ఆన్‌లైన్‌లో నమోదై వివిధస్థాయిలో ఉన్న 57 వేల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మోక్షం
మొదలుపెట్టని లక్ష ఇళ్ల దరఖాస్తుల ర ద్దు
నిర్మాణాల్లో అక్రమాలపై సీబీసీఐడీ దర్యాప్తు పూర్తి
ఇళ్ల కోసం 2 లక్షల దరఖాస్తులు పెండింగ్
డబుల్ బెడ్‌రూం స్కీం కోసం ఎదురుచూపులు
ఇళ్ల వివరాలు పునాది లెవల్ 7,900
బేస్‌మెంట్‌దశలో 31,100
లెంటల్ లెవల్ 4,400
రూఫ్ లెవల్13,900
నల్లగొండ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇది ఊరట కలిగించే విషయం... గతేడాది సార్వత్రిక ఎన్నికల ముందు బిల్లులు చెల్లించకుండా ఆగిపోయిన ఇళ్లకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. ఆన్‌లైన్‌లో నమోైదె ..నిధుల్లేక వివిధ స్థాయిలో నిర్మాణాలు నిలిచిపోయిన ఇళ్లకు మాత్రమే బిల్లులు చెల్లిస్తారు. ఈ బకాయిల మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమచేస్తారు. జిల్లాలో వివిధ స్థాయిలో నిర్మాణాలు ఆగిపోయిన ఇళ్లు 57,300 ఉన్నాయి. వీటికి ఇప్పుడు నిధులు మంజూరు చేస్తారు. అయితే ఆన్‌లైన్‌లో నమోదై ఇళ్ల నిర్మాణం చేపట్టని వాటిని ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయనుంది. ఇలాంటివి జిల్లాలో లక్షా 23 వేల ఇళ్లు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో డబుల్ బెడ్‌రూం స్కీం ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో...నిర్మాణం కానీ ఇళ్లను రద్దు చేయాలని నిర్ణయించింది.
ఇందిరమ్మ పథకం 2006-07 సంవత్సరంలో ప్రారంభమైంది. అప్పటి నుంచి చివరిసారిగా నిర్వహించిన రచ్చబండ వరకు జిల్లావ్యాప్తంగా 4,03,000 దరఖాస్తులు వచ్చాయి. అయితే సగం ఇళ్లు అంటే 2,22,300 పూర్త్తయ్యాయి. ఇంకా 1,80,700 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇవిగాక గతేడాది రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నిర్వహించిన మన ఊరు-మన ప్రణాళిక భాగంగా ఇళ్లు కావాలని కోరుతూ కొత్తగా రెండు లక్షల ఐదువేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ డబుల్‌బెడ్ రూం ఉన్న ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో ప్రజల నుంచి వేలాది దరఖాస్తులు వచ్చాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలు త్వరలో ఖరారు కానున్నాయి. మార్చి నాటికి ఈ పథకం అమలులోకి వచ్చేఅవకాశం ఉందని పీడీ పి.రాజ్‌కుమార్ ‘సాక్షి’కి తెలిపారు.
అక్రమాలపై దర్యాప్తు పూర్తి
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతి అక్రమాలపై సీబీసీఐడీ అధికారుల దర్యాప్తు పూర్తయ్యింది. నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లోని మూడు మండలాల పరిధిలోని నాలుగు గ్రామాల్లో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గురించి సీబీసీఐడీ అధికారులు డిసెంబర్‌లో విచారణ చేశారు. అనుముల మండలం చల్మారెడ్డిగూడెంలో 414 ఇళ్లు, కొత్తపల్లిలో 730, డిండి మండలం డి.నెమలిపూర్‌లో 229, చందంపేట మండలం తిమ్మాపురంలో 313 ఇళ్లను సీబీసీఐడీ బృందం తనిఖీ చేసింది. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను ప్రభుత్వానికి అందజేసింది.
మొత్తం ఇందిరమ్మ దరఖాస్తులు @ః 4,03,500
పూర్తయిన ఇళ్లు 2,22,300
మన ఊరు -మన ప్రణాళికలో వచ్చిన దరఖాస్తులు 2,05,000
నిర్మాణం కాకుండా రద్దయిన ఇళ్లు @ః 1,23,000
నిధులొస్తున్నాయి
Published Thu, Jan 8 2015 4:37 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement