15.15 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారని తెలిపారు. 30 రకాల పంటలకు ఇన్సూరెన్స్ వస్తుందని వివరించారు. దేశంలో మరెక్కడా లేని విధంగా రైతులపై పైసా కూడా ఆర్థిక భారం పడనీయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. పంటల బీమా పథకం కింద 21 రకాల పంటలకు బీమా కల్పిస్తోంది. 9 రకాల పంటలకు సంబంధించి 35.75 లక్షల హెక్టార్లకు బీమా డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. ఏడాది తిరగకుండానే ఠంచనుగా పంటల బీమా సొమ్ములు చెల్లించాలన్న లక్ష్యంతో ఖరీఫ్- 2019 సీజన్‌కు సంబంధించి 9.79 లక్షల మంది రైతులకు రూ.1,252.18 కోట్లు చెల్లించింది. అంతేకాకుండా టీడీపీ ప్రభుత్వం 5.58 లక్షల మంది రైతులకు చెల్లించాల్సిన రూ.715.84 కోట్ల బకాయిలను కూడా చెల్లించి రైతులకు అండగా నిలిచింది. చదవండి: రాష్ట్రానికి అండగా నిలిచిన కార్పొరేట్లకు కృతజ్ఞతలు -
రైతులకు బీమా కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది: సీఎం జగన్
-
ఆర్టీసీకి రూ.15.71 కోట్లు విడుదల
సాక్షి, అమరావతి: వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చడంలో క్రియాశీలకంగా వ్యవహరించిన ఆర్టీసీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.15.71 కోట్లు విడుదల చేసింది. కరోనా కారణంగా రోజుకు 65 లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ ఇప్పుడు కేవలం రెండు లక్షల మందికే సేవలందిస్తోంది. రోజుకు రూ.13 కోట్లకు పైగా ఆదాయం ఆర్జించే పరిస్థితి నుంచి ఇప్పుడు సగటున రూ.1.50 కోట్ల వరకే ఆర్జించే స్థితికి పడిపోయింది. ఈ దశలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను మే నెలకు సంబంధించి కాంట్రాక్టు సిబ్బందికి చెల్లించాల్సిన జీతాలు, పాత బకాయిలు, పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు జూన్ నెలకు సంబంధించి ఎస్ఆర్బీఎస్ పెన్షన్, ఎస్బీటీ చెల్లింపులు, ఐటీఐ అప్రెంటిస్‌లకు స్టైఫండ్, ఉద్యోగుల వైద్య ఖర్చులు, ఆఫీసు నిర్వహణ, డీజిల్ బిల్లుల చెల్లింపులు తదితరాలకు ఖర్చుచేసింది. ♦ ఆర్టీసీ ఎదుర్కొంటున్న ఆర్థిక గడ్డు పరిస్థితి నేపథ్యంలో ప్రభుత్వం 52 వేల మంది ఉద్యోగులకు జీతాలతో పాటు ఆర్టీసీ సేవలకు నిధులు చెల్లించింది. ♦ వలస కార్మికులను ఇతర రాష్ట్రాలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు చేర్చడానికి ఆర్టీసీ 8,611 బస్సుల్ని వినియోగించి, మొత్తం 2,45,308 మందిని వారి స్వస్థలాలకు చేర్చింది. -
కోవిడ్‌పై పోరు: రాష్ట్రాలకు రూ 17,287 కోట్లు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా వైరస్‌పై రాష్ట్రాలు మరింత సమర్ధంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ 17,287 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఈ నిధుల్లో 14 రాష్ట్రాలకు సంబంధించి పదిహేనో ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ లోటు గ్రాంటు రూ 6195 కోట్లు కూడా కలిపిఉన్నాయి. ఆదాయ లోటు గ్రాంట్‌ను ఏపీ, అసోం, హిమచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లకు ఆర్థిక శాఖ మంజూరు చేసింది. ఇక కరోనా మహమ్మారిని దీటుగా కట్టడి చేసేందుకు ఎస్‌డీఆర్‌ఎమ్‌ఎఫ్ తొలి వాయిదాగా అన్ని రాష్ట్రాలకు రూ 11,092 కోట్లు విడుదల చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా 2301 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 57 మంది మరణించారు. చదవండి : తెలంగాణలో 10కి చేరిన కరోనా మరణాలు -
పంచాయతీలకు ఊరట
సాక్షి, అనంతపురం: నిధుల్లేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్న పంచాయతీలకు మంచి రోజులు వచ్చాయి. 2011 జనాభా లెక్కల ప్రకారం 2018 నుంచి పెండింగ్‌లో ఉండిపోయిన 14వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. 2018–19 సంవత్సరానికి సంబంధించి ఒక విడత, 2019–20 సంవత్సరానికి సంబంధించి రెండు విడతలు కలిపి మొత్తం మూడు విడతలుగా రావాల్సి ఉండగా 2018–19 సంవత్సరానికి సంబంధించిన ఒక విడత నిధులు రూ.72,25,71,000 విడుదలైనట్లు జిల్లా పంచాయతీ అధికారి రామనాథరెడ్డి తెలిపారు. గత టీడీపీ సర్కార్ స్థానిక సంస్థలను పూర్తిగా నిరీ్వర్యం చేసింది. పంచాయతీల నిధులను సైతం దారి మళ్లించగా.. గ్రామాల్లో రెండేళ్లుగా నిధులు లేక అభివృద్ధి పడకేసింది. పంచాయతీల ఖజానాల్లో పైసా లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకు ఆటంకం ఏర్పడింది. కొన్ని పంచాయతీల్లో కార్యదర్శులే రూ.లక్షలు చేతినుంచి ఖర్చు చేసి నిధుల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో నిధులు మంజూరు కావడంతో పంచాయతీలకు ఊరట వచ్చింది. నిధుల వ్యయం ఇలా.. జిల్లాలో మొత్తం 1,003 (ప్రస్తుతం 1,044) పంచాయతీలకు గాను జనాభా ప్రాతిపదికన ఆర్థిక సంఘం నిధులను సర్దుబాటు చేయనున్నారు. కాగా ఈ మొత్తం నిధులన్నీ తాగునీటి, పారిశుద్ధ్య నిర్వహణకు ఖర్చు చేయనున్నారు. జిల్లాలో 13,386 చేతిపంపులుండగా..చేతిపంపుల నిర్వహణకు రూ. 1.33 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఒక్కో చేతిపంపు నిర్వహణకు రూ.వెయ్యి కేటాయించారు. ఇక రక్షిత తాగునీటి అవసరాలకు రూ.42.27 కోట్లు కేటాయించారు. ఈ మొత్తం జిల్లా పరిషత్ ద్వారా ఖర్చు చేయనున్నారు. అంటే ఈ నిధులను పంచాయతీ నుంచి జిల్లా పరిషత్‌కు మళ్లించనున్నారు. తక్కిన నిధులను పంచాయతీలకు కేటాయించనున్నారు. -
సర్కారు బడులకు స్వర్ణయుగం
సాక్షి, విజయనగరం అర్బన్: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. నూతన ప్రభుత్వం వచ్చాక భవనాలు, సౌకర్యాల పరిస్థితులను పాఠశాలల నుంచి నేరుగా ఛాయాచిత్రాల ద్వారా తీసుకొనే ప్రక్రియ ఇప్పటికే పూర్తి చేసింది. వాటిని సమకూర్చే ప్రణాళికలు ఒకవైపు జరుగుతుండగా మరో వైపు గత ప్రభుత్వం విస్మరించిన అభివృద్ధి పనులను పూర్తి చేసే బృహత్తర కార్యక్రమానికి ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా గత ఏడాది యూ–డైస్ ద్వారా సేకరించిన మౌలిక సదుపాయాల ప్రణాళికను ముందుగా పరిశీలించింది. గత ప్రభుత్వం మూడేళ్లుగా పట్టించుకోని మరుగుదొడ్ల, మేజర్ మరమ్మతు పనులను ముందుగా పూర్తి చేయాలని సర్వశిక్షా అభియాన్ నిర్ణయింది. ఈ చర్యల్లో భాగంగా జిల్లాలోని 128 పాఠశాలలకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. వీటిని అత్యవసర పనులుగా సర్వశిక్షా అభియాన్ చేపట్టడానికి సిద్ధమయింది. గత కొన్నేళ్లుగా కనీస మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతున్న పాఠశాలలకు మోక్షం లభించినట్లయింది. అవసరమైన చోట మరుగుదొడ్లు.. జిల్లాలోని 128 స్కూళ్లకు సర్వశిక్షా అభియాన్ రూ.2.5 కోట్లు నిధులు కేటాయించింది. వీటిలో 21 స్కూళ్లకు రూ.54.60 లక్షలతో బాలురకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. జిల్లాలోని గుర్ల మండలంలో 4, పార్వతీపురం మండలలో 3 స్కూళ్లకు, జామి, వేపాడ, ఎస్‌కోట, భోగాపు రం, నెల్లిమర్ల, చీపురుపల్లి, మెరకముడిదాం, సాలూరు, బొబ్బిలి, గరుగుబిల్లి, జియమ్మవల స, జీఎల్‌పురం, కొమరాడ మండలాల్లో ఒక్కో స్కూల్‌కి బాలుర మరుగుదొడ్డి నిర్మాణానికి ని ధులు మంజూరయ్యాయి. అదేవిధంగా 15 పా ఠశాలల్లో రూ.39 లక్షలతో బాలికలకోసం మరుగుదొడ్లు నిర్మించనున్నారు. వాటిలో అత్యధికంగా సాలూరు మండలంలో 4, పార్వతీపురం, పాచిపెంట మండలాల్లో రెండేసి స్కూళ్లు, మెరకముడిదాం, గరివిడి, గరుగుబిల్లి, కురుపాం, జీఎల్‌పురం, కొమరాడ మండలాల్లో ఒక్కొక్క స్కూల్‌ను గుర్తించారు. ఒక్కో మరుగుదొడ్డికి రూ.2.6లక్షల వంతున నిధులు కేటాయించారు. 92 స్కూళ్లకు మేజర్ మరమ్మత్తులు.. జిల్లాలోని 92 పాఠశాలల్లో మేజర్ మరమ్మతులు చేపట్టేందుకు రూ.1.53 కోట్లు మంజూరయ్యాయి. ప్రధానంగా బీటలు వారిన తరగతి గదుల గోడలు, స్లాబ్లకు ప్రాధాన్యమిచ్చారు. ఆ తరువాత ప్రహరీలు, ఫ్లోరింగ్ మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. గుర్తించిన 92 స్కూళ్లలో ఒక్కోదానికి కనీసం రూ.1.2 లక్షల నుంచి అధికంగా రూ.1.8 లక్షల వరకు నిధులు మంజూరు చేశారు. మౌలిక సదుపాయాలే తొలిప్రాధాన్యం.. జిల్లా వ్యాప్తంగా గతంలో పెండింగ్‌లో ఉన్న పాఠశాలల్లోని మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. వాటిని తక్షణమే నిర్మించాలని జిల్లాకు రూ.2.5 కోట్లు మంజూరు చేసింది. గతంలోని రెండు సంవత్సరాలలోని యూ–డైస్ ద్వారా గుర్తించిన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రస్తుతం తొలి ప్రాధాన్యమిస్తాం. – ఎం.కృష్ణమూర్తినాయుడు, పీఓ, సర్వశిక్షా అభియాన్ -
‘కల్యాణలక్ష్మి’కి రూ.144 కోట్లు విడుదల
సాక్షి, హైదరాబాద్: కల్యాణలక్ష్మి పథకానికి సంబంధించిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో 2018–19 వార్షిక సంవత్సరంలో 36,254 మం ది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. వీటిలో 22,862 దరఖాస్తుల పరిశీలన పూర్తి కావడంతో వాటికి నిధులు విడుదల చేశారు. ఇందుకు రూ.144.5 కోట్లను రెవెన్యూ డివిజనల్ అధికారులకు విడు దల చేసినట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ చెప్పారు. వారంలోపు లబ్ధిదారుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయనున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు పూర్తిస్థాయిలో పరిష్కారం కానున్నాయని, ఇందుకు సరిపడా నిధులను ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు. మిగతా దరఖాస్తులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని, బడ్జెట్ సరిపడా అందు బాటులో ఉండటంతో పరిశీలన పూర్తయ్యాక నిధులు విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది వచ్చిన దరఖాస్తుల్లో 604 దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. -
జీపీలకు నిధులు
సాక్షి, వరంగల్ రూరల్: కొత్త గ్రామపంచాయతీలకు నిధులు తొలిసారిగా నిధులు విడుదల కానున్నాయి. 14వ ఆర్థిక సంఘం నిధులను పాత పంచాయతీలతోపాటు వీటికి కూడా సర్దుబాటు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రజలకు పాలనను చేరువ చేయాలనే ఉద్దేశంతో 500 జనాభా ఉన్న చిన్నగ్రామాలు, తండాలను ప్రభుత్వం గ్రామపంచాయతీలుగా ఏర్పాçటు చేసిన విషయం తెలిసిందే. ఈ గ్రామ పంచాయతీల అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారిం చింది. గతంలో ఉన్న 265 గ్రామపంచాయతీలలోపాటు జిల్లాలో కొత్తగా ఏర్పాటైన 136 గ్రామపంచాయతీలతో కలిపితే ఈ సంఖ్య 401కి చేరింది. సర్పంచుల పదవీకాలం ముగియడంతో ప్రస్తుతం అన్ని గ్రామాలకు ప్రత్యేక అధికారుల పాలన సాగుతోంది. చిన్నగ్రామాలు, తండాలుగా ఉండి కొత్తగా పంచాయతీ హోదా దక్కించుకున్న జీపీలకు ఆయా మాతృపంచాయతీల నుంచి రావాల్సిన ఆస్తులకు సంబంధించిన లెక్కలు కొలిక్కి తెచ్చే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా గ్రామపంచాయతీ ఖాతాల్లో ఎన్ని నిధులు నిల్వ ఉన్నాయనే సమాచారాన్ని జిల్లా పంచాయతీ కార్యాలయానికి రికార్డులు తెప్పించుకుంటున్నారు. ఇవి పూర్తి కాగానే జనాభా ఆధారంగా నిధుల పంపకాలు చేయనున్నారు. 14వ ఆర్థిక సంఘం నిధులు కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటు సమయంలోనే 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5.31 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. జూలై 31న సర్పంచ్ల పదవీకాలం కూడా ముగిసింది. దీంతో నిధుల పంపకాన్ని నిలిపివేశారు. పాత గ్రామ పంచాయతీల వారిగా నిధులు కేటాయిస్తే కొత్త గ్రామ పంచాయతీలకు నిధులు లేకుండా పోతాయని ముందస్తుగానే ట్రెజరీలో ఫ్రీజ్ చేశారు. జిల్లా ట్రెజరీ కార్యాలయంలో ఇప్పటికే కొత్త గ్రామ పంచాయతీలకు పీడీ అకౌంట్లను ప్రారంభించారు. వాటన్నింటికి డీడీఓ కోడ్లను సైతం కేటాయించారు. పంచాయతీ ప్రత్యేక అధికారి, పంచాయతీ కార్యదర్శి జాయింట్ అకౌంట్ ద్వారా గ్రామ పంచాయతీల పేర్ల మీద కరెంట్ అకౌంట్లను తీయాల్సి ఉంది. డీడీఓ కోడ్ నంబర్లతో బ్యాంక్ అకౌంట్లను తీయగానే డబ్బులు జమ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. నిధుల కోసం తాజా మాజీల ఎదురుచూపులు 14వ ఆర్థిక సంఘం నిధులు వస్తున్నాయని తెలియగానే తాజా మాజీ గ్రామ సర్పంచ్‌లు పదవీలో ఉన్న సమయంలో వివిధ అభివృద్ధి పనులు చేశారు. గ్రామ పంచాయతీ సమావేశాల్లో తీర్మానాలు చేసి, ఎంబీ రికార్డుల్లో సైతం నమోదు చేశారు. ఆ పనులకు సంబంధించిన బిల్లులు డ్రా చేసుకునేందుకు 14వ ఆర్థిక సం ఘం నిధులు ఎప్పుడొస్తాయా అని తాజా మాజీ సర్పంచ్‌లు ఎదురు చూస్తున్నారు. గ్రామ పంచాయతీ బ్యాంకు అకౌంట్ల లో డబ్బులు జమ కాగానే తీసుకునేందుకు ప్రత్యేకాధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మరో రెండు రోజుల్లో జమ గ్రామ పంచాయతీల అకౌంట్లను తీయిస్తున్నాం. పీడీ అకౌంట్లు పూర్తి చేశాం. డీడీఓ అకౌంట్ల ద్వారా బ్యాంకుల్లో ఖాతాలను తెరిపిస్తున్నాం. 14వ ఆర్థిక సంఘం నిధులను మరో రెండు, మూడు రోజుల్లో డబ్బులను జమ చేస్తాం. – రాజారావు, ఇన్చార్జి డీపీఓ -
నిధులు మంజూరైనా నిర్లక్ష్యమే..
నిజాం కాలంలో నిర్మించిన కత్వ శిథిలావస్థకు చేరడంతో పునర్నిర్మించేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. అయితే నిధులు మంజూరై సంవత్సరం దాటినా టెండర్ల ప్రక్రియ పూర్తి కాలేదు. మూడు మండలాల్లోని పది గ్రామాలకు ప్రయోజనం కలిగించే ఈ కత్వ నిర్మాణానికి రైతులు ఎదురుచూస్తున్నారు. మొయినాబాద్(చేవెళ్ల): వందేళ్ల క్రితం నిజాం పాలకులు హిమాయత్ సాగర్ జలాశయాన్ని నిర్మించారు. అదే సమయంలో ఈసీ వాగుపై మొయినాబాద్ మండలం వెంకటాపూర్ వద్ద, దానికింద శంషాబాద్ మండలంలోని మల్కారం వద్ద, మొయినాబాద్ మండలంలోని అమ్డాపూర్ వద్ద కత్వలు నిర్మించారు. ఈసీవాగు వికారాబాద్ జిల్లాలోని అనంతగిరికి కుడివైపు నుంచి పారుతూ హిమాయత్‌సాగర్ జలాశయంలో కలుస్తుంది. అప్పట్లో వాగు జీవనదిగా పారేది. దీంతో కత్వలు నిండి పైనుంచి పొర్లి నీరు కిందకు వెళ్లేది. కత్వ ఎగువ భాగంలో నిలిచిన నీటితో పరిసర ప్రాంతాల్లో భూగర్భజలాలు పెరిగేవి. అప్పట్లో కత్వల వద్ద నిల్వ ఉండే నీటిని మోట ద్వారా రైతులు పంటపొలాలకు తరలించేవారు. వెంకటాపూర్ వద్ద నిర్మించిన కత్వ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 500 ఎకరాలకు లబ్ధిచేకూరేది. కత్వకు కుడివైపు సుమారు మూడు కిలోమీటర్ల దూరం పెద్ద కాలువ ఉండేది. ఈ కాలువ ద్వారా శంషాబాద్ మండలంలోని రామంజాపూర్, కవేలిగూడ, మల్కారం, కేబీ దొడ్డి గ్రామాల్లోని సుమారు 350 ఎకరాలకు సాగునీరు అందేది. అదే విధంగా ఎగువ ప్రాంతంలో ఉన్న మొయినాబాద్ మండలంలోని వెంకటాపూర్, శ్రీరాంనగర్, కేతిరెడ్డిపల్లి, నక్కలపల్లి, షాబాద్ మండలంలోని చిన్నసోలిపేట్, పెద్దసోలిపేట్, హైతాబాద్ తదితర గ్రామాల రైతులు కత్వ ఎగువన నిల్వ ఉన్న నీటిని మోట ద్వారా పొలాలకు పారించుకునేవారు. 50 ఏళ్ల క్రితం వరకు ఆయా గ్రామాలకు సాగునీరు అందేది. అయితే కొంత కాలం క్రితం కత్వకు రంద్రాలు పడి నీటి నిల్వ తగ్గడంతోపాటు పంటకాల్వలు మూసుకుపోవడంతో నీటి పారుదల వ్యవస్థ దెబ్బతిన్నది. ఈసీ వాగు కూడా వరదలు వచ్చినప్పుడు మాత్రమే పారుతుండడంతో ఆయకట్టుకు నీరందకుండా పోయింది. రూ.2.77 కోట్లు మంజూరు వెంకటాపూర్ కత్వ పునర్నిర్మాణానికి ప్రభుత్వం సంవత్సరం క్రితం నిధులు మంజూరు చేసింది. రెండేళ్ల క్రితం చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో పాటు ఇరిగేషన్ అధికారులు కత్వను పరిశీలించారు. కత్వ పునర్నిర్మాణం చేపడితే రైతులకు ఉపయోగపడుతుందని గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రభుత్వం కత్వ పునర్నిర్మాణంతోపాటు పంట కాలువల నిర్మాణానికి రూ.2.77కోట్లు మంజూరు చేసింది. అయితే నిధులు మంజూరై సంవత్సరం దాటినా ఇప్పటి వరకు పనలు మొదలు కాలేదు. నిధులు మంజూరు చేయడంతో సంతోషించిన రైతులు ఇంకా పనులు మొదలు కాకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి వెంటనే కత్వ పునర్నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు. భూగర్భజలాలు పెరుగుతాయి వెంకటాపూర్ కత్వ పూర్తిగా శిథిలావస్థకు చేరింది. వాగులు పారినా నీళ్లు నిల్వ ఉండడం లేదు. కత్వ పునర్నిర్మాణానికి సంవత్సరం క్రితమే ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. కానీ ఇప్పటి వరకు పనులు మొదలు పెట్టలేదు. కత్వ పునర్నిర్మాణం జరిగితే సాగునీరు అందడంతోపాటు పరిసర ప్రాంతంలో భూగర్భ జలాలు పెరిగి బోరుబావుల్లో నీటి మట్టం పెరుగుతుంది. – మాణెయ్య, మాజీ సర్పంచ్, శ్రీరాంనగర్ టెండర్ ప్రక్రియలో ఆగింది వెంకటాపూర్ కత్వ పునర్నిర్మాణానికి ప్రభుత్వం రూ.2.77 కోట్లు మంజూరు చేసింది. దీనికి సంబందించి టెక్నికల్ సాంక్షన్ వచ్చింది. టెండర్ ప్రక్రియలోనే ఆగిపోయింది. ఎందుకు ఆగిందనే విషయం పూర్తిగా తెలియదు. దానిని పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటాం. అనిల్, ఇరిగేషన్ ఏఈ, మొయినాబాద్ -
ఖమ్మం అభివృద్ధికి రూ.కోట్లు
ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం నగరంలో అన్ని డివిజన్లలో రోడ్లనుసీసీ రోడ్లుగా మార్చి సుందర నగరంగా తీర్చిదిద్దటమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ అన్నారు. శనివారం ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 41, 41వ డివిజన్లలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మేయర్ పాపాలాల్‌తో కలిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గతంలో నగరంలో రోడ్లు, సీసీ డ్రెయిన్ల అవసరాన్ని గుర్తించిన మేరకు నేడు శంకుస్థాపనలు చేస్తున్నట్లు తెలిపారు. ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేసి వాటిని వాడుకలోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రుద్రగాని శ్రీదేవి, కొప్పెర సరిత, పాలడుగు పాపారావు, కొప్పెర నరసింహారావు, నాయకులు ఆర్జేసీ కృష్ణ, రుద్రగాని ఉపేందర్, మెంతుల శ్రీశైలం, నిరంజన్‌రెడ్డి, వసంతబాబు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యవర్గం భేటీ ఖమ్మంమయూరిసెంటర్: ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌ను అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ నూతన కార్యవర్గం శనివారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన కార్యవర్గానికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు పద్మ, భవాని, శ్రీదేవి, ప్రేమబాయి, రమాదేవి, విమల, ప్రేమిలా, జ్యోతి, కల్పన పాల్గొన్నారు. -
స్మార్ట్ మిషన్‌కు నిధుల గండం
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ఆశించిన మేర నిధుల లభ్యత లేకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయి. రెండు లక్షల కోట్లపైగా వ్యయంతో స్మార్ట మిషన్‌ను చేపట్టగా రాష్ట్రాల వారీగా ఇప్పటివరకూ కేంద్రం కేవలం రూ 9940 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా మహారాష్ట్ర రూ 1378 కోట్లు పొందగా, మధ్యప్రదేశ్‌కు రూ 984 కోట్లు విడుదలయ్యాయి.కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా 99 నగరాలను ఎంపిక చేశారు. ఈ నగరాలను రూ 2.03 లక్షల కోట్లతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా నిధుల విడుదల, పనుల పురోగతి మాత్రం ఎక్కడివేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది. ఏపీలో నాలుగు నగరాలు స్మార్ట్ మిషన్‌కు ఎంపిక కాగా ఇప్పటివరకూ కేవలం రూ 588 కోట్ల నిధులే విడదలయ్యాయి. 11 స్మార్ట్ నగరాలు ఎంపికైన తమిళనాడుకు రూ 848 కోట్లు విడుదలయ్యాయి. ఇక పది స్మార్ట్ సిటీలున్న యూపీకి రూ 547, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు రూ 509 కోట్లు విడుదలైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. స్మార్ట్ సిటీలుగా ఎంపికైన నగరాల్లో అధునాతన రహదారులు, జల వనరుల మెరుగుదల, సైకిల్ ట్రాక్స్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, వైద్య సేవల ఆధునీకరణ, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి అభివృద్ధి పనులు చేపడతారు. ప్రతి నగరానికీ 500 కోట్ల నిధులతో ఆయా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా అరకొర నిధులే అందుతుండటంతో స్మార్ట్ మిషన్‌లో స్థబ్థత నెలకొంది. -
స్మార్ట్ సిటీలకు రూ.198 కోట్లు విడుదల
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న 6 స్మార్ట్ సిటీలకు నిధులు విడుదలయ్యాయి. మంగళవారం ప్రభుత్వం రూ.198 కోట్లు విడుదల చేసింది. ఒక్కో నగరానికి రూ. 33 కోట్ల చొప్పున విడుదల చేశారు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, ఏలూరు, ఒంగోలు, నెల్లూరు, కర్నూలు, అనంతపురం లను ప్రభుత్వం స్మార్ట్ సిటీలుగా అభివృద్ధి చేయాలని నిర్ణయించిన విషయం విదితమే. వీటికి గాను ఆర్థిక శాఖ నిధులు విడుదల చేసింది. -
మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.99 కోట్లు
మనుబోలు : జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.99 కోట్లు ఖర్చు చేశామని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన ఆత్మగౌరవం రికార్డులను పరిశీలించారు. పథకం అమలుపై ఎంపీడీఓ హేమలతతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కింద జిల్లాలో ఇప్పటికి 70, 212 మరుగు దొడ్లు నిర్మించామన్నారు. ఇంకా 35,883 మరుగు దొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు బకాయిలకు సంబంధించి రూ.5.02 కోట్లు విడుదలయ్యాయన్నారు. వారంలో మిగిలిన రూ.3 కోట్లు విడుదల చేస్తామన్నారు. మనుబోలు మండలాన్ని ఓడీఫ్ (సంపూర్ణ మల విసర్జన రహిత) మండలంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏడాదిలోపు మండలంలోని అన్ని గ్రామాల్లో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు. -
మూడో దఫా రుణమాఫీ నిధుల విడుదల
రంగారెడ్డి జిల్లా : ఎట్టకేలకు రైతు రుణమాఫీ మూడో విడత నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. నాలుగేళ్లలో రుణమాఫీని వర్తింపజేయాలని నిర్ణయించిన ప్రభుత్వం మొత్తం రుణాల్లో ఇప్పటివరకు రూ.501 కోట్లను చెల్లించింది. తాజాగా మరో రూ.125.65 కోట్లు అంటే 12.5% రుణ మాఫీకి సంబంధించిన నిధులను విడుదల చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. తద్వారా 1,99,678 మంది రైతులకు రుణభారం తగ్గనుంది. మొదటి సంవత్సరం ఒకే విడతలో 25శాతం నిధులు విడుదల చేసిన ప్రభుత్వం.. గతేడాది రెండు వాయిదాల్లో రుణమాఫీ నిధులను చెల్లించింది. ఈసారి కూడా అదే తరహాలో 12.5 శాతం నిధుల చెల్లింపునకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఫ్లాగ్షిప్ కార్యక్రమంగా దీన్ని భావిస్తోంది. అధికారపీఠం దక్కించుకోవడంలో కీలకపాత్ర పోషించిన రుణాలను మాఫీ చేయడం ద్వారా రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకూడదని నిర్ణయించింది. ఈ క్రమంలో విడతల వారీగా రుణమాఫీ నిధుల చెల్లిస్తూ వస్తోంది. -
మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.15కోట్లు
డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి నెల్లూరు(దర్గామిట్ట): జిల్లాలోని 43 పంచాయతీల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.2.15కోట్లు మంజూరైనట్లు డీఆర్డీఏ పీడీ లావణ్యవేణి తెలిపారు. కలెక్టరేట్లోని డీఆర్డీఏ సమావేశ మందిరంలో వెలుగు ఏపీఎంలు, ఏసీలు, డీపీఎంలతో గురువారం ఆమె సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. జిల్లాలో 10వ తేదీలోగా 3వేల కంపోస్టు తొట్టెలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. చంద్రన్న బీమాలో సభ్యులను చేర్పించాలని ఏపీఎంలను ఆదేశించారు. పొదుపు సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాల మంజూరులో రాష్ట్రంలో జిల్లా 7వ స్థానంలో ఉన్నట్లు తెలిపారు. డీఆర్డీఏ ఏపీడీ ప్రసన్నలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. -
చేబర్తికి నిధుల మంజూరుపై హర్షం
జగదేవ్‌పూర్: మండలంలోని చేబర్తి గ్రామంలో పలు అభివృద్ధి పనుల కోసం రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు కోట్లాది నిధులు మంజూరు చేయడం పట్ల సోమవారం గ్రామంలో టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీ నాయకులు నర్సింలుగౌడ్, రాందాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మండలంలోని చేబర్తి గ్రామం చాలా రోజులుగా అభివృద్ధికి నోచుకోవడం లేదన్నారు. చెబర్తి పెద్ద చెరువు నుంచే కూడవెల్లి వాగు పుట్టిందని, కానీ చేబర్తి వాగుకు బదులు కూడవెల్లి వాగు అనడంతో గ్రామంలో అభివృద్ధి కూడా అంతగా లేదన్నారు. ఇటీవల మంత్రి హరీశ్‌రావు గ్రామంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు కోట్లాది నిధులు మంజూరు చేశారని చెప్పారు. కూడవెల్లి వాగుకు బదులు పెద్దవాగుగా నామకరణం చేయడంతోపాటు చెరువు అభివృద్ధి కోటి రూపాయలు మంజూరు చేయడంతో వారు కృతజ్ఞతలు తెలిపారు. మహిళా భవనం, ఫంక్షన్‌హాల్, బస్‌షెల్టర్, సీసీ రోడ్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం కోసం రూ.కోటికి పైగా నిధులు మంజూరు చేయడంతో గ్రామం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. అందరు కలిసికట్టుగా అభివృద్ధిలో భాగస్వాములవుతామని చెప్పారు. సమావేశంలో వివిధ పార్టీల నాయకులు రాములు, మల్లేశం, గంగాధర్, చంద్రం తదితరులు పాల్గొన్నారు. -
మత్స్యకళాశాల అభివృద్ధికి రూ.3.63 కోట్లు
జనవరిలో రజతోత్సవాలు ముత్తుకూరు : ముత్తుకూరులోని మత్స్యకళాశాల స్థాయి పెంచేందుకు శ్రీవెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ నడుంకట్టింది. ఇందులో భాగంగా కళాశాల మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.3.63 కోట్లు మంజూరు చేసింది. మొదటి విడతగా రూ.1.20 కోట్లు విడుదల చేసింది. అలాగే సంఖ్య పెరుగుతున్న విద్యార్థినుల హాస్టల్ మొదటి అంతస్తు నిర్మాణానికి రూ.1.50 కోట్లు మంజూరయ్యాయి. రూ.81 లక్షలతో నిర్మించిన మినీ ఆడిటోరియంను జనవరిలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాణం పూర్తయిన ఈ ఆడిటోరియానికి అదనపు హంగులు సమకూర్చేందుకు రూ.45 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. మరో వైపు వెంకటాచలం మండలంలోని తిరుమలమ్మపాళెంలో ఉన్న ఫామ్ చుట్టూ ప్రహరీగోడ నిర్మించేందుకు రూ.45 లక్షలు మంజూరైంది. ఎగువమిట్టలోని క్షేత్రంలో గిడ్డంగి నిర్మించేందుకు రూ.20 లక్షలు మంజూరు చేశారు. విద్యార్థుల మెస్, డైనింగ్ గది నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరైంది. ఇద్దరు డీన్లు రాక నేడు ఎస్వీవీయూ నుంచి సోమవారం మత్స్యకళాశాలకు ఇద్దరు డీన్లు వస్తున్నట్టు అసోసియేట్ డీన్ కృష్ణప్రసాద్ చెప్పారు. స్టూడెంట్ అఫైర్స్ డీన్ డాక్టర్ మూర్తి, ఫిషరీస్ డీన్ డాక్టర్ రమణ తదితరులు వస్తున్నారన్నారు. 2017 జనవరిలో కళాశాల రజతోత్సవ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందుకోసం కమిటీలు కూడా నియమించామన్నారు. -
కాలేజీ నిర్మాణానికి నిధులు
నిధులు మంజూరు.. త్వరలో అందుబాటులోకి భవనం హర్షం వ్యక్తంచేస్తున్న విద్యార్థులు ములుగు: సుదీర్ఘ కాలం నుంచి రేకుల షెడ్డులకే పరిమితమైన ములుగు ప్రభుత్వ జూనియర్ కళాశాలకు ఇక సొంత భవనం సమకూరనుంది. భవన నిర్మాణానికి ప్రభుత్వం రూ.75 లక్షలు మంజూరు చేసింది. 2001లో ములుగు ఉన్నత పాఠశాలలో షిఫ్ట్ పద్ధతిన కళాశాలను ఏర్పాటుచేశారు. అనంతరం రెవెన్యూ కార్యాలయం పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో తాత్కాలికంగా నిర్మించిన రేకుల షెడ్డుల్లోకి మార్చారు. ప్రస్తుతం కళాశాలలో ఇంటర్ మొదటి, ద్వితీయ సీఈసీ, ఎంపీసీ, బైపీసీ గ్రూపులు కలుపుకుని మొత్తం 170 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అయితే అరకొర వసతుల మధ్య చదువులు కొనసాగక విద్యార్థులు నానా ఇబ్బందులుపడుతున్నారు. వీరి ఇబ్బందిని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం అదనపు గదుల నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం భవన నిర్మాణ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. భవనం తర్వలో అందుబాటులోకి రానుంది. భవన నిర్మాణంతోపాటు కళాశాల ప్రహరీ, సీసీ రోడ్డు నిర్మాణాలకు మరో రూ.17 లక్షలు మంజూరయ్యాయి. వసతులు మెరుగుపడుతాయి కళాశాల నూతన భవనంతో విద్యార్థులకు వసతులు మెరుగుపడతాయి. ఇన్నాళ్లు గదుల కొరతతో విద్యార్థులు, అధ్యాపకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భవిష్యత్‌లో కళాశాలలో మరిన్ని వసతులు సమకూరుస్తాం. - వెంకటాచారి, కళాశాల ప్రిన్సిపాల్ రేకుల షెడ్డులతో తప్పని ఇబ్బందులు ఇరుకైన రేకుల షెడ్డులతో ఇబ్బందులు పడుతున్నాం. దీనికితోడు ఎండకు ఉక్కపోత, విషపురుగుల సంచారంతో భయంగా ఉంది. చదువుపై దృష్టిపెట్టలేకపోతున్నాం. కళాశాల నూతన భవనం నిర్మించడం చాలా సంతోషంగా ఉంది. - రాజు, విద్యార్థి రెండు నెలల్లో పనులు పూర్తిచేస్తాం కళాశాల భవన నిర్మాణ పనులు మరో రెండు నెలల్లో పూర్తిచేస్తాం. కాంట్రాక్టర్‌కు ఇప్పటి వరకు పూర్తిచేసిన పనులకు సంబందించిన బిల్లులు సకాలంలో మంజూరు కాకపోవడంతో నిర్మాణంలో కొంత జాప్యం జరిగింది. పనులు త్వరితగతిన పూర్తిచేసి అందుబాటులోకి తీసుకొచ్చేందకు చర్యలు తీసుకున్నాం. - రామచంద్రం, ఈడబ్ల్యుఐడీసీ ఏఈ -
చంద్రబాబు బుల్లెట్ ప్రూఫ్ బస్సుకు నిధులు విడుదల
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలు, మారుమూల ప్రాంతాల్లో పర్యటించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన బుల్లెట్ ప్రూఫ్ బస్సుని కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం నిధులను విడుదల చేసింది. రూ.5.05 కోట్ల అంచనా వ్యయంతో చండీగఢ్‌కు చెందిన జేసీబీఎల్ సంస్థ నుంచి ఈ బస్సు కొనుగోలు నిమిత్తం తుది విడతగా రూ.కోటి ఇరవై ఆరు లక్షలను విడుదల చేస్తూ ప్రభుత్వ కార్యదర్శి శశిభూషన్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికే వాయిదాల్లో రూ.రెండున్నర కోట్లు విడుదల చేసినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. -
నిర్వహణా.. నిర్మాణమా!?
కొన్నేళ్ల నిధుల కరువు తీరింది. ఒక్కసారిగా నిధులు వచ్చి పడ్డాయి. వాటిని ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే లోపే.. అంటే మార్చి 31లోగా ఖర్చు చేయాలి. లేనిపక్షంలో వెనక్కి వెళ్లిపోయే ప్రమాదముంది. అయితే వీటి వినియోగంలో కొంత వివాదం నెలకొంది. నిర్వహణ పనులకే ఈ నిధులు వెచ్చించాలని మార్గదర్శకాల్లో ఉండటంతో నిర్మాణాలు చేపట్టే విషయంలో గ్రామాల్లో వాగ్వాదాలు, వివాదాలు.. పరస్పర ఫిర్యాదులు వంటి ఘటనలతో ఉద్రిక్తతలు రేగుతున్నాయి. ఎచ్చెర్ల : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో జాప్యం కారణంగా 13వ ఆర్థిక సంఘం నిధుల విడుదలలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంది. ఎట్టకేలకు ఎన్నికలు జరగడంతో ఆ నిధులన్నీ కొద్ది రోజుల వ్యవధిలోనే ఐదు విడతల్లో మంజూరయ్యాయి. జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు మంజూరైన ఈ నిధులను సత్వరమే వినియోగించాల్సిన అవసరం ఉంది. వచ్చే నెల.. అంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 14వ ప్రణాళిక కాలం ప్రారంభం కానుంది. అందువల్ల ఇప్పుడు మంజూరైన నిధులన్నింటినీ ఈ నెలలోనే పంచాయతీల ఖాతాలకు జమ చేయాలి. వాటితో పనులు ప్రారంభం కావాలి. అయితే దీనికి నిబంధనలు అడ్డంకిగా మారాయి. ఆర్థిక సంఘం నిధులతో పారిశుద్ధ్య నిర్వహణ పనులు మాత్రమే చేపట్టాలని నిబంధనల్లో ఉంది. సిమెంటు కట్టడాలు చేపట్టవచ్చని ఎక్కడా పేర్కొనలేదు. దాంతో ఒక్కసారి వచ్చిపడిన లక్షల నిధులను పారిశుద్ధ్య నిర్వహణకే ఎలా వినియోగిస్తారన్నది చర్చనీయాంశంగా మా రింది. మురుగు కాలువలు, సిమెంట్ కల్వర్టులు, సీసీ రోడ్ల నిర్మాణం కూడా పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో భాగమేనని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు అంటుండగా.. అధికారులు కూడా అదే చెబుతున్నారు. అయితే కొన్ని గ్రామాల్లో ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులు మాత్రం నిర్మాణాలు నిర్వహణ కిందకు ఎలా వస్తాయని ప్రశ్నిస్తూ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఫలితంగా వివాదాలు రేగుతున్నాయి. ఫరీదుపేటే ఉదాహరణ ఎచ్చెర్ల మండలం ఫరీదుపేటలో ఏర్పడిన వివాదమే ఈ పరిస్థితికి నిదర్శనం. ఈ పంచాయతీలో పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా పేర్కొంటూ సిమెంట్ కాలువలు నిర్మిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఆర్థిక సంఘం నిధులు నిర్వహణకే తప్ప నిర్మాణాలకు అవకాశం లేదని వాదిస్తూ.. దీనిపై అధికారులకు సైతం ఫిర్యాదు చేశారు. ఈ అంశం రెండు వర్గాల మధ్య వివాదంగా మారినప్పటికీ అధికారులు మాత్రం ‘పాము చావదు.. కర్ర విరగదు’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. కాలువల నిర్మాణం పారిశుద్ధ్య నిర్వహణలో భాగమేనని ఒకపక్క చెబుతూ.. మరోపక్క జిల్లా అధికారులను అడిగి నిర్ణయం తీసుకుంటామని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. జనాభా ప్రాతిపదికన ఈ పంచాయతీకి రూ.9.12 లక్షలు మంజూరయ్యాయి. ఇందులో రూ. 2 లక్షలు విద్యుత్ సామగ్రికి, రూ.62 వేలు కల్వర్టు నిర్మాణానికి ఖర్చు చేశారు. రూ. 6.02 లక్షలతో ప్రస్తుతం మురుగు కాలువలు నిర్మిస్తున్నారు. నాలుగు నివాస కమిటీలకు అప్పగించిన ఈ పనులు ప్రస్తుతం వివాదంలో పడ్డాయి. నిబంధనలు ఇలా.. జిల్లాలోని పంచాయతీలకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ. 16,09,17,600 మంజూరయ్యాయి. ఈ మేరకు పంచాయతీరాజ్ కమిషనర్ నుంచి జీవో విడుదలైంది. 2011 జనాభా ప్రాతిపదికన ఈ నిధులు మంజూరు చేశారు. ఈ నిధుల వినియోగానికి సంబంధించిన నిబంధనలు పరిశీలిస్తే.. సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్ స్కీములు, పారిశుద్ధ్యం, అంతర్గత రోడ్లు, వీధి దీపాలు, వృథా నీరు, పంచాయతీ కార్యాలయం, ఈ-పంచాయతీ, పాఠశాలలు, అంగ న్వాడీ కేంద్రాల నిర్వహణకు నిధులు వినియోగించాలని పేర్కొన్నారు. పారిశుద్ధ్యానికి కీలకమైన మురుగు కాల్వలు, అంతర్గత రోడ్ల నిర్మాణం గురించి ప్రస్తావించలేదు. అయినా ప్రస్తుతం పెద్ద మొత్తంలో మంజూరైన నిధులతో జిల్లాలో 80 శాతం సిమెంటు కాలువల నిర్మాణాలే చేపడుతున్నారు. దీనిపై పలు గ్రామాల్లో వివాదాలు రేగి ఫిర్యాదుల వరకు వెళుతుండటంతో శాంతిభద్రతలకు విఘాతం కలిగే ప్రమాదముంది. -
అవసరం రూ.80 లక్షలు..మంజూరు రూ.8 లక్షలు
రంగులకూ, టైల్స్కే ఆ మొత్తం సరి అదనపు సౌకర్యాలకు సొమ్ములు కరువు మురమళ్ల వీరేశ్వరుని సన్నిధిపై చిన్నచూపు పుష్కరాలకు 6 లక్షల మంది వస్తారని అంచనా అయినా పట్టించుకోని ప్రభుత్వం ఐ.పోలవరం :గోదావరి తీరంలో 12 రోజుల పాటు జరిగే పుష్కరాలకు ప్రభుత్వం కోట్లు కేటాయించినా.. నిత్య కల్యాణం, పచ్చతోరణంగా విరాజిల్లుతున్న మురమళ్ల శ్రీభద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయానికి నామమాత్రంగా నిధులు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. జూలై 14 నుంచి పుష్కర పర్వదినాలు ప్రారంభమవుతుండగా భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దేవస్థానంలో కనీస సౌకర్యాలు కల్పించవలసి ఉంది. కాశీ తరువాత నిత్యం పరమశివునికి కల్యాణం జరిగే ఏకైక పుణ్యక్షేత్రం మురమళ్ల. ఆలయంలో ప్రత్యేకంగా వివాహం కాని యువతీయువకులు తమ జన్మనక్షత్రాల ప్రకారం సాధన తార చూసుకొని, ఇక్కడ కల్యాణం జరిపించుకొంటే తక్షణమే వివాహం అవుతుందని ప్రగాఢ నమ్మకం. వీరేశ్వరుని సన్నిధిలో ప్రతినిత్యం 72 మంది భక్తులు గోత్రనామాలతో కల్యాణం జరగడం విశేషం. ఏటా 10 లక్షల మంది రాక.. మురమళ్ల వీరేశ్వరస్వామిని ప్రతి సంవత్సరం సుమారు 10 లక్షల మంది దర్శించుకొంటారు. ఆలయంలో వార్షికంగా ఐదురోజులపాటు జరిగే మహాశివరాత్రి, ద్వాదశ పుష్కర జలాభిషేకం, ఐదురోజుల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు, లక్ష రుద్రాక్షపూజలకు ఇతర జిల్లాల నుంచే కాక ఇతర రాష్ట్రాలనుంచీ అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతుంటారు. 2003లో జరిగిన పుష్కరాల సమయంలో అధికారుల లెక్కల ప్రకారం లక్షకు పైగా భక్తులు వీరేశ్వరస్వామి వారిని దర్శించుకొన్నారు. ఇప్పుడు 12 రోజులలో సుమారు 6 లక్షల మంది హాజరవుతారని ఆలయాధికారులు అంచనా వేశారు. దానికి అనుగుణంగా ఉన్నతాధికారులకు రూ.80 లక్షలు వ్యయమయ్యే ప్రతిపాదనలు పంపించారు. అయితే వాటి ప్రకారం నిధుల కేటాయింపు జరగడంలేదు. ఆలయానికి కేవలం రూ.8 లక్షలు కేటాయించారు. ఈ సొమ్ము కేవలం ఆలయానికి రంగులు వేయడానికి, ఆలయ ఆవరణలో పార్కింగ్ టైల్స్ వంటి పనులకే సరిపోతాయి. ఇంకా కల్పించాల్సిన అదనపు, అత్యవసర సౌకర్యాలకు నిధులు సమకూర్చడం ఆలయాధికారులకు భారమవుతుంది. ప్రధానంగా తాగునీరు, మరుగుదొడ్లు, తాత్కాలికంగా బస చేసేందుకు షెల్టర్లు, రద్దీకి అనుగుణంగా వాహనాల పార్కింగ్ వంటి పనులు చేపట్టవలసి ఉంది. ఆదాయం ఘనమే.. మురమళ్ల వీరేశ్వరునికి ప్రతి సంవత్సరం కల్యాణం టికెట్లు, 90 ఎకరాల మీద శిస్తు, హుండీ, ఇతర ఆదాయాలు కలుపుకొని రూ.కోటి 50 లక్షలు వస్తుంది. ఆదాయానికి తగ్గట్టు ఆలయంలో భక్తులకు సౌకర్యాలు కల్పించడంలో అటు పాలక మండలి, ఇటు అధికారులు విఫలమయ్యారు. రానున్న పుష్కరాల్లోనే స్వామి ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. అయితే దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేయాల్సి ఉంది. రూ.80లక్షలకుప్రతిపాదనలు పంపాం... గోదావరి పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని భక్తుల సౌకర్యార్థం రూ.80 లక్షలు వ్యయమయ్యే పనులకు ప్రతిపాదనలను ఉన్నతాధికారులకు పంపాం. కానీ అధికారులు రూ.8 లక్షలు మంజూరు చేశారు. అవి ఆలయానికి రంగులు వేసి, ఆలయ ఆవరణలో టైల్స్ అమర్చేందుకు మంజూరు చేశారు. ఆలయంలో ప్రత్యేకంగా డార్మిటరీ, కల్యాణ బేడా మండపం ఎక్స్టెన్షన్, నూతనంగా అభిషేక మండపం, ఇతర ఏర్పాట్లకు ప్రతిపాదనలు పంపాం. అయినా దేనికీ అనుమతులు లేవు. - బళ్ల నీలకంఠం, ఆలయ కార్య నిర్వహణాధికారి -
నిధులొస్తున్నాయి
ఆన్లైన్లో నమోదై వివిధస్థాయిలో ఉన్న 57 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మోక్షం మొదలుపెట్టని లక్ష ఇళ్ల దరఖాస్తుల ర ద్దు నిర్మాణాల్లో అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు పూర్తి ఇళ్ల కోసం 2 లక్షల దరఖాస్తులు పెండింగ్ డబుల్ బెడ్రూం స్కీం కోసం ఎదురుచూపులు ఇళ్ల వివరాలు పునాది లెవల్ 7,900 బేస్మెంట్దశలో 31,100 లెంటల్ లెవల్ 4,400 రూఫ్ లెవల్13,900 నల్లగొండ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇది ఊరట కలిగించే విషయం... గతేడాది సార్వత్రిక ఎన్నికల ముందు బిల్లులు చెల్లించకుండా ఆగిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆన్లైన్లో నమోైదె ..నిధుల్లేక వివిధ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తారు. ఈ బకాయిల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తారు. జిల్లాలో వివిధ స్థాయిలో నిర్మాణాలు ఆగిపోయిన ఇళ్లు 57,300 ఉన్నాయి. వీటికి ఇప్పుడు నిధులు మంజూరు చేస్తారు. అయితే ఆన్లైన్లో నమోదై ఇళ్ల నిర్మాణం చేపట్టని వాటిని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయనుంది. ఇలాంటివి జిల్లాలో లక్షా 23 వేల ఇళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డబుల్ బెడ్రూం స్కీం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో...నిర్మాణం కానీ ఇళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది. ఇందిరమ్మ పథకం 2006-07 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి చివరిసారిగా నిర్వహించిన రచ్చబండ వరకు జిల్లావ్యాప్తంగా 4,03,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే సగం ఇళ్లు అంటే 2,22,300 పూర్త్తయ్యాయి. ఇంకా 1,80,700 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవిగాక గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన మన ఊరు-మన ప్రణాళిక భాగంగా ఇళ్లు కావాలని కోరుతూ కొత్తగా రెండు లక్షల ఐదువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ డబుల్‌బెడ్ రూం ఉన్న ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజల నుంచి వేలాది దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు కానున్నాయి. మార్చి నాటికి ఈ పథకం అమలులోకి వచ్చేఅవకాశం ఉందని పీడీ పి.రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అక్రమాలపై దర్యాప్తు పూర్తి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీసీఐడీ అధికారుల దర్యాప్తు పూర్తయ్యింది. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లోని మూడు మండలాల పరిధిలోని నాలుగు గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గురించి సీబీసీఐడీ అధికారులు డిసెంబర్లో విచారణ చేశారు. అనుముల మండలం చల్మారెడ్డిగూడెంలో 414 ఇళ్లు, కొత్తపల్లిలో 730, డిండి మండలం డి.నెమలిపూర్లో 229, చందంపేట మండలం తిమ్మాపురంలో 313 ఇళ్లను సీబీసీఐడీ బృందం తనిఖీ చేసింది. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. మొత్తం ఇందిరమ్మ దరఖాస్తులు @ః 4,03,500 పూర్తయిన ఇళ్లు 2,22,300 మన ఊరు -మన ప్రణాళికలో వచ్చిన దరఖాస్తులు 2,05,000 నిర్మాణం కాకుండా రద్దయిన ఇళ్లు @ః 1,23,000 -
బీసీల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు
కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : బీసీల అభివృద్ధి, సంక్షేమం కోసం రూ.5 వేల కోట్లు వెచ్చిస్తున్నట్లు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బసవరాజు సారయ్య తెలిపారు. స్థానిక ప్రభుత్వ అతిథిగృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. బీసీ కార్పొరేషన్ ద్వారా గతంలో రూ.30 వేలు మాత్రమే సబ్సిడీ ఇచ్చేవారని, ప్రస్తుతం లక్ష రూపాయలకు పెంచామన్నారు. బీసీ కులాల్లో చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నవారిలో ప్రతి నియోజకవర్గంలో 2వేల మందికి బ్యాంకు లింకేజీ కింద రుణాల కోసం బడ్జెట్ విడుదల చేసినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 2013-14లో 6 లక్షల మంది బీసీలకు ఆర్థిక చేయూతనందిస్తామన్నారు. మండలాల్లో ఎంపీడీఓ, మున్సిపాలిటీల్లో కమిషనర్లు కన్వీనర్లుగా ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఆధ్వర్యంలోనే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుందన్నారు. జీవో నెం.101 ప్రకారం ఈ నెల 21వ తేదీ నాటికి రుణాలకు సంబంధించిన ప్రక్రియను పూర్తయ్యేలా ఆదేశాలు జారీ చేశామని, అయితే గడువు పొడిగింపు అంశాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రాష్ట్రంలో కొత్తగా 40 వసతి గృహాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. 38 మహాత్మా జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ పాఠశాలలను ఇంటర్మీడియట్ స్థాయికి అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న బీసీ సంక్షేమ, సహాయ సంక్షేమాధికారులు, హెచ్‌డబ్ల్యూఓలు, ఇతర మినిస్టీరియల్ ఉద్యోగుల భర్తీ ప్రక్రియను త్వరలోనే చేపడతామని మంత్రి తెలిపారు. మంత్రికి బీసీ నేతల స్వాగతం.. మంత్రి బసవరాజు సారయ్య కర్నూలుకు వచ్చిన నేపథ్యంలో పలు బీసీ సంఘాల నాయకులు స్థానిక ప్రభుత్వ అతిథిగృహం వద్ద ఘనంగా స్వాగతం పలికారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, బీసీ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.రాంబాబు, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు జె.లక్ష్మీనరసింహ, బీసీ కులాల ఐక్యవేదిక కన్వీనర్ టి.శేషఫణి, బీసీ హెచ్‌డబ్ల్యూఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లింగస్వామి, పాలెగార్ సత్యనారాయణరాజు, విద్యార్థి సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు కె.జోషి తదితరులు స్వాగతం పలికారు. -
బండ‘బడి’
కర్నూలు(విద్య), న్యూస్‌లైన్ : ‘ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల వసతులూ కల్పిస్తున్నాం.. కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా ఫలితాలు సాధిస్తాం’ అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ మేరకు చర్యలు తీసుకోవడంలో విఫలమవుతోంది. దీంతో గదులు, ప్రహరీలు, క్రీడలకు మైదానం లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం కొన్ని పాఠశాలలకు గదులు మంజూరు చేసినా అధికారుల ఉదాసీనత, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా ఏళ్లు గడుస్తున్నా భవనాలు పూర్తి కావడం లేదు. జిల్లాలో 79 ప్రభుత్వ, 140 మునిసిపల్, 335 జిల్లా పరిషత్, 2,154 మండల పరిషత్, 1,003 ఎయిడెడ్ పాఠశాలలు ఉన్నాయి. అందులో మంచినీటి సౌకర్యం లేని పాఠశాలల సంఖ్య 1450, మరుగుదొడ్లు లేని పాఠశాలలు 1380, వంటగదులు లేని పాఠశాలలు 1020, రక్షణ గోడలు లేని పాఠశాలలు 1010, ఆటస్థలాలు లేని పాఠశాలలు 1254, విద్యుత్ సౌకర్యం లేని పాఠశాలలు 890 ఉన్నాయి. ప్రహరీగోడలు, వాచ్మెన్ లేకపోవడంతో పాఠశాలలు రాత్రివేళల్లో అసాంఘిక కార్యక్రమాలకు నిలయాలు మారాయి. వంటగదులకు కేటాయించిన నిధులు సరిపోవడం లేదంటూ చాలా చోట్ల నిర్మాణాలు చేపట్టలేదు. ఆరుబయటే మధ్యాహ్న భోజనం వండుతుండటంతో క్రిమికీటకాలు పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తాగునీటి సౌకర్యం ఉన్నా ట్యాంకులు శుభ్రం చేయకపోవడం, నీటిసరఫరా సరిగ్గా లేకపోవడం, నిర్వహణ లోపంతో విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారు. విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో కంప్యూటర్ విద్య మూలనపడింది. మరుగుదొడ్లు, మూత్రశాలలు లేకపోవడంతో బాలికల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధిక శాతం పాఠశాలల్లో మైదానాలు లేకపోవడంతో విద్యార్థులు ఆటపాటలకు దూరమవుతున్నారు. మరికొన్ని చోట్ల పాఠశాలల స్థలాలు ఆక్రమణకు గురవుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జిల్లాలోని పాఠశాలల్లో పరిస్థితి ఇదీ.. ఆదోని మండల పరిధిలోని మాంత్రికి గ్రామ ప్రాథమిక పాఠశాల గదుల నిర్మాణం అర్ధంతరంగా నిలిచిపోయింది. బల్లేకల్లు, పెద్దపెండేకల్లు, మదిరె గ్రామాల్లోని ప్రాథమిక పాఠశాలలో గదుల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఆదోని మునిసిపల్ కమిషనర్ కార్యాలయం పక్కనే ఉన్న ఎన్ఎంహెచ్ స్కూల్లో విద్యార్థులకు తగ్గట్టుగా తరగతి గదులు లేవు. పట్టణంలోని అండర్పేట గర్ల్స్ హైస్కూల్‌కు ప్రహరీ లేకపోవడంతో చుట్టుపక్కల వారు పాఠశాల ఆవరణలోనే మల విసర్జన చేస్తున్నారు. దీంతో విద్యార్థులు నడిచేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బనగానపల్లి మండలంలోని పసుపల, నందివర్గం, కైప, రామతీర్థం, ఇల్లూరు కొత్తపేట, పట్టణంలోని జిల్లా పరిషత్ పాఠశాలలకు మరుగుదొడ్ల, తాగునీటి సౌకర్యాలు లేవు. నందివర్గం ఉన్నత పాఠశాల వద్ద ఇటీవలే మరుగుదొడ్లను నిర్మించినా, నాణ్యత లేక బీటలువారి నిరుపయోగంగా మారాయి. నందవరం, నందివర్గం, రామతీర్థం, ఇల్లూరు కొత్తపేట, టంగుటూరు, తిమ్మాపురం మరికొన్ని గ్రామాల్లో ప్రాథమిక పాఠశాలల అదనపు గదుల నిర్మాణానికి నిధుల మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపినా బుట్టదాఖలయ్యాయి. డోన్పట్టణంలో కొత్తపేట, నెహ్రునగర్ కాలనీల్లోని జెడ్పీపాఠశాల్లో తరగతి గదులు లేక ఉన్న నాలుగు గదుల్లోనే క్లాసులు నడుపుతున్నారు. ప్యాపిలి జెడ్పీ బాలుర హైస్కూలు, చిన్నపూజర్ల, వెంగళాంపల్లె గ్రామాల్లో పాఠశాలలల్లో క్రీడామైదానాల కొరత ఉంది. -
ఏకగ్రీవాలకు ప్రోత్సాహమేదీ?
భువనగిరి, న్యూస్‌లైన్: గత సంవత్సరం జూలైలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవమైన వాటికి ఇస్తామన్న నజరానా నేటికీ అందలేదు. ప్రభుత్వం ఇస్తామన్న నగదు ప్రోత్సాహకం కోసం ఎదురుచూస్తున్న ఏకగ్రీవ సర్పంచ్‌లకు నిరాశే మిగులుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికల సమయంలో ఎన్నికలు లేకుండా పాలకవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ పంచాయతీకి *7లక్షల పారితోషికం అందజేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. దీంతో జిల్లాలో ఉన్న 1169 పంచాయతీల్లో 103 ఏకగ్రీవమయ్యాయి. వీటన్నింటికి కలిపి *7.21కోట్ల నిధులు రావాల్సి ఉంది. ఎన్నికలు జరిగి ఏడు నెలలవుతున్నా ఒక్క పంచాయతీకి కూడా ప్రోత్సాహక నిధులు విడుదల చేయలేదు. పంచాయతీల్లో నిధులు లేక గ్రామాల్లో కనీస సౌకర్యాలు కూడా కల్పించలేని స్థితిలో సర్పంచ్‌లున్నారు. కనీసం ప్రోత్సాహక నిధులు వస్తే వాటితోనైనా తాగునీరు, వీధి దీపాలు తదితర పనులు పూర్తి చేద్దామనుకుంటే ప్రభుత్వం వాటి గురించే పట్టించుకోవడం లేదని ఏకగ్రీవ సర్పంచ్‌లు వాపోతున్నారు. ఆ నిధుల కోసం ఎన్నిసార్లు అధికారులను కలిసినా ఎవరూ స్పం దించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఏకగ్రీవ పంచాయతీలకు ఇస్తామన్న ప్రోత్సాహక నగదును మంజూరు చేయాలని వారు కోరుతున్నారు. -
పంచాయతీలకు కాసుల కళ
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: పంచాయతీల దశ తిరగనుంది. కొన్నేళ్లుగా నిధులందక.. అభివృద్ధి పనులు చేపట్టలేక కటకటలాడిపోతున్న గ్రామ పంచాయతీలను ప్రభుత్వాలు ఎట్టకేలకు కరుణించాయి. ఒకేసారి మూడు పద్దుల కింద జిల్లాకు రూ.17.41 కోట్ల నిధులు మంజూరు చేశాయి. దీంతో గ్రామాలు నిత్యం ఎదుర్కొంటున్న పారిశుద్ధ్య సమస్యతోపాటు ఇతరత్రా సమస్యల పరిష్కారానికి అవకాశం ఏర్పడింది. పంచాయతీ ఎన్నికలు జరిగిన తర్వాత నిధులు మంజూరు కావడం ఇదే తొలిసారి. వీటితో అభివృద్ధి పనులు చేపట్టే వెసులుబాటు కొత్త సర్పంచులకు లభిస్తుంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సాకుగా చూపిస్తూ ప్రతి ఏటా మంజూరు చేయాల్సిన నిధులను కూడా రాష్ట్ర ప్రభుత్వం గత కొన్నాళ్లు గా నిలిపివేసింది. ఆర్థిక సంవత్సరంలో మరో మూడు నెలలే మిగిలిన తరుణంలో ఇప్పుడు ఆదరాబాదరాగా మంజూరు చేసింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో తొలి రెండు త్రైమాసికాలకు చెందిన రాష్ట్ర ఆర్ధిక సంఘం నిధులు 4,09,78,800 రూపాయలు, 2013-14 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికి చెందిన వృత్తి పన్ను వాటా 85,93,200 రూపాయలు, అలాగే 13వ ఆర్థిక సంఘానికి సంబంధించి 2011-12 సంవత్సరం రెండో విడత నిధుల కింద 12,45,50,200 రూపాయలు మంజూరయ్యాయి. ఈ నిధులను జనాభా ప్రాతిపదికన గ్రామ పంచాయతీలకు కేటాయించారు. జిల్లాలో పరిస్థితి జిల్లాలో మొత్తం 1099 పంచాయతీలున్నాయి. వీటిలో 13 మేజర్ పంచాయతీలు కాగా, మిగిలినవన్నీ మైనర్ పం చాయతీలే. ఇటీవల కాలంలో సంభవించిన వరుస తుఫాన్లు, వరదలు, వర్షాలతో గ్రామాల్లో పారిశుద్ధ్య పరి స్థితి దారుణంగా తయారైంది. పంచాయతీల ఆస్తులు సైతం దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో నిధులు విడుదల కావడంతో పారిశుద్ధ్యం మెరుగు పరచడంతోపాటు, వీధి దీపాలు, పంచాయతీ భవనాల మరమ్మతులు, ప్రాథమిక పాఠశాలలు, అంగన్వాడీ భవనాల మరమ్మతులు, నిర్వహణ తదితర పనులు చేపట్టేందుకు వీలు కలిగింది. దీనిపై ఇన్‌ఛార్జి డీపీవో బలివాడ సత్యనారాయణ ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ జిల్లాలోని పంచాయతీలకు 17,41,22200 రూపాయలు మంజూరయ్యాయన్నారు. వీటిని నిర్మాణాత్మక కార్యక్రమాలకు వినియోగించాలని సూచించారు.