ప్రతికాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్: గ్రామ పంచాయతీ నుంచి పార్లమెంటు ఎన్నికల వరకు డబ్బు ప్రాబల్యం పెరిగిందని దీన్ని అరికట్టేలా వెంటనే చర్యలు చేపట్టాలని భారత ఎన్నికల సంఘం, ఎన్నికల ప్రధానాధికారిని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ (ఎఫ్‌జీజీ) కోరింది. ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి మంగళవారం ఎఫ్‌జీజీ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి లేఖరాశారు. ఎన్నికలు ఒక ప్రహసనంలా మారాయని, మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్ర, తమిళనాడులో డబ్బు జోక్యం మితిమీరిందని ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థి రూ.25 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ఎన్నికల సమయంలోఎన్నికల సంఘం పకడ్బందీగా వ్యవహరిస్తుందని, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి డబ్బు అక్రమ రవాణాను అడ్డుకుంటుందని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తుందని గుర్తుచేశారు.
కానీ, ఎన్నికల ముగిసిన అనంతరం ఆ కేసుల పురోగతిని పట్టించుకోవడం లేదని వాపోయారు. 2014లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలో 1,199 కేసులు, డబ్బు పంపిణీలో 543 కేసులు నమోదు కాగా రూ.34.38 కోట్ల నగదు పట్టుబడిందని పద్మనాభరెడ్డి తెలిపారు. అదే సమయంలో 2,194 అక్రమ మద్యం కేసులు, 52 ఘటనల్లో బంగారం స్వాధీనం చేసుకున్నారన్నారు. ఇక 2018లో ఎన్నికల నిబంధనల ఉల్లంఘనపై 1,086 కేసులు, డబ్బుపంపిణీపై 548 కేసులవగా రూ.55.07 కోట్లు నగదు పట్టుబడిందని తెలిపారు. 1,875 మద్యం పంపిణీ కేసులు నమోదవ్వగా మొత్తంగా 3,561 కేసులు రికార్డయ్యాయని పేర్కొన్నారు.
చదవండి: Funds: బీజేపీకి కోట్లకు కోట్లు.. చతికిలబడ్డ కాంగ్రెస్
Comments
Please login to add a commentAdd a comment