మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.99 కోట్లు
మనుబోలు : జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఇప్పటి వరకూ రూ.99 కోట్లు ఖర్చు చేశామని ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ కృష్ణారెడ్డి అన్నారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం ఆయన ఆత్మగౌరవం రికార్డులను పరిశీలించారు. పథకం అమలుపై ఎంపీడీఓ హేమలతతో చర్చించారు. ఆయన మాట్లాడుతూ ఆత్మగౌరవం కింద జిల్లాలో ఇప్పటికి 70, 212 మరుగు దొడ్లు నిర్మించామన్నారు. ఇంకా 35,883 మరుగు దొడ్లు నిర్మాణ దశలో ఉన్నాయని తెలిపారు. అక్టోబర్ నుంచి ఇప్పటి వరకు బకాయిలకు సంబంధించి రూ.5.02 కోట్లు విడుదలయ్యాయన్నారు. వారంలో మిగిలిన రూ.3 కోట్లు విడుదల చేస్తామన్నారు. మనుబోలు మండలాన్ని ఓడీఫ్ (సంపూర్ణ మల విసర్జన రహిత) మండలంగా చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఏడాదిలోపు మండలంలోని అన్ని గ్రామాల్లో 100 శాతం మరుగుదొడ్లు నిర్మించుకోవాలని కోరారు.