సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు సాయాన్ని 5 ఎకరాలకే పరిమితం చేసినా, చిన్న, సన్నకారు రైతులకే లాభం కలుగుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) అంచనా వేసింది. ఇలా చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి రూ.4,500 కోట్ల వరకు మిగులుతుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌జీజీ వినతిపత్రం అందజేసింది. అంతకు ముందు ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి రైతుబంధు పథకానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది.
2020 యాసంగిలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 147.14 లక్షల ఎకరాలకు సంబంధించి 59.21 లక్షల పట్టాదారులకు రూ.7,357.02 కోట్లు రైతుబంధు సాయం అందించినట్లు తెలిపింది. ఇందులో ఐదు ఎకరాల లోపు ఉన్నవాళ్లు 53.30 లక్షల మంది 102.24లక్షల ఎకరాలు కలిగి ఉన్నారు. వీరికి ఎకరాకి రూ.5వేల చొప్పున ప్రతి సీజన్‌కి రైతులకు రైతుబంధు సాయాన్ని అందజేసిన రూ.5,111 కోట్లు ఖర్చు కానుంది. ఇలా రెండు సీజన్లు కలిపి సుమారు రూ.4,500 కోట్లు మిగలనున్నట్లు ఎఫ్‌జీజీ తెలిపింది. అదే పది ఎకరాల లోపు ఉన్న 58.07 లక్షల మంది రైతులకు(132.65 లక్షల ఎకరాలకు) ప్రతి సీజన్‌కి రైతులకు రైతుబంధు సాయాన్ని అందజేస్తే రూ.6,632.74 కోట్లు ఖర్చు అవుతుంది.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment