ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, న్యూఢిల్లీ : స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు ఆశించిన మేర నిధుల లభ్యత లేకపోవడంతో నత్తనడకన సాగుతున్నాయి. రెండు లక్షల కోట్లపైగా వ్యయంతో స్మార్ట మిషన్‌ను చేపట్టగా రాష్ట్రాల వారీగా ఇప్పటివరకూ కేంద్రం కేవలం రూ 9940 కోట్లు విడుదల చేసింది. అత్యధికంగా మహారాష్ట్ర రూ 1378 కోట్లు పొందగా, మధ్యప్రదేశ్‌కు రూ 984 కోట్లు విడుదలయ్యాయి.కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్మార్ట్ సిటీ ప్రాజెక్టుకు దేశవ్యాప్తంగా 99 నగరాలను ఎంపిక చేశారు. ఈ నగరాలను రూ 2.03 లక్షల కోట్లతో అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా నిధుల విడుదల, పనుల పురోగతి మాత్రం ఎక్కడివేసిన గొంగళి అక్కడే చందంగా ఉంది.
ఏపీలో నాలుగు నగరాలు స్మార్ట్ మిషన్‌కు ఎంపిక కాగా ఇప్పటివరకూ కేవలం రూ 588 కోట్ల నిధులే విడదలయ్యాయి. 11 స్మార్ట్ నగరాలు ఎంపికైన తమిళనాడుకు రూ 848 కోట్లు విడుదలయ్యాయి. ఇక పది స్మార్ట్ సిటీలున్న యూపీకి రూ 547, ప్రధాని సొంత రాష్ట్రం గుజరాత్‌కు రూ 509 కోట్లు విడుదలైనట్టు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి.
స్మార్ట్ సిటీలుగా ఎంపికైన నగరాల్లో అధునాతన రహదారులు, జల వనరుల మెరుగుదల, సైకిల్ ట్రాక్స్, స్మార్ట్ క్లాస్‌రూమ్‌లు, నైపుణ్యాభివృద్ధి కేంద్రాలు, వైద్య సేవల ఆధునీకరణ, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వంటి అభివృద్ధి పనులు చేపడతారు. ప్రతి నగరానికీ 500 కోట్ల నిధులతో ఆయా కార్యక్రమాలు చేపట్టాల్సి ఉండగా అరకొర నిధులే అందుతుండటంతో స్మార్ట్ మిషన్‌లో స్థబ్థత నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment