
సాక్షి, న్యూఢిల్లీ : మహమ్మారి కరోనా వైరస్‌పై రాష్ట్రాలు మరింత సమర్ధంగా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రూ 17,287 కోట్లు విడుదల చేసింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసిన ఈ నిధుల్లో 14 రాష్ట్రాలకు సంబంధించి పదిహేనో ఆర్థిక సంఘం సూచించిన మేర ఆదాయ లోటు గ్రాంటు రూ 6195 కోట్లు కూడా కలిపిఉన్నాయి. ఆదాయ లోటు గ్రాంట్‌ను ఏపీ, అసోం, హిమచల్ ప్రదేశ్, కేరళ, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు, త్రిపుర, ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్‌లకు ఆర్థిక శాఖ మంజూరు చేసింది. ఇక కరోనా మహమ్మారిని దీటుగా కట్టడి చేసేందుకు ఎస్‌డీఆర్‌ఎమ్‌ఎఫ్ తొలి వాయిదాగా అన్ని రాష్ట్రాలకు రూ 11,092 కోట్లు విడుదల చేశామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. మరోవైపు దేశవ్యాప్తంగా 2301 కరోనా పాజిటివ్ కేసులు నమోదవగా 57 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment