Forum for good governance
-
17 మందిలో 14 మందిపై కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచి లోక్‌సభకు ఎన్నికైన 17 మంది ఎంపీల్లో 14 మందికి నేరచరిత్ర ఉందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ శనివారం ఒక ప్రకటనలో తెలిపింది. ఇందులో మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై అత్యధికంగా 54 కేసులు ఉన్నాయని వెల్లడించింది. ఎంపీలు తమ ఎన్నికల అఫిడవిట్లలో పొందుపరిచిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు వెల్లడించినట్టు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం.పద్మనాభరెడ్డి వివరించారు.కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై 42 కేసులు, మెదక్ ఎంపీ రఘునందన్‌రావుపై 29 కేసులు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌పై 22 కేసులు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై ఐదు కేసులు ఉన్నట్టు పద్మనాభరెడ్డి తెలిపారు. సికింద్రాబాద్ ఎంపీ కిషన్‌రెడ్డి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, వరంగల్ ఎంపీ కడియం కావ్యలపై మాత్రం ఎలాంటి కేసులు నమోదై లేవని వెల్లడించారు. మల్కాజ్గిరి పార్లమెంట్ నియెజకవర్గంలో అత్యధికంగా 13,366 ఓట్లు ‘నోటా’కు పడినట్లు తెలిపారు. -
తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సీఎస్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ రాసింది. ప్రైవేట్ లాయర్లకు ప్రభుత్వం ఎక్కువ ఖర్చు పెడుతుందని లేఖలో పేర్కొంది. ఏజీ, అడిషనల్ ఏజీ ఉండగా, ప్రైవేట్ లాయర్ల ఎందుకు అని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. గవర్నర్ రిపబ్లిక్ డే కేసుతో పాటు, ఎమ్మెల్యేల ఫాంహౌస్ కేసులోనూ ప్రభుత్వం తరుపున న్యాయవాది దుష్యంత్ దవే వాదించారు. ప్రైవేట్ న్యాయవాదులకు లక్షల్లో ఫీజులు ఇచ్చి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఫోరం ఫిర్యాదు చేసింది. చదవండి: E-Car Racing: ఓరి నాయనో ఇదేంటి! వాహనాలు రేసింగ్ ట్రాక్‌పైకి ఎలా వచ్చాయ్? -
కూకట్‌పల్లిలో 5 ఎకరాలు ఆక్రమణ
సాక్షి, హైదరాబాద్: రూ.100 కోట్లకు పైగా విలువ చేసే భూమిని ఆక్రమించేశారు. రాజకీయ, అధికారుల అండదండలు మెండుగా ఉండటంతో అక్రమ ప్లాట్ల రిజిస్ట్రేషన్లూ జరిగిపోయాయి. రాత్రికి రాత్రే గృహ, వాణిజ్య సముదాయాల నిర్మాణ పనులు మొదలయ్యాయి. అయినా స్థానిక మున్సిపల్ అధికారులు తూతూ మంత్రంగా నోటీసులు జారీ చేసి చేతులు దులుపుకోవటం విశేషం. ఈ మేరకు కబ్జా రాయుళ్లపై విజిలెన్స్ అధికారులతో విచారణ జరిపించి, దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసింది. ఆ వివరాలివే.. ► సనత్‌నగర్‌లోని హైదరాబాద్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆస్బెస్టాస్) తన కంపెనీలో పని చేస్తున్న కార్మికులకు గృహ వసతి కోసం కూకట్పల్లి గ్రామ పరిధిలో 45 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం నుంచి కొనుగోలు చేసింది. ఇందులో 40 ఎకరాలలో ఓపెన్ ప్లాట్లకు కేటాయించగా.. 5 ఎకరాలు ఆటస్థలాలు, పార్కులు, స్కూళ్ల వంటి 12 రకాల అభివృద్ధి పనుల కోసం కేటాయించింది. హుడా అనుమతితో ఈ లే–అవుట్లో 1,035 ప్లాట్ల చేసి కార్మికుల పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేశారు. ► కొంతకాలం తర్వాత కొందరు కార్మికులు హైదరాబాద్ ఇండస్ట్రీస్ ఎంప్లాయీస్ కో–ఆపరేటివ్ సొసైటీ పేరుతో 45 ఎకరాల భూమిని తమ ఆధీనంలోకి తీసుకొని అభివృద్ధి పనుల కోసం కేటాయించిన ఐదెకరాల స్థలంపై కన్నేశారు. స్థానిక రాజకీయ నాయకులు, రిజిస్ట్రేషన్, మున్సిపల్ అధికారులతో కుమ్మకై.. 12 ఖాళీ స్థలాల భూమిని 100 ప్లాట్లుగా విభజించి, ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించారు. వీటి విలువ దాదాపు రూ.100 కోట్ల వరకు ఉంటుంది. (క్లిక్: రీజినల్’ రెండో గెజిట్ విడుదల..) ► ఆయా అక్రమ రిజిస్ట్రేషన్ స్థలాలలో గృహాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌ల నిర్మాణాలు జరుగుతున్నా.. మున్సిపల్ అధికారులు పట్టించుకోవటం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభ రెడ్డి ఆరోపించారు. (క్లిక్: మెడికల్ కాలేజీల్లో పీజీ సీట్ల బ్లాకింగ్.. దందాలో పెద్దలు?) -
ఎన్నికల కేసులు వీగిపోకుండా చూడండి
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల సందర్భంగా ప్రజాప్రతినిధులపై వివిధ జిల్లా కోర్టుల్లో ఉన్న కేసులను ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ చేయటానికి చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కేసులు వీగిపోకుండా ప్రాసిక్యూషన్ తగిన శ్రద్ధ వహించాలని సుపరిపాలన వేదిక (ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్) కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు పద్మనాభరెడ్డి లేఖ రాశారు. మొత్తం 507 కేసులు నమో దు అయ్యాయని ఆయా కేసులను నాంపల్లి ప్రత్యేక కోర్టుకు బదిలీ చేయాలని తెలిపారు. అన్ని కేసులు ప్రత్యేక న్యాయస్థానానికి బదిలీ కాకపోవడంతో ప్రాసిక్యూషన్ వారి అలసత్వం తో అనేక కేసులు వీగిపోతున్నాయన్నారు. దీంతో శిక్ష పడిన కేసుల్లో స్టేలు రావడం వంటి వాటితో ప్రజలకు పోలీసుశాఖ, న్యాయవ్యవస్థపై నమ్మకం పోతుందని విమర్శించారు. చదవండి: రూ.700 కోట్ల ‘కార్వీ’ షేర్లు ఫ్రీజ్ -
ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి ఖర్చు రూ.25 కోట్లు
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు డబ్బు ప్రాబల్యం పెరిగిందని దీన్ని అరికట్టేలా వెంటనే చర్యలు చేపట్టాలని భారత ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రధానాధికారిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) కోరింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి మంగళవారం ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి లేఖరాశారు. ఎన్నికలు ఒక ప్రహసనంలా మారాయని, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో డబ్బు జోక్యం మితిమీరిందని ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.25 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోఎన్నికల సంఘం పకడ్బందీగా వ్యవహరిస్తుందని, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి డబ్బు అక్రమ రవాణాను అడ్డుకుంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తుందని గుర్తుచేశారు. కానీ, ఎన్నికల ముగిసిన అనంతరం ఆ కేసుల పురోగతిని పట్టించుకోవడం లేదని వాపోయారు. 2014లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో 1,199 కేసులు, డబ్బు పంపిణీలో 543 కేసులు నమోదు కాగా రూ.34.38 కోట్ల నగదు పట్టుబడిందని పద్మనాభరెడ్డి తెలిపారు. అదే సమయంలో 2,194 అక్రమ మద్యం కేసులు, 52 ఘటనల్లో బంగారం స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక 2018లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై 1,086 కేసులు, డబ్బుపంపిణీపై 548 కేసులవగా రూ.55.07 కోట్లు నగదు పట్టుబడిందని తెలిపారు. 1,875 మద్యం పంపిణీ కేసులు నమోదవ్వగా మొత్తంగా 3,561 కేసులు రికార్డయ్యాయని పేర్కొన్నారు. చదవండి: Funds: బీజేపీకి కోట్లకు కోట్లు.. చతికిలబడ్డ కాంగ్రెస్ -
ఐదెకరాలకే ఇస్తే రూ.4 వేల కోట్లు మిగులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించే రైతుబంధు సాయాన్ని 5 ఎకరాలకే పరిమితం చేసినా, చిన్న, సన్నకారు రైతులకే లాభం కలుగుతుందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(ఎఫ్‌జీజీ) అంచనా వేసింది. ఇలా చేస్తే ప్రభుత్వానికి ఏడాదికి రూ.4,500 కోట్ల వరకు మిగులుతుందని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఎఫ్‌జీజీ వినతిపత్రం అందజేసింది. అంతకు ముందు ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి రైతుబంధు పథకానికి సంబంధించి సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నలకు రాష్ట్ర ప్రభుత్వం సమాధానమిచ్చింది. 2020 యాసంగిలో మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 147.14 లక్షల ఎకరాలకు సంబంధించి 59.21 లక్షల పట్టాదారులకు రూ.7,357.02 కోట్లు రైతుబంధు సాయం అందించినట్లు తెలిపింది. ఇందులో ఐదు ఎకరాల లోపు ఉన్నవాళ్లు 53.30 లక్షల మంది 102.24లక్షల ఎకరాలు కలిగి ఉన్నారు. వీరికి ఎకరాకి రూ.5వేల చొప్పున ప్రతి సీజన్‌కి రైతులకు రైతుబంధు సాయాన్ని అందజేసిన రూ.5,111 కోట్లు ఖర్చు కానుంది. ఇలా రెండు సీజన్లు కలిపి సుమారు రూ.4,500 కోట్లు మిగలనున్నట్లు ఎఫ్‌జీజీ తెలిపింది. అదే పది ఎకరాల లోపు ఉన్న 58.07 లక్షల మంది రైతులకు(132.65 లక్షల ఎకరాలకు) ప్రతి సీజన్‌కి రైతులకు రైతుబంధు సాయాన్ని అందజేస్తే రూ.6,632.74 కోట్లు ఖర్చు అవుతుంది. చదవండి: ఎస్బీఐ వినియోగదారులకి హెచ్చరిక -
నయీం ఇంట్లో కళ్లు చెదిరే నిజాలు..!
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు జరిపించాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి కోరారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నయీం ఇంట్లో 24 వెపన్స్, ఏకే 47 రైఫిల్స్, పిస్టర్స్, గ్రనేడ్స్ పట్టుబడ్డాయని, పోలీసుల సహకారం లేకుండా అత్యాధునిక ఆయుధాలు నయీంకు ఎలా వచ్చాయని ఆయన ప్రశ్నించారు. (చదవండి: ‘తెలంగాణలో నయా రాచరికం’) ‘‘నయీం ఇంట్లో దొరికిన 24 గన్స్కు లైసెన్స్ ఇచ్చింది పోలీసులే. నయీం ఇంట్లో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు దొరికాయంటే పోలీసులకు సంబంధం లేదని సిట్ ఎలా చెబుతుంది. పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది కూడా నయీంకు సహకరించారు. నయీం ఇంట్లో 752 ల్యాండ్ డాక్యుమెంట్లు దొరికాయి. నయీం కేసును సీబీఐకి అప్పగించాలి. నయీం ఇంట్లో దొరికిన 602 సెల్ఫోన్ల కాల్ డేటాను ఎందుకు బయట పెట్టడం లేదని’’ ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నించింది. నయీం లాంటి దుర్మార్గులు మళ్ళీ మళ్ళీ పుట్టకుండా ఉండాలంటే సహకరించిన పోలీసులపై పూర్తిస్థాయి దర్యాప్తు జరగాల్సిందేనని, దీని పై గవర్నర్ కు లేఖ రాశామని పద్మనాభరెడ్డి తెలిపారు. (చదవండి: టీపీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం!) -
‘గ్రేటర్’లో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్లు వీరే
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విడుదల చేసింది. మూడు పార్టీల్లో మొత్తం 25 మంది నేరచరితులు ఉన్నట్లు పేర్కొంది. బీజేపీ 10, టీఆర్ఎస్ 8, ఎంఐఎంలో ఏడుగురు కార్పొరేటర్లు నేర చరిత్ర కలిగి ఉన్నట్లు ప్రకటించింది. కాగా, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ 55 బీజేపీ 48, ఎంఐఎం 44, కాంగ్రెస్ 2 స్థానాల్లో గెలిచిన విషయం తెలిసిందే. నేరచరిత్ర ఉన్న కార్పొరేటర్ల జాబితా కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టీఆర్ఎస్లో 16, ఎంఐఎంలో 13 మంది నేరచరితులు
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వవద్దని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేసింది. గతంలో అన్ని పార్టీల నుంచి కలిపి 72 మంది నేరచరిత్ర ఉన్నవాళ్లు టికెట్లు దక్కించుకుని పోటీ చేశారని తెలిపింది. అందులో 30 మంది అభ్యర్థులు గెలిచారని, ఈ లెక్కన పాలకమండలిలో 20 శాతం మంది కార్పొరేటర్లు నేరచరిత్ర కలిగి ఉన్నారని వివరించింది. పార్టీలవారీగా చూసుకుంటే టీఆర్ఎస్లో 16 మంది, ఎంఐఎంలో 13 మంది, బీజేపీలో ఒక్కరి చొప్పున ఉన్నారని వెల్లడించింది. నేరచరితులు బరిలో నిల్చుంటే విద్యావంతులు ఓటింగ్‌పై విముఖత చూపుతారని, ఫలితంగా ఓటింగ్ శాతం పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేసింది. వచ్చే ఎన్నికల్లోనైనా నేరచరిత్ర కలిగిన అభ్యర్థులకు టికెట్లు ఇవ్వకూడదని అన్ని పార్టీలను ఎఫ్‌జీజీ కార్యదర్శి పద్మనాభరెడ్డి సోమవారం ఓ ప్రకటనలో కోరారు. (చదవండి: ఎన్నికలపై స్టే కోరుతూ వ్యాజ్యం.. హైకోర్టు ఆగ్రహం) -
నయీం కేసు: ఆ డైరీని బయట పెట్టాలి
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అనే సంస్థ అభ్యంతరం తెలిపింది. సిట్ దర్యాప్తు పారదర్శకంగా జరగలేదని, కేసు నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించింది. నయీం కేసు విచారణను సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కు లేఖ రాసింది. నాలుగేళ్లుగా దర్యాప్తు చేస్తున్నా.. బాధితులకు న్యాయం జరగలేదని, నేరస్తులకు శిక్ష పడలేదని లేఖలో పేర్కొంది. ఈ కేసును సీబీఐకి అప్పగించి పారదర్శకంగా దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ను కోరింది. (చదవండి : నయీం కేసులో మరో సంచలనం) నయీం డైరీని బయట పెట్టాలి నయీం కేసులో సిట్ దర్యాప్తు పారదర్శకంగా లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆరోపించారు. కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. శనివారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ.. నయీం కేసులో పోలీసులకు క్లీన్ చిట్ ఇవ్వడం అనుమానం కలిగిస్తోందన్నారు. నయీం ఇంట్లో డబ్బులు లెక్కించడానికి రెండు కౌంటింగ్ మిషన్లు తీసుకెళ్లి.. 3.74లక్షల రూపాయలు మాత్రమే దొరికినట్లు చూపించడం దారుణమన్నారు. 240 కేసులు నమోదు చేసి నాలుగేళ్లయినా.. ఇప్పటి వరకు 173 చార్జషీట్లు మాత్రమే దాఖలు చేశారని విమర్శించారు. నయీం డైరీని బయట పెట్టాలన్నారు. నయీం కేసును సీబీఐతో విచారణ జరిపించి, నేరస్తులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. -
ఖండాంతరాలు దాటిన హైదరాబాద్ డ్రగ్స్ దందా
సాక్షి, హైదరాబాద్ : గత రెండేళ్లలో 12 డ్రగ్స్ కేసులు నమోదైనట్లు తెలంగాణ ఎక్సైజ్ శాఖ తెలిపింది. 12 కేసుల్లో 8 కేసుల్లోనే చార్జిషీట్ నమోదు చేసినట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ దాఖలు చేసిన ఆర్టీఐకు ఎక్సైజ్‌శాఖ సమాధానమిచ్చింది. టాలీవుడ్‌కు సంబంధించిన 4 కేసులపై ఎక్సైజ్‌శాఖ సమాచారం ఇవ్వకపోగా.. దాఖలు చేసిన 8 చార్జిషీట్లలో సంచలన అంశాలు వెల్లడించింది. ఈ క్రమంలో హైదరాబాద్ డ్రగ్స్ దందా ఖండాంతరాలు దాటినట్లు వెల్లడైంది. (రియాకు మద్దతుగా కాంగ్రెస్ ర్యాలీ) జర్మనీ, బ్రిటన్, ఇంగ్లాండ్‌ల నుంచి కొరియర్ ద్వారా డ్రగ్స్ సప్లై అవుతోంది. విదేశాల నుంచి స్టీల్ బౌల్స్ పేరుతో కొకైన్, ఎల్ఎస్డీ www.ipsld.lo వెబ్సైట్ ద్వారా స్టూడెంట్స్ డ్రగ్స్ బుకింగ్ చేస్తున్నట్లు వెల్లడి. సికింద్రాబాద్ మోండా మార్కెట్ మహేశ్వర ఫార్మాలో సైతం డ్రగ్స్ అమ్మకాలు జరుగుతన్నట్లు తేలింది. ఈ ఎనిమిది చార్జిషీట్లలో కాలేజీ స్టూడెంట్స్‌తో పాటు ప్రముఖుల పేర్లు ఉన్నట్లు తేలింది. సంచలనం సృష్టించిన టాలీవుడ్ కేసులో 72 మంది పేర్లు ఉండగా, విచారణకు హాజరైన 12 మందితో మరో 60 మంది జాబితాను వెల్లడించింది. (ప్రభుత్వ ఖజానా నింపుకునేందుకే: బీజేపీ) -
సీఈఓకి ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల ప్రచారం సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బు దొరికిన వాళ్లపై కేసులు పెట్టడం లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి మండిపడ్డారు. డిసెంబర్లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కోడ్ అమల్లో ఉన్న సమయంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తల వద్ద పట్టుకున్న డబ్బు వివరాలపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పరిశీలన చేసిందన్నారు. అదేవిధంగా డబ్బు ఎన్నికలను శాసిస్తోందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో డబ్బు విపరీతంగా పంచుతున్నారని.. డబ్బు నియంత్రణ కోసం ఎన్నికల కమిషన్ ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల సమయంలో తెలంగాణలో 640 కేసులు, సుమారు రూ. 84 కోట్ల 34 లక్షలు పట్టుకున్నారని తెలిపారు. రూ.28 కోట్లకు 159 కేసులను మాత్రమే నమోదు చేశారని పేర్కొన్నారు. కేవలం 24 శాతం మాత్రమే కేసులు పెట్టారని తెలిపారు. నమోదైన కేసుల్లో దాదాపు రూ. 56 కోట్లు వదిలేశారని ఆగ్రహించారు. ఎన్నికల నిబంధనలను సరిగా అమలు చేయటం లేదని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఎన్నికలు సక్రమంగా నిర్వహిస్తున్నప్పటికి.. అమలు చేస్తున్న విధానం సరిగా లేదన్నారు. ఎన్నికలు పూర్తయ్యాక ప్రతి ఆరు నెలలకు ఎన్నికల కమిషనర్ జిల్లా ఎస్పీలతో సమీక్ష నిర్వహించాలని సూచించారు. ఎన్నికల సమయంలో పట్టుబడిన డబ్బు, కేసులపై చర్చించాలని పద్మనాభరెడ్డి అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి తెచ్చిన డబ్బును ఐటీకి బదిలీ చేయటం సరికాదన్నారు. భారీగా డబ్బు పట్టుబడినప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసిన ఏ అభ్యర్థిపై కేసులు నమోదు చేయకపోవటంపై ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా డబ్బు పాత్రను తగ్గించుటకు ఎన్నికల కమిషన్ చేపట్టిన చర్యలు తెలంగాణ రాష్ట్రలో సరైన ఫలితాలు ఇవ్వలేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ విశ్లేషణలో తేలిందన్నారు. ఇప్పటికైనా ఎన్నికల్లో పట్టుకున్న డబ్బుపై విచారణ పూర్తి చేసి కేసు నమోదు చేయాలన్నారు. కేసు నమోదు చేసిన వివరాలను మీడియాలో తెలిపాలని ఆయన అభిప్రాయపడ్డారు. నమోదు చేసిన కేసులను రాష్ట్ర చీఫ్ ఎలక్షన్ కమిషనర్ తరచుగా పోలీసు అధికారులతో విశ్లేషించి.. ఆ కేసులన్నింటికి త్వరగా తీర్పు వచ్చేటట్టు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఈ మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఎన్నికల కమిషనర్‌కి లేఖ రాశారు. -
నయీం కేసులో రాజకీయ నాయకులపై చర్యలేవీ?
సాక్షి, హైదరాబాద్ : గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో ప్రమేయం ఉన్న రాజకీయ నాయకులపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి ప్రశ్నించారు. నయీం కేసు వివరాలు ఇవ్వాలని ఫోరం ఫర్ గుడ్ గవర్ననెన్స్ అధికారులను ఆర్టీఐ ద్వారా కోరింది. దీంతో అధికారులు నయీం కేసులో పలువురు రాజకీయ నాయకులు, పోలీసు ఉన్నతాధికారుల పేర్లు వెల్లడించారు. అయితే ఈ సమాచారంపై తమకు కొన్ని అనుమానాలు ఉన్నాయని తెలిపిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్, పలు అంశాలతో గవర్నర్ నరసింహన్‌కు ఓ లేఖ రాసింది. దీనిపై పద్మనాభరెడ్డి గురువారం సాక్షి టీవీతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన పలు సందేహాలను వెలిబుచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ‘నయీం ఎన్కౌంటర్ జరిగి మూడేళ్లు గడిచిన తరువాత ఈ కేసులో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. నయీంతో పోలీసులు, రాజకీయ నాయకులు సంబంధాలు పెట్టుకుని అరాచకాలకు పాల్పడ్డారని సిట్ ఏర్పాటు చేశారు. సిట్ దర్యాప్తు నివేదికలో రూ. 3.74 లక్షలు సీజ్ చేసినట్టు చెప్తున్నారు. కానీ నాడు నయీం ఇంట్లో పెద్ద ఎత్తున డబ్బు దొరికిందని కౌంటింగ్ మెషిన్లు తీసుకొచ్చి డబ్బులు లెక్కించారు. మరీ ఇంత తక్కువ మొత్తం లెక్కించడానికేనా కౌంటింగ్ మెషిన్లు తీసుకెళ్లింది?. రాజకీయ నాయకులకు ఎనిమిది మందికి ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్టు చెప్పారు. మరి వారిపై చర్యలు ఎందుకు తీసుకోలేదు?. నయీం ఇంట్లో సెర్చ్ చేసినప్పుడు ఒక డైరీ దొరికిందని అన్నారు. మేము అందులో ఏముందో చెప్పాలని ఆర్టీఐ ద్వారా అడిగాం. కానీ దర్యాప్తు సమయంలో సమాచారం ఇవ్వలేమని చెప్పారు. డైరీలో ఉన్న సమాచారాన్ని ప్రజల ముందు ఉంచాలి. 2003 నుంచి నయీంపై 8 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. కానీ వాటిని అతను చనిపోయాక రీ ఓపెన్ చేశారు. నయీం చనిపోయిన తరువాత 250 కేసులు నమోదైనట్టు చెబుతున్న పోలీసులు.. అతడు బతికి ఉన్నప్పుడు ఏం చేశారు?. ఇప్పటికే నయీం కేసులో తమకున్న అనుమానాలపై గవర్నర్‌కు లేఖ రాశామ’ని తెలిపారు. చదవండి : నయీం కేసులో బయటపడ్డ సంచలన విషయాలు -
నయీమ్ కేసు ఏమైంది?
సాక్షి, హైదరాబాద్: నయీమ్ కేసుల వ్యవహారంపై ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’ (ఎఫ్‌జీజీ) లేఖాస్త్రం సంధించింది. ఆర్టీఐ ద్వారా సేకరించిన వివరాలతో గవర్నర్‌కు లేఖ రాసింది. కబ్జాలు, సెటిల్మెంట్లు, కిడ్నాప్‌లు, హత్యలతో రెండు దశాబ్దాలపాటు హైదరాబాద్ పరిసరాల్లో వ్యాపారులకు కంటి మీద కనుకు లేకుండా చేసిన నయీమ్ కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2016లో నయీమ్‌ను ఎన్కౌంటర్ అనంతరం సాగిన దర్యాప్తు, పురోగతి, ఎవరెవరిని అరెస్టు చేశారు? ఎవరిపై చర్యలు తీసుకున్నారో వివరాలు తెలపాలంటూ ‘ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్’(ఎఫ్‌జీజీ) సమాచారహక్కు చట్టం కింద దరఖాస్తు చేసింది. సంస్థ అధ్యక్షుడు పద్మనాభరెడ్డి ఆర్టీఐ ద్వారా ఈ ప్రశ్నలను సంధించారు. కానీ, పోలీసుల నుంచి దర్యాప్తు జరుగుతోందన్న సమాధానం మాత్రమే వచ్చింది. దీంతో సదరు ఆర్టీఐ కాపీతోపాటు పలు సందేహాలతో కూడిన లేఖను బుధవారం ఇక్కడ విడుదల చేశారు. మూడేళ్లవుతున్నా నత్తలా నడుస్తున్న కేసు పక్కదారి పడుతోందంటూ గవర్నర్‌కి లేఖ ద్వారా ఫిర్యాదు కూడా చేశారు. -
అవినీతికి కొమ్ముకాస్తున్న రెవెన్యూ శాఖ
సాక్షి, హైదరాబాద్: అవినీతి అధికారులకు రెవెన్యూ శాఖ కొమ్ముకాస్తోందని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి అన్నారు. లంచం తీసుకుంటూ, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఏసీబీకి చిక్కిన అధికారులపై విచారణకు అనుమతి ఇవ్వకుండా సచివాలయంలోని రెవెన్యూ అధికారులు కేసులను నీరుగారుస్తున్నారని ఆరోపించారు. శనివారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషికి ఆయన వినతిపత్రం సమర్పించారు. అవినీతి కేసుల్లో పట్టుబడ్డ అధికారులను ప్రాసిక్యూషన్ చేయకుండా అడ్డుకోవడం, తీవ్ర నేరారోపణలున్నా శాఖాపరమైన చర్యలకే పరిమితం కావడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లలో సుమారు 50 అవినీతి కేసులను విచారణ జరపకుండానే మూసివేశారని, దీనిపై విచారణ జరపాలని కోరారు. -
మహిళలు, పిల్లలకు రక్షణలేని దేశం ముందుకు పోలేదు
హైదరాబాద్: మహిళలకూ, పిల్లలకూ రక్షణ కల్పించలేని దేశం ఎన్నటికీ ముందుకు పోలేదని ఫోరం ఫర్ గుడ్ గవ ర్నెన్స్ సెక్రటరీ పద్మనాభరెడ్డి అన్నారు. మహిళలు ఎక్కడ గౌరవిస్తారో అక్కడ దేవతలు కొలువుదీరుతారని పురాణాల్లో ఉందని, చదువుల కోసం సరస్వతిని, డబ్బు కోసం లక్ష్మీదేవిని పూజించడం మన సంస్కృతిలోనే ఉందని, కానీ ఆ మహిళలకూ, పిల్లలకూ రక్షణ లేకుండా పోయిందన్నారు. కైలాస్ సత్యార్థి పిల్లల ఫౌండేషన్, నెట్వర్క్ ఆఫ్ ప్రొటెక్షన్ చైల్డ్ ఆధ్వర్యంలో చేపట్టిన ‘అత్యాచార రహిత భారతదేశం’కోసం అన్ని రాజకీయ పార్టీల నాయకుల ప్రతిజ్ఞ పోస్టర్‌ను ఆయన శుక్రవారం ఇక్కడ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల భద్రత కోసం రాజకీయ నాయకుల వద్ద ప్రతిజ్ఞ తీసుకోవడం ఎంతో మంచి కార్యక్రమమే, కానీ నేతలు మాటపై నిలబడతారన్న నమ్మకం ఉండటంలేదన్నారు. పిల్లల రక్షణలో భారతదేశం ప్రపంచంలో 97వ స్థానంలో ఉందని, ఇది విచారకరమని పేర్కొన్నారు. మహిళలపై అత్యాచార కేసుల సత్వర పరిష్కారానికి ప్రతిరాష్ట్రంలో ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలని, బాధితులకు ఏడాదిలోపు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళలు, పిల్లల రక్షణ, భద్రత, చదువు కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని సూచించారు. రాజకీయ పార్టీలతోనే పరిష్కారం.. కైలాస్ సత్యార్థి పిల్లల ఫౌండేషన్ ప్రతినిధి రమణ్ చావ్లా మాట్లాడుతూ పిల్లలు, మహిళల భద్రతలేమి అనేది సామాజిక సమస్య అనీ, దీన్ని రాజకీయ పార్టీల నేతల చొరవతోనే పరిష్కరించగలమని అన్నారు. అత్యాచారరహిత భారతదేశం కోసం అన్ని రాజకీయ పార్టీల నేతల చేత ప్రతిజ్ఞ చేయిస్తున్నామని, ఎన్నికల్లో గెలవగానే పార్లమెంట్లో గళం విప్పేలా చూడటం, కేంద్ర బడ్జెట్లో పిల్లలు, మహిళల భద్రత కోసం 10 శాతం బడ్జెట్ కేటాయించే విధంగా కృషి చేయడం తమ ముఖ్య లక్ష్యమని తెలిపారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా 450 మంది ఎంపీలు, పార్టీల ప్రముఖులు ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేసినట్లు చెప్పారు. తెలంగాణలో కిషన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి లాంటి ప్రముఖులతోపాటు 34 మంది ఎంపీ అభ్యర్థులు, నేతలు ప్రతిజ్ఞాపత్రంపై సంతకం చేసి తమ ఉద్యమంలో భాగస్వామ్యం అయినట్లు తెలిపారు. తమతోపాటు సుమారు 50 వరకు స్వచ్ఛంద సంస్థలు ఈ ప్రచార ఉద్యమంలో పాల్గొంటున్నాయ ని చెప్పారు. ఎన్నికల ఫలితాలు రాగానే గెలిచిన ఎంపీలతో ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసి మహిళలు, పిల్లల రక్షణ కోసం పార్లమెంటులో గళం విప్పేలా చొరవ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆశ్రిత, ఎస్ఆర్డీ, బచ్పన్ బచావో ఆందోళన్, ఎంబీ ఫౌండేషన్ ప్రతినిధులు, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
అసెంబ్లీకి 67 మంది నేరచరితులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యుల్లో వివిధ పార్టీలకు చెందిన 67 మందిపై సివిల్, క్రిమినల్ కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ తెలిపింది. ఈ మేరకు సంస్థ కన్వీనర్ పద్మనాభరెడ్డి బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. మొత్తంగా శాసనసభలో 56.3 శాతం మంది ఎమ్మెల్యేలపై వివిధ రకాల కేసులున్నాయని తెలిపారు. ఇందులో టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైన 88 మంది శాసనసభ్యుల్లో 44 మందిపై కేసులున్నట్లు చెప్పారు. ఇక బీజేపీ నుంచి ఎన్నికైన ఒకే ఒక్క ఎమ్మెల్యేపైనా పలు కేసులున్నట్లు తెలిపారు. కాంగ్రెస్, టీడీపీల నుంచి గెలిచిన 21 మంది శాసనసభ్యుల్లో 16 మందిపై కేసులున్నట్లు పేర్కొన్నారు. ఎంఐఎం పార్టీ తరఫున గెలిచిన 7 మంది సభ్యుల్లో ఆరుగురిపై కేసులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు, సంబంధిత పార్టీలు ప్రధాన పత్రికలు, టీవీ చానళ్లలో నామినేషన్ వేసినప్పటి నుంచి 3 సార్లు కేసుల గురించి ప్రచురించాలని, ప్రసారం చేయాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిందని తెలిపారు. అయితే కొద్దిమంది అభ్యర్థులు మినహా ఎవరూ ఈ తీర్పును అమలు చేయలేదన్నారు. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి దృష్టికి తమ సంస్థ తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు. -
ఎన్నికల అక్రమాలపై నిఘా
సాక్షి, హైదరాబాద్: రానున్న ఎన్నికల్లో జరిగే అక్రమాలపై నిరంతరం నిఘా ఉంచటంతోపాటు ఓటరు చైతన్య కార్యక్రమాలను నిర్వహించేందుకు ఎన్నికల నిఘా కమిటీ ఏర్పాటైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి పద్మనాభరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ కమిటీలో వివిధ రంగాల ప్రముఖులు ఉండనున్నారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ కమిటీ రాష్ట్రవ్యాప్తంగా ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహించనుంది. ఓటరు జాబితాలో అవకతవకలు, పార్టీల మేనిఫెస్టోలు, ప్రచారం, డబ్బు, మద్యం పంపిణీ తదితర అంశాలను ఈ కమిటీ పర్యవేక్షిస్తుందని పద్మనాభరెడ్డి తెలిపారు. అవసరమైతే ఎన్నికల కమిషన్, పోలీసు, ఇతర అధికారుల దృష్టికి ఈ అంశాలు తీసుకెళ్తామని చెప్పారు. అలాగే అభ్యర్థులతో ఉమ్మడి వేదికలు నిర్వహించడం, ఓటింగ్ శాతం పెంచడానికి ఓటర్లను చైతన్యం చేయడం వంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. 20 స్వచ్ఛంద సంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తామని వెల్లడించారు. -
రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలి
హైదరాబాద్: రాజ్యాంగంలోని 243–ఐ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని తక్షణం ఏర్పాటు చేయా లని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(సుపరిపాలన వేదిక) అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి కోరారు. గురువారం లక్డీకాపూల్‌లోని సుపరిపాలన వేదిక కార్యాలయంలో సంఘం కార్యదర్శి యం.పద్మనాభరెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ రావు చెలికానితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆదాయంలో స్థానిక సంస్థలకు న్యాయమైన వాటా ఇవ్వడం, పంచాయతీల పన్ను, రుసుములతో వచ్చే ఆదాయాన్ని సక్రమంగా పంపిణీ చేయడం ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం దోహదపడుతుందని చెప్పారు. తెలంగాణలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో విడుదలై మూడేళ్లు కావస్తున్నా అది పూర్తిస్థాయిలో కొలువుదీరలేదని ఆరోపించారు. కొత్త రాష్ట్రంలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసినా అధ్యక్షుడు, సభ్యులను నియమించలేదని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త పంచాయతీరాజ్ బిల్లును ప్రజల ముందుంచి వారి సలహాలు తీసుకున్న తర్వాతే అసెంబ్లీలో చట్టం చేయాలని అన్నారు. రాజ్యాంగం నిర్దేశించిన 29 అంశాలను పంచాయతీలకు బదిలీ చేయాలని కోరారు. మూడంచెల పాలనా వ్యవస్థలో చివరివైన స్థానిక సంస్థలు సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉంటాయని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాజ్యాంగాన్ని సవరించారని చెప్పారు. ఈ సవరణ స్థానిక సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా గుర్తించి, కోట్లాది మంది గ్రామీణుల జీవనస్థితులను మెరుగుపరచడానికి ఉద్దేశించిందని పేర్కొన్నారు. పంచాయతీలు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేయడానికి వీలు కల్పించాలని, ఇందుకనుగుణంగా 29 అంశాలను వాటికి బదిలీ చేయాల్సి ఉందని అన్నారు. ఆ విధంగా జరిగినప్పుడే 73వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాలు నెరవేరినట్లు అవుతుందని చెప్పారు. పంచాయతీలకు అధికారాలు, నిధులు బదిలీ చేయకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులు, విధులు, సిబ్బందిని ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు. -
సమాచార కమిషనర్ల నియామకాలేవీ?
- ఇరు రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు - నియామకాలు చేపట్టేలా ఆదేశాలివ్వండి - హైకోర్టులో ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ పిల్ సాక్షి, హైదరాబాద్: సమాచార కమిషన్‌కు ప్రధాన సమాచార కమిషనర్, కమిషనర్ల నియామకంలో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని హైకోర్టులో పిల్ దాఖలైంది. ఆ నియామకాలు చేపట్టేలా ఇరు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని కోరు తూ స్వచ్ఛంద సంస్థ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి పిల్ దాఖలు చేశారు. ఇరు రాష్ట్రాల సీఎస్‌లను ప్రతివాదులుగా పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం ఈ నెల 27న ధర్మాసనం ముందు విచారణకు రానుంది. ఆర్టీఐ ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం సమాచార కమిషన్‌ను ఏర్పాటు చేసి, ప్రధాన సమాచార కమిషనర్, పది మంది కమిషనర్లను నియమించాలని పిటిషనర్ పేర్కొన్నారు. 2 రాష్ట్రాలకు సమాచార కమిషన్ ఉమ్మడిగానే ఉందని, 2017 ఏప్రిల్ వరకు ప్రధాన కమిషనర్‌తో పాటు ఐదుగురు కమిషనర్లు పనిచేస్తూ ఉన్నారని, ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు నలుగురు కమిషనర్ల నియామకా న్ని రద్దు చేసిందని, అదే సమయంలో మిగిలిన ఇద్దరు కూడా పదవీ విరమణ చేశారని గుర్తుచేశారు. ప్రస్తుతం ప్రధాన సమాచార కమిషనర్, సమాచార కమిషనర్లు లేరని వివరించారు. 2017 ఏప్రిల్ 1 నాటికి కమిషన్‌లో 11,325 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రతి నెలా సగటున 900 అప్పీళ్లు దాఖలవుతున్నాయని తెలిపారు. కమిషన్‌లో ప్రధాన సమాచార కమిషనర్, ఇతర కమిషనర్ల నియామకం లేకపోవడం వల్ల సమాచార హక్కు చట్టం లక్ష్యం నెరవేరకుండా పోతోందన్నారు. కమిషనర్ల నియామకం కోసం ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్‌కు వినతిపత్రాలు సమర్పించినా ఇప్పటి వరకు ఎలాంటి స్పందన లేదని పేర్కొన్నారు. -
నీటి లభ్యత ఇప్పుడేమైంది..?
తమ్మిడిహెట్టి నీటి లభ్యతపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రశ్నలు సాక్షి, హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులోని తమ్మిడిహెట్టి వద్ద ఏడేళ్ల కింద 160 టీఎంసీలుగా ఉన్న గోదావరి జలాల నీటి లభ్యత.. తర్వాతి కాలంలో ఎక్కడికి పోయిందని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స ప్రశ్నించింది. 2007లో ఇంజనీర్లు, సలహాదారులు అన్ని విషయాలను లోతుగా అధ్యయనం చేసి నీటి లభ్యతపై నివేదికలు ఇచ్చారని, ప్రస్తుతం అదే ఇంజనీర్లు, సలహాదారులు నీటి లభ్యత లేదంటూ మరో నివేదిక ఇవ్వడం విడ్డూరంగా ఉందంది. ఈ ఏడేళ్లలో ప్రాణహిత కింద రూ.12,333 కోట్లు ఖర్చు చేశారని, రూ.1,937 కోట్లు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్సుల కింద ఇచ్చారని, ఇవన్నీ ఇప్పుడు వృథా అయ్యాయని ఆరోపించింది. ప్రజాధనం వృథా అవ్వడానికి కారకులైన ఇంజనీర్లు, ప్రభుత్వ కార్యదర్శులు, సలహాదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఆర్థిక దుర్వినియోగంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో, లేదా ఉన్నత స్థారుు కమిటీతో విచారణ చేపట్టాలని కోరింది. మంగళవారం ఈ మేరకు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స అధ్యక్షుడు జస్టిస్ రెడ్డప్ప రెడ్డి, ఉపాధ్యక్షుడు డాక్టర్ రావు చెలికాని, కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి విలేకరుల సమావేశంలో మట్లాడారు. ప్రభుత్వం ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, దుమ్ముగూడె టెరుుల్పాండ్ల పనులను రూ.వేల కోట్లతో ఆరంభించి మధ్యలో నిలిపివేసిందని, దీని వల్ల రూ.2,250 కోట్లు వృథా అయ్యాయని తెలిపారు. మొత్తంగా ఇంజనీర్ల తప్పుడు నిర్ణయాలతో రూ.14,483 కోట్లు వృథా చేశారని ఆరోపించారు. అవసరమున్నా లేకున్నా అడ్వాన్సులు అవసరమున్నా లేకున్నా ఇంజనీర్లు మొబిలైజేషన్ అడ్వాన్సుకు రికమండ్ చేయడం, దానికి ప్రభుత్వ ఉన్నతాధికారులు ఆమోదం తెలపడం ద్వారా అన్ని ప్రాజెక్టులకు కలిపి మొత్తంగా రూ.3,644 కోట్లు అడ్వాన్సులుగా ఇచ్చారని, ఇందులో రూ.2,735 కోట్లు తిరిగి రాబట్టగా.. రూ.909 కోట్లు మొండి బకారుుగా ఉందని తెలిపారు. -
72 మంది నేర చరితులు
నివేదిక విడుదల చేసిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఎన్నికల్లో 72 మంది నేర చరితులు పోటీ చేస్తున్నట్లు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ స్వచ్ఛంద సంస్థ పేర్కొంది. ఈ మేరకు పార్టీల వారీగా నేర చరితుల వివరాలతో గురువారం నివేదిక విడుదల చేసింది. వీరిపై నమోదైన కేసుల వివరాలను లక్డీకాపూల్‌లోని సంస్థ కార్యాలయంలో ఉపాధ్యక్షుడు రావు చెలికాని, కార్యదర్శి పద్మనాభరెడ్డిలు వెల్లడించారు. ఈ కేసుల్లో కొన్ని పోలీస్ స్టేషన్లు, మరికొన్ని కోర్టు విచారణల్లో ఉన్నట్లు తెలిపారు. 14 మంది నేర చరిత ఉన్న అభ్యర్థులతో అధికార పార్టీ టీఆర్ఎస్ తొలి స్థానంలో నిలిచింది. కాగా కాంగ్రెస్, టీడీపీల నుంచి చెరో 13 మంది, ఎంఐఎం నుంచి 11 మంది బరిలో ఉన్నారు. ఇక బీజేపీ నలుగురికి, ఎంబీటీ ఇద్దరికి, సీపీఐ, సీపీఎం, ఎస్పీ, బీఎస్పీ ఒక్కో అభ్యర్థికి టికెట్లు ఇచ్చాయి. మరో వైపు 11 మంది స్వతంత్య్ర అభ్యర్థులపై క్రిమినల్ కేసులు ఉండడం గమనార్హం. అభ్యర్థుల గుణగణాల గురించి ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతోనే ఈ నివేదిక విడుదల చేశామని సంస్థ ప్రతినిధులు తెలిపారు. క్రిమినల్ కేసులున్న అభ్యర్థులకు టికెట్లు ఇవ్వొద్దని ఆయా పార్టీలకు లేఖలు రాశామని పేర్కొన్నారు. అభ్యర్థులు నామినేషన్ పత్రాలతో జత చేసిన అఫిడవిట్లలో సమర్పించిన వివరాలను రిటర్నింగ్ అధికారులు మీడియాకు వెల్లడించి ఉంటే తమకు ఈ పని ఉండేదే కాదన్నారు. తమ సంస్థ నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల నుంచి అభ్యర్థులపై నమోదైన కేసుల వివరాలను సేకరించిందని తెలిపారు. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో నోటా అందుబాటులో ఉంచిన ఎలక్షన్ కమిషన్.. ఈ దఫా ఎందుకు తొలగించిందని ప్రశ్నించారు. కమిషన్ దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. త్వరలోనే గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. -
జీహెచ్ఎంసీ అభ్యర్థుల్లో 72మందికి నేర చరిత్ర
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు గట్టి షాక్ తగిలే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల బరిలో నేర చరిత్ర కలిగిన అభ్యర్థుల జాబితాను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సంస్థ విడుదల చేసింది. 51 డివిజన్లలో 72మంది అభ్యర్థులకు నేర చరిత్ర ఉన్నట్లు ఆ సంస్థ తెలిపింది. అందులో 64మంది పురుషులు ఉండగా.. 8మంది మహిళలు ఉన్నట్లు పేర్కొంది. టీడీపీ నుంచి 13మంది, టీఆర్ఎస్ నుంచి 14 మంది, బీజేపీ నుంచి నలుగురు, ఎంఐఎంలో 11మంది, ఎంబీటీలో ఇద్దరు, ఇతర పార్టీల వారు నలుగురు, స్వతంత్ర్య అభ్యర్థులు 11మంది నేర చరిత్ర గలవారు ఉన్నట్లు ఆ సంస్థ వివరించింది. -
బీఆర్ఎస్పై డైలమా!
హైకోర్టు ఆదేశాలతో ‘క్రమబద్ధీకరణ’పై గందరగోళం ప్రత్యామ్నాయాలపై తర్జనభర్జన సిటీబ్యూరో : దాదాపు మరోవారం రోజుల్లో దరఖాస్తుల స్వీకరణకు గడువు ముగిసిపోనున్న తరుణంలో బీఆర్ఎస్ దరఖాస్తుల పరిష్కారానికి హైకోర్టు బ్రేక్ వేసింది. దీంతో అటు దరఖాస్తుదారులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారుల్లో గందరగోళం నెలకొంది. తదుపరి ఉత్తర్వులిచ్చేంతవరకు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించరాదంటూ మంగళవారం హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించడం గ్రేటర్లో చర్చనీయాంశంగా మారింది. ఈ అంశంపై ఫోరం ఫర్ గుడ్‌గవర్నెన్స్ కార్యదర్శి ఎ.పద్మనాభరెడ్డి దాఖలు చేసిన పిల్‌పై స్పందిస్తూ హైకోర్టు, తాము తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు అక్రమ నిర్మాణాలను క్రమబద్ధీకరించవ ద్దని పేర్కొంది. అయితే దరఖాస్తులను స్వీకరించవచ్చునని పేర్కొనడం వారికి కొంత ఊరట కలిగించింది. వాస్తవానికి జీహెచ్ ఎంసీ అధికారులు కూడా ఇంతవరకు దరఖాస్తుల పరిశీలన చేపట్టలేదు. ఈనెలాఖరువరకు దరఖాస్తుల స్వీకరణకు గడువుండటంతో అది ముగిశాకే సర్కిళ్ల వారీగా దరఖాస్తులను పంపిణీ చేసి, పరిష్కరించాలనే యోచనలో ఉన్నారు. జీహెచ్ఎంసీకి ఇప్పటి వరకు బీఆర్ఎస్ కోసం దాదాపు 36 వేల దరఖాస్తులందాయి. జీహెచ్ఎంసీ అంచనా మేరకు ఇవి దాదాపు 30 శాతం మాత్రమే. మిగతావారు ఈ వారంరోజుల్లో దరఖాస్తుచేసుకుంటారని భావిస్తున్న తరుణంలో వెలువడిన హైకోర్టు అదేశాలతో ఇంకా దరఖాస్తుచేసుకోనివారితో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారు సైతం గందరగోళానికి గురయ్యారు. 2007-08లో బీఆర్ఎస్ను అమల్లోకి తెచ్చినప్పుడే ఇది ఒకేసారి ఇస్తున్న మినహాయింపు అని, దీని ద్వారా క్రమబద్ధీకరణ అనంతరం భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలు జరుగకుండా ఆది లోనే అడ్డుకుంటామని, అందుకు తగిన చర్యలు తీసుకుంటామని జీహెచ్ంఎసీ అధికారులు అప్పట్లో హైకోర్టుకు నివేదించినట్లు సమాచారం. దాన్ని అమలు చేయకపోగా, అప్పటి చట్టానికి సవరణ చేస్తూ దాన్నే 2015 వరకు పొడిగించారని పద్మనాభరెడ్డి పిల్లో పేర్కొన్నారు. చట్టసభలో ఆమోదం లేకుండానే చట్టసవరణ చేశారని కూడా పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు తదుపరి విచారణను జనవరి 27కు వాయిదా వేసింది. అమలుపై సందేహాలు.. హైకోర్టు బ్రేక్ వేయడంతో ఈ పథకం అమలవుతుందా.. లేదా ? అనే సందేహా లు వ్యక్తమవుతున్నాయి. తుదితీర్పు ఎ లా ఉంటుందోననే అనుమానాలున్నా యి. అనుమతి పొందిన నిర్మాణ ప్లాన్‌కు భిన్నంగా డీవియేషన్లకు పాల్పడిన వారు, అసలు అనుమతే లేకుండా నిర్మాణాలు చేసిన వా రు బీఆర్ఎస్తో క్రమబద్ధీకరించుకునేందుకు సిద్ధమయ్యారు. ఎంతో కాలంగా వారు ఈ పథకం కో సం ఎదురు చూస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం సైతం దీని అమలు ద్వారా జీహెచ్ఎంసీ ద్వారానే దాదాపు రూ.1000 కోట్ల ఆదాయం సమకూరగలదని అంచనా వేసింది. ఇప్పటి వరకు అందిన దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటే దాదా పు రూ.300 కోట్ల వరకు మాత్రమే రాగలవని అంచనా. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశాలు ఉభయవర్గాలను అయోమయంలో పడవేశాయి. ఒక్కరోజే 10 వేల దరఖాస్తులు జీహెచ్ఎంసీకి బీపీఎస్ ద్వారా సోమవారం వరకు గడచిన నెలన్నర రోజుల్లో 25 వేల దరఖాస్తులందగా , మంగళవా రం ఒక్కరోజే దాదాపు పదివేల దరఖాస్తులందాయి.హైకోర్టు ఉత్తర్వులతో గడువు పొడిగిస్తారో లేదోననే తలంపుతో మంగళవారం మధ్యాహ్నంనుంచే ఎక్కువమంది దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. అడ్డగోలుగా ఓసీల జారీ 2008లో ఒకసారి మినహాయింపు అని పేర్కొన్న అధికారులు దానిని 2015 వరకు పొడిగించారు. అధికారుల అంచనా మేరకే కనీసం 50 వేల అక్రమనిర్మాణాలున్నాయి. భవిష్యత్తులో అక్రమ నిర్మాణాలను అడ్డుకుంటామని, అన్నీ సవ్యంగా ఉంటేనే తనఖానుంచి విముక్తి చేసి ఓసీ(ఆక్యుపెన్సీ సర్టిఫికెట్) ఇస్తామని పేర్కొన్న అధికారులు దానిని అమలు చేయలే కపోయారు. అడ్డగోలు నిర్మాణాల క్రమబద్ధీకరణ వల్ల ఎందరికో నష్టం జరుగుతుంది. జీప్లస్1కు అనుమతి తీసుకొని ఐదారు అంతస్తులు నిర్మిస్తే పలు సమస్యలు ఉత్పన్నమవుతాయి. రహదారి విస్తీర్ణం తగినంత లేనందున ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజను కూడా వెళ్లలేదు. 2008 నాటి మినహాయింపునే కొనసాగించడం వల్ల ఇలాంటి మినహాయింపులు ఎప్పటికీ ఉంటాయనే అభిప్రాయాలు ఏర్పడతాయి. ఇది మంచిది కాదు. మేం వేసిన పిల్ కొన్ని వేలమందికి ఇబ్బం దిగా అని పించినా, లక్షల మందికి నష్టం జరుగకుండా ఉం టుంది. - పద్మనాభరెడ్డి, కార్యదర్శి, ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్ -
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలి
* రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని పిల్ * హైకోర్టును ఆశ్రయించిన ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాల హయాంలో ప్రారంభమై మధ్యలో నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని మొదట పూర్తి చేసి, ఆ తరువాతనే తాజాగా ప్రకటించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పథకాన్ని చేపట్టేలా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, గృహ నిర్మాణశాఖ ముఖ్య కార్యదర్శి, సీఐడీ అదనపు డీజీలను ఇందులో ప్రతివాదులుగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన తరువాత 4.67 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో నిలిచిపోయాయని పద్మనాభరెడ్డి తన పిటిషన్లో వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనుల్లో అక్రమాలు జరిగాయంటూ ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని, విచారణ జరిపిన విజిలెన్స్ అధికారులు అక్రమాలు నిజమేనని నిర్ధారిస్తూ 1150 మంది అక్రమాలకు పాల్పడ్డారని, అందులో రాజకీయ నాయకులు కూడా ఉన్నారని తెలిపారన్నారు. ఈ వివరాలను సమాచార హక్కు చట్టం కింద ఇచ్చేందుకు అధికారులు నిరాకరిస్తున్నారని పేర్కొన్నారు. నిలిచిపోయిన ఇందిరమ్మ ఇళ్ల పనులను కొనసాగించేందుకు బడ్జెట్లో ఎటువంటి నిధులు కేటాయించలేదని పద్మనాభరెడ్డి తన పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఇళ్ల కోసం లబ్ధిదారులు తమ వాటా కింద ఇప్పటికే రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, నిర్మాణం ఆగిపోవడంతో వారంతా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పూర్తి చేసి, అక్రమార్కులపై చర్యలు తీసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు.